దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఖుర్’ఆన్ పారాయణం: సాద్ అల్-ఘమిడి తెలుగు అనువాదం: అహ్ సనుల్ బయాన్
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
(ఓ ముహమ్మద్ – సఅసం!) మేమీ గ్రంథాన్ని సత్యబద్ధంగా నీ వైపుకు పంపాము. కాబట్టి నువ్వు అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించు – ధర్మాన్ని ఆయనకు మాత్రమే ప్రత్యేకిస్తూ!
జాగ్రత్త! నిష్కల్మషమైన ఆరాధన మాత్రమే అల్లాహ్‌కు చెందుతుంది. ఎవరయితే అల్లాహ్‌ను గాకుండా ఇతరులను సంరక్షకులుగా ఆశ్రయించారో వారు, “ఈ పెద్దలు మమ్మల్ని అల్లాహ్ సాన్నిధ్యానికి చేర్చటంలో తోడ్పడతారని భావించి మాత్రమే మేము వీళ్లను ఆరాధిస్తున్నామ”ని అంటారు. ఏ విషయం గురించి వారు భేదాభిప్రాయానికి లోనై ఉన్నారో దానికి సంబంధించిన (అసలు) తీర్పు అల్లాహ్ (స్వయంగా) చేస్తాడు. అబద్ధాలకోరులకు, కృతఘ్నులకు అల్లాహ్ ఎట్టి పరిస్థితిలోనూ సన్మార్గం చూపడు.
అల్లాహ్ (ఎవరినయినా) సంతానంగా చేసుకోదలచుకుంటే, తన సృష్టితాలలో తాను కోరిన వారిని ఎన్నుకుని ఉండేవాడు. (కాని) ఆయన పరమ పవిత్రుడు. ఆ అల్లాహ్ ఒకే ఒక్కడు, తిరుగులేనివాడు.
ఆయన ఆకాశాలను, భూమిని సత్యబద్ధంగా నిర్మించాడు. ఆయన రాత్రిని పగటిపై, పగటిని రాత్రిపై చుట్టివేస్తున్నాడు. సూర్యచంద్రులను కార్యబద్ధుల్ని చేశాడు. (వాటిలో) ప్రతిదీ నిర్ణీత సమయం వరకు సంచరిస్తూ ఉంది. ఆయనే అపార శక్తిమంతుడు, పాపాలను క్షమించేవాడు అని తెలుసుకోండి!
ఆయన మిమ్మల్నందరినీ ఒకే ప్రాణి నుండి పుట్టించాడు. మరి దాంతోనే దాని జతను కూడా చేశాడు. ఇంకా మీ కోసం పశువులలో ఎనిమిది (రకాల) పెంటి – పోతులను అవతరింపజేశాడు. ఆయన మిమ్మల్ని, మీ మాతృగర్భాలలో – మూడేసి చీకట్లలో – ఒకదాని తరువాత ఒకటిగా రూపకల్పన చేస్తున్నాడు. ఈ అల్లాహ్‌యే మీ ప్రభువు. రాజ్యాధికారం ఆయనదే. ఆయన తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడు. మరలాంటప్పుడు మీరు ఎటు తిరిగిపోతున్నారు?
ఒకవేళ మీరు తిరస్కార వైఖరిని అవలంబించినట్లయితే అల్లాహ్‌కు మీ అవసరం ఎంతమాత్రం లేదు (అన్న విషయాన్ని తెలుసుకోండి). తన దాసుల కృతఘ్నతా ధోరణిని ఆయన ఇష్టపడడు. మీరు గనక కృతజ్ఞతాపూర్వకంగా మసలుకుంటే, దాన్ని ఆయన మీ కోసం ఇష్టపడతాడు. బరువును మోసే వాడెవడూ ఇంకొకరి బరువును మోయడు. మరి మీరంతా మరలి పోవలసింది మీ ప్రభువు వైపునకే. మీరు చేస్తూ ఉన్న కర్మలను ఆయన మీకు తెలియపరుస్తాడు. ఆయన ఆంతర్యాల్లోని విషయాన్ని సయితం ఎరిగినవాడు.
మనిషికి ఎప్పుడైనా, ఏదైనా ఆపద వచ్చిపడితే తన ప్రభువు వైపుకు మరలి ఆయన్ని(అదేపనిగా) మొరపెట్టుకుంటాడు. మరి అల్లాహ్ అతనికి తన వద్ద నుంచి అనుగ్రహాన్ని ప్రసాదిస్తే అంతకు మునుపు అతను దేనికోసం (కడుదీనంగా) మొరపెట్టుకున్నాడో దాన్ని మరచిపోతాడు. అల్లాహ్ మార్గం నుంచి (ఇతరుల్ని కూడా) పెడత్రోవ పట్టించడానికి అల్లాహ్‌కు భాగస్వాముల్ని కల్పించటం మొదలెడతాడు. (ఓ ప్రవక్తా!) ఇలా చెప్పు : “నీ తిరస్కార వైఖరి లాభాలను కొన్నాళ్ళపాటు అనుభవించు. తుదకు నువ్వు నరక వాసులలో చేరేవాడివే.”
ఏమిటి, ఏ వ్యక్తి అయితే రాత్రి వేళల్లో సాష్టాంగప్రణామం చేస్తూ, దైవారాధనలో నిలబడుతున్నాడో, పరలోకానికి భయపడుతూ, తన ప్రభువు కారుణ్యాన్ని ఆశిస్తున్నాడో అతను (మరియు దానికి విరుద్ధంగా ప్రవర్తించేవాడు – ఇద్దరూ సమానులు కాగలరా?). చెప్పండి – తెలిసినవారు, తెలియనివారు ఒక్కటేనా? బుద్ధిమంతులు మాత్రమే ఉపదేశాన్ని గ్రహిస్తారు.
(ఓ ప్రవక్తా!) ఇలా చెప్పు : “విశ్వసించిన ఓ నా దాసులారా! మీ ప్రభువుకు భయపడుతూ ఉండండి. ఈ లోకంలో సత్కర్మలు చేసినవారికి మేలు జరుగుతుంది. అల్లాహ్ భూమి ఎంతో విశాలమైనది. సహనం వహించేవారికి లెక్కలేనంత పుణ్యఫలం ప్రసాదించబడుతుంది.”
“మీరు ఆయన్ని వదలి ఎవరెవరిని పూజించదలుస్తున్నారో పూజించుకోండి.” ఇంకా ఇలా చెప్పు: “ప్రళయదినాన తాము నష్టపోయినదిగాక, తమ పరివారానికి కూడా నష్టం చేకూర్చినవారే పూర్తిగా నష్టపోయినవారు. బాగా వినండి! ఘోరమైన నష్టం ఇదే.”
వారిని పైనుంచీ, క్రిందినుంచీ అగ్ని మేఘాలు (జ్వాలలు) ఆవరిస్తూ ఉంటాయి. వాటి (యాతన) గురించి అల్లాహ్ తన దాసులను భయపెడుతున్నాడు. “ఓ నా దాసులారా! అందుకే నాకు భయపడండి.”
అయితే తమ ప్రభువుకు భయపడుతూ ఉండేవారికోసం (అంతస్తులుగా కట్టబడిన) మేడలున్నాయి. వాటిపై (మరిన్ని) అంతస్తులు నిర్మించబడి ఉన్నాయి. మరి వాటి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉన్నాయి. అల్లాహ్ వాగ్దానం ఇది. అల్లాహ్ తన వాగ్దానానికి విరుద్ధంగా చేయడు.
ఏమిటి, నువ్వు చూడలేదా? – అల్లాహ్ ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి, దాన్ని భూగర్భంలోని ఊటలలోనికి చేరుస్తున్నాడు. మరి దాని ద్వారా రకరకాల పంటల్ని ఉత్పన్నం చేస్తున్నాడు. మరి అవి ఎండిపోతాయి. అప్పుడు నువ్వు వాటిని పసుపు రంగులో చూస్తావు. తరువాత వాటిని పొట్టుపొట్టుగా చేసేస్తాడు. విజ్ఞుల కోసం ఇందులో మహోపదేశం ఉంది.
39:22 أَفَمَن شَرَحَ اللَّهُ صَدْرَهُ لِلْإِسْلَامِ فَهُوَ عَلَىٰ نُورٍ مِّن رَّبِّهِ ۚ فَوَيْلٌ لِّلْقَاسِيَةِ قُلُوبُهُم مِّن ذِكْرِ اللَّهِ ۚ أُولَٰئِكَ فِي ضَلَالٍ مُّبِينٍ
ఏ వ్యక్తి హృదయాన్ని అల్లాహ్ ఇస్లాం కోసం విప్పాడో, (అతను గుణపాఠం నేర్చుకోని వ్యక్తిలాంటివాడు కాగలడా?) అతడు తన ప్రభువు తరఫు నుంచి వచ్చిన కాంతిపై ఉన్నాడు. అల్లాహ్ స్మరణ పట్ల ఎవరి హృదయాలు (మెత్తబడకుండా) కరకుగా మారాయో వారికి వినాశం తప్పదు. వారు స్పష్టమైన మార్గభ్రష్టతకు గురై ఉన్నారు.
అల్లాహ్ అత్యుత్తమమైన విషయాన్ని అవతరింపజేశాడు. అది పరస్పరం పోలిక కలిగి ఉండే, పదేపదే పునరావృతం అవుతూ ఉండే ఆయతులతో కూడిన గ్రంథం రూపంలో ఉంది. దాని వల్ల తమ ప్రభువుకు భయపడేవారి శరీరాలపై రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆ తరువాత వారి శరీరాలు, హృదయాలు అల్లాహ్ స్మరణపట్ల మెత్తబడి పోతాయి. ఇదీ అల్లాహ్ మార్గదర్శకత్వం. దాని ద్వారా ఆయన తాను కోరిన వారిని సన్మార్గానికి తెస్తాడు. మరి అల్లాహ్ ఎవరిని మార్గం నుండి తప్పిస్తాడో అతనికి మార్గం చూపేవాడెవడూ ఉండడు.
ఎవరయితే ప్రళయదినాన దుర్భరమైన శిక్ష పడకుండా తన ముఖాన్ని డాలుగా పెట్టుకుంటాడో (అతను ప్రళయదినాన నిశ్చింతగా ఉండేవానితో సమానం కాగలడా?) “మీరు సంపాదించుకున్న దాని రుచిని చూడండి” అని ఆ దుర్మార్గులతో అనబడుతుంది.
అల్లాహ్ ఒక ఉదాహరణ ఇస్తున్నాడు: ఒక (బానిస) వ్యక్తి ఉన్నాడు. అతను విరుద్ధ భావాలు గల అనేకమంది భాగస్వాముల క్రింద ఉన్నాడు. రెండవ వ్యక్తి ఒక్కనికే చెందినవాడు (ఒక యజమానికి చెందిన బానిస). వారిద్దరూ సమానులవుతారా? ప్రశంసలన్నీ అల్లాహ్ కొరకే. కాని వారిలో చాలా మంది తెలియనివారు.
39:30 إِنَّكَ مَيِّتٌ وَإِنَّهُم مَّيِّتُونَ
నిశ్చయంగా (ఏదో ఒకనాడు) నీకూ చావు వస్తుంది. వారికీ చావు వస్తుంది.
39:31 ثُمَّ إِنَّكُمْ يَوْمَ الْقِيَامَةِ عِندَ رَبِّكُمْ تَخْتَصِمُونَ
తర్వాత మీరంతా ప్రళయదినాన మీ ప్రభువు ఎదుట గొడవపడతారు.
అల్లాహ్‌పై అబద్ధాలు చెప్పే వాడి కంటే, తన వద్దకు సత్య ధర్మం వచ్చినప్పుడు దాన్ని అసత్యమని ధిక్కరించేవాడి కంటే పరమదుర్మార్గుడు ఎవడుంటాడు? అటువంటి తిరస్కారుల నివాస స్థలం నరకం కాక మరేమవుతుందీ??
ఆకాశాలను, భూమిని సృష్టించిన వాడెవడు? అని నువ్వు గనక వారిని అడిగితే, “అల్లాహ్” అని వారు తప్పకుండా చెబుతారు. వారితో చెప్పు : “సరే! చూడండి. మీరు అల్లాహ్‌ను వదలి ఎవరెవరిని పిలుస్తున్నారో వారు, అల్లాహ్ నాకేదన్నా కీడు చేయదలిస్తే, ఆ కీడును తొలగించగలరా? పోనీ, అల్లాహ్ నన్ను కటాక్షించదలిస్తే, వారు ఆయన కృపను అడ్డుకోగలరా?” ఇలా అను: “నాకు అల్లాహ్ చాలు. నమ్మేవారు ఆయన్నే నమ్ముకుంటారు.”
(ఓ ముహమ్మద్ – సఅసం!) జనుల కోసం మేము ఈ గ్రంథాన్ని సత్యబద్ధంగా నీ వద్దకు పంపాము. కాబట్టి ఎవడయినా దారికి వస్తే అతను తన స్వయానికే మేలు చేసుకున్నాడు. మరెవరయినా దారితప్పితే ఆ పెడదారి (పాపం) అతని మీదే పడుతుంది. నీవు వారికి బాధ్యుడవు కావు.
అల్లాహ్‌యే ఆత్మలను వాటి మరణ సమయంలో స్వాధీనం చేసుకుంటాడు. మరణం రాని వారి ఆత్మలను కూడా వాటి నిద్రావస్థలో ఆయన వశపరచుకుంటున్నాడు. మరి మరణ ఉత్తర్వు ఖరారైన వారి ఆత్మలను ఆపుకుంటున్నాడు. ఇతర ఆత్మలను ఒక నిర్ణీత గడువు వరకు వదలిపెడుతున్నాడు. చింతన చేసే వారి కోసం ఇందులో ఎన్నో సూచనలున్నాయి.
ఏమిటి, వారు అల్లాహ్‌ను వదలి (వేరితరులను) సిఫార్సు చేసేవారుగా చేసుకుంటున్నారా? “వారికి ఏ అధికారం లేకున్నా, తెలివి లేకపోయినా (మీరు వారిని సిఫార్సు కోసం నిలబెడతారా?)?” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.
అల్లాహ్ ఒక్కని గురించి ప్రస్తావించినప్పుడు పరలోకాన్ని నమ్మని వారి గుండెలు అక్కసుతో ఉడికిపోతాయి. మరి అల్లాహ్ తప్ప ఇతరుల గురించి చెప్పినప్పుడు మాత్రం అవి ఆనందంతో విప్పారుతాయి.
(ఓ ప్రవక్తా! నువ్వు ఇలా) అను: “ఓ అల్లాహ్! భూమ్యాకాశాల సృష్టికర్తా! గోచర అగోచరాలను గురించి తెలిసినవాడా! నీ దాసులు విభేదించుకుంటున్న విషయాలపై నీవు మాత్రమే తీర్పు చేస్తావు.”
దుర్మార్గానికి ఒడిగట్టే వారి వద్ద భూమి యందలి సమస్తమూ ఉన్నా, దాంతోపాటు మరి అంతటి సంపద ఉన్నా ఘోర శిక్ష నుండి తప్పించుకోవటానికి ప్రళయ దినాన వారు దాన్నంతటినీ కూడా – పరిహారంగా – ఇచ్చివేస్తారు. వారు ఊహించి కూడా ఉండనిది అల్లాహ్ తరఫున వారి ముందు ప్రస్ఫుటమవుతుంది.
మనిషికి ఏదన్నా ఆపద వచ్చిపడినప్పుడు అతడు మమ్మల్ని (సహాయం కోసం) మొరపెట్టుకోసాగుతాడు. మరి మేమతనికి మా తరఫునుండి ఏదైనా అనుగ్రహాన్ని ప్రసాదిస్తే “ఇది నా ప్రజ్ఞా పాటవాల మూలంగా నాకు ఇవ్వబడింద”ని అంటాడు. కాదు, వాస్తవానికి అదొక పరీక్ష. కాని వారిలో చాలా మంది ఈ విషయాన్ని గ్రహించరు.
(ఓ ప్రవక్తా! నా తరఫున వారికి ఇలా) చెప్పు: “తమ ఆత్మలపై అన్యాయానికి ఒడిగట్టిన ఓ నా దాసులారా! మీరు అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్ పాపాలన్నింటినీ క్షమిస్తాడు. నిజంగా ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు.
“అప్పుడు ఏ ప్రాణి అయినా, ‘అయ్యో! ఏమి దురవస్థ నాది! నేను అల్లాహ్ విషయంలో లోటు చేశానే! నేను గేలిచేసే వారిలో ఉండిపోయానే!?’ అని చెబుతుందేమో! (ఆ పరిస్థితి రాకూడదు సుమా!)
“లేదా శిక్షను చూసిన తరువాత, ‘ఎలాగయినాసరే నేను తిరిగి (ప్రపంచానికి) పంపబడితే నేను సజ్జనులలో చేరుతాను’ అని పలుకుతుందేమో! (మీకు ఆ దురవస్థ రాకూడదనే ఈ విషయాలన్నీ విడమరచి చెప్పబడ్డాయి).”
“అదికాదు, నిశ్చయంగా నా సూచనలు నీ వద్దకు వచ్చాయి. కాని నువ్వు వాటిని ధిక్కరించావు. గర్వాతిశయంతో విర్రవీగావు. అసలు నువ్వు అవిశ్వాసులలో ఒకడవు” (అని అనబడుతుంది).
నిశ్చయంగా నీ వద్దకు, నీ పూర్వీకులైన ప్రవక్తల వద్దకు పంపబడిన సందేశం (వహీ) ఇది : “ఒకవేళ నువ్వు గనక బహుదైవారాధనకు పాల్పడితే నువ్వు చేసుకున్నదంతా వృధా అయిపోతుంది. మరి నిశ్చయంగా నువ్వు నష్టపోయినవారిలో చేర్తావు.”
వారసలు అల్లాహ్‌ను గౌరవించవలసిన విధంగా గౌరవించలేదు. ప్రళయ దినాన భూమి అంతా ఆయన గుప్పెట్లో ఉంటుంది. ఆకాశాలన్నీ ఆయన కుడిచేతిలో చుట్టబడి ఉంటాయి. ఆయన పవిత్రుడు. వీళ్లు కల్పించే భాగస్వామ్యాలకు అతీతుడు – ఎంతో ఉన్నతుడు.
మరి శంఖం ఊదబడగానే ఆకాశాలలో, భూమిలో ఉన్న వారంతా స్పృహ తప్పి పడిపోతారు – కాని అల్లాహ్ కోరిన వారు మాత్రం (స్పృహ కోల్పోరు)! మళ్లీ శంఖం పూరించబడగానే వారంతా ఒక్కసారిగా లేచి చూస్తూ ఉంటారు.
భూమి తన ప్రభువు జ్యోతితో ధగధగా మెరిసిపోతుంది. కర్మల పత్రాలు హాజరు పరచబడతాయి. ప్రవక్తలు, సాక్షులు రప్పించబడతారు. వారి మధ్య న్యాయసమ్మతంగా తీర్పు చేయబడుతుంది. వారికి అన్యాయం అనేది జరగదు.
అవిశ్వాసులు గుంపులు గుంపులుగా నరకం వైపు తోలబడతారు. వారు అక్కడకు చేరుకోగానే దాని ద్వారాలు తెరువబడతాయి. “ఏమిటి? మీ ప్రభువు వాక్యాలను చదివి వినిపించే, ఈ దినం రానున్నదని మిమ్మల్ని హెచ్చరించే ప్రవక్తలు – మీలో నుంచి – ఎవరూ రాలేదా?” అని అక్కడి పర్యవేక్షకులు వారిని అడుగుతారు. దానికి వారు “ఎందుకు రాలేదు? (వచ్చారు). కాని అవిశ్వాసులపై శిక్షా ఉత్తర్వు ఖరారై పోయింది” అని చెబుతారు.
మరెవరయితే తమ ప్రభువుకు భయపడుతూ ఉండేవారో, వారు గుంపులు గుంపులుగా స్వర్గం వైపునకు పంపబడతారు. తుదకు వారు అక్కడకు చేరుకునేటప్పటికే దాని ద్వారాలు తెరువబడి ఉంటాయి. స్వర్గ పర్యవేక్షకులు వారినుద్దేశ్యించి, “మీపై శాంతి కురియుగాక! మీరు హాయిగా ఉండండి. శాశ్వతంగా ఉండేటందుకు ఇందులో ప్రవేశించండి” అంటారు.
“అల్లాహ్‌కే కృతజ్ఞతలు. ఆయన మాకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. మమ్మల్ని ఈ భూమికి వారసులుగా చేశాడు. ఇక స్వర్గంలో మేము కోరిన చోటల్లా ఉంటాము. మొత్తానికి (మంచి) కర్మలు చేసేవారికి లభించే ప్రతిఫలం ఎంత గొప్పది!” అని వారు అంటారు.
మరి నువ్వు, దైవదూతలు దైవ సింహాసనం చుట్టూ చేరి, తమ ప్రభువు పవిత్రతను కొనియాడటాన్ని, స్తోత్రం చేయటాన్ని చూస్తావు. వారి మధ్య న్యాయబద్ధంగా తీర్పు చేయబడుతుంది. “సకల లోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు” అని అనబడుతుంది
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
79:14 فَإِذَا هُم بِالسَّاهِرَةِ
(అది సంభవించగానే) వారంతా ఒక్కసారిగా మైదానంలో
సమీకరించబడతారు.
79:15 هَلْ أَتَاكَ حَدِيثُ مُوسَىٰ
(ఓ ప్రవక్తా!) మూసా సంగతిగాని నీ వరకు చేరిందా?
79:16 إِذْ نَادَاهُ رَبُّهُ بِالْوَادِ الْمُقَدَّسِ طُوًى
అప్పుడు అతని ప్రభువు అతణ్ణి ‘తువా’ అనే పవిత్ర లోయలోకి పిలిచాడు.
79:17 اذْهَبْ إِلَىٰ فِرْعَوْنَ إِنَّهُ طَغَىٰ
“నువ్వు ఫిరౌను వద్దకు వెళ్ళు. వాడు మరీ చెలరేగిపోయాడు.”
79:18 فَقُلْ هَل لَّكَ إِلَىٰ أَن تَزَكَّىٰ
“నీ స్వీయ సంస్కరణకు నువ్వు సిద్ధంగా ఉన్నావా?” అని వాణ్ణి అడుగు.
79:19 وَأَهْدِيَكَ إِلَىٰ رَبِّكَ فَتَخْشَىٰ
“నువ్వు భయభక్తులతో మసలుకునేందుకుగాను, నేను నీకు నీ ప్రభువు మార్గం చూపించనా!?” (అని చెప్పమని అల్లాహ్ మూసాకు ఉపదేశించాడు).
79:20 فَأَرَاهُ الْآيَةَ الْكُبْرَىٰ
మరి (మూసా) అతనికి గొప్ప సూచన (మహిమ)ను చూపాడు.
79:21 فَكَذَّبَ وَعَصَىٰ
కాని వాడు మాత్రం ధిక్కరించాడు, అవిధేయతకు పాల్పడ్డాడు.
79:22 ثُمَّ أَدْبَرَ يَسْعَىٰ
ఆ తర్వాత తిరిగి వెళ్లి, తన సన్నాహాలు మొదలెట్టాడు.
79:23 فَحَشَرَ فَنَادَىٰ
మరి అందరినీ సమావేశపరచి, ప్రకటించాడు.
79:24 فَقَالَ أَنَا رَبُّكُمُ الْأَعْلَىٰ
“నేనే మీ సర్వోన్నత ప్రభువును” అన్నాడు.
79:25 فَأَخَذَهُ اللَّهُ نَكَالَ الْآخِرَةِ وَالْأُولَىٰ
అందువల్ల అల్లాహ్ అతన్ని ఇహపర లోకాల శిక్షగా పట్టుకున్నాడు.
79:26 إِنَّ فِي ذَٰلِكَ لَعِبْرَةً لِّمَن يَخْشَىٰ
నిశ్చయంగా ఇందులో దైవభీతిగల ప్రతి ఒక్కరికీ గొప్ప గుణపాఠం ఉంది.
79:27 أَأَنتُمْ أَشَدُّ خَلْقًا أَمِ السَّمَاءُ ۚ بَنَاهَا
ఏమిటి, మిమ్మల్ని సృష్టించటం కష్టంతో కూడుకున్న పనా? లేక ఆకాశాన్నా? ఆయనే (అల్లాహ్ యే) దానిని నిర్మించాడు.
79:28 رَفَعَ سَمْكَهَا فَسَوَّاهَا
ఆయనే దాని కప్పును బాగా ఎత్తుగా చేశాడు. మరి దానిని తీర్చిదిద్దాడు.
79:29 وَأَغْطَشَ لَيْلَهَا وَأَخْرَجَ ضُحَاهَا
దాని రాత్రిని చీకటిమయంగా చేశాడు, దాని పగటిని (వెలుతురుగా) బయల్పరిచాడు.
79:30 وَالْأَرْضَ بَعْدَ ذَٰلِكَ دَحَاهَا
తరువాత భూమిని సుగమం చేశాడు.
79:31 أَخْرَجَ مِنْهَا مَاءَهَا وَمَرْعَاهَا
అందులో నుంచి దాని నీళ్ళను, దాని పచ్చికను వెలికి తీశాడు.
79:32 وَالْجِبَالَ أَرْسَاهَا
ఇంకా, పర్వతాలను (స్థిరంగా) పాతి పెట్టాడు.
79:33 مَتَاعًا لَّكُمْ وَلِأَنْعَامِكُمْ
ఇదంతా మీ కోసమూను, మీ పశువుల ప్రయోజనం కోసమే.
79:34 فَإِذَا جَاءَتِ الطَّامَّةُ الْكُبْرَىٰ
మరెప్పుడైతే ఆ మహా విపత్తు (ప్రళయం) వచ్చిపడుతుందో…
79:35 يَوْمَ يَتَذَكَّرُ الْإِنسَانُ مَا سَعَىٰ
ఆ రోజు మనిషి తాను చేసిన దాన్ని నెమరు వేసుకుంటాడు.
79:36 وَبُرِّزَتِ الْجَحِيمُ لِمَن يَرَىٰ
ప్రతి చూపరి ముందూ నరకం బహిర్గతం చేయబడుతుంది.
79:37 فَأَمَّا مَن طَغَىٰ
కాబట్టి ఎవడు తలబిరుసుగా వ్యవహరించాడో,
79:38 وَآثَرَ الْحَيَاةَ الدُّنْيَا
మరి ప్రాపంచిక జీవితానికే ప్రాధాన్యం ఇచ్చాడో,
79:39 فَإِنَّ الْجَحِيمَ هِيَ الْمَأْوَىٰ
అతని నివాసం నరకమే అవుతుంది.
79:40 وَأَمَّا مَنْ خَافَ مَقَامَ رَبِّهِ وَنَهَى النَّفْسَ عَنِ الْهَوَىٰ
మరెవడు తన ప్రభువు ఎదుట నిలబడే విషయమై భయపడ్డాడో,
ఇంకా తన మనసును చెడు వాంఛల నుండి ఆపుకున్నాడో,
79:41 فَإِنَّ الْجَنَّةَ هِيَ الْمَأْوَىٰ
అతని నివాసం స్వర్గమవుతుంది.
79:42 يَسْأَلُونَكَ عَنِ السَّاعَةِ أَيَّانَ مُرْسَاهَا
వారు ప్రళయం గురించి, ‘ఇంతకీ అదెప్పుడు సంభవిస్తుంది?’
అని నిన్ను అడుగుతున్నారు కదూ!
79:43 فِيمَ أَنتَ مِن ذِكْرَاهَا
ఆ వివరణతో అసలు నీకేం సంబంధం (ఉందనీ?)
79:44 إِلَىٰ رَبِّكَ مُنتَهَاهَا
ఆ సంగతి (దాని పరిజ్ఞానం) పూర్తిగా నీ ప్రభువు వైపే మరలుతుంది (కదా!)
79:45 إِنَّمَا أَنتَ مُنذِرُ مَن يَخْشَاهَا
నువ్వు మాత్రం దానికి భయపడేవారిని హెచ్చరించే వాడివి మాత్రమే.
79:46 كَأَنَّهُمْ يَوْمَ يَرَوْنَهَا لَمْ يَلْبَثُوا إِلَّا عَشِيَّةً أَوْ ضُحَاهَا
వారు దానిని ప్రత్యక్షంగా చూసిన నాడు, తాము (ప్రపంచంలో)
కేవలం ఒక దినములో అంత్య భాగమో లేక దాని ఆరంభ భాగమో
ఉండి ఉంటామని వారికి అనిపిస్తుంది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఓ విశ్వసించినవారలారా! ఉపవాసాలుండటం మీపై విధిగా నిర్ణయించబడింది – మీ పూర్వీకులపై కూడా ఇదే విధంగా ఉపవాసం విధించబడింది. దీనివల్ల మీలో భయభక్తులు పెంపొందే అవకాశం ఉంది.
అదీ లెక్కించదగిన కొన్ని రోజులు మాత్రమే. అయితే మీలో వ్యాధిగ్రస్తులుగానో, ప్రయాణీకులుగానో ఉన్నవారు ఆ ఉపవాసాల లెక్క ఇతర దినాలలో పూర్తి చేసుకోవాలి. స్థోమత ఉన్న వారు (ఉపవాసం పాటించకపోయినందుకు) పరిహారంగా ఒక నిరుపేదకు అన్నం పెట్టాలి. కాని ఎవరైనా స్వచ్ఛందంగా ఇంకా ఎక్కువ పుణ్యం చేస్తే, అది వారికే మేలు. మీరు గ్రహించ గలిగితే ఉపవాసం ఉండటమే మీ కొరకు శ్రేయస్కరం.
రమజాను నెల – ఖుర్‌ఆన్ అవతరింపజేయబడిన నెల. అది మానవులందరికీ మార్గదర్శకం. అందులో సన్మార్గంతోపాటు, సత్యాసత్యాలను వేరుపరచే స్పష్టమైన నిదర్శనాలు ఉన్నాయి. కనుక మీలో ఎవరు ఈ నెలను చూస్తారో వారు ఉపవాసాలుండాలి. అయితే రోగగ్రస్తుని గానో, ప్రయాణీకుని గానో ఉన్న వారు ఇతర దినాలలో ఈ లెక్కను పూర్తిచేయాలి. అల్లాహ్ మీకు సౌలభ్యాన్ని సమకూర్చదలుస్తున్నాడేగాని మిమ్మల్ని కష్టపెట్టదలచటం లేదు. మీరు (ఉపవాసాల) నిర్ణీత సంఖ్యను పూర్తిచేసుకోవాలన్నదీ, తాను అనుగ్రహించిన సన్మార్గ భాగ్యానికి ప్రతిగా ఆయన గొప్పతనాన్ని కీర్తించి, తగురీతిలో మీరు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాలన్నది అల్లాహ్ అభిలాష!
(ఓ ప్రవక్తా!) నా దాసులు నా గురించి నిన్ను అడిగితే, నేను (వారికి) అత్యంత సమీపంలోనే ఉన్నాననీ, పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా నేను అతని పిలుపును ఆలకించి ఆమోదిస్తానని (నువ్వు వారికి చెప్పు). కాబట్టి వారు కూడా నా ఆదేశాన్ని శిరసావహించాలి, నన్ను విశ్వసించాలి (ఈ విషయం నీవు వారికి తెలియజేయి). తద్వారానే వారు సన్మార్గ భాగ్యం పొందగల్గుతారు.
ఉపవాస కాలంలోని రాత్రులలో మీరు మీ భార్యలను కలుసుకోవటం మీ కొరకు ధర్మసమ్మతం చేయబడింది. వారు మీకు దుస్తులు, మీరు వారికి దుస్తులు. మీరు రహస్యంగా ఆత్మద్రోహానికి పాల్పడుతున్నారనే సంగతి అల్లాహ్‌కు తెలుసు. అయినప్పటికీ ఆయన క్షమాగుణంతో మీ వైపుకు మరలి, మీ తప్పును మన్నించాడు. ఇకనుంచి మీరు మీ భార్యలతో (ఉపవాసపు రాత్రులందు) రమించడానికీ, అల్లాహ్ మీ కొరకు రాసిపెట్టిన దాన్ని అన్వేషించటానికీ మీకు అనుమతి ఉంది. తొలిజాములోని తెలుపు నడిరేయి నల్లని చారలో నుండి ప్రస్ఫుటం అయ్యే వరకూ తినండి, త్రాగండి. ఆ తరువాత (వీటన్నింటినీ పరిత్యజించి) రాత్రి చీకటి పడేవరకూ ఉపవాసం ఉండండి. ఇంకా – మీరు మస్జిదులలో ‘ఏతెకాఫ్’ పాటించేకాలంలో మాత్రం మీ భార్యలతో సమాగమం జరపకండి. ఇవి అల్లాహ్ (నిర్ధారించిన) హద్దులు. మీరు వాటి దరిదాపులకు కూడా పోకండి. ప్రజలు అప్రమత్తంగా ఉండగలందులకుగాను అల్లాహ్ తన ఆయతులను ఇలా విడమరచి చెబుతున్నాడు.
ఒకరి సొమ్మును ఇంకొకరు అన్యాయంగా స్వాహా చేయకండి. బుద్ధిపూర్వకంగా, అక్రమమైన రీతిలో ఇతరుల ఆస్తిలో కొంతభాగం కాజేయటం కోసం అధికారులకు ముడుపులు చెల్లించకండి. అది (న్యాయం కాదన్న సంగతి) మీకూ తెలిసినదే.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
రమజాన్ ప్రత్యేక క్విజ్ ప్రశ్నల పత్రం -08 : జవాబులు మరియు విశ్లేషణ
(1) ఖుర్ఆన్ పఠిస్తే ప్రతీ అక్షరానికి ఎన్ని పుణ్యాలు లభిస్తాయి?
A) 10 పుణ్యాలు
[999] وعن ابن مسعودٍ – رضي الله عنه – قال: قَالَ رسولُ اللهِ – صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ -: «مَنْ قَرَأ حَرْفاً مِنْ كِتَابِ اللهِ فَلَهُ حَسَنَةٌ، وَالحَسَنَةُ بِعَشْرِ أمْثَالِهَا، لا أقول: ألم حَرفٌ، وَلكِنْ: ألِفٌ حَرْفٌ، وَلاَمٌ حَرْفٌ، وَمِيمٌ حَرْفٌ» . رواه الترمذي، وقال: (حَدِيثٌ حَسَنٌ صَحيحٌ)
హదీసు కిరణాలు 999లో ఉంది: అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు: “ఎవరు అల్లాహ్ గ్రంథం ఖుర్ఆనులోని ఒక అక్షరం చదువుతారో వారికి దానికి బదులుగా ఒక పుణ్యం, ఆ ఒక పుణ్యం పది రెట్లు పెంచి ఇవ్వడం జరుగుతుంది. అలిఫ్, లామ్, మీమ్ (ఈ మూడు కలసి ఉన్న పదం) ఒక అక్షరం అని చెప్పను, అలిఫ్ ఒక అక్షరం, లామ్ ఒక అక్షరం, మీమ్ ఒక అక్షరం. (అంటే అలిఫ్ లామ్ మీమ్ అని చదువుతే ముప్పై పుణ్యాలు లభిస్తాయని భావం).“
(2) ఖుర్ఆన్ లో “రూహుల్ ఆమీన్” అని ఎవరిని సంభోదించుట జరిగింది?
“నిశ్చయంగా ఇది (ఈ ఖుర్‌ఆన్) సకల లోకాల ప్రభువు అవతరింపజేసినది. విశ్వసనీయుడైన దైవదూత దీన్ని తీసుకువచ్చాడు. (ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం!) నువ్వు హెచ్చరించే వారిలోని వాడవు కావటానికి ఇది నీ హృదయంపై అవతరించింది. (ఇది) సుస్పష్టమైన అరబీ భాషలో ఉంది.”
(3) ఖుర్ఆన్ ఏ రాత్రియందు అవతరించినది?
షబే ఖద్ర్ రాత్రి / లైలతుల్ ఖద్ర్ రాత్రి
రమజాను మాసములోని లైలతుల్ ఖద్ర్ (ఘనమైన రేయి) లో అవతరించింది. దానిని లైలతుల్ ముబారక (శుభప్రదమైన రేయి) అని కూడా అంటారు .
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ప్రశ్న: తరావీహ్ నమాజులో ఖుర్ఆన్ చూసి చదవవచ్చునా?
అవును, తరావీహ్ నమాజులో ఖుర్ఆన్ చూసి చదవవచ్చును. ఆయిషా రజియల్లాహు అన్హా యొక్క బానిస జక్వాన్ (ذَكْوَان) ఖుర్ఆన్ చూసి తరావీహ్ నమాజ్ చేయించేవారు. ఆయిషా రజియల్లాహు అన్హా అతని వెనక తరావీహ్ లో పాల్గొనేవారు. (సునన్ కుబ్రా బైహఖీ 2/359. 3366, బుఖారీలో ముఅల్లఖన్ వచ్చింది 692కు ముందు హదీసు. బాబు ఇమామతిల్ అబ్ది వల్ మౌలా).
ఒక వ్యక్తి రమజానులో ఖుర్ఆన్ చూసి తరావీహ్ నమాజ్ చేయిస్తాడు, అతని గురించి మీరేమంటారు అని ఇమాం జుహ్రీ రహిమహుల్లాహ్ ను ప్రశ్నించడం జరిగింది. అప్పుడు ఆయన చెప్పారు: “ఇస్లాం ఉన్నప్పటి నుండి మా మంచివారు ఖుర్ఆన్ లో చూసే నమాజు చేస్తూ ఉన్నారు.” (ముఖ్తసర్ ఖియామిల్ లైల్ వ ఖియామి రమజాన్: ఇమాం మిర్వజీ. 233).
సఈద్ బిన్ ముసయ్యిబ్, ఖతాద, అతా, యహ్ యా బిన్ సఈద్ అన్సారీ రహిమహుముల్లాహ్, ఈ ఇమాములందరూ రమజానులో ఖుర్ఆన్ చూసి తరావీహ్ చేయించవచ్చు, అభ్యంతరం లేదన్నారు. (ముఖ్తసర్ ఖియామిల్ లైల్ వ ఖియామి రమజాన్: ఇమాం మిర్వజీ. 233).
ఇంకా ప్రఖ్యాతిగాంచిన ఇమాం అబూ హనీఫా గారి ఇద్దరు శిష్యులు ఇమాం అబూ యూసుఫ్ మరియు ఇమాం ముహమ్మద్, అలాగే ఇమాం మాలిక్, ఇమాం షాఫిఈ మజ్హబ్ లో మరియు ఇమాం అహ్మద్ వారందరూ కూడా రమజానులో ఖుర్ఆన్ చూసి తరావీహ్ చేయవచ్చన్నారు.
అయితే ఇమాం ఇబ్రాహీం, ముజాహిద్, షఅబీ, సుఫ్యాన్ రహిమహుముల్లాహ్ వారు మక్రూహ్ అన్నారు, ఎందుకంటే ఇది యూదులకు పోలిన విషయం అవుతుందీ అని. (ముఖ్తసర్ ఖియామిల్ లైల్ వ ఖియామి రమజాన్: ఇమాం మిర్వజీ. 234).
మరియు అబూ హనీఫా రహిముహల్లాహ్ చెప్పారు: ఖుర్ఆనులో చూసి చదివితే నమాజ్ ఫాసిద్ అవుతుంది. దీని వల్ల అధిక చలనం అవుతుంది, నమాజులో సజ్దా చేసే చోట దృష్టి కేంద్రికృతమై ఉండదు అని. కాని పైన తెలుసుకున్నట్లు ఆయన ఇద్దరు శిష్యులు స్వయంగా దీనిని వ్యతిరేకించారు.
ఇమాం ముహమ్మద్ బిన్ నస్ర్ మిర్వజీ చెప్పారు: ఇమాం అబూ హనీఫా కంటే ముందు ఎవరు కూడా నమాజ్ ఫాసిద్ అవుతుందని చెప్పలేదు. ‘యూదులకు పోలికవుతుంది’ గనక మక్రూహ్ అని చెప్పారు.
అంతే కాదు ఇమాం నవవీ (రహిముహుల్లాహ్) చెప్పారు: “మనిషికి ఖుర్ఆన్ కంఠస్తం ఉన్నా లేకపోయినా ఖుర్ఆన్ చూసి చదివినంత మాత్రాన నమాజ్ బాతిల్ కాదు. ఒకవేళ సుర ఫాతిహా గనక కంఠస్తం లేకుంటే చూసి చదవడం విధిగా అవుతుంది. చూసి చదివితే నమాజ్ బాతిల్ కాదు అన్న మాట మా మజ్హబ్ (అంటే షాఫిఈ మజ్హబ్), మాలిక్ మజ్హబ్, మరియు అబూ యూసుఫ్, ముహమ్మద్ మరియు అహ్మదులవారి మజ్హబ్. (అల్ మజ్మూఅ షర్హ్ల్ ముహజ్జబ్ : ఇమాం నవవీ 4/27).
సఊదీ అరేబియాలోని షేఖ్ ఇబ్ను బాజ్ మరియు షేఖ్ ఇబ్ను ఉసైమీన్ రహిమహుమల్లాహ్ కూడా రమజానులో ఖుర్ఆన్ చూసి తరావీహ్ చేయించడానికి అనుమతించారు.(మజ్మూఅ ఫతావా బిన్ బాజ్ 11/117, ఫతావా నూరున్ అలద్ దర్బ్ 8/2).
ముఖ్య గమనిక:
1- ఖుర్ఆన్ ఉత్తమ రీతిలో కంఠస్తం ఉన్న ఇమాం చూసి చదవడం మంచిది కాదు.
2- ముఖ్తదీలలో ఎవరు కూడా ఇమాం చదువుతున్న ఆయతులు ఖుర్ఆన్ చూస్తూ ఫాలో కావడం కూడా యోగ్యం లేదు. దీని వల్ల దృష్టి సజ్దా చేసే చోట కాకుండా ఖుర్ఆన్ పేజీలలో ఉంటుంది. చేతులు కట్టుకొని ఉండాల్సిన సున్నత్ తప్పిపోతుంది. ఖుర్ఆన్ మూయడం, తెరవడం, పేజీలు తిప్పడం, పక్కన పెట్టడం తీసుకోవడం లాంటి పనుల వల్ల నమాజు మక్రూహ్ అయ్యే కారణాల్లో ఒకటి అధిక చలనం అవుతుంది.
3- ఇమాం ఖుర్ఆన్ లో చూడకుండా చదువుతూ వెనక ఎవరినైనా ఒక్కరిని ఖుర్ఆన ను చూడమని, ఏదైనా తప్పు జరిగితే చెప్పమని అంటే అతను ఖుర్ఆను చూడవచ్చు. (ఫతావా నూరున్ అలద్ దర్బ్ 14/232).
సారాంశం ఏమిటంటే: ఖుర్ఆన్ కంఠస్తం లేనందు వల్ల లేదా ఉత్తమ రీతిలో కంఠస్తం లేనందు వల్ల మరియు తరావీహ్ నమాజులు సామాన్య నమాజుల కంటే దీర్ఘంగా, ఆలస్యంగా చేయడం మంచిది గనక ఖుర్ఆన్ చూసి తరావీహ్ చేయించడం ఒక అవసరం గనక ఇది యోగ్యమే. దీని వల్ల నమాజ్ బాతిల్ కాదు.
అల్లాహ్ మనందరికీ సుఖ దుఃఖ అన్ని స్థితిల్లో ఆయన ఆజ్ఞాపాలన చేసే సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్, సుమ్మ ఆమీన్
కూర్పు: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[11:39 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.