బైతుల్ మఖ్దిస్ (మస్జిద్ అల్ అఖ్సా) యొక్క పది ప్రత్యేకతలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్] 

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه 

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسۡلِمُونَ١٠٢ 

يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا١ 

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَقُولُواْ قَوۡلٗا سَدِيدٗا٧٠ يُصۡلِحۡ لَكُمۡ أَعۡمَٰلَكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ فَازَ فَوۡزًا عَظِيمًا٧١ 

మొదటి ఖుత్బా :-  

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత : 

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.

ఓ ముస్లిం లారా! అల్లాహ్ దైవభీతి కలిగి ఉండండి. మరియు ఆయనకు విధేయత చూపండి, అవిధేయత నుండి జాగ్రత్త వహించండి. మరియు తెలుసుకోండి! అల్లాహ్ కొన్నింటిపై కొన్నింటికి ప్రాధాన్యతను ప్రసాదించాడు. దైవదూతలలో కొందరికి కొందరిపై మరియు దైవప్రవక్తలలో కొందరికి కొందరిపై ప్రాధాన్యతను ఇచ్చాడు. మరియు సమయాలలో, ప్రదేశాలలో కొన్నింటికి కొన్నింటిపై ప్రాధాన్యత ప్రసాదించాడు. అందులో నుండి ఒకటి బైతుల్ మఖ్దిస్. దీనిని (అల్-ఖుద్స్) అని పిలుస్తారు. దీనికి ఇతర ప్రదేశాలపై ఆధిక్యత ఇవ్వబడింది. ఇది అల్లాహ్ యొక్క వివేకము మరియు ఆయన యొక్క గొప్ప ఎంపిక కూడా. అల్లాహ్ ఇలా అంటున్నాడు:  

وَرَبُّكَ يَخْلُقُ مَا يَشَاءُ وَيَخْتَارُ

(నీ ప్రభువు తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు, తాను కోరిన వారిని ఎంపిక చేసుకుంటాడు.)  (28:68)

బైతుల్ మఖ్దిస్ అనగా: షిర్క్ లాంటి దురాచారాల నుండి పవిత్రమైన ఇల్లు. 

1. మొదటి ప్రత్యేకత: సర్వోన్నతుడైన అల్లాహ్ దివ్య ఖురాన్’లో దీనిని శుభవంతమైనదిగా పేర్కొన్నాడు. 

అల్లాహ్ ఇలా అంటున్నాడు: 

سُبْحَانَ الَّذِي أَسْرَىٰ بِعَبْدِهِ لَيْلًا مِّنَ الْمَسْجِدِ الْحَرَامِ إِلَى الْمَسْجِدِ الْأَقْصَى الَّذِي بَارَكْنَا حَوْلَهُ

(తన దాసుణ్ణి రాత్రికి రాత్రే మస్జిదె హరామ్‌ నుండి మస్జిదె అక్సా వరకు తీసుకుపోయిన అల్లాహ్‌ పరిశుద్ధుడు. దాని పరిసరాలను మేము శుభవంతం చేశాము.) (17:1)

2. రెండవ ప్రత్యేకత ఏమిటంటే; అల్లాహ్ దీనిని మూసా (అలైహిస్సలాం) వారి నోట పవిత్రమైనది అని వర్ణించాడు: 

يَا قَوْمِ ادْخُلُوا الْأَرْضَ الْمُقَدَّسَةَ الَّتِي كَتَبَ اللَّهُ لَكُمْ

(నా జాతివారలారా! అల్లాహ్‌ మీకు రాసిపెట్టిన ఈ పవిత్ర ప్రదేశంలో ప్రవేశించండి) (5:21)

3.  బైతుల్ మఖ్దిస్ యెుక్క మరో ప్రత్యేక ఏమిటంటే; సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తన ప్రవక్త మూసాకు అక్కడి నివాసులతో పోరాడమని ఆజ్ఞాపించాడు. వీరు పొడవాటి, కఠినమైన స్వభావం గల, క్రూరమైన వ్యక్తులు. మరియు వారి ఆధీనం నుండి పవిత్ర భూభాగాన్ని తీసి, ఏకేశ్వరోపాసనను అక్కడ సాధారణం చేయమని, బహుదేవతారాధనను అక్కడి నుండి తొలగించమని ప్రవక్తకు ఆదేశించాడు. అప్పుడు మూసా తన ప్రజలను ఉద్దేశించి ఇలా అన్నాడు:  

يَا قَوْمِ ادْخُلُوا الْأَرْضَ الْمُقَدَّسَةَ الَّتِي كَتَبَ اللَّهُ لَكُمْ وَلَا تَرْتَدُّوا عَلَىٰ أَدْبَارِكُمْ فَتَنقَلِبُوا خَاسِرِينَ

(“నా జాతివారలారా! అల్లాహ్‌ మీకు రాసిపెట్టిన ఈ పవిత్ర ప్రదేశంలో ప్రవేశించండి. వెన్నుచూపి మరలిపోకండి. వెన్నుచూపి మరలిపోయారంటే మీరే నష్టపోతారు.”) (5:21)

4. బైతుల్ మఖ్దిస్ మరొక ప్రత్యేక ఏమిటంటే; మూసా అల్లాహ్‌తో ఈ విధంగా ప్రార్థించినట్లు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మనకు తెలియజేసారు. 

మూసా తన మరణ సమయం వచ్చినప్పుడు, బైతుల్ మఖ్దిస్ నుండి ఒక రాయి విసిరివేయబడే దూరంలో ఉంచాలని  అల్లాహ్ ను ప్రార్థించారు. ఎందుకంటే అక్కడే మరణించాలన్నది ఆయన కోరిక!  దీనికి ఏకైక కారణం ఆయన బైతుల్ మఖ్దిస్ ను అంతగా ప్రేమించడం. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “నేను అక్కడ ఉంటే, నేను మీకు ఆయన  సమాధిని చూపించేవాడిని, అది ఎర్ర దిబ్బకు దారి దగ్గరలో ఉన్నది“. (బుఖారి) 

5. బైతుల్ మఖ్దిస్ యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే; యూషా బిన్ నూన్ బైతుల్ మఖ్దిస్ యొక్క క్రూరమైన ప్రజలకు వ్యతిరేకంగా పోరాడినప్పుడు, అల్లాహ్ వారి కోసం సూర్యుడిని నిలిపివేశాడు (అనగా దానిని కదలకుండా ఆపాడు) ఎందుకంటే రాత్రి సమీపిస్తుంది, తన వెంట సైన్యం ఉంది, కాబట్టి ఆయన సూర్యుడిని (అస్తమించకుండా) ఆపమని అల్లాహ్‌ను ప్రార్థించాడు, తద్వారా అతను చీకటి పడకముందే పట్టణంలోకి ప్రవేశించి వారితో పోరాడవచ్చు, కాబట్టి అల్లాహ్ వారి విన్నపాన్ని అంగీకరించాడు మరియు వారు బైతుల్ మఖ్దిస్ ను జయించారు. 

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా తెలియచేశారు: “నిశ్చయంగా, సూర్యుడు ఏ మానవుని కోసం ఎన్నడూ నిలిపివేయబడలేదు. నూన్ కుమారుడైన యూషా కొరకు తప్ప, ఇది వారు జెరూసలేంకు వెళ్ళే రోజుల్లో జరిగిన విషయం”. (అహ్మద్) 

6. బైతుల్ మఖ్దిస్ యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే; బైతుల్ మఖ్దిస్ ను జయించడం పునరుత్థాన దినం యొక్క చిహ్నాలలో ఒకటి, ఇది ఔఫ్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) గారు ఇలా తెలియచేశారు: నేను తబూక్ యుద్ధ సందర్భంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి సేవలో హాజరయ్యాను. అప్పుడు ఆయన ఒక తోలు గుడారంలో ఉన్నారు. మరియు ఇలా తెలియజేశారు; “ప్రళయానికి సంబంధించి ఆరు సూచనలు ఉన్నాయి అందులో ఒకటి నా మరణం మరియు బైతుల్ మఖ్దిస్ ను జయించడం”.  (బుఖారి)  

7. బైతుల్ మఖ్దిస్ యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే: దజ్జాల్ ఇందులోకి ప్రవేశించలేడు మరియు అతను దీని సమీపంలోనే చంపబడతాడు. మర్యమ్ కుమారుడు అయిన మసీహ్ అలైహిస్సలాం వారు అతన్ని “బాబే లుద్ధ” దగ్గర చూడగానే హత మార్చుతారు.  “బాబే లుద్ధ” ఇది బైతుల్ మఖ్దిస్ కు సమీపంలో ఉన్న ఒక ప్రదేశం.  

8. బైతుల్ మఖ్దిస్ యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే; అవిశ్వాసుల నాయకులు మరియు వారి ప్రముఖులు పాలస్తీనాలోనే చంపబడతారు, కాబట్టి వాస్తవానికి అక్కడ జరిగే యుద్ధంలో దజ్జాల్ కూడా చంపబడతాడు. దీనిలో దజ్జాల్ యూదుల నాయకుడిగా ఉంటాడు, అప్పుడు ఈసా అలైహిస్సలాం తన సైన్యంతో దజ్జాల్‌ను మరియు అతని సైన్యాన్ని చంపుతారు. అంతేకాదు ఆయనపై నిజంగా విశ్వాసాన్ని తీసుకురాని క్రైస్తవులందరినీ కూడా చంపుతారు (అనగా ఆయన (ప్రవక్త)గా పంపబడిన మానవుడని విశ్వసించని వారు). అదేవిధంగా క్రైస్తవుల పందులను కూడా చంపుతారు మరియు వారు పూజించే వారి శిలువను విరిచేస్తారు. ఈ సంఘటనలన్నీ పాలస్తీనాలో జరుగుతాయి.(ముస్లిం) 

9. బైతుల్ మఖ్దిస్ యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే; మర్యమ్ కుమారుడైన ఈసా నాయకత్వంలో, ముస్లింలు మరియు యూదుల మధ్య యుద్ధం జరిగినప్పుడు, చెట్లు మరియు రాళ్ళు యూదులను అవమానపరుస్తాయి.

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు: “ముస్లింలు యూదులకు వ్యతిరేకంగా యుద్ధం చేయనంతవరకు ప్రళయ దినం సంభవించదు. అందులో ముస్లింలు యూదులను హతమార్చుతారు చివరికి వారు ఏదైనా రాయి లేదా చెట్టు వెనక దాగి ఉంటే ఆ చెట్టు మరియు రాయి ఇలా అంటాయి – ’ ఓ ముస్లిం! ఓ అల్లాహ్ దాసుడా! ఇదిగో నా వెనుక ఒక యూదుడు దాగి ఉన్నాడు ముందుకు సాగి అతన్ని హతమార్చు’ ఒక గర్ఖద్ వృక్షం తప్ప, ఎందుకంటే అది ఒక యూద వృక్షం”.(బుఖారి, ముస్లిం) 

10. బైతుల్ మఖ్దిస్ యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే; దాని లోపల అల్ అఖ్సా మస్జిద్ ఉంది, ఇది మూడు గొప్ప మస్జిద్ లలో ఒకటి. దీని ఔన్నత్యం ఖురాన్ మరియు హదీసుల ద్వారా నిరూపించబడినది. 

మొదటి కారణం: మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఒకే రాత్రిలో మస్జిదె హరమ్ నుండి మస్జిదె అఖ్సా వరకు తీసుకెళ్లబడ్డారు. ఆ తర్వాత ప్రవక్త వారికి మేరాజ్ గగనయాత్ర చేయించడం జరిగింది. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు: 

سُبْحَانَ الَّذِي أَسْرَىٰ بِعَبْدِهِ لَيْلًا مِّنَ الْمَسْجِدِ الْحَرَامِ إِلَى الْمَسْجِدِ الْأَقْصَى

(తన దాసుణ్ణి రాత్రికి రాత్రే మస్జిదె హరామ్‌ నుండి మస్జిదె అక్సా వరకు తీసుకుపోయిన అల్లాహ్‌ పరిశుద్ధుడు.) (17:1)

రెండవ కారణం: మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు మేరాజ్ గగనయాత్ర సందర్భంగా మస్జిదె అఖ్సా లోపల ప్రవక్తలందరికి ఇమామత్ చేయించారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “అప్పుడు నమాజ్ సమయం కాగానే నేను వారికి ఇమామత్ చేసాను“.(ముస్లిం) 

మూడవ కారణం: మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారికి అల్లాహ్ తఆల మస్జిదె అఖ్సాను మక్కా లో ఉండగానే ప్రత్యక్షంగా చూపించాడు.  మక్కా అవిశ్వాసులు మస్జిదె అఖ్సా పర్యాటన గురించి తెలిపినప్పుడు, వారందరూ తిరస్కరించారు. మరియు ప్రవక్తను మాట్లాడకుండా ఉండనిచ్చేందుకుగాను’ ఆ మస్జిద్ యొక్క లక్షణాలను గురించి ప్రశ్నించారు, అప్పుడు అల్లాహ్ మస్జిదె అఖ్సాను ప్రవక్త గారి కొరకు ఉన్నతం చేసి ప్రత్యక్షంగా చూపించాడు. మరియు ప్రవక్త వారు ఆ అవిశ్వాసుల ఎదుట ఆ భవనం యొక్క ఒక్కొక్క లక్షణాన్ని తెలియజేశారు. జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రజి) కథనం ప్రకారం మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా తెలియజేశారు: మేరాజ్ సంఘటన గురించి ఖురైష్ నన్ను తిరస్కరించినప్పుడు, నేను (కాబా)  రాయి వద్ద నిలబడ్డాను. అప్పుడు అల్లాహ్ మొత్తం బైతుల్ మఖ్దిస్ ను నా ముందు ఉంచాడు. నేను దానిని చూసాను మరియు దాని లక్షణాలను ఒక్కొక్కటిగా వివరించడం ప్రారంభించాను.(బుఖారి, ముస్లిం) 

4. నాల్గోవ కారణం: ఇది ముస్లింల యొక్క మొదటి ఖిబ్లా. బరా బిన్ ఆజిబ్ (రదియల్లాహు అన్హు) కథనం ఆయన ఇలా అన్నారు: “మేము ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారితో పదహారు లేక పదిహేడు నెలల వరకు బైతుల్ మఖ్దిస్ వైపు తిరిగి నమాజ్ చదివాము ఆ తరువాత మాకు కాబా వైపు తిరగమని ఆదేశించ బడింది“. (బుఖారి, ముస్లిం) 

5. ఐదవ కారణం: ఇది పుణ్య సంకల్పంతో సందర్శించడానికి అనుమతి ఇవ్వబడిన మస్జిదులలో ఒకటి. దీని ఆధారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు హదీసులో ఇలా తెలియజేశారు: “పుణ్యఫలాన్ని ఆశించి కేవలం మూడు మస్జిదుల వైపు ప్రయాణం చేయవచ్చు అవి మస్జిదుల్ హరామ్, మస్జిదె అఖ్సా, మరియు నా మస్జిద్ (మస్జీదె నబవీ)“.(బుఖారి, ముస్లిం) 

6. ఆరవ కారణం: ఇందులో చదవబడేటువంటి నమాజ్ ఇతర మస్జిదులలో చదవబడే 250నమాజుల కంటే  రెట్లు ఉన్నతమైనది అబూ జర్ (రదియల్లాహు అన్హు) గారు ఇలా తెలియజేశారు మేము మహా ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి వద్ద కూర్చుని ఉండగా మా మధ్య ఒక సంభాషణ చెలరేగింది అదేమిటంటే గొప్ప మస్జిద్ ఏది? మస్జిదె నబవీ లేక బైతుల్ మాఖ్దిస్! అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం వారు ఇలా తెలియజేశారు: “నా మస్జిద్ అనగా (మస్జీదె నబవీ) లో చదవబడే ఒక నమాజ్ మస్జిదె అఖ్సాలో చదవబడే నాలుగు నమాజులతో సమానము“. (తబ్రానీ) 

ఓ అల్లా దాసులారా! ప్రవక్త మసీదులో చేసే నమాజ్ వెయ్యి నమాజుల కంటే గొప్పది, మస్జిదె అఖ్సాలో చేసే నమాజ్ 250 నమాజుల కంటే గొప్పది, ఎందుకంటే ఇది ప్రవక్త మసీదులో చేసే ప్రార్థనలో నాలుగింట ఒక వంతుకు సమానం. 

7. ఏడవ కారణం: ఇది ఈ భూమండలంపై నిర్మించబడినటువంటి రెండవ మస్జిదు. అబూజర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ఆయన, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఈ భూమిపై నిర్మించబడిన మొట్టమొదటి మస్జిద్ ఏది? అని అడిగారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ‘మస్జిదుల్ హరామ్’ అని జవాబిచ్చారు. ఆయన తర్వాత? అని అడిగారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ‘మస్జిదె అఖ్సా’ అని అన్నారు. ఆయన ఈ రెండు మస్జిద్ ల మధ్య ఎంత వ్యవధి ఉంది? అని అడిగారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) 40 సంత్సరాలు అని అన్నారు. (బుఖారీ, ముస్లిం) 

8. ఎనిమిదవ కారణం: దీనిని సులైమాన్ బిన్ దావూద్ అలైహిస్సలాం పునర్నిర్మించారు. మరియు అందులో ప్రార్థించే వారి పాపాలను క్షమించమని అల్లాహ్‌ను ప్రార్థించాడు, కాబట్టి సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఆయన ప్రార్థనను స్వీకరించాడు.

అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం’ ప్రకారం ఆయన ఇలా అన్నారు. సులైమాన్ బిన్ దావూద్ అలైహిస్సలాం బైతుల్ మఖ్దిస్ నిర్మించినప్పుడు, అల్లాహ్‌ను మూడు విషయాల గురించి ప్రార్థించాడు. మొదటిది ఓ అల్లాహ్’ ప్రజల సమస్యల పట్ల నేను తీసుకునే నిర్ణయాలు నీ నిర్ణయానికి అనుగుణంగా ఉండే విధంగా చేయి. ఇది వారికి ప్రసాదించబడింది, ఆ తర్వాత అల్లాహ్’ ను ఎవ్వరికీ ప్రసాదించబడని రాజ్యాన్ని నాకు ప్రసాదించు, అని ప్రార్థించారు. ఇది కూడా వారికి ప్రసాదించబడింది, మసీదు నిర్మాణం పూర్తి చేసిన తర్వాత మళ్లీ అల్లాహ్ ను ఈ విధంగా ప్రార్థించారు “ఏ వ్యక్తి అయితే కేవలం అందులో నమాజ్ చదివేటువంటి సంకల్పంతో వస్తాడో’  అతని పాపాలను క్షమించు ఏ విధంగానైతే తల్లి గర్భము నుండి అప్పుడే వచ్చిన శిశువు పాపరహితుడుగా ఉంటాడో అదేవిధంగా అతన్ని క్షమించు“. (అహ్మద్) 

9. తొమ్మిదోవ కారణం: సులైమాన్ అలైహిస్సలాం కంటే ముందు వచ్చిన ప్రవక్తలు కూడా మస్జిదే అఖ్సాను పునర్నిర్మించారు ఉదాహరణకు ఇబ్రహీం మరియు యాకూబ్ అలైహిముస్సలాం. 

10. పదవ కారణం: మస్జిదే అఖ్సాను జయించిన వ్యక్తి రెండవ ఖలీఫా ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) గారు. ఆయన పరిపాలనలో ముస్లింల సైన్యం అబూ ఉబైదా బిన్ జర్ర గారి న్యాయకత్వంలో క్రీస్తు శకం 636 సంవత్సరములో ఆ నగరాన్ని ముట్టడించారు. ముట్టడించిన ఆరు నెలల వ్యవధి తరువాత నస్రానీయుల నాయకుడు అన్నాడు – ఉమర్ బిన్ ఖత్తాబ్ గనుక ఇక్కడికి వస్తే మేము లొంగిపోతాము.  

కావున హిజ్రీ 16వ సంవత్సరం ఖలీఫా ఉమర్ (రదియల్లాహు అన్హు)  వారు ఆ నగరాన్ని ఇస్లామీయ నగరంగా ప్రకటించేందుకుగాను బైతుల్ మఖ్దిస్’కు వెళ్లారు. కావున ఆయన అదే ద్వారం గుండా మస్జిదె అఖ్సా లోకి ప్రవేశించారు ఏ ద్వారం గుండా నైతే మేరాజ్ రాత్రి  ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ప్రవేశించారో. 

 ఆ తరువాత మెహ్రాబె దావూద్ ప్రదేశంలో రెండు రకాతులు (తహియ్యతుల్ మస్జిద్) చదివారు, రెండవ రోజు ఫజర్ నమాజులో ప్రజలకు ఇమామత్ చేయించారు. మొదటి రకాతులో సూరె స్వాద్ మరియు రెండవ రకాతులో సూరె బనీ ఇస్రాయిల్ పటించారు. ఆ తరువాత ఉమర్ వారు ఒక ఒప్పందాన్ని వ్రాశారు, అందులో సిరియా క్రైస్తవులకు సంబంధించిన నిబంధనలు నమోదు చేయబడ్డాయి మరియు ముస్లింలు నస్రానీలకు ఇవ్వబడేటువంటి హక్కులు కూడా నమోదు చేయబడ్డాయి మరియు ఇస్లామియా చట్టం కింద ఫలస్తినాలో నివసించే వారు నెరవేర్చవలసిన మొదటి హక్కు ఏమిటంటే’ ఇస్లామియా రాజ్యంలో ముస్లింల మధ్య శాంతి భద్రత మరియు గౌరవంతో జీవిస్తున్నందుకుగాను బదులుగా వారికి (జిజ్యా) పన్ను చెల్లించాలి. (అల్ బిదాయ వన్ నిహాయ) 

ఓ అల్లాహ్ దాసులారా! ఇవి బైతుల్ మఖ్దిస్ యొక్క ఔన్నత్యానికి సంబంధించిన 10 ప్రత్యేకతలు. కాబట్టి ప్రతి ముస్లిం వీటి గురించి తెలుసుకోవాలి. మరియు తమ సంతానానికి నేర్పించాలి, ఎందుకంటే పాలస్తీనా సమస్య భౌతిక సమస్య కాదు, ఇది మన విశ్వాసానికి సంబంధించిన సమస్య. ఈ విషయంలో నిర్లక్ష్యం మరియు ఏమరపాటు వల్ల మన ధర్మానికి నష్టం వాటిల్లుతుంది, ఈ భూమండలంపై వచ్చినటువంటి ఎంతో గొప్ప రాజులు సైతం పాలస్తీనా నుండి యూదులను అంతం చేయుటకు ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ ఇందులో కొందరు ద్రోహానికి పాల్పడటం ముఖ్యంగా ఈ ఉమ్మత్ లో ఉన్నటువంటి ఇరాన్ రాఫిజీలు వీరు ముఖ్యంగా షిర్క్ ని వ్యాపింప చేయుటకు ప్రయత్నిస్తుంటారు. ఈ కారణంగా అంతం చేయలేకపోయారు. కానీ ఈ పాలస్తీనాను ఉమర్ ఆ తర్వాత సలహుద్దీన్ ఇద్దరూ జయించారు. 

అల్లాహ్ ఖుర్ఆన్  యొక్క శుభాలను మన జీవితాలలో వర్షింప చేయుగాక! ఆయన వివేకం తో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక! అల్లాహ్ మనందరిని క్షమించుగాక, మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి నిశ్చయంగా ఆయన (తౌబా)  పశ్చాత్తాపం చెందే వారిని తప్పక  మన్నిస్తాడు.    

స్తోత్రం మరియు దరూద్ తరువాత  

ఓ విశ్వాసులారా! ఓ అల్లాహ్ దాసులారా! యూదులు అనే విషయం ఏమిటంటే ప్రవక్త సులైమాన్ అలైహిస్సలాం మస్జిదే అఖ్సాను నిర్మించారు. మరియు మేము ఆయన వారసులం, కాబట్టి వారు మస్జిదే అఖ్సాకు అత్యంత అర్హులని యూదులు పేర్కొన్నారు, అయితే ఈ విషయం ఈ క్రింది ఏడు కారణాల వల్ల పూర్తిగా తప్పు: 

మొదటి కారణం: సులైమాన్ అలైహిస్సలాం మస్జిదే అఖ్సాను నిర్మించలేదు కానీ దానిని పునర్నిర్మించారు, దీని నిర్మాణం సులేమాన్ అలైహిస్సలాం కంటే ఎంతో ముందు జరిగింది. ఒక వాక్యం ప్రకారం ఆదం అలైహిస్సలాం వారు దానిని నిర్మించారు. దీని గురించి పండితుల అనేక వాక్యాలు ఉన్నాయి. 

రెండవ కారణం: మస్జిదే అఖ్సా యొక్క పునర్నిర్మాణం సులైమాన్ అలైహిస్సలాం గారి కంటే ముందు వచ్చిన ప్రవక్తలు కూడా దీనిని పునర్నిర్మించారు. ఉదాహరణకు; ఇబ్రహీం, యాఖూబ్ వాళ్లు దీనిని తిరిగి నిర్మించడానికి గల కారణం ఏమిటంటే, ఏకేశ్వరోపాసకులు అల్లాహ్ ను ఆరాధించుట కొరకు మాత్రమే’ అంతేకానీ, యూదుల కొరకు నిర్మించబడ లేదు.  

మూడవ కారణం: సులైమాన్ అలైహిస్సలాం వారు ఏకేశ్వరోపాసకులు. కానీ’ యూదులు తమ ప్రవక్తల మార్గాన్ని అనుసరించలేకపోయారు, అంతేకాదు వారితో శత్రుత్వం వహించారు, తౌరాత్ మరియు ఇంజీల్ గ్రంథాలను వక్రీకరించారు, మరియు అవిశ్వాసానికి పాల్పడ్డారు. బనీ ఇస్రాయీల్ కాలంలోనే యూదులు వారి అవిశ్వాసం వలన ఇస్రాయీలుల నుండి వేరు చేయబడ్డారు. నూహ్ తన కుమారుడు నుండి వేరు చేయబడ్డాడు, ఇబ్రహీం తన తండ్రి హాజరు నుండి వేరు చేయబడ్డాడు, మహమ్మద్ తన బాబాయి అబూ లహబ్ నుండి వేరు చేయబడ్డాడు. అనగా అవిశ్వాసం ముస్లింలు మరియు అవిశ్వాసుల మధ్య స్నేహం మరియు సంబంధాన్ని నాశనం చేస్తుంది, అందుకే ఇస్రాయీలులకు లభించిన ఘనత యూదులకు లభించలేదు, కారణం వారి అవిశ్వాసము.  

నాల్గవ కారణం: దీనిని సులైమాన్ నిర్మించినట్లయితే, అతను దానిని తన జాతి మరియు తెగ కోసం నిర్మించి అతను దాని యజమాని అయ్యాడు అని అర్థం కాదు. అది పునర్నిర్మించడానికి గల కారణం, తద్వారా ప్రజలు నమాజ్ చేయవచ్చు. అంతేకానీ అది కేవలం ఒక జాతి కొరకు లేక ఒక తెగ కొరకు ప్రత్యేకము కాదు, ప్రవక్తల సందేశం అందరి కొరకు కానీ’ ఈ యూదులు మాత్రం తమ ధర్మాన్ని వక్రీకరించారు.  

ఐదవ కారణం: ఉమర్ (రదియల్లాహు అన్హు) వారు బైతుల్ మఖ్దిస్ ను జయించినప్పుడు, అతను శాంతి ఒప్పందాన్ని సిద్ధం చేశాడు, ఆ సమయం నుండి ఇప్పటివరకు, అది స్థాపించబడింది మరియు ముస్లింలు దానిపై స్థిరంగా ఉన్నారు మరియు ఉంటారు కూడా, ఆ ఒప్పందం ఏమిటంటే పాలస్తీనా ముస్లింలకు చెందినది, ముస్లింల స్వాధీనంలోనే ఉంటుంది మరియు వారికి స్వంత ప్రభుత్వం మరియు అధికారం కూడా ఉంటుంది. యూదులకు అక్కడ నివసించడానికి అనుమతి ఇవ్వబడుతుంది, ఇది కాకుండా పాలస్తీనా పై వారికి ఏ హక్కు ఉండదు. వాళ్లు ముస్లింల న్యాయకత్వంలో ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలను వినియోగించుకుంటున్నారు అందువలన దానికి బదులుగా వారు పన్ను చెల్లించాలి.  

ఆరవ కారణం: అల్లాహ్ తన దివ్య గ్రంథంలో ఈ సమస్త భూమండలం ఆయనదే అని తెలియజేశాడు. మరియు పుణ్యాత్ములైన దాసులను దీనికి వారసులుగా చేస్తాడు.  

కాబట్టి ఇస్లాం మతాన్ని అనుసరించే వాడే పుణ్యాత్ముడు, మరియు యూదులు ప్రవక్తల శత్రువులు మరియు వారి హంతకులు. ఇబ్నె ఉసైమీన్ (రహిమహుల్లాహ్) వారి వాక్యం యొక్క వివరణ ఏమిటంటే! పవిత్ర భూమి అయిన (అల్ ఖుదుస్) యొక్క అసలు హక్కుదారులు ఇస్రాయీలులే, కానీ! అది వారు విశ్వాసులుగా ఉన్నప్పుడు. అంతేకానీ వారు  ఇస్రాయీలుల సంతతి చెందిన వారని కాదు, వాస్తవం ఏమిటంటే మూసా అలైహిస్సలాం గారి కాలంలో ఈ భూమండలంపై అత్యంత ఉత్తములు బనీ ఇస్రాయీలే. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు:  

وَلَقَدْ كَتَبْنَا فِي الزَّبُورِ مِن بَعْدِ الذِّكْرِ أَنَّ الْأَرْضَ يَرِثُهَا عِبَادِيَ الصَّالِحُونَ

(సజ్జనులైన నా దాసులే భూమికి వారసులవుతారని మేము జబూర్‌ (గ్రంథం)లో హితబోధ అనంతరం వ్రాసిపెట్టాము.) (21:1015)

సర్వశక్తిమంతుడైన అల్లాహ్ బనీ ఇస్రాయీలును ఫిరోన్ రాజ్యానికి మరియు దేశానికి వారసులుగా చేశాడు, అదేవిధంగా ముస్లింలను మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై విశ్వాసం తీసుకువచ్చే వారిని బనీ ఇస్రాయిల్ యొక్క వారసులుగా చేశాడు. 

ఏడవ కారణం: సాధారణంగా, అన్ని మస్జిద్ లు మరియు ముఖ్యంగా మూడు మస్జిద్ ల పై విశ్వాసులకు హక్కు ఉంది. అవిశ్వాసులకు ఏ హక్కు లేదు. అల్లాహ్ ఇలా అంటున్నాడు:  

مَا كَانَ لِلْمُشْرِكِينَ أَن يَعْمُرُوا مَسَاجِدَ اللَّهِ شَاهِدِينَ عَلَىٰ أَنفُسِهِم بِالْكُفْرِ ۚ أُولَٰئِكَ حَبِطَتْ أَعْمَالُهُمْ وَفِي النَّارِ هُمْ خَالِدُونَ إِنَّمَا يَعْمُرُ مَسَاجِدَ اللَّهِ مَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَأَقَامَ الصَّلَاةَ وَآتَى الزَّكَاةَ وَلَمْ يَخْشَ إِلَّا اللَّهَ

(ముష్రిక్కులు తాము స్వయంగా తమ అవిశ్వాసాన్ని గురించి సాక్ష్యమిస్తున్నప్పుడు వారు అల్లాహ్‌ మస్జిదుల నిర్వహణకు ఎంతమాత్రం తగరు. వారి కర్మలన్నీ వృథా అయిపోయాయి. శాశ్వతంగా వారు నరకాగ్నిలో ఉంటారు. అల్లాహ్‌ను, అంతిమ దినాన్నీ విశ్వసిస్తూ, నమాజులను నెలకొల్పుతూ, జకాత్‌ను విధిగా చెల్లిస్తూ, అల్లాహ్‌కు తప్ప వేరొకరికి భయపడనివారు మాత్రమే అల్లాహ్‌ మస్జిదుల నిర్వహణకు తగినవారు.)  (9:17-18)

అల్లాహ్‌ దాసులారా! సర్వశక్తిమంతుడైన అల్లాహ్ పరిశుద్ధుడు ఆయన సాష్టాంగ పడేటువంటి నుదుటిని, ఏకేశ్వరోపాసన చేసే హృదయాల ద్వారా విజయం గురించి వాగ్దానం చేశాడు. అల్లాహ్ తన వాగ్దానంలో సత్యవంతుడు, ఆయన వాగ్దానం తప్పు కాదు. 

అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు:  

 وَعَدَ اللَّهُ الَّذِينَ آمَنُوا مِنكُمْ وَعَمِلُوا الصَّالِحَاتِ لَيَسْتَخْلِفَنَّهُمْ فِي الْأَرْضِ كَمَا اسْتَخْلَفَ الَّذِينَ مِن قَبْلِهِمْ وَلَيُمَكِّنَنَّ لَهُمْ دِينَهُمُ الَّذِي ارْتَضَىٰ لَهُمْ وَلَيُبَدِّلَنَّهُم مِّن بَعْدِ خَوْفِهِمْ أَمْنًا ۚ يَعْبُدُونَنِي لَا يُشْرِكُونَ بِي شَيْئًا ۚ وَمَن كَفَرَ بَعْدَ ذَٰلِكَ فَأُولَٰئِكَ هُمُ الْفَاسِقُونَ

(మీలో ఎవరు విశ్వసించి, మంచి పనులు చేశారో వారికి అల్లాహ్‌, వారి పూర్వీకులను భూమికి ప్రతినిధులుగా చేసినట్లుగానే వారికి కూడా తప్పకుండా ప్రాతినిధ్యం వొసగుతానని, తాను వారి కోసం సమ్మతించి ఆమోదించిన ధర్మాన్ని వారి కొరకు పటిష్టం చేసి, దానికి స్థిరత్వాన్ని కల్పిస్తానని, వారికున్న భయాందోళనల స్థానే శాంతిభద్రతల స్థితిని కల్పిస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. వారు నన్నే ఆరాధిస్తారు. నాకు సహవర్తులుగా ఎవరినీ కల్పించరు. ఇంత జరిగిన తరువాత కూడా ఎవరైనా విశ్వాస ఘాతుకానికి పాల్పడితే ముమ్మాటికీ వారు అవిధేయులవుతారు.) (24:55)

మరియు ఇది కూడా తెలుసుకోండి అల్లాహ్ ఆయనపై తన కారుణ్యాన్ని కురిపించు గాక అల్లాహ్ మీకు ఒక గొప్ప విషయం గురించి తెలియచేశాడు అల్లాహ్ ఈ విధంగా ఆజ్ఞాపించాడు. 

إِنَّ اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ ۚ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيمًا

(నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్‌ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి.) (33:56)

ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై నీ కారుణ్యాన్ని అవతరింపచేయి. ఆయన ఖలీఫాలు, తాబయీనులను పూర్తి చిత్తశుద్ది తో అనుసరించే వారిని ఇష్టపడు, ప్రేమించు.  

ఓ అల్లాహ్! ఇస్లాం ముస్లింలకు గౌరవ మర్యాదలు ప్రసాదించు షిర్క్ ,ముష్రిక్ లను అవమాన బరుచు నీవు నీ ధర్మం అయిన ఇస్లాం కు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయి మరియు ఏకేశ్వరోపశకులకు నీ సహాయాన్ని అందించు.  

ఓ అల్లాహ్! మా దేశాలలో భద్రత ను ప్రసాదించు మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు ,సన్మార్గం చూపే మరియు సన్మార్గము పై నడిచే వారీగా చేయి.  

ఓ అల్లాహ్! నిశ్చయంగా యూదులు తిరుగుబాటు చేస్తున్నారు, వారు ఈ భూమండలంపై కల్లోలాన్ని వ్యాపింప చేస్తున్నారు. ఓ అల్లాహ్! వారు ప్రవక్తలను కూడా హతమార్చారు, పుణ్యాత్ముల రక్తాన్ని చిందించారు, దేశాలను ఆక్రమించుకున్నారు, సిరిసంపదలను దోచుకున్నారు, ఓ అల్లాహ్! వారిపై నీ శిక్ష అవతరింప చేయి, వారి హృదయాలను భయాందోళనలకు గురి చేయి. ఓ అల్లాహ్! మేము నిన్ను అనుమానించము, మా భరోసా నమ్మకం నీ పైనే. నీవు తప్ప మా సంరక్షకుడు, మహా నాయకుడు, మరొకరు లేరు. ఓ అల్లాహ్! మస్జిదె అఖ్సా కు  పునర్వైభవాన్ని ప్రసాదించు, దానిని ఉన్నతం చేయు, యూదుల బారి నుండి దానిని కాపాడు. 

سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِين 

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి