“అల్లాహ్ తప్ప ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న వారెవరికీ అగోచర జ్ఞానం లేదు.” (అన్ నమ్ల్ 27: 65)
అల్లాహ్ కొన్ని సందర్భాలలో దైవప్రవక్తలలో కొందరికి, కొన్ని పరమార్థాల దృష్ట్యా తన అగోచర జ్ఞానంలోని కొన్ని విషయాలను తెలియజేస్తాడు. ఆ విషయాన్నే ఇక్కడ ప్రస్తావించటం జరిగింది.
“ఆయన అగోచర జ్ఞానం కలవాడు. తన అగోచర విషయాలను ఆయన ఎవరికీ తెలుపడు – తాను ఇష్టపడిన ప్రవక్తకు తప్ప!” (అల్ జిన్న్ : 26, 27)
అంటే, అల్లాహ్ తనకు స్వంతమైన అగోచర జ్ఞానంలోని కొంత భాగాన్ని తన ప్రవక్తలలో తాను కోరిన వారికి, కొన్ని పరమార్థాల దృష్ట్వా తెలియపరచటం సంభవమే. ఎందుకంటే అతను (ఆ ప్రవక్త) ఆ అద్భుతాలను తన దైవదౌత్యానికి నిదర్శనంగా చూపుతాడు. ఇలాంటి అద్భుతాలలో, అగోచర విషయాలను (భవిష్యవాణి) తెలుపటం కూడా ఒకటి. ఈ అగోచర జ్ఞానంలో మానవ సందేశహరునికి, దైవదూతల సందేశవాహకునికి మాత్రమే ప్రమేయం ఉంటుంది. మూడో వ్యక్తికి ఇందులో ఎలాంటి దఖలు ఉండదు. ఎందుకంటే అల్లాహ్ అగోచర జ్ఞానాన్ని వారిరువురికే పరిమితం చేశాడు. కాబట్టి అల్లాహ్ దృష్టిలో మినహాయింపుకు నోచుకున్న ఆ సందేశహరులు తప్ప వేరెవరయినా తనకు అగోచర జ్ఞానం ఉందని అంటే అతను అసత్యవాది, అవిశ్వాసానికి ఒడిగట్టిన వాడవుతాడు. అతను హస్త సాముద్రికం ఆధారంగా చెప్పినా, తారాబలం చూసి చెప్పినా, క్షుద్రవిద్యలను ఆశ్రయించినా, జ్యోతిష్కం ద్వారా చెప్పినా, మరే వనరుల ఆధారంగా చెప్పినా అతను అబద్ధీకుడే. ఈ యుగంలో కూడా ఇలాంటి నయవంచకులు, మోసగాళ్లకు కొదువలేదు. వారు తమ వాక్చాతుర్యంతో, మాయమాటలతో అమాయక జనులను బుట్టలో వేసుకుని పోగొట్టుకున్న వస్తువుల ఆచూకీ తెలుపుతామని, రోగ కారణాలను తెలుపుతామని అంటుంటారు. ఫలానా వ్యక్తి నీకేదో చేసేశాడని, అందుకే నీవు ఈ విధంగా మంచాన పడ్డావని చెబుతుంటారు. ఈ విషయాలను వారు జిన్నాతుల నుండి, షైతానుల నుండి సేకరిస్తారు. అందుకోసం వారు ఆ పైశాచిక శక్తులను ప్రసన్నుల్ని చేస్తుంటారు. ఎవరయినా మీ వద్దకు క్షుద్రవిద్యను పొందిన మాటలంటే ఖచ్చితంగా వారు మాయలమారులని, మోసగాళ్లని గ్రహించాలి.
షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు : “భవిష్యవాణి (సోదె) చెప్పేవారి పరిస్థితి ఎటువంటిదంటే, వారి వద్ద షైతాన్ సహచరుడు ఉంటాడు. ఆకాశాలలో దొంగచాటుగా. విన్న విషయాలను వాడు వారికి తెలియజేస్తుంటాడు. వాటిలో వారు మరికొన్ని అబద్ధాలను (మిర్చిమసాలాను) జోడించి వివరిస్తారు.”
ఆయన ఇంకా ఇలా అంటున్నారు : “ఈ సోదె చెప్పటంలో కొందరు ఆరితేరిన వారుండేవారు. వారి దగ్గరకు షైతానులు తినే త్రాగే పదార్థాలను కూడా తెచ్చేవారు. ఆ ప్రదేశాలలో లభ్యంకాని పండ్లను, మిఠాయిలను కూడా తెచ్చేవారు. వాటిలో కొన్నింటిని జిన్ను మక్కా లేదా బైతుల్ మఖ్దిస్ లేదా వేరే ఇతర స్థలాలకు తరలించేవాడు.” (మజ్మూ అత్ తౌహీద్ – పేజీ : 797, 801)
అగోచరాలకు సంబంధించి వారు జ్యోతిష్యశాస్త్రం ద్వారా కొన్ని విషయాలు అందజేస్తుంటారు. నక్షత్రాలను, రాసులను చూసి వారు భూమండలంపై సంభవించబోయే దానిని సూచిస్తుంటారు. గాలులు ఎంతవేగంగా వీస్తాయి, వర్షం ఎప్పుడు ఎక్కడ కురుస్తుంది తదితర విషయాలను అంచనా వేస్తారు. నక్షత్రాలు తమ తమ కక్ష్యల్లో చేసే పరిభ్రమణం, వాటి కలయిక, విడిపోవటాలను బట్టి జరిగే సంఘటనలను నిర్ధారిస్తారు. వారిలా అంటారు: ఇతను గనక ఫలానా నక్షత్రం సంచరించే సమయంలో వివాహమాడితే అతనికి ఈ ఈ సమస్యలు ఎదురవుతాయి. అతను గనక ఫలానా నక్షత్రం పొడసూపినపుడు ప్రయాణం చేస్తే ఫలానా ఫలానా గండాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అతను ఫలానా నక్షత్రం సమయంలో పుట్టాడు కనుక ఫలానా భాగ్యం వరిస్తుంది లేదా ఫలానా దరిద్రం చుట్టుకుంటుంది. ప్రస్తుతం కొన్ని చవుకబారు పత్రికలు సయితం ఇలాంటి రాశి ఫలాలను ముద్రించి మనుషుల జీవితాలలో సంభవించబోయే వాటిని గురించి విచ్చలవిడి రాతలు రాస్తున్నాయి.
కొంతమంది అజ్ఞానులు, బలహీన విశ్వాసులు జ్యోతిష్కుల వద్దకు వెళుతుంటారు. వారు తమ జీవితాలలో యెదురు కానున్న సంఘటనలను గురించి, ముఖ్యంగా వివాహాది శుభకార్యాల గురించి దర్యాప్తు చేస్తుంటారు.
ఎవడయితే తనకు అగోచర జ్ఞానముందని అంటాడో, మరెవరయితే అలాంటి వారిని సత్యవంతులని ధృవీకరిస్తాడో అతను ముష్రిక్కు, కాఫిర్ అవుతాడు. ఎందుకంటే వాడు అల్లాహ్ యొక్క ప్రత్యేక గుణాలలో తనకు భాగస్వామ్యం ఉందని దావా చేస్తున్నాడు. నిజానికి నక్షత్రాలు అల్లాహ్ కు సంపూర్ణ విధేయతను ప్రకటించే సృష్టితాలు. వాటి అధీనంలో ఏ శక్తీ లేదు. ఒకరి భాగ్యాన్నిగానీ, దరిద్రాన్ని గానీ శాసించే అధికారం వాటికి లేదు. జీవన్మరణాలతో కూడా వాటికి ఎలాంటి సంబంధం లేదు. ఇవన్నీ పైశాచిక చేష్టలు. ఆకాశాలలో దొంగచాటుగా విన్న విషయాలను అవి చేరవేస్తుంటాయి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, సమాధులను సందర్శించే ప్రజలు చేసే షిర్క్ గురించి వివరించబడింది. గత ప్రసంగంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలోని ముష్రికులు మరియు నేటి సమాధులను సందర్శించే ముస్లింల మధ్య నమ్మకాల పోలికను చర్చించారు. రెండు వర్గాలు అల్లాహ్‌ను ఏకైక సృష్టికర్తగా నమ్మినప్పటికీ, మధ్యవర్తుల ద్వారా ఆయనను చేరుకోవాలని ప్రయత్నించారు, దీనిని ఖుర్ఆన్ షిర్క్‌గా పరిగణిస్తుంది. మృతులు వినగలరనే నమ్మకం కూడా షిర్క్‌కు దారితీస్తుందని, దీనికి సరైన ఆధారం లేదని వక్త తెలిపారు. బద్ర్ యుద్ధం తర్వాత ప్రవక్త మృతులతో మాట్లాడటం మరియు సమాధిలోని వ్యక్తి పాదాల శబ్దాన్ని వినడం వంటి హదీసులు ప్రత్యేక సందర్భాలని, సాధారణ నియమం కాదని స్పష్టం చేశారు. మృతులు వినలేరని, వారికి సహాయం చేసే శక్తి లేదని ఖుర్ఆన్ ఆయతుల ద్వారా నిరూపించారు. ప్రళయ దినాన, ఈసా (అలైహిస్సలాం) మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా తమ అనుచరులు తమ తర్వాత ఏమి చేశారో తమకు తెలియదని చెప్పడం, మృతులకు ప్రపంచ విషయాలతో సంబంధం ఉండదనేదానికి నిదర్శనం. ప్రజలు ఖుర్ఆన్ మరియు సహీ హదీసులను చదివి, షిర్క్ నుండి తమను తాము రక్షించుకోవాలని వక్త పిలుపునిచ్చారు.
اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِيْنَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِيْنَ، نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِيْنَ، أَمَّا بَعْدُ. సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వ స్తోత్రములు. ప్రవక్తల నాయకుడైన మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబంపై మరియు వారి అనుచరులందరిపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక. ఆ తర్వాత.
సోదరులారా, గత పాఠంలో మనం సామాన్యంగా ప్రజలు సమాధుల వద్దకు ఎందుకు వెళ్తారు అనే దాని గురించి కొన్ని కారణాలు తెలుసుకున్నాము. వాటికి ఆధారంగా, నిదర్శనంగా, దలీల్‌గా వారు కొన్ని విషయాలు ఏదైతే ప్రస్తావిస్తారో వాటి యొక్క వాస్తవికత ఖుర్ఆన్ హదీసుల వెలుగులో తెలుసుకున్నాము.
సంక్షిప్తంగా మరోసారి మనం చెప్పుకోవాలంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలం నాటి ముష్రికులు ఏకైక అల్లాహ్‌ను సృష్టికర్తగా, ఉపాధి ప్రధాతగా, సర్వ జగత్తుకు నిర్వాహకారునిగా నమ్మినప్పటికీ, కొందరు వలీలను, ఔలియాలను, బాబాలను నిర్ణయించుకుని, అల్లాహ్‌కు చేయనటువంటి ఆరాధనలు వారికి చేసేవారు. ఎందుకు చేసేవారు? మేము చాలా పాపాత్ములం, డైరెక్ట్ అల్లాహ్ వద్ద వెళ్లడానికి మాకు ముఖం లేదు. ఈ బాబాలు, పీర్లు, ఈ ముర్షదులు, ఈ వలీలు, ఔలియాలు వీరి సాధనంగా, వీరి ఆధారంగా, వీరి యొక్క మధ్యవర్తిత్వం వసీలాతో మేము అల్లాహ్ వద్ద చేరుకుంటాము, వారు మా గురించి అల్లాహ్ వద్ద సిఫారసు చేస్తారు. వారి యొక్క ఈ సాకు ఏదైతే ఉండినదో, ఈ రోజుల్లో సామాన్యంగా మన ముస్లింలు ఎవరైతే సమాధుల వద్దకు వెళ్తున్నారో, బాబాల వద్దకు వెళ్తున్నారో వారి యొక్క సాకు, వారి యొక్క కారణం కూడా అదే. మేము పాపాత్ములం, డైరెక్ట్ అల్లాహ్ వద్ద వెళ్లడానికి మా దగ్గర ముఖం లేదు. అల్లాహ్ యొక్క ఈ పుణ్యాత్ములు, ఔలియాలు వారి యొక్క మధ్యవర్తిత్వంతోనే మనం పోగలుగుతాము. వారి యొక్క సిఫారసుతోనే మనం అల్లాహ్‌కు సన్నిహితులుగా కాగలుగుతాము.
అయితే, సూరె యూనుస్ ఆయత్ నెంబర్ 18, సూరె జుమర్ ఆయత్ నెంబర్ 3 వీటి ఆధారంగా ఇదే అసలైన షిర్క్. ఇలాంటి షిర్క్‌ను ఖండించడానికే ప్రతీ కాలంలో అల్లాహు త’ఆలా ప్రవక్తలను పంపాడు అని మనం తెలుసుకున్నాము.
అంతేకాకుండా ఈ ఆయతులు, ప్రత్యేకంగా సూరె జుమర్ మరియు సూరె యూనుస్‌లో తెలుపబడిన ఈ ఆయతులను మనం చదివినప్పుడు సామాన్యంగా ఈనాటి ముస్లింలు కొందరు ఏమంటారు, ఈ ఆయతులు మాలాంటి వారి గురించి కాదు అవతరించినవి. ఆ కాలంలో విగ్రహాలను పూజించేవారు. ఆ విగ్రహాలకు వ్యతిరేకంగా ఈ ఆయతులు అవతరించాయి. అయితే మనం ఇందులో మరికొన్ని ఆధారాలు తెలిపి ఉన్నాము. ఉదాహరణకు, సూరె ఆరాఫ్ లోని ఈ ఆయతులో అల్లాహు త’ఆలా చాలా స్పష్టంగా చెప్పాడు,
عِبَادٌ أَمْثَالُكُمْ (ఇబాదున్ అమ్సాలుకుమ్) మీలాంటి దాసులు మాత్రమే.
అల్లాహ్‌ను కాకుండా మీరు ఎవరైతే ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు మీలాంటి మానవులు మాత్రమే. మీలాంటి దాసులు మాత్రమే. అల్లాహు త’ఆలా చాలా స్పష్టంగా చెప్పారు, మీలాంటి దాసులు, మీలాంటి మానవులు. అంటే మక్కా యొక్క ముష్రికులు ఎవరినైతే వారికి మరియు అల్లాహ్‌కు మధ్య మధ్యవర్తిత్వంగా, సిఫారసుగా నిర్ణయించుకున్నారో వారు కేవలం విగ్రహాలు మాత్రమే కాదు. రాళ్లతో, చెట్లతో, లేక వేరే వాటితో చేసిన కేవలం మూర్తులు మాత్రమే కాదు. సమాధిలో ఉన్న కొందరు పుణ్యాత్ములు, ఔలియాలు వారిని ప్రవక్తల కాలం యొక్క ముష్రికులు పూజించేవారు.
ఉదాహరణకు, హజ్రత్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హు గారి యొక్క హదీస్ కూడా వినిపించడం జరిగింది. తాయిఫ్ నుండి తాయిఫ్‌కు దగ్గర మక్కా మార్గంలో ‘లాత్’ అనే ఒక పుణ్యాత్ముడు హజ్ కు వచ్చే వాళ్లకు సత్తువ ఇట్లా తాగించి తినిపించేవాడు. అతను చనిపోయిన తర్వాత అతను చనిపోయిన స్థలంలోనే అతన్ని సమాధి చేసి అక్కడే కొందరు ముజావర్గా కూర్చొని కొద్ది రోజుల తర్వాత వారిని అదే పూజించడం మొదలుపెట్టారు. ఇది సహీ హదీసులో ఉంది.
అంతేకాకుండా, హజ్రత్ నూహ్ అలైహిస్సలాం కాలంలో ఐదుగురు పుణ్యాత్ములు ఏదైతే చనిపోయారో, వద్, సువా, యగూస్, యఊక్, నసర్, వీరి గురించి హజ్రత్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హు ఏం చెప్పారు? నూహ్ అలైహిస్సలాం కాలంలో వీరు పుణ్యాత్ములు. నూహ్ అలైహిస్సలాం కాలంలో ఉన్నటువంటి ముష్రికులు వీరిని పూజించేవారు. అయితే తర్వాత నూహ్ అలైహిస్సలాం కాలంలో వచ్చిన ఏదైతే తూఫాన్ ఉందో ఆ తూఫాన్ తర్వాత ఈ ఐదు పుణ్యాత్ముల విగ్రహాలు ఏదైతే తయారు చేసి పెట్టుకున్నారో అవి ఎక్కడో దాగిపోయి ఉన్నాయి. కానీ షైతాన్ వాడు అమర్ బిన్ లుహై అనే ఒక నాయకుడు మక్కాలో అతనికి ఏదో రకంగా తెలిపి జిద్దా ఒడ్డున, జిద్దాలో సముద్రం ఉంది కదా, సముద్ర తీరాన ఎక్కడో పాతి ఉన్న ఆ విగ్రహాలను తీసి మళ్లీ మక్కాలో తీసుకొచ్చి వాటి విగ్రహారాధన మరోసారి మొదలుపెట్టారు. అయితే అక్కడ వారు పూజించేది కేవలం విగ్రహం అనే కాదు. వీరు పుణ్యాత్ములు. పుణ్యాత్ముల ఒక ఆకారం, ఒక వారి రూపాన్ని మేము పూజిస్తున్నాము. వీరు మాకు ప్రళయ దినాన సిఫారసు చేస్తారు. అటువంటి నమ్మకాలు వారు ఉంచుకునేవారు.
మృతులు వినగలరా?
ఇంతవరకు మనం గత పాఠంలో ఏదైతే కొన్ని విషయాలు తెలుసుకున్నామో వాటి సంక్షిప్త విషయాలు ఇప్పుడు మరోసారి చెప్పడం జరిగింది. ఈరోజు పాఠంలో నేను మరో విషయం మీకు తెలుపబోతున్నాను. దానిని మీరు చాలా శ్రద్ధగా వినాలని ఆశిస్తున్నాను. అదేమిటి, చాలా ముఖ్యమైన విషయం. అనేకమంది ప్రజలు సమాధుల వద్దకు వెళ్ళడానికి ఇది కూడా ఒక కారణం. అదేమిటి, సమాధిలో ఉన్న వాళ్ళు మా యొక్క మొరలను వింటున్నారు. మేము ఏదైనా దుఆ చేస్తే మా దుఆలను వారు ఆలకిస్తారు అని వారి నమ్మకం ఉంది. అయితే వాస్తవానికి చనిపోయిన వారు, మృతులు, సమాధిలో ఉన్న వారు మనం బ్రతికి ఉన్న వాళ్ళు వీరి యొక్క మాటలను వింటారా? ఒకవేళ సమాధి వద్దకు వెళ్లి ఏదైనా మొరపెట్టుకుంటే, ఏదైనా దుఆలు చేస్తే, ఏదైనా అరిస్తే వారికి వినే శక్తి ఉందా? ఈ విషయం ఖుర్ఆన్ హదీస్ ఆధారంగా తెలుసుకుందాం.
అయితే, ఎవరైతే సమాధుల వద్దకు వెళ్తున్నారో వారి యొక్క గట్టి నమ్మకం, విశ్వాసం ఏంటి? సమాధిలో ఉన్న వాళ్ళందరూ వింటూ ఉంటారు. ప్రత్యేకంగా ఔలియా అల్లాహ్ ఈ బాబాలు వాళ్ళు మా యొక్క కష్టసుఖాలను మేము ఏదైతే చెప్పుకుంటామో, మొరపెట్టుకుంటామో వాటిని వింటారు అన్నటువంటి నమ్మకం ఉంది. వారి ఆ నమ్మకానికి ఖుర్ఆన్‌లో హదీసులో ఎక్కడైనా ఏదైనా ఆధారం ఉందా? అయితే హదీసు నుండి ఒక ఆధారం, ఒక దలీల్ వారు చూపిస్తారు. అదేమిటి, సహీ బుఖారీలో హదీస్ ఉంది.
ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వలస పోయి వచ్చిన తర్వాత రెండవ హిజ్రీలో, అంటే వలస పోయి వచ్చిన తర్వాత రెండవ సంవత్సరం, మక్కా యొక్క ముష్రికులతో ఒక యుద్ధం జరిగింది. దాని పేరు బద్ర్యుద్ధం. గజ్వతె బద్ర్. ఆ యుద్ధంలో అల్హందులిల్లాహ్ అల్లాహ్ యొక్క దయ వల్ల ముస్లింలు జయించారు. ముష్రికులు ఓడిపోయారు. ముష్రికుల వైపు నుండి 70 మంది హతమయ్యారు. మరో 70 మంది ఖైదీలు అయ్యారు. అయితే ఆ బద్ర్ ప్రాంతంలో ఒక చిన్న సంఘటన జరిగింది. అదేంటి, ఆ మృతులను, ఎవరైతే ముష్రికులు హతులయ్యారో, చంపబడ్డారో వారిని పెద్ద పెద్ద గోతులు తవ్వి అందులో వారిని పడేయడం జరిగింది. అలాంటి సందర్భంలో ఒకసారి అబూ జహల్ ఇంకా పెద్ద పెద్ద కొందరు నాయకులను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక బావి లాంటిది లోతుగా కొంచెం తవ్వి అందులో వారిని వేసినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ నిలబడి ‘హల్ వజద్తుమ్ మా వఅద రబ్బుకుమ్ హక్కా’. ఏమిటి, అల్లాహ్ మీతో మీ ప్రభువు మీతో చేసిన వాగ్దానాన్ని మీరు పొందారా? అని వారిని అడిగారు. ఎవరిని అడుగుతున్నారు ప్రవక్త గారు అప్పుడు? ఆ చనిపోయిన వాళ్ళను. ఆ యుద్ధంలో ఎవరినైతే చంపడం జరిగిందో ముష్రికులను, వారిని ఒక బావిలో వేస్తున్నారు. అయితే వారిని వేసిన తర్వాత దాని ఒడ్డున మీద నిలబడి ప్రవక్త వారితో సంబోధిస్తూ, వారిని ఉద్దేశించి ఈ మాట అడుగుతున్నారు. అల్లాహు త’ఆలా, మీ యొక్క ప్రభువు మీతో ఏ వాగ్దానం అయితే చేశాడో దానిని మీరు పొందారా? అయితే కొందరు సహాబాలు అన్నారు, ప్రవక్తా వారు మృతులు కదా మీ మాటలను ఎలా వినగలుగుతారు? అప్పుడు ప్రవక్త అన్నారు,
إِنَّهُمْ الْآنَ يَسْمَعُونَ مَا أَقُولُ (ఇన్నహుముల్ ఆన యస్మఊన మా అఖూల్) నిశ్చయంగా వారు ఇప్పుడు నేను చెప్పేది వింటున్నారు.
నేను ఏ మాటనైతే అంటున్నానో ఆ మాటను వారు ఇప్పుడు వింటున్నారు అని ప్రవక్త చెప్పారు కదా. ఈ యొక్క హదీసు తోని ఈనాటి ఆ ముస్లింలు దలీల్ ఆధారం తీసుకుంటారు చూడండి. మృతులు వినరు అని మీరు అంటారు. ఇక్కడ ప్రవక్త స్వయంగా వారికి వినిపిస్తున్నారు. సహాబాలకు అనుమానం కలిగింది. అయితే ప్రవక్త వారికి సమాధానం చెప్పారు వింటున్నారు అని. అందుగురించి మృతులు వింటారు.
వారు సహీ బుఖారీలో ఉన్న హదీస్ మరొకటి వినిపిస్తారు. అదేమిటి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు,
اَلْعَبْدُ إِذَا وُضِعَ فِي قَبْرِهِ، وَتُوُلِّيَ وَذَهَبَ أَصْحَابُهُ حَتَّى إِنَّهُ لَيَسْمَعُ قَرْعَ نِعَالِهِمْ، أَتَاهُ مَلَكَانِ فَأَقْعَدَاهُ మనిషి చనిపోయిన తర్వాత అతన్ని సమాధిలో పెట్టి తిరిగిపోతున్న సందర్భంలో, ఎప్పుడైతే వారి బంధుమిత్రులందరూ వెళ్లిపోతూ ఉంటారో వారి చెప్పుల శబ్దాన్ని అతడు సమాధిలో ఉండి అతడు వింటాడు. అప్పుడే ఇద్దరు దేవదూతలు వచ్చి అతన్ని కూర్చోబెట్టి ప్రశ్న అడుగుతారు.
ఇక్కడ ఏముంది హదీసులో, సమాధిలో ఉన్న ఆ వ్యక్తి అతని యొక్క బంధుమిత్రులు ఎవరైతే వెళ్తున్నారో వారి యొక్క చెప్పుల శబ్దాన్ని వింటారు అని హదీసులో స్పష్టంగా ఉంది. యస్మఉ ఖర్అ నిఆలిహిమ్. వారి చెప్పుల శబ్దాన్ని అతను వింటాడు. అందుగురించే ఈ మన సోదరులు ఎవరైతే సమాధుల వద్దకు వెళ్తూ ఉంటారో, సమాధిలో ఉన్న వాళ్ళు ఔలియాలు బాబాలు వింటారు, అందుగురించి ఈ హదీసులో ఆధారం అని చూపిస్తారు.
హదీసుల సరైన అవగాహన
కానీ వాస్తవానికి ఈనాటి కాలంలో ఉన్న సమాధులలో లేక సామాన్యంగా ఎవరైనా మృతులు, చనిపోయిన వారు వింటారు అనడానికి ఈ రెండు హదీసులు దలీల్ ఏ మాత్రం కావు. ఎందుకు? మొదటి హదీస్ ఏదైతే ఉందో, ఈ హదీస్ సహీ బుఖారీలో ఇమామ్ బుఖారీ రహమతుల్లాహ్ అలైహ్ నాలుగు చోట్ల ప్రస్తావించారు. అంటే నాలుగుసార్లు వేరే వేరే స్థానాల్లో ఈ హదీసును ప్రస్తావించారు. ఒకటి కితాబుల్ జనాఇజ్‌లో, జనాజా అంతక్రియలకు సంబంధించిన చాప్టర్ ఏదైతే ఉంటుందో అక్కడ, ఇంకా మిగతా మూడుసార్లు కితాబుల్ మగాజి, యుద్ధాల విషయానికి సంబంధించిన హదీసులను ప్రస్తావించాడు ఎక్కడైతే అక్కడ.
అయితే మొదటిసారి కితాబుల్ జనాఇజ్ బాబు అజాబిల్ ఖబ్ర్ హదీస్ నెంబర్ 1370 లో ఎక్కడైతే ఈ హదీస్ వచ్చి ఉందో, ప్రవక్త ఎప్పుడైతే అన్నారో మీరు మీ ప్రభువు చేసిన వాగ్దానాన్ని మీరు పొందారా అని అప్పుడు సహాబాలు అన్నారు, తద్ఊ అమ్వాతన్? మీరు మృతులను పిలుస్తున్నారా? మృతులను సంబోధిస్తున్నారా? దాని యొక్క సమాధానంలో ప్రవక్త ఏం చెప్పారు, ‘మా అన్తుమ్ బి అస్మఅ మిన్హుమ్ వలాకిన్ లా యుజీబూన్’. మీరు వారి కంటే ఎక్కువ ఇప్పుడు వినడం లేదు. అంటే వారు మీ కంటే ఎక్కువ ఇప్పుడు వింటున్నారు. కానీ వారు సమాధానం ఇవ్వలేరు.
ఇదే హదీస్ మరోచోట ఉంది, అక్కడ హదీస్ నెంబర్ అది 4026. అక్కడ సహాబాలు అడిగారు, యా రసూలల్లాహ్ తునాది నాసన్ అమ్వాతా? ఓ ప్రవక్తా, మీరు చనిపోయిన వారిని మృతులను పిలుస్తున్నారా? అయితే ప్రవక్త చెప్పారు, ‘మా అన్తుమ్ బి అస్మఅ లిమా ఖుల్తు మిన్హుమ్’. నేను వారికి చెప్పే విషయం ఏదైతే ఉందో దానిని మీరు వారి కంటే ఎక్కువ వినడం లేదు. అంటే వారు మీ కంటే ఎక్కువ వింటున్నారు.
మూడోచోట హజ్రత్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు అడిగారు అని ఉంది. హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు, యా రసూలల్లాహ్ మా తుకల్లిము మిన్ అజ్సాదిన్ లా అర్వాహ లహా. ఆత్మలు లేని ఈ శరీరం వాటితో మీరు సంబోధిస్తున్నారా? వాటికి మీరు వాటితో మీరు వారిని పిలుస్తున్నారా? వారితో మాట్లాడుతున్నారా? అప్పుడు ప్రవక్త ఏమన్నారు, ‘వల్లది నఫ్సు ముహమ్మదిన్ బియదిహ్’. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణం ఎవరి చేతిలో ఉందో అతని సాక్షి ‘మా అన్తుమ్ బి అస్మఅ లిమా అఖూలు మిన్హుమ్’. నేను ఇప్పుడు చెప్పే మాటలు మీరు వారి కంటే ఎక్కువ వినలేరు.
అయితే ఇక్కడ ఒక విషయం మనం ఈ హదీస్ ను ఈ ఒక్క హదీస్ నాలుగు చోట్ల నాలుగు స్థానాల్లో ఏదైతే వచ్చి ఉందో అందులో ఏ ఏ పదాలతో విషయం చర్చించబడిందో వాటిని ఒకవేళ మనం శ్రద్ధ వహిస్తే, సహాబాలు ఏదైతే అడుగుతున్నారో, ఓ ప్రవక్తా మీరు మృతులను సంబోధిస్తున్నారా? ప్రాణం ఏమాత్రం లేని ఈ శవాలను, ప్రాణం లేని ఈ శరీరాలతో మీరు మాట్లాడుతున్నారా? అని ఈ అడగడం ద్వారా మనకు ఏం తెలుస్తుంది? అప్పటివరకు సహాబాల విశ్వాసం ఏమిటి? మృతులు వినరు. చనిపోయిన వాళ్ళు వినరు అన్న విశ్వాసమే ప్రబలి ఉండింది. ఇదే మాట అందరికీ తెలిసి ఉండింది. అందుగురించే ఎప్పుడైతే ప్రవక్త మృతులతో మాట్లాడుతున్నారో, ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అని ఆశ్చర్యంగా వారు అడిగారు.
రెండో విషయం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? ఇప్పుడు వీరు మీ కంటే ఎక్కువ వింటున్నారు.
اِنَّهُمُ الْآنَ (ఇన్నహుముల్ ఆన్) నిశ్చయంగా వారు ఇప్పుడు
అల్ ఆన్ అన్న పదం ఉన్నది అక్కడ. ఇప్పుడు వారు మీ కంటే ఎక్కువ వింటున్నారు. అయితే ఇప్పుడు వారు మీ కంటే ఎక్కువ వింటున్నారు అన్న ఈ పదంలోనే ఇది ఒక ప్రత్యేక సందర్భం అంతే మాత్రం గానీ చనిపోయిన ఏ వ్యక్తి కూడా బ్రతికి ఉన్న వారి, జీవరాశుల మాటలను వినరు అని స్పష్టం అవుతుంది. ఇది ఒక ప్రత్యేక సందర్భం.
మరి ఇదే హదీస్ గురించి హజ్రత్ ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా గారు ఏం చెప్పారో ఒకసారి వినండి. దాని ద్వారా కూడా సహాబాల యొక్క విశ్వాసం మృతులు వింటారా లేదా అనే విషయం సహాబాలకు ఎలా ఉండింది అది కూడా మనకు తెలుస్తుంది. ఈ హదీస్ హజ్రత్ ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా వద్దకు వచ్చినప్పుడు, హజ్రత్ ఆయిషా రదియల్లాహు అన్హా గారు చెప్పారు, “ప్రవక్త యొక్క ఉద్దేశం ఇక్కడ ఏమిటంటే వారి యొక్క జీవితాల్లో నేను మాటిమాటికి ఏదైతే చెప్పేవాడినో, మీరు అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించండి, అల్లాహ్‌కు ఏ మాత్రం సాటి కల్పించకండి, షిర్క్ చేయకండి అని మాటిమాటికి ఏదైతే నేను చెప్పేవాడినో, ఒకవేళ మీరు నా మాటను వినేది ఉంటే అల్లాహ్ స్వర్గం యొక్క వాగ్దానం మీకు చేస్తున్నాడు, మీరు నన్ను తిరస్కరించేది ఉంటే మీరు నరకంలో వెళ్తారు, ఇలాంటి వారి జీవితంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ ఏ మాటలైతే చెప్పేవారో అవి సత్యం అని ఇప్పుడు వారికి తెలుస్తుంది. ‘హల్ వజద్తుమ్ మా వఅద రబ్బుకుమ్ హక్కా’. మీ ప్రభువు మీతో చేసిన వాగ్దానం ఏదైతే ఉందో అది నిజం అని మీకు ఇప్పుడు తెలిసిందా? దాన్ని మీరు పొందారా? అది సత్యమే అన్న విషయం ఇప్పుడు తెలిసిందా?”
ఇదే సంఘటన కాకుండా వేరే కొన్ని ఆయతులు ఖుర్ఆన్‌లో ఉన్నాయి. మనిషి చనిపోయినప్పుడు, ఓ దేవా నాకు కొంచెం అవకాశం ఇవ్వు, ఇప్పుడు నాకు తెలిసింది, నాకు కొంచెం అవకాశం దొరికిన గానీ నేను నా ధనాన్ని నీ మార్గంలో ఖర్చు పెడతాను అని కూడా కోరుకుంటారు కొందరు.
ఫిర్ఔన్ చనిపోయేటప్పుడు కూడా ఏమన్నాడు? ఆ, మూసా చెప్పిన మాటలన్నీ కూడా నిజమే. ఇప్పుడు నేను విశ్వాసం మార్గాన్ని అవలంబిస్తాను.
అయితే ఇలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారికి ఆ సందర్భంలో గుర్తు చేస్తున్నారు. అయితే అప్పుడు అల్లాహు త’ఆలా వారికి ప్రవక్త యొక్క మాట వినిపించారు. అదేంటి, ప్రత్యేక సందర్భం. ఈ ప్రత్యేక సందర్భాన్ని మనం ప్రతీ శవం గురించి, ప్రతీ చనిపోయిన వారి గురించి, ప్రత్యేకంగా ఔలియాల గురించి, అంబియాల గురించి ఇంకా వేరే వారి గురించి ఈ మాటలు అక్కడ అతికించవద్దు. ఈ మాటతోని, ఈ యొక్క హదీసుతోని “అందరూ వింటారు” అన్నటువంటి దలీల్ పట్టుకోవడం, దీనిని ఒక ఆధారంగా తీసుకోవడం ఎంత మాత్రం నిజమైనది కాదు. అందుగురించి ఇదే హదీస్ సహీ బుఖారీలో 3976వ హదీస్ లో హజ్రత్ ఖతాదా రహమతుల్లాహ్ అలైహ్ ఏం చెప్తున్నారు,
أَحْيَاهُمُ اللَّهُ حَتَّى أَسْمَعَهُمْ (అహ్యాహుముల్లాహు హత్తా అస్మఅహుమ్) వారిని వినిపించేంత వరకు అల్లాహ్ వారికి జీవం పోసాడు
అల్లాహ్ వారిని ఆ సందర్భంలో వారికి జీవం పోసాడు. హత్తా అస్మఅహుమ్, ప్రవక్త యొక్క మాటను వారికి వినిపించాడు. తౌబీఖన్ వ తస్గీరన్ వ నఖీమతన్ వ హసరతన్ వ నదామతన్. ఎందుకు, వారికి ఆ సందర్భంలో బాధ, అయ్యో ప్రవక్త మాటను మేము వినలేదు కదా అన్నటువంటి ఒక బాధ, ఎంతో ఒక షర్మిందాపన్, పశ్చాత్తాపం లాంటిది కలగాలి, ఇంకింత వారికి ఆ ఆవేశం అనేది వారి యొక్క అఫ్సోస్ అనేది పెరిగిపోవాలి అన్న ఉద్దేశంతో ఆ సందర్భంలో అల్లాహు త’ఆలా వారిని మరోసారి లేపి ప్రవక్త యొక్క మాటను వినిపించాడు. అది అంత మటుకు మాత్రమే.
మృతులు వినలేరని చెప్పే ఖుర్ఆన్ ఆయతులు
అందుగురించి, ఇప్పుడు నేను కొన్ని ఖుర్ఆన్ ఆయతులు వినిపిస్తాను వాటిని శ్రద్ధగా వినండి. ఖుర్ఆన్ ద్వారా మనకు ఏం తెలుస్తుంది అంటే సామాన్యంగా మృతులు, చనిపోయిన వారు బ్రతికి ఉన్న వారి ఏ మాటను వినలేరు. సూరె నమల్ ఆయత్ నెంబర్ 80లో అల్లాహ్ చెప్పాడు,
إِنَّكَ لَا تُسْمِعُ الْمَوْتَى (ఇన్నక లా తుస్మిఉల్ మౌతా) నిశ్చయంగా నువ్వు మృతులకు వినిపించలేవు.
నువ్వు మృతులకు, చనిపోయిన వారికి వినిపించలేవు. అలాగే సూరె రూమ్ ఆయత్ నెంబర్ 52లో ఇలాంటి ఆయతే ఉంది. అక్కడ కూడా ఉంది, ఓ ప్రవక్తా నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ మృతులకు వినిపించలేవు. అయితే మృతులు వినరు, బ్రతికి ఉన్న వారు తమ ఏ మాటను కూడా మృతులకు వినిపించలేరు అని ఈ ఆయత్ చాలా స్పష్టంగా ఉంది. అంతేకాకుండా అల్లాహు త’ఆలా కోరినప్పుడు, ఏదైనా అవసర సందర్భంగా అల్లాహు త’ఆలాకు ఇష్టమైతే వినిపించవచ్చు. ఆ శక్తి అల్లాహ్‌కు ఉంది. కానీ ఒక సామాన్య నియమం, ఒక రూల్, ఒక పద్ధతి ఏమిటి? మృతులు వినరు. కానీ అల్లాహ్ కోరినప్పుడు వినిపిస్తాడు. అల్లాహ్ స్వయంగా వినిపిస్తాడు. దానికి సాక్ష్యంగా ఈ హదీస్, ఈ ఖుర్ఆన్ యొక్క ఆయతును మనం తెలుసుకోవచ్చు. ఈ ఆయత్ సూరె ఫాతిర్ ఆయత్ నెంబర్ 22.
وَمَا يَسْتَوِي الْأَحْيَاءُ وَلَا الْأَمْوَاتُ (వమా యస్తవిల్ అహ్యాఉ వలల్ అమ్వాత్) బ్రతికి ఉన్న వారు, చనిపోయిన వారు ఇద్దరూ సమానులు కాలేరు.
إِنَّ اللَّهَ يُسْمِعُ مَنْ يَشَاءُ (ఇన్నల్లాహ యుస్మిఉ మన్ యషా) నిశ్చయంగా అల్లాహ్ తాను కోరిన వారికి వినిపిస్తాడు
وَمَا أَنْتَ بِمُسْمِعٍ مَنْ فِي الْقُبُورِ (వమా అంత బిముస్మిఇన్ మన్ ఫిల్ ఖుబూర్) మరియు సమాధులలో ఉన్నవారికి నీవు వినిపించలేవు.
ఇక్కడ అల్లాహ్ కోరినప్పుడు వినిపిస్తాడు అని దీంతో కూడా కొందరు పెడమార్గంలో పడిపోతారు. అదేమిటి? అవును ఔలియా అల్లాహ్‌కు వినిపించే శక్తి అల్లాహ్‌కు ఉంది, అందుగురించి మేము మొరపెట్టుకునే మొరలను వారు ఇప్పుడు వింటున్నారు, అల్లాహ్ వినిపిస్తున్నాడు, వారు స్వయంగా వింటారని మేము అనుకుంటలేము. మళ్ళీ ఇలా తిప్పికొట్టి వారు తమ యొక్క విశ్వాసాన్ని మరింత గట్టి పరుచుకునే ప్రయత్నం చేస్తారు. అయితే బుఖారీలోని మొదటి హదీస్ బద్ర్‌లో చనిపోయిన ముష్రికులకు ఏదైతే ప్రవక్త వినిపించారో దానికి ఈ ఆయత్ సాక్ష్యం అవుతుంది.
అంతేకాకుండా చనిపోయిన ప్రతీ వ్యక్తిని సమాధిలో పెట్టినప్పుడు అతన్ని సమాధిలో పెట్టేసి వారి యొక్క బంధుమిత్రులు తిరిగి వస్తున్నప్పుడు అతను ఏదైతే వారి చెప్పుల శబ్దాన్ని వింటాడో, అయ్యో అందరూ నన్ను వదిలేసి నన్ను ఒక్కడిని వదిలేసి పోతున్నారా, నేను ఏకాంతంలో అయిపోయానా, అలాంటి రంది అతనికి కలగడానికి, ఎవరి ఎవరి యొక్క అండదండ నాకు ఉంది అన్న యొక్క ఆలోచనతో నేను ఎంతో అల్లాహ్‌కు వ్యతిరేకంగా కూడా జీవితం గడిపానో, ఇప్పుడు ఈ సమాధిలో నన్ను ఎవరూ కూడా కానడానికి చూడడానికి వస్తలేరు, నేను ఒక్కడిని అయిపోయాను, అలాంటి ఒక ఆవేదన అతనికి కలగడానికి కేవలం వారు వెళ్ళిపోతున్న చెప్పుల శబ్దాన్ని వినిపిస్తాడు, అంతే. ఇంకా వేరే మాటలను వినిపిస్తాడు అని అక్కడ ఇక్కడ లేదు మనకు. అలాంటి విషయం తెలుస్తలేదు.
అందుగురించి సోదరులారా, ఈ రెండు హదీసులను మనం తీసుకొని ఖుర్ఆన్ ఆయతులను మనం తిరస్కరించవద్దు. ఈ రెండు ఆయతులకు రెండు హదీసులను ఈ సూరె ఫాతిర్ యొక్క ఆయత్. ఒకవేళ వీరందరూ వింటున్నారు అని మనం అనుకుంటే, అల్లాహ్ వారిని వినిపిస్తున్నాడు అని అనుకుంటే, ‘ఇన్నల్లాహ యుస్మిఉ మన్ యషా’, అల్లాహ్ తాను కోరిన వారికి వినిపిస్తాడు అని చెప్పేకి ముందు బ్రతికి ఉన్న వారు, చనిపోయిన వారు ఇద్దరూ సమానులు కాజాలరు అని ఏదైతే అంటున్నాడో మరి దాని యొక్క భావం ఏంటి? ఒకవేళ అందరూ వినేది ఉంటే, వారు కూడా బ్రతికి ఉన్న వాళ్ళ మాదిరిగానే అయిపోయారు. అందుగురించి ఈ ఆయతులు ఈ హదీసులను మనం విన్న తర్వాత సామాన్యంగా మృతులు వినరు. ఏదైనా ప్రత్యేక సందర్భంలో, ఏదైనా ఒక ఉద్దేశంతో వినిపిస్తాడు అన్నటువంటి హదీస్ ఎక్కడైనా వచ్చి ఉంటే దానిని అక్కడి వరకే మనం నమ్మాలి గానీ, అంతకంటే ఇంకా ముందుకు వెళ్ళేసి అన్ని విషయాలను వింటారు అని మనం దాంట్లో కలుపుకోవడం ఇది పెడమార్గానికి తీసుకెళ్తుంది.
మరికొందరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి ఏం విశ్వసిస్తారు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో తమ సమాధిలో ఉండి మనల్ని చూస్తున్నారు, మనం చేసే కార్యాలను చూస్తున్నారు, మనం చెప్పే మాట్లాడే మాటలను వింటున్నారు అని కొందరు విశ్వసిస్తారు. అది కూడా ఖుర్ఆన్ హదీసులకు వ్యతిరేకమైన విశ్వాసం.
ఏమిటంటారు తెలుసా వాళ్ళు? ఒక హదీసులో మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దరూద్ చదివినప్పుడు ఆ దరూద్ దేవదూతలు తీసుకెళ్లి ప్రవక్త గారికి వినిపిస్తారు. అయితే సహీ హదీసుల్లో ఇంత విషయమే ఉంది. కానీ మరికొన్ని జయీఫ్ హదీసులలో ఏం వస్తుంది అంటే, ఎవరైనా ప్రవక్త సమాధి వద్దకు వచ్చి దరూద్ సలాం చేస్తే స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దరూద్ సలాంకు సమాధానం ఇస్తారు. కానీ ఇది నిరాధారమైన హదీస్. బలమైనది కాదు. అయితే హదీసులు కూడా బలహీనంగా ఉంటాయా? హదీస్ యొక్క పరంపరలో, హదీస్ యొక్క సనదులో పరంపరలో కొందరు అబద్దీకులు, కొందరు తప్పుగా ప్రవక్త వైపునకు మాటలు కల్పించే వాళ్ళు కూడా వస్తారు. హదీస్ యొక్క పండితులు అలాంటి కల్పిత హదీసులను వేరుగా చేసి ఉన్నారు. అయితే సహీ హదీసులో ఎక్కడా కూడా ప్రవక్త డైరెక్ట్ మన యొక్క సలాంను దరూదును వింటారు అని లేదు. ఏ సహీ హదీసులో లేదు. దూరమైనా దగ్గరైనా ఎక్కడ ఉండి మనం దరూద్ చదివినా గానీ ప్రవక్త డైరెక్ట్ గా వింటారు అని ఎక్కడా ఏ హదీసులో కూడా లేదు. అందుగురించి ప్రవక్త కూడా మన మాటలను వింటారు అని మనం ఎప్పుడూ కూడా నమ్మవద్దు విశ్వసించవద్దు.
ప్రళయ దినాన అల్లాహ్ మరియు ఈసా (అలైహిస్సలాం) మధ్య సంభాషణ
అయితే, ఇంతవరకు ఈ విషయాలు మనం విన్న తర్వాత నేను ఖుర్ఆన్‌లోని ఒక ఆయత్, ఆ ఆయత్‌కు సాక్ష్యాధారంగా సహీ బుఖారీలోని ఒక హదీస్ వినిపిస్తాను. ఈ ఆయత్ మరియు ఈ హదీస్ విన్న తర్వాతనైనా ఇక మన విశ్వాసాలు కరెక్ట్, నిజమైనవి, శుద్ధమైనవి మరియు ప్రవక్త సహాబాల విశ్వాస ప్రకారంగా ఉండాలి. శవాలు వింటారు అని, వారి సమాధుల వద్దకు వెళ్లి అక్కడ ఎలాంటి షిర్క్ పనులకు, ఎలాంటి మనం తావు ఇవ్వకూడదు, ఎలాంటి మనం అక్కడ మోసాలకు గురికాకూడదు.
అదేవిటండీ ఆ ఆయత్ అంటే, సూరె మాయిదాలో అల్లాహు త’ఆలా ఈసా అలైహిస్సలాం కు సంబంధించిన ఒక సంఘటన తెలిపారు. అదేమిటి, ఈసా అలైహిస్సలాం అల్లాహ్ యొక్క సత్య ప్రవక్త, తండ్రి లేకుండా అల్లాహు త’ఆలా మర్యమ్ అలైహిస్సలాం ద్వారా అతన్ని పుట్టించాడు. ఈ విషయం మనకు తెలిసిందే. అలాగే మనం విశ్వసించాలి. అయితే ఈ రోజుల్లో అనేకమంది క్రైస్తవులు స్వయంగా ఈసా అలైహిస్సలాంనే దేవునిగా పూజిస్తున్నారు. మరికొందరు మర్యమ్ అలైహిస్సలాంను కూడా పూజిస్తున్నారు. ఇంకొందరు ఈసా, పరిశుద్ధాత్మ, యెహోవా అని త్రైత్వ దైవాన్ని (Trinity) పూజిస్తున్నారు. ఇవన్నీ కూడా తప్పుడు విశ్వాసాలు. వారి యొక్క ఈ ఆరాధనలన్నీ కూడా షిర్క్‌లోకి వస్తాయి. స్వయంగా ఈసా అలైహిస్సలాం నన్ను కాదు ఏకైక దేవుణ్ణి పూజించండి అని స్పష్టంగా చెప్పారు. ఖుర్ఆన్ సూరె ఆలి ఇమ్రాన్‌లో ఉంది.
اعْبُدُوا اللَّهَ رَبِّي وَرَبَّكُمْ (ఉ’బుదుల్లాహ రబ్బీ వ రబ్బకుమ్) నాకు మీకు ప్రభువైన అల్లాహ్‌ను మాత్రమే మీరు ఆరాధించండి.
అలాగే బైబిల్‌లో యోహాను సువార్తలో ఉంది. ఆకాశాల్లో ఉన్న ఆ దేవుణ్ణి పూజించేవారే నిత్య జీవితాన్ని పొందుతారు అని చాలా స్పష్టంగా ఉంది. అయితే ప్రళయ దినాన అల్లాహు త’ఆలా ఈసా అలైహిస్సలాంను పిలుస్తాడు. అక్కడ గట్టిగా ప్రశ్నిస్తాడు. ఆ విషయం ఏంటి? ఆ ప్రశ్నలు ఏంటి? కొంచెం శ్రద్ధగా వినండి.
وَإِذْ قَالَ اللَّهُ يَا عِيسَى ابْنَ مَرْيَمَ أَأَنْتَ قُلْتَ لِلنَّاسِ اتَّخِذُونِي وَأُمِّيَ إِلَٰهَيْنِ مِنْ دُونِ اللَّهِ మరియు (ఆ రోజును గుర్తు చేసుకోండి), అప్పుడు అల్లాహ్ ఇలా అంటాడు: ఓ మర్యమ్ కుమారుడవైన ఈసా! నీవు ప్రజలతో, ‘అల్లాహ్‌ను వదలి నన్నూ, నా తల్లినీ ఆరాధ్య దైవాలుగా చేసుకోండి’ అని అన్నావా?
మరియం పుత్రుడైన ఓ ఈసా, అల్లాహ్‌ను వదలి నన్ను నా తల్లిని ఆరాధ్య దైవాలుగా చేసుకోండి అని నీవు ప్రజలకు చెప్పావా? అని అల్లాహ్ నీలదీసి అడిగే సందర్భం కూడా స్మరించుకోదగినది. అప్పుడు ఈసా అలైహిస్సలాం ఇలా విన్నవించుకుంటారు. ఏమని,
قَالَ سُبْحَانَكَ مَا يَكُونُ لِي أَنْ أَقُولَ مَا لَيْسَ لِي بِحَقٍّ ఓ అల్లాహ్, నిన్ను పరమ పవిత్రుడిగా భావిస్తున్నాను. ఏ మాటను అనే హక్కు నాకు లేదో అలాంటి మాటను అనటం నాకే మాత్రం తగదు.
إِنْ كُنْتُ قُلْتُهُ فَقَدْ عَلِمْتَهُ تَعْلَمُ مَا فِي نَفْسِي وَلَا أَعْلَمُ مَا فِي نَفْسِكَ ఒకవేళ నేను గనక అలాంటిది ఏదైనా అని ఉంటే అది నీకు తెలిసి ఉండేది. నా మనసులో ఏముందో కూడా నీకు తెలుసు. కానీ నీలో ఏముందో నాకు తెలియదు.
إِنَّكَ أَنْتَ عَلَّامُ الْغُيُوبِ నిశ్చయంగా నీవు సమస్త గుప్త విషయాలను ఎరిగినవాడవు.
مَا قُلْتُ لَهُمْ إِلَّا مَا أَمَرْتَنِي بِهِ أَنِ اعْبُدُوا اللَّهَ رَبِّي وَرَبَّكُمْ నీవు నాకు ఆజ్ఞాపించిన దానిని తప్ప నేను వారికి మరేమీ చెప్పలేదు: ‘అల్లాహ్‌ను ఆరాధించండి, ఆయనే నా ప్రభువు మరియు మీ ప్రభువు.’
وَكُنْتُ عَلَيْهِمْ شَهِيدًا مَا دُمْتُ فِيهِمْ فَلَمَّا تَوَفَّيْتَنِي كُنْتَ أَنْتَ الرَّقِيبَ عَلَيْهِمْ وَأَنْتَ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ నేను వారి మధ్య ఉన్నంత కాలం వారిపై సాక్షిగా ఉన్నాను. కానీ నీవు నన్ను పైకి లేపుకున్న తరువాత, నీవే వారిపై పర్యవేక్షకుడవుగా ఉన్నావు. మరియు నీవు ప్రతి విషయానికి సాక్షిగా ఉన్నావు.
ఈసా అలైహిస్సలాం ప్రవక్త కదా, అయినా ఇప్పుడు వారందరూ అంటే క్రైస్తవులందరూ వారిని పూజిస్తున్నారు అన్న విషయం ఈసా అలైహిస్సలాంకు తెలుసా? తెలియదు. అందుగురించి ఏమంటున్నారు, నేను వారి మధ్యలో ఉన్నంత వరకే నేను సాక్ష్యంగా ఉన్నాను. ఎప్పుడైతే నీవు నన్ను నీ వద్దకు తీసుకున్నావో, నీవే వారిపై వారిని పర్యవేక్షించి ఉన్నావు. వారు ఏం చేస్తున్నారో నాకేం తెలుసు. ఇది సూరె మాయిదాలోని 116, 117వ ఆయత్.
దీనికి సాక్ష్యాధారంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హదీస్ ఏంటి? అది కొంచెం శ్రద్ధగా వినండి. కానీ ఈ హదీసులో తెలిపే ముందు, ఈ రోజుల్లో ప్రపంచమంతటిలో ఎక్కడెక్కడ ఏ పెద్ద పెద్ద ఔలియాలు, పెద్ద పెద్ద బాబాలు, పీరీలు, ముర్షదులు ఎవరెవరైతే ఉన్నారో, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్థానం వారి కంటే గొప్పదా లేకుంటే వారందరూ మన ప్రవక్త కంటే గొప్పవారా? సమాధానం ఇవ్వండి. ప్రవక్తనే గొప్పవారు కదా. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు కదా మనకు. అయితే స్వయంగా ప్రవక్త సంగతి ఈ హదీసులో వినండి. ప్రవక్త ఎలా విన్నవించుకుంటున్నారు? ప్రవక్త తమ తర్వాత జరిగిన విషయాలను నాకు తెలియవు అన్నట్టుగా ఎలా ప్రస్తావిస్తున్నారో. మరి ఈ రోజుల్లో మనం ఎలాంటి తప్పుడు విశ్వాసాల్లో, పెడమార్గాల్లో పడి ఉన్నామో మనం మనకు మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ హదీస్ సహీ బుఖారీలో హదీస్ నెంబర్ 4625, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఈ హదీసును హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు గారు ఉల్లేఖించారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రసంగించారు. ఖుత్బా ఇచ్చారు. అంటే ఏదో ఒక సహాబీతో ప్రత్యేకంగా చెప్పిన విషయం కాదు. 10 మంది 50 మంది 100 మంది ముంగట ఖుత్బాలో ప్రసంగంలో చెప్పిన విషయం. ఆ ప్రసంగంలో ఇలా చెప్పారు. యా అయ్యుహన్నాస్, ఓ ప్రజలారా ఇన్నకుమ్ మహ్షూరున ఇలల్లాహి హుఫాతన్ ఉరాతన్ గుర్లా. మీరు అల్లాహ్ వైపునకు లేపబడతారు. మొదటిసారి పుట్టిన స్థితిలో, శరీరంపై బట్టలు లేకుండా, కాళ్ళకు చెప్పులు లేకుండా, సున్నతీలు చేయబడకుండా. మళ్లీ ప్రవక్త ఖుర్ఆన్ యొక్క ఆయత్ చదివారు. సూరె అంబియా ఆయత్ నెంబర్ 104.
