తెలుగు ఇస్లామిక్ క్విజ్ : పార్ట్ 01

బిస్మిల్లాహ్

తెలుగు ఇస్లామిక్ క్విజ్ : పార్ట్ 1
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

1) పవిత్ర కలిమా లో గల “ఇలాహ్” కు అర్థం ఏమిటి ?

A) గొప్పవాడు
B) నిజ ఆరాధ్య దేవుడు
C) దైవదూత

2) ఖుర్ఆన్ అవతరణా క్రమంలో దైవప్రవక్త (ﷺ) వారిపై అవతరించిన తొలి పదం ఏమిటి ?

A) ఇబాదాహ్
B) ఇఖ్రా
C) సలాహ్

3) ప్రవక్తల పరంపరలో తొలి ప్రవక్త ఎవరు ?

A) ముహమ్మద్ ప్రవక్త (ﷺ)
B) ఆదం (అలైహిస్సలాం)
C) ఈసా (అలైహిస్సలాం)

4) ఖుర్ఆన్ ఏ భాషలో అవతరించినది?

A) ఉర్దూ
B) హీబ్రు
C) అరబ్బీ

5) ఇస్లాం మూల స్తంభాలు ఎన్ని వాటిలో 2 వది ఏది?

A) 6 –ఉపవాసం
B) 5 –నమాజ్
C) 4 — కలిమా

సమాధానాలు 

1) B) నిజ ఆరాధ్య దేవుడు
2) B) ఇఖ్రా
3) B) ఆదం (అలైహిస్సలాం)
4) C) అరబ్బీ
5) B) 5 –నమాజ్


నోట్: ఈ  పార్ట్ 01కు ఆడియో వివరణ లేదు. పార్ట్ 02 నుండి ఆడియో వివరణ వినవచ్చు 

ఇతరములు :

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

తెలుగు ఇస్లామిక్ క్విజ్ : పార్ట్ 02 [ఆడియో]

బిస్మిల్లాహ్

తెలుగు ఇస్లామిక్ క్విజ్ : పార్ట్ 2
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

1) ఖుర్ఆన్ లో అతి పెద్ద ఆయాత్ దేనిగూర్చి? అది ఏ సురాహ్ లో గలదు?

A) ఏకత్వం గూర్చి అది సురాహ్ యాసీన్ లో ఉంది
B) అది అప్పు గూర్చి సురాహ్ బఖరా లో గలదు
C) మహర్ గూర్చి అది సురాహ్ నిసా లో గలదు

2) “రసూల్” అనగా అర్థం ఏమిటి?

A) దాత
B) ప్రదాత
C) సందేశహరుడు.

3) దైవదూతల నాయకుడైన దైవదూత ఎవరు?

A) మీఖాయిల్ (అలైహిస్సలాం)
B) జిబ్రాయిల్ (అలైహిస్సలాం)
C) ఇస్రాఫీల్ (అలైహిస్సలాం)

4) ఈమాన్ యొక్క మూల స్తంభాలు ఎన్ని ? వాటిలో తొలిది ఏది?

A) అవి 6 వాటిలో తొలిది అల్లాహ్ పై విశ్వాసం
B) అవి 5 వాటిలో తొలిది రసూల్ పై విశ్వాసం
C) అవి 4 వాటిలో తొలిది పరలోకం పై విశ్వాసం

5) పవిత్ర ఏకత్వ కలిమాలో గల నియమాలు ఎన్ని?

A) 2
B) 6
C) 5

క్విజ్ 02. సమాధానాలు & విశ్లేషణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [వ్యవధి 9:51]

ఇతరములు :

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

కష్టం తొలగిపోవుటకు, లేక రాకుండా ఉండుటకు కడాలు, దారాలు, వాటి లాంటివి ధరించుట షిర్క్ – ఏకత్వపు బాటకు సత్యమైన మాట

7 వ అధ్యాయం
కష్టం తొలగిపోవుటకు, లేక రాకుండా ఉండుటకు కడాలు, దారాలు, వాటి లాంటివి ధరించుట షిర్క్
[Wearing bracelets and cords etc., To remove Afflictions or to seek protection is a form of shirk]
అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.

యూట్యూబ్ ప్లే లిస్ట్ (ఏకత్వపు బాటకు సత్యమైన మాట)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0VrU7pg90uGfghChg9Bptl


 إِنْ أَرَادَنِيَ اللَّهُ بِضُرٍّ هَلْ هُنَّ كَاشِفَاتُ ضُرِّهِ

“ఒక వేళ అల్లాహ్ నాకేదైనా నష్టాన్ని కలిగించగోరితే, మీరు అల్లాహ్ ను కాదని వేడుకునే దేవతలు, ఆయన కలిగించే నష్టం నుండి నన్ను కాపాడగలరా?” (జుమర్ 39: 38).

ఇమ్రాన్ బిన్ హుసైన్ కథనం: ఒక వ్యక్తి చేతిలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) రాగి కడం (bracelet) చూసి, “ఇది ఏమిటి?” అని అడిగారు. “వాహిన” [*] దూరము కావడానికి వేసుకున్నాను అని అతడు చెప్పాడు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “దాన్ని తీసివేయి. అది నీ “వాహిన” పెరుగుటకే కారణమవుతుంది. ఒక వేళ అది నీవు ధరించి ఉన్నప్పుడు మరణించావంటే ఎన్నటికీ సాఫల్యం పొందవు” అని హెచ్చరించారు. (అహ్మద్).

[*భుజములోని ఒక నరం ఉబ్బి రోగము వస్తుంది. అది దూరము కావడానికి వారు అలాంటివి వేసుకునేవారు

ఉఖ్బా బిన్ ఆమిర్ కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆదేశం: “తాయత్తు వేసుకున్నవారి ఉద్దేశాన్ని అల్లాహ్ పూర్తి చేయకుండుగాక. గవ్వ (సీపి) వేసుకున్న వానికి కూడా అల్లాహ్ స్వస్థత ప్రసాదించకుండా ఉండుగాక “. (అహ్మద్). మరో ఉల్లేఖనంలో ఉంది: “తాయత్తు వేసుకున్న వారు షిర్క్ చేయువారు“.

ఇబ్ను అబి హాతింలో ఉంది: హుజైఫా ఒక వ్యక్తి చేతిలో జ్వరం దూరం కావడానికి వేసుకున్న దారాన్ని చూసి తెంచారు. తరువాత ఈ ఆయతు చదివారు. “వారిలో చాలామంది అల్లాహ్ను విశ్వసిస్తూ కూడా ఆయనతో పాటు ఇతరులను భాగస్వాములుగా నిలబెడుతున్నారు.” (యూసూఫ్ 12 : 106).

ముఖ్యాంశాలు:

1. రోగాలు దూరమగుటకు కడాలు (bracelets), దారాలు (cords) వేసుకొనుట కఠినంగా నివారించబడింది.

2.”అతను అదే స్థితిలో చనిపోతే సఫలుడు కాడు” అన్న దానితో షిర్క్ అస్గర్ (చిన్న షిర్క్), కబీర గునాహ్ లో (ఘోర పాపాల్లో) పెద్దది అని తెలుస్తుంది.

3. తెలియక పోవడము ఒక సాకుగా పరిగణింపబడలేదు.

4. దాని వలన లాభం కలగదు. ప్రవక్త ఆదేశానుసారం: ‘దాని వలన “వహన్” ఇంకా పెరుగుతుంది.’

5. ఇలాంటి పని చేసిన వారిని కఠినంగా హెచ్చరించబడింది.

6. ఇలాంటివి వేసుకున్నవారు దాని వైపే అప్పగించబడుతారు.

7. తాయత్తు వేసుకున్న వారు షిర్క్ చేయువారు అని స్పష్టం అయింది.

8. జ్వరం దూరం కావడానికి దారం వేసుకొనుట కూడా ఇందులోనే పరిగణించబడుతుంది.

9. హుజైఫా పఠించిన ఆయతుతో తెలిసిందేమిటంటే; ప్రవక్త సహచరులు పెద్ద షిర్క్ ప్రస్తావించబడిన ఆయతులతో చిన్న షిర్క్ గురించి ప్రమాణంగా ప్రస్తావించేవారు. సూరె బఖర వాక్యంలో ఇబ్నె అబ్బాసు (రదియల్లాహు అన్హు) ఇలాగే తెలిపారు.

10. దిష్టి తగలకుండా గవ్వ (సీపి) వేసుకొనుట కూడా షిర్క్ అవుతుంది.

11. తాయత్తు వేసుకున్న వారిని, గవ్వ వేసుకున్న వారిని శపించబడింది. అంటే అల్లాహ్ వారిని తన సంరక్షణలో ఉంచడు.

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :

నష్టం, కష్టం దూరం కావడానికి, లేక రాకుండా ఉండడానికి ఉపయోగించే సాధనాల (జరియ, అస్బాబ్)లో ఏవి యోగ్యం, ఏవి నిషేధం తెలుసుకొనటానికి, సాధనాల (జరీయ, అస్బాబ్)కు సంబంధించిన ఆదేశాల్ని తెలుసుకొనుట ఎంతయినా అవసరం. ఇందులో మూడు విషయాల్ని తెలుసుకొనుట చాలా ముఖ్యం.

1. ధార్మికంగా లేక శాస్త్రీయంగా లాభకరమయిన సాధనం అని రుజువైన వాటినే సాధనంగా ఉపయోగించాలి.

2. వాటిని ఉపయోగించే వ్యక్తి ఆధారం, భరోసా వాటిపై ఉండ కూడదు. వాటిని సాధనంగా చేసిన అల్లాహ్ పై నమ్మకం ఉండాలి.

3. సాధనాలు ఎంత గొప్పవి, శక్తి గలవైనా అల్లాహ్ వ్రాసి ఉంచిన విధి, (తఖ్ దీర్)కి అవి లోబడి ఉంటాయి. దానిని తప్పించుకోలేవు. అల్లాహ్ తాను కోరినట్లు వాటిలో మార్పు చేస్తాడు. అల్లాహ్ కోరితే అందులోని గుణాన్ని అలాగే ఉంచుతాడు. ఆయన దాసులు వాటిని తెలుసుకొని, ఉపయోగించి వాటిలో ఉన్నటువంటి అల్లాహ్ తత్వాన్ని గమనించగలరనీ. అతను కోరితే అందులోని గుణాన్ని మార్చనూవచ్చు. ఇలా దాసులు వాటిపైనే నమ్మకం ఉంచకూడదనీ, అల్లాహ్ శక్తిని అర్థం చేసుకోగలరనీ. మార్పు చేయు సర్వశక్తి, సర్వ ఇష్టం ఒకే ఒక్క అల్లాహ్ కు మాత్రమే ఉంది.

పై ముఖ్య విషయం తెలుసుకున్న తరువాత, ఇక వచ్చిన కష్టం తొలగడానికి, లేక కష్టం రాకుండా జాగ్రత్త పడడానికి దారం లేక కడం లాంటివి వేసుకున్న వాడు షిర్క్ చేసినట్లే కదా? ఎలా అనగా; అది కష్టం రాకుండా, లేక వచ్చిన తరువాత కాపాడునది అని విశ్వసిస్తే ఇది పెద్ద షిర్క్ అవుతుంది. అతడు అల్లాహ్ను గాక ఇతరులను స్వస్థత ఇచ్చేవాడుగా నమ్మినందుకు ఇది రుబూబియత్ కు సంబంధించిన షిర్క్. ఇంకా అతడు అందులో స్వస్థత ఉంది అని దానిపై భరోసా, నమ్మకం, ఆశ ఉంచినందుకు, ఇది ఉలూహియత్ కు సంబంధించిన షిర్క్ అవుతుంది.

ఒక వేళ అతడు అల్లాహ్ యే కష్టనష్టాలు రాకుండా, లేక వచ్చిన తరువాత కాపాడువాడు అని విశ్వసించి, అవి కేవలం సాధనం అని నమ్మినవాడు, ధార్మికంగా, శాస్త్రీయంగా సాధనం లేని దానిని సాధనంగా నమ్మినవాడవుతాడు. ఇది నిషిద్ధం (హరాం). మరియు ఇస్లాం పై, వైద్య శాస్త్రంపై ఒక అబద్దం మోపినవాడవుతాడు. ఎలా అనగా; ఇస్లామీయ ధర్మం దీనిని చాలా కఠినంగా నివారించింది. అది నివారించినవి లాభాన్నిచ్చేవి కావు. శాస్త్రీయంగా కూడా ఇవి ఆమోదం పొందినవి కావు. లాభం చేకూర్చే ఔషదాల్లో లెక్కించబడవు.

అందుకే ఇవి షిర్క్ వైపునకు లాక్కొని వెళ్ళే సాధనాలు. వాటిని వేసుకున్న వాని మనుస్సు వాటిపై లగ్నం అయి ఉంటుంది. అందుకే అది షిర్క్ భాగాల్లో ఒక భాగం. లేక సాధనాల్లో ఒక సాధనం.

ఇది ధార్మికంగా, శాస్త్రీయంగా సాధనం కాదని తెలిసినప్పుడు, విశ్వాసుడు తన విశ్వాసం సంపూర్ణమగుటకు దానిని వదిలి వేయాలి. అతని తౌహీద్ సంపూర్ణం అయిందంటే నివారించబడిన వాటిపై అతని మనుస్సు లగ్నం కాదు. లాభం లేని వాటిపై మనుస్సు లగ్నం కావడం బుద్ధిహీనతకు నిదర్శనం. ఎలా అనగా మనిషి తనకు లాభం లేని వాటిని ఉపయోగించడు. అందులో నష్టమే ఉంది.

ఈ సత్య ధర్మం యొక్క పునాది: “ప్రజల నుండి విగ్రహారాధనను, సృష్టి రాసుల పైనుండి నమ్మకాన్ని దూరము చేసి, వారి ధర్మాన్ని దురాచారాల, దుష్చేష్టల నుండి దూరం చేసి వారి బుద్ధి జ్ఞానాలను సంపూర్ణం చేయుట. బుద్ధిని అభివృద్ధి పరిచే, ఆత్మలను పరిశుద్ధపరిచే, ధార్మిక, ప్రాపంచిక స్థితిగతులను సంస్కరించే లాభదాయకమయిన విషయాల గురించి కృషి చేయుట.”


నుండిఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్)  – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం]. తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

యూట్యూబ్ ప్లే లిస్ట్ (ఏకత్వపు బాటకు సత్యమైన మాట)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0VrU7pg90uGfghChg9Bptl

కోరోనా నుండి రక్షణ సాధనాలు [వీడియో]

బిస్మిల్లాహ్

కోరోనా వైరస్ నుండి రక్షణకై ధార్మిక మరియు వైద్య సాధనాలన్నీ అవలంబించండి:

  • అందుకు అల్లాహ్ పై సంపూర్ణ నమ్మకం ఉంచండి,
  • అజ్కార్ (జిక్ర్), దుఆలను పాటించండి,
  • ఖర్జూరం, నల్ల జీలకర్ర సరియైన విధానంలో ఉపయోగించండి.
  • బైటికి వెల్లకండి, ఎవరినీ కలవకండీ.
  • اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ البَرَصِ، وَالْجُنُونِ، وَالْجُذَامِ، وَمِنْ سَيِّئِ الْأَسْقَامِ اللَّهُمَّ إِنِّي أسأَلُك العَفْوَ وَالعَافِية
    అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మినల్ బరసి వల్ జునూని వల్ జుదామి వ మిన్ సయ్యిఇల్ అస్ఖామ్,
  • ఇంకా –  అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ అఫ్వ వల్ ఆఫియ.. చదువుతూ ఉండండి.

అల్లాహ్ అందరిని కాపాడుగాక!

ఉపవాసానికి 1 సాక్షి మరియు పండుగకు 2 సాక్ష్యులు [వీడియో]

బిస్మిల్లాహ్

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (5:17 నిముషాలు)

ఇతరములు:

ఉపవాసం భంగపరిచే విషయాలు, భంగపరచని విషయాలు [వీడియో క్లిప్]

బిస్మిల్లాహ్

[5:14 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (5:14 నిముషాలు)

క్రింది విషయాలు ఉపవాస (రోజా) ఆదేశాలు – జుల్ఫీ కేంద్రం నుండి [28 పేజీలు] అనే పుస్తకం నుండి తీసుకోబడింది.

రోజాను భంగ పరుచు విషయాలు:

1- గుర్తుండి తిని త్రాగడం వల్ల రోజా భంగమగును. కాని మరచిపోయి తిన త్రాగటం వల్ల రోజా భంగం కాదు.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:

ఏ ఉపవాసి అయినా మరచిపోయి ఏదన్నా తిన్నా, త్రాగినా (ఫరవాలేదు) అతను తన రోజాను కొనసాగించాలి. (ముస్లిం 1155).

ముక్కు ద్వారా కడుపులో నీళ్ళు పోయినా రోజా భంగమవుతుంది. నాడి ద్వారా ఏదైనా ఆహారం అందించడం, రక్తం ఎక్కించడం వల్ల రోజా వ్యర్థమవుతుంది. ఇవి ఉపవాసికి ఆహారంగా పని చేస్తాయి.

2- సంభోగించడం. ఉపవాసమున్న వ్యక్తి సంభోగించినచో ఉపవాసం భంగమగును. దానికి బదులుగా రమజాను తర్వాత ఒక రోజు ఉపవాసం ఉంటూ ఈ పరిహారం చెల్లించుటవిధిగా ఉంది. (1) ఒక బానిసకు విముక్తి కలిగించాలి. ఈ శక్తి లేనిచో (2) వరుసగా రెండు నెలల ఉపవాసాలుండాలి. అకారణంగా వరుస తప్పవద్దు. ఉదాః రెండు పండుగలు, ఈదుల్ అజ్హా తర్వాత మూడు రోజులు, లేదా అనారోగ్యం మరియు ప్రయాణం లాంటి కారణాలు. రోజా తప్పాలనే ఉద్దేశంతో ప్రయాణం చేయకూడదు. ఒకవేళ అకారణంగా ఒక రోజు కూడా ఉపవాసం మానుకున్నా మళ్ళీ కొత్త వరుసతో ఉపావాసాలు మొదలు పెట్టాలి. ఒకవేళ రెండు నెలల ఉపవాసాలు కూడా ఉండే శక్తి లేనిచో (3) అరవై మంది పేదలకు అన్నం పెట్టాలి.

3- ముద్దులాట, హస్తప్రయోగం వల్ల వీర్యం పడి పోతే ఉపవాసం భంగమవుతుంది. (హస్త ప్రయోగానికి ఇస్లాంలో అనుమతిలేదు). వాటికి పరిహారం లేదు కాని తర్వతా ఒక రోజా ఉండాలి. ఒకవేళ నిద్రలో స్ఖలనమైనచో రోజా భంగం కాదు.

4- కరిపించి దేహం నుండి రక్తం తీయించుట, లేదా రక్తదానం కొరకు ఆధునిక పద్ధతిలో రక్తం తీయుంచుట వల్ల రోజా భంగమగును. కాని రక్తపరీక్ష ఉద్దేశంతో కొంచం తీయుట వల్ల రోజా భంగం కాదు. అలాగే పుండు నుండి, ముక్కు నుండి రక్తం వెలితే, పన్ను వూడి రక్తం వెలితే రోజా భంగం కాదు.

5- ఉద్దేశ్యంతో కావాలని వాంతి చేస్తే రోజా భంగమవుతుంది. కాని మనిషి తన ప్రమేయం లేకుండా అదే వస్తే రోజా భంగం కాదు.

పై విషయాలు, ఏ మనిషి తెలిసి చేస్తాడో అతని రోజా మాత్రమే భంగమగును. వాటి ధార్మిక ఆదేశాలు తెలియక లేదా సమయం తెలియక (ఉదా: ఉషోదయం కాలేదని అను కొనుట, లేదా సూర్యాస్తమయం అయినది అనుకొనుట లాంటివి) ఏదైనా తప్పు జరిగితే రోజా భంగం కాదు.

గుర్తుండి వాటికి పాల్పడ కూడదు. మతి మరుపుతో జరిగిన విషయంలో కూడా పట్టు బడరు. తాను కావాలని చేయకూడదు. ఎవరైనా అతనిపై ఒత్తిడి, బలవంతం చేసినందు వల్ల అతను వాటికి పాల్పడితే రోజా భంగం కాదు. తర్వాత దాన్ని పూర్తి చేయనవసరం లేదు.

6- ఉపవాస స్థితిలో స్త్రీలకు బహిష్టు వచ్చినా, వారు ప్రసవించినా రోజా భంగమగును. అలాగే రక్తస్రావం ఉన్నన్ని రోజులు ఉపవాసం ఉండరాదు. ఎన్ని రోజుల ఉపవాసం ఉండలేక పోయారో శుద్ధి పొందిన తర్వాత అన్ని రోజుల ఉపవాసం పూర్తి చెయ్యాలి.

రోజాను భంగపరచని విషయాలు:

1- స్నానం చేయుట, ఈతాడుట, వేసవిలో నీళ్ళు పోసుకొని శరీర భాగాన్ని చల్లబరుచుట.

2- ఉషోదయం వరకు తిని త్రాగుట మరియు సంభోగించుట.

3- ఏ సమయములోనైనా మిస్వాక్ చేయుట వల్ల రోజా భంగము కాదు, మక్రూహ్ కాదు. అది ఏ స్థితిలో కూడా చేయుట అభిలషణీయం.

4- ఆహారముగా పని చేయని ధర్మసమ్మతమైన ఏ రకమైన చికిత్స అయినా సరే చేయవచ్చును. ఇంజక్షన్, చెవుల్లో, కళ్ళల్లో మందు వేయించటం, దాని రుచి ఏర్పడినా సరే. ఒకవేళ ఇఫ్తార్ వరకు ఆగటం వల్ల ఏ నష్టం లేకుంటే ఆలస్యం చేయడం మంచిది. ఉబ్బసం (Asthma)తో బాధపడు తున్నవారికి ఆక్సిజన్ (Oxygen) ఎక్కించడం వల్ల రోజా భంగం కాదు. కడుపులో చేరకుండా జాగ్రత్త పడుతూ వంటకాల రుచి చూడడం. అలాగే పుక్కిలించడం, తిన్నగా ముక్కులో నీళ్ళు ఎక్కించడం తప్పు కాదు. అయితే తిన్నగా ఎక్కించే విషయంలో అజాగ్రత్త వల్ల ముక్కు ద్వారా నీళ్ళు కడుపులో పోయే ప్రమాదం ఉంటుంది. సువాసన పూసుకోవడం, దానిని ఆఘ్రాణించడం కూడా తప్పు లేదు.

5- రాత్రి సమయంలో రకస్రావం నిలిచిన బహిష్టురాలు, బాలింతలు అలాగే సంభోగించుకున్న దంపతులు సహరీ తర్వాత ఫజ్ర్ నమాజుకు ముందు గుస్ల్ (స్నానం) చేసినా అభ్యంతరం లేదు.

ఇతరములు:

ఉపవాసం ఎవరిపై విధిగా ఉంది?ఎవరిపై విధిగా లేదు? [వీడియో క్లిప్]

బిస్మిల్లాహ్

[4:39 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (4:39 నిముషాలు)

క్రింది విషయాలు ఉపవాస (రోజా) ఆదేశాలు – జుల్ఫీ కేంద్రం నుండి [28 పేజీలు] అనే పుస్తకం నుండి తీసుకోబడింది.

ఈ ఉపవాసాలు ఎవరిపై విధి?

ప్రతీ తెలివిగల, యుక్తవయస్సుకు చేరిన ముస్లిం స్త్రీ, పురుషునిపై రోజా విధిగా ఉంది. 15 సంవత్సరాలు నిండుట లేదా నాభి క్రింద వెంట్రుకలు మొలుచుట, స్వప్నస్ఖలనమగుట మరియు బాలికలకు పై మూడింటితో పాటు నెలవారి రక్తస్రావమగుట. వీటిలో ఏ ఒక్కటి సంభవించినా యుక్త వయస్సుకు చేరినట్లే.

ఎవరిపై రోజా విధిగా లేదు?

1- రోగి: స్వస్థత పొందే నమ్మకం ఉన్న వ్యాదిగ్రస్తుడు. అతనికి ఉపవాసం ఉండుట కష్టంగా ఉంటే, కష్టం ఉన్న రోజుల్లో ఉపవాసం మానుకొని, అన్ని రోజుల ఉపవాసం తర్వాత ఉండాలి.

స్వస్థత పొందే నమ్మకం లేని వ్యాదిగ్రస్తుడు ఉపవాసం ఉండనవసరం లేదు. కాని ప్రతి ఒక్క ఉపవాసానికి బదులుగా ఒక బీదవానికి కడుపు నిండా అన్నం పెట్టాలి. లేదా ఎన్ని రోజుల  ఉపవాసం మానేశాడో లెక్కేసుకొని అంత మంది బీదవాళ్ళకు ఒకే రోజు విందు చేయాలి.

2- ప్రయాణికుడు: ఇంటి నుండి వెళ్ళి తిరిగి వచ్చే వరకు ఉపవాసం మానేయవచ్చును. అయితే అక్కడ నివసించే ఉద్దేశం ఉండకూడదు.

3- గర్భిణి, పసి బిడ్డలకు పాలిచ్చు తల్లి: తనకు లేదా పసిబిడ్డకు అనారోగ్య భయం ఉన్నచో ఉపవాసం మానేసి, ఈ ఆటంకం దూరమయ్యాక అన్ని రోజుల ఉపవాసం వేరే రోజుల్లో ఉండాలి.

4- ఉపవాసముండే శక్తి లేని వృద్ధులు: వారు ఉపవాసం మానుకోవచ్చు. కాని ఒక రోజుకు బదులుగా ఒక బీదవానికి అన్నం పెట్టాలి.

ఇతరములు:

బయటికి వెళ్ళినప్పుడు, ఇంట్లో ప్రవేశించినపుడు చెడు, కీడు నుండి రక్షణ కొరకు

బిస్మిల్లాహ్

عَنْ أَبِي هُرَيْرَةَ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ

” إِذَا خَرَجْتَ مِنْ مَنْزِلِكَ فَصَلِّ رَكْعَتَيْنِ تَمْنَعانِكَ مَخْرَجَ السَّوْءِ، وَإِذَا دَخَلْتَ مَنْزِلَكَ فَصَلِّ رَكْعَتَيْنِ تَمْنَعانِكَ مَدْخَلَ السَّوْءِ “

అబూ హురైరా (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:

“నీవు ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పుడు రెండు రకాతుల నమాజు చేయి, ఆ రెండు రకాతుల వల్ల అల్లాహ్ నిన్ను బయటి చెడుల, కీడుల నండి కాపాడుతాడు. అలాగే ఇంట్లో ప్రవేశించావంటే రెండు రకాతుల నమాజు చేయి, వాటి మూలంగా అల్లాహ్ నిన్ను ఇంట్లోని చెడు, కీడు నుండి కాపాడతాడు.”

[సహీహా 1323. సహీహుల్ జామి 505]

కూర్పు, తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

షవ్వాల్ 6 ఉపవాసాల లాభాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[9:51 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (9:51 నిముషాలు)

“ఎవరు రమజాను మాసమెల్లా ఉపవాసాలుండి, షవ్వాల్ మాసములో ఆరు ఉపవాసాలుంటాడో అతనికి సంవత్సరమెల్లా ఉపవాసాలున్నంత పుణ్యం లభిస్తుంది.” (ముస్లిం 1164).

ఇతరములు:

రమదాన్ నెల చివరి పది రోజుల ఘనత [వీడియో]

బిస్మిల్లాహ్

[8:16 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (8:16 నిముషాలు)

ఇతరములు: