తౌబా (పశ్చాత్తాపం) [పుస్తకం]

repent-too-late

పశ్చాత్తాపం- Toubah – Repentence
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)

[ఇక్కడ చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [మొబైల్ ఫ్రెండ్లీ బుక్] [34 పేజీలు]
[2 MB]

పశ్చాత్తాపం (తౌబా):రియాదుస్ సాలిహీన్ [ఆడియో సిరీస్]

విషయ సూచిక :

క్రింది చాఫ్టర్లు PDF లింకులుగా ఇవ్వబడ్డాయి

  1. తౌబా (పశ్చాత్తాపం) ప్రాముఖ్యత [11p]
  2. తౌబా నిబంధనలు [3p]
  3. తౌబా విధానాలు [3p]
  4. సత్యమైన తౌబా [3p]
  5. తౌబా చేయుటకు సహాయపడే విషయాలు [3p]
  6. పాప పరిహారాలు [4p]
  7. ప్రశ్నోత్తరాలు [9p]
    1. పాపాలు చాలా ఎక్కువగా ఉంటే ఎలా తౌబా చేయాలి?
    2. స్నేహితులు అడుకున్నప్తుడు ఎలా తౌబా చేయాలి?
    3. స్నేహితులు అవమానపరుస్తారన్స్న భయంలో ఎలా తౌబా?
    4. తౌబా చేసిన తర్వత అదే తప్పు మళ్ళీ జరిగితే ఎలా?
    5. ఒక పాపం చేస్తూ వేరే పాపం నుండి తౌబా చేయవచ్చా?
    6. గతంలో తప్పిపోయిన నమాజు, ఉపవాసాలు… ఎలా?
    7. సొమ్ము దొంగతనం చేసిన ఉంటే ఎలా తౌబా చేయాలి?
    8. వ్యభిచారానికి పాల్యడిన వ్వక్తి ఎలా తౌబా చేయాలి?
    9. వివాహానికి ముందు జరిగిన తప్పు గురించి చెప్పాలా?
    10. పురుషులు పరస్పరం, స్త్రీలు పరస్పరం చెడుకు పాలడితే ఎలా?

ప్రియ సోదరా/సోదరీ ! ఒక తల్లి తన చంటి పిల్ల పట్ల చూపే ప్రేమకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ప్రేమ అల్లాహ్ తన దాసుల పట్ల చూపుతాడు  అని గుర్తుంచుకో !! తన తౌబాలో  సత్యవంతుడైన వ్యక్తిని అల్లాహ్ తప్పక మన్నిస్తాడు. వ్యక్తిగతంగా తౌబా ద్వారం చివరి శ్వాస వరకు ఉంది. సామాన్యంగా ప్రళయానికి ముందు పశ్చిమ దిశ నుండి సూర్యోదయం అయ్యే వరకు ఉంది.

అల్లాహ్ మనందిరికీ క్షమాబిక్ష కోరుతూ, తౌబా చేస్తూ ఉండే భాగ్యం ప్రసాదించు గాక! అమీన్ !!

ఎవరైనా ఏదైనా పాపకార్యానికి పాల్పడటమో లేదా తనకు తాను అన్యాయం చేసుకోవడమో జరిగి ఆ తర్వాత అల్లాహ్ ను క్షమాభిక్షకై వేడుకుంటే, అలాంటి వాడు అల్లాహ్ ను క్షమాశీలుడు, అపార కరుణాప్రదాతగా పొందగలడు. (నిసా 4: 110).

తౌబా (పశ్చాత్తాపం) ప్రాముఖ్యత

సర్వ స్తోత్రములు అల్లాహ్ కొరకే. కరుణ, శాంతి కురువుగాక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై మరియు ఆయన అనుచరులపై.

ఒక వ్యక్తి ఇబ్రాహీం బిన్ అద్ హమ్ రహిమహుల్లాహ్ వద్దకు వచ్చి నేను పాపాలు చేసి స్వయంగా నాపైనే అన్యాయం చేసుకున్నాను. నాకేదైనా ఉపదేశం చేయండి అని విన్నవించుకున్నాడు. ఇబ్రాహీం చెప్పారుః “ఐదు విషయాలు నీవు పాటించగలిగితే పాపాల వల్ల నీకు నష్టం కలగదు (నీతో పాపం జరిగే అవకాశం తక్కువ ఉంటుంది). అప్పుడు అవేమిటి? అని ఆ వ్యక్తి అడిగాడు. ఇబ్రాహీం ఇలా సమాధానం చెప్పారు:

ఇబ్రాహీం:  పాపం చేయాలనుకున్నప్పుడు అల్లాహ్ ప్రసాదించే ఆహారం తినడం మానుకో.

ఆ వ్యక్తిః  ‘అయితే నేను ఎక్కడి నుండి తినాలి? ఈ ధర్తిపై ఉన్నదంతా అల్లాహ్ దే కదా?’

ఇబ్రాహీం: అల్లాహ్ ఇచ్చిన ఆహారం తిని, అల్లాహ్ అవిధేయతకు పాల్పడటం (పాపం చేయటం) న్యాయమేనా?

ఆ వ్యక్తిః  ‘కాదు’. ‘అయితే రెండవదేమిటి’?

ఇబ్రాహీం: నీవు పాపం చేయాలనుకున్నప్పుడు అల్లాహ్ యొక్క భూమిపై నివసించకు.

ఆ వ్యక్తిః  ‘ఇది మొదటి దానికంటే మరీ కష్టమైనది, అయినా నేను ఎక్కడ ఉండాలి’?

ఇబ్రాహీం: అల్లాహ్ యొక్క భూమిపై ఉండి, దుష్కార్యానికి పాల్ప- డటం మంచిదేనా?

ఆ వ్యక్తిః  మంచిది కాదు. మూడవది ఏమిటో తెలుపండి.

ఇబ్రాహీం:     నీవు పాపం చేయాలనుకున్నప్పుడు అల్లాహ్ చూడని ప్రాంతములోకి వెళ్ళు.

ఆ వ్యక్తిః  ఎక్కడికి వెళ్ళాలి? రహస్యబహిరంగాలన్నియూ ఆయనకు తెలుసు కదా!!

ఇబ్రాహీం:     నీవు అల్లాహ్ ప్రసాదించిన ఆహారం తింటూ, ఆయన ధర్తిపై నివసిస్తూ, ఆయన చూస్తూ ఉండగా పాపానికి ఒడిగడతావా?

ఆ వ్యక్తిః  అలా చేయను. అయితే నాల్గవది ఏమిటి?

ఇబ్రాహీం: ప్రాణంతీసే దూత వచ్చినప్పుడు “ఇప్పుడే నా ప్రాణం తీయకు, తౌబా చేసి, సత్కార్యాలు చేయుటకు నాకు వ్యవధి ఇవ్వు” అని చెప్పు.

ఆ వ్యక్తిః  అతడు నా మాట వినడు, నాకు వ్యవధి ఇవ్వడు కదా?

ఇబ్రాహీం:    తౌబా చేసి, సత్కార్యాలు చేయుటకు చావు నుండి తప్పించుకునే స్థోమత లేనివాడివి నీవు ఎలా పాపానికి ముందు అడుగు వేస్తావు?

ఆ వ్యక్తిః  సరే. ఐదవదేమిటి?

ఇబ్రాహీం:   నరకపాలకులు నిన్ను నరకంలోకి తీసుకుపోవటానికి వచ్చినప్పుడు నీవు వారి వెంట వెళ్ళకు.

ఆ వ్యక్తిః  వారు నన్ను వదలరు, నా అర్థింపును ఆలకించరు.

ఇబ్రాహీం: అలాంటప్పుడు నీకు మోక్షం ఎలా ప్రాప్తిస్తుంది?

ఆ వ్యక్తిః  ఇక చాలండి. నేను అల్లాహ్ తో పశ్చాత్తాప భావంతో స్వచ్ఛమైన క్షమాపణ కోరుకుంటాను. (అంటే తౌబా, ఇస్తిగ్ఫార్ చేస్తాను).

 అల్లాహ్ విశ్వాసులందరికీ తౌబా ఆదేశమిచ్చాడుః

విశ్వాసులారా! మీరంత కలసి అల్లాహ్ వైపునకు మరలి క్షమా- భిక్షన వేడుకోండి. మీకు సాఫల్యం కలగవచ్చు[. (నూర్ 24: 31).

తన దాసుల్లో రెండు రకాలవారున్నారు అని అల్లాహ్ తెలిపాడుః

  • 1-పాపం జరిగిన వెంటనే తౌబా చేయువారు.
  • 2-తౌబా చేయకుండా, తమ అత్మలపై అన్యాయం చేయువారు.

తౌబా చేయనివారే అన్యాయం చేయువారు[. (హుజురాత్ 49:11).

మానవుడు ఎల్లప్పుడూ తౌబా అవసరం గలవాడు. ఎందుకనగ అతని నుండి ఏదో అపరాధం జరుగతూ ఉంటుంది. అయితే అపరాధుల్లో తౌబా చేయువారే మంచివారు.

తౌబా చేయడం వల్ల ఇహపరాల్లో అనేక లాభాలు 

  • మనిషి తౌబా చేసి తన ప్రభువుకు అత్యంత ప్రియుడు, సన్నిహితుడు అవుతాడు. (సూర బఖర 2: 222).
  • సాఫల్యానికి, మోక్షానికి మార్గం తౌబా. (సూర్ నూర్ 24: 31)
  • ఆ వ్యక్తి పట్ల అల్లాహ్ చాలా సంతొషిస్తాడు. (సహీ ముస్లిం 2675)
  • ఇహపరాల్లో సుఖసంతోషాలు ప్రాప్తమవుతాయి. (హూద్ 11: 3).
  • పాపాల ప్రక్షాళనం జరుగుతుంది. (జుమర్ 39: 53, తహ్రీమ్ 66: 8).
  • పాపాలు పుణ్యాల్లో మార్చబడతాయి. (ఫుర్ఖాన్ 25: 70).
  • వర్షాలు కురుస్తాయి, పంటలు పండుతాయి, సంతానం ఇంకా అనేక శుభాలు వర్థిల్లుతాయి మరియు శత్రువులపై బలం పుంజుకుంటారు. (హూద్ 11: 52, నూహ్ 71: 10 – 12).

అనేక మందికి గురి అయిన ఒక పీడ ఏమనగ, నిర్లక్ష్యం కారణంగా వారు రేయింబవళ్ళు పాపాలకు పాల్పడుతూ ఉంటారు, మరికొందరు పాపాన్ని అతిచిన్న చూపుతో చూస్తూ, దానిని అల్పమైనదిగా భావిస్తారు. దానిని ఏ మాత్రం లక్ష్య పెట్టరు.

కాని మన ప్రవక్త సహచరుల దృష్టిలో పాపం యొక్క భయం ఎలా ఉండెనో ఈ క్రింది హదీసు ద్వారా గమనించండిః

قَالَ عَبْدُ اللهِ بْنُ مَسْعُودٍ : إِنَّ الْمُؤْمِنَ يَرَى ذُنُوبَهُ كَأَنَّهُ قَاعِدٌ تَحْتَ جَبَلٍ يَخَافُ أَنْ يَقَعَ عَلَيْهِ وَإِنَّ الْفَاجِرَ يَرَى ذُنُوبَهُ كَذُبَابٍ مَرَّ عَلَى أَنْفِهِ. {قَالَ بِهِ هَكَذَا فَطَارَ}

ఇబ్నుమస్ఊద్ రజియల్లాహు అన్హు ఇలా చెప్పారుః నిశ్చయంగా విశ్వాసుడు తన పాపాలను ఎలా భావిస్తాడంటే అతడు ఓ పర్వతం క్రింద కూర్చొని ఉన్నాడు, అది అతనిపై అప్పుడో, ఇప్పుడో పడనుందని భయపడుతూ ఉంటాడు. దుర్మార్గుడు తన పాపాల్ని తన ముక్కుపై వాలిన ఒక ఈగ మాదిరిగా భావిస్తాడు, అతడు తన చెయితో ఇలా అంటాడు అది లేచిపోతుంది. (బుఖారి 6308. తిర్మిజి 2497).

జ్ఞానంగల విశ్వాసుడు పాపం చిన్నదేకదా అని చూడడు, పాపం యొక్క శిక్ష ఎంత భయంకరమైనదో, దానిని చూస్తాడు. అయినా మానవుడు నిరపరాధి కాడు, కనుక అల్లాహ్ అతని కొరకు తౌబా ద్వారం తెరచి ఉంచాడు. తౌబా చేయాలని ఆదేశించాడు. అల్లాహ్ ఆదేశం శ్రద్ధగా చదవండిః

]ఓ ప్రవక్తా! ఇలా అనుః తమ ఆత్మలపై అన్యాయం చేసుకున్న నా దాసులారా! అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా, అల్లాహ్ అన్ని పాపాలను క్షమిస్తాడు. నిశ్చయంగా ఆయనే క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత[. (జుమర్ 39: 53).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారుః

((التَّائِبُ مِنَ الذَّنْبِ كَمَنْ لاَ ذَنْبَ لَهُ))

“పాపం చేసిన తర్వాత (పశ్చాత్తాపపడి) తౌబా చేసే వ్యక్తి, ఏ మాత్రం పాపం లేని వ్యక్తిగా మారుతాడు”. (ఇబ్ను మాజ).

ఇంతే కాదు, అతడు తన తౌబాలో సత్యవంతుడైతే అల్లాహ్ అతని పాపాల్ని పుణ్యాల్లో మారుస్తాడు. చదవండి ఈ ఆదేశం:

ఎవడు పశ్చాత్తాపపడి, విశ్వసించి, సత్కార్యాలు చేస్తాడో, అలాంటివారి పాపాలను అల్లాహ్ పుణ్యాల్లో మార్చుతాడు. అల్లాహ్ క్షమాశీలుడు, అపారకరుణప్రదాత[. (ఫుర్ఖాన్ 25: 70).

ముస్లిం చేసే తప్పుల్లో అతి పెద్ద తప్పు; తౌబా చేయడంలో జాప్యం చేయడం.

 కొంతమంది ఓ తప్పు చేస్తారు. అలా ఒక నిషిద్ధ కార్యానికి పాల్పడ్డారని తెలిసి కూడా తౌబా చేయడంలో జాప్యం చేస్తారు. వాస్తవానికి మృత్యువు ఆసన్నమయ్యే కాలాన్ని మనిషి ఎరుగడు గనక పాపాల మన్నింపుకై తౌబా చేయడంలో తొందరపడుట తప్పనిసరి.

తనకు గుర్తున్నవి, గుర్తు లేనివి అన్ని రకాల పాపాల మన్నింపుకై అధికంగా తౌబా చేస్తూ, అల్లాహ్ వైపునకు మరలుట తప్పనిసరి. అలాగే పాపాలు ఎంత ఘోరమైనవి అయినా సరే, తౌబా చేయడంలో తొందరపడుట కూడా అనివార్యం. (కొందరు తౌబా చేయడంలో తొందరపడరు, లేనిపోని తుచ్ఛమైన భావనాలకు గురి అయి, మరింత ఆలస్యమే చేస్తూ పోతారు, అలాంటి వారు ఈ విషయం తెలుసుకోవాలి) ‘మీ ప్రభువుని నేనే, మీ పూజలకు అర్హుడిని నేనే’ అన్న వాదన కంటే ఘోరమైన కుఫ్ర్, అవిశ్వాసం, తిరస్కారం మరొకటి లేదు. ఇలాంటి వాదనయే ఫిర్ఔన్ చేశాడు. అతని మాట ఖుర్ఆనులో ఇలా పేర్కొనబడినదిః ]ఓ నాయకులారా! నేను తప్ప మీకు మరొక ఆరాధ్య దేవుడు గలడని నాకు తెలియదు[. (ఖసస్ 28: 38). మరోచోట అతని వాదన ఇలా వచ్చిందిః ]నేనే మీ యొక్క మహోన్నత ప్రభువును[. (నాజిఆత్ 79: 24). అతను ఇంతటి ఘోరాతిఘోరమైన వాదనలు చేసినప్పటికీ, పరమప్రభువైన అల్లాహ్, ప్రవక్త మూసా అలైహిస్సలాంను అతని వైపునకు పంపుతూ ఇలా ఆదేశించాడుః

ఫిర్ఔన్ వద్దకు వెళ్ళు, అతడు హద్దులు మీరాడు. అతనికి ఇలా బోధించుః పరిశుద్ధ జీవితం అవలంబించటానికి నీవు సిద్ధంగా ఉన్నావా? నేను నీ ప్రభువు మార్గాన్ని నీకు చూపితే, నీలో ఆయన పట్ల భయభక్తులు కలుగుతాయా?[. (నాజిఆత్ 79: 17-19).

అతడు మూసా అలైహిస్సలాం మాటను స్వీకరించి, స్వచ్ఛమైన తౌబా గనక చేసి ఉంటే, అల్లాహ్ తప్పక అతడ్ని క్షమించేవాడు.

ఇది కూడా తెలుసుకో! ఎవరయినా ఒక పాపం నుండి తౌబా చేసిన తర్వాత మళ్ళీ అదే పాపానికి పాల్పడితే, మళ్ళీ తౌబా చేయాలి. తప్పు జరిగినప్పుడల్లా తౌబా చేస్తూ ఉండాలి. అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందవద్దు.

عَنْ أَنَسٍ  قَالَ: سَمِعْتُ رَسُولَ الله ﷺ يَقُولُ: قَال اللهُ تَعَالى: ((يَا ابنَ آدَمَ! إِنَّكَ مَا دَعَوْتَنِي وَرَجَوْتَنِي غَفَرْتُ لَكَ عَلَى مَا كَانَ فِيكَ وَلاَ أُبَالِي، يَا ابْنَ آدَمَ! لَوْ بَلَغَتْ ذُنُوبُكَ عَنَانَ السَّمَاءِ ثُمَّ اسْتَغْفَرْتَنِي غَفَرْتُ لَكَ وَلاَ أُبَالِي، يَا ابْنَ آدَمَ! إِنَّكَ لَوْ أَتَيْتَنِي بِقُرَابِ الْأَرْضِ خَطَايَا ثُمَّ لَقِيتَنِي لاَ تُشْرِكُ بِي شَيئًا لَأَتَيتُكَ بِقُرَابِهَا مَغْفِرَة )) رواه الترمذي

సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా తెలిపాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా నేను విన్నాను అని అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఓ ఆదం పుత్రుడా! నీవు నన్ను అర్థిస్తూ, నాపై ఆశ ఉంచినంత కాలం నేను నిన్ను మన్నిస్తూ ఉంటాను, నీవు మాటిమాటికి (పాపం మరియు తౌబాలు) చేస్తూ ఉన్నా సరే, నేను పట్టించుకోను. ఓ ఆదం పుత్రుడా! నీ పాపాలు (అధిక సంఖ్యలో) చేరి నింగిని అందుకున్నా సరే నేను పట్టించుకోను, నువ్వు గనక నాతో క్షమాభిక్ష కోరితే నేను తప్పక క్షమిస్తాను. ఓ ఆదం పుత్రుడా! నీవు ఎవ్వరినీ నాకు భాగస్వామిగా (షిర్క్) చేయకుండా, ఇతర పాపాలు భూమి నిండా తీసుకొని నా వద్దకు వస్తే, నేను అంతే పరిమాణంలోని మన్నింపుతో  నేను నిన్ను కలుసుకుంటాను”. (తిర్మిజి 2669).

 కొంతమంది అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందుతారు. అది వారి అపరాధాలు, పాపాలు అధికమైనందుకు, లేదా ఒకసారో, కొన్నిసార్లో తౌబా చేసి, తిరిగి అదే పాపానికి పాల్పడినందుకు, ఇక అల్లాహ్ క్షమించడు అని భావించి, మరింత పాపాల్లోనే ఇరుక్కు పోతారు. తౌబా చేయడం, అల్లాహ్ వైపు మరలడం మానేస్తారు. కాని వారు చేసే ఘోరమైన తప్పు ఇదే. ఎందుకనగా అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందేది అవిశ్వాసులే. విశ్వాసులు నిరాశ నిస్పృహలను సంపూర్ణంగా వదలుకొని, అల్లాహ్ కారుణ్యాన్ని ఆశించి, పాపాలను విడనాడి స్వచ్ఛమైన తౌబా చేయాలి. అల్లాహ్ ఆదేశాలను చాలా శ్రద్ధగా చదవండిః

ఓ ప్రవక్తా! ఇలా అనుః తమ ఆత్మలపై అన్యాయం చేసుకున్న నా దాసులారా! అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా, అల్లాహ్ అన్ని పాపాలను క్షమిస్తాడు. నిశ్చయంగా ఆయనే క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత[. (జుమర్ 39: 53).

అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి, నిశ్చయంగా, సత్యతిరస్కార జాతికి చెందినవారు తప్ప, ఇతరులు అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందరు [. (జుమర్ 39: 53).

మరికొందరు కొన్ని రకాల పాపాల నుండి తౌబా చేయరు. దానికి కారణం: ప్రజల మాటల, వదంతుల భయంతో, లేదా తాను ఏ సమాజంలో జీవితం గడుపుతున్నాడో అందులో అతని ప్రతిష్ఠకు ముప్పు కలుగుతుందన్న భయంతో, లేదా తన ఉద్యోగం పోతుందన్న భయంతో. అయితే ఇలాంటి వారు ఈ విషయాలు తెలుసుకోవాలి, ఎప్పుడు వీటిని మరవవద్దుః చనిపోయిన తర్వాత సమాధిలో మరియు తన ప్రభువు సమక్షంలో హాజరైనప్పుడు తాను ఒంటరిగానే ఉంటాడు. చివరికి ప్రభువు అతడ్ని అతని ఆచరణ గురించి ప్రశ్నించినప్పుడు ఏ ఒక్కడూ అతని వెంట ఉండడు. ఆ కరుణామయుని భయంతో తౌబా చేయకుండా, ఇతరుల భయంతో ఇంకెన్నాళ్ళు పాపపుజీవితమే గడుపుతూ ఉందాము ఆలోచించండి.

మరికొందరు తౌబా చేయకపోవడానికి కారణం; ఎవరో అతని తౌబాకు అడ్డుపడుతున్నారని, లేదా ఎవరో దుష్చేష్టలను ఆకర్షవంతగా, సరైనవిగా చూపిస్తున్నారని. అయితే వారు కూడా అల్లాహ్ యందు అతనికి ఏ మాత్రం ఉపయోగపడరు అని స్పష్టంగా తెలుసుకోవాలి. ఒకవేళ అతను స్వచ్ఛమైన తౌబా చేసి, ఏదైనా దుష్కార్యాన్ని వదులుకుంటే, తప్పక అల్లాహ్ దానికి బదులుగా అతనికి ఏదైనా మేలైనదానిని నొసంగుతాడు.

 మరికొందరు తప్పుపై తప్పు చేస్తునే ఉంటారు. అలా చేయకండి అని బోధ చేసినప్పుడు ‘అల్లాహ్ క్షమించేవాడు’ అని బదులిస్తారు. ఇది మూర్ఖత్వం, పిచ్చివాదం. ఇలా షైతాన్ వారిని దుర్మార్గ వలలోనే చిక్కుకొని ఉండి, బయటకు రాకుండా చేస్తున్నడాని తెలుసుకోవాలి. అల్లాహ్ అపార కరుణాప్రదాత, క్షమించేవాడు అన్నది వాస్తవమే. కాని ఎవరి కొరకు అన్నది కూడా తెలుసుకోవాలి కదా! అయితే తెలుసుకోః పాపాలను వదలి, సత్కార్యాలు చేసేవారి కొరకు అల్లాహ్ కారుణ్యం చాలా సమీపంలో ఉంది. మంకుతనంతో దుష్కార్యాలకు పాల్పడేవారి కోసం కాదు. అల్లాహ్ ఆదేశాన్ని గమనించండిః

నిశ్చయంగా అల్లాహ్ కారుణ్యం సజ్జనులకు సమీపంలోనే ఉంది[. (ఆరాఫ్ 7: 56).

 అల్లాహ్ కరుణించే, క్షమించేవాడు అయినప్పటికీ, దుష్టులను శిక్షించేవాడు కూడాను. అల్లాహ్ ఈ ఆదేశం చదవండిః

నేను చాలా క్షమించేవాడిని, కరుణించేవాడిని అనీ మరియు దీనితో పాటు నా శిక్ష కూడా చాలా బాధకరమైన శిక్షే అని నా దాసులకు తెలియజేయుము[. (ఆరాఫ్ 7: 56).

 సోదరులారా! తౌబా చేయక పోవడానికి లేదా చేయడంలో ఆలస్యం అవడానికి సంబంధించిన కొన్ని కారణాలు, వాటి పరి- ష్కారాలు  గత పేజిలలో తెలిపాము. క్రింద తౌబా నిబంధనలు తెలుసుకుందాము.

తౌబా నిబంధనలు

తౌబా నిబంధనలు అంటేః ఒక మనిషి ఏదైనా పాపం నుండి తౌబా చేస్తున్నప్పుడు, అతని తౌబాను అల్లాహ్ స్వీకరించాలంటే,  ఈ మూడు నిబంధనలు ఉన్నాయి. అప్పుడే అది నిజమైన తౌబా అగును. వాటిని ధర్మ వేత్తలు ఖుర్ఆన్ మరియు హదీసుల ఆధారంగా సేకరించారు.

1- ఏ పాపం నుండి తౌబా చేస్తున్నాడో ఆ పాపాన్ని విడనాడాలి.

2- ఆ పాపం గుర్తుకు వచ్చినప్పుడల్లా సిగ్గుతో కుమిలిపోవాలి.

3-ఇక ముందు ఆ పాపం చేయకుండా ఉండడానికి దృఢ సంకల్పం చేసుకోవాలి.

పాపం యొక్క సంబంధం మానవుని మరియు అతని ప్రభువు మధ్య ఉంటే, పై మూడు నిబంధనలు పాటించాలి. ఒకవేళ పాపం తోటి మానవుల హక్కులకు సంబంధించినదైతే, పై మూడిటితో పాటు ఈ నాల్గవది కూడా పాటించాలిః

4- ఎవరిపైనా ధన, మాన, ప్రాణ సంబంధమైన హక్కులో ఏదైనా అన్యాయం చేసి ఉంటే, అతని హక్కు అతనికి తిరిగి ఇవ్వాలి. లేదా అతనితో క్షమాపణ కోరుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారుః

عَنْ أَبِي هُرَيْرَةَ  قَالَ: قَالَ رَسُولُ الله : مَنْ كَانَتْ لَهُ مَظْلَمَةٌ لِأَخِيهِ مِنْ عِرْضِهِ أَوْ شَيْءٍ فَلْيَتَحَلَّلْهُ مِنْهُ الْيَوْمَ قَبْلَ أَنْ لَا يَكُونَ دِينَارٌ وَلَا دِرْهَمٌ إِنْ كَانَ لَهُ عَمَلٌ صَالِحٌ أُخِذَ مِنْهُ بِقَدْرِ مَظْلَمَتِهِ وَإِنْ لَمْ تَكُنْ لَهُ حَسَنَاتٌ أُخِذَ مِنْ سَيِّئَاتِ صَاحِبِهِ فَحُمِلَ عَلَيْهِ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారని అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఎవరైనా తన సోదరుని మానమర్యాదలకు సంబంధించిన విషయంలోగాని లేదా మరే విషయంలోగాని ఏదైనా దౌర్జన్యానికి/ అన్యాయానికి పాల్పడి ఉంటే, దీనార్లుగాని, దిర్హములుగాని (డబ్బు, ధనాల ప్రయోజనం) ఉండని ఆ రోజు రాక ముందు, ఈ రోజే అతను (హక్కుదారుని హక్కు ఇచ్చేసి, లేదా అతని ద్వారా మాఫీ పొంది) ఆ పాపాన్ని ప్రక్షాళనం చేసుకోవాలి. (ఇలా చేయని పక్షంలో ఆ రోజు పాప ప్రక్షాళన పద్ధతి ఇలా ఉంటుందిః) దౌర్జన్యపరుని వద్ద సత్కార్యాలు ఉంటే, అతని దౌర్జన్యానికి సమానంగా సత్కార్యాలు అతని నుండి తీసుకొని (పీడుతులకు పంచడం జరుగుతుంది). ఒకవేళ అతని వద్ద సత్కార్యాలు లేకుంటే పీడుతుని పాపాలు తీసుకొని అతనిపైన మోపడం జరుగుతుంది”. (బుఖారి 2449).

ఏ బాధితుడైనా ఈ హదీసు తెలిసిన తర్వాత తన శక్తిమేర ప్రయత్నం చేసినప్పటికీ, తాను బాధించిన వ్యక్తిని కలుసుకోలేక, లేదా అతని హక్కు ఇవ్వలేక పోతే, ఈ స్థితిలో కేవలం అల్లాహ్ మన్నింపుకై ఆశించాలి. అల్లాహ్ మనందరిని తన కరుణ ఛాయలో తీసుకొని మన్నించుగాక.

హక్కుల్లో

 గత పేజిల్లో మాన, ప్రాణ, ధన సంబంధిత హక్కుల విషయం వచ్చింది గనక, వాటి గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం.

1-  ధనసంబంధిత హక్కుః ధనానికి సంబంధించిన హక్కు ఎలాగైనా హక్కుదారునికి తిరిగి ఇచ్చే ప్రయత్నం చేయాలి. లేదా అతడ్ని కలుసుకొని మాఫీ చేయించుకోవాలి. ఒకవేళ అతని చిరునామ తెలియక, లేదా సాధ్యమైనంత వరకు వెతికినప్పటికీ అతడ్ని పొందలేకపోతే, లేదా ధన పరిమాణం గుర్తు లేకుంటే, ఏదైనా ఒక పరిమాణం నిర్ణయించుకొని అతని తరఫున దానం చేయాలి.

ఒకటిః (ప్రాయశ్చితంగా, దౌర్జన్య ప్రమాణంలో) ఏదైనా ధనం కోర- వచ్చు. రెండవదిః దౌర్జన్య ప్రమాణంలో ప్రతీకారం తీసుకోవచ్చు. మూడవదిః మాఫీ చేయవచ్చు. ఒకవేళ హక్కుగల వ్యక్తి తెలియకుంటే అతని తరఫున దానం చేయాలి. అతని కొరకు దుఆ చేయాలి.

2- శారీర సంబంధిత హక్కుః శారీరకంగా ఎవరిపైనైనా ఏదైనా దౌర్జన్యం చేసి ఉంటే, దౌర్జన్యపరుడు పీడితునికి లొంగిపోవాలి. అతడు తన హక్కు ఈ క్రింది మూడు పద్ధతుల్లో ఏదో ఒక రకంగా తీసుకోవచ్చుః

3- మానమర్యాద హక్కుః ఇది ఎన్నో రకాలుగా ఉంటుందిః పరోక్షంగా నిందించుట, ఏదైనా అపనింద మోపుట, చాడీలు చెప్పుట, కలసిఉన్నవారి మధ్య విభేదాలు సృష్టించి వారిని విడదీయుట వగైరా. ఈ రకంగా ఎవరినైనా బాధించి ఉంటే, అతని వద్దకు వెళ్ళి మన్నింపు కోరుకోవాలి. శక్తానుసారం వారికి చేసిన కీడుకు బదులుగా మేలు చేయాలి. వారి కొరకు దుఆ చేయాలి.

తౌబా విధానాలు

పాపాల్లో కొన్ని మహాఘోరమైన పాపాలున్నాయి. వాటికి పాల్పడినవారు ఎలా తౌబా చేయాలి అన్న విషయమే క్రింది భాగంలో తెలుసుకోబుతున్నాము. అయితే చాలా శ్రద్ధగా చదవండి, ఇతరులకు ప్రయోజనం కలగజేయండి.

1- హంతకుని తౌబాః ఉద్ధేశపూర్వకంగా ఎవరినైనా చంపిన వ్యక్తిపై మూడు రకాల హక్కులుంటాయి.

ఒకటి: అల్లాహ్ కు సంబంధించిన హక్కుః అంటే సత్యమైన తౌబా చేయాలి. ఇందులో పైన తెలిపిన మూడు/నాలుగు నిబంధనలు వస్తాయి.

రెండవది: హతుని వారసుల హక్కుః హంతకుడు వారికి లొంగిపోవాలి. వారు ఇతడి నుండి మూడిట్లో ఏదైనా ఒక రకంగా తమ హక్కు తీసుకుంటారు. A: ప్రాయశ్చితంగా అతని నుండి ధనం తీసుకుంటారు. లేదా B: అతడ్ని చంపి ప్రతీకారం తీర్చుకుంటారు. లేదా C: అతడ్ని మన్నించి వదలుతారు.

మూడవది: హతుని హక్కుః ఈ హక్కు అతనికి ఇహలోకంలో ఇవ్వరాదు.

అందుకని హంతకుడు తన తౌబాలో సత్యవంతుడై, తనకు తాను హతునివారసులకు అప్పగిస్తే, అల్లాహ్ అతని ఆ అపరాధాన్ని మన్నిస్తాడు. హతునికి ప్రళయదినాన మేలైన ప్రతిఫలం నొసంగుతాడు.

2-  వడ్డీ తినే, తీసుకునే వారి తౌబాః వడ్డీ తీసుకొనుట, తినుట నిషిద్ధం అని తెలిసిన తర్వాత, తౌబా చేయు వ్యక్తి, వడ్డీ తీసుకోవడం మరియు తినడం మానుకోవాలి. ఇక ఎప్పుడూ తీసుకోకుండా, తినకుండా ఉండడానికి దృఢ సంకల్పం చేసుకోవాలి. ఇంతకు ముందు ఏదైతే తిన్నాడో, తీసుకున్నాడో అది గుర్తుకు వచ్చినప్పుడు ‘ఛీ’ అని సిగ్గు చెందాలి. ఈ విషయాల్ని పాటించినప్పుడే అతని తౌబా నిజమగును. అతను వడ్డీ ద్వారా సంపాదించిన ధనం గురించి పండితుల మధ్య భేదాభిప్రాయాలున్నవి. అయితే షేఖుల్ ఇస్లాం ఇబ్ను తైమియా, షేఖ్ అబ్దుర్ రహ్మాన్ బిన్ సఅదీ మరియు ఇబ్ను ఉసైమీన్ రహిమహుముల్లాహ్ ఇలా చెప్పారుః

తౌబా చేయటానికి ముందు తీసుకున్న వడ్డీ అతనిదే అయి యుంటుంది. అతను దానిని తన ఏ అవసరాలకైనా సరే ఉపయోగించ వచ్చును. అందులో ఏలాంటి అభ్యంతరం లేదు. ఏ వడ్డీ సొమ్ము వచ్చేది ఉందో దానిని తీసుకోకుండా అసలు సొమ్ము మాత్రమే తీసుకోవాలి. దీనికి ఆధారం అల్లాహ్ యొక్క ఈ ఆదేశం:

అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మసమ్మతం (హలాల్) చేశాడు, వడ్డీని నిషిద్ధం (హరాం) చేశాడు. కనుక తన ప్రభువు యొక్క ఈ హితబోధ అందిన వ్యక్తి, ఇక ముందు వడ్డీ తినడం త్యజిస్తే, పూర్వం జరిగిందేదో జరిగింది, దాని పరిష్కారం అల్లాహ్ చూసుకుంటాడు[. (బఖర 2: 275).

సత్యమైన తౌబా

చెడును వదులుకునేవారు సామాన్యంగా ఏదైనా కారణంగానే వదులుకుంటారు. కాని తన తౌబా అంగీకరించబడాలి అని కాంక్షించే వ్యక్తి, అల్లాహ్ ప్రసన్నత పొందుటకు మాత్రమే తౌబా చేయుట తప్పనిసరి.

ఎవరైనా తన పాపం, తన ప్రఖ్యాతిలో మరియు ఉద్యోగంలో అడ్డు పడుతుందన్న భయంతో పాపాన్ని విడనాడితే అది తౌబా అనబడదు.

ఎవరు తన ఆరోగ్యం చెడిపోతుందని లేదా (ఏయిడ్స్) లాంటి వ్యాదికి గురి కావలసి వస్తుందన్న భయంతో ఏదైనా దుష్చేష్టను వదులుకుంటే అది తౌబా అనబడదు.

ఎవరైతే దొంగతనం చేసే శక్తి లేనందుకు, పోలీసు, లేదా కాపలాదారుని భయానికి దొంగతనం మానుకుంటే అది తౌబా కాదు.

డబ్బు లేనందుకు మత్తు సేవించడం, మాధకద్రవ్యాలు వాడటం మానుకుంటే అది తౌబా అనబడదు.

తన మనస్ఫూర్తిగా కాకుండా, వేరే ఏదైనా కారణం వల్ల, ఉదాహరణకు తప్పు చేసే శక్తి లేనందుకు తప్పు చేయకుంటే అది తౌబా అనబడదు.

తౌబా చేయు వ్యక్తి మొదట తప్పు యొక్క చెడును గోచరించాలి. ఉదాహరణకుః స్వచ్ఛమైన తౌబా చేసే వ్యక్తి, జిరిగిన ఆ తప్పును తలచి తృప్తి చెందడం, సంతోషించడం అసంభవం, లేక భవిష్యత్తులో తిరిగి చేయాలని కాంక్షించడం కూడా అసంభవం.

అదే విధంగా ఏ చెడు నుండి తౌబా చేశాడో, ఆ చెడుకు తోడ్పడే సాధనాలన్నిటికీ దూరంగా ఉండడం తప్పనిసరి. ఉదాహరణకుః మత్తు సేవించడం, సినిమాలు చూడడం నిషిద్ధం అని తెలిసిన తర్వాత, వాటి నుండి తౌబా చేసిన వ్యక్తి మత్తు మరియు సినిమాలకు సంబంధించిన పరికరాలన్నిటికి దూరంగా ఉండాలి. అవి ఉన్న ప్రాంతంలో వెళ్ళ కూడదు. స్నేహితుల్లో వాటికి బానిస అయినవారి నుండి దూరం ఉండాలి.

 అనేక మంది చెడు పనులకు అలవాటు పడేది చెడు స్నేహితుల ద్వారానే. అయితే ఇక్కడ చెడు స్నేహితులను వదలుకోవడం కష్టంగా ఏర్పడినప్పుడు ప్రళయదినాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. ఇక్కడి దుష్మిత్రులు అక్కడ పరస్పరం శత్రువులవుతారు, శపించుకుంటారు. (చూడండి సూర జుఖ్రుఫ్ 43: 67: الْأَخِلَّاءُ يَوْمَئِذٍ بَعْضُهُمْ لِبَعْضٍ عَدُوٌّ إِلَّا الْمُتَّقِينَ ఆ రోజు (ప్రాణ) మిత్రులు కూడా ఒకరికొకరు  శత్రువులై పోతారు – అయితే దైవభక్తి పరాయణులు మాత్రం అలా ప్రవర్తించరు). అందుకే తౌబా చేసిన వ్యక్తి తన పాత స్నేహితులను, సత్కార్యాల వైపునకు ఆహ్వానించే ప్రయత్నం చేయాలి. అలా చేయలేకపోతే వారికి దూరంగానే ఉండాలి.

 తౌబా చేసిన వారిలో కొందరు తన పాత మిత్రులను సత్కార్యం వైపునకు పిలిచే సాకుతో మళ్ళీ వారితోనే కలసిపోవటానికి షైతాన్ ప్రేరేపిస్తాడు. స్వయంగా వారు కొత్తగా సత్కార్య మార్గాన్ని అవలంబించారు గనక, తమ మిత్రులపై మంచి ప్రభావం చూపలేకపోతారు. ఇలా ఇది పాత పాపానికి పాల్పడడానికి కారణం అవుతుంది. అందుకు అతను వారికి బదులుగా మంచి మిత్రుల్ని ఎన్నుకోవాలి. వారు అతని మంచికై తోడ్పడతారు, సన్మార్గంపై ఉండడానికి బలాన్నిస్తారు.

తౌబా చేయుటకు సహాయపడే విషయాలు

1- సంకల్పశుద్ధి, స్వచ్ఛత అల్లాహ్ కొరకే ఉండాలి:- పాపం వదలడానికి ఇది ప్రయోజనకరమైన ఆధారం. దాసుడు తన ప్రభువు కొరకే చిత్తశుద్ధి చూపినప్పుడు, పశ్చాత్తాపపడి, క్షమాభిక్షలో సత్యవంతుడైనప్పుడు అల్లాహ్ ఆ విషయంలో అతనికి సహాయపడతాడు. తౌబా చేయడానికి అతడ్ని అడ్డగించే వాటిని అతని నుండి దూరంగా ఉంచుతాడు.

2- మనుస్సును నిర్బంధించుటః- ఒక వ్యక్తి పాపం చేయకుండా తన మనస్సును నిర్బంధించాడంటే అల్లాహ్ అతనికి సహాయపడతాడు. అల్లాహ్ ఆదేశం చదవండిః

మా కొరకు తీవ్ర ప్రయత్నం చేసేవారికి మేము మా మార్గాలను చూపుతాము[. (అన్కబూత్ 29: 69).

3- పరలోక ధ్యాసః- అల్పమైన ఇహలోకాన్ని, అతిత్వరలో నశించే ఈ ప్రపంచాన్ని తలచి, విధేయులకు పరలోకంలో సిద్ధంగా ఉన్న భోగభాగ్యలు, అవిధేయుల గురించి ఉన్న కఠిన శిక్షను తలచుకుంటూ ఉంటే అపరాధానికి గురి కాకుండా ఉండడానికి ఇది ముఖ్యమైన అడ్డుగా నిలుస్తుంది.

4-ప్రయోజనకరమైన వాటిలో కార్యమగ్నుడై, ఒంటరితనం, తీరిక లేకుండా ఉండుటః- పాపాల్లో పడటానికి ముఖ్య కారణం తీరిక. ఇహపరాల్లో లాభం చేకుర్చేవాటిలో మనిషి నిమగ్నుడై ఉంటే, దుర్మార్గం చేయడానికి తీరిక పొందడు.

5-ఉద్రేకానికి గురి చేసే విషయాలకు, పాపాన్ని గుర్తు చేసే వాటికి దూరంగా ఉండాలిః- పాపానికి గురిచేసే కారణాల్ని ప్రేరేపించే వాటికి, సినిమాలకు, పాటలకు, అశ్లీల రచణలకు, నీతిబాహ్యమైన మ్యాగ్జిన్స్ (పత్రికల)కు ఇలా దుర్వాంఛల్ని ఉత్తేజ పరిచే వాటికి దూరంగా ఉండాలి.

6-సజ్జనులకు దగ్గరగా, దుర్జణులకు దూరంగా ఉండాలిః- సజ్జనుల తోడు మంచి చేయుటకు సహాయపడుతుంది, పుణ్యాత్ములను అనుసరిం- చాలని ప్రోత్సహిస్తుంది, దుర్మార్గానికి, చెడుకు అడ్డుపడుతుంది.

7-దుఆః- మహాప్రయోజనకరమైన చికిత్స ఇది. దుఆ విశ్వాసుల ఆయుధం. అవసరాలు తీర్చే బలమైన హేతువు. అల్లాహ్ ఆదేశాలను చదవండిః

నీ ప్రభువు ఇలా అంటున్నాడుః నన్ను ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను అంగీకరిస్తాను[. (మోమిన్ 40: 60).

విలపిస్తూ, గోప్యంగానూ మీ ప్రభువును వేడుకోండి. [. (ఆరాఫ్ 7:55).

నా దాసులు నా గురించి నిన్ను అడిగితే, నేను వారికి అత్యంత సమీపంలో ఉన్నాననీ, పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపును వింటాను, సమాధానం పలుకుతాను అనీ ఓ ప్రవక్తా నీవు వారికి తెలుపు. కనుక వారు నా సందేశం విని దానిని స్వీకరించాలి. నన్ను విశ్వసించాలి. ఇలా వారు రుజుమార్గం పొందే అవకాశం ఉంది[. (బఖర 2: 186).

పాప పరిహారాలు

అల్లాహ్ తన దాసులపై విధించిన ప్రార్థనల్లో తన గొప్ప దయ, కరుణతో కొన్నిటిని చిన్నపాపాల పరిహారానికి సాధనంగా చేశాడు. వాటిలో కొన్ని ఈ క్రిందివిః

1-విధిగా ఉన్న ఐదు పూటల నమాజులు. దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారుః

أَرَأَيْتُمْ لَوْ أَنَّ نَهْرًا بِبَابِ أَحَدِكُمْ يَغْتَسِلُ مِنْهُ كُلَّ يَوْمٍ خَمْسَ مَرَّاتٍ هَلْ يَبْقَى مِنْ دَرَنِهِ شَيْءٌ قَالُوا لَا يَبْقَى مِنْ دَرَنِهِ شَيْءٌ قَالَ فَذَلِكَ مَثَلُ الصَّلَوَاتِ الْخَمْسِ يَمْحُو اللهُ بِهِنَّ الْخَطَايَا

“మీలో ఎవరి ఇంటి ముందైనా ఒక సెలయేరు ఉండి, అతను అందులో ప్రతి రోజు ఐదుసార్లు స్నానం చేస్తూ ఉంటే, అతని శరీరంపై మురికి ఉంటుందా”? అని ప్రవక్త అడిగారు. దానికి సహచరులు చెప్పారుః ఎలాంటి మురికి మిగిలి ఉండదు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారుః “ఐదు పూటల నమాజు సంగతి కూడా ఇలాంటిదే. వాటి ద్వారా అల్లాహ్ పాపాలను తుడిచివేస్తాడు”. (ముస్లిం 667, బుఖారి 528).

2-జుమా నమాజు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశం:

مَنْ تَوَضَّأَ فَأَحْسَنَ الْوُضُوءَ ثُمَّ أَتَى الْجُمُعَةَ فَاسْتَمَعَ وَأَنْصَتَ غُفِرَ لَهُ مَا بَيْنَهُ وَبَيْنَ الْجُمُعَةِ وَزِيَادَةُ ثَلَاثَةِ أَيَّامٍ

“ఎవరైనా చక్కగా వుజూ చేసుకొని, జుమా నమాజు కొరకు వచ్చి, అత్యంత శ్రద్ధతో, నిశ్శబ్దంగా జుమా ప్రసంగం వింటే, వెనకటి జుమా నుండి ఈ జుమా వరకు, అదనంగా మూడు రోజుల పాపాల మన్నింపు జరుగుతుంది. (ముస్లిం 857).

3- రమజాను ఉపవాసాలు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశం:

مَنْ صَامَ رَمَضَانَ إِيمَانًا وَاحْتِسَابًا غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ

“ఎవరు సంపూర్ణ విశ్వాసం మరియు పుణ్యాన్ని ఆశించి రమజాను ఉపవాసాలు పాటించాడో అతని పూర్వ పాపాలు క్షమించబడతాయి”. (బుఖారి 38, ముస్లిం 760).

4- హజ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశం:

مَنْ حَجَّ هَذَا الْبَيْتَ فَلَمْ يَرْفُثْ وَلَمْ يَفْسُقْ رَجَعَ كَيَوْمِ وَلَدَتْهُ أُمُّهُ

“ఏలాంటి వాంఛలకు లోనవకుండా, అల్లాహ్ ఆజ్ఞల్ని ఉల్లఘించకుండా కాబా గృహం యొక్క హజ్ చేసిన వ్యక్తి, అదే రోజు పుట్టినవానిలా హజ్ నుండి తిరిగి వస్తాడు”. (బుఖారి 1820, ముస్లిం 1350).

5- అరఫా (జిల్ హిజ్జ మాసం యొక్క 9వ) రోజు ఉపవాసం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారుః

صَومُ يَومِ عَرَفَةَ يُكَفِّرُ السَّنَةَ الْمَاضِيَةَ وَالْبَاقِيَة

“అరఫా రోజు యొక్క ఉపవాసము గడిసిన ఒక సంవత్సరం మరియు వచ్చే ఒక సంవత్సర పాపాలన్నిటిని తుడిచివేస్తుంది”. (ముస్లిం 1162).

6- రోగాలు, కష్టాలు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశం:

مَا يُصِيبُ الْمُسلِمَ مِنْ نَصَبٍ، وَلاَ وَصَبٍ، وَلاَ هَمٍّ، وَلاَ حُزنٍ، وَلاَ أَذًى، وَلاَ غَمٍّ حَتَّى الشَّوْكَةِ يُشَاكُّهَا إِلاَّ كَفَّرَ اللهُ بِهَا مِن خَطَايَاه

“ముస్లింకు అలసట, అవస్త, చింత, వ్యాకులత, బాధ మరియు దుఃఖం ఏదీ కలిగినా, చివరికి ఒక ముళ్ళు గుచ్చుకున్నా అల్లాహ్ దాని కారణంగా అతని పాపాలను తుడిచివేస్తాడు”. (బుఖారి 5642, ముస్లిం 2573).

మరో చోట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారుః

مَنْ يُرِدِ اللهُ بِهِ خَيْرًا يُصِبْ مِنْهُ

“అల్లాహ్ ఎవరికి మేలు చేయగొరుతాడో, అతనిని పరీక్షిస్తాడు”. (బుఖారి 5645).

7- ఇస్తిగ్ఫార్ (అంటే అస్తగ్‘ఫిఅల్లాహ్ అని పలకడం): అధికంగా పాపాల్ని మన్నించే కారణాలలో ఇది అతి ముఖ్యమైనది. చదవండి అల్లాహ్ ఆదేశం:

ప్రజలు క్షమాభిక్ష కొరకు ప్రార్థిస్తూ ఉన్నంత వరకు వారిని శిక్షించడం అనేది అల్లాహ్ సాంప్రదాయం కాదు[. (అన్ఫాల్ 8: 33).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారుః

طُوبَى لِمَنْ وَجَدَ فِي صَحِيفَتِهِ اسْتِغْفَاراً كَثِيرًا

“ఎవరి కర్మపత్రంలో ఎక్కువగా క్షమాభిక్షలుంటాయో వారికి శుభవార్త”. (ఇబ్ను మాజ 3818).

ప్రశ్నోత్తరాలు

1- ప్రశ్నః నేను తౌబా చేయాలనుకుంటున్నాను. కాని నా పాపాలు చాలా ఉన్నాయి. నేను గతంలో చేసిన పాపాలన్నిటినీ అల్లాహ్ మన్నిస్తాడో లేదో తెలియదు?

జవాబుః అల్లాహ్ ఇలా ఆదేశించాడుః

ఓ ప్రవక్తా! ఇలా అనుః తమ ఆత్మలపై అన్యాయం చేసుకున్న నా దాసులారా! అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా, అల్లాహ్ అన్ని పాపాలను క్షమిస్తాడు. నిశ్చయంగా ఆయనే క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత[. (జుమర్ 39: 53).

 హదీసె ఖుదుసీలో ఇలా ఉందిః

عَنْ أَنَسٍ  قَالَ: سَمِعْتُ رَسُولَ الله  يَقُولُ: قَال اللهُ تَعَالى: ((يَا ابنَ آدَمَ! إِنَّكَ مَا دَعَوْتَنِي وَرَجَوْتَنِي غَفَرْتُ لَكَ عَلَى مَا كَانَ فِيكَ وَلاَ أُبَالِي، يَا ابْنَ آدَمَ! لَوْ بَلَغَتْ ذُنُوبُكَ عَنَانَ السَّمَاءِ ثُمَّ اسْتَغْفَرْتَنِي غَفَرْتُ لَكَ وَلاَ أُبَالِي، يَا ابْنَ آدَمَ! إِنَّكَ لَوْ أَتَيْتَنِي بِقُرَابِ الْأَرْضِ خَطَايَا ثُمَّ لَقِيتَنِي لاَ تُشْرِكُ بِي شَيئًا لَأَتَيتُكَ بِقُرَابِهَا مَغْفِرَة )) رواه الترمذي

సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా తెలిపాడని ప్రవక్త సల్లల్లాహు అలై- హి వసల్లం చెప్పగా నేను విన్నాను అని అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఓ ఆదం పుత్రుడా! నీవు నన్ను అర్థిస్తూ, నాపై ఆశ ఉంచినంత కాలం నేను నిన్ను మన్నిస్తూ ఉంటాను, నీవు మాటిమాటికి (పాపం మరియు తౌబాలు) చేస్తూ ఉన్నా సరే, నేను పట్టించుకోను. ఓ ఆదం పుత్రుడా! నీ పాపాలు (అధిక సంఖ్యలో) చేరి నింగిని అందుకున్నా సరే నేను పట్టించుకోను, నువ్వు గనక నాతో క్షమాభిక్ష కోరితే నేను తప్పక క్షమిస్తాను. ఓ ఆదం పుత్రుడా! నీవు ఎవ్వరినీ నాకు భాగస్వామిగా (షిర్క్) చేయకుండా, ఇతర పాపాలు భూమి నిండా తీసుకొని నా వద్దకు వస్తే, నేను అంతే పరిమాణంలోని మన్నింపుతో  నేను నిన్ను కలుసుకుంటాను”. (తిర్మిజి 2669).

అంతేకాదు, తన దాసుల కొరకు అల్లాహ్ కారుణ్యం మరీ విశాలమైనది. ఎవరు తమ తౌబాలో సత్యవంతుడయి తేలుతాడో అల్లాహ్, గతంలో వారితో జరిగిన పాపాలన్నిటినీ పుణ్యాల్లో మారుస్తాడు. అల్లాహ్ ఆదేశం చదవండిః

ఎవడు పశ్చాత్తాపపడి, విశ్వసించి, సత్కార్యాలు చేస్తాడో, అలాంటి వారి పాపాలను అల్లాహ్ పుణ్యాల్లో మార్చుతాడు. అల్లాహ్ క్షమాశీలుడు, అపారకరుణప్రదాత[. (ఫుర్ఖాన్ 25: 70).

 అందుకు, పాపాలు ఎన్నీ ఉన్నా, ఎంతటి ఘోరమైనవైనా ఏ మాత్రం నిరాశ చెందకుండా తొందరగా తౌబా చేయుటకు ముందడుగు వేయాలి.

2- ప్రశ్నః నేను తౌబా చేయాలనుకుంటాను. కాని నా దుష్ట స్నేహితులు నన్ను తౌబా చేయనివ్వడం లేదు. ఇందుకు నా బలహీనత, నీరసం కూడా తోడ్పడుతుంది. అయితే నేను ఏమి చేయాలి?

జవాబుః తౌబా విషయంలో ఓపిక మరియు నిలకడ అవసరం ఎంతైనా ఉంటుంది. తన తౌబాలో మనిషి ఎంతవరకు సత్యత చూపుతున్నాడో తెలియడానికి ఇది ఓ పరీక్ష. అందుకు వారిని అనుసరించకుండా, జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఇలాంటి వారి విషయమే అల్లాహ్ ఎంత చక్కగా తెలిపాడో గమనించుః

కనుక నీవు సహనం వహించు, నిశ్చయంగా అల్లాహ్ వాగ్దానం సత్యమైనది. విశ్వసించనివారు నిన్ను చులకన భావంతో చూడ- కూడదు సుమా! (అంటే నీవు వారి మాటలకు ఏమాత్రం లొంగి- పోకూడదు)[. (రూమ్ 30: 60).

దుష్ట స్నేహితులు అతడ్ని తమ వైపు మలుపుకోటానికి నానారకాల ప్రయత్నాలు చేస్తారన్నది తౌబా చేసే వ్యక్తి తెలుసుకోవాలి. కాని ఎప్పుడైతే వారు అతని సత్యత మరియు ధర్మంపై బలమైన నిలకడ చూస్తారో అతడ్ని వదిలేస్తారు.

3- ప్రశ్నః నేను తౌబా చేయాలనుకుంటున్నాను. కాని నా పాత స్నేహితులు నన్ను నలుగురిలో అవమాన పరుస్తారని బెదిరిస్తున్నారు. వారి వద్ద నా పాత ఫోటోలు, కొన్ని నిధర్శనాలున్నాయి. నా ప్రఖ్యాతి మట్టిలో కలుస్తుందని నాకు భయం ఉంది. అయితే ఇలాంటి పరిస్థితిలో నేనేమి చేయాలి?

జవాబుః ముందు షైతాన్ మిత్రులతో సమరం చేయాల్సి ఉంటుంది. షైతాన్ జిత్తులు ఎంతో బలహీనమైనవని కూడా తెలుసుకోవాలి. ఒకవేళ నీవు వారికి మొగ్గు చూపావంటే వారు మరిన్ని రుజువులు నీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తారు అని కూడా తెలుసుకో. ఈ విధంగా మొదటికీ, చివరికి నీవు నష్టపోతావు. కాని నీవు అల్లాహ్ పై గట్టి నమ్మకం కలిగి ఉండు. “హస్బియల్లాహు వ నిఅమల్ వకీల్” (నాకు అల్లాహ్ యే చాలు ఆయనే శ్రేష్ఠుడైన కార్యసాధకుడు) అని చదువుతూ ఉండు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరితోనైనా భయం చెందినప్పుడు ఈ దుఆ చదివేవారు.

اللَّهُمَّ إِنَّا نَجْعَلُكَ فِي نُحُورِهِمْ، وَنَعُوذُ بِكَ مِنْ شُرُورِهِم

“అల్లాహుమ్మ ఇన్నా నజ్అలుక ఫీ నుహూరిహిమ్ వ నఊజు బిక మిన్ షురూరిహిమ్”.

(ఓ అల్లాహ్ మేము నిన్ను వారి ఎదుట అడ్డుగా చేస్తున్నాము. వారి కీడు నుండి నీ శరణు కోరుతున్నాము).

వాస్తవంగా ఇది కఠిన సందర్భం. కాని అల్లాహ్ కూడా భయభక్తులు గలవారికి తోడుగా ఉన్నాడు. ఆయన వారిని అవమాన పరచడు. భక్తులకు అల్లాహ్ సహాయంగా ఉన్న ప్రత్యక్ష సాక్ష్యంగా ఈ గాధ చదువుః

మర్సద్ బిన్ అబీ మర్సద్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల్లో ఒకరు. ఆయన, మదీనాకు వలసపోయే శక్తిలేని ముస్లిములను మక్కా నుండి మదీనా చేర్పించేవారు. మక్కాలో ఆయనకు ఇస్లాంకు ముందు పరిచయమున్న ఒక అభిసారిక ఉండేది. ఆమె పేరు ‘అనాఖ్’. ఆయన, మక్కాలో ఖైదీగా ఉన్న ఒక వ్యక్తిని మదీనా చేర్పిస్తానని మాట ఇచ్చి ఉండెను. తర్వాత సంఘటన ఆయన నోటే విందాము/ చదువుదాముః నేను మక్కా నగరానికి వచ్చి, పౌర్ణమి రాత్రిలో ఒక గోడ ఛాయలో నిల్చున్నాను. అనాఖ్ నన్ను దూరం నుండే చూసి, దగ్గరికి వచ్చి, నన్ను గుర్తు పట్టి ‘వచ్చేసెయి, ఈ రాత్రి మనం కలసి ఆనందంగా గడుపుకుందాము’ అని అంది. “అనాఖ్! అల్లాహ్ వ్యభిచారాన్ని నిషేధించాడు” అని నేను బదులిచ్చాను. ఇది విన్న వెంటనే అనాఖ్ ‘ఓ ప్రజలారా! ఈ వ్యక్తి మీ ఖైదీలను విడిపించుకు వెళ్తున్నాడు’ అని బిగ్గరగా అరిచింది. అప్పుడే ఎనిమిది మంది నా వెంట పడ్డారు. నేను పరిగెత్తి ఒక గుహలో ప్రనేశించాను. వారు గుహ వరకు వచ్చి నాపైనే, అంటే; గుహ ముఖంద్వారం వద్ద నిల్చున్నారు. కాని అల్లాహ్ వారిని అంధులుగా చేశాడు. వారు నన్ను చూడలేకపోయారు. చివరికి వారు తిరిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను మాటిచ్చిన నా స్నేహితుని వద్దకు వెళ్ళి అతడ్ని మదీనా చేర్పించాను.

ఈ విధంగా అల్లాహ్, విశ్వాసులను, తౌబా చేసేవారిని కాపాడతాడు.

ఒకవేళ నీవు భయపడే విషయమే గనక బయటపడి, నీవు నీ విషయం స్పష్టం చేయవలసిన అవసరం వచ్చినప్పుడు, నీ నిర్ణయాన్ని ఎదుటివారి ముందు స్పష్టం చేయి, నీవు చేసిన దానిని ఒప్పుకుంటూ ‘అవును, నేను అపరాధునిగా ఉంటిని, కాని అల్లాహ్ వైపునకు మరలి నేను తౌబా చేశాను’ అని నిక్కచ్చిగా చెప్పేసెయి. అసలు అవమానం, ఇది కాదు. ప్రళయదినాన అల్లాహ్ సమక్షంలో, దైవదూతల, జిన్నాతుల మరియు సర్వమానవుల ముందు కలిగే అవమానమే అసలు అవమానము.

4- ప్రశ్నః నేను ఒక తప్పు చేసిన తర్వాత తౌబా చేస్తాను. నా మనుస్సు అదుపులో ఉండలేక అదే తప్పు మళ్ళీ జరిగితే, నేను ముందు చేసిన తౌబా వ్యర్థం అయిపోయి, మొదటి తప్పుతో పాటు తర్వాత తప్పు కూడా నా పత్రంలో ఉంటుందా?

జవాబుః ఒక తప్పు చేసిన తర్వాత నీవు తౌబా చేసినచో అల్లాహ్ ఆ తప్పును మన్నిస్తాడు. తర్వాత అదే తప్పు మళ్ళీ చేసినచో, కొత్తగా తప్పు చేసినట్లు లిఖించబడుతుంది. అందుకు మళ్ళీ తౌబా చేయాల్సి ఉంటుంది. కాని మొదటి తప్పు తన కర్మ పత్రంలో ఉండదు.

5-ప్రశ్నః నేను ఒక పాపంలో మంకుతనం వహిస్తూ మరో పాపం నుండి తౌబా చేస్తే ఈ తౌబా అంగీకరించబడుతుందా?

జవాబుః ఒక పాపం చేస్తూ మరో పాపం నుండి తౌబా చేస్తే ఈ తౌబా అంగీకరించబడుతుంది. కాని రెండు పాపాలు ఒకే రకమైనవి కాకూడదు. ఉదాహరణకుః వడ్డీ తినే, తీసుకునే వ్యక్తి ఇక నుండి వడ్డీ వ్యవహారానికి దూరంగా ఉంటానని తౌబా చేస్తున్నప్పుడు, అతను మత్తు సేవించేవాడు కూడా ఉండి, దీనిని నుండి తౌబా చేయకుంటే, వడ్డీ గురించి చేసిన తౌబా నిజమగును, అది అంగీకరించబడును. కాని ఒక వ్యక్తి ఇక నుండి మత్తు సేవించనని తౌబా చేసి, మాదకద్రవ్యాలు, డ్రగ్స్ అలవాటు మానుకోకుంటే, లేదా ఒక స్త్రీతో వ్యభిచారానికి పాల్పడి తౌబా చేస్తూ, మరో స్త్రీతో వ్యభిచారానికి ఒడిగడితే ఇలాంటి తౌబా అనేది అంగీకరించబడదు.

6- ప్రశ్నః నేను గతంలో నమాజ్, ఉపవాసం, జకాత్ మొదలయిన కొన్ని విధులను పాటించలేదు. అందుకు నేనేమి చేయాలి?

జవాబుః వదిలివేసిన నమాజులు తిరిగి చేయాలని (అంటే ఖజా) ఏమీ లేదు. కాని స్వచ్ఛమైన తౌబా చేయాలి. ఇక ముందు చాలా శ్రద్ధగా నమాజులను కాపాడాలి. ఎక్కువగా క్షమాపణ కోరుతూ ఉండాలి. అలాంటప్పుడు అల్లాహ్ తప్పక మన్నించవచ్చు.

ఉపవాసాలు వదిలిన వ్యక్తి, ఉపవాసాలు ఉండలేకపోయిన రోజుల్లో ముస్లింగానే ఉంటే ప్రతి ఒక్క ఉపవాసానికి బదులుగా ఒక్కో నిరుపేదకు కడుపునిండా అన్నం పెట్టాలి. జకాత్ ఇవ్వలేకపోయిన ముస్లిం, గత ఎన్ని సంవత్సరాల జకాత్ ఇవ్వలేకపోయాడో అన్ని సంవత్సరాల జకాత్ లెక్కేసుకోని ఒకేసారి చెల్లించాలి.

7-ప్రశ్నః నేను కొంతమందికి సంబంధించిన సొమ్ము దొంగలించాను. ఆ తర్వాత తౌబా చేశాను. కాని నాకు వారి చిరునామాలు తెలియవు. అలాంటప్పుడు నేనేమీ చేయాలి?

జవాబుః పూర్తి ప్రయత్నాలు చేసి వారి చిరునామాలు కనుగొనాలి. వారి చిరునామాలు లభ్యమవుతే వారి నుండి దొంగలించిన సొమ్ము వారికి అప్పగించాలి. సొమ్ము ఎవరిదో ఆ వ్యక్తి చనిపోయినచో, ఆ సొమ్ము అతని వారసులకు ఇవ్వాలి. తగిన ప్రయత్నం చేసి వారిని వెతికినప్పటికీ వారు తెలియకుంటే వారి తరఫున, వారికి దాని పుణ్యం లభించే సంకల్పంతో దానం చేయాలి. వారు అవిశ్వాసులైనా సరే. వారికి దాని ప్రతిఫలం అల్లాహ్ ఇహములోనే ఇస్తాడు. పరలోకంలో ఇవ్వడు.

8-ప్రశ్నః నేను వ్యభిచారానికి పాల్పడ్డాను. నేను ఎలా తౌబా చేయాలి. ఆ స్త్రీ గర్భిణి అయితే ఆ సంతానం నాకే చెందుతుందా?

జవాబుః స్త్రీ యొక్క ఇష్టం, అంగీకారంతో చేసిన వ్యభిచారానికి నీపై కేవలం తౌబా విధిగా ఉండును. సంతానం అక్రమ సంబంధ ఫలితమైనందకు నీది కాదు. అతని ఖర్చులు ఇచ్చే బాధ్యత కూడా నీపై ఉండదు. ఇలాంటి సంతానం అతని తల్లితోనే ఉండును.

ఈ విషయాన్ని కప్పి ఉంచడానికి ఆ స్త్రీతో వివాహం కూడా చేయకూడదు. ఒకవేళ ఆ వ్యక్తి మరియు ఆ స్త్రీ ఇద్దరూ స్వచ్ఛంగా తౌబా చేస్తే, ఆ వ్యక్తి ఆమెతో వివాహం చేసుకోవచ్చును. కాని మొదటి అక్రమ సంబంధం వల్ల ఆమెకు గర్భం నిలిచిందా లేదా నిర్ధారణ చేసుకున్న తర్వాతే.

 ఒకవేళ అత్యాచారం, బలవంతంతో వ్యభిచారం జరిపి ఉంటే, ఆమెపై చేసిన అత్యాచారానికి బదులుగా, అతడు ఆమెకు ఆమె తోటి సోదరీమనులు తమ వివాహంలో పొందిన మహర్ కు సమానంగా ధనం ఇవ్వాలి. స్వచ్ఛమైన తౌబా చేయాలి. అతడు ఉన్న ప్రాంతంలో ఇస్లామీయ చట్టం అమలులో ఉండి, అతని వ్యవహారం చట్టం దృష్టిలోకి వస్తే ధర్మప్రకారంగా అతనిపై “హద్” (వ్యభిచార శిక్ష) విధింపబడును.

9-ప్రశ్నః ఒక మంచి వ్యక్తితో నా వివాహం జరిగింది. వివాహానికి ముందు అల్లాహ్ ఇష్టపడని కొన్ని సంఘటనలకు నేను గురయ్యాను. ఇప్పుడు నేనేమి చేయాలి?

జవాబుః స్వచ్ఛమైన తౌబా చేయి. గతంలో జరిగిన విషయాలు నీ భర్తకు తెలియజేయుట నీపై అవశ్యకత ఏమీ లేదు. అందుకు నీవు కుండ బద్దలు గొట్టి సంసారం పాడు చేసుకోకు.

10- ప్రశ్నః గుదమైధనం (సోడోమీ) లాంటి పాపానికి గురైన వ్యక్తి తౌబా చేయునప్పుడు ఏ విధులు వర్తిస్తాయి?

జవాబుః ఆ దుష్చర్యకు పాల్పడిన ఇద్దరూ స్వచ్ఛమైన తౌబా చేయాలి.

ఇలాంటి దుష్చర్యకు పాల్పడిన లూత్ అలైహిస్సలాం జాతివారిపై అల్లాహ్ ఎలాంటి విపత్తు కుర్పించాడో అతనికి తెలియదా?

  • వారి చూపులను తీసుకొని వారిని అంధులుగా చేశాడు.
  • వారిపై పేలుడు వదిలాడు.
  • వారి ఆ నగరాన్ని తల్లక్రిందులుగా చేశాడు
  • దాని మీద కాల్చిన మట్టితో చేయబడిన రాళ్ళను ఎడతెగకుండా కుర్పించాడు. ఇలా వారందరినీ నాశనము చేశాడు.

ఇలాంటి దుష్చర్యకు పాల్పడ్డవారి గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారుః

مَنْ وَجَدْتُمُوهُ يَعْمَلُ عَمَلَ قَوْمِ لُوطٍ فَاقْتُلُوا الْفَاعِلَ وَالْمَفْعُولَ بِهِ

“లూత్ అలైహిస్సలాం జాతివారు పాల్పడిన లాంటి దుష్చర్యకు పాల్పడినవారిని మీరు చూసినట్లయితే ఆ ఇద్దరినీ నరికి వేయండి”. (అబూ దావూద్ 4462, తిర్మిజి 1456, ఇబ్ను మాజ 2561).

ఇలాంటి దుష్కార్యానికి పాల్పడినవారు స్వచ్ఛమైన తౌబా చేయుట విధిగా ఉంది. అల్లాహ్ తో అధికంగా క్షమాభిక్ష కోరుట కూడా తప్పనిసరి.

పశ్చాత్తాపం (Repentance)

repentance-telugu-islam

పుస్తకం నుండికలామే హిక్మత్ – 1(వివేక వచనం)
రచన: సఫీ అహ్మద్ మదనీ
అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
ప్రకాశకులు: జమీ అతే అహ్ లె హదీస్, ఆంధ్రప్రదేశ్

[ఇక్కడ PDF డౌన్ లోడ్ చేసుకోండి]

పరలోకపు బికారి (Bankrupt in Aakhirah)

అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో

ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచించారని హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “దరిద్రుడు ఎవరో మీకు తెలుసా?” దానికి సహాబాలు, ‘ఎవరి వద్ద డబ్బు, సామగ్రి లేవో అతనే దరిద్రుడు’ అని మేము భావిస్తున్నాము’ అని అన్నారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రబోధించారు :

“నా అనుచర సమాజం (ఉమ్మత్)లో దరిద్రుడు ఎవరంటే, అతను ప్రళయదినం నాడు నమాజులు, ఉపవాసాలు, జకాత్ లతో పాటు హాజరవుతాడు. (కాని అతను) ఒకప్పుడు ఇతన్ని తిట్టాడు, అతనిపై అపనింద వేశాడు. మరొకప్పుడు ఇతని సొమ్మును కాజేశాడు, వేరొకప్పుడు అతన్ని కొట్టాడు. అందుచేత అతని సత్కర్మలు వారికి (ఆ బాధితులకు) ఇచ్చివేయబడతాయి. ఒకవేళ అతని సత్కర్మలన్నీ అయిపోయి అతనింకా వారికి బాకీపడితే, వారి అపరాధాలు తీసి ఇతని లెక్కలో వేయబడతాయి. ఆపైన అతన్ని అగ్నిలోకి నెట్టివేయడం జరుగుతుంది.” (ముస్లిం) :

“దరిద్రుడెవరు?” అనేది హదీసులో ముఖ్యాంశం. సహాబాల మనుస్సుల్లో పరలోక చింతనను పెంపొందించడానికి మహాప్రవక్త పలు రీతుల్లో విషయాన్ని ప్రస్తావించేవారు. ఇహలోకంలోని పదాలను పరలోక పరమార్థంతో మేళవించేవారు. సహచరులు కూడా అదే రీతిలో ఆలోచించాలి, యోచించాలన్నదే దీని ఉద్దేశ్యం. ‘దరిద్రుడెవరు?’ అని ప్రశ్నించే రీతిలో అడిగారు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం). సహచరుల దృష్టిని కేంద్రీకరించే ఉద్దేశ్యంతో ఇలా అడగటం జరుగుతుంది. సహాబాలు తమకు తోచినంతవరకు ఉత్తమరీతిలోనే దరిద్రునికి నిర్వచనం చెప్పారు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పరలోక దరిద్రుని స్థితిని విశ్లేషించారు. ప్రపంచపు దారిద్య్రమైతే. తాత్కాలికమైనది. ఎంతో సంక్షిప్తమైన ప్రపంచ జీవితంతోపాటే అది కూడా అంతమైపోతుంది. చాలావరకు ప్రపంచంలోనే మనిషి లేమి తరువాత కలిమి కూడా పొందుతాడు. నిజమైన దరిద్రుడు, ప్రళయదినాన చేసుకున్న సత్కర్మలన్నీ కోల్పోయేవాడే. అప్పుడతని వద్ద సత్కర్మల నిధి ఉండదు. అతనికి రుణం కూడా ఎవరూ ఇవ్వరు. ఇంకా అతను, ఇతరుల వద్ద నుండి సత్కర్మల్ని ముట్టెత్తుకుని తన అవసరాన్ని నెరవేర్చుకోనూలేడు.

లోకంలో కొంతమంది పరిస్థితి ఏమంటే వారు ఒకవైపు నుండి సత్కార్యాలు చేస్తూ పోతుంటారు. కాని మరోవంక వారి దుష్కర్మల చిట్టా కూడా పెరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా తోటి మనుషులకు చేసే అన్యాయానికి సంబంధించిన అపరాధాల చిట్టా. తీర్పు దినంనాడు మనిషి, ఇతరుల నుండి తాను పొందవలసిన హక్కును అంత తేలిగ్గా వదలుకోడు. తప్పకుండా బదులును అపేక్షిస్తాడు. ఈ హదీసు ద్వారా బోధపడే ముఖ్యాంశం ఏమంటే మనిషి కొన్ని మంచి పనులు చేసుకున్నంత మాత్రాన సరిపోదు – అతను చెడుపనులు, అపరాధాలకు దూరంగా ఉండటం కూడా ఎంతో అవసరమే. ఒక వంక సత్కార్యాలు చేస్తూనే మరోవంక చెడు పనులు చేసే వ్యక్తి దృష్టాంతం ఎటువంటిదంటే, ఒక రోగి ఉన్నాడు – అతను, వ్యాధి నయం కావటానికి మందులూ వాడుతున్నాడు. ఇంకోవైపు పత్యం చేయకుండా ఏదిబడితే అది తినేస్తున్నాడు. దాని పర్యవసానం నష్టం తప్ప మరేం కాగలదు? ఏవో కొన్ని దానధర్మాలు చేసి నిశ్చింతగా ఉండిపోయి, ఇక తమకేమీ ఫరవాలేదనుకుని ఏ చెడుపనికయినా వడిగట్టే వారికి ప్రళయదినాన పట్టే దుర్గతిపై అందరూ ఆలోచించాలి.

ఈ హదీసును ఉల్లేఖించిన వారు హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు), వీరు ప్రవక్త సహచరులలో ఎక్కువ హదీసుల్ని ఉల్లేఖించినవారు. హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) యమన్లోని దోప్ తెగకు చెందినవారు. హిజ్రీ శకం 6వ ఏట వీరు మదీనాకు వచ్చి ఇస్లాం స్వీకరించారు. అప్పటి నుండి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జీవించినంతకాలం ఆయనకు తోడుండేవారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పలుకులన్నింటినీ ఆయన శ్రద్ధగా వినేవారు, ప్రవక్త ఆచరణను హృదయంలో పదిలపరచుకునేవారు. ఆయన ఇలా అన్నారు : “అన్సార్లు తమ తోటల్లో, ముహాజిర్లు వ్యాపార వ్యవహారాలలో నిమగ్నులై ఉండేవారు. నా చేయి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చేతిలో ఉండేది.”

ఒకసారి హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో, “ఓ దైవప్రవక్తా! నేను మీ పలుకులెన్నింటినో వింటున్నాను. (వాటిని) మరచిపోతానేమోనన్న భయం నాకుంది” అని విన్నవించుకున్నారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) సెలవిచ్చారు – “మీ దుప్పటిని పరచండి”. హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) దుప్పటి పరిచారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన చేతితో ఇన్ని నీళ్ళు దానిపై చల్లి, ఆ దుప్పటిని తుడుచుకొమ్మని చెప్పారు. తాను దుప్పటి తుడుచుకున్న తరువాత ఇక ఎన్నడూ మరుపు అనేదే రాలేదని హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) అన్నారు.. వీరు గౌరవప్రదులయిన సహాబాలలోని వారు. 69 ఏళ్ళ వయస్సులో (హిజ్రీ 57లో) మదీనాలో తనువు చాలించారు.

పరలోకపు బికారి (Bankrupt in Aakhirah)
పుస్తకం నుండి :కలామే హిక్మత్ – 1 (వివేక వచనం)
రచన:సఫీ అహ్మద్ మదనీ
అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
ప్రకాశకులు:జమీ అతే అహ్ లె హదీస్,ఆంధ్రప్రదేశ్

[ఇక్కడ చదవండి / డౌన్ లోడ్ చేసుకోండి]

English Version of this Hadith:

Abu Hurayra (May Allah be pleased with him) narrated that the Messenger of Allah (Peace Be Upon Him) once asked his companions: “Do you know who is the bankrupt one?”

The companions replied: “A bankrupt person amongst us is the one who neither has a dirham nor any possessions.”

The Prophet (Peace Be Upon Him) said: “Rather, the bankrupt person from my Ummah is the one who will come on the Day of Resurrection with a good record of Salah (Prayers), Sawm (Fasts) and Zakah (Obligatory Charity); but he would have offended a person, slandered another, unlawfully consumed the wealth of another person, murdered someone and hit someone. Each one of these people would be given some of the wrong-doer’s good deeds. If his good deeds fall short of settling the account, then their sins will be taken from their account and entered into the wrong-doer’s account and he would be thrown in the Hell Fire. {Sahih Muslim, Book 32, Hadith Number 6251}

అన్నిఫాఖ్ – కపటత్వం [ముహ్సిన్ ఖాన్ & అల్ హిలాలీ]

hypocrisy-nifaqరచయిత : ముహమ్మద్ ముహ్సిన్ ఖాన్ & ముహమ్మద్ తకిఉద్దీన్ అల్ హిలాలీ
అనువాదకులు : ముహమ్మద్ కరీముల్లాహ్
పునర్విచారకులు : షేఖ్ నజీర్ అహ్మద్
క్లుప్త వివరణ: అన్నిఫాఖ్ అంటే కపటత్వం యొక్క నిర్వచనం మరియు దాని యొక్క భాగాల గురించి ఈ వ్యాసంలో క్లుప్తంగా చర్చించబడినది.

అన్నిఫాఖ్الــنــفـــاق

కాపట్యం మరియు దాని యొక్క వేర్వేరు పద్ధతులు.

కాపట్యం రెండు రకాలు, అవి:

  1. విశ్వాసం (నమ్మకం) లో కాపట్యం
  2. ఆచరణలలో మరియు కార్యములలో (పనులలో) కాపట్యం.

(1) విశ్వాసం (నమ్మకం)లో కాపట్యం: దీనిలో ఆరు రకాలున్నాయి.

  1. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను తిరస్కరించటం
  2. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకు వచ్చిన (ఆయన పై అవతరించిన లేక ఆయన బోధించిన) వాటిలో కొన్నింటిని తిరస్కరించటం (ఉదాహరణ – ఖుర్ఆన్, సున్నహ్, ఇస్లామీయ ధర్మశాస్త్ర నియమ నిబంధనలు)
  3. ప్రవక్త  సల్లల్లాహు అలైహి వసల్లం ను ద్వేషించుట, అసహ్యించుట.
  4. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకు వచ్చిన వాటిలో కొన్నింటిని ద్వేషించటం లేక అసహ్యించుకోవటం (ఉదాహరణ – ఏకదైవత్వం లేక ఏక దైవారాధన మొదలైనవి)
  5. అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన ఇస్లాం ధర్మానికి ఏదైనా తాత్కాలిక పరాభవం గాని లేదా అపకీర్తి గాని కలిగినప్పుడు సంతోషపడటం.
  6. అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన ఇస్లాం ధర్మానికి విజయం కలిగినట్లయితే విచారపడటం. (ఇస్లాంధర్మపు సాఫల్యాన్ని చూసి అసంతృప్తి చెందటం)

ఎవరిలోనైతే పైన పేర్కొన్న ఆరు కపటపు గుణాలు ఉంటాయో, వారు నరకాగ్నిలోని అట్టడుగు పొరలలోనికి చేర్చబడతారు. (కపటులు నరకం లోని అట్టడుగు పొరలలోనికి పంపబడతారుఖుర్ఆన్ 4:145)

(2) ఆచరణలలో మరియు కార్యములలో (పనులలో) కాపట్యం.

అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వేర్వేరు ప్రకటనల ఆధారంగా, దీనిలో ఐదు పద్ధతులు ఉన్నాయి. కపటుల చిహ్నాలు –

  1. అతడు మాట్లాడినప్పుడు, అబద్ధం చెబుతాడు.
  2. అతడు వాగ్దానం చేసినప్పుడు, దానిని పూర్తిచేయడు.
  3. ఒకవేళ అతడిని నమ్మినట్లయితే (అతడిపై భరోసా చేసినట్లయితే), అతడు వంచకుడిగా, మోసగాడిగా తేలుతాడు. (మీరు దేనినైనా అతడి దగ్గర ఉంచినట్లయితే, దానిని తిరిగి వాపసు ఇవ్వడు).
  4. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఇంకో హదీథ్ లో- ఘర్షణ పడినప్పుడల్లా (పోట్లాటకు దిగినప్పుడు) అతడు తెలివి లేని వాడిగా, అవివేకిగా, దుష్టుడిగా, చెడ్డవాడిగా, ఇతరులకు అవమానం, పరాభవం కలిగించే విధంగా ప్రవర్తిస్తాడు.
  5. అతడు ఒప్పందం చేసినట్లయితే, స్వయంగా అతడు తనకు తానే విశ్వాసఘాతకుడిగా నిరూపించుకుంటాడు.

English Source: Appendix  from the book: “Interpretation of the Meaning of The Noble Quraan” By Dr. Muhammad Taqiuddeen al-Hilaalee, Ph.D. and Dr. Muhammad Muhsin Khan .

కపటుడి చిహ్నాలు (Signs of Hypocrite)

al-munafiqun-telugu-islamహదీథ్׃ 12

علامـــــــــة المـنـــــــــافــــق కపటుడి చిహ్నాలు

حَدَّثَنَا سُلَيْمَانُ أَبو الرَّبِيعَ قال: حَدَّثَنَا إِسْمَاعِيلُ بْنُ جَعْفَرٍ قَالَ:حَدَّثَنَا نَافِعُ بْنُ مَالِكِ بْنُ أَبِي عَامِرٍ أَبو سُهَيْلٍ عَنْ أَبِيهِ عَنْ أَبِي هُرَيرَة

” عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:آيَةُ المُنَافِقِ ثَلاَثٌ إِذَا حَدَّثَ كَذَبَ، وَإِذَا وَعَدَ أَخْلَفَ، وَإِذَا اُؤْتُمِنَ خَانَ “  رواة صحيح البخاري

హద్దథనా సులైమాను అబు అర్రబీఅ ఖాల హద్దథనా ఇస్మాయీలుబ్ను జాఁఫరిన్ ఖాల హద్దథనా నాఫిఉబ్ను మాలికిబ్ను అబి ఆమిరిన్ అబు సుహైలిన్ అన్ అబీహి అన్ అబీహురైరత అనిన్నబియ్యి సల్లల్లాహు అలైహి వ సల్లమ ఖాల   ఆయతుల్ మునాఫిఖి థలాథున్, ఇదా హద్దథ కదబ, ఇదా వఆఁద అఖ్లఫ, ఇదా ఉఁతుమిన ఖాన రవాహ్ సహీ బుఖారి..

అస్సనద్ (ఉల్లేఖకుల పరంపర) సహీ బుఖారి హదీథ్ గ్రంధంకర్త   ← సులైమాను అబు అర్రబీఅ ← ఇస్మాయీలుబ్ను జాఁఫరిన్ ← నాఫిఉబ్ను మాలికిబ్ను అబి ఆమిరిన్ అబు సుహైలిన్  అబీహి (మాలికిబ్ను అబి ఆమిరిన్ అబు సుహైలిన్) ← అబీహురైరత (రదియల్లాహుఅన్హు) ప్రవక్త సల్లల్లాహుఅలైహి వసల్లం హితోపదేశం.

అల్ మతన్ (బోధించిన అసలు విషయం) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు కపటుడి చిహ్నాలు మూడు, 1) ఎప్పుడు మాట్లాడినాఅబధ్ధం పలుకుతాడు. 2) మరియు ఎప్పుడు వాగ్దానం చేసినాదానిని పూర్తి చేయడు. 3) మరియు వస్తువునైతే అతని దగ్గర నమ్మకంగా ఉంచుతారోదానిని అతడు నిజాయితిగా తిరిగి ఇవ్వడు. సహీ బుఖారి హదీథ్ గ్రంధం.

హదీథ్ వివరణ

కపటత్వానికి చేర్చే వివిధ విషయాల గురించి ఇస్లాం ధర్మం తీవ్రంగా హెచ్చరిస్తున్నది. చూడటానికి చిన్న చిన్నవిగా కనబడినా అవి కపటత్వం దగ్గరికి చేర్చుతాయి. ఇక్కడ థఅతబ బిన్ హాతిబ్ అల్ అన్సారీ యొక్క వృత్తాంతాన్ని ఒక మంచి ఉదాహరణగా వివరించటం జరిగినది. దివ్యఖుర్ఆన్ లోని సూరతు అత్తౌబా అధ్యాయంలో 77వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు –

فَأَعْقَبَهُمْ نِفَاقًا فِي قُلُوبِهِمْ إِلَى يَوْمِ يَلْقَوْنَهُ بِمَا أَخْلَفُوا اللهَ مَا وَعَدُوهُ وَبِمَا كَانُوا يَكْذِبُونَ(77)

అనువాదం – “వారు అల్లాహ్ యెడల చేసిన ఈ ప్రమాణభంగం కారణంగా, వారు చెబుతూ వచ్చిన అబద్ధాల కారణంగా, అల్లాహ్ వారి హృదయాలలో కాపట్యాన్ని నాటాడు. అది ఆయన సమక్షంలో హాజరయ్యే వరకు వారిని వెంటాడటం మానదు.”

ఉల్లేఖకుని పరిచయం: అబు హురైరా రదియల్లాహు అన్హు పూర్తి పేరు అబ్దుర్రహ్మాన్ బిన్ సఖర్ అద్దౌసీ. ఆయన 7వ హిజ్రీ సంవత్సరంలో ఖైబర్ విజయం సందర్భంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచర్యంలోనికి చేరినారు. ఎక్కువ హదీథ్ లను జ్ఞాపకం ఉంచిన వారిలో సహచరులలో (సహాబాలలో) ఒకరు.

ఈ హదీథ్ యొక్క ప్రయోజనాలు (లాభాలు):

  1. అబద్ధం చెప్పటం, ఇచ్చిన మాటను నిలబెట్టుకోక పోవటం, నిజాయితీని పాటించక పోవటం వంటి చెడు అలవాట్లతో, చెడు లక్షణాలతో ఎల్లప్పుడూ యుద్ధం చేస్తుండమని ఇస్లాం ధర్మం నిర్దేశిస్తున్నది.
  2. కపటత్వం నుండి మనం కాపాడుకోవటానికి ప్రయత్నించ వలెను. ఎందుకంటే అల్లాహ్ దగ్గర ఇది షిర్క్ అంటే ఏకదైవత్వ భాగస్వామ్యం లేదా బహుదైవారాధన కంటే ఘోరమైన పాపం.
  3. కపటత్వపు చిహ్నాల నుండి దైనినైనా సరే ఎట్టి పరిస్థితిలోను అలవర్చుకోకూడదు.
  4. ఎవరైతే కపటత్వపు లక్షణాలను అలవర్చుకున్నారో వారు, అల్లాహ్ దృష్టిలో  మరియు ఇతరుల దృష్టిలో చాలా హీనంగా దిగజారిపోతారు.
  5. మాట్లాడేటప్పుడు సత్యం పలకటం, ఇచ్చిన మాటను తప్పక పోవటం, నిజాయితీ తన దగ్గర ఉంచిన వస్తువులను వాటి యజమానికి సరిగ్గా తిరిగి ఇవ్వటం వంటి మంచి అలవాట్లు దైవవిశ్వాసుల చిహ్నాలలో కనబడతాయి.

Source : హదీథ్ – రెండవ స్థాయి  [తెలుగు]
(రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  ముహమ్మద్ కరీముల్లాహ్

అనవసరపు విషయాల జోలికి పోకూడదు (Leaving off unnecessary matters)

హదీథ్׃ 10

అనవసరపు విషయాల జోలికి పోకూడదు ترك المسلم ما لا يعنيه

حَدَّثَنَا أَحمَدُ بْنُ نَصْرٍ النَّيْسَابُورِيُّ وَغَيرُ وَاحِدٍ قَالوا حَدَّثَنَا أَبو مُسْهِرٍ عَنْ إسماعِيلَ بنِ عَبْدِ اللهِ بْنِ سَمَاعَةَ ، عَنْ الأوْزَاعيِّ ، عَنْ قُرَّةَ ، عَنْ الزُّهْرِيِّ عَنْ أَبي سَلَمَةَ عَنْ أَبي هُرَيْرَةَ قال.  قَالَ رَسُولُ اللَّه ”مِنْ حُسْنِ إِسْلاَمِ المَرْءِ تَرْكُهُ مَا لاَ يَعْنِيهِ “ رواه الترمذي

హద్దథనా అహ్మదుబ్ను నశ్రిన్ అన్నైసాబూరియ్యు వ గైరు వాహిదిన్ ఖాలూ, హద్దథనా అబుముస్హిరిన్ అన్ ఇస్మాయీలబ్ని అబ్దిల్లాహిబ్ని సమాఅత,  అన్ అల్ అవ్జాయ్యి,  అన్ ఖుర్రత , అన్ అజ్జుహ్రియ్యి , అన్ అబి సలమత అన్ అబి హురైరత ఖాల, ఖాల రసూలుల్లాహి మిన్ హుస్ని ఇస్లామి అల్ మర్ఇ తర్కుహు మా లా యనీహి” రవాహ్ అత్తిర్మిది .

అస్సనద్ (ఉల్లేఖకుల పరంపర) అత్తిర్మిది హదీథ్ గ్రంధకర్త   ← అహ్మదుబ్ను నశ్రిన్ అన్నైసాబూరియ్యు  & గైరువాహిదిన్  ← అబుముస్హిరిన్  ← ఇస్మాయీలబ్ని అబ్దిల్లాహిబ్ని సమాఅత ← అల్ అవ్జాయ్యి  ← అన్ ఖుర్రత ← అన్ అజ్జుహ్రియ్యి ← అబి సలమత ← అబి హురైరత (రదియల్లాహుఅన్హు) ← ప్రవక్త సల్లల్లాహుఅలైహి వసల్లం హితోపదేశం.

అల్ మతన్ (బోధించిన అసలు విషయం) అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు ఇస్లాం లోని ఉన్నతమైన లక్షణాలలో ఒక లక్షణం ఏమిటంటే, మానవుడు అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండటం అత్తిర్మిది హదీథ్ గ్రంధం.

అబుహురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీథ్ ప్రకారం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) ఒకసారి ఇలా బోధించారు –  “మిన్ హుస్నల్ ఇస్లాం, అల్ మరఅఁ తరకహ్ మా లా యఅఁనీహి” అంటే “అనవసర విషయాల జోలికి పోకుండా ఉండటం కూడా ‘మంచి ముస్లిం’ కావటానికి ఒక నిదర్శనం”  అత్ తిర్మిథి హదీథ్ గ్రంథం

హదీథ్ వివరణ

సందేశం మరియు ఆచరణ పరంగా ఇది ఒక ముఖ్యమైన హదీథ్. తనకు సంబంధించిన విషయాల గురించి తప్ప, ఒక ముస్లిం ప్రతిదాని గురించి మాట్లాడకూడదు. ఇతరుల వ్యక్తిగత విషయాలలో తలదూర్చకూడదని, వాటి జోలికి పోకూడదని కూడా ఈ హదీథ్ బోధిస్తున్నది. కేవలం ధనం సంపాదించటానికి మరియు ఉన్నత స్థానాలకు చేరటానికి మాత్రమే మన జీవితం వెచ్చించకూడదు.  ముస్లింలు పొగడ్తలను ఆశ్రయించకూడదు, ధర్మపరం గాను మరియు ప్రాపంచిక జీవితంలోను ఇది ఎంత మాత్రమూ ప్రయోజనకరం కాదు.

ఉల్లేఖకుని పరిచయం: అబు హురైరా రదియల్లాహు అన్హు పూర్తి పేరు అబ్దుర్రహ్మాన్ బిన్ సఖర్ అద్దౌసీ. ఆయన 7వ హిజ్రీ సంవత్సరంలో ఖైబర్ విజయం సందర్భంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచర్యంలోనికి చేరినారు. ఎక్కువ హదీథ్ లను జ్ఞాపకం ఉంచిన వారిలో సహచరులలో (సహాబాలలో) ఒకరు.

ఈ హదీథ్ యొక్క ప్రయోజనాలు (లాభాలు):

  1. తమకు సంబంధించని అనవసర విషయాలను వదిలి వేయమని ఇస్లాం ప్రోత్సహిస్తున్నది.
  2. మస్లింలు తమకు సంబంధించని విషయాలను – అవి మాటలు అయినా లేక చేతలు (పనులు) అయినా సరే
  3. వదిలివేయటం ఇస్లాం లోని అత్యుత్తమ నడవడికలో ఒక ముఖ్యమైన భాగం. అడగకపోయినా, స్వయంగా కల్పించుకుని సమాధానం చెప్పేటందుకు మీరు ప్రయత్నించవద్దు.
  4. మంచి వైపుకు దారి చూపటం పై ముస్లింలు ధ్యానం ఉంచవలెను.

ప్రశ్నలు

  1. ‘తమకు సంబంధించని అనవసర విషయాలు’ అంటే ఏమిటో వివరంగా వ్రాయండి.
  2. ఈ హదీథ్ ను ఆచరించటం వలన కలిగే లాభాలను వివరించండి.
  3. ఈ హదీథ్ ద్వారా సమాజానికి కలిగే ఉపయోగం గురించి తెలుపండి.

Source : హదీథ్ – రెండవ స్థాయి  [తెలుగు]
(రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  ముహమ్మద్ కరీముల్లాహ్

ఇరుగు పొరుగు (పొరుగింటి) వారి హక్కులు (Rights of neighbours)

హదీథ్׃ 09

ఇరుగు పొరుగు (పొరుగింటి) వారి హక్కులు حق الجار على الجار

حَدَّثَنَا أَبُو بَكْرِ بْنُ أَبِي شَيْبَةَ: حَدَّثَنَا أَبُو الأَحْوَصِ عَنْ أَبِي حَصِينٍ عَنْ أَبِي صَالِحٍ عَنْ أَبِي هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُولُ اللّهِ:  ” مَنْ كَانَ يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الآخِرِ فَلاَ يُؤْذِ جَارَهُ. وَمَنْ كَانَ يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الآخِرِ فَلْيُكْرِمْ ضَيْفَهُ.  وَمَنْ كَانَ يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الآخِرِ فَلْيَقُلْ خَيْراً أَوْ لِيَسْكُتْ “ رواة صحيح مسلم

హద్దథనా అబుబక్రిబ్ను అబి షైబత, హద్దథనా అబు అల్అహ్వశి అన్ అబిహశీనిన్ అన్ అబిశాలిహిన్ అన్ అబిహురైరత ఖాల, ఖాల రసూలిల్లాహి మన్ కాన యుమిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి ఫలా యూది జారహు, వమన్ కాన యుఁమిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి ఫల్ యుక్రిమ్ దైఫహు, వమన్ కాన యుఁమిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి ఫల్ యఖుల్ ఖైరన్ అవ్ లియస్కుత్ రవాహ్ సహీ ముస్లిం.

అస్సనద్ (ఉల్లేఖకుల పరంపర) సహీ ముస్లిం హదీథ్ గ్రంధంకర్త   ← అబుబక్రిబ్ను అబిషైబత ← అబు అల్అహ్వశి ← అబిహశీనిన్ ← అబిశాలిహిన్ ← అబిహురైరత (రదియల్లాహుఅన్హు) ← ప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం హితోపదేశం.

అల్ మతన్ (బోధించిన అసలు విషయం) అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహుఅలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు. ఎవరైతే అల్లాహ్ పై మరియు ప్రళయదినం పై విశ్వాసము ఉంచుతారో వారు తమ యొక్క పొరుగు వారికి కష్టము కలిగించ కూడదు. మరియు ఎవరైతే అల్లాహ్ పై మరియు ప్రళయదినం పై విశ్వాసము ఉంచుతారో వారు తమ ఇంటికి వచ్చిన అతిధులకు మంచి ఆతిధ్యముతో గౌరవిచవలెను. ఎవరైతే అల్లాహ్ మీద మరియు ప్రళయదినం పై విశ్వాసము ఉంచుతారో వారు వీలైతే మంచి మాటలు చెప్పవలెను లేకుంటే మౌనము వహించవలెను. సహీ ముస్లిం హదీథ్ గ్రంధం.

హదీథ్ వివరణ

ఇరుగు పొరుగు వారి హక్కులను కాపాడటం కూడా దైవ విశ్వాసం లోని ఒక ముఖ్యమైన భాగమని మరియు వారికి హాని కలిగించటం కూడా ఒక ఘోరమైన మహాపాపమని  ఈ హదీథ్ ప్రకటిస్తున్నది. ఇతర పొరుగింటి వారి కంటే సత్యసంధులైన, ధర్మాత్ములైన పొరుగింటి వారి గురించి ప్రత్యేక శ్రద్ధ చూపవలెను. ఇంకా ముస్లిం పొరుగింటి వారినందరికీ మంచి చేయవలెను, దయతో మంచి సలహాలివ్వవలెను, వారు సరైన మార్గాన్ని అనుసరించేటట్లుగా ప్రార్థించ వలెను, మరియు వారికి హాని కలిగించకూడదు.

ఉల్లేఖకుని పరిచయం: అబు హురైరా రదియల్లాహు అన్హు పూర్తి పేరు అబ్దుర్రహ్మాన్ బిన్ సఖర్ అద్దౌసీ. ఆయన 7వ హిజ్రీలో ఖైబర్ విజయం సందర్భంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచర్యంలోనికి చేరినారు. ఎక్కువ హదీథ్ లను జ్ఞాపకం చేసినవారిలో సహచరులలో (సహాబాలలో) ఒకరు.

ఈ హదీథ్ యొక్క ప్రయోజనాలు (లాభాలు):

  1. పరస్పరం ప్రేమ మరియు సహాయసహకారాలు పెంపొందుకునే దిశగా ప్రజలను ఇస్లాం ప్రోత్సహిస్తుంది.
  2. ఇరుగు పొరుగు వారి మధ్య సహాయసహకారాలు వారి మధ్య బంధుత్వాన్ని పటిష్టపరుస్తాయి.
  3. పొరుగింటి పిల్లలను మాటలతో లేదా చేతలతో (పనులతో) నొప్పించకుండా ఉండటం ద్వారా వారిపై దయ చూపినట్లవుతుంది.
  4. ఇంటి కప్పు పై నుండి లేదా తలుపు రంధ్రాల నుండి పొరుగింటిలోనికి తొంగిచూడటం నిషేధించబడినది.
  5. పొరుగువారికి ఎలాంటి అపకారం, కీడు, హాని కలిగించటం నిషేధించబడినది.
  6. అతిథులను మర్యాదపూర్వకంగా సత్కరించడం ప్రతి ఒక్కరి బాధ్యత.
  7. అనవసరపు సంభాషణలు సంపూర్ణమైన దైవవిశ్వాసం (ఈమాన్) నుండి దూరం చేస్తాయి.

ప్రశ్నలు

  1. తప్పక చేయమని దైవప్రవక్త ఆదేశించిన మూడుపనులు వ్రాయండి.
  2. పొరుగువారి హక్కులు ఏవి?
  3. పొరుగువారి పిల్లలతో ఎలా మెలగాలి?
  4. దేని వలన దైవ విశ్వాసానికి (ఈమాన్) దూరమవుతారు.
  5. పొరుగువారితో ఎలా ప్రవర్తించ వలెను?

Source : హదీథ్ – రెండవ స్థాయి  [తెలుగు]
(రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  ముహమ్మద్ కరీముల్లాహ్

అపనిందలు వేయటం (Gheebah & Slander)

హదీథ్׃ 08

تحريم الغيبة అపనిందలు వేయటం

حَدَّثَنَا يَحْيَىٰ بْنُ أَيُّوبَ وَ شِيْبَةَ وَ ابْنُ حُجْرٍ قَالُوا: حَدَّثَنَا إِسْمَاعِيلُ عَنِ الْعَلاَءِ عَنْ أَبِيهِ، عَنْ أَبِي هُرَيْرَةَ

أَنَّ رَسُولَ اللَّهِ قَالَ  ” أَتَدْرُونَ مَا الْغِيبَةُ؟ قَالُوا” اللَّهُ وَرَسُولُهُ أَعْلَمُ“ قَالَ”ذِكْرُكَ أَخَاكَ بِمَا يَكْرَهُ“ قِيلَ  ”أَفَرَأَيْتَ إِنْ كَانَ فِي أَخِي مَا أَقُولُ؟   “قَالَ ” إِن كَانَ فِيهِ مَا تَقُولُ، فَقَدِاغْتَبْتَهُ. وَإِنْ لَمْ يَكُنْ فِيهِ، فَقَدْ بَهَتَّهُ “   رواة صحيح مسلم

హద్దథనా యహ్యా ఇబ్ను అయ్యూబ వ షీబత వ ఇబ్ను హుజ్రిన్ ఖాలూ, హద్దథనా ఇస్మాయీలు అనిల్ అలాయి అన్ అబిహి,  అన్ అబి హురైరత అన్న రసూలల్లాహి ఖాల, అతద్రూన మా అల్ గీబతు ?” ఖాలూ, అల్లాహు వ రసూలుహు ఆలము. ఖాల, దిక్రుక అఖాక బిమా యక్రహు. ఖీల, అఫరాయ్త ఇన్ కాన ఫీ అఖి మా అఖూలు ?” ఖాల, ఇన్ కాన ఫీహి మా తఖూలు, ఫఖదిగ్ తబ్తహు. వ ఇన్ లమ్ యకున్ ఫీహి, ఫఖద్ బహత్తహు. రవాహ్ సహీ ముస్లిం .

దైవవిశ్వాసపు తియ్యటి మాధుర్యం (Sweetness of Iman)

tree-iman-telugu-islamహదీథ్ ׃ 13

حلاوة الإيمان దైవవిశ్వాసపు తియ్యటి మాధుర్యం

حَدَّثَنا مُحَمَّدُ بْنُ المُثَنَّى قَالَ: حَدَّثَنَا عَبْدُ الْوَهَّابِ الثَّقَفِيُّ قَالَ: حَدَّثَنَا أَيُّوبُ عَنْ أَبي قِلابَةَ عَنْ أَنْسٍ عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: ”ثَلاثٌ مَنْ كُنَّ فِيهِ وَجَدَ حَلاوَةَ الإِيمَانِ أَنْ يَكونَ اللَّهُ وَرَسُولُهُ أَحَبَّ إلَيْهِ مِمَّا سِواهُمَا، وَأَنْ يُحِبَّ المَرْءَ لاَ يُحِبُّهُ إلاَّ للَّهِ ، وَأَنْ يَكْرَهَ أَنْ يَعُودَ فِي الْكُفْرِ كَمَا يَكْرَهُ أَنْ يُقْذَفَ فِي النَّارِ “ رواة صحيح البخاري

హద్దథనా ముహమ్మదుబ్ను అల్ ముథన్నా ఖాల, హద్దథనా అబ్దుల్ వహ్హాబి అథ్థఖఫియ్యు ఖాల హద్దథనా అయ్యూబు అన్ అబి ఖిలాబత అన్ అన్సిన్ అనిన్నబియ్యి సల్లల్లాహు అలైహి వ సల్లమ ఖాల థలాథున్ మన్ కున్న ఫీహి వజద హలావత అల్ఈమాని అన్ యకూనల్లాహు వ రసూలుహు అహబ్బ ఇలైహి మిమ్మా సివాహుమా, వ అన్ యుహిబ్బ అల్మర్ఆ లా యుబ్బుహు ఇల్లల్లాహి, వ అన్ యక్రహ అన్ యఊద ఫిల్కుఫ్రి కమా యక్రహు అన్ యుఖ్దఫ ఫిన్నారి రవాహ్ సహీ బుఖారి.

అస్సనద్ (ఉల్లేఖకుల పరంపర) సహీ బుఖారి హదీథ్ గ్రంధంకర్త   ← ముహమ్మదుబ్ను అల్ ముథన్నా ← అబ్దుల్ వహ్హాబి అథ్థఖఫియ్యు ← హద్దథనా అయ్యూబు ←  అబి ఖిలాబత ← అన్సిన్ (రదియల్లాహుఅన్హు) ప్రవక్త సల్లల్లాహుఅలైహి వసల్లం హితోపదేశం.

అల్ మతన్ (బోధించిన అసలు విషయం) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు మూడు (గుణములు) ఎవరి దగ్గరైతే ఉంటాయో వారు విశ్వాసం యొక్క తియ్యటి మాధుర్యాన్ని రుచి చూస్తారు – 1)వారు కేవలం అల్లాహ్ ను మరియు దైవప్రవక్తను మాత్రమే అన్నింటి కంటే ఎక్కువగా ఇష్టపడతారు. 2)మరియు ఎదుటి మనిషిని కేవలం అల్లాహ్ యొక్క ప్రసన్నత కొరకే ప్రేమిస్తారు. 3)మరియు నరకాగ్ని భయంతో తిరిగి మళ్ళీ అవిశ్వాసిగా మారటాన్ని ఇష్టపడరు. సహీ బుఖారి హదీథ్ గ్రంధం

హదీథ్ వివరణ

విశ్వాసి యొక్క దైవవిశ్వాసపు కోరికను ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) తీపిదనపు మాధుర్యం కోసం తపించే ఆకాంక్షతో పోల్చినారు. ఒక వ్యాధిగ్రస్థుడి మరియు ఒక ఆరోగ్యవంతుడి మధ్య ఉండే తేడాని ఈ హదీథ్ జ్ఞాపకానికి తీసుకు వస్తున్నది. వ్యాధిగ్రస్థుడికి తేనె కూడా చేదుగా అనిపిస్తుంది, కాని అదే తేనెలోని తియ్యదనాన్ని ఆరోగ్యవంతుడు మాధుర్యంతో రుచిచూస్తాడు. ఎప్పుడైతే ఆరోగ్యం క్షీణిస్తుంటుందో, రుచి చూసే శక్తి కూడా క్షీణిస్తుంది. ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) మాధుర్యం (తియ్యదనం) అనే పదాన్ని వినియోగించారు ఎందుకంటే దైవవిశ్వాసాన్ని ఒక చెట్టుతో అల్లాహ్ పోల్చినాడు. దివ్యఖుర్ఆన్ లోని సూరహ్ ఇబ్రహీం 14:24 లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు:“అల్లాహ్ ఉపమానాలను ఎలా ముందు ఉంచుతున్నాడో మీరు చూడటం లేదా? ఒక మంచి మాట ఒక మంచి చెట్టు వంటిది, దేని వ్రేళ్ళు అయితే బాగా పాతుకుపోయి ఉంటాయో మరియు దేని కొమ్మలు అయితే ఆకాశానికి చేరి పోతాయో ఇక్కడ మంచి పదం అంటే చిత్తశుద్ధితో కూడిన హృదయపూర్వకమైన దైవవిశ్వాసం. అదే ఏకదైవత్వపు (తౌహీద్) ప్రకటన. ఇక్కడ చెట్టు అనే పదం దైవవిశ్వాసానికి మూలబిందువు వంటిది, దాని కొమ్మలు అల్లాహ్ యొక్క ఆదేశాలను పాటించటం మరియు ఏవైతే అల్లాహ్ నిషేధించాడో వాటి నుండి దూరంగా ఉండటం వంటిది, మరియు దాని ఆకులు దైవవిశ్వాసి జాగ్రత్త వహించే ప్రతి మంచి విషయం వంటిది, మరియు దాని ప్రతిఫలమే అల్లాహ్ కు విధేయత చూపటం. ఇంకా దాని పర్యవసానంలోని మాధుర్యమే దాని ఫలాలు మరియు ఆ ఫలాలలోని తియ్యదనం.

ఉల్లేఖకుని పరిచయం: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క సేవకుడిగా అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు తన సేవలందించారు. అనేక హదీథ్ లను ఉల్లేఖించారు. 92వ హిజ్రీ సంవత్సరంలో చనిపోయారు.

ఈ హదీథ్ యొక్క ప్రయోజనాలు (లాభాలు):

  1. సృష్టిలోని అన్నింటి కంటే అల్లాహ్ ను మరియు అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్త ను ప్రేమించటం యొక్క ఆవశ్యకతను ఈ హదీథ్ తెలుపుతుంది.
  2. అల్లాహ్ కు మరియు అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్తకు అవిధేయత చూపుతూ, ప్రజలకు విధేయులుగా ఉండటం తగదు.
  3. దైవవిశ్వాసం పరిపూర్తి కావటానికి ఒక మార్గం – ప్రతి ముస్లిం తన తోటి ముస్లిం సోదరుడిని కేవలం అల్లాహ్ కోసం తప్పక ప్రేమించ వలెను.
  4. ప్రతి ముస్లిం అవిశ్వాసాన్ని నరకంలో పడవేయటాన్ని అసహ్యించుకున్నట్లుగా అసహ్యించుకో వలెను.
  5. ఎవరి దగ్గర అయితే పై మూడు మంచి లక్షణాలు ఉన్నాయో వారు శాంతియుతంగా మరియు సురక్షితంగా ఉన్నట్లుగా అనుభూతి పొందుతారు.

ప్రశ్నలు

  1. దైవవిశ్వాసపు తీపిదనం ఎవరిలో ఉంటుంది?
  2. ప్రతి ముస్లిం అవిశ్వాసాన్ని ఏ విధంగా అసహ్యించుకోవలెను?
  3. ఈ హదీథ్ యొక్క ఉల్లేఖకుని గురించి క్లుప్తంగా వ్రాయండి?
  4. ప్రతి ముస్లిం తోటి ముస్లిం సోదరుడిని ఎవరి కోసం ప్రేమించాలి?
  5. శాంతియుతంగా మరియు సురక్షితంగా ఉండటానికి ఏ ఏ లక్షణాలు ఉండవలెను?

Source : హదీథ్ – రెండవ స్థాయి  [తెలుగు]
(రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  ముహమ్మద్ కరీముల్లాహ్

చాడీలు చెప్పటం నిషేధించబడినది (Prohibition of Backbiting)

backbiting-telugu-islamహదీథ్׃ 07

تحريم النميمة చాడీలు చెప్పటం నిషేధించబడినది

حدّثنا مُحَمَّدُ بْنُ الْمُثَنَّى وَ ابْنُ بَشَّارٍ قَالاَ: حَدَّثَنَا مُحَمَّدُ بْنُ جَعْفٍ  حَدَّثَنَا شُعْبَةُ . سَمِعْتُ أَبَا إِسْحَـٰقَ يُحَدِّثُ عَنْ أَبِي الأَحْوَصِ عَنْ عَبْدِاللّهِ بْنِ مَسْعُودٍ قَالَ: إِنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَ سَلَّمَ قَالَ: أَلاَ أُنَبِّئُكُمْ مَا الْعَضْهُ؟ هِيَ النَّمِيمَةُ الْقَالَةُ بَيْنَ النَّاس. رواة صحيح مسلم

హద్దథనా ముహమ్మద్ ఇబ్ను అల్ ముథన్న వ ఇబ్ను బష్షారిన్ ఖాల హద్దథనా ముహమ్మద్ ఇబ్ను జఅఫిన్ హద్దథనా షుఅబతు సమియ్ తు అబా ఇస్హాఖ యుహద్దిథు అన్అబి అల్అహ్వశి అన్ అబ్దిల్లాహ్ ఇబ్ని మస్ఊదిన్ ఖాల, ఇన్న రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వ సల్లమ ఖాల ఆలా ఉనబ్బి ఉకుమ్ మా అల్ అద్హు? హియన్నమీమతు అల్ ఖాలతు బైనన్నాసి రవాహ్ సహీ ముస్లిం.

అస్సనద్ (ఉల్లేఖకుల పరంపర) సహీ ముస్లిం హదీథ్ గ్రంధంకర్త ← ముహమ్మద్ ఇబ్ను అల్ ముథన్న← ఇబ్ను బష్షారిన్← ముహమ్మద్ ఇబ్ను జఅఫిన్ ← షుఅబతు ← అబా ఇస్హాఖ ← అబి అల్అహ్వశి ← అబ్దిల్లాహ్ ఇబ్ని మస్ఊదిన్ (రదియల్లాహుఅన్హు) ← ప్రవక్త సల్లల్లాహుఅలైహి వసల్లం హితోపదేశం.

అల్ మతన్ (బోధించిన అసలు విషయం) అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిశ్చయంగా ఇలా ఉపదేశించినారు. మీకు అల్ అద్హు అంటే ఏమిటో తెలుపనా? అది మానవుల మధ్య చాడీలు విస్తరింప చేయడము. సహీ ముస్లిం హదీథ్ గ్రంధం.

హదీథ్ ఉల్లేఖకుని పరిచయం – ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క ఇస్లాం ధర్మం సందేశాన్ని ప్రారంభంలోనే స్వీకరంచిన వారిలో ఉత్తమములలో అబ్దుల్లాహ్ ఇబ్నె మస్ఊద్ రదియల్లాహు అన్హు ఒకరు.  వీరు ప్రముఖ ధర్మనిష్ఠాపరుల, ఖుర్ఆన్ పారాయణుల, ధర్మజ్ఞానకోవిదుల ప్రసిద్ధులలో ఒకరు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం దగ్గర దాదాపుగా 70 ఖుర్ఆన్ అధ్యాయాలను కంఠస్థం చేసారు. 32వ హిజ్రీ సంవత్సరంలో, 60 సంవత్సరాల వయస్సులో మదీనా పట్టణంలో వీరు మరణించారు.

హదీథ్ వివరణ

ఇస్లాం ధర్మం ప్రజలకు పరస్పర ప్రేమాభిమానాలతో, సోదర భావంతో, కలిసిమెలిసి ఆదర్శవంతంగా జీవితం గడపే మంచి మార్గం వైపునకు దారిచూపుతున్నది. ఇంకా పరస్పర వైషమ్యాలు, ఈర్ష్యాద్వేషాలు, కోపతాపాలు, భేదాలు కూడదని నివారిస్తున్నది. ప్రజల మధ్య ప్రేమాభిమానాలను తుడిచిపెట్టి, వారిలో సంఘీభావాన్ని, కలిసిమెలిసి జీవించటాన్ని ముక్కలుముక్కలు చేసే అత్యంత ప్రమాదకరమైన దురలవాటు చాడీలు చెప్పటం. దీని వలన ప్రజల హృదయాలలో కోపతాపాలు భగ్గుమంటాయి. ఒకరినొకరు అసహ్యించుకోవటం మొదలవుతుంది.  మంత్రగాళ్ళు సంవతర్సరకాలంలో లేపలేని అలజడిని, అపోహలను, అల్లర్లను ఒక్కోసారి చాడీలు మరియు అబద్ధాలు చెప్పేవారు కేవలం ఒక గంటలోనే లేపుతారు. కాబట్టి, ధర్మవిద్య నేర్చుకునే సోదరులారా! మీరేదైనా విషయం విన్నప్పుడు దానిలోని సత్యాసత్యాలను, నిజానిజాలను, వాస్తవాలను బాగా పరిశోధించ వలెను, పరిశీలించ వలెను మరియు, పరీక్షించ వలెను. తెలిసిన వారు చెబుతున్నారు కాదా అని గ్రుడ్డిగా నమ్మరాదు. కేవలం సందేహం మరియు అనుమానం మీద ఆధార పడవద్దు. ఖుర్ఆన్ లోని అల్ హుజురాత్ అనే అధ్యాయంలో 6వ వచనంలో అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు –

يَا أَيُّهَا الَّذِينَ آَمَنُوا إِنْ جَاءَكُمْ فَاسِقٌ بِنَبَأٍ فَتَبَيَّنُوا أَنْ تُصِيبُوا قَوْمًا بِجَهَالَةٍ فَتُصْبِحُوا عَلَى مَا فَعَلْتُمْ نَادِمِينَ(6)

దైవవిశ్వాసులారా!  ఎవరైనా దుర్మార్గుడు మీ వద్దకు ఏదైనా సమాచారాన్ని తీసుకువస్తే, నిజానిజాలు విచారించి తెలుసుకోండి. అలా చేయకపోతే, మీకు తెలియకుండానే మీరు ఏదైనా వర్గానికి నష్టం కలిగించవచ్చు, తర్వాత చేసినదానికి పశ్చాత్తాప పడవలసి రావచ్చు.

కాబట్టి ఎల్లప్పుడూ చాడీలు చెప్పేవారితో చాలా జాగ్రత్తగా ఉండండి. అంటువంటి వారికి సమాజంలో గౌరవమర్యాదలు ఉండవు. ఇంకా అటువంటి వారిలో మంచి నడవడిక కూడా ఉండదు. అటువంటి వారి యొక్క ఏకైక లక్ష్యం ప్రజలు కష్టం కలిగించటం మరియు బాధలకు గురిచేయటం. ఎదుటి వారు కష్టనష్టాలలో కూరుకు పోవటం చూసి సంతోషపడతారు. అటువంటి నుండి అల్లాహ్ మమ్ముల్ని కాపాడు గాక! ఆమీన్.

ఈ హదీథ్ వలన కలిగే లాభాలు:

  1. చాడీలు చెప్పటం మరియు అపవాదాలు వేయటం హరామ్, ఇస్లాం ధర్మం పూర్తిగా నిషేధించినది.
  2. చాడీలు చెప్పటమనేది అత్యంత ఘోరమైన పాపాలలో పరిగణించబడుతుంది.

Source : హదీథ్ – రెండవ స్థాయి  [తెలుగు]
(రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  ముహమ్మద్ కరీముల్లాహ్