కహానహ్ (జ్యోతిష్యం) – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్]

అంశము : ఇస్లాం నుంచి బహిష్కరించే ఏడవ  విషయము: కహానహ్ (జ్యోతిష్యం)

إنَّ الْحَمْدَ لِلَّهِ، نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللَّهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وسَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللَّهُ فَلَا مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ، وَأَشْهَدُ أَنْ لَا إلـٰه إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ.

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత

అల్లాహ్ దాసులారా! ఆయనకు భయపడుతూ ఉండండి, ఆయన భీతి కలిగి ఉండండి, ఆయనకు విధేయత చూపండి,  అవిధేయతకు పాల్పడకండి. గుర్తుంచుకోండి!  తౌహీద్లో భాగమైన ఓ విషయం ఏమిటంటే: నామాలలో గుణగణాలలో అల్లాహ్ ను ఏకంగా భావించటం. అందులో అగోచర జ్ఞానం అనేది అల్లాహ్ యొక్క ప్రత్యేకమైన గుణం,  అది అల్లాహ్ కు  అంకితం అని ఖురాన్ మరియు హదీసుల ద్వారా మరియు ఈ ఉమ్మత్ యొక్క ఉలమాలు అందరూ ఏకీభవించి ఉన్న స్పష్టమైన విషయం. అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు:

قُل لَّا يَعْلَمُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ الْغَيْبَ إِلَّا اللَّهُ ۚ وَمَا يَشْعُرُونَ أَيَّانَ يُبْعَثُونَ

“అల్లాహ్‌కు తప్ప ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న వారెవరికీ అగోచర జ్ఞానం లేదు. తాము ఎప్పుడు తిరిగి లేపబడతామో కూడా వారికి తెలియదు” అని ఓ ప్రవక్తా (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి చెప్పు. (సూరా అన్ నమ్ల్ 27 : 65)

ఓ హాదీస్ లో ఖాలిద్ బిన్ జక్వాన్ వారు రబీ బింతే ముఅవ్వీజ్ తో ఉల్లేఖిస్తున్నారు: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక బాలికను ఈ విధంగా గీతం పాడుతుండగా విన్నారు “మా ప్రవక్తకు రేపు జరిగే విషయాలు కూడా తెలుసు“. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)  “ఆ విషయాన్ని విడిచి మిగతాది పాడండి” అని వారించారు మరియు రేపు ఏం జరగనున్నది అనేది అల్లాహ్ కు తప్ప మరెవరికి తెలియదు అని బోధించారు. (ఇబ్ను మాజహ్, అల్లామా అల్బానీ రహిమహుల్లాహ్ వారు దీనిని ప్రామాణికంగా ఖరారు చేశారు).

ఇబ్నె ఉమర్ వారి ఉల్లేఖనము: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా అన్నారు: అగోచరజ్ఞానం ఖజానా కు ఐదు తాళం చెవులు ఉన్నాయి , దాని జ్ఞానం అల్లాహ్ కు తప్ప మరి ఎవరికి లేదు, అందులో :  (1) రేపు ఏం జరగనున్నదో అల్లాహ్ కు తప్ప మరి ఎవరికి తెలియదు, (2) మాతృ గర్భాలలో  ఏముందో అల్లాహ్ కు తప్ప మరి ఎవరికి తెలియదు (*), (3) వర్షం ఎప్పుడు కురుస్తుందో ఆయనకు తప్ప మరెవరికి తెలియదు, (4) ఎవరు ఏ గడ్డపై మరణిస్తారో అల్లాహ్ కు తప్ప మరి ఎవరికి తెలియదు మరియు (5) ప్రళయం ఎప్పుడు సంభవిస్తుందో అల్లాహ్ కు తప్ప మరి ఎవరికి తెలియదు. (సహీ బుఖారి).

తెలిసిన విషయమేమిటంటే అగోచర జ్ఞానం కేవలం అల్లాహ్ కు మాత్రమే అంకితము. ఇది అల్లాహ్ యొక్క గుణము.  ఇందులో ఎవరు కూడా ఆయనకి సాటిలేరు,  వాళ్ళు అల్లాహ్ సమీపంలో ఉన్న దైవదూతులైనా కావచ్చు, పంపించబడ్డ ప్రవక్తలైనా కావచ్చు. కనుక ఎవరైతే తనకు అగోచర జ్ఞానం ఉందని ప్రకటిస్తాడో అతను అల్లాహ్ కి ప్రత్యేకమైన గుణంలో అల్లాహ్ దాసులను భాగ్యస్వామ్యం చేసినట్టు. దాసుడ్ని అల్లాహ్ కు సమానము చేశాడు, మరియు ఘోరాతి ఘోరమైన పాపానికి (షిర్క్ ఎ అక్బర్) కి పాల్పడ్డాడు. తమ కాలానికి  ఇమామ్ అయిన ఇమామ్ అహ్లుస్ సున్నహ్: నుఐమ్ బిన్ హమ్మాద్ అల్ ఖుజాయీ వారు అన్నారు: “ఎవరైతే సృష్టికర్తను సృష్టిరాశులతో  సమానం చేశాడో అతను అవిశ్వాసానికి (కుఫ్ర్ కు) పాల్పడినట్టు.”

అల్లాహ్ దాసులారా! ప్రజలలో కొందరు అగోచర జ్ఞాన విషయంలో అల్లాహ్ కు సాటిగా సమానులని ప్రకటిస్తున్నారు. అల్లాహ్ కు ఈ నినాదానికి ఎటువంటి సంబంధం లేదు. వీళ్లు “కాహిన్” మరియు “అర్రాఫ్ “. కాహిన్ అంటే: భవిష్య జ్ఞానం కలిగి ఉన్నాడని ప్రచారం చేసుకునేవాడు, జ్యోతిష్యుడు. అర్రాఫ్ ( షోబదబాజ్) అంటే ఇందులో జ్యోతిష్యుడు, గుప్త విద్య కలిగిన వాడు, చేతబడి చేసేవాడు  అనే అన్ని అర్ధాలు వస్తాయి. అరబీ భాషలో ఇతన్ని “అర్రాఫ్” అంటారు.

షేక్ సాలేహ్ అల్ ఉసైమీన్ (రహిమహుల్లాహ్) అన్నారు: కాహిన్ అనే పదానికి అర్ధం “అంచనా” ఆధారం లేని విషయాల ద్వారా వాస్తవాలు సేకరించడం. ఆజ్ఞాన కాలంలో ఎవరి వద్దకు అయితే షైతానులు వచ్చేవో వాళ్ళు ఇదే పని చేసేవారు, షైతానులు ఆకాశం నుంచి సమాచారాలను అందించే వారు. ఈ జ్యోతిష్యులు షైతానులు నుంచి అందిన సమాచారంతో స్వంత మాటలు కలిపి ప్రజలకు చెప్పేవారు. ఒకవేళ వీళ్ళు చెప్పిన మాటలు నిజమైతే ప్రజలు వీళ్ళకు దగ్గరై ప్రతీ సమస్యకు పరిష్కారం కొరకు వీళ్ళని ఆశ్రయించే  వారు మరియు భవిష్యవాణులు తెలుసుకునే వారు.  అందుకే మనం (సాలేహ్ అల్ఉసైమీన్ వారు) అంటున్నాం,  కాహిన్ అంటే: భవిష్యత్తులో జరిగే అగోచార  విషయాల్ని తెలియజేసేవాడు .(ఇలా ప్రజల్లో ప్రచారం వుంది)

ఓ విశ్వాసులారా! జ్యోతిష్యుడు అగోచర జ్ఞానం నిరూపించడానికి రెండింటిలో ఒక మార్గాన్ని ఎన్నుకుంటాడు,

మొదటిది: దైవదూతల నుంచి సమాచారాన్ని దొంగలిచే షైతాన్ మాటలు వినటం. దీని ఆధారం సహీ బుఖారిలో ఆయేషా (రదియల్లాహు అన్హా) వారి ఉల్లేఖనం:

దైవ దూతలు ఆకాశం మబ్బుల్లో వస్తారు మరియు అల్లాహ్ తీసుకున్న నిర్ణయాలను తెలియజేస్తారు. అక్కడున్న షైతాన్లు రహస్యంగా ఆ మాటలను దైవదూతల నుంచి విని, ఈ చేతబడి చేసే వాళ్ళు,  జ్యోతిష్యాలు చెప్పే వాళ్లకు తెలియజేస్తారు. వాళ్ళు ఆ  విన్న మాటల్లో తమ తరఫునుంచి అబద్ధాలు కలిపి, తమ వద్దకు వచ్చే ప్రజలకు చెప్తారు. (బుఖారి)

అల్లాహ్ దాసులారా! తెలిసిన విషయం ఏంటంటే: జ్యోతిష్యులు ప్రజలకు అబద్ధమైన విషయాలను చెప్తారు. ఒకవేళ వాళ్ళు చెప్పిన విషయంలో ఏదైనా సత్యం ఉంటే, అది షైతాన్ దొంగిలించిన మాటల్లో నుంచి ఉంటుంది. అంతే తప్ప వాళ్ళు చెప్పే అగోచర జ్ఞానానికి దానికి సంబంధం ఉండదు. ఈ విధంగా ప్రజలు వాళ్ళ చెప్పే విషయాల్లో ఆ ఒక్క సత్యమైన మాట వల్ల వాళ్ళ వలలో చిక్కుకుంటారు. మరియు అందులో కలిసి ఉన్న అబద్ధమైన విషయాలను పట్టించుకోరు.  మరికొన్ని సందర్భాల్లో వాళ్ళు చెప్పే పూర్తి విషయాలు అబద్ధం అయినప్పటికీ దాన్ని సత్యమే అని భావిస్తారు. (ఇది మొదటి మార్గం)

రెండవ మార్గం: జిన్నులను ఆశ్రయించటం. ఆ జిన్  ప్రతి మానవుడుతో పాటే ఉండేవాడైనా కావచ్చు లేదా వేరే వాడైనా. ఇది ఎలా అంటే ప్రతి మానవుడుతో పాటు ఒక జిన్ నిమిత్తమై ఉంటాడు. అతను ఆ మానవుడికి చెడు వైపునకు ఆహ్వానిస్తూ ఉంటాడు, కనుక ఆయేషా (రదియల్లాహు అన్హా) వారి ఉల్లేఖనం లో ఈ విధంగా ఉంది: కొంతమంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో కాహిన్ మరియు  జ్యోతిష్యులు గురించి ప్రశ్నించారు. దానికి సమాధానంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు “అది పెద్ద విషయం కాదు”  దానికి వారు ఇలా అడిగారు ” ప్రవక్త కొన్ని సందర్భాల్లో వాళ్ళు చెప్పే మాటలు నిజమవుతాయి కదా”  అంటే దానికి జవాబుగా ప్రవక్త వారు ఇలా అన్నారు ” వాళ్లు చెప్పే మాటల్లో ఏదైతే నిజం అవుతాయో అవి దైవదూతల నుంచి  దొంగలిస్తారు , దానిని ఈ జ్యోతిష్యులు, కాహిన్ లకు  చెవిలో కోడికూత మాదిరిగా చెప్తారు. తర్వాత వాళ్ళు ఆ ఒక్క మాటలో  వంద  అబద్ధాలు కలిపి చెప్తారు. ( బుఖారి, ముస్లిం)

కాహిన్ లకు మానవులతో పాటు ఉండే జిన్నాతులకు సంబంధం ఉంది అని చెప్పటానికి ఇది ఒక ఆధారం, ఎందుకంటే ప్రతి మానవుడుతో పాటు ఒక జిన్ నియమిత ఉంటాడు. అతను మానవుడికి చెడు వైపుకు ఆహ్వానిస్తూ ఉంటాడు. ఈ జిన్ ఆ వ్యక్తి యొక్క ప్రతి రహస్యాన్ని ఎరిగి ఉంటాడు, ఏదైతే ఇతర ప్రజలకు తెలియవో. ఉదాహరణకు: ఒక వ్యక్తి యొక్క ఏదో ఒక వస్తువు తప్పిపోతే ఆ వ్యక్తితో పాటు ఉండే జిన్ కి ఆ ప్రదేశము తెలిసి ఉంటుంది, ఎందుకంటే ఎల్లప్పుడూ ఆ వ్యక్తితోనే ఉంటాడు కాబట్టి. ఒకవేళ ఈ వ్యక్తి కాహిన్ ను సంప్రదిస్తే ఆ  తప్పిపోయిన వస్తువు గురించి ప్రశ్నిస్తే ఆ జిన్ ఆ కాహిన్ కి ఆ వస్తువు ఒక ప్రదేశం గురించి తెలియజేస్తాడు. తర్వాత కాహిన్ ఆ ఒక్క మాటతో 100 అబద్ధాలు కలిపి ఆ వ్యక్తికి ఆ  ప్రదేశము తెలియజేస్తాడు. చివరికి ఆ వ్యక్తి పోగొట్టుకున్న వస్తువుని పొందిన తర్వాత ఆ కాహిన్ చెప్పిన ప్రతి మాట నిజమే అని భావిస్తాడు,  మరియు అతను అగోచర జ్ఞానం కలిగి ఉన్నాడని నమ్ముతాడు. వాస్తవానికి ఆ కాహిన్ ఆ జిన్ను నుంచి విన్న విషయాన్ని అతనికి చెప్పి ఉంటాడు, ఉదాహరణకు: ఒక వ్యక్తి తన భార్యతో చెప్పుకున్న విషయాలు, వాళ్ల తల్లి పేరు, ఊరు పేరు, ఇంటి అడ్రస్సు,  వాళ్ళు చేసే పని,  ఇంకా ఆ జిన్ కి , ఆ వ్యక్తికి సంబంధించి తెలిసిన విషయాలన్నీ కూడా మొదలైనవి.

అల్లాహ్ దాసులారా! కాహిన్ ఏ షైతాన్ని అయితే సంప్రదిస్తాడో అతను షైతాన్ నుంచి సేవలు తీసుకుంటాడు. దానికి బదులు ఆ కాహిన్ అతన్ని ఆరాధిస్తాడు. షైతాన్ లక్ష్యం కూడా ఇదే. షైతాన్ పూర్తి ఆదం సంతతిని మార్గ భ్రష్టత్వానికి గురి చేయడానికి లక్ష్యం చేసుకున్నాడు. ఇంకా ఇదే అతని పని మరియు ఇదే అతని సందేశము. అతని వలలో జ్యోతిష్యులు,  చేతబడి చేసే వాళ్ళు  కాహిన్ అందరూ చిక్కుకుంటారు,  వీళ్ళు మానవుల్లో ఉన్న షైతానులు అయితే అతను జిన్నాతుల నుంచి షైతాన్.  ఈ షైతాన్లు అందరు కలిసి మానవాళిని అపమార్గం పట్టిస్తారు.  (అల్లాహ్ మనందరినీ ఈ షైతాన్లు నుంచి కాపాడుగాక)

అల్లాహ్ దాసులారా! ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎవరైతే షరియత్ లో చెప్పిన రుఖ్యా ద్వారా వ్యాధులను నిర్మూలిస్తారో వాళ్లకు ఆ కాహిన్ చేసే నాటకాలు తెలిసికొని ఉంటారు. వాళ్ళల్లో ఒక్కరు చెప్పిన విషయం ఏమిటంటే: మీరు కాహిన్ రహస్యాన్ని ఛేదించడం అనుకుంటున్నారు అయితే: “మీకు కూడా తెలియని ఒక విషయము ఆ కాహిన్ ని అడగండి, ఎందుకంటే మీకు తెలియని విషయం కూడా మీతో పాటు ఉన్న జిన్ కి కూడా తెలియదు,  కనుక ఆ కాహిన్ కి కూడా తెలియకుండా పోతుంది. ఉదాహరణకు నేలపై నుంచి కొన్ని కంకర రాళ్లు తీసుకోండి, మీ పిడికిలను మూసేసి, తర్వాత కాహిన్ను ప్రశ్నించండి,  నా చేతిలో ఎన్ని రాళ్లు ఉన్నాయని, అతను దానికి సమాధానం ఇవ్వలేడు, మీ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు, ఎందుకంటే ఈ విషయము, ఈ సమాధానము మీతో పాటు ఉన్న జిన్ కి కూడా తెలియదు,  అలాంటప్పుడు ఆ కాహిన్ ఏం సమాధానం ఇస్తాడు? .

సారాంశం ఏమిటంటే: కాహిన్ తమ అన్ని వ్యవహారాలలో జిన్నాతులను ఆశ్రయిస్తాడు,సహాయం తీసుకుంటాడు. అన్ని సంఘటనలు, సమాచారాన్ని తెలుసుకోవడానికి షైతాన్ ను ఆశ్రయిస్తాడు. షైతాన్ ఆ కాహిన్ చెవిలో కొన్ని విషయాలు ఊదుతాడు,  దానినీ ఆధారంగా చేసుకొని అనేక విషయాలు కలిపి  ప్రజలకు తెలియజేస్తారు. ఒకవేళ చెప్పిన మాట నిజమైతే ప్రజలు ఆ కాహిన్ ని అగోచర జ్ఞాని అనుకుంటారు,  ఇలా అతని వలలో చిక్కుకుంటారు. ప్రజలు అజ్ఞానంలో దాన్ని మహిమలు (కరామాత్) అనుకొని వీళ్ళు ఔలియా అల్లాహ్ (అల్లాహ్ స్నేహితులు) అనుకుంటున్నారు.  వాస్తవానికి వాళ్ళు ఔలియా ఉష్ షైతాన్ (షైతాన్ స్నేహితులు), ఎలాగైతే అల్లాహ్ ఖుర్ఆన్ లో సూరతుష్ షుఅరా లో  ఇలా తెలియజేశారు:

(هَلْ أُنَبِّئُكُمْ عَلَى مَنْ تَنـزلُ الشَّيَاطِين * تَنـزلُ عَلَى كُلِّ أَفَّاكٍ أَثِيم * يُلْقُونَ السَّمْعَ وَأَكْثَرُهُمْ كَاذِبُون).

(ప్రజలారా!) షైతానులు ఎవడిపైన దిగుతారో నేను మీకు తెలుపనా? అబద్దాలకోరు, పాపాత్ములైన ప్రతి ఒక్కరిపై వారు దిగుతారు. విని వినని కొన్ని మాటలు చెవుల్లో వేస్తారు. వారిలో అనేకులు అబద్ధాలు చెప్పేవారే (26: 221,-226)

తౌహీద్ ప్రజలారా: నుజూమి కూడా అగోచర జ్ఞానం కలిగి ఉన్నాడని ప్రకటిస్తాడు. నుజూమి అంటే: నక్షత్రాలను చూసి భవిష్యతులొ సంభవించే సంఘటనాల జ్ఞానాన్ని సేకరించేవాడు. ఉదాహరణకు: గాలి వీచే సమయము , వర్షం కురిసే సమయం, చలికాలం, వేసవి కాలము మరియు ధరలు మారే జ్ఞానము. వాళ్ళు చెప్పే విషయం ఏమిటంటే : ఆకాశంలో నక్షత్రాలు తిరిగే , కలిసే సమయాల్లో దానిని చూసి వీళ్ళు ఈ విషయాలు తెలియజేస్తారు. మరియు నక్షత్రాలు భూమండలంపై ప్రభావితమై ఉంటాయి అంటారు,  దీనిని “ఇల్మె తాసీర్”  అంటారు , మరియు దీని గురించి ప్రచారం  చేసుకునే వాడ్ని ‘జ్యోతిషి” అని అంటారు. వాళ్లు నక్షత్రాలను చూసి, వాళ్లతో మాట్లాడేటప్పుడు షైతాన్ వాళ్లకు చెప్పాలనుకున్న విషయాన్ని చిత్ర రూపంలో చూపిస్తాడు, దాని ద్వారా వాళ్ళు ప్రజలకు ఈ విషయాలన్నీ చెప్తూ ఉంటారు. (ఇవన్నీ వ్యర్థమైన విషయాలు)

అల్లాహ్ దాసులారా! ఇల్మే నుజూమ్ లో ఓ భాగం: ఆకాశంలో తిరిగే నక్షత్రాలు మరియు అబ్జద్ అక్షరాల (అరబీ ఆల్ఫాబెట్స్) ద్వారా భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను తెలియజేయడం కూడా ఉంది, ఇబ్నే అబ్బాస్ (రదియల్లాహు అన్హు) గారు చెప్పిన మాటకు ఇదే అర్థము: ఒక జాతి వారు అబూజాద్  (అరబీ ఆల్ఫాబెట్స్) లను ఉపయోగించి , నక్షత్రాలను చూసి ఇలా భవిష్యవాణిలను చెప్పేవాళ్లు  నా ఉద్దేశ ప్రకారం వాళ్లు పరలోకంలో ఏం భాగాన్ని పొందలేరు. (ఏ ప్రతిఫలం దక్కడు) .

( దీనినీ అబ్దూర్రజ్జాక్ వారు ముసన్నఫ్ అనే గ్రంథంలో పేర్కొన్నారు , ఇమామ్ బైహకిఖీ వారు కూడా పేర్కొన్నారు)

ఇల్మే నుజూమ్ లోని ప్రదర్శనలో ఇంకో భాగం జ్యోతిష్య శాస్త్రవేత్తలు (Astrologers), వీళ్ళు మానవ భవిష్యత్తులో సంభవించే విషయాలను తెలుసుకున్నారని మరియు దానిని వార్తల్లో , మ్యాగజైన్స్ లోప్రచారం చేస్తూ ఉంటారు, వాళ్ళు చేసే వాదన ఏమిటంటే : ఎవరైతే  బిర్జ అక్రబ్ నక్షత్రము  మెరిసే సమయంలో  పుడతాడో , జన్మించాడో, అతని తలరాత మంచిది కాదని మరి ఎవరైతే “బిర్జ్ మిజాన్” నక్షత్రము మెరిసే సమయంలో జన్మిస్తాడో వాడు మంచి అదృష్టం గలవాడు అని భావించడం మొదలైనవి.

అల్లాహ్ దాసులారా! ఇల్మే నుజూమ్ కూడా చేతబడి కిందే పరిగణించడం జరుగుతుంది. ఈ రెండిటి మధ్య సమానమైన విషయం ఏమిటంటే : షైతాన్  నుండి సంప్రదింపులు,  సంబంధాలు, దాని ఆధారము ఇబ్నె అబ్బాస్ వారి ఉల్లేఖనము, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఎవరైతే ఇల్మే నుజూమ్ నేర్చుకున్నాడో అతను చేతబడిలో ఒక భాగాన్ని నేర్చుకున్నట్టే , కనుక ఆ భాగాన్ని పెంచుకునే వాళ్ళు పెంచుకోండి. (సహీ ముస్లిం)

ఇల్మే నుజూమ్ ను ఇల్మే తాసీర్ అంటారు. అంటే: నక్షత్రాల ప్రసరణ వలన (నక్షత్రాలు తిరగటం వలన)  దాని ప్రభావం భూమండలంపై  పడుతుంది. అంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాట “అతను జాదులో (చేతబడిలో) ఒక భాగాన్ని నేర్చుకున్నాడు” కు అతను చేతబడిలోని ఒక రకానికి గురయ్యాడు అని అర్థం. మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాట “అందులో ఎవరైతే తమ భాగాన్ని పెంచుకోవాలనుకుంటున్నారో  పెంచుకోండి” అంటే అర్థము ఎవరైతే  ఖగోళ జ్యోతిష శాస్త్ర జ్ఞానాన్ని నేర్చుకుంటాడో అతను అదే విధంగా చేతబడి విద్యను నేర్చుకున్నాడు, దాన్ని ఇంకా పెంచుకుంటున్నాడు.

అల్లాహ్ దాసులారా!  ఇస్లాం ధర్మం యొక్క ప్రత్యేకత ఏమిటంటే మంచి శకునము తీసుకునే ఆజ్ఞ ఇస్తుంది. మరియు మానవుడికి చేసే మార్గదర్శకాలు ఎలా ఉంటాయి అంటే: అందులో ఇహ పరలోకాలా సాఫల్య రహస్యం దాగి ఉంటుంది. షిర్క్, బహు దైవారాధన, పాపాలు, మోసాలు,  అబద్ధాల ను నివారిస్తుంది . అందుకే ఇస్లాం షైతాన్ చేష్టలను, మార్గాలను ముందు నుంచే ఆరికట్టింది. కనుక కాహిన్ల వద్దకు వెళ్లటాన్ని నిషేధం చేసింది.  మరియు జ్యోతిష్యులు చెప్పే వాళ్ళ వద్దకు వెళ్లే వాళ్ళ విషయంలో కఠినంగా చర్యలు తీసుకోవడం జరిగినది. ఆ  కాహిన్ల వద్దకు ప్రశ్నించడానికి వెళ్లినా సరే. ఇమామ్ ముస్లిం వారు ప్రవక్త గారి సతీమణి సఫీయహ్ (రదియల్లాహు అన్హా) వారితో ఉల్లేఖించారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం వారు అన్నారు: ఏ వ్యక్తి అయితే అగోచారవిషయాలను చెప్పేవాడి (జ్యోతిష్యుడు) వద్దకు వెళ్లి అతన్ని ఏ విషయంలోనైనా ప్రశ్నించినా, లేదా అతను చెప్పిన మాటను నమ్మినా నలభై (40) రోజుల వరకు అతను చేసిన నమాజులు స్వీకరించబడవు (ఆమోదకరమైనవి కావు). (సహీ ముస్లిం)

ఏ వ్యక్తి అయితే జ్యోతిష్యుల వద్ద కాహిన్ వద్ద వెళ్లి అతన్ని ఏదైనా విషయంలో ప్రశ్నించాడు,  కానీ దానికి ఇవ్వబడిన సమాధానాన్ని  నమ్మలేదు, అలాంటి వ్యక్తి యొక్క 40 రోజులు నమాజు స్వీకరించబడవు అనే విషయం ఈ హదీస్ ద్వారా స్పష్టమవుతుంది. ఆ వ్యక్తి కాఫిర్ అవ్వడు (ఎందుకంటే ఇవ్వబడిన సమాధాన్ని స్వీకరించలేదు ‘నమ్మలేదు’ కాబట్టి). అందువల్ల అతను ఇస్లాం నుంచి బహిష్కరించబడడు.

కానీ! ఏ వ్యక్తి అయితే ఆ కాహిన్ వద్దకు వెళ్లి ఏ విషయంలోనైనా అతన్ని ప్రశ్నించి మరియు అతను ఇచ్చిన సమాధానాన్ని సత్యమని నమ్మితే అలాంటి వ్యక్తి ఇస్లాం పరిధిలో నుంచి బహిష్కరించబడినట్టే. ఎందుకంటే అతను ఏదో ఒక విషయాన్ని నమ్మిన తర్వాతే  కాహిన్ అగోచర జ్ఞాని అని  విశ్వసించినట్టవుతుంది.  మరియు  అల్లాహ్ కు అంకితమైన ఈ అగోచర జ్ఞానం విషయంలో ఆ కాహిన్ ను సాటి నిలబెట్టినట్టే అవుతుంది. మరి ఇలాంటి వ్యక్తి ఖుర్ఆన్ లో ఇవ్వబడ్డ విషయాలను తిరస్కరించినట్టు. మరియు కుఫ్ర్ కి పాల్పడినట్లు అవుతుంది. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు ) వారి ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు : “ఏ వ్యక్తి అయితే కాహిన్  వద్దకు వెళ్లి , అతను చెప్పిన సమాచారాన్ని సత్యమని విశ్వసిస్తే అతను ప్రవక్త పై అవతరించబడ్డ ధర్మాన్ని (షరియత్) ను తిరస్కరించినట్టే“. (మస్నద్ అహ్మద్)

హజరత్ ఇమ్రాన్ బిన్ హుసైన్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించెను. “శకునము తీయువాడు, తీయించువాడు, గుప్తవిద్య చేయువాడు, చేయించువాడు, జాదు చేయువాడు, చేయించువాడు మనలోలేరు (అంటే ఇస్లాంలో లేరు). ఏ వ్యక్తి అయినా గుప్త విద్య చేయువాని వద్దకు వెళ్ళి అతడు చేప్పిన మాటలను ధృవీకరించిన ఎడల అతడు మతమును నిరాకరించిన వాడవుతాడు” (దీనిని ఉత్తమ సనద్ బజ్జార్ ఉల్లేఖించెను)

అల్లాహ్ దాసులారా! ఈ కాహిన్,  జ్యోతిష్యుల  కార్యకలాపాలు సూఫీల వద్దనే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ గురువులు  కాహిన్లు లేదా అర్రాఫ్ (జ్యోతిష్యులు) అయి ఉన్నారు. వాళ్ళ గురువులు, విలాయత్ పొంది ఉన్నారు (వలి అని) కరమాత్ (మహిమలు) తెలుసు అని ప్రకటిస్తూ ఉంటారు. మరియు అగోచర జ్ఞానం కలిగి ఉన్న వ్యక్తులు మత్రమే విలాయాత్ మరియు కరామాత్ చేస్తారు అనీ వాళ్ళ నమ్మకం, దాన్ని వాళ్ళు  కష్ఫ్  (నేరుగా అల్లాహ్ తో మాట్లాడటం)  అనే పేరు పెట్టారు, (ఒకవేళ వాళ్ళు దీనికి  అగోచర జ్ఞానం అని పేరు పెడితే ప్రజల ముందు అవమాన పాలవుతారని ఈ విధంగా  పేర్లు మార్చారు )

అల్లాహ్ దాసులారా! కహానత్ నిషేధము అని మరియు కాయిన్ల వద్దకు వెళ్ళటము అవిశ్వాసము అని స్పష్టం చేయడానికి ఇది చాలా లాభకరమైన విషయ సూచిక. కాహిన్ జ్యోతిష్యము చేసినా, చేయించినా, ఈ విద్యను  నేర్చుకున్న లేదా మనసులో దానికి సంబంధించి ఇష్టం కలిగి ఉన్న సరే ఇవన్నీ అవిశ్వాస పూరితమైన ఆచరణ.

అల్లాహ్ మనందరికీ ఖురాన్ యొక్క శుభాలతో,  ఆశీర్వాదాలతో దీవించును గాక. అల్లాహ్ మనందరినీ వివేకంతో, హితోపదేశంతో కూడిన వాక్యాల ప్రకారం ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించు గాక. నేను నా కొరకు మీ కొరకు అల్లాహ్ నుంచి క్షమాపణ వేడుకుంటున్నాను. మరియు మీరు కూడా ఆయన నుంచి క్షమాపణ కోరండి. సందేహంగా ఆయన క్షమించేవాడు దయగలవాడు. ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత …

అల్లాహ్ దాసులారా! ఆయన భీతి కలిగి ఉండండి.  కాహిన్ ల చేష్టలలో “తరక్” అనేది కూడా ఒక భాగమే. దాని ద్వారా అరబ్ వాళ్లు అగోచర జ్ఞానాన్ని ఆర్జిస్తారన్న సంతోషంలో, భ్రమలో ఉండేవారు. తరక్ అంటే “నడవటం”. వాళ్లు నేలపై కొన్ని గీతలు గీస్తారు,  ఆ గీత ద్వారా వాళ్ళు నడిచినట్టు భావించి, ఆ గీత ద్వారా అగోచర జ్ఞానం తెలిసింది అని వ్యక్తం చేస్తారు.

రమాల్ అనేది కూడా జ్యోతిష్యంలో పరిగణించడం జరుగుతుంది. ఈ పద్ధతి ఎలా అంటే: ఓ వ్యక్తి తమ చేతులారా ఇసుకపై కొన్ని గీతలు గీసి,  దాని ద్వారా ఆ గోచర జ్ఞానం ప్రకటిస్తాడు.

కహానత్ లో (జ్యోతిష్యంలో) రాళ్లతో కొట్టడం కూడా ఒక భాగమే, ఇది ఎలా అంటే ఎవరైనా వ్యక్తి వచ్చి ఏదో ఒక సంఘటన గురించి ప్రశ్నిస్తే ఈ జ్యోతిష్యుడు తమ వద్ద ఉన్న ఆ చిన్న చిన్న కంకర రాళ్ళను తీసి ఆ రాళ్ల పై కొట్టి దాని ద్వారా ఆ వ్యక్తి అడిగిన సమస్యకు పరిష్కారం సమాధానం తెలుసుకుంటాడు.

కహానత్ లో ఫింజాన్ (కప్పు, Cup) చదవటము కూడా భాగమే, ఇది ఎలా అంటే:  వ్యక్తి కప్పులో కాఫీ తాగిన తర్వాత మిగిలిన దానిపై ఆ మాంత్రికుడు తమ దృష్టిని కేంద్రీకరిస్తాడు , దాని చుట్టుపక్కల కొన్ని గీతలు గీసి,  దాని ద్వారా అగోచర జ్ఞానం కలిగిందని,  వచ్చిన వాళ్లకు సమస్యలకు పరిష్కారం చెప్పటము ఇలా చేస్తా ఉంటారు,

ఈ కహానత్ లో చేతి రేఖలను చదివి చెప్పటం కూడా భాగ్యమే , అది ఎలా అంటే : జ్యోతిష్యుడు కాహిన్లు చేతి రేఖలను:  అడ్డంగా నిలువుగా కలిసి ఉన్నరేఖలను చూసి ప్రజలకు ఇలా ఇలా జరగనున్నది అని చెప్తారు.

ఇక కహానత్లో “అయాఫా” (పక్షుల ద్వారా శకునం తీయడం)  కూడా భాగమే దాని పద్ధతి ఏమిటంటే: పక్షులను గాలిలో వదిలి అవి ఒకవేళ కుడివైపు ఎగిరితే మంచి శకునం లేదా ఎడమవైపు ఎగిరితే చెడు జరుగుతుంది అని శకునాలను తీస్తారు. ఖచ్చితంగా అయాఫా కూడా అధర్మమైన పద్ధతే. ఎందుకంటే పక్షులు అల్లాహ్ యొక్క సృష్టితాలు. వాటిలో మేలు గాని చెడు గాని చేసే శక్తి ఉండదు. అల్లాహ్ యే వాళ్ల పోషకుడు, పాలకుడు. అల్లాహ్ ఈ విధంగా తెలియజేశారు:

 أَلَمْ يَرَوْا إِلَى الطَّيْرِ مُسَخَّرَاتٍ فِي جَوِّ السَّمَاءِ مَا يُمْسِكُهُنَّ إِلَّا اللَّهُ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يُؤْمِنُونَ

శూన్యాకాశంలో ఆజ్ఞాబద్ధులై ఉన్న పక్షులను వారు చూడలేదా? అల్లాహ్‌ తప్ప వాటిని ఆ స్థితిలో నిలిపి ఉంచేవారెవరూ లేరు. నిశ్చయంగా విశ్వసించేవారి కోసం ఇందులో గొప్ప సూచనలున్నాయి. (సూరా అన్ నహ్ల్ 16: 79)

ఇంకా ఈ విధంగా అన్నారు:

أَوَلَمْ يَرَوْا إِلَى الطَّيْرِ فَوْقَهُمْ صَافَّاتٍ وَيَقْبِضْنَ ۚ مَا يُمْسِكُهُنَّ إِلَّا الرَّحْمَٰنُ ۚ إِنَّهُ بِكُلِّ شَيْءٍ بَصِيرٌ

ఏమిటీ, వీరు తమపై రెక్కల్ని చాచుతూ, (ఒక్కోసారి) ముడుచుకుంటూ ఎగిరే పక్షుల్ని చూడటం లేదా? కరుణామయుడు (అయిన అల్లాహ్) తప్ప వాటిని ఆ స్థితిలో ఎవరూ నిలిపి ఉంచటం లేదు. నిశ్చయంగా ప్రతి వస్తువు ఆయన దృష్టిలో ఉంది. (సూరా అత్ తహ్రీం 67 : 19)

ఈ కహానత్ (జ్యోతిష్యం) లో శకునం కూడా భాగమే. అవి కంటికి కనిపించేవే అయినా సరే, లేదా వినేటటువంటి నుంచి అయినా సరే. అంటే పావురాలను ఎగిరిపించి శకునాలు తీయటము లేదా ఇంటిపై కూర్చున్న గుడ్లగూబను చూసి శకునము తీయటము, లేదా పదమూడవ (13వ) అంకె నుంచి, మెల్లకన్ను ,కాళ్లు లేనివాడు నుంచి శకునము తీయటము, ఉదాహరణకు: “మెల్లకన్ను కలిగి ఉన్న వ్యక్తిని చూసి ఇలా అనటం “ఈరోజు మొత్తం దరిద్రంగా ఉంటుంది, మంచి జరగదు”. కనుక అతను వ్యాపారం మూసేసి,  ఆరోజు మొత్తం కొనటము అమ్మటముగాని చేయకుండా ఉండటము, బహుశా అతనికి ఆరోజు చెడు, కీడు జరుగుతుంది అని, ఆపద విరుచుకు పడుతుందని తెలిసిపోయినట్టు. ఇంకా ఒక వ్యక్తి కుడి చేయి అరచేతిలో దురద పుట్టితే అలా జరుగుతుందని లేదా ఎడమ చేయి అరిచేతిలో దురద పుడితే ఇలా జరుగుతుందని భావించటం ఇంకా మొదలైనవి. వీటన్నిటిలో ఏ ఒక్కటి లో కూడా అల్లాహ్ చెడును, హానిని పెట్టలేదు. కానీ ప్రజలు వాటి నుంచి శకునాలను తీస్తున్నారు, చెడు జరుగుతుందని భావిస్తున్నారు. ఆ రోజులను కీడులా భావించుకుంటున్నారు. దీనికి అర్థం ఏమిటంటే:  ఆ రోజు ఏం జరుగుతుందో దాన్ని తెలుసుకొని, అల్లాహ్ కు తెలిసిన అగోచర విషయంలో అల్లాహ్ కు సాటిగా నిలిచాడు. దీని కొరకు వాళ్ళు అసమర్థమైన విషయాలను కారణాలుగా చేస్తున్నారు.

శకునం తీయడం అనేది హారాం, ఇంకా షిర్క్ కూడా. దీనికి ఆధారం అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) వారి ఉల్లేఖనం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా వివరించారు: “ఎవరి శకునము అతనికి తమ అవసరాలను తీర్చకుండా ఆపేసిందో అతను షిర్క్ చేసినట్టు,  దానికి సహాబాలు అడిగారు “దానికి పరిహారం ఏమిటి “? దానికి ప్రవక్త (సల్లల్లహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:

( اللهم لا خير إلا خيرك، ولا طير إلا طيرك، ولا إلـٰه غيرك )

ఓ అల్లాహ్ నువ్వు ప్రసాదించిన మేలు కన్నా మరో మేలు ఏదీ లేదు, నువ్వు నియమించిన శకునము కన్నా మరో శకునము లేదు,  మరియు నీవు తప్ప మరో ఆరాధ్యుడు లేడు (అహ్మద్)

శకునం హరాం అనడానికి ప్రవక్త (సల్లల్లహు అలైహి వసల్లం) గారి ఈ హదీస్ కూడా మనకు ఆధారం : వ్యాధి తనంతట తానే  వ్యాపించడం, శకునం తీయటము, మరియు గుడ్లగూబ వల్ల కీడు, సఫర్ మాసం వల్ల శకునం ఇలాంటివి ఏమీ లేవు (అన్ని వ్యర్ధ మాటలే) ( బుఖారి)

ప్రవక్త (సల్లల్లహు అలైహి వసల్లం) మాట “శకునం లేదు”- దీనివల్ల శకునాలు ఏమీ లేవు  అన్న మాట పూర్తిగా స్పష్టమవుతుంది.

సారాంశము ఏమిటంటే : కహానత్ “జ్యోతిష్యం”లో చాలా రకాలు ఉన్నాయి,  కానీ అన్ని రకాలలో సమాంరతమైన విషయము ఏమిటంటే అది “అగోచర జ్ఞానం ప్రకటన“. పద్ధతులు వేరేగా ఉంటాయి, అందులో కొన్ని షైతానులతో సంబంధం ఉంటుంది,  మరికొందరు కేవలం ఉట్టిగా ప్రకటనలు చేస్తారు, దాని ద్వారా ప్రజలను మోసం చేస్తారు, తమ వలలో పడేసుకుంటారు. అల్లాహ్ మనందరినీ వీళ్ళ నుంచి కాపాడుగాక.

ముగింపు ప్రసంగం :

మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, అల్లాహ్ మిమల్ని గొప్ప సత్కార్యాన్ని గురుంచి ఆదేశించాడు. అల్లాహ్ ఆదేశం:

 ( إن اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تسليما )

నిశ్చయంగా   అల్లాహ్‌,  ఆయన  దూతలు  కూడా  దైవప్రవక్తపై  కారుణ్యాన్ని   పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా!  మీరు  కూడా  అతనిపై  దరూద్‌  పంపండి.  అత్యధికంగా  అతనికి  ‘సలాములు’  పంపుతూ  ఉండండి. – (33: 56)

اللهم صل وسلم على عبدك ورسولك محمد، وارض عن أصحابه الخلفاء، الأئمة الحنفاء، وارض عن التابعين ومن تبعهم بإحسان إلى يوم الدين.

ఓ అల్లాహ్! మాకు  ప్రపంచంలో మేలును, పుణ్యాన్ని పరలోకంలో సాఫల్యాన్ని ప్రసాదించు. మరియు నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు. ఓ అల్లాహ్! మన హృదయాలను కపటం నుంచి, మన ఆచరణను ప్రదర్శన బుద్ధి నుంచి మరియు మా చూపులను ద్రోహం నుంచి కాపాడుగాక .

ఓ అల్లాహ్! మేము నీతో స్వర్గం గురించి ప్రాధేయపడుతున్నాము, మరియు ఆ స్వర్గంలోకి ప్రవేశించేటువంటి ఆచరణని మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాము.మరియు ఆ నరకం నుండి నీ శరణు వేడుకుంటున్నాము మరియు నరకానికి దగ్గర చేసేటువంటి ప్రతి పని నుండి నీ శరణు కోరుకుంటున్నాము.

ఓ అల్లాహ్! ఇహపరలోకాల సర్వ మేలును ప్రసాదించు, ఆ మేలు మాకు తెలిసిన తెలియకపోయినా మరియు ఇహ పరలోకాల చెడు నుంచి మమ్మల్ని రక్షించు ఆ చెడు మాకు తెలిసిన తెలియకపోయినా. ఓ అల్లాహ్! నీ అనుగ్రహాలు మా నుండి తొలగిపోవటాన్ని గురుంచి,  ఆరోగ్యం పోవటం నుంచి, నీ శిక్షల నుంచి, నీ ఆగ్రహానికి గురికాకుండా మనల్ని రక్షించు, కాపాడు.

ఓ అల్లాహ్ మాకు ప్రపంచంలో పుణ్యాన్ని ప్రసాదించు, పరలోకంలో మేలును ప్రసాదించు, మమ్మల్ని నరక శిక్ష నుండి కాపాడు.

اللهم صل على نبينا محمد وآله وصحبه وسلِّم تسليما كثيرا.

పుస్తకం నుండి – ఇస్లామీయ జుమా ప్రసంగాలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్
రచన : మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్ పట్టణం, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామయి

చివరకు దైవదూతల హృదయాల నుండి భయం తొలగి పోయినప్పుడు, వారు “మీ ప్రభువు ఏమని పలికాడు?” అని అడుగుతారు

బిస్మిల్లాహ్

16 వ అధ్యాయం
అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.


إِذَا فُزِّعَ عَن قُلُوبِهِمْ قَالُوا مَاذَا قَالَ رَبُّكُمْ ۖ قَالُوا الْحَقَّ ۖ وَهُوَ الْعَلِيُّ الْكَبِيرُ

అల్లాహ్ ఆదేశం: (చివరకు దైవదూతల హృదయాల నుండి భయం తొలగిపోయినపుడు, వారు “మీ ప్రభువు ఏమని పలికాడు?” అని అడుగుతారు. వారు, “సత్యం పలికాడు”, ఆయన మహిమాన్వితుడు, మహోన్నతుడు అని అంటారు). (సబా 34:23).

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా చెప్పారు:

“అల్లాహ్ ఆకాశంలో ఒక ఆదేశం జారి చేసినప్పుడు, ఆయన ఆజ్ఞకు (విధేయులై) దైవదూతలు తమ రెక్కలు కొడుతారు. దాని శబ్దం కొండరాతిపై గొలుసుతో కొట్టినట్లు ఉంటుంది. ఆయన ఆదేశం వారి వరకు చేరుతుంది. చివరకు వారి హృదయాల నుండి భయం తొలగిపోయినప్పుడు, వారు “మీ ప్రభువు ఏమని పలికాడు?” అని అడుగుతారు. వారు, “సత్యం పలికాడు”, ఆయన మహెూన్నతుడు, మహిమాన్వితుడు అని చెబుతారు. ఈ మాటను దొంగలించడానికి షైతాన్ వింటూ ఉంటాడు. షైతానులు ఒకరిపై ఒకరు ఇలా ఉంటారు అని (ఈ హదీసు ఉల్లేఖించేవారిలో ఒకరు) సుఫ్యాన్ బిన్ ఉమయ్య నా తమ అరచేతిని వంచి వ్రేళ్ళ మధ్య వ్యత్యాసముంచి వివరించారు. ఆ షైతాన్ ఒక్క మాట విని, అతని క్రింద ఉన్న షైతాన్ కు ఇస్తాడు. ఇలా ప్రతి ఒకడు తన క్రిందివానికి ఇస్తూ చివరివాడు మాంత్రికునికి, లేక జ్యోతిష్యునికి ఇస్తాడు. ఒకప్పుడు ఆ మాట క్రిందికి చేరక ముందే (అల్లాహ్ ఆకాశంలో నియమించిన) అగ్ని జ్వాల అతడ్ని పట్టుకొని (కాల్చేస్తుంది). ఒకప్పుడు ఆ అగ్నిజ్వాల పట్టుకోక ముందే ఆ మాటను అతడు పంపేస్తాడు. ఆ ఒక్క మాటలో మాంత్రికుడు, లేక జ్యోతిష్యుడు వంద అబద్దాలు కలిపి (ప్రజలకు చెబుతాడు). అతడు చెప్పింది నిజమయేదుంటే, ప్రజలు అతను (మాంత్రికుడు, జ్యోతిష్యుడు) అలా, అలా చెప్పలేదా అని అనుకుంటారు. కాని అందులో నిజమయేది ఆ ఆకాశం నుండి విన్న ఒక్క మాటే”. (బుఖారి).

నవాసుబ్ను సమ్ ఆన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:

“అల్లాహ్ ఒక విషయం వహీ (దివ్య సందేశం) పంపాలని కోరినప్పుడు వహీ ద్వారా మాట్లాడుతాడు. అప్పుడు అల్లాహ్ భయంతో ఆకాశాలు కంపించిపోతాయి. ఆకాశవాసులు ఇది విన్నప్పుడు సొమ్మసిల్లి, సజ్దాలో పడిపోతారు. మొట్ట మొదట వారిలో జిబ్రీల్ తలెత్తుతారు. అల్లాహ్ తాను కోరింది వహీ ద్వారా అతనితో మాట్లాడుతాడు. తరువాత జిబ్రీల్ దైవదూతల ముందు వెళ్తారు. ప్రతీ ఆకాశం నుండి వెళ్తున్నప్పుడు ఆ ఆకాశ దైవదూతలు మీ ప్రభువు ఏమన్నాడు? అని అడుగుతారు. “సత్యం పలికాడు. ఆయన మహెన్నతుడు, మహిమాన్వితుడు” అని అతడంటాడు. వారందరు జిబ్రీల్ అన్నట్లు అంటారు. తరువాత జిబ్రీల్ ఆ విషయాన్ని ఎక్కడ చేరవేయాలని అల్లాహ్ చెప్పాడో అక్కడికి చేరవేస్తారు”.

ముఖ్యాంశాలు:

1. ఖుర్ ఆన్ ఆయతు యొక్క భావం (అల్లాహ్ వహీ చేసినప్పుడు దైవ దూతల భయ కంపనాల వివరణ ఉంది).

2. ఇందులో షిర్క్ కు విరుద్ధంగా బలమైన ఋజువు ఉంది. ప్రత్యేకంగా పుణ్యపురుషుల పేరు మీద జరిగే షిర్క్. ఈ ఆయత్ ఆంతర్యాల నుండి షిర్క్ పునాదులను బద్దలు చేస్తుంది అని అనబడింది.

3. “సత్యం పలికాడు, ఆయన మహిమాన్వితుడు, మహోన్నతుడూ” అన్న ఆయతు భావం.

4. వారు ప్రశ్నించింది ఎందుకు అన్నది కూడా తెలుస్తుంది. (అల్లాహ్ భయంతో).

5. ఆ తరువాత జిబ్రీల్ “అల్లాహ్ ఇలా ఇలా చెప్పాడు” అని వారికి బదులిస్తారు.

6. “మొదటిసారిగా తల ఎత్తేవారు జిబ్రీల్ ” అన్న ప్రస్తావన వచ్చింది.

7. ఆకాశవాసులందరు అడిగినందుకు జిబ్రీల్ వారందరికి సమాధానమిస్తారు.

8. ఆకాశవాసులందరూ సొమ్మసిల్లిపోతారు.

9. ఆకాశాలు కంపించేది అల్లాహ్ యొక్క వచనములతో.

10. అల్లాహ్ ఆదేశమిచ్చిన చోటకి వహీ తీసుకెళ్ళేవారు జిబ్రీలె.

11. షైతానులు మాటలను దొంగతనం చేసే ప్రయత్నాలు చేసేవారు.

12. షైతానులు ఒకరిపై ఒకరు ఎక్కుతారు, ఆకాశంలోని మాట అందుకోవటానికి.

13. వారిని తరిమి కొట్టడానికి అగ్నిజ్వాల పంపబడుతుంది.

14. ఒక్కప్పుడు అగ్నిజ్వాల అతన్ని అందుకొని కాల్చేస్తుంది. ఒకప్పుడు అతడు తప్పించుకొని ఆ మాట మాంత్రికుని, లేక జ్యోతిష్యునికి అందిస్తాడు.

15. ఒక్కోసారి మాంత్రికుని, జ్యోతిష్యుని మాట నిజమవుతుంది.

16. మాంత్రికుడు, జ్యోతిష్యుడు ఆ ఒక్క మాటకు వంద అబద్దాలు కలుపుతాడు.

17. అతని అసత్య మాటల్ని ప్రజలు నిజమనుకునేది ఆ ఒక్క ఆకాశ మాట నిజమయినందుకే.

18. అసత్యాన్ని, మిథ్యాన్ని మనుస్సు ఎంత తొందరగా ఒప్పుకుంటుందో చూడండి. ఒక్క మాటను చూస్తారు, కాని వంద అబద్దాలున్నాయని గమనించరు.

19. షైతానులు పరస్పరం ఆమాటను అందుకొని జ్ఞాపకముంచుకుంటారు. ఇతర మాటల్ని నిజమని భావింపజేసే ప్రయత్నం చేస్తారు.

20. ఇందులో అల్లాహ్ గుణవిశేషణాలు రుజువవుతున్నాయి. “అష అరియ్య, ముఅత్తిల” వర్గంవారు వాటిని తిరస్కరిస్తారు. (వాస్తవానికి తిరస్కరించ కూడదు).

21. కంపించుట, సొమ్మసిల్లుట అనేది అల్లాహ్ భయం వలన జరుగుతుంది.

22. దైవదూతలు అల్లాహ్ కు సజ్దా  చేస్తారు.

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) 

ఇందులో కూడా తౌహీద్ విధితం, షిర్క్ తుచ్ఛం అని చెప్పడానికి గొప్ప నిదర్శనం ఉంది. పై మూల వాక్యాల్లో అల్లాహ్ గొప్పతనం, ఔన్నత్యం ప్రస్తావించబడినది. ఆ గొప్పతనం, ఔన్నత్యం ముందు సర్వ సృష్టి యొక్క పెద్దరికాలు మట్టిలో కలిసిపోతాయి. అతని మాట వింటేనే భూమ్యాకాశాల్లో ఉన్న సర్వ దైవదూతల గుండెలు అదిరిపోతాయి. వారందరు ఆయన ఎదుట తల మోకరిల్లి, ఆయన గొప్పతనం, ఔన్నత్యాలను స్తుతిస్తారు. ఆయనతో భయపడుతారు. ఇలాంటి గొప్ప గుణం గల ప్రభువే, ఆరాధనకు అర్హుడు కాగలడు. ఆయన తప్ప మరెవ్వరూ ఆరాధనకు, పొగడ్తలకు, ప్రశంసలకు, కృతజ్ఞతకు అర్హులు కారు.


నుండిఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్)  – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం]