ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క హక్కు – ఆయన్ను ప్రేమించడం – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్]        

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه 

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسۡلِمُونَ١٠٢ 

يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا١ 

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَقُولُواْ قَوۡلٗا سَدِيدٗا٧٠ يُصۡلِحۡ لَكُمۡ أَعۡمَٰلَكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ فَازَ فَوۡزًا عَظِيمًا٧١ 

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత : 

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.    

ఓ ముస్లింలారా! అల్లాహ్ కు భయపడండి. అల్లాహ్ యొక్క భయం మీ మనసులలో ప్రతి సమయంలో జనింప చేయండి. అల్లాహ్ కు విధేయత చూపండి. అల్లాహ్ అవిధేయత నుండి దూరంగా ఉండండి. గుర్తుంచుకోండి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి పట్ల ప్రేమ, వారిని గౌరవించడం మనిషి  విశ్వాసానికి నిబంధన మరియు ధర్మం యొక్క ముఖ్యమైన పునాది

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పట్ల ప్రేమ  తప్పనిసరి.  దీనికి గల ఆధారాలు అనేకం ఉన్నాయి. అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు:- 

قُلْ إِن كَانَ آبَاؤُكُمْ وَأَبْنَاؤُكُمْ وَإِخْوَانُكُمْ وَأَزْوَاجُكُمْ وَعَشِيرَتُكُمْ وَأَمْوَالٌ اقْتَرَفْتُمُوهَا وَتِجَارَةٌ تَخْشَوْنَ كَسَادَهَا وَمَسَاكِنُ تَرْضَوْنَهَا أَحَبَّ إِلَيْكُم مِّنَ اللَّهِ وَرَسُولِهِ وَجِهَادٍ فِي سَبِيلِهِ فَتَرَبَّصُوا حَتَّىٰ يَأْتِيَ اللَّهُ بِأَمْرِهِ ۗ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الْفَاسِقِينَ

(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “ఒకవేళ మీ తండ్రులు, మీ కుమారులు, మీ సోదరులు, మీ భార్యలు, మీ సమీప బంధువులు, మీరు సంపాదించిన సిరిసంపదలు, కుంటుపడుతుందేమోనని మీరు భయపడే మీ వర్తకం, మీకెంతో ప్రియమైన మీ గృహాలు మీకు అల్లాహ్‌ కన్నా, ఆయన ప్రవక్త కన్నా, ఆయన మార్గంలో సలిపే పోరాటం కన్నా ఎక్కువ ప్రియమైనవైతే అల్లాహ్‌ తీసుకువచ్చే తీర్పు (శిక్ష) కొరకు ఎదురుచూడండి. అల్లాహ్‌ అవిధేయులకు సన్మార్గం చూపడు. (సూరా అత్ తౌబా 9:24)

ఈ వాక్యం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పట్ల ప్రేమ తప్పనిసరి అని తెలియపరిచే ఒక స్పష్టమైన రుజువు. మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ప్రేమకు అర్హులు. ఈ ఆయత్ అల్లాహ్ దాసులకు దైవ ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)పై ప్రేమను కలిగించేందుకు చాలు. 

ఎందుకంటే ఏ వ్యక్తి అయితే అల్లాహ్, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పట్ల కంటే తన సంపద, తన ఇంటి వారి పట్ల ఎక్కువగా ప్రేమ కలిగి ఉంటాడో అతన్ని హెచ్చరించడం జరిగినది. అంతేకాదు ఈ వాక్యం చివరన తెలియజేయబడినది ఏమనగా అటువంటి వ్యక్తిని “ఫాసిక్” అనగా అపరాదుడు గా పేర్కొనడం జరిగింది. అతను సన్మార్గం నుండి దారితప్పిన వాడు మరియు సన్మార్గం పొందలేని అభాగ్యుడు. 

ఓ విశ్వాసులారా! దైవ ప్రవక్త (సల్లలాహు అలైహి వసల్లం) పట్ల ప్రేమ ఎప్పుడు సంపూర్ణమవుతుందో తెలుసా? మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను మన కంటే, మన సంపద కంటే, మన ఇంటివారి కంటే ఎక్కువగా ఆయనకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు. ఈ ఉత్తమ వ్యవహారం లేనప్పుడు మన ప్రేమ మరియు మన విశ్వాసం రెండు అసంపూర్ణంగా  భావించబడతాయి. దీనికి సంభందించిన ఆధారాలు ఖుర్ఆన్ మరియు హదీసులలో ఉన్నాయి. 

అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు : 

النَّبِيُّ أَوْلَىٰ بِالْمُؤْمِنِينَ مِنْ أَنفُسِهِمْ
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) విశ్వాసులపై వారి ప్రాణాల కంటే ఎక్కువ హక్కు ఉన్నవారు.

హదీసులోఈ విధంగా తెలియజేయబడి: 

మన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియపరిచారు:- ఈ ప్రపంచంలో ప్రతి విశ్వాసి కూడా ఇహ పర లోకాలలో అందరికంటే ఎక్కువ నాతో దగ్గరి బంధం కలవారే. మీకు తెలియాలంటే ఈ ఆయతు చదవండి. النبي أولى بالمؤمنين من أنفسهم  (” ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)విశ్వాసులపై వారి ప్రాణాల కంటే ఎక్కువ అధికారం కలవారు”) 

మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు తెలియపరిచారు:

“నేను ప్రతి విశ్వాసితో తనకంటే ఎక్కువగా ప్రేమ ఆప్యాయత గలవాడను” 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ఈ విధంగా ప్రవచించారు:-

“ఎప్పటి వరకైతే నేను మీ పిల్లలు మీ తల్లిదండ్రులు మరియు సమస్త మానవాళి కంటే మీ వద్ద ఎక్కువ ప్రియమైన వానిగా అవ్వనంతవరకు మీలో ఎవరు నిజమైన విశ్వాసి అవ్వలేరు”.(బుఖారి ముస్లిం) 

అబ్దుల్లా బిన్ హిషామ్ (రదియల్లాహు అన్హు) కథనం: మేమొక సారి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట ఉన్నాం. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఉమర్ (రజి అల్లాహు అన్హు) చేతులు పట్టుకొని ఉన్నారు. ఇంతలో ఉమర్ (రదియల్లాహు అన్హు) ఓ దైవ ప్రవక్తా! మీరు నాకు నా ప్రాణం తప్ప ఇతర (ప్రాపంచిక) వస్తువులన్నింటి కన్నా ప్రియమైన వారు అని పలికారు. దీనిపై దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) స్పందిస్తూ – “కాదు! నా ప్రాణం ఎవరి చేతుల్లో వుందో ఆ శక్తిమంతుని సాక్షి! మీ ప్రాణం కన్నా ఎక్కువగా నేను మీకు ప్రియం కావాలి” అని అన్నారు. ఉమర్ (రదియల్లాహు అన్హు) మాట్లాడుతూ “అల్లాహ్ సాక్షి! మీరిప్పుడు నాకు నా ప్రాణం కన్నా ప్రియులు” అని పలికారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జవాబిస్తూ- “ఇప్పుడు మాట కుదిరింది” అని అన్నారు. (బుఖారి) 

హాజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనo ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ఈ విధంగా తెలియజేశారు:

“ఏ వ్యక్తిలోనయినా ఈ మూడు గుణాలు వుంటే అతను వాటి ద్వారా విశ్వాస మాధుర్యాన్నీ, తియ్యదనాన్ని ఆస్వాదించ గలుగుతాడు. వాటిలో మొదటిది: అల్లాహ్ నూ ఆయన ప్రవక్తనూ అందరికన్నా ఎక్కువగా ప్రేమించడం, రెండవది: కేవలం అల్లాహ్ ను సంతృప్తి పరచడానికే ఇతరులను ప్రేమించడం, ఇక మూడవది – నరకాగ్నిలోకి ప్రవేశించడానికి ఎంతగా అయిష్టపడతాడో, (విశ్వసించిన తర్వాత) తిరస్కారం (కుఫ్ర్) వైపునకు మరలడానిక్కూడా అంతే అయిష్ట పడడం” (బుఖారి, ముస్లిం) 

ఓ విశ్వాసులారా! అల్లాహ్ పట్ల ప్రేమతో పాటు ఆయన ప్రవక్త పట్ల ప్రేమను కూడా కలిగి ఉండాలి అని పవిత్ర ఖుర్ఆన్ మరియు ప్రామాణికమైన హదీసులలో తెలుపబడింది. 

అల్లాహ్ ఈ విధంగా తెలియచేస్తున్నాడు: 

أَحَبَّ إِلَيْكُم مِّنَ اللَّهِ وَرَسُولِهِ
(ఒకవేళ ఇవి మీకు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లలాహు అలైహి వసల్లం కంటే ప్రియమైనవైతే)

ఈ నిబంధన మనకు తెలియజేస్తుంది – అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పట్ల ప్రేమ మధ్య పటిష్టమైన నిబంధన ఉంది అని చెప్పడానికి ఇది ఒక దృష్టాంతం. 

ప్రాథమికంగా అల్లాహ్ పట్ల ప్రేమను కలిగి ఉండడం ఆయన ప్రవక్త పట్ల ప్రేమను కలిగి ఉండడమే. కానీ ఇక్కడ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పట్ల ప్రేమ కలిగి ఉండడాన్ని విడివిడిగా తెలియజేసి మనకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం గొప్పదనం), హోదా చాలా పెద్దవనే సంకేతం ఇవ్వబడింది. కాబట్టి మీరు అల్లాహ్ మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)వారి ప్రేమను తప్పకుండా అర్థం చేసుకోండి. 

ఓ ముస్లిం లారా! ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పట్ల ప్రేమలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దానిలో నుంచి ఒక ప్రత్యేకత ఏమిటంటే ఏ వ్యక్తి అయితే ప్రవక్త గారిని ప్రేమిస్తాడో ఆ వ్యక్తి ప్రళయదినాన ప్రవక్త గారితో ఉంటాడు. 

అనస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖిస్తున్నారు:

ఒక వ్యక్తి ప్రవక్త గారిని ప్రళయదినం గురించి ఈ విధంగా అడుగుతాడు- ప్రళయం ఎప్పుడు సంభవిస్తుంది? దానికి ప్రవక్త గారు నీవు దానికోసం ఏమి సిద్ధం చేశావు అని అన్నారు? ఆ వ్యక్తి! ఏమి సిద్ధం చేయలేదు కానీ నేను అల్లాహ్ ను మరియు ప్రవక్తను ప్రేమిస్తున్నాను అని అన్నాడు. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు ఇలా అన్నారు “ప్రళయ దినాన మీరు ఎవరిని ప్రేమిస్తారో వారితోనే ఉంటారు”.  

అనస్ (రదియల్లాహు అన్హు) ఈ విధంగా అంటున్నారు:  

మేము “మీరు ఎవరిని ప్రేమిస్తారో ప్రయాదినాన వారితోనే ఉంటారు” అనే ఈ మాటతో సంతోషించినంతగా ఎప్పుడు ఏ విషయంలోనూ ఇంత సంతోషించలేదు

అనస్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు:

“నేను ప్రవక్త గారిని, అబూబకర్, ఉమర్ గారిని ప్రేమిస్తున్నాను. ఈ ప్రేమ వల్ల నేను  వారిలా అమలు చేయనప్పటికీ వారితో ఉంటానని నమ్ముతున్నాను“. 

అల్లాహ్ ఖుర్ఆన్  యొక్క శుభాలను మనజీవితాలలో వర్షింప చేయుగాక!. ఆయన వివేకం తో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరిని క్షమించుగాక. మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి. నిశ్చయంగా ఆయన (తౌబా)  పశ్చాత్తాపం చెందే వారిని తప్పక  మన్నిస్తాడు.    

స్తోత్రం మరియు దరూద్ తరువాత 

ఓ విశ్వాసులారా! ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పట్ల ప్రేమకు తోడ్పాటునిచ్చే మార్గాలు  అవి చాలా ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి నాలుగు:- 

మొదటిది: ఉమ్మత్ పట్ల ప్రవక్త యొక్క త్యాగాలను, దయ మరియు సౌమ్యతను గుర్తు చేసుకోవడం. ఎందుకంటే ఆయన ఇస్లాం వ్యాప్తి చెందడం కొరకు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. 

రెండవది: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పట్ల ప్రేమ బలపరచడానికి కారణాలలో ఒక కారణం ఇది కూడా ఉంది; అనుచర సమాజం యొక్క పరలోకపు శిక్ష గురించి ఆయన ఎంతగానో చింతించే వారు! అల్లాహ్ ఇలా తెలియపరుస్తున్నాడు: 

لَقَدْ جَاءَكُمْ رَسُولٌ مِّنْ أَنفُسِكُمْ عَزِيزٌ عَلَيْهِ مَا عَنِتُّمْ حَرِيصٌ عَلَيْكُم بِالْمُؤْمِنِينَ رَءُوفٌ رَّحِيمٌ

మీ దగ్గరకు స్వయంగా మీలో నించే ఒక ప్రవక్త వచ్చాడు. మీకు కష్టం కలిగించే ప్రతిదీ అతనికి బాధ కలిగిస్తుంది. అతను మీ మేలును ఎంతగానో కోరుకుంటున్నాడు. విశ్వాసులు ఎడల అతను వాత్సల్యం కలవాడు, దయామయుడు. (9:128)

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ఈ విధంగా చెబుతుండగా విన్నారు:

“నిశ్చయంగా ప్రజలు మరియు నన్ను గురించిన ఉదాహరణ ఎలాంటి వ్యక్తి లాంటిదంటే ఆ వ్యక్తి అగ్ని రాజేసాడు. అది తన పరిసరాలన్నింటినీ ప్రకాశవంతం చేయగా ఆ అగ్నిలోకి దీపం పురుగులు, ఇతర కీటకాలు దూకుతుంటాయి. అగ్నిరాజేసిన వ్యక్తి మటుకు, వాటిని మంటల్లో పడకుండా దూరంగా తరుముతూ వుంటాడు. కానీ, అవి మాత్రం అతనిపై ప్రాబల్యం పొంది అగ్నిలోకి దూకుతాయి. ఇలా, నేను కూడా మీ నడుం పట్టి మిమ్మల్ని నరకాగ్ని నుండి దూరంగా లాగుతాను. కానీ, (మీరుమాత్రం నన్ను వదిలించుకొని) బలవంతంగా పోయి నరకాగ్నిలోకి ప్రవేశిస్తారు”. (బుఖారి, ముస్లిం)  

ప్రవక్త యొక్క ప్రేమను బలపరచడానికి గల మూడవ కారణం; ప్రవక్త యొక్క నైతికతలను మరియు గుణగణాలు గురించి తెలుసుకోవడం, ఈ లక్షణాలలో ఒకటి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ఎంతో దయ, క్షమాగుణం కలిగిన వారు. మక్కావాసులు ప్రవక్త వారిని మాంత్రికుడని, కవి అని, పిచ్చివాడని, దారి తప్పిన వ్యక్తి అని అన్నారు. ప్రవక్త గారి మోకాళ్ళపై కొట్టారు, ఒంటె పేగులను పైన వేశారు మరియు ప్రవక్త వారి దంతాలు షహీద్ చేయబడ్డాయి, మరియు ప్రవక్త వారి నుదుటి నుండి రక్తం కారింది.  కానీ అల్లాహ్ మక్కా ప్రజలపై ప్రవక్త వారికి ఆధిపత్యం ఇచ్చినప్పుడు,  మక్కావాసులు ఎంత హింసించినప్పటికి ప్రవక్త వారితో ఇలా అన్నారు: ఓ మక్కా ప్రజలారా! నేను ఏమి చేస్తానని మీరు అనుకుంటున్నారు? దీనిపై వారు మాట్లాడుతూ, మేము నీ నుండి మంచిని ఆశిస్తున్నాము. ఎందుకంటే మీరు మంచి సోదరుడు మరియు మంచి సోదరినీ కుమారుడు. దీనిపై ప్రవక్త వారు అన్నారు వెళ్ళండి: మీరంతా స్వేచ్ఛగా ఉన్నారు. అల్లాహ్ ప్రవక్తకు వారిపై ఆధిపత్యం ఇచ్చినప్పటికీ ప్రవక్త వారందరిని విడిచి పెట్టేశారు . 

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)యొక్క ప్రేమను బలోపేతం చేయడానికి చివరి కారణం; ప్రవక్త యొక్క జీవిత చరిత్రకు  సంభందించిన పుస్తకాలను చదవాలి మరియు అధ్యయనం చేయాలి మరియు రోజువారి పనులను, దినచర్యలను గుర్తుంచు కోవాలి. ఇస్లాం ధర్మాన్ని పూర్తి చేయడంలో ప్రవక్త చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ ఉండాలి.  

ఓ ముస్లిం లారా! ప్రవక్తను ప్రేమించడం మీ జీవితంపై,  ఆస్తిపై మరియు కుటుంబంపై ప్రవక్త వారికి మొదటి స్థానం ఇవ్వడంలో పూర్వికులు అద్భుతమైన ఉదాహరణలు చూపారు. అబూ సుఫియాన్ బిన్ హర్బ్ ఆ సమయంలో అతను బహుదైవారాధకుడు. మక్కా ప్రజలు జైద్ ను చంపడానికి హరమ్ నుండి బహిష్కరించినప్పుడు, అబూ సుఫియాన్ జైద్ ను ఇలా ప్రశ్నించాడు: “ఓ జైద్! నేను నిన్ను అల్లాహ్ కొరకు అడుగుతున్నాను ఇప్పుడు మహమ్మద్ నీ స్థానంలో ఉండి, మేము అతన్ని చంపినప్పుడు నువ్వు నీ కుటుంబంతో సురక్షితంగా ఉండటం నువ్వు ఇష్టపడతావా!” అతను సమాధానంగా ఇలా అన్నారు: “అల్లాహ్ సాక్షిగా! మహమ్మద్ నా స్థానంలో ఉండి మరియు ఆయనకు ముళ్ళు గుచ్చుకున్నా ఏదైతే ఆయనకు బాధను కలిగిస్తుందో మరియు నేను కుటుంబ సభ్యుల మధ్య కూర్చోవటాన్ని సహించలేను.  నేను ఈ మాట కూడా ఇష్టపడను.”

అబూ సుఫియాన్ ఇలా అన్నాడు: “నేను ప్రజలలో ఇలాంటి వ్యక్తిని చూడలేదు ఎవరైతే ఒకరిని ఇంత ప్రేమిస్తారో. ఎలా అయితే మొహమ్మద్ ని మహమ్మద్ యొక్క అనుచరులు ప్రేమిస్తున్నారో.” 

ఓ విశ్వాసులారా! షైతాన్ కొందరిని మోసంలో పడవేయడానికి ప్రయత్నించే ఒక రకం: ధర్మంలో భాగం కాని చెడు కర్మలను అలంకరించి చూపిస్తాడు. మరియు ప్రవక్త వారు వీటిని చేయమని ఎన్నడూ చెప్పలేదు. మరియు సహాబాలు మరియు మూడు శతాబ్దాల వ్యక్తులు వీటిపై అమలు చెయ్యలేదు. (అదే సమయంలో) వాళ్ళ ఈ తప్పుడు దావా వారిని రసూల్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై పరిపూర్ణ స్థాయి ప్రేమ అని అపోహాలకు గురిచేస్తుంది. దీని ఉదాహరణ ఒక ఆచరణ కూడా ఉంది. దానినే ఈద్ మిలాదున్నబీ అని పిలుస్తారు. అయితే ఇది సరికాదు. కాబట్టి ప్రేమ అనేది ఒక వ్యక్తి తాను ప్రేమించే వ్యక్తికి లొంగిపోవాలి మరియు అతని ఆజ్ఞలు మరియు నిషేధాలను పాటించాలి మరియు ఆయన ధర్మంలో  హెచ్చు తగ్గులు చేయ రాదు. అయితే ఈద్ మీలాదున్నబీ ప్రేమలో భాగం కాదు కొత్తగా కనిపెట్టిన ఆరాధనలో ఒకటి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా సెలవిచ్చారు: “ఏ వ్యక్తి అయినా మన ఈ ధర్మంలో భాగం కానీ కొత్త దానిని కనిపెట్టిన అది తిరస్కరించబడుతుంది”. అంటే ఈ ఆచరణ అమలు చేసే వారికి తిరిగి ఇవ్వబడుతుంది మరియు ఆమోదించబడదు.  

మరియు ఇది కూడా తెలుసుకోండి అల్లాహ్ ఆయనపై తన కారుణ్యాన్ని కురిపించు గాక. అల్లాహ్ మీకు ఒక గొప్ప విషయం గురించి తెలియచేశాడు. అల్లాహ్ ఈ విధంగా ఆజ్ఞాపించాడు. 

(إن اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تسليما) 

(నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్‌ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి.) 

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జుమా రోజు వారిపై ఎక్కువగా దరూద్ మరియు సలాం పంపమని చెబుతూ ఇలా సెలవిచ్చారు:

“ఉత్తమమైన రోజుల్లో జుమా రోజు ఆ రోజునే ఆదమ్ అలైహిస్సలాం పుట్టించబడ్డారు. మరియు ఆయన అదే రోజున మరణించారు, మరియు అదే రోజున శంఖం పూరించబడుతుంది, అదే రోజు గావు “కేక” కూడా వినబడుతుంది. కాబట్టి ఆరోజు నాపై అతి ఎక్కువగా దరూద్ మరియు సలాం పంపండి. అవి నా ముందు ప్రదర్శించబడతాయి.”

ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై నీ కారుణ్యాన్ని అవతరింపచేయి ఆయన ఖలీఫాలు, తాబయీనులను పూర్తి చిత్తశుద్ది తో అనుసరించే వారిని ఇష్టపడు, ప్రేమించు.  

ఓ అల్లాహ్! ఇస్లాం మరియు ముస్లింలకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్క్ ,ముష్రిక్ లను అవమాన బరుచు. నీవు నీ ధర్మం అయిన ఇస్లాం కు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయి. మరియు ఏకేశ్వరోపశకులకు నీ సహాయాన్ని అందించు.  

ఓ అల్లాహ్! మా దేశాలలో భద్రత ను ప్రసాదించు మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు, సన్మార్గం చూపే మరియు సన్మార్గము పై నడిచే వారీగా చేయి .ఓ అల్లాహ్! మా పరిపాలకులకు నీ గ్రంధానికి కట్టుబడి ఆజ్ఞాపాలన చేసే భాగ్యాన్ని ప్రసాదించు.    

ఓ అల్లాహ్! మా పాపాలను మరియు మా ఆచరణలో ఏర్పడిన కొరతను క్షమించు.ఓ అల్లాహ్ మమ్ములను ఆ నరకాగ్ని నుంచి రక్షించు,మాకు మోక్షాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్! మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని పరలోకం లో సాఫల్యాన్ని ప్రసాదించు, నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు.   

ఓ అల్లాహ్! మేము నీతో స్వర్గం గురించి ప్రాధేయపడుతున్నాము మరియు ఆ స్వర్గం  లోకి ప్రవేశించేటువంటి ఆచరణని మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాము.  మరియు ఆ నరకం నుండి నీ శరణు వేడుకుంటున్నాము మరియు  నరకానికి దగ్గర చేసేటువంటి ప్రతి పని నుండి  నీ శరణు కోరుకుంటున్నాము.  

ఓ అల్లాహ్ దాసులారా! అల్లాహ్ న్యాయం గురించి, బందువుల హక్కులు నెరవేర్చడం గురించి అజ్ఞాపిస్తున్నాడు. మరియు అశ్లీలం దౌర్జన్యం నుండి ఆపుతున్నాడు. ఆయన మనకు హితోపదేసిస్తున్నాడు కనుక మనం ఎల్ల వేళలా ఆయనను స్మరిస్తూ ఉండాలి. ఆయన ప్రసాదించిన అనుగ్రహాల పట్ల కృతజ్ఞత చూపాలి. అల్లాహ్ స్మరణ అన్నిటి కంటే గొప్పది. అల్లాహ్ మనం చేసే ప్రతి పనిని గమనిస్తున్నాడు. 

سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِين 

రచన: మాజిద్ బిన్ సులేమాన్ అర్రస్సి
జుబైల్ పట్టణం సౌదీ అరేబియా
అనువాదం : అబ్దుల్ మాబూద్ జామయీ

పుస్తకం నుండి – ఇస్లామీయ జుమా ప్రసంగాలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్