ఒక మిలియన్ (పదిలక్షల) పుణ్యాలు నీ పుణ్యాల త్రాసులో పెట్టబడే విషయాన్ని ఒక సారి ఊహించు, అంతకు మించి పాపాల త్రాసులో నుంచి ఒక మిలియన్ పాపాలు తగ్గించడం, చెరిపివేయడం జరుగుతుంది. నిస్సందేహంగా ఇది నీ త్రాసును చాలా బరువుగలదిగా చేస్తుంది.
పూర్వం పుణ్య పురుషుల్లో ఒకరికి ఈ పుణ్యం సంపాదించే కాంక్ష ఉండేదా అని ఆశ్చర్య పోవలసిన అవసరం లేదు! అతను ఏ పని లేకున్నా బాజారుకు వెళ్ళి, ఈ దుఆ చదివి తిరిగి వచ్చేవారు, ఈ విషయం అతని త్రాసును బరువుగలదిగా చేయాలని అతని కాంక్ష. ముహమ్మద్ బిన్ వాసిఅ రహిమహుల్లాహ్ తెలిపారుః నేను మక్కా నగరానికి వచ్చాను, అక్కడ సోదరులు సాలిం బిన్ అబ్దుల్లాహ్ ను కలిశాను, అతను తన తండ్రితో, అతను తన తండ్రితో ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని ‘ఎవరు బాజారులో ప్రవేశిస్తూ…’ అన్న ఈ హదీసు వినిపించారు. నేను ఖురాసాన్ వచ్చి, ఖుతైబా బిన్ ముస్లింను కలసి, నేను మీ కొరకు ఒక బహుమానం తీసుకొచ్చాను అని చెప్పి, ఈ హదీసు వినిపించాను. ఆ తర్వాత నుండి అతను తన వాహనముపై ఎక్కి బాజారుకు వచ్చి, నిలబడి, ఈ దుఆ చదివి వెళ్ళిపోయేవారు. (సునన్ దార్మీ 1692).
ఉపన్యాసకులు : జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ దుఆల సంకలనం మూలం:సయీద్ బిన్ అలీ బిన్ వహఫ్ అల్ ఖహ్తానీ
ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్
హిస్నుల్ ముస్లిం (ముస్లిం వేడికోలు) లోని నిద్ర నుండి మేల్కొన్న తర్వాత పఠించవలసిన దుఆలు మీరిక్కడ వినగలరు. వీటిని అర్థం చేసుకొని, ప్రతిరోజు పఠించడం ద్వారా మీరు లాభం పొందగలరు.
సమస్త స్తోత్రాలు అల్లాహ్ కొరకే. ఆయనే మేము చనిపోయాక మాకు జీవం పోశాడు. చివరికి ఆయన వైెపునకే మేము మరలిపోవలసి ఉంది. (బుఖారి మ’ అల్‌ఫతహ్ 113/11, ముస్లిం 2083/4)
2. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు: ఎవరికైనా రాత్రివేళ మెలకువ వస్తే ఈ దుఆ పఠించాలి
“అల్లాహ్ ఒక్కడే. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయనకు సాటి ఎవ్వరూ లేరు. అధికారం ఆయనదే. స్తోత్రం ఆయనకే శోభిస్తుంది. ప్రతి వస్తువుకూ ఆయనే సృష్టికర్త. అల్లాహ్ పరిశుద్ధుడు. సమస్త స్తోత్రాలు ఆయనకే చెల్లును. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. అల్లాహ్ అందరికంటే గొప్పవాడు, పరమోన్నతుడు, మహిమాన్వితుడైన అల్లాహ్ సహాయం లేకుండా ఏదీ తనను తాను రక్షించుకో జాలదు, ఇంకా ఏ పనిచేసే శక్తీ లేదు.
తరువాత ఇలా ప్రార్థించాలి – ఓ నా ప్రభూ! నన్ను మన్నించు.
ఇలా వేడుకున్నవారు మన్నించబడ తారు. దీని ఉల్లేఖనకర్త వలీద్ ఇలా అంటున్నారు: ఈ వాక్యం పఠించిన పిదప ఏదైనా వేడుకుంటే దానిని స్వీకరించటం జరుగు తుంది. ఆపై లేచి నిలబడి, వుజూచేసి నమాజ్ చేస్తే అతని నమాజ్ కూడా స్వీకరించబడుతుంది.
భూమీ, ఆకాశాల సృష్టిలో రేయింబవళ్ళు ఒక దాని తరువాత ఒకటి రావడంలో, నిలుచున్నా, కూర్చున్నా పరుండినా అన్నివేళలా అల్లాహ్‌ను స్మరించే వారున్నూ, భూమీ, ఆకాశాల నిర్మాణం గురించి చింతన చేసేవారున్నూ అయిన వివేకవంతులకు ఎన్నో సూచనలు ఉన్నాయి. (వారు అప్రయత్నంగా ఇలా అంటారు) ప్రభూ! ఇదంతా నీవు వ్యర్థంగా, లక్ష్య రహితంగా సృష్టించలేదు. నీవు పరిశుద్ధడవు కాబట్టి నిష్ఫలకార్యాలు చెయ్యవు. కనుక ప్రభూ! మమ్మల్ని నరకబాధ నుండి కాపాడు. నీవు ఎవడినైతే నరకంలో పడవేస్తావో వాణ్ణి వాస్తవానికి అధోగతికి, అవమానానికీ గురిచేసినట్లే. ఇక ఇటువంటి దుర్మార్గులకు సహాయం చేసేవాడెవడూ ఉండడు. ప్రభూ! మేము విశ్వాసం వైపునకు పిలిచేవాని పిలుపును విన్నాము. మీ ప్రభువును విశ్వసించండి అని అతను అనేవాడు. మేము అతని సందేశాన్ని స్వీకరించాము. కనుక మా స్వామీ! మేము చేసిన తప్పులను మన్నించు. మాలో ఉన్న చెడులను దూరం చెయ్యి. సజ్జనులతోపాటు మా జీవితానికి ముగింపు ప్రసాదించు. దేవా! నీవు నీ ప్రవక్తల ద్వారా చేసినటువంటి బాసలను మా విషయంలో నెరవేర్చు. ప్రళయంనాడు మమ్మల్ని పరాభవానికి గురిచెయ్యకు. నిస్సందేహంగా నీవు నీ వాగ్జానాలకు భిన్నంగా వ్యవహరించవు.
అంతిమ దైవగ్రంథం ఖుర్ఆన్ (అహసనుల్ బయాన్) నుండి సూరతుల్ ఫాతిహా అనువాదం మరియు వ్యాఖ్యానం.
Ahsanul Bayan (Telugu) అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్ అనువాదం, వ్యాఖ్యానం (అహసనుల్ బయాన్) మూలానువాదం: మౌలానా ముహమ్మద్ జునాగఢీ (రహ్మ.లై) వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ తెలుగు రూపం: ముహమ్మద్ అజీజుర్రహ్మాన్
001 సూరహ్అల్ఫాతిహా (ప్రారంభం)
పరిచయం:
మూలం: అహసనుల్ బయాన్, First Edition February 2009, శాంతి మార్గం పబ్లికేషన్స్ ట్రస్ట్, హైదరాబాద్:
సంకలనం రీత్యా దివ్యఖుర్ఆన్ లో ఇది మొట్టమొదటి సూరా. ఈ సూరాలో తౌహీద్ (అంటే ఏకదైవారాధన) ప్రధానంగా కనబడుతుంది. దేవుని పట్ల విశ్వాసం, దైవారాధన, దేవుణ్ణి సహాయం కోసం వేడుకోవడం, దేవుని ప్రార్థించడం గురించి ఇందులో ముఖ్యంగా నొక్కి చెప్పడం జరిగింది. ఈ సూరాలో ఏడు ఆయతులున్నాయి. అల్లాహ్ మాత్రమే ఆరాధనలకు, స్తోత్రాలకు, అభ్యర్థనలకు యోగ్యుడనీ, అల్లాహ్ మాత్రమే పరిపూర్ణుడనీ, ఇహలోకానికి, పరలోకానికి అల్లాహ్ మాత్రమే ప్రభువనీ, ఆయనే సృష్టికర్త అనీ ఈ ఏడు ఆయతులలో నిర్దిష్టంగా చెప్పడం జరిగింది.
ఈ సూరాకు ‘అల్ ఫాతిహా’ (ప్రారంభం) అని పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే, ఇది దివ్యఖుర్ఆన్ కు ప్రారంభ అధ్యాయం. ఈ సూరా దివ్య ఖుర్ఆన్ కు తల్లివంటిదనీ, దివ్య ఖుర్ఆన్ సారం ఇందులో ఉందని కూడా చెప్పడం జరిగింది. ముస్లిములు చేసే నమాజుల్లో తప్పనిసరిగా చదువవలసిన సూరా ఇది. రోజూ చేసే అయిదు పూటల నమాజు కాని, లేక స్వచ్ఛందంగా చేసే ఐచ్ఛికమైన నమాజుల్లో కాని ప్రతి నమాజులో ఈ సూరాను పఠించటం తప్పనిసరి. ప్రారంభ సూరా చదువకపోతే ముస్లిములు చేసే ఏ నమాజూ స్వీకరించ బడదని ముస్లిం ధర్మవేత్తలు ఖచ్చితంగా చెప్పారు.
ధర్మవేత్తల అభిప్రాయం ప్రకారం, ఈ ప్రారంభ సూరా (అల్ ఫాతిహా), పూర్తి ఖుర్ఆన్ కు సారాంశం వంటిది. ఈ సూరా పూర్తి ఖుర్ఆన్ కు సారాంశం అని ఎందుకు చెప్పడం జరిగిందంటే, ఇస్లాంకు సంబంధించిన ప్రధానమైన భావనలను, నియమాలను అన్నింటినీ ఈ సూరా క్లుప్తంగా తెలియజేస్తుంది. మౌలికమైన ఇస్లామీయ భావనలు, ప్రధానమైన ఇస్లామీయ విశ్వాసాలు, అంటే దేవుని ఏకత్వం (దేవుడు ఒక్కడే అని విశ్వసించడం, దేవునికి భాగస్వాములు ఎవరూ లేరని విశ్వసించడం, దేవునికి సాటి ఎవరూ లేరని విశ్వసించడం), దేవుని గుణగణాలను గురించి ఈ సూరా సరళంగా, సూటిగా, సంక్షిప్తంగా మనిషికి తెలియజేస్తుంది. ముస్లిములు అల్లాహ్ ను, అంటే ఒకే ఒక్క ఆరాధ్యుడిని తప్ప మరెవ్వరినీ అర్థించరాదనీ, ఎవరి ముందూ చేతులు చాపరాదనీ, మనిషి సాటి మనిషికి దాస్యం చేయరాదనీ, కేవలం దేవునికి మాత్రమే తన ఆరాధనను అంకితం చేసుకొని, ఆయన ముందు మాత్రమే తలవంచాలని బోధిస్తుంది. దేవునికి మానవ గుణగణాలు ఆపాదించడాన్ని ఖండిస్తుంది. అల్లాహ్ కు ఎవరూ సమానులు కారు. అల్లాహ్ వంటి వారు మరెవ్వరూ లేరు. మనిషి ఆయన్ను విశ్వసించాలి. విశ్వాసంతో ఆయన్నే ఆరాధించాలి.
ఈ సూరా రెండు సమాన భాగాలుగా ఉన్నట్లు కనబడుతుంది. మొదటి భాగంలో అల్లాహ్, ఆయన గుణగణాల గురించి ఉంది. రెండవ భాగంలో మనిషి గురించి, మనిషికి దేవునితో ఉన్న అవసరం గురించి ఉంది.
షేఖ్ ముహమ్మద్ బిన్ సాలెహ్ అల్ ఉథైమిన్ అనువాదం: ముహమ్మద్ కరీముల్లాహ్ రివ్యూ : షేఖ్ నజీర్ అహ్మద్
2012 – 1433
అంతిమ దినాన్ని మనం ఏ విధంగా నమ్మాలి ?
ఇది షేఖ్ ముహమ్మద్ బిన్ సాలెహ్ అల్ ఉథైమిన్ (రహిమహుల్లాహ్) యొక్క ‘షర్హ్ హదీథ్ జిబ్రయీల్’ అనే అరబీ పుస్తకంలోని ఒక భాగం.
విషయసూచిక
1. మానవ జీవితం వివిధ దశలలో ఉందా లేక అసలు దశలేమీ లేవా ? అంతిమ దినాన్ని మనం ఏ విధంగా నమ్మాలి ?
2. సమాధి శిక్షలు మరియు దాని అనుగ్రహాలు : సమాధి శిక్షలు దేహానికా లేక ఆత్మకా ?
3. పునరుత్థానం : మనిషి చనిపోయి ఉండవచ్చు, (అతని శరీరాన్ని) సింహం తినేసి ఉండవచ్చు. మరి అలాంటపుడు అతను తిరిగి ఎలా లేపబడతాడు ?
4. సూర్యుడు సృష్టికి అతి దగ్గరగా రావడం – అంతిమదినం నాడు సూర్యుడు, సృష్టికి ఒక మైలు దూరమంత దగ్గరికి రావడం ఎలా సాధ్యం ?
5. ప్రజల కర్మల పత్రం – ఈ లెక్క నుండి ఎవరైనా తప్పించుకోగలగుతారా ?
6. త్రాసు – త్రాసులో కర్మలు ఎలా తూచబడతాయి – అవి కర్తల లక్షణాలు మరియు పనుల రూపంలో ఉంటాయి కదా! – అక్కడ ఒకే త్రాసు ఉంటుందా లేక అనేక త్రాసులు ఉంటాయా ?
9. షఫా (విముక్తి, మోక్షం) – షఫా షరతులు
10. పుల్ సిరాత్ (వంతెన)
11. స్వర్గం లేక నరకంలోనికి ప్రవేశం – స్వర్గం మరియు నరకం ఇపుడు ఉనికిలో ఉన్నాయా? – స్వర్గం మరియు నరకం శాశ్వతమా ?
బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం
ఇది అంతిమ దినమని ఎందుకు పిలవబడిందంటే, దీని తర్వాత ఇక మరే దినమూ ఉండదు.
మానవ జీవితం వివిధ దశలలో ఉందా లేక అసలు దశలేమీ లేవా ?
అల్లామా సనావుల్లాహ్ అమృతసరీ (రహ్మతుల్లాహ్ అలైహి) గారి ఈ వ్యాసాన్ని మర్కజ్ దారుల్ బిర్ర్ విద్యార్థిని హనీఫా అహ్మదీయా చక్కటి తెలుగులో అనువదించారు. దీనిలో మిర్జా గులామ్ అహ్మద్ ఖాదియానీ స్వయంగా చేసుకున్న కొన్ని ఆత్మస్తుతి ప్రగల్భాలు ఆధారాలతో సహా పేర్కొనబడినాయి.
అల్లామా సనావుల్లాహ్ అమృతసరీ (రహ్మతుల్లాహ్ అలైహి) గారి ఈ వ్యాసాన్ని మర్కజ్ దారుల్ బిర్ర్ విద్యార్థిని షమ్సున్నిసా అహ్మదీయా చక్కటి తెలుగులో అనువదించారు. దీనిలో మిర్జా గులామ్ అహ్మద్ ఖాదియానీ స్వయంగా చేసిన అనేక పరస్పర విరుద్ధ ప్రకటనలు ఆధారాలతో సహా పేర్కొనబడినాయి.
అల్లామా సనావుల్లాహ్ అమృతసరీ (రహ్మతుల్లాహ్ అలైహి) గారి ఈ వ్యాసాన్ని మర్కజ్ దారుల్ బిర్ర్ విద్యార్థిని ఆయిషా అహ్మదీయా చక్కటి తెలుగులో అనువదించారు. దీనిలో మిర్జా గులామ్ అహ్మద్ ఖాదియానీ స్వయంగా చేసిన అనేక అసత్య పలుకులు ఆధారాలతో సహా పేర్కొనబడినాయి.
అల్లామా సనావుల్లాహ్ అమృతసరీ (రహ్మతుల్లాహ్ అలైహి) గారి ఈ వ్యాసాన్ని మర్కజ్ దారుల్ బిర్ర్ విద్యార్థిని షఫీఆ అహ్మదీయా చక్కటి తెలుగులో అనువదించారు. దీనిలో మిర్జా గులామ్ అహ్మద్ ఖాదియానీ తాను ప్రవక్తనని నిరూపించుకోవడానికి చూపుకున్న కొన్ని బూటకపు నిదర్శనాలు ఆధారాలతో సహా పేర్కొనబడినాయి.
అల్లామా సనావుల్లాహ్ అమృతసరీ (రహ్మతుల్లాహ్ అలైహి) గారి ఈ వ్యాసాన్ని మర్కజ్ దారుల్ బిర్ర్ విద్యార్థిని జబీరా అహ్మదీయా చక్కటి తెలుగులో అనువదించారు. దీనిలో మిర్జా గులామ్ అహ్మద్ ఖాదియానీ యొక్క గుణాల గురించి వివరించబడింది.
You must be logged in to post a comment.