كَمَا بَدَأْنَا أَوَّلَ خَلْقٍ نُعِيدُهُ وَعْدًا عَلَيْنَا إِنَّا كُنَّا فَاعِلِينَ తొలిసారిగా మిమ్మల్ని పుట్టించిన రీతిలో మలిసారి మిమ్మల్ని మేము లేపుతాము. ఇది మా యొక్క వాగ్దానం. దీనిని మేము పూర్తి చేసి తీరుతాము.
ఇది సూరె అంబియా ఆయత్ నెంబర్ 104 యొక్క అనువాదం. మళ్లీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, వినండి, వ ఇన్న అవ్వలల్ ఖలాయిఖి యుక్సా యౌమల్ ఖియామతి ఇబ్రాహీమ్ అలైహిస్సలాతు వస్సలాం. అందరూ ఏ స్థితిలో లేస్తారు సమాధుల నుండి? నగ్నంగా. బట్టలు లేకుండా. చెప్పులు లేకుండా. సున్నతీలు చేయబడకుండా. అయితే, మొట్టమొదటిసారిగా హజ్రత్ ఇబ్రాహీమ్ అలైహిస్సలాంకు వస్త్రాలు ధరింపజేయబడతాయి. ఆ తర్వాత మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి. అయితే, ఆ మైదానే మహ్షర్‌లో, ఆ పెద్ద మైదానంలో ఎక్కడైతే అందరూ, ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని ప్రళయం సంభవించే వరకు వచ్చిన ఈ జన సమూహం అంతా ఒకే ఒక మైదానంలో సమూహం అవుతారు, జమా అవుతారు. అక్కడ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, వినండి, వ ఇన్నహు యుజాఉ బిరిజాలిన్ మిన్ ఉమ్మతీ ఫయు’ఖదు బిహిమ్ దాతశ్శిమాల్. నేను నా హౌదె కౌసర్ పై నా ఉమ్మతీయులు, నా అనుచర సంఘం వస్తుంది అని నేను వేచిస్తూ ఉంటాను. వారు కొన్ని కొన్ని గ్రూపుల రూపంలో వస్తూ ఉంటారు. కొందరు నా వైపునకు వస్తూ ఉంటారు, ఫయు’ఖదు బిహిమ్ దాతశ్శిమాల్, వారిని నా వద్దకు రానివ్వకుండా ఎడమ వైపునకు నెట్టేయడం జరుగుతుంది. ఫ అఖూల్, అప్పుడు నేను అంటాను, యా రబ్బీ ఉసైహాబీ, ఓ ప్రభువా వీరు నా యొక్క అనుచరులు, నన్ను విశ్వసించిన వారు. ఫ యుఖాల్, అప్పుడు అనబడడం జరుగుతుంది.
إِنَّكَ لَا تَدْرِي مَا أَحْدَثُوا بَعْدَكَ (ఇన్నక లా తద్రీ మా అహదసూ బ’అదక) నిశ్చయంగా, నీ తర్వాత వారు ఏ కొత్త కొత్త విషయాలు పుట్టించుకొని ధర్మం నుండి దూరమయ్యారో నీకు తెలియదు ఆ విషయం.
ఎప్పుడు అనబడుతుంది? ప్రళయ దినాన. హౌదె కౌసర్ వద్ద. హౌదె కౌసర్ వద్ద ప్రవక్త శుభ హస్తాలతో హౌదె కౌసర్ ఆ శుభ జలాన్ని త్రాగడానికి అందరూ గుంపులు గుంపులుగా వెళ్తూ ఉంటారు. ఒక గుంపు వచ్చినప్పుడు వారిని ప్రవక్త వద్దకు రానివ్వడం జరగదు. ఎడమ వైపునకు నెట్టేయడం జరుగుతుంది. అయ్యో నా వారు వాళ్ళు, రానివ్వండి నా దగ్గరికి అని ప్రభువును వేడుకుంటారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. కానీ ప్రభువు వైపు నుండి సమాధానం ఏమొస్తుంది? నీవు చనిపోయిన తర్వాత, నీ తర్వాత వారు ఏ కొత్త కొత్త విషయాలు పుట్టించుకొని ధర్మం నుండి దూరమయ్యారో (ఇన్నక లా తద్రీ) నీకు తెలియదు ఆ విషయం.
ఈ హదీస్ ఇంకా ముందుకు ఉంది. కానీ ఇక్కడ నేను ఈ విషయాన్ని నొక్కి చెప్తున్నాను మరోసారి. ఇన్నక లా తద్రీ. నీకు తెలియదు. నీకు ఆ సందర్భంలో నీకు జ్ఞానం లేదు. నీవు చనిపోయిన తర్వాత నీ యొక్క ఈ నిన్ను విశ్వసించే వారు ఏ పెడమార్గంలో పడిపోయారో నీకు తెలియదు. ఈరోజు మనం ఏమనుకుంటున్నాము? ప్రవక్త మనల్ని చూస్తున్నారు, మనం చెప్పే మాట్లాడే మాటలన్నీ, మనం చేసే ప్రార్థనలన్నీ వింటున్నారు. ఇది తప్పు విషయం ఇది. ఈ హదీసుకి వ్యతిరేకంగా ఉందా లేదా వారి యొక్క ఈ విశ్వాసం? ఆ తర్వాత వినండి, ఫ అఖూల్, ప్రవక్త అంటున్నారు, అప్పుడు నేను అంటాను కమా ఖాలల్ అబ్దుస్సాలిహ్, ఎలాగైతే ఆ పుణ్య పురుషుడైన, సదాచరుడైన దాసుడు ఈసా అలైహిస్సలాం చెప్పాడో
وَكُنْتُ عَلَيْهِمْ شَهِيدًا مَا دُمْتُ فِيهِمْ فَلَمَّا تَوَفَّيْتَنِي كُنْتَ أَنْتَ الرَّقِيبَ عَلَيْهِمْ وَأَنْتَ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ నేను వారి మధ్య ఉన్నంత కాలం వారిపై సాక్షిగా ఉన్నాను. కానీ నీవు నన్ను పైకి లేపుకున్న తరువాత, నీవే వారిపై పర్యవేక్షకుడవుగా ఉన్నావు. మరియు నీవు ప్రతి విషయానికి సాక్షిగా ఉన్నావు.
నేను వారి మధ్యలో ఉన్నంత మాత్రం నేను వారిపై సాక్ష్యంగా ఉన్నాను. ఫలమ్మా తవఫ్ఫైతనీ, ఎప్పుడైతే నీవు నన్ను చంపివేశావో, ఎప్పుడైతే నువ్వు నన్ను నా ప్రాణం తీసుకున్నావో, కున్త అంతర్రఖీబ అలైహిమ్, నీవే వారిని పర్యవేక్షిస్తూ ఉన్నావు. వ అంత అలా కుల్లి షైఇన్ షహీద్, మరియు నీవే సర్వ విషయాలపై సర్వ జగత్తుపై సత్యమైన సాక్షివి.
అయితే సోదరులారా, ఈ హదీస్ ఎంత స్పష్టంగా ఉంది. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సైతం ఆయన కూడా ఎవరి ఏ మాట వినరు ఇప్పుడు. ఎవరి యొక్క మొరలను ఆలకించలేరు. అలాంటప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే తక్కువ స్థానంలో ఉన్న వారి గురించి వారు వింటారు, వారు చేస్తారు, మనకు అన్ని రకాల అనుగ్రహాలు ప్రసాదిస్తారు, ఇలాంటి విశ్వాసాలు, ఇలాంటి నమ్మకాలు మనల్ని ఎంత షిర్క్ లాంటి లోతుకు తీసుకెళ్తాయో మనమే ఆలోచించాలి. ఇ
లా చెప్పుకుంటూ పోతే సోదరులారా, ఖుర్ఆన్‌లో ఇంకా ఎన్నో ఆయతులు ఉన్నాయి, ఎన్నో హదీసులు ఉన్నాయి. ఇలాంటి తప్పుడు విశ్వాసాలకు వ్యతిరేకంగా. కానీ, కొంత సమయం ఉంది గనుక కేవలం ఒకే ఒక ఆయత్, దాని యొక్క అనువాదం మీ ముందు తెలిపి నేను ఈ యొక్క ప్రసంగాన్ని సమాప్తం చేస్తాను. ఇది సూరె ఫాతిర్. సూరె ఫాతిర్‌లోని ఆయత్ నెంబర్ 13, 14. అల్లాహ్ అంటున్నాడు,
ذَٰلِكُمُ اللَّهُ رَبُّكُمْ لَهُ الْمُلْكُ (దాలికుముల్లాహు రబ్బుకుమ్ లహుల్ ముల్క్) ఆయనే అల్లాహ్, మీ ప్రభువు, ఆధిపత్యం ఆయనదే.
وَالَّذِينَ تَدْعُونَ مِنْ دُونِهِ مَا يَمْلِكُونَ مِنْ قِطْمِيرٍ (వల్లదీన తద్ఊన మిన్ దూనిహీ మా యమ్లికూన మిన్ ఖిత్మీర్) మరియు ఆయనను వదలి మీరు పిలిచేవారు ఖర్జూరపు బీజంపై ఉండే పొరంత కూడా అధికారం కలిగి లేరు.
ఆయన్ని కాకుండా, ఆయన్ని వదలి మీరు ఎవరెవరినైతే మొరపెట్టుకుంటున్నారో, ఎవరెవరినైతే మీరు పిలుస్తున్నారో, దుఆలు చేస్తున్నారో, మా యమ్లికూన మిన్ ఖిత్మీర్, ఖర్జూరపు బీజంపై ఉన్నటువంటి మరీ పలుచని ఆ పొర అంత మాత్రం శక్తి కూడా వారికి లేదు. మీరు అల్లాహ్‌ను కాకుండా ఎవరినైతే పూజిస్తున్నారో, ఎవరినైతే మొరపెట్టుకుంటున్నారో వారి వద్ద ఖర్జూరపు గుట్లి, దాని యొక్క బీజంపై చాలా పలుచని పొర ఏదైతే ఉంటుందో అంత శక్తి కూడా వారి వద్ద లేదు.
إِنْ تَدْعُوهُمْ لَا يَسْمَعُوا دُعَاءَكُمْ (ఇన్ తద్ఊహుమ్ లా యస్మఊ దుఆఅకుమ్) ఒకవేళ నీవు వారిని మొరపెట్టుకుంటే మీ మొరలను వారు ఆలకించలేరు, వినలేరు.
وَلَوْ سَمِعُوا مَا اسْتَجَابُوا لَكُمْ (వలవ్ సమీఊ మస్తజాబూ లకుమ్) ఒకవేళ వారు విన్నా, మీకు సమాధానం ఇవ్వలేరు.
లేదు వింటారు, వింటారు, వింటారు అని ఏదైతే మీ విశ్వాసం ఉందో, ఒకవేళ విన్నా గానీ మస్తజాబూ లకుమ్, మీకు ఎలాంటి జవాబ్, సమాధానం ఇవ్వలేరు. అల్లాహ్ అంటున్నాడు, ఒకవేళ మీ యొక్క బలహీన విశ్వాసం ఉంది కదా లేదు వింటున్నారు అని, ఒకవేళ విన్నా గానీ సమాధానం ఏ మాత్రం ఇవ్వలేరు. సహీ బుఖారీలోని మొదటి హదీస్ ఏదైతే వినిపించానో అక్కడ కూడా ప్రవక్త అదే చెప్పారు. ఇప్పుడు వారు వింటున్నారు కానీ జవాబు ఇవ్వలేరు. సమాధానం ఇవ్వలేరు. బదులు పలకలేరు. అల్లాహ్ ఏమంటున్నాడు ఇక్కడ? ఒకవేళ మీ విశ్వాస ప్రకారంగా, ఏదైనా అవసరం పడి, ఏదైనా సందర్భంలో మేము వారికి వినిపించినా గానీ వారు సమాధానం చెప్పలేరు, ఇవ్వలేరు.
وَيَوْمَ الْقِيَامَةِ يَكْفُرُونَ بِشِرْكِكُمْ మరియు ప్రళయ దినాన వారు మీ షిర్క్‌ను తిరస్కరిస్తారు.
మరియు ప్రళయ దినాన యక్ఫురూన బిషిర్కికుమ్. మీరు అల్లాహ్‌తో పాటు వారిని ఏదైతే సాటి కల్పించారో దీనిని వారు తిరస్కరిస్తారు. తిరస్కరిస్తారు. అల్లాహ్ మీరు అల్లాహ్‌తో పాటు మీరు వారిని ఏదైతే సాటి కల్పిస్తున్నారో వాటి దానిని వారు తిరస్కరిస్తారు. అంటే ఏంటి? అంటే వారికి ఈ విషయం తెలియదు. ఒకవేళ తెలిసేది ఉంటే ఎందుకు తిరస్కరిస్తారు? తెలిసేది ఉంటే ఎందుకు తిరస్కరిస్తారు? మీరు ఇక్కడ మొరపెట్టుకున్న విషయం, అల్లాహ్‌ను కాకుండా వారిని మీరు ఏదైతే దుఆ చేస్తున్నారో ఇవన్నీ విషయాలు వాస్తవానికి వారు వినలేరు, వారికి ఏమాత్రం తెలియదు. అందుగురించే ప్రళయ దినాన ఎప్పుడైతే వీరు వెళ్తారో, అక్కడ కూడా వారు వీరి యొక్క ఈ షిర్క్‌ను తిరస్కరిస్తారు. ఈ తిరస్కరిస్తారు అన్న విషయం బహుశా ఇంకొందరికి అర్థం అవతలేదు అనుకుంటా. సూరె బఖరాలో, సూరె అహ్కాఫ్‌లో 26వ పారా స్టార్టింగ్ ఆయతులలోనే ఐదు ఆరు ఆయతులలోనే అక్కడ విషయం ఉంది. సూరె బఖరాలో రెండవ అధ్యాయం అంటే రెండవ పారా ఏదైతే ఉందో, అందులో సగం అయిన తర్వాత ఇంచుమించు సుమారు ఒక క్వార్టర్ పారా అయిపోయిన తర్వాత
إِذْ تَبَرَّأَ الَّذِينَ اتُّبِعُوا مِنَ الَّذِينَ اتَّبَعُوا وَرَأَوُا الْعَذَابَ وَتَقَطَّعَتْ بِهِمُ الْأَسْبَابُ (ఆ రోజును గుర్తు చేసుకోండి), ఎప్పుడైతే అనుసరించబడిన వారు తమను అనుసరించిన వారి నుండి వైదొలగిపోతారో, మరియు వారు శిక్షను చూస్తారో, మరియు వారి మధ్య సంబంధాలన్నీ తెగిపోతాయో.
ఆ ఆయతుల సంగతి ఆ ఆయతులను దాని యొక్క వ్యాఖ్యానం చదవండి. ఏమవుతుంది, సహీ బుఖారీలో వివరణ ఉంది. ప్రళయ దినాన ప్రజలందరూ ఆ మైదానే మహ్షర్‌లో జమా అవుతారు కదా, అక్కడ అల్లాహు త’ఆలా ఎవరెవరు ఎవరెవరిని మొరపెట్టుకునేవారో వారి వెంట వెళ్ళండి అని అన్నప్పుడు, ఈ ఇమాములను, పీరీలను, ముర్షదులను, బాబాలను వారందరినీ మొరపెట్టుకునేవారు వారి వారిని వెనుకులాడుతూ ఉంటారు. వెనుకులాడి ఆ మీరే కదా పీరానే పీర్ షేఖ్ అబ్దుల్ ఖాదర్ జీలాని, మీరే కదా పెద్ద గుట్ట వాళ్ళు, మీరే కదా ఈ విధంగా వారి వారి వద్దకు వెళ్లి వారి వెంట ఉండి వారి యొక్క సిఫారసు పొందడానికి వారి వెనక వెళ్లే ప్రయత్నం చేస్తారు ప్రళయ దినాన. అప్పుడు వారు వీరిని చూసి ఓ అల్లాహ్ వీరు మమ్మల్ని పూజించే వారు కాదు, మమ్మల్ని మొరపెట్టుకునే వారు కాదు, వీరు మాకు శత్రువులు, మమ్మల్ని బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, మాకు వీరికి ఎలాంటి సంబంధం లేదు అని స్పష్టంగా చెప్తారు.
సోదరులారా, ఖుర్ఆన్‌లో ఈ ఆయతులు, హదీసుల్లో ఈ విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అసలైన రోగం, అసలైన పెద్ద సమస్య ఏంటంటే ఇలాంటి ఆయతులను ఇలాంటి హదీసులను మనం చదవడం లేదు. ఈ సమాధుల వద్ద ఉండే మౌల్వీలు, ఇలాంటి పండితులు మన సామాన్య ప్రజలకు తెలపడం లేదు. అందుగురించి సామాన్య ప్రజలు ఇలాంటి ఘోరమైన షిర్క్‌లో పడిపోతున్నారు.
అల్లాహు త’ఆలా మనందరికీ సరియైన సన్మార్గం మరియు తౌహీద్, ఈ నిజమైన అఖీదా విశ్వాసానికి సంబంధించిన విషయాలు ఖుర్ఆన్ హదీస్ ఆధారంగా మరిన్ని ఎక్కువగా తెలుసుకునే భాగ్యం అల్లాహ్ కలిగించుగాక. ఈ రోజుల్లో ప్రజలు ఏదైతే షిర్క్‌లో పడి ఉన్నారో వాటి నుండి అల్లాహు త’ఆలా వారిని రక్షించుగాక. జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
2వ అధ్యాయం తౌహీద్ ఘనత, అది పాపాల విమోచనానికి ఉత్తమ సాధనం అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.
“ఎవరయితే విశ్వసించి, తమ విశ్వాసాన్ని “జుల్మ్” (షిర్క్) తో కలుషితం చేయలేదో, వారికే శాంతి ఉంది. వారు మాత్రమే రుజుమార్గంపై ఉన్నవారు.”(అన్ ఆమ్ 6 : 82).
ఉబాద బిన్ సామిత్ (రది అల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు:
“(1) అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడని, ఆయన ఒక్కడేనని, 2) ఆయనకు మరెవ్వరూ సాటిలేరని మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన దాసుడు, ప్రవక్త అని; (3) అలాగే ఈసా (అలైహిస్సలాం) కూడా అల్లాహ్ దాసుడు, ఆయన ప్రవక్త అని, కాకపోతే ఆయన హజ్రత్ మర్యం (గర్భం)లో అవతరించిన అల్లాహ్ వాక్కు, అల్లాహ్ యొక్క ఆత్మ అని; (4,5) స్వర్గ నరకాలు ఉన్నాయి అన్నది యదార్ధమని, ఎవడైతే సాక్ష్యమిస్తాడో ఆ వ్యక్తి కర్మలు ఎలాంటివయినా సరే అల్లాహ్ అతడ్ని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు”. (బుఖారి, ముస్లిం).
ఇత్బాన్ (రది అల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలాసెలవిచ్చారు:
“అల్లాహ్ సంతృప్తి కొరకు “లాఇలాహ ఇల్లల్లాహ్” చదివే వారిపై అల్లాహ్ నరకం నిషేధించాడు”. (బుఖారి, ముస్లిం).
అబూ సఈద్ ఖుద్రీ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారని:
ప్రవక్త మూసా (అలైహిస్సలాం) అల్లాహ్ తో ఇలా విన్నవించుకున్నారు: ‘ఓ అల్లాహ్! నాకు కొన్ని వచనాలు నేర్పు. వాటితో నేను నిన్ను స్మరిస్తాను. నీతో అర్ధిస్తాను”. “ఓ మూసా! “లాఇలాహ ఇల్లల్లాహ్” పలుకు” అని అల్లాహ్ నేర్పాడు. మూసా (అలైహిస్సలాం) అన్నారు: “అల్లాహ్! నీ దాసులందరూ ఇదే వచనముతో స్మరిస్తారు?” “ఓ మూసా! ఏడు ఆకాశాలు, నేను తప్ప అందులో ఉన్న సృష్టి, ఇంకా ఏడు భూములను త్రాసు యొక్క ఒక పళ్లెంలో, “లాఇలాహ ఇల్లల్లాహ్” ను ఇంకొక పళ్లెంలో ఉంచితే “లాఇలాహ ఇల్లల్లాహ్” ఉన్న పళ్లెం క్రిందికి వంగిపోవును” అని అల్లాహ్ (దాని విలువను) తెలిపాడు.
(ఇబ్ను హిబ్బాన్ మరియు హాకిం సేకరించారు. హాకిం నిజపరిచారు).
అల్లాహ్ ఇలా సెలవిచ్చారని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పగా నేను విన్నాను అని అనస్ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు:
“ఓ మానవుడా! నీవు భూమి నిండా పాపాలు చేసినప్పటికీ నాతో మరెవ్వరినీ సాటి కల్పించకుండా (చనిపోయి) నాతో కలిసినప్పుడు, ‘నేను అంతే (భూమి నిండా) క్షమాపణలతో నీతో కలుస్తాను (నిన్ను క్షమిస్తాను).(తిర్మిజి. ఈ హదీసు హసన్).
ముఖ్యాంశాలు:
1. అల్లాహ్ దయ, కరుణ చాలా విశాలమైనది.
2. తౌహీద్ యొక్క పుణ్యం అల్లాహ్ వద్ద చాలా ఎక్కువగా ఉంది.
3. దానితో పాటు అది పాపాలను తుడిచి వేయును.
4. సూరయే అన్‌ఆమ్ లోని ఆయతులో “జుల్మ్” అంటే షిర్క్ అని భావం.
5. ఉబాద బిన్ సామిత్ (రది అల్లాహు అన్హు) హదీసులో ఉన్న ఐదు విషయాల్ని గమనించండి.
6. ఉబాద హదీసు, ఇత్బాన్ హదీసు మరియు అబూ సఈద్ ఖుద్రీ (రది అల్లాహు అన్హుమ్) హదీసులను కలిపితే “లాఇలాహ ఇల్లల్లాహ్ ” యొక్క అసలు అర్ధం నీకు తెలుస్తుంది. మరియు దాని సరియైన భావాన్ని తెలుసు కొనక మోసబోయి తప్పులో పడియున్నవారి విషయం కూడా స్పష్టం అవుతుంది.
7. ఇత్బాన్ హదీసులో ఉన్న షరతు (అల్లాహ్ ఇష్టం కొరకు)పై చాలా శ్రద్ధ వహించాలి.
8. “లాఇలాహ ఇల్లల్లాహ్” ఘనత తెలుసుకునే అవసరం ప్రవక్తలకు సయితం ఉండేది.
9. “లాఇలాహ ఇల్లల్లాహ్” సర్వ సృష్టికన్నా ఎక్కువ బరువుగలదైనప్పటికీ, దాన్ని చదివేవారిలో చాలా మంది యొక్క త్రాసు తేలికగా (విలువలేనిదిగా) ఉండును.
10. ఆకాశాలు ఏడు ఉన్నట్లు భూములు కూడా ఏడు ఉన్నవని రుజువయింది.
11. అందులో కూడా నివసించువారున్నారు. (జీవించువారున్నారు).
12. అల్లాహ్ యొక్క అన్ని గుణగణాలను నమ్మాలని రుజువవుతుంది. కాని “అష్ ఆరీయ్యా” అను ఒక వర్గం వారు కొన్ని గుణగణాలను తిరస్కరిస్తారు.
13. అనస్ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసును నీవు అర్థం చేసుకుంటే, ఇత్బాన్ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసు: “అల్లాహ్ సంతృప్తి కొరకు “లాఇలాహ ఇల్లల్లాహ్ ” చదివే వారిపై అల్లాహ్ నరకం నిషేధించాడు” లో అది కేవలం నోటితో చదవటం కాదు షిర్కు వదులుకోవాలి అని కూడా అర్ధం చేసుకుంటావు.
14. ఉబాద (రది అల్లాహు అన్హు) హదీసులో ఈసా (అలైహిస్సలాం) మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇద్దరిని “అల్లాహ్ దాసులు, ప్రవక్తలు” అని చెప్పబడింది.
15. ప్రతీది అల్లాహ్ ఆజ్ఞ తోనే పుడుతుంది గనుక అది అల్లాహ్ వాక్కు. కాని ఇక్కడ ప్రత్యేకంగా ఈసా (అలైహిస్సలాం) ను అల్లాహ్ వాక్కు అని చెప్పబడింది .
16. (ఆత్మ అల్లాహ్ యొక్క సృష్టి అయినప్పటికీ) ప్రత్యేకంగా ఈసా (అలైహిస్సలాం) అల్లాహ్ యొక్క ఆత్మ అని చెప్పబడింది.
17. స్వర్గ నరకాలను విశ్వసించు ఘనత కూడా తెలిసింది.
18. ఉబాద హదీసులో “కర్మలు ఏలాంటివైనా సరే” అన్నదానితో (అతడు ఏక దైవోపాసకుడు అయి ఉండుట తప్పనిసరి అనే) భావం తెలుస్తుంది.
19. (ప్రళయదినాన కర్మలు తూకము చేయబడే) త్రాసుకు రెండు పళ్ళాలుండును అని తెలిసింది.
20. ఇత్బాన్ హదీసులో అల్లాహ్ కు “వజ్‌హ్” ఉంది అని వచ్చింది. దాని అర్ధం “ముఖం” (Face).
తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ)
తౌహీద్ మానవులందరిపై విధిగా ఉన్నదని మొదటి అధ్యాయంలో తెలుపబడింది. ఇందులో దాని ఘనత, ఔన్నత్యం, దాని మంచి ప్రభావాన్ని మరియు దాని సత్ఫలితాన్ని తెలుపడం జరిగింది. తౌహీద్ లో ఉన్నటువంటి వివిధ ఘనతలు, మంచి ప్రభావాలు మరే దానిలో లేవు. ఇహపరాల మేళ్లు అన్నియూ తౌహీద్ ఫలితము, దాని ఘనత తోనే లభించును. పాపాల మన్నింపు, వాటి విమోచనం కూడా తౌహీద్ ఘనత వలనే. దానికి ఆధారం కూడా పైన తెలుపబడింది. (దాని అనేక ఘనతల్లో కొన్ని క్రింద చూడండి).
1. ఇహపరాల కష్టాలు, విపత్తులు దూరమగుటకు ఇది గొప్ప కారణం.
2.తౌహీద్ హృదయంలో ఆవగింజంత ఉన్నా, అది నరకాగ్నిలో శాశ్వతంగా ఉండకుండా కాపాడుతుంది.
3. అది సంపూర్ణంగా ఉంటే నరక ప్రవేశం నుండే కాపాడుతుంది.
4. తౌహీద్ గల వ్యక్తికి ఇహపర లోకాల్లో సంపూర్ణ సన్మార్గం, పూర్తి శాంతి ప్రాప్తి యగును.
5. అల్లాహ్ సంతృప్తి, దాని సత్ఫలితం పొందుటకు అది ఏకైక కారణం. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సిఫారసుకు అర్హుడయ్యే అదృష్టవంతుడు “లాఇలాహ ఇల్లల్లాహ్” నిర్మలమైన మనుస్సుతో చదివేవాడు.
6. బాహ్య, ఆంతర్య, సర్వ మాటల, కర్మల అంగీకారం, వాటి సంపూర్ణత, వాటి సత్ఫలితం తౌహీద్ పై ఆధారపడియుంది. తౌహీద్ లో ఎంత బలం, స్వచ్ఛత ఉంటే, అంతగా ఆ విషయాలు సంపూర్ణం అవుతాయి.
7.సత్కార్యాలు చేయడం, దుష్కార్యాల నుండి దూరముండడం తౌహీద్ మూలంగా సులభమగును. బాధ కలిగినప్పుడు తృప్తి లభించును. తౌహీద్, విశ్వాసంలో అల్లాహ్ కొరకు స్వచ్ఛత చూపేవాడు సత్కార్యాలపై సత్ఫలితం, అల్లాహ్ ప్రసన్నతను ఆశిస్తాడు. కనుక అవి అతనికి చాలా తేలికగా ఏర్పడుతాయి. దుష్కార్యాలపై ఉన్న శిక్షతో భయపడుతాడు కనుక అవి వదలుకోవడం కూడా అతనికిచాలా తేలికగా ఉంటుంది.
8.హృదయాంతరంలో తౌహీద్ సంపూర్ణమయితే అల్లాహ్ వారికి విశ్వాసం పట్ల ప్రేమను కలుగజేస్తాడు, దాన్ని మనోరంజకమైనదిగా చేస్తాడు.అవిశ్వాసం, దుర్మార్గం, అవిధేయతల పట్ల అసహ్యం కలిగేలా చేస్తాడు. అతన్ని సన్మార్గం పొందువారిలో చేర్చుతాడు.
9.ఏ దాసునిలో తౌహీద్, విశ్వాసం సంపూర్ణంగా ఉంటుందో అతడు అసహ్యమైన సంఘటనలను, కష్ట బాధలను ఎంతో విశాలమైన, సంతృప్తికరమైన మనుస్సుతో సహిస్తాడు. అల్లాహ్ వ్రాసి ఉంచిన అదృష్టంపై సంతోషంగా ఉంటాడు.
10) ఇంకా దాని ఘనత: అది మానవ దాస్యం నుంచి అతన్ని విముక్తి కలిగిస్తుంది. అతడు అల్లాహ్ తప్ప ఇతరుల పై ఆధారపడి, వారితో భయపడుతూ ఉండడు. వారి దయదాక్షిణ్యాల వైపు కన్నెత్తి చూడడు. అతడు చేసేది వారి కొరకూ కాదు. వాస్తవానికి ఇదే నిజమైన పరువు ప్రతిష్ట, మాన్యత. దీనితో పాటు అతడు అల్లాహ్ నే ఆరాధిస్తాడు. ఆయనకు తప్ప మరెవ్వరికి భయపడడు. మరెవ్వరితో కరుణను ఆశించడు. ఇలా అతడు సంపూర్ణ సాఫల్యం పొందుతాడు.
11. తౌహీద్ తప్ప ఇంకే దానికీ లభించని ఘనత: అతని మనసులో తౌహీద్, ఇఖ్లాసు తో కూడుకొని సంపూర్ణం అయితే, అతని చిన్న కర్మ కూడా అసంఖ్యాక ఫలితాన్ని పొందుతుంది. అతని మాటల, చేష్టల ఫలితం లెక్క లేకుండా పెరుగుతుంది. అబూ సయీద్ (రది అల్లాహు అన్హు) హదీసులో వచ్చిన ప్రకారం “ఇఖ్లాసుతో కూడుకున్న అతని ఆ సద్వచనం (లాఇలాహ ఇల్లల్లాహ్) భూమ్యాకాశాలు, (అల్లాహ్ తప్ప) అందులో ఉన్న సర్వం కన్నా బరువుగా ఉంటుంది”. ఇలాంటి విషయమే “హదీసుల్ బితాఖ” అన్న పేరుతో ప్రసిద్ది చెందిన హదీసులో కూడా ఉంది: “లాఇలాహ ఇల్లల్లాహ్” వ్రాసి ఉన్న చిన్న ముక్క తొంభై తొమ్మిది రిజిస్టర్ల (Records) కంటే ఎక్కువ బరువు గలదై పోతుంది. అందులో ప్రతీ ఒక్క రిజిస్టర్ దాని పొడవు, మనిషి దృష్టి ఎంత దూరము చేరుకుంటుందో అంత దూరముంటుంది. మరో వైపు కొందరుంటారు; తౌహీద్, ఇఖ్లాసు మనసులో సంపూర్ణం లేనివారు. వారికి ఈ స్థానం, ఘనత ప్రాప్తి కాదు.
12) ఇహపరాల్లో తౌహీద్ వారలకు అల్లాహ్ విజయం, సహాయం, గౌరవం నొసంగుతాడు. సన్మార్గం ప్రసాదిస్తాడు. మంచి పనులు చేయుటకు సౌకర్యం కలుగజేస్తాడు. మాటలను, చేష్టలను సంస్కరించుకునే భాగ్యం ప్రసాదిస్తాడు.
13) విశ్వాసులైన తౌహీద్ వారల నుండి ఇహపరాల బాధలను దూరము చేసి, శాంతి, సుఖ ప్రదమైన జీవితం అనుగ్రహిస్తాడు. దీని ఉదాహరణలు, సాక్ష్యాలు ఖుర్ ఆన్, హదీసులో చాలా ఉన్నవి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
22 వ అధ్యాయం
తౌహీదును రక్షించుటకు, షిర్క్ వరకు చేర్చించే ప్రతి దారిని మూసి వేయుటకు ప్రవక్త చేసిన కృషి. అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.
“నిశ్చయంగా మీ వద్దకు ఒక ప్రవక్త వచ్చాడు. ఆయన స్వయంగా మీలోనివాడే. మీరు నష్టానికి గురికావటం అనేది ఆయనకు బాధ కలిగిస్తుంది.” (తౌబా 9:128).
అబూ హురైరా (రది అల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా చెప్పారు:
“మీరు మీ ఇళ్ళను సమాధులుగా మార్చకండి. నా సమాధిని పండుగ కేంద్రం (ఉర్సు, జాతరగా) చేయకండి. నా కోసం దరూద్ చదవండి. మీరు ఎక్కడా ఉన్నా మీ దరూద్ నా వరకు చేరుతుంది”. (అబూ దావూద్).
అలీ బిన్ హుసైన్ కథనం: ఒక వ్యక్తి గోడలో ఉన్న ఒక రంద్రం నుండి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధి వద్దకు వచ్చి అక్కడ దుఆ చేస్తుండగా, చూసి అతనిని నివారించారు. ఇంకా ఇలా చెప్పారు. నేను నీకు ఒక హదీసు వినిపిస్తాను, అది నేను నా తండ్రి (హుసైన్ రది అల్లాహు అన్హు)తో, అతను తన తండ్రి (అలీ రది అల్లాహు అన్హు)తో, అతను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో విన్నాడు. ప్రవక్త చెప్పారు:
“నా సమాధిని పండుగ కేంద్రంగా (ఉర్సు, జాతర) చేయకండి. మీరు మీ ఇళ్ళను సమాధులుగా మార్చకండి (నఫిల్ నమాజులు చదవకుండా). మీరు ఎక్కడ ఉండి నాపై సలాం పంపినా అది నా వరకు చేరుతుంది”. (రవాహు ఫిల్ ముఖ్ తార్ ).
ముఖ్యాంశాలు:
1. సూరయే తౌబా ఆయతు యొక్క భావం.
2. షిర్క్ దరిదాపులకు కూడా చేరకుండా దూరముండాలని ప్రవక్త యొక్క తాకీదు.
3. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మనపై చాలా కనికరం, కారుణ్యం గలవారు. మన రుజుమార్గాన్ని అధికంగా కోరుకునేవారు.
4. ఆయన సమాధి దర్శనకు వెళ్ళుట ప్రత్యేకంగా నివారించారు. ఆయన సమాధి దర్శనం (అక్కడ ఉన్నవారికి ధర్మం పరిదిలో ఉండి చేయుట) చాలా పుణ్య కార్యం.
5. (అక్కడ నివసించే వారైనప్పటికీ) మాటికి మాటికి దర్శించుటను నివారించారు.
6. నఫిల్ నమాజులు ఇంట్లో చదవాలని ప్రోత్సహించారు.
7. స్మశానంలో నమాజ్ చదవకూడదన్పది సహాబాల (సహచరుల) వద్ద స్పష్టమయిన విషయం.
8. దరూద్, సలాం దూరంగా ఉండి పంపినా, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) వరకు చేరుతుంది. అలాంటపుడు ప్రత్యేకంగా ఈ ఉద్దేశంతో అక్కడికి వెళ్ళే అవసరం లేదు.
9. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధి జీవితం (బర్ జఖ్)లో ఉన్నారు. ఆయన వరకు తన అనుచర సంఘం కర్మల నుండి కేవలం దరూద్, సలాం మాత్రమే చేర్చించ బడుతాయి.
తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ)
ఈ అధ్యాయంలో ప్రస్తావించబడిన వాక్యాలపై శ్రద్ధ చూపినవారు ఇందులో తౌహీద్‌ను బలపరిచే విషయాలపై ఆచరించాలని పోత్సహించబడింది. అల్లాహ్ వైపునకే మరలాలని, భయమూ మరియు ఆశతో అల్లాహ్ పై మాత్రమే నమ్మకం ఉంచాలని, ఆయన దయను కాంక్షించి, దాన్ని పొందే ప్రయత్నం చేయాలని, సృష్టి బానిసత్వ శృంఖలాలను తెంచేసి, ముక్తి పొందాలని, సృష్టిలో ఎవరి గురించి కూడా గులువ్వు (అతిశయోక్తి) చేయకూడదని, సర్వ బాహ్యాంతర కార్యాలు సంపూర్ణంగా నిర్వహించి, ప్రత్యేకంగా ఇబాదత్ కు ప్రాణమయినటువంటి చిత్తశద్ధి (ఇఖ్లాసు) ప్రతికార్యంలో ఉంచే ప్రయత్నం చేయాలని ప్రోత్సహించబడింది.
సృష్టరాసుల విషయంలో గులువ్వు (అతిశయోక్తి) అయ్యే ముష్రికులను పోలిన మాటలు, చేష్టలు చేయుట నివారించబడింది. ఇది వారిలో కలిసిపోవుటకు కూడా కారణం కావచ్చు. తౌహీద్ భద్రతకై షిర్క్ లోయలో పడవేసే మాటలు, చేష్టల నుండి కూడా నివారించబడింది. విశ్వాసులు ఏ ఉద్దేశంతో పుట్టించబడ్డారో దానిపై వారు స్థిరంగా ఉండుటకు ఇది వారిపై ఓ కరుణ, దయ. వారి సాఫల్యం కూడా అందులొనే ఉంది.
ఇది ఏకత్వపు బాటకు సత్యమైన మాట – ఇమామ్ అస్-సాదీ అనే పుస్తకం నుండి తీసుకోబడింది. తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్). ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
9 వ అధ్యాయం చెట్లు , రాళ్ళతో శుభం (తబర్రుక్ ) కోరుట అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.
అల్లాహ్ ఆదేశం: “ఈ లాత్, ఈ ఉజ్జా, మూడోది ఒక దేవత అయిన మనాత్‌ల వాస్తవికతను గురించి కాస్తయినా ఆలోచించారా?”(సూరా నజ్మ్ 53:19,20).
అబూ వాఖిద్ లైసీ (రది అల్లాహు అన్హు) కథనం: మేము ప్రవక్త (సల్లలాహు అలైహి వసల్లం) తో కలసి హునైన్ యుద్దానికి వెళ్ళాము. అప్పుడే మేము కొత్తగా ఇస్లాం స్వీకరించి యుంటిమి. (దారి మధ్యలో ఒక చోట) ముష్రిక్కుల ఒక ‘రేగు చెట్టు’ ఉండింది. అక్కడ వారు శుభం (తబర్రుక్) కలగాలని కూర్చుండేవారు, తమ ఆయుధాలను దానికి తగిలించేవారు. దానిని “జాతు అన్వాత్”” అనేవారు. ఆ రేగుచెట్టు దగ్గరి నుండి మేము వెళ్తూ “మాకు కూడా అలాంటి ఒక “జాతు అన్వాత్ ” నిర్ణయించండి ప్రవక్తా’ అని అన్నాము.
అప్పుడు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) అన్నారు: “అల్లాహు అక్బర్! ఇవే (గత జాతులు పాటించిన) పద్దతులు, మార్గాలు. నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్ష్యం! బనీ ఇస్రాయీల్ “తమ ప్రవక్త మూసా (అలైహిస్సలాం) తో అన్న తీరే మీరన్నారు. “వాళ్ళ దేవుళ్ళ వంటి ఒక దేవుణ్ణి మాకు కూడా చేసి పెట్టు” (అని వారన్నప్పుడు), మూసా (అలైహిస్సలాం) ఇలా అన్నారు: “మీరు చాలా అజ్ఞానపు మాటలు మాట్లాడుతున్నారు”. (ఆరాఫ్ 7:138). తప్పకుండా మీకంటే ముందు గడిచిపోయినవారి మార్గాలను మీరు కూడా అనుసరిస్తారు”అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) హెచ్చరించారు.
(తిర్మిజీ ). సహీ అని నిరూపించబడిన హదీసు.
ముఖ్యాంశాలు
1. సూరె నజ్మ్ లోని ఆయత్ యొక్క వ్యాఖ్యానం తెలిసింది. (అదే మనగా: ఆ దేవతలు వారికి లాభనష్టాలు చేకూర్చేవి అని ముష్రికులు భావించేవారు. అందుకే వారితో మొరపెట్టుకునేవారు. అక్కడ జంతువులను బలిచ్చేవారు. వారి సాన్నిధ్యం కోరేవారు).
3. సహాబాలు (సహచరులు) కేవలం తమ కోరికను వెల్లడించారు తప్ప, దాన్ని ఆచరణ రూపంలోకి తీసుకురాలేదు.
4. కోరిక ఉద్దేశం కూడా అల్లాహ్ సాన్నిధ్యం పొందడానికే ఉండేది. ఎందుకనగా: అల్లాహ్ దానిని ప్రేమిస్తాడని వారనుకున్నారు.
5. ఇది షిర్క్‌కు సంబంధించినదని సహాబాలకు తెలియనప్పుడు ఇతరులకు తెలియకపోవడం సంభవం. (కాని తెలిసిన వెంటనే విడనాడడం కూడా తప్పనిసరి).
6. ప్రవక్త సహాబాలు (సహచరులు), తమ సత్కార్యాలకు బదులుగా పొందిన వాగ్దానం, క్షమాపణ శుభవార్త లాంటివి అంత సులభంగా ఇతరులు పొందలేరు.
7. వారికి తెలియదు కదా అని ప్రవక్త ఊరుకోలేదు. “అల్లాహు అక్బర్! ఇవే మార్గాలు. మీకంటే ముందు గతించిన వారి మార్గాలను మీరు అనుసరిస్తారు” అని మూడు సార్లు హెచ్చరించి, అలాంటి కోరికలు చెడు అని స్పష్టం చేసారు.
8. మరో ముఖ్య విషయం ప్రవక్త తమ సహచరులతో ఇలా అనడం: మీ ప్రశ్న, కోరిక బనీ ఇస్రాయీల్, మూసాతో ప్రశ్నించి, కోరినటువంటిదే. వారు: “వాళ్ళ దేవుళ్ళవంటి ఒక దేవుణ్ణి మాకు కూడా చేసిపెట్టు” అని కోరారు.
9. ప్రవక్త (సల్లలాహు అలైహి వసల్లం) వారిని నివారించడం “లాఇలాహ ఇల్లల్లాహ్” యొక్క భావంలోనే వస్తుంది. ఇది చాలా సూక్ష్మమైనది. అందుకే సహచరులు కూడా అది “లాఇలాహ ఇల్లల్లాహ్” భావానికి విరుద్ధమైనదని ముందు గమనించలేక పోయారు.
10. ఇచ్చట కూడా ప్రవక్త (సల్లలాహు అలైహి వసల్లం), అల్లాహ్ ప్రమాణం చేసి చెప్పారు. (మాటి మాటికి ప్రమాణం చేయటం ఆయన అలవాటు కాదు. కాని విషయం చాలా గంభీరమైనది గనుక ప్రమాణం చేసి చెప్పారు).
11. తమ కోరికను వెల్లడించినందుకు వారు మతభ్రష్టులు కాలేదు. దీనీతో తెలిసిందేమిటంటే షిర్క్ చిన్నదీ (కనబడనిది) ఉంటుంది, పెద్దదీ (కనబడునది) ఉంటుంది.
12 “మేము కొత్తగా ఇస్లాం స్వీకరించియుంటిమి” అన్న వారి మాటతో ఇతర సహచరులు దినిని షిర్క్‌గా భావించేవారు అని తెలుస్తుంది.
13. ఆశ్చర్యం కలిగినప్పుడు “అల్లాహు అక్బర్” అనవచ్చు అని తెలిసింది. ఇలా అనకూడదు అని అనేవారి మాట ప్రవక్త మాటకు విరుద్ధం అని స్పష్టమయింది.
14. (షిర్క్ మరియు బిద్ అత్ )కు చేర్పించే సాధనాలన్నిటినీ రద్దు చేయాలని తెలిసింది.
15. జాహిలియ్యత్ (అజ్ఞానకాలం) నాటి పోలికను అవలంబించుట నుండి నివారించబడింది.
16. విద్య నేర్పుతున్నప్పుడు అవసర సందర్భంగా ఆగ్రహించవచ్చును.
17. “ఇవే సాంప్రదాయాలు” అని ప్రవక్త (సల్లలాహు అలైహి వసల్లం) ఒక నియమం తెలిపారు.
18. ప్రవక్త మహత్యాల్లో ఒకటి ఆయన భవిష్యసూచన ఇచ్చినట్టు సంభవించింది.
19. ఖుర్‌ఆన్‌లో యూదుల, క్రైస్తవుల ఏ విషయాల్ని చెడుగా ప్రస్తావించి వారిన హెచ్చరించబడిందో, అలాంటి పనుల నుండి మనము దూరముండాంలని మనకు కూడా హెచ్చరిక ఉంది.
20. పండితుల వద్ద ఉన్న ఒక నియమం వాస్తవమైనది. అది: ఆరాధనల (ఇబాదత్‌ల) పునాది ఆజ్ఞ (హుకుం) పై ఉంది. (మన ఇష్టానుసారం ఇబాదత్ చేయరాదు).
21. గ్రంథమవ్వబడిన వారి సాంప్రదాయాలు, అలవాట్లు ఎలా చెడ్డవో ముష్రికులవి కూడా అలాగే చెడ్డవి.
22. ఎవరైతే అధర్మం నుండి ధర్మంలో అడుగుపెడుతాలో వారిలో కొన్ని పాత అలవాట్లు ఉంటాయి అని తెలిసింది. అబూ వాఖిద్ లైసీ (రది అల్లాహు అన్హు) అదే చెప్పింది. “మేము కొత్తగా ఇస్తాం స్వీకరించియుంటిమి”.
తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ)
‘చెట్లతో, రాళ్ళతో శుభం కోరుట ముష్రిక్కుల పని. ‘చెట్లతో, రాళ్ళతో, సమాధులతో ఇంకేదానితోనైనా శుభం కోరుట ధర్మసమ్మతం కాదని పండితులు ఏకీభవించారు. ఇది “గులువ్వు” (అతిశయోక్తి). ఎవరితో, ఏ దానితో తబర్రుక్ కోరబడుతుంటో, వారి ఆరాధన, వారితో దుఆ (ప్రార్ధన) చేయడం లాంటి పనులకు ఇది గురి చేస్తుంది. అల్లాహ్ యేతరుల ఆరాధన, వారితో దుఆ షిర్క్ అక్బర్ (పెద్ద షిర్క్) అన్న విషయం తెలిసిందే. చివరికి ముఖామె ఇబ్రాహీం, ప్రవక్త యొక్క గృహం, బైతుల్ మఖ్డిస్, అక్కడ ఉన్న “సఖ్ర్” మొదలగు వాటితో తబర్రుక్ కోరుట కూడా తప్పు.
కాబతుల్లా లోని హజర్ అస్వద్ (నల్ల రాయి)ను ముట్టుకొనుట, చుంబించుట మరియు రుక్నె యమానిని ముట్టుకొనుట మొదలైనవి అల్లాహ్ కు విధేయత చూపుట. ఆయన ఔన్నత్యాల ముందు వినయ వినమ్రతతో మెలుగుటయే ఇబాదత్ యొక్క సారాంశము. దీనికున్న ఆదేశం ఇతర వాటికి లేదు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
(ఆ సందర్భాన్ని కూడా కాస్త జ్ఞాపకం చేసుకోండి!) ఎప్పుడైతే ఇబ్రాహీమ్ ఇలా వేడుకున్నాడో: “నా ప్రభూ! ఈ నగరాన్ని శాంతి భద్రతల నగరంగా చేయి. నన్నూ, నా సంతానాన్నీ విగ్రహాల పూజ నుంచి కాపాడు.”(ఇబ్రాహీం 14:35).
“అతి ఎక్కువగా నేను మీ పట్ల భయం చెందేది “షిర్కె అస్గర్” (చిన్న షిర్క్) కు మీరు పాల్పడుతారని”, అప్పుడు సహచరులు “అదేమిటి”? అని అడిగితే “ప్రదర్శనాబుద్ధి” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం బదులిచ్చారు. (ముస్నద్ అహ్మద్ 23630).
“అల్లాహ్ తో మరెవ్వరినీ సాటి కల్పించని స్థితిలో చనిపోయిన వ్యక్తి స్వర్గంలో చేరుకుంటాడు. అల్లాహ్ తో సాటి కల్పించి చనిపోయిన వ్యక్తి నరకంలో చేరుకుంటాడు”. (ముస్లిం 93).
3. అది “షిర్కె అస్గర్” (చిన్న షిర్క్) లో వస్తుంది. (పై హదీసు ఆధారంగానే)
4. సత్కార్యాలు చేసేవారిలో అది చోటు చేసుకుంటుందన్న భయం ఎక్కువ ఉంటుంది.
5. స్వర్గనరకాలు సమీపములోనే ఉన్నాయని తెలిసింది. (ముస్లిం 93)
6. ఒకే హదీసులో రెండిటిని కలిపి చెప్పడం జరిగింది.
7. షిర్క్ చేయకుండా చనిపోయి అల్లాహ్ తో కలసినవాడు స్వర్గంలో చేరుతాడు. షిర్క్ చేసి చనిపోయి అల్లాహ్ తో కలసినవాడు నరకంలో పోతాడు. అతడు అందరికన్నా ఎక్కువ ప్రార్థనలు చేసినవాడైనప్పటికినీ.
8. ముఖ్య విషయం: ఇబ్రాహీం (అలైహిస్సలాం) తమను, తమ సంతానాన్ని విగ్రహారాధన నుండి కాపాడమని అల్లాహ్ తో దుఆ చేశారు.
9. “ప్రభూ! ఈ విగ్రహాలు చాలా మందిని మార్గం తప్పించాయి” (14: 36). అంటూ (దుర్మార్గంలో పడుతున్న) అధికసంఖ్యాకులతో గుణపాఠం నేర్చుకొని “ఓ ప్రభూ! నా సంతానాన్ని విగ్రహారాధన నుండి కాపాడుము” అని అర్ధించారు.
10. ఇమాం బుఖారీ (రహిమహుల్లాహ్) తెలిపిన ప్రకారం ఇందులో “లా ఇలాహ ఇల్లల్లాహ్” యొక్క భావం ఉంది.
11. షిర్క్ నుండి దూరమున్నవారి ఘనత తెలిసింది.
తాత్పర్యం
షిర్క్ తౌహీద్ కు విరుద్ధం. దాని రెండు రకాలు: ఒకటి షిర్కె అక్బర్ (పెద్ద షిర్క్ = జలీ). రెండవది: షిర్కె అస్గర్ (చిన్న షిర్క్ = ఖఫీ)
షిర్కె అక్బర్ అంటే: అల్లాహ్ తో ‘మొరపెట్టుకున్నట్లు, భయం చెందినట్లు, ప్రేమంచినట్లు ఇతరులతో మొరపెట్టుకొనుట, భయం చెందుట, ప్రేమించుట. సారాంశమేమనగా: అల్లాహ్ కు చేయవలసిన ప్రార్ధనలు, ఆరాధనలు ఇతరులకు చేయుట షిర్కె అక్బర్. దీనికి పాల్పడినవానిలో ఏ మాత్రం తౌహీద్ లేనట్లే. అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించింది ఇలాంటి ముష్రికుల పైనే. అతని నివాసం నరకం. ఇక ఏవైనా ఇలాంటి పనులు చేస్తూ దానిని “వసీల”, “పుణ్యపురుషుల ప్రేమ”, అన్న పేర్లతో నిజాన్ని వక్రీకరిస్తే అది కూడా షిర్క్ అవుతుంది.
షిర్కె అస్గర్ అంటే: షిర్కె అక్బర్ వరకు చేర్పించే సాధనాలు, కార్యాలు. ఉదాహరణకు: “గులువ్వ్ ” (అతిశయోక్తి. అంటే: పుణ్యపురుషుల విషయంలో హద్దులు మీరుట), అల్లాహ్ యేతరుల ప్రమాణం, చూపుగోలుతనం, ప్రదర్శనాబుద్ధి మొదలగునవి).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.
షిర్క్ (బహుదైవారాధన), దాని రకాలు:
షిర్క్ అంటే: ఆరాధనలో అల్లాహ్ తో పాటు ఇతరులను సాటి కల్పుట. ఉదాహరణకు విగ్రహాన్ని, మృతులను, సూర్యచంద్రులను, ప్రవక్తలను, వలీలను, సమాధి తదితరాలను పూజించుట. లేదా అల్లాహ్ యేతరులతో మొరపెట్టుకొనుట, వారికి మ్రొక్కుబడులు చెల్లించుట లేదా వారి కొరకు నమాజు, ఉపవాసాలు పాటించుట, వారి కొరకు బలిదానమిచ్చుట. ఇవన్నీ అల్లాహ్ తో పాటు షిర్క్ లో వస్తాయి.
అలాగే విగ్రహానికి, సూర్యచంద్రులకు, సమాధివారికి ఇంకా ఇలాంటి వాటికి సజ్దా చేయుట (సాష్టాంగపడుట). ఇది కూడా షిర్క్, ఇది ఇస్లాం నుండి బహిష్కరిస్తుంది. అల్లాహ్ కాపాడుగాక!
అలాగే సృష్టించటంలో అల్లాహ్ తో పాటు ఎవరైనా భాగస్వామి గలడని, లేదా అల్లాహ్ మాత్రమే శక్తిగలవాటి శక్తి అతనిలో ఉందని నమ్మడం కూడా షిర్క్ అవుతుంది.
షిర్క్ రెండు రకాలు: చిన్న షిర్క్, పెద్ద షిర్క్.
మొదటిది: పెద్ద షిర్క్: ఆరాధన యొక్క ఏ ఒక్క రకమైనా అల్లాహ్ యేతరుల కొరకు చేయుట. ఇలాంటి షిర్క్ చేసిన వ్యక్తి తౌబా చేయకుండా (పశ్చత్తాప పడి, క్షమాభిక్ష కోరకుండా) చనిపోతే శాశ్వతంగా నరకంలో ఉంటాడు. ఇంకా ఇది సర్వ సత్కార్యాలను భస్మం చేసేస్తుంది.
పద్దెనిమిది ప్రవక్తల ప్రస్తావన తర్వాత సూర అన్ఆమ్ ఆయతు 88లో అల్లాహ్ ఇలా హెచ్చరించాడు:
{అల్లాహ్ క్షమించనిది కేవలం షిర్క్ మాత్రమే. అది తప్ప ఏ పాపాన్ని అయినా ఆయన తాను ఇష్టపడిన వారి కొరకు క్షమిస్తాడు. ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేసేవాడు, ఎంతో తీవ్రమైన పాపపు మాట అన్నాడన్నమాట}. (సూరె నిసా 4: 48).
పెద్ద షిర్క్ లోని కొన్ని రకాలు: అల్లాహ్ యేతరులతో దుఆ, అల్లాహ్ యేతరుల కొరకు మొక్కుబడి, జిబహ్ వగైరాలు చేయుట. అల్లాహ్ తో ఇతరుల్ని సాటి కలిపి అల్లాహ్ పట్ల ఉండవలసిన ప్రేమ వారి పట్ల ఉంచుట.
{కొందరు అల్లాహ్ ను కాదని ఇతరులను ఆయనకు సమానులుగా, ప్రత్యర్థులుగా భావిస్తారు. వారు అల్లాహ్ పట్ల కలిగి ఉండవలసిన ప్రేమతో వారిని ప్రేమిస్తారు}. (సూరె బఖర 2: 165).
రెండవది: చిన్న షిర్క్:ఖుర్ఆను, హదీసుల్లో ఏ పనుల కొరకు షిర్క్ అనే పదం వచ్చిందో కాని అవి పెద్ద షిర్క్ వరకు చేరవో వాటిని చిన్న షిర్క్ అంటారు. ఈ రకం ధర్మభ్రష్టతకు కారణం కాదు. కాని దీని వల్ల తౌహీదు లో మాత్రం కళంకం, కొరత ఏర్పడుతుంది. ఉదా: ప్రదర్శనాబుద్ధితో ఏదైనా సత్కార్యం చేయుట. లేదా షిర్క్ అక్బర్ కు చేర్పించే ఏదైనా కార్యం. ఉదా: ఏదైనా సమాధి వద్ద అల్లాహ్ కొరకు నమాజు చేయుట. అల్లాహ్ యేతరులు లాభనష్టానికి అధికారులు కారు అన్న విశ్వాసంతో వారి మీద ప్రమాణం చేయుట. ఇంకా అల్లాహ్ మరియు ఫలాన వ్యక్తి తలచినట్లు అని అనడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః
“మీ పట్ల నాకు అధికంగా భయం కలిగించేదేమిటంటే మీరు చిన్న షిర్క్ కు పాల్పడతారని”. చిన్న షిర్క్ అంటేమిటి? ప్రవక్తా అని అడిగారు అక్కడున్నవారు. అప్పుడు ప్రవక్త చెప్పారు: “ప్రదర్శనాబుధ్ధి” అని.(ముస్నద్ అహ్మ్దద్ 23630. దీని సనద్ జయ్యిద్).
«مَنْ حَلَفَ بِغَيْرِ اللَّهِ فَقَدْ أَشْرَكَ»
“ఎవరు అల్లాహ్ తప్ప ఇతరుల ప్రమాణం చేశాడో అతడు షిర్క్ చేసినట్లే“. (అబూ దావూద్ 3251. సహీ హదీస్).
తాయత్తులు వేసుకొనుట: రోగాలు, ఆపదలు రాకుండా లేదా వచ్చినా తొలిగిపోవుటకు కడాలు, రింగులు సాధనం అని వేసుకొనుట లాంటి పనులు చిన్న షిర్క్ కు సంబంధించినవే. ఇక అవి సాధనమే కాదు, లాభనష్టాలు వాటిలో ఉన్నాయి, అంటే: అవి వేసుకున్నప్పుడు లాభం ఉంటుంది వేసుకోకుంటే నష్టం ఉంటుంది అని విశ్వసిస్తే అది పెద్ద షిర్కులో వస్తుంది. (అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి).
అలాగే జ్యోతిషుల వద్దకు వచ్చి ఏమైనా అడగడం కూడా షిర్క్ లో వస్తుంది, ఎలా అనగా అతడు మానవుల్లో కొందరు అగోచర జ్ఞానం గలవారని నమ్మినందుకు. ఇది అబద్ధం, భూటకం. అల్లాహ్ ఈ ఆదేశానుసారం:
“అల్లాహ్‌కు తప్ప ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న వారెవరికీ అగోచర జ్ఞానం లేదు. తాము ఎప్పుడు తిరిగి లేపబడతారో కూడా వారికి తెలియదు” అని ఓ ప్రవక్తా వారికి చెప్పు. (నమ్ల్ 27:65).
అందుకే ప్రతి ముస్లం తప్పనిసరిగా తెలుసకోవాల్సిన విషయం ఏమిటంటే: స్వచ్ఛమైన తౌహీద్ (ఏకేశ్వరోపాసన) కొరకే అల్లాహ్ మనల్ని పుట్టించాడు, స్వర్గనరకాలను సృష్టించాడు, ప్రవక్తల్ని పంపాడు, గ్రంథాలను అవతరింపజేశాడు. కర్మలన్నీ అల్లాహ్ కొరకే ప్రత్యేకించి చిత్తశుద్ధితో చేసినప్పుడే స్వీకరించబడతాయి, లేదా అంటే అవి రద్దు చేయబడతాయి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఇస్లాం ధర్మం యొక్క నాలుగు నియమాలు (అల్ ఖవాఇద్ అల్ ఆర్బా) షిర్క్ నాలుగు సూత్రాలు
మూలం:షేఖుల్ ఇస్లాం ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ (రహమతుల్లాహ్ అలై) అనువాదకులు:ముహమ్మద్ అజీజుర్రహ్మాన్ పుస్తకం నుండి:ఇస్లాం మూల సూత్రాలు (హదీసు పబ్లికేషన్స్)
أسأل الله الكريمَ ، ربَّ العرش العظيم: أن يتولاّك في الدنيا والآخرة، وأن يجعلك مباركاً أينما كُنْتَ
మహోన్నత సింహాననానికి అధిపతి అయిన అల్లాహ్ దర్బారులో అభ్యర్ధించుకుంటున్నాను – ఆయన ఇహపరాలలో మిమ్మల్ని పర్యవేక్షిస్తూ ఉండుగాక! మీరెక్కడున్నా మిమ్మల్ని శుభవంతుల్ని చేయుగాక!
وأن يجعلكَ مِمن إذا أعطي شَكَر، وإذا ابْتُلي صَبر، وإذا أذنب استغفر، فإن هذه الثلاث عنوانُ السعادة
కలిమిని ప్రసాదించినపుడు కృతజ్ఞతలు తెలుపుకునే, లేమికి గురి చేసినప్పుడు సహనం వహించే, తప్పులు జరిగిపోయినప్పుడు పశ్చాత్తాపం చెందే సజ్జనులకోవలో మిమ్మల్ని చేర్చుగాక!- ఈ మూడు విషయాలే మహాభాగ్యం అనబడతాయి.
اعلم أرشدك الله لطاعته أن الحنيفية – مِلةَ إبراهيمَ – : أنْ تَعبُدَ الله مُخلصاً له الدين، وبذلك أمرَ الله جميع الناس، وخَلَقهم لها ، كما قال
ఆరాధనలో ఏకాగ్ర చిత్తం కలిగి ఉండటం – ఇబ్రాహీం (అలైహిస్సలాం) అనుయాయునిగా మారటం – అంటే ఏమిటో తెలుసా?! ఒక్కడైన అల్లాహ్‌ను సేవించడంలో చిత్తశుద్ధినీ, వజ్ర సంకల్పాన్ని కనబరచటం! అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
“మేము మానవుల్ని, జిన్నుల్ని మా దాస్యం కోసమే పుట్టించాము.”(అజ్జారియాత్ 51:56)
فإذا عرفتَ أن الله خلقك لعبادته: فاعلم أنّ العبادةَ لا تُسمى عبادةً إلا مع التوحيد، (كما أنّ الصلاة لا تُسمى صلاة إلا مع الطهارة)
అల్లాహ్ తన దాస్యం కోసమే మిమ్మల్ని పుట్టించాడన్న సంగతి మీకు తెలిసినప్పుడు, ఆ దాస్యం స్వచ్చమైన – ఏకేశ్వరోపాసన (తౌహీద్) – తో కూడుకున్నదై ఉండాలన్న సత్యం కూడా మీరు తెలుసుకోవటం అవసరం. ఏ విధంగానయితే మీరు శుచీ శుభ్రతల (తహారత్)ను పాటించినపుడే నమాజ్ నెరవేరుతుందో అదే విధంగా అద్వితీయుడైన అల్లాహ్ కు భాగస్వామ్యం (షిర్క్)కల్పించకుండా ఉన్నప్పుడే దాస్యం స్వీకార యోగ్యం అవుతుంది.
فإذا دخل الشركُ في العبادة فسدتْ، (كالحَدَثِ إذا دخل في الصلاة) ، كما قال تعالى
ఆరాధన (దాస్యం)లోనే గనక “షిర్క్” వచ్చి చేరితే అది కలుషితం అయిపోతుంది.శుచీ శుభ్రతలను అశుద్ధ వస్తువులు పాడు చేసేసినట్లే షిర్క్‌తో కూడుకున్న పనులు స్వచ్చమైన తౌహీద్‌ను పాడు చేసేస్తాయి. దివ్యగ్రంథంలో అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు:
“ముష్రిక్కులు అల్లాహ్ మసీదులలో సంరక్షకులుగా, సేవకులుగా ఉండటానికి పనికి రారు. ఎందుకంటే వారే స్వయంగా అవిశ్వాసులమని తమకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తున్నారు. వారి కర్మలైతే అన్నీ వ్యర్థమై పోయాయి.నరకంలో వారు కలకాలం ఉండాలి.”(అత్ తౌబా 9:17)
فإذا عرفتَ أنّ الشرْكَ إذا خالط العبادة أفسدها وأحبط العمل وصار صاحبه من الخالدين في النار: عرفتَ أن أهمَّ ما عليك: معرفةُ ذلك؛ لعل الله أن يخلصك من هذه الشبكة، وهي الشرْكُ بالله
‘షిర్క్’ (భాగస్వామ్యం) వల్ల ఆరాధనలు, ఆచరణలన్నీ వ్యర్థమైపోతాయనీ, ముష్రిక్కుల పర్యవసానం నరకమని మీకు తెలిసిపోయిన మీదట, ఆ “షిర్క్” గురించి క్షుణ్ణంగా తెలుసుకుని, దానిపట్ల జాగ్రత్త పడవలసిన బాధ్యత కూడా మీపై ఉంది; అప్పుడే మీరు ఆ వినాశకర చేష్ట నుండి మిమ్మల్ని మీరు రక్షించు కోగలుగుతారు. దాని గురించి అల్లాహ్ ఇలా అంటున్నాడు:
“అల్లాహ్ దృష్టిలో షిర్కు ఒక్కటే క్షమార్హం కానిది.అది తప్ప తాను కోరిన వారి అన్ని పాపాలను ఆయన క్షమిస్తాడు.” (అన్ నిసా 4:116)
: وذلك بمعرفة أربع قواعد ذكرها الله في كتابه
అల్లాహ్ తన గ్రంథంలో ప్రస్తావించిన ఈ క్రింది నాలుగు ప్రధానాంశాలను తెలుసుకున్నప్పుడే దీని గురించిన పూర్తి అవగాహన ఏర్పడుతుంది.
మొదటి నియమం :
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు వ్యతిరేకంగా వైర వైఖరిని అవలంబించి, కయ్యానికి కాలు దువ్విన అవిశ్వాసులు కూడా అల్లాహ్‌ను సృష్టికర్తగా, ఉపాధి ప్రదాతగా, విధాతగా అంగీకరించేవారు. కాని వారి ఈ అంగీకారం వారిని ఇస్లాంలో చేర్చలేకపోయింది. (అంటే ఒక్కడైన అల్లాహ్‌ను సేవించే వరకూ వారు ముస్లింలు కాలేకపోయారు.) దివ్యగ్రంథంలోని దైవోపదేశం ఇందుకు ప్రబల నిదర్శనం:
వారిని అడుగు : ఆకాశం నుండీ, భూమి నుండీ మీకు ఉపాధినిచ్చేవాడు ఎవడు? వినే శక్తీ, చూసే శక్తీ ఎవడి అధీనంలో ఉన్నాయి? ప్రాణములేని దాని నుండి ప్రాణమున్న దానినీ, ప్రాణమున్న దాని నుండి ప్రాణములేని దానినీ వెలికి తీసేవారు తప్పకుండా అంటారు. ఇలా అను: “అలాంటప్పుడు మీరు (షిర్క్‌కు వ్యతిరేకంగా నడవటం) మానుకోరేమిటి?”(యూనుస్ 10:31)
రెండవ నియమం :
తాము వాళ్ళను (తమ మిథ్యా దైవాలను, వలీలను) కేవలం సామీప్యం కోసం, సిఫారసు కోసమే పిలుస్తున్నామని ముష్రిక్కులు అనేవారు. ఈ సామీప్యానికి వారిచ్చే నిదర్శనం ఏమిటంటే ఈ వలీలు, పుణ్య పురుషులు తమను అల్లాహ్‌కు చేరువ చేస్తారని అనేవారు. కాని ఇది పచ్చి షిర్క్. ఈ సందర్భంగా అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు :
ఇక ఆయనను వదిలివేసి ఇతరులను సంరక్షకులుగా చేసుకున్న వారు, (తమ ఈ చర్యకు సమర్థింపుగా) “వారు మమ్మల్ని అల్లాహ్ వద్దకు చేరుస్తారని మాత్రమే వారిని ఆరాధిస్తున్నాము” అని అంటారు.అల్లాహ్ నిశ్చయంగా వారి మధ్యన వారు విభేదిస్తున్న అన్ని విషయాలను గురించి తీర్పు చెబుతాడు. అసత్యవాదీ, సత్య ధిక్కారి అయిన ఏ వ్యక్తికీ అల్లాహ్ సన్మార్గం చూపడు.”(జుమర్-3)
సిఫారనుకు సంబంధించిన (అంటే వారు కల్పించుకున్న కాల్పనిక దేవుళ్ళు వారికి వారధిగా ఉంటారన్న వారి నమ్మకం షిర్క్ అని చాటి చెప్పే) ఆయతు:
“ఈ ప్రజలు అల్లాహ్‌ను కాదని తమకు నష్టాన్ని గానీ, లాభాన్ని గానీ కలిగించలేని వారిని పూజిస్తున్నారు.పైగా ఇలా అంటున్నారు : “వారు అల్లాహ్ వద్ద మా కొరకు సిఫారసు చేస్తారు.” (ప్రవక్తా!) వారితో ఇలా అను : ఆకాశాలలో గానీ, భూమిలో గానీ అల్లాహ్ ఎరుగని విషయాన్ని గురించి ఆయనకు మీరు తెలుపుతున్నారా?” ఆయన పరిశుద్దుడు.ఈ ప్రజలు చేసే షిర్కుకు అతీతుడు, ఉన్నతుడూను.”(యూనుస్ 10:18)
సిఫారసు రెండు రకాలు. ఒకటి: నకారాత్మక సిఫారను. రెండు : సకారాత్మక సిఫారసు.
1. నకారాత్మక సిఫారసు :అంటే అల్లాహ్‌కు మాత్రమే సాధ్యమైన వాటి కోసం దైవేతరుల ముందు అర్థించటం. దీనికి ఆధారం ఇది :
“విశ్వసించిన ఓ ప్రజలారా! క్రయ విక్రయాలు కూడా జరగని, మైత్రీ ఉపయోగ పడని, సిఫారసు కూడా చెల్లని, ఆ (చివరి) దినము రాక పూర్వమే, మేము మీకు ప్రసాదించిన సిరి సంపదలనుండి (మా మార్గంలో) ఖర్చుపెట్టండి. వాస్తవంగా అవిశ్వాస మార్గం అవలంబించేవారే దుర్మా ర్గులు”.’(అల్ బఖర 2:254)
* ఈ సూక్తి గురించి వ్యాఖ్యానిస్తూ అల్లామా ఇబ్నె కసీర్ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు – అల్లాహ్ తన దాసులకు, తాను ప్రసాదించిన ఉపాధి నుండి, తన మార్గంలో ఖర్చుపెట్టమని ఆదేశిస్తున్నాడు.ఎందుకంటే వారు తవు ప్రభువు వద్ద తమ పుణ్య రాసులను సమకూర్చుకొవాలని! ప్రళయ దినం రాకముందే వారు ఈ పని చేసుకోవాలి.ఆ రోజు ఎంత కఠినమైనదంటే, ఆనాడక్కడ క్రయ విక్రయాలు గానీ, బేరసారాలు గానీ, స్నేహసంబంధాలు గానీ, రికమండేషన్లు గానీ ఏ మాత్రం పనికిరావు. పరిహారంగా సొమ్ము ఇవ్వటం కుదరదు. భూమండలం లోని బంగారాన్నంతటినీ ఇచ్చినా ఆనాడు మనిషి తనను విడిపించుకోలేడు. ఆవగింజంత ప్రయోజనం కూడా తన ఆత్మకు చేకూర్చుకోజాలడు.
శంఖం ఊదబడిన రోజున వారు ఒక పట్టాన నిలదొక్కుకోవటం గానీ, ఒకరినొకరు పరామర్శించుకోవటం గానీ చేయలేరు. సిఫారసు చేసేవారి సిఫారసు కూడా ఏ విధంగానూ వారికి ఉపయోగ పడదు.
2. సకారాత్మక సిఫారసు : అంటే అల్లాహ్‌ను మాత్రమే వేడుకొనే సిఫారసు. సిఫారసు చేసేవాడు కూడా ఈ సిఫారసు మూలంగా ఆదరణీయుడవుతాడు. ఎవరి కోసమైతే సిఫారసు చేయబడుతుందో అతని వట్ల అల్లాహ్ కూడా ప్రసన్నుడవు తాడు. ఇటువంటి సిఫారసు కేవలం అల్లాహ్ నుండి మాత్రమే అర్థించబడుతుంది. ఎందుకంటే సిఫారసును ఆమోదించటం లేక ఆమోదించక పోవటమన్నది అల్లాహ్ అభీష్టంపైనే ఆధారపడి ఉంటుంది.కనుక దైవేతరుల నుండి అర్ధించేవాడు షిర్కుకు ఒడిగట్టినట్లే. ఎందుకంటే అతడు చేయరాని పనిని చేశాడు.’వేడుకోలు’కు విరుద్ధమైన వైఖరిని అవలంబించాడు.అల్లాహ్ కేవలం ఏకేశ్వరోపాసనను మాత్రమే ఇష్టపడతాడు. ఏకేశ్వరోపాసకులకై చేసే సిఫారసును మాత్రమే అంగీకరించి ఆమోదిస్తాడు. దివ్య ఖుర్‌ఆన్‌లో ఆయన సెలవిచ్చినట్లు:
“ఇంకా ఇలా అను : సిఫారసు అనేది పూర్తిగా అల్లాహ్ చేతిలోనే ఉన్నది.”(అజ్ జుమర్ 29:44)
మూడవ నియమం:
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పెక్కు ఆరాధ్య దైవాలను పూజించే ప్రజల్లో ప్రభవింప జేయబడ్డారు.ఆ ప్రజల్లో కొందరు దైవదూతలను పూజించగా, మరి కొందరు దైవప్రవక్తలను ఆరాధించేవారు. కొందరు మహనీయులను కొలవగా, ఇంకొందరు చెట్టు పుట్టలను, రాళ్ళు రప్పలను కొలిచేవారు. మరికొందరు సూర్యచంద్రులను సేవించేవారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వీళ్ళందరి మిథ్యా విధానాన్ని అంతమొందించారు.ఈ విషయంలో వారి మధ్య ఎలాంటి వ్యత్యాసం కనబరచలేదు. దీనికి నిదర్శనం ఖుర్‌ఆన్‌లోని ఈ సూక్తి:
“రేయింబవళ్ళు, సూర్యచంద్రులు అన్నీ ఆయన(అద్వితీయ శక్తికి) నిదర్శనాలలోనివి. కనుక మీరు సూర్యునికి గానీ, చంద్రునికి గానీ సాష్టాంగ పడకండి. మీకు దైవారాధన చేయాలనే ఉంటే ఈ నిదర్శనాలన్నింటినీ సృష్టించిన దైవానికి మాత్రమే సాష్టాంగపడండి.” (హామీమ్‌సజ్దా 41:37)
దైవదూతలను పూజించటం కూడా షిర్కేనన్న దానికి తార్కాణం:
(ఆ సన్నివేశాన్ని గురించి కాస్త ఆలోచించండి) “మర్యమ్ కుమారుడవైన ఓ ఈసా! నీవు మనుష్య జాతితో, అల్లాహ్‌ను కాదని నన్నూ, నాతల్లిని దేవుళ్ళుగా భావించండి అని బోధించావా? అని అల్లాహ్ అడిగినప్పుడు అతను ఇలా మనవి చేనుకుంటాడు: “నీవు అత్యంత పవిత్రుడవు! ఏ మాటను అనే హక్కు నాకు లేదో ఆ మాటను అనడం నాకు యుక్తమైన పని కాదు. ఒకవేళ నేను ఆ విధంగా అని ఉంటే, అది నీకు తప్పకుండా తెలిసి ఉండేది. నామనస్సులో ఏముందో నీకు తెలుసు. నీమనస్సులో ఏముందో నాకు తెలియదు. నీవు గుప్తంగా ఉన్న యదార్థాలన్నీ తెలిసిన మహా జ్ఞానివి.” (అల్ మాయిద 5:116)
ఇక ఔలియాలు, పుణ్యపురుషులకు సంబంధించిన నిదర్శనం (అంటే వాళ్ళను వేడుకుని, వాళ్ళ ఆధారంగా దేవుని సామీప్యం పొందవచ్చుననుకోవటం షిర్క్. ఇలాంటి వ్యవహారాలకు అల్లాహ్ అతీతుడు, ఉన్నతుడు). ఈ సూక్తిని గమనించండి:
“ఈ ప్రజలు ఎవరిని మొర పెట్టుకుంటున్నారో వారే స్వయంగా తమ ప్రభువు సాన్నిధ్యాన్ని పొందడానికి మార్గాన్ని వెతుకుతున్నారు. ఒకరితో ఒకరు పోటీపడుతున్నారు. వారు, ఆయన కారుణ్యాన్ని ఆశిస్తున్నారు. ఆయన శిక్షకు భయపడుతున్నారు.”(బనీ ఇస్రాయీల్ 17:57)
ఇక చెట్టు పుట్టలు, రాళ్ళు రప్పలకు సంబంధించిన నిదర్శనం – అంటే వృక్షాలను, రాళ్ళను పూజించటం, మహనీయుల సమాధుల నుండి శుభం పొందాలని తాపత్రయ పడటం, తమ కష్టాలను, కడగండ్లను దూరం చేసుకోవటానికి వాళ్ళను మొక్కుకోవటం, వారి పేరున జంతువులను కోయటం, ఆ సమాధుల వద్ద కొంత కాలంపాటు గడపటం, అక్కడే ఆరాధనలు చేయటం, అక్కడి మట్టితో, వస్త్రాలతో ‘శుభం’ పొందగోరటం-ఇవన్నీ ‘షిర్క్’గా పరిగణించ బడతాయి. అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు –
أَفَرَأَيْتُمُ اللَّاتَ وَالْعُزَّىٰ
ఇప్పుడు చెప్పండి : “ఈ లాత్, ఈ ఉజ్జా, మూడోది ఒక దేవత అయిన మనాత్‌ల వాస్తవికత గురించి మీరు కాస్తయినా ఆలోచించారా?”(అన్ నజ్మ్ 53:19)
1 ఈ సూక్తికి వ్యాఖ్యానంగా హాఫిజ్ ఇబ్నె కసీర్ ఇలా అంటున్నారు: తనను తప్ప మరొకరిని పూజించమని అల్లాహ్ ఎన్నడూ ఆదేశించడు. తన దూతలను పూజించమని గానీ, తాను పంపిన ప్రవక్తలను ఆరాధించమని గానీ కోరడు. ఇస్లాం స్వీకరించిన తరువాత ధిక్కార వైఖరికి ఒడిగట్టమని కూడా అనడు. దైవేతరుల దాస్యం చేయమని పిలుపు ఇచ్చేవాడే ఇలాంటి ఆజ్ఞలు జారీ చేస్తాడు. దైవేతరుల దాస్యం కొరకు ఆహ్వానించిన వాడు నిశ్చయంగా కుఫ్ర్కి (అవిశ్వాసానికి) ఒడిగట్టాడు. కాగా; దైవప్రవక్తలు సతతం ఈమాన్ గురించి మాత్రమే ఉపదేశిస్తారు. సాటిలేని సృష్టికర్తను నమ్మటం, దాస్యం చేయటమే ఈమాన్ బిల్లాహ్.
2. “ఊలాయి కల్లజీన……..” సూక్తి గురించి బుఖారీలో హజ్రత్ అబ్దుల్లాహ్ చే ఇలా ఉల్లేఖించబడింది – “ప్రజలు మొర పెట్టుకునే ఆ కొంతమంది ఎవరంటే వారు జిన్ను వర్గానికి చెందిన వారు. తరువాత వారు ఇస్లాం స్వీకరించారు.”
హజ్రత్ ఇబ్నె మస్‌వూద్ (రది అల్లాహు అన్హు) కథనం ఈ విధంగా వుంది: “ఈ ఆయతు జిన్నులను పూజించే అరబ్బులను ఉద్దేశించి అవతరించింది. ఆ జిన్నులు తరువాత ఇస్లాం స్వీకరించారు. ఆ సందర్భంగానే ఈ ఆయతు అవతరించింది. వాస్తవం అల్లాహ్ యెరుక” (షేఖ్ ముహమ్మద్ మునీర్ డెమాస్కసీ)
అల్లాహ్ ముష్రిక్కుల వైఖరిని ఖండిస్తూ ఈ ఆయతును అవతరింపజేశాడు. వాళ్లు విగ్రహాలను, దేవీదేవతలను పూజించేవారు. వాళ్ల పేరుతో కాబా గృహం మాదిరిగా కట్టడాలు నిర్మించేవారు.
లాత్ : తాయఫ్‌లో ఒక తెల్లని రాయి ఉండేది. దానిపై ఓ గృహం నిర్మించబడింది. అందులో అనేక తెరలు ఉండేవి. అనేక మంది సేవకులుండేవారు. దాని చుట్టూ మైదానాలుండేవి. తాయఫ్‌లో సఖీఫ్ తెగవారి దృష్టిలోఈ కట్టడం ఎంతో పవిత్రమైనదిగా, పూజనీయంగా ఉండేది.ఆ ప్రదేశంలో ఆ విగ్రహం ఉన్నందుకు ఖురైషులతోపాటు ఇతర అరబ్బు తెగలవారు కూడా గర్వపడేవారు.
ఉజ్జా: ఇదొక వృక్షం.ఇది ‘నఖ్లా’ అనే స్థలంలో ఉంది. ఈ “నఖ్లా’ మక్కా నగరానికి తాయఫ్ పట్టణానికి మధ్య ఉంది. ఈవృక్షంపై ఒక కట్టడం వెలిసింది. దానిపై కొన్ని పరదాలు వేలాడదీయబడ్డాయి. ఖురైష్ తెగవారు ఈ కట్టడాన్ని ఆరాధించేవారు. ఈ కారణంగానేనేమో ఉహుద్ యుద్ధ దినాన అబూ సుఫ్యాన్ ఈ కట్టడాన్ని తలచుకుంటూ”మాకు అండగా, ఉజ్జా దేవత ఉంది. మీకెవరున్నారు?!” అని ముస్లింలకు సవాలు విసిరాడు.దానికి సమాధానంగా మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన ప్రీయ సహచరుల చేత, “అల్లాహ్ మాకు అండగా ఉన్నాడు. మీకు అండగా ఎవరూ లేరు” అని చెప్పించారు.
మనాత్ : మక్కా-మదీనా నగరాల మధ్య ముసల్లల్ అనే స్ధలంలో ఈ విగ్రహం ఉండేది. అజ్ఞాన కాలంలో ఖుజాఅ, బెస్, ఖజ్రజ్ తెగల వారు ఈ విగ్రహానికి తమ శ్రద్ధాభక్తుల నివాళి ఘటించేవారు. హజ్ నెలలో కాబాకు వచ్చే యాత్రికులు ఈ స్థలం నుండే ఇహ్రామ్ దీక్ష బూనేవారు.ఈ కట్టడాలన్నింటినీ కూల్చడానికి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కొంతమంది సహాబీలను పంపించారు. హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ (రజి యల్లాహు అన్హు)ని మాత్రం “ఉజ్జా’ వైపునకు పంపారు.ఆయన ఆ కట్టడాన్ని నేలమట్టం చేస్తూ ఇలా పలికారు:-
ఓ ఉజ్జా! నేను నిన్ను ధిక్కరిస్తున్నాను. నీ పవిత్రతను కొనియాడబోను. అల్లాహ్ నీకు దుర్గతి పట్టించాడు.”
హజ్రత్ ముగీరా బిన్ షోబ (రజి యల్లాహు అన్హు), హజ్రత్ సుఫ్యాన్ (రజి యల్లాహు అన్హు)లను “లాత్’ విగ్రహం వైపునకు పంపించగా వారిద్దరూ కలసి ఆ విగ్రహాన్ని కూల్చివేశారు. ఆస్థలంలో ఒక మస్జిద్ను కూడా నిర్మించారు.ఈ విగ్రహం తాయఫ్ పట్టణంలో ఉండేది. మనాత్ విగ్రహం వైపునకు హజ్రత్ సుఫ్యాన్ పంపించబడ్డారు.ఆయన దాన్ని పడగొట్టారు. హజ్రత్ అలీ బిన్ అబూ తాలిబ్ పడగొట్టారని కూడా ఒక ఉల్లేఖనం ఉంది.
మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు సత్య ధర్మాన్ని తీసుకువచ్చారు. ఒక్కడైన సృష్టికర్తను సేవించమనీ, దైవారాధన స్వచ్భంగా ఉండాలనీ ఆయన ప్రజలకు బోధించారు. దురాచారాలను, షిర్కుతో కూడుకున్న కర్మలను ఆయన నిర్మూలించారు. ఆయన ప్రియ సహచరులు, వాళ్ల శిష్యులు కూడా ఈ సత్య ధర్మంపై స్థిరంగా ఉన్నారు. అయితే కాలక్రమేణా అనుయాయుల ధర్మావలంబనలో మార్చులు వచ్చాయి. ఆచరణలు కలగాపులగం అయి చాలా మంది ముస్లింలు షైతాన్ ఎత్తులకు చిత్తయిపోయారు. మిథ్యావాదులు ముస్లింలను లోబరుచు కున్నారు. వాళ్లు మళ్లీ విగ్రహారాధన వైపునకు మొగ్గసాగారు. తమకు తెలియ కుండానే వాళ్లు నెమ్మదిగా బహు దైవోపాసన వైపునకు తీసుకుపో బడుతున్నారు. కాని పండితులు ఈ విషయాన్ని పట్టించు కోవటం లేదు.ఇది ఎంతో శోచనీయం.
– షేక్ ముహమ్మద్ మునీర్ డెమాస్కసీ
హజ్రత్ అబూ వాఖిద్ లైసీ (రజి యల్లాహు అన్హు) ఇలా అంటున్నారు: “మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో కలిసి హునైన్ వైపునకు బయలుదేరాము. ఆరోజుల్లోనే మేము దైవధిక్కార (కుఫ్ర్) ఊబిలో నుండి బయటపడి ఉన్నాము. దారిలో ఒక రేగి చెట్టు ఉండేది. బహు దైవారాధకులు ఆ వృక్షం వద్ద బైఠాయించేవారు. తమ ఆయుధాలను ఆ వృక్షానికి వ్రేలాడదీసేవారు. ఆ వృక్షం “జాతుల్ నవాద్”గా పిలువబడేది. ఆ వృక్షం వద్దకు సమీపించగానే, “దైవప్రవక్తా! ఏవిధంగానయితే ఈ వృక్షం వాళ్లకోసం ‘జాతుల్ నవాద్’గా ఉందో ఆ విధంగా మాక్కూడా ‘జాతుల్ నవాద్’ గా చేయండి”అని మేము ప్రాధేయపడ్డాము.దీనిపై మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు ఆగ్రహం చెందారు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా వ్యాఖ్యానించారు:
“అల్లాహు అక్బర్! ఇవైతే ప్రాచీన కాలవు ఆచారాలు. ఎవరి అధీనంలో నా ప్రాణముందో ఆయన సాక్షిగా చెబుతున్నాను. ఇస్రాయీల్ సంతతి వారు మూసా (అలైహిస్సలాం)తో అన్న మాటలే ఈనాడు మీరు అన్నారు.”వాళ్ళకున్న ఆరాధ్య దైవాల వంటివే మాకోసం కూడా కల్పించండి” అని ఇస్రాయీల్ వంశీయులు చెప్పి ఉన్నారు. మీరు ఒట్టి అజ్ఞానులు. మీరు మీ పూర్వీకులయిన యూదుల, కైస్తవుల పద్ధతులను అనుసరించేలా ఉన్నారు.”(తిర్మిజీ)
నాల్గవ నియమం :
ఈ కాలపు ముష్రిక్కులు పూర్వకాలపు ముష్రిక్కుల కన్నా కడు హీనంగా ఉన్నారు. ఎందుకంటే, పూర్వకాలపు ముష్రిక్కులు కలిమిలో షిర్క్ (బహు దైవోపాసన)కు పాల్చడే వారు. కష్టకాలం దాపురించగానే ఒక్కడైన దైవం వైపుకు చిత్తశుద్ధితో మరలేవారు. కాని ఈ కలికాలపు ముష్రిక్కులైతే కష్ట కాలంలోనే గాక,సుఖ సంతోషాల సమయాల్లో సైతం బహు దైవారాధనకు పాల్పడుతున్నారు. దైవ గ్రంథంలోని ఈ దైవోపదేశం ఇందుకు ప్రబల తార్కాణం :
“వారు పడవలోకి ఎక్కినప్పుడు తమ ధర్మాన్ని అల్లాహ్‌కే ప్రత్యేకించుకుని ఆయన్ని వేడుకుంటారు.తరువాత ఆయన వారిని రక్షించి నేలపైకి తీసుకు రాగానే, అకస్మాత్తుగా వారు బహుదైవారాధన చేయటం ఆరంభిస్తారు.” (అన్‌కబూత్ 29:65)
మనలోని చాలా మంది తమ పూర్వీకుల, సజ్జనుల సమాధుల వద్దకు పోయి,వాటి ముందు చేయి చాచి అర్థించటం మనం చూస్తూ ఉన్నాము. కలిమిలోనూ లేమిలోనూ కూడా వీళ్లు ఈ పని చేస్తున్నారు. ప్రాచీన కాలపు ముష్రిక్కులే నయం. ఎందుకంటే వాళ్లు కష్టాల్లో మాత్రం నిజదైవం వైపునకు మరలి, కష్టాలు తీరిపోయిన తరువాత బూటకపు దైవాల వద్దకు పోయేవారు. కాని నవీన ముష్రిక్కులకు ఇలాంటి తేడా పాడా లేమీ లేవు. పైగా కష్టకాలంలో వీళ్ల బహు దైవోపాసనా చేష్టలు మరింత పెరిగిపోతున్నాయి. లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహిల్ అలియ్యిల్ అజీమ్.
“మీరు అల్లాహ్‌ను కాదని వేడుకునే మీ దేవీలు ఆయన కలిగించే నష్టం నుండి నన్ను కాపాడగలరా? లేదా అల్లాహ్ నాపై కనికరం చూపగోరికే, వారు ఆయన కారు ణ్యాన్ని అడ్డుకోగలరా? మీ అభిప్రాయ మేమిటీ? కనుక వారితో ఇలా అను : “నాకు అల్లాహ్ ఒక్కడే చాలు. నమ్ముకునే వారు ఆయననే నమ్ముకుంటారు.” (అజ్ జుమర్ 39:38)
“కలత చెందినవాడు మొర పెట్టుకున్నప్పుడు, అతని మొరను ఆలకించి, అతని బాధను తొలగించేవాడు ఎవడు? భూమిపై మిమ్మల్ని ప్రతినిధులుగా చేసినవాడు ఎవడు? అల్లాహ్‌తో పాటు (ఈ పనులు చేసే) మరొక దేవుడు కూడా ఎవడయినా ఉన్నాడా? కాని మీరు చాలా తక్కువగా ఆలో చిస్తారు?” (అన్ నమల్ 27:62)
“ఆయనను కాదని మీరు పిలిచే ఇతరులు కనీసం ఒక గడ్డిపోచకు కూడా యజమానులు కారు. వారిని వేడుకుంటే, వారు మీ ప్రార్థనలను వినలేరు. ఒకవేళ విన్నా, వాటికి ఏ నమాధానమూ మీకు ఇవ్వలేరు. మీరు కల్పించిన దైవత్వపు భాగస్వామ్యాన్ని వారు ప్రళయంనాడు తిరస్కరిస్తారు. సత్యాన్ని గురించిన ఈ సరైన సమాచారాన్ని తెలిసినవాడు తప్ప మరొకడెవ్వడూ మీకు అందజెయ్యలేడు.” (ఫాతిర్ 35: 13,14)
“అల్లాహ్‌ను కాదని, ప్రళయం వచ్చే వరకు అతనికి నమాధానమైనా ఇవ్వలేని వారిని, మొరపెట్టుకునే వారు తమకు మొరపెట్టుకుంటున్నారనే విషయం కూడా ఎరుగని వారిని వేడుకునే వాడికంటే పరమభ్రష్టుడైన మానవుడు ఎవడు ఉంటాడు? మానవులందరినీ సమావేశ పరచినప్పుడు, వారు తమనువేడుకున్న వారికి విరోధులై పోతారు. వారి ఆరాధనను తిరస్కరిస్తారు.” (అల్ అహ్‌ఖాఫ్ 46:5,6)
[వీడియో పాఠం]
షిర్క్ కి సంబంధించిన నాలుగు సూత్రాలు (The Four Principles of Shirk) https://youtu.be/nAglSs0ggPE [~ 40 నిముషాలు] వక్త: సయ్యద్ అబ్దుస్సలామ్ ఉమ్రి (హఫిజహుల్లాహ్)
25.34980855.394526
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.