[4:39 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (4:39 నిముషాలు)
క్రింది విషయాలు ఉపవాస (రోజా) ఆదేశాలు – జుల్ఫీ కేంద్రం నుండి [28 పేజీలు] అనే పుస్తకం నుండి తీసుకోబడింది.
ఈ ఉపవాసాలు ఎవరిపై విధి?
ప్రతీ తెలివిగల, యుక్తవయస్సుకు చేరిన ముస్లిం స్త్రీ, పురుషునిపై రోజా విధిగా ఉంది. 15 సంవత్సరాలు నిండుట లేదా నాభి క్రింద వెంట్రుకలు మొలుచుట, స్వప్నస్ఖలనమగుట మరియు బాలికలకు పై మూడింటితో పాటు నెలవారి రక్తస్రావమగుట. వీటిలో ఏ ఒక్కటి సంభవించినా యుక్త వయస్సుకు చేరినట్లే.
ఎవరిపై రోజా విధిగా లేదు?
1- రోగి: స్వస్థత పొందే నమ్మకం ఉన్న వ్యాదిగ్రస్తుడు. అతనికి ఉపవాసం ఉండుట కష్టంగా ఉంటే, కష్టం ఉన్న రోజుల్లో ఉపవాసం మానుకొని, అన్ని రోజుల ఉపవాసం తర్వాత ఉండాలి.
స్వస్థత పొందే నమ్మకం లేని వ్యాదిగ్రస్తుడు ఉపవాసం ఉండనవసరం లేదు. కాని ప్రతి ఒక్క ఉపవాసానికి బదులుగా ఒక బీదవానికి కడుపు నిండా అన్నం పెట్టాలి. లేదా ఎన్ని రోజుల ఉపవాసం మానేశాడో లెక్కేసుకొని అంత మంది బీదవాళ్ళకు ఒకే రోజు విందు చేయాలి.
2- ప్రయాణికుడు: ఇంటి నుండి వెళ్ళి తిరిగి వచ్చే వరకు ఉపవాసం మానేయవచ్చును. అయితే అక్కడ నివసించే ఉద్దేశం ఉండకూడదు.
3- గర్భిణి, పసి బిడ్డలకు పాలిచ్చు తల్లి: తనకు లేదా పసిబిడ్డకు అనారోగ్య భయం ఉన్నచో ఉపవాసం మానేసి, ఈ ఆటంకం దూరమయ్యాక అన్ని రోజుల ఉపవాసం వేరే రోజుల్లో ఉండాలి.
4- ఉపవాసముండే శక్తి లేని వృద్ధులు: వారు ఉపవాసం మానుకోవచ్చు. కాని ఒక రోజుకు బదులుగా ఒక బీదవానికి అన్నం పెట్టాలి.
ఇతరములు:
You must be logged in to post a comment.