teluguislam.net
ఎడ తెగని పుణ్యం
సూరా బఖర చివరి రెండు ఆయతులు
మీలో ఎవరైనా ఖురాన్ లోని మూడో వంతు భాగం ఒక రాత్రిలో చదవలేడా?
అతి పెద్ద పాపం ఏమిటి?
హాఫిజుల్ ఖురాన్ గొప్పతనం
ముఅజ్జిన్ పలికినట్లు పలికి ప్రవక్త ఫై దరూదు చదవటం
అల్లాహ్ కి సాటి కల్పించడం (బహుధైవారాధన) ఘోరమైన అన్యాయం
78. హజ్రత్ అబ్దుల్లా బిన్ మాస్ వూద్ (రధి అల్లాహు అన్హు) కధనం :-
“సత్యాన్ని విశ్వసించి, తమ విశ్వాసానికి ఎలాంటి అన్యాయం తలపెట్టని వారికే శాంతి లభిస్తుంది; అలాంటి వారే నిజానికి సన్మార్గగాములు” అనే ఖుర్ ఆన్ సూక్తి అవతరించినప్పుడు ముస్లింలు భయపడిపోయి “దైవప్రవక్తా! మాలో ఆత్మలకు అన్యాయం చేసుకోని వారెవరున్నారు?” అని అడిగారు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు. “ఇక్కడ అన్యాయం అంటే మీరు సాధారణంగా భావిస్తున్న అన్యాయం కాదు, ఈ సూక్తిలో అన్యాయం అంటే షిర్క్ (బహుధైవారాధన) అని అర్ధం. (ఖుర్ ఆన్ లో) హజ్రత్ లుఖ్మాన్ (అలైహిస్సలాం) తన కుమారునికి హితభోద చేస్తూ ‘కుమారా! అల్లాహ్ కి ఏ శక్తినీ సాటి కల్పించకు. అల్లాహ్ కి సాటి కల్పించడం (బహుధైవారాధన) ఘోరమైన అన్యాయం’ అని పలికిన మాటలు మీకు తెలియవా?”
[సహీహ్ బుఖారీ : 60 వ ప్రకరణం – అంబియా, 41 వ అధ్యాయం – ఖౌలుల్లాహ్ తాలా వలఖద్ ఆతైనా లుఖ్మాన్]
విశ్వాస ప్రకరణం : 53 వ అధ్యాయం – అవిశ్వాసులు తమ అవిశ్వాస జీవితంలో చేసిన సత్కార్యాలకు ఇస్లాం స్వీకరణ తరువాత పుణ్యఫలం లభిస్తుందా?
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్
“ఇస్లాం సంప్రదాయం ప్రకారం కాకుండా వేరే మత సంప్రదాయం ప్రకారం ప్రమాణం చేసినవాడు ..
70. హజ్రత్ సాబిత్ బిన్ జహాక్ (రధి అల్లాహు అన్హు) కధనం :-
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు : “
-
ఇస్లాం సంప్రదాయం ప్రకారం కాకుండా వేరే మత సంప్రదాయం ప్రకారం ప్రమాణం చేసినవాడు తను ప్రమాణం చేసిన విషయం లాంటివాడే అవుతాడు (అంటే ఆ మతానికి చెందిన వ్యక్తిగానే పరిగణించబడతాడు).
- తన శక్తి పరిధిలో లేని విషయం గురించి మొక్కుబడి చేసుకున్నవాడు అలాంటి మొక్కుబడి నెరవేర్చనవసరం లేదు.
- ఆత్మహత్య చేసుకున్నవాడు ఇహలోకంలో తనను తాను ఏ వస్తువుతో హతమార్చుకున్నాడో ప్రళయదినాన అతడ్ని అదే వస్తువుతో శిక్షించడం జరుగుతుంది.
-
విశ్వాసిని హత్యచేయడం ఎంత ఘోరమైన పాపమో, అతడ్ని దూషించడం కూడా అంతే (ఘోరమైన) పాపకార్యమవుతుంది. అలాగే అతనిపై సత్యతిరస్కార (కుఫ్ర్) అపనిందను మోపడం కూడా అంతే (ఘోరమైన) పాపకార్యమవుతుంది. (*)
(*) ఇది ఒక హెచ్చరికగా, మందలింపుగా పేర్కొనబడింది. నవవి (రహ్మలై) గారి ప్రకారం మనిషి హృదయాలలో ఇస్లాం పట్ల నిజమైన విశ్వాసం ఉంటే అతను అవిశ్వాసి కాజాలడు. ఒకవేళ అతని హృదయంలో ఇస్లాం కి బదులు ఇతర ధర్మాల పట్ల ఔన్నత్యభావం ఉంటే అతను తప్పకుండా అవిశ్వాసి అవుతాడు.
[సహీహ్ బుఖారీ : 78 వ ప్రకరణం – అదబ్, 44 వ అధ్యాయం – మాయన్హా మినస్సిబాబివల్లాన్]
విశ్వాస ప్రకరణం – 45 వ అధ్యాయం – ఆత్మహత్య చేసుకున్నవాడికి నరకంలో అదే శిక్ష, నిజమైన ముస్లిం కే స్వర్గ ప్రవేశం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-2. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్
అల్లాహ్ ఎవరినైనా అభిమానిస్తే అతడ్ని తన దాసులకు అభిమాన పాత్రుడిగా చేస్తాడు
1692. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-
అల్లాహ్ ఏ దాసుడిని అయినా అభిమానిస్తే జిబ్రయీల్ (అలైహిస్సలాం) ని పిలిచి “అల్లాహ్ ఫలానా వ్యక్తిని అభిమానిస్తున్నాడు కనుక నీవు కూడా అతడ్ని అభిమానించు” అని అంటాడు. అందుచేత జిబ్రయీల్ (అలైహిస్సలాం) అతడ్ని అభిమానించడం ప్రారంభిస్తారు. తరువాత ఆయన ఆకాశంలో ఒక ప్రకటన గావిస్తూ “అల్లాహ్ ఫలానా వ్యక్తిని అభిమానిస్తున్నాడు. కనుక మీరంతా అతడ్ని అభిమానించండి” అని అంటారు. దాంతో ఆకాశవాసులంతా (అంటే దైవదూతలందరూ) అతడ్ని అభిమానించడం మొదలెడతారు. చివరికి భూమిపై కూడా అతనికి ప్రజాదరణ లభిస్తుంది.
[సహీహ్ బుఖారీ : 97 వ ప్రకరణం – అత్తౌహీద్, 33 వ అధ్యాయం – కలామిర్రబ్బి మఅ జిబ్రయీల్]
సామాజిక మర్యాదల ప్రకరణం – 48 వ అధ్యాయం – అల్లాహ్ ఎవరినైనా అభిమానిస్తే అతడ్ని తన దాసులకు అభిమాన పాత్రుడిగా చేస్తాడు
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-2. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్







You must be logged in to post a comment.