దుఆ అంగీకార సమయాలు

బిస్మిల్లాహ్

దుఆ అంగీకార ఘడియలు

"తన ప్రభువుతో దాసుడు అత్యంత సమీపంలో ఉండేది సజ్దా లోనే. గనుక మీరు ఈ స్థితిలో అధికంగా దుఆ చేస్తూ ఉండండి" అని ప్రవక్త మహానీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం) బోధించారని, అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (ముస్లిం).

తన ప్రభువుతో దాసుడు అత్యంత సమీపంలో ఉండేది సజ్దా లోనే. గనుక మీరు ఈ స్థితిలో అధికంగా దుఆ చేస్తూ ఉండండి” అని ప్రవక్త మహానీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం) బోధించారని, అబూ హురైర (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. (ముస్లిం).


అనస్‌ రజియల్లాహు అన్హు ఉల్లేఖనంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: "అజాన్‌ మరియు ఇఖామత్‌ మధ్యలో చేసిన దుఆ రద్దుకాదు". (తిర్మిజి).

అనస్‌ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖనంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “అజాన్‌ మరియు ఇఖామత్‌ మధ్యలో చేసిన దుఆ రద్దుకాదు“. (తిర్మిజి).


"రెండు సమయాల్లో దుఆ తిరస్కరించబడదు. లేక తిరస్కరించబడే అవకాశం ఆతి తక్కువ. ఒకటి: అజాన్‌ వేళలో చేసే దుఆ. రెండవది: జిహాద్‌ లో ఒకరిపై నొకరు విరుచుకుపడినప్పుడు చేసే దుఆ". (అబూ దావూద్‌).
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించినట్లు సహల్‌ బిన్‌ సఅద్‌ ఉల్లేఖించారు:

“రెండు సమయాల్లో దుఆ తిరస్కరించబడదు. లేక తిరస్కరించబడే అవకాశం అతి తక్కువ. ఒకటి: అజాన్‌ వేళలో చేసే దుఆ. రెండవది: జిహాద్‌ లో ఒకరిపై నొకరు విరుచుకుపడినప్పుడు చేసే దుఆ”. (అబూ దావూద్‌).


"అల్లాహు తఆల ప్రతి రాత్రి (మూడు భాగాల్లోని) చివరి భాగంలో ఈ ప్రపంచ ఆకాశానికి దిగివచ్చి "నాతో మొరపెట్టుకునే వారెవరు, నేను వారి దుఆలను స్వీకరిస్తాను. నన్ను అర్థించే వారెవరు, నేను వారికి ప్రసాదిస్తాను. నాతో క్షమాపణ వేడుకునేదెవరు, నేను వారిని క్షమిస్తాను" అని అంటాడు. (బుఖారి: 1145. ముస్లిం: 758)

అబూహురైరా (రజియల్లాహు అన్హు) ఉల్లేఖనంలో, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:

“అల్లాహు తఆల ప్రతి రాత్రి (మూడు భాగాల్లోని) చివరి భాగంలో ఈ ప్రపంచ ఆకాశానికి దిగివచ్చి “నాతో మొరపెట్టుకునే వారెవరు, నేను వారి దుఆలను స్వీకరిస్తాను. నన్ను అర్థించే వారెవరు, నేను వారికి ప్రసాదిస్తాను. నాతో క్షమాపణ వేడుకునేదెవరు, నేను వారిని క్షమిస్తాను” అని అంటాడు. (బుఖారి: 1145. ముస్లిం: 758)


"నిశ్చయంగా రాత్రి వేళ ఓ గడియ ఉంది. అందులో ఏ ముస్టిమయితే అల్లాహ్‌ తో ఇహపరలోకాల మేలు కోరుకుంటాడో అల్లాహ్‌ అతనికి అది ప్రసాదిస్తాడు. ఇలా ప్రతి రాత్రి జరుగుతుంది" అని ప్రవక్త చెబుతుండగా నేను విన్నానని జాబిర్‌ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు.

“నిశ్చయంగా రాత్రి వేళ ఓ గడియ ఉంది. అందులో ఏ ముస్లిమయితే అల్లాహ్‌ తో ఇహపరలోకాల మేలు కోరుకుంటాడో అల్లాహ్‌ అతనికి అది ప్రసాదిస్తాడు. ఇలా ప్రతి రాత్రి జరుగుతుంది” అని ప్రవక్త చెబుతుండగా నేను విన్నానని జాబిర్‌ (రజియల్లాహు అన్హు ) ఉల్లేఖించారు. (ముస్లిం).


విశేషాలు:

1- కొన్ని ప్రత్యేక సమయాలున్నవి వాటిలో దుఆ స్వీకరణపు నమ్మకం ఇతర సమయాలకంటే ఎక్కువగా ఉంటుంది.

2- ఆ సమయాలను అదృష్టంగా భావించాలని ప్రోత్సహించబడింది. ఆ సమయాల్లో అధికంగా దుఆ చేయుటకు ప్రయాస పడాలి.

3- ఆ సమయాల్లో కొన్ని ఇవి: సజ్దాలో, అజాన్‌ ఇఖామత్‌ ల మధ్యలో, రాత్రి చివరి గడియలో, జీహాద్ లో శత్రువులతో భేటి జరిగినప్పుడు.


దిన చర్యల పాఠాలు పుస్తకం నుండి
ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

మృతులు (చనిపోయిన వారు) వింటారా? [ఆడియో & టెక్స్ట్]

మృతులు (చనిపోయిన వారు) వింటారా?
https://www.youtube.com/watch?v=96plKtzzef4 (51 నిముషాలు)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, సమాధులను సందర్శించే ప్రజలు చేసే షిర్క్ గురించి వివరించబడింది. గత ప్రసంగంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలోని ముష్రికులు మరియు నేటి సమాధులను సందర్శించే ముస్లింల మధ్య నమ్మకాల పోలికను చర్చించారు. రెండు వర్గాలు అల్లాహ్‌ను ఏకైక సృష్టికర్తగా నమ్మినప్పటికీ, మధ్యవర్తుల ద్వారా ఆయనను చేరుకోవాలని ప్రయత్నించారు, దీనిని ఖుర్ఆన్ షిర్క్‌గా పరిగణిస్తుంది. మృతులు వినగలరనే నమ్మకం కూడా షిర్క్‌కు దారితీస్తుందని, దీనికి సరైన ఆధారం లేదని వక్త తెలిపారు. బద్ర్ యుద్ధం తర్వాత ప్రవక్త మృతులతో మాట్లాడటం మరియు సమాధిలోని వ్యక్తి పాదాల శబ్దాన్ని వినడం వంటి హదీసులు ప్రత్యేక సందర్భాలని, సాధారణ నియమం కాదని స్పష్టం చేశారు. మృతులు వినలేరని, వారికి సహాయం చేసే శక్తి లేదని ఖుర్ఆన్ ఆయతుల ద్వారా నిరూపించారు. ప్రళయ దినాన, ఈసా (అలైహిస్సలాం) మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా తమ అనుచరులు తమ తర్వాత ఏమి చేశారో తమకు తెలియదని చెప్పడం, మృతులకు ప్రపంచ విషయాలతో సంబంధం ఉండదనేదానికి నిదర్శనం. ప్రజలు ఖుర్ఆన్ మరియు సహీ హదీసులను చదివి, షిర్క్ నుండి తమను తాము రక్షించుకోవాలని వక్త పిలుపునిచ్చారు.

اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِيْنَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِيْنَ، نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِيْنَ، أَمَّا بَعْدُ.
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వ స్తోత్రములు. ప్రవక్తల నాయకుడైన మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబంపై మరియు వారి అనుచరులందరిపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక. ఆ తర్వాత.

సోదరులారా, గత పాఠంలో మనం సామాన్యంగా ప్రజలు సమాధుల వద్దకు ఎందుకు వెళ్తారు అనే దాని గురించి కొన్ని కారణాలు తెలుసుకున్నాము. వాటికి ఆధారంగా, నిదర్శనంగా, దలీల్‌గా వారు కొన్ని విషయాలు ఏదైతే ప్రస్తావిస్తారో వాటి యొక్క వాస్తవికత ఖుర్ఆన్ హదీసుల వెలుగులో తెలుసుకున్నాము.

సంక్షిప్తంగా మరోసారి మనం చెప్పుకోవాలంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలం నాటి ముష్రికులు ఏకైక అల్లాహ్‌ను సృష్టికర్తగా, ఉపాధి ప్రధాతగా, సర్వ జగత్తుకు నిర్వాహకారునిగా నమ్మినప్పటికీ, కొందరు వలీలను, ఔలియాలను, బాబాలను నిర్ణయించుకుని, అల్లాహ్‌కు చేయనటువంటి ఆరాధనలు వారికి చేసేవారు. ఎందుకు చేసేవారు? మేము చాలా పాపాత్ములం, డైరెక్ట్ అల్లాహ్ వద్ద వెళ్లడానికి మాకు ముఖం లేదు. ఈ బాబాలు, పీర్లు, ఈ ముర్షదులు, ఈ వలీలు, ఔలియాలు వీరి సాధనంగా, వీరి ఆధారంగా, వీరి యొక్క మధ్యవర్తిత్వం వసీలాతో మేము అల్లాహ్ వద్ద చేరుకుంటాము, వారు మా గురించి అల్లాహ్ వద్ద సిఫారసు చేస్తారు. వారి యొక్క ఈ సాకు ఏదైతే ఉండినదో, ఈ రోజుల్లో సామాన్యంగా మన ముస్లింలు ఎవరైతే సమాధుల వద్దకు వెళ్తున్నారో, బాబాల వద్దకు వెళ్తున్నారో వారి యొక్క సాకు, వారి యొక్క కారణం కూడా అదే. మేము పాపాత్ములం, డైరెక్ట్ అల్లాహ్ వద్ద వెళ్లడానికి మా దగ్గర ముఖం లేదు. అల్లాహ్ యొక్క ఈ పుణ్యాత్ములు, ఔలియాలు వారి యొక్క మధ్యవర్తిత్వంతోనే మనం పోగలుగుతాము. వారి యొక్క సిఫారసుతోనే మనం అల్లాహ్‌కు సన్నిహితులుగా కాగలుగుతాము.

అయితే, సూరె యూనుస్ ఆయత్ నెంబర్ 18, సూరె జుమర్ ఆయత్ నెంబర్ 3 వీటి ఆధారంగా ఇదే అసలైన షిర్క్. ఇలాంటి షిర్క్‌ను ఖండించడానికే ప్రతీ కాలంలో అల్లాహు త’ఆలా ప్రవక్తలను పంపాడు అని మనం తెలుసుకున్నాము.

అంతేకాకుండా ఈ ఆయతులు, ప్రత్యేకంగా సూరె జుమర్ మరియు సూరె యూనుస్‌లో తెలుపబడిన ఈ ఆయతులను మనం చదివినప్పుడు సామాన్యంగా ఈనాటి ముస్లింలు కొందరు ఏమంటారు, ఈ ఆయతులు మాలాంటి వారి గురించి కాదు అవతరించినవి. ఆ కాలంలో విగ్రహాలను పూజించేవారు. ఆ విగ్రహాలకు వ్యతిరేకంగా ఈ ఆయతులు అవతరించాయి. అయితే మనం ఇందులో మరికొన్ని ఆధారాలు తెలిపి ఉన్నాము. ఉదాహరణకు, సూరె ఆరాఫ్ లోని ఈ ఆయతులో అల్లాహు త’ఆలా చాలా స్పష్టంగా చెప్పాడు,

عِبَادٌ أَمْثَالُكُمْ
(ఇబాదున్ అమ్సాలుకుమ్)
మీలాంటి దాసులు మాత్రమే.

అల్లాహ్‌ను కాకుండా మీరు ఎవరైతే ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు మీలాంటి మానవులు మాత్రమే. మీలాంటి దాసులు మాత్రమే. అల్లాహు త’ఆలా చాలా స్పష్టంగా చెప్పారు, మీలాంటి దాసులు, మీలాంటి మానవులు. అంటే మక్కా యొక్క ముష్రికులు ఎవరినైతే వారికి మరియు అల్లాహ్‌కు మధ్య మధ్యవర్తిత్వంగా, సిఫారసుగా నిర్ణయించుకున్నారో వారు కేవలం విగ్రహాలు మాత్రమే కాదు. రాళ్లతో, చెట్లతో, లేక వేరే వాటితో చేసిన కేవలం మూర్తులు మాత్రమే కాదు. సమాధిలో ఉన్న కొందరు పుణ్యాత్ములు, ఔలియాలు వారిని ప్రవక్తల కాలం యొక్క ముష్రికులు పూజించేవారు.

ఉదాహరణకు, హజ్రత్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హు గారి యొక్క హదీస్ కూడా వినిపించడం జరిగింది. తాయిఫ్ నుండి తాయిఫ్‌కు దగ్గర మక్కా మార్గంలో ‘లాత్’ అనే ఒక పుణ్యాత్ముడు హజ్ కు వచ్చే వాళ్లకు సత్తువ ఇట్లా తాగించి తినిపించేవాడు. అతను చనిపోయిన తర్వాత అతను చనిపోయిన స్థలంలోనే అతన్ని సమాధి చేసి అక్కడే కొందరు ముజావర్గా కూర్చొని కొద్ది రోజుల తర్వాత వారిని అదే పూజించడం మొదలుపెట్టారు. ఇది సహీ హదీసులో ఉంది.

అంతేకాకుండా, హజ్రత్ నూహ్ అలైహిస్సలాం కాలంలో ఐదుగురు పుణ్యాత్ములు ఏదైతే చనిపోయారో, వద్, సువా, యగూస్, యఊక్, నసర్, వీరి గురించి హజ్రత్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హు ఏం చెప్పారు? నూహ్ అలైహిస్సలాం కాలంలో వీరు పుణ్యాత్ములు. నూహ్ అలైహిస్సలాం కాలంలో ఉన్నటువంటి ముష్రికులు వీరిని పూజించేవారు. అయితే తర్వాత నూహ్ అలైహిస్సలాం కాలంలో వచ్చిన ఏదైతే తూఫాన్ ఉందో ఆ తూఫాన్ తర్వాత ఈ ఐదు పుణ్యాత్ముల విగ్రహాలు ఏదైతే తయారు చేసి పెట్టుకున్నారో అవి ఎక్కడో దాగిపోయి ఉన్నాయి. కానీ షైతాన్ వాడు అమర్ బిన్ లుహై అనే ఒక నాయకుడు మక్కాలో అతనికి ఏదో రకంగా తెలిపి జిద్దా ఒడ్డున, జిద్దాలో సముద్రం ఉంది కదా, సముద్ర తీరాన ఎక్కడో పాతి ఉన్న ఆ విగ్రహాలను తీసి మళ్లీ మక్కాలో తీసుకొచ్చి వాటి విగ్రహారాధన మరోసారి మొదలుపెట్టారు. అయితే అక్కడ వారు పూజించేది కేవలం విగ్రహం అనే కాదు. వీరు పుణ్యాత్ములు. పుణ్యాత్ముల ఒక ఆకారం, ఒక వారి రూపాన్ని మేము పూజిస్తున్నాము. వీరు మాకు ప్రళయ దినాన సిఫారసు చేస్తారు. అటువంటి నమ్మకాలు వారు ఉంచుకునేవారు.

ఇంతవరకు మనం గత పాఠంలో ఏదైతే కొన్ని విషయాలు తెలుసుకున్నామో వాటి సంక్షిప్త విషయాలు ఇప్పుడు మరోసారి చెప్పడం జరిగింది. ఈరోజు పాఠంలో నేను మరో విషయం మీకు తెలుపబోతున్నాను. దానిని మీరు చాలా శ్రద్ధగా వినాలని ఆశిస్తున్నాను. అదేమిటి, చాలా ముఖ్యమైన విషయం. అనేకమంది ప్రజలు సమాధుల వద్దకు వెళ్ళడానికి ఇది కూడా ఒక కారణం. అదేమిటి, సమాధిలో ఉన్న వాళ్ళు మా యొక్క మొరలను వింటున్నారు. మేము ఏదైనా దుఆ చేస్తే మా దుఆలను వారు ఆలకిస్తారు అని వారి నమ్మకం ఉంది. అయితే వాస్తవానికి చనిపోయిన వారు, మృతులు, సమాధిలో ఉన్న వారు మనం బ్రతికి ఉన్న వాళ్ళు వీరి యొక్క మాటలను వింటారా? ఒకవేళ సమాధి వద్దకు వెళ్లి ఏదైనా మొరపెట్టుకుంటే, ఏదైనా దుఆలు చేస్తే, ఏదైనా అరిస్తే వారికి వినే శక్తి ఉందా? ఈ విషయం ఖుర్ఆన్ హదీస్ ఆధారంగా తెలుసుకుందాం.

అయితే, ఎవరైతే సమాధుల వద్దకు వెళ్తున్నారో వారి యొక్క గట్టి నమ్మకం, విశ్వాసం ఏంటి? సమాధిలో ఉన్న వాళ్ళందరూ వింటూ ఉంటారు. ప్రత్యేకంగా ఔలియా అల్లాహ్ ఈ బాబాలు వాళ్ళు మా యొక్క కష్టసుఖాలను మేము ఏదైతే చెప్పుకుంటామో, మొరపెట్టుకుంటామో వాటిని వింటారు అన్నటువంటి నమ్మకం ఉంది. వారి ఆ నమ్మకానికి ఖుర్ఆన్‌లో హదీసులో ఎక్కడైనా ఏదైనా ఆధారం ఉందా? అయితే హదీసు నుండి ఒక ఆధారం, ఒక దలీల్ వారు చూపిస్తారు. అదేమిటి, సహీ బుఖారీలో హదీస్ ఉంది.

ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వలస పోయి వచ్చిన తర్వాత రెండవ హిజ్రీలో, అంటే వలస పోయి వచ్చిన తర్వాత రెండవ సంవత్సరం, మక్కా యొక్క ముష్రికులతో ఒక యుద్ధం జరిగింది. దాని పేరు బద్ర్ యుద్ధం. గజ్వతె బద్ర్. ఆ యుద్ధంలో అల్హందులిల్లాహ్ అల్లాహ్ యొక్క దయ వల్ల ముస్లింలు జయించారు. ముష్రికులు ఓడిపోయారు. ముష్రికుల వైపు నుండి 70 మంది హతమయ్యారు. మరో 70 మంది ఖైదీలు అయ్యారు. అయితే ఆ బద్ర్ ప్రాంతంలో ఒక చిన్న సంఘటన జరిగింది. అదేంటి, ఆ మృతులను, ఎవరైతే ముష్రికులు హతులయ్యారో, చంపబడ్డారో వారిని పెద్ద పెద్ద గోతులు తవ్వి అందులో వారిని పడేయడం జరిగింది. అలాంటి సందర్భంలో ఒకసారి అబూ జహల్ ఇంకా పెద్ద పెద్ద కొందరు నాయకులను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక బావి లాంటిది లోతుగా కొంచెం తవ్వి అందులో వారిని వేసినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ నిలబడి ‘హల్ వజద్తుమ్ మా వఅద రబ్బుకుమ్ హక్కా’. ఏమిటి, అల్లాహ్ మీతో మీ ప్రభువు మీతో చేసిన వాగ్దానాన్ని మీరు పొందారా? అని వారిని అడిగారు. ఎవరిని అడుగుతున్నారు ప్రవక్త గారు అప్పుడు? ఆ చనిపోయిన వాళ్ళను. ఆ యుద్ధంలో ఎవరినైతే చంపడం జరిగిందో ముష్రికులను, వారిని ఒక బావిలో వేస్తున్నారు. అయితే వారిని వేసిన తర్వాత దాని ఒడ్డున మీద నిలబడి ప్రవక్త వారితో సంబోధిస్తూ, వారిని ఉద్దేశించి ఈ మాట అడుగుతున్నారు. అల్లాహు త’ఆలా, మీ యొక్క ప్రభువు మీతో ఏ వాగ్దానం అయితే చేశాడో దానిని మీరు పొందారా? అయితే కొందరు సహాబాలు అన్నారు, ప్రవక్తా వారు మృతులు కదా మీ మాటలను ఎలా వినగలుగుతారు? అప్పుడు ప్రవక్త అన్నారు,

إِنَّهُمْ الْآنَ يَسْمَعُونَ مَا أَقُولُ
(ఇన్నహుముల్ ఆన యస్మఊన మా అఖూల్)
నిశ్చయంగా వారు ఇప్పుడు నేను చెప్పేది వింటున్నారు.

నేను ఏ మాటనైతే అంటున్నానో ఆ మాటను వారు ఇప్పుడు వింటున్నారు అని ప్రవక్త చెప్పారు కదా. ఈ యొక్క హదీసు తోని ఈనాటి ఆ ముస్లింలు దలీల్ ఆధారం తీసుకుంటారు చూడండి. మృతులు వినరు అని మీరు అంటారు. ఇక్కడ ప్రవక్త స్వయంగా వారికి వినిపిస్తున్నారు. సహాబాలకు అనుమానం కలిగింది. అయితే ప్రవక్త వారికి సమాధానం చెప్పారు వింటున్నారు అని. అందుగురించి మృతులు వింటారు.

వారు సహీ బుఖారీలో ఉన్న హదీస్ మరొకటి వినిపిస్తారు. అదేమిటి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు,

اَلْعَبْدُ إِذَا وُضِعَ فِي قَبْرِهِ، وَتُوُلِّيَ وَذَهَبَ أَصْحَابُهُ حَتَّى إِنَّهُ لَيَسْمَعُ قَرْعَ نِعَالِهِمْ، أَتَاهُ مَلَكَانِ فَأَقْعَدَاهُ
మనిషి చనిపోయిన తర్వాత అతన్ని సమాధిలో పెట్టి తిరిగిపోతున్న సందర్భంలో, ఎప్పుడైతే వారి బంధుమిత్రులందరూ వెళ్లిపోతూ ఉంటారో వారి చెప్పుల శబ్దాన్ని అతడు సమాధిలో ఉండి అతడు వింటాడు. అప్పుడే ఇద్దరు దేవదూతలు వచ్చి అతన్ని కూర్చోబెట్టి ప్రశ్న అడుగుతారు. 

ఇక్కడ ఏముంది హదీసులో, సమాధిలో ఉన్న ఆ వ్యక్తి అతని యొక్క బంధుమిత్రులు ఎవరైతే వెళ్తున్నారో వారి యొక్క చెప్పుల శబ్దాన్ని వింటారు అని హదీసులో స్పష్టంగా ఉంది. యస్మఉ ఖర్అ నిఆలిహిమ్. వారి చెప్పుల శబ్దాన్ని అతను వింటాడు. అందుగురించే ఈ మన సోదరులు ఎవరైతే సమాధుల వద్దకు వెళ్తూ ఉంటారో, సమాధిలో ఉన్న వాళ్ళు ఔలియాలు బాబాలు వింటారు, అందుగురించి ఈ హదీసులో ఆధారం అని చూపిస్తారు.

కానీ వాస్తవానికి ఈనాటి కాలంలో ఉన్న సమాధులలో లేక సామాన్యంగా ఎవరైనా మృతులు, చనిపోయిన వారు వింటారు అనడానికి ఈ రెండు హదీసులు దలీల్ ఏ మాత్రం కావు. ఎందుకు? మొదటి హదీస్ ఏదైతే ఉందో, ఈ హదీస్ సహీ బుఖారీలో ఇమామ్ బుఖారీ రహమతుల్లాహ్ అలైహ్ నాలుగు చోట్ల ప్రస్తావించారు. అంటే నాలుగుసార్లు వేరే వేరే స్థానాల్లో ఈ హదీసును ప్రస్తావించారు. ఒకటి కితాబుల్ జనాఇజ్‌లో, జనాజా అంతక్రియలకు సంబంధించిన చాప్టర్ ఏదైతే ఉంటుందో అక్కడ, ఇంకా మిగతా మూడుసార్లు కితాబుల్ మగాజి, యుద్ధాల విషయానికి సంబంధించిన హదీసులను ప్రస్తావించాడు ఎక్కడైతే అక్కడ.

అయితే మొదటిసారి కితాబుల్ జనాఇజ్ బాబు అజాబిల్ ఖబ్ర్ హదీస్ నెంబర్ 1370 లో ఎక్కడైతే ఈ హదీస్ వచ్చి ఉందో, ప్రవక్త ఎప్పుడైతే అన్నారో మీరు మీ ప్రభువు చేసిన వాగ్దానాన్ని మీరు పొందారా అని అప్పుడు సహాబాలు అన్నారు, తద్ఊ అమ్వాతన్? మీరు మృతులను పిలుస్తున్నారా? మృతులను సంబోధిస్తున్నారా? దాని యొక్క సమాధానంలో ప్రవక్త ఏం చెప్పారు, ‘మా అన్తుమ్ బి అస్మఅ మిన్హుమ్ వలాకిన్ లా యుజీబూన్’. మీరు వారి కంటే ఎక్కువ ఇప్పుడు వినడం లేదు. అంటే వారు మీ కంటే ఎక్కువ ఇప్పుడు వింటున్నారు. కానీ వారు సమాధానం ఇవ్వలేరు.

ఇదే హదీస్ మరోచోట ఉంది, అక్కడ హదీస్ నెంబర్ అది 4026. అక్కడ సహాబాలు అడిగారు, యా రసూలల్లాహ్ తునాది నాసన్ అమ్వాతా? ఓ ప్రవక్తా, మీరు చనిపోయిన వారిని మృతులను పిలుస్తున్నారా? అయితే ప్రవక్త చెప్పారు, ‘మా అన్తుమ్ బి అస్మఅ లిమా ఖుల్తు మిన్హుమ్’. నేను వారికి చెప్పే విషయం ఏదైతే ఉందో దానిని మీరు వారి కంటే ఎక్కువ వినడం లేదు. అంటే వారు మీ కంటే ఎక్కువ వింటున్నారు.

మూడోచోట హజ్రత్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు అడిగారు అని ఉంది. హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు, యా రసూలల్లాహ్ మా తుకల్లిము మిన్ అజ్సాదిన్ లా అర్వాహ లహా. ఆత్మలు లేని ఈ శరీరం వాటితో మీరు సంబోధిస్తున్నారా? వాటికి మీరు వాటితో మీరు వారిని పిలుస్తున్నారా? వారితో మాట్లాడుతున్నారా? అప్పుడు ప్రవక్త ఏమన్నారు, ‘వల్లది నఫ్సు ముహమ్మదిన్ బియదిహ్’. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణం ఎవరి చేతిలో ఉందో అతని సాక్షి ‘మా అన్తుమ్ బి అస్మఅ లిమా అఖూలు మిన్హుమ్’. నేను ఇప్పుడు చెప్పే మాటలు మీరు వారి కంటే ఎక్కువ వినలేరు.

అయితే ఇక్కడ ఒక విషయం మనం ఈ హదీస్ ను ఈ ఒక్క హదీస్ నాలుగు చోట్ల నాలుగు స్థానాల్లో ఏదైతే వచ్చి ఉందో అందులో ఏ ఏ పదాలతో విషయం చర్చించబడిందో వాటిని ఒకవేళ మనం శ్రద్ధ వహిస్తే, సహాబాలు ఏదైతే అడుగుతున్నారో, ఓ ప్రవక్తా మీరు మృతులను సంబోధిస్తున్నారా? ప్రాణం ఏమాత్రం లేని ఈ శవాలను, ప్రాణం లేని ఈ శరీరాలతో మీరు మాట్లాడుతున్నారా? అని ఈ అడగడం ద్వారా మనకు ఏం తెలుస్తుంది? అప్పటివరకు సహాబాల విశ్వాసం ఏమిటి? మృతులు వినరు. చనిపోయిన వాళ్ళు వినరు అన్న విశ్వాసమే ప్రబలి ఉండింది. ఇదే మాట అందరికీ తెలిసి ఉండింది. అందుగురించే ఎప్పుడైతే ప్రవక్త మృతులతో మాట్లాడుతున్నారో, ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అని ఆశ్చర్యంగా వారు అడిగారు.

రెండో విషయం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? ఇప్పుడు వీరు మీ కంటే ఎక్కువ వింటున్నారు.

اِنَّهُمُ الْآنَ
(ఇన్నహుముల్ ఆన్)
నిశ్చయంగా వారు ఇప్పుడు

అల్ ఆన్ అన్న పదం ఉన్నది అక్కడ. ఇప్పుడు వారు మీ కంటే ఎక్కువ వింటున్నారు. అయితే ఇప్పుడు వారు మీ కంటే ఎక్కువ వింటున్నారు అన్న ఈ పదంలోనే ఇది ఒక ప్రత్యేక సందర్భం అంతే మాత్రం గానీ చనిపోయిన ఏ వ్యక్తి కూడా బ్రతికి ఉన్న వారి, జీవరాశుల మాటలను వినరు అని స్పష్టం అవుతుంది. ఇది ఒక ప్రత్యేక సందర్భం.

మరి ఇదే హదీస్ గురించి హజ్రత్ ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా గారు ఏం చెప్పారో ఒకసారి వినండి. దాని ద్వారా కూడా సహాబాల యొక్క విశ్వాసం మృతులు వింటారా లేదా అనే విషయం సహాబాలకు ఎలా ఉండింది అది కూడా మనకు తెలుస్తుంది. ఈ హదీస్ హజ్రత్ ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా వద్దకు వచ్చినప్పుడు, హజ్రత్ ఆయిషా రదియల్లాహు అన్హా గారు చెప్పారు, “ప్రవక్త యొక్క ఉద్దేశం ఇక్కడ ఏమిటంటే వారి యొక్క జీవితాల్లో నేను మాటిమాటికి ఏదైతే చెప్పేవాడినో, మీరు అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించండి, అల్లాహ్‌కు ఏ మాత్రం సాటి కల్పించకండి, షిర్క్ చేయకండి అని మాటిమాటికి ఏదైతే నేను చెప్పేవాడినో, ఒకవేళ మీరు నా మాటను వినేది ఉంటే అల్లాహ్ స్వర్గం యొక్క వాగ్దానం మీకు చేస్తున్నాడు, మీరు నన్ను తిరస్కరించేది ఉంటే మీరు నరకంలో వెళ్తారు, ఇలాంటి వారి జీవితంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ ఏ మాటలైతే చెప్పేవారో అవి సత్యం అని ఇప్పుడు వారికి తెలుస్తుంది. ‘హల్ వజద్తుమ్ మా వఅద రబ్బుకుమ్ హక్కా’. మీ ప్రభువు మీతో చేసిన వాగ్దానం ఏదైతే ఉందో అది నిజం అని మీకు ఇప్పుడు తెలిసిందా? దాన్ని మీరు పొందారా? అది సత్యమే అన్న విషయం ఇప్పుడు తెలిసిందా?”

ఇదే సంఘటన కాకుండా వేరే కొన్ని ఆయతులు ఖుర్ఆన్‌లో ఉన్నాయి. మనిషి చనిపోయినప్పుడు, ఓ దేవా నాకు కొంచెం అవకాశం ఇవ్వు, ఇప్పుడు నాకు తెలిసింది, నాకు కొంచెం అవకాశం దొరికిన గానీ నేను నా ధనాన్ని నీ మార్గంలో ఖర్చు పెడతాను అని కూడా కోరుకుంటారు కొందరు.

ఫిర్ఔన్ చనిపోయేటప్పుడు కూడా ఏమన్నాడు? ఆ, మూసా చెప్పిన మాటలన్నీ కూడా నిజమే. ఇప్పుడు నేను విశ్వాసం మార్గాన్ని అవలంబిస్తాను.

అయితే ఇలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారికి ఆ సందర్భంలో గుర్తు చేస్తున్నారు. అయితే అప్పుడు అల్లాహు త’ఆలా వారికి ప్రవక్త యొక్క మాట వినిపించారు. అదేంటి, ప్రత్యేక సందర్భం. ఈ ప్రత్యేక సందర్భాన్ని మనం ప్రతీ శవం గురించి, ప్రతీ చనిపోయిన వారి గురించి, ప్రత్యేకంగా ఔలియాల గురించి, అంబియాల గురించి ఇంకా వేరే వారి గురించి ఈ మాటలు అక్కడ అతికించవద్దు. ఈ మాటతోని, ఈ యొక్క హదీసుతోని “అందరూ వింటారు” అన్నటువంటి దలీల్ పట్టుకోవడం, దీనిని ఒక ఆధారంగా తీసుకోవడం ఎంత మాత్రం నిజమైనది కాదు. అందుగురించి ఇదే హదీస్ సహీ బుఖారీలో 3976వ హదీస్ లో హజ్రత్ ఖతాదా రహమతుల్లాహ్ అలైహ్ ఏం చెప్తున్నారు,

أَحْيَاهُمُ اللَّهُ حَتَّى أَسْمَعَهُمْ
(అహ్యాహుముల్లాహు హత్తా అస్మఅహుమ్)
వారిని వినిపించేంత వరకు అల్లాహ్ వారికి జీవం పోసాడు

అల్లాహ్ వారిని ఆ సందర్భంలో వారికి జీవం పోసాడు. హత్తా అస్మఅహుమ్, ప్రవక్త యొక్క మాటను వారికి వినిపించాడు. తౌబీఖన్ వ తస్గీరన్ వ నఖీమతన్ వ హసరతన్ వ నదామతన్. ఎందుకు, వారికి ఆ సందర్భంలో బాధ, అయ్యో ప్రవక్త మాటను మేము వినలేదు కదా అన్నటువంటి ఒక బాధ, ఎంతో ఒక షర్మిందాపన్, పశ్చాత్తాపం లాంటిది కలగాలి, ఇంకింత వారికి ఆ ఆవేశం అనేది వారి యొక్క అఫ్సోస్ అనేది పెరిగిపోవాలి అన్న ఉద్దేశంతో ఆ సందర్భంలో అల్లాహు త’ఆలా వారిని మరోసారి లేపి ప్రవక్త యొక్క మాటను వినిపించాడు. అది అంత మటుకు మాత్రమే.

అందుగురించి, ఇప్పుడు నేను కొన్ని ఖుర్ఆన్ ఆయతులు వినిపిస్తాను వాటిని శ్రద్ధగా వినండి. ఖుర్ఆన్ ద్వారా మనకు ఏం తెలుస్తుంది అంటే సామాన్యంగా మృతులు, చనిపోయిన వారు బ్రతికి ఉన్న వారి ఏ మాటను వినలేరు. సూరె నమల్ ఆయత్ నెంబర్ 80లో అల్లాహ్ చెప్పాడు,

إِنَّكَ لَا تُسْمِعُ الْمَوْتَى
(ఇన్నక లా తుస్మిఉల్ మౌతా)
నిశ్చయంగా నువ్వు మృతులకు వినిపించలేవు.

నువ్వు మృతులకు, చనిపోయిన వారికి వినిపించలేవు. అలాగే సూరె రూమ్ ఆయత్ నెంబర్ 52లో ఇలాంటి ఆయతే ఉంది. అక్కడ కూడా ఉంది, ఓ ప్రవక్తా నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ మృతులకు వినిపించలేవు. అయితే మృతులు వినరు, బ్రతికి ఉన్న వారు తమ ఏ మాటను కూడా మృతులకు వినిపించలేరు అని ఈ ఆయత్ చాలా స్పష్టంగా ఉంది. అంతేకాకుండా అల్లాహు త’ఆలా కోరినప్పుడు, ఏదైనా అవసర సందర్భంగా అల్లాహు త’ఆలాకు ఇష్టమైతే వినిపించవచ్చు. ఆ శక్తి అల్లాహ్‌కు ఉంది. కానీ ఒక సామాన్య నియమం, ఒక రూల్, ఒక పద్ధతి ఏమిటి? మృతులు వినరు. కానీ అల్లాహ్ కోరినప్పుడు వినిపిస్తాడు. అల్లాహ్ స్వయంగా వినిపిస్తాడు. దానికి సాక్ష్యంగా ఈ హదీస్, ఈ ఖుర్ఆన్ యొక్క ఆయతును మనం తెలుసుకోవచ్చు. ఈ ఆయత్ సూరె ఫాతిర్ ఆయత్ నెంబర్ 22.

وَمَا يَسْتَوِي الْأَحْيَاءُ وَلَا الْأَمْوَاتُ
(వమా యస్తవిల్ అహ్యాఉ వలల్ అమ్వాత్)
బ్రతికి ఉన్న వారు, చనిపోయిన వారు ఇద్దరూ సమానులు కాలేరు.

إِنَّ اللَّهَ يُسْمِعُ مَنْ يَشَاءُ
(ఇన్నల్లాహ యుస్మిఉ మన్ యషా)
నిశ్చయంగా అల్లాహ్ తాను కోరిన వారికి వినిపిస్తాడు

وَمَا أَنْتَ بِمُسْمِعٍ مَنْ فِي الْقُبُورِ
(వమా అంత బిముస్మిఇన్ మన్ ఫిల్ ఖుబూర్)
మరియు సమాధులలో ఉన్నవారికి నీవు వినిపించలేవు.

ఇక్కడ అల్లాహ్ కోరినప్పుడు వినిపిస్తాడు అని దీంతో కూడా కొందరు పెడమార్గంలో పడిపోతారు. అదేమిటి? అవును ఔలియా అల్లాహ్‌కు వినిపించే శక్తి అల్లాహ్‌కు ఉంది, అందుగురించి మేము మొరపెట్టుకునే మొరలను వారు ఇప్పుడు వింటున్నారు, అల్లాహ్ వినిపిస్తున్నాడు, వారు స్వయంగా వింటారని మేము అనుకుంటలేము. మళ్ళీ ఇలా తిప్పికొట్టి వారు తమ యొక్క విశ్వాసాన్ని మరింత గట్టి పరుచుకునే ప్రయత్నం చేస్తారు. అయితే బుఖారీలోని మొదటి హదీస్ బద్ర్‌లో చనిపోయిన ముష్రికులకు ఏదైతే ప్రవక్త వినిపించారో దానికి ఈ ఆయత్ సాక్ష్యం అవుతుంది.

అంతేకాకుండా చనిపోయిన ప్రతీ వ్యక్తిని సమాధిలో పెట్టినప్పుడు అతన్ని సమాధిలో పెట్టేసి వారి యొక్క బంధుమిత్రులు తిరిగి వస్తున్నప్పుడు అతను ఏదైతే వారి చెప్పుల శబ్దాన్ని వింటాడో, అయ్యో అందరూ నన్ను వదిలేసి నన్ను ఒక్కడిని వదిలేసి పోతున్నారా, నేను ఏకాంతంలో అయిపోయానా, అలాంటి రంది అతనికి కలగడానికి, ఎవరి ఎవరి యొక్క అండదండ నాకు ఉంది అన్న యొక్క ఆలోచనతో నేను ఎంతో అల్లాహ్‌కు వ్యతిరేకంగా కూడా జీవితం గడిపానో, ఇప్పుడు ఈ సమాధిలో నన్ను ఎవరూ కూడా కానడానికి చూడడానికి వస్తలేరు, నేను ఒక్కడిని అయిపోయాను, అలాంటి ఒక ఆవేదన అతనికి కలగడానికి కేవలం వారు వెళ్ళిపోతున్న చెప్పుల శబ్దాన్ని వినిపిస్తాడు, అంతే. ఇంకా వేరే మాటలను వినిపిస్తాడు అని అక్కడ ఇక్కడ లేదు మనకు. అలాంటి విషయం తెలుస్తలేదు.

అందుగురించి సోదరులారా, ఈ రెండు హదీసులను మనం తీసుకొని ఖుర్ఆన్ ఆయతులను మనం తిరస్కరించవద్దు. ఈ రెండు ఆయతులకు రెండు హదీసులను ఈ సూరె ఫాతిర్ యొక్క ఆయత్. ఒకవేళ వీరందరూ వింటున్నారు అని మనం అనుకుంటే, అల్లాహ్ వారిని వినిపిస్తున్నాడు అని అనుకుంటే, ‘ఇన్నల్లాహ యుస్మిఉ మన్ యషా’, అల్లాహ్ తాను కోరిన వారికి వినిపిస్తాడు అని చెప్పేకి ముందు బ్రతికి ఉన్న వారు, చనిపోయిన వారు ఇద్దరూ సమానులు కాజాలరు అని ఏదైతే అంటున్నాడో మరి దాని యొక్క భావం ఏంటి? ఒకవేళ అందరూ వినేది ఉంటే, వారు కూడా బ్రతికి ఉన్న వాళ్ళ మాదిరిగానే అయిపోయారు. అందుగురించి ఈ ఆయతులు ఈ హదీసులను మనం విన్న తర్వాత సామాన్యంగా మృతులు వినరు. ఏదైనా ప్రత్యేక సందర్భంలో, ఏదైనా ఒక ఉద్దేశంతో వినిపిస్తాడు అన్నటువంటి హదీస్ ఎక్కడైనా వచ్చి ఉంటే దానిని అక్కడి వరకే మనం నమ్మాలి గానీ, అంతకంటే ఇంకా ముందుకు వెళ్ళేసి అన్ని విషయాలను వింటారు అని మనం దాంట్లో కలుపుకోవడం ఇది పెడమార్గానికి తీసుకెళ్తుంది.

మరికొందరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి ఏం విశ్వసిస్తారు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో తమ సమాధిలో ఉండి మనల్ని చూస్తున్నారు, మనం చేసే కార్యాలను చూస్తున్నారు, మనం చెప్పే మాట్లాడే మాటలను వింటున్నారు అని కొందరు విశ్వసిస్తారు. అది కూడా ఖుర్ఆన్ హదీసులకు వ్యతిరేకమైన విశ్వాసం.

ఏమిటంటారు తెలుసా వాళ్ళు? ఒక హదీసులో మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దరూద్ చదివినప్పుడు ఆ దరూద్ దేవదూతలు తీసుకెళ్లి ప్రవక్త గారికి వినిపిస్తారు. అయితే సహీ హదీసుల్లో ఇంత విషయమే ఉంది. కానీ మరికొన్ని జయీఫ్ హదీసులలో ఏం వస్తుంది అంటే, ఎవరైనా ప్రవక్త సమాధి వద్దకు వచ్చి దరూద్ సలాం చేస్తే స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దరూద్ సలాంకు సమాధానం ఇస్తారు. కానీ ఇది నిరాధారమైన హదీస్. బలమైనది కాదు. అయితే హదీసులు కూడా బలహీనంగా ఉంటాయా? హదీస్ యొక్క పరంపరలో, హదీస్ యొక్క సనదులో పరంపరలో కొందరు అబద్దీకులు, కొందరు తప్పుగా ప్రవక్త వైపునకు మాటలు కల్పించే వాళ్ళు కూడా వస్తారు. హదీస్ యొక్క పండితులు అలాంటి కల్పిత హదీసులను వేరుగా చేసి ఉన్నారు. అయితే సహీ హదీసులో ఎక్కడా కూడా ప్రవక్త డైరెక్ట్ మన యొక్క సలాంను దరూదును వింటారు అని లేదు. ఏ సహీ హదీసులో లేదు. దూరమైనా దగ్గరైనా ఎక్కడ ఉండి మనం దరూద్ చదివినా గానీ ప్రవక్త డైరెక్ట్ గా వింటారు అని ఎక్కడా ఏ హదీసులో కూడా లేదు. అందుగురించి ప్రవక్త కూడా మన మాటలను వింటారు అని మనం ఎప్పుడూ కూడా నమ్మవద్దు విశ్వసించవద్దు.

అయితే, ఇంతవరకు ఈ విషయాలు మనం విన్న తర్వాత నేను ఖుర్ఆన్‌లోని ఒక ఆయత్, ఆ ఆయత్‌కు సాక్ష్యాధారంగా సహీ బుఖారీలోని ఒక హదీస్ వినిపిస్తాను. ఈ ఆయత్ మరియు ఈ హదీస్ విన్న తర్వాతనైనా ఇక మన విశ్వాసాలు కరెక్ట్, నిజమైనవి, శుద్ధమైనవి మరియు ప్రవక్త సహాబాల విశ్వాస ప్రకారంగా ఉండాలి. శవాలు వింటారు అని, వారి సమాధుల వద్దకు వెళ్లి అక్కడ ఎలాంటి షిర్క్ పనులకు, ఎలాంటి మనం తావు ఇవ్వకూడదు, ఎలాంటి మనం అక్కడ మోసాలకు గురికాకూడదు.

అదేవిటండీ ఆ ఆయత్ అంటే, సూరె మాయిదాలో అల్లాహు త’ఆలా ఈసా అలైహిస్సలాం కు సంబంధించిన ఒక సంఘటన తెలిపారు. అదేమిటి, ఈసా అలైహిస్సలాం అల్లాహ్ యొక్క సత్య ప్రవక్త, తండ్రి లేకుండా అల్లాహు త’ఆలా మర్యమ్ అలైహిస్సలాం ద్వారా అతన్ని పుట్టించాడు. ఈ విషయం మనకు తెలిసిందే. అలాగే మనం విశ్వసించాలి. అయితే ఈ రోజుల్లో అనేకమంది క్రైస్తవులు స్వయంగా ఈసా అలైహిస్సలాంనే దేవునిగా పూజిస్తున్నారు. మరికొందరు మర్యమ్ అలైహిస్సలాంను కూడా పూజిస్తున్నారు. ఇంకొందరు ఈసా, పరిశుద్ధాత్మ, యెహోవా అని త్రైత్వ దైవాన్ని (Trinity) పూజిస్తున్నారు. ఇవన్నీ కూడా తప్పుడు విశ్వాసాలు. వారి యొక్క ఈ ఆరాధనలన్నీ కూడా షిర్క్‌లోకి వస్తాయి. స్వయంగా ఈసా అలైహిస్సలాం నన్ను కాదు ఏకైక దేవుణ్ణి పూజించండి అని స్పష్టంగా చెప్పారు. ఖుర్ఆన్ సూరె ఆలి ఇమ్రాన్‌లో ఉంది.

اعْبُدُوا اللَّهَ رَبِّي وَرَبَّكُمْ
(ఉ’బుదుల్లాహ రబ్బీ వ రబ్బకుమ్)
నాకు మీకు ప్రభువైన అల్లాహ్‌ను మాత్రమే మీరు ఆరాధించండి.

అలాగే బైబిల్‌లో యోహాను సువార్తలో ఉంది. ఆకాశాల్లో ఉన్న ఆ దేవుణ్ణి పూజించేవారే నిత్య జీవితాన్ని పొందుతారు అని చాలా స్పష్టంగా ఉంది. అయితే ప్రళయ దినాన అల్లాహు త’ఆలా ఈసా అలైహిస్సలాంను పిలుస్తాడు. అక్కడ గట్టిగా ప్రశ్నిస్తాడు. ఆ విషయం ఏంటి? ఆ ప్రశ్నలు ఏంటి? కొంచెం శ్రద్ధగా వినండి.

وَإِذْ قَالَ اللَّهُ يَا عِيسَى ابْنَ مَرْيَمَ أَأَنْتَ قُلْتَ لِلنَّاسِ اتَّخِذُونِي وَأُمِّيَ إِلَٰهَيْنِ مِنْ دُونِ اللَّهِ
మరియు (ఆ రోజును గుర్తు చేసుకోండి), అప్పుడు అల్లాహ్ ఇలా అంటాడు: ఓ మర్యమ్ కుమారుడవైన ఈసా! నీవు ప్రజలతో, ‘అల్లాహ్‌ను వదలి నన్నూ, నా తల్లినీ ఆరాధ్య దైవాలుగా చేసుకోండి’ అని అన్నావా?

మరియం పుత్రుడైన ఓ ఈసా, అల్లాహ్‌ను వదలి నన్ను నా తల్లిని ఆరాధ్య దైవాలుగా చేసుకోండి అని నీవు ప్రజలకు చెప్పావా? అని అల్లాహ్ నీలదీసి అడిగే సందర్భం కూడా స్మరించుకోదగినది. అప్పుడు ఈసా అలైహిస్సలాం ఇలా విన్నవించుకుంటారు. ఏమని,

قَالَ سُبْحَانَكَ مَا يَكُونُ لِي أَنْ أَقُولَ مَا لَيْسَ لِي بِحَقٍّ
ఓ అల్లాహ్, నిన్ను పరమ పవిత్రుడిగా భావిస్తున్నాను. ఏ మాటను అనే హక్కు నాకు లేదో అలాంటి మాటను అనటం నాకే మాత్రం తగదు.

إِنْ كُنْتُ قُلْتُهُ فَقَدْ عَلِمْتَهُ تَعْلَمُ مَا فِي نَفْسِي وَلَا أَعْلَمُ مَا فِي نَفْسِكَ
ఒకవేళ నేను గనక అలాంటిది ఏదైనా అని ఉంటే అది నీకు తెలిసి ఉండేది. నా మనసులో ఏముందో కూడా నీకు తెలుసు. కానీ నీలో ఏముందో నాకు తెలియదు.

إِنَّكَ أَنْتَ عَلَّامُ الْغُيُوبِ
నిశ్చయంగా నీవు సమస్త గుప్త విషయాలను ఎరిగినవాడవు.

مَا قُلْتُ لَهُمْ إِلَّا مَا أَمَرْتَنِي بِهِ أَنِ اعْبُدُوا اللَّهَ رَبِّي وَرَبَّكُمْ
నీవు నాకు ఆజ్ఞాపించిన దానిని తప్ప నేను వారికి మరేమీ చెప్పలేదు: ‘అల్లాహ్‌ను ఆరాధించండి, ఆయనే నా ప్రభువు మరియు మీ ప్రభువు.’

وَكُنْتُ عَلَيْهِمْ شَهِيدًا مَا دُمْتُ فِيهِمْ فَلَمَّا تَوَفَّيْتَنِي كُنْتَ أَنْتَ الرَّقِيبَ عَلَيْهِمْ وَأَنْتَ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ
నేను వారి మధ్య ఉన్నంత కాలం వారిపై సాక్షిగా ఉన్నాను. కానీ నీవు నన్ను పైకి లేపుకున్న తరువాత, నీవే వారిపై పర్యవేక్షకుడవుగా ఉన్నావు. మరియు నీవు ప్రతి విషయానికి సాక్షిగా ఉన్నావు.

ఈసా అలైహిస్సలాం ప్రవక్త కదా, అయినా ఇప్పుడు వారందరూ అంటే క్రైస్తవులందరూ వారిని పూజిస్తున్నారు అన్న విషయం ఈసా అలైహిస్సలాంకు తెలుసా? తెలియదు. అందుగురించి ఏమంటున్నారు, నేను వారి మధ్యలో ఉన్నంత వరకే నేను సాక్ష్యంగా ఉన్నాను. ఎప్పుడైతే నీవు నన్ను నీ వద్దకు తీసుకున్నావో, నీవే వారిపై వారిని పర్యవేక్షించి ఉన్నావు. వారు ఏం చేస్తున్నారో నాకేం తెలుసు. ఇది సూరె మాయిదాలోని 116, 117వ ఆయత్.

దీనికి సాక్ష్యాధారంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హదీస్ ఏంటి? అది కొంచెం శ్రద్ధగా వినండి. కానీ ఈ హదీసులో తెలిపే ముందు, ఈ రోజుల్లో ప్రపంచమంతటిలో ఎక్కడెక్కడ ఏ పెద్ద పెద్ద ఔలియాలు, పెద్ద పెద్ద బాబాలు, పీరీలు, ముర్షదులు ఎవరెవరైతే ఉన్నారో, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్థానం వారి కంటే గొప్పదా లేకుంటే వారందరూ మన ప్రవక్త కంటే గొప్పవారా? సమాధానం ఇవ్వండి. ప్రవక్తనే గొప్పవారు కదా. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు కదా మనకు. అయితే స్వయంగా ప్రవక్త సంగతి ఈ హదీసులో వినండి. ప్రవక్త ఎలా విన్నవించుకుంటున్నారు? ప్రవక్త తమ తర్వాత జరిగిన విషయాలను నాకు తెలియవు అన్నట్టుగా ఎలా ప్రస్తావిస్తున్నారో. మరి ఈ రోజుల్లో మనం ఎలాంటి తప్పుడు విశ్వాసాల్లో, పెడమార్గాల్లో పడి ఉన్నామో మనం మనకు మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ హదీస్ సహీ బుఖారీలో హదీస్ నెంబర్ 4625, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఈ హదీసును హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు గారు ఉల్లేఖించారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రసంగించారు. ఖుత్బా ఇచ్చారు. అంటే ఏదో ఒక సహాబీతో ప్రత్యేకంగా చెప్పిన విషయం కాదు. 10 మంది 50 మంది 100 మంది ముంగట ఖుత్బాలో ప్రసంగంలో చెప్పిన విషయం. ఆ ప్రసంగంలో ఇలా చెప్పారు. యా అయ్యుహన్నాస్, ఓ ప్రజలారా ఇన్నకుమ్ మహ్షూరున ఇలల్లాహి హుఫాతన్ ఉరాతన్ గుర్లా. మీరు అల్లాహ్ వైపునకు లేపబడతారు. మొదటిసారి పుట్టిన స్థితిలో, శరీరంపై బట్టలు లేకుండా, కాళ్ళకు చెప్పులు లేకుండా, సున్నతీలు చేయబడకుండా. మళ్లీ ప్రవక్త ఖుర్ఆన్ యొక్క ఆయత్ చదివారు. సూరె అంబియా ఆయత్ నెంబర్ 104.

كَمَا بَدَأْنَا أَوَّلَ خَلْقٍ نُعِيدُهُ وَعْدًا عَلَيْنَا إِنَّا كُنَّا فَاعِلِينَ
తొలిసారిగా మిమ్మల్ని పుట్టించిన రీతిలో మలిసారి మిమ్మల్ని మేము లేపుతాము. ఇది మా యొక్క వాగ్దానం. దీనిని మేము పూర్తి చేసి తీరుతాము.

ఇది సూరె అంబియా ఆయత్ నెంబర్ 104 యొక్క అనువాదం. మళ్లీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, వినండి, వ ఇన్న అవ్వలల్ ఖలాయిఖి యుక్సా యౌమల్ ఖియామతి ఇబ్రాహీమ్ అలైహిస్సలాతు వస్సలాం. అందరూ ఏ స్థితిలో లేస్తారు సమాధుల నుండి? నగ్నంగా. బట్టలు లేకుండా. చెప్పులు లేకుండా. సున్నతీలు చేయబడకుండా. అయితే, మొట్టమొదటిసారిగా హజ్రత్ ఇబ్రాహీమ్ అలైహిస్సలాంకు వస్త్రాలు ధరింపజేయబడతాయి. ఆ తర్వాత మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి. అయితే, ఆ మైదానే మహ్షర్‌లో, ఆ పెద్ద మైదానంలో ఎక్కడైతే అందరూ, ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని ప్రళయం సంభవించే వరకు వచ్చిన ఈ జన సమూహం అంతా ఒకే ఒక మైదానంలో సమూహం అవుతారు, జమా అవుతారు. అక్కడ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, వినండి, వ ఇన్నహు యుజాఉ బిరిజాలిన్ మిన్ ఉమ్మతీ ఫయు’ఖదు బిహిమ్ దాతశ్శిమాల్. నేను నా హౌదె కౌసర్ పై నా ఉమ్మతీయులు, నా అనుచర సంఘం వస్తుంది అని నేను వేచిస్తూ ఉంటాను. వారు కొన్ని కొన్ని గ్రూపుల రూపంలో వస్తూ ఉంటారు. కొందరు నా వైపునకు వస్తూ ఉంటారు, ఫయు’ఖదు బిహిమ్ దాతశ్శిమాల్, వారిని నా వద్దకు రానివ్వకుండా ఎడమ వైపునకు నెట్టేయడం జరుగుతుంది. ఫ అఖూల్, అప్పుడు నేను అంటాను, యా రబ్బీ ఉసైహాబీ, ఓ ప్రభువా వీరు నా యొక్క అనుచరులు, నన్ను విశ్వసించిన వారు. ఫ యుఖాల్, అప్పుడు అనబడడం జరుగుతుంది.

إِنَّكَ لَا تَدْرِي مَا أَحْدَثُوا بَعْدَكَ
(ఇన్నక లా తద్రీ మా అహదసూ బ’అదక)
నిశ్చయంగా, నీ తర్వాత వారు ఏ కొత్త కొత్త విషయాలు పుట్టించుకొని ధర్మం నుండి దూరమయ్యారో నీకు తెలియదు ఆ విషయం.

ఎప్పుడు అనబడుతుంది? ప్రళయ దినాన. హౌదె కౌసర్ వద్ద. హౌదె కౌసర్ వద్ద ప్రవక్త శుభ హస్తాలతో హౌదె కౌసర్ ఆ శుభ జలాన్ని త్రాగడానికి అందరూ గుంపులు గుంపులుగా వెళ్తూ ఉంటారు. ఒక గుంపు వచ్చినప్పుడు వారిని ప్రవక్త వద్దకు రానివ్వడం జరగదు. ఎడమ వైపునకు నెట్టేయడం జరుగుతుంది. అయ్యో నా వారు వాళ్ళు, రానివ్వండి నా దగ్గరికి అని ప్రభువును వేడుకుంటారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. కానీ ప్రభువు వైపు నుండి సమాధానం ఏమొస్తుంది? నీవు చనిపోయిన తర్వాత, నీ తర్వాత వారు ఏ కొత్త కొత్త విషయాలు పుట్టించుకొని ధర్మం నుండి దూరమయ్యారో (ఇన్నక లా తద్రీ) నీకు తెలియదు ఆ విషయం.

ఈ హదీస్ ఇంకా ముందుకు ఉంది. కానీ ఇక్కడ నేను ఈ విషయాన్ని నొక్కి చెప్తున్నాను మరోసారి. ఇన్నక లా తద్రీ. నీకు తెలియదు. నీకు ఆ సందర్భంలో నీకు జ్ఞానం లేదు. నీవు చనిపోయిన తర్వాత నీ యొక్క ఈ నిన్ను విశ్వసించే వారు ఏ పెడమార్గంలో పడిపోయారో నీకు తెలియదు. ఈరోజు మనం ఏమనుకుంటున్నాము? ప్రవక్త మనల్ని చూస్తున్నారు, మనం చెప్పే మాట్లాడే మాటలన్నీ, మనం చేసే ప్రార్థనలన్నీ వింటున్నారు. ఇది తప్పు విషయం ఇది. ఈ హదీసుకి వ్యతిరేకంగా ఉందా లేదా వారి యొక్క ఈ విశ్వాసం? ఆ తర్వాత వినండి, ఫ అఖూల్, ప్రవక్త అంటున్నారు, అప్పుడు నేను అంటాను కమా ఖాలల్ అబ్దుస్సాలిహ్, ఎలాగైతే ఆ పుణ్య పురుషుడైన, సదాచరుడైన దాసుడు ఈసా అలైహిస్సలాం చెప్పాడో

وَكُنْتُ عَلَيْهِمْ شَهِيدًا مَا دُمْتُ فِيهِمْ فَلَمَّا تَوَفَّيْتَنِي كُنْتَ أَنْتَ الرَّقِيبَ عَلَيْهِمْ وَأَنْتَ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ
నేను వారి మధ్య ఉన్నంత కాలం వారిపై సాక్షిగా ఉన్నాను. కానీ నీవు నన్ను పైకి లేపుకున్న తరువాత, నీవే వారిపై పర్యవేక్షకుడవుగా ఉన్నావు. మరియు నీవు ప్రతి విషయానికి సాక్షిగా ఉన్నావు.

నేను వారి మధ్యలో ఉన్నంత మాత్రం నేను వారిపై సాక్ష్యంగా ఉన్నాను. ఫలమ్మా తవఫ్ఫైతనీ, ఎప్పుడైతే నీవు నన్ను చంపివేశావో, ఎప్పుడైతే నువ్వు నన్ను నా ప్రాణం తీసుకున్నావో, కున్త అంతర్రఖీబ అలైహిమ్, నీవే వారిని పర్యవేక్షిస్తూ ఉన్నావు. వ అంత అలా కుల్లి షైఇన్ షహీద్, మరియు నీవే సర్వ విషయాలపై సర్వ జగత్తుపై సత్యమైన సాక్షివి.

అయితే సోదరులారా, ఈ హదీస్ ఎంత స్పష్టంగా ఉంది. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సైతం ఆయన కూడా ఎవరి ఏ మాట వినరు ఇప్పుడు. ఎవరి యొక్క మొరలను ఆలకించలేరు. అలాంటప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే తక్కువ స్థానంలో ఉన్న వారి గురించి వారు వింటారు, వారు చేస్తారు, మనకు అన్ని రకాల అనుగ్రహాలు ప్రసాదిస్తారు, ఇలాంటి విశ్వాసాలు, ఇలాంటి నమ్మకాలు మనల్ని ఎంత షిర్క్ లాంటి లోతుకు తీసుకెళ్తాయో మనమే ఆలోచించాలి. ఇ

లా చెప్పుకుంటూ పోతే సోదరులారా, ఖుర్ఆన్‌లో ఇంకా ఎన్నో ఆయతులు ఉన్నాయి, ఎన్నో హదీసులు ఉన్నాయి. ఇలాంటి తప్పుడు విశ్వాసాలకు వ్యతిరేకంగా. కానీ, కొంత సమయం ఉంది గనుక కేవలం ఒకే ఒక ఆయత్, దాని యొక్క అనువాదం మీ ముందు తెలిపి నేను ఈ యొక్క ప్రసంగాన్ని సమాప్తం చేస్తాను. ఇది సూరె ఫాతిర్. సూరె ఫాతిర్‌లోని ఆయత్ నెంబర్ 13, 14. అల్లాహ్ అంటున్నాడు,

ذَٰلِكُمُ اللَّهُ رَبُّكُمْ لَهُ الْمُلْكُ
(దాలికుముల్లాహు రబ్బుకుమ్ లహుల్ ముల్క్)
ఆయనే అల్లాహ్, మీ ప్రభువు, ఆధిపత్యం ఆయనదే.

وَالَّذِينَ تَدْعُونَ مِنْ دُونِهِ مَا يَمْلِكُونَ مِنْ قِطْمِيرٍ
(వల్లదీన తద్ఊన మిన్ దూనిహీ మా యమ్లికూన మిన్ ఖిత్మీర్)
మరియు ఆయనను వదలి మీరు పిలిచేవారు ఖర్జూరపు బీజంపై ఉండే పొరంత కూడా అధికారం కలిగి లేరు.

ఆయన్ని కాకుండా, ఆయన్ని వదలి మీరు ఎవరెవరినైతే మొరపెట్టుకుంటున్నారో, ఎవరెవరినైతే మీరు పిలుస్తున్నారో, దుఆలు చేస్తున్నారో, మా యమ్లికూన మిన్ ఖిత్మీర్, ఖర్జూరపు బీజంపై ఉన్నటువంటి మరీ పలుచని ఆ పొర అంత మాత్రం శక్తి కూడా వారికి లేదు. మీరు అల్లాహ్‌ను కాకుండా ఎవరినైతే పూజిస్తున్నారో, ఎవరినైతే మొరపెట్టుకుంటున్నారో వారి వద్ద ఖర్జూరపు గుట్లి, దాని యొక్క బీజంపై చాలా పలుచని పొర ఏదైతే ఉంటుందో అంత శక్తి కూడా వారి వద్ద లేదు.

إِنْ تَدْعُوهُمْ لَا يَسْمَعُوا دُعَاءَكُمْ
(ఇన్ తద్ఊహుమ్ లా యస్మఊ దుఆఅకుమ్)
ఒకవేళ నీవు వారిని మొరపెట్టుకుంటే మీ మొరలను వారు ఆలకించలేరు, వినలేరు.

وَلَوْ سَمِعُوا مَا اسْتَجَابُوا لَكُمْ
(వలవ్ సమీఊ మస్తజాబూ లకుమ్)
ఒకవేళ వారు విన్నా, మీకు సమాధానం ఇవ్వలేరు.

లేదు వింటారు, వింటారు, వింటారు అని ఏదైతే మీ విశ్వాసం ఉందో, ఒకవేళ విన్నా గానీ మస్తజాబూ లకుమ్, మీకు ఎలాంటి జవాబ్, సమాధానం ఇవ్వలేరు. అల్లాహ్ అంటున్నాడు, ఒకవేళ మీ యొక్క బలహీన విశ్వాసం ఉంది కదా లేదు వింటున్నారు అని, ఒకవేళ విన్నా గానీ సమాధానం ఏ మాత్రం ఇవ్వలేరు. సహీ బుఖారీలోని మొదటి హదీస్ ఏదైతే వినిపించానో అక్కడ కూడా ప్రవక్త అదే చెప్పారు. ఇప్పుడు వారు వింటున్నారు కానీ జవాబు ఇవ్వలేరు. సమాధానం ఇవ్వలేరు. బదులు పలకలేరు. అల్లాహ్ ఏమంటున్నాడు ఇక్కడ? ఒకవేళ మీ విశ్వాస ప్రకారంగా, ఏదైనా అవసరం పడి, ఏదైనా సందర్భంలో మేము వారికి వినిపించినా గానీ వారు సమాధానం చెప్పలేరు, ఇవ్వలేరు.

وَيَوْمَ الْقِيَامَةِ يَكْفُرُونَ بِشِرْكِكُمْ
మరియు ప్రళయ దినాన వారు మీ షిర్క్‌ను తిరస్కరిస్తారు.

మరియు ప్రళయ దినాన యక్ఫురూన బిషిర్కికుమ్. మీరు అల్లాహ్‌తో పాటు వారిని ఏదైతే సాటి కల్పించారో దీనిని వారు తిరస్కరిస్తారు. తిరస్కరిస్తారు. అల్లాహ్ మీరు అల్లాహ్‌తో పాటు మీరు వారిని ఏదైతే సాటి కల్పిస్తున్నారో వాటి దానిని వారు తిరస్కరిస్తారు. అంటే ఏంటి? అంటే వారికి ఈ విషయం తెలియదు. ఒకవేళ తెలిసేది ఉంటే ఎందుకు తిరస్కరిస్తారు? తెలిసేది ఉంటే ఎందుకు తిరస్కరిస్తారు? మీరు ఇక్కడ మొరపెట్టుకున్న విషయం, అల్లాహ్‌ను కాకుండా వారిని మీరు ఏదైతే దుఆ చేస్తున్నారో ఇవన్నీ విషయాలు వాస్తవానికి వారు వినలేరు, వారికి ఏమాత్రం తెలియదు. అందుగురించే ప్రళయ దినాన ఎప్పుడైతే వీరు వెళ్తారో, అక్కడ కూడా వారు వీరి యొక్క ఈ షిర్క్‌ను తిరస్కరిస్తారు. ఈ తిరస్కరిస్తారు అన్న విషయం బహుశా ఇంకొందరికి అర్థం అవతలేదు అనుకుంటా. సూరె బఖరాలో, సూరె అహ్కాఫ్‌లో 26వ పారా స్టార్టింగ్ ఆయతులలోనే ఐదు ఆరు ఆయతులలోనే అక్కడ విషయం ఉంది. సూరె బఖరాలో రెండవ అధ్యాయం అంటే రెండవ పారా ఏదైతే ఉందో, అందులో సగం అయిన తర్వాత ఇంచుమించు సుమారు ఒక క్వార్టర్ పారా అయిపోయిన తర్వాత

إِذْ تَبَرَّأَ الَّذِينَ اتُّبِعُوا مِنَ الَّذِينَ اتَّبَعُوا وَرَأَوُا الْعَذَابَ وَتَقَطَّعَتْ بِهِمُ الْأَسْبَابُ
(ఆ రోజును గుర్తు చేసుకోండి), ఎప్పుడైతే అనుసరించబడిన వారు తమను అనుసరించిన వారి నుండి వైదొలగిపోతారో, మరియు వారు శిక్షను చూస్తారో, మరియు వారి మధ్య సంబంధాలన్నీ తెగిపోతాయో.

ఆ ఆయతుల సంగతి ఆ ఆయతులను దాని యొక్క వ్యాఖ్యానం చదవండి. ఏమవుతుంది, సహీ బుఖారీలో వివరణ ఉంది. ప్రళయ దినాన ప్రజలందరూ ఆ మైదానే మహ్షర్‌లో జమా అవుతారు కదా, అక్కడ అల్లాహు త’ఆలా ఎవరెవరు ఎవరెవరిని మొరపెట్టుకునేవారో వారి వెంట వెళ్ళండి అని అన్నప్పుడు, ఈ ఇమాములను, పీరీలను, ముర్షదులను, బాబాలను వారందరినీ మొరపెట్టుకునేవారు వారి వారిని వెనుకులాడుతూ ఉంటారు. వెనుకులాడి ఆ మీరే కదా పీరానే పీర్ షేఖ్ అబ్దుల్ ఖాదర్ జీలాని, మీరే కదా పెద్ద గుట్ట వాళ్ళు, మీరే కదా ఈ విధంగా వారి వారి వద్దకు వెళ్లి వారి వెంట ఉండి వారి యొక్క సిఫారసు పొందడానికి వారి వెనక వెళ్లే ప్రయత్నం చేస్తారు ప్రళయ దినాన. అప్పుడు వారు వీరిని చూసి ఓ అల్లాహ్ వీరు మమ్మల్ని పూజించే వారు కాదు, మమ్మల్ని మొరపెట్టుకునే వారు కాదు, వీరు మాకు శత్రువులు, మమ్మల్ని బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, మాకు వీరికి ఎలాంటి సంబంధం లేదు అని స్పష్టంగా చెప్తారు.

సోదరులారా, ఖుర్ఆన్‌లో ఈ ఆయతులు, హదీసుల్లో ఈ విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అసలైన రోగం, అసలైన పెద్ద సమస్య ఏంటంటే ఇలాంటి ఆయతులను ఇలాంటి హదీసులను మనం చదవడం లేదు. ఈ సమాధుల వద్ద ఉండే మౌల్వీలు, ఇలాంటి పండితులు మన సామాన్య ప్రజలకు తెలపడం లేదు. అందుగురించి సామాన్య ప్రజలు ఇలాంటి ఘోరమైన షిర్క్‌లో పడిపోతున్నారు.

అల్లాహు త’ఆలా మనందరికీ సరియైన సన్మార్గం మరియు తౌహీద్, ఈ నిజమైన అఖీదా విశ్వాసానికి సంబంధించిన విషయాలు ఖుర్ఆన్ హదీస్ ఆధారంగా మరిన్ని ఎక్కువగా తెలుసుకునే భాగ్యం అల్లాహ్ కలిగించుగాక. ఈ రోజుల్లో ప్రజలు ఏదైతే షిర్క్‌లో పడి ఉన్నారో వాటి నుండి అల్లాహు త’ఆలా వారిని రక్షించుగాక. జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ : https://teluguislam.net/?p=8426

ఇతరములు:

దుఆ స్వీకరించబడే సమయంలో ఏ దుఆ చేయడం మంచిది? [ఆడియో]

బిస్మిల్లాహ్

(5:29 నిముషాలు)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు. ఇక్కడ ఆడియో వీడియో ఆర్టికల్స్ పొందుతారు ఇన్ షా అల్లాహ్. తప్పక ఈ పేజీని దర్శించండి, ఫార్వర్డ్ చేయండి
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/friday/

ఫిత్నా (ఉపద్రవం,సంక్షోభం) నుండి రక్షణ కొరకు దుఆ [వీడియో]

బిస్మిల్లాహ్

వీడియో వ్యవధి: 4:30 నిముషాలు 

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

اللَّهُمَّ إنِّي أَسألُكَ فِعْلَ الْخَيْرَاتِ، وَتَرْكَ الْمُنْكَرَاتِ، وَحُبَّ الْمَسَاكِينِ، وَأَنْ تَغْفِرَ لِي، وَتَرْحَمَنِي، وَإِذَا أَرَدْتَ فِتْنَةَ قَوْمٍ فَتَوَفَّنِي غَيْرَ مَفْتُونٍ، وَأَسْأَلُكَ حُبَّكَ، وَحُبَّ مَنْ يُحِبُّكَ، وَحُبَّ عَمَلٍ يُقَرِّبُنِي إِلَى حُبِّكَ

అల్లాహుమ్మ ఇన్నీ అస్ అలుక ఫి’అలల్ ఖైరాతి  , వ తర్కల్ మున్కరాతి , వ హుబ్బల్ మసాకీని, వ అన్ తగ్ ఫిరలీ, వ తర్ హమనీ, వ ఇజా అరత్త   ఫిత్నత ఖౌమిన్ ఫతవఫ్ఫనీ గైర మఫ్ తూన్, వ అస్అలుక హుబ్బక, వ హుబ్బ మన్ యుహిబ్బుక, వ హుబ్బ అమలిన్ యుకర్రిబునీ ఇలా హుబ్బిక్ 

ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను నీతో అర్థిస్తున్నాను –  అన్ని రకాల మంచి పనులు చెయ్యాలని, అన్ని రకాల చెడులను వదులుకోవాలని, నిరుపేదల పట్ల ప్రేమగా మసులుకోవాలని. మరియు నా పాపాలను మన్నించు మరియు నన్ను కరుణించు. ఏ సమాజంలో నైనా ఏదైనా ప్రజలకు నీవు వారిని ఫిత్నా (ఉపద్రవంలో సంక్షోభంలో) పడవేయాలని కోరినపుడు, నేను సంక్షోభం లో పడకముందే నాకు చావు ప్రసాదించు. నీతోనే అర్థిస్తున్నాను – నీ ప్రేమ నాకు లభించాలని, నిన్ను ప్రేమించేవారి ప్రేమకూడా నాకు ప్రాప్తించాలని, మరియు ఏ కార్యాలు ఏ మాటలైతే నీ ప్రేమకు మరింత దగ్గరగా,చేరువగా  చేస్తాయో, అలాంటి సత్కార్యాల, మంచి మాటల ప్రేమ కూడా నాకు కలుగజేయుము.

Ahmad 5/243, Al-Haakim 1/521 and At-Tirmidhi 5/369 (with similar wording); declared hasan by At-Tirmidhi who said, “I asked Muhammad bin Isma’il (Al-Bukhari) and he said, “This hadith is hasan sahih.” Additionally, at the end of the hadith, the Prophet  صَلَّى اللّٰهُ عَلَيْهِ وَسَلَّم said, “Verily it is true so learn it and teach it.”“

Source: From the Book “Supplications & Treatment with Ruqyah” ,
Dr. Sa’eed bin Ali Al-Qahtani, Dar-us-Salam Publication

చిన్న దానికి అయినా సరే అల్లాహ్ నుండి సహాయం కోరడం మర్చిపోవద్దు

షేఖ్ ముహమ్మద్ బిన్ సాలీహ్ అల్-ఉతైమీన్ [రహిమహుల్లాహ్ ] ఇలా అన్నారు: "చాలా చిన్న దానికి అయినా సరే అల్లాహ్ నుండి సహాయం కోరడం మర్చిపోవద్దు." [రియాద్ అస్-సాలీహీన్ వ్యాఖ్యానం, (1/273) | ఇంగ్లిష్ అనువాదం: అబ్బాస్ అబూ యాహ్యా హఫిజహుల్లాహ్]

నిద్ర లేశారు, పాపాలు దూరమయ్యాయి! [వీడియో]

బిస్మిల్లాహ్

[కేవలం 3 నిమిషాల వీడియో]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

dua wakeup sleep

నిద్ర మధ్యలో మేల్కొన్న వ్యక్తి చదవవలసిన దుఆ:

“ఎవరు రాత్రి వేళ నిద్ర నుండి మేల్కొని ‘లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీకలహూ, లహుల్‌ ముల్కు వలహుల్‌ హందు, వహువ అలా కుల్లి షైఇన్‌ ఖదీర్‌. అల్‌ హందులిల్లాహ్‌, వ సుబ్‌ హానల్లాహ్‌, వల్లాహు అక్బర్‌, వలాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్‌‘ చదివి, (అల్లాహుమ్మగ్ ఫిర్లీ) ‘అల్లాహ్‌ నన్ను క్షమించు’ అని లేదా మరేదైనా దుఆ చేసుకున్నచో అది అంగీకరింపబడుతుంది. ఒకవేళ వుజూ చేసుకొని నమాజ్‌ చేస్తే అదీ స్వీకరించబడుతుంది”

అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పారని అబూ హురైర (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు. (బుఖారీ 1154).

[ఇది శత సాంప్రదాయాలు (100 Sunnah) పుస్తకం లోని 4 వ టాపిక్]

నమాజు యొక్క దుఆలు మరియు స్మరణలు [పుస్తకం]

బిస్మిల్లాహ్

[ఇక్కడ చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [23 పేజీలు]

విషయ సూచిక

నమాజు యొక్క దుఆలు – స్మరణలు

1- వుజూకు ముందు పలకండి

బిస్మిల్లాహ్.
(అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను). (అబూ దావూద్ 101).

2- వుజూ తర్వాత చదవండి

أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ
అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ.

అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు ఎవ్వడూ లేడని ఆయన ఏకైకుడని, ఆయనకు ఎవరు భాగస్వాములు లేరని సాక్ష్యమిచ్చుచున్నాను. మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు మరియు ప్రవక్త అని కూడా సాక్ష్యమిచ్చుచున్నాను. (ముస్లిం 234).

3- అజాన్ సమాధానం, దాని పిదప దుఆ

అజాన్ విన్నప్పుడు ముఅజ్జిన్ అన్నట్లు మీరు అనండి, కాని అతను “హయ్య అలస్సలాహ్, హయ్య అలల్ ఫలాహ్” అన్నప్పుడు మాత్రం “లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” (పుణ్యం చేసే మరియు పాపల నుండి దూరం ఉండే భాగ్యం  అల్లాహ్ యే ప్రసా దించువాడు) అనండి. ఆ తర్వాత దరూదె ఇబ్రాహీం చదవండి. ఆ తర్వాత ఈ దుఆ కూడా చదవండిః

اللَّهُمَّ رَبَّ هَذِهِ الدَّعْوَةِ التَّامَّةِ وَالصَّلَاةِ الْقَائِمَةِ آتِ مُحَمَّدًا الْوَسِيلَةَ وَالْفَضِيلَةَ وَابْعَثْهُ مَقَامًا مَحْمُودًا الَّذِي وَعَدْتَهُ
అల్లాహుమ్మ రబ్బ హాజిహిద్ దఅవతిత్తామ్మతి వస్సలాతిల్ ఖాఇమతి ఆతి ముహమ్మదనిల్ వసీలత వల్ ఫజీలత వబ్అస్ హు మఖామమ్ మహ్మూద నిల్లజీ వఅత్తహూ. (బుఖారి 614).

ఈ పరిపూర్ణ ఆహ్వానం మరియు స్థాపించబడే నమాజు యొక్క ప్రభువైన అల్లాహ్! ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు వసీల మరియు ఘనతలు ప్రసాదించు. మరియు నీవు వాగ్దానం చేసిన ‘మఖామె మహ్మూద్’ (ప్రశంసనీయమైన స్థానం) ప్రతిష్ఠింప జేయి).

పై దుఆలో పరిపూర్ణ ఆహ్వానం అంటే అజాన్ అని, వసీల అంటే స్వర్గంలో ఓ ఉన్నత స్థానం అని, అల్లాహ్ దాసుల్లో కేవలం ఒక్కడే దానికి అర్హుడు అని అర్థం. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు: “ఆ ఒక్కణ్ణి నేనే అవుతానని ఆశిస్తున్నాను.”

4- మస్జిదు వైపునకు వెళ్తూ చదవండి

اللَّهُمَّ اجْعَلْ فِي قَلْبِي نُورًا وَفِي لِسَانِي نُورًا وَاجْعَلْ فِي سَمْعِي نُورًا وَاجْعَلْ فِي بَصَرِي نُورًا وَاجْعَلْ مِنْ خَلْفِي نُورًا وَمِنْ أَمَامِي نُورًا وَاجْعَلْ مِنْ فَوْقِي نُورًا وَمِنْ تَحْتِي نُورًا اللَّهُمَّ أَعْطِنِي نُورًا

అల్లాహుమ్మజ్అల్ ఫీ ఖల్ బీ నూరా, వ ఫీ లిసానీ నూరా, వజ్అల్ ఫీ సమ్ఈ నూరా, వజ్అల్ ఫీ బసరీ నూరా, వజ్అల్ మిన్ ఖల్ ఫీ నూరా, వ మిన్ అమామీ నూరా, వజ్అల్ మిన్ ఫౌఖీ నూరా, వమిన్ తహ్ తీ నూరా, అల్లాహుమ్మ అఅతినీ నూరా. (ముస్లిం 763, బుఖారి 6316).

(ఓ అల్లాహ్ నా హృదయంలో వెలుగు ప్రసాదించు, నా నాలుకలో వెలుగు ప్రసాదించు, నా చెవిలో వెలుగు ప్రసాదించు, నా కళ్ళలో వెలుగు ప్రసా- దించు, నా వెనక వెలుగు ప్రసాదించు, నా ముందు వెలుగు ప్రసాదించు, నా పైన వెలుగు ప్రసాదించు, నా క్రింద వెలుగు ప్రసాదించు. ఓ అల్లాహ్ నాకు (ప్రళయ దినాన) వెలుగు ప్రసాదించు).

వెలుగు అంటే ధర్మం మరియు సత్యాన్ని స్పష్ట పరచడం అని భావం.    

5- మస్జిదులో ప్రవేశించినప్పుడు చదవండి

اللَّهُمَّ افْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ
అల్లాహుమ్మఫ్ తహ్ లీ అబ్వాబ రహ్మతిక.

(ఓ అల్లాహ్ నా కొరకు నీ కరుణ ద్వారాలను తెరుచు). (ముస్లిం 713).

6- మస్జిద్ నుండి బైటికి వెళ్తూ చదవండి

اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ فَضْلِكَ
అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక మిన్ ఫజ్లిక.

(ఓ అల్లాహ్ నీతో నీ దయను కోరుతున్నాను.) (ముస్లిం 713).

7- తక్బీరె తహ్రీమ తర్వాత చదవండి

1- అల్లాహుమ్మ బాఇద్ బైనీ వ బైన ఖతాయాయ కమా బాఅత్త బైనల్ మష్రిఖి వల్ మఘ్రిబి అల్లాహుమ్మ నఖ్ఖినీ మినల్ ఖతాయా కమా యునఖ్ఖస్సౌబుల్ అబ్ యజు మినద్దనసి అల్లాహుమ్మగ్ సిల్ ఖతాయాయ బిల్ మాఇ వస్సల్ జి వల్ బరద్.

اللَّهُمَّ بَاعِدْ بَيْنِي وَبَيْنَ خَطَايَايَ كَمَا بَاعَدْتَ بَيْنَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ اللَّهُمَّ نَقِّنِي مِنْ الْخَطَايَا كَمَا يُنَقَّى الثَّوْبُ الْأَبْيَضُ مِنْ الدَّنَسِ اللَّهُمَّ اغْسِلْ خَطَايَايَ بِالْمَاءِ وَالثَّلْجِ وَالْبَرَدِ

(ఓ అల్లాహ్ తూర్పు పడమరల మధ్య ఎంత దూరం ఉంచావో నన్ను పాపాలకు అంతే దూరంగా ఉంచు. ఓ అల్లాహ్ మాసిన బట్ట తెల్లనిబట్టలా ఎలా శుభ్రమవుతుందో నా పాపాలను అలా శుద్ధి చెయ్యి. నా పాపాలను నీరు, మంచు, వడగండ్లతో కడిగివెయ్యి). (బుఖారి 744, ముస్లిం 598).

2- సుబ్ హానకల్లాహుమ్మ వ బిహమ్దిక వ తబార కస్ముక వ తఆలా జద్దుక వ లాఇలాహ ఘైరుక.

سُبْحَانَكَ اللَّهُمَّ وَبِحَمْدِكَ وَتَبَارَكَ اسْمُكَ وَتَعَالَى جَدُّكَ وَلَا إِلَهَ غَيْرُكَ

(అల్లాహ్ నీవు అన్ని రకాల లోపాలకు అతీతునివి, నీకే సర్వ స్తోత్రములు, నీ నామమే శుభము గలది. నీ ఔన్నత్యం, అనుగ్రహం ఉన్నతమైనది. నీవు తప్ప సత్యమైన ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు. (అబూదావూద్ 775, తిర్మిజి 242. అల్బానీ సహీ అని అన్నారు).

3- అల్ హందులిల్లాహి హందన్ కసీరన్ తయ్యిబమ్ ముబారకన్ ఫీహ్.

الْحَمْدُ لِله حَمْدًا كَثِيرًا طَيِّبًا مُبَارَكًا فِيهِ

(ఎనలేని ఉత్తమమైన, శుభప్రదమైన స్తోత్రములు అల్లాహ్ కొరకే). (ముస్లిం 600).

4- అల్లాహు అక్బరు కబీరా వల్ హందు లిల్హాహి కసీరా వ సుబ్ హానల్లాహి బుక్రతవ్ వ అసీలా.

اللهُ أَكْبَرُ كَبِيرًا وَالْحَمْدُ لِله كَثِيرًا وَسُبْحَانَ الله بُكْرَةً وَأَصِيلًا

(అల్లాహ్ చాలా గొప్పవాడు, ఎనలేని స్తోత్రములు అల్లాహ్ కొరకే, ఉదయం, సాయంత్రం ఆయనకే పవిత్రతలు). (ముస్లిం 601).

5- అల్లాహుమ్మ రబ్బ జిబ్రాఈల వ మీకాఈల వ ఇస్రాఫీల ఫాతిరస్ సమావాతి వల్ అర్జి ఆలిమల్ గైబి వష్షహాదతి అంత తహ్ కుము బైన ఇబాదిక ఫీమా కానూ ఫీహి యఖ్తలిఫూన్ ఇహ్ దినీ లిమఖ్ తులిఫ ఫీహి మినల్ హఖ్ఖి బిఇజ్నిక ఇన్నక తహ్ దీ మన్ తషాఉ ఇలా సిరాతిమ్ ముస్తఖీం.

اللَّهُمَّ رَبَّ جَبْرَائِيلَ وَمِيكَائِيلَ وَإِسْرَافِيلَ فَاطِرَ السَّمَاوَاتِ وَالْأَرْضِ عَالِمَ الْغَيْبِ وَالشَّهَادَةِ أَنْتَ تَحْكُمُ بَيْنَ عِبَادِكَ فِيمَا كَانُوا فِيهِ يَخْتَلِفُونَ اهْدِنِي لِمَا اخْتُلِفَ فِيهِ مِنْ الْحَقِّ بِإِذْنِكَ إِنَّكَ تَهْدِي مَنْ تَشَاءُ إِلَى صِرَاطٍ مُسْتَقِيمٍ

(ఓ అల్లాహ్! జిబ్రాఈల్, మీకాఈల్ మరియు ఇస్రాఫీల్ యొక్క ప్రభువా! భూమ్యాకాశాల సృష్టికర్తా! గోచర అగోచరాల జ్ఞానీ! నీవే నీ దాసుల మధ్య ఉన్న విభేదాలను గురించి తీర్పు చేయువానివి. ఏ సత్య విషయంలో విభేదించడం జరిగినదో అందులో నీ దయతో నాకు మార్గం చూపుము, నిశ్చయంగా నీవు కోరినవారికి సన్మార్గం చూపుతావు). (ముస్లిం 770).

6- వజ్జహ్ తు వజ్ హియ లిల్లజీ ఫతరస్సమావాతి వల్ అర్ జ హనీఫవ్ వమా అన మినల్ ముష్రికీన్ ఇన్న సలాతీ వ నుసుకీ వ మహ్ యాయ వ మమాతీ లిల్లాహి రబ్బిల్ ఆలమీన్ లా షరీక లహూ వ బిజాలిక ఉమిర్తు వ అన అవ్వలుల్ ముస్లిమీన్ అల్లా హుమ్మ అంతల్ మలికు లాఇలాహ ఇల్లా అంత, అంత రబ్బీ వ అన అబ్దుక జలంతు నఫ్సీ వఅతరఫ్ తు బిజంబీ ఫగ్పిర్ లీ జునూబీ జమీఅన్ ఇన్నహూ లా యగ్ఫిరుజ్జునూబ ఇల్లా అంత వహ్ దినీ లిఅహ్ సనిల్ అఖ్లాఖి లా యహ్ దీ లిఅహ్ సనిహా ఇల్లా అంత వస్రిఫ్ అన్నీ సయ్యిఅహా లా యస్రిఫ్ అన్నీ సయ్యిఅహా ఇల్లా అంత లబ్బైక వ సఅదైక వల్ ఖైరు కుల్లుహూ ఫీ యదైక వష్షర్రు లైస ఇలైక అన బిక వ ఇలైక తబారక్త వ తఆలైత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక.

وَجَّهْتُ وَجْهِيَ لِلَّذِي فَطَرَ السَّمَاوَاتِ وَالْأَرْضَ حَنِيفًا وَمَا أَنَا مِنْ الْمُشْرِكِينَ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لِله رَبِّ الْعَالَمِينَ لَا شَرِيكَ لَهُ وَبِذَلِكَ أُمِرْتُ وَأَنَا مِنْ الْمُسْلِمِينَ اللَّهُمَّ أَنْتَ الْمَلِكُ لَا إِلَهَ إِلَّا أَنْتَ أَنْتَ رَبِّي وَأَنَا عَبْدُكَ ظَلَمْتُ نَفْسِي وَاعْتَرَفْتُ بِذَنْبِي فَاغْفِرْ لِي ذُنُوبِي جَمِيعًا إِنَّهُ لَا يَغْفِرُ الذُّنُوبَ إِلَّا أَنْتَ وَاهْدِنِي لِأَحْسَنِ الْأَخْلَاقِ لَا يَهْدِي لِأَحْسَنِهَا إِلَّا أَنْتَ وَاصْرِفْ عَنِّي سَيِّئَهَا لَا يَصْرِفُ عَنِّي سَيِّئَهَا إِلَّا أَنْتَ لَبَّيْكَ وَسَعْدَيْكَ وَالْخَيْرُ كُلُّهُ فِي يَدَيْكَ وَالشَّرُّ لَيْسَ إِلَيْكَ أَنَا بِكَ وَإِلَيْكَ تَبَارَكْتَ وَتَعَالَيْتَ أَسْتَغْفِرُكَ وَأَتُوبُ إِلَيْكَ

(నేను నా ముఖాన్ని ఏకాగ్రచిత్తంతో భూమ్యాకాశాలను సృష్టించిన వాని వైపునకు త్రిప్పుకుంటున్నాను. నేను బహుదైవారాధకులలోని వాడిని కాను. నా నమాజ్, నా ఖుర్బానీ, నా జీవనం మరియు నా మరణం సర్వ లోక ప్రభువైన అల్లాహ్ కే అంకితం. ఆయన సహవర్తులెవరూ లేనివాడు. నాకు దీని గురించిన ఆజ్ఞే ఇవ్వబడింది. నేను ముస్లింలలోని వాడిని. ఓ అల్లాహ్! నీవే యజమానివి. నీవే ఆరాధ్యుడవు. నీవు తప్ప మరో ఆరాధ్యుడు లేడు. నీవే నా ప్రభువువి. నేను నీ దాసుడిని. నేను నా ఆత్మకు అన్యాయం చేసుకున్నాను. నేను నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను. కనుక నా పాపాలన్నింటినీ మన్నించు. నీవు తప్ప పాపాలను మన్నిం చగల వాడెవడూ లేడు. నన్ను సêత్పవర్తన వైపునకు నడిపించు, సêత్పవర్తన వైపునకు మార్గదర్శకత్వం చూపేవాడు నీవు తప్ప ఎవ్వడూ లేడు. నా దుర్గుణాలను నా నుండి దూరం చెయ్యి. నన్ను దుర్గుణాల నుండి దూరం చేయువాడు నీ తప్ప ఎవ్వడూ లేడు. నీ సమక్షంలో హాజరవుతున్నాను. దీనిని నా అదృష్టంగా భావిస్తున్నాను. సర్వ మేళ్ళు నీ స్వాధీనంలో ఉన్నాయి. నీ తరఫు నుండి ఎన్నటికీ కీడు ఉండదు. నేను నీ వల్లనే ఉన్నాను. నీ వైపే మరలుతాను. నీవు  శుభప్రదమైనవాడివి, ఉన్నతుడివి. పాపాల మన్నింపుకై నిన్నే వేడుకుంటున్నాను. పశ్చాత్తాప భావంతో నీ వైపునకే మరలుతున్నాను. (ముస్లిం 771).

8- రుకూలో చదవండి

1- సుబ్ హాన రబ్బియల్ అజీం      سُبْحَانَ رَبِّيَ الْعَظِيم                               

(ఘనుడైన నా ప్రభువు పరిశుద్ధుడు).                             
పై దుఆ కనీసం ఒకసారైనా అనడం విధిగా ఉంది. అంతకు ఎక్కువగా అనడం ఉత్తమం.(ముస్లిం 773).  

2- సుబ్ హానకల్లాహుమ్మ రబ్బనా వ బిహమ్దిక అల్లాహుమ్మగ్ ఫిర్లీ.

سُبْحَانَكَ اللَّهُمَّ رَبَّنَا وَبِحَمْدِكَ اللَّهُمَّ اغْفِرْلِي

(మా ప్రభువైన ఓ అల్లాహ్ నీవు పరిశుద్ధునివి, నీకే స్తోత్రములు, ఓ అల్లాహ్ నన్ను మన్నించు). (బుఖారి 794, ముస్లిం 484).

3- సుబ్బూహున్ ఖుద్దూసున్ రబ్బుల్ మలాఇకతి వర్రూహ్.

سُبُّوحٌ قُدُّوسٌ رَبُّ الْـمَلَائِكَةِ وَالرُّوحُ
(దైవదూతలు మరియు జిబ్రీల్ యొక్క ప్రభువు పరిశుద్ధుడు, పరమ పవిత్రుడు). (ముస్లిం 487).

4- సుబ్ హాన జిల్ జబరూతి వల్ మలకూతి వల్ కిబ్రియాఇ వల్ అజమహ్.

سُبْحَانَ ذِي الجَبَرُوتِ وَالمَلَكُوتِ وَالْكِبرِيَاءِ وَالْعَظمَةِ

(సార్వభౌమాధికారి, సర్వాధిపతి, గొప్పవాడు మరియు ఘనుడు అయిన అల్లాహ్ ఎంతో పరిశుద్ధుడు).
(అబూదావూద్ 873, షేఖ్ అల్బానీ సహీ అని అన్నారు).

5- అల్లాహుమ్మ లక రకఅతు వ బిక ఆమంతు వ లక అస్లమ్ తు ఖషఅ లక సమ్ఈ వ బసరీ వ ముఖ్ఖీ వ అజమీ వ అసబీ.

اللَّهُمَّ لَكَ رَكَعْتُ وَبِكَ آمَنْتُ وَلَكَ أَسْلَمْتُ خَشَعَ لَكَ سَمْعِي وَبَصَرِيْ وَمُخِّي وَعَظَمِي وَعَصَبِي

(అల్లాహ్ నీ కొరకు రుకూ చేశాను. నిన్ను విశ్వసిం చాను. నీకే శిరసవహించాను. నా చెవులు, కళ్ళు, మెదడు, ఎముక మరియు నరాలు నీ కొరకే నమ్రత చూపుతున్నాయి). (ముస్లిం 771).

9- రుకూ నుండి నిలబడి చదవండి

1- రబ్బనా లకల్ హమ్ద్. رَبَّنَا لَكَ الحَمْد (బుఖారి 722). 

లేదా – రబ్బనా వలకల్ హమ్ద్   رَبَّنَا وَلَكَ الحَمْد                                                                        
(సర్వ స్తోత్రములు నీకే ఓ మా ప్రభువా). (బుఖారి 689, ముస్లిం 392).

లేదా – అల్లాహుమ్మ రబ్బనా లకల్ హమ్ద్.  اللَّهُمَّ رَبَّنَا لَكَ الحَمْد (బుఖారి 796, ముస్లిం 404).

లేదా – అల్లాహుమ్మ రబ్బనా వలకల్ హమ్ద్.  اللَّهُمَّ رَبَّنَا وَلَكَ الحَمْد
(ఓ అల్లాహ్! ఓ మా ప్రభువా! సర్వ స్తోత్రములు నీకే). (బుఖారి 795).  

నోట్: కొందరు ‘రబ్బనా లకల్ హందు వష్షుక్ర్’ అని అంటారు. అయితే దీని ప్రస్తావన ఏ హదీసులో రాలేదు, (గనక దానిని వదలుకోవాలి).

2- అల్లాహుమ్మ రబ్బనా లకల్ హందు మిల్ అస్సమావాతి వ మిల్అల్ అర్జి వ మిల్అ మా బైనహుమా వ మిల్అ మా షిఅత మిన్ షైఇమ్ బఅదు.

اللَّهُمَّ رَبَّنَا لَكَ الْحَمْدُ مِلْءَ السَّمَاوَاتِ وَمِلْءَ الْأَرْضِ وَمِلْءَ مَا بَيْنَهُمَا وَمِلْءَ مَا شِئْتَ مِنْ شَيْءٍ بَعْدُ

(మా ప్రభువైన ఓ అల్లాహ్! ఆకాశాలు నిండిపోయేంత, భూమి నిండి పోయేంత, భూమ్యాకాశాల మధ్య నిండిపోయేంత మరియు ఆ తర్వాత నీవు కోరిన ప్రతీది నిండిపోయేంత ప్రశంసలు నీ కొరకే). (ముస్లిం 476).

3- రబ్బనా లకల్ హందు మిల్ఉస్సమావాతి వల్ అర్జి వ మిల్ఉ మా షిఅత మిన్ షైఇమ్ బఅదు అహ్ లస్సనాఇ వల్ మజ్ది అహఖ్ఖు మా ఖాలల్ అబ్దు వ కుల్లునా లక అబ్దున్, అల్లాహుమ్మ లా మానిఅ లిమా అఅతైత వ లా ముఅతియ లిమా మనఅత వలా యన్ ఫఉ జల్ జద్ది మిన్కల్ జద్దు. (ముస్లిం 477).

رَبَّنَا لَكَ الْحَمْدُ مِلْءُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمِلْءُ مَا شِئْتَ مِنْ شَيْءٍ بَعْدُ أَهْلَ الثَّنَاءِ  وَالْمَجْدِ أَحَقُّ مَا قَالَ الْعَبْدُ وَكُلُّنَا لَكَ عَبْدٌ اللَّهُمَّ لَا مَانِعَ لِمَا أَعْطَيْتَ وَلَا مُعْطِيَ لِمَا مَنَعْتَ وَلَا يَنْفَعُ ذَا الْجَدِّ مِنْكَ الْجَدُّ

(భూమ్యాకాశాలు నిండిపోవునంత, ఆ తర్వాత నీవు కోరిన ప్రతీది నిండి- పోవునంత ప్రశంసలు నీ కొరకే ఓ మా ప్రభువా! ఘనతలకు, పొగడ్తలకు అధిపతి అయిన, దాసుడు పొగిడే దానికి నీవు అర్హుడవైనవాడా!. మేమందరమూ నీకే దాసులం. ఓ అల్లాహ్! నీవు ప్రసాదించే దానిని అడ్డుకునేవాడెవడూ లేడు. నీవు ఇవ్వని దానిని ఇచ్చేవాడూ లేడు. ఎవరి పెద్దరికం, ఐశ్వర్యం నీ శిక్ష ముందు వారికి లాభం చేకూర్చ లేవు).

4- రబ్బనా వలకల్ హందు హందన్ కసీరన్ తయ్యిబమ్ ముబారకన్ ఫీహ్.

رَبَّنَا وَلَكَ الْحَمْدُ حَمْدًا كَثِيرًا طَيِّبًا مُبَارَكًا فِيهِ
(మా ప్రభువా! ఎనలేని ఉత్తమమైన, శుభప్రదమైన స్తోత్రములు నీకే).(బుఖారి 799).

10- సజ్దాలో చదవండి

1-    సుబ్ హాన రబ్బియల్ అఅలా.   سُبْحَانَ رَبِّيَ الأعلَى

(ఉన్నతుడైన నా ప్రభువు పరిశుద్ధుడు). (ముస్లిం 772).
ఒక్కసారి చదవడం విధిగా ఉంది. ఎక్కువ సార్లు చదవడం చాలా మంచిది.

2- సుబ్ హానకల్లాహుమ్మ రబ్బనా వ బిహమ్దిక అల్లాహుమ్ మగ్ఫిర్లీ.

سُبْحَانَكَ اللَّهُمَّ رَبَّنَا وَبِحَمْدِكَ اللَّهُمَّ اغْفِرْلِي
(మా ప్రభువైన ఓ అల్లాహ్ నీవు పరిశుద్ధునివి, నీకే స్తోత్రములు, ఓ అల్లాహ్ నన్ను మన్నించు). (బుఖారి 794, ముస్లిం 484).

3- సుబ్బూహున్ ఖుద్దూసున్ రబ్బుల్ మలా ఇకతి వర్రూహ్.

سُبُّوحٌ قُدُّوسٌ رَبُّ الْـمَلَائِكَةِ وَالرُّوحُ
(దైవదూతలు మరియు జిబ్రీల్ యొక్క ప్రభువు పరిశుద్ధుడు, పరమపవిత్రుడు). (ముస్లిం 487).

4- సుబ్ హాన జిల్ జబరూతి వల్ మలకూతి వల్ కిబ్రియాఇ వల్ అజమహ్

سُبْحَانَ ذِي الجَبَرُوتِ وَالمَلَكُوتِ وَالْكِبرِيَاءِ وَالْعَظْمَةِ
(సార్వభౌమాధికారి, సర్వాధిపతి, గొప్పవాడు మరియు ఘనుడు అయిన అల్లాహ్ ఎంతో పరిశుద్ధుడు
(అబూదావూద్ 873, నిసాయి 1049. అల్బానీ ఈ హదీసు సహీ అని అన్నారు).

5- అల్లాహుమ్మగ్ఫిర్లీ జంబీ కుల్లహూ దిఖ్ఖహూ వ జిల్లహు వ అవ్వలహూ వ ఆఖిరహూ వ అలానియతహూ వ సిర్రహూ.

اللَّهُمَّ اغْفِرْلِي ذَنْبِي كُلَّهُ دِقَّهُ وَجِلَّهُ وَأوَّلَهُ وَآخِرَهُ وَعَلَانِيَتَهُ وَسِرَّهُ
(ఓ అల్లాహ్! నా చిన్నా పెద్ద, ముందు వెనక, బహిర్గ తమైన, రహస్యమైన పాపాలన్నిటినీ క్షమించు). (ముస్లిం 483).

6- అల్లాహుమ్మ లక సజత్తు వ బిక ఆమంతు వ లక అస్లమ్ తు సజద వజ్ హియ లిల్లజీ ఖలకహు వ సవ్వరహు వ షక్క సమ్అహు వ బసరహు తబారకల్లాహు అహ్ సనుల్ ఖాలికీన్.

اللَّهُمَّ لَكَ سَجَدْتُ وَبِكَ آمَنْتُ وَلَكَ أَسْلَمْتُ سَجَدَ وَجْهِي لِلَّذِي خَلَقَهُ وَصَوَّرَهُ وَشَقَّ سَمْعَهُ وَبَصَرَهُ تَبَارَكَ اللَّهُ أَحْسَنُ الْخَالِقِينَ
(ఓ అల్లాహ్ నేను నీ కొరకు సజ్దా చేశాను, నిన్ను విశ్వసించాను, నీకే శిరసవహించాను, నా ముఖం దానిని సృష్టించిన, ఆకారం ఇచ్చిన, చెవి, కళ్ళు ఇచ్చిన అల్లాహ్ కు సజ్దా చేసింది. అతి ఉత్తమ సృష్టికర్త అయిన అల్లాహ్ చాలా శుభాలు కలవాడు). (ముస్లిం 771).

7- అల్లాహుమ్మ అఊజు బిరిజాక మిన్ సఖతిక వ బిముఆఫాతిక మిన్ ఉఖూబతిక వ అఊజు బిక మిన్క లా ఉహ్ సీ సనాఅన్ అలైక అంత కమా అస్నైత అలా నఫ్సిక.

اللَّهُمَّ أَعُوذُ بِرِضَاكَ مِنْ سَخَطِكَ وَبِمُعَافَاتِكَ مِنْ عُقُوبَتِكَ وَأَعُوذُ بِكَ مِنْكَ لَا أُحْصِي ثَنَاءً عَلَيْكَ أَنْتَ كَمَا أَثْنَيْتَ عَلَى نَفْسِكَ
(ఓ అల్లాహ్! నీ అప్రసన్నత నుండి నీ ప్రసన్నత శరణు, నీ శిక్ష నుండి నీ మన్నింపు శరణు కోరుతున్నాను. నిన్ను నీవు ఎలా స్తుతించుకున్నావో అలా నేను నీ స్తోత్రాలను లెక్కించలేను).(ముస్లిం 486).

సజ్దాలో ఉన్నప్పుడు ఎక్కువగా దుఆ చేయడం మంచిది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం ఈ హదీసు ఆధారంగాః “దాసుడు తన ప్రభువుకు అత్యంత సమీపంగా ఉండేది సజ్దా స్థితిలో. అందుకు మీరు అందులో దుఆ ఎక్కు వగా చేయండి”. (ముస్లిం 482).

11- రెండు సజ్దాల మధ్యలో చదవండి

1- రబ్బిగ్ ఫిర్లీ, రబ్బిగ్ ఫిర్లీ.     رَبِّ اغْفِرْ لِي ، رَبِّ اغْفِرْ لِي                                
(ప్రభువా నా పాపాలను మన్నించు). (అబూదావూద్ 874).

2- అల్లాహుమ్ మగ్ఫిర్లీ వర్ హమ్నీ వ ఆఫినీ వహ్ దినీ వర్ జుఖ్నీ

اللَّهُمَّ اغْفِرْلِي وَارْحَمْنِي وَعَافِنِي وَاهْدِنِي وَارْزُقْنِي
(ఓ అల్లాహ్ నన్ను క్షమించు, కరుణించు, నాకు స్వస్తత, సన్మార్గం మరియు ఆహారం ప్రసాదించు). (అబూదావూద్ 850).

12- తషహ్హుద్ లో చదవండి

అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వరహ్మతుల్లాహి వబరకాతుహూ అస్సలాము అలైనా వఅలా ఇబాదిల్లాహిస్సాలిహీన్ అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వఅష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వరసూలుహు. (బుఖారి 831).

التَّحِيَّاتُ لله وَالصَّلَوَاتُ وَالطَّيِّبَاتُ السَّلَامُ عَلَيْكَ أَيُّهَا النَّبِيُّ وَرَحْمَةُ الله وَبَرَكَاتُهُ السَّلَامُ عَلَيْنَا وَعَلَى عِبَادِ الله الصَّالِحِينَ أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه

(నా వాక్కు, దేహా, ధన సంబంధమైన ఆరాధనలన్ని యూ అల్లాహ్ కొరకే ఉన్నవి. ఓ ప్రవక్తా! మీపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు ఆయన శుభాలు కురువుగాకా. అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. ముహమ్మద్ అల్లాహ్ యొక్క దాసుడు, సందేశహరుడని సాక్ష్యమిస్తున్నాను).

అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదివ్ వఅలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదివ్ వఅలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్ త అలా ఇబ్రా హీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదు మ్మజీద్. (బుఖారి 3370).

اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ كَمَا صَلَّيْتَ عَلَى إِبْرَاهِيمَ وَعَلَى آلِ إِبْرَاهِيمَ إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ اللَّهُمَّ بَارِكْ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ كَمَا بَارَكْتَ عَلَى إِبْرَاهِيمَ وَعَلَى آلِ إِبْرَاهِيمَ إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ

(ఓ అల్లాహ్ నీవు ఇబ్రాహీంను, వారి కుటుంబీకులను కరుణించినట్లు ముహమ్మద్ మరియు వారి కుటుంబీకులను కరుణించు. నిశ్చయంగా నీవు స్తోత్రాలకు అర్హునివి. ఘనుడివి. ఓ అల్లాహ్ నీవు ఇబ్రాహీం, వారి కుటుంబీకులకు శుభాలు దయ చేసినట్లు ముహమ్మద్, వారి కుటుంబీకులకు శుభాలు దయ చేయుము. నిశ్చయంగా నీవు స్తోత్రాలకు అర్హునివి. ఘనుడివి.).

13- తషహ్హుద్ తర్వాత చదవండి

1- అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మిన్ అజా బిల్ ఖబ్రి వమిన్ అజాబిన్నారి వమిన్ ఫిత్నతి ల్ మహ్ యా వల్ మమాతి వమిన్ ఫిత్నతిల్ మసీహిద్దజ్జాల్.

اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ عَذَابِ الْقَبْرِ وَمِنْ عَذَابِ النَّارِ وَمِنْ فِتْنَةِ الْمَحْيَا وَالْمَمَاتِ وَمِنْ فِتْنَةِ الْمَسِيحِ الدَّجَّالِ

(ఓ అల్లాహ్! సమాధి శిక్ష నుండి, నరక యాతన నుండి, జీవన్మర ణాల విపత్తు నుండి మరియు మసీహుద్దజ్జాల్ ఉపద్రవం  నుండి నీ శరణు వేడుచున్నాను.) (బుఖారి 1377, ముస్లిం 588).

2- అల్లాహుమ్మ ఇన్నీ జలమ్తు నఫ్సీ జుల్మన్ కసీరవ్ వలా యగ్ఫిరుజ్జునూబ ఇల్లా అంత ఫగ్ఫిర్లీ మగ్ఫిరతమ్ మిన్ ఇందిక వర్ హమ్నీ ఇన్నక అంతల్ గఫూరుర్రహీం.

اللَّهُمَّ إِنِّي ظَلَمْتُ نَفْسِي ظُلْمًا كَثِيرًا وَلَا يَغْفِرُ الذُّنُوبَ إِلَّا أَنْتَ فَاغْفِرْ لِي مَغْفِرَةً مِنْ عِنْدِكَ وَارْحَمْنِي إِنَّك أَنْتَ الْغَفُورُ الرَّحِيمُ

(ఓ అల్లాహ్ నా ఆత్మకు నేను చాలా అన్యాయం చేసు కున్నాను. నీవు తప్ప పాపాలను క్షమించేవారు మరెవ్వరూ లేరు. నీవు నీ ప్రత్యేక అనుగ్రహంతో నన్ను క్షమించు, నా మీద దయచూపు, నిశ్చ యంగా నీవు క్షమించే- వాడవు, కరుణామయుడవు). (బుఖారి 834).

3- అల్లాహుమ్ మగ్ఫిర్లీ మా ఖద్దమ్తు వమా అఖ్ఖర్తు వమా అస్ రర్తు వమా అఅలన్తు వమా అస్ రఫ్తు వమా అంత అఅలము బిహీ మిన్నీ అంతల్ ముఖద్దిము వ అంతల్ ముఅఖ్ఖిరు లా ఇలాహ ఇల్లా అంత.

اللَّهُمَّ اغْفِرْ لِي مَا قَدَّمْتُ وَمَا أَخَّرْتُ وَمَا أَسْرَرْتُ وَمَا أَعْلَنْتُ وَمَا أَسْرَفْتُ وَمَا أَنْتَ أَعْلَمُ بِهِ مِنِّي أَنْتَ الْمُقَدِّمُ وَأَنْتَ الْمُؤَخِّرُ لَا إِلَهَ إِلَّا أَنْتَ

(అల్లాహ్! నా పూర్వ పాపాలను, జరగబోయే పాపాలను, రహస్యంగా చేసిన పాపాలను, బహిరంగంగా చేసిన పాపాలను మరియు నా మితిమీరినతనాన్ని కూడా క్షమించు. మరికొన్ని పాపాలు ఉండవచ్చు, వాటి గురించి నా కంటే ఎక్కువ నీకే బాగా తెలుసు, వాటిని కూడా నీవు క్షమించు. ముందుకు నడిపించేవాడివి, వెనక్కి నెట్టేవాడివి నీవే. నీవు తప్ప వెరొక ఆరాధ్యుడు లేడు).

4- అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మినల్ అజ్ జి వల్ కసలి వల్ జుబ్ని వల్ హరమి వల్ బుఖ్ లి వ అఊజు బిక మిన్ అజాబిల్ ఖబ్రి వమిన్ ఫిత్నతిల్ మహ్ యా వల్ మమాత్.

اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ الْعَجْزِ وَالْكَسَلِ وَالْجُبْنِ وَالْهَرَمِ وَالْبُخْلِ وَأَعُوذُ بِكَ مِنْ عَذَابِ الْقَبْرِ وَمِنْ فِتْنَةِ الْمَحْيَا وَالْمَمَاتِ

(ఓ అల్లాహ్ (మంచి పనులు) చేయలేకపోవటం నుంచి, శక్తి ఉండ కూడా సోమరితనానికి లోనవటం నుంచి, పిరికితనం నుంచి, నికృష్టమైన వృద్ధాప్యం నుంచి నీ శరణు కోరుతున్నాను. ఇంకా సమాధి శిక్ష నుండి మరియు జీవన్మరణాల ఉపద్రవం నుంచి నీ శరణు కోరుతున్నాను). (ముస్లిం 2706, బుఖారి 2823).

14- సలాంకు ముందు ఎక్కువ దుఆ చేయాలి

అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించిన ఓ హదీసులో తషహ్హుద్ దుఆ నేర్పుతూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: “ఆ తర్వాత తనకిష్టమైన దుఆ చేసుకోవాలి”. (బుఖారి 835).

15- నమాజ్ తర్వాత జిక్ర్

1-అస్తగ్ ఫిరుల్లాహ్ , అస్తగ్ ఫిరుల్లాహ్, అస్తగ్ ఫిరుల్లాహ్, అల్లాహుమ్మ అంతస్సలాం వమిన్కస్స లాం తబారక్త యాజల్ జలాలి వల్ ఇక్రామ్.

اَسْتَغْفِرُ الله ، اَسْتَغْفِرُ الله ، اَسْتَغْفِرُ الله ، اَللهُمَّ أَنْتَ السَّلامُ ومِنْكَ السَّلامُ تَبَارَكْتَ يَا ذَا الجَلالِ وَ الإكْرَام.

(అల్లాహ్ నీ క్షమాభిక్ష కోరుతున్నాను… అల్లాహ్ నీవే సలాం. శాంతి నీ నుండి లభిస్తుంది. ఔన్నత్యం, గొప్ప దనాలు గలవాడా నీవు గొప్ప శుభాలు కలవాడివి). (ముస్లిం 592).

2- లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ అల్లాహుమ్మ లా మానిఅ లిమా అఅతైత వలా ముఅతియ లిమా మనఅత వలా యన్ ఫఉ జల్ జద్ది మిన్కల్ జద్దు. (బుఖారి 844).

لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ اللَّهُمَّ لَا مَانِعَ لِمَا أَعْطَيْتَ وَلَا مُعْطِيَ لِمَا مَنَعْتَ وَلَا يَنْفَعُ ذَا الْجَدِّ مِنْكَ الْجَدُّ

(అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు. ఆయన ఏకైకుడు, సాటిలేనివాడు. విశ్వసామ్రాజ్యం ఆయనదే. స్తోత్రములు ఆయనకే చెల్లును. ఆయన సర్వాధికారుడు. ఓ అల్లాహ్! నీవు ప్రసాదించే దానిని అడ్డుకునే- వాడెవడూ లేడు. నీవు ఇవ్వని దానిని ఎవ్వడూ ఇవ్వలేడు. ఎవరి పెద్దరికం, ఐశ్వర్యం నీ శిక్ష ముందు వారికి లాభం చేకూర్చ లేవు). (ముస్లిం 593).

3- లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహి లాఇలాహ ఇల్లల్లాహు వలా నఅబుదు ఇల్లా ఇయ్యాహు లహున్నిఅమతు వలహుల్ ఫజ్లు వలహుస్స నాఉల్ హసన్ లా ఇలాహ ఇల్లల్లాహు ముఖ్లి సీన లహుద్దీన వలౌ కరిహల్ కాఫిరూన్. (ముస్లిం 594).

لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللَّهِ لَا إِلَهَ إِلَّا اللهُ وَلَا نَعْبُدُ إِلَّا إِيَّاهُ لَهُ النِّعْمَةُ وَلَهُ الْفَضْلُ وَلَهُ الثَّنَاءُ الْحَسَنُ لَا إِلَهَ إِلَّا اللهُ مُخْلِصِينَ لَهُ الدِّينَ وَلَوْ كَرِهَ الْكَافِرُونَ

(అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు. ఆయన ఏకైకుడు, సాటిలేనివాడు. విశ్వసామ్రాజ్యం ఆయనదే. స్తోత్రములు ఆయనకే చెల్లును. ఆయన సర్వాధికారుడు. పుణ్యాలు చేసే, పాపాల నుండి దూరముండే భాగ్యం అల్లాహ్ యే ప్రసాదించువాడు, ఆ అల్లాహ్ తప్ప వెరొక ఆరాధ్యుడు లేడు. మేము ఆయన్నే ఆరాధిస్తాము. వరాలు, అనుగ్రహాలు ఆయన ప్రసాదించినవే. మంచి స్తోత్రాలు ఆయనకే శోభిస్తాయి. అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు. సత్యతిరస్కారులకు ఎంత అయిష్టకరంగా ఉన్నా సరే మేము మా ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకున్నాము).

ఆ తర్వాత సుబ్ హానల్లాహ్ 33 సార్లు, అల్ హందులిల్లాహ్ 33 సార్లు, అల్లాహు అక్బర్ 33 సార్లు అనాలి. వంద పూర్తి చేయుటకు ఒక్కసారి అనాలిః “లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్“. (ముస్లిం 597).

16- జనాజ నమాజులోని దుఆ

అల్లాహుమ్ మగ్ఫిర్ లహూ వర్ హమ్ హు వ ఆఫిహీ వఅఫు అన్ హు వ అక్రిమ్ నుజులహూ వ వస్సిఅముద్ ఖలహూ వగ్సిల్ హు బిల్ మాఇ వస్సల్జి వల్ బర్ది వ నఖ్ఖిహి మినల్ ఖతాయా కమా యునఖ్ఖస్ సౌబుల్ అబ్ యజు మినద్దనసి వ అబ్దిల్ హు దారన్ ఖైరమ్ మిన్ దారిహీ వ అహ్లన్ ఖైరమ్మిన్ అహ్లిహీ వ జౌజన్ ఖైరమ్మిన్ జౌజిహీ వ అద్ ఖిల్ హుల్ జన్నత వ అఇజ్ హు మిన్ అజాబిల్ ఖబ్రి వ అజాబిన్నార్. (ముస్లిం 963).

اللَّهُمَّ اغْفِرْ لَهُ وَارْحَمْهُ وَعَافِهِ وَاعْفُ عَنْهُ وَأَكْرِمْ نُزُلَهُ وَوَسِّعْ مُدْخَلَهُ وَاغْسِلْهُ بِالْمَاءِ وَالثَّلْجِ وَالْبَرَدِ وَنَقِّهِ مِنْ الْخَطَايَا كَمَا نَقَّيْتَ الثَّوْبَ الْأَبْيَضَ مِنْ الدَّنَسِ وَأَبْدِلْهُ دَارًا خَيْرًا مِنْ دَارِهِ وَأَهْلًا خَيْرًا مِنْ أَهْلِهِ وَزَوْجًا خَيْرًا مِنْ زَوْجِهِ وَأَدْخِلْهُ الْجَنَّةَ وَأَعِذْهُ مِنْ عَذَابِ الْقَبْرِ أَوْ مِنْ عَذَابِ النَّارِ

(అల్లాహ్ ఇతడ్ని క్షమించు, ఇతనిని కరుణించు, శిక్ష నుండి కాపాడు, మన్నించు, ఇతడ్ని ఆదరించి మర్యాద చెయ్యి, ఇతని సమాధిని విశాల పరచు, ఇతడ్ని నీళ్ళతో, మంచుతో, వడగళ్ళతో కడిగి తెల్లని వస్త్రాన్ని మురికి లేకుండా శుభ్రం చేసినట్లు పాపాల నుండి ఇతన్ని పరిశుభ్రం చెయ్యి. ఇతనికి ఇహలోకపు ఇల్లు కన్నా మంచి ఇల్లునీ, ఇహలోకపు పరివారంకన్నా ఉత్తమ పరివారాన్నీ, ఇహలోకపు జంటకంటే మంచి జంట ఇవ్వు. ఇతన్ని స్వర్గంలోకి ప్రవేశింపజెయ్యి. సమాధి శిక్ష నుండి, అగ్ని శిక్ష నుండి కాపాడు).

17- విత్ర్ నమాజ్ తర్వాత చదవండి

సుబ్ హానల్ మలికిల్ ఖుద్దూస్.      سُبْحَانَ المَلِكُ القُدُّوس           

(పరిశుద్ధుడైన చక్రవర్తి పరమపవిత్రుడు). (నిసాయీ 1729).
ముడూ సార్లు అనాలి. మూడవసారి శబ్దాన్ని కొంచెం పెంచాలి.

18- ఇస్తిఖార నమాజు యొక్క దుఆ

(ఏదైనా పని గురించి ఆలోచించి, ఎలా చేస్తే మేలుంటుంది అనుకున్నప్పుడు ఏ ఒక నిర్ణయానికి రాక ముందు ఫర్జ్ నమాజు కాకుండా రెండు రకాతుల నఫిల్ నమాజు చేసి సలాంకు ముందు తషహ్హుద్ చివరిలో లేదా సలాం తింపిన తర్వాత ఈ క్రింది దుఆ చేయవలెను. అయితే “అన్న హాజల్ అమ్ర” అన్న చోట తన అవసరాన్ని గురించి ఆలోచించుకోవాలి, లేదా అవసరాన్ని ప్రస్తావించాలి).

అల్లాహుమ్మ ఇన్నీ అస్తఖీరుక బిఇల్మిక వ అస్తఖ్దిరుక బి ఖుద్రతిక వ అస్అలుక మిన్ ఫజ్లికల్ అజీం ఫఇన్నక తఖ్దిరు వలా అఖ్దిరు వ తఅలము వలా అఅలము వ అంత అల్లాముల్ గుయూబ్, అల్లాహుమ్మ ఇన్ కుంత తఅలము అన్న హాజల్ అమ్ర ఖైరుల్లీ ఫీ దీనీ వ మఆషీ వ ఆఖిబతి అమ్రీ ఔ ఖాల ఆజిలి అమ్రీ వ ఆజిలిహీ ఫఖ్దుర్ హు లీ వ యస్సిర్ హు లీ సుమ్మ బారిక్ లీ ఫీహి వ ఇన్ కుంత తఅలము అన్న హాజల్ అమ్ర షర్రుల్లీ ఫీ దీనీ వ మఆషీ వ ఆఖిబతి అమ్రీ ఔ ఖాల ఫీ ఆజిలి అమ్రీ వ ఆజిలిహీ ఫస్రిఫ్ హు అన్నీ వస్రిఫ్ నీ అన్హు వఖ్ దుర్ లియల్ ఖైర హైసు కాన సుమ్మ అర్జినీ బిహీ.

اللَّهُمَّ إِنِّي أَسْتَخِيرُكَ بِعِلْمِكَ وَأَسْتَقْدِرُكَ بِقُدْرَتِكَ وَأَسْأَلُكَ مِنْ فَضْلِكَ الْعَظِيمِ فَإِنَّكَ تَقْدِرُ وَلَا أَقْدِرُ وَتَعْلَمُ وَلَا أَعْلَمُ وَأَنْتَ عَلَّامُ الْغُيُوبِ اللَّهُمَّ إِنْ كُنْتَ تَعْلَمُ أَنَّ هَذَا الْأَمْرَ خَيْرٌ لِي فِي دِينِي وَمَعَاشِي وَعَاقِبَةِ أَمْرِي أَوْ قَالَ عَاجِلِ أَمْرِي وَآجِلِهِ فَاقْدُرْهُ لِي وَيَسِّرْهُ لِي ثُمَّ بَارِكْ لِي فِيهِ وَإِنْ كُنْتَ تَعْلَمُ أَنَّ هَذَا الْأَمْرَ شَرٌّ لِي فِي دِينِي وَمَعَاشِي وَعَاقِبَةِ أَمْرِي أَوْ قَالَ فِي عَاجِلِ أَمْرِي وَآجِلِهِ فَاصْرِفْهُ عَنِّي وَاصْرِفْنِي عَنْهُ وَاقْدُرْ لِي الْخَيْرَ حَيْثُ كَانَ ثُمَّ أَرْضِنِي به

(అల్లాహ్! నీ జ్ఞానంతో నేను శుభాలను అడుగుతున్నాను. నీ అధికార సాయంతో శక్తిని ప్రసాదించమని కోరుతున్నాను. మహోత్తరమైన నీ అనుగ్రహాన్ని ప్రసాదించమని అభ్యర్తిస్తున్నాను. నిశ్చయంగా నువ్వు అధికారం గలవాడివి. నాకు ఎలాంటి అధికారమూ లేదు. నీకు అన్నీ తెలుసు, నాకు ఏమీ తెలియదు. అగోచర జ్ఞానివి నీవే. అల్లాహ్! నీ జ్ఞానం ప్రకారం ఈ పని ధార్మి కంగా, ప్రాపంచికంగా, పరలోక పరిణామం రీత్యా (లేదా) త్వరగా లేక ఆలస్యంగా నాకు ప్రయోజనకరమైతే దాన్ని నా అదృష్టంలో ఉంచు. దాని సాధనను నా కొరకు సులభతరం చెయ్యి. దాన్ని నా కొరకు శుభప్రదమైనదిగా చెయ్యి. కాని ఒకవేళ నీ జ్ఞానం ప్రకారం ఈ పని ధార్మికంగా, ప్రాపంచికంగా, పరలోక పరిణామం రీత్యా (లేదా) త్వరగా గానీ, ఆలస్యంగా గానీ నాకు నష్టం కలిగించేదయితే దాన్ని నా నుండి దూరంగా ఉంచు. దాని బారి నుండి నన్ను కాపాడు. సాఫల్యం ఎక్కడున్నాసరే దాన్ని నా అదృష్టంగా మలచు. ఆ తర్వాత నా మనసు దానిపై కుదుటపడేలా చెయ్యి) (బుఖారి 1166).

రేయింబవళ్ళ ముఖ్యమైన దుఆలు [పుస్తకం]

బిస్మిల్లాహ్

రేయింబవళ్ళ ముఖ్యమైన దుఆలు (పగలు రాత్రి దుఆలు)
కూర్పు: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ 

[ఇక్కడ పుస్తకం చదవండి / డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [63 పేజీలు]

ఉన్నత చదులు ఎన్ని  చదివినా  ఫలితము ఉండబోదురా !
సృష్టికర్తను గ్రహించలేని డిగ్రీలన్నీ వ్యర్ధమురా!

మానువుడు దాసుడు, అల్లాహ్‌ యజమాని, దాసుడు ఎల్లవేళల్లో తన యజమాని ఆజ్ఞాపాలనలో, ఆయనను స్మరిస్తూ, స్తుతిస్తూ ఉండాలి.

  • ఈనాడు శాంతి ఎందుకు కరువైపోయింది?
  • జీవితాలు ఎందుకు దుర్భరమైపోయాయి?
  • సుఖపరమైన నిద్ర ఎందుకు కోల్పాయాము?
  • పరస్పరంలో ప్రేమలు ఎందుకు లోపించాయి?
  • భూతపిశాచుల భయం ఎలా అధికమయ్యింది?

వీటన్నిటికి ఒకే సమాధానం: మనం ఎప్పుడు అల్లాహ్‌ ను ఎలా స్మరించాలో, అప్పుడు అలా స్మరించడం మరచిపోయాము. మరియు సామాన్యుల ఆలోచన ఏమిటంటే; అల్లాహ్‌ స్మరణ చేస్తూ ఉండడం అనేది మనపని కాదు, మౌల్వీ సాబులు, సమాధికి అతిచేరువులో ఉన్న వృద్ధుల పని అని. (నఊజుబిల్లాహ్‌). అల్లాహ్‌ స్మరణలోని ప్రయోజనాలు తెలియుటకు ఈ చిరుపుస్తకం చదివి చూడండి.

ఈ చిరుపుస్తకాన్ని మీరు ఎల్లవేళల్లో మీ వెంటే ఉంచుకొని ఏ సందర్భంలో ఏ దుఆ చదవాలో ఆ దుఆ చూచి చదవండి. ఇలా కొద్ది రోజుల్లో అనేక దుఆలు మీరు కంఠస్తం చేసుకోగల్గుతారు. వేరే ప్రత్యేక సమయం కేటాయించే అవసరమే ఉండదు. ఇన్నీ దుఆలను ఎప్పుడు కంఠస్తం చేయాలి? అని దీనిని మూలకు పడేయంకండి, ఇలా ఎన్నో మేళ్లను కోల్పోతారు.

ఇది చిరుపుస్తకం గనక ప్రతి దుఆ యొక్క ఆధారం సంక్షిప్తంగా ఇవ్వబడింది. మరిన్ని ఎక్కువ దుఆలతో, సంపూర్ణ ఆధారాలతో మరో పుస్తకం తయారు చేసే భాగ్యం అల్లాహ్‌ ప్రసాదించుగాక! ఆమీన్‌.

విషయ సూచిక 

  1. నిద్ర నుండి మేల్కొని
  2. కాలకృత్వాలు తీర్యుకునే ముందు, తర్వాత
  3. వుజూకు ముందు, తర్వాత
  4. దుస్తులు ధరిస్తూ, తీస్తూ
  5. ఇంటి నుండి వెళ్తూ / ఇంట్లో ప్రవేశిస్తూ
  6. మస్జిద్ వైపునకు వెళ్తూ / మస్జిద్లో ప్రవేశిస్తూ
  7. అజాన్‌ సమాధానం, దుఆలు
  8. తక్బీరే  తహ్రీమ తర్వాత దుఆలు
  9. రుకూలో/ రుకూ నుండి నిలబడి
  10. సజ్దాలో
  11. రెండు సజ్దాల మధ్య
  12. సజ్దాయె తిలావత్‌ లో
  13. తషహ్హుద్‌ లో
  14. సలాంకు ముందు
  15. సలాం తర్వాత
  16. ఇస్తిఖారా నమాజులో
  17. ఉదయసాయంకాలపు జిక్ర్‌, వాటి లాభాలు
  18. పడుకునే ముందు
  19. రాత్రి వేళ ప్రక్క మారుస్తూ
  20. నిద్రలో భయాందోళన…, చెడు కల  చూస్తే….?
  21. విత్ర్ నమాజులో/ విత్ర్ నమాజ్‌ తర్వాత
  22. జనాజా నమాజులో

[క్రింద పూర్త్తిపుస్తకం చదవండి]

నిద్ర నుండి మేల్కొని

[1] అల్ హందులిల్లాహిల్లజీ అహ్ యానా బఅద మా అమాతనా వ ఇలైహిన్ నుషూర్. (బుఖారి 6312).

الْـحَمْدُ لِلهِ الَّذِي أَحْيَانَا بَعْدَ مَا أَمَاتَنَا وَإِلَيْهِ النُّشُورُ

(అల్లాహ్ కే సర్వ స్తోత్రములు, ఆయనే మమ్మల్ని మరణింపజేసిన తర్వాత తిరిగి బ్రతికించాడు. మళ్ళీ ఆయన వైపునకే మరలిపోవలసి ఉన్నది).

[2] అల్ హందులిల్లాహిల్లజీ ఆఫానీ ఫీ జసదీ వరద్ద అలయ్య రూహీ వ అజినలీ బిజిక్రిహీ. (తిర్మిజి 3401).

الْـحَمْدُ لِله الَّذِي عَافَانِي فِي جَسَدِي وَرَدَّ عَلَيَّ رُوحِي وَأَذِنَ لِي بِذِكْرِهِ

(అల్లాహ్ కే సర్వ స్తోత్రములు, ఆయనే నా శరీరం లో క్షేమాన్ని ప్రసాదించాడు. నా ఆత్మను తిరిగి పంపాడు, అయన్ను స్మరించే అనుమతి (భాగ్యం) ప్రసాదించాడు).

రాత్రి వేళ నిద్ర మధ్యలో మేల్కుంటే చదవాలి


1- లాఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లాషరీక లహు లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ అల్ హందులిల్లాహి వ సుబ్ హానల్లాహి వ లాఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ వలాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్.

لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ الْحَمْدُ لِلهِ وَسُبْحَانَ الله وَلَا إِلَهَ إِلَّا اللهُ وَاللهُ أَكْبَرُ وَلَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللهِ

ఈ దుఆ చదివిన వెంటనే ‘అల్లాహ్ నన్ను క్షమించు’ అని లేదా మరేదైనా దుఆ చేస్తే స్వీకరించ బడుతుంది. ఒకవేళ వుజూ చేసుకొని నమాజు చేస్తే అదీ అంగీకరింపబడుతుంది. (బుఖారి 1154)

2- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి మేల్కొన్నప్పుడు సూర ఆలె ఇమ్రాన్ యొక్క చివరి పది ఆయతులు (3: 190-200) పారాయణం చేసేవారు. (ముస్లిం 763, బుఖారి 183).

కాలకృత్యాలు తీర్చుకునే ముందు

బిస్మిల్లాహి’ అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మినల్ ఖుబుసి వల్ ఖబాఇస్. (తిర్మిజి 606. బుఖారి 142.).

بِسمِ اللهِ اَللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الخُبُثِ وَالخَبَائِثِ

(అల్లాహ్ పేరు తో, ఓ అల్లాహ్! నేను దుష్ట జిన్నాతు స్త్రీ పురుషుల నుండి నీ శరణు జొచ్చుచున్నాను).

కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత

గుఫ్రానక
غُفْرَانَكَ
(నీ క్షమాపణ కోరుతున్నాను). (తిర్మిజి 7).

వుజూకు ముందు అనండి

బిస్మిల్లాహ్ (అల్లాహ్ పేరుతో). (అబూదావూద్ 101).

వుజూ తర్వాత

[1] అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వరసూలుహ్. (ముస్లిం 234).

أَشْهَدُ أَن لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ

(అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు వెరొకడు లేడని, ఆయన ఏకైకుడని, ఆయనకు ఎవరూ భాగస్వాములు లేరని సాక్ష్యమిచ్చుచున్నాను. మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు మరియు ప్రవక్త అని కూడా సాక్ష్యమిచ్చుచున్నాను).

పై దుఆ చదివినవారి కొరకు స్వర్గపు ఎనిమిది ద్వారాలు తెరువబడతాయి. అతను ఎందులో నుండైనా ప్రవేశించవచ్చు. మరో హదీసులో ఈ పదాలు అదనంగా ఉన్నాయిః

అల్లాహుమ్మజ్అల్ నీ మినత్తవ్వాబీన వజ్ అల్ నీ మినల్ ముతతహ్హిరీన్. (తిర్మిజి 55).

اللَّهُمَّ اجْعَلْنِي مِنْ التَّوَّابِينَ وَاجْعَلْنِي مِنْ الْمُتَطَهِّرِينَ

(ఓ అల్లాహ్! నన్ను నీ వైపు మరలేవానిగా మరియు పరిశుభ్రంగా ఉండేవానిగా చేయుము)

[2] సుబ్ హానకల్లాహుమ్మ వ బిహందిక అష్ హదు అల్లాఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక.

سُبْحَانَكَ اللَّهُمَّ وَبِحَمْدِكَ أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا أَنْتَ أَسْتَغْفِرُكَ وَ أَتُوبُ إِلَيكَ

(ఓ అల్లాహ్ నీవు పరిశుద్ధునివి, నీకే సర్వస్తోత్రములు, నీవు తప్ప సత్యమైన ఆరాధ్యుడు వేరొకడు లేడని నేను సాక్ష్యమిచ్చుచున్నాను. నీ వైపునకే మరలుచున్నాను మరియు నా పాపాల మన్నింపుకై నిన్నే వేడుకుంటున్నాను).

వుజూ తర్వాత పై దుఆ చదివినవారి పేరు తోలు పత్రంపై వ్రాయబడుతుంది. ముద్ర వేయబడుతుంది. ప్రళయదినం వరకు తీయబడదు. (నిసాయీ ఫిల్ కుబ్రా 9909. 6/25. సహీహుత్తర్గీబ్ 225. సహీహుల్ జామిఅ’ 6170.).

దుస్తులు ధరిస్తూ

అల్ హందులిల్లాహిల్లజీ కసానీ హాజస్సౌబ వ రజఖనీహి మిన్ గైరి హౌలిమ్ మిన్నీ వలా ఖువ్వహ్.

الْـحَمْدُ لِلهِ الَّذِي كَسَانِي هَذَا الثَّوْبَ وَرَزَقَنِيهِ مِنْ غَيْرِ حَوْلٍ مِنِّي وَلَا قُوَّةٍ

(అల్లాహ్ కే సర్వస్తోత్రములు, ఆయనే ఈ వస్త్రాన్ని నాకు ధరింపజేశాడు, ప్రసాదించాడు, అందులో నా స్వయం శక్తి, సామర్థ్యం ఏ మాత్రం లేదు). (అబూదావూద్ 4033).

పై దుఆ చదివిన వారి పూర్వపు మరియు వెనకటి పాపాలన్నీ క్షమించబడతాయి.

కొత్త దుస్తులు ధరిస్తూ

అల్లాహుమ్మ లకల్ హందు అంత కసౌతనీహి అస్అలుక మిన్ ఖైరిహీ వ ఖైర మా సునిఅ లహూ వ అఊజుబిక మిన్ షర్రిహీ వషర్రి మాసునిఅ లహ్. (అబూదావూద్ 4020).

اللَّهُمَّ لَكَ الْحَمْدُ أَنْتَ كَسَوْتَنِيهِ أَسْأَلُكَ مِنْ خَيْرِهِ وَخَيْرِ مَا صُنِعَ لَهُ وَأَعُوذُ بِكَ مِنْ شَرِّهِ وَشَرِّ مَا صُنِعَ لَهُ

(ఓ అల్లాహ్! సర్వ స్తోత్రములు నీకే, నీవే నాకు ఈ దుస్తులు తొడిగించావు, ఇందులో ఉన్న మేలు మరియు దేని కొరకు ఇది తయారు చేయబడిందో ఆ మేలును నీతో కోరుతున్నాను, ఇందులోని కీడు మరియు దేని కొరకు తయారు చేయబడిందో ఆ కీడు నుండి నీ శరణులో వస్తున్నాను).

కొత్త వస్త్రాలు తొడిగిన వ్యక్తిని చూసి

తుబ్లీ వ యుఖ్లిఫుల్లాహు తఆలా

تُبْلِى وَيُخْلِفُ اللهُ تَعَالَى

(నీవు దీనిని పాతబడే వరకు తొడుగు, అల్లాహ్ దానికి బదులుగా మరొకటి ప్రసాదిస్తాడు). (అబూదావూద్ 4020).

వస్త్రాలు తీయునప్పుడు బిస్మిల్లాహ్ (అల్లాహ్ పేరుతో) అనాలి. (సహీహుల్ జామి 3610).

ఇంటి నుండి బైటికి వెళ్తూ

1- బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లాహి లాహౌల వలా ఖువ్వత ఇల్లాబిల్లాహ్. (అబూదావూద్ 5095).

بِسْمِ اللهِ تَوَكَّلْتُ عَلَى اللَّهِ لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِالله

(అల్లాహ్ పేరుతో వెళ్తున్నాను, అల్లాహ్ పై మాత్రమే నా నమ్మకం. పుణ్యం చేసే మరియు పాపం నుండి దూరంగా ఉండే భాగ్యం అల్లాహ్ యే ప్రసాదించువాడు).

పై దుఆ చదివిన వారికి సన్మార్గం ప్రాప్తిస్తుంది, కీడు, బాధలతో రక్షణ లభిస్తుంది మరియు షైతాన్ అతని నుండి దూరముంటాడు.

2- అల్లాహుమ్మ అఊజు‘ బిక అన్ అజ్దిల్ల ఔ ఉజ్దల్ల ఔ అజిల్ల ఔ ఉజల్ల ఔ అజ్లిమ ఔ ఉజ్లమ ఔ అజ్ హల ఔ యుజ్ హల అలయ్య.

اللَّهُمَّ أَعُوذُ بِكَ أَنْ أَضِلَّ أَوْ أُضَلَّ أَوْ أَزِلَّ أَوْ أُزَلَّ أَوْ أَظْلِمَ أَوْ أُظْلَمَ أَوْ أَجْهَلَ أَوْ يُجْهَلَ عَلَيَّ

(నేను స్వయంగా మార్గం తప్పడం నుండి, లేదా తప్పించబడటం నుండి, జారటం నుండి లేదా జారింపబడుట నుండి, నేను ఎవరినైనా బాధించడం నుండి లేదా ఎవరిచేతనైనా బాధింపబడటం నుండి, నేను ఎవరితోనైనా అసభ్యంగా, మూర్ఖంగా ప్రవర్తించుట నుండి లేదా ఎవరైనా నాతో అలా ప్రవర్తించుట నుండి నేను నీ శరణు కోరుతున్నాను ఓ అల్లాహ్!).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు తమ దృష్టి ఆకాశం వైపు సారించి పై దుఆ పఠించేవారు. (అబూ దావూద్ 5094).

ఇంట్లో ప్రేవేశిస్తూ

అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక ఖైరల్ మౌలజి వ ఖైరల్ మఖ్రజి బిస్మిల్లాహి వలజ్నా వ బిస్మిల్లాహి ఖరజ్నా వఅలల్లాహి రబ్బినా తవక్కల్నా. (అబూదావూద్ 5096).

اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ خَيْرَ الْمَوْلَجِ وَخَيْرَ الْمَخْرَجِ بِسْمِ الله وَلَجْنَا وَبِسْمِ الله خَرَجْنَا وَعَلَى الله رَبِّنَا تَوَكَّلْنَا

(ఓ అల్లాహ్! నేను ఇంట్లో ప్రవేశిస్తూ, బయటికి వెళ్తూ శుభం కలగాలని నిన్నే వేడుకుంటున్నాను. అల్లాహ్ పేరుతో ప్రవేశించాము, అల్లాహ్ పేరుతోనే బైటికి వెళ్ళాము, మా ప్రభువైన అల్లాహ్ పై నమ్మకం ఉంచాము).

మనిషి ఇంట్లో ప్రవేశిస్తూ, భోజనం చేస్తూ అల్లాహ్ ను స్మరిస్తే, షైతాన్ తన తోటివాళ్ళతో ఈ ఇంట్లో మీకు నివాస స్థలం లేదు, భోజనం లేదు అని అంటాడు. (ముస్లిం 2018).

మస్జిదు వైపునకు వెళ్తూ

అల్లాహుమ్మజ్అల్ ఫీ ఖల్ బీ నూరా, వ ఫీ లిసానీ నూరా, వజ్అల్ ఫీ సమ్ఈ నూరా, వజ్అల్ ఫీ బసరీ నూరా, వజ్అల్ మిన్ ఖల్ ఫీ నూరా, వ మిన్ అమామీ నూరా, వజ్అల్ మిన్ ఫౌఖీ నూరా, మవిన్ తహ్ తీ నూరా, అల్లాహుమ్మ అఅ’తినీ నూరా. (ముస్లిం 763, బుఖారి 6316).

اللَّهُمَّ اجْعَلْ فِي قَلْبِي نُورًا وَفِي لِسَانِي نُورًا وَاجْعَلْ فِي سَمْعِي نُورًا وَاجْعَلْ فِي بَصَرِي نُورًا وَاجْعَلْ مِنْ خَلْفِي نُورًا وَمِنْ أَمَامِي نُورًا وَاجْعَلْ مِنْ فَوْقِي نُورًا وَمِنْ تَحْتِي نُورًا اللَّهُمَّ أَعْطِنِي نُورًا

(ఓ అల్లాహ్ నా హృదయంలో వెలుగు ప్రసాదించు, నా నాలుకలో వెలుగు ప్రసాదించు, నా చెవిలో వెలుగు ప్రసాదించు, నా కళ్ళలో వెలుగు ప్రసాదించు, నా వెనక వెలుగు ప్రసాదించు, నా ముందు వెలుగు ప్రసాదించు, నా పైన వెలుగు ప్రసాదించు, నా క్రింద వెలుగు ప్రసాదించు. ఓ అల్లాహ్ నాకు (ప్రళయ దినాన) వెలుగు ప్రసాదించు).

ఇందులో వెలుగు అంటే ధర్మం, సత్యం స్పష్టపరచడం అని భావం.

మస్జిదులో ప్రవేశించినప్పుడు

[1] అఊజు బిల్లాహిల్ అజీం వ బివజ్ హిహిల్ కరీం వ సుల్తానిహిల్ ఖదీం మినష్షైతానిర్రజీం.

أَعُوذُ بِاللهِ الْعَظِيمِ وَبِوَجْهِهِ الْكَرِيمِ وَسُلْطَانِهِ الْقَدِيمِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ

(ధూత్కరింపబడిన షైతాన్ బారి నుండి రక్షణకై నేను గొప్పవాడైన అల్లాహ్, ఆయన గౌరవనీయమైన ముఖం మరియు ఆది నుండి గల ఆయన అధికార శరణు కోరుతున్నాను).

పై దుఆ మస్జిదులోనికి వెళ్తూ చదివేవారు, ఆ రోజం- తా షైతాన్ నుండి రక్షింపబడతారు. (అబూ దావూద్ 466).

[2] బిస్మిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్.

بِسْمِ الله وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى رَسُولِ الله

(అల్లాహ్ నామముతో. ప్రవక్తపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణలు కురుయుగాక). (ఇబ్నుమాజ 771, తిర్మిజి 314).

[3] అల్లాహుమ్మఫ్ తహ్ లీ అబ్వాబ రహ్మతిక. (ముస్లిం 713).

اللَّهُمَّ افْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ

(ఓ అల్లాహ్ నా కొరకు నీ కరుణ ద్వారాలను తెరుచు).

[4] అల్లాహుమ్మగ్ ఫిర్లీ జునూబీ వఫ్ తహ్ లీ అబ్వాబ రహ్మతిక. (ఇబ్నుమాజ 771, తిర్మిజి 314)

اللَّهُمَّ اغْفِرْ لِي ذُنُوبِي وَافْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ

(ఓ అల్లాహ్! నా పాపాలు క్షమించు మరియు నా కొరకు నీ కరుణ ద్వారాలను తెరుచు).

మస్జిద్ నుండి బయటికి వెళ్తూ

[1] బిస్మిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. (ఇబ్నుస్సినీ, అబూదావూద్).

بِسْمِ الله وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى رَسُولِ الله

[2] అల్లాహుమ్మ అ’సిమ్ నీ మినష్షైతానిర్రజీం. (ఇబ్ను మాజ 773).

اللَّهُمَّ اعْصِمْنِي مِنْ الشَّيْطَانِ الرَّجِيمِ

(ఓ అల్లాహ్! నన్ను ధూత్కరింపబడిన షైతాన్ బారి నుండి కాపాడుము).

[3] అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక మిన్ ఫజ్లిక.

اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ فَضْلِكَ

(ఓ అల్లాహ్ నీతో నీ దయను కోరుతున్నాను). (ముస్లిం 713).

[4] అల్లాహుమ్మగ్ ఫిర్లీ జునూబీ వఫ్ తహ్ లీ అబ్వాబ ఫజ్లిక. (ఇబ్నుమాజ 771, తిర్మిజి 314)

اللَّهُمَّ اغْفِرْ لِي ذُنُوبِي وَافْتَحْ لِي أَبْوَابَ فَضْلِكَ

(ఓ అల్లాహ్! నా పాపాలు క్షమించు మరియు నా కొరకు నీ కృప, దయ ద్వారాలను తెరుచు).

అజాన్ సమాధానం, దాని పిదప దుఆ

మనస్ఫూర్తిగా అజాన్ యొక్క జవాబిచ్చిన వారికి స్వర్గం లభించును. కాని “హయ్య అలస్సలాహ్, హయ్య అలల్ ఫలాహ్” విన్నప్పుడు “లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” (పుణ్యం చేసే మరియు పాపల నుండి దూరం ఉండే భాగ్యం అల్లాహ్ యే ప్రసాదించువాడు) అనాలి. దాని తర్వాత దరూదె ఇబ్రాహీం చదివిన వారిపై అల్లాహ్ యొక్క పది కరుణలు కురుస్తాయి. ఆ తర్వాత క్రింది దుఆ చదివిన వారికి ప్రళయదినాన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు లభిస్తుంది. (ముస్లిం 385, 384.).


1- అల్లాహుమ్మ రబ్బ హాజిహిద్ దఅ’వతిత్ తామ్మతి వస్సలాతిల్ ఖాఇమతి ఆతి ముహమ్మదనిల్ వసీలత వల్ ఫజీలత వబ్అస్ హు మఖామమ్ మహ్మూద నిల్లజీ వఅత్తహూ.

اللَّهُمَّ رَبَّ هَذِهِ الدَّعْوَةِ التَّامَّةِ وَالصَّلَاةِ الْقَائِمَةِ آتِ مُحَمَّدًا الْوَسِيلَةَ وَالْفَضِيلَةَ وَابْعَثْهُ مَقَامًا مَحْمُودًا الَّذِي وَعَدْتَهُ

(ఈ పరిపూర్ణ ఆహ్వానం మరియు స్థాపించబడే నమాజు యొక్క ప్రభువైన అల్లాహ్! ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు వసీల మరియు ఘనతలు ప్రసాదించు. మరియు నీవు వాగ్దానం చేసిన ‘మఖామె మహ్మూద్’ (ప్రశంసనీయమైన స్థానం) ప్రతిష్ఠంపజేయి).

పై దుఆలో పరిపూర్ణ ఆహ్వానం అంటే అజాన్ అని, ‘వసీల’ అంటే స్వర్గంలో ఓ ఉన్నత స్థానం అని, అల్లాహ్ దాసుల్లో కేవలం ఒక్కడే దానికి అర్హుడు అని అర్థం. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారుః ఆ ఒక్కణ్ణి నేనే అవుతానని ఆశిస్తున్నాను.

2- వ అన అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లా షరీక లహూ వఅష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ, రజీతు బిల్లాహి రబ్బా వబి ముహమ్మదిర్ రసూలా వబిల్ ఇస్లామి దీనా.

وَأَنَا أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ وَأَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ رَضِيتُ بِالله رَبًّا وَبِمُحَمَّدٍ رَسُولًا وَبِالْإِسْلَامِ دِينًا

(అల్లాహ్ తప్ప సత్యమైన ఆరాధ్యుడు వేరొకడు లేడని, ఆయన ఏకైకుడని, ఆయనకు ఎవరూ సాటి లేరని నేను సాక్ష్యమిచ్చుచున్నాను. మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దాసుడు మరియు ప్రవక్త అని సాక్ష్యమిస్తున్నాను. అల్లాహ్ నా ప్రభువు అని, ముహమ్మద్ (అల్లాహ్ యొక్క) ప్రవక్త అని మరియు ఇస్లాం నా ధర్మం అని ఇష్టపడ్డాను). (ముస్లిం 386).

పై దుఆ చదివిన వారి పాపాలు మన్నించబడతాయి.

తక్బీరె తహ్రీమ తర్వాత ఈ క్రింది దుఆల్లో ఏదైనా ఒకటి చదవండి

1- అల్లాహుమ్మ బాఇద్ బైనీ వ బైన ఖతాయాయ కమా బాఅత్త బైనల్ మష్రిఖి వల్ మగ్రిబి అల్లాహుమ్మ నఖ్ఖినీ మినల్ ఖతాయా కమా యునఖ్ఖస్సౌబుల్ అబ్ యజు మినద్దనసి అల్లాహుమ్మగ్ సిల్ ఖతాయాయ బిల్ మాఇ వస్సల్ జి వల్ బర్ద్. (బుఖారి 744, ముస్లిం 598).

اللَّهُمَّ بَاعِدْ بَيْنِي وَبَيْنَ خَطَايَايَ كَمَا بَاعَدْتَ بَيْنَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ اللَّهُمَّ نَقِّنِي مِنْ الْخَطَايَا كَمَا يُنَقَّى الثَّوْبُ الْأَبْيَضُ مِنْ الدَّنَسِ اللَّهُمَّ اغْسِلْ خَطَايَايَ بِالْمَاءِ وَالثَّلْجِ وَالْبَرَدِ

ఓ అల్లాహ్ తూర్పు పడమరల మధ్య ఎంత దూరం ఉంచావో నన్ను పాపాలకు అంతే దూరంగా ఉంచు. ఓ అల్లాహ్ మాసిన బట్ట తెల్లనిబట్టలా ఎలా శుభ్ర మవుతుందో నా పాపాలను అలా శుద్ధి చెయ్యి. నా పాపాలను నీరు, మంచు, వడగండ్లతో కడిగివెయ్యి.

2- సుబ్ హానకల్లాహుమ్మ వ బిహందిక వ తబార కస్ముక వ తఆలా జద్దుక వ లాఇలాహ ఘైరుక.

سُبْحَانَكَ اللَّهُمَّ وَبِحَمْدِكَ وَتَبَارَكَ اسْمُكَ وَتَعَالَى جَدُّكَ وَلَا إِلَهَ غَيْرُكَ

(అల్లాహ్ నీవు అన్ని రకాల లోపాలకు అతీతునివి, నీకే సర్వ స్తోత్రములు, నీ నామమే శుభము గలది. నీ ఔన్నత్యం, అనుగ్రహం ఉన్నతమైనది. నీ తప్ప సత్యమైన ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు. (తిర్మిజి 242. షేఖ్ అల్బానీ సహీ అన్నారు).

3- అల్ హందులిల్లాహి హందన్ కసీరన్ తయ్యిబమ్ ముబారకన్ ఫీహ్.

الْحَمْدُ لِله حَمْدًا كَثِيرًا طَيِّبًا مُبَارَكًا فِيهِ

(ఎనలేని ఉత్తమమైన, శుభప్రదమైన స్తోత్రములు అల్లాహ్ కొరకే).

పై పదాలు వ్రాయడానికి 12 దైవదూతలు పరస్పరం పోటిపడ్డారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. (ముస్లిం 600).

4- అల్లాహు అక్బరు కబీరా వల్ హందు లిల్హాహి కసీరా వ సుబ్ హానల్లాహి బుక్రతవ్ వ అసీలా.

اللهُ أَكْبَرُ كَبِيرًا وَالْحَمْدُ لِله كَثِيرًا وَسُبْحَانَ الله بُكْرَةً وَأَصِيلًا

(అల్లాహ్ చాలా గొప్పవాడు, ఎనలేని స్తోత్రములు అల్లాహ్ కొరకే, ఉదయం, సాయంత్రం ఆయనకే పవిత్రతలు).

పై పదాల వల్ల నాకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకనగ వాటి వల్ల ఆకాశ ద్వారాలు తెరువబడ్డాయి అని ప్రవక్త చెప్పారు. ఇబ్ను ఉమర్ ప్రవక్తగారి ఈ మాట విన్నప్పటి నుండి ఎన్నడూ వీటిని చదవడం మానుకోలేదు. (ముస్లిం 601). మరో ఉల్లేఖనంలో ఉందిః పై దుఆ మూడు సార్లు చదివి, తర్వాత ఇది చదవాలి అనిః అఊజు బిల్లాహి మినష్షైతాని మిన్ నఫ్ ఖిహీ వ నఫ్ సిహీ వ హంజిహీ. أَعُوذُ بِالله مِنَ الشَّيْطَانِ مِنْ نَفْخِهِ وَنَفْثِهِ وَهَمْزِهِ (అబూ దావూద్/ మా యుస్తఫ్తహు బిహిస్సలాతు… 764).

5- అల్లాహుమ్మ రబ్బ జిబ్రాఈల వ మీకాఈల వ ఇస్రాఫీల ఫాతిరస్సమావాతి వల్ అర్జి ఆలిమల్ గైబి వష్షహాదతి అంత తహ్ కుము బైన ఇబాదిక ఫీమా కానూ ఫీహి యఖ్తలిఫూన్ ఇహ్ దినీ లిమఖ్ తులిఫ ఫీహి మినల్ హఖ్ఖి బిఇజ్నిక ఇన్నక తహ్ దీ మన్ తషాఉ ఇలా సిరాతిమ్ ముస్తఖీం. (ముస్లిం 770).

اللَّهُمَّ رَبَّ جَبْرَائِيلَ وَمِيكَائِيلَ وَإِسْرَافِيلَ فَاطِرَ السَّمَاوَاتِ وَالْأَرْضِ عَالِمَ الْغَيْبِ وَالشَّهَادَةِ أَنْتَ تَحْكُمُ بَيْنَ عِبَادِكَ فِيمَا كَانُوا فِيهِ يَخْتَلِفُونَ اهْدِنِي لِمَا اخْتُلِفَ فِيهِ مِنْ الْحَقِّ بِإِذْنِكَ إِنَّكَ تَهْدِي مَنْ تَشَاءُ إِلَى صِرَاطٍ مُسْتَقِيمٍ

(జిబ్రాఈల్, మీకాఈల్ మరియు ఇస్రాఫీల్ యొక్క ప్రభువైన ఓ అల్లాహ్! భూమ్యాకాశాల సృష్టికర్త, గోచర అగోచరాల జ్ఞాని, నీవే నీ దాసుల మధ్య ఉన్న విభే దాలను గురించి తీర్పు చేయువానివి. ఏ సత్య విష- యంలో విభేదం ఉందో అందులో నీ దయతో నాకు సన్మార్గం చూపుము, నిశ్చయంగా నీవు కోరినవారికి సన్మార్గం చూపుతావు.

6- వజ్జహ్ తు వజ్ హియ లిల్లజీ ఫతరస్సమావాతి వల్ అర్ జ హనీఫవ్ వమా అన మినల్ ముష్రికీన్ ఇన్న సలాతీ వ నుసుకీ వ మహ్ యాయ వ మమాతీ లిల్లాహి రబ్బిల్ ఆలమీన్ లా షరీక లహూ వ బిజాలిక ఉమిర్తు వ అన అవ్వలుల్ ముస్లిమీన్ అల్లాహుమ్మ అంతల్ మలికు లాఇలాహ ఇల్లా అంత, అంత రబ్బీ వ అన అబ్దుక జలంతు నఫ్సీ వఅ’తరఫ్ తు బిజంబీ ఫగ్పిర్ లీ జునూబీ జమీఅన్ ఇన్నహూ లా యగ్ఫిరుజ్జునూబ ఇల్లా అంత, వహ్ దినీ లిఅహ్ సనిల్ అఖ్లాఖి లా యహ్ దీ లిఅహ్ సనిహా ఇల్లా అంత, వస్ రిఫ్ అన్నీ సయ్యిఅహా లా యస్ రిఫ్ అన్నీ సయ్యిఅహా ఇల్లా అంత, లబ్బైక వ సఅ’దైక వల్ ఖైరు కుల్లుహూ ఫీ యదైక వష్షర్రు లైస ఇలైక, అన బిక వ ఇలైక, తబారక్త వ తఆలైత, అస్తగ్ఫి- రుక వ అతూబు ఇలైక. (ముస్లిం 771).

وَجَّهْتُ وَجْهِيَ لِلَّذِي فَطَرَ السَّمَاوَاتِ وَالْأَرْضَ حَنِيفًا وَمَا أَنَا مِنَ المُشْرِكِينَ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لِله رَبِّ الْعَالَمِينَ لَا شَرِيكَ لَهُ وَبِذَلِكَ أُمِرْتُ وَأَنَا مِنْ المُسْلِمِينَ اللَّهُمَّ أَنْتَ المَلِكُ لَا إِلَهَ إِلَّا أَنْتَ أَنْتَ رَبِّي وَأَنَا عَبْدُكَ ظَلَمْتُ نَفْسِي وَاعْتَرَفْتُ بِذَنْبِي فَاغْفِرْ لِي ذُنُوبِي جَمِيعًا إِنَّهُ لَا يَغْفِرُ الذُّنُوبَ إِلَّا أَنْتَ وَاهْدِنِي لِأَحْسَنِ الْأَخْلَاقِ لَا يَهْدِي لِأَحْسَنِهَا إِلَّا أَنْتَ وَاصْرِفْ عَنِّي سَيِّئَهَا لَا يَصْرِفُ عَنِّي سَيِّئَهَا إِلَّا أَنْتَ لَبَّيْكَ وَسَعْدَيْكَ وَالْخَيْرُ كُلُّهُ فِي يَدَيْكَ وَالشَّرُّ لَيْسَ إِلَيْكَ أَنَا بِكَ وَإِلَيْكَ تَبَارَكْتَ وَتَعَالَيْتَ أَسْتَغْفِرُكَ وَأَتُوبُ إِلَيْكَ

(నేను నా ముఖాన్ని ఏకాగ్రచిత్తంతో భూమ్యాకాశాలను సృష్టించిన ప్రభువు వైపునకు త్రిప్పుకున్నాను. నేను బహు- దైవారాధకులలోనివాడిని కాను. నా నమాజ్, నా ఖుర్బానీ, నా జీవనం మరియు నా మరణం సర్వ లోక ప్రభువైన అల్లాహ్ కే అంకితం. ఆయనకు ఏ భాగస్వామీ లేడు. నాకు దీని గురించిన ఆజ్ఞే ఇవ్వబడింది. నేను ముస్లింలలోని వాణ్ణి. ఓ అల్లాహ్! నీవే యజమానివి. నీవే ఆరాధ్యుడవు. నీవు తప్ప మరో ఆరాధ్యుడు లేడు. నీవే నా ప్రభువువి. నేను నీ దాసుణ్ణి. నేను నా ఆత్మకు అన్యాయం చేసుకున్నాను. నేను నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను. కనుక నా పాపాలన్నింటినీ మన్నించు. నీవు తప్ప పాపాలను మన్నించగల వాడెవడూ లేడు. నన్ను సత్పవర్తన వైపునకు నడిపించు, సత్పవర్తన వైపునకు మార్గదర్శకత్వం చూపేవాడు నీ తప్ప ఎవ్వడూ లేడు. నా దుర్గుణాలను నా నుండి దూరం చెయ్యి. నన్ను దుర్గుణాల నుండి దూరం చేయువాడు నీ తప్ప ఎవ్వడూ లేడు. నీ సమక్షంలో హాజరవుతున్నాను. దీనిని నా అదృష్టంగా భావిస్తున్నాను. సర్వ మేళ్ళు నీ స్వాధీనంలో ఉన్నాయి. నీ తరఫు నుండి ఎన్నటికీ కీడు ఉండదు. నేను నీ వల్లనే ఉన్నాను. నీ వైపే మరలుతాను. నీవు శుభప్రదమైన వాడివి, ఉన్నతునివి. పాపాల మన్నింపుకై నిన్నే వేడుకుంటు- న్నాను. పశ్చాత్తాప భావంతో నీ వైపునకే మరలుతున్నాను.

7-అల్లాహుమ్మ లకల్ హందు అంత ఖయ్యిము స్సమావాతి వల్ అర్జి వమన్ ఫీహిన్న వలకల్ హందు లక ముల్కుస్సమావాతి వల్ అర్జి వమ న్ ఫీహిన్న వలకల్ హందు అంత నూరుస్సమావాతి వల్ అర్జి వమన్ ఫీహిన్న వలకల్ హందు అంత మలికుస్సమా- వాతి వల్ అర్జి వలకల్ హందు అంతల్ హఖ్కు వ వఅ’దుకల్ హఖ్ఖు వలిఖాఉక హఖ్ఖున్ వకౌలుక హఖ్ఖున్ వల్ జన్నతు హఖ్ఖున్ వన్నారు హఖ్ఖున్ వన్నబియ్యూన హఖ్ఖున్ వ ముహమ్మదున్ సల్లల్లాహు అలైహి వసల్లం హఖ్ఖున్ వస్సాఅతు హఖ్ఖ్. అల్లాహుమ్మ లక అస్లమ్తు వ బిక ఆమంతు వ అలైక తవక్కల్తు వ ఇలైక అనబ్తు వ బిక ఖాసంతు వ ఇలైక హాకమ్తు ఫగ్ఫిర్లీ మా ఖద్దమ్తు వ మా అఖ్ఖర్తు వ మా అస్రర్తు వ మా అఅ’లంతు అంతల్ ముఖద్దిము వ అంతల్ ముఅ- ఖ్ఖిరు లాఇలాహ ఇల్లా అంత. (బుఖారి 1120).

اللَّهُمَّ لَكَ الْحَمْدُ أَنْتَ قَيِّمُ السَّمَوَاتِ وَالْأَرْضِ وَمَنْ فِيهِنَّ وَلَكَ الْحَمْدُ لَكَ مُلْكُ السَّمَوَاتِ وَالْأَرْضِ وَمَنْ فِيهِنَّ وَلَكَ الْحَمْدُ أَنْتَ نُورُ السَّمَوَاتِ وَالْأَرْضِ وَمَنْ فِيهِنَّ وَلَكَ الْحَمْدُ أَنْتَ مَلِكُ السَّمَوَاتِ وَالْأَرْضِ وَلَكَ الْحَمْدُ أَنْتَ الْحَقُّ وَوَعْدُكَ الْحَقُّ وَلِقَاؤُكَ حَقٌّ وَقَوْلُكَ حَقٌّ وَالْجَنَّةُ حَقٌّ وَالنَّارُ حَقٌّ وَالنَّبِيُّونَ حَقٌّ وَمُحَمَّدٌ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ حَقٌّ وَالسَّاعَةُ حَقٌّ اللَّهُمَّ لَكَ أَسْلَمْتُ وَبِكَ آمَنْتُ وَعَلَيْكَ تَوَكَّلْتُ وَإِلَيْكَ أَنَبْتُ وَبِكَ خَاصَمْتُ وَإِلَيْكَ حَاكَمْتُ فَاغْفِرْ لِي مَا قَدَّمْتُ وَمَا أَخَّرْتُ وَمَا أَسْرَرْتُ وَمَا أَعْلَنْتُ أَنْتَ الْمُقَدِّمُ وَأَنْتَ الْمُؤَخِّرُ لَا إِلَهَ إِلَّا أَنْتَ

ఆ తర్వాత చదవండిః

అఊజు బిల్లాహిస్సమీఇల్ అలీమ్, మినష్షైతానిర్రజీం, మిన్ హంజిహీ, వ నఫ్ ఖిహీ వ నఫ్సిహీ

أَعُوذُ بِالله السَّمِيعِ الْعَلِيمِ مِنْ الشَّيْطَانِ الرَّجِيمِ مِنْ هَمْزِهِ وَنَفْخِهِ وَنَفْثِهِ

(వినేవాడు, సర్వజ్ఞాని అయిన అల్లాహ్ శరణులో వస్తున్నాను, ధూత్కరింపబడిన షైతాన్ మరియు వాని ప్రేరేపణలు, గర్వం, మరియు చేతబడి నుండి). (అబూదావూద్ 775).

ఆ తర్వాత చదవండిః

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం, అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అర్రహ్మానిర్రహీం, మాలికి యౌమిద్దీన్, ఇయ్యాక నఅ’బుదు వ ఇయ్యాక నస్తఈన్, ఇహ్దినస్సిరాతల్ ముస్తఖీమ్, సిరాతల్లజీన అన్అమ్ త అలైహిమ్, గైరిల్ మగ్ జ్దూబి అలైహిమ్ వలజ్దాల్లీన్. (ఆమీన్).

[بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ، الحَمْدُ للهِ رَبِّ العَالَمِينَ، الرَّحْمَنِ الرَّحِيمِ، مَالِكِ يَوْمِ الدِّينِ، إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ ، اهْدِنَا الصِّرَاطَ المُسْتَقِيمَ، صِرَاطَ الَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ غَيْرِ المَغْضُوبِ عَلَيْهِمْ وَلَا الضَّالِّينَ،]. {آمين}

ఆ తర్వాత చదవండిః

ఖుర్ఆనులోని ఏదైనా ఒక సూర, లేదా కొన్ని ఆయతులు. తర్వాత రుకూ చేయండి.

రుకూలో

1- సుబ్ హాన రబ్బియల్ అజీం (ముస్లిం 773).

سُبْحَانَ رَبِّيَ الْعَظِيم (ఘనుడైన నా ప్రభువు పరిశుద్ధుడు).

2- సుబ్ హానకల్లాహుమ్మ రబ్బనా వ బిహందిక అల్లాహుమ్మగ్ఫిర్లీ. (బుఖారి 794, ముస్లిం 484).

سُبْحَانَكَ اللَّهُمَّ رَبَّنَا وَبِحَمْدِكَ اللَّهُمَّ اغْفِرْلِي

(మా ప్రభువైన ఓ అల్లాహ్ నీవు పరిశుద్ధునివి, నీకే స్తోత్రములు, ఓ అల్లాహ్ నన్ను మన్నించు).

3- సుబ్బూహున్ ఖుద్దూసున్ రబ్బుల్ మలాఇకతి వర్రూహ్. (ముస్లిం 487).

سُبُّوحٌ قُدُّوسٌ رَبُّ الْـمَلَائِكَةِ وَالرُّوحُ

(దైవదూతలు మరియు జిబ్రీల్ యొక్క ప్రభువు పరిశుద్ధుడు, పరమపవిత్రుడు).

4- సుబ్ హాన జిల్ జబరూతి వల్ మలకూతి వల్ కిబ్రియాఇ వల్ అజమహ్.

سُبْحَانَ ذِي الجَبَرُوتِ وَالمَلَكُوتِ وَالْكِبرِيَاءِ وَالْعَظمَةِ

(సార్వభౌమాధికారి, సర్వాధిపతి, గొప్పవాడు మరియు ఘనుడు అయిన అల్లాహ్ ఎంతో పరిశుద్ధుడు).
(అబూదావూద్ 873, నిసాయి 1049. అల్బానీ సహీ అని అన్నారు).

6- అల్లాహుమ్మ లక రకఅ’తు వ బిక ఆమంతు వ లక అస్లమ్ తు ఖషఅ లక సమ్ఈ వ బసరీ వ ముఖ్ఖీ వ అజమీ వ అసబీ. (ముస్లిం 771).

اللَّهُمَّ لَكَ رَكَعْتُ وَبِكَ آمَنْتُ وَلَكَ أَسْلَمْتُ خَشَعَ لَكَ سَمْعِي وَبَصَرِيْ وَمُخِّي وَعَظَمِي وَعَصَبِي

(అల్లాహ్ నీ కొరకు రుకూ చేశాను. నిన్ను విశ్వసించాను. నీకే శిరసవహించాను. నా చెవులు, కళ్ళు, మెదడు, ఎముక మరియు నరాలు నీ కొరకే నమ్రత చూపుతున్నాయి).

రుకూ నుండి నిలబడి


1- రబ్బనా లకల్ హంద్. (బుఖారి 722).
رَبَّنَا لَكَ الحَمْد (సర్వ స్తోత్రములు నీకే ఓ ప్రభువా).

లేదా రబ్బనా వలకల్ హంద్. (బుఖారి 689, ముస్లిం 392).
رَبَّنَا وَلَكَ الحَمْد

లేదా అల్లాహుమ్మ రబ్బనా లకల్ హంద్.
اللَّهُمَّ رَبَّنَا لَكَ الحَمْد (బుఖారి 796, ముస్లిం 404).

లేదా అల్లాహుమ్మ రబ్బనా వలకల్ హంద్. (బుఖారి 795).
اللَّهُمَّ رَبَّنَا وَلَكَ الحَمْد

నోట్: కొందరు ‘రబ్బనా లకల్ హందు వష్షుక్ర్’ అని అంటారు. అయితే దీని ప్రస్తావన ఏ హదీసులో రాలేదు, గనక దానిని వదులు కొనుటయే మేలు.

2- అల్లాహుమ్మ రబ్బనా లకల్ హందు మిల్ అస్సమావాతి వ మిల్అల్ అర్జి వ మిల్అ మా బైనహుమా వ మిల్అ మా షిఅ’త మిన్ షైఇమ్ బఅ’దు. (ముస్లిం 476).

اللَّهُمَّ رَبَّنَا لَكَ الحَمْدُ مِلْءَ السَّمَاوَاتِ وَمِلْءَ الْأَرْضِ وَمِلْءَ مَا بَيْنَهُمَا وَمِلْءَ مَا شِئْتَ مِنْ شَيْءٍ بَعْدُ

(మా ప్రభువైన ఓ అల్లాహ్! ఆకాశాలు నిండిపోయేంత, భూమి నిండిపోయేంత, భూమ్యాకాశాల మధ్య నిండిపోయేంత మరియు ఆ తర్వాత నీవు కోరిన ప్రతీది నిండిపోయేంత ప్రశంసలు నీ కొరకే).

3- రబ్బనా లకల్ హందు మిల్ఉస్సమావాతి వల్ అర్జి వ మిల్ఉ మా షిఅ’త మిన్ షైఇమ్ బఅ’దు అహ్ లస్సనాఇ వల్ మజ్ది అహఖ్ఖు మా ఖాలల్ అబ్దు వ కుల్లునా లక అబ్దున్, అల్లాహుమ్మ లా మానిఅ లిమా అఅ’తైత వ లా ముఅ’తియ లిమా మనఅ’త వలా యన్ ఫఉ జల్ జద్ది మిన్కల్ జద్దు. (ముస్లిం 477).

رَبَّنَا لَكَ الْحَمْدُ مِلْءُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمِلْءُ مَا شِئْتَ مِنْ شَيْءٍ بَعْدُ أَهْلَ الثَّنَاءِ وَالْمَجْدِ أَحَقُّ مَا قَالَ الْعَبْدُ وَكُلُّنَا لَكَ عَبْدٌ اللَّهُمَّ لَا مَانِعَ لِـمَا أَعْطَيْتَ وَلَا مُعْطِيَ لِمَا مَنَعْتَ وَلَا يَنْفَعُ ذَا الْجَدِّ مِنْكَ الْجَدُّ

(భూమ్యాకాశాలు నిండిపోయేంత, ఆ తర్వాత నీవు కోరిన ప్రతీది నిండిపోయేంత ప్రశంసలు నీ కొరకే మా ప్రభువా! ఓ ఘనతకు, పొగడ్తలకు అధిపతి, దాసుడు పొగిడే దానికి నీవు అర్హుడవు. మేమందరం నీకే దాసులం. అల్లాహ్! నీవు ప్రసాదించే దానిని అడ్డుకునేవాడెవడూ లేడు. నీవు ఇవ్వని దానిని ఎవ్వడూ ఇవ్వలేడు. ఎవరి పెద్దరికం, ఐశ్వర్యం నీ శిక్ష ముందు వారికి లాభం చేకూర్చ లేవు).

4- రబ్బనా వలకల్ హందు హందన్ కసీరన్ తయ్యిబమ్ ముబారకన్ ఫీహ్. (బుఖారి 799).

رَبَّنَا وَلَكَ الْحَمْدُ حَمْدًا كَثِيرًا طَيِّبًا مُبَارَكًا فِيهِ

(మా ప్రభువా! ఎనలేని ఉత్తమమైన, శుభప్రదమైన స్తోత్రములు నీకే).

సజ్దాలో

1-సుబ్ హాన రబ్బియల్ అఅ’లా. (ముస్లిం 772).
سُبْحَانَ رَبِّيَ الأعلَى
(ఉన్నతుడైన నా ప్రభువు పరిశుద్ధుడు).
ఒక్కసారి చదవడం విధిగా ఉంది. ఎక్కువ సార్లు చదవడం చాలా మంచిది.

2- సుబ్ హానకల్లాహుమ్మ రబ్బనా వ బిహందిక అల్లాహుమ్ మగ్ఫిర్లీ. (బుఖారి 794, ముస్లిం 484).
سُبْحَانَكَ اللَّهُمَّ رَبَّنَا وَبِحَمْدِكَ اللَّهُمَّ اغْفِرْلِي
(మా ప్రభువైన ఓ అల్లాహ్ నీవు పరిశుద్ధునివి, నీకే స్తోత్రములు, ఓ అల్లాహ్ నన్ను మన్నించు).

3- సుబ్బూహున్ ఖుద్దూసున్ రబ్బుల్ మలా ఇకతి వర్రూహ్. (ముస్లిం 487).
سُبُّوحٌ قُدُّوسٌ رَبُّ الْـمَلَائِكَةِ وَالرُّوحُ
(దైవదూతలు మరియు జిబ్రీల్ యొక్క ప్రభువు పరిశుద్ధుడు, పరమపవిత్రుడు).

4- సుబ్ హాన జిల్ జబరూతి వల్ మలకూతి వల్ కిబ్రియాఇ వల్ అజమహ్.
(అబూదావూద్ 873, నిసాయి 1049. అల్బానీ సహీ అని అన్నారు).
سُبْحَانَ ذِي الجَبَرُوتِ وَالمَلَكُوتِ وَالْكِبرِيَاءِ وَالْعَظْمَةِ
(సార్వభౌమాధికారి, సర్వాధిపతి, గొప్పవాడు మరియు ఘనుడు అయిన అల్లాహ్ ఎంతో పరిశుద్ధుడు).

5- అల్లాహుమ్మగ్ఫిర్లీ జంబీ కుల్లహూ దిఖ్ఖహూ వ జిల్లహు వ అవ్వలహూ వ ఆఖిరహూ వ అలానియతహూ వ సిర్రహూ. (ముస్లిం 483).

اللَّهُمَّ اغْفِرْلِي ذَنْبِي كُلَّهُ دِقَّهُ وَجِلَّهُ وَأوَّلَهُ وَآخِرَهُ وَعَلَانِيَتَهُ وَسِرَّهُ
(ఓ అల్లాహ్! నా చిన్నా పెద్ద, ముందు వెనక, బహిర్గతమైన, రహస్యమైన పాపాలన్నిటినీ క్షమించు).

6- అల్లాహుమ్మ లక సజత్తు వ బిక ఆమంతు వ లక అస్లమ్ తు సజద వజ్ హియ లిల్లజీ ఖలకహు వ సవ్వరహు వ షక్క సమ్అహు వ బసరహు తబారకల్లాహు అహ్ సనుల్ ఖాలికీన్. (ముస్లిం 771).

اللَّهُمَّ لَكَ سَجَدْتُ وَبِكَ آمَنْتُ وَلَكَ أَسْلَمْتُ سَجَدَ وَجْهِي لِلَّذِي خَلَقَهُ وَصَوَّرَهُ وَشَقَّ سَمْعَهُ وَبَصَرَهُ تَبَارَكَ اللهُ أَحْسَنُ الخَالِقِينَ
(ఓ అల్లాహ్ నేను నీ కొరకు సజ్దా చేశాను, నిన్ను విశ్వసించాను, నీకే శిరసవహించాను, నా ముఖం దానిని సృష్టించిన, ఆకారం ఇచ్చిన, చెవి, కళ్ళు ఇచ్చిన అల్లాహ్ కు సజ్దా చేసింది. అతి ఉత్తమ సృష్టికర్త అయిన అల్లాహ్ చాలా శుభాలు కలవాడు).

7- అల్లాహుమ్మ అఊజు బిరిజాక మిన్ సఖతిక వ బిముఆఫాతిక మిన్ ఉఖూబతిక వ అఊజు బిక మిన్క లా ఉహ్ సీ సనాఅన్ అలైక అంత కమా అస్నైత అలా నఫ్సిక. (ముస్లిం 486).

اللَّهُمَّ أَعُوذُ بِرِضَاكَ مِنْ سَخَطِكَ وَبِمُعَافَاتِكَ مِنْ عُقُوبَتِكَ وَأَعُوذُ بِكَ مِنْكَ لَا أُحْصِي ثَنَاءً عَلَيْكَ أَنْتَ كَمَا أَثْنَيْتَ عَلَى نَفْسِكَ
(ఓ అల్లాహ్! నీ అప్రసన్నత నుండి నీ ప్రసన్నత శరణు, నీ శిక్ష నుండి నీ మన్నింపు శరణు కోరుతున్నాను. నిన్ను నీవు ఎలా స్తుతించుకున్నావో అలా నేను నీ స్తోత్రాలను లెక్కించలేను).

సజ్దాలో ఉన్నప్పుడు ఎక్కువగా దుఆ చేయడం మంచిది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం ఈ హదీసు ఆధారంగాః “దాసుడు తన ప్రభువుకు అత్యంత సమీపంగా ఉండేది సజ్దా స్థితిలో. అందుకు మీరు అందులో దుఆ ఎక్కు వగా చేయండి. (ముస్లిం 482).

రెండు సజ్దాల మధ్యలో

1- రబ్బిగ్ ఫిర్లీ, రబ్బిగ్ ఫిర్లీ. (అబూదావూద్ 874).

رَبِّ اغْفِرْ لِي ، رَبِّ اغْفِرْ لِي
(ప్రభువా నా పాపాలను మన్నించు (2).

2- అల్లాహుమ్ మగ్ఫిర్లీ వర్ హమ్నీ వ ఆఫినీ వహ్ దినీ వర్ జుఖ్నీ. (అబూదావూద్ 850).

اللَّهُمَّ اغْفِرْلِي وَارْحَمْنِي وَعَافِنِي وَاهْدِنِي وَارْزُقْنِي
(ఓ అల్లాహ్ నన్ను క్షమించు, కరుణించు, నాకు స్వస్తత, సన్మార్గం మరియు ఆహారం ప్రసాదించు).

సజ్దయే తిలావత్ చేయునప్పుడు

ఖుర్ఆనులో 15 సజ్దా ఆయతులున్నాయి, ఖుర్ఆన్ పారాయణ సందర్భంగా వాటిలో ఏ ఒక్క ఆయతు వచ్చినా అచ్చట ఆగి సజ్దా చేయాలి. అప్పుడు ఈ క్రింది దుఆ చదవాలి.

1-సజద వజ్ హియ లిల్లజీ ఖలకహూ వ షక్క సమ్అహూ వ బసరహూ బిహౌలిహీ వ కువ్వతిహీ [ఫతబారకల్లాహు అహ్ సనుల్ ఖాలిఖీన్]. (తిర్మిజి 580 [హాకిం 802]).

سَجَدَ وَجْهِي لِلَّذِي خَلَقَهُ وَشَقَّ سَمْعَهُ وَبَصَرَهُ بِحَوْلِهِ وَقُوَّتِهِ {فَتبَارَك اللهُ أَحسَنَ الخَالِقِين}
(నా ముఖం, తన శక్తి సామర్థ్యాలతో దానిని సృష్టించిన, చెవి, కళ్ళు ఇచ్చిన అల్లాహ్ కు సజ్దా చేసింది. అతి ఉత్తమ సృష్టి కర్త అయిన అల్లాహ్ చాలా శుభాలు కలవాడు).

2- అల్లాహుమ్మక్ తుబ్ లీ బిహా ఇందక అజ్రా, వ జఅ’ అన్నీ బిహా విజ్రా, వజ్అల్ హా లీ ఇందక జుఖ్రా, వ తఖబ్బల్ హా మిన్నీ కమా తఖబ్బల్ తహా మిన్ అబ్దిక దావూద్.
(తిర్మిజి 579, 3424).

اللَّهُمَّ اكْتُبْ لِي بِهَا عِنْدَكَ أَجْرًا وَضَعْ عَنِّي بِهَا وِزْرًا وَاجْعَلْهَا لِي عِنْدَكَ ذُخْرًا وَتَقَبَّلْهَا مِنِّي كَمَا تَقَبَّلْتَهَا مِنْ عَبْدِكَ دَاوُدَ
(ఈ సజ్దాకు బదులుగా నీ వద్ద నా కొరకు పుణ్యం వ్రాసి పెట్టు, నాపై ఉన్న పాపాల భారం దించిపెట్టు, పుణ్యఫలం భద్రంగా స్టోర్ చేసిపెట్టు మరియు నీ (ప్రియ)దాసుడైన దావూద్ అలైహిస్సలాం నుండి అంగీకరించినట్లు నాతో అంగీకరించు).

తషహ్హుద్ లో

అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వరహ్మతుల్లాహి వబరకాతుహూ అస్సలాము అలైనా వఅలా ఇబాదిల్లా- హిస్సాలిహీన్ అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వఅష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వరసూలుహు. (బుఖారి 831).

التَّحِيَّاتُ لله وَالصَّلَوَاتُ وَالطَّيِّبَاتُ السَّلَامُ عَلَيْكَ أَيُّهَا النَّبِيُّ وَرَحْمَةُ الله وَبَرَكَاتُهُ السَّلَامُ عَلَيْنَا وَعَلَى عِبَادِ الله الصَّالِحِينَ أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه

(నా వాక్కు, దేహా, ధన సంబంధమైన ఆరాధనలన్నియూ అల్లాహ్ కొరకే ఉన్నవి. ఓ ప్రవక్తా! మీపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు ఆయన శుభాలు కురువుగాకా. అల్లాహ్ తప్ప వేరు ఆరాధ్యుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. ముహమ్మద్ అల్లాహ్ యొక్క దాసుడు, సందేశహరుడని సాక్ష్యమిస్తున్నాను).

ప్రవక్తపై దరూద్

అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదివ్ వఅలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదివ్ వఅలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్ త అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్. (బుఖారి 3370).

اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ كَمَا صَلَّيْتَ عَلَى إِبْرَاهِيمَ وَعَلَى آلِ إِبْرَاهِيمَ إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ اللَّهُمَّ بَارِكْ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ كَمَا بَارَكْتَ عَلَى إِبْرَاهِيمَ وَعَلَى آلِ إِبْرَاهِيمَ إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ

(ఓ అల్లాహ్ నీవు ఇబ్రాహీం అలైహిస్సలాంను, వారి కుటుంబీ- కులను కరుణించినట్లు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు వారి కుటుంబీకులను కరుణించు. నిశ్చయంగా నీవు స్తోత్రాలకు అర్హునివి, ఘనుడివి. ఓ అల్లాహ్ నీవు ఇబ్రాహీం అలైహిస్సలాం, వారి కుటుంబీకులకు శుభాలు దయ చేసినట్లు ముహమ్మ ద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారి కుటుంబీకులకు శుభాలు దయ చేయుము. నిశ్చయంగా నీవు స్తోత్రాలకు అర్హునివి, ఘనుడివి.).

సలాంకు ముందు

1- అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మిన్ అజా బిల్ ఖబ్రి వమిన్ అజాబిన్నారి వమిన్ ఫిత్నతిల్ మహ్ యా వల్ మమాతి వమిన్ ఫిత్నతిల్ మసీహిద్దజ్జాల్. (ముస్లిం 589, బుఖారి 833).

اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ عَذَابِ الْقَبْرِ وَأَعُوذُ بِكَ مِنْ فِتْنَةِ الْمَسِيحِ الدَّجَّالِ وَأَعُوذُ بِكَ مِنْ فِتْنَةِ الْمَحْيَا وَالْمَمَاتِ اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْمَأْثَمِ وَالْمَغْرَمِ
(ఓ అల్లాహ్! సమాధి శిక్ష నుండి నీ శరణులోకి వస్తున్నాను, మసీహుద్దజ్జాల్ ఉపద్రవము నుండి నీ శరణులోకి వస్తున్నా- ను, జీవన్మరణాల విపత్తు నుండి నీ శరణులోకి వస్తున్నాను, పాపం మరియు అప్పు నుండి నీ శరణులోకి వస్తున్నాను).

2- అల్లాహుమ్మ ఇన్నీ జలమ్తు నఫ్సీ జుల్మన్ కసీరవ్ వలా యగ్ఫి రుజ్జునూబ ఇల్లా అంత ఫగ్ఫిర్లీ మగ్ఫిరతమ్ మిన్ ఇందిక వర్ హమ్నీ ఇన్నక అంతల్ గఫూరుర్రహీం.

اللَّهُمَّ إِنِّي ظَلَمْتُ نَفْسِي ظُلْمًا كَثِيرًا وَلَا يَغْفِرُ الذُّنُوبَ إِلَّا أَنْتَ فَاغْفِرْ لِي مَغْفِرَةً مِنْ عِنْدِكَ وَارْحَمْنِي إِنَّك أَنْتَ الْغَفُورُ الرَّحِيمُ
(ఓ అల్లాహ్ నా ఆత్మకు నేను చాలా అన్యాయం చేసు కున్నాను. నీవు తప్ప పాపాలను క్షమించేవారు మరెవ్వరూ లేరు. నీవు నీ ప్రత్యేక అనుగ్రహంతో నన్ను క్షమించు, నా మీద దయచూపు, నిశ్చయంగా నీవు క్షమించేవాడవు, కరుణామయుడవు). (బుఖారి 834).

3- అల్లాహుమ్ మగ్ఫిర్లీ మా ఖద్దమ్ తు వమా అఖ్ఖర్ తు వమా అస్ రర్ తు వమా అఅ’లంతు వమా అస్ రఫ్ తు వమా అంత అఅ’లము బిహీ మిన్నీ అంతల్ ముఖద్ది- ము వ అంతల్ ముఅ ఖ్ఖిరు లాఇలాహ ఇల్లా అంత.

اللَّهُمَّ اغْفِرْ لِي مَا قَدَّمْتُ وَمَا أَخَّرْتُ وَمَا أَسْرَرْتُ وَمَا أَعْلَنْتُ وَمَا أَسْرَفْتُ وَمَا أَنْتَ أَعْلَمُ بِهِ مِنِّي أَنْتَ الْمُقَدِّمُ وَأَنْتَ الْمُؤَخِّرُ لَا إِلَهَ إِلَّا أَنْتَ

(అల్లాహ్! నా పూర్వ పాపాలను, జరగబోయే పాపాలను, రహస్యంగా చేసిన పాపాలను, బహిరంగంగా చేసిన పాపాలను మరియు నా మితిమీరినతనాన్ని కూడా క్షమించు. మరికొన్ని పాపాలు ఉండవచ్చు, వాటి గురించి నా కంటే ఎక్కువ నీకే బాగా తెలుసు, వాటిని కూడా నీవు క్షమించు. ముందుకు నడిపించేవాడివి, వెనక్కి నెట్టేవాడివి నీవే. నీవు తప్ప వెరొక ఆరాధ్యుడు లేడు).

4- అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మినల్ అజ్ జి వల్ కసలి వల్ జుబ్ని వల్ హరమి వల్ బుఖ్ లి వ అఊజు బిక మిన్ అజాబిల్ ఖబ్రి వమిన్ ఫిత్నతిల్ మహ్ యా వల్ మమాత్. (ముస్లిం 2706, బుఖారి 2823).

اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ الْعَجْزِ وَالْكَسَلِ وَالْجُبْنِ وَالْهَرَمِ وَالْبُخْلِ وَأَعُوذُ بِكَ مِنْ عَذَابِ الْقَبْرِ وَمِنْ فِتْنَةِ الْمَحْيَا وَالْمَمَاتِ
(ఓ అల్లాహ్ (మంచి పనులు) చేయలేకపోవటం నుంచి, శక్తి ఉండి కూడా సోమరితనానికి లోనవటం నుంచి, పిరికితనం నుంచి, నికృష్టమైన వృద్ధాప్యం నుంచి నీ శరణు కోరుతున్నాను. ఇంకా సమాధి శిక్ష నుండి మరియు జీవన్మరణాల ఉపద్రవం నుంచి నీ శరణు కోరుతున్నాను).

5-అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక యా అల్లాహుల్ వాహిదుల్ అహదుస్ సమదుల్లజీ లమ్ యలిద్ వలమ్ యూలద్ వలమ్ యకుల్లహూ కుఫువన్ అహద్. అన్ తగ్ఫిరలీ జునూబీ ఇన్నక అంతల్ గఫూరుర్రహీం. (అబూదవూద్ 985).

اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ يَا أَللهُ الْأَحَدُ الصَّمَدُ الَّذِي لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ وَلَمْ يَكُنْ لَهُ كُفُوًا أَحَدٌ أَنْ تَغْفِرَ لِي ذُنُوبِي إِنَّكَ أَنْتَ الْغَفُورُ الرَّحِيمُ
(అద్వితీయునివి, నిరపేక్షాపరునివి, సంతానము, తల్లి దండ్రులు లేని మరియు ఏ ఒక్కరికి సరిసమానము కాని ఓ అల్లాహ్! నీవు నా పాపాల ప్రక్షాలనం చేయా లని కోరుతున్నాను. నిశ్చయంగా నీవు క్షమించే, కరుణించేవానివి).

ఒక వ్యక్తి తషహ్హుద్ లో ఈ దుఆ చదువుతున్నది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విని ఇతడు క్షమించబడ్డాడు అని శుభవార్త ఇచ్చారు.

6- అల్లాహుమ్మ బిఇల్మికల్ గైబ వ ఖుద్రతిక అలల్ ఖల్ఖ్, అహ్ యినీ మా అలిమ్ తల్ హయాత ఖైరల్లీ వ తవఫ్ఫనీ ఇజా అలిమ్ తల్ వఫాత ఖైరల్లీ, వ అస్అలుక ఖష్ యతక ఫిల్ గైబి వష్షహాద, వ కలిమతల్ ఇఖ్లాసి ఫిర్రిజా వల్ ఘజబ్, వ అస్అలుక నఈమల్ లా యన్ ఫద్, వ ఖుర్రత ఐనిల్ లా తన్ ఖతిఅ’, వఅస్అలుకర్ రిజా బిల్ ఖజా, వ బర్దల్ ఐషి బాదల్ మౌత్, వ లజ్జతన్ నజరి ఇలా వజ్ హిక వ ష్షౌఖ ఇలా లిఖాఇక్, వ అఊజు బిక మిన్ జర్రాఅ ముజిర్రతిన్ వ ఫిత్నతిమ్ ముజిల్లహ్, అల్లాహుమ్మ జయ్యిన్నా బిజీనతిల్ ఈమాన్, వజ్అల్నా హుదాతమ్ ముహ్తదీన్.

اللَّهُمَّ بِعِلْمِكَ الْغَيْبَ وَقُدْرَتِكَ عَلَى الْخَلْقِ أَحْيِنِي مَا عَلِمْتَ الْحَيَاةَ خَيْرًا لِي وَتَوَفَّنِي إِذَا عَلِمْتَ الْوَفَاةَ خَيْرًا لِي اللَّهُمَّ وَأَسْأَلُكَ خَشْيَتَكَ فِي الْغَيْبِ وَالشَّهَادَةِ وَأَسْأَلُكَ كَلِمَةَ الْحَقِّ فِي الرِّضَا وَالْغَضَبِ وَأَسْأَلُكَ الْقَصْدَ فِي الْفَقْرِ وَالْغِنَى وَأَسْأَلُكَ نَعِيمًا لَا يَنْفَدُ وَأَسْأَلُكَ قُرَّةَ عَيْنٍ لَا تَنْقَطِعُ وَأَسْأَلُكَ الرِّضَاءَ بَعْدَ الْقَضَاءِ وَأَسْأَلُكَ بَرْدَ الْعَيْشِ بَعْدَ الْمَوْتِ وَأَسْأَلُكَ لَذَّةَ النَّظَرِ إِلَى وَجْهِكَ وَالشَّوْقَ إِلَى لِقَائِكَ فِي غَيْرِ ضَرَّاءَ مُضِرَّةٍ وَلَا فِتْنَةٍ مُضِلَّةٍ اللَّهُمَّ زَيِّنَّا بِزِينَةِ الْإِيمَانِ وَاجْعَلْنَا هُدَاةً مُهْتَدِينَ

(ఓ అల్లాహ్! నీవు అగోచర జ్ఞానంగలవానివి, నీ సృష్టిపై సంపూర్ణ అధికారంగలవానివి కనుక, జీవితం నా కొరకు ఎంత వరకు మేలు అని నీకు తెలియునో అంత వరకు నన్ను సజీవంగా ఉంచు, మరెప్పుడైతే మరణం నా కొరకు మేలు అని నీకు తెలియునో అప్పుడే నాకు మరణం ప్రసాదించు, గోచర (బాహ్యం) మరియు అగోచర (అంతర్యం) సర్వ స్థితుల్లో నీ భయం ఉండాలని కోరుతున్నాను, కోపం, ప్రశాంతం అన్ని వేళల్లో సత్యంపలికాలని వేడుకుంటున్నాను, కలిమిలోనైనా, లేమిలోనైనా (హెచ్చుతగ్గులకు గురి కాకుండా) మధ్యేమార్గంలో ఉండాలని కోరుతున్నాను, ఎన్నడూ నశించని అనుగ్రహం నీతో కోరుతున్నాను, ఎన్నాడూ అంతంకాని కంటి చలువ నీతో కోరుతు- న్నాను, నీ నిర్ణయాలపై తృప్తి చెందే భాగ్యం నీతో తలుస్తున్నాను, మరణం తర్వాత చల్లని/సుఖమయ జీవితం నీతో కోరుతున్నాను, నీ ముఖదర్శనభాగ్య ఆనందం మరియు నిన్ను కలుసుకునే కాంక్ష నీతో కోరుతున్నాను, ఇవి ఎలాంటి బాధకరమైన కష్టంతో మరియు మార్గభ్రష్టతకు గురి చేయని ఉపద్రవంతో ప్రాప్తించు. ఓ అల్లాహ్! మమ్మల్ని విశ్వాస అంకరణతో అలంకరించు, మమ్మల్ని సన్మార్గగామి మరియు మార్గదర్శిగా చేయు.

7- అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ జన్నత వ అఊజు బిక మినన్నార్. (అబూదావూద్ 792, ఇబ్నుమాజ 910).
اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ الْجَنَّةَ وَأَعُوذُ بِكَ مِنَ النَّارِ

సలాంకు ముందు ఎక్కువ దుఆ చేయాలి

అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించిన ఓ హదీసులో తషహ్హుద్ దుఆ నేర్పుతూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారుః “ఆ తర్వాత తనకిష్టమైన దుఆ చేసుకోవాలి”. (బుఖారి 835).

సలాం తర్వాత

1- అస్తగ్ఫిరుల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్, అల్లాహుమ్మ అంతస్సలాం వ మిన్కస్సలాం తబారక్త యాజల్ జలాలి వల్ ఇక్రామ్. (ముస్లిం 592).

اَسْتَغْفِرُ الله ، اَسْتَغْفِرُ الله ، اَسْتَغْفِرُ الله ، اَللهُمَّ أَنْتَ السَّلامُ ومِنْكَ السَّلامُ تَبَارَكْتَ يَا ذَا الجَلالِ وَ الإكْرَام.
(అల్లాహ్ నీ క్షమాభిక్ష కోరుతున్నాను… అల్లాహ్ నీవే సలాం. శాంతి నీ నుండి లభిస్తుంది. ఔన్నత్యం, గొప్పదనాలు గలవాడా నీవు గొప్ప శుభాలు కలవాడివి).

2- లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ అల్లా హుమ్మ లా మానిఅ లిమా అఅ’తైత వలా ముఅ’తియ లిమా మనఅ’త వలా యన్ ఫఉ జల్ జద్ది మిన్కల్ జద్దు. (బుఖారి 844, ముస్లిం 593).

لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ اللَّهُمَّ لَا مَانِعَ لِمَا أَعْطَيْتَ وَلَا مُعْطِيَ لِمَا مَنَعْتَ وَلَا يَنْفَعُ ذَا الْجَدِّ مِنْكَ الْجَدُّ

(అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు. ఆయన ఏకైకుడు, సాటిలేనివాడు. విశ్వసామ్రాజ్యం ఆయనదే. స్తోత్రములు ఆయనకే చెల్లును. ఆయన సర్వాధికారుడు. ఓ అల్లాహ్! నీవు ప్రసాదించే దానిని అడ్డుకునేవాడెవడూ లేడు. నీవు ఇవ్వని దానిని ఎవ్వడూ ఇవ్వలేడు. ఎవరి పెద్దరికం, ఐశ్వర్యం నీ శిక్ష ముందు వారికి లాభం చేకూర్చ లేవు).

3- లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహి లాఇలాహ ఇల్లల్లాహు వలా నఅ’బుదు ఇల్లా ఇయ్యా- హు లహున్నిఅ’మతు వలహుల్ ఫజ్లు వలహుస్స నాఉల్ హసన్ లా ఇలాహ ఇల్లల్లాహు ముఖ్లి సీన లహుద్దీన వలౌ కరిహల్ కాఫిరూన్. (ముస్లిం 594).

لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ لَهُ الْـمُلكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِالله لَا إِلَهَ إِلَّا اللهُ وَلَا نَعْبُدُ إِلَّا إِيَّاهُ لَهُ النِّعْمَةُ وَلَهُ الْفَضْلُ وَلَهُ الثَّنَاءُ الْحَسَنُ لَا إِلَهَ إِلَّا اللهُ مُخْلِصِينَ لَهُ الدِّينَ وَلَوْ كَرِهَ الْكَافِرُونَ

(అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు. ఆయన ఏకైకుడు, సాటిలేనివాడు. విశ్వసామ్రాజ్యం ఆయనదే. స్తోత్రములు ఆయనకే చెల్లును. ఆయన సర్వాధికారుడు. పుణ్యాలు చేసే, పాపాల నుండి దూరముండే భాగ్యం అల్లాహ్ యే ప్రసాదించువాడు, ఆ అల్లాహ్ తప్ప వెరొక ఆరాధ్యుడు లేడు. మేము ఆయన్నే ఆరాధిస్తాము. వరాలు, అనుగ్రహాలు ఆయన ప్రసా దించినవే. మంచి స్తోత్రాలు ఆయనకే శోభిస్తాయి. అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు. సత్యతిరస్కారులకు ఎంత అయిష్టకరంగా ఉన్నా సరే మేము మా ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకున్నాము.).

4-సుబ్డహానల్లాహ్ 33 సార్లు, అల్ హం దులిల్లాహ్ 33 సార్లు, అల్లాహు అక్బర్ 33 సార్లు అనాలి. వంద పూర్తి చేయుటకు ఒక్క సారి అనాలిః “లాఇ లాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్”. (ముస్లిం 597).

పై జిక్ర్ వంద లెక్క పూర్తి చేసినవారి పాపాలు సముద్రపు నురగంత ఉన్నా మన్నించబడతాయి. (ముస్లిం 597).

5-అల్లాహుమ్మ అఇన్నీ అలా జిక్రిక వ షుక్రిక వ హస్ని ఇబాదతిక. (అబూదావూద్ 1522).

اللَّهُمَّ أَعِنِّي عَلَى ذِكْرِكَ وَشُكْرِكَ وَحُسْنِ عِبَادَتِك
(అల్లాహ్! నేను నీ ధ్యానం చేయటానికి, నీకు కృతజ్ఞతలు తెలుపుకోటానికి, తగురీతిలో నిన్ను ఆరాధించటానికి నాకు సహాయం చెయ్యి).

6-అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మినల్ జుబ్ని వఅఊజు బిక మిన్ అన్ అరుద్ద ఇలా అర్జలిల్ ఉమురి వ అఊజు బిక మిన్ ఫిత్నతిద్దున్యా వ అఊజు బిక మిన్ అజాబిల్ ఖబ్ర్. (బుఖారి 2822).

اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ الْجُبْنِ وَأَعُوذُ بِكَ أَنْ أُرَدَّ إِلَى أَرْذَلِ الْعُمُرِ وَأَعُوذُ بِكَ مِنْ فِتْنَةِ الدُّنْيَا وَأَعُوذُ بِكَ مِنْ عَذَابِ الْقَبْرِ
(అల్లాహ్! పిరికితనం నుండి నీ శరణు వేడుతున్నాను. నికృష్టమైన వృద్ధాప్యానికి చేరుకోవటం నుండి నీ శరణు కోరుతున్నాను. ప్రాపంచిక ఉపద్రవాల నుండి నీ శరణు వేడుతున్నాను. సమాధి యాతనల నుండి నీ శరణు వేడుతున్నాను).

7- (1) బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం, ఖుల్ హువల్లాహు అహద్, అల్లాహుస్సమద్, లమ్ యలిద్, వలమ్ యూలద్, వలమ్ యకుల్లహూ కుఫువన్ అహద్. (2) బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం, ఖుల్ అఊజు బిరబ్బిల్ ఫలఖ్, మిన్ షర్రి మా ఖలఖ్, వ మిన్ షర్రి గాసిఖిన్ ఇజా వఖబ్, వ మిన్ షర్రిన్ నఫ్ఫాసాతి ఫిల్ ఉఖద్, వమిన్ షర్రి హాసిదిన్ ఇజా హసద్. (3) బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం, ఖుల్ అఊజు బిరబ్బిన్నాస్, మలికిన్నాస్, ఇలాహిన్నాస్, మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్, అల్లజీ యువస్విసు ఫీ సుదూరిన్నాస్, మినల్ జిన్నతి వన్నాస్”. (అబూదావూద్ 1523).

[بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ] [قُلْ هُوَ اللهُ أَحَدٌ ، اللهُ الصَّمَدُ ، لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ ، وَلَمْ يَكُنْ لَهُ كُفُوًا أَحَدٌ]. [بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ] [قُلْ أَعُوذُ بِرَبِّ الفَلَقِ ، مِنْ شَرِّ مَا خَلَقَ ، وَمِنْ شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ ، وَمِنْ شَرِّ النَّفَّاثَاتِ فِي العُقَدِ ، وَمِنْ شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ]. [بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ] [قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ ، مَلِكِ النَّاسِ ، إِلَهِ النَّاسِ ، مِنْ شَرِّ الوَسْوَاسِ الخَنَّاسِ ، الَّذِي يُوَسْوِسُ فِي صُدُورِ النَّاسِ ، مِنَ الجِنَّةِ وَالنَّاسِ]

((1) ఇలా అనుః ఆయనే అల్లాహ్, ఏకైకుడు, అల్లాహ్ ఎవరి అక్కరా లేనివాడు, ఆయనకు సంతానం లేదు మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ కాడు, ఆయనకు సరిసమానుడు ఎవడూ లేడు. (2) ఇలా అనుః నేను ఉదయ కాలపు ప్రభువు శరణులోకి వస్తున్నాను, ఆయన సృష్టించిన ప్రతిదాని కీడు నుండి, చిమ్మచీకటి కీడు నుండి ఎప్పుడైతే అది క్రమ్ముకుంటుందో, ముడుల మీద మంత్రించి ఊదే వారి కీడు నుండి, మరియు అసూయపరుడి కీడు నుండి, ఎప్పుడైతే అతడు అసూయపడతాడో. (3) ఇలా అనుః నేను మానవుల ప్రభువు, మానవుల సార్వభౌముడు, మానవుల ఆరాధ్య దైవం యొక్క శరణులోకి వస్తున్నాను, కలతలు రేకెత్తించి తొలగిపోయేవాని కీడు నుండి, ఎవడైతే మానవుల హృదయాలలో కలతలు రేకెత్తిస్తాడో, వాడు జిన్నాతులలోని వాడూ కావచ్చు లేదా మానవులలోని వాడూ కావచ్చు).

8-అల్లాహు లాఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూం లా తాఖుజుహూ సినతుఁ వలా నౌం, లహూ మా ఫిస్సమావాతి వమా ఫిల్ అర్జి మన్ జల్లజీ యష్ ఫఉ ఇందహూ ఇల్లా బిఇజ్నిహీ యఅ’లము మా బైన ఐదీహిం వమా ఖల్ఫహుం వలా యుహీతూన బిషైఇమ్ మిన్ ఇల్మిహీ ఇల్లా బిమా షాఅ వసిఅ కుర్సియ్యుహు- స్సమావాతి వల్ అర్జ వలా యఊదుహూ హిఫ్జు- హుమా వహువల్ అలీయ్యుల్ అజీం. (సూ. బఖర 255). (ఈ ఆయతును ‘ఆయతుల్ కుర్సీ’ అని అంటారు).

[اللهُ لَا إِلَهَ إِلَّا هُوَ الحَيُّ القَيُّومُ لَا تَأْخُذُهُ سِنَةٌ وَلَا نَوْمٌ لَهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الأَرْضِ مَنْ ذَا الَّذِي يَشْفَعُ عِنْدَهُ إِلَّا بِإِذْنِهِ يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ وَلَا يُحِيطُونَ بِشَيْءٍ مِنْ عِلْمِهِ إِلَّا بِمَا شَاءَ وَسِعَ كُرْسِيُّهُ السَّمَاوَاتِ وَالأَرْضَ وَلَا يَئُودُهُ حِفْظُهُمَا وَهُوَ العَلِيُّ العَظِيمُ]

(అల్లాహ్! ఆయన తప్ప మరొక సత్యఆరాధ్యుడు ఎవ్వడూ లేడు. ఆయన నిత్యుడు, విశ్వవ్యవస్థకు ఆధారభూతుడు, ఆయనకు కునుకురాదు మరియు నిదురరాదు. భూమ్యా- కాశాలలో ఉన్న సమస్తమూ ఆయనకు చెందినదే, ఆయన సమ్ముఖంలో -ఆయన అనుజ్ఞ లేకుండా- సిఫారసు చేయగలవాడెవడు? వారి ముందున్నదీ మరియు వారి వెనుక ఉన్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు, మరియు ఆయన కోరితే తప్ప, ఆయన జ్ఞానవిశేషాలలో ఏ విషయమునూ వారు గ్రహించజాలరు, ఆయన కుర్సీ ఆకాశాలనూ మరియు భూమినీ పరివేష్టించి ఉన్నది. వాటి సంరక్షణ ఆయనకు ఏ మాత్రం అలసట కలిగించదు. మరియు ఆయన అత్యున్నతుడు, సర్వోత్తముడు).

ప్రతి ఫర్జ్ నమాజు తర్వాత ఆయతుల్ కుర్సీ చదివిన వారు స్వర్గంలో ప్రవేశించడానికి చావు మాత్రమే అడ్డు ఉంటుంది. (సహీహ 972).

9- అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక ఇల్మన్ నాఫిఅ, వరిజ్ఖన్ తయ్యిబ, వ అమలమ్ ముతఖబ్బల. (ఇబ్ను మాజ 925).

اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ عِلْمًا نَافِعًا وَرِزْقًا طَيِّبًا وَعَمَلًا مُتَقَبَّلًا
(ఓ అల్లాహ్! నేను నీతో ప్రయోజనకరమైన జ్ఞానం, పవిత్ర ఆహారం మరియు అంగీకరింపబడే ఆచరణ కోరుతున్నాను).

నమాజు తర్వాతగల దుఆల మరికొన్ని ఘనతలు తెలుసుకొనుటకు “నమాజు నిధులు” అన్న మా పుస్తకం చదవండి.

ఇస్తిఖార నమాజులో

(ఏదైనా పని గురించి ఆలోచించి, ఎలా చేస్తే మేలుంటుంది అనుకున్నప్పుడు ఏ ఒక నిర్ణయానికి రాక ముందు ఫర్జ్ నమాజు కాకుండా రెండు రకాతుల నఫిల్ నమాజు చేసి సలాంకు ముందు లేదా సలాం తింపిన తర్వాత ఈ క్రింది దుఆ పఠించాలి. అయితే “అన్నహాజల్ అమ్ర” అన్న చోట తన అవసరాన్ని గురించి ఆలోచించుకోవాలి, లేదా అవసరాన్ని ప్రస్తావించాలి. దుఆ ఇలా ఉందిః)

అల్లాహుమ్మ ఇన్నీ అస్తఖీరుక బిఇల్మిక వ అస్తఖ్దిరుక బి ఖుద్రతిక వ అస్అలుక మిన్ ఫజ్లికల్ అజీం ఫఇన్నక తఖ్దిరు వలా అఖ్దిరు వ తఅ’లము వలా అఅ’లము వ అంత అల్లా ముల్ గుయూబ్, అల్లాహుమ్మ ఇన్ కుంత తఅ’లము అన్న హాజల్ అమ్ర ఖైరుల్లీ ఫీ దీనీ వ మఆషీ వ ఆఖిబతి అమ్రీ ఔ ఖాల ఆజిలి అమ్రీ వ ఆజిలిహీ ఫఖ్దుర్ హు లీ వ యస్సిర్ హు లీ సుమ్మ బారిక్ లీ ఫీహి వ ఇన్ కుంత తఅ’లము అన్న హాజల్ అమ్ర షర్రుల్లీ ఫీ దీనీ వ మఆషీ వ ఆఖిబతి అమ్రీ ఔ ఖాల ఫీ ఆజిలి అమ్రీ వ ఆజిలిహీ ఫస్రిఫ్ హు అన్నీ వస్రిఫ్ నీ అన్హు వఖ్ దుర్ లియల్ ఖైర హైసు కాన సుమ్మ అర్జినీ బిహీ. (బుఖారి 1166).

اللَّهُمَّ إِنِّي أَسْتَخِيرُكَ بِعِلْمِكَ وَأَسْتَقْدِرُكَ بِقُدْرَتِكَ وَأَسْأَلُكَ مِنْ فَضْلِكَ الْعَظِيمِ فَإِنَّكَ تَقْدِرُ وَلَا أَقْدِرُ وَتَعْلَمُ وَلَا أَعْلَمُ وَأَنْتَ عَلَّامُ الْغُيُوبِ اللَّهُمَّ إِنْ كُنْتَ تَعْلَمُ أَنَّ هَذَا الْأَمْرَ خَيْرٌ لِي فِي دِينِي وَمَعَاشِي وَعَاقِبَةِ أَمْرِي أَوْ قَالَ عَاجِلِ أَمْرِي وَآجِلِهِ فَاقْدُرْهُ لِي وَيَسِّرْهُ لِي ثُمَّ بَارِكْ لِي فِيهِ وَإِنْ كُنْتَ تَعْلَمُ أَنَّ هَذَا الْأَمْرَ شَرٌّ لِي فِي دِينِي وَمَعَاشِي وَعَاقِبَةِ أَمْرِي أَوْ قَالَ فِي عَاجِلِ أَمْرِي وَآجِلِهِ فَاصْرِفْهُ عَنِّي وَاصْرِفْنِي عَنْهُ وَاقْدُرْ لِي الْخَيْرَ حَيْثُ كَانَ ثُمَّ أَرْضِنِي به

(అల్లాహ్! నీ జ్ఞానంతో నేను శుభాలను అడుగుతున్నాను. నీ అధికార సాయంతో శక్తిని ప్రసాదించమని కోరుతున్నాను. మహోత్తరమైన నీ అనుగ్రహాన్ని ప్రసాదించమని అభ్యర్తి- స్తున్నాను. నిశ్చయంగా నువ్వు అధికారం గలవాడివి. నాకు ఎలాంటి అధికారమూ లేదు. నీకు అన్నీ తెలుసు, నాకు ఏమీ తెలియదు. అగోచర జ్ఞానివి నీవే. అల్లాహ్! నీ జ్ఞానం ప్రకారం ఈ పని ధార్మికంగా, ప్రాపంచికంగా, పరలోక పరిణామం రీత్యా (లేదా) త్వరగా లేక ఆలస్యంగా నాకు ప్రయోజనకరమైతే దాన్ని నా అదృష్టంలో ఉంచు. దాని సాధనను నా కొరకు సులభతరం చెయ్యి. దాన్ని నా కొరకు శుభప్రదమైనదిగా చెయ్యి. కాని ఒకవేళ నీ జ్ఞానం ప్రకారం ఈ పని ధార్మికంగా, ప్రాపంచికంగా, పరలోక పరిణామం రీత్యా (లేదా) త్వరగా గానీ, ఆలస్యంగా గానీ నాకు నష్టం కలిగించేదయితే దాన్ని నా నుండి దూరంగా ఉంచు. దాని బారి నుండి నన్ను కాపాడు. సాఫల్యం ఎక్కడున్నాసరే దాన్ని నా అదృష్టంగా మలచు. ఆ తర్వాత నా మనసు దానిపై కుదుటపడేలా చెయ్యి).

ఉదయసాయంకాలపు జిక్ర్ ఘనత

“నేను, ఫజ్ర్ నమాజ్ తర్వాత నుండి సూర్యోదయం వరకు అల్లాహ్ స్మరణ చేస్తూ ఉండేవారితో కూర్చుండడం ఇస్మాఈల్ అలైహిస్సలాం సంతానంలోని నలుగురు బానిసలను విడుదల చేయుటకంటే ఎక్కువ ఇష్టం, మరియు అస్ర్ నమాజు తర్వాత నుండి సూర్యాస్తమయం వరకు అల్లాహ్ స్మరణ చేస్తూ ఉండేవారితో కూర్చుండడం ఇస్మాఈల్ అలైహిస్సలాం సంతానంలోని నలుగురు బానిసలను విడుదల చేయుటకంటే ఎక్కువ ఇష్టం” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. (అబూదావూద్ 3667). షొఅబుల్ ఈమాన బైహఖీ (556)లో ఎనిమిది మంది బానిసల ప్రస్తావన ఉంది. అలాగే ప్రపంచం అందులో ఉన్న సర్వానికంటే ఎక్కువ ఇష్టం అని కూడా ఉంది. (555).

“ఎవరైనా సామూహికంగా ఫజ్ర్ నమాజు చేసిన తర్వాత అల్లాహ్ ను స్మరిస్తూ ఉండి, సూర్యోదయం తర్వాత రెండు రకాతులు చేస్తాడో అతనికి ఒక ఉమ్రా, ఒక హజ్ చేసినంత సంపూర్ణ పుణ్యం లభిస్తుంది” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (తిర్మిజి 586).

ఫజ్ర్ నమాజ్ చేసి అదే స్థలంలో కూర్చొని ఉండే వ్యక్తిపై ‘అల్లాహ్ ఇతడిని క్షమించు, ఇతడిని కరుణించు’మని దైవ దూతలు దుఆ చేస్తారు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని అలీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (అహ్మద్ 1/144).

నోట్: అల్లాహ్ స్మరణ అంటే క్రింద తెలుపబడిన దుఆలు, ఖుర్ఆన్ పారాయణం, సుబ్ హానల్లాహ్, అల్ హందులిల్లాహ్, అల్లాహు అక్బర్, లాఇలాహ ఇల్లల్లాహ్, దరూదె ఇబ్రాహీం వైగారాలు చదవడం.

ఉదయం మరియు సాయంకాలం చదవండి

1- ఆయతుల్ కుర్సీ.

ఉదయం ఆయతుల్ కుర్సీ చదివినవారు సాయం- కాలం వరకు మరియు సాయంకాలం చదివినవారు ఉదయం వరకు షైతానుల నుండి రక్షింపబడతారు. (హాకిం 2064).

2- ఖుల్ హువల్లాహు అహద్, ఖుల్ అఊజు బిరబ్బిల్ ఫలక్ మరియు ఖుల్ అఊజు బిరబ్బిన్నాస్. 3 సార్లు.

పై మూడు సూరాలు ఉదయం 3 సార్లు, సాయం- కాలం 3 సార్లు చదివినవారికి ప్రతి కీడు నుండి రక్షణకై ఇవి సరిపోతాయి. (అబూ దావూద్ 5082, తిర్మిజి 3570).

3- అమ్ సైనా వ అమ్సల్ (అస్బహ్ నా వ అస్బ హల్) ముల్కు లిల్లాహి, వల్ హందులిల్లాహి లాఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లాషరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ కదీర్. రబ్బి అస్అలుక ఖైర మా ఫీ హాజిహిల్లైలతి (హాజల్ యౌమి) వ ఖైర మా బఅదహా (హూ) వ అఊజు బిక మిన్ షర్రి మా ఫీ హాజిహిల్లైలతి (హాజల్ యౌమి) వ షర్రి మా బఅదహా (హూ), రబ్బి అఊజు బిక మినల్ కసలి వ సూఇల్ కిబరి వ అఊజు బిక మిన్ అజాబిన్ ఫిన్నారి వ అజాబిన్ ఫిల్ ఖబ్ర్. (ముస్లిం 2723).

أَمْسَيْنَا وَأَمْسَى (أَصْبَحْنَا وَأَصْبَحَ) الْمُلْكُ لِله وَالْحَمْدُ لِله لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ لَهُ الـْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ رَبِّ أَسْأَلُكَ خَيْرَ مَا فِي هَذِهِ اللَّيْلَةِ (هَذا اليَوْمِ) وَخَيْرَ مَا بَعْدَهَا (هُ) وَأَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا فِي هَذِهِ اللَّيْلَةِ (هَذَا اليَوْمِ) وَشَرِّ مَا بَعْدَهَا (هُ) رَبِّ أَعُوذُ بِكَ مِنْ الْكَسَلِ وَسُوءِ الْكِبَرِ رَبِّ أَعُوذُ بِكَ مِنْ عَذَابٍ فِي النَّارِ وَعَذَابٍ فِي الْقَبْرِ. (مسلم 2723).

(మేము మరియు అల్లాహ్ యొక్క రాజ్యము సాయంకాలానికి చేరుకున్నాము. సర్వస్తోత్రములు అల్లాహ్ కొరకే, అల్లాహ్ తప్ప సత్యఆరాధ్యుడు ఎవ్వడూ లేడు, ఆయన ఏకైకుడు, ఆయనకు భాగస్వామి లేడు, రాజ్యమంతా అయనదే, స్తోత్రము- లన్నియూ అయనకే, ఆయన సర్వముపై అధికారంగలవాడు. ప్రభువా! ఈ రాత్రిలోని మేలును దీని తర్వాత వచ్చే మేలును నీతో కోరుతున్నాను. ఈ రాత్రిలోని కీడు మరియు దీని తర్వాత వచ్చే కీడు నుండి నీ శరణు కోరుతున్నాను. ప్రభువా! బద్ధకం మరియు చెడు వృద్ధాప్యం నుండి నీ శరణు కోరుతున్నాను. నరక శిక్ష మరియు సమాధి శిక్ష నుండి నీ శరణు కోరుతున్నాము).

నోట్: పైన ఇవ్వబడిన దుఆ సాయంకాలము చదివినప్పుడు బ్రాకెట్లోని పదాలు చదవకూడదు. ఉదయం చదివినప్పుడు గీత మీద ఉన్న పదాలు చదవకూడదు

4- అల్లాహుమ్మ బిక అస్ బహ్ నా వ బిక అమ్ సైనా వబిక నహ్ యా వ బిక నమూతు వ ఇలైకన్నుషూర్. (అదబుల్ ముఫ్రద్ 1199).
اللَّهُمَّ بِكَ أّصْبَحْنَا وَبِكَ أَمْسَينَا وَبِكَ نَحْيَا وَبِكَ نَمُوتُ وَإِلَيكَ النُّشُور

సాయంకాలం చదివినప్పుడు ఇలా చదవండిః

అల్లాహుమ్మ బిక అమ్ సైనా వ బిక అస్ బహ్ నా వబిక నహ్ యా వ బిక నమూతు వ ఇలైకల్ మసీర్.

اللَّهُمَّ بِكَ أَمْسَينَا وَبِكَ أّصْبَحْنَا وَبِكَ نَحْيَا وَبِكَ نَمُوتُ وَإِلَيكَ الْـمَصِير
(ఓ అల్లాహ్! నీ రక్షణలోనే మేము ఉదయానికి చేరాము, నీ రక్షణలోనే మేము సాయంకాలానికి చేరాము, నీ పేరుతోనే మేము జీవించి ఉన్నాము, నీ పేరుతోనే మేము మరణిస్తాము, మళ్ళీ నీ వైపే తిరిగి రానున్నాము).

5- అల్లాహుమ్మ ఇన్నీ అస్ బహ్ తు ఉష్ హిదుక వ ఉష్ హిదు హమలత అర్షిక వ మలాఇకతక వ జమీఅ ఖల్ ఖిక అన్నక అంతల్లాహు లా ఇలాహ ఇల్లా అంత వ అన్న ముహమ్మదన్ అబ్దుక వ రసూలుక.

اللَّهُمَّ إِنِّي أَصْبَحْتُ أُشْهِدُكَ وَأُشْهِدُ حَمَلَةَ عَرْشِكَ وَمَلَائِكَتَكَ وَجَمِيعَ خَلْقِكَ أَنَّكَ أَنْتَ اللهُ لَا إِلَهَ إِلَّا أَنْتَ وَأَنَّ مُحَمَّدًا عَبْدُكَ وَرَسُولُكَ

(ఓ అల్లాహ్! నిశ్చయంగా నేను ఉదయానికి చేరాను. నిన్ను సాక్షిగా పెడుతున్నాను మరియు నీ సింహాసన పీఠాన్ని ఎత్తి ఉన్నవారిని, దైవ దూతలందరిని ఇంకా సర్వసృష్టిని సాక్షిగా పెడుతున్నాను; నీవు మాత్రమే అల్లాహ్ అని, నీ తప్ప సత్య ఆరాధ్యుడు ఎవ్వడూ లేడని, మరియు ముహమ్మద్ సల్లల్లా- హు అలైహి వసల్లం నీ దాసుడు మరియు నీ ప్రవక్త అని).

పై దుఆ ఉదదయం, సాయంకాలం నాలుగు సార్లు చదివిని వారిని అల్లాహ్ నరకాగ్ని నుండి రక్షిస్తాడు. (అబూదావూద్ 5069).

6- అల్లాహుమ్మ మా అస్బహబీ మిన్ నిఅ’మతిన్ ఫమిన్క వహ్ దక లా షరీక లక ఫలకల్ హందు వలకష్షుక్ర్.

اللَّهُمَّ مَا أَصْبَحَ بِي مِنْ نِعْمَةٍ فَمِنْكَ وَحْدَكَ لَا شَرِيكَ لَكَ فَلَكَ الْحَمْدُ وَلَكَ الشُّكْرُ

(ఓ అల్లాహ్! ఉదయకాలమున నాకు లభించిన అనుగ్రహాలన్నియూ నీ తరఫునే, నీవు ఏకైకునివి, నీకు ఏ భాగస్వామి లేడు, సర్వ స్తోత్రములు నీకే, సర్వ కృతజ్ఞతలు నీకే).

నోట్: పై దుఆ ఉదయం చదవాలి. సాయంకాలం చదివినప్పుడు “అస్బహబీ” ఉన్న చోట “అమ్సాబీ” అని చదవాలి.

పై దుఆ ఉదయం చదివిన వ్యక్తి పగటి కృతజ్ఞత చెల్లించినవాడవుతాడు, సాయంకాలం చదివిన వ్యక్తి రాత్రి కృతజ్ఞత చెల్లించినవాడవుతాడు. (అబూదావూద్ 5073).

7- అస్బహ్నా అలా ఫిత్రతిల్ ఇస్లామి వ అలా కలిమతిల్ ఇఖ్లాసి వఅలా దీని నబియ్యినా ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లమ వ అలా మిల్లతి అబీనా ఇబ్రాహీమ హనీఫమ్ ముస్లిమవ్ వమాకాన మినల్ ముష్రికీన్. (ముస్నద్ అహ్మద్ 3/406, సహీహుల్ జామి ).

أَصْبَحْنَا عَلَى فِطْرَةِ الْإِسْلَامِ وَعَلَى كَلِمَةِ الْإِخْلَاصِ وَعَلَى دِينِ نَبِيِّنَا مُحَمَّدٍ ﷺ وَعَلَى مِلَّةِ أَبِينَا إِبْرَاهِيمَ حَنِيفًا مُسْلِمًا وَمَا كَانَ مِنْ الْمُشْرِكِينَ

(మేము ఉదయానికి చేరాము స్వభావిక ధర్మం అయిన ఇస్లాంపై, చిత్తశుద్ధితో కూడి ఉన్న వచనంపై, మా ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ధర్మంపై, మా పితామూర్తులైన ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క మతముపై, ఆయన ఏకాగ్రులు, విశ్వాసులు, ముష్రికులలోని వారు కారు).

నోట్:పై దుఆ ఉదయం చదవాలి. సాయంకాలం చదివినప్పుడు “అస్బహ్నా” ఉన్న చోట “అమ్ సైనా” అని చదవాలి.

8- బిస్మిల్లాహిల్లజి లా యజుర్రు మఅస్మిహీ షైఉన్ ఫిల్ అర్జి వలా ఫిస్సమాఇ వహువస్సమీఉల్ అలీం.

بِسْمِ اللهِ الَّذِي لاَ يَضُرُّ مَعَ اسْمِهِ شَيْءٌ فِي الأَرْضِ وَلاَ فِي السَّمَاءِ وَهُوَ السَّمِيعُ العَلِيم
(అల్లాహ్ పేరుతో, ఆయన పేరుతో ఏ వస్తువు నష్టపరచదు, ఆకాశంలోగాని, భూమిలోగాని, ఆయన వినువాడు, సర్వజ్ఞాని).

పై దుఆ ఉదయం 3 సార్లు, సాయంకాలం 3 సార్లు చదివినవారికి ఏదీ నష్టపరచదు. (అబూదావూద్ 5088).

9- రజీతు బిల్లాహి రబ్బౌఁ వబిల్ ఇస్లామి దీనౌఁ వ బిముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లమ నబియ్య.

رَضِيتُ بِاللهِ رَبًّا وَ بِالإِسْلامِ دِ ينًا وَبِمُحَمَّدٍ ﷺ نَبِيًّا
(అల్లాహ్ ను ప్రభువుగా, ఇస్లాంను ధర్మంగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రవక్తగా నమ్మి సంతోషపడ్డాను).

పై దుఆ ఉదయం 3 సార్లు, సాయంకాలం 3 సార్లు చదివినవారితో అల్లాహ్ ప్రళయదినాన తప్పక సంతో- షంగా ఉంటాడు. (తిర్మిజి 3870).

నేను పై దుఆ ఉదయం చదివినవారి చేయి పట్టుకొని స్వర్గంలో తీసుకెళ్తాను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం చెప్పారు. (సహీహుత్ తర్గీబ్ 657).

10- హస్బియల్లాహు లాఇలాహ ఇల్లాహువ అలైహి తవక్కల్తు వహువ రబ్బుల్ అర్షిల్ అజీం. 7సార్లు. (అబూదావూద్ 5081).

حَسْبِيَ الله لاَ إِلهَ إلاَّ هُوَ عَلَيهِ تَوَكَّلْتُ وَهُوَ رَبُّ الْعَرْشِ الْعَظِيم
(నాకు అల్లాహ్ యే చాలు, ఆయన తప్ప సత్య ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు, ఆయనపైనే నేను నమ్మకం ఉంచాను, ఆయన గొప్ప సింహాసనం యొక్క ప్రభువు).

11- అల్లాహుమ్మ అంత రబ్బి లా ఇలాహ ఇల్లా అంత ఖలక్ తనీ వ అనా అబ్దుక వఅన అలా అహ్దిక వ వఅదిక మస్తతఅతు అఊజు బిక మిన్ షర్రి మా సనఅతు అబూఉ లక బినిఅమతిక అలయ్య వఅబూఉ లక బిజంబీ ఫగ్ఫిర్లీ ఫఇన్నహూ లా యగ్ఫిరుజ్జునూబ ఇల్లా అంత.

اللَّهُمَّ أَنْتَ رَبِّي لاَ إِلهَ إلاَّ أَنْتَ خَلَقْتَنِي وَأَنَا عَبْدُكَ وَأَنَا عَلَى عَهْدِكَ وَوَعْدِكَ مَااسْتَطَعْتُ أَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا صَنَعْتُ أَبُوْءُ لَكَ بِنِعْمَتِكَ عَلَيَّ وَأَبُوءُ لَكَ بِذَنْبِي فَاغْفِرْ لِيْ فَإِنَّهُ لاَ يَغْفِرُ الذُّنُوبَ إِلاَّ أَنْتَ

(ఓ అల్లాహ్! నీవు నా ప్రభువు, నీ తప్ప సత్య ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు, నీవే నన్ను సృష్టించావు, నేను నీ దాసుడ్ని, నేను నీతో చేసిన ఒడంబడిక, వాగ్దానంపై స్థిరంగా ఉన్నాను, నేను పాల్పడిన పాపాల కీడు నుండి నీ శరణులో వచ్చు- చున్నాను, నాపై ఉన్న నీ అనుగ్రహాలను నేను అంగీకరిస్తు- న్నాను, నా పాపాలను కూడా ఒప్పుకుంటున్నాను, నీవు నన్ను క్షమించు, పాపాలను క్షమించేవాడు నీ తప్ప ఎవడూ లేడు).

పై దుఆ పూర్తి విశ్వాసంతో ఉదయం చదివిన వ్యక్తి సాయంకాలముకు ముందే మరణిస్తే స్వర్గంలో చేరుతాడు, ఒకవేళ సాయంకాలం పూర్తి నమ్మకంతో చదవి ఉదయించేకి ముందే మరణిస్తే స్వర్గంలో చేరుతాడు. (బుఖారి 6306).

12- అల్లాహుమ్మ ఆఫినీ ఫీ బదనీ అల్లాహుమ్మ ఆఫినీ ఫీ సమ్ఈ అల్లాహుమ్మ ఆఫినీ ఫీ బసరీ లాఇలాహ ఇల్లా అంత, అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మినల్ కుఫ్రి వల్ ఫక్రి వ అఊజు బిక మిన్ అజాబిల్ కబ్రి లాఇలాహ ఇల్లా అంత. (అబూ దావూద్ 5090).

اللَّهُمَّ عَافِنِي فِي بَدَنِي اللَّهُمَّ عَافِنِي فِي سَمْعِي اللَّهُمَّ عَافِنِي فِي بَصَرِي لَا إِلَهَ إِلَّا أَنْتَ ، اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ الْكُفْرِ وَالْفَقْرِ وَأَعُوذُ بِكَ مِنْ عَذَابِ الْقَبْرِ لَا إِلَهَ إِلَّا أَنْتَ

(ఓ అల్లాహ్! నా శరీరంలో నాకు స్వస్థత ప్రసాదించు, ఓ అల్లాహ్! నా చెవిలో స్వస్థత ప్రసాదించు, ఓ అల్లాహ్! నా దృష్టిలో స్వస్థత ప్రసాదించు, నీవు తప్ప సత్య ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు. ఓ అల్లాహ్! సత్యతిరస్కారం మరియు బీదరికం నుండి నీ శరణు వచ్చాను, ఓ అల్లాహ్! సమాధి శిక్ష నుండి నీ శరణులో వచ్చాను. నీవు తప్ప సత్య ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు).

13- అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ ఆఫియత ఫిద్దున్యా వల్ ఆఖిర, అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ అఫ్వ వల్ ఆఫియత ఫీ దీనీ వ దున్యాయ వ అహ్లీ వ మాలీ, అల్లాహుమ్మస్ తుర్ ఔరాతీ వ ఆమిన్ రౌఆతీ అల్లాహుమ్మహ్ ఫజ్నీ మిన్ బైని యదయ్య వ మిన్ ఖల్ఫీ వ అన్ యమీనీ వ అన్ షిమాలీ వ మిన్ ఫౌకీ వ అఊజు బిఅజ్మతిక అన్ ఉగ్ తాల మిన్ తహ్ తీ.

اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ الْعَافِيَةَ فِي الدُّنْيَا وَالآخِرَةِ اَللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ الْعَفْوَ وَالْعَافِيَةَ فِي دِيْنِي وَ دُنْيَايَ وَأَهْلِيْ وَمَالِيْ اللَّهُمَّ اسْتُرْ عَوْرَاتِيْ وَآمِنْ رَوْعَاتِي اللَّهُمَّ احْفَظْنِيْ مِنْ بَيْنِ يَدَيَّ وَمِنْ خَلْفِيْ وَعَنْ يَمِيْنِي وَعَنْ شِمَالِي وَمِنْ فَوْقِي وَأَعُوذُ بِعَظْمَتِكَ أَنْ أُغْتَالَ مِنْ تَحْتِي

(ఓ అల్లాహ్! నేను నీతో ఇహపరాల క్షేమాన్ని కోరుతున్నాను, ఓ అల్లాహ్! నేను నీతో నా ధర్మం, ప్రపంచం, ఇల్లాలు, ఆస్తుల్లో మన్నింపు మరియు క్షేమాన్ని కోరుతున్నాను. ఓ అల్లాహ్! నా లోటుపోట్లను కప్పిఉంచు, నా భయాన్ని దూరం చేయి, ఓ అల్లాహ్! నన్ను నా ముందు నుండి, నా వెనక నుండి, నా కుడి, ఎడమ నుండి మరియు పై నుండి కాపాడు. నేను క్రింది నుండి కూడా ఏ కీడుకు గురి కాకుండా నీ ఔన్నత్యంతో నీ శరణులో వచ్చాను).

14- అల్లాహుమ్మ ఫాతిరస్సమావాతి వల్ అర్జి ఆలిమల్ గైబి వష్షహాదతి రబ్బ కుల్లి షైఇన్ వ మలీకహు అష్ హదు అల్లా ఇలాహ ఇల్లా అంత అఊజు బిక మిన్ షర్రి నఫ్సీ వ షర్రిష్ షైతాని వ షిర్కిహీ, వఅన్ అక్తరిఫ అలా నఫ్సీ సూఅన్ ఔ అజుర్రహూ ఇలా ముస్లిమ్.

اللَّهُمَّ فَاطِرَ السَّمَاوَاتِ وَالأرْضِ عَالِمَ الْغَيْبِ وَالشَّهَادَةِ رَبَّ كُلِّ شَيْءٍ وَ مَلِيْكَهُ أَشْهَدُ أَن لاَّ إِلَهَ إِلاَّ أَنْتَ أَعُوذُ بِكَ مِنْ شَرِّ نَفْسِي وَشَرِّ الشَّيْطَانِ وَشِرْكِهِ وَأَنْ أَقْتَرِفَ عَلَى نَفْسِي سُوْءً أَوْ أَجُرَّهُ إِلَى مُسْلِمٍ

(ఓ అల్లాహ్! భూమ్యాకాశాల సృష్టికర్తా! గోచర అగోచరాల జ్ఞానీ! ప్రతీ వస్తువు ప్రభువా! మరియు యజమానీ! నీ తప్ప సత్య ఆరాధ్యుడు ఎవడూ లేడని నేను సాక్ష్యమిస్తున్నాను, నేను నీ శరణులో వచ్చాను; నా ఆత్మ కీడు నుండి, షైతాన్ కీడు నుండి, అతని షిర్క్, ప్రేరేపణల నుండి, అలాగే నేను నా పట్ల- గాని లేదా ఎవరైనా ముస్లింను చెడుకు గురి చేయుట నుండి.).

15- యా హయ్యు యా ఖయ్యూమ్ బిక అస్తగీస్, ఫఅస్లిహ్ లీ షఅనీ వలా తకిల్నీ ఇలా నఫ్సీ తర్ఫత ఐన్. (అబూ దావూద్ 5090).

يَا حَيُّ يَا قَيُّومُ بِكَ اَسْتَغِيثُ فَأَصْلِحْ لِيْ شَأْنِي وَلاَ تَكِلْنِي إِلَى نَفْسِي طَرْفَةَ عَيْن
(ఓ సజీవుడా, విశ్వవ్యవస్థకు ఆధారభూతుడా! నీతోనే నేను మొరపెట్టుకుంటున్నాను. అందుకని నా ప్రతి కార్యాన్ని సజావుగా చేయు, కనురెప్ప కొట్టే అంత కూడా నన్ను నాకై అప్పగించకు).

16- లాఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ కదీర్.

لاَ إِلهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيْكَ لَهُ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِير

పై జిక్ర్ ఉదయం పది సార్లు చదివినవారికి పది పుణ్యాలు అల్లాహ్ వ్రాస్తాడు, పది పాపాలు మన్నిస్తాడు, పది స్థానాలను పెంచుతాడు, నాలుగు బానిసలకు విముక్తి కలిగించినంత పుణ్యం ఉంటుంది మరియు సాయంకాలం వరకు షైతాన్ నుండి కాపాడబడతాడు. సాయంకాలం పది సార్లు చదివితే అలాంటి ఘనతే ఉంది. (ఇబ్నుహిబ్బాన్ 2021, సహీహుత్ తర్గీబ్ 474). బద్ధకం ఉంటే ఒకసారైనా చదవాలి. (అబూదావూద్ 5077).

పై జిక్ర్ 100 సార్లు చదివితే పది బానిసలను విడుదల చేసినంత పుణ్యం లభిస్తుంది, 100 పుణ్యాలు వ్రాయబడతాయి, 100 పాపాలు తొలగించబడతాయి, సాయంకాలం వరకు షైతాన్ నుండి రక్షింపబడతాడు, అతనికంటే ఎక్కువ చదివినవాడు తప్ప మరెవ్వడూ అతనికంటే ఉత్తముడు కాడు. (బుఖారి 6403, ముస్లిం 2691).

15- సుబ్ హానల్లాహి వబిహందిహీ.

سُبْحَانَ اللهِ وَ بِحَمْدِهِ (100 مرة)

పై జిక్ర్ ఉదయం 100 సార్లు, సాయంకాలం 100 సార్లు చదివినవారికంటే ఉత్తములు ప్రళయదినాన మరెవరూ ఉండరు, కేవలం అతని పరిమాణంలో, లేదా అతని కంటే ఎక్కువ చదివిన వ్యక్తి తప్ప. (ముస్లిం 2692).

పై జిక్ర్ ఉదయం, సాయంకాలం వంద, వంద సార్లు చదివిన వారి పాపాలు సముద్రపు నురుగుకు సమానమైనా క్షమించబడతాయి. (సహీహుత్ తర్గీబ్ 653).

16- అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక ఇల్మన్ నాఫిఆ, వ రిజ్ఖన్ తయ్యిబా, వ అమలమ్ ముతకబ్బలా. (కేవలం ఫజ్ర్ నమాజు తర్వాత). (ఇబ్ను మాజ 925)

اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ عِلْمًا نَافِعًا وَرِزْقًا طَيِّبًا وَ عَمَلاً مُتَقَبَّلاً

(ఓ అల్లాహ్! ప్రయోజనకరమైన విద్య, పవిత్ర ఆహారం మరియు అంగీకారయోగ్యం పొందే ఆచరణ భాగ్యం ప్రసాదించమని నిన్నే వేడుకుంటున్నాను).

17- సుబ్ హానల్లాహి వ బిహందిహీ అదద ఖల్కిహీ వ రిజా నఫ్సిహీ వ జినత అర్షిహీ వ మిదాద కలిమాతిహ్.

سُبْحَانَ الله وَبِحَمْدِهِ عَدَدَ خَلْقِهِ وَرِضَا نَفْسِهِ وَزِنَةَ عَرْشِهِ وَمِدَادَ كَلِمَاتِهِ

(అల్లాహ్ స్తోత్రముతో పాటు ఆయన పవిత్రతను కొనియాడు తున్నాను, ఆయన సృష్టి పరిమాణంలో, ఆయనకు ఇష్టమైనంత, ఆయన సింహాసనంత బరువులో మరియు ఆయన పవిత్ర వచనాలు వ్రాయబడే సిరా అంత పరిమాణంలో).

పై దుఆ ఫజ్ర్ తర్వాత 3 సార్లు చదివితే, ఫజ్ర్ నుండి చాష్త్ వరకు చేసే జిక్ర్ కు సమానమైన పుణ్యం లభిస్తుంది. (ముస్లిం 2726).

18- అఊజు బికలిమాతిల్లాహిత్తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ్.

أَعُوذُ بِكَلِمَاتِ الله التَّامَّاتِ مِن شَرِّ مَا خَلَق
(అల్లాహ్ సంపూర్ణ వచనాలతో నేను శరణు కోరుతున్నాను, ఆయన సృష్టిలో ఉన్న సర్వ కీడుల నుండి).

పై దుఆ సాయంకాలం 3 సార్లు చదివినవారికి ఆ రాత్రి ఏ విషపురుగు హాని కలిగించదు. (ముస్లిం 2709).

19- అస్తగ్ ఫిరుల్లాహ వ అతూబు ఇలైహ్.

ఈ జిక్ర్ ప్రవక్త సల్లల్లాహు అలైహివ వసల్లం ప్రతి రోజు వందసార్లు చదివేవారు. (ముస్లిం 2702).

20- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్.

ఉదయం 10 సార్లు, సాయంకాలం 10 సార్లు దరూద్ చదివినవారి పట్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు చేస్తారు. (సహీహుల్ జామి 6357).

21- సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి ముందు 100 సార్లు ‘సుబ్ హానల్లాహ్’, 100 సార్లు ‘అల్ హందులిల్లాహ్’, 100 సార్లు ‘అల్లాహు అక్బర్’.

అది (అల్లాహ్ మార్గంలో వదిలిన) 100 ఒంటెలకంటే ఉత్తమం.
అది అల్లాహ్ మార్గంలో వదిలిన 100 గుర్రాల కంటే ఉత్తమం.
అది 100 బానిసలను విముక్తి కలిగించుటకంటే ఉత్తమం. (సహీ తర్గీబ్ 658).

పడుకునే ముందు

1- ఖుల్ హువల్లాహు అహద్, ఖుల్ అఊజు బిరబ్బిల్ ఫలక్ మరియు ఖుల్ అఊజు బిరబ్బిన్నాస్.

రెండు అరచేతులు కలిపి, పై మూడు సూరాలు చదివి, అందులో ఊదుకొని ముఖము, శరీర ముందు భాగం ఇంకా సాధ్యమైనంత వరకు మిగిత భాగంలో తుడుచు కోవాలి. ఇలా మూడు సార్లు చేయాలి. (బుఖారి 5018).

2- ఆయతుల్ కుర్సీ.

పడకపై వెళ్ళి ఆయతుల్ కుర్సీ చదివినవారి పై అల్లాహ్ ఒక రక్షకుడ్ని నియమిస్తాడు మరియు తెల్లారే వరకు షైతాన్ అతని దగ్గరికి రాడు. (బుఖారి 2311 తర్వాత).

3- ఆమనర్రసూలు బిమా ఉంజిల ఇలైహి మిర్ రబ్బిహీ వల్ ముఅ’మినూన్, కుల్లున్ ఆమన బిల్లాహి వమలాఇకతిహీ వకుతుబిహీ వ రుసులిహీ లా నుఫర్రిఖు బైన అహదిమ్ మిర్రుసులిహ్, వ ఖాలూ సమిఅ’నా వ అతఅ’నా గుఫ్రానక రబ్బనా వ ఇలైకల్ మసీర్. లా యుకల్లిఫుల్లాహు నఫ్సన్ ఇల్లా వుస్అహా లహా మా కసబత్ వఅలైహా మక్తసబత్ రబ్బనా లా తుఆఖిజ్నా ఇన్నసీనా ఔ అఖ్ తఅ’నా రబ్బనా వలా తహ్ మిల్ అలైనా ఇస్రన్ కమా హమల్తహూ అలల్లజీన మిన్ ఖబ్లినా రబ్బనా వలా తుహమ్మిల్నా మాలా తాఖత లనా బిహీ వఅ’ఫు అన్నా వగ్ఫిర్ లనా వర్ హమ్నా అంత మౌలానా ఫన్సుర్నా అలల్ ఖౌమిల్ కాఫిరీన్.

(ఈ ప్రవక్త తన ప్రభువు తరఫు నుండి అవతరించిన దానిని విశ్వసించాడు, విశ్వాసులు కూడా దానిని విశ్వసించారు. వారంతా అల్లాహ్ నూ, ఆయన దూతలనూ, ఆయన గ్రంథాలనూ, ఆయన ప్రవక్తలనూ విశ్వసించారు. వారంటారుః మేము అల్లాహ్ ప్రవక్తలలో ఏ ఒక్కరినీ భేదభావంతో చూడము. మేము ఆదేశం విన్నాము, శిరసావహించాము, నీ క్షమాభిక్షకై అర్థిస్తున్నాము ఓ మా ప్రభువా! గమ్యస్థానం నీ వైపుకే ఉంది. అల్లాహ్ ఏ ప్రాణిపైననూ దాని శక్తికి మించిన భారం వేయడు, తాను సంపాదించిన పుణ్యానికి సత్ఫలితం, తాను చేసిన పాపానికి దుష్ఫలితం ప్రతివ్యక్తి అనుభవిస్తాడు. (మీరు ఇలా వేడుకోండిః) ఓ మా ప్రభువా! మేము మరచినా, లేక తప్పు చేసినా మమ్మల్ని పట్టకు. ఓ మా ప్రభువా! పూర్వం వారిపై మోపినటువంటి భారం మాపై మోపకు. ఓ మా ప్రభువా! మేము సహించలేని భారం మాపై వేయకు. మమ్మల్ని మన్నించు, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కరుణించు. నీవే మా సంరక్షకుడవు, కావున సత్యతిరస్కారులకు విరుద్ధంగా మాకు సహాయం నొసంగు).

పై ఆయతులు రాత్రి పడుకునే ముందు చదువు కునే వారికి అవి సరిపోతాయి. (బుఖారి 5040, ముస్లిం 807).

4- బిస్మిక రబ్బీ వజఅతు జంబీ వ బిక అర్ఫఉహూ ఇన్ అమ్సక్ త నఫ్సీ ఫర్హమ్ హా వఇన్ అర్సల్ తహా ఫహ్ఫజ్ హా బిమా తహ్ఫజు బిహీ ఇబాదకస్సాలిహీన్. (బుఖారి 6320).

నిద్రించుటకు వెళ్ళినపుడు పడక బట్టల్ని బాగా దులుపుకోవాలి, అతను దాని నుండి దూరంగా ఉన్నపుడు అందులో ఏమి వచ్చి పడిందో అతనికి తెలియదు గనక, ఆ తర్వాత పై దుఆ చదవాలి

بِاسْمِكَ رَبِّ وَضَعْتُ جَنْبِي وَبِكَ أَرْفَعُهُ إِنْ أَمْسَكْتَ نَفْسِي فَارْحَمْهَا وَإِنْ أَرْسَلْتَهَا فَاحْفَظْهَا بِمَا تَحْفَظُ بِهِ عِبَادَكَ الصَّالِحِينَ

నా ప్రభూ! నీ పేరుతో (పడకపై) మేను వాల్చాను, తిరిగి నీ పేరుతోనే మేల్కొంటాను. (ఈ మధ్యలో) నీవు నా ప్రాణాన్ని (నీ వద్ద) ఆపుకుంటే దానిని క్షమించి కరుణించు. ఒకవేళ దానిని తిరిగి (నా శరీరంలో) విడిచిపెడితే సజ్జనులైన నీ దాసుల్ని రక్షించినట్లు దానిని రక్షించు.

5- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పడుకోవాలని ఉద్దేశించినప్పుడు తమ కుడి చేతిని కుడి చెంప క్రింద పెట్టుకొని ఈ దుఆ 3 సార్లు చదివేవారుః అల్లాహుమ్మ ఖినీ అజాబక యౌమ తబ్అసు ఇబాదక. (అబూ దావూద్ 5045).

اللَّهُمَّ قِنِي عَذَابَكَ يَوْمَ تَبْعَثُ عِبَادَكَ
అల్లాహ్! నీవు నీ దాసుల్ని మరణించిన తర్వాత తిరిగి బ్రతికించే రోజున నన్ను నీ శిక్ష నుండి కాపాడు.

6- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పడకపై వచ్చి తమ చేతిని కుడి చెంప క్రింద పెట్టుకొని “అల్లాహుమ్మ బిస్మిక అమూతు వ అహ్ యా” చదివేవారు. (బుఖారి 6314).

اللَّهُمَّ بِاسْمِكَ أَمُوتُ وَأَحْيَا
అల్లాహ్! నీ పేరుతోనే మృత్యు ఒడిలోకి పోతున్నాను మళ్ళీ నీ పేరుతోనే బ్రతుకుతున్నాను.

7- మీరు మీ పడకపై వచ్చి నిద్రపోయే ముందు అల్లాహు అక్బర్ 34 సార్లు, అల్ హందులిల్లాహ్ 33 సార్లు, సుబ్ హానల్లాహ్ 33 సార్లు చదవండి. ఇది మీ కొరకు బానిస కంటే ఎంతో ఉత్తమం. (బుఖారి 3113).

8- ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్ లా అఅ’బుదు మా తఅ’బుదూన్, వలా అంతుమ్ ఆబిదూన మా అఅ’బుద్. వలా అనా ఆబిదుమ్ మాఅబత్తుమ్, వలా అంతుమ్ ఆబిదూన మా అఅ’బుద్, లకుమ్ దీనుకుమ్ వలియ దీన్.

(ఇలా అనుః ఓ సత్యతిరస్కారులారా! మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించను. నేను ఆరాధించే ఆయన(అల్లాహ్) ను మీరు ఆరాధించేవారు కారు. మరియు మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించేవాణ్ణి కాను. నేను ఆరాధిస్తున్న ఆయనను మీరు ఆరాధించేవారు కారు. మీ ధర్మం మీకు, నా ధర్మం నాకు).

పై సూరా పఠించి వెంటనే పడుకో, నీవు షిర్క్ నుండి దూరంగా ఉన్నావని ఇది ఒక నిరూపణ. (అబూ దావూద్ 5055).

9- నీవు నీ పడకపై వచ్చే ముందు నమాజు కొరకు చేసిన విధంగా వుజూ చేసి నీ కుడి ప్రక్కన పడుకొని ఈ దుఆ చదువుః అల్లాహుమ్మ అస్లమ్ తు వజ్ హీ ఇలైక వ ఫవ్వజ్ తు అమ్రీ ఇలైక వ అల్ జఅ’తు జహ్రీ ఇలైక రగ్బతౌఁ రహ్బతన్ ఇలైక లా మల్ జఅ వలా మంజా మిన్క ఇల్లా ఇలైక అల్లాహుమ్మ ఆమన్తు బికితాబికల్లజీ అంజల్త వ బినబియ్యికల్లజీ అర్సల్త.

اللَّهُمَّ أَسْلَمْتُ وَجْهِي إِلَيْكَ وَفَوَّضْتُ أَمْرِي إِلَيْكَ وَأَلْجَأْتُ ظَهْرِي إِلَيْكَ رَغْبَةً وَرَهْبَةً إِلَيْكَ لَا مَلْجَأَ وَلَا مَنْجَا مِنْكَ إِلَّا إِلَيْكَ اللَّهُمَّ آمَنْتُ بِكِتَابِكَ الَّذِي أَنْزَلْتَ وَبِنَبِيِّكَ الَّذِي أَرْسَلْتَ

(ఓ అల్లాహ్ నీ సమక్షంలో నన్ను నేను సమర్పించు- కున్నాను. నా వ్యవహారాలన్నీ నీకు అప్పగించాను. ఇక నిన్నే నమ్ముకొని ఉన్నాను. నీ అనుగ్రహ భాగ్యం పొందే ఆరాటంతో, నీ ఆగ్రహ భయంతో నీ సన్నిధిలో హాజరయ్యాను. నీ నుండి పారిపోయి నేనెక్కడా రక్షణ పొందలేను. నీ సన్నిధిలో తప్ప నాకు మరెక్కడా ఆశ్రయం లేదు. అల్లాహ్! నీవు అవతరింప జేసిన నీ (ఖుర్ఆను) గ్రంథాన్ని, నీవు ప్రభవింపజేసిన నీ ప్రవక్తను (మనస్ఫూర్తిగా) విశ్వసించాను). (బుఖారి 247).

ఇదే రాత్రి నీవు చనిపోయావంటే ఇస్లాం ధర్మంపై నీవు చనిపోతావు. ఈ దుఆ నీ తుది పలుకులు కావాలి. (అంటే ఈ దుఆ తర్వాత నీ నోట ఎలాంటి ప్రాపంచిక విషయాలు వెలువడ కూడదు).

10- అల్లాహుమ్మ రబ్బస్సమావాతి వ రబ్బల్ అర్జి వ రబ్బల్ అర్షిల్ అజీమ్, రబ్బనా వ రబ్బ కుల్లి షైఇన్ ఫాలిఖిల్ హబ్బి వన్నవా వ ముంజిలత్ తౌరాతి వల్ ఇంజీలి వల్ ఫుర్కాని అఊజు బిక మిన్ షర్రి కుల్లి షైఇన్ అంత ఆఖిజుమ్ బినాసియతిహీ, అల్లాహుమ్మ అంతల్ అవ్వలు ఫలైస ఖబ్లక షైఉన్ వ అంతల్ ఆఖిరు ఫలైస బఅ’దక షైఉన్ వ అంతజ్జాహిరు ఫలైస ఫౌఖక షైఉన్ వ అంతల్ బాతిను ఫలైస దూనక షైఉన్ ఇఖ్ జి అన్నద్దైన వ అగ్నినా మినల్ ఫఖ్ర్.

اللَّهُمَّ رَبَّ السَّمَاوَاتِ وَرَبَّ الْأَرْضِ وَرَبَّ الْعَرْشِ الْعَظِيمِ رَبَّنَا وَرَبَّ كُلِّ شَيْءٍ فَالِقَ الْحَبِّ وَالنَّوَى وَمُنْزِلَ التَّوْرَاةِ وَالْإِنْجِيلِ وَالْفُرْقَانِ أَعُوذُ بِكَ مِنْ شَرِّ كُلِّ شَيْءٍ أَنْتَ آخِذٌ بِنَاصِيَتِهِ اللَّهُمَّ أَنْتَ الْأَوَّلُ فَلَيْسَ قَبْلَكَ شَيْءٌ وَأَنْتَ الْآخِرُ فَلَيْسَ بَعْدَكَ شَيْءٌ وَأَنْتَ الظَّاهِرُ فَلَيْسَ فَوْقَكَ شَيْءٌ وَأَنْتَ الْبَاطِنُ فَلَيْسَ دُونَكَ شَيْءٌ اقْضِ عَنَّا الدَّيْنَ وَأَغْنِنَا مِنْ الْفَقْرِ

(భూమ్యాకాశాలకు, గొప్ప సింహాసనానికి ప్రభువైన అల్లాహ్! మాకు మరియు ప్రతీదానికి ప్రభువైన ఓ ప్రభువా! బీజాన్ని, విత్తనాన్ని చీల్చువాడా! తౌరాత్, ఇంజీల్ మరియు ఫుర్కాన్ (ఖుర్ఆన్) అవతరింప జేసినవాడా! నేను ప్రతీ కీడు నుండి నీ శరణులో వచ్చాను, దాని జుట్టు నీ చేతిలోనే ఉంది. ఓ అల్లాహ్! నీవే అందరికీ ప్రథమం, నీకంటే ముందు ఎవడూ లేడు, నీవే అంతం, నీ తర్వాత ఎవడూ లేడు, నీవే అందరిపై ఆధిపత్యం గలవానివి, నీపై ఎవరి ఆధిపత్యం చెల్లదు, నీవే అందరికీ పరోక్షంగా ఉన్నవానివి, నీకంటే మరుగగా ఎవడూ లేడు, మాపై ఉన్న అప్పును తేర్చు, బీదరికం నుండి బైటికి తీసి మమ్మల్ని సరిసంపదలు గలవానివిగా చేయు). (ముస్లిం 2713).

11- అల్ హందులిల్లాహిల్లజీ అత్అమనా వ సఖానా వ కఫానా వ ఆవానా ఫకమ్ మిమ్మల్ లా కాఫియ లహూ వలా ముఅవియ. (ముస్లిం 2715).

الْحَمْدُ لِله الَّذِي أَطْعَمَنَا وَسَقَانَا وَكَفَانَا وَآوَانَا فَكَمْ مِمَّنْ لَا كَافِيَ لَهُ وَلَا مُؤْوِي

(సర్వ స్తోత్రములు అల్లాహ్ కొరకే! ఆయనే మాకు తినిపించాడు, త్రాగించాడు, సరిపోయాడు, నివాసమిచ్చాడు. లేకుంటే ఎంతో మందికి సరిపడు వాడు మరియు నివాసమిచ్చువాడు ఎవడూ లేడు).

12- అల్లాహుమ్మ ఫాతిరిస్సమావాతి వల్ అర్జి ఆలిమల్ గైబి వష్షహాదతి రబ్బ కుల్లి షైఇన్ వ మలీకహు అష్ హదు అల్లా ఇలాహ ఇల్లా అంత అఊజు బిక మిన్ షర్రి నఫ్సీ వ షర్రిష్షైతాని వ షిర్కిహీ, వఅన్ అక్తరిఫ అలా నఫ్సీ సూఅన్ ఔ అజుర్రుహూ ఇలా ముస్లిమ్.

اللَّهُمَّ فَاطِرَ السَّمَاوَاتِ وَالأرْضِ عَالِمَ الْغَيْبِ وَالشَّهَادَةِ رَبَّ كُلِّ شَيْءٍ وَ مَلِيْكَهُ أَشْهَدُ أَن لاَّ إِلَهَ إِلاَّ أَنْتَ أَعُوذُ بِكَ مِنْ شَرِّ نَفْسِي وَشَرِّ الشَّيْطَانِ وَشِرْكِهِ وَأَنْ أَقْتَرِفَ عَلَى نَفْسِي سُوْءً أَوْ أَجُرُّهُ إِلَى مُسْلِمٍ

(ఓ అల్లాహ్! భూమ్యాకాశాల సృష్టికర్తా! గోచర అగోచరాల జ్ఞానీ! ప్రతి వస్తువు యొక్క ప్రభువా! మరియు వాటి యజమానీ! నీ తప్ప ఎవ్వరూ సత్య ఆరాధ్యుడు లేడు అని నేను సాక్ష్యమిచ్చు చున్నాను, నేను నీ శరణులో వచ్చాను; నా ఆత్మ కీడు నుండి, షైతాన్ కీడు నుండి, అతని షిర్క్, ప్రేరేపణల నుండి, అలాగే నేను నా పట్లగాని లేదా ఎవరైనా ముస్లింను చెడుకు గురి చేయుట నుండి.). (అబూదావూద్ 5083).

13- పడుకునే ముందు ఖుర్ఆనులోని సూర (32) అలిఫ్ లామ్ మీమ్ అస్సజ్దా మరియు సూర (67) ముల్క్ చదవాలి. (తిర్మిజి 3404).

రాత్రివేళ ప్రక్క మారుస్తూ

లాఇలాహ ఇల్లల్లాహుల్ వాహిదుల్ ఖహ్హార్, రబ్బుస్సమావాతి వల్ అర్జి వమా బైనహుమల్ అజీజుల్ గఫ్ఫార్. (హాకిం, సహీహుల్ జామి 4693).

لاَ إِلَهَ إِلاَّ اللهُ الوَاحِدُ القَهَّارُ رَبُّ السَّمَاوَاتِ وَالأَرضِ وَمَا بَينَهُمَا العَزِيزُ الغَفَّار

(అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు. ఆయన అద్వితీయుడు, సర్వాధికారుడు, భూమ్యాకాశాలకు మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికి ప్రభువు, సర్వశక్తిమంతుడు, క్షమాశీలుడు).

నిద్రలో భయాందోళన కలిగినప్పుడు

అఊజు బికలిమాతిల్లాహిత్తామ్మాతి మిన్ గజబిహీ వ ఇఖాబిహీ వ షర్రి ఇబాదిహీ వ మిన్ హమజాతిష్ షయాతీని వ అఐఁ యహ్ జురూన్. (తిర్మిజి 3528).

أَعُوذُ بِكَلِمَاتِ الله التَّامَّاتِ مِنْ غَضَبِهِ وَعِقَابِهِ وَشَرِّ عِبَادِهِ وَمِنْ هَمَزَاتِ الشَّيَاطِينِ وَأَنْ يَحْضُرُونِ

(అల్లాహ్ యొక్క సంపూర్ణ వచనాల రక్షణలో వస్తున్నాను; ఆయన ఆగ్రహం నుండి, శిక్ష నుండి, ఆయన దాసుల కీడు నుండి మరియు షైతానుల ప్రేరేపణల నుండి ఇంకా అవి స్వయంగా దగ్గరకు రావడం నుండి).

చెడు స్వప్న చూస్తే ఏం చేయాలి?

ముడూ సార్లు తన ఎడమ ప్రక్కలో ఉమ్మి వేయాలి.
ఆ చెడు కల మరియు షైతాన్ నుండి అల్లాహ్ శరణు వేడుకోవాలి.
ప్రక్క మార్చాలి.
ఆ కల గురించి ఎవరికీ తెలుపకూడదు.
లేచి నమాజు చేసుకున్నా మంచిదే.
పై పనులు చేసినవానికి ఆ కల ద్వారా ఏ హానీ, అపాయం కలుగదు ఇన్షాఅల్లాహ్. (ముస్లిం 2261-2263).

విత్ర్ నమాజులో

1- అల్లాహుమ్మహ్ దినీ ఫీమన్ హదైత వ ఆఫినీ ఫీమన్ ఆఫైత వతవల్లనీ ఫీమన్ తవల్లైత వ బారిక్ లీ ఫీమా అఅ’తైత వ ఖినీ షర్ర మా ఖజైత ఇన్న తఖ్ జీ వలా యుఖ్ జా అలైక వ ఇన్నహూ లా యజిల్లు మన్ వాలైత వలా యఇజ్జు మన్ ఆదైత తబారక్త రబ్బనా వ తఆలైత

اللَّهُمَّ اهْدِنِي فِيمَنْ هَدَيْتَ وَعَافِنِي فِيمَنْ عَافَيْتَ وَتَوَلَّنِي فِيمَنْ تَوَلَّيْتَ وَبَارِكْ لِي فِيمَا أَعْطَيْتَ وَقِنِي شَرَّ مَا قَضَيْتَ إِنَّكَ تَقْضِي وَلَا يُقْضَى عَلَيْكَ وَإِنَّهُ لَا يَذِلُّ مَنْ وَالَيْتَ وَلَا يَعِزُّ مَنْ عَادَيْتَ تَبَارَكْتَ رَبَّنَا وَتَعَالَيْتَ

(ఓ అల్లాహ్! నీవు సన్మార్గం ప్రసాదించిన వారిలో నన్ను చేర్చి నాకూ సన్మార్గం ప్రసాదించు, నీవు స్వస్థత ప్రసాదించిన వారిలో నన్ను చేర్చి నాకూ స్వస్థత ప్రసాదించు, నీ స్నేహితుల్లో చేర్చి నాకు నీ స్నేహం ప్రసాదించు, నీవు నాకొసంగిన దాంట్లో శుభం కలుగజేయి, నీవు నిర్ణయించిన కీడు నుండి నన్ను కాపాడుకో, నిర్ణయాలు చేసేవానివి నీవే, నీకు వ్యతిరేకమైన నిర్ణయం ఎవడూ చేయలేడు, నీవు మిత్రునిగా చేసుకున్నవాడు ఎన్నడూ అవమానం పాలుకాడు. నీవు ద్వేశించినవాడు ఎన్నటికీ గౌరవం పొందడు. ఓ మా ప్రభువా నీవు శుభాలుగల మహోన్నతునివి). (అబూదావూద్ 1425).

2- అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిరిజాక మిన్ సఖతిక వ బిముఆఫాతిక మిన్ ఉఖూబతిక వ అఊజు బిక మిన్క లా ఉహ్ సీ సనాఅన్ అలైక అంత కమా అస్నైత అలా నఫ్సిక.

اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِرِضَاكَ مِنْ سَخَطِكَ وَبِمُعَافَاتِكَ مِنْ عُقُوبَتِكَ وَأَعُوذُ بِكَ مِنْكَ لَا أُحْصِي ثَنَاءً عَلَيْكَ أَنْتَ كَمَا أَثْنَيْتَ عَلَى نَفْسِكَ

(ఓ అల్లాహ్! నీ అప్రసన్నత నుండి నీ ప్రసన్నత శరణు, నీ శిక్ష నుండి నీ మన్నింపు శరణు కోరుతున్నాను. నిన్ను నీవు ఎలా స్తుతించు కున్నావో అలా నేను నీ స్తోత్రాలను లెక్కించలేను). (అబూదావూద్ 1427).

3- అల్లాహుమ్మ ఇన్నా నస్తఈనుక వ నస్తగ్ ఫిరుక వ నుస్నీ అలైకల్ ఖైర కుల్లహూ వ నష్కురుక వలా నక్ఫురుక వ నఖ్ లఉ వ నత్రుకు మన్ యఫ్ జురుక అల్లాహుమ్మ ఇయ్యాక నఅబుదు వలక నుసల్లీ వ నస్జుదు వఇలైక నస్ఆ వ నహ్ ఫిదు నర్జూ రహ్మతక వ నఖ్ షా అజాబక ఇన్న అజాబక బిల్ కుఫ్ఫారి ముల్ హిఖ్

اللَّهُمَّ إِنَّا نَستَعِينُكَ وَنَستَغفِرُكَ وَنُثنِي عَلَيكَ الخَيرَ كُلَّهُ وَنَشكُرُكَ وَلاَ نَكفُرُكَ وَنَخلَعُ وَنَترُكُ مَن يَفجُرُكَ اللَّهُمَّ إِيَّاكَ نَعبُدُ وَلَكَ نُصَلِّي وَنَسجُدُ وَإِلَيكَ نَسعَى وَنَحفِدُ نَرجُو رَحمَتَكَ وَنَخشَى عَذَابَكَ إِنَّ عَذَابَكَ بِالكُفَّارِ مُلحِق

(ఓ అల్లాహ్! నిశ్చయంగా మేము నీతో మాత్రమే సహాయం కోరుతాము, నీతోనే క్షమాభిక్ష అడుగుతాము, నీ సంపూర్ణ ఉత్తమ స్తోత్రములే స్తుతిస్తాము, నీ కృతజ్ఞత చెల్లిస్తాము, నీ కతఘ్నత పాటించము, నీతో పాపానికి ఒడిగట్టిన వారిని ఓ మానాన వదిలేస్తాము, ఓ అల్లాహ్! నిన్ను మాత్రమే ఆరాధిస్తూ ఉన్నాము, నీ కొరకే నమాజు, సజ్దాలు చేస్తాము, నీ వైపునకే పరుగిడుతాము, ప్రయత్నము చేస్తాము, నీ కరుణను ఆశిస్తూ, నీ శిక్షతో భయపడుతాము, నీ శిక్ష అవిశ్వాసులకు కలుగనుంది). (ఇర్వాఉల్ గలీల్ 425, 2/164).

విత్ర్ నమాజ్ తర్వాత

సుబ్ హానల్ మలికిల్ ఖుద్దూస్. (నిసాయీ 1729).

سُبْحَانَ المَلِكُ القُدُّوس
(పరిశుద్ధుడైన చక్రవర్తి పరమపవిత్రుడు).
ముడూ సార్లు అనాలి. మూడవసారి కొంచెం శబ్దం పెంచాలి.

జనాజ నమాజులో

జనాజ నమాజు పద్ధతిః అల్లాహు అక్బర్ అని సనా, సూరె ఫాతిహా చదవాలి. మళ్ళీ అల్లాహు అక్బర్ అని దరూద్ చదవాలి. మళ్ళీ అల్లాహు అక్బర్ అని ఈ క్రింది దుఆలు చదవాలి. మళ్ళీ అల్లాహు అక్బర్ అని సలాం తింపాలి.

[1] అల్లాహుమ్ మగ్ఫిర్ లహూ వర్ హమ్ హు వ ఆఫిహీ వఅ’ఫు అన్ హు వ అక్రిమ్ నుజులహూ వ వస్సిఅ’ ముద్ ఖలహూ వగ్సిల్ హు బిల్ మాఇ వస్సల్జి వల్ బర్ది వ నఖ్ఖిహి మినల్ ఖతాయా కమా యునఖ్ఖస్ సౌబుల్ అబ్ యజు మినద్దనసి వ అబ్దిల్ హు దారన్ ఖైరమ్ మిన్ దారిహీ వ అహ్లన్ ఖైరమ్ మిన్ అహ్లిహీ వ జౌజన్ ఖైరమ్ మిన్ జౌజిహీ వ అద్ ఖిల్ హుల్ జన్నత వ అఇజ్ హు మిన్ అజాబిల్ ఖబ్రి వ అజాబిన్నార్.

اللَّهُمَّ اغْفِرْ لَهُ وَارْحَمْهُ وَعَافِهِ وَاعْفُ عَنْهُ وَأَكْرِمْ نُزُلَهُ وَوَسِّعْ مُدْخَلَهُ وَاغْسِلْهُ بِالْمَاءِ وَالثَّلْجِ وَالْبَرَدِ وَنَقِّهِ مِنَ الْخَطَايَا كَمَا نَقَّيْتَ الثَّوْبَ الْأَبْيَضَ مِنَ الدَّنَسِ وَأَبْدِلْهُ دَارًا خَيْرًا مِنْ دَارِهِ وَأَهْلًا خَيْرًا مِنْ أَهْلِهِ وَزَوْجًا خَيْرًا مِنْ زَوْجِهِ وَأَدْخِلْهُ الْجَنَّةَ وَأَعِذْهُ مِنْ عَذَابِ الْقَبْرِ أَوْ مِنْ عَذَابِ النَّارِ

(అల్లాహ్ ఇతడ్ని క్షమించు, ఇతనిని కరుణించు, శిక్ష నుండి కాపాడు, మన్నించు, ఇతడ్ని ఆదరించి మర్యాద చెయ్యి, ఇతని సమాధిని విశాల పరచు, ఇతడ్ని నీళ్ళతో, మంచుతో, వడగళ్ళతో కడిగి తెల్లని వస్త్రాన్ని మురికి లేకుండా శుభ్రం చేసినట్లు పాపాల నుండి ఇతన్ని పరిశుభ్రం చెయ్యి. ఇతనికి ఇహలోకపు ఇల్లు కన్నా మంచి ఇల్లు, ఇహలోకపు పరివారంకన్నా ఉత్తమ పరివారం, ఇహలోకపు జంటకంటే మంచి జంట ఇవ్వు. ఇతన్ని స్వర్గంలోకి ప్రవేశింపజెయ్యి. సమాధి శిక్ష నుండి, అగ్ని శిక్ష నుండి కాపాడు). (ముస్లిం 963).

[2] అల్లాహుమ్మగ్ఫిర్ లిహయ్యినా వ మయ్యితినా వ షాహిదినా వ గాయిబినా వ సగీరినా వ కబీరినా వ జకరినా వ ఉన్సానా అల్లాహుమ్మ మన్ అహ్ యైతహూ మిన్నా ఫఅహ్ యిహీ అలల్ ఇస్లామ్, వ మన్ తవఫ్ఫైతహూ మిన్నా ఫతవఫ్ఫహూ అలల్ ఈమాన్, అల్లాహుమ్మ లా తహ్రి మ్నా అజ్రహూ వలా తుజిల్లనా బఅ’దహ్. (ఇబ్ను మాజ 1498).

اللَّهُمَّ اغْفِرْ لِحَيِّنَا وَمَيِّتِنَا وَشَاهِدِنَا وَغَائِبِنَا وَصَغِيرِنَا وَكَبِيرِنَا وَذَكَرِنَا وَأُنْثَانَا اللَّهُمَّ مَنْ أَحْيَيْتَهُ مِنَّا فَأَحْيِهِ عَلَى الْإِسْلَامِ وَمَنْ تَوَفَّيْتَهُ مِنَّا فَتَوَفَّهُ عَلَى الْإِيمَانِ اللَّهُمَّ لَا تَحْرِمْنَا أَجْرَهُ وَلَا تُضِلَّنَا بَعْدَهُ

(అల్లాహ్! మాలోని బ్రతికి ఉన్నవారిని చనిపోయిన వారిని, హాజరున్నవారిని, దూరమున్నవారిని, చిన్న వారిని పెద్దవారిని, పురుషులను స్త్రీలను క్షమించు. అల్లాహ్ మాలో ఎవరిని బ్రతకనిచ్చినా ఇస్లాంపై బ్రతకనివ్వు, మాలో ఎవరికి మరణాన్ని ప్రసాదించినా విశ్వాస స్థితిలోనే మరణాన్ని ప్రసాదించు. అల్లాహ్! ఈ మరణించిన వ్యక్తి (విషయంలో సహనం వహించటం వల్ల లభించే) పుణ్యానికి మమ్మల్ని దూరం చేయకు. ఇతని తర్వాత మమ్మల్ని మార్గభ్రష్టత్వంలో పడవేయకు).

[3] అల్లాహుమ్మ ఇన్న ఫులానబ్న ఫులానిన్ ఫీ జిమ్మతిక వ హబ్లి జివారిక ఫఖిహీ ఫిత్నతల్ ఖబ్రి వ అజాబన్నారి వ అంత అహ్లుల్ వఫాఇ వల్ హంద్. అల్లాహుమ్మ ఫగ్ఫిర్లహూ వర్ హమ్ హు ఇన్నక అంతల్ గఫూరుర్రహీం. (అబూదావూద్ 3202).

اللَّهُمَّ إنَّ فُلَانَ بنَ فُلَانٍ فِي ذِمَّتِكَ وَحَبلِ جِوَارِكَ فَقِهِ فِتْنَةَ الْقَبرِ وَعَذَابَ الْقَبرِ وَأنْتَ أهلُ الْوَفَاءِ وَالحَمْدِ اللَّهُمَّ فَاغْفِرْلَهُ وَارْحَمْهُ إِنَّكَ أَنْتَ الْغَفُورُ الرَّحِيم

(ఓ అల్లాహ్ ఫలాన వ్యక్తి కుమారుడు నీ రక్షణలో, నీ చెంత ఉన్నాడు, నీవు అతడ్ని సమాధి శిక్ష నుండి, అగ్ని శిక్ష నుండి కాపాడు. నీవు వాగ్దానాన్ని నెరవేర్చువాడవు, స్తుతి పాత్రుడవు. అల్లాహ్ ఇతడ్ని మన్నించు, ఇతనిపై దయ చూపు. నిస్సందేహంగా నీవు అమితంగా మన్నించేవాడవు, అత్యధికంగా కరుణించేవాడవు).

[4] అల్లాహుమ్మ అబ్జుక వబ్ను అమతిక ఇహ్ తాజ ఇలా రహ్మతిక వ అంత గనియ్యున్ అన్ అజాబిహీ ఇన్ కాన ముహ్ సినన్ ఫజిద్ ఫీ ఇహ్ సానిహీ వ ఇన్ కాన ముసీఅన్ ఫతజావజ్ అన్ హు. (హాకిం 1/359).

اللَّهُمَّ عَبْدُكَ وَابْنُ أَمَتِكَ احْتَاجَ إِلَى رَحْمَتِكَ وَأَنْتَ غَنِيٌّ عَنْ عَذَابِهِ إِنْ كَانَ مُحسِنًا فَزِدْ فِي حَسَنَاتِهِ وَإِنْ كَانَ مُسِيئاً فَتَجَاوَزْ عَنْهُ

(అల్లాహ్! నీ దాసుడు, నీ దాసి కుమారుడు నీ కరుణ అవసరమైనవాడు. అతన్ని శిక్షించే అవసరం నీకు ఏ మాత్రం లేదు. అతడు పుణ్యాత్ముడై ఉంటే అతనికి పుణ్యఫలితాలు రెట్టింపుగా ప్రసాదించు. అతడు పాపా త్ముడై ఉంటే అతన్ని మన్నించు).

పిల్లల జనాజలో

అల్లాహుమ్మజ్అల్ హు లనా ఫరతౌఁ వ సలఫౌఁ వ అజ్రా. (బుఖారి 1335కు ముందు).

اللَّهُمَّ اجْعَلْهُ لَنَا فَرَطًا وَسَلَفًا وَأَجْرًا
(ఓ అల్లాహ్! ఇతడ్ని మా కొరకు సారథిగా, ముందుగా ఉండి మా కొరకు ప్రతిఫల కారకునిగా చేయి).


కృతజ్ఞతలు
స్తుతులకు పాత్రుడవు నీవే అల్లాహ్ ! కరుణామయుడా ఓ అల్లాహ్ !

దరూద్ చదవండి ప్రవక్త సిఫారసు పొందండి [వీడియో]

బిస్మిల్లాహ్

[1 నిమిషం వీడియో]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Video Courtesy: Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

ఉదయం పదిసార్లు, సాయంత్రం పదిసార్లు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దరూద్ పఠిస్తే, (ప్రళయ దినాన) ఆయన సిఫారసు భాగ్యం లభిస్తుంది.

عَنْ أَبِي الدَّرْدَاءِ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ ﷺ: «مَنْ صَلَّى عَلَيَّ حِيْنَ يُصْبِحُ عَشْرًا وَحِيْنَ يُمْسِي عَشْرًا أَدْرَكَتْهُ شَفَاعَتِي يَوْمَ الْقِيَامَةِ». رَوَاهُ الطَّبَرَانِي

హజ్రత్ అబూదర్దా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “ఎవరయితే ఉదయం పదిసార్లు, సాయంత్రం పదిసార్లు నాపై దరూద్ పఠిస్తారో, ప్రళయ దినాన వారికి నా సిఫారసు లభిస్తుంది“.(తబ్రానీ-హసన్) [అల్ బానీగారి ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి గ్రంథం. 11వ హదీసు]

ఇతరములు:

జిన్నాతుల యొక్క పెరుగుదల

షేఖ్ ముహమ్మద్ ఇబ్న్ అల్-ఉతైమీన్- రహిమహుల్లాహ్ – చెప్పారు :

‘ప్రజలు షరియా నుండి రెగ్యులర్ దుఆ మరియు జిక్ర్ లను నిర్లక్ష్యం చేయడం ప్రారంభించినప్పుడు, అప్పుడు జిన్నాతులు వారిలో చాలాపెరిగాయి, మరియు అవి వారిని ఎగతాళి చేసి వారితో ఆడుకున్నాయి’

[లికా అల్-బాబ్ అల్-మఫ్ తూహ్ 197]

من أقوال ابن العثيمين رحمه  الله

  ولمَّا غفل النَّاس عن الأوراد الشَّرعية كثرت فيهم الجنُّ الآن، وتلاعبت بهم .

لقاء الباب المفتوح ١٩٧

తెలుగు అనువాదం: teluguislam.net

నుండి: https://followingthesunnah.com/2019/10/18/the-increase-of-jinn/