ప్రళయ దినాన మన కర్మ పత్రాలు మన చేతిలో ఇవ్వబడటం [మరణానంతర జీవితం – పార్ట్ 49] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

ప్రళయ దినాన మన కర్మ పత్రాలు మన చేతిలో ఇవ్వబడటం
[మరణానంతర జీవితం – పార్ట్ 49]
https://www.youtube.com/watch?v=LJvDCtqg1H0 [23 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహిల్లజీ హదానా లిహాదా వమా కున్నా లినహ్తదియ లవ్లా అన్ హదానల్లాహ్. వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ వఅలా ఆలిహి వమన్ వాలాహ్. అమ్మాబాద్. ఋజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

ప్రళయ దినాన మన కర్మ పత్రాలు మన చేతిలో ఇవ్వబడటం ఈ విషయాల వివరణలు మనం తెలుసు కుంటున్నాము.

అయితే మహాశయులారా, గత కార్యక్రమంలో మనం ఇహలోకంలో మన కర్మలన్నీ కూడా వ్రాయబడుతున్నాయి అనే విషయానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నాము. ఎప్పుడైతే పరలోకంలో మనం హాజరవుతామో అక్కడ మన కర్మ పత్రాలు మన ముందు తెరవబడటం జరుగుతుంది. ప్రతీ మనిషి ఇహలోకంలో అతను చదువుకున్నా, చదువుకోకున్నా అతడు జ్ఞాని అయినా అజ్ఞాని అయినా ప్రళయ దినాన అతని మెడలో అతని యొక్క కర్మ పత్రం ఉంటుంది. స్వయంగా దానిని అతను చదువుకోవచ్చు కూడా. స్వయంగా అతను దానిని చదువుకునే అటువంటి శక్తి కూడా ఆ రోజు అల్లాహు తఆలా అతనికి ప్రసాదిస్తాడు.

ఒకసారి సూరత్ బనీ ఇస్రాయీల్, దాని మరొక పేరు సూరతుల్ ఇస్రా. సూరతుల్ ఇస్రాలోని ఈ ఆయతు చదవండి.

وَكُلَّ إِنسَانٍ أَلْزَمْنَاهُ طَائِرَهُ فِي عُنُقِهِ
وَنُخْرِجُ لَهُ يَوْمَ الْقِيَامَةِ كِتَابًا يَلْقَاهُ مَنشُورًا
إقْرَأْ كِتَابَكَ
كَفَىٰ بِنَفْسِكَ الْيَوْمَ عَلَيْكَ حَسِيبًا

మేము ప్రతీ మనిషి యొక్క మంచి చెడులను అతని మెడలో వ్రేలాడదీశాము. ప్రళయ దినాన మేము అతని కర్మ పత్రాలను వెలికి తీస్తాము. అతను దానిని ఒక తెరువబడిన పుస్తకం మాదిరిగా స్పష్టంగా చూస్తాడు పొందుతాడు. అప్పుడు అతనితో చెప్పడం జరుగుతుంది. నీవు నీ ఈ కర్మ పత్రాన్ని చదువుకో. ఈ రోజు నీ లెక్క తీసుకోవటానికి నీవే చాలు.

తఖ్దీర్ (విధి వ్రాత) పై విశ్వాసం [వీడియో]

బిస్మిల్లాహ్

[3:40 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.
విశ్వాస మూల సూత్రాలు (Fundamentals of Belief in Islam) [పుస్తకం & వీడియోలు]

6- మంచి, చెడు ‘ తఖ్దీర్’ (అదృష్టం)పై విశ్వాసం:

‘తఖ్దీర్‌’ పై విశ్వాసంలో నాలుగు విషయాలు వస్తాయి:

మొదటిది: భూతకాలములో జరిగినది, భవిష్యత్తులో జరగబోయేది సర్వమూ తెలిసినవాడు అల్లాహ్‌. తన దాసుల పరిస్థితులు సయితం ఆయనకు తెలుసు. ఇంకా వారి జీవనోపాయం, వారి చావు, వారు చేసే కర్మలన్నియూ ఎరిగినవాడు ఆయనే. ఆ పరమ పవిత్రునికి వారి ఏ విషయమూ మరుగుగా లేదు.

إِنَّ اللَّهَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ

(నిశ్చయముగా అల్లాహ్‌ కు సర్వమూ తెలియును). (సూరె తౌబా 9: 115).

రెండవది: ఆయన సృష్టిలో ఉన్న ప్రతీ దాని అదృష్టాన్ని వ్రాసి పెట్టాడు.

وَكُلَّ شَيْءٍ أَحْصَيْنَاهُ فِي إِمَامٍ مُّبِينٍ

(ప్రతి విషయాన్నీ మేము ఒక స్పష్టమైన గ్రంథంలో వ్రాసి పెట్టాము). (సూరె యాసీన్‌ 36: 12).

మూడవది: ప్రతి విషయం అల్లాహ్ ఇష్టముపై ఆధారపడి యుంది. ఆయన తలచినది తక్షణమే అవుతుంది. తలచనిది కానే కాదు అని విశ్వసించాలి. సూర ఆలి ఇమ్రాన్‌ (3:40)లో ఉంది:

كَذَٰلِكَ اللَّهُ يَفْعَلُ مَا يَشَاءُ

(అలానే అవుతుంది. అల్లాహ్‌ తాను కోరినదానిని చేస్తాడు).

నాల్గవది: అల్లాహ్‌ దేని తఖ్దీర్‌ నిర్ణయించాడో అది సంభవించక ముందే దానిని పుట్టించి ఉన్నాడు.

وَاللَّهُ خَلَقَكُمْ وَمَا تَعْمَلُونَ

(వాస్తవానికి అల్లాహ్‌ యే మిమ్మల్నీ మీరు చేసిన వాటినీ సృష్టించాడు). (సూరె సాఫ్ఫాత్‌ 37: 96).