నిద్ర నుండి మేల్కొన్న తర్వాత పఠించవలసిన దుఆలు (Dua after Wakeup)

బిస్మిల్లాహ్

ఉపన్యాసకులు : జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ
దుఆల సంకలనం మూలం:సయీద్ బిన్ అలీ బిన్ వహఫ్ అల్ ఖహ్తానీ
ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్

హిస్నుల్ ముస్లిం (ముస్లిం వేడికోలు) లోని నిద్ర నుండి మేల్కొన్న తర్వాత పఠించవలసిన దుఆలు మీరిక్కడ వినగలరు. వీటిని అర్థం చేసుకొని, ప్రతిరోజు పఠించడం ద్వారా మీరు లాభం పొందగలరు.

Listen / Download Mp3 Here (Time 9:25)

[ Read the Dua’s Here – PDF ]


1. అల్‌హమ్‌దులిల్లాహిల్లజీ అహ్‌యానా బ’అద మా అమాతనా వ ఇలైహిన్నుషూర్‌.

الْحَمْدُ للهِ الَّذِي أَحْيَانَا بَعْدَ مَا أَمَاتَنَا وَإِلَيْهِ النُّشُورُ

సమస్త స్తోత్రాలు అల్లాహ్‌ కొరకే. ఆయనే మేము చనిపోయాక మాకు జీవం పోశాడు. చివరికి ఆయన వైెపునకే  మేము మరలిపోవలసి ఉంది. (బుఖారి మ’ అల్‌ఫతహ్ 113/11, ముస్లిం 2083/4)


2. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు: ఎవరికైనా రాత్రివేళ మెలకువ వస్తే ఈ దుఆ పఠించాలి

లా ఇలాహ ఇల్లల్లాహు వహ్‌దహు లాషరీక లహూ. లహుల్‌ముల్‌కు వలహుల్‌హమ్‌దు, వహువ అలా కుల్లి షయ్యిన్‌ ఖదీర్‌. సుబ్‌హానల్లాహి వల్‌హమ్‌దు లిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్‌ వలా హౌల వలా ఖువ్వత ఇల్లాబిల్లాహిల్‌ అలియ్యిల్‌ అజీమ్‌ రబ్చిగ్‌ఫిర్‌లీ.

لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ، وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ. سُبْحَانَ اللّهِ، وَالْحَمْدُ للهِ، ولَا إِلَهَ إِلَّا اللهُ، وَاللهُ أَكْبَرُ، وَلَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللهِ العَلِيِّ الْعَظيِمِ، ربِّ اغْفِرْلِي

“అల్లాహ్‌ ఒక్కడే. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయనకు సాటి ఎవ్వరూ లేరు. అధికారం ఆయనదే. స్తోత్రం ఆయనకే శోభిస్తుంది. ప్రతి వస్తువుకూ ఆయనే సృష్టికర్త. అల్లాహ్‌ పరిశుద్ధుడు. సమస్త స్తోత్రాలు ఆయనకే చెల్లును.  ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. అల్లాహ్‌ అందరికంటే గొప్పవాడు, పరమోన్నతుడు, మహిమాన్వితుడైన అల్లాహ్‌ సహాయం లేకుండా ఏదీ తనను తాను రక్షించుకో జాలదు, ఇంకా ఏ పనిచేసే శక్తీ లేదు.

తరువాత ఇలా ప్రార్థించాలి – ఓ నా ప్రభూ! నన్ను మన్నించు.

ఇలా వేడుకున్నవారు మన్నించబడ తారు. దీని ఉల్లేఖనకర్త వలీద్‌ ఇలా అంటున్నారు: ఈ వాక్యం పఠించిన పిదప ఏదైనా వేడుకుంటే దానిని స్వీకరించటం జరుగు తుంది. ఆపై లేచి నిలబడి, వుజూచేసి నమాజ్‌ చేస్తే అతని నమాజ్‌ కూడా స్వీకరించబడుతుంది.

(బుఖారి మఅల్‌ఫతహ్ 39/3 వగైరా, ప దాలు ఇబ్నెమాజకు చెందినవి. సహీహ్  ఇబ్నెమాజ 335/2 చూడండి)


3. అల్‌హమ్‌దు లిల్లాహిల్లజీ ఆఫానీ ఫీ జసదీ వ రద్ద అలయ్య రూహీ వ అజినలీ బిజిక్‌రిహీ

الْحَمْدُ للهِ الَّذِي عَافَانِي فِي جَسَدِي، وَرَدَّ عَلَيَّ رُوحِي، وَأَذِنَ لِي بِذِكْرِهِ

స్తోత్రాలన్నీ అల్లాహ్‌కే. ఆయనే నా శరీరానికి స్వస్థత చేకూర్చాడు. నా ప్రాణాన్ని నాకు తిరిగిచ్చేశాడు. ఇంకా తనను స్మరించే సద్బుద్ధి నిచ్చాడు.

(తిర్మిజీ  473/5 , సహీహ్  తిర్మిజీ  144/2)


4. “ఇన్న ఫీ ఖల్‌ఖిస్సమావాతి వల్‌ అర్‌జి వఖ్తిలాఫిల్‌లైలి వన్నహారి లఆయాతిల్‌ లి ఉలిల్‌ అల్‌బాబ్‌. అల్లజీన యజ్‌కురూనల్లాహ ఖియామవ్‌ వ ఖువూదవ్‌ వ అలా జునూబిహిమ్‌ వ యతఫక్కరూన ఫీ ఖల్‌ఖిస్సమావాతి వల్‌ అర్‌జ్‌, రబ్బనా మా ఖలఖ్‌త హాజా బాతిలా, సుబ్‌హానక ఫఖినా అజాబన్నార్‌. రబ్బనా ఇన్నక మన్‌ తుద్‌ఖిలిన్నార ఫఖద్‌ అఖ్ జయ్‌తహూ వమా లిజ్ఞాలి మీన మిన్‌ అన్‌సార్‌. రబ్బనా ఇన్ననా సమి’అనా మునా దియయ్‌ యునాదీ లిల్‌ఈమాని అన్‌ ఆమినూ బిరబ్బి కుమ్‌ ఫ ఆమన్నాా రబ్బనా ఫగ్‌ఫిర్‌లనా జునూబనా వ కఫ్ ఫిర్‌అన్నా సయ్యిఆతినా వతవఫ్ ఫనా మఅల్‌ అబ్‌రార్‌. రబ్బనా వ ఆతినా మా వఅద్‌త్తనా అలా రుసులిక వలా తుఖ్‌జినా యవ్మల్‌ ఖియామతి ఇన్నక లా తుఖ్‌లిఫుల్‌ మీఆద్‌.

إِنَّ فِي خَلْقِ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَاخْتِلَافِ اللَّيْلِ وَالنَّهَارِ لَآيَاتٍ لِأُولِي الْأَلْبَابِ ۞ الَّذِينَ يَذْكُرُونَ اللّهَ قِيَامًا وَقُعُودًا وَعَلَى جُنُوبِهِمْ وَيَتَفَكَّرُونَ فِي خَلْقِ السَّمَاوَاتِ وَالْأَرْضِ رَبَّنَا مَا خَلَقْتَ هَذَا بَاطِلًا سُبْحَانَكَ فَقِنَا عَذَابَ النَّارِ ۞ رَبَّنَا إِنَّكَ مَنْ تُدْخِلِ النَّارَ فَقَدْ أَخْزَيْتَهُ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنْصَارٍ ۞ رَبَّنَا إِنَّنَا سَمِعْنَا مُنَادِيًا يُنَادِي لِلْإِيمَانِ أَنْ آمِنُوا بِرَبِّكُمْ فَآمَنَّا رَبَّنَا فَاغْفِرْ لَنَا ذُنُوبَنَا وَكَفِّرْ عَنَّا سَيِّئَاتِنَا وَتَوَفَّنَا مَعَ الْأَبْرَارِ ۞ رَبَّنَا وَآتِنَا مَا وَعَدْتَنَا عَلَى رُسُلِكَ وَلَا تُخْزِنَا يَوْمَ الْقِيَامَةِ إِنَّكَ لَا تُخْلِفُ الْمِيعَادَ

భూమీ, ఆకాశాల సృష్టిలో రేయింబవళ్ళు ఒక దాని తరువాత ఒకటి రావడంలో, నిలుచున్నా, కూర్చున్నా పరుండినా అన్నివేళలా అల్లాహ్‌ను స్మరించే వారున్నూ, భూమీ, ఆకాశాల నిర్మాణం గురించి చింతన చేసేవారున్నూ అయిన వివేకవంతులకు ఎన్నో సూచనలు ఉన్నాయి. (వారు అప్రయత్నంగా ఇలా అంటారు) ప్రభూ! ఇదంతా నీవు వ్యర్థంగా, లక్ష్య రహితంగా సృష్టించలేదు. నీవు పరిశుద్ధడవు కాబట్టి నిష్ఫలకార్యాలు చెయ్యవు. కనుక ప్రభూ! మమ్మల్ని నరకబాధ నుండి కాపాడు. నీవు ఎవడినైతే నరకంలో పడవేస్తావో వాణ్ణి వాస్తవానికి అధోగతికి, అవమానానికీ గురిచేసినట్లే. ఇక ఇటువంటి దుర్మార్గులకు సహాయం చేసేవాడెవడూ ఉండడు. ప్రభూ! మేము విశ్వాసం వైపునకు పిలిచేవాని పిలుపును విన్నాము. మీ ప్రభువును విశ్వసించండి అని అతను అనేవాడు. మేము అతని సందేశాన్ని స్వీకరించాము. కనుక మా స్వామీ! మేము చేసిన తప్పులను మన్నించు. మాలో ఉన్న చెడులను దూరం చెయ్యి. సజ్జనులతోపాటు మా జీవితానికి ముగింపు ప్రసాదించు. దేవా! నీవు నీ ప్రవక్తల ద్వారా చేసినటువంటి బాసలను మా విషయంలో నెరవేర్చు. ప్రళయంనాడు మమ్మల్ని పరాభవానికి గురిచెయ్యకు. నిస్సందేహంగా నీవు నీ వాగ్జానాలకు భిన్నంగా వ్యవహరించవు.

(ఆలిఇమ్రాన్‌: 190- 294) (బుఖారి’ మ అల్‌ఫతహ్  235/8 , ముస్లిమ్  530/1)


 

%d bloggers like this: