ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం:అబ్దుల్ మాబూద్ జామయీ
‘ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి
అంశము: ఇస్లాం నుంచి బహిష్కరించే ఐదవ విషయము: ప్రవక్త గారు తెచ్చిన షరియత్ (ధర్మం)లో ఏ ఒక్క భాగాన్నైనా ద్వేషించుట.
ప్రధమ ఖుత్బా:
إنَّ الْحَمْدَ لِلَّهِ، نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللَّهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وسَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللَّهُ فَلَا مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ، وَأَشْهَدُ أَنْ لَا إلـٰه إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ.
స్తోత్రాలు,మరియు దరూద్ తరువాత
ప్రవక్త గారి పద్ధతి అందరికన్నా గొప్పది మరియు సంపూర్ణమైన పద్ధతి
అల్లాహ్ దాసులారా! అల్లాహ్ భీతి కలిగి ఉండి, ఆయనను గౌరవించండి, ఆయన మాటకు విధేయత చూపండి, అవిధేయతకు పాల్పడమాకండి.
గుర్తుంచుకోండి “లా ఇలాహ్ ఇల్లల్లాహ్ ముహమ్మదూర్ రసూలుల్లాహ్” (అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు మరియు ముహమ్మద్ అల్లాహ్ ప్రవక్త, ఆయన దాసుడు) ప్రవచనము పఠించిన తర్వాత (సాక్ష్యం ఇచ్చిన తర్వాత) అల్లాహ్ ను, ప్రవక్తను మరియు ఇస్లాం ధర్మాన్ని ప్రేమించుటము, గౌరవించటడం ఖచ్చితమవుతుంది. ఈ గౌరవం అనేది (అఖీదా) విశ్వాసాలకు, ఆరాధనకు మరియు ఇతర వ్యవహారాలకు సంబంధించినదైనా సరే. ఈ కలిమ-ఎ-షహాదత్ ను పఠించడం, గౌరవించటటం అంటే అల్లాహ్ ను, ప్రవక్తను మరియు ఇస్లాం ధర్మాన్ని గౌరవించి దానిని ఆచరించటం మరియు సత్యంగా భావించటంతోనే రుజువు అవుతుంది. అల్లాహ్ ఆయనను, ప్రవక్తను విశ్వసించడంలోనే ఆయన గౌరవం అనీ ప్రవక్త మరియు ఇస్లాం ధర్మంతో తోడుగా ఈ ప్రస్తావన చేశారు. అల్లాహ్ ఈ విధంగా ఆదేశిస్తున్నారు:
لِّتُؤْمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ وَتُعَزِّرُوهُ وَتُوَقِّرُوهُ وَتُسَبِّحُوهُ بُكْرَةً وَأَصِيلًا
నిశ్చయంగా మేమే నిన్ను (ప్రవక్తగా ఎన్నుకుని) సాక్ష్యమిచ్చేవానిగా, శుభవార్తలు వినిపించేవానిగా, హెచ్చరించే వానిగా చేసి పంపాము. (ఓ ముస్లిములారా!) మీరు అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను విశ్వసించటానికి, అతనికి తోడ్పడటానికి, అతన్ని గౌరవించటానికి, ఉదయం సాయంత్రం అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉండటానికి గాను (మేము ఈ ఏర్పాటు చేశాము) (48 : 9)
అంటే : మీరు ఇస్లాం ధర్మానికి సహాయం చేయడం ద్వారానే అల్లాహ్ కు సహాయం చేయడం అవుతుంది. ఆయనను గౌరవించండి మరియు ఉదయం, సాయంత్రం ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండండి.
అల్లాహ్ దాసులారా! ధర్మాన్ని గౌరవించడానికి వ్యతిరేకమైన విషయం ఏమిటంటే: అల్లాహ్ మరియు ప్రవక్తను, ధార్మిక నియమాలను, ధార్మిక చిహ్నాలను లేదా పుణ్యాల, శిక్షల పట్ల ఎగతాళి (హేళన) చేయడం. ఎవరైతే ఇలా చేస్తాడో అతను కుఫ్ర్ (అవిశ్వాసానికి) పాల్పడినట్టే. ఇది కుఫ్ర్ ఎందుకు అవుతుందంటే దీనితో ధర్మాన్ని, వ్యవస్థ (చట్టం) చేసిన వాడిని (అల్లాహ్ ను) ఎగతాళి చేయడం అవుతుంది కాబట్టి. ఇది స్పష్ఠమైన కుఫ్ర్ (అవిశ్వాసం). ఎందుకంటే మనం అల్లాహ్ ను గౌరవించాలి తప్ప ఆయనకు లోపాన్ని అంటగట్టరాదు. అల్లాహ్ గౌరవానికి పూర్తి హక్కు చెల్లించే వాడితో ఇటువంటి అవమానం జరగదు. ఆయన అల్లాహ్, ధర్మం, మరియు ప్రవక్త పట్ల మర్యాద పూర్వకంగా మసులుకుంటాడు, మనసులో కపటం ఉన్నవాడు మాత్రమే హేళన, ఎగతాళి చేస్తాడు. (అల్లాహ్ మనల్ని రక్షించుగాక). కపట విశ్వాసి ధర్మం పట్ల హేళన చేస్తూ ఉంటాడు – ఇది మనకు తెలిసిన విషయమే.
ఇబ్నె సాదీ (రహిమహుల్లాహ్) అంటున్నారు: అల్లాహ్ మరియు ప్రవక్త పట్ల హేళన చేయటము, ఎగతాళి చేయటం అవిశ్వాసము. అది ఇస్లాం నుంచి బహిష్కరిస్తుంది, ఎందుకంటే ధర్మం ఆధారపడిందే అల్లాహ్ ను, ఆయన ప్రవక్త ను మరియు ధర్మాన్ని గౌరవించడం పైనే. మరియు అలాంటి విషయం పట్ల హేళన, ఎగతాళి చేయటం ఎంత తీవ్రమైనదో, ఎంత విరుద్ధమో అర్థమవుతుంది (తైసీరుల్ కరీమ్ అర్-రెహ్మాన్ ఫీ తఫ్సీర్ కలాం అల్ మన్నాన్ / సూరా తౌబాహ్ : 65)
ధర్మం పట్ల ఎగతాళి, హేళన చేసేవాడు కాఫిర్ (అవిశ్వాసి) – దాని ఆధారాలు
అల్లాహ్ దాసులారా! ఏ ఒక్క ధార్మిక నియమాన్ని, ఆజ్ఞను హేళన చేసిన వాడు కాఫిర్ అని అల్లాహ్ ఖుర్ఆన్ లో స్పష్టం చేశారు:
وَلَئِن سَأَلْتَهُمْ لَيَقُولُنَّ إِنَّمَا كُنَّا نَخُوضُ وَنَلْعَبُ ۚ قُلْ أَبِاللَّهِ وَآيَاتِهِ وَرَسُولِهِ كُنتُمْ تَسْتَهْزِئُونَ لَا تَعْتَذِرُوا قَدْ كَفَرْتُم بَعْدَ إِيمَانِكُمْ ۚ إِن نَّعْفُ عَن طَائِفَةٍ مِّنكُمْ نُعَذِّبْ طَائِفَةً بِأَنَّهُمْ كَانُوا مُجْرِمِينَ
(మీరు చెప్పుకుంటూ ఉన్న విషయం ఏమిటి? అని) నువ్వు వారిని అడిగితే, “అబ్బే ఏమీలేదు. ఏదో సరదాగా, నవ్వులాటకు ఇలా చెప్పుకుంటున్నాము” అని వారంటారు. “ఏమిటీ, మీరు అల్లాహ్‌తో, ఆయన ఆయతులతో, ఆయన ప్రవక్తలతో పరిహాసమాడుతున్నారా? అని అడుగు. మీరింక సాకులు చెప్పకండి. మీరు విశ్వసించిన తరువాత అవిశ్వాసానికి ఒడిగట్టారు. ఒకవేళ మేము మీలో కొందరిని మన్నించినా, మరికొందరిని వారి నేరాలకుగాను కఠినంగా శిక్షిస్తాము” అని (ఓప్రవక్తా!) వారికి చెప్పు. (సూరా మర్యం 9:65-66)
అంటే అర్ధం అవుతున్న విషయం: ధర్మం యొక్క ఏ ఒక్క ఆజ్ఞని హేళన చేసినా అతను కాఫిర్, ఆ హేళన అల్లాహ్ కు సంబంధించినా, ఆయన వాక్యాలకు సంబంధించినా లేక ఖుర్ఆన్ కి సంబంధించినా లేదా ప్రవక్తకి సంబంధించినైనా కావచ్చు, అతను కాఫిర్ అయినట్టే, తీరా అతను ఎంత గొప్పవాడైనా, కాకపోయినా.
ఇబ్నే అబీ హతిం, అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ తో ఉల్లేఖిస్తున్నారు: గజ్వే తబుక్ సందర్భంగా ఒక వ్యక్తి ఒక సభలో సహబాలను ఉద్దేశించి అన్నాడు “నేను ఇలాంటి ఖారీల (ఖుర్ఆన్ పట్టించే వాళ్లు) మాదిరిగా కడుపులు నింపుకునే వాళ్ళు, అబద్దీకులు, శత్రువుతో పోరాడే సమయంలో పిరికితనాన్ని చూపించే వాళ్ళ మాదిరిగా కాదూ?” ఇది విన్న ఓ సహాబి అన్నారు “నువ్వు అబద్దం చెప్తున్నావ్, నువ్వు కపట విశ్వాసివి , నేను ఈ మాట ప్రవక్త గారికి కచ్చితంగా తెలియజేస్తాను” అన్నారు. చివరికి ఈ విషయం ప్రవక్త వద్దకు చేరింది. దానిపై ఖురాన్ వాక్యం అవతరించబడింది. అబ్దుల్లా బిన్ ఉమర్ అంటున్నారు ” నేను అతనిని ప్రవక్త గారి ఒంటె తాడుతో కట్టి వేయబడి , రాళ్లతో దెబ్బలు తింటూ, నిరంతరం ఇలా చెప్తు పోతుండగా చూశాను “మనలో మనం నవ్వుకుంటూ చెప్పుకున్నాము” దానికి ప్రవక్త వారు ఇలా సమాధానం ఇస్తూ పోతున్నారు “హేళన చేయడానికి అల్లాహ్, ఆయన వాక్యాలు మరియు ఆయన ప్రవక్తే దొరికారా? “. (షేక్ ముఖ్ బిల్ బిన్ హాది రహిమహుల్లాహ్ వారు “అస్ సహీహ్ అల్ ముస్నద్ మిన్ అస్బాబిన్ నుజూల్” అనే గ్రంథం లో హసన్ (ప్రామాణికంగా) ఖరారు చేశారు)
“ధర్మం పట్ల హేళన చేసినవాడు కాఫిర్ “ – విద్వాంసులందరూ ఏకీభవించిన విషయం ఇది
ఓ విశ్వాసులారా ! ధర్మం పట్ల హేళన చేసేవాడు కాఫిర్, ఈ విషయంపై విద్వాంసులందరూ ఏకీభవించి ఉన్నారు. ఏ వ్యక్తి అయితే అల్లాహ్ లేదా ఖుర్ఆన్ లేదా ప్రవక్త గారి ప్రస్తావన కలిగి ఉన్న విషయాన్ని హేళన చేస్తే అలాంటి వ్యక్తి గురించి షేక్ సులేమాన్ బిల్ అబ్దుల్లా బిన్ మహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ (రహిమహుల్లాహ్) అంటున్నారు:
“అతను ఈ పని వల్ల అవిశ్వాసి (కాఫిర్) అయినట్లే. ఎందుకంటే అతను తౌహీద్ ఏ రుబూబియత్ మరియు రిసాలత్ ను (దైవ దౌత్యాన్ని) అవమానపరిచాడు. ఇది తౌహీద్ కి విరుద్ధం. అందువలన విద్వాంసులందరూ ఇలాంటి ఆచరణ అవిశ్వాసంతొ కూడినది, ఇలా చేసేవాడు కాఫిర్ అని ఏకీభవించి ఉన్నారు. కనుక ఏ వ్యక్తి అయితే అల్లాహ్ ను, ఆయన గ్రంథాన్ని మరియు ఆయన ప్రవక్తను, ఆయన ధర్మం పట్ల హేళన చేస్తే అతను కాఫిరే (అతను ఆ పని ఉద్దేశపూర్వకంగా చేసినా, ఆషామాషీగా చెప్పినా సరే)” ((తైసీరుల్ అజీజిల్ హమీద్ ఫీ షర్హ్ హి కితాబిత్ తౌహీద్)
ధర్మాన్ని ఎగతాళి చేయడం నిషిద్ధం
ఓ విశ్వాసులారా! మనం నాలుకతో చేసే పొరపాట్లతో ఖచ్చితంగా జాగ్రత వహించాలి, ఎందుకంటే ప్రజలను నరకంలో అత్యధికంగా ప్రవేశింపజేసే కారణము నాలుకే, ఎలాగైతే ముఆజ్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనంలో ఉంది, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఇలా ప్రశ్నించడం జరిగినది: “ఏమిటి మనం నోటి ద్వారా చెప్పే ప్రతి మాటకు బదులు నిలదీయబడతామా?” దానికి ప్రవక్త వారు ఓ ముఆజ్ నీ తల్లి నిన్ను పోగొట్టుకో గాక (అరబ్బులు ఓ రకమైన తిట్టే మాట) అని చెప్పి అన్నారు: “ప్రజలను అత్యధికంగా నాలుక వల్లనే నరకంలో పడివేయటము జరుగుతుంది“. (లేదా ముఖాలపై పడి వేయడం జరుగుతుంది) – ఉల్లేఖనం “అహ్మద్” మరియు “అల్ ముస్నద్” పరిశోధకులు ఇతర ఆధారాల వల్ల ప్రామాణికంగా ఖరారు చేశారు) .
ఇంకో హదీస్ లో ఈ విధంగా ఉంది: “దాసుడు నోటి ద్వారా, నాలుకతో ఒక మాట చెప్తాడు, దాని కారణంగా అతను అల్లాహ్ ఆగ్రహానికి గురవుతాడు, కానీ అతని వద్ద ఆ మాటకు ఎటువంటి ప్రాధాన్యత ఉండదు , కానీ ఆ మాట ద్వారానే ఆ వ్యక్తి నరకానికి ఆహుతి అవుతాడు“.(ఉల్లేఖనం అబూ హురైరా/ బుఖారి)
ఖుర్ఆన్ లో ఈ విధంగా చెప్పడం జరిగినది:
(ويل لكل همزة لمزة)
(ఇతరుల) తప్పులెన్నుతూ, పరోక్ష నిందకు పాల్పడే ప్రతి ఒక్కడికీ మూడుతుంది.(104 : 1)
ఇంకా ఇలా కూడా చెప్పెడం జరిగింది :
(ما يلفظ من قول إلا لديه رقيب عتيد)
(మనిషి) నోట ఒక మాట వెలువడటమే ఆలస్యం, అతని దగ్గర ఒక పర్యవేక్షకుడు (దాన్ని నమోదు చేయడానికి) సిద్ధంగా ఉంటాడు. (50 : 18)
“ధర్మాం పట్ల హేళన చేయడం “ – ఈ విషయంలో ఆచరణలో ఉన్న కొన్ని ఉదాహరణలు
అల్లాహ్ దాసులారా! ధార్మిక పండితుల పట్ల, సమాజ సంస్కరణ చేసే దాయిలపట్ల హేళన చేయటం కూడా ఒకరకంగా ధర్మం పట్ల హేళన చేసినట్టే. ఎందుకంటే ధార్మిక పండితులు ప్రవక్తల వారసులు, వాళ్ళు ధర్మస్థాపకులు. కనుక ఎవరైతే ధార్మిక పండితులను కేవలం అతను పండితుడని ఆయనను హేళన చేస్తాడో అతను కుఫ్ర్ కి పాల్పడినట్టే. లేదా ఎవరైనా ఒక దాయీను కేవలం అతను మంచిని బోధిస్తు చెడునీ నివారిస్తున్నాడు అన్న కారణంగా హేళన చేస్తే అతను కూడా కుఫ్ర్ కి పాల్పడినట్టే. ధార్మిక పండితులు, దాయీలను గౌరవించడం తప్పనిసరి. ఎందుకంటే అల్లాహ్ ఖుర్ఆన్ గ్రంథంలో వాళ్ళ గొప్పతనాన్ని వివరించారు. అందువలన ఒక విశ్వాసిపై తప్పనిసరి ఏమిటంటే అల్లాహ్ మరియు ప్రవక్త ఎవరినైతే గౌరవప్రదంగా భావించారో, ఖరారు చేశారో అతనిని గౌరవించటం తప్పనిసరి,.అల్లాహ్ ఆజ్ఞ ఈ విధంగా ఉన్నది:
يَرْفَعِ اللَّهُ الَّذِينَ آمَنُوا مِنكُمْ وَالَّذِينَ أُوتُوا الْعِلْمَ دَرَجَاتٍ
మీలో విశ్వసించినవారి, జ్ఞానం ప్రసాదించబడినవారి అంతస్థులను అల్లాహ్ పెంచుతాడు.
(సూరా అల్ ముజాదలహ్ 58 : 11)
ఇంకా హదీసులో ఈ విధంగా వుంది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రబోధిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబూ దర్దా (రదియల్లాహు అన్హు) తెలియజేశారు:
(ధర్మ) జ్ఞానాన్ని వెతుక్కుంటూ బయలుదేరే వారి కోసం అల్లాహ్ వారు నడిచే మార్గం గుండా స్వర్గమార్గాన్ని సుగమం చేస్తాడు. విద్యార్థి చేసే పనుల పట్ల ప్రసన్నులై దైవదూతలు అతని గౌరవార్ధం తమ రెక్కలు ముడుచుకుంటారు. భూమ్యాకాశాలలో ఉన్న వారు, ఆఖరికి నీళ్ళలో ఉండే చేపలు కూడా జ్ఞానుల మన్నింపు కోసం ప్రార్థిస్తూ ఉంటాయి. చంద్రునికి ఇతర నక్షత్రాల మీద ఎంత విశిష్ఠత ఉందో జ్ఞానులకు ఆరాధకుల మీద అంత విశిష్ఠత ఉంది. జ్ఞానులు దైవప్రవక్తల వారసులు. దైవప్రవక్తలు తమ వారసుల కోసం దిర్హంలు, దీనార్లు (మొదలగు ధనసంపదలు) వదలి వెళ్ళరు. వారు కేవలం జ్ఞానం మాత్రమే వదలి వెళ్తారు. కనుక ఎవరయితే ఆ జ్ఞానాన్ని నేర్చుకుంటారో వారు ఓ గొప్ప భాగ్యాన్ని పొందినట్లే۔ ( అబూ దావూద్, తిర్మిజీ)
విశ్వాసులారా! ప్రవక్త గారి సాంప్రదాయం (సున్నత్) ను హేళన చేయడం కూడా ధర్మాన్ని హేళన చేయటంలోనే భాగము. గడ్డం పెంచడం వలన, చీలమండల పైన వస్త్రాలు ధరించడం లేదా మిస్వాక్ చేయటం లేదా హిజాబ్, బుర్కా ధరించటం మొదలైన వాటిని హేళన చేయటం.
ఇంకా ధర్మంలో ఉన్న అగోచర విషయాలను కించపరచడం కూడా హేళనలో భాగమే. ఉదాహరణకు స్వర్గ నరకాల పట్ల హేళన, “స్వర్గ నరకాలు ఎక్కడున్నాయి ఎవరు చూశారు” అని ప్రశ్నించడం.
మరియు అఖిదాకి (విశ్వాసానికి) సంబంధించి ఏ విషయాన్నైనా ఎగతాళి చేసినా అది హేళన చేసినట్టే. సహబాల న్యాయము, ధర్మము, సత్యతపై ప్రశ్నించడం, ఆయేషా (రదియల్లాహు అన్హా) వారి పవిత్రతపై వేలు చూపించడం మొదలైనవి. దీనివల్ల ఖురాన్ యొక్క సత్యతను తిరస్కరించటం జరుగుతుంది. ఎందుకంటే అల్లాహ్ సహబాల గురించి, వాళ్ళ సత్యతను పొగుడుతూ తన ప్రసన్నతను వ్యక్తం చేశారు . సూరా తౌబా ఆయత్ 100 లో, సూరా ఫతహ్ ఆయత్ 29 లో, సూరా హాష్ర్ ఆయత్ 8,9 లలో ప్రస్తావించడం జరిగినది. ఇదే విధంగా ఆయేషా (రదియల్లాహు అన్హా) వారిపై కపటులు చేసిన నిందను వ్యతిరేకిస్తూ, ఆయేషా గారి పవిత్రతను వివరించారు. దీని తర్వాత కూడా ఎవరైనా సహబాల సత్యత గురించి, ప్రవక్త గారి గౌరవంపై వేలు చూపించడం అనేది ఎంతవరకు సమంజసం?. ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే అతను ఇలా చెప్పినట్టే: అల్లాహ్ ప్రవక్త కి ఇలాంటి సహాబాలను, భార్యను నియమించారు, ఎవరిలో నైతే మంచి గుణం లేదో. (కచ్చితంగా ఇలా కానే కాదు)
ప్రజలారా! హేళనలో స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పటం, చేయటము, లేదా ఏదైనా పత్రికల్లో ప్రచురించటం కూడా భాగమే. ఇదే విధంగా కంటితో, చేతులతో సేగ చేయటం మరియు నాలుకను కదిలించి హేళన చేయటము కూడా భాగమే. (షేక్ హమద్ బిన్ అతీక్ రహిమహుల్లాహ్ వారు తమ పుస్తకం ” సబీలూన్ నజాతి వల్ ఫకాక్” లో వివరించారు).
తెలిసిన విషయం ఏమిటంటే: హేళన అది ఎంత చిన్న భాగం అయినా కూడా సరే క్షమించరానిది, దాని చిన్న భాగము కూడా పెద్ద భాగము తో సమానం, ఏ రకమైన హేళన అయినా సరే అన్ని సమానమే. (అల్లాహ్ మనందరిని రక్షించుగాక).
ధర్మం పట్ల హేళన చేసే వాళ్ల విషయంలో ముస్లింల నాయకులు పై మరియు ముస్లింల పై ఉన్న బాధ్యతలు
ఓ ప్రజలారా! ఎవరైతే అల్లాహ్ మరియు ప్రవక్త పట్ల హేళన చేస్తాడో, ఇలా చేసిన వాడిని హతమార్చడం ముస్లింల నాయకుడిపై తప్పనిసరి, ఖచ్చితమైనది.
అల్లాహ్ దాసులారా! ఏవరైతే అల్లాహ్ ను లేదా ప్రవక్తను కించపరుస్తాడో,హేళన చేస్తాడో అలాంటి వ్యక్తిని చూస్తే ఖచ్చితంగా అతనిని ఆపాలి లేదా నిరాకరించాలి, లేదా చివరికి ఆ సమావేశం నుంచి బయలుదేరి పోవాలి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల సమావేశంలో కూర్చోవడం కూడా వాళ్ళ మాటలను సమర్ధించినట్టు అవుతుంది, మరియు ఈ విధంగా సమర్థించటం కుఫ్ర్, మరియు ఇస్లాం నుంచి బహిష్కరింప బడటం అవుతుంది. అల్లాహ్ తెలియజేస్తున్నారు:
وَقَدْ نَزَّلَ عَلَيْكُمْ فِي الْكِتَابِ أَنْ إِذَا سَمِعْتُمْ آيَاتِ اللَّهِ يُكْفَرُ بِهَا وَيُسْتَهْزَأُ بِهَا فَلَا تَقْعُدُوا مَعَهُمْ حَتَّىٰ يَخُوضُوا فِي حَدِيثٍ غَيْرِهِ ۚ إِنَّكُمْ إِذًا مِّثْلُهُمْ ۗ إِنَّ اللَّهَ جَامِعُ الْمُنَافِقِينَ وَالْكَافِرِينَ فِي جَهَنَّمَ جَمِيعًا
అల్లాహ్ తన గ్రంథంలో ఇదివరకే మీ వద్దకు ఈ ఆజ్ఞను అవతరింపజేశాడు: ఎవరైనా అల్లాహ్ వాక్యాలను తిరస్కరిస్తూ, పరిహాసమాడుతున్నట్లు మీరు విన్నట్లయితే, – వారు ఆ మాటలు విడిచి పెట్టి వేరే మాటలు మాట్లాడటం మొదలు పెట్టనంతవరకూ – ఆ సమూహంలో వారితో కలసి కూర్చోకండి. (అన్యధా) మీరు కూడా ఆ సమయంలో వారిలాంటి వారుగానే పరిగణించబడతారు. అల్లాహ్ నిశ్చయంగా కపటులను, అవిశ్వాసులందరినీ నరకంలో పోగుచేయనున్నాడు. (సూరా అన్ నిసా 4 :140)
ప్రజలారా ! గ్రహించండి, ఈ పై వాక్యాన్ని గమనించండి. ఎవరైతే హేళన చేసే వాళ్ళతో ప్రపంచంలో వాళ్ల సమావేశాలలో కూర్చొని హేళన చేస్తూ ఉంటారో, వాళ్ళు మరణాంతరం నరకంలో కూడా వాళ్లతో పాటు శిక్షను అనుభవిస్తూ ఉంటారు. అల్లాహ్ మనల్ని రక్షించుగాక.
అల్లాహ్ దాసులారా! ధర్మాన్ని గౌరవించడం ధర్మాన్ని అవతరింప జేసిన అల్లాహ్ ని గౌరవించడం. దీనిని అందించేవారు ప్రవక్తలను గౌరవించడం మరియు దీనిని ప్రచారం చేసే ధార్మిక పండితులను, సంస్కరించే వాళ్లను గౌరవించడం తప్పనిసరి అని వివరించే ఈ సందర్భంగా చాలా విలువైనది. ఎవరైతే దీనికి వ్యతిరేకిస్తాడో అతను పెద్ద ఆపదను ఎదుర్కొంటాడు.
అల్లాహ్ మనందరికీ ఖురాన్ యొక్క శుభాలతో, ఆశీర్వాదాలతో దీవించును గాక, అల్లాహ్ మనందరినీ వివేకంతో, హితోపదేశం కూడిన వాక్యాల ప్రకారం ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించు గాక, నేను నా కొరకు మీ కొరకు అల్లాహ్ నుంచి క్షమాపణ వేడుకుంటున్నాను, మరియు మీరు కూడా ఆయన నుంచి క్షమాపణ కోరండి, సందేహంగా ఆయన క్షమించేవాడు దయగలవాడు. ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.
రెండవ ఖుత్బా :
స్తోత్రాలు మరియు దరూద్ తరువాత …
అల్లాహ్ దాసులారా! అల్లాహ్ భీతి కలిగి ఉండండి. గుర్తుంచుకోండి ధర్మాన్ని హేళన చేయటము యూదుల గుణము, వాళ్లు అల్లాహ్ విషయంలో ఇలా అన్నారు:
(يد الله مغلولة)
అల్లాహ్ చేతులు కట్టివేయబడి ఉన్నాయి.
మరో చోట ఇలా అన్నారు:
(إن الله فقير ونحن أغنياء)
“అల్లాహ్ పేదవాడు, మేము ధనికులం”
ఇదే విధంగా విశ్వాసులను హేళన చేయటము అవిశ్వాసుల (కాఫిర్) ల గుణము అంటూ వాళ్లను ఖరారు చేశారు. అల్లాహ్ ఈ విధంగా తెలియజేశారు:
إِنَّ الَّذِينَ أَجْرَمُوا كَانُوا مِنَ الَّذِينَ آمَنُوا يَضْحَكُونَ وَإِذَا مَرُّوا بِهِمْ يَتَغَامَزُونَ وَإِذَا انقَلَبُوا إِلَىٰ أَهْلِهِمُ انقَلَبُوا فَكِهِينَ وَإِذَا رَأَوْهُمْ قَالُوا إِنَّ هَٰؤُلَاءِ لَضَالُّونَ
అపరాధులు విశ్వాసుల స్థితిపై (చులకనగా) నవ్వేవారు.వారి దగ్గర నుండి వెళుతున్నప్పుడు, పరస్పరం కన్నుగీటి మరీ సైగలు చేసేవారు.తమ వారి వద్దకు తిరిగి వెళ్ళినప్పుడు కూడా (విశ్వాసులను గురించి) వేళాకోళం చేస్తూనే వెళ్ళేవారు.వారిని (విశ్వాసులను) చూసినప్పుడల్లా, “నిశ్చయంగా వీళ్ళు పెడదారి పట్టార”ని అనేవారు. (83: 29-32)
ఇదే విధంగా విశ్వాసులను హేళన చేయటము కపటల గుణము వాళ్ళ గుర్తు. విశ్వాసులు అని ప్రకటించుకుంటారు కానీ అంతర్గతంగా అల్లాహ్ షరియత్ (ధర్మం) పట్ల ద్వేషము దాగి ఉంటుంది. వీళ్ళలో సెక్యులరిజం, లేబరిజం ప్రచారకులు మరియు ఇలాంటి విశ్వాసాలు కలిగిన వాళ్లు అనేకులు కలిసి ఉన్నారు. వాళ్లు మంచిని బోధించి, చెడును నివారించే వాళ్లను హేళన చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా హిజాబ్ (బుర్ఖా)ను కించపరుస్తూ ఉంటారు. మరియు ప్రవక్త గారు బోధనలో వివరించబడ్డ వైద్య విధానాన్ని హేళన చేస్తూ ఉంటారు. ఉదాహరణకు : ఒంటె మూత్రం ద్వారా వైద్యము. అల్హందులిల్లాహ్ అల్లాహ్ దయతో వాళ్ళు చేసిన పన్నాగలు వృధా అయ్యాయి. వాళ్ళు పన్నాగలు ఏ విషయంలో కూడా ఫలించలేదు. కనుక యూరప్ దేశాలలో అనేక ముస్లిమేతరులు వైద్య రంగాల్లో ఒంటె మూత్రం పై పరిశోధనలు చేసి, దాని ద్వారా వ్యాధులను నియంత్రించడం సాధ్యమే అని సాక్ష్యం ఇస్తున్నారు, ఎలాగైతే ప్రవక్త గారి బోధనలో వివరించబడిందో.
ముగింపు ప్రసంగం
మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే అల్లాహ్ మీకు ఒక గొప్ప విషయం గురించి తెలియచేశాడు. అల్లాహ్ ఈ విధంగా ఆజ్ఞాపించాడు.
إن اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تسليما
(నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి.) (33: 56)
اللهم صل وسلم على عبدك ورسولك محمد، وارض عن أصحابه الخلفاء، الأئمة الحنفاء، وارض عن التابعين ومن تبعهم بإحسان إلى يوم الدين.
ఓ అల్లాహ్! మాకు ప్రపంచంలో మేలును, పుణ్యాన్ని పరలోకంలో సాఫల్యాన్ని ప్రసాదించు, మరియు నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు.
ఓ అల్లాహ్! అల్లాహ్ మా హృదయాలను కపటం నుంచి, మన ఆచరణను ప్రదర్శన బుద్ధి నుంచి, మరియు మా చూపులను ద్రోహం నుంచి కాపాడుగాక .
ఓ అల్లాహ్! మేము నీతో స్వర్గం గురించి ప్రాధేయపడుతున్నాము, మరియు ఆ స్వర్గంలోకి ప్రవేశించేటువంటి ఆచరణని మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాము మరియు ఆ నరకం నుండి నీ శరణు వేడుకుంటున్నాము మరియు నరకానికి దగ్గర చేసేటువంటి ప్రతి పని నుండి నీ శరణు కోరుకుంటున్నాము.
ఓ అల్లాహ్! ఇహపరలోకాల సర్వ మేలును ప్రసాదించు, ఆ మేలు మనకు తెలిసిన తెలియకపోయినా మరియు ఇహ పరలోకాల చెడు నుంచి మమ్మల్ని రక్షించు ఆ చెడు మనకు తెలిసిన తెలియకపోయినా.
ఓ అల్లాహ్! నీ అనుగ్రహాలు మా నుండి తొలగిపోవటాన్ని, ఆరోగ్యం పోవటం నుంచి, నీ శిక్షల నుంచి, నీ ఆగ్రహానికి గురికాకుండా మనల్ని రక్షించు, కాపాడు.
ఓ అల్లాహ్! మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని పరలోకం లో సాఫల్యాన్ని ప్రసాదించు, నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు
اللهم صل على نبينا محمد وآله وصحبه وسلِّم تسليما كثيرا.
—
రచన: మాజిద్ బిన్ సులేమాన్ అర్రస్సి
జుబైల్ పట్టణం సౌదీ అరేబియా
అనువాదం : అబ్దుల్ మాబూద్ జామయీ
పుస్తకం నుండి – ఇస్లామీయ జుమా ప్రసంగాలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్