మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .
విశ్వాస ప్రకరణం [PDF]
1వ అధ్యాయం : విశ్వాసం (ఈమాన్) – దాని విశిష్ఠ లక్షణాలు
الإيمان ما هو وبيان خصاله
5 – حديث أبي هُرَيْرَةَ قال كان النبيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بارزًا يومًا للناسِ فأَتاه رجلٌ فقال: ما الإيمان قال: الإيمان أن تؤمنَ بالله وملائكتِهِ وبلقائِهِ وبرسلِهِ وتؤمَن بالبعثِ قال: ما الإسلامُ قال: الإسلامُ أن تعبدَ اللهَ ولا تشركَ به وتقيمَ الصلاةَ وتؤدِّيَ الزكاةَ المفروضةَ وتصومَ رمضانَ قال: ما الإحسان قال: أن تعبدَ الله كأنك تراهُ، فإِن لم تكن تراه فإِنه يراك قال: متى الساعةُ قال: ما المسئولُ عنها بأَعْلَم مِنَ السائل، وسأُخبرُكَ عن أشراطِها؛ إِذا وَلَدَتِ الأَمَةُ رَبَّهَا، وَإِذا تطاولَ رُعاةُ الإبِلِ البَهْمُ في البنيان، في خمسٍ لا يعلمهنَّ إِلاَّ الله ثم تلا النبيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ (إِنَّ الله عنده علم الساعة) الآية: ثم أدبر فقال: رُدُّوه فلم يَرَوْا شيئاً فقال: هذا جبريل جاءَ يُعَلِّمُ الناسَ دينَهم
__________
أخرجه البخاري في: 2 كتاب الإيمان: 37 باب سؤال جبريل النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عن الإيمان والإسلام
5. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం :- ఒక రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రజలతో సమావేశమయి ఉండగా, ఒక వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి “దైవప్రవక్తా! విశ్వాసం అంటే ఏమిటి?” అని అడిగాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధానమిస్తూ “విశ్వాసం ఉంటే నీవు అల్లాహ్ ను, దైవ దూతలను, దైవప్రవక్తలను, (పరలోకంలో) అల్లాహ్ ముందు హాజరు కావలసి ఉంటుందన్న విషయాన్ని, (మరణానంతరం మానవులు) తిరిగి బ్రతికించబడతారన్న విషయాన్ని నమ్మాలి” అని అన్నారు.
“మరి ఇస్లాం అంటే ఏమిటి?” అని ఆ వ్యక్తి మళ్ళీ అడిగాడు. “ఇస్లాం అంటే (1) నీవు అల్లాహ్ ను మాత్రమే (దేవుని గా భావించి) ఆరాధించాలి. (దైవత్వంలో) మరెవరినీ ఆయనకు సహవర్తులుగా చేయకూడదు. (2) నమాజు (ప్రార్ధనా) వ్యవస్థను నెలగొల్పాలి. (3) జకాత్ (పేదల ఆర్థిక హక్కు)ను విధిగా నెరవేర్చాలి. (4) రమజాన్ నెల ఉపవాసాలు పాటించాలి” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).
“ఇహ్సాన్ అంటే ఏమిటి?” ఆ వ్యక్తి తిరిగి ప్రశ్నించాడు. “ఇహ్సాన్ అంటే, నీవు అల్లాహ్ ను ప్రత్యక్షంగా చూస్తున్నట్లు (అత్యంత భయభక్తులతో) ఆయన్ని ఆరాధించాలి. నీవు ఆయన్ని చూడలేకపోయినా ఆయన మాత్రం నిన్ను తప్పకుండా చూస్తున్నాడు. (అన్న యదార్ధాన్ని గుర్తుంచుకో)” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).
“దైవప్రవక్తా! మరి ప్రళయం ఎప్పుడొస్తుంది?” మరో ప్రశ్న అడిగాడు ఆ వ్యక్తి. ప్రళయం గురించి ప్రశ్నించేవాడికన్నా సమాధానమిచ్చేవాడికి ఎక్కువేమీ తెలియదు. కాకపోతే ప్రళయ సంభవం గురించి నేను కొన్ని సూచనలు తెలియజేస్తాను. అప్పుడు దాసి తన యజమానిని కంటుంది. (అనాగరికులుగా ఉన్న) పశువుల కాపర్లు పెద్ద పెద్ద భవంతులు కట్టడంలో ఒకర్నొకరు పోటీపడతారు. ఆ ఐదు అగోచర విషయాల్లో ప్రళయం ఒకటి. దాని సంగతి అల్లాహ్ కి తప్ప మరెవ్వరికీ తెలియదు,” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).
ఆ తరువాత ఆయన ఆ గడియకు సంబంధించిన జ్ఞానం అల్లాహ్ వద్ద మాత్రమే ఉన్నది. ఆయనే వర్షాన్ని కురిపిస్తాడు. తల్లుల గర్భాలలో పెరుగుతున్న దేమిటో ఆయనే ఎరుగు. తాను రేపటి రోజున ఏమి సంపాదించనున్నదో ఏ ప్రాణీ ఎరుగదు. ఏ భూభాగంపై తనకు మృత్యువు రానున్నదో ఏ వ్యక్తి ఎరుగడు (లుక్మాన్ – 34)” అన్న ఖుర్ఆన్ సూక్తిని పఠించారు.
ఈ సంభాషణ తరువాత ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ‘ఆ వ్యక్తిని పిలవండి’ అన్నారు. కాని కొందరు సహచరులు వెళ్ళి చూస్తే ఆ వ్యక్తి ఎక్కడా కన్పించలేదు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (అసలు విషయం బయట పెడ్తూ) “ఆ వ్యక్తి (ఎవరో కాదు) జిబ్రయీల్ (దైవదూత). ఈ విధంగా ఆయన ప్రజలకు వారి ధర్మం గురించి చెప్పడానికి వచ్చారు” అని అన్నారు.
[బుఖారీ; 2వ ప్రకరణం – విశ్వాసం, 37వ అధ్యాయం – జిబ్రయీల్…]
3వ అధ్యాయం – నమాజ్ – ఇస్లాం మౌలిక అంశం.
بيان الصلوات التي هي أحد أركان الإسلام
6 – حديث طَلْحَةَ بن عُبَيْد الله قال: جاءَ رجلٌ إِلى رسولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ من أهل نجْدٍ ثائرُ الرأسِ يُسْمَعُ دوِيُّ صوتِهِ ولا يُفْقَهُ ما يقول، حتى دنا فإِذا هو يسأَل عن الإسلام؛ فقال رسول الله صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: خمسُ صلواتٍ في اليومِ والليلةِ فقال: هل عليّ غيرُها قال: لا إِلاَّ أَنْ تَطَوَّعَ قال رسول الله صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: وصيامُ رمضانَ قال: هل عليّ غيره قال: لا إِلاَّ أَن تَطَوَّعَ قال، وذكر له رسول الله صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ الزكاةَ قال هل عليَّ غيرُها قال [ص:3] لا إِلاَّ أَنْ تَطَوَّعَ قال فأَدبر الرجل وهو يقول: والله لا أزيد على هذا ولا أَنْقصُ قال رسول الله صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: أَفْلَحَ إِنْ صَدَقَ
__________
أخرجه البخاري في: 2 كتاب الإيمان: 34 باب الزكاة من الإسلام
6. హజ్రత్ తల్హా బిన్ ఉబైదా (రదియల్లాహు అన్హు) కథనం – ఓ రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి నజద్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి వచ్చాడు. అప్పుడు అతని శిరోజాలు చిందర వందరగా పడి ఉన్నాయి. అతని గొణుగుడు విన్పిస్తోంది గాని, అతని మాటలు మాత్రం అర్థం కావడం లేదు. దగ్గరగా వచ్చిన తరువాత అతను ఇస్లాం గురించి సమాచారం అడుగుతున్నాడని అర్థమయింది.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతనికి సమాధానమిస్తూ, “రాత్రింబవళ్ళు (ఇరవై నాల్గు గంటల)లో ఐదుసార్లు నమాజు చేయాలి” అని అన్నారు. “అవే కాకుండా అదనంగా మరేవయినా నమాజులు కూడా నేను చేయవలసి ఉందా?” అని అతను అడిగాడు. “(విధిగా) చేయనవసరం లేదు. అయితే నీవు సంతోషంగా చేయదలచుకుంటే (ఐచ్చిక నమాజులు ఎన్నయినా) చేయవచ్చు. పోతే రమజాన్ నెలలో ఉపవాసాలు (కూడా) పాటించాలి” అన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). “రమజాన్ ఉపవాసాలు కాకుండా అదనంగా మరేవయినా ఉపవాసాలు కూడా నేను పాటించవలసి ఉందా?” అని ఆ వ్యక్తి మళ్ళీ అడిగాడు. “(విధిగా) పాటించనవసరం లేదు. అయితే నీవు సంతోషంగా పాటించదలచుకుంటే (ఐచ్చిక ఉపవాసాలు ఎన్నయినా) పాటించవచ్చు” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ వ్యక్తికి జకాత్ (పేదల ఆర్థిక హక్కు) గురించి కూడా తెలియజేశారు. దానికి ఆ వ్యక్తి “అదే కాకుండా అదనంగా మరేదయినా విధి (దానం) నేను నెరవేర్చవలసి ఉందా?” అని అడిగాడు. “(విధిగా) నెరవేర్చనవసరం లేదు. కాకపోతే నీవు సంతోషంగా ఏదయినా ఇవ్వదలచుకుంటే (ఐచ్చిక దానం ఎంతయినా) ఇవ్వవచ్చు” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).
ఆ తరువాత ఆ వ్యక్తి వెనుదిరిగి వెళ్ళిపోతూ “అల్లాహ్ సాక్షి! నేనిందులో అదనంగా ఎలాంటి విషయాన్ని చేర్చను. ఇందులో ఏ విషయాన్ని తగ్గించను కూడా” అని అన్నాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ మాటలు విని “అతనీ మాటను నిజంగా ఆచరణలో పెడితే అతను మోక్షం పొందినట్లే” అని అన్నారు.
(బుఖారీ: 2వ ప్రకరణం : ఈమాన్, 34వ అధ్యాయం – అజ్జకాతు మినల్ ఇస్లాం)
5వ అధ్యాయం – స్వర్గానికి చేర్చే విశ్వాసం
بيان الإيمان الذي يدخل به الجنة
7 – حديث أبي أيوبَ الأَنصاريّ رضي الله عنه أَنَّ رجلاً قال: يا رسول الله أخبرني بعمل يُدْخِلُني الجنة، فقال القوم: مَا لَهُ مَالَه فقال رسولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: أَرَبٌ مَّا لَهُ فقال النبيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: تعبُدُ اللهَ لا تُشْرِكُ بهِ شيئًا وتُقيمُ الصَّلاةَ وَتُؤْتِي الزكاةَ وَتَصِلُ الرَّحِمَ ذرْها قَال كأنّه كانَ عَلى رَاحِلَتِهِ
__________
أخرجه البخاري في: 78 كتاب الأدب: 10 باب فضل صلة الرحم
7. హజ్రత్ అబూ అయ్యూబ్ అన్సారీ (రదియల్లాహు అన్హు) కథనం – ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరికొచ్చి “దైవప్రవక్తా! నన్ను స్వర్గానికి గొనిపోగల సత్కర్మలేమిటో కాస్త చెప్పండి” అని అన్నాడు. ప్రజలు (అతను ముందుకు వస్తూ మాట్లాడుతున్న తీరును చూసి), “ఏమయింది ఇతనికి (ఒక పద్ధతి అంటూ లేకుండా) ఇలా అడుగుతున్నాడు?” అని చెప్పుకోసాగారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ మాటలు విని “ఏం కాలేదు. అతనికి నాతో పని పడింది, మాట్లాడనివ్వండి” అని అన్నారు. తరువాత ఆయన ఆ వ్యక్తి వైపుకు తిరిగి “పూర్తి ఏకాగ్రతతో ఒక్క అల్లాహ్ ను మాత్రమే ఆరాధించు. ఆయన్ని తప్ప మరెవరినీ ఆరాధించకు. ఆ దైవారాధనలో మరెవరినీ ఆయనకు సహవర్తులుగా కల్పించకు. నమాజ్ వ్యవస్థను నెలకొల్పు. జకాత్ (పేదల ఆర్థిక హక్కు) చెల్లించు. బంధువులతో కలసి మెలసి ఉంటూ మంచిగా మసలుకో. ఇక దీన్ని వదలి పెట్టు” * అని అన్నారు.
* ఇక్కడ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నోట వెలువడిన అసలు మాటేమిటో హదీసు ఉల్లేఖకునికి గుర్తులేదు.
హజ్రత్ అబూ అయ్యూబ్ (రదియల్లాహు అన్హు) ఈ హదీసు ఉల్లేఖించిన తరువాత “ఆ సమయంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒంటె ఎక్కి ఉన్నారని, ఆ వ్యక్తి దాన్ని నిరోధించి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఈ ప్రశ్న అడిగినప్పుడు దానికాయన సమాధానమిచ్చి, చివర్లో ఇక దీన్ని (ఒంటె పగ్గాన్ని) వదలి పెట్టు” అని చెప్పి ఉంటారని తెలియజేశారు.
[సహీహ్ బుఖారీ : ప్రకరణం – 78 (అదబ్), అధ్యాయం – 10 (సలాతుర్రహం)]
8 – حديث أَبي هُرَيْرَةَ رضي الله عنه أَنَّ أَعْرابِيًّا أَتَى النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَقالَ: دُلَّني عَلى عَمَلٍ إِذا عَمِلْتُهُ دَخَلْتُ الجنة قَالَ: تَعْبُدُ اللهَ لا تُشْرِكُ بِهِ شَيْئًا، وَتُقيمُ الصَّلاةَ المَكْتُوبَةَ، وَتُؤَدِّي الزَّكَاةَ الْمفْروضَة وَتَصُومُ رَمَضانَ قَالَ وَالَّذِي نَفْسِي بِيَدِهِ لاَ أَزِيدُ عَلى هذا فَلَمّا وَلّى، قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مَنْ سَرَّهُ أَنْ يَنْظُرَ إِلَى رَجُلٍ مِنْ أَهْلِ الْجَنَّةِ فَلْيَنْظُرْ إِلى هَذا
__________
أخرجه البخاري في 24 كتاب الزكاة: 1 باب وجوب الزكاة
8. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- ఒక పల్లెవాసి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చి “దైవప్రవక్తా! నన్ను స్వర్గానికి గొనిపోగల సత్కర్మలేమిటో కాస్త తెలియజేయండి” అని అడిగాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “నీవు ఒక్క అల్లాహ్ ను మాత్రమే ఆరాధించు. దైవత్వంలో ఆయనకు సహవర్తునిగా మరెవరినీ కల్పించకు. విధిగా చేయబడిన (ఫర్జ్) నమాజులు ఆచరించు. (పేదల ఆర్థిక హక్కయిన) జకాత్ చెల్లిస్తూ ఉండు. రమజాన్ నెల ఉపవాసాలు పాటించు” అని బోధించారు. అప్పుడా వ్యక్తి ప్రమాణం చేస్తూ “నా ప్రాణం ఎవరి అధీనంలో ఉందో ఆ అల్లాహ్ సాక్ష్యం! నేనీ ఆజ్ఞలను తు.చ. తప్పకుండా పాటిస్తాను” అని అన్నాడు. ఆ తరువాత అతను వెళ్ళిపోవడానికి వెనుతిరగ్గానే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన అనుచరుల వైపు తిరిగి మీలో ఎవరైనా స్వర్గ నివాసిని చూడగోరితే ఈ వ్యక్తిని చూడవచ్చు” అని అన్నారు.
(సహీహ్ బుఖారీ : 24వ ప్రకరణం – జకాత్ 1వ అధ్యాయం – వజూబుజ్జక్కాత్)
قول النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بُني الإسلام على خمس
9 – حديث ابْنِ عُمَرَ رضي الله عنهما قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: بُنِيَ الإِسْلامُ عَلى خَمْسٍ: [ص:4] شَهادَةِ أَنْ لاَ إِلهَ إِلاَّ اللهُ وَأَنَّ مُحَمَّدًا رَسُولُ اللهِ وَإِقامِ الصَّلاةِ وَإِيتاءَ الزَّكاةِ وَالْحَجِّ وَصَوْمِ رَمَضَانَ
__________
أخرجه البخاري في: 2 كتاب الإيمان: 2 باب دعاؤكم إيمانكم
9. హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: ఇస్లాం ఐదు మౌలికాంశాల పై ఆధారపడి ఉంది. (1) అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ అల్లాహ్ దాసుడు, ప్రవక్త అని సాక్ష్యమివ్వాలి. (2) నమాజ్ వ్యవస్థను నెలకొల్పాలి. (3) జకాత్ (పేదల ఆర్థిక హక్కు) ను నెరవేర్చాలి. (4) హజ్జ్ చేయడం (5) రమజాన్ నెల ఉపవాసాలు పాటించాలి.”
(సహీహ్ బుఖారీ : 2వ ప్రకరణం – ఈమాన్, 2 వ అధ్యాయం – దుఆవుకుం ఈమానుకుం)
7వ అధ్యాయం – అల్లాహ్ ను, దైవ ప్రవక్తను, ఇస్లాం ధర్మాన్ని విశ్వసించడం, విశ్వసించమని ఆదేశించడం.
الأمر بالإيمان بالله ورسوله وشرائع الدين والدعاء إليه
10 – حديث ابْنِ عَبّاس قَالَ إِنَّ وَفْدَ عَبْدِ الْقَيْسِ لَمّا أَتَوُا النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: مَنِ الْقَوْمُ أَوْ مَنِ الْوَفْدُ قَالُوا: رَبِيعَةَ قَالَ: مَرْحَبًا بِالْقَوْمِ أَوْ بِالْوَفْدِ غَيْرَ خَزايا وَلاَ نَدَامَى فَقالُوا: يا رَسُولَ اللهِ إِنَّا لاَ نَسْتَطِيعُ أَنْ نَأْتِيَكَ إِلاَّ في الشَّهْرِ الْحَرامِ، وَبَيْنَنَا وَبَيْنَكَ هَذا الْحَيُّ مِنْ كُفّارِ مُضَرَ، فَمُرْنَا بِأَمْرٍ فَصْلٍ نُخْبِرْ بِهِ مَنْ وَرَاءَنا وَنَدْخُلْ بِهِ الْجَنَّةَ وَسَأَلُوهُ عَنِ الأَشْرِبَةِ فَأَمَرَهُمْ بِأَرْبَعٍ وَنَهاهُمْ عَنْ أَرْبَعٍ: أَمَرَهُمْ بِالإِيمانِ بِاللهِ وَحْدَهُ، قَالَ: أَتَدْرُونَ مَا الإِيمانُ بِاللهِ وَحْدَهُ قَالُوا: اللهُ وَرَسُولُهُ أَعْلَمُ، قَالَ: شَهادَةُ أَنْ لاَ إِلهَ إِلاّ اللهُ وَأَنَّ مُحَمَّدًا رَسُولُ اللهِ، وَإِقامُ الصَّلاةِ وَإِيتاءُ الزَّكاةِ وَصِيامُ رَمَضَانَ وَأَنْ تُعْطُوا مِنَ الْمغنَمِ الْخُمُسَ وَنَهاهُمْ عَنْ أَرْبَعٍ: عَنِ الْحَنْتَمِ وَالدُّبَّاءِ وَالنَّقِيرِ وَالمُزَفَّتِ وَرُبَّما قَالَ المُقَيَّرِ وَقالَ: احْفَظُوهُنَّ وَأَخْبِرُوا بِهِنَّ مَنْ وَراءَكُمْ
__________
أخرجه البخاري في: 2 كتاب الإيمان: 40 باب أداء الخمس من الإيمان
10. హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం :- అబ్దుల్ ఖైస్ మనుషులు కొందరు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చారు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “మీరెవరు, ఏ తెగకు చెందినవారు?” అని అడిగారు. దానికి వారు “మేము రబీఆ తెగకు చెందిన వాళ్ళము” అని అన్నారు. “ఓహో! మీరా! స్వాగతం! గౌరవనీయులారా!! రండి” అంటూ ఆహ్వానించారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).
దైవప్రవక్తా! మాకూ, మీకూ మధ్య సత్యతిరస్కారి అయిన ఈ ‘ముజర్’ తెగ అడ్డుగోడగా ఉంది. అందువల్ల మేము పవిత్రమాసంలో తప్ప ఇతర సమయాలలో మీ సన్నిధికి రాలేము. ఇప్పుడు మాకేవయినా స్వర్గప్రవేశానికి ఉపయోగపడే విషయాలు బోధించండి. వీటిని మేము మాతో పాటు మీ దగ్గరకి రానటువంటి వారికి కూడా వినిపిస్తాము” అన్నారు వారు. అంతేకాదు, పానీయాలను గురించి కూడా వారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను అడిగారు.
అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి నాలుగు విషయాలను ఆచరించాలని, నాలుగు విషయాలు మానుకోవాలని బోధించారు. మిధ్యా దైవాలన్నిటినీ వదలి ఒకే అల్లాహ్ ను విశ్వసించాలని ఆయన చెబుతూ, “ఒకే అల్లాహ్ ను విశ్వసించాలంటే ఏమిటో మీకు తెలుసా?” అని ప్రశ్నించారు. దానికి వారు “అల్లాహ్ కి, ఆయన ప్రవక్తకు మాత్రమే ఆ సంగతి బాగా తెలుసు; మాకు తెలియదు” అని అన్నారు. “ఏకేశ్వర విశ్వాసం అంటే అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన చేత నియమించబడిన ప్రవక్త అని సాక్ష్యమివ్వాలి” అని వివరించారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). ఆ తరువాత నమాజు (ప్రార్థనా) వ్యవస్థను నెలకొల్పాలి, జకాత్ (పేదల ఆర్థిక హక్కు) చెల్లించాలి. రమజాన్ నెల ఉపవాసాలు పాటించాలి. యుద్ధప్రాప్తి (మాలె గనీమత్)లో ఐదో వంతు సొమ్ము ప్రభుత్వ ధనాగారానికి ఇవ్వాలి” అని ఆదేశించారు.
అలాగే ఆయన నాలుగు విషయాలను మానుకోవాలని చెప్పారు – “హన్తమ్, దుబ్బా, నఖీర్, ముజఫ్ఫత్” * అనే నాలుగు రకాల పాత్రలలో నీళ్ళు ఉంచడాన్ని, వాటిని త్రాగడాన్ని ఆయన వారించారు. (హదీసు ఉల్లేఖకుడు ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హు, ఒక్కొక్కసారి నఖీర్ అనడానికి బదులు ముఖయ్యర్ అని పలికేవారు).
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విషయాలను బోధిస్తూ “ఈ ఆదేశాలను బాగా గుర్తుంచుకోండి. మీతో పాటు ఇక్కడకు రాని మీ ప్రాంతం వాళ్ళకు కూడా ఈ ఆదేశాలు తెలియజేయండి” అని అన్నారు.
(సహీహ్ బుఖారీ : 2వ ప్రకరణం – ఈమాన్, 40వ అధ్యాయం – అదావుల్ ఖమ్స్ మినల్ ఈమాన్)
(*) హస్తమ్ :- పచ్చ లేక ఎర్ర రంగు మట్టికడవను హన్తమ్ అంటారు. దీనికి మూతి పై భాగాన కాకుండా పార్శ్వభాగాన ఉంటుంది. మట్టిలో రక్తం, వెండ్రుకలు కలిపి ఈ కడవను తయారుచేస్తారు. లేదా లక్క, గాజు కలిపిన ఎరుపురంగు పూయబడిన కడవను కూడా అంటారు. దుబ్బా :- పాత్రగా ఉపయోగించే బోలు సొరకాయను దుబ్బా అంటారు. ముజఫ్ఫత్ :- ఉమ్మినీటితో లేపనం చేసిన మట్టి పాత్రను ముజఫ్ఫత్ అంటారు. నఖీర్:- ఖర్జూర చెట్టు వేరులో గుంట చేసి దాన్ని మధుపాత్రగా ఉపయోగిస్తారు. ముఖయ్యర్:- చర్మాన్ని ఎండబెట్టి, కాల్చి ఒక విధమైన లేపనం తయారు చేస్తారు. దాంతో లేపనం చేయబడిన పాత్రను ముఖయ్యర్ అంటారు. ఈ లేపనాన్ని ఓడలక్కూడా ఉపయోగిస్తారు.
11 – حَدْيث ابْنِ عَبَّاسٍ أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ لَمَّا بَعَثَ مُعَاذاً رضي الله عنه عَلى الْيَمنِ قَالَ: إِنَّكَ تَقْدَمُ عَلى قَوْمِ أَهْلِ كِتَابٍ، فَلْيَكُنْ أَوَّلَ مَا تَدْعُوهُمْ إِلَيْهِ عِبادَةُ اللهِ، فَإِذَا عَرَفُوا اللهَ فَأَخْبِرْهُمْ أَنَّ اللهَ قَدْ فَرَضَ عَلَيْهِمْ خَمْسَ صَلَواتٍ في يَوْمِهِمْ وَلَيْلَتِهِمْ، فَإِذا فَعَلُوا فَأَخْبِرْهُمْ أَنَّ اللهَ فَرَضَ عَلَيْهِمْ زَكاةً مِنْ أَمْوالِهِمْ وَتَردُّ عَلى فُقَرائِهِمْ فَإِذا أَطَاعُوا بِها فَخُذْ مِنْهُمْ وَتَوَقَّ كَرائِم أَمْوالِ النَّاسِ
__________
أخرجه البخاري في: 24 كتاب الزكاة: 41 باب لا تؤخذ كرائم أموال الناس في الصدقة
11. హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ ముఆజ్ (రదియల్లాహు అన్హు)ని యమన్ రాష్ట్రానికి గవర్నర్‌గా నియమించి పంపుతూ ఇలా ఉపదేశించారు: “ముఆజ్! నీవిప్పుడు క్రైస్తవులుండే ప్రాంతానికి వెళ్తున్నావు. అంచేత మొట్టమొదట నీవు వారిని ఏకేశ్వరాధన వైపుకు పిలువు. వారు గనక (నీ పిలుపు అందుకొని) ఏకేశ్వరుడయిన అల్లాహ్ ను ధృవీకరించడం జరిగితే, ఆయన వారికి రోజుకు (24 గంటలలో) ఐదుసార్లు విధిగా నమాజు చేయాలని ఆదేశించాడని తెలియజేయి. దీనికి వారు ఒప్పుకుంటే వారు తమ సిరిసంపదల నుండి విధిగా జకాత్ (పేదల ఆర్థిక హక్కు) తీసి చెల్లించాలని ఆయన ఆజ్ఞాపించాడని తెలియజేయి. ఈ జకాత్ సొమ్ము వారిలో ధనికుల నుండి వసూలు చేసి పేదలకు పంచబడుతుంది. ఈ ఆదేశాన్ని కూడా శిరసావహించి జకాత్ చెల్లించడానికి అంగీకరిస్తే వారి దగ్గర జకాత్ వసూలు చేయాలి. అయితే ఒక విషయం బాగా గుర్తుంచుకో. ప్రజల దగ్గరుండే అత్యంత శ్రేష్ఠమైన వస్తువుల జోలికి మాత్రం పోకూడదు.”
[సహీహ్ బుఖారీ: 24వ ప్రకరణం – జకాత్, 41వ అధ్యాయం – లాతూఖజుకరాయిము అమ్వాలిన్నాసి ఫిస్సదఖి]
12 – حديث ابْنُ عَبّاسٍ أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بَعَثَ مُعاذًا إِلى الْيَمَنِ فَقالَ: اتَّقِ دَعْوَةَ المَظْلُومِ فَإِنَّها لَيْسَ بَيْنَها وَبَيْنَ اللهِ حِجابٌ
__________
أخرجه البخاري في: 46 كتاب المظالم: 9 باب الاتقاء والحذر من دعوة المظلوم
12. హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ ముఆజ్ (రదియల్లాహు అన్హు)ని యమన్ రాష్ట్రానికి గవర్నర్‌గా నియమించి పంపుతూ “పీడితుని ఆర్తనాదాలకు భయపడుతూ ఉండాలి. పీడితుని ఆర్తనాదానికి, అల్లాహ్ కి మధ్య ఎలాంటి అడ్డుతెర ఉండదు” అని బోధించారు.
[సహీహ్ బుఖారీ : 46వ ప్రకరణం – ముజాలిమ్, 9వ అధ్యాయం – అల్ ఇత్తి ఖాయి వల్ హజరి మిన్ దావతిల్ మజ్ లూమ్]
8వ అధ్యాయం – అల్లాహ్ ను, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను విశ్వసించేవరకు అవిశ్వాసులతో పోరాటం
الأمر بقتال الناس حتى يقولوا لا إِله إِلا الله محمد رسول الله
13 – حديث أَبي بَكْر وَعُمَر قَالَ أَبُو هُرَيْرَةَ: لَمّا تُوُفِّيَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَكانَ أَبُو بَكْرٍ رضي الله عنه، وَكَفَرَ مَنْ كَفَرَ مِنَ الْعَرَب، فَقالَ عُمَرُ رضي الله عنه: كَيْفَ تُقاتِلُ النَّاسَ وَقَدْ قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: أُمِرْتُ أَنْ أُقاتِلَ النَّاسَ حَتّى يَقُولوا لا إِلهَ إِلاَّ اللهُ، فَمَنْ قالَها فَقَدْ عَصَمَ مِنِّي مَالَهُ وَنَفْسَهُ إِلاَّ بِحَقِّهِ، وَحِسابُهُ عَلى اللهِ فَقالَ أَبُو بَكْرٍ: وَاللهِ لأُقاتِلَنَّ مَنْ فَرَّقَ بَيْنَ الصَّلاةِ وَالزَّكاةِ، فَإِنَّ الزَّكاةَ حَقُّ الْمالِ، وَاللهِ لَوْ مَنَعُوني عَناقًا كَانوا يُؤَدُّونَها إِلى رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ لَقاتَلْتُهُمْ عَلى مَنْعِها
قالَ عُمَر رضي الله عنه: فَواللهِ ما هُوَ إِلاَّ أَنْ قَدْ شَرَحَ اللهُ صَدْرَ أَبي بَكْرٍ رضي الله عنه فَعَرَفْتُ أَنَّهُ الْحَقُّ
__________
أخرجه البخاري في: 24 كتاب الزكاة: 1 باب وجوب الزكاة
13. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దివంగతులయిన తరువాత హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఖలీఫా అయ్యారు. ఆయన పాలనా కాలంలో కొన్ని అరబ్బు తెగలు జకాత్ ఇవ్వడానికి నిరాకరించాయి.
ఆ సందర్భంలో హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఖలీఫా ముందు ప్రవక్త ప్రవచనాన్ని ఉటంకిస్తూ ఇలా అన్నారు: “అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని ప్రజలు అంగీకరించనంతవరకు వారితో పోరాడాలని నాకు ఆజ్ఞ అయింది. ఇలా సద్వచనానికి అనుకూలంగా సాక్ష్యమిచ్చేవాడు తన ధనప్రాణాలను కాపాడుకున్న వాడవుతాడు. ఇక అతను నా వల్ల ఎలాంటి నష్టానికి గురయ్యే ప్రశ్న ఉండదు. కాకపోతే దైవధర్మం ప్రకారం అతను విధిగా నెరవేర్చవలసిన హక్కు ఏదైనా నెరవేర్చకపోతే అది వేరే విషయం . దాని సంగతి అల్లాహ్ చూసుకుంటాడు – అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు కదా! అలాంటప్పుడు మీరు ఆ తెగలతో ఎలా యుద్ధం చేస్తారు?”
అప్పుడు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “దైవసాక్షిగా చెబుతున్నాను. నమాజ్, జకాల మధ్య విచక్షణ చేసే ప్రతి వ్యక్తితో నేను యుద్ధం చేస్తాను. జకాత్ నిజానికి సంపద హక్కు (అంటే సంపద కలిగి ఉన్నవారు, దాని మీద పేదల ఆర్థిక హక్కు అయిన జకాత్ ని విధిగా చెల్లించాలి). అల్లాహ్ సాక్షి! వారు గనక దైవప్రవక్త కాలంలో జకాత్ గా ఇస్తూ ఉండిన సంపదలో నుంచి ఒక్క ఒంటె తాడయినా సరే ఇవ్వడానికి నిరాకరిస్తే నేను తప్పకుండా వారితో పోరాడుతాను.”
ఆ తరువాత హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) మాట్లాడుతూ “అల్లాహ్ సాక్షి! సత్యావగాహన కోసం అల్లాహ్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) హృదయ కవాటాన్ని తెరిచాడు. అబూ బకర్ (రదియల్లాహు అన్హు) దృక్పథమే సరయినదని నేను ఆ తరువాత గ్రహించాను” అని అన్నారు.
[సహీహ్ బుఖారీ : 24వ ప్రకరణం – జకాత్, 1వ అధ్యాయం – జకాత్ విధింపు]
14 – حديث أَبي هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: أُمِرْتُ أَنْ أُقاتِلَ النَّاسَ حَتّى يَقُولُوا لا إِلهَ إِلاّ اللهُ، فَمَنْ قَالَ لا إِلهَ إِلاّ اللهُ فَقَدْ عَصَمَ مِنّي نَفْسَهُ وَمالَهُ إِلاَّ بِحَقِّهِ، وَحِسابُهُ عَلى اللهِ
__________
أخرجه البخاري في: 56 كتاب الجهاد: 102 باب دعاء النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إلى الإسلام والنبوة
14. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని ప్రజలు అంగీకరించనంతవరకు వారితో యుద్ధం చేస్తూ ఉండాలని నాకు ఆజ్ఞ అయింది. కనుక అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని ఎవరైనా అంగీకరిస్తే అతను తన ధనప్రాణాలను నా నుండి కాపాడుకున్న వాడవుతాడు. కాకపోతే అతను విధిగా నెరవేర్చవలసిన చట్టపరమైన హక్కు ఏదయినా నెరవేర్చకపోతే అది వేరే విషయం. దాని సంగతి చూసుకునే బాధ్యత అల్లాహ్ పై ఉంది.”
[సహీహ్ బుఖారీ: 56వ ప్రకరణం – జిహాద్, 102 వ అధ్యాయం – దుఆన్నబియ్యి(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలల్ ఇస్లామి వ నబువ్వహ్]
15 – حديث ابْنُ عُمَر أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: أُمِرْتُ أَنْ أُقاتِلَ النَّاسَ حَتّى يَشْهَدوا أَنْ لا إِلهَ إِلاّ اللهُ وَأَنَّ مُحَمَّداً رَسُولُ اللهِ، وَيُقيمُوا الصَّلاةَ وَيُؤْتُوا الزَّكاةَ، فَإِذا فَعَلُوا ذَلِكَ عَصَمُوا مِنّي دِمَاءَهُمْ وَأَمْوالَهُمْ إِلاّ بِحَقِّ الإسْلامِ، وَحِسابُهُمْ عَلى اللهِ
__________
أخرجه البخاري في: 2 كتاب الإيمان: 17 باب فإن تابوا وأقاموا الصلاة وآتوا الزكاة فخلوا سبيلهم
15. అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “ప్రజలు అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు’లేడని సాక్ష్యమిచ్చి నమాజ్, జకాత్ విధులు పాటించనంతవరకు వారితో యుద్ధం చేస్తూ ఉండాలని నాకు ఆజ్ఞ అయింది. ఇలా సాక్ష్యమిచ్చి, ఈ విధులు పాటించనారంభిస్తే వారి ధనప్రాణాలు నా నుండి రక్షణ పొందుతాయి. అయితే వారు విధిగా నెరవేర్చవలసిన చట్టపరమైన హక్కేదయినా నెరవేర్చకపోతే అది వేరే విషయం. దాని సంగతి అల్లాహ్ చూసుకుంటాడు”.
[సహీహ్ బుఖారీ: 2వ ప్రకరణం – విశ్వాసం, 17వ అధ్యాయం – ఫ ఇన్ తాబూ వ అఖాముస్సలాత వ ఆతుజ్జకాత ఫఖల్లూ సబీలహుమ్)
9వ అధ్యాయం – విశ్వాసం “లా ఇలాహ ఇల్లల్లాహ్” సమ్మతితో ప్రారంభం
أول الإيمان قول لا إله إلا الله
16 – حديث المُسَيَّبِ بْنِ حَزْنٍ قَالَ: لَمّا حَضَرَتْ أَبا طَالِبٍ الْوَفاةُ جاءَهُ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَوَجَدَ عِنْدَهُ أَبا جَهْلِ بْنَ هِشامٍ وَعَبْدَ اللهِ بْنَ أَبي أُمَيَّةَ بْنِ المُغِيرَة، قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ لأبي طالِبٍ يا عَمِّ قُلْ لا إِلهَ إِلاّ اللهَ كَلِمَةَ أَشْهَدُ لَكَ بِها عِنْدَ اللهِ، فَقَالَ أَبُو جَهْلٍ وَعَبْدُ اللهِ بْنِ أَبي أُمَيَّةَ يا أَبا طَالِبٍ أَتَرْغَبُ عَنْ مِلَّةِ عَبْدِ المُطَّلِب فَلَمْ يَزَل رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَعْرِضُها عَلَيْهِ، وَيَعُودَانِ بِتِلْكَ المَقالَةِ حَتّى قَالَ أَبو طَالِبٍ، آخِرَ ما كَلَّمَهُمْ، هُوَ عَلى مِلَّة عَبْدِ المُطَّلِبِ، وَأَبى أَنْ يَقُولَ لا إِلهَ إِلاّ الله، فَقالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: أَمّا وَاللهِ لأَسْتَغْفِرَنَّ لَكَ ما لَمْ أُنْهَ عَنْكَ فَأَنْزَلَ اللهُ تَعالى فِيهِ (مَا كانَ لِلنَّبِي) الآية
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 81 باب إذا قال المشرك عند الموت لا إله إلاّ [ص:7] الله
16. హజ్రత్ ముసయ్యబ్ (రదియల్లాహు అన్హు) కథనం:- అబూ తాలిబ్ కు మరణ సమయం ఆసన్నమయినప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన్ని చూడటానికి వచ్చారు. ఆ సమయంలో అబూ తాలిబ్ దగ్గర అబూ జహల్ బిన్ హెషామ్, అబ్దుల్లా బిన్ అబీ ఉమయ్య బిన్ ముగైరా కూర్చొని ఉన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అబూ తాలిబ్ ని ఉద్దేశించి “చిన్నాన్నా! (ఇప్పటికైనా) అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని అంగీకరించండి. దీన్ని ప్రాతిపదికగా తీసుకొని నేను అల్లాహ్ దగ్గర మీకు అనుకూలంగా సాక్ష్యమిస్తాను” అని అన్నారు.
అబూజహల్, అబ్దుల్లా బిన్ అబీ ఉమయ్యా ఈ మాటలు విని “అబూ తాలిబ్! మీరు అబ్దుల్ ముత్తలిబ్ అనుసరించిన మతాన్ని వదలి పెడతారా?” అని అడిగారు. ఆ తరువాత దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని అంగీకరించవలసిందిగా మాటిమాటికీ అబూ తాలిబ్ కు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. అయితే అబూజహల్, అబ్దుల్లా బిన్ అబీ ఉమయ్యాలు కూడా తమ మాటను అనేకసార్లు ఉద్ఘాటించారు. చివరికి అబూ తాలిబ్ వారిద్దరితో “నేను అబ్దుల్ ముత్తలిబ్ మతాన్నే అంటిపెట్టుకొని ఉంటాను” అని చెప్పేశారు. అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడని ఒప్పుకోవడానికి ఆయన నిరాకరించారు.
అయినప్పటికీ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (చిన్నాన్న మీది ప్రేమను చంపుకోలేక) “అల్లాహ్ సాక్షి! అల్లాహ్ నన్ను వారించనంతవరకు నేను మీ పాప క్షమాపణ కోసం ప్రార్థన చేస్తూ ఉంటాను” అని అన్నారు. అప్పుడు ఈ సూక్తి అవతరించింది: “బహు దైవారాధకులు (సత్యాన్ని తిరస్కరించి) నరకానికి అర్హులయ్యారని స్పష్టంగా తెలిసిన తరువాత వారు దగ్గరి బంధువులయినా సరే, వారి పాప మన్నింపు కోసం అల్లాహ్ ను ప్రార్థించడం దైవప్రవక్తకు, విశ్వాసులకు ఎంత మాత్రం శోభించదు. ( ఖుర్ఆన్ : 9:113)
[సహీహ్ బుఖారీ: 23వ ప్రకరణం – శవ సంస్కారం, 81వ అధ్యాయం – ఇజ్ ఖాలల్ ముష్రికు ఇన్దల్ మౌతి లా ఇలాహ ఇల్లల్లాహ్]
10వ అధ్యాయం – స్వచ్ఛమైన ‘విశ్వాసం’తో అల్లాహ్ సన్నిధికి వెళ్ళిన వారికి నేరుగా స్వర్గ ప్రవేశం
من لقي الله بالإيمان وهو غير شاك فيه دخل الجنة وحرم على النار
17 – حديث عُبادَةَ رضي الله عنه عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: مَنْ شَهِدَ أَنْ لا إِلهَ إِلاَّ اللهُ وَحْدَهُ لا شَريكَ لَهُ، وَأَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ، وَأَنَّ عِيسَى عَبْدُ اللهِ وَرَسُولُهُ وَكَلِمَتُهُ أَلْقاها إِلى مَرْيَمَ وَرُوحٌ مِنْهُ، وَالْجَنَّةُ حَقٌّ، وَالنَّارُ حَقٌّ، أَدْخَلَهُ اللهُ الْجَنَّةَ عَلى مَا كَانَ مِنَ الْعَمَل
وزاد أحد رجال السند مِنْ أَبوَابِ الْجَنَّةِ الثمانِيَةِ أَيُها شَاءَ
__________
أخرجه البخاري في: 60 كتاب الأنبياء: 47 باب قوله: (يا أهل الكتاب لا تغلوا في دينكم ولا تقولوا على الله إلا الحق)
17. హజ్రత్ ఉబాదా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడని, ఆయన ఒక్కడేనని, ఆయనకు మరెవరూ సాటి లేరని; ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన దాసుడు, ప్రవక్త అని; అలాగే ఈసా (అలైహిస్సలాం) కూడా అల్లాహ్ దాసుడు, ఆయన ప్రవక్త అనీ; కాకపోతే ఆయన హజ్రత్ మర్యం (గర్భం)లో అవతరించిన దైవవాక్కు, దైవాత్మ అని; స్వర్గనరకాలు ఉన్నాయన్నది యదార్థమని ఎవరైతే సాక్ష్యమిస్తారో ఆ వ్యక్తి కర్మలు ఎలాంటివయినా సరే అల్లాహ్ అతనికి స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు.”
హదీసు ఉల్లేఖకులలో ఒక ఉల్లేఖకుడు ఇందులో మరొక విషయాన్ని చేర్చుతూ “స్వర్గానికి ఉండే ఎనిమిది ద్వారాలలో ఆ వ్యక్తి తాను కోరుకున్న ద్వారం గుండా స్వర్గంలోప్రవేశించగలడు” అని తెలిపాడు.
[సహీహ్ బుఖారీ: 60వ ప్రకరణం – అంబియా, 47వ అధ్యాయం – ఖౌలహూ యా అల్ కితాబి లా తగ్లూ ఫీ దీనికుమ్ వలా తఖూలూ అలల్లాహి ఇల్లల్ హఖ్ )
18 – حديث مُعاذِ بْنِ جَبَلٍ رضي الله عنه قَالَ: بَيْنا أَنا رَدِيفُ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، لَيْسَ بَيْني وَبَيْنَهُ إِلاّ أَخِرَةُ الرَّحْلِ، فَقالَ: يا مُعاذ قُلْتُ: لَبَّيْكَ رَسُولَ اللهِ وَسَعْدَيْكَ ثُمَّ سَارَ ساعَةً ثُمَّ قَالَ: يا مُعاذ قُلْتُ: لَبَّيْكَ رَسُولَ اللهِ وَسَعْدَيْكَ ثُمَّ سارَ سَاعَةً ثُمَّ قَالَ: يا مُعاذ قُلْتُ: لَبَّيْكَ رَسُولَ اللهِ وَسَعْدَيْكَ قَالَ: هَلْ تَدْري ما حَقُّ اللهِ عَلى عِبادِهِ قُلْتُ: اللهُ وَرَسُولُهُ أَعْلَمُ، قَالَ: حَقُّ اللهِ عَلى عِبادِهِ أَنْ يَعْبُدوهُ وَلا يُشْرِكُوا بِهِ شَيْئاً ثُمَّ سَارَ سَاعَةً ثُمَّ قَالَ: يا مُعاذُ بْنُ جَبَلٍ قُلْتُ: لَبَّيْكَ رَسُولَ اللهِ وَسَعْدَيْكَ، فَقَالَ: هَلْ تَدْري ما حَقُّ الْعِبادِ عَلى اللهِ إِذَا فَعَلُوهُ قُلْتُ اللهُ وَرَسُولُهُ أَعْلَمُ، قَالَ: حَقُّ الْعِبادِ عَلى اللهِ أَنْ لا يُعَذِّبَهُمْ
__________
أخرجه البخاري في: 77 كتاب اللباس: 101 باب إرداف الرجُل خلف الرجُل
18. హజ్రత్ ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు) కథనం:- నేనొకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెనుక ఆయన ఒంటె మీద కూర్చొని ప్రయాణం చేస్తున్నాను. నాకు, ఆయనకు మధ్య అంబారీ కర్ర మాత్రమే అడ్డుగా ఉంది. హఠాత్తుగా ఆయన “ఓ ముఆజ్!” అని పిలిచారు. నేను వెంటనే “(చెప్పండి) దైవప్రవక్తా! నేను మీ సేవ కోసం సిద్ధంగా ఉన్నాను” అన్నాను. కొంచెం దూరం నడిచిన తరువాత ఆయన మళ్ళీ “ఓ ముఆజ్!” అని పిలిచారు. “(సెలవియ్యండి) దైవప్రవక్తా! నేను మీ సేవ కోసం సిద్ధంగా ఉన్నాను” అన్నాను. ఆ తరువాత మరి కొంచెం దూరం పోయాక మూడవసారి మళ్ళీ “ముఆజ్!” అని పిలిచారు. “(ఆజ్ఞాపించండి) దైవప్రవక్తా! నేను మీ సేవ కోసం సిద్ధంగా ఉన్నాను” అన్నాను నేను.
అప్పుడాయన “దాసుల మీద అల్లాహ్ హక్కు ఏముందో నీకు తెలుసా?” అని అడిగారు. అందుకు నేను “అల్లాహ్ కి, దైవప్రవక్తకే బాగా తెలుసు” అన్నాను. “దాసుల మీదున్న అల్లాహ్ హక్కు ఏమిటంటే, వారు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి, మరెవరినీ ఆరాధించకూడదు. దైవత్వంలో ఆయనకు మరెవరినీ సాటి కల్పించకూడదు” అన్నారు ఆయన. ఇలా చెప్పి కాస్సేపు మౌనంగా నడిచారు. ఆ తరువాత “ఓ ముఆజ్ బిన్ జబల్!” అని పిలిచారు. నేను (వెంటనే సెలవియ్యండి) “దైవప్రవక్తా! మీ సేవ కోసం సిద్ధంగా ఉన్నాను” అని అన్నాను. “దాసులు అల్లాహ్ హక్కు నెరవేర్చిన తరువాత, అల్లాహ్ పై దాసులకు ఉండే హక్కేమిటో నీకు తెలుసా?” అని అడిగారు ఆయన. నేను “అల్లాహ్ కి, దైవప్రవక్తకు మాత్రమే బాగా తెలుసు” అన్నాను. “అప్పుడు అల్లాహ్ (తన) దాసులను శిక్షించకపోవడమే ఆయనపై వారికున్న హక్కు” అని తెలిపారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).
[సహీహ్ బుఖారీ: 77వ ప్రకరణం – లిబాస్, 101వ అధ్యాయం – ఇర్దాఫిర్రజుల ఖల్ ఫి ర్రజుల్]
19 – حديث مُعاذ رضي الله عنه قَالَ: كُنْتُ رِدْفَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَلى حِمارٍ يُقالُ لَهُ عُفَيْرٌ، فَقَالَ: يَا مُعاذُ هَلْ تَدْري حَقَّ اللهِ عَلى عِبادِهِ وَما حَقُّ الْعِبادِ عَلى اللهِ قُلْتُ اللهُ وَرَسُولُهُ أَعْلَمُ، قَالَ: فَإِنَّ حَقَّ اللهِ عَلى الْعِبادِ أَنْ يَعْبُدُوهُ وَلا يُشْرِكُوا بِهِ شَيْئًا، وَحَقَّ الْعِبادِ عَلى اللهِ أَنْ لا يُعَذِّبَ مَنْ لا يُشْرِكُ بِهِ شَيْئًا فَقُلْتُ يا رَسُولَ اللهِ: أَفَلا أُبَشِّرُ بِهِ النَّاسَ قَالَ: لا تُبَشِّرْهُمْ فَيَتَّكِلُوا
__________
أخرجه البخاري في: 56 كتاب الجهاد: 46 باب اسم الفرس والحمار
19. హజ్రత్ ముఆజ్ (రదియల్లాహు అన్హు) కథనం:- నేనొకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెనుక అఫీర్ పేరు గల గాడిదపై ఎక్కి ప్రయాణం చేస్తున్నాను. (దారిలో) ఆయన “ముఆజ్! దాసులపై అల్లాహ్ హక్కేమిటో, అల్లాహ్ పై దాసుల హక్కేమిటో నీకేమయినా తెలుసా?” అని అడిగారు. నేను “అల్లాహ్ కి, దైవప్రవక్తకు మాత్రమే బాగా తెలుసు” అన్నాను. అప్పుడాయన “దాసులపై అల్లాహ్ కున్న హక్కు – వారు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి. ఆయనకు మరెవరినీ ఏ మాత్రం సాటి కల్పించకూడదు. అల్లాహ్ పై దాసులకున్న హక్కు – ఆయన తనకు సాటి కల్పించని వారిని శిక్షించకపోవడమే” అని అన్నారు. “అయితే దైవప్రవక్తా! నేనీ శుభవార్తను ప్రజలకు తెలియజేయనా?” అని అడిగాను. దానికి ఆయన “వద్దు. (అప్పుడే) ఈ శుభవార్తను ప్రజలకు తెలియజేయకు. అలా చెబితే వారు దీని మీదే ఆధారపడతారు (ఆచరణకు దూరమయిపోతారు)” అని హెచ్చరించారు.
[సహీహ్ బుఖారీ : 56వ ప్రకరణం – జిహాద్, 46వ అధ్యాయం – ఇస్మిల్ ఫరసి వల్ హిమార్)
20 – حديث أَنَسِ بْنِ مالِكٍ أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَمُعاذٌ رَديفُهُ عَلى الرَّحْلِ، قَالَ: يا مُعاذُ بْنَ جَبَلٍ قَالَ: لَبَّيْكَ يا رَسُولَ اللهِ وَسَعْدَيْكَ، قَالَ: يا مُعاذُ قَالَ: لَبَّيْكَ يَا رَسُولَ اللهِ وَسَعْدَيْكَ ثَلاثًا، قَالَ: ما مِنْ أَحَدٍ يَشْهَدُ أَنْ لا إِلهَ إِلاَّ اللهُ وَأَنَّ مُحَمَّدًا رَسُولُ اللهِ صِدْقًا مِنْ قَلْبِهِ إِلاَّ حَرَّمَهُ اللهُ عَلى النَّارِ قَالَ: يا رَسولَ اللهِ أَفَلا أُخْبِرُ بِهِ النَّاسَ فَيَسْتَبْشِروا قَالَ: إِذًا يَتَّكِلُوا وَأَخْبَرَ بِها مُعاذٌ عِنْدَ مَوْتِهِ تَأَثُّما
__________
أخرجه البخاري في: 3 كتاب العلم: 49 باب من خص بالعلم قومًا دون قوم كراهية أن لا يفهموا
20. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం:- ఒకసారి ముఆజ్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వాహనం మీద ఆయన వెనుక ఎక్కి ప్రయాణం చేస్తున్నారు. (దారిలో) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఓ ముఆజ్!” అని పిలిచారు. దానికి ముఆజ్ (రదియల్లాహు అన్హు) “దగ్గరే ఉన్నాను దైవప్రవక్తా! మీ సేవ కోసం సిద్ధంగా ఉన్నాను” అని అన్నారు. ఈ విధంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తనను మూడుసార్లు పిలిచారని, ప్రతిసారీ తాను ఇలాగే సమాధానమిచ్చానని ముఆజ్ (రదియల్లాహు అన్హు) తెలిపారు. మూడవసారి, “అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) దైవప్రవక్త అని మనస్ఫూర్తిగా సాక్ష్యమిచ్చేవారికి అల్లాహ్ నరకాగ్ని (శిక్ష)ని నిషేధించాడు” అని చెప్పారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). అప్పుడు ముఆజ్(రదియల్లాహు అన్హు) “అయితే దైవప్రవక్తా! నేనీ విషయాన్ని ప్రజలకు తెలియజేయనా, వారు విని సంతోషిస్తారు?” అని అడిగారు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “వద్దు (అప్పుడే వద్దు) ఈ విషయం తెలియజేస్తే వారు దీని మీద ఆధారపడి కూర్చుండిపోతారు” అని అన్నారు. అందువల్ల హజ్రత్ ముఆజ్ (రదియల్లాహు అన్హు) (ఈ హదీసుని చాలా రోజుల వరకు ప్రజల ముందు వెల్లడించలేదు. అయితే) హదీసుని అసలు వెల్లడించకపోతే పాపినవుతానేమోనని భయపడి తన అంత్యఘడియలలో దాన్ని వెల్లడించారు.
[సహీహ్ బుఖారీ: 3వ ప్రకరణం – అల్ ఇల్మ్, 49వ అధ్యాయం – మన్ ఖస్యబిల్ ఇల్మి ఖౌమన్ దూనఖౌమ్)
12వ అధ్యాయం – ‘విశ్వాసం’, దాని శాఖలు
شعب الإيمان
21 – حديث أَبي هُرَيْرَةَ رضي الله عنه عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: الإِيمانُ بِضْعٌ وَسِتُّونَ شُعْبَةً وَالْحَياءُ شُعْبَةٌ مِنَ الإِيمانِ
__________
أخرجه البخاري في: 2 كتاب الإيمان: 3 باب أمور الإيمان
21. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- “ఈమాన్ (విశ్వాసం)కు చెందిన శాఖలు అరవైకి పైగా ఉన్నాయి. బిడియం కూడా ఈమాన్‌కు చెందిన శాఖే” అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు.
(సహీహ్ బుఖారీ: 2వ ప్రకరణం-ఈమాన్, 3వ అధ్యాయం – ఉమూరుల్ ఈమాన్)
22 – حديث ابْنِ عُمَرَ: أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مَرَّ عَلى رَجُلٍ مِنَ الأَنْصارِ وَهُوَ يَعِظُ أَخَاهُ في الْحَياءِ، فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: دَعْهُ فَإِنَّ الْحَياءَ مِنَ الإِيمانِ
__________
أخرجه البخاري في: 2 كتاب الإيمان: 16 باب الحياء من الإيمان
22. హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎక్కడికో వెళ్తూ ఉంటే దారిలో ఒక అన్సారీ ముస్లిం తారసపడ్డాడు. అతను తన సాటి (ముస్లిం) సోదరునికి హితోపదేశం చేస్తూ “మరీ అంత సిగ్గుపడతావేమిటి?” అన్నాడు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కల్పించుకుంటూ “పోనివ్వు, సిగ్గు కూడా విశ్వాసంలోని ఒక భాగమే” అని చెప్పారు.
[సహీహ్ బుఖారీ : 2వ ప్రకరణం – ఈమాన్, 16వ అధ్యాయం – అల్ హయా మినల్ ఈమాన్]
23 – حديث عِمَرانَ بْنِ حُصَيْنٍ قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: الْحَياءُ لا يَأتي إِلاّ بِخَيْرٍ
__________
أخرجه البخاري في: 78 كتاب الأدب: 77 باب الحياء
23. హజ్రత్ ఇమ్రాన్ బిన్ హుసైన్ (రదియల్లాహు అన్హు) కథనం:- “బిడియం వల్ల మేలు మాత్రమే జరుగు తుంది” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).
[సహీహ్ బుఖారీ : 78వ ప్రకరణం – అదబ్, 77వ అధ్యాయం – అల్ హయా)
14వ అధ్యాయం – ఇస్లాం ప్రకారం అన్నిటికన్నా శ్రేష్ఠమైన పనులు (ఆచరణలు)
بيان تفاضل الإسلام وأي أموره أفضل
24 – حديث عبْد اللهِ بْنِ عَمْرٍو أَنَّ رَجُلاً سَأَلَ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَيُّ الإِسْلامِ خَيْرٌ قَالَ: تُطْعِمُ الطَّعامَ وَتَقْرَأُ السَّلامَ عَلى مَنْ عَرَفْتَ وَمَنْ لَمْ تَعْرِفْ
__________
أخرجه البخاري في: 2 كتاب الإيمان: 6 باب إطعام الطعام من الإسلام
24. హజ్రత్ అబ్దుల్లా బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హు) కథనం:- ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చి “ఇస్లాంకు సంబంధించిన ఆచరణలలో అన్నిటికన్నా శ్రేష్ఠమైన ఆచరణ ఏది?” అని అడిగాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “నీవు బీదసాదలకు అన్నం పెట్టు. (అలాగే) పరిచయమున్నా లేకపోయినా ప్రతి వ్యక్తికీ సలాం చెయ్యి. ఇవే అన్నిటికంటే శ్రేష్ఠమైన ఆచరణలు” అని బోధించారు.
[సహీహ్ బుఖారీ : 2వ ప్రకరణం – ఈమాన్, 6వ అధ్యాయం – తాముల్ ఇతఆమ్ మినల్ ఇస్లాం]
25 – حديث أَبي مُوسَى رضي الله عنه قَالَ: قَالُوا يا رَسُولَ اللهِ أَيُّ الإِسْلامِ أَفْضَلُ قَالَ: مَنْ سَلِمَ الْمُسْلِمُونَ مِنْ لِسانِهِ وَيَدِهِ
__________
أخرجه البخاري في: 2 كتاب الإيمان: 5 باب أي الإسلام أفضل
25. హజ్రత్ అబూ మూసా (రదియల్లాహు అన్హు) కథనం:- ఓ సారి ప్రవక్త అనుచరులు “దైవప్రవక్తా! అందరిలో కెల్లా ఎవరి ఇస్లాం (ధర్మం) శ్రేష్ఠమైనది?” అని అడిగారు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధానమిస్తూ “మాటల ద్వారా గాని, చేతల ద్వారా గాని తోటి ముస్లింలను బాధ కలిగించని వాడి (ఇస్లాం ధర్మం ఎక్కువ శ్రేష్ఠమైనది)” అని తెలియజేశారు.
[సహీహ్ బుఖారీ – 2వ ప్రకరణం – ఈమాన్, 5వ అధ్యాయం – అయ్యుల్ ఇస్లామి అఫ్జల్)
15వ అధ్యాయం – విశ్వాస మాధుర్యాన్ని ఆస్వాదించేవాడు.
بيان خصال من اتصف بهن وجد حلاوة الإيمان
26 – حديث أَنَسٍ عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: ثَلاثٌ مَنْ كُنَّ فِيهِ وَجَدَ حَلاوَةَ الإِيمانِ، أَنْ يَكُونَ اللهُ وَرَسُولُهُ أَحَبَّ إِلَيْهِ مِمّا سِواهُما، وَأَنْ يُحِبَّ الْمَرْءَ لا يُحِبُّهُ إِلاّ للهِ، وَأَنْ يَكْرَهَ أَنْ يَعُودَ في الْكُفْرِ كَما يَكْرَهُ أَنْ يُقْذَفَ في النَّارِ
__________
أخرجه البخاري في: 2 كتاب الإيمان: 9 باب حلاوة الإيمان
26. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం:- “ఈ క్రింది మూడు లక్షణాలు కలిగి ఉన్నవాడు విశ్వాస మాధుర్యాన్ని ఆస్వాదిస్తాడ”ని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియజేశారు. 1) అందరికంటే ఎక్కువ అల్లాహ్ ను, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను అభిమానించడం, 2) ఎవరిని అభిమానించినా కేవలం దైవప్రసన్నత కోసం అభిమానించడం, 3) (నరక) అగ్నిలో పడటానికి ఎంతగా అసహ్యించుకుంటాడో అవిశ్వాస స్థితి వైపుకు మరలిపోవడానికి కూడా అంతగా అసహ్యించుకోవడం.
[సహీహ్ బుఖారీ : 2వ ప్రకరణం – ఈమాన్, 9వ అధ్యాయం – హలావతిల్ ఈమాన్]
16వ అధ్యాయం – భార్యాపిల్లలు, తల్లిదండ్రులు, సమస్త మానవాళి కంటే ఎక్కువగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను అభిమానించడం.
وجوب محبة رسول الله صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أكثر من الأَهل والولد والوالد والناس أجمعين
27 – حديث أَنَس قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: لا يُؤْمِنُ أَحَدُكُمْ حَتّى أَكُونَ أَحَبَّ إِلَيْهِ مِنْ والِدِهِ وَوَلَدِهِ وَالنَّاسِ أَجْمَعينَ
__________
أخرجه البخاري في: 2 كتاب الإيمان: 8 باب حب الرسول صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ من الإيمان
27. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం :- “తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, ప్రపంచంలోని ఇతర మానవులందరి కన్నా ఎక్కువగా నన్ను అభిమానించనంత వరకు మీలో ఏ ఒక్కడూ నిజమైన విశ్వాసి కాజాలడు” అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు.*
[సహీహ్ బుఖారీ : 2వ ప్రకరణం – ఈమాన్, 8వ అధ్యాయం – హుబ్బుర్రసూలి మినల్ ఈమాన్]
* హదీసులో ప్రస్తావించబడిన ఈ అభిమానం సహజసిద్ధమైన అప్రయత్నాభిమానం కానవసరం లేదు. అంటే ఉద్దేశ్వపూర్వకమైన ప్రేమాభిమానాలన్న మాట. దీని ప్రకారం ఆజ్ఞపాలనా, వినయ విధేయతల్లో మనిషి తన తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, బంధుమిత్రులకన్నా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు అత్యధిక ప్రాధాన్యత నివ్వాలి.
17వ అధ్యాయం – తన కోసం ఇష్టపడినదే తోటి ముస్లిం కోసం ఇష్టపడటం విశ్వాస లక్షణం.
الدليل على أن من خصال الإيمان أن يحب لأَخيه ما يحب لنفسه من الخير
28 – حديث أَنَسٍ عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: لا يُؤْمِنُ أَحَدُكُمْ حَتّى يُحِبَّ َلأخيهِ ما يُحِبُّ لِنَفْسِهِ
__________
أخرجه البخاري في: 2 كتاب الإيمان: 7 باب من الإيمان أن يحب لأخيه ما يحب لنفسه
28. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం:- “తన కోసం ఇష్టపడినదే తన (ముస్లిం) సోదరుని కోసం కూడా ఇష్టపడనంతవరకు మీలో ఏ ఒక్కడూ నిజమైన విశ్వాసి కాజాలడు” అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు.
(సహీహ్ బుఖారీ: 2వ ప్రకరణం – ఈమాన్, 7వ అధ్యాయం – మినల్ ఈమాని అఁయ్యుహబ్బుల్ అఖీహ్)
الحث على إِكرام الجار والضيف وقول الخير أو لزوم الصمت وكون ذلك كله من الإيمان
29 – حديث أَبي هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: مَنْ كانَ يُؤْمِنُ بِاللهِ وَالْيَوْمِ الآخِرِ فَلا يُؤْذِ جارَهُ، وَمَنْ كَانَ يُؤْمِنُ بِاللهِ وَالْيَوْمِ الآخِرِ فَلْيُكْرِمْ ضَيْفَهُ، وَمَنْ كَانَ يُؤْمِنُ بِاللهِ وَالْيَوْمِ الآخِرِ فَلْيَقُلُ خَيْرًا أَوْ لِيَصْمُتْ
__________
أخرجه البخاري في: 78 كتاب الأدب: 31 باب من كان يؤمن بالله واليوم الآخر فلا يؤذ جاره
29. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు – “అల్లాహ్ ను, అంతిమ (ప్రళయ) దినాన్ని విశ్వసించేవారు ఎట్టి పరిస్థితిలోనూ తన పొరుగువాడ్ని బాధించకూడదు. అల్లాహ్ ను, అంతిమదినాన్ని విశ్వసించేవాడు తన అతిథిని గౌరవించాలి. అల్లాహ్ ను, అంతిమదినాన్ని విశ్వసించేవాడు పలికితే మంచి మాటనే పలకాలి లేదా మౌనం వహించాలి.”
[సహీహ్ బుఖారీ : 78వ ప్రకరణం – అదబ్, 31 వ అధ్యాయం – మన్ కాన యూమిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ ఫలా యూజి జారహ్)
30 – حديث أَبي شُرَيْحٍ الْعَدَوِيّ قَالَ: سَمِعَتْ أُذُنَايَ وَأَبْصَرَتْ عَيْنَايَ حِينَ تَكَلَّمَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: مَنْ كَانَ يُؤْمِنُ بِاللهِ وَالْيَوْمِ الآخِرِ فَلْيُكْرِمْ جَارَهُ، وَمَنْ كانَ يُؤْمِنُ بِاللهِ وَالْيَوْمِ الآخِرِ فَلْيُكْرِمْ ضَيْفَهُ جائِزَتُهُ، قَالَ: وَما جاِئِزَتُهُ يا رَسُولَ اللهِ قالَ: يَوْمٌ وَلَيْلَةٌ، وَالضِّيافَةُ َثلاثَةُ أَيَّامٍ فَما كانَ َوراءَ ذَلِكَ فَهُوَ صَدَقَةٌ َعلَيْهِ، وَمَنْ كانَ يُؤْمِنُ بِاللهِ وَالْيَوْمِ الآخِرِ فَلْيَقُلْ خَيْرًا أَوْ لِيَصْمُتْ
__________
أخرجه البخاري في: 78 كتاب الأدب: 31 باب من كان يؤمن بالله واليوم الآخر فلا يؤذ جاره
30. హజ్రత్ అబూ షురై అదలి (రదియల్లాహు అన్హు) కథనం:- నేను కళ్ళారా చూసి చెవులారా విన్నాను, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు. “అల్లాహ్ ను, అంతిమదినాన్ని విశ్వసించేవాడు తన పొరుగువాడ్ని గౌరవించాలి; అల్లాహ్ ను, అంతిమదినాన్ని విశ్వసించేవాడు తన అతిథిని సత్కరించి ఆతిథ్యమివ్వాలి” అప్పుడు కొందరు అనుచరులు “దైవప్రవక్తా! ఈ సత్కారం ఎన్ని రోజులు జరగాలి?” అని అడిగారు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఒక రోజు బాగా సత్కరించాలి. మూడు రోజులు సాధారణ ఆతిథ్యమివ్వాలి. అంతకంటే ఎక్కువ రోజులు ఆతిథ్యమిస్తే అది సదఖా (దానం)గా పరిగణించబడుతుంది. పోతే అల్లాహ్ ను, అంతిమదినాన్ని విశ్వసించినవాడు పలికితే మంచి మాటను పలకాలి లేదా మౌనం వహించాలి” అని అన్నారు.
[సహీహ్ బుఖారీ – 78వ ప్రకరణం – అదబ్, 31వ అధ్యాయం-మన్ కానయూమిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ ఫలా యూజి జారహ]
20వ అధ్యాయం – యమన్ వాసుల విశిష్ఠ ‘విశ్వాసం’
تفاضل أهل الإيمان فيه ورجحان أهل اليمن فيه
31 – حديثُ عُقْبَةَ بْنِ عَمْرٍو أَبي مَسْعودٍ قَالَ: أَشارَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بِيَدِهِ نَحْوَ الْيَمَنِ فَقالَ: الإِيمانُ يَمانٍ هَهنا، أَلا إِنَّ الْقَسْوَةَ وَغِلَظَ الْقُلُوبِ في الْفَدَّادِينَ عِنْدَ أُصولِ أَذْنابِ الإِبْلِ حَيْثُ يَطْلُعُ قَرْنا الشَّيْطانِ في رَبيعَةَ وَمُضَرَ
__________
أخرجه البخاري في: 59 كتاب بدء الخلق: 15 باب خير مال المسلم غنم يتبع بها شعف الجبال
31. హజ్రత్ అబూ మస్ వూద్ ఉఖ్బా బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన చేతిని యమన్ దేశం వైపుకు చూపుతూ “ఈమాన్ అటు (యమన్) వైపు ఉంది. గుర్తుంచుకోండి! ఒంటెల తోకలు పట్టుకొని, అరుస్తూ అదిలించే ఒంటెల కాపరులలో (ఎక్కువ) కాఠిన్యం, కర్కశత్వాలు ఉన్నాయి. అక్కడ నివసించే రబియా, ముజర్ తెగల నుంచి షైతాన్ కొమ్ములు మొలుస్తాయి” అని అన్నారు.
(సహీహ్. బుఖారీ : 59వ ప్రకరణం – బద్ అల్ ఖల్ ఖ్ , 15వ అధ్యాయం – ఖైరి మాలిల్ ముస్లిమి గనమున్ యత్ బవు బిహా షాఫల్ జిబాలి]
32 – حديث أَبي هُرَيْرَةَ رضي الله عنه عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: أَتاكُمْ أَهْلُ الْيَمَنِ، أَضْعَف قُلوبًا، وَأَرَقُّ أَفْئِدَةً، الْفِقْهُ يَمانٍ وَالْحِكْمَةُ يَمانِيَةٌ
__________
أخرجه البخاري في: 64 كتاب المغازي: 74 باب قدوم الأشعريين وأهل اليمن
32. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు: “మీ దగ్గరకు యమన్ వాసులు వస్తున్నారు. వీరు మృదు మనస్కులు, దయార్ద్రహృదయులు. ధర్మావగాహనా శక్తి, వివేకాలు కూడా వారి సొత్తే.”
(సహీహ్ బుఖారీ: 64వ ప్రకరణం – ముగాజి, 74వ అధ్యాయం – ఖుదూముల్ అష్ అరియ్యీన వ అహ్లిల్ యమన్.]
33 – حديث أَبي هُرَيْرَةَ رضي الله عنه أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: رَأْسُ الْكُفْرِ نَحْوَ الْمَشْرِقِ، وَالْفَخْرُ وَالْخُيَلاءُ في أَهْلِ الْخَيْلِ وَالإِبِلِ وَالْفَدَّادينَ أَهْلِ الْوَبَرِ، وَالسَّكينَةُ في أَهْلِ الْغَنَمِ
__________
أخرجه البخاري في: 59 كتاب بدء الخلق: 15 باب خير مال المسلم غنم يتبع بها شعف الجبال
33. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు, “సత్య తిరస్కారం శిరస్సు తూర్పు దిక్కున ఉంది. గర్వం, డాంబికాలు భూస్వాములలో, గుర్రాలు ఒంటెలు కల అనాగరిక ధనికులలో ఉన్నాయి. మృదుత్వం మేకలు కల పేదవారిలో ఉంది.”
(సహీహ్ బుఖారీ : 59వ ప్రకరణం – బద్ ఖల్జీ, 15వ అధ్యాయం, ఖైరుమాలిల్ ముస్లిమి గనము యత్ బు బిహా షఆఫల్ జిబాల్)
34 – حديث أَبي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: الْفَخْر وَالْخُيَلاءُ في الْفَدَّادينَ أَهْلِ الْوَبَرِ، وَالسَّكينَةُ في أَهْلِ الْغَنَمِ، وَالإِيمانُ يَمانٍ، وَالْحِكْمَةُ يَمانِيَةٌ
__________
أخرجه البخاري في: 61 كتاب المناقب: 1 باب قول الله تعالى: (يأيها الناس إنا خلقناكم من ذكر وأنثى وجعلناكم شعوباً وقبائل لتعارفوا)
34. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా చెబుతుండగా విన్నాను, “గర్వం, డాంబికాలు ఒంటెలు కల అనాగరిక ధనికులలో ఉన్నాయి. మృదుత్వం మేకలు గల పేదవారిలో ఉంది. ‘విశ్వాసం’ యమన్ వాసులలో ఉంది. వివేకం ధర్మావగాహనా శక్తులు కూడా యమన్ వాసుల సొత్తే.”
(సహీహ్ బుఖారీ : 61వ ప్రకరణం – మనాఖిబ్, 1వ అధ్యాయం – ఖౌలిల్లాహుత ఆలా]
21వ అధ్యాయం – జన శ్రేయోభిలాష కూడా ధర్మాంశమే.
بيان أن الدين النصيحة
35 – حديث جَريرِ بْنِ عَبْدِ اللهِ قَالَ بايَعْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَلى السَّمْعِ وَالطَّاعَةِ، فَلَقَّنَني فِيما اسْتَطَعْتُ، وَالنُّصْحِ لِكلِّ مُسْلِمٍ
__________
أخرجه البخاري في: 93 كتاب الأحكام: 43 باب كيف يبايع الإمام الناس
بيان نقصان الإيمان بالمعاصي ونفيه عن المتلبس بالمعصية على إرادة نفي كماله
35. హజ్రత్ జరీర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం:- నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చేతిలో చేయి వేసి, ఆయన బోధించే మాటలు వింటానని, ఆయన పట్ల విధేయత కలిగి ఉంటానని ప్రమాణం చేశాను. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “నా శక్తి మేరకు (ఇలా చేస్తాను) అని చెప్పు” అని ఉపదేశించారు. ఆ తరువాత నేను ముస్లింలందరి పట్ల శ్రేయోభిలాష కలిగి ఉంటానని కూడా ప్రమాణం చేశాను.
(సహీహ్ బుఖారీ: 93వ ప్రకరణం – అహకామ్, 43వ అధ్యాయం]
22వ అధ్యాయం – పాపకార్యాలు విశ్వాసానికి గొడ్డలి పెట్టు
36 – حديثُ أَبي هُرَيْرَةَ أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: لا يَزْنِي الزَّانِي حِينَ يَزْني وَهُوَ مُؤْمِنٌ، وَلا يَشْرَبُ الْخَمْرَ حِينَ يَشْرَبُهَا وَهُوَ مُؤْمِنٌ، وَلا يَسْرِقُ السَّارِقُ حِينَ يَسْرِقُ وَهُوَ مُؤْمِنٌ
وزَادَ في رِوايَةٍ وَلا يَنْتَهِبُ نُهْبَةً ذَاتَ شَرَفٍ يَرْفَعُ النَّاسُ إِلَيْهِ أَبْصارَهُمْ فِيها حِينَ يَنْتَهِبُها وَهُوَ مُؤْمِنٌ
__________
أخرجه البخاري في: 74 كتاب الأشربة: 1 باب قول الله تعالى: (إنما الخمر والميسر والأنصاب والأزلام رجس من عمل الشيطان)
36. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “వ్యభిచారి వ్యభిచారం చేస్తున్నప్పుడు విశ్వాసిగా ఉండడు. త్రాగుబోతు మద్యం సేవిస్తున్నప్పుడు విశ్వాసిగా ఉండడు. దొంగ దొంగతనం చేస్తున్నప్పుడు విశ్వాసిగా ఉండడు.*
మరో ఉల్లేఖనంలో పై విషయాలతో పాటు ఈ విషయం కూడా అదనంగా చేర్చబడింది – ప్రజలు కళ్ళారా చూస్తుండగా దోపిడీ దొంగ పెద్ద ఎత్తున లూటీ చేస్తున్నప్పుడు అతను విశ్వాసిగా ఉండడు.
[సహీహ్ బుఖారీ : 74వ ప్రకరణం – అప్రబా, 1వ అధ్యాయం – ఖౌలల్లాహు….. ఇన్నమల్ ఖమ్రు వల్ మైసిరు….]
* హజ్రత్ అబూజర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం లా ఇలాహ ఇల్లలాహ్ అని అంగీకరించిన ప్రతి వ్యక్తి వ్యభిచరించినా, దొంగతనం చేసినా సరే స్వర్గంలో ప్రవేశిస్తాడని ఒక హదీసులో ఉంది. దివ్యఖుర్ఆన్లో “అల్లాహ్ బహుదైవారాధన ( షిర్క్) పాపాన్ని తప్ప ఇతర పాపాలను తాను తలచుకుంటే క్షమిస్తాడు” అని ఉంది. ఈ కారణాల దృష్ట్యా తత్వవేత్తలు మద్యపానం, వ్యభిచారం, దొంగతనం లాంటి పాపాలు చేస్తున్నప్పుడు మనిషిలో పరిపూర్ణ విశ్వాసం ఉండదని అభిప్రాయపడ్డారు.
23వ అధ్యాయం – కపట విశ్వాసి లక్షణాలు
بيان خصال المنافق
37 – حديث عَبْدِ اللهِ بْنِ عَمْرٍو أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: أَرْبَعٌ مَنْ كنَّ فِيهِ كَانَ مُنافِقًا خَالِصًا، وَمَنْ كانَتْ فِيهِ خَصْلَةٌ مِنْهُنَّ كانَتْ فِيهِ خَصْلَةٌ مِنَ النِّفاقِ حَتّى يَدَعَهَا: إِذا اؤْتُمِنَ خَانَ، وَإِذا حَدَّثَ كَذَبَ، وَإِذا عاهَدَ غَدَرَ، وَإِذا خَاصَمَ فَجَرَ
__________
أخرجه البخاري في: 2 كتاب الإيمان: 24 باب علامة المنافق
37. హజ్రత్ అబ్దుల్లా బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా తెలిపారు – “కపట విశ్వాసిలో నాలుగు దుర్లక్షణాలు ఉంటాయి. (1) భద్రపరచమని ఏదైనా వస్తువు అప్పగిస్తే దాని పట్ల అతను నమ్మక ద్రోహానికి పాల్పడతాడు. (2) నోరు విప్పితే అబద్ధమే పలుకుతాడు. (3) వాగ్దానం చేస్తే దాన్ని భంగపరుస్తాడు. (4) ఎవరితోనైనా జగడం పెట్టుకుంటే దుర్భాషకు దిగుతాడు. ఈ నాలుగు లక్షణాలు ఎవరిలోనైనా ఉంటే అతను పచ్చి కపట విశ్వాసిగా పరిగణించబడతాడు. ఒకవేళ ఈ నాలుగు లక్షణాలలో ఒక లక్షణం ఉంటే, దాన్ని విడనాడనంతవరకు అతనిలో కపట విశ్వాసానికి సంబంధించిన ఒక లక్షణం ఉన్నట్లే లెక్క.”
[సహీహ్ బుఖారీ : 2వ ప్రకరణం – ఈమాన్, 24వ అధ్యాయం – అలామతుల్ మునాఫిఖ్ ]
38 – حديث أَبي هُرَيْرَةَ عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: آيَةَ الْمُنافِق ثَلاثٌ: إِذا حَدَّثَ كَذَب، وَإِذا وَعَد أَخْلَفَ، وَإِذا اؤْتُمِنَ خَانَ
__________
أخرجه البخاري في: 2 كتاب الإيمان: 24 باب علامة المنافق
38. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు- “కపట విశ్వాసిని మూడు విషయాల ద్వారా గుర్తించవచ్చు. (1) అతను నోరు విప్పితే అబద్దం పలుకుతాడు. (2) వాగ్దానం చేస్తే దాన్ని భంగపరుస్తాడు. (3) భద్రపరచమని ఏదైనా వస్తువు అప్పగిస్తే దాని పట్ల అతను నమ్మక ద్రోహానికి పాల్పడతాడు.”
(సహీహ్ బుఖారీ : 2వ ప్రకరణం – ఈమాన్, 24వ అధ్యాయం – అలామతుల్ మునాఫిఖ్ )
24వ అధ్యాయం – ముస్లిం సోదరుడ్ని అవిశ్వాసి అనడం తగదు
بيان حال إيمان من قال لأَخيه المسلم يا كافر
39 – حديثُ عَبْدِ اللهِ بْنِ عُمَرَ أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: أَيُّما رَجُلٍ قالَ َلأخيهِ يا كافِرُ فَقَدْ باءَ بِها أَحَدَهُما
__________
أخرجه البخاري في: 78 كتاب الأدب: 73 باب من كفر أخاه بغير تأويل
39. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:- “ఒక ముస్లిం తన సాటి ముస్లిం సోదరుడ్ని అవిశ్వాసి (కాఫిర్) అని పిలిస్తే, వారిద్దరిలో ఒకరు తప్పకుండా అవిశ్వాసి అయిపోతాడ”ని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు.
(సహీహ్ బుఖారీ : 78వ ప్రకరణం – అదబ్, 73వ అధ్యాయం – మన్ కఫ్ఫర అఖాహు బిగైరి తావీల్)
25వ అధ్యాయం – రక్తసంబంధాన్ని వక్రీకరించి చెప్పుకునే వాడి విశ్వాసం
بيان حال إيمان من رغب عن أبيه وهو يعلم
40 – حديث أَبي ذَرٍّ رضي الله عنه أَنَّهُ سَمِعَ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: لَيْسَ مِنْ رَجُلٍ ادَّعَى لِغَيْرِ أَبيهِ وَهُوَ يَعْلَمُهُ إِلاَّ كَفَرَ، وَمَنِ ادَّعى قَوْمًا لَيْسَ لَهُ فِيهِمْ نَسَبٌ فَلْيَتَبَوَّأْ مَقْعَدَهُ مِنَ النَّارِ
__________
أخرجه البخاري في: 61 كتاب المناقب: 5 باب حدثنا أبو معمر
40. హజ్రత్ అబూజర్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా చెబుతుండగా నేను విన్నాను, “ఒక వ్యక్తి ఉద్దేశ్యపూర్వకంగా కన్న తండ్రిని కాదని వదలి వేరే వ్యక్తిని తన తండ్రిగా సూచించుకుంటే అతను సత్య తిరస్కారానికి పాల్పడినవాడవుతాడు. అలాగే ఒక వ్యక్తి తనకు చెందని వేరే జాతి (సంతతి) కి చెందిన వాణ్ణని చెప్పుకుంటే, అతను తన నివాసాన్ని నరకంలో కట్టుకున్నట్లే”.
[సహీహ్ బుఖారీ : 61వ ప్రకరణం – మనాఖిబ్, 5వ అధ్యాయం]
41 – حديثُ أَبي هُرَيْرَةَ عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: لا تَرْغَبُوا عَنْ آبائِكِمْ فَمَنْ رَغِبَ عَنْ أَبيهِ فَهُوَ كُفْرٌ
__________
أخرجه البخاري في: 85 كتاب الفرائض: 29 باب من ادعى إلى غير أبيه
41. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం :- “కన్న తండ్రిని తండ్రిగా అంగీకరించకపోవడం సత్య తిరస్కారమవుతుంది. అందువల్ల మీ తాత ముత్తాతలను కాదని మిమ్మల్ని మీరు ఇతరుల సంతతికి చెందిన వారమని చెప్పుకోకండి” అని తెలిపారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).”
(సహీహ్ బుఖారీ: 85వ ప్రకరణం – ఫరాయజ్, 29వ అధ్యాయం – మనిద్దఆ ఇలాగైరి అబీ]
42 – حديثُ سَعْدِ بْنِ أَبي وَقَّاصٍ وَأَبي بَكْرَةَ قَالَ سَعْدٌ سَمِعْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: مَنِ ادَّعى إِلى غَيْرِ أَبيهِ وَهُوَ يَعْلَمُ أَنَّهُ غَيْرُ أَبيهِ فَالْجَنَّةُ عَلَيْهِ حَرامٌ فَذُكِرَ َلأبي بَكْرَةَ فَقَالَ: وَأَنا سَمِعَتْهُ أُذُنايَ وَوَعاهُ قَلْبي مِنْ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ
__________
أخرجه البخاري في: 85 كتاب الفرائض: 29 باب من ادعى إلى غير أبيه
42. హజ్రత్ సాద్ బిన్ అబీ వఖ్కాస్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా బోధిస్తుండగా నేను విన్నాను, “ఒక వ్యక్తి బుద్ధిపూర్వకంగా కన్న తండ్రిని కాదని వేరే మనిషిని తన తండ్రిగా చెప్పుకుంటే అలాంటి వ్యక్తికి స్వర్గ ప్రవేశం నిషేధించబడుతుంది.”
ఈ ప్రవచనాన్ని హజ్రత్ అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు) ముందు విన్పించినప్పుడు ఆయన దీన్ని ధృవీకరిస్తూ “ఈ హదీసుని నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నోట చెవులారా విని నా మేధలో భద్రపరచుకున్నాను” అని అన్నారు.
(సహీహ్ బుఖారీ : 85వ ప్రకరణం – 29వ అధ్యాయం -మనిద్దఆ ఇలాగైరి అబీ)
26వ అధ్యాయం – సాటి ముస్లింని దూషించడం, అతనితో పోరాడటం ఘోరమైన విషయం
بيان قول النبيّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ سباب المسلم فسوق وقتاله كُفر
43 – حديثُ عَبْدِ اللهِ بْنِ مَسْعودٍ أَنَّ النَّبِيّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: سِبَابُ الْمُسْلِم فُسُوقٌ وَقِتالُهُ كُفْرٌ
__________
أخرجه البخاري في: كتاب الإيمان: 36 باب خوف المؤمن من أن يحبط عمله وهو لا يشعر
43. హజ్రత్ అబ్దుల్లా బిన్ మసూద్ (రదియల్లాహు అన్హు) కథనం :- “సాటి ముస్లింని దూషించడం దుర్మార్గం *, కడు హేయమైన విషయం ; అతనితో పోరాడటం సత్య తిరస్కారంతో సమానం” అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్నారు.
[సహీహ్ బుఖారీ : 2వ ప్రకరణం – ఈమాన్, 36వ అధ్యాయం – ఖౌఫిల్ మోమిని అఁయ్యహ్ బత అమలుహు వహువ లాయషవురు)
* ముస్లిం సమాజ ఏకాభిప్రాయం ప్రకారం సాటి ముస్లింని నిందించడం, దూషించడం నిషిద్ధం. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడినవాడు దుర్మార్గుడు (ఫాసిఖ్ )గా పరిగణించబడతాడు. అయితే సాటి ముస్లింలకు వ్యతిరేకంగా యుద్ధం చేయడం అవిశ్వాసం (కుఫ్ర్) క్రిందికి రాదు. ఈ హదీసు గురించి విభిన్న వ్యాఖ్యలు ఈ విధంగా ఉన్నాయి: (1) సాటి ముస్లింలతో యుద్ధం చేయడాన్ని ధర్మసమ్మతంగా తలచి యుద్ధం చేయవచ్చు. (2) ఈ హదీసులో పేర్కొన్న కుఫ్ర్ (సత్య తిరస్కారం లేక అవిశ్వాసం) అంటే కృతఘ్నత అని అర్థం. షరీఅత్ పరమైన కుఫ్ర్ కాదు. (3) సాటి ముస్లింలతో యుద్ధం చేయడం వల్ల కలిగే పర్యవసానం కుఫ్ర్ (అవిశ్వాసం) మాత్రమే. (4) ఈ పని – అంటే ముస్లింలతో యుద్ధం చేయడం అవిశ్వాసులు చేసే పని.
27వ అధ్యాయం – ఒకర్నొకరు చంపుకొని అవిశ్వాసులయిపోకండి.
لا ترجعوا بعدي كفارًا يضرب بعضكم رقاب بعض
44 – حديثُ جَريرٍ أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ لَهُ في حَجَّةِ الْوَداعِ: اسْتَنْصِتِ النَّاسَ، فَقالَ: لا تَرْجِعُوا بَعْدي كُفَّارًا يَضْرِبُ بَعْضُكُمْ رِقابَ بَعْضٍ
__________
أخرجه البخاري في: 3 كتاب العلم: 43 باب الإنصات للعلماء
44. హజ్రత్ జరీర్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ‘వీడ్కోలు హజ్ యాత్ర’ సమయంలో ప్రజలను నిశ్శబ్దంగా ఉండమని చెప్పు అని నన్నాదేశించారు. ప్రజల మధ్య నిశ్శబ్దం ఏర్పడిన తరువాత ఆయన ఉపన్యాసమిస్తూ “ప్రజలారా! నేనీ లోకం వీడిపోయిన తరువాత మీరు పరస్పరం మెడలు నరుక్కుంటూ అవిశ్వాసులయిపోకండి” అని హితవు చేశారు.
[సహీహ్ బుఖారీ : 3వ ప్రకరణం – అల్ ఇల్మ్, 43వ అధ్యాయం – అల్ ఇన్సాతిలిల్ ఉలమాయి)
45 – حديثُ ابْنِ عُمَرَ عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: وَيْلَكُمْ أَوْ وَيْحَكُمْ، لا تَرْجِعُوا بَعْدي كُفَّارًا يَضْرِبُ بَعْضُكُمْ رِقابَ بَعْضٍ
__________
أخرجه البخاري في: 78 كتاب الأدب: 95 باب ما جاء في قول الرجل ويلك
45. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాట్లాడుతూ “నా నిష్క్రమణ తరువాత మీరు ఒకర్నొకరు చంపుకుంటూ అవిశ్వాసులయిపోకండి. అల్లాహ్ మిమ్మల్ని కరుణించు గాక!” అని ఉపదేశించారు.
(సహీహ్ బుఖారీ : 78వ ప్రకరణం – అదబ్, 95వ అధ్యాయం – మాజాఅఫీ ఖౌలిర్రజులి వయ్ లక్)
30వ అధ్యాయం – తారాబలాన్ని నమ్మడం సత్యతిరస్కారంతో సమానం
بيان كفر من قال مطرنا بالنوء
46 – حديث زَيْدِ بْنِ خالِدٍ الْجُهَنِيِّ قَالَ: صَلّى لَنا رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ صَلاةَ الصُّبْحِ بالحُدَيْبِيَةِ عَلى إِثْرِ سَماءٍ كانَتْ مِنَ اللَّيْلَةِ، فَلَمّا انْصَرَفَ أَقْبَلَ عَلى النَّاسِ فَقالَ: هَلْ تَدْرُونَ مَاذا قَالَ رَبُّكُمْ قَالوا اللهُ وَرَسُولُهُ أَعْلَمُ قَالَ: أَصْبَحَ مِنْ عِبادي مُؤْمِنٌ بِيَ وَكافِرٌ، فَأَمّا مَنْ قَالَ مُطِرْنا بِفَضْلِ اللهِ وَرَحْمَتِهِ فَذَلِكَ مُؤْمِنٌ بِيَ وَكافِرٌ بِالْكَوْكَبِ وَأَمّا مَنْ قَالَ مُطِرْنا بِنَوْءِ كَذا وَكَذا فَذَلِكَ كافِرٌ بِيَ وَمُؤْمِنٌ بِالْكَوْكَبِ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 156 باب يستقبل الإمام الناس إذا سلّم
46. హజ్రత్ జైద్ బిన్ ఖాలిద్ జుహ్ని (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాతో కలిసి హుదైబియా ప్రాంతంలో ఉదయం నమాజు చేశారు. రాత్రి వర్షం కురిసింది. ఉదయం వరకు నేల తడిగానే ఉంది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు ముగిసిన తరువాత అనుచరుల వైపుకు తిరిగి, “అల్లాహ్ ఏం సెలవిచ్చాడో మీకు తెలుసా? ” అని అడిగారు. “అల్లాహ్ కి, దైవప్రవక్తకే బాగా తెలుసు. మాకు తెలియదు” అన్నారు అనుచరులు. అప్పుడు దైవప్రవక్త ఈ విధంగా తెలిపారు:“అల్లాహ్ ఇలా అన్నాడు – ఈ రోజు ఉదయం (విభిన్న మత విశ్వాసులు గల) నా దాసులలో కొందరు విశ్వాసులయిపోయారు, మరికొందరు అవిశ్వాసులయిపోయారు. అల్లాహ్ దయ వల్ల మనకు వర్షం కురిసింది అన్న వారు తారాబలాన్ని నిరాకరించి, నన్ను విశ్వసించిన వారయ్యారు. దీనికి భిన్నంగా ఫలానా నక్షత్ర ప్రభావంతో వర్షం కురిసిందని అన్నవారు నక్షత్ర విశ్వాసులయి, నన్ను తిరస్కరించిన వారయ్యారు”.
[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 156వ అధ్యాయం – యస్తగ్ బిలుల్ ఇమామున్నాస ఇజా సల్లమ్)
31వ అధ్యాయం – అన్సార్ ముస్లింలను ప్రేమించడం విశ్వాసానికి సూచన
الدليل على أن حب الأَنصار من الإيمان
47 – حديث أَنَسٍ عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: آيَةُ الإيمانِ حُبُّ الأَنْصارِ، وَآيَةُ النِّفاقِ بُغْضُ الأَنْصارِ
__________
أخرجه البخاري في: كتاب الإيمان: 10 باب علامة الإيمان حب الأنصار
47. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం:- “అన్సార్లను ప్రేమించడం విశ్వాసానికి సూచన, వారిని ద్వేషించడం కపట విశ్వాసానికి నిదర్శనం” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).
[సహీహ్ బుఖారీ : 2వ ప్రకరణం – ఈమాన్, 10వ అధ్యాయం – అలామతుల్ ఈమాని హుబ్బుల్ అన్సార్)
48 – حديث الْبَراء قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: الأَنْصارُ لا يُحِبُّهُمْ إِلاَّ مُؤْمِنٌ، وَلا يُبْغِضُهُمْ إِلاّ مُنافِقٌ، فَمَنْ أَحَبَّهُمْ أَحَبَّهُ اللهُ، وَمَنْ أَبْغَضَهُمْ أَبْغَضَهُ اللهُ
__________
أخرجه البخاري في: 63 كتاب مناقب الأنصار: 4 باب حب الأنصار
48. హజ్రత్ బరా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు, “అన్సార్లను నిజమైన విశ్వాసులు మాత్రమే అభిమానిస్తారు. వారిని కపట విశ్వాసులు మాత్రమే ద్వేషిస్తారు. అన్సార్లను అభిమానించే వారిని అల్లాహ్ అభిమానిస్తాడు.
(సహీహ్ బుఖారీ : 63వ ప్రకరణం – మనాఖిబుల్ అన్సార్, 4వ అధ్యాయం – హుబ్బుల్ అన్సార్)
32వ అధ్యాయం – ఆరాధనలు, ఆజ్ఞా పాలనల్లో ఉపేక్షాభావం విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది
بيان نقصان الإيمان بنقص الطاعات
49 – حديث أَبي سَعِيدٍ الْخُدْرِيِّ قَالَ: خَرَجَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ في أَضْحًى أَوْ فِطْرٍ إِلى المُصَلَّى فَمَرَّ عَلى النِّساءِ فَقَالَ: يا مَعْشَرَ النِّساءِ تَصَدَّقْنَ فَإِنّي أُريتُكُنَّ أَكْثَرَ أَهْلِ النَّارِ فَقُلْنَ: وَبِمَ يا رَسُولَ اللهِ قَالَ: تُكْثِرْنَ اللَّعْنَ وَتَكْفُرْنَ الْعَشيرَ، ما رَأَيْتُ مِنْ ناقِصاتٍ عَقْلٍ وَدينٍ أَذْهَبَ لِلُبِّ الرَّجُلِ الْحازِمِ مِنْ إِحْداكُنَّ قُلْنِ: وَما نُقْصانُ دِينِنا وَعَقْلِنا يا رَسُولَ اللهِ قَالَ: أَلَيْسَ شَهادَةُ الْمَرْأَةِ مِثْلَ نِصْفِ شَهادَةِ الرَّجُلِ قُلْنِ: بَلَى، قَالَ: فَذَلِكَ مِنْ نُقْصانِ عَقْلِها، أَلَيْسَ إِذا حَاضَتْ لَمْ تُصَلِّ وَلَمْ تَصُمْ قُلْنَ: بَلى، قَالَ: فَذَلِكَ مِنْ نُقْصانِ دِينِها
__________
أخرجه البخاري في: كتاب الحيض: 6 باب ترك الحائض الصوم
49. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం:- ఈదుల్ అజ్హా లేక ఈదుల్ ఫిత్ర్ (పండుగ) దినాన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈద్గాలో మహిళా భక్తుల ముందు నుంచి పోతూ “మహిళల్లారా! నరకంలో మీ సంఖ్య అధికంగా ఉన్నట్లు నాకు ‘మేరాజ్’ రాత్రిన చూపడం జరిగింది. అందువల్ల మీరు (వీలైనంత ఎక్కువగా) దానం చేస్తూ ఉండండి” అని బోధించారు. స్త్రీలు ఈ మాటలు విని “దానిక్కారణం ఏమిటి దైవప్రవక్తా?” అని అడిగారు. “మీరు తరచుగా నోరు పారేసుకుంటారు; భర్తల పట్ల కృతజ్ఞులయి ఉండరు. ధర్మం, విజ్ఞతావివేచనల దృష్ట్యా మీరు పురుషుల కన్నా తక్కువ అయినప్పటికీ పురుషుల్ని లోబరచుకుంటున్నారు” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). “ధర్మం, విజ్ఞతా వివేచనల దృష్ట్యా మేము పురుషుల కన్నా తక్కువ ఎలా అయ్యా ము దైవప్రవక్తా?” అని అడిగారు స్త్రీలు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “స్త్రీ సాక్ష్యం పురుష సాక్ష్యంలో సగానికి సమానం (అంటే ఒక పురుషుని సాక్ష్యం ఇద్దరు స్త్రీల సాక్ష్యంతో సమానం) కాదా?” అన్నారు. స్త్రీలు ‘ఔను, నిజమే’ అన్నారు. “స్త్రీలలో విజ్ఞతా వివేచనలు తక్కువ అనడానికి ఇదే నిదర్శనం. అలాగే స్త్రీలు రుతు సమయంలో నమాజ్ చేయలేరు కదా? ఉపవాసాలు పాటించలేరు కదా?” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). దానికి స్త్రీలు ‘ఔను, నిజమే’ అన్నారు. “కనుక ధర్మం దృష్ట్యా స్త్రీలు పురుషుల కన్నా తక్కువ అనడానికి ఇదొక నిదర్శనం” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).
[సహీహ్ బుఖారీ : 6వ ప్రకరణం – హైజ్, 6వ అధ్యాయం – తర్కిల్ హాయిజిస్సౌమ్]
34వ అధ్యాయం – అల్లాహ్ ను విశ్వసించడం అన్నిటికన్నా గొప్ప విషయం
بيان كون الإيمان بالله تعالى أفضل الأعمال
50 – حديث أَبي هُرَيْرَةَ أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ سُئِلَ: أَيُّ الْعَمَلِ أَفْضَلُ فَقَالَ: إِيمانٌ بِاللهِ وَرَسُولِهِ قِيلَ: ثُمَّ ماذا قَالَ: الْجِهادُ في سَبيلِ اللهِ قِيلَ: ثُمَّ ماذا قَالَ: حَجٌّ مَبْرورٌ
__________
أخرجه البخاري في: 2 كتاب الإيمان: 18 باب من قال إن الإيمان هو العمل
50. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చి “అన్నిటికంటే శ్రేష్ఠమైన ఆచరణ ఏమిటి?” అని అడిగాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను విశ్వసించడం” అని చెప్పారు. “ఆ తరువాత శ్రేష్ఠమైన ఆచరణ ఏమిటి?” అని అడిగాడతను. “అల్లాహ్ మార్గంలో పోరాడటం ” అని అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). “ఆ తరువాత శ్రేష్ఠమైన ఆచరణ ఏది?” అని మళ్ళీ అడిగాడతను. “చిత్తశుద్ధితో చేసే హజ్ (కాబా యాత్ర)” అని సమాధానమిచ్చారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).*
[సహీహ్ బుఖారీ : 2వ ప్రకరణం – ఈమాన్, 18వ అధ్యాయం – మనఖాల ఇన్నల్ ఈమాన హువల్ అమల్]
* ఎలాంటి పాపాలకు పాల్పడకుండా చిత్తశుద్ధితో చేసే హజ్ నే ‘మబ్రూర్ హజ్’ అంటారు. మరికొందరి అభిప్రాయం ప్రకారం హజ్ చేసిన తరువాత మరెన్నటికీ తప్పు చేయనని పశ్చాత్తాప హృదయంతో అల్లాహ్ ను వేడుకోని సత్కార్యాలలో నిమగ్నమయిపోవాలి. ఇలాంటి హజ్ నే ‘హజ్జె మబ్రూర్’ లేక సమ్మతించబడిన హజ్ అని అంటారు.
51 – حديث أَبي ذَرٍّ رضي الله عنه، قَالَ سَأَلْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: أَيُّ الْعَمَلِ أَفْضَلُ قَالَ: إِيمانٌ بِاللهِ وَجِهادٌ في سَبيلِهِ قُلْتُ: فَأَيُّ الرِّقابِ أَفْضَلُ قَالَ: أَغْلاها ثَمَنًا وَأَنْفَسُها عِنْدَ أَهْلِهَا قُلْتُ: فَإِنْ لَمْ أَفْعَلْ قَالَ: تُعِينُ صَانِعًا أَوْ تَصْنَعُ َلأخْرَقَ قَالَ: فَإِنْ لَمْ أَفْعَلْ قَالَ: تَدَعُ النَّاسَ مِنَ الشَّرِّ فَإِنَّها صَدَقَةٌ تَصَدَّقُ بِها عَلى نَفْسِكَ
__________
أخرجه البخاري في: 49 كتاب العتق: 2 باب أي الرقاب أفضل
51. హజ్రత్ అబూజర్ (రదియల్లాహు అన్హు) కథనం:- నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను “అన్నిటికంటే శ్రేష్ఠమైన ఆచరణ ఏది?” అని అడిగాను. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “అల్లాహ్ ను విశ్వసించి ఆయన మార్గంలో పోరాడటం”అని అన్నారు. “బానిసకు స్వేచ్చనివ్వడం (కూడా) శ్రేష్ఠమైన ఆచరణేనా?” అని అడిగాను నేను. “విలువను బట్టి ఎక్కువ ధరకు అమ్ముడు పోవడంతో పాటు, యజమానికి అందరికన్నా ఎక్కువ ఇష్టమైన బానిసకు (స్వేచ్చ ప్రసాదించాలి)” అన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). “ఒకవేళ నేనీ పని చేయలేని స్థితిలో ఉంటే!?” అని అడిగాను. “అప్పుడు ఏదైనా పని చేసేవాడికి ఆ పనిలో సహాయపడు లేదా పని చేయడం రానివాడికి పని చేసి పెట్టు” అని చెప్పారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). “మరి ఈ పని కూడా చేయలేని స్థితిలో ఉంటే మరేం చేయాలి?” అని అడిగాను మళ్ళీ. “అయితే ప్రజలను ఎలాంటి కష్టనష్టాలకు గురి చేయకు. ఇది కూడా నీ పాలిట ఒక విధమైన దానమే” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).
[సహీహ్ బుఖారీ : 49వ ప్రకరణం – అల్ ఇత్ఖ్, 2వ అధ్యాయం – అయ్యు ర్రిఖాబి అఫ్జల్)
52 – حديث عَبْدِ اللهِ بْنِ مَسْعُودٍ قَالَ سَأَلْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَيُّ الْعَمَلِ أَحَبُّ إِلى اللهِ قَالَ: الصَّلاةُ عَلى وَقْتِها قَالَ: ثُمَّ أَيّ قَالَ: ثُمَّ بِرُّ الْوالِدَيْنِ قَالَ: ثُمَّ أَيّ قَالَ: الْجِهادُ في سَبيلِ اللهِ قَالَ حَدَّثَنِي بِهِنَّ، وَلَوِ اسْتَزَدْتُهُ لَزَادَنِي
__________
أخرجه البخاري في: 9 كتاب مواقيت الصلاة: 5 باب فضل الصلاة لوقتها
52. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రదియల్లాహు అన్హు) కథనం:- నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను “అల్లాహ్ కి అన్నిటికంటే ఎక్కువ ప్రియమైన ఆచరణ ఏది?” అని అడిగాను. “వేళకు నమాజు చేయడం” అని ఆయన సమాధానమిచ్చారు. “ఆ తరువాత ఆచరణ ఏది?” అని అడిగాను మళ్ళీ. “తల్లిదండ్రుల పట్ల సద్వర్తనతో మెలగడం” అని అన్నారు ఆయన. “ఆ తరువాత ఏది?” అని ప్రశ్నించాను నేను. “దైవ మార్గంలో పోరాడటం” అని ఆయన చెప్పారు. – ఈ మాటలు స్వయంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నాకు తెలియజేశారు. ఒకవేళ నేను ఇంకా ఏమైనా అడిగితే వాటికి గూడా ఆయన సమాధానమిచ్చేవారు.
[సహీహ్ బుఖారీ : 9వ ప్రకరణం – మవాఖియతుస్సలాహ్, 5వ అధ్యాయం – ఫజ్లిస్సలాతి లివఖ్ తిహా]
35వ అధ్యాయం – షిర్క్ (బహుదైవారాధన) తరువాత వచ్చే ఘోరమైన పాపాలు
كون الشرك أقبح الذنوب وبيان أعظمها بعده
53 – حديث عَبْدِ اللهِ بْنِ مَسْعُودٍ قَالَ: سَأَلْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: أَيُّ الذَّنْبِ أَعْظَمُ عِنْدَ اللهِ قَالَ: أَنْ تَجْعَلَ للهِ نِدًّا وَهُوَ خَلَقَكَ قُلْتُ: إِنَّ ذَلِكَ لَعَظيمٌ، قلْتُ: ثُمَّ أَيّ قَالَ: وَأَنْ تَقْتُلَ وَلَدَكَ تَخافُ أَنْ يَطْعَمَ مَعَكَ، قُلْتُ: ثُمَّ أَيّ قَالَ: أَنْ تُزانِيَ حَليلَةَ جارِكَ
__________
أخرجه البخاري في: 65 كتاب التفسير، تفسير سورة البقرة: 3 باب قوله تعالى: (فلا تجعلوا لله أندادًا)
53. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రదియల్లాహు అన్హు) కథనం:- “అల్లాహ్ దృష్టిలో అన్నికంటే ఘోరమైన పాపం ఏద”ని నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను అడిగాను. దానికి ఆయన “నిన్ను సృష్టించినవాడు అల్లాహ్ అయినప్పటికీ, అలాంటి అల్లాహ్ కి దైవేతర శక్తులను సహవర్తులుగా కల్పించడం (అన్నిటికంటే ఘోరమైన పాపం)” అని అన్నారు. ” ఆ తరువాత ఘోరమైన పాపం ఏది?” అని అడిగాను మళ్ళీ. “ఆహారంలో నీతో పాలుపంచుకుంటారన్న ఉద్దేశ్యంతో నీవు నీ సంతానాన్ని హతమార్చివేయడం” అని చెప్పారు ఆయన. “ఆ తరువాత ఘోరమైన పాపం ఏది?” అని అడిగాను నేను మళ్ళీ. “నీవు నీ పొరుగింటి వాని భార్యతో వ్యభిచరించడం” అని ఆయన సమాధానమిచ్చారు.
[సహీహ్ బుఖారీ : 65వ ప్రకరణం -అత్తఫ్సీర్, సూరతుల్ బఖర; 3వ అధ్యాయం – ఫలా తజ్ అలూ లిల్లాహి అందాదన్]
36వ అధ్యాయం – ఘోరపాపాలు, ఘోరాతి ఘోరమైన పాపాలు
بيان الكبائر وأكبرها
54 – حديث أَبي بَكْرَةَ قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَلا أُنَبِّئُكُمْ بِأَكْبَرِ الْكَبائِرِ ثَلاثًا، قَالُوا: بَلى يا رَسُولَ اللهِ، قَالَ: الإِشْراكُ بِاللهِ وَعُقوقُ الْوالِدَيْنِ وَجَلَسَ، [ص:17] وَكانَ مُتَّكِئًا، فَقالَ أَلا وَقَوْلُ الزّورِ قَالَ فَما زَالَ يُكَرِّرُها حَتّى قُلْنا لَيْتَهُ سَكَتَ
__________
أخرجه البخاري في: 52 كتاب الشهادات: 10 باب ما قيل في شهادة الزور
54. హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మమ్మల్ని ఉద్దేశించి “నేను మీకు అన్నిటికంటే ఘోరమైన పాపాలను గురించి తెలుపనా?” అని అడిగారు. ఈ మాట ఆయన మూడుసార్లు పలికారు. దానికి మేము “తప్పకుండా తెలుపండి దైవప్రవక్తా!” అన్నాము. అప్పుడాయన “అల్లాహ్ కి ఇతరులను సాటి కల్పించడం, తల్లిదండ్రుల మాట వినకపోవడం” అని తెలిపారు. ఆ తరువాత ఆయన ఆనుకుని కూర్చున్న వారల్లా ఒక్కసారిగా లేచి సరిగా కూర్చొని “జాగ్రత్తగా వినండి! అబద్దమాడటం (అన్నిటికంటే ఘోరమైన పాపం)” అని అన్నారు. ఇలా మాటి మాటికి చెబుతూ పోయారు. చివరికి మేము మనస్సులో “అయ్యో! ఈయన ఈ మాటలు ఇక చాలిస్తే బాగుండు” అని అనుకున్నాం.
{సహీహ్ బుఖారీ: 52వ ప్రకరణం – షహాదాత్, 10వ అధ్యాయం – మాఖీల ఫీషహదతిజ్జూర్)
55 – حديث أَنَسٍ رضي الله عنه قَالَ سُئِلَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَنِ الْكَبائِرِ قَالَ: الإِشْراكُ بِاللهِ، وَعُقوقُ الْوالِدَيْنِ، وَقَتْلُ النَّفْسِ، وَشَهادَةُ الزّورِ
__________
أخرجه البخاري في: 52 كتاب الشهادات: 10 باب ما قيل في شهادة الزور
55. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం:- ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఘోరమైన పాపాలను గురించి అడిగాడు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “(1) అల్లాహ్ కి ఇతరుల్ని సాటి కల్పించడం, (2) తల్లిదండ్రుల మాట వినకపోవడం, (3) నరహత్యకు పాల్పడటం, (4) అసత్య సాక్ష్యమివ్వడం ఘోరమైన పాపాలు” అని తెలిపారు.
[సహీహ్ బుఖారీ :52 వ ప్రకరణం – షహాదాత్, 10వ అధ్యాయం – మాఖీల ఫీషహదతిజ్జూర్]
56 – حديث أَبي هُرَيْرَةَ رضي الله عنه، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: اجْتَنِبُوا السَّبْعَ الْمُوبِقاتِ قَالُوا: يا رَسُولَ اللهِ وَما هُنَّ قَالَ: الشِّرْكُ بِاللهِ، وَالسِّحْرُ، وَقَتْلُ النَّفْسِ الَّتي حَرَّمَ اللهُ إِلاَّ بِالْحَقِّ، وَأَكْلُ الرِّبا، وَأَكْلُ مَالِ الْيَتيمِ، وَالتَّوَلِّي يَوْمَ الزَّحْفِ، وَقَذْفُ الْمُحْصَنَاتِ الْمُؤْمِناتِ الْغافِلاتِ
__________
أخرجه البخاري في: 55 كتاب الوصايا: 23 باب قول الله تعالى: (إن الذين يأكلون أموال اليتامى ظلمًا)
56. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుచరుల్ని ఉద్దేశించి, “మిమ్మల్ని సర్వనాశనం చేసే పనులకు దూరంగా ఉండండ”ని హెచ్చరించారు. “ఆ పనులేమిటి దైవ ప్రవక్తా?” అని అడిగారు అనుచరులు. అప్పుడాయన ఇలా సెలవిచ్చారు – “(1) అల్లాహ్ కి సాటి కల్పించడం, (2) చేతబడి చేయడం, (3) ధర్మయుక్తంగా తప్ప అల్లాహ్ హతమార్చకూడదని నిషేధించిన ప్రాణిని హతమార్చడం, (4) వడ్డీ సొమ్ము తినడం, (5) అనాధ సొమ్మును హరించి వేయడం, (6) ధర్మయుద్ధంలో వెన్నుజూపి పారిపోవడం, (7) ఏ పాపమెరుగని అమాయక ముస్లిం స్త్రీల పై అపనిందలు మోపడం ”.
[సహీహ్ బుఖారీ: 55వ ప్రకరణం – అల్ వసాయా, 23వ అధ్యాయం – ఖౌలిల్లాహ్…. ఇన్నల్లజీనయాకులూన అమ్వాలల్ యతామాజుల్మా)
57 – حديث عَبْدِ اللهِ بْنِ عَمْرٍو قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِنَّ مِنْ أَكْبَرِ الْكَبائِرِ أَنْ يَلْعَنَ الرَّجُلُ والِدَيْهِ قِيلَ يا رَسُولَ اللهِ وَكَيْفَ يَلْعَنُ الرَّجُلُ والِدَيْهِ قَالَ: يَسُبُّ الرَّجُلُ أَبا الرَّجُلِ فَيَسُبُّ أَباهُ وَيَسُبُّ أُمَّهُ
__________
أخرجه البخاري في: 78 كتاب الأدب: 4 باب لا يسب الرجل والديه
57. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుచరుల్ని ఉద్దేశించి “అతిఘోరమైన పాపాలలో ఒకటి తల్లిదండ్రులను దూషించడం” అని అన్నారు. “దైవప్రవక్తా! ఏ మనిషైనా తన సొంత తల్లిదండ్రుల్ని ఎలా దూషించగలడు?” అని ప్రశ్నించారు అనుచరులు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఒక వ్యక్తి మరొక వ్యక్తి తల్లిదండ్రుల్ని దూషించినప్పుడు, అతను సమాధానంగా మొదటి వ్యక్తి తల్లిదండ్రులను దూషిస్తాడు. (ఇలా ఆ వ్యక్తి తన కన్న తల్లిదండ్రుల్ని దూషించిన వాడవు తాడు)” అని అన్నారు.
[సహీహ్ బుఖారీ: 78వ ప్రకరణం – అదబ్, 4వ అధ్యాయం – లాయసుబ్బుర్రజులు వాలిదైహి)
38వ అధ్యాయం – జీవితపు చరమ ఘడియల్లో షిర్క్ చేయనివాడు స్వర్గనివాసి అవుతాడు
من مات لا يشرك بالله شيئًا دخل الجنة
58 – حديثُ عَبْدِ اللهِ بْنِ مَسْعودٍ رضي الله عنه، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مَنْ ماتَ يُشْرِكُ بِاللهِ شَيْئًا دَخَلَ النَّارَ وَقُلْتُ أَنا: مَنْ ماتَ لا يُشْرِكُ بِاللهِ شَيْئًا دَخَلَ الْجَنَّةَ
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 1 باب في الجنائز ومن كان آخر كلامه لا إله إلا الله
58. హజ్రత్ అబ్దుల్లా బిన్ మసూద్ (రదియల్లాహు అన్హు) కథనం:- “అల్లాహ్ కి సాటి కల్పించే (బహుదైవారాధన చేసే) స్థితిలో చనిపోయే వ్యక్తి నరకానికి పోతాడ”ని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు. నేను ‘అల్లాహ్ కి సాటి కల్పించని (ఏకేశ్వరాధన చేసే) స్థితిలో మరణించే వ్యక్తి స్వర్గానికి పోతాడ’ని అన్నాను.
[సహీహ్ బుఖారీ: 23వ ప్రకరణం – జనాయెజ్, 1వ అధ్యాయం – ఫిల్ జనాయిజి వమన్ కాన ఆఖరు కలామిహీ లా ఇలాహ ఇల్లల్లాహు]
59 – حديث أَبي ذَرٍّ رضي الله عنه، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَتانِي آتٍ مِنْ رَبّي [ص:18] فَأَخْبَرَني، أَوْ قَالَ بَشَّرَني، أَنَّهُ مَنْ ماتَ مِنْ أُمَّتِي لا يُشْرِكُ بِاللهِ شَيْئًا دَخَلَ الْجَنَّةَ قلْتُ: وَإِنْ زَنى وَإِنْ سَرَقَ قَالَ: وَإِنْ زَنى وَإِنْ سَرَقَ
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 1 باب في الجنائز ومن كان آخر كلامه لا إله إلا الله
59. హజ్రత్ అబూజర్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓ రోజు (నా ముందు) విశ్వప్రభువు తరఫున ఒక వార్తాహరుడొచ్చి తనకీ వార్త విన్పించాడని లేక శుభవార్త అందజేశాడని చెబుతూ, “నా అనుచర సమాజంలో అల్లాహ్ కి సాటి కల్పించని స్థితిలో చనిపోయేవారు స్వర్గంలో ప్రవేశిస్తారు” అని అన్నారు. అప్పుడు నేను “వ్యభిచారం చేసినా, దొంగతనానికి పాల్పడినా వారు స్వర్గంలో ప్రవేశిస్తారా?” అని అడిగాను. దానికి ఆయన “అవును.. వ్యభిచారం చేసినా, దొంగతనానికి పాల్పడినా సరే (స్వర్గంలో ప్రవేశిస్తారు)” అని అన్నారు.
(సహీహ్ బుఖారీ : 23వ ప్రకరణం – జనాయెజ్, 1వ అధ్యాయం – ఫిల్ జనాయిజ్ వమన్ కాన ఆఖిరూ కలామిహీ లా ఇలాహ ఇల్లల్లాహ్]
60 – حديث أَبي ذَرٍّ رضي الله عنه، قَالَ: أَتَيْتُ النَّبيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَعَلَيْهِ ثَوْبٌ أَبْيَضُ وَهُوَ نائِمٌ، ثُمَّ أَتَيْتُهُ وَقَدِ اسْتَيْقَظَ، فَقالَ: ما مَنْ عَبْدٍ قَالَ لا إِلهَ إِلاّ اللهُ ثُمَّ ماتَ عَلى ذَلِكَ إِلاّ دَخَلَ الْجَنَّةَ قُلْتُ: وَإِنْ زَنى وَإِنْ سَرَقَ قَالَ: وَإِنْ زَنى وَإِنْ سَرَقَ، قُلْتُ: وَإِنْ زَنى وَإِنْ سَرَقَ قَالَ: وَإِنْ زَنى وَإِنْ سَرَقَ، قُلْتُ: وَإِنْ زَنى وَإِنْ سَرَقَ قَالَ: وَإِنْ زَنى وَإِنْ سَرَقَ عَلى رَغْمِ أَنْفِ أَبي ذَرٍّ
وَكانَ أَبُو ذَرٍّ إِذا حَدَّثَ بِهذا قَالَ وَإِنْ رَغِمَ أَنْفُ أَبي ذَرٍّ
__________
أخرجه البخاري في: 77 كتاب اللباس: 24 باب الثياب البيض
60. హజ్రత్ అబూజర్ (రదియల్లాహు అన్హు) కథనం:- నేనొకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వెళ్తే ఆ సమయంలో ఆయన తెల్లదుప్పటి కప్పుకొని గాఢంగా నిద్రపోతున్నారు. నేను మళ్ళీ వచ్చి చూస్తే ఆయన మేల్కొని ఉన్నారు. అప్పుడాయన (నన్ను చూసి) “అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యడులేడని సాక్ష్యమిచ్చి, అదే మాట పై చనిపోయేదాకా నిలకడగా ఉండేవారు తప్పకుండా స్వర్గానికి వెళ్తారు” అని అన్నారు. “వ్యభిచారం చేసినా, దొంగతనానికి పాల్పడినా స్వర్గానికి వెళ్తారా వారు?” అని అడిగాను నేను (ధృవపరచుకోవడానికి). “ఔను. వ్యభిచారం చేసినా, దొంగతనానికి ఒడిగట్టినా సరే వెళ్తారు” అన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). నేను ఆశ్చర్యపోతూ “ఏమిటీ, వ్యభిచారం, దొంగతనం లాంటి నేరాలు చేసి ఉన్నా (స్వర్గానికి వెళ్తారా)?” అని అడిగాను. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఔను, వ్యభిచారం, దొంగతనం చేసి ఉన్నా సరే. ఈ విషయాలు అబూజర్ కు ఎంత ఆందోళన కలిగిస్తున్నా సరే (వారు స్వర్గానికి తప్పకుండా వెళ్తారు)” అని ఉద్ఘాటించారు. హజ్రత్ అబూజర్ (రదియల్లాహు అన్హు) ఈ హదీసును వివరించినప్పుడల్లా “వ ఇన్ రగిమ అన్ ఫ అబీజిర్రిన్ (అబూజర్ తన ముక్కుకు మన్ను తగిలించుకున్నా సరే!) అని తప్పక అనేవారు.
(సహీహ్ బుఖారీ: 77వ ప్రకరణం – లిబాస్, 24వ అధ్యాయం – అస్సియాబిల్ బైజ్)
39వ అధ్యాయం – లా ఇలాహ ఇల్లల్లాహ్ అని పలికిన అవిశ్వాసిని వధించడం నిషిద్ధం
تحريم قتل الكافر بعد أن قال لا إِله إِلا الله
61 – حديث الْمِقْدَادِ بْنِ الأَسْوَدِ (هُوَ الْمِقْدادُ بْنُ عَمْرٍو الْكِنْدِيُّ) أَنَّهُ قَالَ لِرَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: أَرَأَيْتَ إِنْ لَقِيتُ رَجُلاً مِنَ الْكُفّارِ، فَاقْتَتَلْنا، فَضَرَبَ إِحْدى يَدَيَّ بِالسَّيْفِ قَقَطَعَها، ثُمَّ لاذَ مِنّي بِشَجَرَةٍ، فَقالَ أَسْلَمْتُ للهِ، أَأَقْتُلُهُ يا رَسولَ اللهِ بَعْدَ أَنْ قَالَها فَقالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: لا تَقْتُلْهُ، فَقالَ يا رَسُولَ اللهِ إِنَّهُ قَطَعَ إِحْدى يَدَيَّ ثُمَّ قَالَ ذَلِكَ بَعْدَ ما قَطَعَها؛ فَقالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: لا تَقْتُلْهُ، فَإِنْ قَتَلْتَهُ فَإِنَّهُ بِمَنْزِلَتِكَ قَبْلَ أَنْ تَقْتُلَهُ، وَإِنَّكَ بِمَنْزِلَتِهِ قَبْلَ أَنْ يَقولَ كَلِمَتُه الَّتي قَالَ
__________
أخرجه البخاري في: 64 كتاب المغازي: 12 باب حدثني خليفة
61. హజ్రత్ మిఖ్దాద్ బిన్ అస్వద్ (రదియల్లాహు అన్హు) (మిఖ్దాద్ బిన్ అమ్ర్ కుంది అనే పేరు కూడా ఈయనకు ఉంది) కథనం:- నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో మాట్లాడుతూ “ఏ అవిశ్వాసి అయినా (యుద్ధరంగంలో) నాకు ఎదురయి మేమిద్దరం పరస్పరం పోరాడుకుంటున్నప్పుడు, అతను నా చేతినొకదాన్ని ఖడ్గంతో తెగొట్టి వెంటనే ఏదైనా చెట్టు చాటుకు వెళ్ళి ‘అల్లాహ్ (ప్రసన్నత) కోసం నేను ముస్లింనయ్యాను అని అన్నాడనుకోండి. అలాంటి స్థితిలో నేనతడ్ని హతమార్చవచ్చా?” అని అడిగాను. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “లేదు, నీవతడ్ని – హతమార్చకూడదు” అని అన్నారు. “దైవప్రవక్తా! అతను నా చేతినొకదాన్ని తెగ్గొట్టాడు. ఆ తరువాతనే ఈ మాటలు పలికాడు కదా? ” అన్నాను నేను. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఏమైనా సరే నీవతడ్ని వధించడానికి ఏ మాత్రం వీల్లేదు. ఒకవేళ నీవతడ్ని వధిస్తే, అతడ్ని వధించక పూర్వం నీవు ఏ స్థానంలో ఉన్నావో ఆ స్థానంలో అతను ఉంటాడు. అలాగే అతను సద్వచనం (కలిమా) పఠించక పూర్వం ఏ స్థానంలో ఉండేవాడో ఆ స్థానంలో నీవు ఉంటావు” అని సమాధానమిచ్చారు. *
[సహీహ్ బుఖారీ : 64వ ప్రకరణం – మగాజి, 12వ అధ్యాయం – హద్దసనీ ఖలీఫా ]
* అంటే, ఇస్లాం స్వీకరించి ముస్లిం అయిన కారణంగా అతడ్ని వధించడం నిషిద్ధం (హరాం) అవుతుంది; హత్యా ప్రతీకారం (ఖిసాస్) కారణంగా నిన్ను వధించడం ధర్మ సమ్మతం (హలాల్) అవుతుంది అని అర్ధం. అయితే యుద్ధరంగంలో అవిశ్వాసి ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ (కలిమా) పఠించిన తర్వాత అతడ్ని వధించే విషయంలో ధర్మవేత్తల మధ్య విభిన్న అభిప్రాయాలు ఏర్పడ్డాయి. ముందు రాబోయే ఒక హదీసు దృష్ట్యా అలాంటి వ్యక్తిని వధించిన ముస్లిం పై ఎలాంటి దోషం లేదని, ప్రతీకార హత్య (ఖిసాస్)గాని, రక్తపరిహారం (దయత్)గాని, పాపపరిహారం (కప్పారా) గాని లేదని కొందరు అభిప్రాయపడ్డారు. హజ్రత్ ఉసామా (రదియల్లాహు అన్హు) వల్ల ఇలాంటి పొరపాటే జరిగినపుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన్ని ప్రతీకార చర్యగా హత్య చేయలేదు. ఆయన పై రక్తపరిహారం, పాపపరిహారం కూడా విధించలేదు. కొందరు ధర్మవేత్తల దృష్టిలో పాపపరిహారం చెల్లింపు విధి (హజిబ్) అయి ఉంది. కాని ఆ ముస్లిం అతడ్ని పొరపాటున అవిశ్వాసి అని పొరపడి వధించినందువల్ల ప్రతీకారహత్య ఉండదు. అదీగాక జిహాద్ సందర్భంలో జరిగిన ఈ పొరపాటు హత్య వల్ల ఆ ముస్లిం అవిశ్వాసి (కాఫీర్)గా పరిగణించబడడు. ముఖ్యంగా ఆ వ్యక్తి కొందరు ముస్లింలను గాయపరచిన తర్వాత తన ప్రాణం కాపాడుకోవడానికి మాత్రమే ‘కలిమా’ పరిస్తున్నాడని ముస్లిం యోధుడు అనుమానించి అతడిని హతమార్చినపుడయితే ప్రతీకారహత్య, రక్తపరిహారాల ప్రసక్తే రాదు.
62 – حديث أُسامَةَ بْنِ زَيْدٍ رضي الله عنهما قَالَ: بَعَثَنَا رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِلى الْحُرَقَةِ فَصَبَّحْنَا الْقَوْمَ فَهَزَمْنَاهُمْ، وَلَحِقْتُ أَنَا وَرَجُلٌ مِنَ الأَنْصارِ رَجُلاً مِنْهُمْ، فَلَمّا غَشِينَاهُ قَالَ لاَ إِلهَ إِلاَّ اللهُ، فَكَفَّ الأَنْصارِيُّ عَنْهُ، وَطَعَنْتُهُ بِرُمْحي حَتّى قَتَلْتُهُ؛ فَلَمّا قَدِمْنَا، بَلَغَ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَقالَ: يا أُسامَةُ أَقَتَلْتَهُ بَعْدَما قَالَ لا إِلهَ إِلاَّ اللهُ، قُلْتُ كَانَ مُتَعَوِّذًا؛ فَما زَالَ يُكَرِّرُها حَتّى تَمَنَّيْتُ أَنّي لَمْ أَكُنْ أَسْلَمْتُ قَبْلَ ذَلِكَ الْيَوْمِ
__________
أخرجه البخاري في: 64 كتاب المغازي: 45 باب بعث النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أسامة بن زيد إلى الحرقات من جهينة
62. హజ్రత్ ఉసామా బిన్ జైద్ (రదియల్లాహు అన్హు) కథనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓసారి మమ్మల్ని హుర్ఖా (తెగ) వారి వైపుకు పంపించారు. మేము (మరునాడు) ఉదయాన్నే దాడి చేసి వారిని చిత్తుగా ఓడించాము. ఆ సందర్భంలో నేను, ఒక అన్సార్ యోధుడు ఇద్దరం కలసి ఆ తెగకు చెందిన ఒక వ్యక్తిని వెంబడించి చుట్టు ముట్టాము. అప్పుడతను ‘అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు’ అనే సద్వచనం పఠించాడు. ఈ మాట వినగానే అన్సార్ యోధుడు తన చేతిని వెనక్కి తీసుకున్నాడు. కాని నేను మాత్రం ఈటె విసరి అతడ్ని కడతేర్చాను.
ఆ తరువాత మేము (మదీనాకు) తిరిగొచ్చినప్పుడు నేను చేసిన పని సంగతి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు తెలిసింది. ఆయన వెంటనే నన్ను పిలిపించి) “ఉసామా! నీవతడ్ని అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని పలికిన తరువాత కూడా వధించావా?” అని నిలదీశారు. నేను సమాధానమిస్తూ “అతను ప్రాణం కాపాడుకోవడానికి (ఇలా) సద్వచనం పఠించాడు” అన్నాను. కాని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మళ్ళీ ఆ విషయాన్నే నొక్కి ప్రస్తావిస్తూ “నీవతడ్నీ అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని పలికిన తరువాత కూడా వధించావా?” అని అడిగారు. ఈ మాటలు ఆయన మాటిమాటికీ అంటూ నన్ను నిలదీశారు. దాంతో నేను (భయపడిపోయి) ఈ రోజు వరకు ముస్లింనయి ఉండకపోతే ఎంత బాగుండేది! (దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆగ్రహానికి గురయ్యేవాడ్ని కాదు) అని మనసులో తలపోశాను.
[సహీహ్ బుఖారీ : 64వ ప్రకరణం – మగాజి, 45వ అధ్యాయం – బఅసున్నబియ్యి(సల్లల్లాహు అలైహి వసల్లం)]
40వ అధ్యాయం – మన (ముస్లింల) మీద కత్తి ఎత్తినవాడు మనవాడు కాదు.
قول النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ من حمل علينا السلاح فليس منا
63 – حديث عَبْدِ اللهِ بْنِ عُمَرَ أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: مَنْ حَمَلَ عَلَيْنا السِّلاَحَ فَلَيْسَ مِنّا
__________
أخرجه البخاري في: 92 كتاب الفتن: 7 باب قول النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ من حمل علينا السلاح فليس منا
63. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:- “మన (ముస్లింల) మీద కత్తి ఎత్తినవాడు మన (జీవనశైలి అనుసరించే) వాడు కాదు” అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు.”*
[సహీహ్ బుఖారీ : 92వ ప్రకరణం – ఫిత్న్, 7వ అధ్యాయం]
(*)ముస్లింల పై కత్తి కట్టడమే గాక, దాన్ని ధర్మసమ్మతమైన చర్యగా భావించేవాడు ఎంతమాత్రం ముస్లిం కానేకాడు. ధర్మవేత్తలు ఈ హదీసును గురించి ఇలాంటి అర్ధాన్నే తీసుకున్నారు.
64 – حديث أَبي مُوسَى عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: مَنْ حَمَلَ عَلَيْنَا السِّلاحَ فَلَيْسَ مِنّا
__________
أخرجه البخاري في: 92 كتاب الفتن: 7 باب قول النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ من حمل علينا السلاح فليس منا
64. హజ్రత్ అబూమూసా (రదియల్లాహు అన్హు) కథనం:- “మన (ముస్లింల) మీద కత్తి ఎత్తిన వాడు మన (సంస్కృతి ప్రకారం నడుచుకునే) వాడు కాదు” అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు.
(సహీహ్ బుఖారీ: 92 వ ప్రకరణం – ఫిత్న్, 7వ అధ్యాయం]
42వ అధ్యాయం – ఏడ్పులు, పెడబొబ్బలు, మూఢనమ్మకాల నినాదాలు నిషిద్ధం.
تحريم ضرب الخدود وشق الجيوب والدعاء بدعوى الجاهلية
65 – حديث عَبْدِ اللهِ بْنِ مَسْعودٍ رضي الله عنه قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ لَيْسَ مِنّا مَنْ ضَرَبَ الْخُدُودَ، وَشَقَّ الْجُيُوبَ، وَدَعا بِدَعْوى الْجاهِلِيَّةِ
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز 39 باب ليس منا من ضرب الخدود
65. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రదియల్లాహు అన్హు) కథనం:- “నెత్తీ నోరూ బాదుకుంటూ, దుస్తులు చించుకుంటూ మూఢకాలం పలుకులు పలికేవాడు మన (పద్ధతి అనుసరించే)వాడు కాదు” అని తెలిపారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).*
[సహీహ్ బుఖారీ : 23వ ప్రకరణం – జనాయెజ్; 39వ అధ్యాయం – లైసమిన్నా మన్ జరబల్ ఖుదూద్]
(*) మూడకాలం పలుకులు అంటే, పూర్వం అజ్ఞానయుగంలో అరబ్బులు తమ సన్నిహితుడెవరైనా చనిపోతే అతని పేరు పెట్టి పిలుస్తూ ఏడ్పులు పెడబొబ్బలు పెట్టేవారు. ఇస్లాం ప్రకారం ఈ చర్య నిషిద్ధం. ఇలా ప్రవర్తించడమే గాక దీన్ని ధర్మసమ్మతమని భావించే ముస్లిం ధర్మ భ్రష్టుడవుతాడు.
66 – حديث أَبي مُوسَى رضي الله عنه وَجِعَ أَبُو مُوسَى وَجَعًا شَديدًا فَغُشِي عَلَيْهِ وَرَأْسُهُ في حَجْرِ امْرَأَةٍ مِنْ أَهْلِهِ، فَلَمْ يَسْتَطِعْ أَنْ يَرُدَّ عَلَيْها شَيْئًا؛ فَلَمَّا أَفاقَ قَالَ أَنا بَرِيءٌ مِمَّنْ بَرئَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بَرِئَ مِنَ الصَّالِقَةِ وَالْحالِقَةِ وَالشَّاقَّةِ
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 38 باب ما ينهى من الحلق عند المصيبة
66. హజ్రత్ అబూ బుర్దా బిన్ అబూ మూసా (రదియల్లాహు అన్హు) కథనం:- ఓ రోజు అబూమూసా వ్యాధిగ్రస్తులయి స్పృహ కోల్పోయారు. అప్పుడాయన శిరస్సు ఆయన కుటుంబ స్త్రీలలో ఒకామె వడిలో ఉంది. (ఆ స్త్రీ ఆయన పరిస్థితి చూసి భయపడిపోయి పెడబొబ్బలు పెట్టనారంభించింది.) అబూ మూసా (రదియల్లాహు అన్హు) స్పృహ కోల్పోయి ఉన్నందున ఆమె ఏడ్పులు పెడబొబ్బల పట్ల ఎలాంటి ప్రతిస్పందన వెలిబుచ్చలేకపోయారు. కాస్సేపటికి స్పృహ రాగానే ఆయన (విసుక్కుంటూ) “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అసహ్యించుకున్న వాటన్నిటినీ నేను అసహ్యించుకుంటున్నాను. ఏడ్పులు, పెడబొబ్బలు పెట్టే, తల గొరిగించుకునే, వక్షస్థల వస్త్రాన్ని చించుకునే స్త్రీలను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అసహ్యించుకున్నారు” అని అన్నారు.
(సహీహ్ బుఖారీ : 23వ ప్రకరణం – జనాయెజ్, 38వ అధ్యాయం – మాయున్హా మినల్ ఖల్ ఖి ఇన్దల్ ముసీబ]
43వ అధ్యాయం – పరోక్ష నిందకు, చాడీలకు పాల్పడటం నిషిద్ధం.
بيان غلظ تحريم النميمة
67 – حديث حُذَيْفَةَ قَالَ سَمِعْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: لا يَدْخُلُ الْجَنَّةَ قَتَّاتٌ
__________
أخرجه البخاري في: 78 كتاب الأدب: 50 باب ما يكره من النميمة
67. హజ్రత్ హుజైఫా (రదియల్లాహు అన్హు) కథనం:- “కొండెములు (చాడీలు) చెప్పేవాడు స్వర్గంలో ప్రవేశించ లేడని” దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెబుతుండగా నేను విన్నాను.
[సహీహ్ బుఖారీ : 78వ ప్రకరణం – అదబ్, 5వ అధ్యాయం]
44వ అధ్యాయం – బట్టను చీలమండలం క్రిందికి ఉండేలా ధరించడం, మేలు చేసి ఎత్తిపొడవడం, వ్యాపారంలో అబద్దమాడటం నిషిద్ధం.
بيان غلظ تحريم إِسبال الإِزار والمن بالعطية وتنفيق السلعة بالحلف، وبيان الثلاثة الذين لا يكلمهم الله يوم القيامة ولا ينظر إليهم، ولا يزكيهم ولهم عذاب أليم
68 – حديث أَبي هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ ثَلاثَةٌ لا يَنْظُرُ اللهُ إِلَيْهِمْ يَوْمَ الْقِيامَةِ وَلا يُزَكِّيهِمْ وَلَهُمْ عَذابٌ أَليمٌ: رَجُلٌ كَانَ لَهُ فَضْلُ مَاءٍ بِالطَّريقِ فَمَنَعَهُ مِنِ ابْنِ السَّبيلِ؛ وَرَجُلٌ بايَعَ إِمامَهُ لا يُبايِعُهُ إِلاّ لِدُنْيا، فَإِنْ أَعْطاهُ مِنْها رَضِيَ، وَإِنْ لَمْ يُعْطِهِ مِنْهَا سَخِطَ؛ وَرَجُلٌ أَقامَ سِلْعَتَهُ بَعْدَ الْعَصْرِ فَقالَ وَاللهِ الَّذي لا إِلهَ غَيْرُهُ لَقَدْ أَعْطَيْتُ [ص:21] بِها كَذا وَكَذا، فَصَدَّقَهُ رَجُلٌ ثُمَّ قَرَأَ هذِهِ الآيَةَ (إِنَّ الَّذينَ يَشْتَرونَ بِعَهْدِ اللهِ وَأَيْمانِهِمْ ثَمَنًا قَليلاً)
__________
أخرجه البخاري في: 42 كتاب المساقاة: 5 باب إثم من منع ابن السبيل من الماء
68. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనం ప్రకారం మూడు రకాల వ్యక్తులున్నారు. ప్రళయ దినాన అల్లాహ్ దయాభావంతో వారివైపు కన్నెత్తి కూడా చూడడు; వారి పాపాలను క్షమించి వారిని పరిశుద్ధపరచడు; పైగా వారికి తీవ్రమైన (నరక) శిక్ష విధిస్తాడు. వారిలో ఒక కోవకు చెందిన వ్యక్తి అవసరానికి మించి ప్రయాణ సామగ్రి కలిగి ఉన్నప్పటికీ, తోటి ప్రయాణీకులకు వాటినిచ్చి ఆదుకోవడానికి నిరాకరిస్తాడు. రెండవ వ్యక్తి ప్రాపంచిక స్వలాభాపేక్షతో ఇమామ్ (రాజ్యాధినేత)కు మద్దతునిస్తూ ప్రయాణం చేస్తాడు. అందువల్ల ఆ ఇమామ్ సిరిసంపదలు ఇస్తే అతను సంతోషిస్తాడు, ఇవ్వకపోతే ముఖం మాడ్చుకుంటాడు. మూడవ వ్యక్తి సాయంత్రం వేళ తన వ్యాపార సరుకుతో (జనం ముందు) నిలబడి, “సాటిలేని మేటి అయిన అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, నేనీ సరుకును ఇంత ధరకు కొన్నాను” అని (అబద్ధం) చెబుతాడు. ప్రజలు అతను నిజమే చెబుతున్నాడని భావిస్తారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ తరువాత ఖుర్ఆన్లోని ఈ సూక్తిని పఠిస్తారు, “కొందరు తమ వాగ్దానాలను, అల్లాహ్ విషయంలో చేసిన ప్రమాణాలను అతి స్వల్ప మూల్యానికి అమ్ముకుంటారు. ఇలాంటి (అమ్ముడుబోయిన) వారికి పరలోకంలో ఎలాంటి (పుణ్యఫలం) వాటా లభించదు. వారితో అల్లాహ్ మాట్లాడడు. చివరికి వారివైపు ప్రళయదినాన కన్నెత్తి కూడా చూడడు. వారిని పరిశుద్ధ పరిచే ప్రసక్తి కూడా లేదు. పైగా వారికి వ్యధాభరితమైన శిక్ష పడుతుంది.” (3:77)
[సహీహ్ బుఖారీ : 42వ ప్రకరణం – ముసాఖా, 5వ అధ్యాయం – ఇస్మి మమ్మన ఇబ్నుస్సబీలి మినల్ మాయి]
45వ అధ్యాయం – ఆత్మహత్య చేసుకున్న వాడికి నరకంలో అదే శిక్ష, నిజమైన ముస్లింకే స్వర్గ ప్రవేశం.
بيان غلظ تحريم قتل الإِنسان نفسه وأن من قتل نفسه بشيء عذب به في النار، وأنه لا يدخل الجنة إلا نفس مسلمة
69 – حديث أَبي هُرَيْرَةَ رضي الله عنه عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: مَنْ تَرَدَّى مِنْ جَبَلٍ فَقَتَلَ نَفْسَهُ فَهُوَ في نَارِ جَهَنَّمَ يَتَرَدَّى فِيهِ خَالِدًا مُخَلَّدًا فِيها أَبَدًا، وَمَنْ تَحَسَّى سُمًّا فَقَتَلَ نَفْسَهُ فَسُمُّهُ في يَدِهِ يَتَحَسَّاهُ في نَارِ جَهَنَّمَ خَالِدًا مُخَلَّدًا فيها أَبَدًا، وَمَنْ قَتَلَ نَفْسَهُ بِحَديدَةٍ فَحَدِيدَتُهُ في يَدِهِ يَجَأُ بِها في بَطْنِهِ في نَارِ جَهَنَّمَ خَالِدًا مُخَلَّدًا فِيها أَبَدًا
__________
أخرجه البخاري في: 76 كتاب الطب: 56 باب شرب السم والدواء به وبما يخاف منه
69. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనం ప్రకారం, కొండమీద నుంచి పడి ఆత్మహత్య చేసుకున్నవాడు నరకానికిపోయి, మాటిమాటికి కొండ మీద నుంచి త్రోయబడే ఘోర శిక్షను శాశ్వతంగా చవిచూస్తూ ఉంటాడు. విషం తిని ఆత్మహత్య చేసుకున్నవాడు నరకంలో విషం చేత పట్టుకొని తింటూ ఎల్లప్పుడూ తనను తాను హతమార్చుకుంటూ ఉంటాడు. ఏదైనా ఆయుధంతో ఆత్మహత్య చేసుకున్నవాడు నరకంలో కూడా అదే ఆయుధం తీసుకొని కడుపులో పొడుచుకుంటూ, ఎల్లప్పుడు తీవ్ర యాతనలు అనుభవిస్తూ ఉంటాడు.
[సహీహ్ బుఖారీ : 76వ ప్రకరణం – తిబ్, 56వ అధ్యాయం]
70 – حديث ثَابِتِ بْنِ الضَّحَّاكِ، وَكانَ مِنْ أَصْحابِ الشَّجَرَةِ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: مَنْ حَلَفَ عَلى مِلَّةٍ غَيْرِ الإِسْلامِ فَهُوَ كَما قَالَ، وَلَيْسَ عَلى ابْنِ آدَمَ نَذْرٌ فِيما لا يَمْلِكُ، وَمَنْ قَتَلَ نَفْسَهُ بِشَيْءٍ في الدُّنْيا عُذِّبَ بِهِ يَوْمَ الْقِيامَةِ، وَمَنْ لَعَنَ مُؤْمِنًا فَهُوَ كَقَتْلِهِ، وَمَنْ قَذَفَ مُؤْمِنًا بِكُفْرٍ فَهُوَ كَقَتْلِهِ
__________
أخرجه البخاري في: 78 كتاب الأدب: 44 باب ما ينهى من السباب واللعن
70. హజ్రత్ సాబిత్ బిన్ జహాక్ (రదియల్లాహు అన్హు) కథనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “ఇస్లాం సంప్రదాయం ప్రకారం కాకుండా వేరే మత సంప్రదాయం ప్రకారం ప్రమాణం చేసినవాడు తను ప్రమాణం చేసిన విషయం లాంటివాడే అవుతాడు (అంటే ఆ మతానికి చెందిన వ్యక్తిగానే పరిగణించబడుతాడు). తన శక్తి పరిధిలో లేని విషయం గురించి మొక్కుబడి చేసుకున్నవాడు అలాంటి మొక్కుబడి నెరవేర్చనవసరం లేదు. ఆత్మహత్య చేసుకున్నవాడు ఇహలోకంలో తనను తాను ఏ వస్తువుతో హతమార్చుకున్నాడో ప్రళయదినాన అతడ్ని అదే వస్తువుతో శిక్షించడం జరుగుతుంది. విశ్వాసిని హత్య చేయడం ఎంత ఘోరమైన పాపమో, అతడ్ని దూషించడం కూడా అంతే (ఘోరమైన) పాపకార్యమవుతుంది. అలాగే అతనిపై సత్యతిరస్కార (కుఫ్ర్) అపనిందను మోపడం కూడా అంతే (ఘోరమైన) పాపకార్యమవుతుంది.*
(సహీహ్ బుఖారీ : 78వ ప్రకరణం – అదబ్, 44వ అధ్యాయం – మాయన్హా మినస్సిబాబివల్లాన్]
* ఇది ఒక హెచ్చరికగా, మందలింపుగా పేర్కొనబడింది. నవవి (రహిమహుల్లాహ్) గారి ప్రకారం మనిషి హృదయాలలో ఇస్లాం పట్ల నిజమైన విశ్వాసం ఉంటే అతను అవిశ్వాసి కాజాలడు. ఒకవేళ అతని హృదయంలో ఇస్లాంకు బదులు ఇతర ధర్మాల పట్ల ఔన్నత్య భావం ఉంటే అతను తప్పకుండా అవిశ్వాసి అవుతాడు.
71 – حديث أَبي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: شَهِدْنا مَعَ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ خَيْبَرَ، فَقالَ لِرَجُلٍ مِمَّنْ يَدَّعِي الإِسْلامَ: هذا مِنْ أَهْلِ النَّارِ، فَلَمّا حَضَرَ الْقِتالُ قاتَلَ الرَّجُلُ قِتالاً شَديدًا [ص:22] فَأَصابَتْهُ جِراحَةٌ، فَقِيلَ يا رَسُولَ اللهِ الَّذِي قُلْتَ إِنَّهُ مِنْ أَهْلِ النَّارِ فَإِنَّه قَدْ قاتَلَ الْيَوْمَ قِتالاً شَدِيدًا، وَقَدْ مَاتَ، فَقالَ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِلى النَّارِ قَالَ فَكادَ بَعْضُ النَّاسِ أَنْ يَرْتابَ؛ فَبَيْنَما هُمْ عَلى ذلِكَ إِذْ قِيلَ إِنَّهُ لَمْ يَمُتْ وَلكِنَّ بِهِ جِراحًا شَدِيدًا، فَلَمّا كانَ مِنَ اللَّيْلِ لَمْ يَصْبِرْ عَلى الْجِراحِ فَقَتَلَ نَفْسَهُ: فَأُخْبِرَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بِذلِكَ، فَقالَ: اللهُ أَكْبَرُ أَشْهَدُ أَنّي عَبْدُ اللهِ وَرَسُولُهُ، ثُمَّ أَمَرَ بِلالاً فَنادى في النَّاسِ: إِنَّه لا يَدْخُلُ الْجَنَّةَ إِلاّ نَفْسٌ مُسْلِمَةٌ، وَإِنَّ اللهَ لَيُؤَيِّدُ هذا الدِّينَ بِالرَّجُلِ الْفاجِرِ
__________
أخرجه البخاري في: 56 كتاب الجهاد: 182 باب إن الله يؤيد الدين بالرجل الفاجر
71. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- మేము ఓసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో కలసి ఖైబర్ యుద్ధంలో పాల్గొన్నాము. ఆ సందర్భంలో తనను తాను ముస్లిం అని చెప్పుకునే ఒక వ్యక్తిని గురించి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రస్తావిస్తూ, అతను నరక నివాసి అవుతాడని అన్నారు. ఆ తరువాత యుద్ధం మొదలయింది. అప్పుడా వ్యక్తి అత్యంతోత్సాహంతో, అమిత ధైర్య సాహసాలతో అవిశ్వాసులతో పోరాడుతూ చివరికి తీవ్రంగా గాయపడ్డాడు. అప్పుడు కొందరు అనుచరులు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వెళ్ళి “దైవప్రవక్తా! మీరు నరకవాసి అవుతాడని తెలిపిన వ్యక్తి ఈ రోజు అవిశ్వాసులతో అనన్య ధైర్య సాహసాలతో పోరాడి చని పోయాడు” అని అన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ మాట విని కూడా అతను నరకానికే పోతాడని అన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పలికిన ఈ పలుకుల్ని కొందరు శంకించేలోగా ఒకతను వచ్చి ఆ వ్యక్తి చనిపోలేదని, తీవ్రంగా గాయపడ్డాడని తెలిపాడు. అయితే ఆ రోజు రాత్రి ఆ వ్యక్తి గాయాల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంగతి తెలుసుకున్న దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “అల్లాహ్ గొప్పవాడు! నేను అల్లాహ్ దాసుణ్ణి, ఆయన ప్రవక్తనని సాక్ష్యమిస్తున్నాను” అని అన్నారు. ఆ తరువాత ఆయన హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు)ని పిలిచి, “మనస్పూర్తిగా (ఇస్లాం ధర్మాన్ని విశ్వసించి) ముస్లిం అయినవాడు మాత్రమే స్వర్గంలో ప్రవేశిస్తాడని, ఒక్కోసారి అల్లాహ్ చెడ్డవాడి ద్వారా కూడా తన ధర్మానికి సహాయం చేయించుకుంటాడని ప్రకటన చేయ్యి” అని ఆదేశించారు.
[సహీహ్ బుఖారీ: 56వ ప్రకరణం – జిహాద్, 182 వ అధ్యాయం – ఇన్నల్లాహయు అయ్యిదుద్దీన బిర్రజులిల్ ఫాజిర్)
72 – حديثُ سَهْلِ بْنِ سَعْدٍ السَّاعِدِيِّ رضي الله عنه أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ الْتَقى هُوَ وَالْمُشْرِكُونَ فَاقْتَتَلُوا فَلَمَّا مَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِلى عَسْكَرِهِ، وَمالَ الآخَرُونَ إِلى عَسْكَرِهِمْ، وَفي أَصْحابِ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ رَجُلٌ لا يَدَعُ لَهُمْ شاذَّةً وَلا فَاذَّةً إِلاَّ اتَّبَعَهَا يَضْرِبُها بِسَيْفِهِ، فَقالُوا ما أَجْزَأَ مِنّا الْيَوْمَ أَحَدٌ كَما أَجْزَأَ فُلانٌ؛ فَقالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: أَما إِنَّهُ مِنْ أَهْلِ النَّارِ فَقالَ رَجُلٌ مِنَ الْقَوْمِ: أَنا صَاحِبُهُ قَالَ فَخَرَجَ مَعَهُ كُلَّما وَقَفَ وَقَفَ مَعَهُ، وَإِذا أَسْرَعَ أسرع مَعَهُ؛ قَالَ فَجُرِحَ الرَّجُلُ جُرْحًا شَديدًا، فَاسْتَعْجَلَ الْمَوْتَ فَوَضَعَ نَصْلَ سَيْفِهِ بِالأَرْضِ، وَذُبابَهُ بَيْنَ ثَدْييْهِ ثُمَّ تَحامَلَ عَلى نَفْسِهِ فَقَتَلَ نَفْسَهُ فَخَرَجَ الرَّجُلُ إِلى رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَقالَ: أَشْهَدُ أَنَّكَ رَسُولُ اللهِ قَالَ: وَما ذَاكَ قَالَ: الرَّجُلُ الَّذي ذَكَرْتَ آنِفًا أَنَّهُ مِنْ أَهْلِ النَّارِ فَأَعْظَمَ النَّاسُ ذَلِكَ، فَقُلْتُ: أَنا لَكُمْ بِهِ، فَخَرَجْتُ في طَلَبِهِ، ثُمَّ جُرِحَ جُرْحًا شَدِيدًا فَاسْتَعْجَلَ الْمَوْتَ، فَوَضَعَ [ص:23] نَصْلَ سَيْفِهِ في الأَرْضِ، وَذُبابَهُ بَيْنَ ثَدْيَيْهِ، ثُمَّ تَحامَلَ عَلَيْهِ فَقَتَلَ نَفْسَهُ فَقالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عِنْدَ ذَلِكَ: إِنَّ الرَّجُلَ لَيَعْمَلُ عَمَلَ أَهْلِ الْجَنَّةِ فيما يَبْدُو لِلنَّاسِ وَهُوَ مِنْ أَهْلِ النَّارِ، وَإِنَّ الرَّجُلَ لَيَعْمَلُ عَمَلَ أَهْلِ النَّارِ فِيما يَبْدُو لِلنَّاسِ وَهْوَ مِنْ أَهْلِ الْجَنَّةِ
__________
أخرجه البخاري في: 56 كتاب الجهاد: 77 باب لا يقول فلان شهيد
72. హజ్రత్ సహల్ బిన్ సాద్ సాది (రదియల్లాహు అన్హు) కథనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక యుద్ధంలో అవిశ్వాసుల్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఇరు వర్గాలు పరస్పరం ఢీకొన్నాయి. చివరికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన గుడారానికి తిరిగొచ్చారు. అవిశ్వాసులు కూడా తమ తమ గుడారాలకు వెళ్ళిపోయారు. ప్రవక్త అనుచరులలో ఒకతను యుద్ధమైదానంలో ఒంటరిగా కన్పించే ప్రతి శత్రువుని సమయస్ఫూర్తితో వెంటాడి మట్టు పెట్టేవాడు. కొందరు యోధులు అతను చేసిన ఈ సాహసకార్యాలు చూసి, “ఈ రోజు జరిగిన యుద్ధంలో ఆ వ్యక్తి సాధించిన ఘనకార్యాలు మరెవరూ సాధించలేదు” అని అన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ మాటలు విని “నిజమే, కాని ఆ వ్యక్తి నరకవాసి అవుతాడు” అని అన్నారు. ఇది విని ఒక సహచరుడు తానా వ్యక్తి వెంట (నీడలా) ఉంటానని నిర్ణయించుకున్నాడు. ఆ తరువాత అతను ఆ వ్యక్తిని వెన్నంటి తిరుగుతూ అతను నిల్చుంటే నిల్చోవడం, అతను పరుగెత్తితే అతని వెంట పరుగెత్తడం చేయసాగాడు. కాస్సేపటికి ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడి (బాధకు తట్టుకోలేక) తొందరపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను ఖడ్గం పిడిని నేలమీద నిలబెట్టి దాని మొనను తన వక్షస్థలం మధ్య ఆనిచ్చి, తన శరీర బరువంతా దాని మీద మోపి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దృశ్యం చూడగానే అతన్ని వెంబడించిన సహచరుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వెళ్ళి “(మహానుభావా!) మీరు (ముమ్మాటికి) దైవ ప్రవక్తేనని నేను సాక్ష్యమిస్తున్నాను” అని అన్నాడు. అది విని దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఏమిటీ విశేషం?” అని అడిగారు. అప్పుడా సహచరుడు ఇలా అన్నాడు: “ఇంతకు ముందే మీరు ఒక వ్యక్తిని గురించి అతను నరకవాసి అవుతాడని చెప్పారు. జనం ఈ మాట నమ్మలేకపోయారు. నేను వెంటనే ఆ వ్యక్తి సంగతేమిటో ఆరా తీద్దామని మనసులో అనుకున్నాను. ఆ తరువాత నేనతడ్ని వెంబడించాను. చివరికి అతను తీవ్రంగా గాయపడి తొందరపాటుతో మృత్యువుని ఆహ్వానించాడు. అతను కత్తి పిడిని నేలమీద నిలబెట్టి, దాని మొనను తన వక్షస్థలం మధ్య ఆనించి దాని మీద పడి ఆత్మహత్య చేసుకున్నాడు”. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ సంగతి విని “ఒక్కోసారి ఒక వ్యక్తి పైకి స్వర్గవాసుల కర్మల మాదిరిగానే సత్కర్మలు ఆచరిస్తాడు. అయితే అసలతను నరకవాసి అవుతాడు. అలాగే మరొక వ్యక్తి పైకి నరకవాసుల కర్మల మాదిరిగానే దుష్కర్మలు ఆచరిస్తాడు. కాని వాస్తవానికి అతను స్వర్గవాసి అవుతాడు” అని ప్రవచించారు.
[సహీహ్ బుఖారీ : 56వ ప్రకరణం – జిహాద్, – 17వ అధ్యాయం – లా యఖూలు ఫలాన్ షహీద్)
73 – حديث جُنْدُبَ بْنِ عَبْدِ اللهِ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ فيمَنْ كَانَ قَبْلَكُمْ رَجُلٌ بِهِ جُرْحٌ فَجَزِعَ، فَأَخَذَ سِكِّينًا فَحَزَّ بِها يَدَهُ فَما رَقَأَ الدَّمُ حَتّى مَاتَ، قَالَ اللهُ تَعالَى بادَرَنِي عَبْدي بِنَفْسِهِ حَرَّمْتُ عَلَيْهِ الْجَنَّةَ
__________
أخرجه البخاري في: 60 كتاب الأنبياء: 50 باب ما ذكر عن بني إسرائيل
73. హజ్రత్ జుందుబ్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు, “మీకు పూర్వం గతించిన జాతులలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ బాధకు తట్టుకోలేక అతను (గాయమయిన) తన చేతిని కత్తితో నరికి వేశాడు. అయితే రక్తస్రావం ఆగలేదు. దాంతో అతను చనిపోయాడు. అప్పుడు అల్లాహ్ అతని నిర్వాకం చూసి “నా దాసుడు ఆత్మహత్య చేసుకోవడంలో నా ఆజ్ఞను మీరిపోయాడు. అందువల్ల నేనతనికి స్వర్గ ప్రవేశాన్ని నిషేధించాను” అని అన్నాడు.
(సహీహ్ బుఖారీ: 60వ ప్రకరణం – అంబియా, 50వ అధ్యాయం – మాజుకి రఅన్ బనీ ఇస్రాయీల్)
46వ అధ్యాయం – యుద్ధప్రాప్తిలో మోసం చేయడం ఘోరమైన నేరం
غلظ تحريم الغلول وأنه لا يدخل الجنة إلا المؤمنون
74 – حديث أَبي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: افْتَتَحْنَا خَيْبَرَ وَلَمْ نَغْنَمْ ذَهَبًا وَلا فِضَّةً، إِنَّما غَنِمْنا الْبَقَرَ وَالإِبِلَ وَالْمَتاعَ وَالْحَوائِطَ، ثُمَّ انْصَرَفْنا مَعَ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِلى وادي الْقُرى وَمَعَهُ عَبْدٌ لَهُ يُقالُ لَهُ مِدْعَمٌ، أَهْداهُ لَهُ أَحَدُ بَني الضِّبابِ؛ فَبَيْنَما هُوَ يَحُطُّ رَحْلَ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِذْ جاءَهُ سَهْمٌ عائِرٌ حَتّى أَصابَ ذَلِكَ الْعَبْدَ فَقالَ النَّاسُ: هَنيئًا لَهُ الشَّهادَةُ فَقالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: بَلى وَالَّذي نَفْسِي بِيَدِهِ إِنَّ الشَّمْلَةَ الَّتي أَصابَها يَوْمَ خَيْبَرَ مِنَ الْمَغانِمِ لَمْ تُصِبْها الْمَقاسِمُ لَتَشْتَعِلُ عَلَيْهِ نارًا
فَجاءَ رَجُلٌ، حِينَ سَمِعَ ذَلِكَ مِنَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، بِشِراكٍ أَوْ بِشِراكَيْنِ، فَقالَ: هذا شَيْءٌ كُنْتُ أَصَبْتُهُ فَقالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: شِراكٌ أَوْ شِرَاكانِ مِنْ نارٍ
__________
أخرجه البخاري في: 64 كتاب المغازى: 38 باب غزوة خيبر
74. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం :- మేము ఖైబర్ ప్రాంతాన్ని జయించినప్పుడు, యుద్ధ సొత్తు (మాలె గనీమత్)గా మాకు వెండి బంగారాలే గాక ఆవులు, ఒంటెలు, తోటలు, ఇతర సామగ్రి కూడా లభించాయి. ఖైబర్ విజయం తరువాత మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట ఖురా లోయకు తిరిగొచ్చాము. ఆ సమయంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట ఆయన బానిస ‘మిద్ అమ్’ కూడా ఉన్నాడు. ఈ బానిసను బనీ జిబాబ్ తెగకు చెందిన ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు కానుకగా సమర్పించాడు. ఆ బానిస దైవ ప్రవక్త (ఒంటె పై నుంచి) అంబారీని తీసివేస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఎక్కడ్నుంచో ఒక బాణం వచ్చి అతనికి తగిలింది. దాంతో అతను ప్రాణం విడిచాడు. ప్రజలు అభినందన భావంతో “అతని అమరగతి (వీరమరణం) ఎంతో శుభప్రదమైనది!” అని పలికారు. అయితే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ పలుకులు విని “బాగానే ఉంది. కాని నా ప్రాణం ఎవరి అధీనంలో ఉందో ఆ శక్తి స్వరూపుని సాక్ష్యం! ఖైబర్ యుద్ధం జరిగిన రోజు యుద్ధప్రాప్తిని పంచక ముందే అతను ఒక దుప్పటిని స్వాధీనం చేసుకున్నాడు. ఆ దుప్పటి అతని పాలిట అగ్నిజ్వాలగా మారుతుంది” అని అన్నారు. ఒక వ్యక్తి ఈ మాటలు విని వెంటనే తన దగ్గరున్న ఒకటో రెండో తాళ్ళు తీసుకొచ్చి “ఇవి నాకు దొరికాయి (తీసుకోండి)” అన్నాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వాటిని చూసి “ఒకటైనా రెండయినా ఈ త్రాళ్ళు కూడా నిప్పుగా మారిపోతాయి” అని చెప్పారు.
[సహీహ్ బుఖారీ : 64వ ప్రకరణం – ముగాజి, 38వ అధ్యాయం – జంగ్-ఇ-ఖైబర్]
51వ అధ్యాయం – అజ్ఞాన కాలం నాటి కర్మల లెక్క
هل يؤاخذ بأعمال الجاهلية
75 – حديث ابْنِ مَسْعودٍ رضي الله عنه قَالَ: قَالَ رَجُلٌ يا رَسُولَ اللهِ أَنُؤَاخَذُ بِما عَمِلْنا في الْجاهِلِيَّةِ قَالَ: مَنْ أَحْسَنَ في الإِسْلامِ لَمْ يُؤَاخَذْ بِما عَمِلَ في الْجاهِلِيَّةِ، وَمَنْ أَساءَ في الإِسْلامِ أُخِذَ بِالأَوَّلِ وَالآخِرِ
__________
أخرجه البخاري في: 88 كتاب استتابة المرتدين: 1 باب إثم من أشرك بالله
75. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రదియల్లాహు అన్హు) కథనం:- ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చి “దైవప్రవక్తా! అజ్ఞానకాలంలో ఆచరించిన కర్మలను గురించి కూడా (అల్లాహ్ ముందు) విచారణ జరుగుతుందా?’ అని అడిగాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సమాధానమిచ్చారు. “ఇస్లాం స్వీకరించిన తరువాత సత్కర్మలు ఆచరిస్తూ ఉంటే అజ్ఞానకాలంలో చేసిన దుష్కర్మలను గురించి నిలదీయడం జరగదు. అయితే ఇస్లాం స్వీకరించిన తరువాత కూడా దుష్కార్యాలు చేస్తూ ఉంటే, అతను గతంలో చేసిన వాటితో పాటు మొత్తం పాపకార్యాల విషయంలో పట్టుబడి పోతాడు.”
(సహీహ్ బుఖారీ : 88వ ప్రకరణం – ఇస్తితాబతిల్ ముర్తదీన్, 1వ అధ్యాయం- ఇస్మిమన్ అష్రిక్ బిల్లాహి]
52వ అధ్యాయం – ఇస్లాం స్వీకరించినా, హజ్, హిజ్రత్ లు చేసినా గత పాపాలు క్షమించబడతాయి.
كون الإِسلام يهدم ما قبله وكذا الهجرة والحج
76 – حديث ابْنِ عَبَّاسٍ، أَنَّ ناسًا مِنْ أَهْلِ الشِّرْكِ كانُوا قَدْ قَتَلُوا وَأَكْثَروا، وَزَنَوْا وَأَكْثَرُوا، فَأَتَوْا مُحَمَّدًا صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَقالُوا: إِنَّ الَّذي تَقُولُ وَتَدْعُو إِلَيْهِ لَحَسَنٌ لَوْ تُخْبِرُنا أَنَّ لِما عَمِلْنا كَفَّارَةً؛ فَنَزَلَ (وَالَّذينَ لا يَدْعُونَ مَعَ اللهِ إِلهًا آخَرَ وَلا يَقْتُلُونَ النَّفْسَ الَّتي حَرَّمَ اللهُ إِلاَّ بِالْحَقِّ وَلا يَزْنُونَ) ، وَنَزَلَ: (قُلْ يا عِبادِي الَّذينَ أَسْرَفُوا عَلى أَنْفُسِهِمْ لا تَقْنَطُوا مِنْ رَحْمَةِ اللهِ)
__________
أخرجه البخاري في: 65 كتاب التفسير: 39 سورة الزمر
76. హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం:- కొందరు బహుదైవారాధకులు (గతంలో) అనేకమంది (అమాయకుల్ని)ని చంపి హత్యానేరాలు చేసి ఉన్నారు. అలాగే లెక్కలేనన్ని సార్లు వ్యభిచారం కూడా చేసి ఉన్నారు. చివరికి వారు (ఓ రోజు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చి “మీరు చెబుతున్న విషయాలు ఎంతో బాగున్నాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. కాని మేము గతంలో ఎన్నో పాపకార్యాలు చేసి ఉన్నాము. మరి వాటికి ప్రాయశ్చితం ఏదైనా ఉందంటారా?” అని అడిగారు.
దాన్ని గురించి ఈ క్రింది ఖుర్ఆన్ సూక్తులు అవతరించాయి :
1) “వారు (కరుణామయుని భక్తులు) ఒక్క అల్లాహ్ ను తప్ప మరెవరినీ మొర పెట్టుకోరు. అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణినీ అన్యాయంగా హతమార్చరు. వ్యభిచారానికి ఏ మాత్రం పాల్పడరు. ఈ పనులు చేసే వారు మాత్రం తమ పాపఫలాన్ని అనుభవిస్తారు.” (అల్ ఫుర్కాన్: 68)
2) “(ఓ ప్రవక్తా!) వారికిలా తెలియజెయ్యి – ఆత్మవంచనకు పాల్పడిన నా దాసులారా! అల్లాహ్ కరుణ పట్ల నిరాశ చెందకండి. ఆయన మీ పాపాలన్నీ క్షమించగలడు. ఆయన గొప్ప క్షమాశాలి, అమిత కరుణామయుడు.” (అజుమర్ : 53)
[సహీహ్ బుఖారీ : 65వ ప్రకరణం – అత్తఫ్సీర్, 39వ అధ్యాయం – సూరతు జ్జుమర్)
53వ అధ్యాయం – అవిశ్వాసులు తమ అవిశ్వాస జీవితంలో చేసిన సత్కార్యాలకు ఇస్లాం స్వీకరణ తరువాత పుణ్యఫలం లభిస్తుందా?
حكم عمل الكافر إِذا أسلم بعده
77 – حديث حَكيمِ بْنِ حِزامٍ رضي الله عنه، قَالَ: قُلْتُ يا رَسُولَ اللهِ أَرَأَيْتَ أَشْياءَ كُنْتُ أَتَحَنَّثُ بِها في الْجاهِلِيَّةِ مِنْ صَدَقَةٍ أَوْ عَتاقَةٍ وَصِلَةِ رَحِمٍ، فَهَلْ فيها مِنْ أَجْرٍ فَقالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: أَسْلَمْتَ عَلى ما سَلَفَ مِنْ خَيْرٍ
__________
أخرجه البخاري في: 24 كتاب الزكاة: 24 باب من تصدق في الشرك ثم أسلم
77. హజ్రత్ హకీం బిన్ హిజామ్ (రదియల్లాహు అన్హు) కథనం:- నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో మాట్లాడుతూ “దైవప్రవక్తా! నేను నా అవిశ్వాస జీవితంలో చేసిన సత్కార్యాలకు ఎలాంటి ప్రతిఫలం లభిస్తుంది? నేను గతంలో దానధర్మాలు, బానిసల విముక్తి, బంధువుల పట్ల దయాదాక్షిణ్యాలు మొదలైన సత్కార్యాలు చేశాను. మరి నాకు వాటి సుకృతఫలం లభిస్తుందంటారా?” అని అడిగాను. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధానమిస్తూ’ ‘ నీవు నీ గత సత్కార్యాల కారణంగానే ముస్లిం అయ్యావు (అంటే ఇస్లాం స్వీకరించిన కారణంగా నీ గత సత్కార్యాలకు కూడా ఇప్పుడు పుణ్యఫలం లభిస్తుంది)” అని అన్నారు.*
[సహీహ్ బుఖారీ : 24వ ప్రకరణం – జకాత్, 24వ అధ్యాయం – మన తసద్దఖ ఫిష్షిర్కి సుమ్మ అస్లమ్)
* హజ్రత్ హకీం బిన్ హిజామ్ ఇస్లాం స్వీకరించక పూర్వం వందమంది బానిసలకు బానిసత్వం నుండి విమోచనం కలిగించారు. అంతేగాక వంద ఒంటెలు మోసే సామగ్రి కూడా దానం చేసి ఉన్నారు.
صدق الإيمان وإِخلاصه
78 – حديث عَبْدِ اللهِ بْنِ مَسْعُودٍ رضي الله عنه، قَالَ: لَمّا نَزَلَتْ (الَّذينَ آمَنُوا وَلَمْ يَلْبِسوا إِيمانَهُمْ بِظُلْمٍ) شَقَّ ذَلِكَ عَلى الْمُسْلِمينَ؛ فَقالُوا: يَا رَسُولَ اللهِ أَيُّنا لاَ يَظْلِمُ نَفْسَهُ قَالَ: لَيْسَ ذَلِكَ، إِنَّما هُوَ الشِّرْكُ؛ أَلَمْ تَسْمَعُوا ما قَالَ لُقْمَانُ لاِبْنِهِ وَهوَ يَعِظهُ (يا بُنَيَّ لا تُشْرِكُ بِاللهِ إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ)
__________
أخرجه البخاري في: 60 كتاب الأنبياء: 1 باب قول الله تعالى (ولقد آتينا لقمان الحكمة)
78. ‘హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రదియల్లాహు అన్హు) కథనం:- “సత్యాన్ని విశ్వసించి, తమ విశ్వాసానికి ఎలాంటి అన్యాయం తల పెట్టని వారికే శాంతి లభిస్తుంది; అలాంటి వారే నిజానికి సన్మార్గగాములు” అనే ఖుర్ఆన్ సూక్తి (6:82) అవతరించినప్పుడు ముస్లింలు భయపడిపోయి “దైవప్రవక్తా! మాలో ఆత్మలకు అన్యాయం చేసుకోని వారెవరున్నారు?” అని అడిగారు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు. “ఇక్కడ అన్యాయం అంటే మీరు సాధారణంగా భావిస్తున్న అన్యాయం కాదు, ఈ సూక్తిలో అన్యాయం అంటే షిర్క్ (బహుదైవారాధన) అని అర్థం. (ఖుర్ఆన్లో) హజ్రత్ లుఖ్మాన్ (అలైహిస్సలాం) తన కుమారునికి హితబోధ చేస్తూ ‘కుమారా! అల్లాహ్ కి ఏ శక్తినీ సాటి కల్పించకు. అల్లాహ్ కి సాటి కల్పించడం (బహు దైవారాధన) ఘోరమైన అన్యాయం’ అని పలికిన మాటలు మీకు తెలియవా?”
[సహీహ్ బుఖారీ : 60వ ప్రకరణం – అంబియా, 41వ అధ్యాయం – ఖౌలుల్లాహ్ తాలా వలఖద్ ఆతైనా లుఖ్మాన్]
56వ అధ్యాయం – పైశాచిక ఆలోచనలు ఆచరణల్లో రాకుండా ఉంటే క్షమించబడతాయి.
تجاوز الله عن حديث النفس والخواطر بالقلب إِذا لم تستقر
79. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (ఓసారి మాకు) హితోపదేశం చేస్తూ “నా అనుచర సమాజం ప్రజల హృదయాల్లో రేకెత్తే పైశాచిక ఆలోచనలు కార్యరూపం దాల్చనంతవరకు, లేదా అవి ఇతరుల ముందు ప్రస్తావించబడనంతవరకు అల్లాహ్ వాటిని క్షమిస్తాడు” అని అన్నారు.
(సహీహ్ బుఖారీ : 68వ ప్రకరణం – తలాఖ్, 11వ అధ్యాయం – అత్తలాఖుఫిల్ ఇగ్లాఖ్)
57వ అధ్యాయం – సత్సంకల్పానికి పుణ్యం ఉంది కాని, దుస్సంకల్పానికి పాపం లేదు
إِذا هم العبد بحسنة كتبت وإِذا هم بسيئة لم تكتب
80 – حديث أَبي هُرَىْرَةَ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِذا أَحْسَنَ أَحَدُكُمْ إِسْلامَهُ فَكُلُّ حَسَنَةٍ ىَعْمَلُها تُكْتَبُ لَهُ بِعَشْرِ أَمْثالِها، إِلى سَبْعِمائَةِ ضِعْفٍ، وَكُلُّ سَيِّئَةٍ يَعْمَلُها تُكْتَبُ لَهُ بِمِثْلِها
__________
أخرجه البخاري في: 2 كتاب الإيمان: 31 باب حسن إسلام المرء
80. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనం ప్రకారం, “ఒక వ్యక్తి తన ఇస్లాం ధర్మాన్ని మెరుగుపరచుకుంటున్నప్పుడు అతను చేసే ప్రతి సత్కార్యానికి పది నుంచి ఏడు వందల రెట్లు పుణ్యం అతని కర్మ పత్రంలో వ్రాయబడుతుంది. అయితే అతను చేసే ప్రతి దుష్కార్యానికి మాత్రం ఒక్క పాపమే అతని కర్మపత్రంలో వ్రాయబడుతుంది.”
(సహీహ్ బుఖారీ : 2 వ ప్రకరణం – ఈమాన్, 31వ అధ్యాయం – హుస్నె ఇస్లామిల్ మర్ ఇ]
81 – حديث ابْنِ عَبَّاسٍ رضي الله عنهما عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فِيما يَرْوي عَنْ رَبِّهِ عَزَّ وَجَلَّ، قَالَ: قَالَ إِنَّ اللهَ كَتَبَ الْحَسَناتِ وَالسَّيِّئاتِ، ثُمَّ بَيَّنَ ذَلِكَ، فَمَنْ هَمَّ بِحَسَنَةٍ فَلَمْ يَعْمَلْها كَتَبَها اللهُ لَهُ عِنْدَهُ حَسَنَةً كامِلَةً، فَإِنْ هُوَ هَمَّ بِها فَعَمِلَها كَتَبَها اللهُ لَهُ عِنْدَهُ عَشْرَ حَسَناتٍ، [ص:26] إِلى سَبْعِمائَةِ ضِعْفٍ، إِلى أَضْعافٍ كَثيرَةٍ، وَمَنْ هَمَّ بِسَيِّئَةٍ فَلَمْ يَعْمَلْها، كَتَبَها اللهُ لَهُ عِنْدَهُ حَسَنَةً كامِلَةً، فَإِنْ هُوَ هَمَّ بِها فَعَمِلَها كَتَبَها اللهُ لَهُ سَيِّئَةً واحِدَةً
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 31 باب من هم بحسنة أو بسيئة
81. హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనం ప్రకారం అల్లాహ్ (మానవుల) పాపపుణ్యాలను (ముందే) రాసి పెట్టి, వాటిని గురించి స్పష్టంగా వివరించాడు. కనుక ఒక సత్కార్యం చేయ సంకల్పించుకున్నవాడు ఆ సంకల్పాన్ని ఆచరణలో పెట్టలేకపోయినా అల్లాహ్ అతని కర్మపత్రంలో పూర్తిగా ఒక పుణ్యం రాసి పెట్టాడు. ఒకవేళ అతను సంకల్పించుకున్న పనిని ఆచరణలో కూడా పెడితే అల్లాహ్ అతని కర్మపత్రంలో పది నుంచి ఏడు వందల రెట్లు పుణ్యం రాసి పెడ్తాడు. పైగా అంతకంటే అనేక రెట్లు ఎక్కువ పుణ్యం కూడా రాసి పెడ్తాడు. పోతే ఒక దుష్కార్యం చేయ సంకల్పించుకున్నవాడు ఆ పని చేయకపోతే అల్లాహ్ అతని కర్మపత్రంలో పూర్తిగా ఒక పుణ్యం రాసి పెడ్తాడు. ఒకవేళ అతను సంకల్పించుకున్న దుష్కార్యం ఆచరణలో పెడితే అల్లాహ్ అతని కర్మపత్రంలో ఒక పాపమే నమోదు చేస్తాడు.
[సహీహ్ బుఖారీ : 81వ ప్రకరణం – రిఖాఖ్, 31వ అధ్యాయం – మన హమ్మబిహ సనతిన్ అన్ బిసయ్యిఅతిన్)
58వ అధ్యాయం – మనస్సులో దుష్ట ఆలోచనలు వచ్చినప్పుడు ఏం చేయాలి?
الوسوسة في الإِيمان وما يقوله من وجدها
82 – حديث أَبي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَأْتي الشَّيْطانُ أَحَدَكُمْ فَيَقُولُ: مَنْ خَلَقَ كَذا مَنْ خَلَقَ كَذا حَتَّى يَقُولَ: مَنْ خَلَقَ رَبَّكَ فَإِذا بَلَغَهُ فَلْيَسْتَعِذْ بِاللهِ وَلْيَنْتَهِ
__________
أخرجه البخاري في: 59 كتاب بدء الخلق: 11 باب صفة إبليس وجنوده
82. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు, “ఒక్కోసారీ షైతాన్ మీలో ఒకరి దగ్గరకు వచ్చి, దీన్నెవరు సృష్టించారు, దాన్నెవరు సృష్టించారు? అని అడుగుతాడు. చివరికి నీ ప్రభువుని ఎవరు సృష్టించారని కూడా దుష్టాలోచనలు కలిగిస్తాడు. అందువల్ల ఇలాంటి దుష్టాలోచనలు మనసులో రేకెత్తినప్పుడు (వెంటనే) మీరు (వాటి కీడు నుంచి) అల్లాహ్ శరణు కోరండి. మీరు స్వయంగా ఇలాంటి పైశాచిక ఆలోచనలకు మనస్సులో తావీయకండి.”
[సహీహ్ బుఖారీ : 59వ ప్రకరణం – బద్ యిల్ ఖల్ఖ్ , 11వ అధ్యాయం – సిఫతి ఇబ్లీస్ వ జునూదిహీ]
83 – حديث أَنَسِ بْنِ مالِكٍ، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: لَنْ يَبْرَحَ النَّاسُ يَتَساءَلُونَ حَتّى يَقُولوا: هذا اللهُ خَالِقُ كُلِّ شَيْءٍ، فَمَنْ خَلَقَ اللهَ
__________
أخرجه البخاري في: 96 كتاب الاعتصام: 3 باب ما يكره من كثرة السؤال
83. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రకారం, ప్రజలు ఎల్లప్పుడూ ఏదో ఒక దాన్ని గురించి పరస్పరం ప్రశ్నించుకుంటారు. చివరికి ‘అల్లాహ్ అన్నిటినీ సృష్టించాడు, బాగానే ఉంది. అయితే అల్లాహ్ ను ఎవరు సృష్టించినట్లు?’ అని అడుగుతారు.
[సహీహ్ బుఖారీ : 96వ ప్రకరణం – ఏతెసామ్, 3వ అధ్యాయం – మాయుక్రహు మిన్ కస్రతిస్సవాల్)
59వ అధ్యాయం – అసత్య ప్రమాణం చేసి సాటి ముస్లింని వంచించే వ్యక్తికి నరక శిక్ష
وعيد من اقتطع حق مسلم بيمين فاجرة بالنار
84 – حديث عَبْدِ اللهِ بْنِ مَسْعُودٍ رضي الله عنه، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مَنْ حَلَفَ يَمينٍ صَبْرٍ لِيَقْتَطِعَ بِها مَالَ امْرِىءٍ مُسْلِمٍ، لَقِيَ اللهَ وَهُوَ عَلَيْهِ غَضْبانُ فَأَنْزَلَ اللهُ تَصْديقَ ذَلِكَ (إِنَّ الَّذينَ يَشْتَرُونَ بِعَهْدِ اللهِ وَأَيْمانِهِمْ ثَمَنًا قَليلاً أُولئِكَ لاَ خَلاقَ لَهُمْ في الآخِرَةِ) إِلى آخر الآية؛ قَالَ فَدَخَلَ الأَشْعَثُ بْنُ قَيْسٍ وَقَالَ: ما يُحَدِّثُكُمْ أَبُو عَبْدِ الرَّحْمنِ قُلْنا: كَذا وَكَذا، قَالَ فيَّ أُنْزِلَتْ: كانَتْ لي بِئْرٌ في أَرْضِ ابْنِ عَمٍّ لي، قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: بَيِّنَتُكَ أَوْ يَمينُهُ؛ فَقُلْتُ: إِذًا يَحْلِفَ يا رَسُول اللهِ؛ فَقالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: مَنْ حَلَفَ عَلى يَمينِ صَبْرٍ يَقْتَطِعُ بِها مَالَ امْرِىءٍ مُسْلِمٍ، وَهُوَ فِيها فاجِرٌ لَقِيَ اللهَ وَهُوَ عَلَيْهِ غَضْبانُ
__________
أخرجه البخاري في: 65 كتاب التفسير: 3 سورة آل عمران 3 باب إن الذين يشترون بعهد الله
84. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రదియల్లాహు అన్హు) కథనం:-దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా చెప్పారు : “తోటి ముస్లిం సోదరుడి ధనాన్ని కాజేయడానికి అబద్ధపు సాక్ష్యమిచ్చే వ్యక్తి (మరణానంతరం) అల్లాహ్ ను కలుసుకున్నప్పుడు, అల్లాహ్ అతని పట్ల ఆగ్రహోదగ్రుడయిపోతాడు” అన్నారు
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). ఈ విషయాన్ని ధృవీకరిస్తూ అల్లాహ్ దివ్యఖుర్ఆన్లో ఈ క్రింది సూక్తిని అవతరింపజేశాడు : “కొందరు తమ వాగ్దానాలను, అల్లాహ్ విషయంలో చేసిన ప్రమాణాలను అతి స్వల్ప మూల్యానికి అమ్ముకుంటారు. అలాంటి (అమ్ముడుబోయిన) వారికి పరలోకంలో ఎలాంటి (పుణ్యఫలం) వాటా లభించదు. వారితో అల్లాహ్ మాట్లాడడు, చివరికి వారి వైపు ప్రళయదినాన కన్నెత్తి కూడా చూడడు. వారిని పరిశుద్ధపరిచే ప్రసక్తి కూడా లేదు. పైగా వారికి వ్యధాభరితమైన శిక్ష పడుతుంది.” (3:77)
ఉల్లేఖకుడు ఈ హదీసుని ఉల్లేఖిస్తున్నప్పుడు హజ్రత్ అష్ అస్ బిన్ ఖైస్ (రదియల్లాహు అన్హు) వచ్చి, “అబ్దుల్లా బిన్ మసూద్ ప్రజలకు ఏ హదీసు విన్పిస్తున్నార’ని అడిగారు. ఫలానా హదీసు విన్పిస్తున్నారని మేము చెప్పాము. అప్పుడు హజ్రత్ అష్ అస్ బిన్ ఖైస్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు:
“ఈ ( ఖుర్ఆన్) సూక్తి నా విషయంలో అవతరించింది. మా పినతండ్రి కొడుక్కు చెందిన స్థలంలో నేను త్రవ్వించిన ఒక బావి ఉంది. (దీని విషయంలో మా ఇద్దరి మధ్య తగాదా వచ్చింది). ఈ సందర్భంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నన్ను ఉద్దేశించి (బావి నీదయితే) సాక్ష్యం తీసుకురా. లేదా అతను (బావి తనదని) ప్రమాణం చేయాలి” అని అన్నారు. దానికి నేను ‘దైవప్రవక్తా! అతను ఎలాగైనా ప్రమాణం చేస్తాడు’ అన్నాను. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ‘ఏ ముస్లిం సోదరుడి ధనాన్నయినా కాజేయడానికి అబద్దపు సాక్ష్యమిచ్చేవాడు (మరణానంతరం) అల్లాహ్ ను కలుసుకున్నప్పుడు, అల్లాహ్ అతని పట్ల ఆగ్రహోదగ్రుడయిపోతాడు’ అని చెప్పారు.”
[సహీహ్ బుఖారీ : 65 వ ప్రకరణం – తఫ్సీర్, 3వ అధ్యాయం – సూరా ఆలిఇమ్రాన్-3)
60వ అధ్యాయం – ఇతరుల సొమ్మును దౌర్జన్యంగా కొల్లగొట్టడం ఘోర పాపం.
الدليل على أن من قصد أخذ مال غيره بغير حق كان القاصد مهدر الدم في حقه، وإن قتل كان في النار، وأن من قتل دون ماله فهو شهيد
85 – حديث عَبْدِ اللهِ بْنِ عَمْرٍو، قَالَ سَمِعْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: مَنْ قُتِلَ دُونَ مالِهِ فَهُوَ شَهيدٌ
__________
أخرجه البخاري في: 46 كتاب المظالم: 33 باب من قاتل دون ماله
85. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:- “సొంత ఆస్తిని కాపాడుకునే ప్రయత్నంలో (దోపిడీ దొంగలచే) హతమార్చబడిన వ్యక్తి – అమరగతి (వీరమరణం) పొందుతాడు” అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెబుతుండగా నేను విన్నాను.
(సహీహ్ బుఖారీ : 46వ ప్రకరణం – మజాలిమ్, 33వ అధ్యాయం – మన్ ఖాతల దూనమలీహీ]
61వ అధ్యాయం – ప్రజల హక్కుల్ని కాలరాచే పాలకుడికి నరకశిక్ష.
استحقاق الوالي الغاش لرعيته النار
86 – حديث مَعْقِلِ بْنِ يَسارٍ، أَنَّ عُبَيْدَ اللهِ بْنَ زِيادٍ عادَهُ في مَرَضِهِ الَّذي مَاتَ فِيهِ، فَقَالَ لَهُ مَعْقِلٌ إِنِّي مُحَدِّثُكَ حَديثًا سَمِعْتُهُ مِنْ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، سَمِعْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: ما مِنْ عَبْدٍ اسْتَرْعاهُ اللهُ رَعِيَّةً فَلَمْ يَحُطْها بِنَصيحَةٍ إِلاّ لَمْ يَجِدْ رائِحَةَ الْجَنَّةِ
__________
أخرجه البخاري في: 93 كتاب الأحكام: 8 باب من استرعى رعية فلم ينصح
86. ఇమామ్ హసన్ బస్రి (రహిమహుల్లాహ్) కథనం:- హజ్రత్ మాఖల్ బిన్ యసార్ (రదియల్లాహు అన్హు) ప్రాణాంతక వ్యాధికి గురయినప్పుడు ఉబైదుల్లా బిన్ జియాద్ ఆయన్ని పరామర్శించడానికి వచ్చారు. అప్పుడు హజ్రత్ మాఖల్ (రదియల్లాహు అన్హు) ఆయనతో ఇలా అన్నారు, “నేను స్వయంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నోట విన్న ఒక హదీసు విన్పించనా? ‘అల్లాహ్ ఒక దాసుడ్ని ప్రజాపాలకుడిగా చేసినప్పుడు, ఆ దాసుడు శ్రేయోభిలాషతో ప్రజల రక్షణ బాధ్యతను గనక నెరవేర్చకపోతే, అతను (మరణానంతరం) స్వర్గ సువాసనను కూడా ఆఘ్రాణించలేడు’ అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).”
(సహీహ్ బుఖారీ : 93వ ప్రకరణం – అహ్కామ్; 8వ అధ్యాయం – మనిస్తురియర యియ్యత్ న్ ఫలమ్ యన్సహ్)
62వ అధ్యాయం – నిజాయితీ, విశ్వాసం లోపించిన హృదయాల్లో దుష్టాలోచనలు
رفع الأمانة والإيمان من بعض القلوب وعرض الفتن على القلوب
87 – حديث حُذَيْفَةَ قَالَ: حَدَّثَنا رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ حَديثَيْنِ، رَأَيْتُ أَحَدَهُمَا، وَأَنا أَنْتَظِرُ الآخَرَ حَدَّثَنا أَنَّ الأَمانَةَ نَزَلَتْ في جَذْرِ قُلوبِ الرِّجالِ، ثُمَّ عَلِمُوا مِنَ الْقُرْآنِ ثُمَّ عَلِمُوا مِنَ السُّنَّةِ وَحَدَّثَنا عَنْ رَفْعِها قَالَ: يَنامُ الرَّجُلُ النَّوْمَةَ فَتُقْبَضُ الأَمانَةُ مِنْ قَلْبِهِ، فَيَظَلُّ أَثَرُها مثل أَثَر الْوَكْتِ، ثُمَّ يَنامُ النَّوْمَةَ فَتُقْبَضُ، فَيَبْقى أَثَرُها مِثْلَ الْمَجْلِ كَجَمْرِ دَحْرَجْتَهُ عَلى رِجْلِكَ، فَنَفِطَ فَتَرَاهُ مُنْتَبِرًا وَلَيْسَ فِيهِ شَيْءٌ، فَيُصْبِحُ النَّاسُ يَتَبايَعُونَ [ص:28] فَلاَ يَكَادُ أَحَدٌ يُؤَدِّي الأَمَانَةَ، فَيُقَالُ إِنَّ فِي بَنِي فُلاَنٍ رَجُلاً أَمِينًا؛ وَيُقَالُ لِلرَّجُلِ مَا أَعْقَلَهُ وَمَا أَظْرَفَهُ وَمَا أَجْلَدَهُ وَمَا فِي قَلْبِهِ مِثْقَالُ حَبَّةِ خَرْدَلٍ مِنْ إِيمَانٍ
وَلَقَدْ أَتَى عَلَيَّ زَمَانٌ وَمَا أُبَالِي أَيَّكُمْ بَايَعْتُ؛ لَئِنْ كَانَ مُسْلِمًا رَدَّهُ عَلَيَّ الإِسْلاَمُ، وَإِنْ كَانَ نَصْرَانِيًّا رَدَّهُ عَلَيَّ سَاعِيهِ، فَأَمَّا الْيَوْمَ، فَمَا كُنْتُ أُبَايِعُ إِلاَّ فُلاَنًا وَفُلاَنًا
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 35 باب رفع الأمانة
87. హజ్రత్ హుజైఫా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాకు (భవిష్యత్ ప్రకటనలకు సంబంధించిన) రెండు హదీసులు విన్పించారు. ఇందులో ఒకటి (నిజమవడం) నేను చూశాను. రెండవ దాని కోసం ఎదురు చూస్తున్నాను. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మా ముందీ విషయం ప్రస్తావిస్తూ, “నిజాయితీ, విశ్వసనీయతలు ప్రజల స్వభావంలో వేరుగొన్నవి. ఆ తరువాత ప్రజలు వాటిని గురించి ఖుర్ఆన్, హదీసుల ద్వారా వివరంగా తెలుసుకున్నారు” అని అన్నారు.
ప్రజల హృదయాల నుండి నిజాయితీ, విశ్వసనీయతలు క్షీణించి పోవడం * గురించి ఆయన మాట్లాడుతూ ఇలా అన్నారు. ఒక వ్యక్తి కాస్సేపు పడుకుంటాడు. అప్పుడు అతని హృదయం నుండి నిజాయితీ తీసివేయడం జరుగుతుంది. గాయం నయమయిన తరువాత దాని గుర్తు మిగిలిపోయినట్లు అతని నిజాయితీకి సంబంధించిన ఓ చిన్న గుర్తు మాత్రమే ఉండిపోతుంది.
ఆ తరువాత ఆ వ్యక్తి మరికాస్సేపు పడుకుంటాడు. అప్పుడు మిగిలిపోయిన ఆ కాస్త నిజాయితీ కూడా తీసివేయబడుతుంది. నిప్పు కణం కాలు మీద పడినప్పుడు బొబ్బ వచ్చి చర్మం ఎలా ఉబ్బెత్తుగా కన్పిస్తుందో అలా ఉంటుంది మిగిలిన ఈ నిజాయితీకి సంబంధించిన గుర్తు. బొబ్బ లోపల ఏమీ ఉండదు (పల్చటి రసి తప్ప). ఈ నిజాయితి స్థితి కూడా అంతే. (మరో మాటలో చెప్పాలంటే ఇది నేతి బీరకాయ వంటి నిజాయితీ అన్నమాట). ప్రజలు అమ్మకం కొనుగోళ్ళయితే చేస్తారు, కాని ఏ ఒక్కరూ నిజాయితీతో వ్యవహరించరు. చివరికి ‘ఫలానా తెగ మనిషి ఎంతో నిజాయితీపరుడు, ఫలానా వ్యక్తి ఎంతో మంచివాడు! ఎంతో బుద్ధిమంతుడు!!’ అని ప్రశంసిస్తారు. నిజానికి అతనిలో అణుమాత్రం నిజాయితీ కూడా ఉండదు.
ఒకప్పుడు నేను మీలో ఎవరి నుండి కొనుగోలు చేస్తున్నానన్న విషయాన్ని పట్టించుకునే వాడ్ని కాను. ఆ వ్యక్తి ముస్లిం అయి ఉంటే అతని ధర్మమైన ఇస్లాం నాకు రావలసిన హక్కు అతని నుండి ఇప్పిస్తుంది. ఒకవేళ ఆ వ్యక్తి క్రైస్తవుడయి ఉంటే అతని అధికారి ఆ హక్కు నాకు ఇప్పించేవాడు. ఈనాడు పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు నేను ఫలానా వ్యక్తులతో మాత్రమే అమ్మకం, కొనుగోళ్ళు చేస్తున్నాను.
(సహీహ్ బుఖారీ : 81వ ప్రకరణం – రిఖాఖ్, 35 వ అధ్యాయం – రఫ్ అల్ అమానత్]
* అంటే ప్రజల హృదయాల్లో నుంచి ఇస్లాం జ్యోతి క్రమంగా సన్నగిల్లి ‘అవిశ్వాస’ చీకటి ఆవరిస్తూ పోతుంది. మొదట్లో ఓ చిన్న మచ్చ ఏర్పడుతుంది. తర్వాత అది కాస్తా పెద్దదవుతుంది. చివరికి హృదయం పూర్తిగా నల్లబడిపోతుంది. ఇలా క్రమంగా విశ్వాసం అంతరించి అక్కడ అవిశ్వాసం గూడుకట్టుకుంటుంది. (అనువాదకుడు)
63వ అధ్యాయం – ఇస్లాం దారిద్ర్య పీడనా స్థితుల్లో ప్రారంభమైంది తిరిగి అదే స్థితికి వస్తుంది.
بيان أن الإسلام بدأ غريبا وسيعود غريبا وأنه يأرز بين المسجدين
88 – حديث حُذَيْفَةَ، قَالَ: كُنَّا جُلُوسًا عِنْدَ عُمَرَ رضي الله عنه فَقَالَ: أَيُّكُمْ يَحْفَظُ قَوْلَ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فِي الْفِتْنَةِ قُلْتُ: أَنَا كَمَا قَالَهُ، قَالَ: إِنَّكَ عَلَيْهِ أَوْ عَلَيْهَا لَجَرِيءٌ؛ قُلْتُ فِتْنَةُ الرَّجُلِ فِي أَهْلِهِ وَمَالِهِ وَوَلَدِهِ وَجَارِهِ تُكَفِّرُهَا الصَّلاَةُ وَالصَّوْمُ وَالصَّدَقَةُ وَالأَمْرُ وَالنَّهْيُ، قَالَ: لَيْسَ هذَا أُرِيدُ وَلكِنْ الْفِتْنَةُ الَّتِي تَمُوجُ كَمَا يَمُوجُ الْبَحْرُ، قَالَ: لَيْسَ عَلَيْكَ مِنْهَا بَأْسٌ يَا أَمِيرَ الْمُؤْمِنِينَ، إِنَّ بَيْنَكَ وَبَيْنَهَا بَابًا مُغْلَقًا، قَالَ: أَيُكْسَرُ أَمْ يُفْتَحُ قَالَ: يُكْسَرُ، قَالَ: إِذًا لاَ يُغْلَقُ أَبَدًا
قُلْنَا: أَكَانَ عُمَرُ يَعْلَمُ الْبَابَ قَالَ نَعَمْ، كَمَا أَنَّ دُونَ الْغَدِ اللَّيْلَةَ، إِنِّي حَدَّثْتُهُ بِحَدِيثٍ لَيْسَ بِالأَغَالِيطِ
فَهِبْنَا أَنْ نَسْأَلَ حُذَيْفَةَ، فَأَمَرْنَا مَسْرُوقًا فَسَأَلَهُ؛ فَقَالَ: الْبَاب عُمَرُ
__________
أخرجه البخاري في: 9 كتاب مواقيت الصلاة: 4 باب الصلاة كفارة
88. హజ్రత్ హుజైఫా (రదియల్లాహు అన్హు) కథనం:- మేము (ఓ రోజు) హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) దగ్గర కూర్చుని ఉన్నప్పుడు ఆయన మాతో మాట్లాడుతూ, “మీలో ఎవరికైనా ఉపద్రవానికి సంబంధించి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించిన ఏదైనా హదీసు గుర్తున్నదా?” అని అడిగారు. “నాకు గుర్తుంది, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎలా ప్రవచించారో ఆ విధంగానే నాకు గుర్తుంది” అన్నాను నేను. దానికి హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) తప్పకుండా నీవలా చెప్పగలవని ఆశించగలను” అని అన్నారు. అప్పుడు నేను (మాట్లాడుతూ) “ఒక మనిషికి అతని భార్యా పిల్లలు, ఇరుగు పొరుగు, సిరిసంపదల మూలంగా ఎదురయ్యే ఉపద్రవం నమాజ్, ఉపవాస వ్రతాలు, దానధర్మాలు చేయడం వల్ల, మంచిని ప్రచారం చేయడం, చెడుని అరికట్టడం వల్ల దూరమవుతుంది” అని అన్నాను.
దానికి హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) “నేనీ ఉపద్రవాన్ని గురించి అడగడం లేదు. భయంకరమైన ఉప్పెనలా విరుచుకుపడే ఉపద్రవాన్ని గురించి అడుగుతున్నాను” అని అన్నారు. “విశ్వాసుల నాయకా! ఆ ఉపద్రవం వల్ల మీకెలాంటి ప్రమాదం ఉండదు. మీకు, ఆ ఉపద్రవానికి మధ్య ఒక మూసిన తలుపుంది” అన్నాను నేను. “ఈ తలుపును బద్దలు గొడతారా లేక తెరుస్తారా?” అని అడిగారు ఆయన. “దీన్ని బద్దలు కొట్టడం జరుగుతుంది” అన్నాను నేను. “అయితే ఇక ఎప్పటికీ మూసుకోదు” అన్నారు హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు). “మరి ఈ తలుపుకు అర్థం ఏమిటో హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కు తెలుసా?” అని అడిగారు అక్కడున్న వారిలో ఒకరు. “ఈ రోజు పగటి తరువాత వచ్చే రాత్రి గురించి మీకెంత తెలుసో ఆ తలుపు గురించి హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు)కు అంతకంటే బాగానే తెలుసు” అన్నాను నేను. (ఆ తరువాత) నేను హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు)కు ఏ మాత్రం పొరపాటు లేని హదీసు విన్పించాను.
హదీసు ఉల్లేఖకుడు ఈ సందర్భంలో మాట్లాడుతూ “మేము తలుపు గురించి తెలుసుకోవడానికి హజ్రత్ హుజైఫా (రదియల్లాహు అన్హు)ను అడిగేందుకు భయపడ్డాము. హజ్రత్ మస్రూఖ్ (రహిమహుల్లాహ్)తో “మీరడగండి’ అన్నాము. అప్పుడాయన అడిగితే, హజ్రత్ హుజైఫా (రదియల్లాహు అన్హు) “ఆ తలుపు స్వయంగా హజ్రత్ ఉమరే (రదియల్లాహు అన్హు)” అని చెప్పారు.
(సహీహ్ బుఖారీ : 9వ ప్రకరణం – మవాఖియతుస్సలాత్, 4వ అధ్యాయం – అస్సలాతు కఫ్ఫారా]
89 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: إِنَّ الإِيمَانَ لَيَأْرِزُ إِلَى الْمَدِينَةِ كَمَا تَأْرِزُ الْحَيَّةُ إِلَى جُحْرِهَا
__________
أخرجه البخاري في: 29 كتاب فضائل المدينة: 6 باب الإيمان يأرز إلى المدينة
89. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- “పాము తన పుట్టలోకి వచ్చి ఎలా ఇమిడిపోతుందో ‘విశ్వాసం’ కూడా అలాగే మదీనాలోకి వచ్చి ఇమిడిపోతుంది” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).
[సహీహ్ బుఖారీ : 29 వ ప్రకరణం – ఫజాయెలుల్ మదీనా, 6వ అధ్యాయం – ఈమానుయాజరు ఇలల్ మదీనా)
65వ అధ్యాయం – ప్రాణాపాయ స్థితిలో విశ్వాసాన్ని దాచడం ధర్మసమ్మతమే
جواز الاستسرار للخائف
90 – حديث حُذَيْفَةَ رضي الله عنه قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ اكْتُبُوا لِي مَنْ تَلَفَّظَ بِالإِسْلاَمِ مِنَ النَّاسِ فَكَتَبْنَا لَهُ أَلْفًا وَخَمْسَمِائَةِ رَجُلٍ فَقُلْنَا نَخَافُ وَنَحْنُ أَلْفٌ وَخَمْسُمِائَةٍ فَلَقَدْ رَأَيْتُنَا ابْتُلِينَا حَتَّى إِنَّ الرَّجُلَ لَيُصَلِّي وَحْدَهُ وَهُوَ خَائِفٌ
__________
أخرجه البخاري في: 56 كتاب الجهاد 181 باب كتابة الإمام للناس
90. హజ్రత్ హుజైఫా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓ రోజు మాతో “ఇస్లాం సద్వచనం పఠించే వారి పేర్లన్నీ రాసి నాకివ్వండి” అని అన్నారు. మేము పదిహేను వందల (1500) మంది పేర్లు రాసిచ్చాము. అప్పుడు మేము “మన సంఖ్య పదిహేను వందల దాకా ఉన్నా, మనం అవిశ్వాసులకు భయపడుతున్నాము. మనమీదేదో పెద్ద విపత్తు వచ్చి పడినట్లు బెంబేలు పడిపోతూ మనలో కొందరు ఒంటరిగా (ఇళ్ళల్లో రహస్యంగా) నమాజు చేస్తున్నారే” అని మనసులో తలపోశాము.
[సహీహ్ బుఖారీ : 56వ ప్రకరణం – జిహాద్, 181 వ అధ్యాయం – కితాబతిల్ ఇమామిన్నాస్]
66వ అధ్యాయం – బలహీన విశ్వాసిని అతను ఖచ్చితంగా విశ్వాసి అని అనకూడదు
تألف قلب من يخاف على إيمانه لضعفه والنهي عن القطع بالإيمان من غير دليل قاطع
91 – حديث سَعْدٍ رضي الله عنه أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَعْطَى رَهْطًا وَسَعْدٌ جَالِسٌ، فَتَرَكَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ رَجُلاً هُوَ أَعْجَبُهُمْ إِلَيَّ، فَقُلْتُ: يَا رَسُولَ اللهِ مَا لَكَ عَنْ فُلاَنٍ فَوَاللهِ إِنِّي لأَرَاهُ مُؤْمِنًا، فَقَالَ: أَوْ مُسْلِمًا فَسَكَتُّ قَلِيلاً ثُمَّ غَلَبَنِي مَا أَعْلَمُ مِنْهُ فَعُدْتُ لِمَقَالَتِي فَقُلْتُ: مَا لَكَ عَنْ فُلاَنٍ فَوَاللهِ إِنِّي لأَرَاهُ مُؤمِنًا فَقَالَ: أَوْ مُسْلِمًا فَسَكَتُّ قَلِيلاً ثُمَّ غَلَبَنِي مَا أَعْلَمُ مِنْهُ، فَعُدْتُ لِمَقَالَتِي، وَعَادَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، ثُمَّ قَالَ: يَا سَعْدُ إِنِّي لأُعْطِي الرَّجُلَ، وَغَيْرُهُ أَحَبُّ إِلَيَّ مِنْهُ، خَشْيَةَ أَنْ يَكُبَّهُ اللهُ فِي النَّارِ
__________
أخرجه البخاري في: 2 كتاب الإيمان: 19 باب إذا لم يكن الإسلام على الحقيقة
91. హజ్రత్ సాద్ (రదియల్లాహు అన్హు) కథనం:- ఓ సారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కొంతమందికి ధనం పంచిపెట్టారు. కాని నాకు ఇష్టమయిన ఒక వ్యక్తికి మాత్రం ఏమీ ఇవ్వకుండా వదిలేశారు. అప్పుడు నేను (ఆశ్చర్యపోతూ) “దైవప్రవక్తా! మీరీ వ్యక్తి పట్ల ఇలా ఎందుకు వ్యవహరించారు? అల్లాహ్ సాక్షి! నేను మటుకు ఇతడ్ని విశ్వాసిగానే భావిస్తున్నాను” అని అన్నాను. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఏమిటీ విశ్వాసియా లేక ముస్లిమా?” అని అడిగారు. ఆయన మాటలు విని నేను కాస్సేపు మౌనంగా ఉండిపోయాను.
కాని ఆ తరువాత ఆ వ్యక్తి గురించి నాకు తెలిసిన విషయాలు నన్ను మరోసారి ఈ సంగతి అడిగేందుకు ఒత్తిడి చేశాయి. నేను సంగతిని తిరిగి ప్రస్తావిస్తూ “దైవప్రవక్తా! మీరీ మనిషి పట్ల ఇలా ఎందుకు ప్రవర్తించారు? అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. నా దృష్టిలో ఇతను విశ్వాసియే” అని అన్నాను. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఏమిటి, విశ్వాసియా లేక ముస్లిమా?” అని అన్నారు. తిరిగి. దాంతో నేను మరోసారి మౌనంగా ఉండిపోయాను. అయితే కాస్సేపటి తరువాత అతడ్ని గురించి నేనెరిగిన విశేషాలు నన్ను మళ్ళీ ఈ ప్రశ్న అడిగేలా చేశాయి. నేనా సంగతిని మళ్ళీ ప్రస్తావించాను. దైవ ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా తిరిగి అదే సమాధానమిచ్చి ఊరుకున్నారు.
ఆ తరువాత కాస్సేపటికి ఇలా అన్నారు, “సాద్! ఒక్కోసారి నేను నాకెంతో ఇష్టుడయిన మనిషిని వదిలేసి అంతకంటే తక్కువ ఇష్టుడయిన మరొకతనికి (ధనం) ఇస్తుంటాను. (అలా ఇవ్వని పక్షంలో అతను ఇస్లాంకు దూరమయిపోవచ్చు. తత్ఫలితంగా) అల్లాహ్ అతడ్ని నరకంలోకి విసిరి బొర్లా పడవేస్తాడేమో నన్న భయంతో నేనతనికి ధనం ఇస్తుంటాను.”
(సహీహ్ బుఖారీ : 2వ ప్రకరణం – ఈమాన్, 19వ అధ్యాయం – ఇజాలమ్ యకునిల్ ఇస్లాము అలల్ హఖైఖా)
67వ అధ్యాయం – పటిష్టమైన ప్రమాణాలే ఎక్కువ తృప్తినిస్తాయి
زيادة طمأنينة بتظاهر الأَدلة
92 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ نَحْنُ أَحَقُّ بِالشَّكِّ مِنْ إِبْرَاهِيمَ إِذْ قَالَ: (رَبِّ أَرِنِي كَيْفَ تُحْيِي الْمَوْتَى قَالَ أَوَلَمْ تُؤمِنْ قَالَ بَلَى وَلكِنْ لِيَطْمَئِنَّ قَلْبِي) وَيَرْحَمُ اللهُ لُوطًا، لَقَدْ كَانَ يَأْوِي إِلَى رُكْنٍ شَدِيدٍ؛ وَلَوْ لَبِثْتُ فِي السِّجْنِ طولَ مَا لَبِثَ يُوسُفَ لأَجَبْتُ الدَّاعِيَ
__________
أخرجه البخاري في: 60 كتاب الأنبياء: 11 باب قوله عز وجل (ونبئهم عن ضيف إبراهيم)
92. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “(ఏదైనా విషయం గురించి) సందేహించడానికి హజ్రత్ ఇబ్రాహీం (అలైహిస్సలాం) కంటే నేనే ఎక్కువ హక్కుదారుడ్ని,* హజ్రత్ ఇబ్రాహీం (అలైహిస్సలాం) అల్లాహ్ తో ‘ప్రభూ! నీవు మృతుల్ని ఎలా బ్రతికిస్తావో కాస్త నాకు చూపించు’ అని అన్నారు. అప్పుడు అల్లాహ్ “నీకు (నామీద) నమ్మకం లేదా?’ అని అడిగాడు. దానికి, ఆయన “ఎందుకు లేదు, నమ్మకం ఉంది. కాకపోతే మనోతృప్తి కోసం అడుగుతున్నా’ అని అన్నారు. అల్లాహ్ హజ్రత్ లూత్ (అలైహిస్సలాం)ని కరుణించుగాక. ఆయన దృఢమైన ఆశ్రయం (అంటే అల్లాహ్ రక్షణ) కోరుకునేవారు! ఒకవేళ నేను కారాగారంలో హజ్రత్ యూసుఫ్ (అలైహిస్సలాం) ఉన్నంత కాలం గనక ఉండి ఉంటే రాజదూత మాటను ఒప్పుకునేవాడ్ని.”
(సహీహ్ బుఖారీ: 60వ ప్రకరణం – అంబియా, 15వ అధ్యాయం – ఖాలుహువ నబ్బిహుమ్ అన్ జైఫి ఇబ్రాహీం]
* హదీసులో పేర్కొనట్లు సందేహించడానికి హజ్రత్ ఇబ్రాహీం (అలైహిస్సలాం) కంటే నేనే ఎక్కువ హక్కుదారుడ్ని అంటే, హజ్రత్ ఇబ్రాహీం (అలైహిస్సలాం) అసలు అనుమానంలో పడిపోవడమే అసాధ్యమైన విషయమని అర్థం. ఒకవేళ దైవప్రవక్తలు అనుమానంలో పడిపోయే పొరపాటు పాల్పడటం జరిగితే ఆ విషయంలో నేను హజ్రత్ ఇబ్రాహీం (అలైహిస్సలాం) కంటే ఎక్కువ అనుమానంలో పడిపోయేవాడ్ని. కాని హజ్రత్ ఇబ్రాహీం (అలైహిస్సలాం) ఎన్నడూ అనుమానించలేదు. మృతుల్ని బ్రతికించే అల్లాహ్ శక్తి విషయంలో స్వయంగా నేనే ఎన్నడూ అనుమానంలో పడిపోలేదని మీకు తెలుసు. అలాంటప్పుడు హజ్రత్ ఇబ్రాహీం (అలైహిస్సలాం) ఎందుకు అనుమానంలో పడిపోతారు. ఈ విషయంలో ఆయన నాకంటే గొప్పవారు. హజ్రత్ లూత్ (అలైహిస్సలాం) దృఢమైన ఆధారాన్ని ఆశ్రయించడం అంటే అల్లాహ్ రక్షణను కోరుకోవడం అన్నమాట. రాజదూత మాటను ఒప్పుకోవటం అంటే – అపనింద నుండి బయటపడేందుకు షరతు విధించే ప్రయత్నం చేయకుండా జైలు నుండి బయటపడే అవకాశం లభించినపుడు దాన్ని తొందరగా వినియోగించుకోవడానికి ప్రయత్నించడం అని అర్ధం.
హజ్రత్ ముహిస్సనత (రహిమహుల్లాహ్) అభిప్రాయం ప్రకారం మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యూసుఫ్ (అలైహిస్సలాం) సహనాన్ని ప్రశంసించారు. ఆయన జైల్లో సుదీర్ఘకాలం గడిపినప్పటికీ రాజదూత వచ్చినప్పుడు జైలు నుండి బయటపడటానికి తొందరపడలేదు. నేరస్తులు సాధారణంగా క్షమాభిక్ష లభించగానే జైలు నుండి బయటపడేందుకు ఉబలాటపడతారు. హజ్రత్ యూసుఫ్ (అలైహిస్సలాం) అలా చేయకుండా, మీ రాజుగారి దగ్గరకెళ్ళి చేతులు కోసుకున్న స్త్రీల సంగతేమిటో అడిగిరా అన్నారు. రాజదూతతో ఈ విధంగా ఆయన తన నిర్దోషిత్వాన్ని, చేయని నేరానికి జరిగిన అన్యాయాన్ని రాజు ముందు నిరూపించాలని భావించారు.
68వ అధ్యాయం – మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యావత్తు మానవాళి కోసం వచ్చిన దైవప్రవక్త
وجوب الإيمان برسالة نبينا محمد صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِلى جميع الناس ونسخ الملل بملته
93 – حديث أَبِي هُرَيْرَةَ قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مَا مِنَ الأَنْبِيَاءِ نَبِيٌّ إِلاَّ أُعْطِيَ مَا مِثْلُهُ آمَنَ عَلَيْهِ الْبَشَرُ، وَإِنَّمَا كَانَ الَّذِي أُوتِيتُهُ وَحْيًا أَوْحَاهُ اللهُ إِلَيَّ، فَأَرْجُو أَنْ أَكُونَ أَكْثَرَهُمْ تَابِعًا يَوْمَ الْقِيَامَةِ
__________
أخرجه البخاري في: 66 كتاب فضائل القرآن: 1 باب كيف نزول الوحي وأول ما نزل
93. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు, “నాకు పూర్వం వచ్చిన దైవప్రవక్తలందరికీ వారికి ముందొచ్చిన ప్రవక్తల కివ్వబడిన మహిమల్లాంటి మహిమలే ప్రసాదించబడ్డాయి. ఆ మహిమలను చూసి ప్రజలు విశ్వసించారు. అయితే అల్లాహ్ నాకు (గొప్ప మహిమగా) దివ్యాస్మృతి (దివ్యఖుర్ఆన్)ని ప్రసాదించాడు. అందువల్ల ప్రళయదినాన ఇతర దైవప్రవక్తల అనుచరుల కంటే నా అనుచరులు అత్యధిక సంఖ్యలో ఉంటారని నేను ఆశిస్తున్నాను.”
[సహీహ్ బుఖారీ : 66వ ప్రకరణం -1వ అధ్యాయం – కైఫ నుజూలుల్ వహీ]
94 – حديث أَبِي مُوسَى، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ ثَلاَثَةٌ لَهُمْ أَجْرَانِ، رَجُلٌ مِنْ أَهْلِ الْكِتَابِ آمَنَ بِنَبِيِّهِ وَآمَنَ بِمُحَمَّدٍ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَالْعَبْدُ الْمَمْلُوكُ إِذَا أَدَّى حَقَّ اللهِ [ص:31] وَحَقَّ مَوَالِيهِ، وَرَجُلٌ كَانَتْ عِنْدَهُ أَمَةٌ فَأَدَّبَهَا فَأَحْسَنَ تَأْدِيبَهَا، وَعَلَّمَهَا فَأَحْسَنَ تَعْلِيمَهَا ثُمَّ أَعْتَقَهَا فَتَزَوَّجَهَا فَلَهُ أَجْرَانِ
__________
أخرجه البخاري في: 3 كتاب العلم: 31 باب تعليم الرجل أَمَته وأهله
94. హజ్రత్ అబూ మూసా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు, “మూడు విధాల వ్యక్తులకు అల్లాహ్ రెట్టింపు పుణ్యఫలం ప్రసాదిస్తాడు. (1) గ్రంథ ప్రజలకు చెందినవాడు. (యూదుడు లేక క్రైస్తవుడు అయి ఉండి తమ దైవప్రవక్త (హజ్రత్ మూసా లేక హజ్రత్ ఈసా)తో పాటు, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను కూడా విశ్వసించే వ్యక్తి. (2) అటు అల్లాహ్ హక్కుల్ని, ఇటు తన యజమాని హక్కుల్ని కూడా నిర్వర్తించే బానిస. (3) ఒక మహిళా బానిసను కలిగి ఉండి, ఆమెకు మంచి విద్యాబుద్ధులు గరిపి, తరువాత ఆమెను బానిసత్వం నుంచి విముక్తి కలిగించి తన భార్యగా చేసుకునే వ్యక్తి. అతనికి కూడా రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది.”
[3వ ప్రకరణం – ఇల్మ్, 31వ అధ్యాయం – తాలిమిర్రజులి ఉమ్మత్)
69వ అధ్యాయం – హజ్రత్ ఈసా (అలైహిస్సలాం) పునరాగమనం – ముహమ్మదీయ ధర్మశాస్త్రమే ఆయనకు శరణ్యం
نزول عيسى بن مريم حاكما بشريعة نبينا محمد صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ
95 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَالَّذِي نَفْسِي بِيَدِهِ لَيُوشِكَنَّ أَنْ يَنْزِلَ فِيكُمُ ابْنُ مَرْيَمَ حَكَمَا مُقْسِطًا، فَيَكْسِرَ الصَّلِيبَ، وَيَقْتُلَ الْخِنْزِيرَ، وَيَضَعَ الْجِزْيَةَ وَيَفِيضَ الْمَالُ حَتَّى لاَ يَقْبَلَهُ أَحَدٌ
__________
أخرجه البخاري في: 34 كتاب البيوع: 102 باب قتل الخنزير
95. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా తెలిపారు, “నా ప్రాణం ఎవరి అధీనంలో ఉందో ఆ అల్లాహ్ సాక్ష్యం! త్వరలోనే మర్యమ్ కుమారుడు (హజ్రత్ ఈసా అలైహిస్సలాం) రాజ్యాధినేతగా మీ మధ్య అవతరిస్తారు. అప్పుడాయన శిలువను విరగొడతారు, సూకర సంహారం చేస్తారు. జజ్ యా (దక్షిణ రుసుం)ను రద్దు చేస్తారు. సిరిసంపదలు అపరిమితంగా వచ్చి పడతాయి. దాంతో ధనికులు దానం చేయగోరినా దాన్ని స్వీకరించేవారే ఉండరు.”
[సహీహ్ బుఖారీ : 34 వ ప్రకరణం – అల్ బుయూ, 102వ అధ్యాయం – ఖతలిల్ ఖంజీర్]
96 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ كَيْفَ أَنْتُمْ إِذَا نَزَلَ ابْنُ مَرْيَمَ فِيكُمْ وَإِمَامُكُمْ مِنْكُمْ
__________
أخرجه البخاري في: 60 كتاب الأنبياء: 49 باب نزول عيسى ابن مريم عليهما السلام
96. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- “మర్యం కుమారుడు ఈసా (అలైహిస్సలాం) మీ మధ్య అవతరిస్తారు. (ఆయన సమక్షంలో కూడా) మీ అధినేత మీలోని వాడే అయి ఉంటాడు. అప్పుడు మీకు ఎలా అన్పిస్తుంది (ఎంత ఆనందంగా ఉంటుంది)?” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). *
[సహీహ్ బుఖారీ : 60వ ప్రకరణం – అంబియా, 59వ అధ్యాయం – నుజూలె ఈసాబిన్ మర్యం అలైహిస్సలాం]
* అంటే, హజ్రత్ ఈసా (అలైహిస్సలాం) తిరిగి వచ్చినపుడు, ఆయన షరీయతె ముహమ్మదీని అనుసరించి ఖుర్ఆన్, హదీసుల ప్రకారమే ఆచరిస్తారని అర్థం.
70వ అధ్యాయం – స్వీకారయోగ్యం కాని విశ్వాసం, ప్రళయకాల చిహ్నం
بيان الزمن الذي لا يقبل فيه الإيمان
97 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ لاَ تَقُومُ السَّاعَةُ حَتَّى تَطْلُعَ الشَّمْسُ مِنْ مَغْرِبِهَا، فَإِذَا طَلَعَتْ وَرَآهَا النَّاسُ آمَنُوا أَجْمَعُونَ، وَذَلِكَ حِينَ لاَ يَنْفَعُ نَفْسًا إِيمَانُهَا ثُمَّ قَرَأَ الآية
__________
أخرجه البخاري في: 65 كتاب التفسير: 6 سورة الأنعام: 9 باب هلمّ شهداءكم
97. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- “సూర్యుడు పడమర నుంచి ఉదయించనంతవరకు ప్రళయం సంభవించదు. సూర్యుడు పడమర నుంచి ఉదయించగానే ప్రజలు ఆ వింత చూసి అందరూ (ఇస్లాం ధర్మాన్ని) విశ్వసిస్తారు. కాని అప్పుడు విశ్వసించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). ఆ తరువాత ఆయన దివ్యఖుర్ఆన్లోని ఈ సూక్తిని పఠించారు:
“ఇకవారు దేనికోసం ఎదురుచూస్తున్నారు? వారి ముందు దైవదూతలు ప్రత్యక్షం కావాలని చూస్తున్నారా? లేక నీ ప్రభువు స్వయంగా వారి దగ్గరకు దిగి రావాలనా? లేక నీ ప్రభువు సూచనల్లో కొన్ని బహిర్గతమయ్యే సమయం కోసం ఎదురుచూస్తున్నారా? నీ ప్రభువు సూచనల్లో కొన్ని ప్రత్యేక సూచనలు బహిర్గతమయ్యే రోజు అసలు సత్యాన్నే విశ్వసించనివాడు వాటిని (కళ్ళారా చూసి) విశ్వసించినా దాని వల్ల అతనికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాగే (గతంలో) విశ్వసించి ఎలాంటి సత్కార్యం చేయని వాడికి సయితం అతని విశ్వాసం ఆ రోజు ఎలాంటి ప్రయోజనం చేకూర్చదు.” (6:158)
(సహీహ్ బుఖారీ : 65వ ప్రకరణం – అత్తఫ్సీర్, 6వ అధ్యాయం – సూరతుల్ అన్ ఆమ్ – 9వ అంశం హలుమ్మ షుహదా అకుమ్)
98 – حديث أَبِي ذَرٍّ رضي الله عنه، قَالَ: دَخَلْتُ الْمَسْجِدَ وَرَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ جَالِسٌ، فَلَمَّا غَرَبَتِ الشَّمْسُ قَالَ: يَا أَبَا ذَرٍّ هَلْ تَدْرِي أَيْنَ تَذْهَبُ هذِهِ قَالَ قُلْتُ اللهُ وَرَسُولُهُ أَعْلَمُ قَالَ: فَإِنَّهَا تَذْهَبُ تَسْتَأْذِنُ فِي السُّجُودِ فَيُؤْذَنُ لَهَا وَكَأَنَّهَا قَدْ قِيل لَهَا ارْجِعِي مِنْ حَيْثُ جِئْتِ، فَتَطْلُعُ مِنْ مَغْرِبِهَا ثُمَّ قَرَأَ (ذَلِكَ مُسْتَقَرٌّ لَهَا)
__________
أخرجه البخاري في:97 كتاب التوحيد: 22 باب وكان عرشه على الماء وهو رب العرش العظيم
98. హజ్రత్ అబూజర్ (రదియల్లాహు అన్హు) కథనం:- నేను మస్జిద్ లో ప్రవేశించాను. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) లోపల కూర్చొని ఉన్నారు. సూర్యుడు అస్తమించగానే “అబూజర్! ఈ సూర్యుడు ఎక్కడికెళ్తున్నాడో నీకేమైనా తెలుసా?” అని అడిగారాయన. నేను “అల్లాహ్ కి, దైవప్రవక్తకే బాగా తెలుసు’ అన్నాను. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు. “ఈ సూర్యుడు (అల్లాహ్ సన్నిధికి) వెళ్ళి సాష్టాంగ ప్రణామం చేయడానికి అనుమతి అడుగుతాడు. అతనికి అనుమతి లభిస్తుంది. చివరికి (ఒక రోజు) నీవు ఎక్కడ్నుంచి వచ్చావో అక్కడికే తిరిగి వెళ్ళు అని ఆజ్ఞ అవుతుంది. దాంతో సూర్యుడు పడమర నుండి ఉదయిస్తాడు.” ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఇదే అతని గ్యమస్థానం” అనే సూక్తిని పఠించారు.
[సహీహ్ బుఖారీ : 97వ ప్రకరణం – తౌహీద్, 22వ అధ్యాయం – వకాన అర్ షుహూ అలల్ మాయి వహువ రబ్బుల్ అర్షల్ అజీం]
71వ అధ్యాయం – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై ‘వహీ’ అవతరణ ప్రారంభం
بدء الوحى إِلى رسول الله صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ
99 – حديث عَائِشَةَ أُمّ الْمُؤُمِنِينَ قَالتْ: أَوَّلُ مَا بُدِىءَ بِهِ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مِنَ الْوَحْيِ الرؤيَا الصَّالِحَةُ فِي النَّوْمِ، فَكَانَ لاَ يَرَى رُؤْيَا إِلاَّ جَاءَتْ مِثْلَ فَلَقِ الصُّبْحِ، ثُمَّ حُبِّبَ إِلَيْهِ الْخَلاَءُ، وَكَانَ يَخْلُو بِغَارِ حِرَاءٍ فَيَتَحَنَّثُ فِيهِ، وَهُوَ التَّعَبُّدُ، اللَّيَالِيَ ذَوَاتِ الْعَدَدِ قَبْلَ أَنْ يَنْزِعَ إِلَى أَهْلِهِ، وَيَتَزَوَّدُ لِذَلِكَ، ثُمَّ يَرْجِعُ إِلَى خَدِيجَةَ فَيَتَزَوَّدُ لِمِثْلِهَا، حَتَّى جَاءَهُ الْحَقُّ وَهُوَ فِي غَارٍ حِرَاءٍ؛ فَجَاءَهُ الْمَلِكُ فَقَالَ اقْرَأْ، قَالَ: مَا أَنَا بِقَارِيءٍ، قَالَ: فَأَخَذَنِي فَغَطَّنِي حَتَّى بَلَغَ مِنِّي الْجَهْدَ ثُمَّ أَرْسَلَنِي فَقَالَ: اقْرَأْ قُلْتُ: مَا أَنَا بِقَارِيءٍ، فَأَخَذَنِي فَغَطَّنِي الثَّانِيَةَ حَتَّى بَلَغَ مِنَّي الْجَهْدَ ثُمَّ أَرْسَلَنِي فَقَالَ: اقْرَأْ، فَقُلْتُ: مَا أَنَا بِقَارِيءٍ، فَأَخَذَنِي فَغَطَّنِي الثَّالِثَةَ ثُمَّ أَرْسَلَنِي فَقَالَ: (اقْرَأْ بِاسْمِ رَبِّكَ الَّذِي خَلَقَ خَلَقَ الإِنْسَانَ مِنْ عَلَقٍ اقْرَأْ وَرَبُّكَ الأكْرَمُ)
[ص:33] فَرَجَعَ بِهَا رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَرْجُفُ فُؤَادُهُ، فَدَخَلَ عَلَى خَدِيجَةَ بِنْتِ خُوَيْلِدٍ، فَقَالَ: زَمِّلُونِي زَمِّلُونِي فَزَمَّلُوهُ حَتَّى ذَهَبَ عَنْهُ الرَّوْعُ، فَقَالَ لِخَدِيجَةَ، وَأَخْبَرَهَا الْخَبَرَ لَقَدْ خَشِيتُ عَلَى نَفْسِي فَقَالَتْ خَدِيجَةُ: كَلاَّ وَاللهِ، مَا يُخْزِيكَ اللهُ أَبَدًا، إِنَّكَ لَتَصِلُ الرَّحِمَ، وَتَحْمِلُ الْكَلَّ، وَتَكْسِبُ الْمَعْدُومَ، وَتَقْرِي الضَّيْفَ، وَتُعِين عَلَى نَوَائِبِ الْحَقِّ
فَانْطَلَقَتْ بِهِ خَدِيجَةُ حَتَّى أَتَتْ بِهِ وَرَقَةَ بْنَ نَوْفَلِ بْنِ أَسَدِ بْنِ عَبْدِ الْعُزَّى ابْنَ عَمِّ خَدِيجَةَ، وَكَانَ امْرءًا تَنَصَّرَ فِي الْجَاهِلِيَّةِ، وَكَانَ يَكْتُبُ الْكِتَابَ الْعِبْرَانِيَّ فَيَكْتُبُ مِنَ الإِنْجِيلِ بِالْعِبْرَانِيَّةِ مَا شَاءَ اللهُ أَنْ يَكْتُبَ، وَكَانَ شَيْخًا كَبِيرًا قَدْ عَمِيَ، فَقَالَتْ لَهُ خَدِيجَةُ: يَا ابْنَ عَمِّ اسْمَعْ مِنَ ابْنِ أَخِيكَ
فَقَالَ لَهُ وَرَقَةُ: يَا ابْنَ أَخِي مَاذَا تَرَى فَأَخْبَرَهُ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بِخَبَرِ مَا رَأَى فَقَالَ لَهُ وَرَقَةُ: هذَا النَّامُوسُ الَّذِي نَزَّلَ اللهُ عَلَى مُوسَى صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، يَا لَيْتَنِي فِيهَا جَذَعًا، لَيْتَنِي أَكُونُ حَيًّا إِذْ يُخْرِجُكَ قَوْمكَ فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: أَوَ مُخْرِجِيَّ هُمْ قَالَ نَعَمْ، لَمْ يَأْتِ رَجُلٌ قَطُّ بِمِثْلِ مَا جِئْتَ بِهِ إِلاَّ عُودِيَ، وَإِنْ يُدْرِكْنِي يَوْمُكَ أَنْصُرُكَ نَصْرًا مُؤَزَّرًا
__________
أخرجه البخاري في: 1 كتاب بدء الوحى: 3 باب حدثنا يحيى ابن بكير
99. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- ప్రారంభంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు కొన్ని నిజమైన కలలు వచ్చేవి. అవి పగటి వెల్తురులా స్పష్టంగా ఉండేవి. ఈ విధంగా ఆయన పై దివ్యాష్కృతి (వక్త) అవతరించడం మొదలయింది. దాంతో ఆయన ఏకాంతం, ఏకాగ్రతలను కోరుకొని హిరా కొండ గుహలో ఒంటరిగా గడపనారంభించారు. ఆ గుహలో ఆయన రోజుల తరబడి ఇంటికి వెళ్ళకుండా దైవారాధనలో నిమగ్నులయి ఉండేవారు. ఈ పనికోసం ఆయన అన్న పానీయాలు కూడా వెంట తీసికెళ్ళి పెట్టుకునేవారు. అవి అయిపోయిన తరువాత (ఇంటికి) హజ్రత్ ఖదీజా (రదియల్లాహు అన్హా) దగ్గరకు వచ్చేవారు. అయితే మళ్ళీ ఆయన అదే విధంగా అన్నపానీయాలు తీసుకొని గుహకు వెళ్ళిపోయేవారు.
ఇలా కొన్నాళ్ళు గడిచాక, ఓ రోజు ఉన్నట్టుండి ఆ కొండ గుహలో హఠాత్తుగా సత్యం (దివ్యాష్కుృతి) సాక్షాత్కరించింది. ఆయన దగ్గరకు ఓ దైవదూత (హజ్రత్ జిబ్రయీల్ అలైహిస్సలాం) వచ్చి ‘చదువు’ అన్నాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తాను చదువురాని వాడినని సమాధానమిచ్చారు. ఆయన ఈ సంఘటనను ప్రస్తావిస్తూ ఇలా తెలియజేశారు:
“అప్పుడు దైవదూత నన్ను పట్టుకొని గట్టిగా అదిమి వదలి పెట్టారు. ఆ సమయంలో నాకు శ్వాస ఆగినంత పనయింది. తరువాత ఆయన ‘చదువు’ అన్నారు మళ్ళీ. నేను తిరిగి ‘నాకు చదువు రాదు’ అన్నాను. దైవదూత నన్ను మరోసారి పట్టుకొని గట్టిగా అదిమి వదిలేశారు. నాకు మళ్ళీ శ్వాస ఆగిపోయినంత బాధ కలిగింది. దైవదూత మళ్ళీ ‘చదువు’ అన్నారు. నేను యథా ప్రకారం నాకు చదువురాదని చెప్పాను. దైవదూత నన్ను మూడోసారి పట్టుకొని గట్టిగా అదిమి వదలి పెట్టారు. దాంతో నాకు మళ్ళీ శ్వాస ఆగిపోయినంత బాధవేసింది. ఆ తరువాత అతను ‘చదువు సర్వసృష్టికర్త అయిన నీ ప్రభువు పేరుతో. ఆయన మానవుడ్ని నెత్తుటి ముద్దతో సృష్టించాడు. చదువు నీ ప్రభువు ఎంతో అనుగ్రహశాలి’ అని అన్నాడు.” (అలఖ్)
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) భయకంపితులయి (ఎలాగో) ఈ మాటలు ఉచ్చరించారు. ఆ తరువాత ఆయన (ఇంటికి) హజ్రత్ ఖదీజా బిన్త్ ఖువైలిద్ దగ్గరకు వచ్చారు. వచ్చీ రాగానే (పడక మీద పడి) ‘దుప్పటి కప్పు, దుప్పటి కప్పు’ అన్నారు. హజ్రత్ ఖదీజా (రదియల్లాహు అన్హా) గబగబా దుప్పటి తెచ్చి కప్పారు. దాంతో కాస్సేపటికి ఆయనకు ఆవహించిన భయాందోళనలు కాస్త తగ్గు ముఖం పట్టాయి. అప్పుడాయన హజ్రత్ ఖదీజా (రదియల్లాహు అన్హా)కు జరిగిన వృత్తాంతం పూస గుచ్చినట్లు చెప్పి, తన ప్రాణానికేదో ముప్పు వాటిల్లినట్లు అనిపిస్తోందని అన్నారు. హజ్రత్ ఖదీజా (రదియల్లాహు అన్హా) ఆయనకు ధైర్యం చెబుతూ “అల్లాహ్ సాక్షి! అలా ఎన్నటికీ జరగదు. మీరు బంధువుల్ని ఆదరిస్తారు, అభిమానిస్తారు. ఇతరుల బరువు బాధ్యతలను మోస్తారు. ఆపదల్లో ఉన్నవారిని ఆదుకుంటారు. సంపాదించలేని వారికి సంపాదించి పెడతారు. అతిథుల్ని సత్కరిస్తారు. సత్యమార్గంలో ఎదురయ్యే కష్టనష్టాలను భరిస్తారు. ఈ విషయంలో ఇతరుల క్కూడా సహాయం చేస్తారు. అలాంటి మిమ్మల్ని అల్లాహ్ ఎన్నటికీ అవమానపర్చడు” అని అన్నారు.
ఆ తరువాత హజ్రత్ ఖదీజా (రదియల్లాహు అన్హా) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను తన పెదనాన్న కొడుకు వరఖా బిన్ నౌఫిల్ బిన్ అసద్ బిన్ అబ్దుల్ ఉజ్జా దగ్గరకు పిలుచుకెళ్ళారు. ఈయన పూర్వం అజ్ఞానకాలంలో క్రైస్తవ మతస్థుడిగా ఉండేవాడు. హెబ్రూ భాష మాట్లాడటం, చదవడం ఆయనకు బాగా తెలుసు. హెబ్రూ భాషలో ఆయన ఇంజీల్ (బైబిల్)ని రాస్తుంటారు. చాలా వృద్ధుడయిపోయాడు. కళ్ళు కూడా కానరాకుండా పోయాయి.
హజ్రత్ ఖదీజా (రదియల్లాహు అన్హా) ఆయన దగ్గరకు చేరుకొని “అన్నా! మీ అబ్బాయి చెప్పే మాటలు కాస్త వినండి” అన్నారు. అప్పుడు వరఖా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఉద్దేశించి “అబ్బాయి! నువ్వేమి చూశావో చెప్పు” అన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తాను కన్నది, విన్నది అంతా వివరంగా ఆయనకు తెలియజేశారు. వరఖా ఈ మాట విని ఇలా అన్నారు: “అయితే అతను మూసా ప్రవక్త (అలైహిస్సలాం) దగ్గరకు అల్లాహ్ దివ్యాష్కృతినిచ్చి పంపిన దైవదూతే. అందులో ఎలాంటి సందేహం లేదు. నీ జాతి ప్రజలు నిన్ను (మక్కా నుండి) బహిష్కరించేనాటికి నేను బ్రతికి ఉంటే ఎంత బాగుండు!”
ఈ మాటలకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆశ్చర్యపోతూ “ఏమిటీ, ప్రజలు నన్ను ఇక్కడ్నుంచి వెళ్ళ గొడ్తారా?” అన్నారు. “ఔను నాయనా! నీవు ఈనాడు చెబుతున్నటువంటి విషయాలే గతంలో కూడా కొందరు చెప్పారు. వారిలో ప్రతి ఒక్కర్నీ ఈ లోకం నిరోధించింది. అలాంటిది నిన్ను విరోధించడంలో వింతేముంది) అప్పటి దాకా నేను జీవించి ఉంటే నా శక్తివంచన లేకుండా నీకు సహాయపడతా” అన్నారు వరఖా బిన్ నౌఫిల్.
[సహీహ్ బుఖారీ : 1వ ప్రకరణం – వహీ, 3వ అధ్యాయం – హద్దసనా యహ్యా బిన్ బకీర్)
100 – حديث جَابِرِ بْنِ عَبْدِ اللهِ الأَنْصَارِيِّ، قَالَ وَهُوَ يُحَدِّثُ عَنْ فَتْرَةِ الْوَحْيِ، فَقَالَ فِي حَدِيثِهِ: بَيْنَا أَنَا أَمْشِي إِذْ سَمِعْتُ صَوْتًا مِنَ السَّمَاءِ فَرَفَعْتُ بَصَرِي فَإِذَا الْمَلكُ الَّذِي جَاءَنِي بِحِرَاءٍ جَالِسٌ عَلَى كُرْسِيٍّ بَيْنَ السَّمَاءِ وَالأَرْضِ، فَرُعِبْتُ مِنْهُ، فَرَجَعْتُ، فَقُلْتُ: زَمِّلُونِي، فَأَنْزَلَ اللهُ تَعَالَى (يأَيُّهَا الْمُدَّثِّرُ قُمْ فَأَنْذِرْ) إِلَى قَوْلِهِ: (وَالرُّجْزَ فَاهْجُرْ) فَحَمِيَ الْوَحْيُ وَتَتَابَعَ
__________
أخرجه البخاري في: 1 كتاب بدء الوحى: 3 باب حدثنا يحيى ابن بكير
100. హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు వహీ తాత్కాలికంగా నిలిచిపోయిన రోజులను గురించి మాట్లాడుతూ ఇలా అన్నారు – “ఓ రోజు నేను నడిచి వెళ్తుంటే (దారిలో ఓ చోట) హఠాత్తుగా నాకు ఆకాశం నుండి ఓ (కంఠ) స్వరం విన్పించింది. నేను వెంటనే తల పైకెత్తి చూశాను. చూస్తే ఇంకేముంది, హిరా గుహలో నా దగ్గరకు వచ్చి పోయిన దైవదూతే భూమ్యాకాశాల మధ్య ఓ కుర్చీ మీద కూర్చొని ఉన్నాడు. అతడ్ని అతని మహాకాయం, గాంభీర్యతను చూడగానే నా గుండె ఝల్లుమంది. నేను భయంతో వణికిపోతూ ఇంటికి వచ్చి పడ్డాను. పడక మీద మేను వాల్చి “దుప్పటి కప్పు, నాకు దుప్పటి కప్పు” అన్నాను. సరిగ్గా అదే సమయంలో “దుప్పటి కప్పి పడుకున్నవాడా! లే, లేచి ప్రజలను హెచ్చరించు…………సహనం వహించు” వరకు గల సూక్తులు నా పై అవతరించాయి. ఆ తరువాత ‘వహీ’ నిరాఘాటంగా రావడం మొదలయింది.”
[సహీహ్ బుఖారీ : 1వ ప్రకరణం – వహీ, 3వ అధ్యాయం]
101 – حديث جَابِرِ بْنِ عَبْدِ اللهِ الأَنْصَارِيِّ عَنْ يَحْي بْنِ كَثِيرٍ، سَأَلْتُ أَبَا سَلَمَةَ بْنَ عَبْدِ الرَّحْمنِ عَنْ أَوَّلِ مَا نَزَلَ مِنَ الْقُرْآنِ قَالَ يأَيُّهَا الْمُدَّثِّرُ قُلْتُ يَقُولُونَ اقْرَأْ بِاسْمِ رَبِّكَ الَّذِي خَلَقَ فَقَالَ أَبُو سَلَمَةَ سَأَلْتُ جَابِرَ بنَ عَبْدِ اللهِ عَنْ ذَلِكَ، وَقُلْتُ لَهُ مِثْلَ الَّذِي قُلْتَ، فَقَالَ جَابِرٌ لاَ أُحَدِّثكَ إِلاَّ مَا حَدَّثَنَا رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: جَاوَرْتُ بِحِرَاءٍ فَلَمَّا قَضَيْتُ جِوَارِي هَبَطْتُ فَنُودِيتُ فَنَظَرْتُ عَنْ يَمِينِي فَلَمْ أَرَ شَيْئًا، وَنَظَرْتُ عَنْ شِمَالِي فَلَمْ أَرَ شَيْئًا، وَنَظَرْتُ أَمَامِي فَلَمْ أَرَ شَيْئًا، وَنَظَرْتُ خَلْفِي فَلَمْ أَرَ شَيْئًا؛ فَرَفَعْتُ رَأْسِي فَرَأَيْتُ شَيْئًا، فَأَتَيْتُ خَدِيجَةَ فَقُلْتُ: دَثِّرُونِي وَصُبُّوا عَلَيَّ مَاءً بَارِدًا، قَالَ فَدَثَّرُونِي وَصَبُّوا عَلَيَّ مَاءً بَارِدًا، قَالَ فَنَزَلَتْ (يأَيُّهَا الْمُدَّثِّرُ قُمْ فَأَنْذِرْ وَرَبَّكَ فَكَبِّرْ)
__________
أخرجه البخاري في: 65 كتاب التفسير: 74 سورة المدثر: باب حدثنا يحيى
101. హజ్రత్ యహ్యా బిన్ కసీర్ (రహిమహుల్లాహ్) కథనం:- నేను దివ్యఖుర్ఆన్లోని ఏ సూక్తి మొట్టమొదట అవతరించిందని అబూ సల్మా బిన్ అబ్దుర్రహ్మాన్ని అడిగాను. దానికాయన ‘యా అయ్యుహల్ ముద్దస్సిర్ (దుప్పటి కప్పి పడుకున్నవాడా!” అని సమాధానమిచ్చారు. “కాని జనం ‘ఇఖ్రా బిస్మిరబ్బికల్లజి’ సూక్తులు మొదట అవతరించాయని చెబుతున్నారే” అని అన్నాను నేను. హజ్రత్ అబూసల్మా (రహిమహుల్లాహ్) నా మాటలు విని “నేను ఈ విషయం గురించి హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రహిమహుల్లాహ్)ను అడిగాను. నీ వంటున్న మాటలనే ఆయన ముందు ప్రస్తావించాను. దానికాయన “నేను నీ ముందు స్వయంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పిన విషయాన్నే ఉంచుతాను. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు అన్నారు. నేను హిరా గుహలో ఏకాంత జీవితం గడుపుతున్న రోజులవి. నా ధ్యాన యోగం ముగిసిన తరువాత నేను అక్కడ్నుంచి బయలుదేరి క్రిందికి దిగాను. అంతలో ఎక్కడ్నుంచో ఒక శబ్దం వినిపించింది. నేను కుడి ఎడమ, వెనుకా ముందూ అంతా కలియజూశాను. కాని నాకెవరూ కన్పించలేదు. తరువాత నేను తల పైకెత్తి ఆకాశం వైపు చూశాను. అక్కడ నేను ఓ (అద్భుత) దృశ్యం చూశాను. ఆ దృశ్యం చూడగానే నేను (భయపడిపోయి) ఖదీజా (రదియల్లాహు అన్హా) దగ్గరికి (ఇంటికి) వచ్చి ‘దుప్పటికప్పు, నా మీద చన్నీళ్ళు చిలికించు’ అన్నాను. ఆమె వెంటనే దుప్పిటి తెచ్చి కప్పి నా మీద కొంచెం చన్నీళ్ళు చిలికించింది. అప్పుడు ‘యా అయ్యుహల్ ముద్దస్సిరు ఖుమ్ ఫ అన్జిర్…’ అనే సూక్తులు అవతరించాయి.”
[సహీహ్ బుఖారీ: 65వ ప్రకరణం – అత్తఫ్సీర్ 73 – అల్ ముద్ధసిర్ సూరా]
72వ అధ్యాయం – మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గగన యాత్రలో నమాజ్ ఆదేశం
الإسراء برسول الله صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِلى السموات وفرض الصلوات
102 – حديث أَبِي ذَرٍّ أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: فُرِجَ عَنْ سَقْفِ بَيْتِي وَأَنَا بِمَكَّةَ، فَنَزَلَ جِبْرِيلُ فَفَرَجَ عَنْ صَدْرِي، ثُمَّ غَسَلَهُ بِمَاءِ زَمْزَمَ، ثُمَّ جَاءَ بِطَسْتٍ مِنْ ذَهَبٍ مُمْتَلِيءٍ حِكْمَةً وَإِيمَانًا فَأَفْرَغَهُ فِي صَدْرِي، ثُمَّ أَطْبَقَهُ، ثُمَّ أَخَذَ بِيَدِي فَعَرَجَ بِي إِلَى السّمَاءِ الدُّنْيَا، فَلَمَّا جِئْتُ إِلَى السَّمَاءِ الدُّنْيَا قَالَ جِبْرِيلُ لِخَازِنِ السَّمَاءِ افْتَحْ، قَالَ: مَنْ هذَا قَالَ: هذَا جِبْرِيلُ، قَالَ: هَلْ مَعَكَ أَحَدٌ قَالَ: نَعَمْ مَعِي مُحَمَّدٌ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: أَوَ أُرْسِلَ إِلَيْهِ قَالَ: نَعَمْ؛ فَلَمَّا فَتَحَ عَلَوْنَا السَّمَاءَ الدُّنْيَا فَإِذَا رَجُلٌ قَاعِدٌ، عَلَى يَمِينِهِ أَسْوِدَةٌ وَعَلَى يَسَارِهِ أَسْوِدَةٌ، إِذَا نَظَرَ قِبَلَ يَمِينِهِ ضَحِكَ، وَإِذَا نَظَرَ قِبَلَ يَسَارِهِ بَكَى، فَقَالَ مَرْحَبًا بِالنَّبِيِّ الصَّالِحِ وَالاِبْنِ الصَّالِحِ، قُلْتُ لِجِبْرِيلَ: مَنْ هذَا قَالَ: هذَا آدَمُ، وَهذِهِ الأَسْوِدَةَ عَنْ يَمِينِهِ وَشِمَالِهِ نَسَمُ بَنِيهِ، فَأَهْلُ الْيَمِينِ مِنْهُمْ أَهْلُ الْجَنَّةِ، وَالأَسْوِدَةُ الَّتِي عَنْ شِمَالِهِ أَهْلُ النَّارِ؛ فَإِذَا نَظَرَ عَنْ يَمِينِهِ ضَحِكَ، وَإِذَا نَظَرَ قِبَلَ شِمَالِهِ بَكَى حَتَّى عَرَجَ بِي إِلَى السَّمَاءِ الثَّانِيَةِ فَقَالَ لِخَازِنِهَا افْتَحْ، فَقَالَ لَهُ خَازِنُهَا مِثْلَ مَا قَالَ الأَوَّلُ؛ فَفَتَحَ قَالَ أَنَسٌ فَذَكَرَ أَنَّهُ وَجَدَ فِي السَّموَاتِ آدَمَ وَإِدْرِيسَ وَمُوسَى وَعيسَى وَإِبْرَاهِيمَ صَلَوَاتُ اللهِ عَلَيْهِمْ، وَلَمْ يُثْبِتْ كَيْفَ مَنَازِلُهُمْ؛ غَيْرَ أَنَّهُ ذَكَرَ أَنَّهُ وَجَدَ آدَمَ فِي السَّمَاءِ الدُّنْيَا وَإِبْرَاهِيمَ فِي السَّمَاءِ السَّادِسَةِ قَالَ أَنَسٌ، فَلَمَّا مَرَّ جِبْرِيلُ بِالنَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بِإِدْرِيسَ قَالَ مَرْحَبًا بِالنَّبِيِّ الصَّالِحِ وَالأَخِ الصَّالِحِ فَقُلْتُ: مَنْ هذَا قَالَ: هذَا إِدْرِيسُ ثُمَّ مَرَرْتُ بِمُوسَى فَقَالَ مَرْحَبًا بِالنَّبِيِّ الصَّالِحِ وَالأَخِ الصَّالِحِ؛ قُلْتُ: مَنْ هذَا قَالَ: هذَا مُوسَى ثُمَّ مَرَرْتُ بِعِيسَى فَقَالَ مَرْحَبَا بِالأَخِ الصَّالِحِ وَالنَّبِيِّ الصَّالِحِ؛ [ص:36] قُلْتُ: مَنْ هذَا قَالَ: هذَا عِيسَى ثُمَّ مَرَرْتُ بِإِبْرَاهِيمَ فَقَالَ مَرْحَبًا بِالنَّبِيِّ الصَّالِحِ وَالاِبْنِ الصَّالِحِ؛ قُلْتُ: مَنْ هذَا قَالَ: هذَا إِبْرَاهِيمُ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ ثُمَّ عُرِجَ بِي حَتَّى ظَهَرْتُ لِمُسْتَوَى أَسْمَعُ فِيهِ صَريفَ الأَقْلاَمِ، فَفَرَضَ اللهُ عَلَى أُمَّتِي خَمْسِينَ صَلاَةً، فَرَجَعْتُ بِذَلِكَ حَتَّى مَرَرْتُ عَلَى مُوسَى، فَقَالَ: مَا فَرَضَ اللهُ لَكَ عَلَى أُمَّتِكَ قُلْتُ: فَرَضَ خَمْسِينَ صَلاَةً، قَالَ فَارْجِعْ إِلَى رَبِّكَ فَإِنَّ أُمَّتَكَ لاَ تُطِيقُ ذَلِكَ، فَرَاجَعَنِي فَوَضَعَ شَطْرَهَا فَرَجَعْتُ إِلَى مُوسَى فَقُلْتُ: وَضَعَ شَطْرَهَا؛ فَقَالَ: رَاجِعْ رَبَّكَ فَإِنَّ أُمَّتَكَ لاَ تُطِيقُ، فَرَاجَعْتُ فَوَضَعَ شَطْرَهَا، فَرَجَعْتُ إِلَيْهِ، فَقَالَ: ارْجِعْ إِلَى رَبِّكَ فَإِنَّ أُمَّتَكَ لاَ تُطِيقُ ذَلِكَ، فَرَاجَعْتُهُ، فَقَالَ: هِيَ خَمْسٌ وَهِيَ خَمْسُونَ لاَ يُبَدَّلُ الْقَوْلُ لَدَيَّ فَرَجَعْتُ إِلَى مُوسَى فَقَالَ رَاجِعْ رَبَّكَ، فَقُلْتُ اسْتَحْيَيْتُ مِنْ رَبِّي ثُمَّ انْطَلَقَ بِي حَتَّى انْتَهَى بِي إِلَى سِدْرَةِ الْمُنْتَهَى، وَغَشِيَهَا أَلْوَانٌ لاَ أَدْرِي مَا هِيَ ثُمَّ أُدْخِلْتُ الْجَنَّةَ فَإِذَا فِيهَا حَبَايِلُ اللُّؤْلُؤِ، وَإِذَا تُرَابُهَا الْمِسْكُ
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 1 باب كيف فرضت الصلاة: في الإسراء
102. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం:- హజ్రత్ అబూజర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు – “నేను మక్కాలో నివసిస్తున్న కాలంలో (ఓ రోజు రాత్రి) నా ఇంటికప్పుకు రంధ్రం వేసి (దైవదూత) హజ్రత్ జిబ్రయీల్ అవతరించారు. ఆయన నా హృదయాన్ని బయటికి తీసి జమ్ జమ్ జలంతో శుద్ధి చేశారు. ఆ తరువాత ఆయన ఒక బంగారు పళ్ళెంలో వివేచన, విశ్వాసాలను నింపి తెచ్చి వాటిని నా హృదయంలో పోశారు. ఆపై నా హృదయాన్ని యథాతథంగా హృదయ కుహరంలో పెట్టేశారు. ఆ తరువాత నా చేయి పట్టుకొని, భూమండలానికి సమీపంలో ఉన్న ఆకాశం వైపుకు అధిరోహించారు.
మేము మొదటి ఆకాశం దగ్గరికి చేరుకున్న తరువాత హజ్రత్ జిబ్రయీల్ (అలైహిస్సలాం) అక్కడున్న ద్వారపాలకునితో ‘తలుపు తెరు’ అన్నారు. దానికి ద్వారపాలకుడు ‘ఎవరు మీరు?’ అని అడిగాడు. “దైవదూత జిబ్రయీల్ ని” అని సమాధానమిచ్చారు. “మీ వెంట మరెవరైనా ఉన్నారా?” అని ప్రశ్నించాడు ద్వారపాలకుడు. తన వెంట ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉన్నారని అన్నారు. జిబ్రయీల్ (అలైహిస్సలాం). “మరి ఆయన్ని పిలుచుకు రావడానికి ఎవరినైనా పంపడం జరిగిందా?” అని తిరిగి అడిగాడు ద్వారపాలకుడు. ఔనన్నారు జిబ్రయీల్ (అలైహిస్సలాం). ఈ మాట విని ద్వారపాలకుడు తలుపు తెరిచాడు. మేము మొదటి ఆకాశం మీదికి చేరుకున్నాము.
అక్కడ మేము ఒక వ్యక్తిని చూశాము. అతని కుడి ఎడమల వైపు జనసమూహాలున్నాయి. ఆ వ్యక్తి కుడివైపు చూసినప్పుడల్లా సంతోషిస్తూ ఉంటాడు; ఎడమవైపు చూసినప్పుడల్లా దుఃఖిస్తూ ఉంటాడు. అతను (నన్ను చూడగానే) “సదాచార సంపన్నుడయిన దైవప్రవక్తా! సద్గుణశాలి అయిన కుమార రత్నమా!! స్వాగతం! రా నాయనా!!” అని అన్నారు. నేను (ఆశ్చర్యపోతూ) “ఎవరీయన?” అని అడిగాను. “ఈయన (ఆదిమానవుడు) హజ్రత్ ఆదం (అలైహిస్సలాం). ఈ జనసమూహాలు ఆయన సంతతికి చెందిన ఆత్మలు. ఈ ఆత్మలలో కుడివైపున్న ఆత్మలు స్వర్గానికి పోయేవి; ఎడమవైపున్న ఆత్మలు నరకానికి పోయేవి. అందుకే హజ్రత్ ఆదం (అలైహిస్సలాం) కుడివైపు చూసి సంతోషంతో నవ్వుతున్నారు, ఎడమవైపు చూసి దుఃఖంతో రోదిస్తున్నారు” అని సమాధానమిచ్చారు హజ్రత్ జిబ్రయీల్ (అలైహిస్సలాం).
ఆ తరువాత ఆయన నన్ను వెంటబెట్టుకొని రెండవ ఆకాశం మీదికి చేరుకున్నారు. అక్కడి ద్వారపాలకుడితో ‘తలుపు తెరువు’ అన్నారు. ఆ ద్వారపాలకుడు కూడా మొదటి ఆకాశద్వారపాలకుడు అడిగినటువంటి ప్రశ్నలే అడగటం, వాటికి హజ్రత్ జిబ్రయీల్ (అలైహిస్సలాం) సమాధానాలివ్వడం జరిగింది. ఆ తరువాత ద్వారపాలకుడు తలుపు తెరిచాడు.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఇతర విశేషాలను హజ్రత్ అబూజర్ (రదియల్లాహు అన్హు) మాటల్లో ఇలా తెలియజేశారు: “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సప్తాకాశాలలో హజ్రత్ ఆదం (అలైహిస్సలాం)ను, హజ్రత్ ఇద్రిస్ (అలైహిస్సలాం)ను, హజ్రత్ మూసా (అలైహిస్సలాం)ను, హజ్రత్ ఈసా (అలైహిస్సలాం)ను, హజ్రత్ ఇబ్రాహీం (అలైహిస్సలాం)ను చూశారు. అయితే వారి స్థానాలను గురించి ప్రస్తావించలేదు. కాకపోతే తాను హజ్రత్ ఆదం (అలైహిస్సలాం)ను భూ సమీప ఆకాశం మీద, హజ్రత్ ఇబ్రాహీం (అలైహిస్సలాం) ను ఆరవ ఆకాశం మీద చూశానని మాత్రం తెలిపారు.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం జిబ్రయీల్ (అలైహిస్సలాం) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో కలసి హజ్రత్ ఇద్రీస్ (అలైహిస్సలాం)ను సమీపించినప్పుడు “సదాచార సంపన్నుడయిన దైవ ప్రవక్తా! సద్గుణశాలి అయిన సోదరా!! స్వాగతం!!!” అన్నారు హజ్రత్ ఇద్రిస్ (అలైహిస్సలాం). ఆ తరువాతి విషయం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు:
నేను జిబ్రయీల్ (అలైహిస్సలాం)ని “ఈయన ఎవర”ని అడిగాను. దానికి జిబ్రయీల్ (అలైహిస్సలాం) “ఈయన ఇద్రీస్” అని చెప్పారు. ఆ తరువాత నేను మూసా (అలైహిస్సలాం)ను సమీపించాను. ఆయన నన్ను చూడగానే “సదాచార సంపన్నుడయిన దైవప్రవక్తా! సద్గుణశాలి అయిన సోదరా!! స్వాగతం!!!” అని అన్నారు. నేను జిబ్రయీల్ (అలైహిస్సలాం)ని “ఈయన ఎవర”ని అడిగాను. “ఈయన మూసా (అలైహిస్సలాం)” అని తెలిపారు. జిబ్రయీల్ (అలైహిస్సలాం). ఆ తరువాత నేను ఈసా (అలైహిస్సలాం)ను సమీపించాను. ఆయన కూడా నన్ను చూడగానే “సదాచార సంపన్నుడయిన దైవప్రవక్తా! సద్గుణశాలి అయిన సోదరా!! స్వాగతం!!!” అని ఆహ్వానించారు. నేను “ఈయన ఎవర”ని అడిగాను. “ఈయన ఈసా (అలైహిస్సలాం)” అని తెలిపారు జిబ్రయీల్ (అలైహిస్సలాం). ఆ తరువాత నేను ఇబ్రాహీం (అలైహిస్సలాం)ను సమీపించాను. ఆయన కూడా నన్ను చూడగానే “సదాచార సంపన్నుడయిన దైవప్రవక్తా! సద్గుణశాలి అయిన కుమారా!! స్వాగతం!!!” అని నన్ను స్వాగతించారు. నేను “ఈయన ఎవర”ని అడిగాను. “ఈయన ఇబ్రాహీం (అలైహిస్సలాం)” అని తెలిపారు జిబ్రయీల్ (అలైహిస్సలాం).
ఆ తరువాత నన్ను (జిబ్రయీల్) మరింత పైకి తీసికెళ్ళారు. చివరికి నేను ఓ విశిష్ట ప్రదేశానికి చేరుకున్నాను. అక్కడ (విధివ్రాత) రాస్తున్న కలం ధ్వని నాకు సరసరమంటూ విన్పించింది.
ఆ తరువాత అల్లాహ్ నా అనుచర సమాజానికి (రోజుకు) యాభై నమాజులు విధించాడు. నేను దీన్ని తీసుకొని తిరిగి వస్తుంటే మార్గమధ్యలో హజ్రత్ మూసా (అలైహిస్సలాం) తారసపడి “అల్లాహ్ మీ అనుచర సమాజానికి ఏ పని విధించాడు?” అని అడిగారు. నేను “యాభై నమాజులు విధించాడ”ని చెప్పాను. అప్పుడాయన “మీ అనుచర సమాజం అన్ని నమాజులు చేయజాలదు. మీ ప్రభువు దగ్గరికి తిరిగి వెళ్ళి నమాజుల సంఖ్య తగ్గించమని విన్నవించుకోండి” అని అన్నారు. ఈ విధంగా మూసా (అలైహిస్సలాం) నన్ను వెనక్కి పంపించారు. (నేను విషయం విన్నవించుకున్నాక) అల్లాహ్ కొన్ని నమాజులు తగ్గించాడు. తిరిగి నేను మూసా (అలైహిస్సలాం) దగ్గరకు వచ్చి “అల్లాహ్ కొన్ని నమాజులు తగ్గించాడ”ని తెలిపాను. “మరొకసారి మీ ప్రభువు దగ్గరకు వెళ్ళండి. మీ. అనుచర సమాజం అన్ని నమాజులు కూడా చేయజాలదు” అన్నారు మూసా (అలైహిస్సలాం). దాంతో నేను అల్లాహ్ దగ్గరకు వెళ్ళి మళ్ళీ విన్నవించుకున్నాను అల్లాహ్ మరి కొన్ని నమాజులు తగ్గించాడు. నేను మూసా (అలైహిస్సలాం) దగ్గరకు తిరిగొచ్చి “అల్లాహ్ మరి కొన్ని నమాజులు తగ్గించాడ’ని తెలియజేశాను. “కాని మీ అనుచర సమాజం అన్ని నమాజులు కూడా చేయజాలదు, ఇంకొకసారి మీ ప్రభువు దగ్గరకు వెళ్ళిరండి” అన్నారు మూసా (అలైహిస్సలాం). అంచేత నేను మరొకసారి వెళ్ళి అల్లాహ్ కి విన్నవించుకున్నాను. అప్పుడు అల్లాహ్ నమాజులను ఐదుకు తగ్గించి ” ఈ ఐదు నమాజులు యాభై నమాజులతో సమానం. నా దగ్గర మాట మారదు” అని అన్నాడు. నేను మూసా దగ్గరకు తిరిగి వచ్చి ఈ సంగతి చెప్పాను. ఆయన నన్ను తిరిగి నా ప్రభువు దగ్గరకు వెళ్ళమని పురమాయించారు. కాని “నా ప్రభువు దగ్గరకు వెళ్ళి మళ్ళీ అడగటానికి నాకు సిగ్గేస్తుంద”ని అన్నాను నేను.
ఆ తరువాత హజ్రత్ జిబ్రయీల్(అలైహిస్సలాం) నన్ను వెంటబెట్టుకొని అక్కడ్నుంచి బయలుదేరారు. ఇలా నేను సిద్రతుల్ మున్తహా (అంటే అత్యద్భుతమైన ఓ విశిష్ఠ వృక్షరాజం) దగ్గరకు చేర్చబడ్డాను. అదొక చిత్రవిచిత్రమైన రంగురంగుల సన్నివేశం.* కాని అదేమిటో, దాని వాస్తవికతేమిటో మాత్రం నాకు తెలియదు. ఆ తరువాత నన్ను స్వర్గానికి తీసికెళ్ళారు. అక్కడ నేను ముఖాలతో నిర్మించబడిన గుమ్మటాలు చూశాను. అక్కడి మన్ను కస్తూరి వాసనలు గుబాళిస్తుంది.
[సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – సలాత్, 1వ అధ్యాయం – కైఫ ఫురిజతిస్సలాత్)
* అంటే, అది అంతకు పూర్వం ఎన్నడూ కానరాని, మాటల్లో వర్ణించ వీలులేని, చిత్ర విచిత్రమైన అద్భుత దృశ్యం అని అర్థం.
103 – حديث مالِكِ بْنِ صَعْصَعَة رضي الله عنه، قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بَيْنَا أَنَا عِنْدَ الْبَيْتِ بَيْنَ النَّائمِ وَالْيَقْظَانِ، وَذَكَرَ بَيْنَ الرَّجُلَيْنِ، فَأُتِيتُ بِطَسْتٍ مِنْ ذَهَبٍ مُلِيءَ حِكْمَةً وَإِيمَانًا، فَشُقَّ مِنَ النَّحْرِ إِلَى مَرَاقِّ الْبَطْنِ، ثُمَّ غُسِلَ الْبَطْنُ بِمَاءِ زَمْزَمَ، ثُمَّ مُلِيءَ حِكْمَةً [ص:37] وَإِيمَانًا، وَأُتِيتُ بِدَابَّةٍ أَبْيَضَ دُونَ الْبَغْلِ وَفَوْقَ الْحِمَارِ، الْبُرَاقُ، فَانْطَلَقْتُ مَعَ جِبْرِيل حَتَّى أَتَيْنَا السَّمَاءَ الدُّنْيَا، قِيلَ مَنْ هذَا قَالَ: جِبْرِيلُ؛ قِيلَ: مَنْ مَعَكَ قَالَ: مُحَمَّدٌ، قِيلَ: وَقَدْ أُرْسِلَ إِلَيْهِ قَالَ: نَعَمْ؛ قِيلَ: مَرْحَبًا بِهِ وَلَنِعْمَ الْمَجِيءُ جَاءَ؛ فَأَتَيْتُ عَلَى آدَمَ فَسَلَّمْتُ عَلَيْهِ فَقَالَ: مَرْحَبًا بِكَ مِنِ ابْنٍ وَنَبِيٍّ، فَأَتَيْنَا السَّمَاءَ الثَّانِيَةَ قِيلَ: مَنْ هذَا قَالَ: جِبْرِيلُ، قِيلَ: مَنْ مَعَكَ قَالَ: مَحَمَّدٌ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قِيلَ: أُرْسِلَ إِلَيْهِ قَالَ: نَعَمْ، قِيلَ مَرْحَبًا بِهِ وَلَنِعْمَ الْمَجِيءُ جَاءَ؛ فَأَتَيْتُ عَلَى عِيسَى وَيَحْيَى فَقَالاَ: مَرْحَبًا بِكَ مِنْ أَخٍ وَنَبِيٍّ فَأَتَيْنَا السَّمَاءَ الثَّالِثَةَ قِيلَ: مَنْ هذَا قِيلَ: جِبْرِيلُ، قِيلَ: مَنْ مَعَكَ قِيلَ: مُحَمَّدٌ، قِيلَ: وَقَدْ أُرْسِلَ إِلَيْهِ قَالَ نَعَمْ، قِيلَ: مَرْحَبًا بِهِ وَلَنِعْمَ الْمَجِيءُ جَاءَ، فَأَتَيْتُ يُوسُفَ فَسَلَّمْتُ عَلَيْهِ، قَالَ: مَرْحَبًا بِكَ مِنْ أَخٍ وَنَبِيٍّ فَأَتَيْنَا السَّمَاءَ الرَّابِعَةَ، قِيلَ: مَنْ هذَا قَالَ: جِبْرِيلُ، قِيلَ: مَنْ مَعَكَ قِيلَ: مُحَمَّدٌ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قِيلَ: وَقَدْ أُرْسِلَ إِلِيْهِ قِيلَ: نَعَمْ، قِيلَ: مَرْحَبًا بِهِ وَلَنِعْمَ الْمَجِيءُ جَاءَ فَأَتَيْتُ عَلَى إِدْرِيسَ فَسَلَّمْتُ عَلَيْهِ، فَقَالَ مَرْحَبًا مِن أَخٍ وَنَبِيٍّ فَأَتَيْنَا السَّمَاءَ الْخَامِسَةَ، قِيلَ: مَنْ هذَا قَالَ: جِبْرِيلُ، قِيلَ: وَمَنْ مَعَكَ قِيلَ: مُحَمَّدٌ، قِيلَ: وَقَدْ أُرْسِلَ إِلَيْهِ قَالَ: نَعَمْ، قِيلَ مَرْحَبًا بِهِ وَلَنِعْمَ الْمَجِيءُ جَاءَ فَأَتَيْنَا عَلَى هرُونَ، فَسَلَّمتُ عَلَيْهِ، فَقَالَ: مَرْحَبًا بِكَ مِنْ أَخٍ وَنَبِيٍّ فَأَتَيْنا عَلَى السَّمَاءِ السَّادِسَةِ، قِيلَ: مَنْ هذَا قِيلَ: جِبْرِيلُ، قِيلَ: مَنْ مَعَكَ قَالَ: مُحَمَّدٌ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قِيلَ: وَقَدْ أُرْسِلَ إِلَيْهِ مَرْحَبًا بِهِ وَلَنِعْمَ المَجِيءُ جَاءَ فَأَتَيْتُ عَلَى مُوسَى فَسَلَّمْتُ عَلَيْهِ، فَقَالَ: مَرْحَبًا بِكَ مِنْ أَخٍ وَنَبِيٍّ، فَلَمَّا جَاوَزْتُ بَكَى، فَقِيلَ: مَا أَبْكَاكَ فَقَالَ: يَا رَبِّ هذَا الْغُلاَمُ الَّذِي بُعِثَ بَعْدِي يَدْخُلُ الْجَنَّةَ مِنْ أُمَّتِهِ أَفْضَلُ مِمَّا يَدْخلُ مِنْ أُمَّتِي فَأَتَيْنَا السَّمَاءَ السَّابِعَةَ، قِيلَ: مَنْ هذَا قِيلَ: جِبْرِيلُ، قِيلَ: مَنْ مَعَكَ قِيلَ: مُحَمَّدٌ، قِيلَ: وَقَدْ أُرْسِلَ إِلَيْهِ مَرْحَبًا بِهِ وَلَنِعْمَ الْمَجِيءُ جَاءَ فَأَتَيْتُ عَلَى إِبْرَاهِيمَ فَسَلَّمْتُ عَلَيْهِ، فَقَالَ: مَرْحَبًا بِكَ [ص:38] مِنِ ابْنٍ وَنَبِيٍّ فَرُفِعَ لِيَ الْبَيْتُ الْمَعْمُورُ، فَسَأَلْتُ جِبْرِيلَ، فَقَالَ: هذَا الْبَيْتُ الْمَعْمُورُ، يَصَلِّي فِيهِ كُلَّ يَوْمٍ سَبْعُونَ أَلْفَ مَلَكٍ، إِذَا خَرَجُوا لَمْ يَعُودُوا إِلَيْهِ آخِرَ مَا عَلَيْهِمْ وَرُفِعَتْ لِي سِدْرَةُ الْمُنْتَهَى، فَإِذَا نَبِقُهَا كَأَنَّهُ قِلاَلُ هَجَرٍ وَوَرَقُهَا كَأَنَّهُ آذَانُ الْفُيُولِ، فِي أَصْلِهَا أَرْبَعَةُ أَنْهَارٍ، نَهْرَانِ بَاطِنَانِ وَنَهْرَانِ ظَاهِرَانِ، فَسَأَلْتُ جِبْرِيلَ، فَقَالَ: أَمَّا الْبَاطِنَانِ فَفِي
الْجَنَّةِ، وَأَمَّا الظَّاهِرَانِ فَالنِّيلُ وَالْفُرَاتُ ثُمَّ فُرِضَتْ عَلَيَّ خَمْسُونَ صَلاَةً، فَأَقْبَلْتُ حَتَّى جِئْتُ مُوسَى، فَقَالَ: مَا صَنَعْتَ قُلْتُ: فُرِضَتْ عَلَيَّ خَمْسُونَ صَلاَةً، قَالَ أَنَا أَعْلَمُ بِالنَّاسِ مِنْكَ، عَالَجْتُ بَنِي إِسْرَائِيلَ أَشَدَّ الْمُعَالَجَةِ، وَإِنَّ أُمَّتَكَ لاَ تُطِيقُ، فَارْجِعْ إِلَى رَبِّكَ فَسَلْهُ، فَرَجَعْتُ فَسَأَلْتُهُ، فَجَعَلَهَا أَربَعِينَ، ثُمَّ مِثْلَهُ، ثُمَّ ثَلاَثِينَ، ثُمَّ مِثْلَهُ، فَجَعَلَ عِشْرِينَ، ثُمَّ مِثْلَهُ، فَجَعَلَ عَشرًا، فَأَتَيْتُ مُوسَى فَقَالَ مِثْلَهُ، فَجَعَلَهَا خَمْسًا، فَأَتَيْتُ مُوسَى، فَقَالَ: مَا صَنَعْتَ قُلْتُ: جَعَلَهَا خَمْسًا، فَقَالَ مِثْلَهُ، قُلْتُ: سَلَّمْتُ بِخَيْرٍ، فَنُودِيَ إِنِّي قَدْ أَمْضَيْت فَرِيضَتِي وَخَفَّفْتُ عَنْ عِبَادِي وَأَجْزِي الْحَسَنَةَ عَشْرًا
__________
أخرجه البخاري في: 59 كتاب بدء الخلق: 6 باب ذكر الملائكة
103. హజ్రత్ మాలిక్ బిన్ సాసా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “నేను కాబా గృహం సమీపంలో అరమోడ్పు కనులతో అర్థ నిద్రావస్థలో కూర్చొని ఉన్నాను – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ సందర్భంలో ఇద్దరు వ్యక్తులు వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ – వారు నా దగ్గరకు ఒక బంగారు పళ్ళెం తీసుకొచ్చారు. అందులో విశ్వాసం, వివేచనలు నిండి ఉన్నాయి. నా వక్ష స్థలాన్ని పొట్ట క్రింది భాగం వరకు చీల్చివేశారు. తరువాత నా ఉదరాన్ని ‘జమ్ జమ్’ జలంతో శుద్ధి చేసి విశ్వాసం, వివేచనలతో దాన్ని నింపారు. ఆ తరువాత గాడిద కంటే కొంచెం పొట్టి, కంచర గాడిద కన్నా కొంచెం ఎత్తయిన ఒక తెల్ల జంతువుని తెచ్చారు. దాన్ని ‘బురాఖ్’ అంటారు. (దాని మీద ఎక్కి) నేను జిబ్రయీల్ (అలైహిస్సలాం)తో కలసి బయలుదేరాను.
చివరికి మేమిద్దరం భూసమీప ఆకాశం దగ్గరకు చేరుకున్నాము. అక్కడ (ద్వారపాలకుడు) ఎవరు మీరని అడిగాడు. దానికి జిబ్రయీల్, తాను జిబ్రయీలనని అన్నారు. “మరి మీతో పాటు ఉన్న ఈ వ్యక్తి ఎవర”ని అడిగాడు (ద్వారపాలకుడు). “ఈయన (దైవప్రవక్త) ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)” అన్నారు జిబ్రయీల్ (అలైహిస్సలాం). “ఈయన్ని పిలవడం జరిగిందా?” అని అడిగాడు (ద్వార పాలకుడు). ఔనన్నారు జిబ్రయీల్ (అలైహిస్సలాం). “అయితే రండి. సుస్వాగతం! మీ రాక శుభదాయకం!!” అన్నాడు (ద్వారపాలకుడు). ఆ తరువాత నేను హజ్రత్ ఆదం (అలైహిస్సలాం) దగ్గరకు చేరుకొని ఆయనకు సలాం చేశాను. ఆయన నన్ను స్వాగతిస్తూ “రా నాయనా! నీవు దైవప్రవక్తవు కూడా, నాకు కుమారుడువి కూడా” అన్నారు.
అక్కడ్నుంచి మేము రెండవ ఆకాశానికి చేరుకున్నాము. (అక్కడి ద్వారపాలకుడు కూడా) “ఎవరు మీరు” అన్నాడు. దానికి హజ్రత్ జిబ్రయీల్ (అలైహిస్సలాం) తాను జిబ్రయీల్ నని సమాధానమిచ్చారు. “మరి మీతో పాటు వచ్చిన ఈ వ్యక్తి ఎవరు?” అని అడిగాడు (ద్వారపాలకుడు). “ఈయన (దైవప్రవక్త) ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)” అన్నారు. జిబ్రయీల్ (అలైహిస్సలాం). “ఈయన్ని పిలవడం జరిగిందా?” అడిగాడు (ద్వారపాలకుడు). ఔనన్నారు. జిబ్రయీల్ (అలైహిస్సలాం). “అయితే రండి, సుస్వాగతం! మీ రాక శుభదాయకం!!” అన్నాడు ద్వారపాలకుడు. ఆ తరువాత నేను హజ్రత్ ఈసా (అలైహిస్సలాం), హజ్రత్ యహ్యా (అలైహిస్సలాం)ల దగ్గరకు వెళ్ళాను. వారిద్దరు నన్ను సాదరంగా ఆహ్వానిస్తూ “స్వాగతం సోదరా! శుభం దైవప్రవక్తా!!” అని అన్నారు.
అక్కడ్నుంచి మేము మూడవ ఆకాశానికి చేరుకున్నాము. (అక్కడి ద్వారపాలకుడు కూడా) “ఎవరు మీర”ని అడిగాడు. దానికి హజ్రత్ జిబ్రయీల్ (అలైహిస్సలాం) తాను జిబ్రయీల నని సమాధానమిచ్చారు. “మరి మీతో పాటు వచ్చిన ఈ వ్యక్తి ఎవరు?” అని అడిగాడు (ద్వారపాలకుడు). “ఈయన (దైవప్రవక్త) ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లం)” అన్నారు హజ్రత్ జిబ్రయీల్ (అలైహిస్సలాం). “ఈయన్ని పిలిపించడం జరిగిందా?” అడిగాడు (ద్వారపాలకుడు). ఔనన్నారు జిబ్రయీల్(అలైహిస్సలాం). “అయితే రండి, సుస్వాగతం! మీ రాక శుభదాయకం!!” అన్నాడు (ద్వారపాలకుడు). ఆ తరువాత నేను హజ్రత్ యూసుఫ్ (అలైహిస్సలాం)ను చేరుకొని ఆయనకు సలాం చేశాను. ఆయన నన్ను సాదరంగా ఆహ్వానిస్తూ “స్వాగతం సోదరా! శుభం దైవప్రవక్తా!!” అని అన్నారు.
అక్కడ్నుంచి మేము నాలుగవ ఆకాశానికి చేరుకున్నాము. (అక్కడి ద్వారపాలకుడు కూడా) “ఎవరు మీర”ని అడిగాడు. దానికి జిబ్రయీల్ (అలైహిస్సలాం) తాను జిబ్రయీల్ నని చెప్పారు. “మరి మీతో పాటు ఉన్న ఈ వ్యక్తి ఎవరు?” అన్ని ప్రశ్నించాడు (ద్వారపాలకుడు). “ఈయన (దైవప్రవక్త) ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)” అన్నారు. జిబ్రయీల్ (అలైహిస్సలాం). “దూతను పంపి ఈయన్ని పిలిపించడం జరిగిందా?” అడిగాడు ద్వారపాలకుడు. ఔనన్నారు జిబ్రయీల్ (అలైహిస్సలాం). “అయితే రండి, సుస్వాగతం! మీ రాక శుభదాయకం!!” అన్నాడు (ద్వారపాలకుడు). ఆ తరువాత నేను హజ్రత్ ఇద్రిస్ (అలైహిస్సలాం) దగ్గరకు చేరుకొని ఆయనకు సలాం చేశాను. ఆయన నన్ను సాదరంగా ఆహ్వానిస్తూ “స్వాగతం సోదరా! శుభం దైవప్రవక్తా!!” అని అన్నారు.
అక్కడ్నుంచి మేము ఐదవ ఆకాశానికి చేరుకున్నాము. (అక్కడి ద్వారపాలకుడు కూడా) “ఎవరు మీర”ని అడిగాడు. దానికి జిబ్రయీల్ (అలైహిస్సలాం) తాను జిబ్రయీల్ నని అన్నారు. “మరి మీతో పాటు ఉన్న ఈ వ్యక్తి ఎవరు?” అని ప్రశ్నించాడు (ద్వారపాలకుడు). “ఈయన (దైవప్రవక్త) ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)” అన్నారు. జిబ్రయీల్ (అలైహిస్సలాం). “దూతను పంపి ఈయన్ని పిలిపించడం జరిగిందా?” అడిగాడు (ద్వారపాలకుడు). ఔనన్నారు. జిబ్రయీల్ (అలైహిస్సలాం). “అయితే రండి, సుస్వాగతం ! మీ రాక శుభదాయకం!!” అన్నాడు (ద్వారపాలకుడు). ఆ తరువాత నేను హజ్రత్ హారూన్ (అలైహిస్సలాం) దగ్గరకు వెళ్ళాను. ఆయనకు నేను సలాం చేశాను. అప్పుడాయన నన్ను సాదరంగా ఆహ్వానిస్తూ “స్వాగతం సోదరా! శుభం దైవప్రవక్త!!” అని అన్నారు.
అక్కడ్నుంచి మేము ఆరవ ఆకాశానికి చేరుకున్నాము. అక్కడ కూడా ఇలా ప్రశ్నోత్తరాలు జరిగాయి. ప్రశ్న :- ఎవరు మీరు? జవాబు:- జిబ్రయీల్. ప్రశ్న:- మీతో పాటు ఉన్న ఈ వ్యక్తి ఎవరు? జవాబు:- (దైవప్రవక్త) ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం). ప్రశ్న:- ఈయన్ని పిలిపించడం జరిగిందా? జవాబు:- ఔను. “అయితే రండి, సుస్వాగతం! మీ రాక శుభదాయకం!!” అన్నాడు (ద్వారపాలకుడు). ఆ తరువాత నేను హజ్రత్ మూసా (అలైహిస్సలాం) దగ్గరకు చేరుకొని ఆయనకు సలాం చేశాను. ఆయన నన్ను సాదరంగా ఆహ్వానిస్తూ “స్వాగతం సోదరా! శుభం దైవద్రవక్తా!!” అని అన్నారు. అక్కడ్నుంచి కదలి నేను ముందుకు నడుస్తుంటే హజ్రత్ మూసా (అలైహిస్సలాం) దుఃఖించడం మొదలెట్టారు. నేను వెనక్కి తిరిగి “మీరెందుకు దుఃఖిస్తున్నారు?” అని అడిగాను. దీనికి సమాధానంగా ఆయన “అల్లాహ్! నా తరువాత నీవు దైవప్రవక్తగా నియమించి పంపిన ఈ యువకుని అనుచర సమాజం నా అనుచర సమాజం కంటే అత్యధిక సంఖ్యలో స్వర్గ ప్రవేశం చేస్తుందే! (ఇతనెంత అదృష్టవంతుడు!!)” అని అన్నారు.
అక్కడ్నుంచి మేము ఏడవ ఆకాశానికి చేరుకున్నాము. (అక్కడ కూడా ఇలాంటి ప్రశ్నోత్తరాలే సాగాయి). ప్రశ్న:- ఎవరు మీరు? సమాధానం:- జిబ్రయీల్. ప్రశ్న:- మీతో పాటు వచ్చిన ఈ వ్యక్తి ఎవరు? సమాధానం:- (దైవప్రవక్త) ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం). ప్రశ్న:- దూతను పంపి పిలిపించబడ్డాడా ఇతను? సమాధానం:- ఔను. “అయితే రండి, సుస్వాగతం! మీ రాక శుభదాయకం!!” అని స్వాగతం పలకబడింది. ఇక్కడ నేను హజ్రత్ ఇబ్రాహీం (అలైహిస్సలాం)ను కలుసుకున్నాను. ఆయనకు సలాం చేశాను. అప్పుడాయన నన్ను సాదరంగా ఆహ్వానిస్తూ “స్వాగతం కుమారా! శుభం దైవప్రవక్తా!!” అన్నారు.
అక్కడ్నుంచి నన్ను “బైతుల్ మామూర్” దగ్గరకు తీసికెళ్ళడం జరిగింది. నేను దాన్ని చూసి “ఇదేమిటీ?” అని అడిగాను. “ఇదే బైతుల్ మామూర్” అన్నారు జిబ్రయీల్ (అలైహిస్సలాం). ఇక్కడ ప్రతి రోజూ డెబ్బై వేల మంది దైవదూతలు ప్రార్థన చేస్తారు. ఇలా ప్రార్థన చేసిన డెబ్బై వేల మంది దైవదూతలు తిరిగి ప్రళయం వరకూ ఇక్కడ ప్రార్థన చేయడానికి రాలేరు. (అంటే దైవదూతల సంఖ్య అసంఖ్యాకంగా ఉన్నందున ఏ ఒక్కరికీ ఇక్కడ రెండవ సారి ప్రార్థన చేసే అవకాశమే రాదన్నమాట).
ఆ తరువాత నన్ను “సిద్రతుల్ ముంతహా” (*) ఓ విశిష్ట (దివ్యవృక్షరాజం) దగ్గరికి తీసికెళ్ళి చూపారు. దాని రేగు పండ్లు చూస్తే హజర్ (**) ప్రాంతంలో ఉండే (మట్టి) కడవల్లా కన్పించాయి. దాని ఆకులు ఏనుగు చెవులంత పెద్దగా ఉన్నాయి. ఆ చెట్టు మొదలు నుంచి నాలుగు సెలయేరులు ప్రవహిస్తున్నాయి. ఆ నాలుగింటిలో రెండు బహిరంగమైనవి, రెండు గుప్తమైనవి. నేను వీటి సంగతేమిటని అడిగితే “సప్తనదులు స్వర్గంలో ఉన్నాయని, బహిరంగ నదులు (భూమండలంలోని) నైలు, ఫరాత్ నదుల”ని జిబ్రయీల్ (అలైహిస్సలాం) తెలియజేశారు.
ఆ తరువాత నాకు (నా అనుచర సమాజానికి) యాభై నమాజులు ఆచరించాలని విధించారు. ఈ ఆజ్ఞ తీసుకొని నేను తిరిగి వస్తుంటే దారిలో హజ్రత్ మూసా (అలైహిస్సలాం) నన్ను, పరిస్థితి ఏమిటని అడిగారు. “(రోజూ) యాభై నమాజులు విధిగా చేయాలని నిర్ణయం జరిగింద”ని చెప్పాను నేను. అప్పుడు హజ్రత్ మూసా (అలైహిస్సలాం) ఇలా అన్నారు: “నాకు మనుషుల స్థితిగతుల్ని గురించి మీకంటే ఎక్కువ తెలుసు. నేను ఇస్రాయీల్ సంతతి ప్రజలను బాగా పరీక్షించి చూశాను. మీ అనుచర సమాజం ఇంతటి భారాన్ని మోయజాలదు. మీరు మీ ప్రభువు దగ్గరకు తిరిగి వెళ్ళి (కొన్ని నమాజులు) తగ్గించమని విన్నవించుకోండి”. ఈ మాటలు విని నేను అల్లాహ్ సన్నిధికి తిరిగి వెళ్ళి విషయం విన్నవించుకున్నాను. అల్లాహ్ (నా విన్నపం విని) నలభై నమాజులకు తగ్గించాడు. కాని హజ్రత్ మూసా (అలైహిస్సలాం) మళ్ళీ ఇంతకు ముందులాగే (మరికొన్ని నమాజులు తగ్గించమని అల్లాహ్ ను అభ్యర్థించండని) అన్నారు. నేను అల్లాహ్ సన్నిధికి మళ్ళీ వెళ్ళాను. అల్లాహ్ ఈసారి ముఫ్ఫై నమాజులకు తగ్గించాడు. కాని మళ్ళీ అదే జరిగింది. నేను అల్లాహ్ సన్నిధికి మరోసారి వెళ్ళాను.
అల్లాహ్ నమాజుల సంఖ్యను ఇరవైకి తగ్గించాడు. హజ్రత్ మూసా (అలైహిస్సలాం) తిరిగి అదే సలహా ఇచ్చారు. నేను మళ్ళీ పోయి అల్లాహ్ సన్నిధిలో విన్నవించుకున్నాను. అల్లాహ్ నమాజుల సంఖ్యను పదికి తగ్గించాడు. కాని హజ్రత్ మూసా (అలైహిస్సలాం) మళ్ళీ అదే సలహా ఇచ్చి నన్ను పురమాయించారు. (నేను మరోసారి వెళ్ళి విన్నవించుకుంటే) అల్లాహ్ విధిగా చేయవలసిన నమాజుల సంఖ్యను ఐదుకు తగ్గించాడు. అయితే హజ్రత్ మూసా (అలైహిస్సలాం) మరొకసారి వెళ్ళి విన్నవించుకోమని సలహా ఇచ్చారు. కాని నాకు మనస్సొప్పక) “నేను అల్లాహ్ ఆజ్ఞను శిరసావహించాను” అని చెప్పేశాను. అప్పుడు అల్లాహ్ వైపు నుంచి “నేను నా (దాసుల కొరకు నిర్ణయించిన) విధిని జారీ చేశాను. నా దాసులపై భారం కూడా తగ్గించాను. ఒక పుణ్యకార్యానికి పదింతల పుణ్యఫలం ప్రసాదిస్తాను. (అంటే ఐదు నమాజులకు యాభై నమాజులంత పుణ్యఫలం లభిస్తుందన్నమాట)” అని ఓ (అదృశ్య) వాణి విన్పించింది.
[సహీహ్ బుఖారీ: 59వ ప్రకరణం – బద్ యిల్ ఖల్ఖ్ , 6వ అధ్యాయం – జిక్రుల్ మలాయిక)
(*) అరబీ భాషలో ‘సిద్ర్’ అంటే రేగు చెట్టు అని అర్థం.
(**) హజర్ అంటే మదీనా పట్టణం సమీపంలో ఉన్న ఒక ప్రదేశం పేరు.
104 – حديث ابنِ عَبَّاسٍ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: رَأَيْتُ لَيْلَةَ أُسْرِيَ بِي؛ مُوسَى، رَجُلاً آدَمَ طُوَالاً جَعْدًا كَأَنَّهُ مِنْ رِجَالِ شَنُوءَةَ؛ وَرَأَيْتُ عَيسَى رَجُلاً مَرْبُوعًا، [ص:39] مَرْبُوعَ الْخَلْقِ إِلَى الْحُمْرَةِ وَالْبَيَاضِ، سَبِطَ الرَّأْسِ، وَرَأَيْتُ مَالِكًا خَازِنَ النَّارِ، وَالدَّجَّالَ فِي آيَاتٍ أَرَاهُنَّ اللهُ إِيَّاهُ، فَلاَ تَكُنْ فِي مِرْيَةٍ مِنْ لِقَائِهِ
__________
أخرجه البخاري في: 59 كتاب بدء الخلق: 7 باب إذا قال أحدكم آمين والملائكة في السماء
104. హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన గగన పర్యటనను గురించి ప్రస్తావిస్తూ ఇలా అన్నారు: “నేను మేరాజ్ (గగన పర్యటన) రాత్రి హజ్రత్ మూసా (అలైహిస్సలాం)ను చూశాను. ఆయన గోధుమ వర్ణంతో, పొడుగ్గా, వంకీల జుట్టు కలిగి ఉన్నారు. షనుఆ తెగకు చెందిన మనిషిలా ఉన్నారు. నేను హజ్రత్ ఈసా (అలైహిస్సలాం)ని కూడా చూశాను. ఆయన సాధారణ ఎత్తు కలిగి ఉన్నారు. తెలుపు, ఎరుపు కలిసిన వర్ణంతో, వంకీలు లేని సామాన్య శిరోజాలు కలవారు. ఆ రాత్రి నేను నరకపాలకుడయిన మాలిక్ ని, దజ్జాల్ ని కూడా చూశాను.” (హజ్రత్ ఇబ్నె అబ్బాస్ కథనం ప్రకారం) ఇవి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ఆ రాత్రి అల్లాహ్ చూపిన కొన్ని నిదర్శనాలు. అనంతరం ఆయన (సఅసం) ఈ వచనం పఠించారు: కనుక “ఆయనకు లభించిన వాటి అనుమానంలో పడకండి.” (ఖుర్ఆన్ – 32 : 23)
(సహీహ్ బుఖారీ : 59వ ప్రకరణం – బద్ యిల్ ఖల్ఖ్, 7వ అధ్యాయం – ఇజాఖాల అహ్ద కుమ్…..]
105 – حديثُ ابْنِ عَبَّاسٍ، عَنْ مُجَاهِدٍ قَالَ كُنَّا عِنْدَ ابْنِ عَبَّاسٍ، فَذَكَرُوا الدَّجَّالَ أَنَّهُ قَالَ مَكْتُوبٌ بَيْنَ عَيْنَيْهِ كَافِرٌ، فَقَالَ ابْنُ عَبَّاسٍ: لَمْ أَسْمَعْهُ وَلكِنَّهُ قَالَ أَمَّا مُوسَى كَأَنِّي أَنْظُرُ إِلَيْهِ إِذِ انْحَدَرَ فِي الْوَادِي يُلَبِّي
__________
أخرجه البخاري في: 25 كتاب الحج: 30 باب التلبية إذا انحدر في الوادي
105. హజ్రత్ ముజాహిద్ (రహిమహుల్లాహ్) కథనం:- మేము హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) దగ్గర కూర్చొని ఉన్నాము. అప్పుడు మాలో కొందరు దజ్జాల్ ప్రస్తావన లేవదీస్తూ “దజ్జాల్ రెండు కళ్ళ మధ్య (నుదుటిపై) కాఫిర్ అనే పదం వ్రాయబడి ఉంటుందని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపార”ని అన్నారు. హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) మధ్యలో కల్పించుకొని “నేనీ సంగతి వినలేదు. అయితే హజ్రత్ మూసా (అలైహిస్సలాం) హాజరయ్యానంటూ లోయలో దిగుతుండగా చూసిన దృశ్యం ఇప్పటికీ తన కళ్ళ ముందు మెదలుతోందని మాత్రం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్నారు” అని అన్నారు.
[సహీహ్ బుఖారీ : 25వ ప్రకరణం – హజ్, 30వ అధ్యాయం – అత్తల్బియతి ఇజన్ హదరఫిల్ వాది]
106 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ لَيْلَةَ أُسْرِيَ بِهِ رَأَيْتُ مُوسَى وَإِذَا رَجُلٌ ضَرْبٌ رَجِلٌ كَأَنَّهُ مِنْ رِجَالِ شَنُوءَةَ، وَرَأَيْتُ عِيسَى فَإِذَا هُوَ رَجُلٌ رَبْعَةٌ أَحْمَرُ، كَأَنَّمَا خَرَجَ مِنْ دِيمَاسٍ، وَأَنَا أَشْبَهُ وَلَدِ إِبْرَاهيمَ بِهِ، ثُمَّ أُتِيتُ بِإِنَاءَيْنِ فِي أَحَدِهِمَا لَبَنٌ، وَفِي الآخَرِ خَمْرٌ، فَقَالَ اشْرَبْ أَيَّهُمَا شِئْتَ، فَأَخَذْتُ اللَّبَنَ فَشَرِبْتُهُ، فَقِيلَ أَخَذْتَ الْفِطْرَةَ، أَمَا إِنَّكَ لَوْ أَخَذْتَ الْخَمْرَ غَوَتْ أُمَّتُكَ
__________
أخرجه البخاري في: 60 كتاب الأنبياء: 24 باب قول الله تعالى: (وهل أتاك حديث موسى) (وكلم الله موسى تكليما)
106. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మేరాజ్ రాత్రిని ప్రస్తావిస్తూ ఇలా అన్నారు: “నేను మేరాజ్ రాత్రిన హజత్ మూసా (అలైహిస్సలాం)ను చూశాను. ఆయన బక్కచిక్కిన మనిషి. ఆయన శిరోజాలు పెద్దగా వంకీలు తిరగలేదు. షనుఆ తెగకు చెందిన మనిషిలా ఉంటారు. నేను హజ్రత్ ఈసా (అలైహిస్సలాం)ని కూడా చూశాను. ఆయన పొడుగూ పొట్టీ కాని మధ్య రకం ఎత్తు కలిగినవారు. ఎర్రగా ఉంటారు. స్నానాల గది నుండి అప్పుడే బయటికి వచ్చిన మనిషిలా (ఎంతో శుభ్రంగా) ఉంటారు. హజ్రత్ ఇబ్రాహీం (అలైహిస్సలాం) సంతతిలో ఆయనే అందరికంటే ఎక్కువగా ఇబ్రాహీం (అలైహిస్సలాం) ని పోలి ఉంటారు. ఆ తరువాత నా దగ్గరికి రెండు గిన్నెలు తీసుకువచ్చారు. అందులో ఒకటి పాలగిన్నె. రెండవ దానిలో సారాయి ఉంది. హజ్రత్ జిబ్రయీల్ (అలైహిస్సలాం) వాటి వైపు చూపిస్తూ “ఈ రెండిటిలో మీ కిష్టమైనది సేవించవచ్చు” అని అన్నారు. అప్పుడు నేను పాలగిన్నె తీసుకొని అందులోని పాలను త్రాగాను. అప్పుడు (ఎవరో) “నీవు సహజత్వాన్ని * పొందావు. దానికి బదులు నీవు సారాయి త్రాగడానికి ఇష్టపడి ఉంటే నీ అనుచర సమాజం చెడిపోయి ఉండేది.”
[సహీహ్ బుఖారీ : 60వ ప్రకరణం – 24వ అధ్యాయం – ఖౌలిల్లాహి – హల్ అతాక హదీసు మూసా]
(*) సహజత్వం అంటే ఇక్కడ ఇస్లాం అని అర్థం.
73వ అధ్యాయం – మర్యం కుమారుడు మసీహ్ – దజ్జాల్ మసీల ప్రస్తావన
في ذكر المسيح بن مريم والمسيح الدجال
107 – حديثُ عَبْدِ اللهِ بْنِ عُمَرَ، قَالَ: ذَكَرَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَوْمًا بَيْنَ ظَهْرَي النَّاسِ [ص:40] الْمَسِيحَ الدَّجَّالَ، فَقَالَ: إِنَّ اللهَ لَيْسَ بِأَعْوَرَ، أَلاَ إِنَّ الْمَسِيحَ الدَّجَّالَ أَعْوَرُ الْعَيْنِ الْيُمْنَى كَأَنَّ عَيْنَهُ عِنَبَةٌ طَافِيَةٌ
__________
أخرجه البخاري في: 60 كتاب الأنبياء: 48 باب (واذكر في الكتاب مريم)
107. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓ రోజు ప్రజల ముందు దజ్జాల్ మసీహ్ గురించి ప్రస్తావిస్తూ “అల్లాహ్ సుతరామూ గుడ్డివాడు కాదు. కాని దజ్జాల్ మసీహ్ మాత్రం కుడికన్ను లేనివాడయి ఉంటాడు. అతని కన్ను ఉబ్బిన ద్రాక్ష పండులా ఉంటుంది” అని తెలిపారు.
(సహీహ్ బుఖారీ : 60వ ప్రకరణం – అంబియా, 48వ అధ్యాయం – వజ్ కుర్ ఫిల్ కితాబి మర్యమ్)
108 – حديثُ عَبْدِ اللهِ بْنِ عُمَرَ، قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: أَرَانِي اللَّيْلَةَ عِنْدَ الْكَعْبَةِ فِي المَنَامِ، فَإِذَا رَجُلٌ آدَمُ كَأَحْسَنِ مَا يُرَى مِنْ أُدْمِ الرِّجَالِ، تَضْرِبُ لِمَّتُهُ بَيْنَ مَنْكِبَيْهِ، رَجِلُ الشَّعَر، يَقْطُرُ رَأْسُهُ مَاءً، وَاضِعًا يَدَيْهِ عَلَى مَنْكِبَيْ رَجُلَيْنِ وَهُوَ يَطُوفُ بِالْبَيْتِ، فَقُلْتُ: مَنْ هذَا فَقَالَوا: هذَا الْمَسِيحُ ابْنُ مَرْيَمَ، ثُمَّ رَأَيْتُ رَجُلاً وَرَاءَهُ جَعْدًا قَطِطًا، أَعْوَرَ الْعَيْنِ الْيُمْنَى، كَأَشْبَهِ مَنْ رَأَيْتُ بِابْنِ قَطَنٍ، وَاضِعًا يَدَيْهِ عَلَى مَنْكِبَيْ رَجُلٍ يَطُوفُ بِالْبَيْتِ، فَقُلْتُ: مَنْ هذَا فَقَالُوا الْمَسِيحُ الدَّجَّالُ
__________
أخرجه البخاري في: 60 كتاب الأنبياء: 48 باب (واذكر في الكتاب مريم)
108. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు – “రాత్రి నేను ఓ కల గన్నాను. ఆ కలలో నేను కాబా గృహం దగ్గర ఓ వ్యక్తిని చూశాను. అతను గోధుమ వర్ణంలో ఎంతో అందంగా ఉన్నాడు. అతని శిరోజాలు తిన్నగా భుజాల మీద వ్రేలాడుతున్నాయి. తల నుంచి నీటి బిందువులు రాలి పడుతున్నాయి. అతను ఇద్దరు వ్యక్తుల భుజాల మీద చేతులు వేసి కాబా గృహం ప్రదక్షిణ చేస్తున్నాడు. నేను ప్రజలను ఇతనెవరని అడిగాను. “అతను మర్యం కుమారుడు మసీహ్ (అలైహిస్సలాం)” అని చెప్పారు వారు. నేను అతని వెనుక మరొక వ్యక్తిని కూడా చూశాను. ఆ వ్యక్తి తల వెంట్రుకలు చిందరవందరగా పడి ఉన్నాయి, వంకీలు తిరిగిన జుట్టది. కుడికన్ను పోయి ఉంది. అతను చాలా వరకు ఇబ్నె ఖతన్ లా (*) ఉంటాడు. అతను కూడా ఇద్దరు మనుషుల భుజాల మీద చేతులు వేసి కాబా ప్రదక్షిణం చేస్తున్నాడు. నేను ప్రజలను ఇతనెవరని అడిగాను. “అతను మసీహ్ దజ్జాల్” అని చెప్పారు.
(సహీహ్ బుఖారీ: 60వ ప్రకరణం – అంబియా, 48వ అధ్యాయం – వజ్ కుర్ ఫిల్ కితాబి మర్యమ్)
(*) ఇబ్నె ఖతన్ బిన్ అబ్దుల్ ఉజ్జా అజ్ఞానయుగంలో (ఇస్లాం అవతరణకు పూర్వమే) చనిపోయిన ఒక అవిశ్వాసి.
109 – حديث جَابِرِ بْنِ عَبْدِ الله أنَّهُ سَمِعَ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: لَمَّا كَذَّبَتْنِي قُرَيْشٌ قُمْتُ فِي الْحِجْرِ فَجَلاَ الله لِي بَيْتَ الْمَقْدِسِ، فَطَفِقْتُ أُخْبِرُهُمْ عَنْ آيَاتِهِ وَأَنَا أَنْظُرُ إِلَيْهِ
__________
أخرجه البخاري في: 63 كتاب مناقب الأنصار: 41 باب حديث الإسراء وقول الله تعالى (سبحان الذي أسرى بعبده ليلا)
109. హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం:- నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచిస్తుండగా విన్నాను – “ఖురైష్ నాయకులు (మేరాజ్ సంఘటన విషయమయి) నన్ను ధిక్కరించినప్పుడు నేను హిజ్ర్ అనే చోట నిలబడి ఉన్నాను. అదే సమయంలో అల్లాహ్ బైతుల్ మఖ్దిస్ దృశ్యాన్ని నా కళ్ళ ముందు ప్రదర్శించాడు. దాన్ని చూస్తూ నేను బైతుల్ మఖ్దిస్ గుర్తులన్నీ తెలియజేశాను.”
(సహీహ్ బుఖారీ : 63వ ప్రకరణం – మనాఖిబే అన్సారీ, 41వ అధ్యాయం – హదీసుల్ ఇస్రా]
74వ అధ్యాయం – సిద్ధతుల్ మునహా (విశిష్ఠ రేగు వృక్షం)
في ذكر سدرة المنتهى
110 – حديث ابْنِ مَسْعُودٍ عَنْ أَبِي إِسْحقَ الشَّيْبَانِيّ، قَالَ: سَأَلْتُ زِرَّ بْنَ حُبَيْشٍ عَنْ قَوْلِ اللهِ تَعَالَى (فَكَانَ قَابَ قَوْسَيْنِ أَوْ أَدْنَى فَأَوْحَى إِلَى عَبْدِهِ ما أَوْحَى) قَالَ: حَدَّثَنَا ابْنُ مَسْعُودٍ أَنَّهُ رَأَى جِبْرِيلَ لَهُ سِتُّمِائَةِ جَنَاحٍ
__________
أخرجه البخاري في: 59 كتاب بدء الخلق: 7 باب إذا قال أحدكم آمين والملائكة في السماء
110. అబూ ఇస్ హాఖ్ ఫైబానీ (రహిమహుల్లాహ్) కథనం:- నేను జిర్ర బిన్ హుబైష్ (రహిమహుల్లాహ్) ముందు “ఈ విధంగా అతను రెండు ధనస్సులంత దూరాన లేక అంతకంటే కొంచెం తక్కువ దూరాన వచ్చి నిలబడ్డాడు. ఆ తరువాత అతను తాను అందజేయవలసిన దివ్య సందేశాన్ని (ఆ) దైవదాసునికి అందజేశాడు (53:9,10)” అనే దైవ సూక్తిని ప్రస్తావించి, ఈ విషయం గురించి మీ అభిప్రాయం ఏమిటని అడిగాను. దీనికాయన సమాధానమిస్తూ “దీని అర్థం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ జిబ్రయీల్ (అలైహిస్సలాం)ని చూశారని, హజ్రత్ జిబ్రయీల్ కు ఆరొందల రెక్కలున్నాయని హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రదియల్లాహు అన్హు) తెలియజేశారు.” అని అన్నారు.
(సహీహ్ బుఖారీ : 59వ ప్రకరణం – బద్ యిల్ ఖల్ఖ్, 7వ అధ్యాయం – ఇజ్ ఖాల అహదుకుమ్…..)
75వ అధ్యాయం – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ ప్రభువును దర్శించారా?
معنى قول الله عز وجل: (ولقد رآه نزلة أخرى) ، وهل رأى النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ ربه ليلة الإسراء
111 – حديث عَائِشَةَ عَنْ مَسْرُوقٍ قَالَ: قُلْتُ لِعَائِشَةَ يَا أُمَّتَاهْ هَلْ رَأَى مُحَمَّدٌ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ رَبَّهُ فَقَالَتْ لَقَدْ قَفَّ شَعَرِي مِمَّا قُلْتَ، أَيْنَ أَنْتَ مِنْ ثَلاَثٍ مَنْ حَدَّثَكَهُنَّ فَقَدْ كَذَبَ: مَنْ حَدَّثَكَ أَنَّ مُحَمَّدًا صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ رَأَى رَبَّهُ فَقَدْ كَذَبَ، ثُمَّ قَرأَتْ (لاَ تُدْرِكُهُ الأَبْصَارُ وَهُوَ يُدْرِكُ الأَبْصَارَ وَهُوَ اللَّطِيفُ الْخَبِيرُ) ، (وَمَا كَانَ لِبَشَرٍ أَنْ يُكَلِّمَهُ اللهُ إِلاَّ وَحْيًا أَوْ مِنْ وَرَاءِ حِجَابٍ) ؛ وَمَنْ حَدَّثَكَ أَنَّهُ يَعْلَمُ مَا فِي غَدٍ فَقَدْ كَذَبَ، ثُمَّ قَرَأَتْ (وَمَا تَدْرِي نَفْسٌ مَاذَا تَكْسِبُ غَدًا) ؛ وَمَنْ حَدَّثَكَ أَنَّهُ كَتَمَ فَقَدْ كَذَبَ، ثُمَّ قَرَأَتْ (يَأَيُّهَا الرَّسُولُ بَلِّغْ مَا أُنْزِلَ إِلَيْكَ مِنْ رَبِّكَ) الآية؛ وَلكِنَّهُ رَأَى جِبْرِيلَ عَلَيْهِ السَّلاَمُ فِي صُورَتِهِ مَرَّتَيْنِ
__________
أخرجه البخاري في: 65 كتاب التفسير: 53 سورة النجم: 1 باب حدثنا يحيى حدثنا وكيع
111. హజ్రత్ మస్రూఖ్ (రదియల్లాహు అన్హు) కథనం:- నేను విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా)ను “అమ్మా! దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ ప్రభువును (ప్రత్యక్షంగా) చూశారా?” అని అడిగాను. దానికి ఆమె ఇలా అన్నారు: “నీ మాటలు విని నా రోమాలు నిక్కపొడుచుకున్నాయి. నీకు తెలుసా? ఈ మూడు విషయాలను గురించి మీలో ఎవరైనా తన వైపు నుంచి ఏదైనా అంటే అతను అబద్ధాలకోరుగా పరిగణించబడతాడు :
(1) “ఎవరి చూపులూ ఆయన్ని అందుకోజాలవు. ఆయన మాత్రం అందరి చూపులనూ అందుకోగలడు.” (దివ్యఖుర్ఆన్ 6:103) “అల్లాహ్ ఏ మానవునితోనూ ప్రత్యక్షంగా సంభాషించడు. మానవ మాత్రుడికి అది సాధ్యమయ్యే పని కాదు. అల్లాహ్ తన మాటను వహీ ద్వారానో లేక తెర వెనుక నుంచో మాత్రమే మానవునికి చేరవేస్తాడు.” (దివ్యఖుర్ఆన్- 42:51)
(2) అలాగే రేపు జరగబోయే విషయాలేవో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు తెలుసనేవాడు కూడా అబద్దాల కోరే. ఈ సందర్భంలో హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఈ సూక్తిని ఉదాహరించారు – “రేపు తాను ఏం చేయనున్నాడో ఏ మానవునికీ తెలియదు.” (దివ్యఖుర్ఆన్ – 31:34)
(3) అదే విధంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (ధర్మానికి సంబంధించిన) ఏదైనా విషయం రహస్యంగా ఉంచారని అనేవాడు కూడా అబద్దాలరాయుడే. దీన్ని గురించి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఈ సూక్తిని ఉదాహరించారు – “ప్రవక్తా! నీ ప్రభువు నుండి నీపై అవతరించే బోధనలను ప్రజలకు అందజేస్తూ ఉండు. ఒకవేళ నీవలా చేయకపోతే దౌత్య బాధ్యతను నెరవేర్చని వాడవుతావు.” (దివ్యఖుర్ఆన్ – 5:67) కనుక అసలు విషయం ఏమిటంటే, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జిబ్రయీల్ (అలైహిస్సలాం)ను అతని నిజ స్వరూపంలో రెండు సార్లు చూశారు.”
[సహీహ్ బుఖారీ : 65వ ప్రకరణం – అత్తఫ్సీర్, 53వ సూరా – అన్నజ్మ్ – 1వ అధ్యాయం – హద్ధసనా యహ్యా ]
112 – حديث عَائِشَةَ قَالَتْ مَنْ زَعَمَ أَنَّ مُحَمَّدًا رَأَى رَبَّهُ فَقَدْ أَعْظَمَ، ولكِنْ قد رَأى جِبْرِيلَ فِي صُورَتِهِ، وَخَلْقُهُ سَادٌّ مَا بَيْنَ الأُفُقِ
__________
أخرجه البخاري في: 59 كتاب بدء الخلق: 7 باب إذا قال أحدكم آمين والملائكة في السماء
112. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- ఎవరైనా, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన ప్రభువును చూశానని అన్నాడంటే అతను చాలా ఘోరమైన (తప్పుడు) మాట అన్నాడన్న మాట. నిజానికి ఆయన(అల్లాహ్ ను చూడలేదు) హజ్రత్ జిబ్రయీల్ (అలైహిస్సలాం)ని మాత్రమే అతని నిజరూపంలో చూశారు. అతని రూపం, ఆకారంలో యావత్తు దిగ్మండల పై విస్తరించింది. అతను ఆకాశాన్ని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కప్పి వేశాడు.
[సహీహ్ బుఖారీ : 59వ ప్రకరణం – బద్ యిల్ ఖల్ఖ్, 7వ అధ్యాయం – ఇజ్ ఖాల అహ్దకుమ్…]
78వ అధ్యాయం – విశ్వాసులు పరలోకంలో అల్లాహ్ ను దర్శిస్తారు
إِثبات رؤية المؤمنين في الآخرة ربهم سبحانه وتعالى
113 – حديث أَبِي مُوسَى، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: جَنَّتَانِ مِنْ فِضَّةٍ آنِيَتُهُمَا وَمَا فِيهِمَا، وَجَنَّتَانِ مِنْ ذَهَبٍ، آنِيَتُهُمَا وَمَا فِيهِمَا، وَمَا بَيْنَ الْقَوْمِ وَبَيْنَ أَنْ يَنْظُرُوا إِلَى رَبِّهِمْ إِلاَّ رِدَاءُ الْكِبْر عَلَى وَجْهِهِ فِي جَنَّةِ عَدْنٍ
__________
أخرجه البخاري في: 65 كتاب التفسير: 55 سورة الرحمن: 1 باب قوله (ومن دونهما جنتان)
113. హజ్రత్ అబూ మూసా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు: “స్వర్గంలో రెండు రజిత (వెండి) వనాలు ఉన్నాయి. ఆ వనాల్లో పాత్రలతో సహా సమస్త వస్తువులు వెండితో రూపొందించినవి అయి ఉంటాయి. అలాగే మరో రెండు స్వర్గ వనాలు కూడా ఉన్నాయి. ఆ వనాల్లో పాత్రలతో సహా సమస్త వస్తువులు బంగారంతో రూపొందించినవి అయి ఉంటాయి. అదనవనంలో అల్లాహ్ దర్శనం కొరకు దాసులకు, వారి ప్రభువుకు మధ్య దివ్య తేజస్సుతో కూడిన అద్భుతమైన పరదా మాత్రమే ఉంటుంది. అది ఆయన ముఖవర్చస్సును కప్పి ఉంటుంది. (ఆ తెర లేకపోతే దాసులు తమ ప్రభువును అనుక్షణం చూస్తూ ఉంటారు.”
[సహీహ్ బుఖారీ: 65వ ప్రకరణం -అత్తఫ్సీర్, 55వ సూరా, -అర్రహ్మాన్ – 1వ అధ్యాయం – వమిన్ దూనిహిమా జన్నతాన్.]
79వ అధ్యాయం – అల్లాహ్ దర్శనం ఎలా ఉంటుంది?
معرفة طريق الرؤية
114 – حديث أَبِي هُرَيْرَةَ، أَنَّ النَّاس قَالُوا: يَا رَسُولَ اللهِ هَلْ نَرَى رَبَّنَا يَوْمَ الْقِيَامَةِ قَالَ: هَلْ تُمَارُونَ فِي الْقَمَرِ لَيْلَةَ الْبَدْرِ لَيْسَ دُونَهُ سَحَابٌ قَالُوا لاَ يَا رَسُولَ اللهِ قَالَ: فَهَلْ تمَارُونَ فِي الشَّمْسِ لَيْسَ دُونَهَا سَحَابٌ قَالُوا لاَ يَا رَسُولَ اللهِ، قَالَ: فَإِنَّكمْ تَرَوْنَهُ كَذَلِكَ يُحْشَرُ النَّاسُ يَوْمَ الْقِيَامَةِ فَيَقُولُ مَنْ كَانَ يَعْبدُ شَيْئًا فَلْيَتْبَعْهُ، فَمِنْهُمْ مَنْ يَتَّبِعُ الشَّمْسَ، وَمِنْهُمْ مَنْ يَتَّبِعُ الْقَمَر، وَمِنْهُمْ مَنْ يَتَّبِعُ الطَّوَاغِيتَ وَتَبْقَى هذِهِ الأُمَّةُ فِيهَا مُنَافِقُوهَا، فَيَأْتِيهِمُ اللهُ فَيَقُولُ أَنَا رَبُّكُمْ، فَيَقُولُونَ هذَا مَكَانُنَا حَتَّى يَأْتِيَنَا رَبُّنَا، فَإِذَا جَاءَ رَبُّنَا عَرَفْنَاهُ، فَيَأْتِيهِمُ اللهُ فَيَقُولُ أَنَا رَبُّكُمْ، فَيقُولُونَ أَنْتَ رَبُّنَا، فَيَدْعُوهُمْ، وَيُضْرَبُ الصِّرَاطُ بَيْنَ ظَهْرَانَيْ جَهَنَّمَ، فَأَكُونُ أَوَّلَ [ص:43] مَنْ يَجُوزُ مِنَ الرَّسُلِ بِأُمَّتِهِ، وَلاَ يَتَكَلَّمُ يَوْمَئِذٍ أَحَدٌ إِلاَّ الرُّسُلُ، وَكَلاَمُ الرُّسُلِ يَوْمَئِذٍ اللهُمَّ سَلِّمْ سَلِّمْ، وَفِي جَهَنَّمَ كَلاَلِيبُ مِثْلُ شَوْكِ السَّعْدَانِ، هَلْ رَأَيْتُمْ شَوْكَ السَّعْدَانِ قَالُوا نَعَمْ، قَالَ: فَإِنَّهَا مِثْلُ شَوْكِ السَّعْدانِ، غَيْرَ أَنَّهُ لاَ يَعْلَمُ قَدْرَ عِظَمِهَا إِلاَّ اللهُ، تَخْطَفُ النَّاسَ بِأَعْمَالِهِمْ، فَمِنْهُمْ مَنْ يُوبَقُ بِعَمَلِهِ، وَمِنْهُمْ مَنْ يُخَرْدَلُ ثُمَّ يَنْجُو، حَتَّى إِذَا أَرَادَ اللهُ رَحْمَةَ مَنْ أَرَادَ مِنْ أَهْلِ النَّارِ أَمَرَ اللهُ الْمَلاَئِكَةَ أَنْ يُخْرِجُوا مَنْ كَانَ يَعْبُدُ اللهَ، فَيُخْرِجُونَهُمْ، وَيَعْرِفُونَهُمْ بِآثَارِ السُّجُودِ، وَحَرَّمَ اللهُ عَلَى النَّارِ أَنْ تَأْكُلَ أَثَرَ السُّجُودِ، فَيَخْرُجُونَ مِنَ النَّار، فَكُلُّ ابْنِ آدَمَ تَأْكُلُهُ النَّارُ إِلاَّ أَثَرَ السُّجُودِ؛ فَيَخْرُجُونَ مِنَ النَّارِ قَدِ امْتَحَشُوا، فَيُصَبُّ عَلَيْهِمْ مَاءُ الْحَيَاةِ، فَيَنْبُتُونَ كَمَا تَنْبُتُ الْحِبَّةُ فِي حَمِيلِ السَّيْلِ؛ ثُمَّ يَفْرُغُ اللهُ مِنَ الْقَضَاءِ بَيْنَ الْعِبَادِ، وَيَبْقَى رَجُلٌ بَيْنَ الْجَنَّةِ وَالنَّارِ، وَهُوَ آخِرُ أَهْلِ النَّارِ دُخُولاً الْجَنَّةَ، مُقْبِلاً بِوَجْهِهِ قِبَلَ النَّارِ، فَيَقُولُ يَا رَبِّ اصْرِفْ وَجْهِي عَنِ النَّارِ، قَدْ قَشَبَنِي رِيحُهَا، وَأَحْرَقَنِي ذَكَاؤُهَا، فَيَقُولُ هَلْ عَسِيْتَ إِنْ فُعِلَ ذَلِكَ بِكَ أَنْ تَسْأَلَ غَيْرَ ذَلِكَ فَيَقُولُ لاَ وَعِزَّتِكَ،
فَيُعْطِي اللهَ مَا يَشَاءُ مِنْ عَهْدٍ وَمِيثَاقٍ؛ فَيَصْرِفُ اللهُ وَجْهَهُ عَنِ النَّارِ فَإِذَا أَقْبَلَ بِهِ عَلَى الْجَنَّةِ رَأَى بَهْجَتَهَا، سَكَتَ مَا شَاءَ اللهُ أَنْ يَسْكُتَ، ثُمَّ قَالَ يَا رَبِّ قَدِّمْنِي عِنْدَ بَابِ الْجَنَّةِ، فَيَقُولُ اللهُ لَهُ، أَلَيْسَ قَدْ أَعْطَيْتَ العُهُودَ وَالْمَوَاثِيقَ أَنْ لاَ تَسْأَلَ غَيْرَ الَّذِي كُنْتَ سَأَلْتَ فَيَقُولُ يَا رَبِّ لاَ أَكُونَنَّ أَشْقَى خَلْقِكَ؛ فَيَقُولُ فَمَا عَسِيْتَ إِنْ أُعْطِيتَ ذَلِكَ أَنْ لاَ تَسْأَلَ غَيْرَهُ فَيَقُولُ لاَ وَعِزَّتِكَ لاَ أَسْأَلُ غَيْرَ ذَلِكَ؛ [ص:44] فَيعْطِي رَبَّهُ مَا شَاءَ مِنْ عَهْدٍ وَمِيثَاق، فَيُقَدِّمُهُ إِلَى بَابِ الْجَنَّةِ، فَإِذَا بَلَغَ بَابَهَا فَرَأَى زَهْرَتَهَا، وَمَا فِيهَا مَنَ النَّضْرَةِ والسُّرُورِ فَيَسْكُتُ مَا شَاءَ اللهُ أَنْ يَسْكُتَ، فَيقُولُ يَا رَبِّ أَدْخِلْنِي الْجَنَّةَ، فَيَقُولُ اللهُ: وَيْحَكَ يَا ابْنَ آدَمَ مَا أَغْدَرَكَ أَلَيْسَ قَدْ أَعْطَيْتَ الْعُهُودَ وَالْمَوَاثِيقَ أَنْ لاَ تَسْأَلَ غَيْرَ الَّذِي أُعْطِيتَ فَيَقُولُ يَا رَبِّ لاَ تَجْعَلْنِي أَشْقَى خَلْقِكَ، فَيَضْحَكُ اللهُ عَزَّ وَجَلَّ مِنْهُ، ثُمَّ يَأْذَنُ لَهُ فِي دُخُولِ الْجنَّةِ، فَيَقُولُ تَمَنَّ، فَيَتَمَنَّى، حَتَّى إِذَا انْقَطَعَتْ أُمْنِيَّتُهُ، قَالَ اللهُ عَزَّ وَجَلَّ: مِنْ كَذَا وَكَذَا أَقْبَلَ يُذَكِّرُهُ رَبُّهُ؛ حَتَّى إِذَا انْتَهَتْ بِهِ الأَمَانِيُّ قَالَ اللهُ تَعَالَى: لَكَ ذَلكَ وَمِثْلُهُ مَعَهُ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 129 باب فضل السجود
114. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- కొందరు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముందు ప్రళయ దినం గురించి ప్రస్తావిస్తూ “దైవప్రవక్తా! ప్రళయదినాన మనం మన ప్రభువును చూస్తామా?” అని అడిగారు. దానికి ఆయన “మబ్బు లేనప్పుడు సూర్యుడ్ని చూడటంలో మీకేమయినా అనుమానం కలుగుతుందా?” అని ఎదురు ప్రశ్న వేశారు. ప్రజలు లేదన్నారు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు :
“అదే విధంగా మీరు ప్రళయదినాన మీ ప్రభువును చూడగలుగుతారు. ప్రళయదినాన మానవులు పునర్జీవులయినప్పుడు అల్లాహ్ వారితో ‘ప్రపంచంలో ఉండగా ఎవరు ఏ శక్తిని ఆరాధిస్తూ ఉండేవారో, వారంతా తమ తమ ఆరాధ్యదైవాల వెనుక వెళ్ళి నిలబడండి’ అని ఆదేశిస్తాడు. దాంతో కొందరు సూర్యుని వెనుక, కొందరు చంద్రుని వెనుక, మరి కొందరు విగ్రహాల వెనుక వెళ్ళి నిలబడతారు. చివర్లో ఈ అనుచర సమాజం (ముస్లిం సమాజం) మిగిలి ఉంటుంది. ఇందులో కపట విశ్వాసులు కూడా ఉంటారు.
ఆ తరువాత అల్లాహ్ వారి దగ్గరకు వచ్చి నేను మీ ప్రభువును అంటాడు. కాని వారు (ఆయన్ని గుర్తుపట్టలేరు. అందువల్ల) ‘మా ప్రభువు మా దగ్గరకు రానంతవరకు మేము ఇక్కడే నిల్చుంటాము. మా ప్రభువు వచ్చిన తరువాత మేము ఆయన్ని గుర్తిస్తాము’ అని అంటారు. ఆ తరువాత అల్లాహ్ (ముస్లింలకు పరిచయమైన రూపంలో) వారి ముందుకు వచ్చి, నేను మీ ప్రభువును అంటాడు. అప్పుడు వారు ఆ విషయాన్ని అంగీకరిస్తూ , ‘ఔను, నీవే మా ప్రభువు’ అనంటారు.
“ఆ తరువాత నరకం మీద ఒక వారధి నిర్మించబడుతుంది. ఆ వారధి పై నుంచి అందరూ నడవాల్సిందిగా చెప్పడం జరుగుతుంది. దైవ ప్రవక్తలందరిలోకెల్లా నేనే మొట్టమొదట నా అనుచర సమాజాన్ని వెంట బెట్టుకొని ఆ వారధి దాటుతాను. ఆ రోజు దైవప్రవక్తలు తప్ప మరెవరూ మాట్లాడలేరు. దైవప్రవక్తలయినా ‘అల్లాహ్! కాపాడు. (మమ్మల్ని నరకాగ్ని నుండి) కాపాడు’ అని మాత్రమే అంటారు. నరకంలో సాదాన్ (చెట్టు) ముండ్లులాంటి మొనదేలిన కొక్కెలు ఉంటాయి. మీరు సాదాన్ ముండ్లు చూశారా ఎప్పుడైనా?” దీనికి ప్రవక్త అనుచరులు ‘చూశాం’ అన్నారు.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తిరిగి ఇలా చెప్పడం ప్రారంభించారు: “ఆ కొక్కెలు కూడా అచ్చం సాదాన్ (చెట్టు) ముండ్లులాగే ఉంటాయి. అయితే ఇవి చాలా పెద్దవిగా ఉంటాయి. వాటిని గురించి అల్లాహ్ కి తప్ప మరెవరికీ తెలియదు. అవి మానవుల్ని వారి వారి దుష్కర్మలను బట్టి గుచ్చి లాక్కుంటాయి. అలా నరక వారధి దాటే వారిలో కొందరు తమ దుష్కర్మలను బట్టి (కొక్కెలకు తగిలి నరకంలో పడిపోయి) హతమవుతారు. మరి కొందరు నుజ్జునుజ్జు అయిపోతారు. అయితే ఆ తరువాత విముక్తి పొందుతారు. (కర్మ విచారణ, వారధి దాటివేత మొదలైన పనులన్నీ ముగిసిన) తరువాత అల్లాహ్ తన దూతలను పిలిచి, అల్లాహ్ ను ఆరాధించిన వారందర్నీ నరకం నుండి బయటికి తీయండని ఆజ్ఞాపిస్తాడు.
“అప్పుడు దైవదూతలు నరకంలో పడ్డ వారిలో సజ్దా (సాష్టాంగ ప్రణామం) చిహ్నాలు ఉన్న వారిని గుర్తిస్తారు. సజ్దా చిహ్నం ఉండే శరీర భాగాన్ని కాల్చకూడదని అల్లాహ్ నరకాగ్నిని నిషేధించాడు. అది తప్ప మానవుని మిగిలిన దేహమంతటినీ నరకాగ్ని దహించి వేస్తుంది. ఈ కారణంగానే దైవదూతలు (ఏకదైవారాధకులయిన) వారిని ఆ చిహ్నాల ద్వారా గుర్తించి నరకాగ్ని నుండి బయటికి తీస్తారు. అప్పటికే ఆ నరకాగ్ని బాధితులు బాగా కాలిపోయి బొగ్గుగా మారిపోతారు. నరకం నుండి బయటికి తీసిన తరువాత వారి మీద అమృతం చిలికించబడుతుంది. దాంతో వారు వరదకు కొట్టుకు వచ్చిన మట్టి నుండి మొలకెత్తిన విత్తనంలా మొలకెత్తుతారు.
“దాసుల కర్మ విచారణ పూర్తిగా ముగిసిన తరువాత చివర్లో ఒక మనిషి మిగిలిపోతాడు. ఇతను స్వర్గప్రవేశం చేసే వారిలో చివరి వాడవుతాడు. అయితే అతను నరకం నుండి బయట పడినప్పటికీ అతని ముఖం మాత్రం నరకం వైపే తిరిగి ఉంటుంది. అప్పుడా వ్యక్తి అల్లాహ్ ను వేడుకుంటూ “ప్రభూ! నరకం నుండి వస్తున్న దుర్వాసనతో నేను చచ్చిపోతున్నాను. దాని (సుదీర్ఘ) జ్వాలలు నన్ను మాడ్చివేస్తున్నాయి. నా ముఖాన్ని నరకం వైపు నుండి వేరే వైపుకు తిప్పి వేయి” అని అంటాడు.
దానికి అల్లాహ్ “నీ ఈ విన్నపాన్ని మన్నిస్తే ఆ తరువాత నీవు మరొక విన్నపం చేయకుండా ఉంటావని నమ్మకం ఏమిటి?” అని అంటాడు.
“చేయను. నీ గౌరవ ప్రతిష్ఠల సాక్ష్యంగా చెబుతున్నాను. (ఈ కోరిక మన్నిస్తే) ఇక నేను మరే కోరికా కోరను” అంటాడు ఆ వ్యక్తి. ఈ సందర్భంగా అతను అనేక విధాల ప్రమాణాలు చేస్తాడు. అప్పుడు అల్లాహ్ అతని ముఖాన్ని నరకాగ్ని నుండి స్వర్గం వైపుకు తిప్పుతాడు.దాంతో ఆ మనిషి స్వర్గంలోని సుందర దృశ్యాలు, భోగభాగ్యాలను (ఆశ్చర్యచకితుడయి) చూస్తూ ఉంటాడు. అల్లాహ్ తలచినంత సేపు (అలా చేస్తూ) మౌనంగా ఉంటాడు. ఆ తరువాత “ప్రభూ! నన్ను స్వర్గద్వారం దగ్గరకు చేర్చు” అంటాడతను. “ఏమిటీ, నీవు మొదట ఒక కోరిక కోరుకుంటున్నప్పుడు ఆ తరువాత మరొక కోరిక కోరనని ప్రమాణం చేసి చెప్పలేదా?” అని అల్లాహ్ అడుగుతాడు. “ప్రభూ! (నన్ను కరుణించు) నీవు సృష్టించిన యావజ్జీవ కోటిలో నేను అత్యంత దౌర్భాగ్యుడిగా ఉండాలనుకోవడం లేదు” అంటాడా దాసుడు.
“సరే ఈ కోరిక మన్నిస్తే, ఆ తరువాత నీవు మరో కోరిక కోరవని నమ్మకం ఏమిటి?” అడుగుతాడు అల్లాహ్. “కోరను ప్రభూ! నీ గౌరవ ప్రతిష్ఠల సాక్ష్యంగా చెబుతున్నాను. ఇక ముందు మరెలాంటి కోరికా కోరను,” అంటాడా వ్యక్తి. ఆ సందర్భంలో కూడా అతను అల్లాహ్ ముందు చేయవలసిన ప్రమాణాలన్నీ చేస్తాడు.
అప్పుడు అల్లాహ్ అతడ్ని స్వర్గద్వారం దగ్గరకు చేర్చుతాడు. అతను స్వర్గద్వారం దగ్గరకు చేరుకొని స్వర్గం లోపలి అసామాన్య అందచందాలు, అపార సౌఖ్యాలను (సంభ్రమాశ్చర్యాలతో) చూస్తూ ఉంటాడు. అల్లాహ్ తలచినంత సేపు ఆ వ్యక్తి వాటిని (గుటకలు వేస్తూ) మౌనంగా చూస్తాడు. ఆ తరువాత (ఇక ఉండబట్టలేక) “ప్రభూ! నన్ను కూడా స్వర్గం లోపలికి పంపించు” అని అంటాడు.
“ఆదం కుమారా, నీ వైఖరి చాలా విచిత్రంగా ఉంది! చేసిన వాగ్దానాన్ని ఎంత ఘోరంగా భంగపరుస్తున్నావు!! నీకివ్వబడినది తప్ప మరేమీ కోరనని నీవు ప్రమాణం చేసి మరీ వాగ్దానం చేయలేదా?” అని అడుగుతాడు అల్లాహ్. “చేశాను ప్రభూ! కాని నీ సృష్టిరాసుల్లో కెల్లా నన్ను పరమ దౌర్భాగ్యుడిగా ఉండనివ్వకు స్వామీ!” అంటూ మొర పెట్టుకుంటాడు ఆ వ్యక్తి.
ఈ మాటలు విని అల్లాహ్ నవ్వుతాడు. తరువాత అతడ్ని (కనికరించి) స్వర్గంలో ప్రవేశించడాన్ని అనుమతిస్తాడు. ఆ తరువాత “నీకు ఇంకేమేమి కావాలో కోరుకో” అని అంటాడు. దాంతో ఆ దాసుడు తన కోరికల్ని వెలిబుచ్చుతాడు. అవన్నీ తీరుతాయి. అప్పుడు అల్లాహ్ మరిన్ని కోరికలు గుర్తు చేస్తూ ఇది కోరుకో, అది కోరుకో అనంటాడు. వాటిని కూడా అతను కోరుకుంటాడు. ఇలా అతను అన్నిటినీ కోరిన తరువాత “వాటన్నిటినీ ఇచ్చి వేస్తున్నాను. అంతేకాదు, నీవు కోరిన వాటికి రెట్టింపు ఇస్తున్నాను, వాటిని కూడా తీసుకో” అని అంటాడు అల్లాహ్”.
[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 129వ అధ్యాయం – ఫజ్లిస్సు జూద్]
115 – حديث أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ قَالَ قُلْنَا يَا رَسُولَ اللهِ هَلْ نَرَى رَبَّنَا يَوْمَ الْقِيَامَةِ قَالَ: هَلْ تُضَارُونَ فِي رُؤْيَةِ الشَّمْسِ وَالْقَمَرِ إِذَا كَانَتْ صَحْوًا قُلْنَا لاَ قَالَ: فَإَنَّكُمْ لاَ تُضَارُونَ فِي رُؤْيَةِ رَبِّكُمْ يَوْمَئِذٍ إِلاَّ كَمَا تُضَارُونَ فِي رُؤْيَتِهِمَا ثُمَّ قَالَ: يُنَادِي مُنَادٍ: لِيَذْهَبْ كُلُّ قَوْمٍ إِلَى مَا كَانُوا يَعْبُدُونَ، فَيَذْهَبُ أَصْحَابُ الصَّلِيبِ مَعَ صَلِيبِهِمْ، وَأَصْحَابُ الأَوْثَانِ مَعَ أَوْثَانِهِمْ، وَأَصْحَابُ كُلِّ آلِهَةٍ مَعَ آلِهَتِهِمْ، حَتَّى يَبْقَى مَنْ كَانَ يَعْبُدُ اللهَ مِنْ بَرٍّ أَوْ فَاجِرٍ، وغُبَّرَاتٌ مِنْ أَهْلِ الْكِتَابِ، ثُمَّ يُؤْتَى بِجَهَنَّمَ تُعْرَضُ كَأَنَّهَا سَرَابٌ، فَيُقَالُ لِلْيَهُودِ: مَا كُنْتُمْ تَعْبُدُونَ قَالُوا كُنَّا نَعْبُدُ عُزَيْرَ ابْنَ اللهِ، فَقَالَ كَذَبْتُمْ، لَمْ يَكُنْ للهِ صَاحِبَةٌ وَلاَ وَلَدٌ، فَمَا تُرِيدُون [ص:45] قَالُوا نُرِيدُ أَنْ تَسْقِيَنَا، فَيُقَالُ اشْرَبُوا، فَيَتَسَاقَطُونَ فِي جَهَنَّمَ ثُمَّ يُقَالُ لِلنَّصَارَى مَا كُنْتُمْ تَعْبُدُونَ فَيَقُولونَ كُنَّا نَعْبُدُ الْمَسِيحَ ابْنَ اللهِ، فَيُقَال كَذَبْتُمْ لَمْ يَكُنْ للهِ صَاحِبَةٌ وَلاَ وَلَدٌ، فَمَا تُرِيدُونَ فَيَقُولُونَ نُرِيدُ أَنْ تَسْقِيَنَا، فَيُقَالُ اشْرَبُوا، فَيَتَسَاقَطُونَ فِي جَهَنَّمَ حَتَّى يَبْقَى مَنْ كَانَ يَعْبُدُ اللهَ مِنْ بَرٍّ أَوْ فَاجِرٍ، فَيُقَالُ لَهُمْ مَا يَحْبِسُكمْ وَقَدْ ذَهَبَ النَّاس فَيَقولُونَ فَارَقْنَاهُمْ وَنَحْنُ أَحْوَجُ مِنَّا إِلَيْهِ الْيَوْمَ، وَإِنَّا سَمِعْنَا مُنَادِيًا يُنَادِي: لِيَلْحَقْ كلُّ قَوْمٍ بِمَا كَانُوا يَعْبُدُونَ وَإِنَّمَا نَنْتَظِرُ رَبَّنَا؛ قَالَ فَيَأْتِيهِمُ الْجَبَّارُ، فِي صُورَةٍ غَيْرَ صُورَتِهِ
الَّتِي رَأَوْهُ فِيهَا أَوَّلَ مَرَّةٍ؛ فَيَقُولُ أَنَا رَبُّكُمْ، فَيَقُولُون أَنْتَ رَبُّنَا فَلاَ يُكَلِّمُهُ إِلاَّ الأَنْبِيَاءُ، فَيَقُولُ هَلْ بَيْنَكُمْ وَبَيْنَه آيةٌ تَعْرِفُونَهُ فَيَقُولُونَ السَّاقُ؛ فيَكْشِفُ عَنْ سَاقِهِ، فَيَسْجُدُ لَهُ كُلُّ مُؤْمِنٍ، وَيَبْقَى مَنْ كَانَ يَسْجُدُ للهِ رِيَاءً وَسُمْعَةً؛ فَيَذْهَبُ كَيْما يَسْجُدَ فَيَعُودُ ظَهْرُهُ طَبَقًا وِاحِدًا، ثُمَّ يُؤْتَى بِالْجِسْمِ فَيُجْعَلُ بَيْنَ ظَهْرَيْ جَهَنَّمَ قُلْنَا يَا رَسُولَ اللهِ وَمَا الْجِسْرُ قَالَ مَدْحَضَةٌ مَزِلَّةٌ عَلَيْهِ خَطَاطِيفُ وَكَلاَلِيبُ، وَحَسَكَةٌ مُفَلْطَحَةٌ لَهَا شَوْكَةٌ عُقَيْفَاءُ تَكُونُ بِنَجْدٍ يُقَالُ لَهَا السَّعْدَانُ الْمُؤْمِنُ عَلَيْهَا كَالطَّرْفِ وَكَالْبَرْقِ وكَالرِّيحِ، وَكَأَجَاوِيدَ الْخَيْلِ وَالرِّكَابِ، فَنَاجٍ مُسَلَّمٌ، وَنَاجٍ مَخْدُوشٌ، وَمَكْدُوسٌ فِي نَارِ جَهَنَّمَ، حَتَّى يَمُرَّ آخِرُهُمْ يُسْحَبُ سَحْبًا فَمَا أَنْتُمْ بَأَشَدَّ لِي مُنَاشَدَةً فِي الْحَقِّ قَدْ تَبَيَّنَ لَكُمْ مِنَ الْمؤْمِنِ يَوْمَئِذٍ لِلْجَبَّارِ فَإِذَا رَأَوْا أَنَهُمْ قَدْ نَجَوْا وَبَقِيَ إِخْوَانُهُمْ، يَقُولُونَ رَبَّنَا إِخْوَانُنَا كَانُوا يُصَلُّونَ مَعَنَا وَيَصُومُونَ مَعَنَا وَيَعْمَلُونَ مَعَنَا؛ فَيَقُولُ اللهُ تَعَالَى اذْهَبُوا فَمَنْ وَجَدْتُمْ [ص:46] فِي قَلْبِهِ مِثْقَالَ دِينَارٍ مِنْ إِيمَانٍ فَأَخْرِجُوهُ، وَيُحَرِّمُ اللهُ صُوَرَهمْ عَلَى النَّارِ، فَيَأْتُونَهُمْ وَبَعْضُهُمْ قَدْ غَابَ فِي النَّارِ إِلَى قَدَمِهِ وَإِلَى أَنْصَافِ سَاقَيْهِ، فَيُخْرِجُونَ مَنْ عَرَفوا ثُمَّ يَعُودُونَ فَيَقُولُ اذْهَبُوا فَمَنْ وَجَدْتُم فِي قَلْبِهِ مِثْقَالَ نِصْفِ دِينَارٍ فَأَخْرِجُوهُ؛ فَيُخْرِجُونَ مَنْ عَرَفُوا ثُمَّ يَعُودُونَ فَيَقُولُ اذْهَبُوا
فَمَنْ وَجَدْتُمْ فِي قَلْبِهِ مِثْقَالَ ذَرَّةٍ مِنْ إِيمَانٍ فَأَخْرِجُوهُ؛ فَيُخْرِجُونَ مَنْ عَرَفُوا
قَالَ أَبُو سَعِيدٍ: فَإِنْ لَمْ تُصَدِّقُونِي فَاقْرَءُوا (إِنَّ اللهَ لاَ يَظْلِمُ مِثْقَالَ ذَرَّةٍ وَإِنْ تَكُ حَسَنَةً يُضَاعِفْهَا) فَيَشْفَعُ النَّبِيُونَ وَالْمَلاَئِكَةُ وَالْمُؤْمِنُونَ فَيَقُولُ الْجَبَّارُ بَقِيَتْ شَفَاعَتِي، فَيَقْبِضُ قَبْضَةً مِنَ النَّارِ فَيُخْرِجُ أَقْوَامًا قَدِ امْتُحِشُوا، فَيُلْقَوْنَ فِي نَهَرٍ بِأَفْوَاهِ الْجَنَّةِ يُقَالُ لَهُ مَاءُ الْحَيَاةِ، فَيَنْبُتُونَ فِي حَافَتَيهِ كَمَا تَنْبُتُ الْحِبَّةُ فِي حَمِيلِ السَّيْلِ قَدْ رَأَيْتُمُوهَا إِلَى جَانِبِ الصَّخْرَةِ إِلَى جَانِبِ الشَّجَرَةِ، فَمَا كَانَ إِلَى الشَّمْسِ مِنْهَا كَانَ أَخْضَرَ، وَمَا كَان مِنْهًا إِلَى الظِّلِّ كَانَ أَبْيَضَ فَيَخْرُجُونَ كَأَنَّهُمُ اللُّؤْلُؤُ، فَيُجْعَلُ فِي رِقَابِهِمِ الْخَوَاتِيمُ فَيَدْخُلُونَ الْجَنَّةَ، فَيَقُولُ أَهْلُ الْجَنَّةِ هؤُلاَءِ عُتَقَاءُ الرَّحْمنِ أَدْخَلَهُمُ الْجَنَّةَ بَغَيْرِ عَمَلٍ عَمِلُوهُ، وَلاَ خَيْرٍ قَدَّمُوهُ، فَيُقَالُ لَهُمْ لَكُمْ مَا رَأَيْتُمْ وَمِثْلُهُ مَعَهُ
[ص:47] أخرجه البخاري في: 97 كتاب التوحيد: 24 باب قول الله تعالى: (وجوه يومئذ ناضرة إلى ربها ناظرة)
115. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం:- “దైవప్రవక్తా! ప్రళయదినాన మేము మా ప్రభువును చూడగలమా?” అని అడిగాము మేము. “ఆకాశం మేఘావృతం కాకుండా నిర్మలంగా ఉన్నప్పుడు సూర్యుడ్ని, చంద్రుడ్ని చూడటంలో మీకేమయినా ఇబ్బంది కలుగుతుందా?” అని ఎదురు ప్రశ్న వేశారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). మేము, కలగదని చెప్పాము. “అదే విధంగా మీరు ప్రళయదినాన మీ ప్రభువును దర్శించుకోవడంలో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇబ్బంది ఏదైనా ఉంటే ఈనాడు సూర్యచంద్రుల్ని చూడటంలో ఎంత ఇబ్బంది ఉంటుందో ఆ రోజు అంతే ఇబ్బంది ఉంటుంది” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).
ఆ తరువాత ఆయన ఇలా తెలియజేశారు : ప్రళయదినాన ఒక ప్రకటనకర్త వచ్చి, “ఏ వర్గం వారు ఏ శక్తిని ఆరాధిస్తూ ఉండేవారో వారంతా ఆ ఆరాధ్యశక్తి వెనుక నిలబడండి” అని ప్రకటిస్తాడు. అప్పుడు సిలువను పూజించే వారు సిలువ వెనుక, విగ్రహాలను పూజించేవారు విగ్రహాల వెనుక నిలబడతారు. ఇలా మిధ్యాదైవాలను పూజించే వారంతా తమ తమ మిథ్యాదైవాల దగ్గరికెళ్ళి నిల్చుంటారు. చివర్లో సదాచారులైనా, దురాచారులైనా అల్లాహ్ ను ఆరాధించేవారు మైదానంలో మిగిలిపోతారు. అలాగే గ్రంథప్రజలలో కూడా (ఏకదైవారాధకులైన వారు) కొందరు మిగిలిపోతారు.
ఆ తరువాత మానవుల ముందుకు నరకం తీసుకు రాబడుతుంది. అది వారికి (దూరం నుంచి) ఎండమావిలా కన్పిస్తుంది. ఆ తరువాత (దైవదూతలు) యూదుల్ని నిలదీసి “మీరు ఎవరిని ఆరాధిస్తూ ఉండేవారు?” అని అడుగుతారు. “మేము హజ్రత్ ఉజైర్ (అలైహిస్సలాం)ని అల్లాహ్ కుమారుడిగా విశ్వసిస్తూ ఆయన్నే ఆరాధిస్తూ ఉండేవాళ్ళము” అని సమాధానమిస్తారు యూదులు. “మీరు అసత్యం పలికారు. అల్లాహ్ కి భార్యా పిల్లలే లేరు” అని వారికి చెప్పబడుతుంది. ఆ తరువాత “సరే ఇప్పుడు మీరేం కోరుతున్నారు?” అని ప్రశ్నిస్తారు (దైవదూతలు). దానికి వారు “త్రాగడానికి నీళ్ళివ్వండ”ని అంటారు. “ఇవిగో త్రాగండి” అని సమాధానం వస్తుంది. ఆ వెనువెంటనే వారు నరకంలో పడిపోతారు.
ఆ తరువాత క్రైస్తవుల్ని నిలదీసి “మీరు ఎవరిని ఆరాధిస్తూ ఉండేవారు?” అని ప్రశ్నిస్తారు (దైవదూతలు). “మేము హజ్రత్ మసీహ్ (అలైహిస్సలాం)ను అల్లాహ్ కుమారుడిగా విశ్వసిస్తూ ఆయన్నే ఆరాధిస్తూ ఉండేవారము” అని సమాధానమిస్తారు క్రైస్తవులు. “మీరు అసత్యం పలికారు. అల్లాహ్ కి భార్యాలేదు, పిల్లలు లేరు” అని చెప్పబడుతుంది. ఆ తరువాత “సరే, ఇప్పుడు మీరేం కోరు తున్నారు?” అని ప్రశ్నిస్తారు (దైవదూతలు). దానికి వారు “మాకు త్రాగడానికి నీళ్ళివ్వండి” అంటారు. “ఇవిగో త్రాగండి” అని సమాధానం వస్తుంది. ఆ వెనువెంటనే వారు నరకంలో పడిపోతారు.
ఆ తరువాత అల్లాహ్ ను ఆరాధిస్తూ ఉండేవారు రంగంలో మిగిలిపోతారు. వారిలో సజ్జనులూ ఉన్నారు, దుర్జనులూ ఉన్నారు. (వారి దగ్గరకు దైవదూతలు వచ్చి) “అందరూ వెళ్ళిపోయారు కదా! మిమ్మల్ని ఏ విషయం ఇక్కడ నిలిపి ఉంచింది?” అని అడుగుతారు. దానికి వారు ఇలా అంటారు – మాకు వారి అవసరం ఎంతో ఉన్నప్పటికీ, మేము (సత్యం కోసం ప్రపంచంలోనే) వారి నుండి ఆనాడే వేరయిపోయాము. అదీగాక, ప్రతి వర్గమూ తాను ఆరాధిస్తూ ఉండిన దైవం దగ్గరికి వెళ్ళి నిలబడాలని ఒక ప్రకటన కర్త చేసిన ప్రకటన విన్నాము. అందువల్ల మేము ఇక్కడే ఉండి మా ప్రభువు రాకకోసం ఎదురు చూస్తున్నాము.”
అప్పుడు అల్లాహ్ వారు ఇది వరకు చూసిన రూపానికి భిన్నంగా మరో రూపంలో ప్రత్యక్షమయి “నేనే మీ ప్రభువుని” అంటాడు. దానికి వారు “నీవా మా ప్రభువు!” అంటారు (ఆశ్చర్యపోతూ). ఆ రోజు విశ్వప్రభువు ముందు దైవప్రవక్తలు తప్ప ఎవరూ పెదవి విప్పలేరు. (పరిస్థితి చాలా భయానకంగా ఉంటుంది). అల్లాహ్ వారిని తిరిగి ప్రశ్నిస్తూ, “మీరు మీ ప్రభువును గుర్తించడానికి ఆయన తరఫున మీ దగ్గర ఏదైనా ఆధారం ఉందా?” అని అడుగుతాడు. “మాకు మోకాలు దర్శనం గుర్తుగా నిర్ణయించబడింది” అని అంటారు వారు. అప్పుడు అల్లాహ్ తన మోకాలును ప్రత్యక్షపరుస్తాడు. దాన్ని చూడగానే విశ్వాసులంతా ఒక్కసారిగా సాష్టాంగ ప్రణామం చేస్తారు.
అయితే వారిలో పేరు ప్రతిష్ఠల కోసం అల్లాహ్ ను ప్రార్థిస్తూ ఆయన ముందు సాష్టాంగ ప్రణామం చేస్తూ ఉండేవారు మాత్రం ఆ రోజు సాష్టాంగ ప్రణామం చేయకుండా నిలబడి ఉంటారు. వారు సాష్టాంగ ప్రణామం చేయడానికి ప్రయత్నిస్తారు కాని, వారి నడుములు బల్లపరుపులా బిగుసుకుపోయి ఏ మాత్రం వంగవు. ఆ తరువాత నరకం మీద ఒక వారధి నిర్మిం చబడుతుంది.
ప్రవక్త అనుచరులు (రదియల్లాహు అన్హు) వారధి ప్రస్తావన వినగానే “దైవ ప్రవక్తా! ఈ వారధి సంగతేమిటి?” అని అడిగారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తిరిగి ఇలా చెప్పడం ప్రారంభించారు.
అదొక (భయంకరమైన) జారుడు చోటు. దాని మీద నుంటి దాటిపోయే వారు (కొందరు) జారిపడతారు, (మరికొందరు) నిలదొక్కుకుంటారు. దాటే వారిని లాగి పడేయడానికి దాని మీద మొనదేలిన కొండీలు వంటి పెద్ద పెద్ద ముండ్లు లేచి ఉంటాయి. ఇవి నజద్ ప్రాంతంలో ఉండే సాదాన్ చెట్ల ముండ్లులా చాలా పొడవుగా, లావుగా ఉంటాయి. విశ్వాసులు (వారి వారి కర్మలను బట్టి) ఆ వారధి మీద నుంచి రెప్పపాటులో మెరుపు వేగంతో, తుఫాను వేగంతో వేగంగా పరుగెత్తే గుర్రాల్లా, (ఇతర) వాహనాల్లా దాటిపోతారు. అలా దాటే వారిలో కొందరు ఎలాంటి ప్రమాదం లేకుండా క్షేమంగా బయటపడతారు; మరికొందరు . తీవ్రంగా గాయపడి (రక్తసిక్తమయి) నరకాగ్నిలో పడిపోతారు. అందరికంటే చివర్లో ఉండేవారు పడుతూ లేస్తూ పడతారు.
ఆ రోజు విశ్వాసులు తాము బయట పడినప్పటికీ, నరకంలో పడిపోయిన తమ సోదర విశ్వాసుల్ని కాపాడేందుకు అల్లాహ్ ను పరిపరి విధాలా ప్రార్థిస్తారు. ఈ రోజు మీరు స్పష్టంగా తేలిన ఒక హక్కు గురించి నన్ను ఎంత గట్టిగా అడుగుతారో, ఆ రోజు వారు తమ సోదరుల్ని కాపాడుకోవడానికి అంతకంటే గట్టిగా అల్లాహ్ ను అడుగుతారు. వారు దైవసన్నిధిలో తమ కోరికను వెలిబుచ్చుతూ “ప్రభూ! మా ఈ సోదరులు మాతో పాటు నమాజు చేస్తుండేవారు; ఉపవాసాలు పాటిస్తూ ఉండేవారు; ఇతర సత్కార్యాలు కూడా చేస్తూ ఉండేవారు. అలాంటి వీరు నరకంలో ఎలా పడ్డారో మాకు అర్థం కావడం లేదు. (ప్రభూ!) వీరిని క్షమించు” అని ప్రార్థిస్తారు.
అల్లాహ్ వారి మొర ఆలకించి “సరే వెళ్ళండి. హృదయంలో ఒక్క దీనారు విలువంత విశ్వాసం ఉన్న వారిని సయితం నరకాగ్ని నుండి బయటకు తీసుకోండి” అని అంటాడు. అప్పుడు వారు నరకంలో ఉన్న తమ సోదర విశ్వాసుల దగ్గరకు వెళ్తారు. అప్పుడు వారిలో కొందరు పాదాల వరకు, మరికొందరు మోకాళ్ళ వరకు అగ్నిలో చిక్కుకొని ఉంటారు. అయితే అగ్ని వారి ముఖాలను మాడ్చి వికృతంగా చేయకుండా అల్లాహ్ దాన్ని నిషేధిస్తాడు. దాంతో ఈ విశ్వాసులు తాము గుర్తించిన వారందర్నీ నరకం నుండి బయటికి తీస్తారు.
ఆ తరువాత అల్లాహ్ సన్నిధికి వచ్చి మళ్ళీ విన్నవించుకుంటారు. అప్పుడు అల్లాహ్ “సరే వెళ్ళండి. హృదయంలో అర్ధ దీనారంత విలువగల విశ్వాసమున్న వారిని కూడా నరకం నుండి తీసేసుకోండి” అని అంటాడు. వారు నరకానికి వెళ్ళి తాము గుర్తించగలిగిన వారందర్నీ నరకం నుండి వెలుపలకు తీస్తారు. అలా తీసిన తరువాత అల్లాహ్ సన్నిధికి వచ్చి మళ్ళీ విన్నవించుకుంటారు. “సరే వెళ్ళండి. హృదయంలో అణుమాత్రం విశ్వాసం (ఈమాన్) ఉన్న వారిని కూడా నరకం నుండి తీసేసుకోండి” అని అంటాడు అల్లాహ్. వారు మూడవసారి వెళ్ళి తాము గుర్తించగలిగిన వారందర్నీ నరకం నుండి తీసి రక్షిస్తారు.
హజ్రత్ అబూ సయీద్ (రదియల్లాహు అన్హు) ఈ సందర్భంగా మాట్లాడుతూ “నా మాటల మీద మీకు నమ్మకం లేకపోతే అల్లాహ్ ఎవరికీ అణుమాత్రం అన్యాయం కూడా చేయడు. ఎవరైనా ఒక పుణ్యకార్యం చేస్తే అల్లాహ్ దానికి రెట్టింపు పుణ్యఫలం ప్రసాదిస్తాడు (4:40) అనే ఖుర్ఆన్ సూక్తి చదువుకోండి” అని అన్నారు. ఈ విధంగా (నరకంలోని ముస్లింలను రక్షించడానికి) దైవప్రవక్తలు, దైవదూతలు, విశ్వాసులు అంతా సిఫారసు చేసిన తరువాత చివర్లో అల్లాహ్ ముందుకు వచ్చి “ఇక నా సిఫారసు మిగిలి ఉంది” అని అంటాడు. ఆ తరువాత ఆయన నరకం నుండి ఓ గుప్పెడు మందిని బయటికి తీస్తాడు. వారు అప్పటికే బాగా కాలిపోయి బొగ్గుగా మారిపోతారు. (దైవదూతలు) వారిని తీసి స్వర్గం అంచున ఉండే ఒక సెలయేరులో పడవేస్తారు. అందులోని నీటిని ‘జీవజలం’ అంటారు. ఆ సెలయేరులో పడగానే, నదిఒడ్డు మీద విత్తనాలు మొలకెత్తి సస్యశ్యామలమైనట్లు వారు నూతనశక్తి సౌందర్యాలతో నవనవలాడుతూ లేస్తారు.
మీరు అనేకసార్లు చెట్ల ప్రక్కనో, రాళ్ళ ప్రక్కనో విత్తనాలు మొలకెత్తడాన్ని చూసే ఉంటారు. అలా మొలకెత్తే మొక్కల్లో ఎండ తగిలే మొక్కలు పచ్చగా ఉంటాయి. ఎండ తగలకుండా నీడ పడే మొక్కలు పాలిపోతాయి. వారు సెలయేరు నుండి ముత్యాల్లా మెరిసిపోతూ బయటికి వస్తారు. కాకపోతే వారి మెడల మీద ఒక మచ్చ ఉండిపోతుంది. ఆ తరువాత వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. అప్పుడు స్వర్గవాసులు వారిని చూసి, “వీరు ఎలాంటి పుణ్యకార్యాలు చేయకపోయినా అల్లాహ్ వీరికి (నరకం నుండి) విముక్తి కలిగించాడు” అని అంటారు. అల్లాహ్ అలా స్వర్గంలో ప్రవేశించిన వారిని ఉద్దేశించి “మీరిక్కడ చూస్తున్న (స్వర్గసంప)దంతా మీదే; అంతేకాదు ఇంకా అంత (సంపద) కూడా అదనంగా మీకు లభిస్తుంది” అని అంటాడు.
(సహీహ్ బుఖారీ : 97వ ప్రకరణం – తౌహీద్, 24వ అధ్యాయం – ఖౌలిల్లాహు…. ఉజూహువ్యోమయిజిన్నాసిరా….]
80వ అధ్యాయం – ఏక దైవారాధకుల నరక విమోచనకై సిఫారసు
إِثبات الشفاعة وإِخراج الموحدين من النار
116 – حديث أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رضي الله عنه عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: يَدْخُلُ أَهْلُ الْجَنَّةِ الْجَنَّةَ، وَأَهْلُ النَّارِ النَّارَ ثُمَّ يَقُولُ اللهُ تَعَالَى: أَخْرِجُوا مَنْ كَانَ فِي قَلْبِهِ مِثْقَالُ حَبَّةٍ مِنْ خَرْدَلٍ مِنْ إِيمَانِ، فَيُخْرَجُونَ مِنْهَا قَدِ اسْوَدُّوا، فَيُلْقَونَ فِي نَهَرِ الْحَيَا أَوِ الْحَيَاةِ (شَكٌّ من أَحد رجال السَّنَد) فَيَنْبُتُونَ كَمَا تَنْبُتُ الْحِبَّةُ فِي جَانِبِ السَّيْلِ، أَلَمْ تَرَأَنَّهَا تَخْرُجُ صَفْرَاءَ مُلْتَوِيَةً أخرجه البخاري في 2 كتاب الإيمان: 15 باب تفاضل أهل الإيمان في الأعمال
116. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు – (పరలోకంలో కర్మల విచారణ ముగిసిన తరువాత) స్వర్గవాసులు స్వర్గంలో, నరకవాసులు నరకంలో ప్రవేశిస్తారు. ఆ తరువాత “హృదయంలో ఆవగింజంత విశ్వాసం ఉన్న వారిని (సయితం) నరకం నుండి బయట తీయండి” అని అల్లాహ్ ఆజ్ఞాపిస్తాడు. ఈ ఆజ్ఞతో (చాలామంది) మానవులు నరకం నుండి బయటపడతారు. వారిలో కొందరు (బాగా కాలిపోయి బొగ్గులా) నల్లగా మారిపోతారు. అలాంటి వారిని వర్షనది లేక ‘జీవనది’లో పడవేస్తారు. దాంతో వారు యేటి ఒడ్డున ధాన్యపు విత్తనం మొలకెత్తినట్లు మొలకెత్తుతారు. ఆ మొక్క పసిమి వన్నెతో ఎంత అందంగా ముస్తాబయి మొలకెత్తుతుందో మీరు చూడలేదా?
[సహీహ్ బుఖారీ :2వ ప్రకరణం – ఈమాన్, 15వ అధ్యాయం – తఫాజులి అహ్లిల్ ఈమాని ఫిల్ ఆమాల్)
81వ అధ్యాయం -నరకం నుండి బయటపడే చివరి మనిషి
آخر أهل النار خروجا
117 – حديثُ عَبْدِ اللهِ بْنِ مَسْعُودٍ رضي الله عنه قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِنِّي لأَعْلَمُ آخِرَ أَهْلِ النَّارِ خُرُوجًا مِنْهَا، وَآخِرَ أَهْلِ الْجَنَّةِ دُخُولاً رَجُلٌ يَخْرُجُ مِنَ النَّارِ كَبْوًا فَيَقُولُ اللهُ اذْهَبْ فَادْخُلِ الْجَنَّةَ، فَيَأْتِيهَا فَيُخَيَّلُ إِلَيْهِ أَنَّهَا مَلأَى، فَيَرْجِعُ فَيَقُولُ يَا رَبِّ وَجَدْتُهَا مَلأَى، فَيَقُولُ اذْهَب فَادْخُلِ الْجَنَّةَ فَيَأْتِيَها فَيُخَيَّلُ إِلَيْهِ أَنَّهَا مَلأَى، فَيَرْجِعُ فَيَقُولُ يَا رَبِّ وَجَدْتُهَا مَلأَى، فَيَقُولُ اذْهَب فادْخُلِ الْجَنَّةَ فَإِنَّ لَكَ مِثْلَ الدُّنْيَا وَعَشَرَةَ أَمْثَالِهَا، أَوْ إِنَّ لَكَ مِثْلَ عَشَرَةِ أَمْثَالِ الدُّنْيَا، فَيَقُولُ تَسخَرُ مِنِّي أَوْ تَضْحَكُ مِنِّي وَأَنْتَ الْمَلِكُ
فَلَقَدْ رَأَيْتُ رَسُولَ الله صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ ضَحِكَ حَتَّى بَدَتْ نَوَاجِذُهُ
وَكَانَ يُقَالُ: ذَلِكَ أَدْنَى أَهْلِ الْجَنَّةِ مَنْزِلَةً
__________
أخرجه البخاري في 81 كتاب الرقاق: 51 باب صفة الجنة والنار
117. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా సెలవిచ్చారు – నరకం నుండి అందరికంటే చివర్లో బయటపడే, స్వర్గంలోనూ అందరికంటే చివర్లో ప్రవేశించే వ్యక్తిని గురించి నాకు బాగా తెలుసు. అతను నరకం నుండి పడుతూ లేస్తూ బయలుదేరుతాడు. అతనితో అల్లాహ్ ‘వెళ్ళు, (ఇక) స్వర్గంలో ప్రవేశించు’ అని అంటాడు. ఆ వ్యక్తి స్వర్గం దగ్గరికి వస్తాడు. చూస్తే స్వర్గం పూర్తిగా నిండిపోయి (జనంతో) క్రిక్కిరిసి ఉన్నట్లు కన్పిస్తుంది. దాంతో అతను వెనక్కి తిరిగొచ్చి “ప్రభూ! అది పూర్తిగా నిండిపోయి ఉంది (నా కక్కడ చోటే ఉన్నట్లు కన్పించడం లేదు)” అని అంటాడు.
దానికి అల్లాహ్ “వెళ్ళు, స్వర్గంలో ప్రవేశించు. నేనక్కడ నీకు ప్రపంచమంత చోటిచ్చాను. ప్రపంచ మంతేమిటి, దానికి పదింతలు విశాలమైన చోటిచ్చాను (వెళ్ళు) అని అంటాడు. (అయితే ఆ వ్యక్తికి నమ్మకం కలగలేదు అందువల్ల) అతను “ప్రభూ! తమరు (సర్వలోకాల) చక్రవర్తి అయి ఉండి నాలాంటి వారితో పరిహాసమాడుతున్నారా? లేక నన్ను ఆట పట్టిస్తున్నారా?” అని అంటాడు.
హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రదియల్లాహు అన్హు) ఈ హదీసు ఉల్లేఖించిన తరువాత “దైవ ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విషయం తెలియజేస్తూ ఫక్కున నవ్వారు. అప్పుడు ఆయన పళ్ళు కూడా స్పష్టంగా కనిపించాయి” అని అన్నారు. ఈ వ్యక్తి స్వర్గవాసులలో అందరికంటే అతి తక్కువ అంతస్తు కలవాడని అంటారు.
(సహీహ్ బుఖారీ : 81వ ప్రకరణం – రిఖాఖ్, 51వ అధ్యాయం – సిఫతుల్ జన్నతి వన్నార్]
82వ అధ్యాయం – అందరికంటే అధమశ్రేణి స్వర్గనివాసి
أدنى أهل الجنة منزلة فيها
118 – حديث أَنَسِ بْنِ مَالِكٍ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: يَجْمَعُ اللهُ النَّاسَ يَوْمَ الْقِيَامَةِ فَيَقولُونَ لَوِ اسْتَشْفَعْنَا عَلَى رَبِّنَا حَتَّى يُرِيحَنَا مِنْ مَكَانِنَا فَيَأْتُونَ آدَمَ فَيَقُولُونَ: أَنْتَ الَّذِي خَلَقَكَ اللهُ بِيَدِهِ، وَنَفَخَ فِيكَ مِنْ رُوحِهِ، وَأَمَرَ الْمَلاَئِكَةَ فَسَجَدُوا لَكَ، فَاشْفَعْ لَنَا عِنْدَ رَبِّنَا؛ فَيَقُولُ: لَسْتُ هُنَاكُمْ، وَيَذْكُرُ خَطِيئَتَهُ، وَيَقولُ ائْتُوا نُوحًا، أَوَّلَ رَسُولٍ بَعَثَهُ اللهُ فَيَأْتُونَهُ فَيَقُولُ: لَسْتُ هُنَاكُمْ، وَيَذْكُرُ خَطِيئَتَهُ، ائْتُوا إِبْرَاهِيمَ الَّذِي اتَّخَذَهُ اللهُ خَلِيلاً، فَيَأْتُونَهُ فَيَقُولُ لَسْتُ هُنَاكُمْ، وَيَذْكُرُ خَطِيئَتَهُ، ائْتَوا مُوسَى الَّذِي كَلَّمَهُ اللهُ؛ فَيَأْتُونَه فَيَقُولُ لَسْتُ هُنَاكُمْ، فَيَذْكُرُ خَطِيئَتَهُ، ائْتُوا عِيسَى، فَيَأْتُونَهُ فَيَقُولُ لَسْتُ هُنَاكُمْ، ائْتُوا مُحَمَّدًا صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَدْ غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ وَمَا تَأَخَّرَ فَيَأْتُونِي، فَأَسْتأْذِنُ عَلَى رَبِّي، فَإِذَا رَأَيْتُهُ وَقَعْتُ سَاجدًا، فَيَدَعُنِي مَا شَاءَ اللهُ، ثُمَّ يُقَالُ ارْفَعْ رَأْسَكَ، سَلْ تُعْطَهْ، وَقُلْ يُسمَعْ، وَاشْفَعْ تُشَفَّعْ فَأَرْفَعُ رَأْسِي فَأَحْمَدُ رَبِّي بِتَحْمِيدٍ يُعَلِّمُنِي؛ ثُمَّ أَشْفَعُ فَيَحُدُّ لِي حَدًّا، ثُمَّ أُخْرِجُهُمْ مِنَ النَّارِ وَأُدْخِلُهُمُ الْجَنَّةَ؛ ثُمَّ أَعُودُ فَأَقَعُ سَاجِدًا مِثْلَهُ فِي الثَّالِثَةِ أَوِ الرَّابِعَةِ حَتَّى مَا يَبْقَى فِي النَّارِ إِلاَّ مَنْ حَبَسَهُ الْقُرْآنُ
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 51 باب صفة الجنة والنار
118. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవక్రపవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు – ప్రళయ దినాన అల్లాహ్ మానవుల్ని (హష్ర్ మైదానంలో) సమీకరిస్తాడు. మానవులు (అప్పటి పరిస్థితి భరించలేక) “ఇక్కడి నుంచి మనల్ని విముక్తి కలిగించడానికి ఎవరైనా అల్లాహ్ సన్నిధిలో సిఫారసు చేస్తే బాగుండు” అని అంటారు. (ఇలా మాట్లాడుకొని) అందరూ కలసి హజ్రత్ ఆదం (అలైహిస్సలాం) దగ్గరకు వెళ్తారు.
ఆయన దగ్గర (పరిస్థితి వివరిస్తూ) “అల్లాహ్ మిమ్మల్ని తన స్వహస్తాలతో సృష్టించాడు. మీలో తన ఆత్మను ఊదాడు. దైవదూతల్ని ఆజ్ఞాపించగానే వారు మీకు సాష్టాంగ ప్రణామం చేశారు. అందువల్ల మీరు అల్లాహ్ దగ్గర మా కోసం సిఫారసు చేయండి” అని అంటారు. దానికి హజ్రత్ ఆదం (అలైహిస్సలాం) తాను చేసిన ఒక తప్పును ప్రస్తావిస్తూ “నేను విశ్వప్రభువు సన్నిధిలో మీ కోసం సిఫారసు చేసేటంతటి వాడ్ని కాను. మీరు హజ్రత్ నూహ్ (అలైహిస్సలాం) దగ్గరకు వెళ్ళండి. అల్లాహ్ ప్రభవింపజేసిన సందేశహరులలో ఆయన మొట్టమొదటివాడు” అని అన్నారు.
ఈ మాటలు విని ప్రజలు హజ్రత్ నూహ్ (అలైహిస్సలాం) దగ్గరకు వెళ్తారు. (తమ సిఫారసు విషయం ఆయన ముందుంచుతారు.) అయితే ఆయన కూడా తాను చేసిన తప్పును ప్రస్తావిస్తూ “నేనందుకు తగినవాడ్ని కాను. మీరు హజ్రత్ ఇబ్రాహీం (అలైహిస్సలాం) దగ్గరకు వెళ్ళండి. ఆయన్ని అల్లాహ్ తన మిత్రుడిగా చేసుకున్నాడు” అని అంటారు.
ప్రజలు అక్కడ్నుంచి హజ్రత్ ఇబ్రాహీం (అలైహిస్సలాం) దగ్గరకు వెళ్తారు. కాని ఆయన కూడా తను చేసిన తప్పును ప్రస్తావిస్తూ “నేనందుకు తగినవాడ్ని కాను. మీరు హజ్రత్ మూసా (అలైహిస్సలాం) దగ్గరకు వెళ్ళండి. అల్లాహ్ ఆయనతో ప్రత్యక్ష సంభాషణ జరిపాడు” అని అంటారు.
ప్రజలు అక్కడ్నుంచి హజ్రత్ మూసా (అలైహిస్సలాం) దగ్గరకు వెళ్తారు. అయితే ఆయన కూడా తాను చేసిన తప్పును గుర్తు చేస్తూ “నేను మిమ్మల్ని గురించి సిఫారసు చేసేటంతటి అర్హుడ్ని కాను. మీరు హజ్రత్ ఈసా (అలైహిస్సలాం) దగ్గరకు వెళ్ళండి” అని అంటారు.
అక్కడ్నుంచి ప్రజలు హజ్రత్ ఈసా (అలైహిస్సలాం) దగ్గరకు వెళ్తారు. ఆయన కూడా “నేను సిఫారసు చేయడానికి తగిన యోగ్యుడ్ని కాను. మీరు హజ్రత్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరకు వెళ్ళండి. ఆయన ఎంతో గొప్పవాడు. అల్లాహ్ ఆయన భూత భవిష్యత్ కాలాల పొరపాట్లన్నిటినీ క్షమించాడు” అని చెబుతారు.
అది విని ప్రజలు నా దగ్గరకు వస్తారు. నేను దైవసన్నిధిలో హాజరు కావడానికి అనుమతి అర్దిస్తాను. (అనుమతి లభించిన తరువాత) నేను అల్లాహ్ ముందు హాజరయి, ఆయన దర్శన భాగ్యం కలగగానే సాష్టాంగ పడిపోతాను. అల్లాహ్ తలచినంత వరకు ఆయన నన్ను ఆ (సాష్టాంగ ప్రణామం) స్థితిలోనే ఉంచుతాడు. ఆ తరువాత “ముహమ్మద్! తల పైకెత్తు. నీవు కోరదలచుకున్నదేమిటో కోరుకో, నేనివ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నీవేదయినా సిఫారసు చేయదలిస్తే చెయ్యి. దాన్ని కూడా ఆమోదించడానికి నేను సిద్ధంగా ఉన్నాను” అని అంటాడు విశ్వసామ్రాజ్యాధినేత.
అప్పుడు నేను తల పైకెత్తి, ముందుగా నా ప్రభువు ఔన్నత్యాన్ని స్తుతిస్తాను. (ఆ సమయంలో) ఆయన నాకు నేర్పిన మాటల్లోనే ఆయన్ని ప్రశంసిస్తాను. ఆ తరువాత (ప్రజల కోసం) సిఫారసు చేస్తాను. అయితే అల్లాహ్ నా కోసం ఒక పరిమితి విధిస్తాడు. (ఆ మేరకు) నేను ప్రజలను నరకం నుండి తీసి స్వర్గంలో ప్రవేశింపజేస్తాను. ఆ తరువాత మళ్ళీ అల్లాహ్ సన్నిధికి వచ్చి ఇంతకు ముందులాగే సాష్టాంగం (సజ్దా)లో పడిపోతాను. అదే విధంగా మూడవసారి, నాల్గవసారి కూడా చేస్తాను. చివరికి నరకంలో దివ్యఖుర్ఆన్ నిరోధించినవారు మాత్రమే మిగిలిపోతారు. దివ్యఖుర్ఆన్ వారిని (అంటే సత్యతిరస్కారుల్ని) శాశ్వతంగా నరకంలో ఉండేలా చేసింది.
(సహీహ్ బుఖారీ : 81వ ప్రకరణం – రిఖాఖ్, 51వ అధ్యాయం – సిఫతుల్ జన్నతి వన్నార్)
119 – حديث أَنَسِ بْنِ مَالِكٍ قَالَ حَدَّثَنَا مُحَمَّدٌ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: إِذَا كَانَ يَوْمُ الْقِيَامَةِ مَاجَ النَّاسُ بَعْضُهُمْ فِي بَعْضٍ، فَيَأْتُونَ آدَمَ فَيَقُولُونَ: اشْفَعْ لَنَا إِلَى رَبِّكَ فَيَقُولُ: لَسْتُ لَهَا وَلكِنْ عَلَيْكُمْ بِإِبْرَاهِيمَ فَإِنَّهُ خَلِيلُ الرَّحْمنِ؛ فَيَأْتُونَ إِبْرَاهِيمَ، فَيَقُولُ: لَسْتُ لَهَا وَلكِنْ عَلَيْكُمْ بِمُوسَى فَإِنَّهُ كَلِيمُ اللهِ؛ فَيَأْتُونَ مُوسَى فَيَقُولُ: لَسْتُ لَهَا وَلكِنْ [ص:49] عَلَيْكُمْ بِعِيسَى فَإِنَّهُ رُوحُ اللهِ وَكَلِمَتُهُ؛ فَيَأْتونَ عِيسَى فيَقُولُ: لَسْتُ لَهَا وَلكِنْ عَلَيْكُمْ بِمحَمَّدٍ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ؛ فَيَأْتُونِي فَأَقُولُ: أَنَا لَهَا، فَأسْتَأْذِنُ عَلَى رَبِّي فَيُؤْذَنُ لِي، وَيُلْهِمُنِي مَحَامِدَ أَحْمَدُهُ بِهَا لاَ تَحْضُرُنِي الآنَ، فَأَحْمَدُهُ بِتِلْكَ الْمَحَامِدِ وَأَخِرُّ لَهُ سَاجِدًا، فَيُقَالُ: يَا مُحَمَّدُ ارْفَعْ رَأْسَكَ وَقُلْ يُسْمَعْ لَكَ، وَسَلْ تُعْطَ، وَاشْفَعْ تُشَفَّعْ؛ فَأَقُولُ: يَا رَبِّ أُمَّتِي، أُمَّتِي، فَيُقَالُ: انْطَلِقْ فَأَخْرِجْ مَنْ كَانَ فِي قَلْبِهِ مِثْقَالُ شَعِيرَةٍ مِنْ إِيمَانٍ، فَأَنْطَلِقُ فَأَفْعَلُ ثُمَّ أَعُودُ فَأَحْمَدُهُ بِتِلْكَ الْمَحَامِدِ، ثُمَّ أَخِرُّ لَهُ سَاجِدًا؛ فَيُقَالُ: يَا مُحَمَّدُ ارْفَعْ رَأْسَكَ، وَقُلْ يُسْمَعْ لَكَ، وَسَلْ تُعْطَ، وَاشْفَعْ تُشَفَعْ؛ فَأَقُولُ: يَا رَبِّ أُمَّتِي، أُمَّتِي فَيُقَالُ انْطَلِقْ فَأَخْرِجْ مِنْهَا مَنْ كَانَ فِي قَلْبِهِ مِثْقَالُ ذَرَّةٍ أَوْ خَرْدَلَةٍ مِنْ إِيمَانٍ؛ فَأَنْطَلِقُ فَأَفْعَلُ؛ ثُمَّ أَعُودُ فَأَحْمَدُهُ بِتَلْكَ الْمَحَامِدِ ثُمَّ أَخِرُّ لَهُ سَاجِدًا؛ فَيُقَالُ يَا مُحَمَّدُ ارْفَعْ رَأْسَكَ، وَقُلْ يُسْمَعْ لَكَ، وَسَلْ تُعْطَ، وَاشْفَعْ تُشَفَّعْ؛ فَأَقُولُ يَا رَبِّ أُمَّتِي، أُمَّتِي فَيُقَالُ انْطَلِقْ فَأخْرِجْ مَنْ كَانَ فِي قَلْبِهِ أَدْنَى أَدْنَى أَدْنَى مِثْقَالِ حَبَّةِ خَرْدَلٍ مِنْ إِيمَانٍ فَأَخْرِجْهُ مِنَ النَّارِ؛ فَأَنْطَلِقُ فَأَفْعَل ثُمَّ أَعُودُ الرَّابِعَةَ فَأَحْمَدُهُ بِتِلْكَ الْمَحَامِدِ، ثُمَّ أَخِرُّ لَهُ سَاجِدًا؛ فَيُقَالُ يَا مُحَمَّدُ ارْفَعْ رَأْسَكَ، وَقُلْ يُسْمَع، وَسَلْ تُعْطَهْ، وَاشْفَعْ تُشَفَّعْ؛ فَأَقَولُ يَا رَبِّ ائْذَنْ لِي فِيمَنْ قَالَ لاَ إِلهَ إِلاَّ اللهُ، فَيَقُولُ وَعِزَّتِي وَجَلاَلِي وَكِبْرِيَائِي وَعَظَمَتِي لأُخْرِجَنَّ مِنْهَا مَنْ قَالَ لا إِله إلاَّ اللهُ
__________
أخرجه البخاري في: 97 كتاب التوحيد: 36 باب كلام الرب عز وجل يوم القيامة مع الأنبياء وغيرهم
119. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు)’ కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా సెలవిచ్చారు ప్రళయదినాన మానవులు ఇసుక పోస్తే రాలనంత అత్యధిక సంఖ్యలో ఉంటారు. ఈ కారణంగా పరస్పరం సముద్రకెరటాల్లా కలసిపోయి తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉంటారు. అప్పుడు వారు హజ్రత్ ఆదం (అలైహిస్సలాం) దగ్గరకు వెళ్ళి “మీ ప్రభువు సన్నిధిలో మా గురించి కాస్త సిఫారసు చేయండి” అని అంటారు. దానికి ఆయన “నేనందుకు తగిన వాడ్ని కాను. మీరు హజ్రత్ ఇబ్రాహీం(అలైహిస్సలాం) దగ్గరకు వెళ్ళండి. ఆయన అల్లాహ్ మిత్రుడు కూడా” అని అన్నారు. అప్పుడు వారంతా హజ్రత్ ఇబ్రాహీం (అలైహిస్సలాం) దగ్గరకు వెళ్తారు. కాని ఆయన కూడా “నేనందుకు తగిన వాడ్ని కాను; మీరు మూసా (అలైహిస్సలాం) దగ్గరకు వెళ్ళండి. ఆయన దైవ సంభాషితుడు అని కూడా పేరు పడ్డారు” అని అంటారు. మానవులు అక్కడ్నుంచి హజ్రత్ మూసా (అలైహిస్సలాం) దగ్గరకు వెళ్తారు. ఆయన కూడా “నేనందుకు తగిన వాడ్ని కాను; మీరు హజ్రత్ ఈసా (అలైహిస్సలాం) దగ్గరకు వెళ్ళండి. ఆయన దైవాత్మ, దైవవచనం అని కూడా ప్రఖ్యాతి చెందారు” అని చెబుతారు – మానవులు అక్కడ్నుంచి హజ్రత్ ఈసా (అలైహిస్సలాం) దగ్గరకు వెళ్తారు. అయితే చివరికి ఆయన కూడా తన అశక్తతను తెలుపుతూ “నేనీ పనికి యోగ్యుడ్ని కాను. మీరు హజ్రత్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరకు వెళ్ళండి” అని సలహా ఇస్తారు.
అప్పుడు వారంతా నా దగ్గరకు వస్తారు. నేను వారితో “ఆ…….. ఈ పని నేనే చేయగలను, చేస్తాను” అని అంటాను. ఆ తరువాత నేను విశ్వ ప్రభువు కొలువులో ప్రవేశించడానికి అనుమతి కోరుతాను. నాకు అనుమతి లభిస్తుంది. ఆ సందర్భంలో దైవస్తుతి కోసం కొన్ని స్తోత్ర వచనాలు కూడా నా హృదయంలో నాటబడతాయి, ఇప్పుడవి నాకు జ్ఞాపకం లేవు. ఆ వచనాలతో నేను అల్లాహ్ ఔన్నత్యాన్ని, ఆయన పవిత్రతను కొనియాడుతూ ఆయన సన్నిధిలో సాష్టాంగపడతాను.
ఆ తరువాత “ముహమ్మద్! తల పైకెత్తు. నీవు చెప్పదలచుకున్నదేమిటో చెప్పు, నీ మాటలు ఆలకిస్తాను. నీవు కోరుతున్నదేమిటో చెప్పు, నీ కోరిక తీరుస్తాను. ఏదైనా సిఫారసు చేయాలనుకుంటే సిఫారసు చెయ్యి, నీ సిఫారసు అంగీకరిస్తాను” అని అంటాడు అల్లాహ్. అప్పుడు నేను “ప్రభూ! నా అనుచర సమాజాన్ని క్షమించు. నా అనుచర సమాజాన్ని కనికరించు” అని అంటాను. “సరే, వెళ్ళు. వెళ్ళి మన్సులో బార్లీ గింజంత విశ్వాసం ఉన్న వారిని సయితం నరకం నుండి బయటికి తీసుకో” అని అంటాడు అల్లాహ్. నేను అలాంటి వారందర్నీ నరకం నుండి బయటికి తీస్తాను.
తరువాత అల్లాహ్ దగ్గరికి తిరిగి వచ్చి, నాకు నేర్పిన వచనాలతో స్తోత్రం చేస్తూ మళ్ళీ ఆయన సన్నిధిలో సాష్టాంగపడతాను. అల్లాహ్ తిరిగి “ముహమ్మద్! తల పైకెత్తు. చెప్పు నీ మొర ఆలకిస్తాను. అడుగు నీ కోరిక తీరుస్తాను. సిఫారసు చెయ్యి, నీ సిఫారసు అంగీకరిస్తాను” అని అంటాడు. నేనప్పుడు “ప్రభూ! నా అనుచర సమాజం, నా అనుచర సమాజాన్ని కనికరించు” అని అంటాను. “సరే, వెళ్ళు. వెళ్ళి మనస్సులో ఇసుమంత లేదా ఆవగింజంత విశ్వాసమున్న వారిని సయితం నరకం నుండి బయటికి తీసుకో” అని అంటాడు అల్లాహ్. నేను వెళ్ళి అలాంటి వారందర్నీ నరకం నుండి బయటికి తీస్తాను.
ఆ తరువాత (మూడవసారి) తిరిగొచ్చి, నాకు నేర్పిన వచనాలతో స్తోత్రం చేస్తూ అల్లాహ్ సన్నిధిలో మళ్ళీ సాష్టాంగపడతాను. అల్లాహ్ తిరిగి “ముహమ్మద్! తల పైకెత్తు. చెప్పు నీ మొర ఆలకిస్తాను. అడుగు నీ కోరిక తీరుస్తాను. సిఫారసు చెయ్యి, నీ సిఫారసు ఆమోదిస్తాను” అని అంటాడు. నేను (ఇది వరకటిలాగే) “ప్రభూ! నా అనుచర సమాజాన్ని మన్నించు. నా అనుచగ సమాజాన్ని నరకం నుండి కాపాడు” అని అంటాను. “సరే వెళ్ళు. వెళ్ళి మనస్సులో ఆవగింజ కన్నా అతి తక్కువ పరిమాణంలో విశ్వాసమున్న వారిని సయితం నరకం నుండి బయటికి తీసుకో” అని అంటాడు అల్లాహ్. నేను వెళ్ళి అలాంటి వారందర్నీ నరకం నుండి బయటికి తీస్తాను.
ఆ తరువాత నాల్గవసారి వెళ్ళి అవే వచనాలతో స్తోత్రం చేస్తూ అల్లాహ్ సన్నిధిలో సాష్టాంగపడతాను. అల్లాహ్ మళ్ళీ ” ముహమ్మద్! తల పైకెత్తు. చెప్పు, నీ మొర ఆలకిస్తాను. అడుగు నీ కోరిక తీరుస్తాను. సిఫారసు చెయ్యి, నీ సిఫారసు ఆమోదిస్తాను” అని అంటాడు. నేను (యథాప్రకారం) “ప్రభూ! నా అనుచర సమాజం, నా అనుచర సమాజాన్ని కనికరించు” అని అంటాను. అప్పుడు అల్లాహ్ “నా గౌరవాన్నత్యాల సాక్ష్యం! అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని నోటితో పలికిన ప్రతి మనిషినీ నేను నరకం నుండి విముక్తం చేస్తాను” అని అంటాడు.
[సహీహ్ బుఖారీ : 97వ ప్రకరణం – తౌహీద్, 36వ అధ్యాయం – కలామిర్రబ్బి ఇజ్జువజల్ యౌమల్ ఖియామతి మఅల్ అంబియావు గైరిహిమ్]
120 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: أُتِيَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بِلَحْمٍ، فَرُفِعَ إِلَيْهِ الذِّرَاعُ، وَكَانَتْ تُعْجِبُهُ، فَنَهَسَ مِنْهَا نَهْسَةً ثُمَّ قَالَ: أَنَا سَيِّدُ النَّاسِ يَوْمَ الْقِيَامَةِ، [ص:50] وَهَلْ تَدْرُونَ مِمَّ ذَلِكَ يُجْمَعُ النَّاسُ الأَوَّلِينَ وَالآخِرِينَ فِي صَعِيدٍ وِاحِدٍ، يُسْمِعُهُمُ الدَّاعِي، وَيَنْفُذُهُمُ الْبَصَرُ، وَتَدْنُو الشَّمْسُ فَيَبْلُغُ النَّاسَ مِنَ الغَمِّ وَالْكَرْبِ مَا لاَ يُطِيقُونَ وَلاَ يَحْتَمِلُونَ؛ فَيَقُولُ النَّاسُ أَلاَ تَرَوْنَ مَا قَدْ بَلَغَكُمْ أَلاَ تَنْظُرُونَ مَنْ يَشْفَعُ لَكُمْ إِلَى رَبِّكُمْ فَيقُولُ بَعْضُ النَّاسِ لِبَعْضٍ، عَلَيْكُمْ بِآدَمَ، فَيَأْتُونَ آدَمَ عَلَيْهِ السَّلاَمُ؛ فَيَقُولُونَ لَهُ: أَنْتَ أَبُو الْبَشَر، خَلَقَكَ اللهُ بِيَدِهِ، وَنَفَخَ فِيكَ مِنْ رُوحِهِ، وَأَمَرَ الْمَلاَئِكَةَ فَسَجَدُوا لَكَ، اشْفَعْ لَنَا إِلَى رَبِّكَ، أَلاَ تَرَى إِلَى مَا نَحْنُ فِيهِ أَلاَ تَرَى إِلَى مَا قَدْ بَلَغَنَا فَيَقُولُ آدَمُ إِنَّ رَبِّي قَدْ غَضِبَ الْيَوْمَ غَضَبًا لَمْ يَغْضَبْ قَبْلَهُ مِثْلَهُ وَلَنْ يَغْضَبَ بَعْدَهُ مِثْلَهُ، وَإِنَّهُ نَهَانِي عَنِ الشَّجَرَةِ فَعَصَيْتُهُ، نَفْسِي نَفْسِي نَفْسِي؛ اذْهَبُوا إِلَى غَيْرِي، اذْهَبُوا إِلَى نُوحٍ؛ فَيَأْتُونَ نُوحًا فَيَقُولُونَ: يَا نُوحُ إِنَّكَ أَنْتَ أَوَّلُ الرُّسُلِ إِلَى أَهْلِ الأَرْضِ، وَقَدْ سَمَّاكَ اللهُ عَبْدًا شَكُورًا، اشْفَعْ لَنَا إِلَى رَبِّكَ، أَلاَ تَرَى إِلَى مَا نَحْنُ فِيهِ فَيَقُولُ: إِنَّ رَبِّي عَزَّ وَجَلَّ قَدْ غَضِبَ الْيَوْمَ غَضَبًا لَمْ يَغْضَبْ قَبْلَهُ مِثْلَهُ وَلَنْ يَغْضَبَ بَعْدَهُ مِثْلَهُ؛ وَإِنَّهُ قَدْ كَانَتْ لِي دَعْوَةٌ دَعَوْتُهَا عَلَى قَوْمِي، نَفْسِي نَفْسِي نَفْسِي
اذْهَبُوا إِلَى غَيْرِي، اذْهَبُوا إِلَى إِبْرَاهِيمَ، فَيَأْتُونَ إِبْراهِيمَ فَيَقُولُونَ يَا إِبْرَاهِيمُ أَنْتَ نَبِيُّ اللهِ وَخِلِيلُهُ مِنْ أَهْلِ الأَرْضِ اشْفَعْ لَنَا إِلَى رَبِّكَ، أَلاَ تَرَى إِلَى مَا نَحْنُ فِيهِ فَيَقُولُ لَهُمْ إِنَّ رَبِّي قَدْ غَضِبَ الْيَوْمَ غَضَبًا لَمْ يَغْضَبْ قَبْلَهُ مِثْلَه، وَلَنْ يَغْضَبَ بَعْدَهُ مِثْلَهُ؛ وَإِنِّي قَدْ كنْتُ كَذَبْتُ ثَلاثَ كَذَبَاتٍ، نَفْسِي نَفْسِي نَفْسِي اذْهَبُوا إِلَى غَيْرِي، اذْهَبُوا إِلَى مُوسَى فَيَأْتُونَ مُوسَى، فَيَقُولُونَ: يَا مُوسَى أَنْتَ رَسُولُ اللهِ فَضَّلَكَ الله بِرِسَالَتِهِ وَبِكَلاَمِهِ عَلَى النَّاسِ، اشْفَعْ لَنَا إِلَى رَبِّكَ أَلاَ تَرَى إِلَى مَا نَحْنُ فِيهِ فَيَقُولُ إِنَّ رَبِّي قَدْ غَضِبَ الْيَوْمَ [ص:51] غَضَبًا لَمْ يَغْضَبْ قَبْلَهُ مِثْلَهُ، وَلَنْ يَغْضَبَ بَعْدَهُ مِثْلَهُ، وَإِنِّي قَدْ قَتَلْتُ نَفْسًا لَمْ أُومَرْ بِقَتْلِهَا، نَفْسِي نَفْسِي نَفْسِي اذْهَبُوا إِلَى غَيْرِي، اذْهبُوا إِلَى عِيسى؛ فَيَأْتُونَ عِيسى، فَيَقُولُونَ يَا عِيسى أَنْتَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَكَلِمَتُهُ أَلْقَاهَا إِلَى مَرْيَمَ وَرُوحٌ مِنْهُ، وَكَلَّمْتَ النَّاسَ فِي الْمَهْدِ صَبِيًّا، اشْفَعْ لَنَا، أَلاَ تَرَى إِلَى مَا نَحْنُ فِيهِ فَيَقُولُ عِيسى، إِنَّ رَبِّي قَدْ غَضِبَ الْيَوْمَ غَضَبًا لَمْ يَغْضَبْ قَبْلَهُ مِثْلَهُ وَلَنْ يَغْضَبَ بَعْدَهُ مِثْلَهُ، وَلَمْ يَذْكُرْ ذَنْبًا، نَفْسِي نَفْسِي نَفْسِي اذْهَبُوا إِلَى غَيْرِي، اذْهَبُوا إِلَى مُحَمَّدٍ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ؛ فَيَأْتُونَ مُحَمَّدًا صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَيَقُولُونَ: يَا مُحَمَّدُ أَنْتَ رَسُولُ اللهِ وَخَاتِمُ الأَنْبِيَاءِ، وَقَدْ غَفَرَ اللهُ لَكَ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِكَ وَمَا تَأَخَّرَ، اشْفَعْ لَنَا إِلَى رَبِّكَ، أَلاَ تَرَى إِلَى مَا نَحْنُ فِيه
فَأَنْطَلِقُ فَآتِي تَحْتَ الْعَرْشِ فَأَقَعُ سَاجِدًا لِرَبِّي عَزَّ وَجَلَّ ثُمَّ يَفْتَحُ اللهُ عَلَيَّ مِنْ مَحَامِدِهِ وَحُسْنِ الثَّنَاءِ عَلَيْهِ شَيْئًا لَمْ يَفْتَحْهُ عَلَى أَحَدٍ قَبْلِي، ثُمَّ يُقَالُ: يَا مُحَمَّدُ ارْفَعْ رَأْسَكَ، سَلْ تُعْطَهْ، وَاشْفَعْ تُشَفَّعْ؛ فَأَرْفَعُ رَأْسِي، فَأَقُولُ: أُمَّتِي يَا رَبِّ أُمَّتِي يَا رَبِّ فَيُقَالُ: يَا مُحَمَّدُ أَدْخِلْ مِنْ أُمَّتِكَ مَنْ لاَ حِسَابَ عَلَيْهِمْ مِنَ الْبَابِ الأَيْمَنِ مِنْ أَبْوَابِ الْجَنَّةِ، وَهُمْ شُرَكَاءُ النَّاسِ فِيمَا سِوَى ذلِكَ مِنَ الأَبْوَابِ، ثُمَّ قَالَ: وَالَّذِي نَفْسِي بِيَدِهِ إِنَّ مَا بَيْنَ المِصْرَاعَيْنِ مِنْ مَصَارِيعِ الْجَنَّةِ كَمَا بَيْنَ مَكَّةَ وَحِمْيَرَ، أَوْ كَمَا بَيْنَ مَكَّةَ وَبُصْرَى
__________
أخرجه البخاري في: 65 كتاب التفسير: 17 سورة الإسراء: 5 باب ذرية من حملنا مع نوح
120. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- ఓ రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరికి కొంత మాంసం (కానుకగా) వచ్చింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు ముందరి కాళ్ళ – మాంసమంటే ఎంతో ఇష్టం. అందువల్ల ఆ మాంసంలో నుంచి ఆయనకు ముందరి కాళ్ళ మాంసం కొంత సమర్పించడం జరిగింది. అందులో కొంత మాంసం ఆయన తిని ఇలా ప్రవచించారు:
ప్రళయదినాన నేను యావత్తు మానవులకు నాయకుణ్ణవుతాను. ఇది ఎలా అవుతుందో మీకు తెలుసా? ప్రళయదినాన భూత భవిష్యత్ వర్తమాన కాలాల మానవులంతా ఒకే మైదానంలో సమీకరించబడతారు. (ఆ మైదానం చదునుగా ఉండటం వల్ల) పిలిచే వాడీ పిలుపును అందరూ వినగలుగుతారు. అలాగే చూసేవారు అందరినీ చూడగలుగుతారు. సూర్యుడు అతి దగ్గరగా వస్తాడు. (దాంతో ఒకవైపు తీక్షణమైన ఎండ, ఉక్కపోతల వల్ల, మరో వైపు ఇసుకపోస్తే రాలనంత అత్యధిక జనాభా కారణంగా) మానవులు తీవ్రమైన ఆందోళనతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. పరిస్థితి చాలా దుర్భరంగా ఉంటుంది.
ఆ స్థితిలో వారు పరస్పరం మాట్లాడుకుంటూ “సోదరులారా! మనం ఎలాంటి ఆపదలో చిక్కుకున్నామో గమనించారా?” అంటారు కొందరు. “ఎందుకు గమనించలేదు? మనల్ని గురించి మన ప్రభువు దగ్గర సిఫారసు చేసే వారెవరైనా దొరుకుతారేమో వెతుకుదాం పదండి” అంటారు మరి కొందరు. ఆ తరువాత వారు పరస్పరం సంప్రదించుకొని హజ్రత్ ఆదం (అలైహిస్సలాం) దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు.
నిర్ణయం ప్రకారం అందరూ హజ్రత్ ఆదం (అలైహిస్సలాం) దగ్గరకు వెళ్ళి “(మహానుభావా!) మీరు మానవులందరికీ తండ్రి. అల్లాహ్ మిమ్మల్ని తన స్వహస్తాలతో తయారు చేసి, మీ శరీరంలో తన ఆత్మను ఊదాడు. అంతేగాక దైవదూతలందర్నీ మీ ముందు మోకరిల్లమని ఆదేశించాడు. అందువల్ల మీరు (దయచేసి) మీ ప్రభువు దగ్గర మా గురించి కాస్త సిఫారసు చేయండి. మా పరిస్థితి చూడండి, మేమెలాంటి ఆపదలో చిక్కుకున్నామో! పరిస్థితి ఇలాగే ఉంటే చివరికి మా గతేం కాను?” అని అంటారు.
దానికి హజ్రత్ ఆదం (అలైహిస్సలాం) సమాధానమిస్తూ “ఈ రోజు నా ప్రభువు ఇది వరకు ఎన్నడూ లేనంత ఆగ్రహోదగ్రుడయి ఉన్నాడు, ఇక ముందు కూడా ఎన్నడూ ఇంత ఉగ్రుడయిపోడు. అదీగాక (నా వల్ల ఒక పొరపాటు జరిగిపోయింది) ఆయన నన్ను ఒక ప్రత్యేక వృక్షం దగ్గరికి వెళ్ళకూడదని ఆజ్ఞాపించాడు. కాని నేనా ఆజ్ఞను పాటించలేకపోయాను. నేనిప్పుడు స్వయంగా నా పరిస్థితి పట్ల ఆందోళన పడుతున్నాను. అందువల్ల మీరు మరొకరి దగ్గరకు వెళ్ళండి. హజ్రత్ నూహ్ (అలైహిస్సలాం) దగ్గరకు వెళ్ళండి. (నా దృష్టిలో ఆయన ఈ పని చేయగల సమర్థుడు)” అని అంటారు.
అప్పుడు మానవులంతా హజ్రత్ నూహ్ (అలైహిస్సలాం) దగ్గరకు వెళ్ళి, “నూహ్! మీరు యావత్తు ప్రపంచంలో మొట్టమొదటి దైవసందేశహరులు. అల్లాహ్ మీకు ‘కృతజ్ఞుడయిన దాసుడ’ని బిరుదు ఇచ్చాడు. అందువల్ల మీరు (దయచేసి) అల్లాహ్ సన్నిధిలో మా గురించి కాస్త సిఫారసు చేయండి. మేమెలా ఆపదలో పడిపోయామో చూస్తున్నారు కదా మీరు?” అని అంటారు.
దానికి హజ్రత్ నూహ్ (అలైహిస్సలాం) “ఈ రోజు నా ప్రభువు ఇది వరకెన్నడూ లేనంత ఆగ్రహోదగ్రుడయి ఉన్నాడు. ఇక ముందు కూడా ఎన్నడూ ఇంత ఉగ్రుడయిపోడు. అదీగాక (నావల్ల ఒక పొరపాటు జరిగిపోయింది) నేను నా జాతి ప్రజలను (తొందరపడి) శపించాను. (తత్ఫలితంగా వారంతా సర్వనాశనమయ్యారు.) ఏమయినప్పటికీ నేనిప్పుడు స్వయంగా నా పరిస్థితి పట్ల ఆందోళన పడుతున్నాను. అందువల్ల మీరు మరొకరి దగ్గరకు వెళ్ళండి. హజ్రత్ ఇబ్రాహీం (అలైహిస్సలాం) దగ్గరకు వెళ్ళండి. (నా దృష్టిలో ఆయన ఈ పని చేయగల సమర్థుడు)” అని అంటారు.
జనం అక్కడ్నుంచి హజ్రత్ ఇబ్రాహీం (అలైహిస్సలాం) దగ్గరకు వెళ్ళి “ఇబ్రాహీం! మీరు అల్లాహ్ ప్రవక్త. యావత్ప్రపంచంలోనే అల్లాహ్ కి (ప్రాణ) స్నేహితులు. కనుక మీరు (దయచేసి) మా గురించి అల్లాహ్ కి సిఫారసు చేయండి. చూస్తున్నారు కదా మా స్థితి, మేమెలా ఆపదలో చిక్కుకున్నామో?” అని అంటారు.
అది విని హజ్రత్ ఇబ్రాహీం (అలైహిస్సలాం) “ఈ రోజు నా ప్రభువు ఇది వరకెన్నడూ లేనంత ఆగ్రహోదగ్రుడయి ఉన్నాడు. ఇక ముందు కూడా ఎన్నడూ ఇంత ఉగ్రుడయిపోడు. అదీగాక (నావల్ల ఒక పొరపాటు జరిగిపోయింది) నేను మూడు సందర్భాలలో అబద్దమాడాను (హదీసు ఉల్లేఖకుడు అబూ హయ్యాన్ ఈ సందర్భంగా ఈ మూడు అబద్దాలేమిటో వివరించారు). ఏమైనా నేనిప్పుడు స్వయంగా నా పరిస్థితి ఏమవుతుందోనని ఆందోళన పడుతున్నాను. అంచేత మీరు మరొకరి దగ్గరకు వెళ్ళండి. హజ్రత్ మూసా (అలైహిస్సలాం) దగ్గరకు వెళ్ళండి. (ఆయన ఈ పని చేయగల సమర్థుడు)” అని అంటారు.
దాంతో జనం అక్కడ్నుంచి హజ్రత్ మూసా (అలైహిస్సలాం) దగ్గరకు వెళ్ళి “మూసా! మీరు అల్లాహ్ సందేశహరులు. అల్లాహ్ మీతో ప్రత్యక్షంగా సంభాషించి, మిమ్మల్ని ప్రత్యేక ప్రవక్తగా నియమించాడు. పైగా ఆయన మీకు యావత్తు మానవుల్లోకెల్లా అత్యధిక గౌరవోన్నతులను ప్రసాదించాడు. అందువల్ల మీరు (దయచేసి) మా గురించి అల్లాహ్ దగ్గర సిఫారసు చేయండి. మా పరిస్థితి చూడండి, మేమెలా ఆపదలో పడి సతమతమవుతున్నామో!” అని అంటారు.
హజ్రత్ మూసా (అలైహిస్సలాం) ఈ మాటలు విని “ఈ రోజు నా ప్రభువు ఇదివరకెన్నడూ లేనంత ఆగ్రహోదగ్రుడయి ఉన్నాడు, ఇక ముందు ఎన్నడూ ఇంత ఉగ్రుడయిపోడు. అదీగాక (నా వల్ల ఒక పొరపాటు జరిగిపోయింది). నాకెలాంటి ఆజ్ఞ లభించకపోయినా నేనొక వ్యక్తిని (తొందరపడి) హతమార్చాను. దీని కారణంగా నేనిప్పుడు స్వయంగా నా పరిస్థితి ఏమవుతుందోనని ఆందోళన పడుతున్నాను. అందువల్ల మీరు మరొకరి దగ్గరకు వెళ్ళండి. హజ్రత్ ఈసా (అలైహిస్సలాం) దగ్గరకు వెళ్ళండి. (ఆయన మీ పని చేసి పెట్టవచ్చు)” అని అంటారు.
ప్రజలు (ఉసూరుమంటూ) అక్కడ్నుంచి హజ్రత్ ఈసా (అలైహిస్సలాం) దగ్గరకు వెళ్తారు. “ఈసా! మీరు అల్లాహ్ ప్రవక్త, దైవవచనం కూడా. అల్లాహ్ దాన్ని హజ్రత్ మర్యం (అలైహిస్సలాం) వైపు వదిలేశాడు. మీరు అల్లాహ్ ఆత్మ(గా) కూడా (ప్రసిద్ధి చెందారు). మీరు శిశు దశలోనే తల్లి ఒడి నుండి జనంతో మాట్లాడారు. కనుక మీరు (దయచేసి) మా గురించి కాస్త అల్లాహ్ దగ్గర సిఫారసు చేయండి. చూస్తున్నారు కదా మా పరిస్థితి, మేమెలా ఆపదలో పడి సతమతమవుతున్నామో?” అని అంటారు.
దీనికి హజ్రత్ ఈసా (అలైహిస్సలాం) సమాధానమిస్తూ “సోదరులారా! ఈ రోజు నా ప్రభువు ఇది వరకెన్నడూ లేనంత ఆగ్రహోదగ్రుడయి ఉన్నాడు. ఇక ముందు ఎప్పుడూ ఇంత ఉగ్రుడయిపోడు” అని అంటారు. హజ్రత్ ఈసా (అలైహిస్సలాం) తానేదయినా తప్పు చేసినట్లు ఇక్కడ ఎలాంటి ప్రస్తావన చేయరు. “(ఈ స్థితిలో నేను మీకు ఎలాంటి సహాయం చేయలేను.) స్వయంగా నేను నా పరిస్థితి ఏమవుతుందోనని భయపడి పోతున్నాను. మీరు మరొకరి దగ్గరకు వెళ్ళండి. హజ్రత్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరికి వెళ్ళండి. (ఆయనే మీకు సహాయం చేయగల సమర్థుడు)” అని మాత్రమే అంటారు.
ఈ మాటలు విని జనం (నిరాశతో) అక్కడ్నుంచి బయలుదేరి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరకు (అంటే నా దగ్గరకు) వస్తారు. “ముహమ్మద్! మీరు అల్లాహ్ ప్రవక్త, దైవప్రవక్తలందరిలోకెల్లా కట్ట కడపటి వారు. అల్లాహ్ మీవెనుకటి, ముందటి తప్పులన్నీ క్షమించేశాడు. కనుక (దయచేసి) మీరు మా గురించి అల్లాహ్ దగ్గర సిఫారసు చేయండి. చూస్తున్నారు కదా మా పరిస్థితి, మేమెలా ఆపదలో చిక్కుకొని సతమతమవుతున్నామో?” అంటారు వారు.
అప్పుడు నేను బయలుదేరి అల్లాహ్ సింహాసనం దగ్గరకు చేరుకుంటాను. అక్కడ నా ప్రభువు ముందు సాష్టాంగపడతాను. అప్పుడు అల్లాహ్ స్తోత్రం కోసం కొన్ని విశేష వచనాలు నా మనసులో నాటుతాడు. ఇలాంటి స్తోత్ర వచనాలు ఇదివరకెప్పుడూ ఎవరికీ నేర్పి ఉండడు. ఆ తరువాత అల్లాహ్ నన్ను సంబోధిస్తూ “ముహమ్మద్! తలపైకెత్తు. నీవు అడగదలచుకున్నదేమిటో అడుగు, నీ కోరిక తీరుస్తాను. ఏదైనా సిఫారసు చెయ్యాలనుకుంటే చెయ్యి, నేను నీ సిఫారసు ఆమోదిస్తాను” అని అంటాడు.
నేను తల పైకెత్తి “ప్రభూ! నా అనుచర సమాజం; ప్రభూ! నా అనుచర సమాజం పాపాల్ని మన్నించు, ప్రభూ! నా అనుచర సమాజాన్ని నరకాగ్ని నుండి కాపాడు” అని అంటాను. దానికి అల్లాహ్ “ముహమ్మద్! వెళ్ళు. వెళ్ళి నీ అనుచర సమాజంలోని న్యాయ విచారణ పరిధి నుంచి మినహాయించబడిన వారందరినీ తీసుకొని, కుడివైపు ద్వారం గుండా స్వర్గం లోపలికి పంపించుకో. వారు ఇతర ద్వారాల గుండా కూడా రాకపోకలు నిరభ్యంతరంగా సాగించుకోవచ్చు” అని సమాధానమిస్తాడు.
ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రమాణం చేస్తూ “నా ప్రాణం ఎవరి అధీనంలో ఉందో ఆ మహోన్నత శక్తి సాక్ష్యం! మక్కా, హుమైర్ ల మధ్య లేదా మక్కా, బస్రాల మధ్య ఎంత దూరం ఉంటుందో స్వర్గంలోని ఒక ద్వారం వెడల్పు అంత దూరం ఉంటుంది” అని అన్నారు.
(సహీహ్ బుఖారీ: 65వ ప్రకరణం – అత్తఫ్సీర్, 17 సూరతుల్ ఇస్రా, 5వ అధ్యాయం – జుర్రియ్యతి మన్ హమల్నా మఅ నూహ్)
83వ అధ్యాయం – సిఫారసు కోసం ప్రత్యేక వేడుకోలు
اختباء النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ دعوة الشفاعة لأُمته
121 – حديث أَبِي هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: لِكُلِّ نَبِيٍّ دَعْوَةٌ، فَأُرِيدُ، إِنْ شَاءَ اللهُ، أَنْ أَخْتَبِيَ دَعْوَتِي شَفَاعَةً لأُمَّتِي يَوْمَ الْقِيَامَةِ
__________
أخرجه البخاري في: 97 كتاب التوحيد: 31 باب قوله تعالى (قل لو كان البحر مدادًا لكلمات ربي)
121. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- “ప్రతి దైవప్రవక్తకూ (ఆమోదయోగ్యమైన) ఒక వేడుకోలు ప్రత్యేకించబడింది. అందువల్ల నేనీ వేడుకోలును (ఇహలోకంలో వాడుకోకుండా) దైవచిత్తమయితే ప్రళయదినాన నా అనుచర సమాజం కొరకు సిఫారసు చేయడానికి భద్రపరుచుకుంటాను” అని అన్నారు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).
[సహీహ్ బుఖారీ: 97వ ప్రకరణం – తౌహీద్, 32వ అధ్యాయం – ఫిల్ మషియ్యతి వల్ అరాద)
122 – حديث أَنَسٍ عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: كُلُّ نَبِيٍّ سَأَلَ سُؤَالاً أَوْ قَالَ لِكُلِّ نَبِيٍّ دَعْوةٌ قَد دَعَا بِهَا فَاسْتُجِيبَتْ، فَجَعَلْتُ دَعْوَتِي شَفَاعَةً لأُمَّتِي يَوْمَ الْقِيَامَةِ
__________
أخرجه البخاري في: 80 كتاب الدعوات: 1 باب لكل نبي دعوة مستجابة
122. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం:- ప్రతి దైవప్రవక్త ఒక కోరిక కోరుకున్నాడని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్నారు. లేక ఆయన ప్రతి దైవప్రవక్తకు ఒక వేడుకోలు చేసుకునే అధికారం ఇవ్వబడిందని చెబుతూ “దాని ప్రకారం దైవ ప్రవక్తలంతా తమ తమ వేడుకోళ్ళు వినియోగించుకున్నారు. అవి ఆమోదించబడ్డాయి కూడా. అయితే నేను మాత్రం నా వేడుకోలును (ఇంకా వినియోగించుకోలేదు. దాన్ని) ప్రళయదినాన నా అనుచర సమాజం కొరకు సిఫారసు చేయడానికి భద్రపరచుకున్నాను” అని అన్నారు.
(సహీహ్ బుఖారీ: 80వ ప్రకరణం – దావాత్, 1వ అధ్యాయం – లికుల్లి నబియ్యిన్ దావతుమ్ముస్త జాబతున్]
87వ అధ్యాయం – దైవాజ్ఞ “మీ దగ్గరి బంధువులను హెచ్చరించు”
في قوله تعالى: (وأنذر عشيرتك الأقربين)
123 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: قَامَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ حِينَ أَنْزَلَ اللهُ عَزَّ وَجَلَّ (وَأَنْذِرْ عَشِيرَتَكَ الأَقْرَبِينَ) ، قَالَ: يَا مَعْشَرَ قرَيْشٍ أَوْ كَلِمَةً نَحْوَهَا اشْتَرُوا أَنْفُسَكُمْ، لاَ أُغْنِي عَنْكُمْ مِنَ اللهِ شَيْئًا يَا بَنِي عَبْدِ مَنَافٍ لاَ أُغْنِي عَنْكُمْ مَنَ اللهِ شَيْئًا يَا عَبَّاسُ بْنَ عَبْدِ الْمُطَّلِبِ لاَ أُغْنِي عَنْكَ مِنَ اللهِ شَيْئًا وَيَا صَفِيَّةُ عَمَّةَ رَسُولِ اللهِ لاَ أُغْنِي عَنْكِ مِنَ اللهِ شَيْئًا وَيَا فَاطِمَةُ بِنْتَ مُحَمَّدٍ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، سَلِيني مَا شِئْتِ مِنْ مَالِي، لاَ أُغْنِي عَنْكِ مِنَ اللهِ شَيْئًا
__________
أخرجه البخاري في: 55 كتاب الوصايا: 11 باب هل يدخل النساء والولد في الأقارب
123. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- “మీ దగ్గరి బంధువులను హెచ్చరించు” అన్న దైవసూక్తి (26:214) అవతరించినపుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) లేచి నిలబడి ఇలా అన్నారు –
“ఖురైష్ ప్రజలారా! మీ ప్రాణాలను (నరకాగ్ని నుండి) కాపాడుకోండి. నేను మిమ్మల్ని దైవశిక్ష నుండి ఏ విధంగానూ కాపాడలేను. అబ్దె మునాఫ్ సంతతి ప్రజలారా! నేను మిమ్మల్ని అల్లాహ్ పట్టు నుండి ఏ మాత్రం రక్షించలేను. అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ ! నేను మిమ్మల్ని అల్లాహ్ పట్టు నుండి కొంచెం కూడా కాపాడలేను. ప్రవక్త మేనత్త సఫియా! నేను నిన్ను కూడా అల్లాహ్ పట్టు నుండి కాపాడలేను. నా చిట్టితల్లి ఫాతిమా! నువ్వు కోరితే నా ఆస్తిపాస్తుల నుండి నీకు ఎంతైనా ఇవ్వగలను. కాని అల్లాహ్ పట్టు నుండి మాత్రం నిన్ను ఏ విధంగానూ రక్షించలేను.”
[సహీహ్ బుఖారీ: 55వ ప్రకరణం – వసాయా, 11వ అధ్యాయం – హల్ యద్ ఖులున్నిసావు వల్ వలదు ఫిల్ అఖారిబ్]
124 – حديث ابْنِ عَبَّاسٍ قَالَ: لَمَّا نَزَلَتْ (وَأَنْذِرْ عَشِيرَتَكَ الأَقْرَبِينَ) وَرَهْطَكَ مِنْهُمُ الْمُخْلَصِينَ، خَرَجَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ حَتَّى صَعِدَ الصَّفَا فَهَتفَ: يَا صَبَاحَاهْ فَقَالُوا مَنْ هذَا فَاجْتَمَعُوا إِلَيْهِ فَقَالَ: أَرَأَيْتُمْ إِنْ أَخْبَرْتُكُمْ أَنَّ خَيْلاً تَخْرُجُ مِنْ سَفْحِ هذَا الْجَبَلِ أَكُنْتُمْ مُصَدِّقِيَّ قَالُوا مَا جَرَّبْنَا عَلَيْكَ كَذِبًا، قَالَ: فَإِنِّي نَذِيرٌ لَكُمْ بَيْنَ يَدَيْ عَذَابٍ شَدِيدٍ، قالَ أَبُو لَهَبٍ: تَبًّا لَكَ مَا جَمَعْتَنَا إِلاَّ لِهذَا ثُمَّ قَامَ فَنَزَلَتْ (تَبَّتْ يَدَا أَبِي لَهَبٍ وَتَبَّ)
__________
أخرجه البخاري في: 65 كتاب التفسير: 111 سورة تبت يدا أبي لهب وتب: 1 باب حدثنا يوسف
124. హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం:- “నీ దగ్గరి బంధువులను, నీ తెగలోని ముఖ్యమైన వ్యక్తులను (దైవశిక్షను గురించి) హెచ్చరించు” అనే ఖుర్ఆన్ సూక్తి అవతరించిన తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంటి నుండి బయలుదేరారు. ఆయన సఫా కొండెక్కి “హోషియార్! అప్రమత్తంగా ఉండండి!!” అని బిగ్గరగా ఒక హెచ్చరిక చేశారు. ప్రజలు ఈ కేక విని, “ఎవరబ్బా ఈ హెచ్చరిక చేస్తున్నది?” అని ఆశ్చర్యపోయారు. వెంటనే వారు (తమ తమ ఇండ్ల నుండి బయలుదేరి) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరికి చేరుకోవడం ప్రారంభించారు.
ఇలా అందరూ తన దగ్గరకు వచ్చిన తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని ఉద్దేశించి “సోధరులారా! నేనొక వేళ ఈ కొండచాటు నుండి వాహనాల మీద ఒక సైనిక దళం వస్తోందని చెబితే మీరు నమ్ముతారా!” అని అడిగారు. దానికి వారు “ఎందుకు నమ్మమూ? నీవు ఎన్నడూ అబద్ధమాడినట్లు మేము చూడలేదు” అని సమాధానమిచ్చారు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “అయితే నేను మిమ్మల్ని శాశ్వతమైన, అతి భయంకరమైన (పరలోక) శిక్షను గురించి హెచ్చరిస్తున్నాను” అని అన్నారు. (వచ్చిన వారిలో) అబూలహబ్ (అనే వాడు వెంటనే భృకుటి ముడిచి) “నీ పాడుగాను! ఇందుకేనా నువ్వు మమ్మల్నందర్నీ పిలిచావు?” అని అంటూ అక్కడ్నుంచి (చరచరా) వెళ్ళిపోయాడు. అతని విషయం గురించే “లహబ్” (తబ్బత్ యదా అబీల హబివ్వతబ్) అనే సూరా అవతరించింది.
[సహీహ్ బుఖారీ : 65వ ప్రకరణం – తఫ్సీర్, 111 తబ్బత్ యదా సూరా, అధ్యాయం – హద్దసనా యూసుఫ్ ]
88వ అధ్యాయం – అబూ తాలిబ్ గురించి దైవప్రవక్త సిఫారసు
شفاعة النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ لأبي طالب والتخفيف عنه بسببه
125 – حديثُ الْعَبَّاسِ بْنِ عَبْدِ الْمُطَّلِبِ رضي الله عنه قَالَ لِلنَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: مَا أَغْنَيْتَ عَنْ عَمِّكَ فَإِنَّهُ كَانَ يَحُوطُكَ وَيَغْضَبُ لَكَ قَالَ: هُوَ فِي ضَحْضَاحٍ مِنْ نَارٍ وَلَوْلاَ أَنَا لَكَانَ فِي الدَّرَكِ الأَسْفَلِ مِنَ النَّارِ
__________
أخرجه البخاري في: 63 كتاب مناقب الأنصار: 40 باب قصة أبي طالب
125. హజ్రత్ అబ్బాస్ బిన్ ముత్తలిబ్ (రదియల్లాహు అన్హు) కథనం:- “దైవప్రవక్తా! మీ పెదనాన్న అబూ తాలిబ్ మీకు మద్దతు నిచ్చి, ఎల్లప్పుడూ మిమ్మల్ని (కంటిరెప్పలా) కాపాడుతుండేవారు. మీ కోసం మీ ప్రత్యర్థులపై తీవ్రాగ్రహం వెలిబుచ్చుతుండేవారు. అలాంటి మీ పెదనాన్నకు మీరేమయినా ప్రయోజనం చేకూర్చారా?” అని అడిగాను నేను. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధానమిస్తూ “ఆయన నరకాగ్నిలో చీలమండలం వరకు దహించబడుతూ ఉంటారు. నేను గనక సిఫారసు చేయకపోతే ఆయన నరకంలో అట్టడుగు అంతస్తులో ఉండేవారు” అని అన్నారు.
[సహీహ్ బుఖారీ : 63వ ప్రకరణం – మనాఖిబిల్ అన్సార్, 40వ అధ్యాయం – ఖిస్సతి అబీతాలిబ్]
126 – حديث أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رضي الله عنه أَنَّهُ سَمِعَ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَذُكِرَ عِنْدَهُ عَمُّهُ، فَقالَ: لَعَلَّهُ تَنْفَعُهُ شَفَاعَتِي يَوْمَ الْقِيَامَةِ فَيُجْعَلُ فِي ضَحضَاحٍ مِنَ النَّارِ يَبْلُغُ كَعْبَيْهِ يَغْلِي مِنْهُ دِمَاغهُ
__________
أخرجه البخاري في: 63 كتاب مناقب الأنصار: 40 باب قصة أبي طالب
126. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గర ఆయన పెదనాన్న అబూతాలిబ్ ప్రస్తావన వచ్చింది. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “ప్రళయదినాన ఆయనకు నా సిఫారసు కొంత ప్రయోజనం కలిగిస్తుందని నేను ఆశిస్తున్నాను. ఆయన నరకంలోని పై అంతస్తులో ఉంచబడతారు. అక్కడ నరకాగ్ని ఆయన కాళ్ళ మడమల వరకు మాత్రమే చేరుతుంది. ఆ వేడికి ఆయన మెదడు కుతకుత ఉడికిపోతూ ఉంటుంది.”
[సహీహ్ బుఖారీ : 63వ ప్రకరణం – మనాఖిబిల్ అన్సార్, 40వ అధ్యాయం – ఖిస్సతి అబీతాలిబ్)
89వ అధ్యాయం – యావత్తు నరకవాసులలో అతి తక్కువ శిక్ష అనుభవించేవాడు
أهون أهل النار عذابًا
127 – حديث النُّعْمَانِ بْنِ بَشِيرٍ قَالَ: سَمِعْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: إِنَّ أَهْوَنَ أَهْلِ النَّارِ عَذَابًا يَوْمَ الْقِيَامَةِ لَرَجُلٌ تَوضَعُ فِي أَخْمَصِ قَدَميْهِ جَمْرَةٌ يَغْلِي مِنْهَا دِمَاغُهُ
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 51 باب صفة الجنة والنار
127. హజ్రత్ నూమాన్ బిన్ బషీర్ (రదియల్లాహు అన్హు) కథనం:- నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా చెబుతుండగా విన్నాను: “ప్రళయదినాన అందరికంటే అతి తేలిక శిక్ష చవి చూసేవాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే అతని పాదాల క్రింద అగ్ని కణాలు ఉంటాయి. వాటి వేడికి అతని మెదడు కుతకుత ఉడికిపోతూ ఉంటుంది.”
(సహీహ్ బుఖారీ : 81వ ప్రకరణం – రిఖాఖ్, 51వ అధ్యాయం – సిఫతిల్ జన్నతి వన్నార్)
91వ అధ్యాయం – విశ్వాసుల మధ్య పరస్పర స్నేహ సంబంధాలు
موالاة المؤمنين ومقاطعة غيرهم والبراءة منهم
128 – حديث عَمْرِو بْنِ الْعَاصِ، قَالَ: سَمِعْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ جِهَارًا غَيْرَ سِرٍّ يَقُولُ: إِنَّ آلَ أَبِي فُلاَنٍ لَيْسُوا بِأَوْلِيَائِي، إِنَّمَا وَلِيِّيَ اللهُ وَصَالِحُ الْمُؤْمِنِينَ، وَلكِنْ لَهُمْ رَحِمٌ أَبَلُّهًا بِبَلاَلِهَا يَعْنِي أَصِلُهَا بِصِلَتِهَا
__________
أخرجه البخاري في: 78 كتاب الأدب: 14 باب يبل الرحم ببلاها
128. హజ్రత్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బహిరంగంగా ఇలా చెబుతుండగా నేను విన్నాను – “అబూ ఫలా సంతానం నా స్నేహితులు కాదు. అల్లాహ్ మరియు సజునులైన విశ్వాసులే నా స్నేహితులు. కాకపోతే అబూ ఫలా సంతానం నాకు బంధువులయినందున, నేను వారి పట్ల అవసరమైనప్పుడల్లా సద్వర్తనంతో మెలుగుతాను.”
(సహీహ్ బుఖారీ : 78వ ప్రకరణం – అదబ్, 14వ అధ్యాయం – యబుల్లు ర్రహిమ బిబలాలహా)
92వ అధ్యాయం – విచారణ జరగకుండానే స్వర్గంలో ప్రవేశించే ముస్లింలు
الدليل على دخول طوائف من المسلمين الجنة بغير حساب ولا عذاب
129 – حديث أَبِي هُرَيْرَةَ قَالَ: سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: يَدْخُلُ مِنْ أُمَّتِي زُمْرَةٌ هُمْ سَبْعُونَ أَلْفًا تُضِيءُ وُجُوهُهُمْ إِضَاءَةَ الْقَمَرِ لَيْلَةَ الْبَدْرِ
قَالَ أَبُو هُرَيْرَةَ: فَقَامَ عُكَّاشَةُ بْنُ مِحْصَنٍ الأَسَدِيُّ يَرْفَعُ نَمِرَةً عَلَيْهِ، فَقَالَ: يَا رَسُولَ اللهِ ادْعُ اللهَ أَنْ يَجْعَلَنِي مِنْهُمْ، قَالَ: اللهُمَّ اجْعَلْهُ مِنْهُمْ ثُمَّ قَامَ رَجُلٌ مِنَ الأَنْصَارِ فَقَالَ: يَا رَسُولَ اللهِ ادْعُ اللهَ أَنْ يَجْعَلَنِي مِنْهُمْ، فَقَالَ: سَبَقَكَ عُكَّاشَةُ
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 50 باب يدخل الجنة سبعون ألفًا بغير حساب
129. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా చెబుతుండగా విన్నాను – “నా అనుచర సమాజంలో డెబ్బై వేల మంది జన సమూహం ఒకటి స్వర్గంలో ప్రవేశిస్తుంది. (స్వర్గంలో) వారి ముఖాలు, పూర్ణచంద్రుడిలా ప్రకాశిస్తూ ఉంటాయి.” హజ్రత్ అక్కాషా బిన్ ముహ్సిన్ అసది (రదియల్లాహు అన్హు) ఈ మాటలు విని అంగవస్త్రం దగ్గరికి లాక్కొని లేచి నిల్చున్నారు. నిల్చొని “దైవప్రవక్తా! అలాంటి వారిలో నన్ను కూడా చేర్చమని అల్లాహ్ ను ప్రార్థించండి” అని అన్నారు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “అల్లాహ్! అక్కాషాను అలాంటి వారిలో చేర్చు” అని ప్రార్థించారు.
ఆ తరువాత అన్సార్ ముస్లింల నుండి ఒక వ్యక్తి లేచి “దైవ ప్రవక్తా! అల్లాహ్ నన్ను కూడా అలాంటి వారిలో చేర్చమని ప్రార్ధన చేయండి” అని అన్నారు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధానమిస్తూ “ప్రార్థన విషయంలో అక్కాషా నీ కంటే మించిపోయాడు” అని అన్నారు.
[సహీహ్ బుఖారీ : 81వ ప్రకరణం – రిఖాఖ్, 50వ అధ్యాయం – యద్ ఖులుల్ జన్నత సబ్ వూన అల్ఫన్ బిగైరి హిసాబ్]
130 – حديث سَهْلِ بْنِ سَعْدٍ أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: لَيَدْخُلَنَّ الْجَنَّةَ مِنْ أُمَّتِي سَبْعُونَ أَلْفًا، أَوْ سَبْعُمِائَةِ أَلْفٍ (لاَ يَدْرِي الرَّاوِي أَيَّهُمَا قَالَ) مُتَمَاسِكونَ آخِذٌ بَعْضُهُمْ بعضًا، لاَ يَدْخُلُ أَوَّلُهُمْ حَتَّى يَدْخُلَ آخِرُهُمْ، وُجُوهُهُمْ عَلَى صُورَةِ الْقَمَرِ لَيْلَةَ الْبَدْرِ
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 51 باب صفة الجنة والنار
130. హజ్రత్ సహల్ బిన్ సాద్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు : “నా అనుచర సమాజంలో డెబ్బైవేల మంది లేదా ఏడు లక్షల మంది (కచ్చితమైన సంఖ్యను గురించి హదీసు ఉల్లేఖకుడు సందిగ్ధంలో పడిపోయాడు). ఒకరి చేతులు మరొకరు పట్టుకొని స్వర్గంలో ప్రవేశిస్తారు. వారిలో చివరి వ్యక్తి స్వర్గంలో ప్రవేశంచనంతవరకు మొదటి వ్యక్తి కూడా స్వర్గంలో అడుగు పెట్టడు. (స్వర్గంలో) వారి ముఖాలు పూర్ణచంద్రుడిలా దేదీప్యమానంగా వెలిగిపోతుంటాయి.”
[సహీహ్ wుఖారీ : 81వ ప్రకరణం — రిఖాఖ్ , 51వ అధ్యాయం – సిఫతుల్ జన్నతి వన్నార్]
131 – حديث ابْنِ عَبَّاسٍ قَالَ: خَرَجَ عَلَيْنَا النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَوْمًا فَقَالَ عُرِضَتْ عَلَيَّ الأُمَمُ فَجَعَلَ يَمُرُّ النَّبِيُّ مَعَهُ الرَّجُلُ، وَالنَّبِيُّ مَعَهُ الرَّجُلاَنِ، وَالنَّبِيُّ مَعَهُ الرَّهْطُ، وَالنَّبِيُّ لَيْسَ مَعَهُ أَحَدٌ، وَرَأَيْتُ سَوَادًا كَثِيرًا سَدَّ الأُفُقَ، فَرَجَوْتُ أَنْ تَكُونَ أُمَّتِي، فَقِيلَ هذَا مُوسى وَقَوْمُهُ؛ ثُمَّ قِيلَ لي انْظُرْ، فَرَأَيْتُ سَوَادًا كَثِيرًا سَدَّ الأُفُقَ، فَقِيلَ لِي انْظُرْ هكَذَا وَهكَذَا، فَرَأَيْتُ سَوَادًا كَثِيرًا سَدَّ الأُفُقَ، فَقِيلَ هؤُلاَءِ أُمَّتُكَ، وَمَعَ هؤُلاَءِ سَبْعُونَ أَلْفًا يَدْخُلُونَ الْجَنَّةَ بَغَيْرِ حِسَابٍ فَتَفَرَّقَ النَّاسُ وَلَمْ يُبَيِّنْ لَهُمْ؛ فَتَذَاكَرَ أَصْحَابُ [ص:55] النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالُوا: أَمَّا نَحْنُ فَوُلِدْنا فِي الشِّرْكِ، وَلكِنَّا آمَنَّا بِاللهِ وَرَسُولِهِ، وَلكِنَّ هؤُلاَءِ هُمْ أَبْنَاؤُنَا فَبَلَغَ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: هُمُ الَّذِينَ لاَ يَتَطَيَّرُونَ وَلاَ يَسْتَرْقُونَ وَلاَ يَكْتَوُونَ وَعَلَى رَبِّهِمْ يَتَوَكَّلُونَ فَقَامَ عُكَّاشَةُ بْنُ مِحْصَنٍ، فَقَالَ أَمِنْهُمْ أَنَا يَا رَسُولَ اللهِ قَالَ: نَعَمْ فَقَامَ آخَرُ فَقَالَ: أَمِنْهُمْ أَنَا فَقَالَ: سَبَقَكَ بِهَا عُكَّاشَةُ
__________
أخرجه البخاري في: 76 كتاب الطب: 42 باب من لم يَرْقِ
131. హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం:- ఓ రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ అనుచరుల దగ్గరికి వచ్చి ఇలా అన్నారు – నాకు వివిధ అనుచర సమాజాలను చూపించడం జరిగింది. (వారికి సారథ్యం వహిస్తూ) దైవప్రవక్తలు నా ముందు నుంచి (స్వర్గం వైపు) వెళ్ళసాగారు. అప్పుడు కొందరు ప్రవక్తల వెనుక ఒక్కొక్క వ్యక్తి మాత్రమే ఉన్నాడు. అలాగే కొందరు ప్రవక్తల వెనుక ఇద్దరేసి వ్యక్తులు ఉంటే, మరికొందరు ప్రవక్తల వెనుక ఓ చిన్న సమూహం ఉండేది. అసలు ఒక్క మనిషి కూడా తమ వెనుక లేని దైవప్రవక్తలు కూడా వారిలో ఉన్నారు. ఆ తరువాత నాకు ఒక పెద్ద జన సమూహం కన్పించింది. అది యావత్తు దిగ్మండలం విస్తరించి ఉంది. అది నా అనుచర సమాజం కావచ్చని భావించాను. కాని ఆ సమూహం హజ్రత్ మూసా (అలైహిస్సలాం), ఆయన అనుచర సమాజమని నాకు తెలియజేయబడింది.
ఆ తరువాత అటు చూడమని నాతో అన్నారు (దైవదూతలు). నేను తల పైకెత్తి అటు చూశాను. చూస్తే బ్రహ్మాండమైన జన సమూహం ఒకటి యావత్తు దిగ్మండలంపై కనుచూపు మేరకు విస్తరించి ఉండటం కన్పించింది. కాస్త కుడి ఎడమల వైపు ఇటు అటు కూడా చూడమని అన్నారు. నేను అలాగే చూశాను. ఎటు చూసినా జనసంద్రమే. యావత్తు దిగ్మండలం జన సమూహంతో కప్పి వేయబడింది.
అప్పుడు దైవదూతలు “ఈ జన సమూహం మీ అనుచర సమాజమే. వీరిలో డెబ్బై వేల మంది ఎలాంటి విచారణ జరగకుండానే స్వర్గంలో ప్రవేశిస్తారు” అని తెలిపారు. ఆ తరువాత ప్రవక్త అనుచరులు లేచి వెళ్ళిపోయారు. (ఈ డెబ్బైవేల మంది ఎవరయి ఉంటారో) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వివరించలేదు. దాంతో కొందరు అనుచరులు పరస్పరం మాట్లాడుకుంటూ “మనం అవిశ్వాసం, బహుదైవారాధనల వాతావరణంలో పుట్టాము. ఆ తరువాతనే కొంత కాలానికి అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను విశ్వసించాము. అందువల్ల (విచారణ జరగకుండా) స్వర్గంలో ప్రవేశించే ఈ (డెబ్బైవేల మంది) ప్రజలు మనం కాము, మన సంతానం అయి ఉండొచ్చు” అని అన్నారు.
ఈ మాటలు చివరికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు చేరాయి. అప్పుడాయన విషయం విశదీకరిస్తూ “వారు (అంటే విచారణ జరగకుండా స్వర్గానికి వెళ్ళేవారు) దుశ్శకునాలను పాటించరు; మంత్రాలు, తాయత్తుల జోలికి పోరు; కాల్పులు, వాతలతో చికిత్స చేయించుకోరు, వారు తమ ప్రభువును మాత్రమే నమ్ముకొని (ఏ కష్టమొచ్చినా) ఆయన మీదే ఆధారపడతారు” అని అన్నారు.
ప్రవక్త అనుచరులలో హజ్రత్ అక్కాషా(రదియల్లాహు అన్హు) ఈ మాటలు వినగానే లేచి నిలబడి “దైవప్రవక్తా! నేను కూడా ఆ జనంలో చేరి ఉంటానా?” అని అడిగారు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఆ….. నువ్వుకూడా వారిలో ఉంటావు” అని చెప్పారు. తరువాత మరొక వ్యక్తి లేచి “దైవప్రవక్తా! మరి నేను కూడా వారిలో చేరి ఉంటానా?” అని అడిగాడు. అయితే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (అతనికి పై విధంగా సమాధానమివ్వకుండా) “అక్కాషా నీ కంటే మించిపోయాడు” అని (మాత్రమే) అన్నారు.
[సహీహ్ బుఖారీ : 76వ ప్రకరణం – అత్తిబ్, 42 వ అధ్యాయం – మల్లమ్ యర్ ఖ్ )
132 – حديث عَبْدِ اللهِ بْنِ مَسْعُودٍ قَالَ: كُنَّا مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فِي قبَّةٍ، فَقَالَ: أَتَرْضَوْنَ أَنْ تَكُونُوا رُبُعَ أَهْلِ الْجَنَّةِ قُلْنَا: نَعَمْ، قَالَ: أَتَرْضَوْنَ أَنْ تَكُونُوا ثُلُثَ أَهْلِ الْجَنَّةِ قُلْنَا: نَعَمْ، قَالَ: أَتَرْضَوْنَ أَنْ تَكُونُوا شَطْرَ أَهْلِ الْجَنَّةِ قُلْنَا: نَعَمْ قَالَ: وَالَّذِي نَفْسُ مُحَمَّدٍ بِيَدِهِ إِنِّي لأَرْجُو أَنْ تَكُونُوا نِصْفَ أَهْلِ الْجَنَّةِ، وَذَلِكَ أَنَّ الْجَنَّةَ لاَ يَدْخُلُها إِلاَّ نَفْسٌ مُسْلِمَةٌ، وَمَا أَنْتُمْ فِي أَهْلِ الشِّرْكِ إِلاَّ كَالشَّعَرَةِ الْبَيْضَاءِ فِي جِلْدِ الثَّوْرِ الأَسْوَدِ، أَوْ كَالشَّعَرَةِ السَّوْدَاءِ فِي جِلْدِ الثَّوْرِ الأَحْمَرِ
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 45 باب كيف الحشر
132. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రదియల్లాహు అన్హు) కథనం:- ఒకసారి మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో పాటు ఓ గుడారంలో కూర్చుని ఉన్నాము. అప్పుడు దైవప్రవక్త మమ్మల్ని ఉద్దేశించి “మీరు స్వర్గవాసుల్లో నాల్గో వంతు సంఖ్యలో ఉంటారంటే మీకు సంతోషమేనా?” అని అడిగారు. దానికి మేము ‘సంతోషమే’ అన్నాము. “మరి మీరు స్వర్గవాసుల్లో మూడో వంతు సంఖ్యలో ఉంటారంటే మీకు సంతోషమేనా?” అన్నారు. తిరిగి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). మేము ‘సంతోషమే’ అన్నాము. “మరి మీరు స్వర్గవాసుల్లో సగం మంది ఉంటారంటే మీకు సంతోషమేనా?” అన్నారు ఆయన మళ్ళీ. మేము మళ్ళీ ‘సంతోషమే’ అన్నాము. అప్పుడాయన ఇలా అన్నారు: “ఎవరి అధీనంలో ముహమ్మద్ ప్రాణం ఉందో ఆ శక్తిమంతుని సాక్ష్యం! మీరు మొత్తం స్వర్గవాసుల్లో సగం మంది ఉంటారని నేను ఆశిస్తున్నాను. తన మనోమస్తిష్కాలను పూర్తిగా అల్లాహ్ కి సమర్పించుకొని, ఆయన ఆజ్ఞలకు బద్దుడయి జీవితం గడిపేవాడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. మీ పరిస్థితి బహుదైవారాధకులకు భిన్నంగా నల్లెద్దు చర్మంపై ఒకటి అరా తెల్ల వెంట్రుకలున్నట్లు లేదా ఎర్రెద్దు చర్మం పై ఒకటి అరా నల్ల వెండ్రుకలున్నట్లు ఉంది.”
[సహీహ్ బుఖారీ : 81వ ప్రకరణం – రిఖాఖ్, 45వ అధ్యాయం – కైఫల్ హష్ర్]
94వ అధ్యాయం – ప్రతి వేయి మందిలో తొమ్మిదొందల తొంభై తొమ్మిది మంది నరక వాసులే
قوله يقول الله لآدم: أخرج بعث النار من كل ألف تسعمائة وتسعة وتسعين
133 – حديث أَبِي سَعِيدٍ، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: يَقُولُ اللهُ: يَا آدَمُ فَيَقُولُ: لَبَّيْكَ وَسَعْدَيكَ وَالْخَيْرُ فِي يَدَيْكَ قَالَ: يَقُولُ: أَخْرِجْ بَعْثَ النَّارِ، قَالَ: وَمَا بَعثُ النَّارِ قَالَ: مِنْ كُلِّ أَلْفٍ، تِسْعَمِائَةٍ وَتِسْعَةً وَتِسْعِينَ، فَذَاكَ حَينَ يَشِيبُ الصَّغِيرُ، وَتَضَعُ كُلُّ ذَاتِ حَمْلٍ حَمْلَهَا، وَتَرَى النَّاسَ سُكَارَى وَمَا هُمْ بِسُكَارَى [ص:56] وَلكِنَّ عَذَابَ اللهِ شَدِيدٌ فَاشْتَدَّ ذَلِكَ عَلَيْهِمْ، فَقَالُوا يَا رَسُولَ اللهِ أَيُّنَا ذَلِكَ الرَّجُلُ قَالَ: أَبْشِرُوا فَإِنَّ مِنْ يَأْجُوج وَمَأجُوجَ أَلْفًا وَمِنْكُمْ رَجُلٌ، ثُمَّ قَالَ: وَالَّذِي نَفْسِي في يَدِهِ إِنِّي لأَطْمَعُ أَنْ تَكُونُوا ثُلُثَ أَهْلِ الْجَنَّةِ، قَالَ: فَحَمِدْنَا اللهَ وَكَبَّرْنَا، ثُمَّ قَالَ: وَالَّذِي نَفْسِي فِي يَدِهِ إِنِّي لأَطْمَعُ أَنْ تَكُونُوا شَطْرَ أَهْل الجَنَّةِ، إِنَّ مَثَلَكُمْ فِي الأُمَمِ كَمَثَلِ الشَّعَرَةِ الْبَيْضَاءِ فِي جِلْدِ الثَّوْرِ الأَسْوَدِ، أَوِ الرَّقْمَةِ فِي ذِرَاعِ الْحِمَارِ
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: باب قوله عز وجل إن زلزلة الساعة شيء عظيم
133. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు: (ప్రళయదినాన) అల్లాహ్ హజ్రత్ ఆదం (అలైహిస్సలాం)ని “ఆదం!” అని పిలుస్తాడు. దానికి ఆయన “నేను ఉన్నాను (అల్లాహ్!) నీ ఆజ్ఞ శిరసావహించడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రతి మంచీ, మేలు నీ చేతిలోనే ఉన్నాయి” అని అంటారు. “నరకానికి పంపవలసిన వారిని ప్రజల నుండి వేరు చెయ్యి” అంటాడు అల్లాహ్. “నరకానికి పంపవలసిన వారు ఎంత మంది ఉన్నారు?” అని అడుగుతారు హజ్రత్ ఆదం (అలైహిస్సలాం). “ప్రతి వేయి మందిలో తొమ్మిదొందల తొంభై తొమ్మిది మంది” అంటాడు అల్లాహ్.
అది అత్యంత కఠిన సమయం. (తీవ్రమైన ఆందోళన, అమితమైన దిగులుతో) బాలుడు సయితం వృద్దుడయిపోతాడు. గర్బిణీ స్త్రీకి గర్భస్రావం జరిగిపోతుంది. మానవులు ఒక విధమైన మైకంలో పడి ఉంటారు. నిజానికి వారు ఏమైకంలోనూ ఉండరు. దైవశిక్ష ప్రభావంతో వారి పరిస్థితి అలా మారిపోతుంది.
ఈ మాటలు విని ప్రవక్త అనుచరులు ఎంతో కంగారుపడిపోతూ “దైవప్రవక్తా! ఆ వేయి మందిలో స్వర్గానికి పోయేవారు ఒక్కరు అయితే మాలో ఆ ఒక్కరు ఎవరెవరయి ఉంటారు?” అని అన్నారు. “భయపడకండి, సంతోషించండి. నరకానికి పోయే వారిలో వేయి మంది యాజూజ్, మాజూజ్ జాతుల వారయి ఉంటే, ఒక్కడు మాత్రమే మీలోని వాడయి ఉంటాడు” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). తిరిగి ఆయన ఇలా అన్నారు “ఎవరి అధీనంలో నా ప్రాణం ఉందో ఆ శక్తిమంతుని సాక్ష్యం ! మొత్తం స్వర్గవాసుల్లో మీరు మూడోవంతు సంఖ్యలో ఉంటారని నేను ఆశిస్తున్నాను” అని అన్నారు.
హదీసు ఉల్లేఖించిన వారు ఇలా అంటున్నారు: “ఈ మాట విని మేము అల్లాహ్ ఔన్నత్యాన్ని స్తుతిస్తూ, అల్లాహు అక్బర్ అన్నాము.” ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తిరిగి ఈ విధంగా అన్నారు: “ఎవరి గుప్పెట్లో నా ప్రాణం ఉందో ఆ మహాన్నతుడి సాక్ష్యం! మొత్తం స్వర్గవాసుల్లో మీ సంఖ్య సగం ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఇతర సమాజాలతో పోల్చుకుంటే మీ సమాజం సంఖ్య నల్లెద్దు చర్మం మీద ఒక్క తెల్ల వెంట్రుక ఉన్నట్లు లేదా గాడిద డొక్క మీద ఓ (చిన్న) మచ్చ ఉన్నట్లు ఉంటుంది”.
[సహీహ్ బుఖారీ : 81వ ప్రకరణం – రిఖాఖ్, 46వ అధ్యాయం – ఇన్నజల్ జలతస్సా అతి షై వున్ అజీమ్)
మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .
విశ్వాస ప్రకరణం [PDF]