జిహాద్ అంటే ఏమిటి? చంపడానికి ఆదేశించే ఇస్లాం శాంతియుత ధర్మం ఎలా అవుతుంది? [వీడియో]

జిహాద్ అంటే ఏమిటి? అవిశ్వాసుల_సందేహం – చంపడానికి ఆదేశించే ఇస్లాం శాంతియుత ధర్మం ఎలా అవుతుంది?
https://youtu.be/gSMYVw32Mr4 [12 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

Al-Hajj 22:39
أُذِنَ لِلَّذِينَ يُقَٰتَلُونَ بِأَنَّهُمْ ظُلِمُوا۟ۚ وَإِنَّ ٱللَّهَ عَلَىٰ نَصْرِهِمْ لَقَدِيرٌ
ఎవరికి వ్యతిరేకంగా యుద్ధం చేయబడుతుందో, వారికి (కూడా ప్రతిఘటనకు) అనుమతి ఇవ్వబడుతోంది. ఎందుకంటే వారు (ముస్లిములు) పీడితులు. నిశ్చయంగా అల్లాహ్‌ వారిని ఆదుకోగల శక్తి గలవాడు.

Al-Baqarah 2:190
وَقَٰتِلُوا۟ فِى سَبِيلِ ٱللَّهِ ٱلَّذِينَ يُقَٰتِلُونَكُمْ وَلَا تَعْتَدُوٓا۟ۚ إِنَّ ٱللَّهَ لَا يُحِبُّ ٱلْمُعْتَدِينَ
మీతో పోరాడే వారితో మీరు కూడా దైవమార్గంలో పోరాడండి. కాని మితిమీరకండి. మితిమీరి పోయేవారిని అల్లాహ్‌ ఇష్టపడడు.

Al-Anfal 8:61
وَإِن جَنَحُوا۟ لِلسَّلْمِ فَٱجْنَحْ لَهَا وَتَوَكَّلْ عَلَى ٱللَّهِۚ إِنَّهُۥ هُوَ ٱلسَّمِيعُ ٱلْعَلِيمُ
ఒకవేళ వారు సంధివైపు మొగ్గు చూపితే (ఓ ప్రవక్తా!) నువ్వు కూడా సంధి వైపుకు మొగ్గుచూపు. అల్లాహ్‌పై భారం మోపు. నిశ్చయంగా ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు.

An-Nisa’ 4:90
… فَإِنِ ٱعْتَزَلُوكُمْ فَلَمْ يُقَٰتِلُوكُمْ وَأَلْقَوْا۟ إِلَيْكُمُ ٱلسَّلَمَ فَمَا جَعَلَ ٱللَّهُ لَكُمْ عَلَيْهِمْ سَبِيلًا
… కాబట్టి వారు మీ దారినుంచి తప్పుకుని, మీతో యుద్ధం చేయకుండా, సంధి కోసం ప్రయత్నిస్తే (అప్పుడు వారిపై దాడి జరపటానికి) అల్లాహ్‌ మీకు మార్గం తెరచి ఉంచలేదు

ఇస్లాం అమరవీరులు 

ఇస్లాం అమర వీరులు [6p] [PDF]

وَلَا تَقُولُوا لِمَن يُقْتَلُ فِي سَبِيلِ اللَّهِ أَمْوَاتٌ ۚ بَلْ أَحْيَاءٌ وَلَٰكِن لَّا تَشْعُرُونَ
అల్లాహ్ మార్గంలో చంపబడినవారిని మృతులు అని అనకండి. వారు బ్రతికే ఉన్నారు. కాని ఆ విషయం మీకు అర్థం కాదు.”
(అల్ బఖర 2: 154) 

పై ఆయతులో అల్లాహ్ ధన్యజీవుల గురించి ప్రస్తావించాడు. వారే ఇస్లాం మార్గంలో ప్రాణాలు అర్పించిన అమరవీరులు. అల్లాహ్ సన్నిధిలో వారికి మహోన్నత స్థానం ఉంది. మన ఊహకందని మహత్తర జీవితం, ఆనందం వారికి అక్కడ లభిస్తుంది. పవిత్ర ఖుర్ఆన్ గ్రంథంలో అమరవీరుల గురించి, వారి విశిష్ఠత గురించి పలు ఆయతుల్లో చెప్పబడింది. 

దైవ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కాలంలో అధర్మంగా, మోసగించబడి ప్రాణాలు కోల్పోయిన ఆ ప్రముఖ అమరవీరుల గాథలను ఈ రోజు తెలుసుకుందాం. కాని కరుడుగట్టిన విరోధులు వారిని మోసగించి హతమార్చారు. పిరికిపందలైన తిరస్కారుల అలవాటే అది. సత్యవంతులను ఎదుర్కొనే ధైర్యం వారికి లేకపోయింది. అందుకే మోసపూరిత సన్నాగాలు, కుట్రలు పన్ని వారిని అధర్మంగా హతమార్చారు. నేటి ఇస్లాం విరోధుల స్థితి కూడా అలానే ఉంది. 

మీ ముందు చెప్పబోయే ఈ సంఘటన ఉహద్ యుద్దం తరువాత హిజ్ర శకం 4వ యేట జరిగింది. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం:

ఉహద్ యుద్ధానంతరం తిరస్కారులు, ఇస్లాం విరోధులు ముస్లింల గౌరవ మర్యాదలను మట్టిపాలు చేయటానికి, వారికి నష్టం కల్గించే ప్రయత్నంలో తలమునకలై ఉన్నారు. కుట్రలు, కుతంత్రాలు పన్నసాగారు. ఇంత నష్టం జరిగినా ముస్లింలు యుద్ధ వ్యూహరచనలతో, శక్తిసామర్థ్యాలతో, సైన్యాన్ని సమీకరిస్తూ పుంజుకోవటాన్ని వారు సహించలేకపోయారు. ఇస్లాంను దెబ్బతీయటానికి, నష్టం, కీడు తలపెట్టడానికి మరో దుష్టాలోచన చేశారు. ఖురైషులంతా కలసి అజల్ ఖిరా జాతిలోని 7 గురు వ్యక్తులను ఎన్నుకుని వారిని మదీనాలో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి పంపారు. వారు ముందుగా వేసుకున్న పథకం ప్రకారం, “దైవ ప్రవక్తా! (సల్లల్లాహు అలైహి వసల్లం) ! మా వర్గమంతా ఇస్లాం స్వీకరించటానికి సిద్ధంగా ఉంది. వారి శిక్షణ కోసం ఇస్లామీయా బోధకులను మీరు మా వెంట పంపించండి” అని అంటారు. 

జిహాద్ అంటే ఏమిటి? [వీడియో & టెక్స్ట్]

జిహాద్ అంటే ఏమిటి?
వక్త: హబీబుర్రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/cdbNg2hlL_U [10 నిముషాలు]

ఈ ప్రసంగంలో, జిహాద్ అనే పదం యొక్క నిజమైన మరియు విస్తృతమైన అర్థం వివరించబడింది. సాధారణంగా యుద్ధం లేదా పవిత్ర యుద్ధంగా తప్పుగా అర్థం చేసుకోబడినప్పటికీ, జిహాద్ యొక్క ప్రాథమిక అర్థం “కృషి చేయడం” లేదా “కష్టపడటం”. ఈ ప్రసంగం జిహాద్ యొక్క వివిధ రూపాలను వివరిస్తుంది, అవి చెడు కోరికలకు వ్యతిరేకంగా పోరాడటం, తల్లిదండ్రులకు సేవ చేయడం, అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడటం, మరియు ధర్మ పరిరక్షణ కోసం పోరాడటం వంటివి. సైనిక చర్యగా జిహాద్ కు ఇస్లాంలో కఠినమైన షరతులు మరియు నియమాలు ఉన్నాయని, అవి ఒక ఇస్లామిక్ ప్రభుత్వం ద్వారా మాత్రమే ప్రకటించబడాలని, తల్లిదండ్రుల అనుమతి అవసరమని, మరియు యుద్ధంలో అమాయకులను, మహిళలను, పిల్లలను మరియు వృద్ధులను హింసించకూడదని స్పష్టం చేయబడింది. జిహాద్ అనే పదాన్ని నేటి హింస మరియు విధ్వంసంతో ముడిపెట్టడం పూర్తిగా తప్పు అని వక్త గట్టిగా నొక్కి చెప్పారు.

اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِيْنَ
[అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్]

وَالْعَاقِبَةُ لِلْمُتَّقِيْنَ
[వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్]

وَالصَّلٰوةُ وَالسَّلَامُ عَلٰى سَيِّدِ الْاَنْبِيَا ءِ وَالْمُرْسَلِيْنَ
[వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్]

وَمَنْ تَبِعَهُمْ بِاِحْسَانٍ اِلٰى يَوْمِ الدِّيْنِ اَمَّا بَعْدُ
[వమన్ తబిఅహుమ్ బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్ అమ్మా బఅద్]

అభిమాన సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరికీ నా ఇస్లామీయ అభివాదం, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ రోజు మనం జిహాద్ అంటే ఏమిటి తెలుసుకోబోతున్నాం.

జిహాద్ అంటే ఏమిటి? జిహాద్ అనే పదం ప్రతీ వ్యక్తి సోషల్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా విన్న పదం ఇది. ఇస్లాంకు సంబంధించిన పదం ఇది. మరియు ఖురాన్, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలలో ఈ పదం బోధించబడి ఉన్నది. కానీ వాస్తవానికి దీని అర్థం, జిహాద్ అంటే ఏమిటి, జిహాద్ అనే పదానికి అర్థం ఏమిటి, భావం ఏమిటి అనేది అతి తక్కువ మందికే తెలుసు. గత కొన్ని సంవత్సరాలుగా అత్యంత అసత్యానికి, అత్యంత దారుణంగా వక్రీకరించిన పదం జిహాద్. అసలు జిహాద్ అంటే ఏమిటో మనము వివరంగా కాకపోయినా క్లుప్తంగా తెలుసుకుందాం.

జిహాద్ అనేది ఒక అరబిక్ పదం. దీని అర్థం కఠోర శ్రమ, శాయశక్తుల ప్రయత్నించటం లేక అసాధారణ కృషి చేయటం. ఈ విధంగా పలు అర్థాలు జిహాద్ అనే పదానికి వస్తాయి.

జిహాద్ గురించి ఖురాన్ మరియు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలలో అనేక రకాలుగా వివరించబడింది.

మనిషి తన చెడు కోరికలకు దూరం అవటానికి చేసే శాయశక్తుల ప్రయత్నం జిహాద్. మనిషి మంచి మార్గంలో ప్రయాణించేటప్పుడు చేసిన కృషి మరియు పడిన కష్టం జిహాద్.

మానవాళిని అజ్ఞానం నుంచి వెలుగు వైపునకు తీసుకురావటానికి చేసే ప్రయత్నం జిహాద్.

అల్లాహ్ మార్గంలో మంచి పనులకు ఖర్చు చేయటం జిహాద్.

అల్లాహ్ కృప కొరకు హజ్ చేసే వారు ప్రయాణంలో కలిగే అన్ని రకాల ఇబ్బందులను సహించటం జిహాద్.

తల్లిదండ్రుల సేవ చేస్తూ కష్టపడటం కూడా జిహాద్.

ధర్మ పరిరక్షణ కోసం పోరాటం చేయడం కూడా జిహాద్.

వీటన్నింటి గురించి ఖురాన్ మరియు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాలలో జిహాద్ అనే పదం వచ్చింది.

ఇక సామాన్యంగా అందరూ జిహాద్ అంటే ఇస్లాం కోసం యుద్ధం చేయటం, ధర్మం కోసం పోరాటం చేయటం అంటారు. ఇది వాస్తవమే, కానీ జిహాద్ అనే విశాలమైన అర్థంలో లేక ఆ అంశంలో ఇది ఒక భాగమే. అలా కాకుండా ఈ ఒక్క అర్థమే పూర్తి జిహాద్ అంశం అనుకోవటం పొరపాటు.

ఇస్లాం కోసం యుద్ధం చేయటం అంటే ఇస్లాం వ్యాప్తి చెందటానికి కాదు. ఇమామ్ ఇబ్నె ఖయ్యిమ్ రహ్మతుల్లాహి అలై ఏమని రాశారంటే, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యుద్ధం వారితోనే చేసేవారు ఎవరైతే యుద్ధం చేయాలనుకుంటారో. ధన, ప్రాణ, మాన రక్షణ కోసం ఎవరైతే యుద్ధం చేయాలనుకుంటారో వారికి ఎదురుదాడిగా ధనాన్ని, మానాన్ని, ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం జిహాద్ ఉంది.

జిహాద్ ఎటువంటి పరిస్థితులలో, వాటి షరతులు ఏమిటి కూడా మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. జిహాద్ చేయాలంటే, అంటే ధర్మం కోసం పోరాటం చేయటం, ఈ జిహాద్ చేయాలంటే దానికి అనేక షరతులు ఉన్నాయి. చాలా కండిషన్లు ఉన్నాయి, వివరాలు ఉన్నాయి. ముఖ్యమైన మూడు షరతులు నేను చెప్పదలిచాను.

ఒకటి ఏమిటి? జిహాద్ అనేది ఒక పూర్తి ఇస్లాం అనుసరించే రాజ్యం లేక ప్రభుత్వం చేసేది. అంతే కానీ ఒక వ్యక్తి లేక ఒక గ్రూప్ చేసే కార్యం ఎంత మాత్రం కాదు.

రెండవ షరతు, తల్లిదండ్రుల అనుమతి కలిగి ఉండాలి. దీనికి ఆధారం ఏమిటంటే, ఒకసారి ఒక వ్యక్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరకు వచ్చి, “ఓ దైవ ప్రవక్త, నాకు దైవ మార్గంలో జిహాద్ చేయడానికి అనుమతించండి” అని అనుమతి కోరాడు స్వయంగా వచ్చి. “ఓ దైవ ప్రవక్త, నేను దైవ మార్గంలో పోరాడాలి, ఈ అనుమతి నాకు ప్రసాదించండి” అని కోరితే, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, “నీకు తల్లిదండ్రులు ఉన్నారా?” ఆయన “ఉన్నారు ఓ దైవ ప్రవక్త” అంటే, “అలాగైతే వారి సేవ చెయ్యి, అదే నీకు జిహాద్” అన్నారు. సుబ్ హా నల్లాహ్! అంటే తల్లిదండ్రుల సేవ కూడా జిహాద్.

అలాగే మూడవ షరతు ఏమిటంటే, యుద్ధంలో ఉన్న వారితోనే యుద్ధం, వేరే వారికి ఎటువంటి హాని చేయకూడదు. అంతే కాదు, ముసలివాళ్ళకి, వృద్ధులకి, చిన్న పిల్లలని, స్త్రీలను, మహిళలను హాని చేయకూడదు. చెట్లను నరకకూడదు, పంటలను నాశనం చేయకూడదు. ఈ విధంగా అనేక షరతులు ఉన్నాయి.

ఈ మూడింటిలో ఏది ఆచరించకపోయినా అది జిహాద్ కాదు. చివరగా, ప్రపంచంలో జరుగుతున్న మారణకాండకు, వినాశానికి జిహాద్ అనే పదంతో ముడివేయటం ఎంత మాత్రం సబబు కాదు.

అభిమాన సోదరులారా, సారాంశం ఏమిటంటే, జిహాద్ అనే పదానికి పలు అర్థాలు వస్తాయి. కాకపోతే ఇస్లాం మరియు ముస్లిం శత్రువులు కొందరు తెలిసి, కొందరు తెలియక ఈ పదాన్ని అత్యంత అసత్యానికి, అత్యంత దారుణంగా వక్రీకరించారు. దీనికి చాలా అర్థాలు వచ్చాయి. ఈ విషయాల గురించి ఖురాన్‌లో అనేక చోట్ల వాక్యాలు ఉన్నాయి.

జిహాద్ అనే పదం ఖురాన్‌లో, ప్రవక్త గారి యొక్క ప్రవచనాలలో అనేక చోట్ల ప్రస్తావించబడింది. కానీ సమయ సందర్భాన్ని బట్టి దానికి అర్థం ఉంది. అమ్మానాన్న సేవ చేయటం కూడా జిహాద్. మంచి పని చేయడం కూడా జిహాద్. ఉదాహరణకి, విపరీతమైన చలి, చలికాలం. ఆ చలికాలంలో ఉదయం 3:30 కి, 4:00 కి లేచి, వుజూ చేసి మస్జిద్ కి పోవాలి, అది కూడా జిహాదే.

ఒక వ్యక్తి దారిలో పోతున్నాడు, యాక్సిడెంట్ జరిగింది, రక్తం కారిపోతా ఉంది, ఎవరూ సహాయం చేయటం లేదు. అటువంటి వ్యక్తి దగ్గరికి పోయి, కాపాడి, సహాయం చేసి, ఆసుపత్రికి తీసుకువెళ్లడం ఇది కూడా జిహాద్.

చెడుని ఆపటం కూడా జిహాద్. ఒక అబ్బాయి చెడు పని చేస్తున్నాడు, సిగరెట్ తాగుతున్నాడు. అతనికి చెబుతున్నాం, “బాబూ ఇది హరాము, ఇది తప్పు, ఇది నీ శరీరానికి నాశనం చేస్తుంది, ఇది ఆరోగ్యపరంగా కూడా ఇది మంచిది కాదు, తాగవద్దు” అని ఆపుతాము కదా, అది కూడా జిహాద్.

చెడు నుండి, రుగ్మతల నుండి, అన్యాయం నుండి, దౌర్జన్యం నుండి, అసత్యం నుండి, చెడు విషయాల నుండి ఆపే ప్రయత్నం చేయటం కూడా జిహాదే.

మంచి పనులు చేసే విషయంలో కష్టాలు వస్తే, ఆ కష్టాలను ఎదుర్కొని సహనంతో ఆ కార్యం నెరవేర్చుకుంటే అది కూడా జిహాదే. హజ్, ఉమ్రా కోసం పోతున్నాము, సులభం కాదు, చాలా కష్టం. ప్రయాణం కష్టం, ఎయిర్పోర్ట్ లో కష్టం, అక్కడ పోయిన తర్వాత చాలా విషయాలు ఉంటాయి. చలికాలంలో వస్తుంది, ఎండాకాలంలో వస్తుంది. అప్పుడు కష్టాన్ని సహిస్తాము, భరిస్తాము, అది కూడా జిహాదే.

ఈ విధంగా ఖురాన్‌లో అలాగే హదీసులలో జిహాద్ అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. కేవలం దానికి ఒకే ఒక్క అర్థం తీసుకొని, సమయ సందర్భాలు లేకుండా వక్రీకరించటం అది సబబు కాదు. కావున అది మనం తెలుసుకోవాలంటే మనం ఖురాన్‌ని చదవాలి, పఠించాలి, తెలుసుకోవాలి. అప్పుడు మనకు వాస్తవం తెలుస్తుంది.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ సరైన అవగాహనని ప్రసాదించు గాక. ఆమీన్. మరిన్ని విషయాలు తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు.

وَاٰخِرُ دَعْوٰىنَا اَنِ الْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِيْنَ
[వ ఆఖిరు దఅవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్]

వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=25123

ధర్మ అవగాహనం – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియోలు & టెక్స్ట్]

తల్లిదండ్రుల పట్ల సద్వర్తన – హజ్, ఉమ్రా మరియు జీహాద్ పుణ్యానికి సమానం [వీడియో]

తల్లిదండ్రుల పట్ల సద్వర్తన – హజ్, ఉమ్రా మరియు జీహాద్ పుణ్యానికి సమానం [2 నిముషాలు]
https://youtu.be/6WmJpPIqMqU

హజ్జ్ పుణ్యానికి సమానమైన సత్కార్యాలు [ యూట్యూబ్ ప్లే లిస్ట్]
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2o33G4d-Mob_ncywRmvJze

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్:
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1

ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత చేసే ఈ చిన్న జిక్ర్ – హజ్, ఉమ్రా, దాన ధర్మాలు & జిహాద్ పుణ్యానికి సమానం

https://youtu.be/TRrTK3aggLE – [7 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

హజ్జ్ పుణ్యానికి సమానమైన సత్కార్యాలు [ యూట్యూబ్ ప్లే లిస్ట్]
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2o33G4d-Mob_ncywRmvJze

ముగ్గురు అల్లాహ్ పూచీలో (హామీలో) ఉన్నారు [ఆడియో]

బిస్మిల్లాహ్

[9:05 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అబూ ఉమామ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) తెలిపారు:

“ముగ్గురు అల్లాహ్ యొక్క హామీ/పూచీ(జమానత్)లో ఉన్నారు. బ్రతికివుంటే వారికి మంచి ఉపాధి లభిస్తుంది వారివైపు నుండి అల్లాహ్ సరిపోతాడు.ఒకవేళ చనిపోతే అల్లాహ్ వారిని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. మొదటి వ్యక్తి ఇంట్లోకి ప్రవేశిస్తూ సలాం చేసేవాడు. అతను అల్లాహ్ యొక్క పూచీలో ఉంటాడు. రెండవ వ్యక్తి మస్జిద్ వైపునకు వెళ్ళేవాడు. అల్లాహ్ యొక్క పూచీలో అతను కూడా ఉంటాడు. మూడో వ్యక్తి అల్లాహ్ యొక్క మార్గంలో బయలుదేరిన వ్యక్తి. అతను కూడా అల్లాహ్ యొక్క హామీలో ఉంటాడు.”

عَنْ أَبِي أُمَامَةَ أَنّ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ ثَلاثَةٌ كُلُّهُمْ ضَامِنٌ عَلَى اللَّهِ إِنْ عَاشَ رُزِقَ وَكُفِيَ وَإِنْ مَاتَ أَدْخَلَهُ اللَّهُ الْجَنَّةَ مَنْ دَخَلَ بَيْتَهُ فَسَلَّمَ فَهُوَ ضَامِنٌ عَلَى اللَّهِ وَمَنْ خَرَجَ إِلَى الْمَسْجِدِ فَهُوَ ضَامِنٌ عَلَى اللَّهِ وَمَنْ خَرَجَ فِي سَبِيلِ اللَّهِ فَهُوَ ضَامِنٌ عَلَى اللَّهِ

504 صحيح ابن حبان كتاب البر والإحسان باب إفشاء السلام وإطعام الطعام

499 المحدث شعيب الأرناؤوط خلاصة حكم المحدث صحيح في تخريج صحيح ابن حبان

Abu Umamah reported: The Messenger of Allah, peace and blessings be upon him, said,

Three people have a guarantee from Allah. If he lives he will have provision to suffice him, and if he dies he will enter Paradise: one who enters and greets with peace has a guarantee from Allah, one who goes out to the mosque has a guarantee from Allah, and one who goes out in the way of Allah has a guarantee from Allah.

Source: Ṣaḥīḥ Ibn Ḥibbān 504. Grade: Sahih (authentic) according to Al-Mundhiri

ఖురాన్ వ్యాఖ్యానం (తఫ్సీర్): సూరా బకరా: ఆయత్ 189 – 193 [వీడియో]

బిస్మిల్లాహ్

[40 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [40 నిముషాలు]

అహ్సనుల్ బయాన్ నుండి:

2:189  يَسْأَلُونَكَ عَنِ الْأَهِلَّةِ ۖ قُلْ هِيَ مَوَاقِيتُ لِلنَّاسِ وَالْحَجِّ ۗ وَلَيْسَ الْبِرُّ بِأَن تَأْتُوا الْبُيُوتَ مِن ظُهُورِهَا وَلَٰكِنَّ الْبِرَّ مَنِ اتَّقَىٰ ۗ وَأْتُوا الْبُيُوتَ مِنْ أَبْوَابِهَا ۚ وَاتَّقُوا اللَّهَ لَعَلَّكُمْ تُفْلِحُونَ

(ఓ ప్రవక్తా!) ప్రజలు నిన్ను నెలవంకలను గురించి ప్రశ్నిస్తున్నారు కదూ! ఇది ప్రజల (ఆరాధనల) వేళలను, హజ్‌ కాలాన్ని నిర్ధారించటానికి (జరిగిన ఏర్పాటు) అని నువ్వు వారికి సమాధానం ఇవ్వు. (ఇహ్రామ్‌ స్థితిలో) మీరు మీ ఇళ్ళల్లోకి వెనుక వైపు నుంచి రావటం సత్కార్యం కాదు. అల్లాహ్‌ పట్ల భయభక్తులు కలిగి వున్నవాడిదే అసలు సత్కార్యం. మీరు మీ ఇండ్లల్లోకి వాకిళ్ళ నుండే ప్రవేశించండి. సాఫల్యం పొందగలందులకుగాను అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి.

2:190  وَقَاتِلُوا فِي سَبِيلِ اللَّهِ الَّذِينَ يُقَاتِلُونَكُمْ وَلَا تَعْتَدُوا ۚ إِنَّ اللَّهَ لَا يُحِبُّ الْمُعْتَدِينَ

మీతో పోరాడే వారితో మీరు కూడా దైవమార్గంలో పోరాడండి. కాని మితిమీరకండి. మితిమీరి పోయేవారిని అల్లాహ్‌ ఇష్టపడడు.

2:191  وَاقْتُلُوهُمْ حَيْثُ ثَقِفْتُمُوهُمْ وَأَخْرِجُوهُم مِّنْ حَيْثُ أَخْرَجُوكُمْ ۚ وَالْفِتْنَةُ أَشَدُّ مِنَ الْقَتْلِ ۚ وَلَا تُقَاتِلُوهُمْ عِندَ الْمَسْجِدِ الْحَرَامِ حَتَّىٰ يُقَاتِلُوكُمْ فِيهِ ۖ فَإِن قَاتَلُوكُمْ فَاقْتُلُوهُمْ ۗ كَذَٰلِكَ جَزَاءُ الْكَافِرِينَ

వారు ఎక్కడ ఎదురైనా మీరు వారితో తలపడండి, మిమ్మల్ని ఎక్కడి నుంచి వారు తరిమికొట్టారో, అక్కడి నుంచి మీరు కూడా వారిని తరిమికొట్టండి. ఫిత్నా (కుఫ్ర్‌, షిర్క్‌, పీడన) అనేది చంపటం కన్నా తీవ్రమైనది. ‘మస్జిదె హరామ్‌’ వద్ద వారు మీతో యుద్ధం చేయనంతవరకూ మీరూ వారితో పోరాడకండి. వారు గనక మిమ్మల్ని హతమార్చడానికి ప్రయత్నిస్తే మీరు కూడా దీటైన జవాబు ఇవ్వండి. అవిశ్వాసులకు సరైన సమాధానం ఇదే.

2:192  فَإِنِ انتَهَوْا فَإِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ

ఒకవేళ వారు గనక (తమ దమన నీతిని) మానుకుంటే నిశ్చయంగా అల్లాహ్‌ క్షమించేవాడు, కరుణించేవాడు.

2:193  وَقَاتِلُوهُمْ حَتَّىٰ لَا تَكُونَ فِتْنَةٌ وَيَكُونَ الدِّينُ لِلَّهِ ۖ فَإِنِ انتَهَوْا فَلَا عُدْوَانَ إِلَّا عَلَى الظَّالِمِينَ

పీడన (ఫిత్నా) సమసిపోనంతవరకూ, దైవధర్మానిది పైచేయి కానంతవరకూ వారితో పోరాడుతూనే ఉండండి. ఒకవేళ వారు యుద్ధాన్ని విరమిస్తే (మీరూ విరమించండి). మెడలు వంచ వలసింది దౌర్జన్యపరులవే.

ఇతరములు:

క్విజ్: 77: ప్రశ్న 01: సూర తౌబా (9) ఆయత్ 38-42 [ఆడియో]

బిస్మిల్లాహ్

తెలుగులో ఇస్లామిక్ క్విజ్ 77వ భాగం 1వ ప్రశ్న సిలబస్:

సూర తౌబా (9) ఆయత్ 38-42 చదవండి:

9:38  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا مَا لَكُمْ إِذَا قِيلَ لَكُمُ انفِرُوا فِي سَبِيلِ اللَّهِ اثَّاقَلْتُمْ إِلَى الْأَرْضِ ۚ أَرَضِيتُم بِالْحَيَاةِ الدُّنْيَا مِنَ الْآخِرَةِ ۚ فَمَا مَتَاعُ الْحَيَاةِ الدُّنْيَا فِي الْآخِرَةِ إِلَّا قَلِيلٌ

ఓ విశ్వాసులారా! “అల్లాహ్‌ మార్గంలో బయలుదేరండి” అని మీతో అనబడినప్పుడు మీరు నేలకు అతుక్కుపోతారేమిటి? అసలు మీకేమైపోయిందీ? మీరు పరలోకానికి బదులు ఇహలోక జీవితాన్నే కోరుకున్నారా? అయితే వినండి! ప్రాపంచిక జీవితపు సకల సామగ్రి పరలోకం ముందు అత్యల్పమైనది.

9:39  إِلَّا تَنفِرُوا يُعَذِّبْكُمْ عَذَابًا أَلِيمًا وَيَسْتَبْدِلْ قَوْمًا غَيْرَكُمْ وَلَا تَضُرُّوهُ شَيْئًا ۗ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ

మీరు గనక (దైవమార్గంలో) బయలు దేరకపోతే అల్లాహ్‌ మీకు బాధాకరమైన శిక్ష విధిస్తాడు. మీకు బదులుగా మరో జాతిని (మీ స్థానంలో) తీసుకువస్తాడు. మీరు అల్లాహ్‌కు ఎంత మాత్రం నష్టం కలిగించలేరు. అల్లాహ్‌ అన్నింటిపై అధికారం కలవాడు.

9:40  إِلَّا تَنصُرُوهُ فَقَدْ نَصَرَهُ اللَّهُ إِذْ أَخْرَجَهُ الَّذِينَ كَفَرُوا ثَانِيَ اثْنَيْنِ إِذْ هُمَا فِي الْغَارِ إِذْ يَقُولُ لِصَاحِبِهِ لَا تَحْزَنْ إِنَّ اللَّهَ مَعَنَا ۖ فَأَنزَلَ اللَّهُ سَكِينَتَهُ عَلَيْهِ وَأَيَّدَهُ بِجُنُودٍ لَّمْ تَرَوْهَا وَجَعَلَ كَلِمَةَ الَّذِينَ كَفَرُوا السُّفْلَىٰ ۗ وَكَلِمَةُ اللَّهِ هِيَ الْعُلْيَا ۗ وَاللَّهُ عَزِيزٌ حَكِيمٌ

మీరు గనక అతనికి (ప్రవక్తకు) తోడ్పడకపోతే (పోనివ్వండి), అవిశ్వాసులు దేశం నుంచి అతనిని వెళ్ళగొట్టినప్పుడు- అతను ఇద్దరిలో రెండవవాడు. వారిద్దరూ గుహలో ఉన్నప్పుడు, అతను తన సహచరునితో, “బాధపడకు. నిశ్చయంగా అల్లాహ్‌ మనకు తోడుగా ఉన్నాడు” అని ఓదార్చినప్పుడు అల్లాహ్‌యే వారికి తోడ్పడ్డాడు. (ఆ ఘడియలో) అల్లాహ్‌ తన తరఫునుంచి అతనిపై ప్రశాంతతను అవతరింపజేశాడు. మీకు కానరాని సైన్యాలతో అతన్ని ఆదుకున్నాడు. ఆయన అవిశ్వాసుల మాటను అట్టడుగు స్థితికి దిగజార్చాడు. అల్లాహ్‌ వాక్కు మాత్రమే సర్వోన్నతమైనది, సదా పైన ఉండేది. అల్లాహ్‌ సర్వాధిక్యుడు, వివేకవంతుడు.

9:41  انفِرُوا خِفَافًا وَثِقَالًا وَجَاهِدُوا بِأَمْوَالِكُمْ وَأَنفُسِكُمْ فِي سَبِيلِ اللَّهِ ۚ ذَٰلِكُمْ خَيْرٌ لَّكُمْ إِن كُنتُمْ تَعْلَمُونَ

తేలిక అనిపించినాసరే, బరువు అనిపించినాసరే – బయలుదేరండి. దైవ మార్గంలో మీ ధన ప్రాణాలొడ్డి పోరాడండి. మీరు గనక తెలుసుకోగలిగితే ఇదే మీ కొరకు మేలైనది.

9:42  لَوْ كَانَ عَرَضًا قَرِيبًا وَسَفَرًا قَاصِدًا لَّاتَّبَعُوكَ وَلَٰكِن بَعُدَتْ عَلَيْهِمُ الشُّقَّةُ ۚ وَسَيَحْلِفُونَ بِاللَّهِ لَوِ اسْتَطَعْنَا لَخَرَجْنَا مَعَكُمْ يُهْلِكُونَ أَنفُسَهُمْ وَاللَّهُ يَعْلَمُ إِنَّهُمْ لَكَاذِبُونَ

(ఓ ప్రవక్తా!) త్వరగా సొమ్ములు లభించి, ప్రయాణం సులభతరమై ఉంటే వాళ్లు తప్పక నీ వెనుక వచ్చి ఉండేవారే. కాని సుదీర్ఘ ప్రయాణం అనేసరికి అది వారికి దుర్భరంగా తోచింది. ఇప్పుడు వాళ్లు, “మాలోనే గనక శక్తీ స్థోమతలు ఉండి ఉంటే తప్పకుండా మీ వెంట వచ్చి ఉండేవారం” అని అల్లాహ్‌పై ఒట్టేసి మరీ చెబుతారు. వాస్తవానికి వారు తమను తాము నాశనం చేసుకుంటున్నారు. వారు అబద్ధాలకోరులన్న సంగతి అల్లాహ్‌కు బాగా తెలుసు.

ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (11:58 నిముషాలు)

ఆడియో విన్న తర్వాత క్రింది ప్రశ్న ట్రై చెయ్యండి

(1) మీకు ఇవ్వ బడిన సిలబస్(తౌబా – 9: 40) వివరణ ప్రకారం దైవప్రవక్త (ﷺ) వారితో పాటుగా గుహలో ఉన్న రెండవ వ్యక్తి (సహచరుడు) ఎవరు?
A) అబూబక్ర్ సిద్దీక్ (రజియల్లాహు అన్హు)
B) అలీ (రజియల్లాహు అన్హు)
C) అబూహురైరా (రజియల్లాహు అన్హు)

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz