కోపతాపాల గురించి హెచ్చరిక (warning about becoming angry)

హదీథ్׃ 09

التحذير من الغضب కోపతాపాల గురించి హెచ్చరిక

عن أبي هريرةَ رضيَ الله عنه أنّ رجلاً قال للنبيّ صلى الله عليه وسلم أوصِني. قال: ((لا تَغضب )) . فردّدَ مراراً, قال: ((لا تَغضب)) . رواه البخاري

అన్ అబి హురైరత రదియల్లాహు అన్హు అన్న రజులన్ ఖాలలిన్నబియ్యి సల్లల్లాహు అలైహి వసల్లం  అవ్ శిని, ఖాల – లా తగ్దబ్, ఫరద్దద మిరారన్, ఖాల – లా తగ్దబ్ రవాహుల్ బుఖారీ.

ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇలా అడగినారు – నాకు ఉపదేశం చేయండి. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కోపగించుకోవద్దు అని బోధించారు. ఆ వ్యక్తి మాటిమాటికీ అదే ప్రశ్నను అడుగగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతిసారి అదే జవాబు (కోపగించుకోవద్దు) ఇచ్చారు.

హదీథ్ ఉల్లేఖించినవారి పరిచయం:- అబుహురైరా అబ్దుర్రహ్మాన్ బిన్ సఖర్ అద్దౌసి రదియల్లాహు అన్హు ఖైబర్ యుద్ధం జరిగిన 7హి సంవత్సరంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహచర్యంలోనికి చేరారు. ఎక్కువ హదీథ్ లను జ్ఞాపకం ఉంచుకున్నవారిలో ఒకరు.

వివరణ – కోపతాపాలకు దూరంగా ఉండమని ఈ హదీథ్ బోధిస్తున్నది. కాబట్టి కోపం కలిగించే పరిస్థితుల నుండి మరియు పరిసరాల నుండి మనం కాపాడుకోవలెను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ప్రశ్నించిన వ్యక్తిని కోపం నుండి దూరంగా ఉండమనే జవాబునే అనేక సార్లు ఇచ్చినారు. దీనిని బట్టి కోపం నుండి దూరంగా ఉండవలసిన ఆవశ్యకత మనకు అర్థం అవుతున్నది. ఈ ప్రశ్న అడిగిన సహచరుడికి కోపం ఎక్కువగా ఉండేది. ప్రశ్న అడిగిన సహచరుడిలో ఏ బలహీనతలున్నాయో, ఏ ఏ తప్పులున్నాయో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం వారికి వాటి నుండి బయటకు వచ్చేటట్లు, వాటిని సరిదిద్దుకునేందుకు అవసరమైన ఉపదేశం చేసేవారు.

ఈ హదీథ్ ద్వారా నేర్చుకోవలసిన విషయాలు

 1. ఇస్లాం ధర్మం కోపతాపాల నుండి దూరంగా ఉండమని ఆదేశిస్తున్నది.
 2. కోపతాపాలు షైతాన్ ఆచరణలు కాబట్టి అవి మానవుడికి కీడును మాత్రమే కలిగిస్తాయి.
 3. ముస్లింలు అనవసరంగా ఎవరిపైనా కోపగించుకో కూడదు.
 4. ఓర్పు, సహనం వంటి మంచి గుణాలను ఇస్లాం ధర్మం ప్రోత్సహిస్తున్నది.
 5. కోపతాపాలు ఎక్కువగా ఉన్నవారు అనేక విధాలుగా నష్టపోతారు.

Source : హదీథ్ – మొదటి స్థాయి (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  సయ్యద్ యూసుఫ్ పాషా

హిస్న్ అల్ ముస్లిం :(దుఆల పుస్తకం)

హిస్న్ అల్ ముస్లిం : (దుఆల పుస్తకం)
అరబీ మూలం: షేఖ్ సయీద్ బిన్ అలీ ఖహతాని  , అనువాదం: ఇఖ్బాల్ అహ్మద్
ప్రకాశకులు: అల్ ఫారూఖ్ పబ్లికేషన్స్ , కడప (ఏ.పి)

విషయ సూచిక
– తొలి పలుకులు
– దైవ నామ స్మరణ విశిష్టత
– నిద్ర నుండి మేల్కొన్నప్పుడు
– దుస్తులు  ధరించేటప్పుడు దుఆ
– నూతన వస్త్రాలు ధరించేటప్పుడు దుఆ
– నూతన వస్త్రాలు ధరించే వాని కోసం దుఆ
– దుస్తులు విడిచే టప్పుడు దుఆ
– మరుగు దొడ్డి లో ప్రవేశించే టప్పుడు దుఆ
– మరుగు దొడ్డి నుండి బయటకు వచ్చు నపుడు దుఆ
– వుజు కు ముందు దుఆ
– వుజు ముగించిన తర్వాత దుఆ
– ఇంటి నుండి బయలు దేరేటప్పుడు దుఆ
– ఇంటిలో ప్రవేశించే టప్పుడు దుఆ
– మస్జిద్ వైపు వెళ్ళేటప్పుడు దుఆ
– మస్జిద్ లో ప్రవేశించే టప్పుడు దుఆ
– మస్జిద్ నుండి వచ్చే టప్పుడు దుఆ
– అజాన్ సమయం లో దుఆ
– అజాన్ తర్వాత దుఆ
– నమాజ్ ప్రారంభించే టప్పుడు దుఆలు
– రుకు లో దుఆల
– రుకు నుండి లేచేటప్పుడు దుఆలు
– రెండు సజ్దాల మధ్య దుఆలు
– సజ్దా తిలావత్ లో దుఆలు
– తషహ్హుద్
– దైవ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) పై దరూద్
– సలాం కు ముందు దుఆలు
– సలాం తర్వాత దుఆలు
– ప్రతి నమాజు తర్వాతా దుఆలు
– నమాజే ఇస్తిఖార దుఆ
– ఉదయం సాయంత్రం దుఆలు
– సాయంత్రం పూట చదువ వలసిన దుఆలు , ఉదయం పూట వందసార్లు
– నిద్రించేటప్పుడు దుఆలు
– రాత్రి వేళ ప్రక్కకు ఒత్ట్టిగిల్లుతూ దుఆ
– నిద్రలో ఆందోళన లేక ఒంటరితనం భావించినపుడు దుఆ
– ఖునూతే వితర్ దుఆలు
– వితర్ నమాజులో సలాం తర్వాత
– బాదుషా చేసే జులుం పట్ల భయానికి దుఆ
– శత్రువుకి శాపనార్ధాలు
– ప్రజల వల్ల భయానికి దుఆ
– విశ్వాసం లో సందేహం కలిగి నప్పుడు
– అప్పులు తీర్చేందుకు దుఆ
– ఖురాన్ పఠనం , నమాజు సమయాలలో దురూహలు కలిగినప్పుడు
– సంకటం సమయం లో  దుఆ
– పాపానికి ఒడిగట్టిన తర్వాత
– షైతాను, వాడి దురూహల్ని దూరం చేసే దుఆ
– ఈ దుఆ ను వంద సార్లు  చేసే వ్యక్తి
– అవాంచనీయ సంఘటన, నిస్సహాయత లో దుఆ
– సంతానానికి శుభాకాంక్షలు అందుకు జవాబు
– పిల్లలను ఏ పదాలతో అల్లా రక్షణ లో ఇవ్వాలి
– రోగిని పరామర్శించడం లో రోగి కోసం దుఆ
– రోగిని పరామర్శించడం లోని మేలు
– ఆశ వదులుకున్న రోగి దుఆ
– మరణం సమీపించినప్పుడు దుఆ
– ఆపద లో చిక్కుకున్నప్పుడు దుఆ
– శవానికి కళ్ళు మూసేటప్పుడు దుఆ
– మృతుని కోసం జనాజా నమాజు లో దుఆ
– పిల్లవాని జనాజా నమాజు లో దుఆ
– సంతాపం లో దుఆ
– శవాన్ని సమాధిలో వుంచే సమయం లో దుఆ
– ఖబరస్తాన్ చూసినప్పుడు దుఆ
– గాలి దుమారం లో దుఆ
– మేఘ గర్జన లో దుఆ
– వర్షాన్ని కోరుతూ దుఆ
– వర్షం కురిసేటప్పుడు దుఆ
– వర్షం కురిసిన తర్వాత దుఆ
– ఆకాశం నిర్మలం అయ్యేందుకు దుఆ
– నెలవంక చూసినప్పుడు దుఆ
– రోజా, ఇఫ్తార్ సమయం లో దుఆ
– భోజనానికి ముందు దుఆ
– భోజనం ముగించిన తర్వాత దుఆ
– ఆతిధ్యం ఇచ్చిన వాని కోసం అతిధి చేసే దుఆ
– త్రాపించిన వాని కోసం దుఆ
– ఒకరి ఇంట ఇఫ్తార్ చేసినప్పుడు దుఆ
– ఉపవాసిని ఎవరైనా ఏమైనా తిడితే ఏమనాలి?
– మొదటి ఫలాన్ని చూసినప్పుడు దుఆ
– తుమ్మినప్పుడు దుఆ
– పెళ్లి చేసుకున్న వారి కోసం దుఆ
– పెళ్లి చేసుకున్నా , వాహనం ఖరీదు చేసినా  దుఆ
– భార్యను కలిసే ముందు దుఆ
– కోపం వచ్చినపుడు దుఆ
– భాధకు గురైన వానిని చూసినప్పుడు దుఆ
– సమావేశం లో దుఆ
– సమావేశం కఫ్ఫారా
– మేలు (సద్ వ్యవహారాణ) చేసిన  వారి కోసం దుఆ
– “నేను నిన్ను అల్లా కొరకు ప్రేమిస్తున్నాను” అనే వారి కోసం దుఆ
– సిరి సంపదలు సమర్పించే వాని కోసం దుఆ
– అప్పు తీర్చేటప్పుడు అప్పు ఇచ్చిన వాని కోసం దుఆ
– షిర్క్ పట్ల భయం తో దుఆ
– శుభం కోసం దుఆ చేసే వాని కోసం దుఆ
– దుశ్శకునాన్ని అసహ్యించుకునే దుఆ
– వాహనం పై కూర్చున్నప్పుడు దుఆ
– ప్రయాణం లో దుఆ
– నగరం లో లేక బస్తీ లో ప్రవేశించేటప్పుడు దుఆ
– బజారు లో ప్రవేశించినప్పుడు దుఆ
– వాహనం కదిలినప్పుడు దుఆ
– స్తానికుని కోసం బాటసారి దుఆ
– బాటసారి కోసం స్థానికుని దుఆ
– ప్రయాణం లో ఉదయం వేళ దుఆ
– ప్రయాణం లోను, ప్రయాణం లేకుండా ఒక చోట ఆగినప్పుడు దుఆ
– ప్రయాణం నుండి వచ్చిన తర్వాత దుఆ
– శుభవార్త లేక ఆందోళనకర వార్త విన్నప్పుడు ఏమి పలకాలి?
– కోడి కూసినప్పుడు, గాడిద ఓండ్ర పెట్టినప్పుడు దుఆ
– రాత్రుళ్ళు కుక్కలు మొరిగినప్పుడు దుఆ
– నీవు తిట్టినా వాని కోసం దుఆ
– ఒక ముస్లిం తనను గురుంచి ప్రశంస విన్నప్పుడు ఏమి చెయ్యాలి?
– హజ్, ఉమ్రా ళ కోసం ఇహ్రాం ధరించే వారు లబ్బైక్ ఎలా చెప్పాలి?
– రుకున్ యమని , హజారె అస్వద్ ల మధ్య దుఆ
– సఫా మర్వాల మధ్య ఆగినప్పుడు దుఆ
– అరఫా రోజు దుఆ
– సంతోషం అనుభవించే టప్పుడు దుఆ
– శరీరం లో బాధ అనిపిస్తే ఏమనాలి?
– ఆందోళన కలిగినప్పుడు దుఆ
– జిబహ్ చేసేటప్పుడు దుఆ
– తలబిరుసు సైతానుల వంచన, మోసాలనుంది రక్షణ పొందే దుఆ
– తౌబా
– హమ్ద్, సనా, తక్బీరు మరియు లా ఇలాహ ఇల్లలాహ్ యొక్క శ్రేష్థత
– బాఖియాతు స్సాలిహాత్
– వివిధ సత్కార్యాలు, సమగ్ర విధానాలు

హిస్న్ అల్ ముస్లిం : (దుఆల పుస్తకం)
అరబీ మూలం: షేఖ్ సయీద్ బిన్ అలీ ఖహతాని  , అనువాదం: ఇఖ్బాల్ అహ్మద్
ప్రకాశకులు: అల్ ఫారూఖ్ పబ్లికేషన్స్ , కడప (ఏ.పి)
——————————————
విషయ సూచిక
– తొలి పలుకులు
– దైవ నామ స్మరణ విశిష్టత
– నిద్ర నుండి మేల్కొన్నప్పుడు
– దుస్తులు  ధరించేటప్పుడు దుఆ
– నూతన వస్త్రాలు ధరించేటప్పుడు దుఆ
– నూతన వస్త్రాలు ధరించే వాని కోసం దుఆ
– దుస్తులు విడిచే టప్పుడు దుఆ
– మరుగు దొడ్డి లో ప్రవేశించే టప్పుడు దుఆ
– మరుగు దొడ్డి నుండి బయటకు వచ్చు నపుడు దుఆ
– వుజు కు ముందు దుఆ
– వుజు ముగించిన తర్వాత దుఆ
– ఇంటి నుండి బయలు దేరేటప్పుడు దుఆ
– ఇంటిలో ప్రవేశించే టప్పుడు దుఆ
– మస్జిద్ వైపు వెళ్ళేటప్పుడు దుఆ
– మస్జిద్ లో ప్రవేశించే టప్పుడు దుఆ
– మస్జిద్ నుండి వచ్చే టప్పుడు దుఆ
– అజాన్ సమయం లో దుఆ
– అజాన్ తర్వాత దుఆ
– నమాజ్ ప్రారంభించే టప్పుడు దుఆలు
– రుకు లో దుఆల
– రుకు నుండి లేచేటప్పుడు దుఆలు
– రెండు సజ్దాల మధ్య దుఆలు
– సజ్దా తిలావత్ లో దుఆలు
– తషహ్హుద్
– దైవ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) పై దరూద్
– సలాం కు ముందు దుఆలు
– సలాం తర్వాత దుఆలు
– ప్రతి నమాజు తర్వాతా దుఆలు
– నమాజే ఇస్తిఖార దుఆ
– ఉదయం సాయంత్రం దుఆలు
– సాయంత్రం పూట చదువ వలసిన దుఆలు , ఉదయం పూట వందసార్లు
– నిద్రించేటప్పుడు దుఆలు
– రాత్రి వేళ ప్రక్కకు ఒత్ట్టిగిల్లుతూ దుఆ
– నిద్రలో ఆందోళన లేక ఒంటరితనం భావించినపుడు దుఆ
– ఖునూతే వితర్ దుఆలు
– వితర్ నమాజులో సలాం తర్వాత
– బాదుషా చేసే జులుం పట్ల భయానికి దుఆ
– శత్రువుకి శాపనార్ధాలు
– ప్రజల వల్ల భయానికి దుఆ
– విశ్వాసం లో సందేహం కలిగి నప్పుడు
– అప్పులు తీర్చేందుకు దుఆ
– ఖురాన్ పఠనం , నమాజు సమయాలలో దురూహలు కలిగినప్పుడు
– సంకటం సమయం లో  దుఆ
– పాపానికి ఒడిగట్టిన తర్వాత
– షైతాను, వాడి దురూహల్ని దూరం చేసే దుఆ
– ఈ దుఆ ను వంద సార్లు  చేసే వ్యక్తి
– అవాంచనీయ సంఘటన, నిస్సహాయత లో దుఆ
– సంతానానికి శుభాకాంక్షలు అందుకు జవాబు
– పిల్లలను ఏ పదాలతో అల్లా రక్షణ లో ఇవ్వాలి
– రోగిని పరామర్శించడం లో రోగి కోసం దుఆ
– రోగిని పరామర్శించడం లోని మేలు
– ఆశ వదులుకున్న రోగి దుఆ
– మరణం సమీపించినప్పుడు దుఆ
– ఆపద లో చిక్కుకున్నప్పుడు దుఆ
– శవానికి కళ్ళు మూసేటప్పుడు దుఆ
– మృతుని కోసం జనాజా నమాజు లో దుఆ
– పిల్లవాని జనాజా నమాజు లో దుఆ
– సంతాపం లో దుఆ
– శవాన్ని సమాధిలో వుంచే సమయం లో దుఆ
– ఖబరస్తాన్ చూసినప్పుడు దుఆ
– గాలి దుమారం లో దుఆ
– మేఘ గర్జన లో దుఆ
– వర్షాన్ని కోరుతూ దుఆ
– వర్షం కురిసేటప్పుడు దుఆ
– వర్షం కురిసిన తర్వాత దుఆ
– ఆకాశం నిర్మలం అయ్యేందుకు దుఆ
– నెలవంక చూసినప్పుడు దుఆ
– రోజా, ఇఫ్తార్ సమయం లో దుఆ
– భోజనానికి ముందు దుఆ
– భోజనం ముగించిన తర్వాత దుఆ
– ఆతిధ్యం ఇచ్చిన వాని కోసం అతిధి చేసే దుఆ
– త్రాపించిన వాని కోసం దుఆ
– ఒకరి ఇంట ఇఫ్తార్ చేసినప్పుడు దుఆ
– ఉపవాసిని ఎవరైనా ఏమైనా తిడితే ఏమనాలి?
– మొదటి ఫలాన్ని చూసినప్పుడు దుఆ
– తుమ్మినప్పుడు దుఆ
– పెళ్లి చేసుకున్న వారి కోసం దుఆ
– పెళ్లి చేసుకున్నా , వాహనం ఖరీదు చేసినా  దుఆ
– భార్యను కలిసే ముందు దుఆ
– కోపం వచ్చినపుడు దుఆ
– భాధకు గురైన వానిని చూసినప్పుడు దుఆ
– సమావేశం లో దుఆ
– సమావేశం కఫ్ఫారా
– మేలు (సద్ వ్యవహారాణ) చేసిన  వారి కోసం దుఆ
– “నేను నిన్ను అల్లా కొరకు ప్రేమిస్తున్నాను” అనే వారి కోసం దుఆ
– సిరి సంపదలు సమర్పించే వాని కోసం దుఆ
– అప్పు తీర్చేటప్పుడు అప్పు ఇచ్చిన వాని కోసం దుఆ
– షిర్క్ పట్ల భయం తో దుఆ
– శుభం కోసం దుఆ చేసే వాని కోసం దుఆ
– దుశ్శకునాన్ని అసహ్యించుకునే దుఆ
– వాహనం పై కూర్చున్నప్పుడు దుఆ
– ప్రయాణం లో దుఆ
– నగరం లో లేక బస్తీ లో ప్రవేశించేటప్పుడు దుఆ
– బజారు లో ప్రవేశించినప్పుడు దుఆ
– వాహనం కదిలినప్పుడు దుఆ
– స్తానికుని కోసం బాటసారి దుఆ
– బాటసారి కోసం స్థానికుని దుఆ
– ప్రయాణం లో ఉదయం వేళ దుఆ
– ప్రయాణం లోను, ప్రయాణం లేకుండా ఒక చోట ఆగినప్పుడు దుఆ
– ప్రయాణం నుండి వచ్చిన తర్వాత దుఆ
– శుభవార్త లేక ఆందోళనకర వార్త విన్నప్పుడు ఏమి పలకాలి?
– కోడి కూసినప్పుడు, గాడిద ఓండ్ర పెట్టినప్పుడు దుఆ
– రాత్రుళ్ళు కుక్కలు మొరిగినప్పుడు దుఆ
– నీవు తిట్టినా వాని కోసం దుఆ
– ఒక ముస్లిం తనను గురుంచి ప్రశంస విన్నప్పుడు ఏమి చెయ్యాలి?
– హజ్, ఉమ్రా ళ కోసం ఇహ్రాం ధరించే వారు లబ్బైక్ ఎలా చెప్పాలి?
– రుకున్ యమని , హజారె అస్వద్ ల మధ్య దుఆ
– సఫా మర్వాల మధ్య ఆగినప్పుడు దుఆ
– అరఫా రోజు దుఆ
– సంతోషం అనుభవించే టప్పుడు దుఆ
– శరీరం లో బాధ అనిపిస్తే ఏమనాలి?
– ఆందోళన కలిగినప్పుడు దుఆ
– జిబహ్ చేసేటప్పుడు దుఆ
– తలబిరుసు సైతానుల వంచన, మోసాలనుంది రక్షణ పొందే దుఆ
– తౌబా
– హమ్ద్, సనా, తక్బీరు మరియు లా ఇలాహ ఇల్లలాహ్ యొక్క శ్రేష్థత
– బాఖియాతు స్సాలిహాత్
– వివిధ సత్కార్యాలు, సమగ్ర విధానాలు

కాలకృత్యాలు తీర్చుకునే పద్ధతి (Dua while entering and exiting from toilet)

హదీథ్׃ 08

آداب قضاء الحاجةకాలకృత్యాలు తీర్చుకునే పద్ధతి

عن  أنس بن مالك رضي الله عنه قال: كان النبي r إذا دخلَ الخلاء قال: اللهمّ إني أعوذ بك منَ الخُبثِ والخبائث». رواه البخاري

عن عائشةَ رضي الله عنه , أنّ النبيّ rكانَ إذا خَرَجَ مِنَ الخلاءِ قالَ: «غُفْرَانَكَ». رواه الترمذي وغيره

అన్ అనసిబ్ని మాలికిన్ రదియల్లాహు అన్హు ఖాల కానన్నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లం – ఇదా దఖలల్ ఖలాఅ, ఖాల అల్లాహుమ్మ ఇన్ని అఊదుబిక మినల్ ఖుబ్థి వల్ ఖబాయిథ్ – రవాహుల్ బుఖారి.

అనువాదం:- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలకృత్యాలు తీర్చుకోవటానికి వెళ్ళినప్పుడు, ఇలా ప్రార్ధించేవారు, అల్లాహ్ నేను మగ దుష్ట శక్తులు మరియు ఆడ దుష్టశక్తుల నుండి నీ శరణు వేడుకుంటున్నాను.

ఇదే విషయం పై ఆయెషా రదియల్లాహు అన్హా ఉల్లేఖించిన ఇంకో హదీథ్ లో ఇలా తెలుపబడినది –  కాలక్రుత్యాలు తీర్చుకుని బయటకి వచ్చినప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం “గుఫ్రానక అంటే మేము నీ యొక్క మన్నింపును కోరుతున్నాము” అని పలికేవారు.

హదీథ్ ను ఉల్లేఖించినవారి పరిచయం:- ఈ హదీథ్ ను ఉల్లేఖించిన వారి పేరు అనస్ ఇబ్నె మాలిక్ రదియల్లాహి అన్హు. వీరు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) సేవలో తన జీవితాన్ని గడిపారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) యొక్క హదీథ్ లు ఎక్కువగా ఉల్లేఖించిన వారిలో వీరి పేరు కూడా ఉంది.

వివరణ: బహిర్భూమి కోసం (టాయిలెట్ -హమామ్) వెళ్ళే ముందు పైన తెలిపిన ప్రార్థన చేయవలెను. ఇంకా ప్రయాణంలో, ఎడారి ప్రాంతాలలో, పొలాల్లో, మైదానాలలో లేక పల్లెటూర్లలో అంటే ఆధునిక యుగపు టాయిలెట్ లు లేనిచోట బహిర్భూమికి వెళ్ళేటప్పుడు కూడా పైన తెలిపిన ప్రార్థన చేయవలెను. దీనికి కారణం మానవుడికి కీడు చేసే దుష్టశక్తులు అన్నిచోట్లా ఉంటాయి. అనస్ రదియల్లాహు అన్హు హదీథ్ ద్వారా మనకు తెలిసేదేమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం బిగ్గరగా పై ప్రార్థన (దుఆ) చేసేవారు కాబట్టి మనం కూడా పైకి వినబడే విధంగా ప్రార్థన చేయవలెను. ఈ ప్రార్థన ద్వారా మానవుడికి కీడు చేయగలిగే మరియు మానవులకు కనబడని మగ, ఆడ జిన్నాతుల వంటి దుష్టశక్తుల నుండి మనం అల్లాహ్ యొక్క శరణు కోరుకుంటున్నాము. మరియు కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆ సమయంలో ఏమైనా పొరపాట్లు, తప్పులు జరిగినట్లయితే, వాటిని మన్నింపమని అల్లాహ్ ను వేడుకుంటున్నాము.

Source : హదీథ్ – మొదటి స్థాయి (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  సయ్యద్ యూసుఫ్ పాషా

అభివాదము & అన్నదానం యొక్క ఔన్నత్యం (Greeting with Salam & Feeding Poor)

హదీథ్ :׃ 07

فضل السلام والأمر بإفشائه అభివాదము & అన్నదానం యొక్కన్నత్యం

عَنْ عَبْدِاللهِ بْنِ  عَمْرٍو (رضي الله أَنهُ)  أَنَّ رَجُلاً سَأَلَ رَسُوْلَ اللهِ  ^ :

أَىُّ الإِسْلاَمِ خَيْرٌ ؟   قَالَ تُطْعِمُ الطَّعَامَ  وَ تَقْرَأُ السَّلَامَ  عَلَى مَنْ عَرَفْتَ وَ مَنْ لَـمْ تَعَرِفْ (رواه البخارى)

అన్ అబ్దిల్లాహ్ ఇబ్నె అమర్ బిన్ అల్ ఆస్ రదియల్లాహు అన్హుమా అన్న రజులన్ సఅల రసూలుల్లాహి సల్లల్లాహుఅలైహివసల్లం య్యుల్ ఇస్లామి ఖైర్?” ఖాల “తుత్ఇముత్తఆమ వ తఖ్రవుస్సలామ అలా మన్ అరఫ్త వ మల్లమ్ తఆరిఫ్ రవాహ్ అల్ బుఖారి

తాత్పర్యం:- అన్ = ఉల్లేఖన, అబ్దిల్లాహ్ ఇబ్నె అమర్ బిన్ అల్ ఆస్ = అమర్  బిన్ అల్ ఆస్ కుమారుడు అబ్దుల్లాహ్, రదిఅల్లాహు అన్హుమా = అల్లాహ్ వారితో ఇష్టపడుగాక, అన్న= ఖచ్ఛితంగా, రజులన్ = ఓ వ్యక్తి,  సఅల = ఇలా ప్రశ్నించాడు, రసూలుల్లాహి = అల్లాహ్ యొక్క సందేశహరుడు (సల్లల్లాహు అలైహి వసల్లమ్)తో, అయ్యు = ఏది, అల్ ఇస్లామి = ఇస్లాంలో,  ఖైర్ = ఉత్తమమైనది? ఖాల = తెలిపారు (ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్),  తుత్ఇముత్తఆమ = నీవు భోజనం చేయించు(అన్నంపెట్టు), వ = మరియు, తఖ్రవు = నీవు చదువు (చేయుము), అస్సలామ = సలాం(అభివాదం), అలా = పైన, మన్ = ఎవరైతే,  అరఫ్త = నీకు పరిచయం ఉన్నారో, వ = మరియు, మన్ = ఎవరైతే, లమ్ తఆరిఫ్ = నీకు అపరిచితులో. రవాహ్అల్ బుఖారి=సహీబుఖారి హదీథ్ గ్రంథంలో రికార్డు చేయబడినది.

అనువాదం:- అబ్దిల్లాహ్ ఇబ్నె అమ్ర్ బిన్ అల్ ఆస్ రదియల్లాహు అన్హుమా ఇలా ఉల్లేఖించారు – ఒక వ్యక్తి ప్రవక్త(ముహమ్మద్)సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇలా ప్రశ్నించాడు స్లాంలో న్నింటికంటే త్తమైన విషయం ఏది? ప్రవక్త (సల్లల్లాహుఅలైహి వసల్లం) ఇలా జవాబిచ్చారు నీవు అన్నం తినిపించు. మరియు నీవు సలాం చేయి, తెలిసిన వారికైనా మరియు తెలియనివారికైనా సరే సహీబుఖారి అనే హదీథ్ గ్రంథంలో రికార్డుచేయబడినది.

వివరణ:- అల్ సలామ్ (శాంతి) అనేది అల్లాహ్ యొక్క అనేక శుభనామాలలో ఒకటి. అస్సలాము (మీపై శాంతి కురువుగాక) అనడం అంటే మీరు అల్లాహ్ రక్షణలో శాంతిగా ఉండమని అర్ధం లేదా అల్లాహ్ సాంగత్యంలో మీరు ఉండండి అని అర్ధం. ఆ విధంగానే, ఆకలితో ఉన్నవారికి, పేదవారికి, ఏ ఆధారంలేని వారికి (దిక్కులేనివారికి) అన్నంపెట్టడం అలాగే వారి అవసరాలలో, ఆపత్సమయాల్లో ఆదుకోవడం అనేది ఉన్నతమైన గుణాలలో, ఉత్తమమైన సంస్కారాలలో లెక్కించ బడును. అలాగే మనకు పరిచయం ఉన్న వారికైనా, లేనివారికైనా అభివాదం చేస్తూ “అస్సలాము అలైకుమ్” అనడం (అంటే వారిపై అల్లాహ్ యొక్క శాంతి కురవాలని – వారు అల్లాహ్ రక్షణలో, ప్రశాంతంగా, క్షేమంగా ఉండాలని కోరుకోవడం) ఉన్నతమైన సుగుణం. పై హదీథ్ లో సూచించబడిన ఈ రెండు పనులు (అన్నార్తులకు అన్నం పెట్టడం, ఇతరులకు అభివాదం చేయడం) సమాజంలో పరస్పర ప్రేమాభిమానాలను పెంపొందించి, పగ, ద్వేషం, వైరభావం, ఒకరిపట్ల మరొకరిలో దురాలోచనలను దూరం చేస్తాయి. ఎటువంటి అభివాదం కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన “అస్సలాము అలైకుమ్”  అనే అభివాదానికి సరితూగదు, ప్రత్యామ్నాయం అసలే కాజాలదు.

సలాం చేసే విధానం:- మూడురకాలుగా సలాం చేస్తుండడం మనం గమనిస్తుంటాము.

1. అస్సలాము అలైకుమ్
మీ పై అల్లాహ్ యొక్క శాంతి (వర్షించు) అవతరించుగాక
2. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్
మీ పై అల్లాహ్ యొక్క శాంతి మరియు కరుణ (వర్షించు) అవతరించుగాక
3. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతహు
మీ పై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు ఆశీర్వాదం (వర్షించు) అవతరించుగాక

అల్లాహ్ వద్ద అన్నింటికంటే ఎక్కువ పుణ్యాన్ని (ప్రతిఫలాన్ని) ఆర్జించి పెట్టేది పైన తెలిపిన వాటిలో మూడవ విధంగా (సంపూర్ణంగా) అభివాదం చేయడం.

ఈ హదీథ్ అమలు చేయడం వలన కలిగే లాభాలు׃

 1. సలాం చేయడమనేది ఐచ్ఛికమైన విషయం కానీ జవాబుగా ప్రతి సలాం చేయడం విధి తప్పనిసరి బాధ్యత.
 2. పాశ్చాత్య విధానంలో లాగా గుడ్ మార్నింగ్” లేదా గుడ్ ఈవినింగ్ అనడం ఎంతమాత్రమూ ఇస్లామిక్ అభివాదం కాదు.
 3. మనకు పరిచయం ఉన్న వారికైనా, లేనివారికైనా సలాం చేసే అలవాటును  అలవరచుకోవాలి.
 4. ఎదుటి వ్యక్తి మన శబ్దం వినలేనంత దూరంలో ఉన్నట్లైతే సలాం యొక్క పదాలను (ఉదా,, అస్సలాము అలైకుమ్ లేదా  అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్ లేదా అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతహు) ఉచ్ఛరిస్తూ (పలుకుతూ) చేయి పైకెత్తి సంజ్ఞ ద్వారా సలాం చేయవచ్చును.
 5. ఫోన్లో ముందుగా సలాంచేసి, తర్వాత మాటలు ప్రారంభించటం అలవర్చుకోవాలి
 6. ఎవరివద్దనైనా సెలవు తీసుకుంటున్నప్పుడు సలాం చేస్తూ సెలవు తీసుకోవడం అలవర్చుకోవాలి.
 7. పేదవారికి, అన్నార్తులకు  సహాయం చేయడాన్ని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన విధంగా సలాం (అభివాదం) చేయడాన్ని విధిగా  ప్రోత్సహించాలి.

హదీథ్ ఉల్లేఖించినవారి పరిచయం:- అబ్దుల్లాహ్ ఇబ్నె అమర్ బిన్ అల్ ఆస్ బిన్ వాయల్ అస్సహామి రదియల్లాహు అన్హుమా ఖురైష్ వంశస్థులు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తాతగారైన కాబ్ బిన్ లోయి మరియు అబ్దుల్లాఇబ్నె అమర్ తాతగారు ఒక్కరే. తొలికాలంలోనే ఇస్లాం స్వీకరించారు. ఎక్కువ హదీసులు ఉల్లేఖించిన వారిలో వీరు కూడా ఒకరు.

ప్రశ్నలు

1. “ఇస్లాంలో అన్నింటికంటే ఉత్తమమైనది ఏది?” ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహి వసల్లం ఇలా జవాబిచ్చారు________,_______ మీకు తెలిసినవారైనా, తెలియనివారైనా కూడా”
2. అన్నార్తులకు, పేదవారికి అన్నం పెట్టడం, పరిచయం ఉన్నవారికీ లేనివారికీ కూడా అభివాదం చేయడం సమాజంలో _________________ పెంపొందించి & పగ, ద్వేషం, వైరభావం, ఒకరిపట్ల మరొకరిలో _________________ దూరం చేస్తాయి
3. సలాం చేయడం లోని మూడు విధానాలు?
a)
b)
c)
4. సలాం చేయడం అనేది __________ కానీ జవాబుగా ప్రతి సలాము చేయడం ________ తప్పనిసరి బాధ్యత.
5. పాశ్చాత్య విధానంలో లాగా “గుడ్ మార్నింగ్” లేదా “గుడ్ ఈవినింగ్” అనడం ఎంతమాత్రమూ ____________  అభివాదం కాదు
6. మనకు పరిచయం ఉన్న______,_______ సలాం చేయడం మనం అలవరచుకోవాలి
7. మనం సలాం చేస్తున్న వ్యక్తి మన శబ్దం వినలేనంత దూరంలో ఉన్నట్లైతే సలాము యొక్క పదాలను ఉచ్ఛరిస్తూ (పలుకుతూ) _____________________  సలాం చేయవచ్చును.
8. _______________సహాయం చేయడాన్ని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన విధంగా ____________ చేయడాన్ని విధిగా  ప్రోత్సహించాలి.
9. అబ్దిల్లాహ్ ఇబ్నె అమర్ బిన్ ఆస్ రదియల్లాహు అన్హుమా గురించి వ్రాయండి.

Source : హదీథ్ – మొదటి స్థాయి (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  సయ్యద్ యూసుఫ్ పాషా

సయ్యదుల్ ఇస్తగ్ ఫార్ (పాప క్షమాపణ దుఆ)

Most Superior way of asking for  Forgiveness from Allah :

అల్లాహుమ్మ అన్ త  రబ్బీ లా ఇలాహ ఇల్లా  అన్ త   ఖలఖ్ తనీ వ అనా అబ్దుక , వ అనా అలా  అహ్ దిక వ వదిక  మస్త తాతు అవూజు బిక మిన్ షర్రి మా సనతు అబూ లక  బి నియ్ మతిక అలయ్య వ అబూ  ఉ బిజన్ బీ  ఫగ్ ఫిర్ లీ ఫ ఇన్నహూ లా యగ్ ఫిరుజ్జునూబ ఇల్లా అన్ త. (సహీ బుఖారి  Vol.8 హదీత్  no:318)

ఓ  అల్లా : !  నీవే నా పోషకుడవు . నీవు తప్ప ఆరాధ్యుడు ఎవరూ లేరు . నీవే నన్ను పుట్టిం చావు . నేను నీ దాసుడను . సాధ్యమైనంత వరకు నీ వాగ్దానానికి కట్టుబడి ఉన్నాను. నా కర్మల దోషం నుండి నీ శరణు కోరుతున్నాను . నీ అనుగ్రహాలను అంగీకరిస్తున్నాను . నా పాపాలను అంగీకరిస్తున్నాను. నీవు నన్ను మన్నించు . నిశ్చయంగా పాపాలను మన్నించే వాడవు నీవే .

ప్రాముఖ్యత :

సయ్యదుల్  ఇస్తగ్ ఫార్ గురించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం సెలవిచ్చారు . ” దీనిని సాయంత్రం  చదివిన వ్యక్తి  అదే సాయంత్రం మరణిస్తే , అతడు స్వర్గంలో  ప్రవేశిస్తాడు. అదే విధంగా ఉదయం గనుక  చదివి ఉదయాన్నే మరణిస్తే అతడు స్వర్గానికి వెళతాడు .

"అల్లాహ్" అనే పదానికి అర్ధం ఏమిటి ?

Is Allah only muslim’s God? అల్లాహ్  ముస్లింలకు మాత్రమె దేవుడా ?

Published in Nelavanka magazine , written by Hafiz S.M.Rasool

సత్యం పలకటాన్ని ప్రోత్సహించటం-అసత్యం పలకటాన్ని నిరోధించటం

హదీథ్׃ 06

التَّرغيب في الصَّدق والتَّحذير من الكذب

عَنْ عَبْدِاللهِ بْنِ مَسْعُوْدْ  رَضِي الله عَنْهُ قَالَ:قَالَ رَسُوْلُ اللهِ صَلَّى اللهُ عَلَيهِ وَسَلَّمْ  ” عَلَيْكُمْ بِا لصِّدْقِ فَإِنَّ  الصِّدْقَ يـَهْدِيْ إِلَى الْبِرَّ، وَ إِنَّ الْبِرَّ يَـهْدِيْ إِلَى الْـجَنَّةِ، وَمَا  يَزَالُ الرَّجُلُ يَصْدُقُ وَيَتَحَرَّى  الصِّدْقَ حَتَّى يُكْتَبَ عِنْدَاللِه صِدِّيْقًا، وَ اِيَّاكُمْ وَالْكَذِبَ فَإِنَّ  الْكَذِبَ يَـهْدِيْ إِلَى الْفُجُوْرِ وَإِنَّ الْفُجُوْرَ يَـهْدِيْ إِلَى الْنَّارِ وَمَا يَزَالُ الرَّجُلُ يَكْذِبَ وَ يَتَحَرَّى الْكَذِبُ حَتَّى يُكْتَبَ عِنْدَاللِه  كَذَّابًا   ” رواه مسلم

అన్ అబ్దుల్లాహ్ ఇబ్నె మస్ఊద్ రదియల్లాహు అన్హు ఖాల : ఖాల రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం “అలైకుమ్ బిశ్శిద్ఖి ఫఇన్న శ్శిద్ఖ యహ్దీ ఇలల్ బిర్ర్, వ ఇన్నల్ బిర్ర యహ్దీ ఇలల్ జన్న, వ మా యజాలుర్రజులు యుశ్దుఖు వ యతహర్ర శ్శిద్ఖ హత్తా యుక్తబ ఇందల్లాహి శిద్ధీఖా, వ ఇయ్యాకుమ్ వల్ కదిజిబ ఫఇన్నల్ కదిబ యహ్దీ ఇలల్ ఫుజూరి, వ ఇన్నల్ ఫుజూర యహ్దీ ఇలన్నారి, వ మా యజాలు ర్రజులు యక్ దిబ వ యతహర్రల్  కదిబు హత్తా యుక్తబ ఇందల్లాహి కద్దాబ” రవాహ్ ముస్లిం

తాత్పర్యం : – అన్ = ఉల్లేఖించారు, అబ్దుల్లాహ్ ఇబ్నె మస్ఊద్ = మసూద్ కుమారుడు అబ్దుల్లాహ్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం  యొక్క సహచరుడు. రదియల్లాహు అన్హు = అల్లాహ్ వారిని స్వీకరించుగాక, ఖాల = చెప్పారు, ఖాల రసూలల్లాహ్ =  ప్రవక్త తెలిపారు, అలైకుమ్ = మీ పై, బిశ్శిద్ఖి = సత్యం పలకటం (విధిగా చేయబడినది), ఇన్నశ్శిద్ఖ = నిశ్చయంగా ఈ సత్యశీలగుణం (నిజం పలికే అలవాటు), యహ్దీ = దారిచూపటం, ఇల = వైపుకు, అల్ బిర్ర్ = పుణ్యకార్యాలు, వ = మరియు, ఇన్నల్ బిర్ర = నిశ్చయంగా ఈ పుణ్యకార్యాలు, యహ్దీ = దారి చూపటం, ఇలల్ జన్న = స్వర్గం వైపుకు, వ = మరియు, మా = ఎవరైతే, యŸజాలుర్రజుల = అప్పటి వరకు, యుశ్దుఖు = సత్యమే పలుకుతుండును, హత్తా = వరకు, యుక్తబ = వ్రాయబడును, ఇందల్లాహి = అల్లాహ్ దగ్గర,  శిద్ధీఖా = సత్యవంతుడుగా, వ = మరియు, ఇయ్యాకుమ్ = మీరు ఎట్టిపరిస్థితులలోను , వల్ కదిబ = అసత్యం పలకవద్దు,  ఇన్నల్ కదిబ = నిశ్చయంగా ఈ  అసత్యం పలికే గుణం (అబద్ధం చెప్పే అలవాటు), యహ్దీ = దారి చూపటం, ఇల = వైపుకు, అల్ ఫుజూర్ = పాపాల , వ = మరియు, ఇన్న = నిశ్చయంగా, అల్ ఫుజూర = ఈ పాపాలు, యహ్దీ = దారి చూపటం, ఇల = వైపుకు, అన్నార్ = నరకాగ్ని, వ = మరియు, మా = ఎవరైతే, యŸజాలుర్రజుల = అప్పటి వరకు, యక్ దిబ = అబద్ధాలే చెప్తుండును, హత్తా = వరకు, యుక్తబ = వ్రాయబడును, ఇందల్లాహి = అల్లాహ్ దగ్గర, కద్దాబ = అసత్యవాదిగా.

అనువాదం :- అబ్దుల్లాహ్ ఇబ్నె మస్ఊద్ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు “మీ పై సత్యం పలకటం తప్పనిసరి చేయబడినది. సత్యశీలగుణం పుణ్యకార్యాల వైపునకు దారి చూపుతుంది మరియు పుణ్యకార్యాలు స్వర్గం వైపునకు దారి చూపుతాయి మరియు ఎవరైనా ఎల్లప్పుడూ సత్యమే పలుకుతున్నట్లయితే, అల్లాహ్ దగ్గర అతడి పేరు సత్యవంతుడిగా వ్రాయబడే వరకూ అతడు సత్యమే పలుకుతాడు. మరియు మీరు ఎట్టి పరిస్థితిలోను అబద్ధం పలకవద్దు. అసత్యం పలికే గుణం పాపపు పనుల వైపునకు దారి చూపుతుంది, మరియు పాపపు పనులు నరకాగ్ని వైపునకు దారి చూపుతాయి మరియు ఎవరైనా ఎల్లప్పుడూ అసత్యమే(అబద్ధం) పలుకుతూ ఉన్నట్లయితే, అల్లాహ్ దగ్గర అతడి పేరు అసత్యవంతుడి (బొంకరి) గా వ్రాయబడే వరకూ అతడు అసత్యమే పలుకుతాడు.”  బుఖారి మరియు ముస్లిం.

వివరణ :- ఎవరైనా ఎల్లప్పుడూ నిజం పలుకుతున్నట్లైతే, అతని గుణగణాలలో సత్యం పలికే మంచిగుణం చేరిపోతుంది మరియు ఎవరైనా ఎల్లప్పుడూ కావాలని అబద్ధం పలుకుతున్నట్లైతే, అతని గుణగణాలలో అసత్యం పలికే గుణం చేరిపోతుందనేది ఈ హదీథ్ ద్వారా సూచింపబడుతుంది.  కాబట్టి మంచి, చెడు గుణాలు మన నడవడికను బట్టి, మనం చేసే అమలును బట్టి అలవడతాయి. ఇంకా సత్యశీలమైన ప్రవర్తన స్వర్గానికి చేర్చుతుందనీ, విశ్వాసహీనమైన (అసత్యమైన) ప్రవర్తన నరకానికి చేర్చుతుంది.

ఈ హదీథ్ అమలు చేయటం వలన కలిగే లాభాలు :-

 1. ఎల్లప్పుడూ సత్యం పలకడమనే మంచి గుణం వైపునకు ఇస్లాం ధర్మం పిలుస్తుంది
 2. మన మాటలు మన విశ్వాసాన్ని నిరూపించేవిగా ఉండాలని ఇస్లాం నిర్ధేశిస్తున్నది.
 3. స్వర్గానికి చేరే మార్గాలలో సత్యం పలకటం అనేది కూడా ఒక దారి
 4. ఎల్లప్పుడూ సత్యాన్ని పలికే విశ్వాసిని ప్రజలు మరియు అల్లాహ్ ప్రేమిస్తారు.
 5. మనతో పనిచేసే వారిని, స్నేహితులను సత్యవంతులుగా మారటానికి హితబోధ చేస్తూ, వారిని భయంకరమైన నరకాగ్ని నుండి రక్షించే ప్రయత్నం చేయవలెను
 6. అబద్ధం చెప్పటాన్ని ఇస్లాం నిషేధిస్తున్నది
 7. అసత్యవంతులకు అబద్ధాలు చెప్పే చెడు అలవాటును వదిలివేయమని  సలహా ఇవ్వటం మన బాధ్యత. అసత్యం పలికే అలవాటు నరకానికి చేరవేస్తుంది.

హదీథ్  ఉల్లేఖించినవారి పరిచయం׃

వీరి పూర్తి పేరు అబు అబ్దుర్రహ్మాన్ అబ్దుల్లాహ్ ఇబ్నె మస్ఊద్ రదియల్లాహు అన్హు. ప్రారంభకాలంలోనే ఇస్లాం స్వీకరించారు. ఆనాటి ప్రసిద్థి చెందిన ఇస్లాం ధర్మవేత్తలు, పండితులు మరియు జ్ఞానవంతులలో వీరొకరు. స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి దాదాపుగా 70 దివ్యఖుర్ఆన్ అధ్యాయాలు (సూరాలు) కంఠస్థం చేశారు. 60యేళ్ళ వయసులో హిజ్రీ 32 వ సంవత్సరం మదీనా లో మరణించారు.

ప్రశ్నలు

1.  “అలైకుమ్ బిశ్శిద్ఖి ఫఇన్న శ్శిద్ఖ యహ్దీ ఇలల్ ________, వ ఇన్నల్ బిర్ర యహ్దీ ఇలల్ ________, వ మా యŸజాలుర్రజులు యుశ్దుఖు వ యతహర్ర శ్శిద్ఖ హత్తా యుక్తబ ఇందల్లాహి ________, వ ఇయ్యాకుమ్ వల్ కదిబ ఫఇన్నల్ కదిబ యహ్దీ ఇలల్ ________, వ ఇన్నల్ ఫుజూర యహ్దీ ఇల________, వ మా యŸజాలు ర్రజులు యక్ ది బ వ యతహర్రల్  కదిబు హత్తా యుక్తబ ఇందల్లాహి ________”

2.  “మీ పై సత్యం పలకటం_______చేయబడినది. సత్యశీలగుణం _______కార్యాల వైపునకు దారి చూపుతుంది మరియు పుణ్యకార్యాలు ________ వైపునకు దారి చూపుతాయి మరియు ఎవరైనా ఎల్లప్పుడూ సత్యమే పలుకుతున్నట్లయితే, అల్లాహ్ దగ్గర అతడి పేరు ________గా వ్రాయబడతాడు. మరియు మీరు ఎట్టి పరిస్థితిలోను ______పలకవద్దు.

3.  ఎవరైనా ఎల్లప్పుడూ నిజం పలుకుతున్నట్లైతే, అతని గుణగణాలలో సత్యం పలికే ________చేరిపోతుంది మరియు ఎవరైనా ఎల్లప్పుడూ కావాలని అబద్ధం పలుకు తున్నట్లైతే, అతని గుణగణాలలో ________పలికే గుణం చేరిపోతుంది.

4.  మంచి, చెడు గుణాలు  _______బట్టి, మనం చేసే పనులను బట్టి అలవడతాయి.

5.  సత్యశీలమైన ప్రవర్తన ________ చేర్చుతుందనీ, విశ్వాసహీనమైన (అసత్యవంతమైన) ప్రవర్తన ________ చేర్చుతుంది.

6.  ఎల్లప్పుడూ______పలకడమనే మంచి గుణం వైపునకు ఇస్లాం ధర్మం పిలునిస్తుంది.

Source : హదీథ్ – మొదటి స్థాయి (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  సయ్యద్ యూసుఫ్ పాషా

ఇస్లాం ధర్మంలో తుమ్మినప్పుడు ఆచరించవలసిన పధ్దతి

హదీథ్׃ 05

من آداب العطاس ఇస్లాం ధర్మంలో తుమ్మినప్పుడు ఆచరించవలసిన పధ్దతి

عن أبي هريرةَ رضيَ الله عنه عنِ النبيّ صلى الله عليه وسلم قال: إذا عطَسَ أحدُكم فليقل الحمد لله, وليقلْ له أخوه أو صاحبه ـ يَرحمكَ الله, فإذا قال له يَرحمكَ الله, فليقل: يَهديكُم الله ويُصلحُ بالكم) .رواه البخاري .

అన్ అబీ హురైరత రదియల్లాహు అన్హు, అనిన్నబియ్యి సల్లల్లాహు అలైహి వసల్లం ఖాల – ఇదా అతస అహదుకుమ్ ఫల్ యఖుల్ అల్ హదులిల్లాహ్, వల్ యఖూలల్లాహు అఖూహు అవ్ సాహిబహు యర్ హమకల్లాహ్, ఫఇదా ఖాల లహు యర్ హమకల్లాహ, ఫల్ యఖుల్ యహ్ దీ కుముల్లాహ్ వ యుశ్ లిహు బాలకుమ్ బుఖారి.

అనువాదం: మీలో ఎవరైనా ఒకవేళ తుమ్మినప్పుడు, అల్ హందులిల్లాహ్ అని పలకవలెను. మరియు అతని దగ్గరున్న సోదరుడు గాని లేదా మిత్రుడు గాని జవాబుగా అతడి కోసం యర్ హమకల్లాహ్ అని పలకవలెను. అలా యర్ హమకల్లాహ్ అని పలికినప్పుడు, తుమ్మినతడు బదులుగా వారికోసం యహ్ దీ కుముల్లాహ్ వ యుశ్ లిహు బాలకుమ్ అని పలకవలెను.

హదీథ్ ఉల్లేఖించినవారి పరిచయం:- అబుహురైరా అబ్దుర్రహ్మాన్ బిన్ సఖర్ అద్దౌసి రదియల్లాహు అన్హు ఖైబర్ యుద్ధం జరిగిన 7హి సంవత్సరంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహచర్యంలోనికి చేరారు. ఎక్కువ హదీథ్ లను జ్ఞాపకం ఉంచుకున్నవారిలో ఒకరు.

వివరణ:- ఈ హదీథ్ లో తుమ్మినతడు పొందే అల్లాహ్ యొక్క దీవెనల గురించి ప్రస్తావించబడినది. అతడికి లభించే పుణ్యాల గురించి తెలుపబడినది. అల్లాహ్ యొక్క అనంతమైన కరుణాకటాక్షాలు అతడి పై ఎలా అవతరిస్తున్నాయో ఈ హదీథ్ తెలియజేస్తున్నది. మానవుడికి అనారోగ్యం కలిగించే కొన్ని వాయువుల నుండి తుమ్ము మనల్ని కాపాడును. అటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించే తుమ్ముకు బదులుగా అల్ హమ్ దులిల్లాహ్ అని పలుకుతూ అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకోమని ఇస్లాం ధర్మం ఆదేశిస్తున్నది. అలా పలకటం ద్వారా తన చుట్టుప్రక్కల ఉన్నవారి ఆశీస్సులూ లభించటం జరుగును.

Source : హదీథ్ – మొదటి స్థాయి (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  సయ్యద్ యూసుఫ్ పాషా

అన్నపానీయములు సేవించే విధానం

హదీథ్׃ 04

من آداب الأكل والشرب ఇస్లాం ధర్మంలో అన్నపానీయములు సేవించే విధానం –

– عن عُمَرَ بْنِ أَبِي سَلَمَةَ. قَالَ: كُنْتُ فِي حَجْرِ رَسُولِ اللّهِ صلى الله عليه وسلم. وَكَانَتْ يَدِي تَطِيشُ فِي الصّحْفَةِ. فَقَالَ لِي: «يَا غُلاَمُ سَمّ اللّهَ. وَكُلْ بِيَمِينِكَ. وَكُلْ مِمّا يَلِيكَ» . رواه مسلم.

అన్ ఉమర్ బిన్ అబి సలమ ఖాల, కున్తు ఫీ హిజ్రి రసులిల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం  వ కానత్ యదీ తతీషు ఫిస్సహ్ఫతి. ఫఖాలలీ, “యా గులాము సమ్మిల్లాహ వకుల్ బి యమీనిక్, వకుల్ మిమ్మా యలీక్” రవాహు ముస్లిం

అనువాదం:- ఉమర్ బిన్ అబి సలమ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు – నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పెంపకంలో వారి ఇంటిలోనే నివాసముంటున్నప్పుడు, నా చేయి పళ్ళెంలో నలుమూలలా కదిలేది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నాకు ఇలా బోధించారు.” ఓ సేవకుడా! తినే ముందు అల్లాహ్ పేరును స్మరించు మరియు నీ యొక్క కుడిచేతితో భుజించు మరియు (పళ్ళెంలో) నీ వైపు నుండి తిను.

హదీథ్ ఉల్లేఖించినవారి పరిచయం:- ఉమర్ బిన్ అబి సలమ రదియల్లాహు అన్హు తన బాల్యంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటిలోనే పెరిగారు. 2వ హిజ్రీ సంవత్సరంలో ఆయన జన్మించారు. అలీ బిన్ అబి తాలిబ్ రదియల్లాహు అన్హు ఖలీఫా గా ఉన్నప్పుడు, ఆయనను బహ్రీన్ యొక్క గవర్నర్ గా నియమించారు. మదీనా పట్టణంలో ఆయన 83వ హిజ్రీ సంవత్సరంలో మరణించారు.

వివరణ:- భోజనం ప్రారంభించే ముందు బిస్మిల్లాహ్ (అల్లాహ్ పేరుతో) అని పలకటం మరియు కుడిచేతితో భుజించటం గురించిన ఇస్లాం ధర్మపు ఆదేశాలను ఈ హదీథ్ నిరూపిస్తున్నది. అలాగే ఎడమచేతితో అన్నపానీయాలు సేవించటం నిషేధించబడినది అనే విషయాన్ని కూడా ఋజువు చేస్తున్నది. ఎందుకంటే అలా తినటం ధర్మ పద్ధతి నుండి దారి తప్పిన వారి జీవనవిధానం. అలాంటి చెడు అలవాట్ల నుండి దూరంగా ఉండమని తెలియజేయబడినది. పైగా అది షైతాన్ యొక్క పద్ధతి మరియు అలవాటు.  ఇంకో హదీథ్ లో ఎవరికైనా, ఏదైనా ఇవ్వాలన్నా, వారి నుండి తీసుకోవాలన్నా కుడిచేతిని మాత్రమే ఉపయోగించమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించినట్లు తెలుపబడినది. అలాగే పళ్ళంలో తన ముందున్న భాగం నుండి మాత్రమే భుజించమని కూడా ఆదేశించబడినది.

ఈ హదీథ్ అమలు చేయడం వలన కలిగే లాభలు׃

 1. ఏదైనా తినటం ప్రారంభించే ముందు బిస్మిల్లాహ్ (అల్లాహ్ పేరుతో) అని పలకమని ఇస్లాం ధర్మం ఆదేశిస్తున్నది.
 2. ఒకవేళ భోజనం ప్రారంభించే టప్పుడు బిస్మిల్లాహ్ అని పలకటం మరచిపోయినట్లయితే, భోజన సమయంలో జ్ఞాపకం రాగానే బిస్మిల్లాహి అవ్వలుహు, ఆఖిరుహు (అల్లాహ్ పేరుతో – మరియు ఆరంభంలో ఉన్నవాడు మరియు చిట్టచివరగా ఉండేవాడు అని పలకవలెను.
 3. భోజనం కుడి చేత్తో మరియు నీరు త్రాగటం కుడిచేత్తో మాత్రమే చేయవలెను.
 4. భోజనం ముగించిన తర్వాత మరియు నీరు త్రాగిన తర్వాత అల్ హమ్దులిల్లాహ్ అని పలకవలెను.
 5. భోజనం చేసేటప్పుడు పళ్ళెంలో తన వైపు ఉన్నదానిలో నుండి తినవలెను.

Source : హదీథ్ – మొదటి స్థాయి (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  సయ్యద్ యూసుఫ్ పాషా

ధర్మప్రచారం మరియు దాని ప్రతిఫలం

హదీథ్׃ 03

الدال على الخير كفاعله ధర్మప్రచారం మరియు దాని ప్రతిఫలం

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِي اللهُ عَنْهُ أَنَّ رَسُوْلُ اللهِ  صَلَّى اللهُ عَلَيهِ وَسَلَّمْ  قَالَ: ” مَنْ دَعَا إِلَى هُدًى كَانَ لَهُ مِنَ الْأَجْرِ مِثْلُ أُجُوْرِ مَنْ تَبِعَهُ لَا يَنْقُصُ ذَالِكَ مِنْ أُجُوْرِهِمْ شَيْئًا، وَمَنْ دَعَا إِلَى ضَلَالَةٍ كَانَ عَلَيْهِ مِنَ الْإِثْمِ مِثْلُ آثَامِ مَنْ تَبِعَهُ لَا يَنْقُصُ ذَالِكَ مِنْ آثَامِهِمْ شَيْئًا” رواه مسلم

అన్ అబిహురైరా రదియల్లాహు అన్హు అన్న రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఖాల : మన్ దఆ ఇలా హుదన్ కాన లహు మినల్ అజ్ రి మిథ్ లు ఉజూరి మన్ తబిఅహు లా యన్ ఖుశు దాలిక మిన్ ఉజూరిహిమ్ షైయ్యిన్, వ మన్ దఆ ఇలా దలాలథిన్ కాన అలైహి మినల్   ఇథ్ మి  మిథ్ లు  ఆథామి మన్ తబిఅహు లా యన్ ఖుశు దాలిక మిన్ ఆథామిహిమ్ షైయ్యిన్ ” రవాహ్ ముస్లిం.

తాత్పర్యం :- అన్ = ఉల్లేఖించారు, అబి హురైరా = ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం  యొక్క సహచరుడు. రదియల్లాహు అన్హు = అల్లాహ్ వారిని స్వీకరించుగాక, ఖాల = చెప్పారు, మన్ = ఎవరైతే, దఆ = ఆహ్వానం,  ఇలా = వైపుకు, హుదన్ = ఋజుమార్గం, కాన = అటువంటి, లహు = వారు, మినల్ = నుంచి, అజ్ రి = పుణ్యం, మిథ్ లు = ఉదాహరణకు, ఉజూరి = వారి పుణ్యం, మన్ = ఎవరైతే, తబిఅహు = అనుసరించినవారు, లా = లేకుండా, యన్ ఖుశు = తగ్గింపు, దాలిక =  అటువంటి, మిన్ = నుంచి, ఉజూరిహిమ్ =వారి పుణ్యం,  షైయ్యిన్  = ఏదైనా సరే, వ = మరియు, మన్ = ఎవరైతే, దఆ = ఆహ్వానం,  ఇలా = వైపుకు, దలాలథిన్ = చెడుపనులు,  కాన = అయ్యాడు, అలైహి = అతని మీద, మినల్  = నుంచి, ఇథ్ మి = పాపం, మిథ్ లు = ఉదాహరణకు, ఆథామి = అతని పాపం, మన్ = ఎవరైతే, తబిఅహు = అనుసరించినవారు, లా = లేకుండా, యన్ ఖుశు = తగ్గింపు, దాలిక = అటువంటి, మిన్ = నుంచి, ఆథామిహిమ్ = అతడి పాపం, షైయ్యిన్ = ఏదైనా సరే.

అనువాదం :- అబుహురైరా రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు – ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు “ఎవరైతే సత్యమార్గం(ఋజుమార్గం) వైపునకు ఆహ్వానిస్తారో వారికి కూడా (అతని పిలుపుననుసరించి) ఆ దారిలో నడిచిన వారికి లభించేటంతటి పుణ్యం మరియు ప్రతిఫలం దొరుకుతుంది, పిలుపిచ్చిన వారికి మరియు అనుసరించివానికి సరిసమానంగా, ఎటువంటి తగ్గింపు లేకుండా. మరియు  ఎవరైతే అసత్యమార్గం(పాపం) వైపునకు ప్రచారం చేస్తారో వారికి కూడా (అతని పిలుపుననుసరించి) ఆ దారిలో నడిచిన వారికి లభించేటంతటి పాపం లభిస్తుంది, పిలుపిచ్చిన వారికి మరియు అనుసరించి వారికి సరిసమానంగా – ఎటువంటి తగ్గింపు లేకుండా. ముస్లిం.

వివరణ:- ఇస్లాం ధర్మం మంచిపనులు, పుణ్యకార్యాల వైపు ఆహ్వానించటాన్ని ప్రోత్సహిస్తున్నది.  ఇంకా ఎవరైతే సమాజంలో మంచిని పెంపొందించటానికి ప్రయత్నిస్తారో వారికి కూడా ఆ మంచి పనులు చేసినవారికి లభించేటంతటి ఫలితం లభిస్తుంది. అంటే పిలుపు నిచ్చిన వారూ మరియు చేసినవారూ సరిసమానంగా అంతే మోతాదులో పుణ్యం పొందుతారు. అమలు చేసినవారి పుణ్యంలోనుండి ఎటువంటి తగ్గింపూ ఉండదు. అదే విధంగా ఇస్లాం ధర్మం చెడుపనులు, పాపపు కార్యాలు చేయటాన్ని నిరుత్సాహ పరుస్తుంది. ఇంకా ఎవరైతే సమాజంలో చెడును వ్యాపింపజేస్తారో వారికి కూడా ఆ పాపపు పనులు చేసినవారికి లభించేటంతటి శిక్ష పడుతుంది. అంటే పిలుపు నిచ్చినవారూ మరియు చేసినవారూ సరిసమానంగా అంతే మోతాదులో పాపం పొందుతారు. అమలు చేసినవారి పాపంలోనుండి ఎటువంటి తగ్గింపూ ఉండదు.

ఈ హదీథ్ అమలు చేయడం వలన కలిగే లాభలు׃

1. మంచి పనులు, పుణ్యకార్యాల వైపు పిలవటాన్ని ప్రోత్సహించవలెను. ఇందులో అల్లాహ్ తరుపునుండి ఎక్కువ పుణ్యం లభిస్తుంది.

2. మంచి పనులు (పుణ్యకార్యాలు) వ్యాపింపచేయవలెను. అవి ఎంత చిన్నవైనాసరే. ఎంతమంది వాటిని అమలు చేస్తారో అంతమంది యొక్క పుణ్యం మీకు లభిస్తుంది.

3. చెడు పనులు (పాపపుకార్యాలు) ఆపటానికి ప్రచారం చేయవలెను. అవి ఎంత చిన్నవైనాసరే. ఎంతమంది వాటిని అమలు చేస్తారో అంతమంది యొక్క పాపాలు మీ ఖాతాలో జమ అవుతాయి. అమలు చేసిన వారితో పాటు  మీ మీద కూడా నరకశిక్ష పడుతుంది. కాబట్టి పాపకార్యాలు, చెడుపనులను నిరుత్సాహపరచటానికి, అరికట్టటానికి అందరూ నడుం బిగించవలెను.

హదీథ్ ఉల్లేఖించినవారి పరిచయం:- అబుహురైరా అబ్దుర్రహ్మాన్ బిన్ సఖర్ అద్దౌసి రదియల్లాహు అన్హు ఖైబర్ యుద్ధం జరిగిన హిజ్ 7వ సంవత్సరంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహచర్యంలోనికి చేరారు. ఎక్కువ హదీథ్ లు జ్ఞాపకం ఉంచుకున్నవారిలో ఒకరు.

ప్రశ్నలు

1. మన్ దఆ  ఇలా ____ కాన లహు మినల్ అజ్ రి మిథ్ లు ఉజూరి మన్ తబిఅహు లా యన్ ఖుశు జాలిక మిన్ ఉజూరిహిమ్ షైయ్యిన్, వ మన్ దఆ ఇలా _______  కాన అలైహి మినల్ ఇథ్ మి మిథ్ లు ఆథామి మన్ తబిఅహు లా యన్ ఖుశు దాలిక మిన్ ఆథామిహిమ్ షైయ్యిన్

2. ఎవరైతే ______ వైపునకు ప్రచారం చేస్తారో వారికి కూడా (అతని పిలుపు ననుసరించి) ఆ దారిలో నడిచిన వారికి లభించేటంతటి పుణ్యం మరియు ప్రతిఫలం దొరుకుతుంది, పిలుపు ఇచ్చిన వారికి మరియు అనుసరించివానికి సరిసమానంగా, ఎటువంటి తగ్గింపు లేకుండా.

3. ఎవరైతే _________వైపునకు ఆహ్వానిస్తారో వారికి కూడా (అతని పిలుపుననుసరించి) ఆ దారిలో నడిచిన వారికి లభించేటంతటి పాపం లభిస్తుంది, పిలుపిచ్చిన వారికి మరియు అనుసరించి వారికి సరిసమానంగా – ఎటువంటి తగ్గింపు లేకుండా.

4. ఇస్లాం ధర్మం మంచి పనులు, పుణ్యకార్యాలు చేయటానికి పిలుపివ్వమని ప్రోత్సహిస్తున్నది.  _______________ (తప్పు  / ఒప్పు)

5. ఇంకా ఎవరైతే సమాజంలో _____ పెంపొందించటానికి ప్రయత్నిస్తారో వారికి కూడా ఆ మంచి పనులు చేసినవారికి లభించేటంతటి _____ లభిస్తుంది.

6. మంచి పనులు చేయమని పిలుపు నిచ్చినవారూ మరియు చేసినవారూ _______ అంతే మోతాదులో పుణ్యం పొందుతారు. అమలు చేసినవారి పుణ్యంలోనుండి ఎటువంటి తగ్గింపూ ఉండదు.

7. ఇస్లాం ధర్మం చెడుపనులు, పాపపు కార్యాలు చేయటాన్ని ________ పరుస్తుంది.

8. ఎవరైతే సమాజంలో చెడు పనులు వ్యాపింపజేస్తారో వారికి కూడా ఆ పాపపు పనులు చేసినవారికి లభించేటంతటి పాపం లభిస్తుంది. ________ (తప్పు / ఒప్పు)

9. పాపపు పనులు చేయమని పిలుపు నిచ్చినవారూ మరియు చేసినవారూ ________ అంతే మోతాదులో పాపం పొందుతారు.

10. మంచి పనులు, పుణ్యకార్యాల వైపు పిలవటాన్ని ________. దీనిలో అల్లాహ్ తరుపునుండి ఎక్కువ పుణ్యం లభిస్తుంది.

11. మంచి పనులు (పుణ్యకార్యాలు) ________ చేయవలెను. అవి ఎంత చిన్నవైనాసరే. ఎంతమంది వాటిని అమలు చేస్తారో అంతమంది యొక్క పుణ్యం మీకు లభిస్తుంది.

Source : హదీథ్ – మొదటి స్థాయి (రబువ జాలియాత్ – రియాద్). అనువాదం : –  సయ్యద్ యూసుఫ్ పాషా


ధర్మ ప్రచారం (దావా) (మెయిన్ పేజీ)
https://teluguislam.net/dawah/

%d bloggers like this: