అబూ ‘వాఖిద్ అల్లెతి (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖించారు; ఒకసారి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మసీదులో కూర్చొని ఉన్నారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో పాటు ఇంకా కొందరు కూడా అక్కడ కూర్చోని ఉన్నారు. ఇంతలో ముగ్గురు మనుషులు అక్కడకు వచ్చారు. వారిలో ఇద్దరయితే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరకు ప్రసంగం వినేందుకు వచ్చారు. మూడో మనిషి అక్కణుంచి వెళ్లిపొయ్యాడు. ఆ ఇద్దరూ మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముందుకు వచ్చి కొంతసేపు నిలబడ్డారు. అంతలో వారిలో ఒకడు సభలో మధ్యన ఒకచోట కొంచెం ఖాళీ స్థలం ఉండటాన్ని గమనించి అక్కడకు పోయి కూర్చున్నాడు. రెండో అతను సభలో జనం వెనుక భాగంలో కూర్చున్నాడు. మూడో అతను వెనుతిరిగి వెళ్లిపోయాడు. తమ ప్రసంగాన్ని ముగించిన మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఈ ముగ్గురి వ్యక్తుల గురుంచి మీకు తెలుపనా? ఒకతనుఆ అల్లాహ్ శరణు కోరుకున్నాడు; అల్లాహ్ అతన్ని కరుణించి అతనికి స్థలాన్ని ప్రసాదించాడు. రెండో అతను సభ లోపలకు చొరబడటానికి పోయి కూర్చోటానికి సిగ్గుపద్డాడు. అల్లాహ్ కూడా అతన్ని చూసి సిగ్గుపడ్డాడు, అతనిపై కృప చూపాడు. మూడో అతను మఖం తిప్పుకున్నాడు. అల్లాహ్ కూడా అతని నుండి ముఖం తిప్పుకున్నాడు.”
సహీహ్ బుఖారి. 3 వ అధ్యాయం “జ్ఞానం”. హదీథ్ నెంబర్:66
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[4:25 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ధర్మపరమైన నిషేధాలు –3
3– అల్లాహ్ ను ఏ గౌరవభావంతో ప్రేమించాలో అదే విధంగా లేదా అంతకు మించి మరెవరినీ ప్రేమించకు:
ప్రేమ అనేది అల్లాహ్ తప్ప మరెవరితో ఉండకూడదు. ఎవరితోనైనా ఉంటే అది అల్లాహ్ కొరకే ఉండాలి. మరియు అల్లాహ్ ప్రేమించువాటినే ప్రేమించాలి. ప్రపంచంలో ఉన్న ప్రేమ అల్లాహ్ పట్ల మరియు అల్లాహ్ కొరకు ఉంటే అది అల్లాహ్ ప్రేమలో ఓ భాగమే([1]).
[وَمِنَ النَّاسِ مَنْ يَتَّخِذُ مِنْ دُونِ الله أَنْدَادًا يُحِبُّونَهُمْ كَحُبِّ الله وَالَّذِينَ آَمَنُوا أَشَدُّ حُبًّا لله] {البقرة:165}
కొందరు అల్లాహ్ ను కాదని ఇతరులను ఆయనకు ప్రత్యర్థులుగా నిలబెట్టి, అల్లాహ్ పట్ల కలిగి వుండవలసిన ప్రేమతో వారిని ప్రేమిస్తారు. కాని విశ్వాసులు అన్నిటికంటే అధికంగా అల్లాహ్ నే ప్రేమిస్తారు. (సూరె బఖర 2: 165).
([1]) అల్లాహ్ పట్ల ప్రేమ రకాలుః
1- దయ, జాలితో కూడిన ప్రేమ. ఇది సంతానం, చిన్న పిల్లవాళ్ళు మరియు వారి లాంటివారితో ఉంటుంది.
2- గౌరవ మర్యాద, సేవసత్కార్యాలతో కూడిన ప్రేమ. ఈ రకమైన ప్రేమ తండ్రి, శిక్షకుడు మరియు వారి స్థానంలో ఉన్నవారితో ఉంటుంది.
3- కామం, వాత్సల్యంతో కూడిన ప్రేమ. ఇది భార్యతో ఉంటుంది.
4- ఆరాధన, విధేయత భావంతో కూడిన ప్రేమ. అల్లాహ్ పట్ల విధేయత భావంతో కూడిన ప్రేమలో విశ్వాసుల్లో గల పుణ్యపురుషుల ప్రేమ కూడా వస్తుంది. (అంటే వారిని ప్రేమించుట అల్లాహ్ ఆరాధన పాటించినట్లు. ఎందుకనగా వారిని ప్రేమించాలని స్వయంగా అల్లాహ్ యే ఆదేశించాడు).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[2:10 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ధర్మపరమైన నిషేధాలు –2
ఆరాధనలో ఏ ఒక్క భాగం కూడా అల్లాహ్ యేతరుల కొరకు చేయకు:
ఆయన ఆరాధనలో ఆయనతో పాటు మరెవ్వరినీ భాగస్వామి చేయకు.
మౌలికంగా ‘ఇబాదత్‘(ఆరాధన) అంటే తనకు తాను అల్లాహ్ యదుట అధమునిగా, ధీనుడిగా భావించి, ఆయన ముందు అణగిపోవుట. అల్లాహ్ యేతరుల ఆరాధన హృదయము, నాలుక మరియు అవయవాలతో జరుగుతుంది. అల్లాహ్ ఇలా ఆదేశించాడుః
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలుల్లాహ్ అమ్మాబాద్.
ఈనాటి మన శీర్షిక – పరలోక దినాన సిఫారసు అవసరం. మహాశయులారా! ఆ దినం యాభై వేల సంవత్సరాల పరిమాణం గల దినం. ప్రజలు అక్కడ ఒక మైలు దూరంలో ఉన్న సూర్యుని కింద ఉండి, పాపాల కారణంగా వారి చెమటలు కారుతూ, డెబ్బై గజాల దూరం వరకు కూడా వారి వెనక ఉండి, వారు స్వయంగా తమ చెమటల్లో కొందరు చీలమండలాల వరకు, మరి కొందరు మోకాళ్ళ వరకు, మరి కొందరు నడుము వరకు, మరికొందరు మెడ వరకు ఈ విధంగా ఏదైతే మునిగి ఉంటారో, కాలం చాలా దీర్ఘంగా గడుస్తూ పోతుంది. కొందరైతే ఈ దీర్ఘ సమయాన్ని భరించలేక మేము నరకంలో పోయినా, మా పట్ల తీర్పు నరకం గురించి అయినా సరే కానీ, ఇక్కడ ఏ కష్టాలు అయితే భరిస్తున్నామో ప్రభువు తీర్పు కొరకు రావాలి అని ఈ వేచించడం అనేది ఈ దీర్ఘకాలం అనేది భరించలేనిది అని కోరుకుంటారు.
ఆ సందర్భంలో ఎంతో మంది కలసి మనందరి తండ్రి, ఆదిమానవుడు ఆదం (అలైహిస్సలాం) వద్దకు వెళ్తారు. “ఓ నాన్న! అల్లాహ్ మిమ్మల్ని స్వయంగా తన శుభ హస్తాలతో పుట్టించాడు. ఆత్మ మీలో ఊదాడు. మరి నిన్ను స్వర్గంలో నివసింపచేశాడు. మేము ఈరోజు ఎంత కష్టతరం లో ఉన్నామో, ఈ దీర్ఘ కాలాన్ని భరించలేక నానా రకాల ఇబ్బందులకు గురి అవుతున్నాము. మీరు అల్లాహ్ ఎదుట సిఫారసు చేసి, అల్లాహ్ త్వరగా తీర్పు చేయడానికి రావాలి అన్నట్లుగా కోరండి.”
మహాశయులారా! గమనించండి. ఇది కూడా ఆ సమయంలో అల్లాహ్ యొక్క ఎంత గొప్ప కరుణ అది ఆలోచించండి. దీర్ఘకాలం ఉంది. ఇంకా వేరే రకాల కష్టాలు ఉన్నాయి. ఇవన్నీ విషయాలు ఏదైతే మనం గత భాగాల్లో విన్నామో అవన్నీ కూడా వాస్తవం. కానీ అల్లాహ్ కొందరికి ఇలాంటి ఆలోచన కలిగించి, వారు ప్రవక్తల వద్దకు వెళ్లి సిఫారసు గురించి కోరడం అనే విషయం కూడా అల్లాహ్ యొక్క గొప్ప కరుణ, గొప్ప దయ. కానీ ఆదం (అలైహిస్సలాం) “నేను దీనికి అర్హుడిని కాను. నాతో జరిగిన పొరపాటు గురించే నేను ఎంతో బాధ పడుతున్నాను. ఈరోజు అల్లాహ్ (తాఆలా) ఎంత ఆగ్రహం, ఎంత కోపంలో ఉన్నాడంటే నేను స్వయంగా నా గురించి తప్ప ఇంకా వేరే గురించి ఆలోచించలేను.” వాస్తవానికి ఆ జరిగిన పొరపాటు అది ఆయన యొక్క కర్మ పత్రంలో లేదు. అల్లాహ్ (తఆలా) ఎన్నడో క్షమించేశాడు, మన్నించేశాడు. ఆ తర్వాత ఆయన్ని ఎన్నుకున్నారు. కానీ ఆదం (అలైహిస్సలాం) గారికి ఆ యొక్క బాధ, ఆ యొక్క రంది ఎంత ఉంటుందంటే సిఫారసు చేయడానికి నేను ఎలా అర్హుడిని కాగలుగుతాను అని అంటారు.
ఇక్కడ గమనించండి! మనకు తండ్రి అయిన ఆదం (అలైహిస్సలాం) ఒక్క పొరపాటు జరిగింది చిన్న పాటిది. దానిని మన్నించి వేయడం కూడా జరిగింది. దాని వల్ల ఆయనకి ఏశిక్ష కూడా జరగదు. అయినా ఎంత భయపడుతున్నారు. మరి ఈ రోజుల్లో మన పరిస్థితి ఏమున్నది? పాపాల పై పాపాలు ఒక్క పాపం, ఒక్క తప్పు ఏంటి? ఎన్నో రకాల తప్పులు చేస్తున్నాము. అయినా మనకు ఎన్ని ఆశలు ఉన్నాయి? ఎంత ధైర్యంగా మనం ఉంటాము. మనకు అల్లాహ్ పట్ల భయం మనలో ఏదైనా ఉందా? స్వయంగా మనమే దాని గురించి అంచనా వేసుకోవాలి.
ఆదం (అలైహిస్సలాం) అంటారు – “నేను సిఫారసు చెయ్యలేను. కావాలంటే మీరు నూహ్ వద్దకు వెళ్ళండి. ఆయన తౌహీద్ ప్రచారం చేయడానికి, షిర్క్ నుండి ఆపడానికి పంపబడిన మొట్టమొదటి ప్రవక్త, మొట్టమొదటి రసూల్. ఆయన వద్దకు వెళ్ళండి. ఆయన్ని అల్లాహ్ (తఆలా) అబ్దన్ షకూరా అని పేర్కొన్నాడు. కృతజ్ఞతలు తెలిపే దాసుడు”.
అప్పుడు ప్రజలందరూ నూహ్ (అలైహిస్సలాం) వద్దకు వెళ్లి అల్లాహ్ ఆయనకు ప్రసాదించినటువంటి అనుగ్రహాల్ని ప్రస్తావించి “మేము ఏ కష్టంలో ఉన్నామో మీరు చూస్తున్నారు. ఈ దీర్ఘకాలాన్ని భరించలేక ఎంత ఇబ్బందికి గురి అవుతున్నామో మీరు చూస్తున్నారు. రండి అల్లాహ్ వద్దకు వచ్చి ఏదైనా మీరు సిఫారసు చేయండి” అని కోరుతారు. అల్లాహు అక్బర్. నూహ్ (అలైహిస్సలాం) రాత్రి అనకుండా, పగలు అనకుండా 950 సంవత్సరాలు ప్రజల్ని అల్లాహ్ వైపునకు ఆహ్వానించడంలో, ఏకేశ్వరోపాసన వైపునకు పిలవడంలో గడిపారు. అంత గొప్ప ప్రవక్త కూడా అల్లాహ్ ఎదుట సిఫారసు చేయడానికి ఒప్పుకోవడం లేదు. “నేను దానికి అర్హుడిని కాను. నాతో జరిగిన పొరపాటు వల్ల నాకు ఈ రోజు అల్లాహ్ యొక్క ఆగ్రహానికి గురి అవుతాను అన్న భయం ఉంది. ఈరోజు అల్లాహ్ (తఆలా) నన్ను క్షమించి, నన్ను మన్నించి, నేను సురక్షితంగా ఉన్నాను అంటే ఇదే ఎంత గొప్ప విషయం.” అని అంటారు. ఆనాటి భయం ఎలా ఉందో గమనించండి. మహాశయులారా!
“అయితే మీరు ప్రవక్త ఇబ్రాహీం వద్దకు వెళ్ళండి. అల్లాహ్ ఆయన్ని సన్నిహితులుగా చేశాడు. ఖలీల్ అన్న బిరుదు ప్రసాదించాడు”. ఆ తర్వాత ప్రజలు ఇబ్రాహీం (అలైహిస్సలాం) వద్దకు వస్తారు. ఇబ్రాహీం (అలైహిస్సలాం) కు అల్లాహ్ ప్రసాదించినటువంటి అనుగ్రహాలని గుర్తు చేస్తారు. మేము ఏ ఇబ్బంది లో ఉన్నామో మీరు చూస్తున్నారు. అల్లాహ్ (తఆలా) తీర్పు చేయడానికి రావాలని మీరు అల్లాహ్ ఎదుట సిఫారసు చేయండి అని కోరుతారు. కానీ ఇబ్రాహీం (అలైహిస్సలాం) ఆయన కూడా “సిఫారసు చేయడానికి నేను అర్హుడిని కాను” అని అంటారు. ఒప్పుకోరు. “నేను ఎలా సిఫారసు చేయగలను? మీరు కావాలంటే మూసా వద్దకు వెళ్ళండి.”
ప్రజలు మూసా (అలైహిస్సలాం) వద్దకు వస్తారు. “ఓ మూసా! అల్లాహ్ ఎలాంటి అడ్డూ లేకుండా డైరెక్టుగా మీతో మాట్లాడారు. అల్లాహ్ మీకు ఇంకా ఎన్నో అనుగ్రహాలు ప్రసాదించాడు వచ్చేసేయండి. కనీసం మీరైనా సిఫారసు చేయండి” అని అంటే, మూసా (అలైహిస్సలాం) కూడా తనతో జరిగిన ఒక చిన్న పొరపాటును గుర్తు చేసుకుంటారు. అది కూడా తప్పుగా జరిగింది. అల్లాహ్ (తఆలా) దానిని మన్నించివేశాడు. తర్వాత ఎన్నుకున్నాడు. ప్రవక్తగా చేశాడు. అయినా దాని పట్ల ఆయన ఎంత భయపడుతున్నారు అంటే “నేను సిఫారసు చేయడానికి అర్హుడిని కాను” అని అంటారు.
ఈ విధంగా మహాశయులారా! తరువాత మూసా (అలైహిస్సలాం) ఆ ప్రజలతో అంటారు: “మీరు ఈసా (అలైహిస్సలాం) వద్దకు వెళ్ళండి”. మూసా (అలైహిస్సలాం) అంటే ప్రవక్త మోషే అని, ఇబ్రాహీం (అలైహిస్సలాం) అంటే ప్రవక్త అబ్రహాం అని మరియు ఈసా (అలైహిస్సలాం) అంటే ప్రవక్త యేసు క్రీస్తు అని మీకు తెలిసే ఉండవచ్చు.
అయితే మహాశయులారా! ప్రజలు ఈసా (అలైహిస్సలాం) వద్దకు వస్తారు. అల్లాహ్ ఆయనపై కురిపించిన అనుగ్రహాల్ని గుర్తు చేసి సిఫారసు చేయడానికి ముందుకు రండి అని కోరుతారు. కానీ ఆయన కూడా సిఫారసు చేయడానికి ఒప్పుకోరు. ఇక ఏమిటి పరిస్థితి? మరి ఎవరు సిఫారసు చేయడానికి రావాలి? అల్లాహ్ (తఆలా) ప్రజల మధ్య లో తీర్పు చేయడానికి ఎప్పుడు వస్తారు? అయితే మహాశయులారా! ఆ సందర్భంలో ఈసా (అలైహిస్సలాం) చిట్ట చివరి ప్రవక్త, దయామయ, దైవప్రవక్త, సర్వ మానవాళి వైపునకు కారుణ్యమూర్తిగా పంపబడిన ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి వైపునకు పంపుతూ “మీరు ఆయన వద్దకు వెళ్ళండి. అల్లాహ్ (తఆలా) ఆయన పూర్వపు మరియు వెనకటి పాపాలు అన్నిటిని కూడా మన్నించేసాడు మరియు ఆయన్ని సర్వ ప్రవక్తలకు ముద్రగా చేసి, చిట్ట చివరి ప్రవక్తగా చేసి పంపారు. మీరు ఆయన వద్దకు వెళ్ళండి” అని అంటారు.
అప్పుడు ప్రజలు ఎక్కడికి వెళ్తారు? ఏమి జరుగుతుంది? ఇక ప్రజలందరూ ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వస్తారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి మాట విని, “సరే అల్లాహ్ నన్ను దానికి అర్హునిగా చేసాడు” అని అంటారు.
కానీ ఇక్కడ ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇక ముందుకు ఎలా చేస్తారు? ఈ విషయాలను చాలా శ్రద్ధగా వినండి. తర్వాత మనం విశ్వాసాల్లో ఏమైనా లోపాలు ఉంటే వాటిని మనం సరిచేసుకోవాలి. ఇక ఆ తరువాత ఆ ప్రళయదినాన మనము కూడా ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి యొక్క సిఫారసులు పొందడానికి ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలో వాటిని కూడా తెలుసుకొని వాటికి కూడా మనం సిద్ధం ఉండే ప్రయత్నం చేయాలి.
ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అంటారు: నేను దానికి అర్హుడుని. కానీ వెంటనే తన ఇష్టానుసారం సిఫారసు చెయ్యలేరు. ఎందుకంటే ఆనాటి పరిస్థితి ఎలాంటిది? దైవదూతలు, ప్రవక్తలు అందరూ ఆ మైదానంలో నిలబడి ఉన్నారు. ఏ ఒక్కరు కూడా నోరు విప్పి మాట్లాడలేరు. ఎప్పటివరకైతే కరుణామయుడైన అల్లాహ్ యొక్క అనుమతి రాదో. ఆ అనుమతి వచ్చిన తర్వాత కూడా సరియైన మాట, సత్యమైన మాట మాత్రమే వారి నోట వెళుతుంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ తరువాత అల్లాహ్ అర్ష్ కింద సజ్దాలో పడిపోతారు.
సహీ బుఖారీ లో వచ్చిన హదీత్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలుపుతున్నారు. “చాలా దీర్ఘ సమయం వరకు నేను సజ్దాలో ఉంటాను. అల్లాహ్ యొక్క పొగడ్తలు, అల్లాహ్ యొక్క ప్రశంసలు, అల్లాహ్ యొక్క స్థుతులు స్తుతిస్తూ ఉంటాను. ఆ సందర్భంలో నేను అల్లాహ్ యొక్క స్థుతులు ఏఏ విధంగా స్తుతిస్తానో ఆ సందర్భంలో అల్లాహ్ నాకు వహీ ద్వారా తెలియజేస్తాడు. చాలా సేపటి వరకు సజ్దాలో ఉన్న తర్వాత యా మహమ్మద్! అని అల్లాహ్ వైపు నుండి మాట వినబడుతుంది. “ఓ మహమ్మద్! నీ తల ఎత్తు మరియు అడుగు. నీవు అడుగుతున్న విషయం నీకు ఇవ్వబడుతుంది. నీవు అడుగుతున్న విషయం మీకు ఇవ్వడం జరుగుతుంది మరియు నీవు సిఫారసు చెయ్యి. నీ సిఫారసు అంగీకరించబడింది”.
ఆ తరువాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. ఒక హద్దు నిర్ణయించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మరోసారి సజ్దాలో పడిపోతారు. అల్లాహ్ యొక్క స్తుతులు స్తుతిస్తారు. ప్రశంసలు చెల్లిస్తారు. ఈ విధంగా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి యొక్క సిఫారసులు అంగీకరించి ప్రజల మధ్య తీర్పు చేయడానికి హాజరవుతారు. దైవ దూతలు అందరూ కూడా బారులుతీరి ఉంటారు. అల్లాహ్ కూడా ప్రజల మధ్యలో తీర్పు చేయడానికి హాజరు అవుతాడు.
అయితే ఈ సిఫారసు యొక్క సమస్య ఏదైతే ఉందో అల్లాహ్, కరుణామయుడైన అల్లాహ్ యొక్క గొప్ప కరుణ, గొప్ప దయ ఆ పరలోక దినాన ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి యొక్క సిఫారసు, ఇంకా ఇతర ప్రవక్తల సిఫారసు మరియు ఇంకా తర్వాత పుణ్యాత్ములు, మహా భక్తులు వారి యొక్క సిఫారసు కూడా స్వీకరించబతుంది. కానీ దానికి ఇంకా వేరే కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి.
అయితే ఈ మైదానంలో అల్లాహ్ తీర్పు గురించి రావాలి అని ఏ సిఫారసు అయితే ప్రజలందరూ ఆదం, నూహ్, ఇబ్రాహీం, మూసా, ఈసా (అలైహిముస్సలాతు వ తస్లీమ్) వారితో కోరడం జరిగిందో వారు నిరాకరించారో తరువాత ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) “సరే మంచిది, నేను దాని అర్హుడ్ని, నేను అల్లాహ్ ఎదుట సిఫారసు చేస్తాను” అని అర్ష్ కింద సజ్దాలో పడిపోతారో, తర్వాత సిఫారసు గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కి అనుమతి లభిస్తుందో, ఈ సిఫారసులు ఎన్ని రకాలుగా ఉన్నాయో, ఎన్ని సందర్భాలలో ఉన్నాయో వాటన్నిటిలో అతి గొప్ప సిఫారసు. దీని యొక్క అర్హత ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కు తప్ప ఇంకా వేరే ఎవరికీ లభించదు.
మరియు ఈ సందర్భంలో ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి ఏ సిఫారసు ఇవ్వడం జరిగిందో, సిఫారసు స్వీకరించడం జరుగుతుందో దానినే ఖురానే మజీద్ లోని ఆయత్ సూరయే ఇస్రాలో మఖామమ్ మహ్మూద అని చెప్పడం జరిగింది. ఏంటి భావం?
సూరత్ బనీ ఇస్రాయిల్ ఆయత్ నెంబర్ 79 లో – “రాత్రి వేళ నిలబడి నిద్ర నుండి మేలుకొని తహజ్జుద్ నమాజ్ పాటించు. ఇది నీ కొరకు అదనపు నమాజ్, నఫీల్ నమాజ్. ఈవిధంగా అల్లాహ్ (తఆలా) మీకు ప్రశంసింప బడిన, ప్రశంసించదగిన ఆ గొప్ప స్థానానికి (మఖామమ్ మహ్మూద) నిన్ను చేర్చుతాడు“. మఖామమ్ మహ్ మూద అని ఏదైతే అనపడిందో, అంటే ప్రశంసించదగిన స్థానం అని.
దీని గురించి సహీ బుఖారీ లో హదీస్ ఉంది. హదీస్ నెంబర్ 1748. ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “ఆనాడు ప్రజలందరూ ప్రవక్తల వెంట వెళ్లి మీరు సిఫారసు చేయండి అని కోరుతారు. వారు దానిని ఒప్పుకోరు. చివరికి నా వద్దకు వస్తారు. అప్పుడు అల్లాహ్ (తఆలా) నన్ను మఖామే మహ్ మూద్ స్థానానికి చేర్చి నా యొక్క సిఫారసును అంగీకరిస్తాడు”.
సహీ బుఖారి లోని మరో ఉల్లేఖనంలో ఉంది. హదీస్ నెంబర్ 1475. “ఎప్పుడైతే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వస్తారో ప్రజలు అప్పుడు ప్రజలందరూ కూడా ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ని ప్రశంసించి, ఈయన దీనికి అర్హులు, ఈయన చేయగలుగుతారు అని చెప్పుకుంటూ ఉంటారు“.
ఈ విధంగా ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఈ తర్వాత వేరే సందర్భాలు ఏవైతే ఉన్నాయో, ఇంకా సిఫారసు చేయడానికి వేరే సందర్భాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రస్తావన మరి కొంత సేపటి తరువాత వస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం మనం గమనిస్తాము. అదేమిటి ఈ మఖామె మహ్ మూద్ లో, ఈ ప్రళయ దినాన, పరలోక దినాన ఆ మహామైదానం లో అల్లాహ్ ప్రజల మధ్య తీర్పు చేయడానికి రావాలి అని ఏదైతే ప్రజలు కోరుకుంటారో దీర్ఘ సమయాన్ని భరించలేక, ఆ సందర్భంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి యొక్క సిఫారసును పొందడానికి ఇహలోకంలో ఏదైనా సత్కార్యాలు ఉన్నాయా?
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “ప్రళయ దినాన నా సిఫారసు పొందే అదృష్టవంతుల్లో ఒకరు – ఎవరైతే లా ఇలాహ ఇల్లల్లాహ్ తన మనుసుతో మరియు స్వచ్ఛమైన మనసుతో చదువుతారో ,అంటే ఏమిటి?, అల్లాహ్ తో పాటు ఇంకా ఎవరిని కూడా ఆయన ఆరాధనలో ఎలాంటి భాగస్వామిగా చెయ్యరు. ఆ తరువాత నమాజులను స్థాపించడం, నమాజ్ కంటే ముందు అజాన్ ఏదైతే అవుతుందో దాని యొక్క సమాధానం పలకడం“. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. సహీ బుఖారీ లోని హదీత్ “ఎవరైతే అజాన్ తర్వాత ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దరూద్ చదువుతారో, ఆ తరువాత క్రింది దుఆ చదువుతారో ప్రళయ దినాన వారికి నా సిఫారసు లభిస్తుంది అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు”.
ఈ సంపూర్ణ పిలుపునకు మరియు స్థాపించబడు నమాజునకు ప్రభువైన ఓ అల్లాహ్! ముహమ్మద్ గారికి వసీలా మరియు ‘ఫజీలా’ అనుగ్రహాన్ని మరియు ఆయనకు వాగ్దానము చేసిన ఔన్నత్యము గల మఖామే మహ్‌మూద్ ప్రసాదించుము
(బుఖారీ, బైహఖి 1-410)
అయితే ఇలాంటి సత్కార్యాలు చేస్తూ ఉండే ప్రయత్నం చేయాలి. మరి కొన్ని విషయాల గురించి ఇన్షా అల్లాహ్ మనం వేరే సందర్భాలలో తెలుసుకుందాము. అల్లాహ్ (తఆలా) ఆ పరలోక దినాన దీర్ఘకాలంలో ఏ సిఫారసు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి చేయడానికి అనుమతించడం జరుగుతుందో, ఆ సిఫారసు మనం కూడా పొందేటువంటి సత్భాగ్యం ప్రసాదించుగాక.
జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఓ అల్లాహ్ నీవు పరమ పవిత్రునివి, నీకే సర్వ స్తోత్రములు, నీ నామము శుభం గలది. నీ మహిమ చాలా ఘనమయినది. నీవు తప్ప ఆరాధ్యుడెవడు లేడు.
ఇవి రెండే గాకుండా ఇతర దుఆలు కూడా చదవవచ్చును. ఎల్లప్పుడూ ఒకే దుఆ కాకుండా వేరు వేరు సమయాల్లో వేరు వేరు దుఆలు చదవడం ఉత్తమం. ఇలా నమాజులో నమ్రత, శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది.
అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో * ప్రశంసలు, పొగడ్తలన్నీ అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి. ఆయన సమస్త లోకాలకు పోషకుడు, * అపార కరుణా మయుడు, పరమ కృపాశీలుడు. * ప్రతిఫల దినానికి (అంటే ప్రళయ దినానికి) యజమాని. * మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్ధిస్తున్నాము. * మాకు రుజుమార్గం (సన్మార్గం) చూపించు. * నీవు అనుగ్రహించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురికాని వారి, అపమార్గానికి లోనుకాని వారి మార్గం.
7- కంఠస్తం చేసి ఉన్న ఖుర్ఆనులోని ఏదైనా సూరా లేదా కొన్ని ఆయతులు పఠించాలి.
8- చేతులు భుజాల వరకు ఎత్తి, అల్లాహు అక్బర్ అంటూ రుకూ చేయాలి. రుకూలో అరచేతుల తో మోకాళ్ళను పట్టుకోవాలి. వ్రేళ్ళు దగ్గరదగ్గరగా కాకుండా విడిగా ఉండాలి. సుబ్ హాన రబ్బియల్ అజీం మూడు సార్లు చదువుట సున్నత్. అంతకంటే ఎక్కువ చదవవచ్చు. ఒక్క సారి చదివినా సరిపోవును. చూడండి (చిత్రం3)
9- ఒంటరి నమాజ్ చేయు వ్యక్తి మరి ఇమాం రుకూ నుండి తల లేపుతూ సమిఅల్లాహు లిమన్ హమిద అంటూ భుజాల వరకు చేతులెత్తాలి. ముఖ్తదీ సమిఅల్లాహు లిమన్ హమిదహ్ కు బదులుగా రబ్బనా వలకల్ హమ్ ద్ అనాలి. ఈ స్థితిలో కుడి చెయి ఎడమ చెయిపై పెట్టి ఛాతిపై కట్టుకోవాలి.
10- రుకూ తర్వాత నిలబడి ఉన్నప్పుడు ఈ దుఆ కూడా చదవవచ్చునుః అల్లాహుమ్మ రబ్బనా లకల్ హమ్దు మిల్ఉస్ సమావాతి వ మిల్ఉల్ అర్జి వ మిల్ఉ మాషిఅత మిన్ షైఇమ్ బఅదు.
ఓ అల్లాహ్, మా ప్రభువా! నీకే ఆకాశముల నిండుగాను, భూమి నిండుగాను, అవి గాకా నీవు కోరిన వస్తువుల నిండుగాను స్తుతి గలదు. (ముస్లిం 476).
11- అల్లాహు అక్బర్ అంటూ మొదటి సజ్దాలో వెళ్ళాలి. ఏడు అంగములపై సజ్దా చేయాలిః (1) నొసటి, ముక్కు. (2,3) రెండు అరచేతులు. (4,5) రెండు మోకాళ్ళు. (6,7) రెండు పాదముల వ్రేళ్ళు. చేతులను పక్కల నుండి దూరముంచాలి. కాళ్ళ వ్రేళ్ళను ఖిబ్లా దిశలో ఉంచి, సజ్దాలో సుబ్ హాన రబ్బియల్ అఅలా మూడు సార్లు పలుకుట సున్నత్. ఎక్కువ పలు- కుట మంచిదే. ఒక్క సారి చదివినా సరిపోతుంది. ఈ స్థితిలో ఎక్కువ దుఆ చేయాలి. ఎందుకనగా ఇది దుఆ అంగీకార స్థితుల్లో ఒకటి. చిత్రం4
12- అల్లాహు అక్బర్ అంటూ సజ్దా నుండి తలెత్తి ఎడమ పాదముపై కూర్చోవాలి. కుడి కాలు పాదమును నిలబెట్టాలి. కుడి చెయ్యి కుడి మోకాలుకు దగ్గరగా తోడపై, ఎడమ చెయ్యి ఎడమ మోకాలుకు దగ్గరగా తోడపై పెట్టాలి. చేతి వ్రేళ్ళను విడిగా పరచి ఉంచాలి. రబ్బిగ్ ఫిర్లీ రబ్బిగ్ ఫిర్లీ అని చదవాలి. (చిత్రం5,6,7)
13- రెండవ సజ్దా మొదటి సజ్దా మాదిరిగా చేసి, సజ్దాలో అదే దుఆ చదవాలి.
14- అల్లాహు అక్బర్ అంటూ రెండవ సజ్దా నుండి లేస్తూ నిటారుగా నిలబడాలి.
15- రెండవ రకాత్ మొదటి రకాత్ మాదిరిగా చేయాలి. అందులో చదివిన దుఆలే ఇందులో చదవాలి. దుఆయె ఇస్తిఫ్ తాహ్ మరియు అఊజు బిల్లాహి…. తప్ప. ఈ రెండవ రకాత్ లోని రెండవ సజ్దా నుండి అల్లాహు అక్బర్ అంటూ లేచి రెండు సజ్దాల మధ్యలో కూర్చున్న విధంగా కూర్చోని, కుడి చెయి వ్రేళ్ళను ముడుచుకొని నడిమి వ్రేళిని బొటన వ్రేళి మధ్యలో పెట్టి, చూపుడు వ్రేళితో సైగా చేస్తూ, కదలిస్తూ తషహ్హుద్ చదవాలిః
నా వాక్కు, దేహా, ధన సంబంధమైన ఆరాధన లన్నియూ అల్లాహ్ కొరకే ఉన్నవి. ఓ ప్రవక్తా! మీపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు ఆయన శుభాలు కురువుగాకా. అల్లాహ్ తప్ప వేరు ఆరాధ్యుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. ముహమ్మద్ అల్లాహ్ యొక్క దాసుడు, సందేశహరుడని సాక్ష్యమిస్తున్నాను.
ఇక్కడి వరకు చదివిన తరువాత, చేతులు భుజాల వరకు ఎత్తుతూ అల్లాహు అక్బర్ అంటూ నిలబడాలి, ఒక వేళ మగ్రిబ్ లాంటి మూడు రకాతుల నమాజ్ లేదా జొహ్ర్, అస్ర్ మరియు ఇషా లాంటి నాలుగు రకాతుల నమాజ్ చేస్తుంటే, రెండవ రకాతు మాదిరిగా మిగిత నమాజ్ పూర్తి చేయాలి. అయితే ఖియామ్ (నిలబడి ఉన్న స్థితి)లో కేవలం సూరె ఫాతిహ చదువుతే సరిపోతుంది. చివరి రకాతు రెండవ సజ్దా నుండి లేచి కూర్చోని తషహ్హుద్, దరూద్ ఇబ్రాహీమ్ మరియు ప్రవక్త నేర్పిన తనికిష్టమైన దుఆలు అధికంగా చదవడం మంచిది. (ఇది కూడా దుఆ అంగీకార సందర్భాల్లో ఒకటి). క్రింద దరూద్ మరియు ఒక దుఆ ఇవ్వబడుతుంది.
ఓ అల్లాహ్ నీవు ఇబ్రాహీంను, వారి కుటుంబీకులను కరుణించినట్లు ముహమ్మద్ మరియు వారి కుటుంబీకులను కరుణించు. నిశ్చయంగా నీవు స్తోత్రాలకు అర్హునివి. ఘనుడివి. ఓ అల్లాహ్ నీవు ఇబ్రాహీం, వారి కుటుంబీకులకు శుభాలు దయ చేసినట్లు ముహమ్మద్, వారి కుటుంబీకులకు శుభాలు దయ చేయుము. నిశ్చయంగా నీవు స్తోత్రాలకు అర్హునివి. ఘనుడివి. ఓ అల్లాహ్ నేను సమాధి శిక్షల నుండి, నరక యాతన నుండి, జీవన్మరణ పరీక్షల నుండి మరియు దజ్జాల్ మాయ నుండి రక్షణకై నీ శరణు కోరుతున్నాను
16- అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అంటూ కుడి వైపున మెడ త్రిప్పాలి. అలాగే అంటూ ఎడమ వైపున మెడ త్రిప్పాలి. చూడండి (చిత్రం8,9)
17- జొహ్ర్, అస్ర్, మగ్రిబ్, ఇషా నమాజుల్లోని చివరి తషహ్హుద్ లో కూర్చుండే పద్ధతి ఇలా ఉండాలి. కుడి పాదాన్ని నిలబెట్టి ఎడమ పాదాన్ని కుడి కాలి పిక్క క్రింది నుంచి బైటికి తీయాలి. ఎడమ పిరుదును భూమిపై ఆనించాలి. కుడి చెయ్యి కుడి తోడపై, ఎడమ చెయ్యి ఎడమ తోడపై మోకాలుకు దగ్గరగా పెట్టాలి. చూడండి (చిత్రం10)
أَسْتَغْفِرُ الله (3). اَللهُمَّ أَنْتَ السَّلامُ ومِنْكَ السَّلامُ تَبَارَكْتَ يَا ذَا الجَلالِ وَ الإكْرَام. لا إله إلا الله وَحْدَهُ لا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيءٍ قَدِير. اَللهُمَّ لا مَانِعَ لِمَا أعْطَيْتَ وَلا مُعْطِيَ لِمَا مَنَعْتَ وَلا يَنْفَعُ ذَا الجَدِّ مِنْكَ الْجَدُّ. لا حَوْلَ وَلا قُوَّةَ إِلاَّ بِاللهِ، لاَ إِلهَ إِلاَّ اللهُ وَلاَ نَعْبُدُ إِلاَّ إِيَّاهُ، لَهُ النِّعْمَةُ وَلَهُ الْفَضْلُ وَلَهُ الثَّنـاءُ الْحَسـَن، لاَ إلَهَ إِلاَّ اللهُ مُخْلِصِينَ لَه الدِّينَ وَلَوكَرِهَ الكَافرون.
అల్లాహ్ తో క్షమాభిక్ష కోరుచున్నాను (3). ఓ అల్లాహ్ నీవు ఏలాంటి లోపాలు లేనివాడవు. నీవే రక్షణ నొసంగువాడవు. ఓ ఘనుడవు, పరమదాతయువు నీవు శుభములు గలవాడవు. అల్లాహ్ దప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడు. ఆయన అద్వితీయుడు. ఆయనకు సాటి మరొకడు లేడు. ఆయనకే అధికారము చెల్లును. ఆయనకే సర్వ స్తోత్రములు గలవు. ఆయనే సర్వ శక్తుడు. ఓ అల్లాహ్ నీవు నొసంగిన వరాలను ఎవడు అడ్డగింపజాలడు. నీవు ఇవ్వని దానిని ఎవ్వడూ ఇవ్వజాలడు. ధనికుడు తన ధనముతో నీ శిక్షల నుండి తప్పించుకు- పోజాలడు. పాపాములను వదులుకొనుట మరియు పుణ్యాలు చేయుట అల్లాహ్ దయవలననే కలుగును. అల్లాహ్ దప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడు. ఆయన్నే మేము ఆరాధించుచున్నాము. ఆయనే సర్వ అనుగ్రహాలు దయ చేయువాడు. ఆయనకే ఘనత, మంచి స్తోత్రములు గలవు. అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యు డెవ్వడూ లేడు. చిత్తశుద్ధితో మేము ఆయన్నే ఆరాధించుచున్నాము. ఈ విషయము సత్య తిరస్కారులకు నచ్చకున్నా సరే. (ముస్లిం 591, 593, 594, బుఖారి 844).
తరువాత సుబ్హానల్లాహ్ 33, అల్ హందు లిల్లాహ్ 33, అల్లాహు అక్బర్ 33 సార్లు చదివి, లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్‌తో 100 పూర్తి చేయాలి. (ముస్లిం 597).
ఖుల్ హువల్లాహు అహద్(5), ఖుల్ అఊజు బిరబ్బిల్ ఫలఖ్(5), ఖుల్ అఊజు బిరబ్బిన్నాస్([2]) సూరాలు ఫజ్ర్ మరియు మగ్రిబ్ తరువాత మూడేసి సార్లు మిగిత నమాజుల తరువాత ఒక్కొక్క సారి చదవాలి.
మస్బూఖ్:
ఎవరైనా జమాఅతుతో ఒకటి లేదా కొన్ని రకాతులు తప్పి పోతే (మస్బూఖ్) ఇమాం రెండవ సలాం తింపిన తర్వాత వాటిని పూర్తి చేసుకోవాలి. అతను ఇమాంతో ఏ రకాతులో కలిసాడో అదే అతని మొదటి రకాతు. ఇమాంను రుకూ స్థితిలో పొందినవాని ఆ రకాతు అయినట్లే. ఇమాంను రుకూలో పొందకుంటే ఆ రకాత్ తప్పిపోయి నట్లే లెక్క.
జమాఅతు నిలబడిన తర్వాత వచ్చేవారు జమాఅతును ఏ స్థితిలో చూసినా అదే స్థితిలో కలవాలి. వారు రుకూ, లేదా సజ్దా ఇంకే స్థితిలో ఉన్నా సరే. వారు మరో రకాతు కొరకు నిలబడే వరకు నిరీక్షించవద్దు. నిలబడి తక్బీరె తహ్రీమ అల్లాహు అక్బర్ అనాలి. రోగి లాంటి ఏదైనా ఆటంకం ఉన్నవారు కూర్చుండి అల్లాహు అక్బర్ అంటే ఏమీ తప్పు లేదు.
నమాజును భంగపరుచు కార్యాలు:
1- తెలిసి, కావాలని మాట్లడడం, అది కొంచమైనా సరే.
2- పూర్తి శరీరముతో ఖిబ్లా దిశ నుండి పక్కకు మరలడం.
3- వుజూను భంగపరిచే కారణాల్లో ఏ ఒకటైనా సంభవించడం.
4- అనవసరంగా ఎడతెగకుండా ఎక్కువ చలనము చేయడం.
5- కొంచం నవ్వినా నమాజ్ వ్యర్థమవుతుంది.
6- తెలిసి కూడా ఎక్కువ రుకూ, సజ్దాలు, ఖియాం, జుల్సాలు చేయడం.
7- తెలిసి కూడా (రుకూ, సజ్దా వగైరా) ఇమాంకు ముందు చేయడం.
నమాజ్ యొక్క వాజిబులు:
1- మొదటి తక్బీరె తహ్రీమ తప్ప మిగితావన్నీ.
2- రుకూలో కనీసం ఒక్కసారైనా సూబ్ హాన రబ్బియల్ అజీం అనడం.
3- రుకూ నుండి లేస్తూ ఇమాం మరియు ఒంటరి నమాజి సమిఅల్లాహు లిమన్ హమిదహ్ అనడం.
4- రుకూ నుండి నిలబడి రబ్బనా వలకల్ హంద్ అనడం.
5- సజ్దాలో కనీసం ఒక్కసారైనా సుబ్ హాన రబ్బియల్ అఅలా అనడం.
6- రెండు సజ్దాల మధ్యలో రబ్బిగ్ ఫిర్లీ అనడం.
7- మొదటి తషహ్హుద్ చదవడం.
8- మొదటి తషహ్హుద్ చదవడానికి కూర్చోవడం.
నమాజ్ యొక్క రుకున్ లు:
1- ఫర్జ్ నమాజులో శక్తి ఉన్నప్పుడు నిలబడటం. నఫిల్ నమాజులో నిలబడటం ముఖ్యం లేదు. కాని కూర్చుండి నమాజ్ చేసేవానికి, నిలబడి చేసేవానికంటే సగం పుణ్యం తక్కువ.
2- తక్బీరె తహ్రీమ.
3- ప్రతి రకాతులో సూరె ఫాతిహ పఠించడం.
4- ప్రతీ రకాతులో రుకూ చేయడం.
5- రుకూ నుండి లేచి నిటారుగా నిలబడటం.
6- ప్రతీ రకాతులో రెండు సార్లు ఏడు అంగములపై సజ్దా చేయడం.
7- రెండు సజ్దాల మధ్య కూర్చోవడం.
8- నమాజులోని రుకూ, సజ్దా మొదలైన అంశాలన్నిటినీ నింపాదిగా, శాంతిగా నెరవేర్చడం.
9- చివరి తషహ్హుద్.
10- దాని కొరకు కోర్చోవడం.
11- దరూదె షరీఫ్ (అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మది…..)
12- సలాం తింపడం.
13- ప్రతి రుకున్ నెరవేర్చడంలో క్రమ పద్దతిని పాటించడం
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలుల్లాహ్ అమ్మాబాద్.
ఈనాటి మన శీర్షిక విశ్వాసుల్లో మరీ ఉత్తమమైన వారు, పుణ్యాత్ములు, భక్తులు, అల్లాహ్ యొక్క భయభీతి కలిగి తమ జీవితం గడిపి పుణ్యాల్లో, సత్కార్యాల్లో తమ జీవితం గడిపిన వారు. వారి యొక్క స్థానం సమాధుల నుండి లేపబడిన తర్వాత పరలోకంలో, ఆ మహా మైదానంలో వారి పరిస్థితి ఎలా ఉంటుంది?
ఎప్పుడైతే ప్రజలందరూ సమాధులు నుండి లేపబడతారో, ఆకాశాల్లో, భూమిలో ఉన్నవారందరూ కూడా భయకంపితులు అయిపోతారు, సొమ్మసిల్లి పోతారు. వారి యొక్క పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంటుంది. కానీ విశ్వాసులు, పుణ్యాత్ములు, ఎల్లవేళల్లో సత్కార్యాల్లో జీవితం గడుపుతూ పాపాల నుండి దూరం ఉండే వారు, ఎంతో భయ భక్తితో తన జీవితం గడిపేవారు, వారి గురించి అల్లాహ్ సూరతుల్ అంబియా ఆయత్ నెంబర్ 101 నుండి 103 వరకు:
అయితే ముందు నుంచే మా వద్ద ఎవరి కొరకు మేలు ఖరారై ఉందో వారంతా నరకానికి దూరంగానే ఉంచబడతారు.వారు నరకం సవ్వడి అయినా వినరు. తమ మనసు మెచ్చిన సుఖవిలాసాల మధ్య వారు శాశ్వతంగా ఉంటారు. ఆ మహాకలవరం (కూడా) వారిని వ్యాకుల పరచదు.
అల్లాహు అక్బర్!. ఎలాంటి అదృష్టవంతులు వారు గమనించండి. మనం కూడా వారిలో ఒకరు కావడానికి ప్రయత్నం చేయాలి. ఈలోకంలో ఒకేసారి మనకి ఈ అవకాశం దొరుకుతుంది.
సూరత్ జుక్రూఫ్ ఆయత్ 68 మరియు 69 లో వారి గురించి అల్లాహ్ ఇలా తెలిపాడు –
ఓ నా దాసులారా! ఈ రోజు మీకెలాంటి భయంగానీ, దుఃఖంగానీ ఉండదు.మా ఆయతులను (సూచనలను) విశ్వసించి, విధేయులు (ముస్లింలు)గా ఉన్న వారినుద్దేశించి (ఈ విధంగా అనబడుతుంది:)
ఆయతులు అంటే ఖురాన్ ఆయతులు. అల్లాహ్ పంపిన మహిమలు. ఈ ప్రపంచంలో అల్లాహ్ ఏ సూచనలు అయితే చూపిస్తున్నాడో, వేటి ద్వారానైతే మనము ఆయన ఏకత్వాన్ని గ్రహించి, పరలోకం రానున్నది, ఆయనను ఆరాధించి ఆ పరలోకదిన గాంభీర్యం, వ్యాకులత, అక్కడి యొక్క కఠినాల నుండి మనము రక్షణ పొందగలుగుతామో అని విశ్వసిస్తారో. మరియు వారు ముస్లిములుగా ఇస్లాం ప్రకారంగా జీవించి ప్రాణం పోయేంత వరకు కూడా ఇస్లాంపై స్థిరంగా ఉంటారో వారు ప్రళయ దినాన ఎప్పుడైతే అల్లాహ్ (తఆలా) వారికి అన్ని రకాల సుఖశాంతులు ప్రసాదిస్తాడో స్వయంగా వారి నోట ఇహలోకంలో కూడా అల్లాహ్ (తఆలా) చెప్పించాడు. ఏమని?
సూరతుల్ ఇన్సాన్ మరొక పేరు దానిది సూరతు ద్దహ్ర్. ఆయత్ నెంబర్ పదిలో అల్లాహ్ ఇలా తెలియపరిచాడు –
“నిశ్చయంగా మేము మా ప్రభువు తరఫున సంభవించే అత్యంత కఠినమైన, సుదీర్ఘమైన రోజు గురించి భయపడుతున్నాము.”
“నిశ్చయంగా మేము భయపడతాము. మా ప్రభువుతో చాలా సుదీర్ఘకాలం అయిన, మరి ఎంతో కఠినతరమైన ఆ పరలోక దినం ఏదైతే ఉందో ఆ రోజున మా ప్రభువు మాకు అన్ని రకాల సౌకర్యాలు ప్రసాదించాలి లేదా అంటే ఆ రోజు చాలా కష్టతరమైనది అని మేము మా ప్రభువుతో భయపడుతూ ఉండేవారము”. అలా భయపడుతూ జీవితం గడిపి సత్కార్యాల్లో, ఎళ్లవేళల్లో నిమగ్నులై పాపాలకు దూరం ఉన్నందువల్ల అల్లాహ్ తప్పకుండా అలాంటి వారిని ఆ రోజున ఏ వ్యాకులత, ఏ కఠినతరం ఉంటుందో దాని నుండి వారిని రక్షిస్తాడు.
ఒక హదీస్ లో ఉంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు – షేక్ అల్బానీ (రహిమహుల్లా) సిల్ సిలతుల్ సహీహాలో దానిని హసన్ అని అన్నారు. సహీహాలో హదీత్ నెంబర్ 742. అల్లాహ్ ఇలా అంటున్నాడు – “స్వయంగా అల్లాహ్ (తఆలా) తాను అందరిపై అన్ని రకాల అధికారం కలిగి అందరికీ మానం, అవమానం పాలు చేసే అటువంటి శక్తిసామర్థ్యం గల ఆయన, ఎంతో గాంభీర్యం, ఔన్నత్యం గల ఆయన, తన ప్రమాణం చేస్తూ ఏమంటున్నాడు? నేను నా దాసునికి రెండు రకాల శాంతులు మరియు రెండు రకాల భయాలు కలిపి ఇవ్వను. అంటే ఏంటి? ఎవరైతే ఇహలోకంలో భయపడుతూ, పరలోకం నాటి గురించి భయపడుతూ ఉంటారో వారికి అల్లాహ్ (తఆలా) పరలోకంలో శాంతి, ప్రశాంతత, సుఖం ప్రసాదిస్తాడు. మరి ఎవరైతే ఇహలోకంలో పరలోకానికి సంబంధించిన విషయంలో ఎలాంటి భయం లేకుండా ఎంతో ప్రశాంతంగా జీవిస్తాడో అలాంటి వ్యక్తి తప్పకుండా ప్రళయదినాన భయకంపితులకు గురి అవుతాడు. ఒకవేళ అతను ఇహలోకంలో ప్రశాంతంగా జీవించాడు. ఎలాంటి భయ కంపితులకు గురికాలేదు. పరలోకం పట్ల రవ్వంత కూడా అతనిలో భయం అనేది కలగలేదు. అలాంటి వ్యక్తిని నేను ప్రళయ దినాన, పరలోకంలో అందరినీ సమీకరించినప్పుడు అతన్ని భయానికి గురి చేస్తాను. ఒకవేళ అతను ఇహలోకంలో నాతో భయపడి ఉన్నాడు అంటే, ఒకవేళ అతను ఇహలోకంలో నాతో భయపడుతూ జీవించాడు అంటే నేను ఏ రోజునైతే ప్రజలందరినీ సమీకరిస్తానో ఆ రోజు అతనికి ప్రశాంతత, సుఖము ప్రసాదిస్తాను“.
ఈ విధంగా మనం విశ్వాసాన్ని అవలంబించి, సత్కార్యాలు చేస్తూ పాపాలకు దూరంగా ఉండి మహా గొప్ప పుణ్యాత్ముల్లో కలిసే ప్రయత్నం చేస్తే ఆ పరలోకంలో ఎంతో సుఖం ఉంటుంది. ఇదే కాకుండా ఇంకా ఎన్నో రకాల పుణ్యాలు ఉన్నాయి.
మరియు ఆరోజు ఏ రోజైతే మైదానంలో కేవలం ఒకే ఒక మైలు దూరంలో సూర్యుడు ఉంటాడో దాని వేడితో ప్రజలు తమ యొక్క చెమటలో మునిగిపోతూ ఉంటారో అక్కడ ఏదైనా నీడ ఉంటె కేవలం అల్లాహ్ యొక్క అర్ష్ సింహాసనం నీడ ఉంటుంది. దాని కింద దాని యొక్క ఛాయ, నీడ పొందే వారిలో కలిసే అదృష్టవంతులు ఎవరో ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు.
“ఏడు రకాల వారిని అల్లాహ్ (తఆలా) ఆరోజు ఏ రోజునైతే ఆయన నీడ, ఛాయ తప్ప మరి ఎక్కడ ఏ నీడ లభించదో ఏడు రకాల వారిని తన నీడలో వారికి ఛాయ ప్రసాదిస్తాడు. ఎవరు ఆ ఏడు రకాల వారు?
1. న్యాయ వంతుడు అయిన నాయకుడు. ఇక్కడ ఇమామ్ అంటే ఇంటికి కూడా నాయకుడు. వీధికి కూడా నాయకుడు. కుటుంబానికి నాయకుడు. గల్లి నుండి ఢిల్లీ వరకు, గ్రామం నుండి మొత్తం దేశం వరకు ఏఏ లెవెల్లో ఎవరు నాయకత్వం వహిస్తున్నార్రో ఎవరు తమ నాయకత్వం లో ఉన్నవారి పట్ల న్యాయం వహిస్తారో వారికి కూడా ఆ రోజు నీడ లభిస్తుంది.
2. రెండో రకమైన వారు యువకుడు, ఏ యువకుడు అయితే తన యవ్వనాన్ని తన ప్రభువు యొక్క ఆరాధనలో గడిపాడో!. అల్లాహు అక్బర్ . యువకులారా ఆరాధనా అంటే ఇరవై నాలుగు గంటలు మస్జిద్ లో ఉండటమే కాదు, మన జీవితంలోని ప్రతి క్షణం ఎక్కడ ఉన్నా ఏది చేసినా అక్కడ ఆ సందర్భంలో, ఆ సమయంలో, ఆ స్థితిలో అల్లాహ్ యొక్క ఆదేశం ఏంటి తెలుసుకొని జీవించడమే అల్లాహ్ యొక్క ఆరాధన. ఇలాంటి యువకుడు ఎవరైతే అల్లాహ్ ఆరాధనలో తన యవ్వనాన్ని గడిపాడో.
3. మూడో వ్యక్తి, అతని మనస్సు మస్జిద్ లో లగ్నమై ఉంటుంది. ఒక నమాజ్ చేసి వచ్చాడు అంటే తన ఇహలోక పనుల్లో, తన యొక్క బాధ్యతల్లో, తన భార్య పిల్లల్లో ఎవరు ఎవరి పట్ల ఏ బాధ్యత నెరవేర్చాలో అన్నిటిలో ఉంటాడు. కానీ నమాజ్ సమయం గుర్తు పెట్టుకొని మరో నమాజ్ వచ్చింది అంటే వెళ్లి సామూహికంగా నమాజ్ పాటించే ప్రయత్నం చేస్తాడు. ఎక్కడ ఉన్నా గాని నమాజ్ సామూహికంగా చేస్తూ ఉండాలి అన్న విషయం అతని మదిలో నుండి బయటికి వెళ్ళదు. అతని హృదయం మస్జిద్ లో లగ్నమై ఉన్నది.
4. నాలుగో రకం వ్యక్తి ఎవరు? ఆ ఇద్దరు మనుషులు ఎవరైతే అల్లాహ్ గురించి పరస్పరం ప్రేమాభిమానాలు పాటించి కలిస్తే అల్లాహ్ సంతోషానికి, అల్లాహ్ ప్రేమను పొందడానికి కలుస్తారు. వేరే అయిపోయినప్పుడు, విడిపోయినప్పుడు కూడా అల్లాహ్ ప్రేమ పొందే ఉద్దేశంతోనే విడిపోతారు. కలిసినా అల్లాహ్ ప్రేమకు పాత్రులు అవ్వడానికి, విడిపోయినా, అల్లాహ్ యొక్క ప్రేమను పొందడానికి మాత్రమే.
5. ఐదవ రకం. ఐదవ మనిషి ఎలాంటి వాడు? ఒక అందమైన మరియు హోదా, అంతస్తులు గల ఒక స్త్రీ అతన్ని చెడు వైపునకు ఆహ్వానిస్తే అతనంటాడు, నేను కేవలం అల్లాహ్ తో భయపడతాను. ఇలాంటి చెడుకు నేను సమీపించను. అల్లాహు అక్బర్. గమనించారా? అల్లాహ్ యొక్క భయం.
6. ఆరో రకం. ఆరో రకమైన వ్యక్తి అతను దానధర్మాలు చేస్తాడు. కుడి చేయితో ఏదైనా దానం చేశాడు అంటే ఎడమ చెయ్యికి కూడా తెలియకుండా అంత గోప్యంగా, రహస్యంగా కేవలం అల్లాహ్ సంతోషాన్ని పొందడానికి. ప్రజల చూపుగోరు తనానికి కాదు. కేవలం అల్లాహ్ యొక్క సంతృష్టికి అతను ఖర్చు చేస్తూ ఉంటాడు.
7.ఏడో రకమైన వ్యక్తి. ఒంటరిగా ఉండి అల్లాహ్ ను గుర్తు చేసుకొని, కన్నీరు కార్చేటువంటి మనిషి. అల్లాహ్ ను గుర్తు చేస్తున్నప్పుడు అతని కళ్ల ద్వారా అశ్రువులు ప్రవహిస్తూ ఉంటాయి. అలాంటి వ్యక్తి.
ఈ ఏడు గుణాలు గల ఏడు రకాల మనుషులు ఆ ప్రళయ దినాన సుదీర్ఘ కాలాన్ని గానీ, ఆ కఠినతరమైన ఆ సమస్యలను కానీ ఎదుర్కోకుండా అల్లాహ్ యొక్క నీడలో ఉంటారు”.
సోదర సోదరీమణులారా! మనందరం కూడా విశ్వాస మార్గాన్ని అవలంభించి ఇలాంటి సత్కార్యాలు చేస్తూ ఉంటే, ఎంత గొప్ప లాభాన్ని పొందుతాము ఆ పరలోక దినాన. ఈ ఏడుగురే కాకుండా అల్లాహ్ యొక్క ఛాయ, నీడను పొందే అదృష్టవంతుల్లో మరొకరు. సహీ ముస్లిం షరీఫ్ హదీత్ నెంబర్ 3006 లో ఉంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు:
“ఎవరైతే తన నుండి అప్పు తీసుకున్న వ్యక్తికి మరి కొంత వ్యవధి ఇస్తాడో మరి కొంత సమయం ఇస్తాడో ఎక్కువగా. సరే మంచిది. మరో పదిహేను రోజుల తర్వాత ఇవ్వు. లేదా నీవద్ద పర్వాలేదు మరొక నెల తర్వాత ఇవ్వు. ఈ విధంగా వ్యవధి ఇస్తాడో లేదా ఆ వ్యక్తి అప్పు తీసుకున్న వ్యక్తి అతని వద్ద ఏమీ లేదు. అప్పు తిరిగి ఇవ్వడానికి అని తెలిసి అతని యొక్క అప్పు మాఫీ చేసేస్తాడు. కేవలం అల్లాహ్ సంతోషానికి ప్రళయ దినాన ఆయన యొక్క నీడ పొందడానికి నేను ఈ రోజు నీ యొక్క అప్పును తిరిగి తీసుకోను. ఇక మాఫీ చేసేస్తున్నాను. నువ్వు ఎలాంటి రంది పడకు అని తృప్తిని ఇస్తాడు. అలాంటి వ్యక్తికి కూడా అల్లాహ్ అతనికి కూడా ప్రళయ దినాన తన ఛాయలో స్థలం ఇస్తాడు“.
ఇంకా ఎవరు పరలోక దినాన ఆ సుదీర్ఘ కాలంలో ఆ కష్టతర సమయాల నుండి, ఆ స్థితిలో నుండి బయట పడతారు. ఎవరైతే విశ్వాస మార్గంలో నడుస్తూ ప్రజల పట్ల కూడా ఎంతో మృదువుగా మెలుగుతారో, వారి యొక్క కష్టాల్లో వారికి తోడుగా ఉండి, వారు ఇబ్బంది లో ఇరుక్కొని ఉన్నారో వాటి నుండి బయటికి తీసే ప్రయత్నం చేస్తారు. సహీ ముస్లిం షరీఫ్ లో ఈ భావం ఉంది. కానీ ఇప్పుడు నేను చదివే హదీత్ సునన్ అబూదావూద్ లోనిది. సునన్ అబూదావూద్ హదీత్ నెంబర్ 4946 ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు.
“ఎవరైతే తన ముస్లిం సోదరుల యొక్క ఇహలోక కష్టాల్లోని ఏదైనా ఒక కష్టం దూరం చేస్తాడో అల్లాహ్ అతని పరలోక కష్టాల్లోని ఒక కష్టాన్ని దూరం చేస్తాడు. ఎవరైతే అప్పు తీసుకున్న వ్యక్తికి గానీ లేదా మరే రకమైన ఇబ్బందులు ఉన్న వ్యక్తికి గాని ఏదైనా సులభతరం కలిగిస్తాడో అల్లాహ్ అతనికి ఇహ, పరలోకాల్లో సులభతరాలు కలుగజేస్తాడు. మరి ఎవరైతే ఒక ముస్లిం లోపాల్ని కప్పిపుచ్చుతాడో అల్లాహ్ ఇహలోకంలో, పరలోకంలో అతన్ని కప్పిపుచ్చుతాడు“.
మరొక హదీత్ లో ఉంది. ఆ హదీత్ ను షేక్ అల్బానీ (రహిమహుల్లా) గారు కూడా సహీహాల్లో ప్రస్తావించారు. హదీత్ నెంబర్ 1217. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు తెలిపారు.
“ఎవరైతే తన యొక్క సోదరునికి సహాయం దూరం నుండి, అతని వెనక ఉండి చేస్తాడో అల్లాహ్ ఇహ, పరలోకాల్లో ఇతనికి సహాయం చేస్తాడు.”
దగ్గర ఉన్నప్పుడు అయితే కనీసం చేయకుంటే ఎలా అని మనసులో వస్తుంది. సహాయం చేస్తాము.కానీ ఇక్కడ ఈ హదీస్ లో దూరం ఉండి అతను చూడకున్నా అతనికి ఎలాంటి సహాయం అవసరం ఉందో మనం చెప్పకుండా అతనికి సహాయం చేసేశాము. అల్లాహ్ అలాంటి వ్యక్తికి ఇహ, పరలోకాల్లో సహాయాలు చేస్తాడు”.
ఇంకా ఎలాంటి సత్కార్యాలు మనకు పనికి వస్తాయి పరలోకంలోని కష్టాలను మనం అనుభవించకుండా సుఖాలు పొందడానికి ఏ సత్కార్యాలు చేయాలి. వినండి మరొక హదీత్.
“నిశ్చయంగా న్యాయం చేసేవారు, ఎవరైతే ప్రజల మధ్య ఏదైనా తీర్పు చేస్తున్న సందర్భంలో తీర్పులో న్యాయం చేసేవారు. వారి కుటుంబంలో ఇంటి వారిలో అందరిపట్ల న్యాయం చేసేవారు. మరి ఎవరైతే నాయకులుగా ఉండి, జడ్జీలుగా ఉండి న్యాయవాదిగా ఉండి, ఎక్కడ ఏ బాధ్యత ఉందో తన బాధ్యతలు ఉన్నవారి పట్ల న్యాయం చేస్తారో ఇలాంటి వారు ప్రళయ దినాన కరుణామయుడైన అల్లాహ్ యొక్క కుడి వైపున కాంతి యొక్క మింబర్ ల మీద ఆసీనులై ఉంటారు. అల్లాహ్ యొక్క రెండు చేతులు కూడా కుడియే“.
ఈ విధంగా జీవితంలోని ప్రతి వ్యవహారంలో న్యాయం పాటించడం ఎంత గొప్ప విషయమో గమనించండి.
ఇంకా మహాశయులారా! ఎవరైతే తమ యొక్క కోపాన్ని మింగేస్తారో, శక్తి ఉండి కూడా ఎదుటి వానితో ప్రతీకారం తీర్చుకోకుండా వారిని క్షమిస్తారో, అలాంటి వారు కూడా ప్రళయ దినాన ప్రజల అందరి ముంగటి నుండి, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ పిలిచి ఆహ్వానించి, ఇహ లోకంలో నీవు నా తృప్తి కొరకు, నా సంతోషాన్ని పొందడానికి మాత్రమే నీ కోపాన్ని దిగమింగావు. ఈ రోజు నీకు ఇష్టమైన స్వర్గ కన్యలో ఇష్టమున్న వారిని ఎన్నుకోండి అని అంటాడు.
ఇంకా వుదూ చేయడం, నమాజ్ చేయడం. ఇది కూడా చాలా గొప్ప విషయం. ఎవరైతే ప్రతిరోజు ఐదు సార్లు నమాజ్ పాటిస్తూ ఉంటారో, తప్పకుండ వుదూ చేయాల్సింది. ఎవరైతే వుదూ సంపూర్ణంగా చేస్తారో వారి యొక్క వుదూ అవయవాలు, ప్రళయ దినాన మెరుస్తూ ఉంటాయి. వారిని ఆ రకంగా పిలవడం జరుగుతుంది.
ఇంకా ఇలాంటి ఎన్నో సత్కార్యాలు గురించి మనం తెలుసుకుంటూ ఉండాలి. కానీ ముఖ్యమైన కొన్ని విషయాలు తెలపడం జరిగింది. పరలోక దినాన మనం ఆ కష్టాలనుండి దూరం ఉండాలంటే పరలోకాన్ని విశ్వసించాలి. సృష్టికర్త అయిన అల్లాహ్ ను విశ్వసించాలి. ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మార్గాన్ని అవలంభించి ఇస్లాం ప్రకారంగా జీవించాలి. అల్లాహ్ ఈ సత్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక!
జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[43:07 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది. శుద్ధి & నమాజు[పుస్తకం]
నమాజ్ ఆదేశాలు
నమాజ్ ఇస్లాం మూల స్థంబాలలో రెండవది. అది ప్రతీ ప్రాజ్ఞ, ఈడేరిన స్త్రీ పురుషునిపై విధిగా ఉంది. నమాజ్ విధిని తిరస్కరించే వాడు కాఫిర్ (సత్యతిరస్కారి) అవుతాడని ఏకాభిప్రాయం ఉంది. ఇక బద్ధకం, నిర్లక్ష్యంతో మొత్తానికే నమాజ్ చేయనివాడు కూడా కాఫిర్ అవుతాడని అధిక సంఖ్యలో ప్రవక్త సహచరులు (రదియల్లాహు అన్హుమ్) ఏకీభవించారు. ప్రళయదినాన మానవునితో తొలి లెక్క నమాజ్ గురించే జరుగును. నమాజుకు సంబంధించిన ఖుర్ఆన్ ఆదేశం చదవండిః
జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రజియల్లాహు అన్హుమా) ఉల్లేఖనం ప్రకారం, నేను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పగా విన్నాను:
“ఒక మనిషి మరియు షిర్క్, కుఫ్ర్ (బహుదైవారాధన, సత్యతిరస్కారం) మధ్య ఉన్న వ్యత్యాసం నమాజును విడనాడడం”.
(ముస్లిం 82).
నమాజ్ పాటించడంలో చాలా గొప్ప ఘనతలున్నాయి, వాటిలో కొన్ని:
عَنْ أَبِي هُرَيْرَةَ t قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (مَنْ تَطَهَّرَ فِي بَيْتِهِ ثُمَّ مَشَى إِلَى بَيْتٍ مِنْ بُيُوتِ الله لِيَقْضِيَ فَرِيضَةً مِنْ فَرَائِضِ الله كَانَتْ خَطْوَتَاهُ إِحْدَاهُمَا تَحُطُّ خَطِيئَةً وَالْأُخْرَى تَرْفَعُ دَرَجَةً).
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారని, అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:
“ఎవరైనా తన ఇంట్లో వుజూ చేసుకొని, అల్లాహ్ యొక్క విధుల్లో ఒక విధి నిర్వహించుటకు అల్లాహ్ గృహాల్లోని ఒక గృహం (మస్జిద్)లో ప్రవేశిస్తే, అతను వేసే అడుగుల్లో ఒక దానికి బదులుగా ఒక పుణ్యం లభిస్తే, మరో దానికి బదులుగా ఒక స్థానం పెరుగుతుంది”. (ముస్లిం 666).
అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం: మహానీయ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అడిగారు:
“పరమ ప్రభువైన అల్లాహ్ ఏ విషయాల ఆధారంగా అపరాధాలను మన్నిస్తాడో, స్థాయిని ఉన్నతం చేస్తాడో అలాంటి విషయాలు మీకు తెలుపనా?” దానికి సహచరులు ‘దైవప్రవక్తా తప్పక సెలవీయండి’ అని బదులిచ్చారు. అప్పుడాయన ఇలా బోధించారుః ” (1) వాతవరణం, పరిస్థితులూ అనుకూలంగా లేనప్పటికీ వుజూ పూర్తిగా చెయ్యటం. (2) మస్జిద్ వైపునకు అధికంగా అడుగులు వెయ్యడం. (3) ఒక నమాజ్ తరువాత మరో నమాజ్ కొరకు నిరీక్షించడం, ఇది రిబాత్ తో సమానం([1])“. (ముస్లిం 251).
[1] రిబాత్ అంటే సత్యాసత్యాల మధ్య పోరాటం సాగే రోజుల్లో రాత్రిళ్ళు పహరా కాయడం అన్న మాట. శాంతి కాలంలో నమాజ్ పట్ల మక్కువ, పోరాటపు రోజుల్లో ప్రాణాలొడ్డి పహరాకాయడంతో సమానమని అర్థం.
“నమాజ్ చేయించడానికి ఒకరిని ఆదేశించి, సామూహిక నమాజులో పాల్గొనని వారి వైపుకు తిరిగి వారు ఇండ్లల్లో ఉండగా వారి గృహాలను తగలబెడదామని ఎన్నో సార్లు అనుకున్నాను”. (బుఖారి 2420, ముస్లిం 651).
2- శాంతి, నిదానంగా త్వరగా మస్జిదుకు రావడం చాలా మంచిది.
3- మస్జిదులో ప్రవేశిస్తూ కుడి కాలు ముందు వేసి అల్లా హుమ్మఫ్ తహ్లీ అబ్వాబ రహ్మతిక చదవండి. (ముస్లిం 713).
اللهُمَّ افْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ
(ఓ అల్లాహ్ నా కొరకు నీ కరుణ ద్వారాలు తెరువు).
4- కూర్చునే ముందు రెండు రకాతులు తహియ్యతుల్ మస్జిద్ చేసుకోవడం సున్నత్.
عَنْ أَبِي قَتَادَةَ السَّلَمِيِّ t أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (إِذَا دَخَلَ أَحَدُكُمْ الْمَسْجِدَ فَلْيَرْكَعْ رَكْعَتَيْنِ قَبْلَ أَنْ يَجْلِسَ).
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారని, అబూ ఖతాద (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:
“మీలో ఎవరైనా మస్జిదులో ప్రవేశిస్తే కూర్చునే ముందు రెండు రకాతుల నమాజ్ చేసుకోవాలి”. (బుఖారి 444, ముస్లిం 714).
5- నమాజులో సతర్ (శరీరంలో కప్పి ఉంచే భాగం) తప్పనిసరి. పురుషుల సతర్ నాభి నుండి మోకాళ్ళ వరకు, స్త్రీల పూర్తి శరీరమే సతర్, నమాజులో కేవలం ముఖము,చేతులు తప్ప.
6- కాబా వైపునకు అభిముఖమై ఉండుట తప్పనిసరి. నమాజ్ అంగీకారానికి ఇది ఒక షరతు. ఏదైనా బలమైన కారణం ఉంటే తప్ప. ఉదా: వ్యాది లేదా మరేదైనా కారణం.
7- ప్రతీ నమాజ్ దాని సమయములో చేయాలి. సమయానికి ముందు చేయుట సమ్మతం కాదు. సమయం దాటి చేయడం నిషిద్ధం.
8- నమాజుకై శీఘ్రముగా సమయంలో రావడం, తొలి పంక్తిలో చేరుకోవడం, నమాజ్ కొరకు వేచించడం, ఇవన్నియూ చాలా గొప్ప ఘనతగల కార్యాలు.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) బోధించారని, అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:
“అజాన్ పలకడం మరియు మొదటి పంక్తిలో చేరడం ఎంత పుణ్యకార్యమో ప్రజలకు గనక తెలిస్తే, ఆ అవకాశాలు చీటి (ఖుర్అ) పద్దతి ద్వారా మాత్రమే లభిస్తాయని తెలిస్తే, వారు తప్పకుండా పరస్పరం చీటి వేసుకొందురు. అలాగే వేళ కాగానే తొలి సమయంలో నమాజుకు రావడంలో ఎంత పుణ్యముందో తెలిస్తే, అందులో కూడా ప్రజలు ఒకర్నొకరు మించిపోవడానికి పోటిపడుదురు. …..”. (బుఖారి 615, ముస్లిం 437).
عَنْ أَبِي هُرَيْرَةَ t أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (لَا يَزَالُ أَحَدُكُمْ فِي صَلَاةٍ مَا دَامَتْ الصَّلَاةُ تَحْبِسُهُ).
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించారని, అబూ హురైర (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:
“నమాజ్ కొరకు వేచిస్తూ ఉన్న వ్యక్తికి నమాజ్ చేస్తున్నంత పుణ్యం లభిస్తుంది”. (బుఖారి 659, ముస్లిం 649).
నమాజ్ సమయాలు:
జొహ్ర్ నమాజ్ నమయం: తల నుండి పొద్దు వాలినప్పటి నుండి ప్రతీ వస్తువు నీడ దానంత అయ్యే వరకు.
అస్ర్ నమాజ్ సమయం: ప్రతీ వస్తువు నీడ దానంత అయినప్పటి నుండి సూర్యాస్తమయం వరకు.
మగ్రిబ్ నమాజ్ సమయం: సూర్యాస్తమయం నుండి ఎర్రని కాంతులు కనుమరుగయ్యే వరకు.
ఇషా నమాజ్ సమయం: ఎర్రని కాంతులు మరుగైన మరుక్షణం నుండీ అర్థ రాత్రి వరకు.
ఫజ్ర్ నమాజ్ సమయం: ఉషోదయము నుండి సూర్యోదయము వరకు.
నమాజ్ చేయరాని స్థలాలు:
1- ఖననవాటిక (స్మశాన వాటిక): ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఆ యువకులు గుహలో ఆశ్రయం పొందినపుడు ఇలా ప్రార్థించారు: “మా ప్రభూ! నీ వద్ద నుంచి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు. మా పనిలో మా కోసం సన్మార్గాన్ని సులభతరం చెయ్యి.”
వారు లేచి నిలబడి ఈ ప్రకటన చేసినప్పుడు మేము వారి హృదయాలకు దృఢత్వాన్ని కలుగజేశాము; “భూమ్యాకాశాలకు ప్రభువైనవాడే మా ప్రభువు. మేము ఆయన్ని తప్ప వేరొక ఆరాధ్య దైవాన్ని పిలవటమన్నది జరగని పని. ఒకవేళ మేము గనక అలా చేస్తే ఎంతో దుర్మార్గపు మాటను పలికిన వారమవుతాము.”
“ఆయన్ని వదలి ఇతరులను ఆరాధ్య దైవాలుగా చేసుకున్న మన జాతి వారు వారి దైవత్వానికి సంబంధించిన స్పష్టమైన ప్రమాణాన్ని ఎందుకు తీసుకురావటం లేదు? అల్లాహ్‌కు అబద్ధాన్ని అంట గట్టేవాడికన్నా ఎక్కువ దుర్మార్గుడెవడుంటాడు?
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.