విశ్వాసి తన కోసం ఇష్టపడే వస్తువునే తన తోటి సోదరుల కోసం కూడా ఇష్టపడాలి [వీడియో]

విశ్వాసి తన కోసం ఇష్టపడే వస్తువునే తన తోటి సోదరుల కోసం కూడా ఇష్టపడాలి | బులూగుల్ మరాం | హదీసు 1256
https://youtu.be/aWHz-iM7Tq4 [12 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

1256. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా ప్రవచించారు:

“ఎవరి అధీనంలో నా ప్రాణముందో ఆ పవిత్రమూర్తి సాక్షిగా చెబుతున్నాను తన స్వయం కొరకు ఇష్టపడేదే తన ఇరుగు పొరుగు లేక తన సోదరుని కోసం కూడా ఇష్టపడనంత వరకూ ఏ దాసుడూ విశ్వాసి (మోమిన్) కాలేడు.” (బుఖారీ, ముస్లిం)

సారాంశం:

ఈ హదీసులో విశ్వాస పరిపూర్ణత కొరకు ఒక షరతు విధించబడింది. అదేమంటే విశ్వాసి అయినవాడు తన కోసం ఇష్టపడే వస్తువునే తన పొరుగువారి కోసం లేదా తన తోటి సోదరుల కోసం కూడా ఇష్టపడాలి. సమాజంలో తన గౌరవ ప్రతిష్ఠలు ఇనుమడించాలని అతను కాంక్షిస్తున్నపుడు ఇతరులు కూడా అలాగే కోరుకుంటారని అతడు తలపోయాలి. కనుక ఇతరుల గౌరవ ప్రతిష్ఠలకు తన తరపున విఘాతం కలగకుండా చూసుకోవాలి. తనకు శాంతీ సౌఖ్యాలు ప్రాప్తించాలని కోరుకున్నప్పుడు సాటి వ్యక్తుల కోసం కూడా అదేవిధంగా ఆలోచించాలి. వ్యక్తుల్లో ఇలాంటి సకారాత్మక ఆలోచనలున్నప్పుడు సమాజమంతా సుఖశాంతులకు నిలయమవుతుంది. ప్రగతి పథంలో సాఫీగా సాగిపోతుంది. అశాంతి అలజడులుండవు. ఒకరింకొకరి శ్రేయస్సును అభిలషించే వారుగా, ఒండొకరి యెడల సానుభూతి పరులుగా ఉంటారు. ఒక సత్సమాజానికి ఉండవలసిన ప్రధాన లక్షణమిదే.

యూట్యూబ్ ప్లే లిస్ట్ – బులూగుల్ మరాం – కితాబుల్ జామి
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV266FkpuZpGacbo51H-4DV3

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1

నాస్తికత్వం & దైవాస్తికత – సయ్యద్ అబ్దుల్ హకీమ్ [పుస్తకం]

రచయిత: సయ్యద్ అబ్దుల్ హకీమ్
అనువాదం: అబ్దుల్ బాసిత్ ఉమరీ


[ఇక్కడ పుస్తకం చదవండి / డౌన్లోడ్ చేసుకోండి] [38పేజీలు] [PDF]
https://teluguislam.net/wp-content/uploads/2022/03/daivastikatha-teluguislam.net-mobile-friendly.pdf

నాస్తికత – మానవ సమాజంపై దాని తప్పుడు ప్రభావాలు :

మానవ జీవితాన్ని సమస్యలు, చిక్కులనుండి రక్షించి పరిశుద్ధ ప్రశాంత జీవనమార్గం చూపాలని గొప్పలు చెప్పుకొనే తత్వశాస్త్రవాదులు చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. సమస్యల పరిష్కారానికై వారు చేసిన ప్రయత్నాలు యుక్తులవల్ల సత్ఫలితానికి బదులు మరిన్ని చిక్కు సమస్యలు ఎదురయ్యాయి. ఉన్న వాటికంటే అనేక రెట్లు ఎక్కువ సంకటాలు ఏర్పడ్డాయి. వారి అపజయాలకు వైఫల్యాలకు కారణమేమిటంటే వారు నాస్తికతను ఆధారంగా చేసుకుని ప్రయత్నించారు. ఈ దృక్పధమే సర్వవినాశాలకు, దుష్కార్యాలకు మూలం. అసలు వాస్తవ విషయమేమిటంటే సర్వమానవాళిని ప్రస్తుత ఆరాచక భావాలు, సాంఘిక వైకల్యం, నీచబుద్ధి మొదలగు వాటి బారినుండి విముక్తి కలిగించాలనుకుంటే మొట్టమొదట ప్రసుత్త నాగరికతకు ఆధారాలుగా పరిగణింపబడుతున్న నాస్తికతా, దైవ తిరస్కారాలను సంపూర్ణంగా నిర్మూలించాలి.

మానవుడు తన ఉనికి యొక్క కారణం మరియు తత్వాన్ని మరచి తన వాస్తవ సృష్టికర్తయైన అల్లాహ్ ఆదేశాలను ఉల్లంఘించి గడిపే ప్రతిజీవితం అజ్ఞాన కాలపు ఆంధకార జీవితమని ఇస్లాం పేర్కొంటుంది. ఎందుకంటే అటువంటి జీవితం వినాశానానికి దారితీస్తుంది. కావున ప్రస్తుత నాస్తిక నాగరికత అజ్ఞాన కాలపు జీవితాలకంటే మరింత ఎక్కువ దిగజారి వుంది. ప్రస్తుత కాలమైన సరే ప్రాచీన కాలమైనా సరే ఇస్లాం దృక్పధమేమిటంటే మానవ జీవితాన్ని సహజ సిద్ధ మార్గాలనుండి తప్పించి, పనికిమాలిన ఆ తప్పుడు దారులు పట్టించే ప్రయత్నాలు చేయటం వల్లనే సర్వ వినాశాలు ఏర్పడతాయి కావున మానవాళి మార్గదర్శకానికి కావలసిన ఒకే ఒక చిట్కా యేమిటంటే అజ్ఞాన పూరిత భావాలను నిర్మూలించడం. అనగా మానవుడు యదార్థ కృతార్థత పొందాలనుకుంటే తన జీవితం యొక్క వాస్తవ ఉద్దేశ్యాన్ని విడనాడకుండా, తప్పుదారి పట్టకుండా పూర్తి బాధ్యతా భావంతో దాన్ని స్వీకరించాలి. తనను సృష్టించిన అల్లాహ్ పై విశ్వాసం ఉంచి ఆ విశ్వాసాన్నే తన జీవిత ప్రయాణ ప్రారంభంగా తలచి ఆయన మార్గదర్శకం ప్రకారం తన జీవన ప్రయాణం కొనసాగించాలి. ఎందుకంటే దేవుడైన అల్లాహ్ మానవాళినే కాక సర్వలోక సృష్టిరాశులను సృష్టించెను. ఆయనే సర్వలోక , యదార్థయజమాని మరియు సర్వాధికారి అతీతుడు,సర్వస్తోత్రాలకు అర్హుడు. ఆయన అత్యంత గొప్ప వినువాడు.అతి సమీపంగా నున్నవాడు. ఆయనే అందరి మొరలు ఆలకించును. ఆయనే ప్రభువు, దాత, సహాయకుడు. తత్వజ్ఞాని, సర్వజ్ఞాని, మనమందరం అతని పాలితులం. పోషితులం, దాసులం బానిసలం.

తోటి సోదరునికి సాయపడుతూ ఉన్నంత కాలం అల్లాహ్ అతన్ని ఆదుకుంటూనే ఉంటాడు [వీడియో]

తోటి సోదరునికి సాయపడుతూ ఉన్నంత కాలం అల్లాహ్ అతన్ని ఆదుకుంటూనే ఉంటాడు | బులూగుల్ మరాం | హదీసు 1263
https://youtu.be/32IJzghLRHc [15 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

1263.హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు:

ఎవరయినా సరే ప్రపంచంలోని ఆపదల్లో నుంచి, ఏదేని ఒక ఆపదనుంచి ఏ ముస్లింనయినా గట్టెక్కిస్తే అల్లాహ్ ప్రళయ దినాన ప్రళయదినపు గండాలలోని ఏదేని ఒక గండం నుంచి అతన్ని గట్టెక్కిస్తాడు. ఎవరయినా ప్రాపంచికంగా లేమికి గురైన ఒక వ్యక్తికి వెసులుబాటు కల్పిస్తే అల్లాహ్ ఇహపరాలలో అతని కోసం వెసులుబాటును కల్పిస్తాడు. ఎవరయినా ఒక ముస్లిం బలహీనతను కప్పిపుచ్చితే అల్లాహ్ ఇహపరాలలో అతని లోగుట్టు పై ఆచ్చాదన వేసి ఉంచుతాడు. ఒక దాసుడు తోటి సోదరుని సాయపడుతూ ఉన్నంత కాలం అల్లాహ్ అతన్ని ఆదుకుంటూనే ఉంటాడు.”

యూట్యూబ్ ప్లే లిస్ట్ – బులూగుల్ మరాం – కితాబుల్ జామి
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV266FkpuZpGacbo51H-4DV3

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1

ప్రియమైన అమ్మకు .. [పుస్తకం]

సంకలనం: నసీమ్ గాజీ

[ఇక్కడ పుస్తకం చదవండి / డౌన్లోడ్ చేసుకోండి]
https://teluguislam.net/wp-content/uploads/2022/03/priyamaina-ammaku-teluguislam.net-mobile-friendly.pdf
[20 పేజీలు] [PDF] 

అపార కృపాశీలుడు అనంత కరుణామయుడయిన అల్లాహ్‌ పేరుతో

ఈ ఉత్తరం ఇప్పటికి దాదావు ఇరవై సంవత్సరాల క్రితం వ్రాశాను. అప్పుడు నేను ఒక ధార్మిక పాఠశాల, జామియతుల్‌ ఫలాహ్‌, బిలేరియా గంజ్‌ (ఆజమ్‌గడ్ జిల్లా)లో విద్యనభ్య సిస్తున్నాను. ఆ కాలంలో అప్పుడప్పుడు ఇంటికి కూడా వెళ్ళేవాడిని. ఇస్లాం స్వీకారానికి పూర్వం నేను హిందూ సమాజంలోని అగర్వాల్‌ కుటుంబానికి చెందినవాడిని. మా నాన్నగారు మరణించినప్పుడు నా వయస్సు తొమ్మిది సంవత్సరాలు. ఒక రోజు ఇస్లాం స్వీకరించే భాగ్యం నాకు లభిస్తుందన్నది నా ఊహకు కూడా అందని విషయం. మా పెద్దన్నయ్య మా కుటుంబ పెద్ద. ఇస్లాం విషయంలో ఆయన నాతో ఏకీభవించేవారు గనక, ఆయన ద్వారా నాకు ప్రోత్సాహమే లభించింది కాని ప్రతికూలం ఎదురవ్వలేదు. అయితే అమ్మ విషయం మాత్రం అందుకు భిన్నంగా ఉండేది. నేను ఇస్లాం స్వీకరించడం ఆమె సుతరామూ ఇష్టపడలేదు. ఆమెను అన్నింటి కంటే ఎక్కువగా బాధించిన విషయం ఏమంటే నేనామెకు దూరంగా ఒక ధార్మిక పాఠశాలలో చేరాను. అప్పటికీ నేను తరచూ ఇంటికి వెళ్ళివచ్చేవాడిని. అమ్మ కూడా ఈ మహా వరప్రసాదాన్ని గ్రహించాలని సహజంగానే నేను మనసారా కోరుకునేవాణ్ణి. ఆమె మటుకు వీలయినంత త్వరగా నేను ఇస్లాంను వదిలేసి పాత ధర్మం వైవుకు తిరిగిరావాలని కోరుకునేది. వాస్తవానికి ఆమెకు నాపైగల అమితమైన మమతానురాగాల కారణంగా నా ఈ చేష్ట ఆమెకు నచ్చలేదు. ఆమె మానసికంగానూ, ఆధ్యాత్మికంగానూ ఆవేదనకు గురయింది. ఇది స్వాభావికమే. ఇస్లాం బోధనలు ఆమెకు విశదంగా తెలియవు. ముస్లిముల జీవితాలు ఇస్లామ్‌కు పూర్తిగా భిన్నంగానే కాక ఇస్లామ్‌ పట్ల ఏవగింపు కలుగజేసేవిగా కనిపిస్తున్నాయి. అందువల్ల అమె హృదయంలో ఇస్లామ్‌ కొరకు ఏ మాతం చోటు లేదు. నా గురించి ఆమెలో రకరకాల ఆలోచనలు తలెత్తేవి, ఇతరులూ బహు విధాలుగా రేకెత్తించేవారు. ఈ లేఖలో కొన్నింటిని పేర్కొన్నాను. నేను వీలైనంతవరకు ఆమె సందేహాలను, సంశయాలను దూరం చేయడానికి, ఇస్లాం బోధనల్ని, విశదపరచడానికి ప్రయత్నించేవాడిని. ఈ ప్రయత్నం ఒక్కో సారి సంభాషణ ద్వారాను, మరోసారి ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారాను కొనసాగేది.

నేను జన్మించిన తరువాత హైందవ ఆచారం ప్రకారంగా మా వంశ గురువులవారు, నా హస్తరేఖలు, నా జాతకం చూసి నా భవిష్యత్తు గురించి అనేక విషయాలు మా అమ్మకు చెప్పారు. ఆందులో ఒకటి, “నీ కొడుకు నీకు కాకుండా పోతాడ”న్నది. నేను ఇస్లాం స్వీకరించిన తరువాత ఆచార్యులవారు జోస్యం నిజమయినట్లుగా ఆమెకు అగుపడసాగింది. ఆ విషయాన్ని ప్రస్తావించి ఆవిడ నాకు నచ్చజెప్పడానికి ప్రయత్నించేది.

ఇస్లాంలో మంచి అన్నదేదీ లేకపోయినా, నా కొడుకు మౌలానాగారి వలలో చిక్కుకున్నాడు అనే విషయం ఆమె హృదయంలో బాగా నాటుకుపోయింది. ఈ లేఖలో ఆమెకున్న ఈ అపోహను దూరం చేయడానికీ ప్రయత్నించాను. దాంతో పాటు ఇస్లాం వైవుకు కూడా అమెను ఆహ్వానించాను. నా ఉద్ధేశ్యం, ఇస్లాం పట్లను , నా పట్లను కేవలం ఆమెకున్న అపోహల్ని, అపార్ధాలను దూరం చెయ్యడమే కాదు. ఈ సత్యాన్ని ఆమె కూడా స్వీకరించి, దైవ ప్రసన్నత పొంది, స్వర్గానికి అర్హురాలు కావాలని, నరకాగ్ని నుండి ఆమె రక్షింపబడాలి అన్నది నా ప్రగాఢ వాంఛ, కృషి కూడా.

ఈ లేఖ చదివిన తరువాత ఆమెలో భావ తీవ్రత కాస్త్ర తగ్గినా, తన పూర్వీకుల మతం వదలడానికి మాతం ఆమె సిద్ధం లేదు. నేను ఆమెకు నచ్చజెప్పడానికి సతతం ప్రయత్నం చేస్తుండేవాడిని. ఆమె హృదయ కవాటాలు సత్యం కొరకు తెరచుకోవాలని అల్లాహ్ ను వేడుకునే వాణ్ణి కూడా. దాదాపు మూడు సంవత్సరాల ఎడతెగని కృషి తరువాత అల్లాహ్ అనుగ్రహం కలిగింది. ఆమెకు సత్యధర్మానికి స్వాగతం పలికే బుద్ధి కలిగింది. తన పురాతన ప్రవర్తనకు పశ్చాత్తాప్పడింది. నా మాతృమూర్తి నేడు ఇస్లామ్‌ పై సుస్థిరంగా, సంతృప్తిగా ఉంది. ఆమెకు ఇస్లాం పట్ల కలిగిన అవ్యాజాభిమానానికి తార్కాణంగా అనేకసార్లు ఖురాన్ లాంటి ఉద్గ్రంధం, హిందీ అనువాదాన్ని అనేకసార్లు అధ్యయనం చేసింది. నేడు, ప్రజలు ఇస్లాం ను అర్ధం చేసుకునే ప్రయత్నం చెయ్యాలని, ముస్లిమ్‌లు తమ జీవితంలో ఇస్లాం ను పూర్తిగా అనుసరించాలని, ఇస్లామ్‌ పట్ట ప్రబలిపోయిన అపోహలను దూరం చేసి, ఇస్లామ్‌ బోధించే మహత్తర శిక్షణల్ని సామాన్య ప్రజలకు చేరవేయాలని ఆమె ఆవేదన చెందుతూ. ఉంటులది.

ఇదో వ్యక్తిగత లేఖ. దీన్ని ప్రచురించడం మూలాన సత్యప్రేమికుల ఆత్మలకు సన్మార్గ దర్శనం జరగాలని, మనం సత్యధర్మంపై స్ధిరంగా నిలబడగలగాలని, మృత్యువు సంభవించే వరకు ఇస్లామ్‌నే అనుసరించగలగాలని ఆకాంక్షిస్తూ అల్లాహ్‌ను వేడుకుంటున్నాను.

నసీమ్‌ గాజి
జూన్‌: 1980

చెడు అనుమానానికి దూరంగా ఉండండి [వీడియో]

చెడు అనుమానానికి దూరంగా ఉండండి | బులూగుల్ మరాం | హదీసు 1284
https://youtu.be/yLseG7LgNmM [6 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

1284. హజ్రత్‌ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకాకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తాకీదు చేశారు:

దురనుమానానికి దూరంగా ఉండండి. ఎందుకంటే దురనుమానం చాలా పెద్ద అబద్ధంగా పరిగణించబడుతుంది.” (బుఖారీ, ముస్లిం)

సారాంశం: దురనుమానం ఒక పెద్ద అసత్య విషయంగా పరిగణించబడటానికి కారణం ఏమిటంటే మనిషి తనలో తానే దాన్ని పెంచి పోషించుకుంటూ పోతాడు. ఆఖరికి అసలేమీ లేని దాన్ని గురించి ఏదో ఒక సందర్భంగా నోటితో చెప్పేస్తాడు. అందుకే విద్వాంసులు దీన్ని అభాండంగా, అపనిందగా ఖరారు చేశారు. ఒకరిపై అపనింద మోపటం నిషిద్ధం కదా! దీని ద్వారా తేటతెల్లమయిందేమిటంటే దురనుమానం అపనిందకు ఆనవాలు. అపనింద మహాపరాధం. పశ్చాత్తాపం చెందనిదే ఇది క్షమార్హం కాజాలదు. అందుకే వీలయినంత వరకు దీనికి దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే దురనుమానాలు, సంకోచాలు పుట్టిపెరిగే సమాజంలో సదనుమానం, సద్భావన అనేవి నిలదొక్కుకోలేవు. అలాంటి సమాజంలోని సభ్యుల మధ్య పరస్పర నమ్మకం, పరస్పర సహకార భావాల వాతావరణం కూడా ఏర్పడదు. ఒండొకరిని అడుగడుగునా శంకిస్తూ ఉంటారు. ఇది సమాజ అభ్యున్నతికి, వికాసానికి శుభ సూచకం కాదు సరికదా పతనానికి, అధోగతికి ఆనవాలు అవుతుంది. సత్సమాజ రూపకల్పనకు ఉపక్రమించినపుడు దురనుమానవు సూక్ష్మక్రిములను ఎప్పటికప్పుడు సంహరించటం అవసరం.

యూట్యూబ్ ప్లే లిస్ట్ – బులూగుల్ మరాం – కితాబుల్ జామి
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV266FkpuZpGacbo51H-4DV3

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1

ఇస్లాంలో జనాజా ఆదేశాలు – ఇక్బాల్ కైలానీ [పుస్తకం]

ఇస్లాంలో జనాజా ఆదేశాలు - ఇక్బాల్ కైలానీ  [పుస్తకం]


రచయిత: ముహమ్మద్ ఇక్బాల్ కైలానీ
అనువాదం: అబ్దుల్ బాసిత్ ఉమరీ
ఎడిటర్: అబ్దుర్ రవూఫ్ ఉమరీ
హదీసు పబ్లికేషన్స్, హైదరాబాద్ ఎ. పి., ఇండియా

మొబైల్ ఫ్రెండ్లీ బుక్

[ఇక్కడ పుస్తకం చదవండి / డౌన్లోడ్ చేసుకోండి]
https://bit.ly/janaza-adeshalu-mobile
[83 పేజీలు] [PDF] [మొబైల్ ఫ్రెండ్లీ బుక్] [18 MB]

డెస్క్ టాప్ బుక్

[ఇక్కడ పుస్తకం చదవండి / డౌన్లోడ్ చేసుకోండి]
https://bit.ly/janaza-adeshalu-desktop
[83 పేజీలు] [PDF]
 [డెస్క్ టాప్ బుక్] [16.4 MB]

విషయ సూచిక

ముస్లింను దూషించటం మహాపాపం.ఇక అతన్ని చంపటం అంటే అది అవిశ్వాసానికి ప్రతీక [వీడియో]

ముస్లింను దూషించటం మహాపాపం.ఇక అతన్ని చంపటం అంటే అది అవిశ్వాసానికి ప్రతీక| బులూగుల్ మరాం| హదీసు 1283
https://youtu.be/iNtNrlahhLM [9 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

1283. హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు:

ముస్లింను దూషించటం మహాపాపం. ఇక అతన్ని చంపటం అంటే అది అవిశ్వాసానికి, దైవధిక్కరణకు ప్రతీక” (బుఖారీ, ముస్లిం)

సారాంశం:

హదీసులో “ఫిస్ఖ్” అనే పదం ప్రయోగించబడింది. సాటి ముస్లింను దూషించినవాడు “ఫాసిఖ్‌” అవుతాడు. అంటే దైవవిధేయతా పరిమితిని దాటిపోయినవాడు, హద్దులను అతిక్రమిం చినవాడన్న మాట! హద్దులను అతిక్రమించినవాడు పాపాత్ముడు, అపరాధి అవుతాడు. ఇక ముస్లింను చంపటం అంటే విశ్వాసాన్ని (ఈమాన్‌ను) త్రోసిరాజనటమే. అకారణంగా ఎవరయినా సాటి ముస్లింను చంపడాన్ని తన కొరకు ధర్మసమ్మతం గావించుకుంటే అతడు ఇస్లాంతో తాను ఏకీభవించటం లేదని క్రియాత్మకంగా రుజువు చేస్తున్నాడు. కనుక అతని ఈ చేష్ట ‘కుఫ్ర్’ క్రిందికి వస్తుంది.

సహీహ్‌ ముస్లింలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు : “నా అనుచర సమాజ సభ్యులందరూ క్షేమంగా, నిక్షేపంగా ఉండదగ్గవారే. అయితే బహిరంగంగా, నిస్సంకోచంగా పాపాలకు ఒడిగట్టేవారు మాత్రం దీనికి అర్హులు కారు.పాపాత్మునికి పాపకార్యాలను గురించి జాగరూకపరచటం గురించి పండితుల మధ్య భిన్నాభిప్రాయా లున్నాయి. తబ్రానీలో హసన్‌ పరంపర ద్వారా సేకరించబడిన ఒక హదీసులో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా సెలవిచ్చారు:

“మీరు ఎప్పటి వరకు పాపాత్ముని ఘోరకృత్యాలను చెప్పకుండా ఉంటారు? అతని బండారం బయటపెట్టి తగిన శాస్తి జరిగేలా చూడండి.” ఈ హదీసు వెలుగులో దుర్మార్గుని దౌష్ట్య్రం నుండి ప్రజలు సురక్షితంగా ఉండగలిగేందుకు అతని దుర్మార్గాలను ఎండగడితే అది ముమ్మాటికీ ధర్మసమ్మతమే.


యూట్యూబ్ ప్లే లిస్ట్ – బులూగుల్ మరాం – కితాబుల్ జామి:
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV266FkpuZpGacbo51H-4DV3

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్:
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1

పురుషులు కాలి మడమలకు (ankles) దిగువ భాగాన అంగ వస్త్రాన్ని వదలటం హరామ్ [వీడియో]

పురుషులు కాలి మడమలకు (ankles) దిగువ భాగాన అంగ వస్త్రాన్ని వదలటం హరామ్ | బులూగుల్ మరాం | హదీస్ 1249
https://youtu.be/l6VwyD-T2Ro [ 8 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

1249. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచించారని హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

“అహంకారంతో తన అంగవస్త్రాన్ని పాదాల క్రిందికి వదలి, వెనుక ఈడ్చుకుంటూ నడిచే వ్యక్తి వైపు అల్లాహ్ దయాదృష్టితో చూడడు.” (బుఖారీ, ముస్లిం)

సారాంశం: పురుషులు కాలి మడమలకు దిగువ భాగాన అంగ వస్త్రాన్నిగానీ, దుప్పటిని గానీ వదలటం హరామ్ (నిషిద్ధం) అని ఈ హదీసు ద్వారా విదితమవుతున్నది. ఈ విధంగా వస్త్రాన్ని వదలటం అహంకారానికి, బడాయికి నిదర్శనం.

యూట్యూబ్ ప్లే లిస్ట్ – బులూగుల్ మరాం – కితాబుల్ జామి
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV266FkpuZpGacbo51H-4DV3

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1

మీలో ఎవరూ నిలబడి నీళ్ళు త్రాగరాదు [వీడియో]

మీలో ఎవరూ నిలబడి నీళ్ళు త్రాగరాదు | బులూగుల్ మరాం | హదీస్ 1246
https://youtu.be/K_dzRSUXsPQ [5 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

1246. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు: “మీలో ఎవరూ నిలబడి నీళ్ళు త్రాగరాదు.” (ముస్లిం)

సారాంశం: నిలబడి నీళ్ళు త్రాగటాన్ని ఈ హదీసు వారిస్తుంది. ఈ వారింపును మెజారిటీ విద్వాంసులు నహీయె తన్జీహీ’గా పరిగణించారు. అయితే ఇబ్నె హజమ్ గారు నిలబడి నీరు త్రాగటం నిషిద్ధం (హరామ్) అని అభిప్రాయపడ్డారు. మరికొంతమంది పండితులు నిలుచుని నీళ్ళు త్రాగటాన్ని ‘మక్రూహ్’ (అవాంఛనీయం, అయిష్టకర విషయం)గా తలపోశారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు జమ్ జమ్ జలాన్ని నిలబడి త్రాగినట్లు ఆధారముంది. బహుశా ఈ కారణంగానే మెజారిటీ విద్వాంసులు ఈ వారింపును ‘నిషిద్దాంశం’గా పేర్కొనలేదేమో!

యూట్యూబ్ ప్లే లిస్ట్ – బులూగుల్ మరాం – కితాబుల్ జామి :
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV266FkpuZpGacbo51H-4DV3

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్:
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1

ఒక వ్యక్తి కపటి అవడానికి మూడు ఆనవాళ్ళు ఉంటాయి [వీడియో]

ఒక వ్యక్తి కపటి అవడానికి మూడు ఆనవాళ్ళు ఉంటాయి | బులూగుల్ మరాం | హదీసు 1282
https://youtu.be/SP78J9l4YSA [21 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

1282. హజ్రత్‌ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు:

ఒక వ్యక్తి కపటి అవడానికి మూడు ఆనవాళ్ళు ఉంటాయి –

1) మాట్లాడినపుడు అతడు అబద్ధం చెబుతాడు.
2) వాగ్దానం చేస్తే దాన్ని భంగపరుస్తాడు.
3) అతని దగ్గర ఏదన్నా అప్పగింత (అమానతు)గా పెడితే అందులో ద్రోహానికి పాల్పడతాడు
(బుఖారీ, ముస్లిం).

బుఖారీ, ముస్లింల లోనే అబ్దుల్లాహ్ బిన్‌ ఉమర్‌ (రదియల్లాహు అన్హు) కథనంలో ఇలా వుంది: “పోట్లాటకు దిగినపుడు తిట్ల పురాణం మొదలెడతాడు.”

సారాంశం: ఈ హదీసులో ‘కపటి” యొక్క నాలుగు గుర్తులు సూచించబడ్డాయి. “వాడు నమాజ్‌ చేసినప్పటికీ, ఉపవాసాలు పాటించినప్పటికీ తాను ముస్టింనని అతను ప్రకటించుకున్నప్పటికీ” (ఈ లోపాలు మాత్రం అతనిలో ఉంటాయి) అని ‘ముస్లిం’లో అదనంగా ఉంది. ఇమామ్‌ నవవీ (రహిమహుల్లాహ్) ఈ సందర్భంగా ఇలా అంటున్నారు – “చాలామంది పరిశోధకులైన విద్వాంసుల అభిప్రాయం ప్రకారం ఈ అవలక్షణాలు కపటులలో ఉండేది నిజమే, కాని ఒక నికార్సయిన విశ్వాసిలో కూడా ఈ అవలక్షణాలు జనిస్తే అతను కూడా ‘కపటిలాంటివాడు” గానే భావించబడతాడు. అంటే అతని స్వభావాన్నిబట్టి ఆ పదం అతని కోసం ప్రయోగించ బడుతుంది.

కపటత్వం కు (నిఫాఖ్) సంబంధించిన క్రింది లింకులు చదవండి:

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1

యూట్యూబ్ ప్లే లిస్ట్ – బులూగుల్ మరాం – కితాబుల్ జామి
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV266FkpuZpGacbo51H-4DV3