(3) జుమానాడు దువా స్వీకరించబడే రెండు ప్రత్యేక శుభ ఘడియలలో నుండి ఒకటి ఈ క్రింది వాటిలో ఒకటి ఉంది అదేమిటి?
A] ఫజర్ నుండి జుమా అజాన్ వరకు గల సమయం B] ఇమామ్ ప్రసంగించేందుకు వేదికపై కూర్చున్నప్పటి నుండి జుమా నమాజు ముగిసే మధ్య సమయం వరకు C] గురువారం మగ్రిబ్ నుండి శుక్రవారం సూర్యోదయం వరకు
సౌదీలో లాక్‌డౌన్ తర్వాత మసీదులు తెరవబడ్డాయి
13-10-1441 (హిజ్రి) రోజున మొదటి జుమ్మా ఖుత్బ
జామి హుస్సేన్ బిన్ అలీ రజియల్లాహు అన్హు షేఖ్ సాలిహ్ బిన్ ఫురైహ్ అల్ బహ్ లాల్ అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 69
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
(1) “ఎవరు విశ్వసించి, వలసపోయారో, అల్లాహ్ మార్గంలో తమ ధనప్రాణాల ద్వారా పోరాడారో వారూ, వారికి ఆశ్రయమిచ్చి సహాయపడినవారూ – వారంతా ఒండొకరికి మిత్రులు” (8:72 ) దీనిలో ప్రఖ్యాతిగా ఎవరిని గూర్చి తెల్పబడింది?
A) అన్సారుల గూర్చి
B) ముహాజిర్ ల గూర్చి
C) ముహాజిర్ మరియు అన్సారుల గూర్చి
(2) భార్య – భర్తల మధ్య ప్రేమ పెరుగుటకు చేసే చేతబడిని ఏమంటారు?
A) అర్రుఖా
B) తివల
C) తమాయిమ్
(3) తావీజు వేసుకోవడం ఎలాంటి కార్యం అవుతుంది?
A) షిర్క్ (బహుదైవారాధన)
B) బిదాత్ (కల్పితాచారం)
C) పుణ్య కార్యం
Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 68
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
(1) దైవప్రవక్త (ﷺ) వారికి స్వప్నం లో శత్రుసైన్యాన్ని తక్కువ మందిగా చూపించింది ఏ యుద్ధ సందర్భంగా తెలపండి?
A) ఉహద్ యుద్ధం
B) బద్ర్ యుద్ధం
C) తబూక్ యుద్ధం
(2) ప్రళయదినం నాడు అల్లాహ్ మనల్ని ప్రశ్నించే 5 ప్రశ్నల క్రమంలో ఈ క్రింది వాటిలో ఒక ప్రశ్న ఉంది అదేమిటి?
A) తెలుసుకున్న విషయాలపై ఎంత వరకు ఆచరించావు ?
B) ఎంత వరకు తెలుసుకున్నావు ?
C) ఎంత ఎక్కువ మందికి తెల్పావు ?
(3) “భయపడినవాడు తెల్లవారుజామునే ప్రయాణం మొదలు పెట్టాడు ఇలాంటి వ్యక్తి గమ్యాన్ని చేరుకుంటాడు , వినండి ! అల్లాహ్ యొక్క సామగ్రి అమూల్యమైనది , జాగ్రత్తగా వినండి ! అల్లాహ్ సామగ్రి అనగా స్వర్గం ” [తిర్మిజీ ] దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి ఈ ప్రవచనం ద్వారా మనకు లభించే గుణపాఠం ఏమిటి?
A) తెల్లవారు జామున మాత్రమే ప్రయాణం చెయ్యాలి
B) అల్లాహ్ విధేయత కొరకు పుణ్యాలు చెయ్యడం లో ఆలస్యం చెయ్యకూడదు
C) పై రెండూ యధార్థమే
మిడతల ప్రస్తావన ఖుర్ఆన్ లో రెండు సార్లు వచ్చింది. (ఆరాఫ్ 7:133, ఖమర్ 54:7). మిడతల ప్రస్తావన హదీసుల్లో ఎన్నో సార్లు ఉంది.
మిడతలు అల్లాహ్ సైన్యాల్లోని ఓ సైన్యం. ఈ మాట స్వయంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓ సందర్భంలో చెప్పారు:
فَإنه جُنْدٌ مِنْ جُنُودِ اللَّهِ الأَعْظَمٌ
“మిడతలు అల్లాహ్ సైన్యాల్లో ఓ గొప్ప సైన్యం”. (సహీహా 2428).
ఇమాం ఇబ్నుల్ ఖయ్యిం (రహిమహుల్లాహ్) చెప్పారు: మిడతలు “అల్లాహ్ సైన్యాల్లో ఓ సైన్యం. సృష్టిలో చాలా బలహీనమైనవి, వింత కూర్పు దానిది. గుంపుగా వచ్చినప్పుడు లేదా అనండీ దండయాత్ర చేసినప్పుడు వాటిని లెక్కించడం గాని, వాటిని ఎదురుకోవడం గాని కాని పని. ఎంతటి శక్తి గల రాజు కూడా తన సైన్యాలన్నిటిని వాటికి ఎదురుగా నిలబెట్ట లేడు. మీరు చూడరా! అవి పర్వతాలపై, ఊర్లపై, గ్రామాలపై, నగరాలపై ఎంత పెద్ద సంఖ్యలో వాలుతాయంటే సూర్యుని కాంతిని కూడా కప్పి వేస్తాయి. ఆకాశం సయితం కనబడకుండా అయిపోతుంది… “(మిఫ్తాహు దారిస్సఆదహ్ 1/252).
అరబీలో జరాద (బహువచనం: జరాద్) అంటారు, అంటే అవి వచ్చిన, వాలిన చోటును ఖాళీ చేసి పారేస్తాయి.
మిడతలు అల్లాహ్ యొక్క శిక్షనా?
అల్లాహ్ తలచినప్పుడు కొందరి పట్ల పరీక్షగా, మరి కొందరి పట్ల శిక్షగా, ఇంకొదరి పట్ల వరంగా చేసి పంపవచ్చు. ఫిర్ఔన్ వారిపై విరుచుకుపడ్డ నానా రకాల విపత్తుల్లో ఒకటి మిడతలు కూడా.
ఆ తరువాత మేము వారిపై తుఫానును, మిడతల దండును పంపాము. ధాన్యపు పురుగులను, కప్పలను, రక్తాన్నీ వదిలాము. వాస్తవానికి ఇవన్నీ స్పష్టమయిన మహిమలు. అయినప్పటికీ వారు అహంకారాన్ని చూపారు. అసలు విషయం ఏమిటంటే వారు అపరాధజనులు.
వారిపై ఏదన్నా ఆపద వచ్చిపడినప్పుడు, “ఓ మూసా! నీకు నీ ప్రభువు చేసిన వాగ్దానం గురించి మా కోసం నీ ప్రభువును ప్రార్థించు. ఈ ఆపదను గనక నువ్వు మానుంచి దూరం చేస్తే మేము నిన్ను తప్పకుండా విశ్వసిస్తాము. ఇస్రాయీలు సంతతి వారిని కూడా (విడుదల చేసి) నీతో పంపిస్తాము” అని అనేవారు.
ఆ తర్వాత మేము వారికి ప్రతీకారం చేశాము. వారిని సముద్రంలో ముంచి వేశాము. ఎందుకంటే, వారు మా ఆయతులను అసత్యాలని ధిక్కరించేవారు, వాటి పట్ల బొత్తిగా నిర్లక్ష్యం వహించేవారు.
ప్రస్తుతం జరుగుతున్న వాటికి ఖుర్ఆన్ సాక్ష్యాలు ఇవ్వడం తప్పా?
కాదు, గుణపాఠం నేర్చుకోండని చెప్పడానికి తెలుపవచ్చు. ఈ పద్ధతి స్వయంగా ఖుర్ఆన్ నేర్పినదే, శ్రద్ధగా సూర ఖమర్ (54) చదవండీ. మహిమలను మరియు ఖుర్ఆన్ ను తిరస్కరించిన అవిశ్వాసులను అల్లాహ్ హెచ్చరిస్తూ, సమాధుల నుండి ఎలా లేపబడతారో తెలిపి, వెంటనే ఐదు ప్రవక్తల జాతులపై విరుచుకుపడ్డ శిక్షల గురించి తెలియజేశాడు.
అలాగే సూర ముద్దస్సిర్ (74) చదవండీ: ఆయత్ 30లో: నరకానికి 19 మంది దైవదూతలు కాపాలా- దారులుగా ఉన్నారని తెలిపినప్పుడు అవిశ్వాసులు; మాలో పది మంది ఒక్కో దైవదూతను చూసుకుంటారని, ఇంకా నానా రకాలుగా గేళి చేశారు, అప్పుడు అల్లాహ్ ఆయత్ 31 అవతరింపజేశాడు, మీరు పూర్తిగా అనువాదంతో పాటు వ్యాఖ్యానం కూడా చదవండీ. చివరలో తెలిపాడు: “నీ ప్రభువు సైన్యాలను స్వయంగా ఆయన తప్ప మరెవరూ ఎరుగరు”.
మిడతలను తినవచ్చా, ప్రవక్త తిన్నారా?
అవును, తినవచ్చు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తిన్నారని సహీ బుఖారీ (5495), సహీ ముస్లిం (1952)లో ఉంది:
«غَزَوْنَا مَعَ النَّبِيِّ سَبْعَ غَزَوَاتٍ أَوْ سِتًّا، كُنَّا نَأْكُلُ مَعَهُ الجَرَادَ» “మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఉండి ఏడు యుద్ధాలు చేశాము, మేము ఆయన వెంట ఉండి మిడతలు తినేవారిమి” అని అబ్దుల్లాహ్ బిన్ అబీ ఔఫా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మిడతలు తినలేదు అని (అబూ దావూద్ 3813, ఇబ్ను మాజ3219లో వచ్చిన హదీసు సహీ కాదు).
బైహఖీ కుబ్రా 18999, మువత్త3443లో ఉంది: హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హుతో ప్రశ్నించడం జరిగింది మిడతల గురించి, అప్పడు ఆయన చెప్పారు:
وَدِدْتُ أَنَّ عِنْدَنَا قَفْعَةً نَأْكُلُ مِنْهَا ఓ బుట్ట నిండా మిడతలు ఉండి, మనము తింటూ ఉంటే ఎంత బావుండునని కోరుతున్నాను.
మిడతలు ఎలా తినాలి?
సహీ బుఖారీ వ్యాఖ్యానం అయిన ఫత్హుల్ బారీ (9/621) లో ఉంది:
మిడతలను జిబహ్ చేయకుండా తినడంపై ఉలమాల ఇజ్మాఅ (ఏకాభిప్రాయం) ఉంది. అయితే మాలికియ వద్ద జిబహ్ చేయడం షరతు అన్న మాటే ఫేమస్, కాని దాని పద్ధతి విషయంలో భేదాభిప్రాయం ఉంది. ఇమాం నవవీ కూడా ఇజ్మాఅ ఉందని చెప్పారు.
“మన కొరకు రెండు మృతులు హలాల్ (ధర్మసమ్మతం) చేయబడ్డాయి: చేప మరియు మిడతలు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చప్పారని అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (ఇబ్ను మాజ 3218, ముస్నద్ అహ్మద్ 5723. సహీహా 1118).
మిడతలను చంపవచ్చా?
నీవున్న చోట నీకు నీ చుట్టు ప్రక్కన ఎవరికీ, ఏ పంటకు ఏ నష్టము చేకూర్చని కొన్ని మిడతలున్నాయి వాటిని చంపడం జాయిజ్ లేదు. షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహా 5/554లో ‘తహ్రీము ఖత్లిల్ జరాది ఇల్లా లిల్ అక్లి ఔ లిదఫ్ఇ జరర్’ (తినడానికి లేదా నష్టం దూరం చేయుటకు తప్ప మిడతలను చంపడం నిషద్ధం) అని ఛాప్టర్ పేర్కొని ఈ క్రింది ప్రవక్త (సల్లల్లాహు అలైహి వస్లలం) వారి హదీసు ప్రస్తావించారు:
لَا تَقْتُلُوا الْجَرَادَ، فَإِنَّهُ مِنْ جُنْدِ اللهِ الْأَعْظَمِ
“మిడతలను చంపకండీ, అవి అల్లాహ్ సైన్యాల్లో ఓ సైన్యం”. (సహీహా 2428).
الصحيحة 2428 – ” لا تقتلوا الجراد، فإنه جند من جنود الله الأعظم “.
الصحيحة 2429 – ” لا تقوم الساعة حتى تقاتلوا قوما صغار الأعين عراض الوجوه كأن أعينهم حدق الجراد، كأن وجوههم المجان المطرقة، ينتعلون الشعر ويتخذون الدرق، حتى يربطوا خيولهم بالنخل “.
الصحيحة 1056 – ” خير ماء على وجه الأرض ماء زمزم، فيه طعام من الطعم وشفاء من السقم، وشر ماء على وجه الأرض ماء بوادي برهوت بقية حضرموت كرجل الجراد من الهوام، يصبح يتدفق ويمسي لا بلال بها “.
“వీరు ఏ ఖిబ్లా వైపుకు అభిముఖులయ్యేవారో దాన్నుంచి మరలటానికి కారణం ఏమిటీ?” అని మూర్ఖ జనులు అంటారు. (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: తూర్పు పడమరలు (అన్నీ) అల్లాహ్‌వే. తాను తలచిన వారికి ఆయన రుజుమార్గం చూపుతాడు.
అదే విధంగా మేము మిమ్మల్ని ఒక “న్యాయశీల సమాజం” (ఉమ్మతె వసత్)గా చేశాము – మీరు ప్రజలపై సాక్షులుగా, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మీపై సాక్షిగా ఉండటం కోసం (మేమిలా చేశాము.) ప్రవక్తకు విధేయత చూపటంలో ఎవరు నిజాయితీపరులో, మరెవరు వెనుతిరిగి పోయేవారో తెలుసుకునే (పరీక్షించే) నిమిత్తమే మేము, పూర్వం నీవు అభిముఖుడవై ఉండిన దిశను మీ ‘ఖిబ్లా’గా నిర్ధారించాము. ఇదెంతో కష్టమైన విషయమే అయినప్పటికీ అల్లాహ్ సన్మార్గం చూపిన వారికి (ఏ మాత్రం కష్టతరం కాదు). అల్లాహ్ మీ విశ్వాసాన్ని వృధా కానివ్వడు. నిశ్చయంగా అల్లాహ్ (తన దాసులైన) మానవుల యెడల అమితమైన వాత్సల్యం కలవాడు! పరమ కృపాశీలుడు.
You must be logged in to post a comment.