నెలవంక చూసి ఉపవాసం ఉండండి మరియు నెలవంక చూసి పండగ జరుపుకోండి [వీడియో]

బిస్మిల్లాహ్

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (7:49 నిముషాలు)

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇతరములు:

రమజానుకు ఒకటి, రెండు రోజుల ముందు ఉపవాసం ఉండకండి [వీడియో]

బిస్మిల్లాహ్

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (4:28 నిముషాలు)

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇతరములు:

షాబాన్ నెల యెుక్క వాస్తవికత! షాబాన్ సున్నతులేమిటి? దురాచారాలేమిటి? [పుస్తకం]

బిస్మిల్లాహ్

సంకలనం : ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

షాబాన్ సున్నతులేమిటి? దురాచారాలేమిటి?

షాబన్ ఇస్లమీయ క్యాలెండర్ ప్రకారం 8వ మాసం. దీనికి ముందు రజబ్ గౌరవప్రదమైన నాలుగు మాసాల్లో ఒకటి. దీని తర్వాత రమజాన్ చాలా ఘనతగల మాసం.

షాబాన్ లో సున్నతులు:

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ మాసంలో అధికంగా ఉపవాసాలు పాటించేవారు.

ఒక సందర్భంలో ఉసామా (రజియల్లాహు అన్హు) అడిగారు, ఓ ప్రవక్తా! మీరు షాబాన్ మాసంలో పాటించినన్ని ఉపావాసాలు వేరే ఏ మాసంలో పాటించేది చూడలేదు, అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు:

“ఇది రజబ్ మరియు రమజాను మధ్యలో ఉన్న మాసం, ఇందులో ప్రజలు అశ్రద్ధకు లోనై ఉంటారు. ఈ మాసంలోనే ప్రజల కర్మలు అల్లాహ్ ఎదుట లేపబడతాయి. నేను ఉపవాస స్థితిలో ఉండగా నా కర్మలు లేపబడాలని నా కోరిక”

(నిసాయి 2357, ముస్నద్ అహ్మద్ 21753. షేఖ్ అల్బానీ హసన్ అన్నారు.)

సలఫ్ పద్ధతి: సహాబా, తాబిఈన్ తదితరులు అధికంగా ఉపవాసంతో పాటు ఖుర్ఆన్ కూడా ఎక్కువగా పారాయణం చేసేవారు. దీని తర్వాత రమజాను మాసం గనక, అందులో ఈ మంచి అలవాటు స్థిరపడిపోతుంది. (లతాఇఫుల్ మఆరిఫ్.)

సారాంశం:  ఈ మాసంలో అధికంగా ఉపవాసాలు పాటించడం ప్రవక్త సున్నత్.

దురాచారాలు:

షాబాన్ 15వ రాత్రి జాగారం. ప్రత్యేక నమాజులు. పగలు ఉపవాసం. సమాధుల సందర్శన. ఈ రాత్రి చనిపోయినవారి ఆత్మలు వస్తాయని మూఢనమ్మకం.అందుకు మస్జిదులు, ఇండ్ల అలంకరణ. ప్రత్యేక వంటకాలు.

దురాచార ఆధారాలు వాటి వాస్తవికతలు:

షాబాన్ 15వ రాత్రి చాలా ఘనత గలదని ఖుర్ఆనులో సూర దుఖాన్ (44) ఆయతు 3లోని “లైలతుమ్ ముబారక” (శుభప్రదమైన రాత్రి) అన్న పదాన్ని చూపిస్తారు.

జవాబు: 44:3లో దివ్వ ఖుర్ఆన్ శుభప్రదమైన రాత్రిలో అవతరించిందని ఉంది. అయితే ఆ శుభప్రదమైన రాత్రి షాబాన్ లో లేదు, రమజానులో ఉంది. ఎలా అంటే దివ్వ ఖుర్ఆన్ అవతరణ విషయం అల్లాహ్ సూర ఖద్ర్ (97)లో కూడా పేర్కొన్నాడు. మరియు సూర బఖర (2) ఆయతు 183 లో స్పష్టంగా తెలిపాడు: ఈ ఖుర్ఆన్ రమజానులో అవతరించిందని. 

(1) షాబాన్ నెల యెుక్క వాస్తవికత! – మెదటి బాగం

ఖుర్ఆన్  లో వచ్చిన  ‘శుభప్రదమైన రాత్రి’ అంటే  షాబాన్ నెలలో వచ్చే 15వ రాత్రినా? లేక రమజాన్ నెలలో వచ్చే లైలతుల్  ఖద్ర్ నా?  ఖుర్ఆన్ వెలుగులో తెలుసుకుందాము ఇన్ షా అల్లాహ్.

సూరహ్ అద్ దుఖాన్ ఆయాతును చూపించి షాబాన్ నెల 15 తేది రాత్రి షబెే బరాత్ శుభప్రదమైన రాత్రని చాలా మంది అపోహను కలిగివున్నారు.  ఆ ఆయతు మరియు తఫ్సీర్ లను చదివి సత్యాన్ని తెలుసుకుందాము

حمٓ  وَٱلْكِتَٰبِ ٱلْمُبِينِ
హా మీమ్‌. స్పష్టమైన   ఈ   గ్రంథం   తోడు!

إِنَّآ أَنزَلْنَٰهُ فِى لَيْلَةٍۢ مُّبَٰرَكَةٍ ۚ إِنَّا كُنَّا مُنذِرِينَ
నిశ్చయంగా   మేము   దీనిని   శుభప్రద   మైన   రాత్రియందు   అవత   రింపజేశాము.   నిస్సందేహంగా   మేము   హెచ్చరిక   చేసేవాళ్ళము.

فِيهَا يُفْرَقُ كُلُّ أَمْرٍ حَكِيم
ఆ   రాత్రియందే   కీలకమైన   ప్రతి   ఉత్తర్వూ   జారీ   చేయబడు   తుంది.

أَمْرًۭا مِّنْ عِندِنَآ ۚ إِنَّا كُنَّا مُرْسِلِينَ
మా   వద్ద   నుండి   ఆజ్ఞ   రూపంలో!   (ప్రవక్తలను)   పంపేది   కూడా   మేమే.

رَحْمَةًۭ مِّن رَّبِّكَ ۚ إِنَّهُۥ هُوَ ٱلسَّمِيعُ ٱلْعَلِيمُ
నీ   ప్రభువు   దయానుగ్రహం   వల్ల.   ఆయన   సర్వం   వినేవాడు,   సర్వం   తెలిసినవాడు.

رَبِّ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ وَمَا بَيْنَهُمَآ ۖ إِن كُنتُم مُّوقِنِينَ
మీరు   గనక   నమ్మగలిగితే   ఆయనే   భూమ్యాకాశాలకు,   వాటి   మధ్యనున్న   సమస్తానికీ   ప్రభువు.

لَآ إِلَٰهَ إِلَّا هُوَ يُحْىِۦ وَيُمِيتُ ۖ رَبُّكُمْ وَرَبُّ ءَابَآئِكُمُ ٱلْأَوَّلِينَ
ఆయన   తప్ప   మరో   ఆరాధ్య   దైవం   లేడు.   ఆయనే   బ్రతికిస్తున్నాడు,   ఆయనే   చంపుతున్నాడు.   ఆయనే   మీ   ప్రభువు,   పూర్వీకు   లైన   మీ   తాతముత్తాతలకు   కూడా   (ఆయనే)   ప్రభువు.

(ఖుర్’ఆన్  44 :1 – 8)

పై ఆయతులో వచ్చిన శుభప్రదమైన రాత్రి అంటే లైలతుల్ ఖద్ర్ (ఘనమైన రాత్రి) అని భావం. ఈ లైలతుల్ ఖద్ర్ రమజాన్ నెల చివరి దశకంలోని బేసి రాత్రుల్లో ఏదో ఒకటి అయి ఉంటుంది.

దివ్య ఖుర్ఆన్ అవతరించిన నెల రమజాన్ నెల”  – అల్ బఖర – 185.అని చెప్పబడటం గమనార్హం.

అలాగే “మేము ఈ ఖుర్ఆన్ ను ఘనమైన రాత్రి యందు అవతరింపజేశాము” అని అల్ ఖద్ర్ సూరాలో సెలవీయబడటం కూడా గమనార్హమే.

ఆ ఘనమైన రేయినే ఈ సూరాలో శుభప్రదమైన రేయిగా పేర్కోనటం జరిగింది. అది శుభప్రదమైన రేయి అనటంలో సందేహానికి తావేలేదు. ఎందుకంటే

ِ إِنَّآ أَنزَلْنَٰهُ فِى لَيْلَةِ ٱلْقَدْرِ
నిశ్చయంగా మేము దీనిని (ఈ ఖుర్ఆనును రమజాను నెలలో) ఘనమైన రాత్రి యందు అవతరింపజేశాము.

وَمَآ أَدْرَىٰكَ مَا لَيْلَةُ ٱلْقَدْرِ
ఘనమైన రాత్రి గురించి నువ్వేమనుకున్నావు?

لَيْلَةُ ٱلْقَدْرِ خَيْرٌ مِّنْ أَلْفِ شَهْرٍ
ఘనమైన రాత్రి వెయ్యి నెలల కంటే కూడా మేలైనది.

تَنَزَّلُ ٱلْمَلَٰٓئِكَةُ وَٱلرُّوحُ فِيهَا بِإِذْنِ رَبِّهِم مِّن كُلِّ أَمْرٍ
ఆ రాత్రి యందు దైవదూతలు, ఆత్మ (జిబ్రయీల్) తమ ప్రభువు ఉత్తర్వుపై సమస్త విషయాల (నిర్వహణ) నిమిత్తం (దివి నుంచి భూమికి) దిగివస్తారు.

سَلَٰمٌ هِىَ حَتَّىٰ مَطْلَعِ ٱلْفَجْرِ
ఆ రాత్రి అసాంతం శాంతియుతమైనది – తెల్లవారే వరకూ (అది ఉంటుంది).

ఖుర్’ఆన్ 97 :(1 – 5)

దివ్యఖుర్ఆన్ ఘనమైన రాత్రిన లేక శుభకరమైన రాత్రిన అవతరించిందంటే దాని భావం ఇదే. ఆ రాత్రి నుంచి మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దాని అవతరణాక్రమం ఆరంభమయింది. అంటే తొట్టతొలిసారి ఈ రాత్రియందే ఈ గ్రంధం అంతిమ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై అవతరించింది. లేక దీని భావం ఇది:

ఈ రాత్రియందే దివ్యఖుర్ఆన్ “లౌహె మహ్ పూజ్” నుంచి క్రింది ఆకాశంలో ఉన్న ‘బైతుల్ ఇజ్జత్‘ లోకి దించబడింది. మరి అక్కణ్ణుంచి అవసరాల కనుగుణంగా కొద్దికొద్దిగా 23 ఏండ్ల వ్యవధిలో మహానీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై అవతరించింది.

కొంత మంది ‘శుభప్రదమైన రాత్రి’ ని షాబాన్ నెలలో వచ్చే 15వ రాత్రిగా తలపోశారు. కాని ఇది సరైనది కాదు.

ఈ గ్రంధం రమజాన్ మాసంలోని ‘లైలతుల్ ఖద్ర్’ లో అవతరించినట్లు ఖుర్ఆన్ ద్వారా స్పష్టంగా రూఢీ అవుతున్నప్పుడు ఇతరత్రా రాత్రుల గురించి ఆలోచించటం ఎంతమాత్రం సరైంది కాదు.

రెండవ భాగంలో హదీసుల వెలుగులో మరిన్ని విషయాలను తెలుసుకుందాము ఇన్ షా అల్లాహ్!

(2) షాబాన్ నెల యెుక్క వాస్తవికత! – రెండవ భాగం

మెదటి బాగంలో ఖుర్ఆన్ లో వచ్చిన  ‘శుభప్రదమైన రాత్రి’ అంటే రంజాన్ నెలలో చివరిదశలో వచ్చే  లైలతుల్ ఖద్ర్ (ఘనమైన రాత్రి) అని తెలుసుకున్నాము. హదీసుల వెలుగులో  షబేబరాత్ కు సంభందించిన హదీసులు  ప్రామాణికమైనవేనా? తెలుసుకుందాం ఇన్ షా అల్లాహ్.

షాబాన్ 15వ రాత్రి (షబే బరాత్) కి సంబందించిన  హదీసుల్లో ఒకటి మాత్రమే సహీహ్ (హసన్) గా మరియు మిగితా హదీసులు ప్రామాణికమైనవి కావు.!

ఆ హదీసుల్లో కొన్నిటిని గురించి శ్రద్ధగా చదవి సత్యాన్ని తెలుసుకుందాము ఇన్ షా అల్లాహ్!

1)  మెుదటి హదీసు –

హజ్రత్ ఆయిషా (రజియల్లాహు అన్హా)  ఉల్లేఖించారు, ఒకసారి షాబాన్ 15 వ రాత్రి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  నా పడకపై లేకపోవడం వలన వెదుకుతూ ఉండగా  బఖీ స్మశానంలో అగుపించగా నేను అక్కడికెళ్లి కారణం అడుగగా – “ఈ రాత్రి అల్లాహ్ ప్రపంచం వైపు దృష్టిసారిస్తాడు, బని కల్బ్ వారి గొర్రెల వెంట్రుకల కంటే అధిక రెట్లో మానవుల పాపాలను క్షమిస్తాడు” అని చెప్పారు.

ఈ హదీసు ముస్నద్ అహ్మద్, తిర్మిది, ఇబ్నెమాజాలో ఉంది.

పై మూడు గ్రంథాల్లో కూడా ఈ హదీసు ఆయిషా రజియల్లాహు అన్హా ద్వార ఉర్వా, ఉర్వా ద్వారా యహ్ యా, యహ్ యా ద్వారా హజ్జాజ్ విన్నట్లు ఉంది.

అయితే ఇమాం తిర్మిజి ఈ హదీసు చివరిలో ఎంతో స్పష్టంగా చెప్పారు: నేను ముహమ్మద్ బిన్ ఇస్మాయీల్ ద్వారా విన్నాను ఆయన దీనిని బలహీనమైనదని, ప్రామాణికమైనది కాదని చెప్పారు, ఎందుకంటే ఉర్వా ద్వారా యహ్’యా మరియు యహ్’యా ద్వారా హజ్జాజ్ వినలేదు.

(తిర్మిజి, అబ్వాబుస్ సియాం, బాబు మా జాఅ ఫీ లైలతిన్ నిస్ఫి మిన్ షాబాన్. 739)

2) రెండవ హదీసు 

హజ్రత్ అలీ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త  ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:

“షాబాన్ 15 వ రాత్రి  అల్లాహ్ యెుక్క ఆరాధనలో నిలబడు. మరునాడు నీవు ఉపవాసం పాటించు. అల్లాహ్ షాబాన్ 14 నాటి సూర్యాస్తమయం వెంటనే ప్రపంచపు ఆకాశంపై వచ్చి, ఫజ్ర్ వరకు తన పాపాల మన్నింపు కోరేవాడున్నాడా నేను అతడ్ని మన్నిస్తాను, ఉపాధి కోరేవాడున్నాడా నేను అతనికి ఉపాధిని ప్రసాదిస్తాను, ఆపదలో ఉన్నవాడెవడూ అతనికి స్వస్థత ప్రసాదిస్తాను అంటూ ఇలాంటి నినాదాలు ప్రకటిస్తాడు.”

(ఇబ్నుమాజా, కితాబు ఇఖామతిస్ సలాతి వస్సున్నతు ఫీహా,  బాబు మా జాఅ ఫీ లైలతిన్ నిస్ఫి మిన్ షాబాన్ 1388)

ఈ హదీసు గురించి షేఖ్ అల్బాని రహిమహుల్లాహ్ తెలిపారు ఇది దయీఫ్ మరియు మౌదూ అని (అంటే ప్రామాణికమైనది కాదు, కల్పించబడినది).

ఈ హదీసులో ఇబ్ను అబి సబ్రా అనే వ్యక్తి  గురించి  ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ మరియు ఇమామ్ ఇబ్నె ముయీన్ ఇలా చెప్పారు: అబూ సబ్రా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పని హదీసులు తానె చెప్పి ప్రవక్త వైపు ఆపాదించాడు. అందువలన అతనిని  కల్పిత హదీసుల బోధకుడిగా పేర్కోన్నారు.

3) మూడవ హదీసు హసన్ మరియు సహీగా కొందరు ఉలమాలు పేర్కొన్నారు.-

దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉల్లేఖించారు: “షాబాన్ 15వ రాత్రి అల్లాహ్ (తఆలా) తన దాసుల పట్ల దృష్టి సారిస్తాడు.  అల్లాహ్ వారి పాపాలను క్షమిస్తాడు. కాని ఇద్దరి వ్యక్తుల పాపాలను క్షమించడు. వారిలో ఒకడు : అల్లాహ్ కు బాగాస్వామిని నిలబెట్టేవాడు (షిర్క్ చేసేవాడు) రెండో వాడు: మనసులో కపటం, కీడు గలవాడు.”

(ఈ హదీసు ఇబ్నెమాజా, ఇబ్ను హిబ్బాన్ లలో ఉంది.) ఈ హదీసు కొందరి దగ్గర దయీఫ్ గా వుంటే ఎక్కువ ఉలమాలు దీనిని ఇతర హదీసుల ఆదారంగా సహీగా ప్రకటించారు.

పై హదీసులు మరికొన్ని వేరే బలహీన, లేదా కల్పిత హదీసుల ద్వారా ఈ క్రింది విషయాలను సత్కార్యాలుగా భావించి, వాటిని ప్రత్యేకంగా 15వ షాబాన్ సందర్భంగా చేయటం పుణ్యకార్యం అని అంటారు:

  • 1- 15వ షాబాన్ రాత్రి జాగారం
  • 2- ప్రత్యేక నమాజులు
  • 3- పగలు ఉపవాసం పాటించడం.
  • 4- సమాధులను దర్శించడం
  • 5- గత సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు చనిపోయిన వారి ఆత్మలు తిరిగి వస్తాయని, అంతే కాదు ప్రత్యేక వంటకాలు చేసి, వాటిని ఆ ఆత్మలు తినిపోతాయని భ్రమపడడం జరుగుతుంది.

అయితే సోదర సోదరిమణులారా! పై ఐదు విషయాలు మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గానీ, సహాబాలు, తాబియిన్లు గానీ పాటించలేదు. అలాంటి మూఢనమ్మకాలు అసలు వారికి లేనే లేవు.

కొందరి అభిప్రాయమేమిటంటే ఆ రాత్రి ఇద్దరిని తప్ప అందరిని అల్లాహ్ క్షమిస్తాడు అని వచ్చిన హదీసు సహీ అయినప్పుడు నమాజు, రోజాలు పాటించడంలో తప్పు ఏమిటి అని అంటారు? కాని వాస్తవంగా ఆలోచిస్తే, ఆ హదీసులో అలాంటి భావమేమీ లేదు.

అలా అనుకుంటే సహీ బుఖారీ హదీసు నంబర్ 758లో ఈ విధంగా ఉంది:

“అల్లాహ్ ప్రతి రాత్రి మూడవ భాగం మిగిలి ఉండగా ప్రపంచపు ఆకాశం వైపునకు వచ్చి ఎవరైనా అడుగుతారా వారికి ఇస్తాను, ఎవరైనా దుఆ చేస్తారా అంగీకరిస్తాను, ఎవరైనా పాప మన్నింపు కోరుతారా మన్నిస్తాను అని ఫజ్ర్ వరకు ప్రకటిస్తూ ఉంటాడు.”

గమనించండి ఇది బుఖారీలోని హదీసు, ఏ ఒక్కరు దీనిని బలహీనమైనది అని అనలేదు, అనలేరు కూడా. కానీ  పై హదీసు కొందరు పండితులు బలహీనమైనదంటే మరి కొందరు సహీ అన్నారు.అయితే బుఖారీ హదీసు ప్రకారం ప్రతి రోజు మేల్కొని అల్లాహ్ ను వేడుకుంటూ మన్నింపు కూరుతూ అన్ని మేల్లు అడుగుతూ ఉంటే ఎంత బావుంటుంది. అలా కాకుండా నిరాధరమైన హదీసుల ఆధారంగా కేవలం ఒక రాత్రి, పగలు పాటించడం అసలు ఇది ప్రవక్త పద్ధతే కాదు. ప్రవక్త పద్ధతి కానప్పుడు పుణ్యానికి బదులుగా పాపం మూట గట్టుకున్నట్లవుతుంది. జాగ్రత్తా!

మూడవ భాగంలో హదీసుల వెలుగులో మరిన్ని విషయాలను తెలుసుకుందాము ఇన్ షా అల్లాహ్!

(3) షాబాన్ నెల యెుక్క వాస్తవికత! – మూడవ భాగం

షాబాన్ నెల యెుక్క చేయవలసిన ఆచారాలు తెలుసుకుందాం! ఇన్ షా అల్లాహ్

నా ధార్మిక సహోదర సహోదరిమణులారా! అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతహు –

అల్లాహ్ సుబానవతఆలా ఇలా ఉపదేశించాడు.

وَمَا خَلَقْتُ ٱلْجِنَّ وَٱلْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ
నేను   జిన్నాతులను,   మానవులను   సృష్టించినది   వారు   నన్ను   ఆరాధించటానికి   మాత్రమే. 
(ఖుర్’ఆన్ – 51 : 56)

షాబాన్ నెల ఇది ఇస్లాం నెలలో 8వ నెల ఈ నెల యెుక్క విశిష్టత ఏమిటంటే ఎంతో ఘనత కల్గిన రంజాన్ నెలను తనతో పాటు తెస్తుంది. అంటే ఈ నెల తరువాత వచ్చేది రంజాన్ నెల.

షాబాన్ మాసంలో ఇస్లాం అనుమతిస్తున్న మనం చేయవలసిన సత్కార్యాల్లో అతి ముఖ్యమైనది ఉపవాసం. స్వయంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) షాబాన్ లో అత్యధికంగా ఉపవాసాలు పాటించేవారు. చూసేవారికి నెలంతా ఉపవాసమున్నారా అనిపించేది.

షాబాన్ నఫిల్ ఉపవాసాల  మాసం

ఈ క్రింది హదీసులు చదవండి:

عن عَائِشَةَ تَقُولُ: ” كَانَ أَحَبَّ الشُّهُورِ إِلَى رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَنْ يَصُومَهُ: شَعْبَانُ، ثُمَّ يَصِلُهُ بِرَمَضَانَ “

ఆయిషా రజియల్లాహు అన్హా చెప్పారు: “ప్రవక్తకు ఉపవాసం ఉండటానికి చాలా ప్రీతికరమైన మాసం షాబాన్ మాసం, ఈ మాసంలో ఉపవాసం పాటిస్తూ రమజాను వచ్చేసేది.” (అబూదావూద్ 2431.)

وعن عائشة رَضِيَ اللهُ عنها قالت: لَمْ يكن النبي – صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ – يَصُومُ مِنْ شَهْرٍ أكْثَرَ مِنْ شَعْبَانَ، فَإنَّهُ كَانَ يَصُومُ شَعْبَانَ كُلَّهُ

ఆయిషా (రజియల్లాహు అన్హా) ఇలా తెలిపారు: “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) షాబాన్ నెలలో (నఫిల్) ఉపవాసాలు పాటించినంతగా మరే ఇతర నెలలోనూ పాటించేవారు కాదు. నిశ్చయంగా ఆయన షాబాన్ నెల సాంతం ఉపవాసం పాటించేవారు“. వేరొక ఉల్లేఖనం ప్రకారం “షాబాన్ నెలలోని కొన్ని రోజులు మినహాయించి మిగతా రోజులన్నీ ఆయన ఉపవాసం పాటించేవారు.”(బుఖారీ 1969, ముస్లిం 1156)

(మానవుల) కర్మలు పైకి లేపబడే  మాసం

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) షాబాన్ మాసంలో అత్యధికంగా ఉపవాసాలు పాటించటానికి గల కారణాన్ని వేరొక హదీసు ఈ విధంగా వివరించింది:

«ذَلِكَ شَهْرٌ يَغْفُلُ النَّاسُ عَنْهُ بَيْنَ رَجَبٍ وَرَمَضَانَ، وَهُوَ شَهْرٌ تُرْفَعُ فِيهِ الْأَعْمَالُ إِلَى رَبِّ الْعَالَمِينَ، فَأُحِبُّ أَنْ يُرْفَعَ عَمَلِي وَأَنَا صَائِمٌ»

“ఇది రజబ్ మరియు రమజాను మధ్యలోని మాసం, ప్రజలు దాని పట్ల అశ్రద్ధగా ఉంటారు.దాసుల కర్మలు షాబాన్ మాసంలో అల్లాహ్ సన్నిధిలో ప్రవేశపెట్టబడతాయి. నేను ఉపవాసంలో ఉన్న స్థితిలోనే నా కర్మలు అల్లాహ్ సన్నిధిలో ప్రవేశపెట్టబడాలన్న కోరిక నాది.”

(నిసాఈ 2357, షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ హసన్ అన్నారు.)

ప్రతి సోమవారము మరియు గురువారాల్లో  మానవుల ఆచరణలు ప్రవేశపెట్టబడతాయి. ఈ హదీసు పైన కూడా శ్రద్ద వహించాలి.హజ్రత్ అబూహురైర (రజియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు:

“సోమ మరియు గురువారాల్లో (అల్లాహ్ సన్నిదిలో దాసుల) ఆచరణలు ప్రవేశపెట్టబడతాయి. అందుకని నేను ఉపవాసిగా ఉన్న స్ధితిలో నా ఆచరణ ప్రవేశపెట్టడాన్ని నేనిష్టపడతాను.”

(తిర్మిజి- హసన్ , రియాదుస్ సాలిహీన్ :1257#)

పై హదీసులో రెండు లాభాలున్నాయి:

1) ప్రజలు అశ్రద్ధగా ఉన్నప్పుడు అల్లాహ్ ఆరాధన ఘనత చాలా గొప్పగా ఉంది. ప్రత్యేకంగా ఉపవాసం, ఇందులో బాహ్యతనం లేదు. ఇఖ్లాస్ (చిత్తశుద్ధి) ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సత్కార్యం అందరూ చేస్తున్నప్పుడు వారిని చూసి చేయని వాడు కూడా ఆ సత్కార్యం చేయడానికి పూనుకుంటాడు, కాని ఎవరు చేయని సమయంలో సత్కార్యం చేయాలని ఆలోచన రావడం, ఆలోచన వచ్చినా నేను ఒక్కణ్ణి చేస్తే ఎవరేమంటారో అనే దురాలోచనకు దూరమైన ప్రత్యేక శ్రధ్ధతో, అల్లాహ్ సంతృష్టి ఉద్దేశ్యంతో చేయడం ఎంతో గొప్ప విషయే కాకుండా అత్యధిక పుణ్యానికి కూడా అర్హత కల్పిస్తుంది. ఇలాంటి వారికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎంత గొప్ప శుభవార్త ఇచ్చారో ఈ హదీసు చదవండి:

إِنَّ مِنْ وَرَائِكُمْ زَمَانَ صَبْرٍ، للمُتَمَسِّكِ فِيهِ أَجْرُ خَمْسِينَ شَهِيدًا

“మీ తర్వాత ఓర్పుసహనాల ఓ కాలం రానుంది, ఆ కాలంలో ధర్మంపై స్థిరంగా ఉన్న వ్యక్తికి 50 మంది అమరవీరుల పుణ్యం ఉంటుంది.”

(తబ్రానీ కబీర్ 10394, షేఖ్ అల్బానీ సహీహుల్ జామి 2234లో సహీ అన్నారు.)

అబూ దావూద్ 4341లోని హదీసులో ఉంది:

“మీ తర్వాత ఓర్పు సహనాల ఓ కాలం రానుంది, అప్పుడు (ధర్మంపై స్థిరంగా ఉంటూ) సహనం వహించడం నిప్పులను చేత్తో పట్టుకోవడంతో సమానం. అప్పుడు సత్కార్యాలు చేసే వ్యక్తికి మీలోని 50 మందికి లభించే పుణ్యం లభిస్తుంది.”

2) ఈ మాసంలో సత్కార్యాలు అల్లాహ్ సన్నిధిలో ప్రవేశపెట్టబడతాయి.

అల్లాహు అక్బర్! గమనించండి: సాయంకాలం యజమాని ముందు పొద్దంతా చేసిన పని గురించి లెక్క చెప్పవలసి ఉంది అని తెలిసినప్పుడు ఆ పొద్దంతా ఎలా పనిచేస్తాడు ఆ గుమస్త? మరి ప్రతి రోజు ఫజ్ర్ మరియు అస్ర్ లో రెండు సార్లు వారంలో ప్రతి సోమ, గురు రెండు రోజులు సంవత్సరంలో ఈ షాబాన్ మాసంలో మన కర్మలన్నీ అల్లాహ్ ముందు ప్రవేశపెట్టబడుతున్నప్పుడు మనం పాపాలకు ఎంత దూరంగా ఉండాలి. సత్కార్యాలు ఎంత ఎక్కువగా చేస్తూ ఉండాలి అర్థమవుతుంది కదా!

కాని ప్రజల సులభతరానికి, వారికి ఏ ఇబ్బంది కలగకుండా ఉండటానికి ఎంతగా కాంక్షించేవారంటే, షాబాన్ 15 రోజులు గడిసిన తర్వాత ఉపవాసం పాటించకూడదని ఆదేశించారు.

عَنْ أَبِي هُرَيْرَةَ، أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: «إِذَا انْتَصَفَ شَعْبَانُ، فَلَا تَصُومُوا»

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వస్లలం) చెప్పారని అబూ హురైరా (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “షాబాన్ సగం గడిచిపోయాక ఉపవాసం ఉండకండి.” (అబూదావూద్ 2337)

హదీసు వ్యాఖ్యానకర్తలు చెప్పారు: ప్రజలు షాబాన్ చివరి వరకు ఉపవాసాలు పాటించి, రమజానులో ఫర్జ్ (విధి) ఉపవాసాలు పాటించడంలో బలహీనులు కాకూడదని సగం షాబాన్ తర్వాత ఉపవాసాలు పాటించడం నుండి వారంచబడినది.

నాల్గవ భాగంలో ఖుర్ఆన్ మరియు  హదీసుల వెలుగులో మరిన్ని విషయాలను తెలుసుకుందాము ఇన్ షా అల్లాహ్!

(4)షాబాన్ నెల యెుక్క వాస్తవికత! – నాల్గవ భాగం

షబే బరాత్ నాడు మరణించిన వారి ఆత్మలు ఇహాలోకంలోకి వస్తాయా?

నా ధార్మిక సహోదర సహోదరిమణులారా! అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతహు –

మానవుడు మరణించాక ఆత్మలు ఇహాలోకానికి రావడం అనేది జరగదు.

మానవుడు మరణించినా, మానవుడుని జంతువులు తిన్నా, మానవుడుని అగ్నికి ఆహుతి చేసినా, మానవుడు బూడిదగా మారినా  మరణించిన వారు బర్జఖ్ లో ఉంటారు. ఇహాలోకంలోకి తిరిగి రావడం అనేది జరగదు. ఇది అల్లాహ్ సున్నత్ కి విరుద్ధం. చాలామందికి మృతుడు చనిపోతే ప్రాణం ఎక్కడ ఉంటుందో తెలియదు.

మృతుడు చనిపోయిన వెంటనే బర్జఖ్ లో బంధించబడతాడు.

అల్లాహ్ సుబహానహు వతాఆలా ఇలా ఉపదేశించాడు.

وَمَا يَسْتَوِى ٱلْأَحْيَآءُ وَلَا ٱلْأَمْوَٰتُ ۚ إِنَّ ٱللَّهَ يُسْمِعُ مَن يَشَآءُ ۖ وَمَآ أَنتَ بِمُسْمِعٍۢ مَّن فِى ٱلْقُبُورِ
బ్రతికి   ఉన్నవారూ   చచ్చినవారు   (ఎన్నటికీ)   సమానులు   కాలేరు.
అల్లాహ్‌   తాను   కోరిన   వారికి   వినిపిస్తాడు.   సమాధుల్లో   ఉన్నవారికి   నువ్వు   వినిపించలేవు.

(ఖుర్’ఆన్ – 35 : 22)

ﺣَﺘَّﻰٰٓ ﺇِﺫَا ﺟَﺎٓءَ ﺃَﺣَﺪَﻫُﻢُ ٱﻟْﻤَﻮْﺕُ ﻗَﺎﻝَ ﺭَﺏِّ ٱﺭْﺟِﻌُﻮﻥِ
చివరికి వారిలో ఒకడికి మరణం సమీ పించినప్పుడు వాడిలా వేడుకుంటాడు: “ఓ నాప్రభూ! నన్ను తిరిగి (భూలోకానికి) పంపు; (Quran – 23:99)

ﻟَﻌَﻠِّﻰٓ ﺃَﻋْﻤَﻞُ ﺻَٰﻠِﺤًﺎ ﻓِﻴﻤَﺎ ﺗَﺮَﻛْﺖُ ۚ ﻛَﻼَّٓ ۚ ﺇِﻧَّﻬَﺎ ﻛَﻠِﻤَﺔٌ ﻫُﻮَ ﻗَﺎٓﺋِﻠُﻬَﺎ ۖ ﻭَﻣِﻦ ﻭَﺭَآﺋِﻬِﻢ ﺑَﺮْﺯَﺥٌ ﺇِﻟَﻰٰ ﻳَﻮْﻡِ ﻳُﺒْﻌَﺜُﻮﻥَ
“నేను చేయకుండా వచ్చిన సత్కార్యాలు చేయటానికి.” అది కాని పని. నిశ్చయంగా, అది అతని నోటిమాట మాత్రమే!  ఇక (ఈ మరణించిన) వారు తిరిగి లేపబడే దినం వరకు వారి ముందు ఒక అడ్డుతెర (బర్‌’జఖ్‌) ఉంటుంది.

(ఖుర్’ఆన్ – 23:100)

ﻓَﺈِﺫَا ﻧُﻔِﺦَ ﻓِﻰ ٱﻟﺼُّﻮﺭِ ﻓَﻼَٓ ﺃَﻧﺴَﺎﺏَ ﺑَﻴْﻨَﻬُﻢْ ﻳَﻮْﻣَﺌِﺬٍ ﻭَﻻَ ﻳَﺘَﺴَﺎٓءَﻟُﻮﻥَ
ఆ తరువాత బాకా ఊదబడిన దినమున వారిమధ్య ఎలాంటిసంబంధాలు ఉండవు. మరియు వారు ఒకరినొకరు పలుకరించుకోరు కూడా!
(ఖుర్’ఆన్ – 23:101)

రెండు వస్తువులకు మద్యనున్న అడ్డును లేక తెరను ‘బర్జఖ్’ అని అంటారు. ఇది ఇహలోక జీవితానికి పరలోక జీవితానికి మద్య విశ్వాసులకు ‘విరామంగా’ అవిశ్వాసులకు మరియు పాపత్ములకు కఠినంగా ఉంటుంది. మరణించిన క్షణం నుంచి ప్రపంచంతో  మనిషి సంబంధం తెగిపోతుంది. పరలోక జీవనం కూడా తక్షణం మెుదలవదు. ప్రళయం తర్వాత మానవులంతా తిరిగి బ్రతికించబడిన నాటి నుంచే ఈ ‘పరలోకం’ మెుదలవుతుంది. ఈ రెండు లోకాలకు మధ్యనున్న ‘అవస్థ’ ను బర్జఖ్ అవస్థ అంటారు.

మృతుడు సమాధిలో ఉన్నా, కాకులకు గద్దలకు ఆహారంగా మారినా, కాల్చివేయబడి మట్టిలో కలసిపోయిన, మరేమైనా – అది బర్జఖ్ అవస్దగానే పరగణించబడుతుంది. తుదకు అల్లాహ్ మానవులందరికీ ఓ కొత్త ఉనికిని ఇచ్చి అందరినీ మహాషర్ మైదానంలో సమావేశపరుస్తాడు.

సమాధులను దర్శించడం.

గత సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు చనిపోయిన వారి ఆత్మలు తిరిగి వస్తాయని, అంతే కాదు ప్రత్యేక వంటకాలు చేసి, వాటిని ఆ ఆత్మలు తినిపోతాయని భ్రమపడడం జరుగుతుంది. మరణించిన పూర్వికుల ఆత్మలు వస్తాయని, వారికి  ఇష్టమైన వంటకాలను వడ్డించటం, మత్తు పానీయాలు, సిగిరేట్, బీడికట్టలు తమ పూర్వికులు  ఇష్టంగా త్రాగేవారని  తదితర వస్తువులను పెట్టి వాటిపై ఫాతిహాలు చేయటం. తమ పూర్వికుల పేర్లు చెబుతూ సాంబ్రాణిని  అగ్గిమంటల పైన  చల్లటం ఇలాంటి మూఢనమ్మకాలు మన సమాజంలో  అల్పజ్ఞాన ముస్లింలు చేస్తూంటారు.

అయితే సోదర సోదరిమణులారా! పై విషయాలు మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గానీ, సహాబాలు, తాబియిన్లు గానీ పాటించలేదు. అలాంటి మూఢనమ్మకాలు అసలు వారికి లేనే లేవు. ఇలాంటి మూఢనమ్మకాలు ఇస్లాంలో చెల్లవు సహోదరులారా! మానవుడు మరణించిన తరువాత ఇహాలోకంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. ఇది కేవలం షైతాను క్రీడగా మాత్రమే పరిగణించబడుతుంది.

పాపాత్ముల కర్మలు, ,ఆత్మలు సిజ్జిన్ లో బంధించబడ్డాయి.

كَلَّآ إِنَّ كِتَٰبَ ٱلْفُجَّارِ لَفِى سِجِّينٍۢ
ముమ్మాటికీ   (వారు   అనుకునేది   నిజం)   కాదు.   నిశ్చయంగా   పాపాత్ముల   కర్మల   చిట్టా   ‘సిజ్జీను’లో   ఉంది.

(ఖుర్’ఆన్  – 83 : 7)

‘సిజ్జిన్’ అనేది ఒక చెరసాల అని కొందరు అబిప్రాయపడ్డారు. అంటే కఠిన కారాగారం మాదిరిగా అది ఎంతో ఇరుకైన, దుర్భరమైన స్ధలం అన్నమాట! మరికొంత మంది ప్రకారం ‘సిజ్జిన్’ అనేది భూమండలంలో అత్యంత అధమస్ధానం. ఆ పాతాళ స్ధానంలో అవిశ్వాసుల, ముష్రిక్కుల, దుర్జనుల ఆత్మలు, వారి కర్మలు భద్రపరచబడతాయి.

పుణ్యాత్ముల కర్మలు, ఆత్మలు ఇల్లియ్యీన్ లో బద్రపరచబడ్డాయి.

كَلَّآ إِنَّ كِتَٰبَ ٱلْأَبْرَارِ لَفِى عِلِّيِّينَ
ఎన్నటికీ   కాదు.   నిశ్చయంగా   పుణ్యాత్ముల   కర్మల   చిట్టా   ‘ఇల్లియ్యీన్‌’లో   ఉంది.

(Quran – 83 : 18)

‘ఇల్లియీన్’ అనేది ‘ఉలువ్వున్’ నుండి వచ్చింది. అంటే ఉన్నతమైనదని అర్ధం. ఇది ‘సిజ్జిన్’ కు వ్యతిరేక పదం. ఇది ఊర్ధ్వలోకాలలో లేదా స్వర్గంలో లేదా సిద్రతుల్ మున్తహా వద్ద లేదా దైవసింహాసనం (ఆర్ష్) దగ్గర ఉన్న ఒక ప్రత్యేక స్ధలం.

అక్కడ సజ్జనుల ఆత్మలు, వారి కర్మల పత్రాలు భద్రపరచబడ్డాయి. ధైవసాన్నిధ్యం పొందిన దైవదూతలు వాటిని పర్యవేక్షిస్తూ ఉన్నారు.

5 (చివరి) భాగంలో ఖుర్ఆన్ మరియు  హదీసుల వెలుగులో మరిన్ని విషయాలను తెలుసుకుందాము ఇన్ షా అల్లాహ్!

(5) 15షాబాన్ నెల యెుక్క వాస్తవికత! – 5 (చివరి) భాగం

ఖుర్ఆన్ మరియు హదీసుల వెలుగులో  చివరి 5వ భాగం.

  • షబే బరాత్ సందర్భాన ప్రత్యేకంగా సమాధులను దర్శించవచ్చునా?
  • షాబాన్ 15వ తేదినాడు ఉపవాసం పాటించవచ్చునా?

నా ధార్మిక సోదర సోదరీమణులారా! అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతహు –

షబే బరాత్ సందర్భాన ప్రత్యేకంగా సమాధుల దర్శనం చేయవచ్చునా?

షబే బరాత్ సందర్భాన ప్రత్యేకంగా సమాధులను దర్శించటం ఇది ఒక బిద్ఆత్ అని చెప్పవచ్చు. ఎందుకంటే సమాధుల దర్శనానికి ఒక ప్రత్యేక ఘడియను ఏర్పాటుచేసుకొన్నారు. అయితే సోదర సోదరీమణులారా!  మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గానీ, సహాబాలు గానీ, తాబిఈన్లు గానీ ఇలా ప్రత్యేక ఘడియను ఏర్పాటుచేసుకోలేదు.

ఈ బిద్అత్ కు పాల్పడే మన సోదరులు ఒక హదీసును చూపించి షబే బరాత్ సందర్భాన సమాధులను దర్శించాలని సాకుగా చూపుతారు కాని ఆ హదీసు దయీఫ్ (బలహీనంగా) గా వుంది. ఆ హదీసు యెుక్క సనద్  ఒకసారి చదవండి

ఆయిషా (రజియల్లాహు అన్హా)  ఉల్లేఖించారు, ఒకసారి షాబాన్ 15 వ రాత్రి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  నా పడకపై లేకపోవడం వలన వెదుకుతూ ఉండగా  బఖీ స్మశానంలో అగుపించగా నేను అక్కడికెళ్లి కారణం అడుగగా – “ఈ రాత్రి అల్లాహ్ ప్రపంచం వైపు దృష్టిసారిస్తాడు, బని కల్బ్ వారి గొర్రెల వెంట్రుకల కంటే అధిక రెట్లో మానవుల పాపాలను క్షమిస్తాడు” అని చెప్పారు. (ఈ హదీసు ముస్నద్ అహ్మద్, తిర్మిది, ఇబ్నెమాజాలో ఉంది.)

పై మూడు గ్రంథాల్లో కూడా ఈ హదీసు ఆయిషా రజియల్లాహు అన్హా ద్వార ఉర్వా, ఉర్వా ద్వారా యహ్ యా, యహ్ యా ద్వారా హజ్జాజ్ ఉల్లేఖించినట్లు ఉంది.

అయితే ఇమాం తిర్మిజి ఈ హదీసు చివరిలో ఎంతో స్పష్టంగా చెప్పారు: నేను ముహమ్మద్ బిన్ ఇస్మాయీల్ ద్వారా విన్నాను ఆయన దీనిని బలహీనమైనదని, ప్రామాణికమైనది కాదని చెప్పారు, ఎందుకంటే ఉర్వా ద్వారా యహ్’యా మరియు యహ్’యా ద్వారా హజ్జాజ్ వినలేదు.

(తిర్మిజి, అబ్వాబుస్ సియాం, బాబు మా జాఅ ఫీ లైలతిన్ నిస్ఫి మిన్ షాబాన్. 739)

ఈ హదీసు ఎంతమాత్రము ప్రామాణికమైనది కాదు.

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు పగలు, రాత్రి అన్నివేళల్లో సమాధులను దర్శించేవారని సహీ హదీసులు బోదిస్తున్నాయి. ఇలాంటి హదీసుల ప్రకారం మనం ఎందుకు ఆచరించము?!

عَنْ عَائِشَةَ أَنَّهَا قَالَتْ: كَانَ رَسُولُ اللهِ ﷺ كُلَّمَا كَانَ لَيْلَتُهَا مِنْ رَسُولِ اللهِ ﷺ يَخْرُجُ مِنْ آخِرِ اللَّيْلِ إِلَى الْبَقِيعِ [مسلم ، الجنائز، ما يقال عند دخول القبور…]

హజ్రత్ ఆయిషా (రజియల్లాహు అన్హా) ఉల్లేఖించారు: “ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు నా వంతు వచ్చినప్పుడల్లా రాత్రి వేళ బఖీ దర్శించడానికి వెళ్ళేవారు”.

(ముస్లిం, జనాఇజ్, మా యుఖాలు ఇంద దుఖూలిల్ ఖుబూర్… 974).

సమాధుల దర్శనం యొక్క రెండు ఉద్దేశ్యాలు

  • 1-దర్శించే వ్యక్తి ప్రయోజనానికి
  • 2- సమాధిలో ఉన్నవారి ప్రయోజనానికి

1-దర్శించే వ్యక్తి ప్రయోజనానికి: సమాధుల దర్శనం ఇహలోకం పట్ల వ్యామోహాన్ని తగ్గిస్తుంది. పరలోకం పట్ల భయభక్తిని కలిగింపజేస్తుంది. చావును గుర్తు చేస్తుంది. ఈ విషయాలు సహీ హదీసుల ద్వారా రుజువై ఉన్నాయి. కాని …

నేడు మనం చేస్తున్న కార్యాలు చూసినట్లైతే ఖబరస్తాన్ దగ్గరికి సంవత్సరానికి ఒకసారి వెళ్ళడం. మన తాత ముత్తాతల సమాధులను నీటితో శుభ్రపరచటం, అక్కడ అలంకరణ చేసి విద్యుత్ దీపాలతో, పూలగుచ్చాలతో, అగర్బత్తి, సుగంధ సువాసనలను సమాధుల పై వెదజల్లి వారిపై ఫాతిహాలు చేయటం, మీఠాయిలు పంచటం చూస్తుంటే  మనకి పరలోకం పట్ల భయభక్తి కలిగేలాగా ఉందా???

మనం ముస్లింలుగా ఆలోచించాల్సిన విషయం. ఇస్లాం ఇలాంటి కార్యాలను చేయమని ఆజ్ఞాపించిందా? అల్లాహ్ మనందరిని క్షమించుగాక!

2- సమాధిలో ఉన్నవారి ప్రయోజనానికి: మనం వారి ప్రయోజనానికి చేయవలసినవి, సమాధులను సందర్శించినప్పుడు మరియు అన్ని సందర్భాల్లో వారి కొరకు అధికంగా దుఆ చేయడం, అంటే ఓ అల్లాహ్! వారికి సమాధి పరీక్ష, సమాధి శిక్ష నుండి రక్షణ కల్పించు, వారి సమాధిలో స్వర్గపు కిటికీలను తెరవు, వారి సమాధిని కాంతితో నింపు, వారి పాపాలన్నింటిని మన్నించు… లాంటి దుఆలు. ఇంకా ఖబరస్తాన్ లో ప్రవేశిస్తున్నప్పుడు:

అస్సలాము అలైకుం అహ్లద్ దియారి మినల్ ముఅ’మినీన వల్ ముస్లిమీన వ ఇన్నా ఇన్ షా అల్లాహు బికుమ్ లాహిఖూన్ అస్అలుల్లాహ లనా వలకుముల్ ఆఫియహ్.

ఈ బస్తీలో ఉన్న విశ్వాసులు, ముస్లిములందరిపై శాంతి కురియుగాక, అల్లాహ్ తలచినప్పుడు మేము కూడా మీ వెనక రానున్నాము, మా కొరకు మీ కొరకు అల్లాహ్ తో సంక్షేమాన్ని కోరుతున్నాను

షాబాన్ 15వ తేదినాడు ఉపవాసం పాటించవచ్చునా?

షాబాన్ 15వ తేదినాడు ప్రత్యేకంగా ఉపవాసం ఉండటం బిద్ఆత్. దీనికి సంబందించిన హదీసులు దయీఫ్ యే కాదు, కల్పితం కూడాను.

హజ్రత్ అలీ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త  ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఇలా సెలవిచ్చారు:

عَنْ عَلِيِّ بْنِ أَبِي طَالِبٍ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: ” إِذَا كَانَتْ لَيْلَةُ النِّصْفِ مِنْ شَعْبَانَ، فَقُومُوا لَيْلَهَا وَصُومُوا نَهَارَهَا، فَإِنَّ اللَّهَ يَنْزِلُ فِيهَا لِغُرُوبِ الشَّمْسِ إِلَى سَمَاءِ الدُّنْيَا، فَيَقُولُ: أَلَا مِنْ مُسْتَغْفِرٍ لِي فَأَغْفِرَ لَهُ أَلَا مُسْتَرْزِقٌ فَأَرْزُقَهُ أَلَا مُبْتَلًى فَأُعَافِيَهُ أَلَا كَذَا أَلَا كَذَا، حَتَّى يَطْلُعَ الْفَجْرُ “

“షాబాన్ 15 వ రాత్రి  అల్లాహ్ యెుక్క ఆరాధనలో నిలబడు. మరునాడు నీవు ఉపవాసం పాటించు. అల్లాహ్ షాబాన్ 14 నాటి సూర్యాస్తమయం వెంటనే ప్రపంచపు ఆకాశంపై వచ్చి, తమ పాపాల మన్నింపు కోరేవారు ఎవరైనా ఉన్నారా నేను వారిని మన్నిస్తాను, ఉపాధి కోరేవారు ఎవరైనా ఉన్నారా నేను వారికి ఉపాధిని ప్రసాదిస్తాను, ఆపదలో ఉన్నవారెవరైనా ఉన్నారా వారికి స్వస్థత ప్రసాదిస్తాను అంటూ ఇలాంటి నినాదాలు ఫజ్ర్ వరకు; ప్రకటిస్తూనే ఉంటాడు.”

(ఇబ్నుమాజా, కితాబు ఇఖామతిస్ సలాతి వస్సున్నతు ఫీహా,  బాబు మా జాఅ ఫీ లైలతిన్ నిస్ఫి మిన్ షాబాన్ 1388)

ఈ హదీసు గురించి షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ తెలిపారు ఇది దయీఫ్ మరియు మౌదూ అని (అంటే ప్రామాణికమైనది కాదు, కల్పించబడినది).

ఈ హదీసులో ఇబ్ను అబి సబ్రా అనే వ్యక్తి  గురించి  ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ మరియు ఇమామ్ ఇబ్నె ముఈన్ ఇలా చెప్పారు: అబూ సబ్రా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పని హదీసులు తానె చెప్పి ప్రవక్త వైపు ఆపాదించాడు. అందువలన అతనిని కల్పిత హదీసుల బోధకుడిగా పేర్కోన్నారు.

ఇలాంటి పాపకార్యాల, బిద్ఆత్ ల నుండి మనం మన కుబుంబాలను,  బందు మిత్రులను రక్షించుకోవాలి. లేదా అంటే మనకు తెలియకుండానే పరలోకంలో తీవ్రంగా నష్టపోయే వారిలో చేరిపోతాం.

అల్లాహ్ సుబ్ హానహూ వతఆలా ముస్లిం సమాజాన్ని  షిర్క్, బిద్ఆత్ నుండి రక్షించుగాక! ఆమీన్ యా రబ్!!

(6) షాబాన్ నెల యెుక్క వాస్తవికత!

 శీర్షిక: షాబాన్ 15వ రోజు కొన్ని బిద’అత్ కార్యాల వాస్తవికత 

హజ్రత్ ఇమామ్ ముఖ్దసి (రహిమహుల్లాహ్) ఇలా ప్రకటించారు:​

“448వ హిజ్రీ శకంలో ఒక వ్యక్తి నాబ్లీస్ పట్టణం నుండి ‘బైతుల్ ముఖద్దస్’ కు వచ్చాడు. అతని పేరు ఇబ్నె ఉబై హుమైరా. అతడు చాలా చక్కగా ఖుర్’ఆన్ పారాయణం చేసేవాడు. అతను షాబాన్ 15వ రోజు రాత్రి ‘బైతుల్ ముఖద్దస్’ లో నఫిల్ నమాజును చదవడం ఆరంభించాడు. అతన్ని చూసి ఒకరు, ఇద్దరు, ముగ్గురు అంటూ ఒక పెద్ద జమాతుగా నిలబడి నమాజు నెరవేర్చారు. ఇలా ఆ రోజు నుండే ఈ బిద’అత్ ఆచరణ మొదలయ్యింది.”​

​[అల్ బాయిస్ ‘అలా ఇన్కారిల్ బిదయి వల్ హవాదిస్, పేజీ #124-125]​

 ప్రామాణిక ఆధారాల ద్వారా నిరూపణ కాని బిద’అత్ (ధర్మంలో కొత్తగా చొరబెట్టినవి) కార్యాలు:​​

​1. షబే బారాత్ నమాజు:​ ప్రతీ ఏటా షాబాన్ నెల 15వ తేది రాత్రి 100 రకాతుల నమాజు ప్రత్యేకంగా చేస్తారు.​

​2. ఆరు రకాతుల నమాజు:​ కష్టాలు తొలగిపోవాలని, వయస్సు పెరగాలని మరియు ప్రజలతో నిరుపేక్షంగా ఉండాలని సంకల్పం చేసుకుని ఈ నమాజు చేస్తారు.​

3. యాసీన్ సూరహ్:​ ఈ రాత్రిలో ప్రత్యేకంగా యాసీన్ సూరహ్ చదువుతారు. మరియు “అల్లాహుమ్మ యా జల్మన్ని వలా యమున్ను అలైహి యా జల్ జలాలి వల్ ఇక్రామ్” అనే పదాలను చదువుతూ ఉంటారు.​

​4. శుభప్రదమైన రాత్రి:​ కొంతమంది షాబాన్ నెలలో వచ్చే 15వ రాత్రిని శుభప్రదమైన రాత్రిగా (ఖుర్’ఆన్ అవతరించిన రాత్రిగా) తలపోసారు. కానీ, ఇది ఏ మాత్రమూ సరైనది కాదు. ఖుర్’ఆన్ గ్రంథం రమదాన్ మాసంలోని ‘లైలతుల్ ఖద్ర్’ లో అవతరించినట్లు స్వయంగా ఖుర్’ఆన్ ద్వారా స్పష్టంగా రూఢీ అవుతున్నప్పుడు ఇతరత్రా రాత్రుల గురించి ఆలోచించడం ఎంతమాత్రమూ సరైనది కాదు.​

​ఇమామ్ షిఖైరి (రహిమహుల్లాహ్) ఈ రాత్రి గురించి ఇలా తెలియజేసారు:​

​”మహాపండితులు మరియు ముహద్దిసీన్లు ఈ రాత్రి (షబే బరాత్) ని లైలతుల్ ఖద్ర్ గా భావించడానికి ఎటువంటి యదార్ధము లేదు.”​

​[అస్ సున్నన్ వల్ ముబ్తిదిఆత్, పేజీ #146]​

​ఇమామ్ నజ్ముద్దీన్ అల్ గైతీ (రహిమహుల్లాహ్) గారు ఇలా తెలియజేసారు:​

​”హిజాజ్ పండితులు షాబాన్ నెల 15వ తేది రాత్రిన చేసే ప్రత్యేకమైన పుణ్యాల గురించి మరియు వాటి ఘునతను గురించి తిరస్కరించారు. వారిలో హజ్రత్ ఇబ్నె అబీ మలీకా మరియు మదీనా విద్వాంసులు ఆ రోజున చేసే ప్రత్యేకమైన కార్యాలన్నింటినీ బిద’అత్ గా ఏకీభవించారు.”​

​[అస్ సున్నన్ వల్ బిద’అత్ అష్ షిఖైరీ, పేజీ #145]​

​షాబాన్ 15వ రోజు గురించి కొన్ని నిరాధారమైన హదీసులు:

బిద’అత్ ఆచారాల్లో మునిగి తేలుతున్నవారు తాము చేస్తున్నది ధర్మమేనంటూ ఈ క్రింద ఇవ్వబడిన బలహీనమైన (దయీఫ్) ఆధారాలను చూపుతూ మూర్ఖంగా వితండవాదం చేస్తూ ఉంటారు.​

​హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం:​ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:​

​”షాబాన్ 15వ రోజు రాత్రి నమాజు చదవండి మరియు పగలు ఉపవాసం ఉండండి. ఆ రోజు సూర్యాస్తమయం తర్వాత ప్రపంచపు (క్రింది) ఆకాశానికి అల్లాహ్ దిగి వస్తాడు మరియు ఇలా అంటాడు:​

​’ఎవరైతే నా పాపాలు మన్నించమని వేడుకుంటారో, నేను వారి పాపాలను మన్నిస్తాను. మరియు ఎవరైతే ఉపాధిని ప్రసాదించమని వేడుకుంటారో, వారికి ఉపాధి ప్రసాదిస్తాను. ఎవరైనా అస్వస్థతకు గురికాబడితే వారికి స్వస్థతను ప్రసాదిస్తాను. ఇంకా ఇలా, అలా సూర్యోదయం వరకూ ఇలా (ప్రసాదించే కార్యం) జరుగుతూ ఉంటుంది.”​

​[ఇబ్నెమాజ, అస్ సిల్సిలతుల్ దయీఫా, హదీసు #2132; అస్ సిల్సిలతుల్ దయీఫా వల్ మౌదూ’అ, హదీసు #5/154]​

​హజ్రత ఆయేషా (రదియల్లాహు అన్హ) ఉల్లేఖనం:​

“దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక రాత్రి నాకు కనపడలేదు. అంతలో నేను (బయటకు వెళ్ళి చూస్తే) ఆయన బఖీ శ్మశానంలో కనపడ్డారు. అప్పుడు (నన్ను చూసి) దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు:​

‘అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త నీకు అన్యాయం చేస్తారని అనుకున్నావా?’. దానికి నేను ‘మీరు ఇతర భార్యల వద్దకు పోయారేమో అని అనుకున్నాను.’ అని అన్నాను.​

​తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు:​

​’షాబాన్ 15వ రోజు రాత్రి అల్లాహ్ ప్రపంచపు ఆకాశానికి దిగి వస్తాడు. బనీ కలబ్ (ఒక తెగ సంతానం పేరు) గొర్రెల వెంట్రుకల కంటే ఎక్కువ మనుషులను క్షమిస్తాడు…….”​

​[ఇబ్నెమాజ, దయీఫ్ హదీసు #1389;​ తిర్మిజీ, దయీఫ్ హదీసు #3684;​ దయీఫుల్ జామి’ఈ, దయీఫ్ హదీసు #1761]​

 పైన పేర్కొన్న హదీసులు దయీఫ్ (బలహీనమైనవి) మరియు నిరాధారమైనవి.​

​హజ్రత్ హాఫిజ్ ఇబ్నె దిహ్యా (రహిమహుల్లాహ్) ఇలా తెలియజేసారు:​

​”షాబాన్ 15వ రాత్రి ఆరాధనల గురించి ఏ ఒక్క హదీసు కూడా ప్రామాణిక ఆధార పూర్వకమైనది లేదు. కనుక ఇలాంటి ఉల్లేఖనాలను విశ్వసించకూడదు.”​

అలాగే హజ్రత్ ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్) వారి ద్వారా కూడా షాబాన్ 15వ రాత్రి లేక పగలు చేసే ఆరాధనల గురించి ఎలాంటి ఆదేశాలు లేవు. మరియు నలుగురు ఇమామ్ ల కాలంలో ఆ కార్యాల గురించి ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే, నలుగురు ఇమాముల జనన మరణాలు 80 వ హిజ్రీశకం నుండి 214 వ హిజ్రీశకం మధ్యలో జరిగినవి. మరియు షాబాన్ 15వ రోజు బిద’అత్ కార్యాలు 448 వ హిజ్రీశకంలో ప్రారంభమైనవి. కనుక, ఇది నలుగురు ఇమామ్ ల దగ్గర బిద’అత్ కార్యాలుగానే భావించబడతాయి.​

​​కనుక, నా ప్రియమైన సోదర సోదరీమణులారా!​​

​​​దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి సున్నత్ కు అనుగుణంగా లేని ఆచరణలు, ఉపాసనలు, కేవలం మార్గభ్రష్టత తప్ప మరేమీ కావు.​​​

 దివ్యగ్రంధమైన ఖుర్’ఆన్ లో అల్లాహ్ (సుబహానహు వ త’ఆలా) ఇలా తెలియజేసాడు.​​

  • ​​కొన్ని ముఖాలు ఆ రోజు వాలి (క్రుంగి) పోయి ఉంటాయి.​​
  • ​​(ప్రపంచంలోని వృథా) శ్రమకు, (పరలోకంలో జరిగే) అవమానానికి,​​
  • ​​వారు దహించే అగ్నిలోపడి కాలుతారు.​​
  • ​​వారికి సలసలకాగే చెలమ నీరు త్రాగటానికి ఇవ్వబడుతుంది.​​
  • వారికి చేదు ముళ్ళగడ్డ (‘దరీ’అ) తప్ప మరొక ఆహారం ఉండదు.​​
  • ​​అది వారికి బలమూ నియ్యదు మరియు ఆకలీ తీర్చదు!​​

​​[సూరహ్ అల్-’గాషియహ్ (88), ఆయతు 2-7]​​

​​అంటే, ప్రళయదినాన కొంతమంది (ఈ ప్రపంచంలో బిద’అత్ పనులతో) కఠోర పరిశ్రమ చేసి అలసిపోయి ఉంటారు. అయినా వాళ్ళు మండే అగ్నికి ఆహుతి చేయబడతారు.​​

​దయచేసి జాగ్రత్తగా తెలుసుకోండి.

​​​”అహ్లుస్ సున్నత్ వల్ జమా’అత్” కు చెందిన వారెవ్వరూ కూడా ఇలాంటి అధర్మ కార్యాలు చేయరు. మరియు ఇటువంటి అధర్మ కార్యాలు చేస్తూ తమను తాము మాత్రం “అహ్లుస్ సున్నత్ వల్ జమా’అత్” కు చెందినవారము అని చెప్పుకునే వారు, వాస్తవంగా ఎన్నటికీ కూడా “అహ్లుస్ సున్నత్ వల్ జమా’అత్” కు చెందినవారు మాత్రం అవ్వరు. ఇలాంటి వారు కేవలం “బిద’అతీ” లుగా పరిగణించబడతారు.​​​

ఒక ముస్లిం “అహ్లుస్ సున్నత్ వల్ జమా’అత్” కి చెందినవాడు అంటే అతను కేవలం ఖుర్’ఆన్ మరియు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విధానానికి (ప్రామాణికమైన సహీహ్ హదీసుల పరంగా మరియు ధర్మపండితుల ప్రామాణికమైన తీర్పుల పరంగా) అనుగుణంగా అనుసరించేవాడు.​​​

​​​దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు మరణించిన కొన్ని సంవత్సరాల తర్వాత అధర్మ వ్యక్తుల చేత జొప్పించబడిన ఇటువంటి నిరాధారమైన తప్పుడు ఆచారాలను మనం ఎలా ధర్మంగా భావించగలము. అలాంటి వాటిపై మనం ఏ రకంగా ఆచరించగలము???​​​

ఒకవేళ మనం అలాంటి బిద’అత్ కార్యాలను ఆచరించినా పుణ్యం మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ లభించదు, పైగా తౌబా (పశ్చాత్తాపం) కూడా చేసుకునేందుకు కూడా ఎలాంటి అవకాశం లేని ఘోరమైన పాపాలలో కూరుకుపోతాము.​​​

​మీరు ఇలాంటి బిద’అత్ కార్యాలను ఆరాధనలుగా భావిస్తున్న వారితో సహవాసం చేయకండి. దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ద్వారా గానీ, సహాబాల ద్వారా గానీ పైన పేర్కొన్న లాంటి బిద’అత్ కార్యాలకు నిజమైన ప్రామాణిక ఆధారం దొరకనంతవరకూ వాటిని మరియు ఈ కార్యాలను చేయండి అని చెప్పేవారిని ఏ మాత్రమూ అనుసరించకండి. ఎందుకంటే, అది ధర్మం కాని, ధర్మానికి చెందని విషయం మరియు ధర్మం కాని విషయాలను (మూర్ఖత్వంతో, మొండితనంతో, వితండవాదనతో) ధర్మంగా ఆచరించినా లేక ధర్మంగా బోధించినా వారు షైతాన్ సేవకులే.​

​​​కాబట్టి, పై విషయాలను మనమందరమూ చాలా జాగ్రత్తగా అర్ధం చేసుకుని మన జీవితంలోని ప్రతీ ఆచరణను సవ్యమైన సున్నత్ విధానంలో ఆచరించేందుకు మరియు ఆ సున్నత్ విధానం గురించి సరైన జ్ఞానాన్ని సంపాదించేందుకు తప్పనిసరిగా సంపూర్ణ కృషి చేయాలి.​​​

​​​అల్లాహ్ (సుబహానహు వత’ఆలా) మనందరికీ సరైన విధంగా అర్ధం చేసుకునే సద్భుద్ధిని తద్వారా మన జీవితాలను కేవలం ఖుర్’ఆన్ మరియు దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి సున్నత్ కు అనుగుణంగా మార్చుకునే హిదాయత్ ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఆమీన్.​​​​​


పై పుస్తకంతో పాటు క్రింద ఇచ్చిన రెండు ఆడియోలు తప్పకుండా వినండి :

తెలుగు ఇస్లామిక్ క్విజ్: పార్ట్ 32 [ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 32
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ప్రశ్నల పత్రం – 32

1) నక్షత్రాల వల్ల కలిగే ప్రయోజనాలు ఏవి?

A) రాశి ఫలాలు – జ్యోతిష్యం కొరకు
B) వర్షం కురిసేందుకు – కోర్కెలు తీర్చేందుకు
C) ఆకాశపు అలంకరణ – షైతాన్ లను తరిమేందుకు – చీకటిలో మార్గం తెలుసు కునేందుకు
D) పై వాటిలో ఏదీకాదు

2) ఏ ప్రవక్తను ఉద్దేశించి అతని పట్ల వారు హద్దు మీరినట్లుగా ! మీరు నా విషయంలో హద్దు మీరి పొగడకండి అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం ) తెలిపారు?

A) మూసా (అలైహిస్సలాం)
B) ఆదం (అలైహిస్సలాం)
C) ఈసా (అలైహిస్సలాం)
D) యహ్య (అలైహిస్సలాం)

3) ఇషా మరియు ఫజర్ నమాజ్ జమాఅత్ తో చెయ్యటం వల్ల ఎంత పుణ్యం లభిస్తుంది?

A) జీవితాంతం నమాజ్ చేసినంత
B) రోజంతా ఉపవాసం చేసినంత
C) పూర్తి రాత్రి తహజ్జుద్ చేసినంత
D) దినమంతా నమాజ్ చేసినట్లు

క్విజ్ 32: సమాధానాలు & వివరణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [10 నిమిషాలు]


1) నక్షత్రాల వల్ల కలిగే ప్రయోజనాలు ఏవి?

C) ఆకాశపు అలంకరణ – షైతాన్ లను తరిమెందుకు – చీకటిలో మార్గం తెలుసు కునేందుకు

الحجر 15:16-18 وَلَقَدْ جَعَلْنَا فِي السَّمَاءِ بُرُوجًا وَزَيَّنَّاهَا لِلنَّاظِرِينَ * وَحَفِظْنَاهَا مِن كُلِّ شَيْطَانٍ رَّجِيمٍ * إِلَّا مَنِ اسْتَرَقَ السَّمْعَ فَأَتْبَعَهُ شِهَابٌ مُّبِينٌ

నిశ్చయంగా మేము ఆకాశంలో బురుజులను నిర్మించాము. చూపరుల కోసం దానిని అందంగా ముస్తాబు చేశాము. ఇంకా, దానిని ధూత్కారి అయిన ప్రతి షైతాను బారి నుంచి రక్షించాము. కాకపోతే దొంగచాటుగా (ఎవడైనా అక్కడి రహస్య విషయాలను) వినటానికి ప్రయత్నించినప్పుడు స్పష్టమైన అగ్నిజ్వాల ఒకటి వాడ్ని వెంటాడుతుంది.

الصافات 37:6-7 إِنَّا زَيَّنَّا السَّمَاءَ الدُّنْيَا بِزِينَةٍ الْكَوَاكِبِ * وَحِفْظًا مِّن كُلِّ شَيْطَانٍ مَّارِدٍ

“మేము సమీప ఆకాశాన్ని నక్షత్రాల (అందం)తో ముస్తాబు చేశాము. తలబిరుసు అయిన ప్రతి షైతాను బారి నుంచి దాన్ని కాపాడాము.”

الأنعام 6:97 وَهُوَ الَّذِي جَعَلَ لَكُمُ النُّجُومَ لِتَهْتَدُوا بِهَا فِي ظُلُمَاتِ الْبَرِّ وَالْبَحْرِ ۗ قَدْ فَصَّلْنَا الْآيَاتِ لِقَوْمٍ يَعْلَمُونَ

“చీకట్లలోనూ, భూమిలోనూ, సముద్రంలోనూ మీరు మార్గం తెలుసుకునేందుకుగాను ఆయనే మీ కోసం నక్షత్రాలను సృష్టించాడు. మేము జ్ఞానం కలవారి కోసం మా సూచనలను బాగా విడమరచి చెప్పాము.”

2) ఏ ప్రవక్తను ఉద్దేశించి అతని పట్ల వారు హద్దు మీరినట్లుగా ! మీరు నా విషయంలో హద్దు మీరి పొగడకండి అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం ) తెలిపారు?

C) ఈసా (అలైహిస్సలాం)

البخاري 3445:- عن عُمَرَ رَضِيَ اللَّهُ عَنْهُ، يَقُولُ عَلَى المِنْبَرِ: سَمِعْتُ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: «لاَ تُطْرُونِي، كَمَا أَطْرَتْ النَّصَارَى ابْنَ مَرْيَمَ، فَإِنَّمَا أَنَا عَبْدُهُ، فَقُولُوا عَبْدُ اللَّهِ، وَرَسُولُهُ»
బుఖారీ 3445లో ఉంది, ఉమర్ (రజియల్లాహు అన్హు) మెంబర్ పై చెప్పారు, నేను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పగా విన్నాను: “క్రైస్తవులు ఈసా బిన్ మర్యమ్ అలైహిస్సలాం విషయంలో హద్దులు మీరినట్లు మీరు నా విషయంలో హద్దులు మీరకండీ. నిశ్చయంగా నేను అల్లాహ్ యొక్క దాసుడ్ని, కనుక మీరు అల్లాహ్ దాసుడు మరియు అతని ప్రవక్త అని అనండి.”

3) ఇషా మరియు ఫజర్ నమాజ్ జమాఅత్ తో చెయ్యటం వల్ల ఎంత పుణ్యం లభిస్తుంది?

C) పూర్తి రాత్రి తహజ్జుద్ చేసినంత

ఇషా మరియు ఫజ్ర్ నమాజ్ సామూహికంగా (జమాఅత్ తో) చేయుట

ప్రవక్త ﷺ ఇలా సంబోధించారని, ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

مَنْ صَلَّى الْعِشَاءَ فِي جَمَاعَةٍ كَانَ كَقِيَامِ نِصْفِ لَيْلَةٍ، وَمَنْ صَلَّى الْعِشَاءَ وَالْفَجْرَ فِي جَمَاعَةٍ كَانَ كَقِيَامِ لَيْلَةٍ

ఎవరు ఇషా నమాజు సామూహికంగా పాటిస్తారో వారికి అర్థ రాత్రి వరకు తహజ్జుద్ చేసినంత (పుణ్యం), మరెవరయితే ఇషా మరియు ఫజ్ర్ నమాజులు సామూహికంగా పాటిస్తారో వారిక రాత్రంతా తహజ్జుద్ చేసినంత (పుణ్యం) లభిస్తుంది”. (అబూ దావూద్ 555, ముస్లిం 656, అహ్మద్ 1/ 58, మాలిక్ 371, తిర్మిజి 221, దార్మి 1224).

ఇతరములు :

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

తెలుగు ఇస్లామిక్ క్విజ్: పార్ట్ 31 [ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 31
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ప్రశ్నల పత్రం – 31

1) ఆలమే అర్వాహ్ (ఆత్మల లోకం) లో ఏ ఆచరణ గూర్చి ఒప్పందం తీసుకోబడింది?

A) హజ్
B) తౌహీద్
C) రిసాలత్
D) జకాత్

2) జ్యోతిష్యకుని వద్దకు వెళ్లి సమాచారం అడిగేవాని ఎన్ని రోజులు నమాజ్ స్వీకరించబడదు?

A) 7 రోజుల
B) 21 రోజుల
C) 40 రోజుల
D) 70 రోజుల

3) జనాజ నమాజ్ చేసి దానివెంట వెళ్లి ఖననం అయ్యేవరకు పాల్గొంటే ఎన్ని ఖిరాతుల పుణ్యం దొరుకుతుంది?

A) 01 ఖిరాతు
B) 03 ఖిరాతులు
C) 02 ఖిరాతులు
D) 05 ఖిరాతులు

[గమనిక : ఒక ఖిరాతు బరువు అనగా అల్లాహ్ వద్ద ఉన్న త్రాసులో ఉహద్ పర్వతం కంటే ఎక్కువ బరువు)

క్విజ్ 31: సమాధానాలు & వివరణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [14:19 నిమిషాలు]


1) ఆలమే అర్వాహ్ (ఆత్మల లోకం) లో ఏ ఆచరణ గూర్చి ఒప్పందం తీసుకోబడింది?

B) తౌహీద్

الأعراف: 7:172-174 وَإِذْ أَخَذَ رَبُّكَ مِن بَنِي آدَمَ مِن ظُهُورِهِمْ ذُرِّيَّتَهُمْ وَأَشْهَدَهُمْ عَلَىٰ أَنفُسِهِمْ أَلَسْتُ بِرَبِّكُمْ ۖ قَالُوا بَلَىٰ ۛ شَهِدْنَا ۛ أَن تَقُولُوا يَوْمَ الْقِيَامَةِ إِنَّا كُنَّا عَنْ هَٰذَا غَافِلِينَ * أَوْ تَقُولُوا إِنَّمَا أَشْرَكَ آبَاؤُنَا مِن قَبْلُ وَكُنَّا ذُرِّيَّةً مِّن بَعْدِهِمْ ۖ أَفَتُهْلِكُنَا بِمَا فَعَلَ الْمُبْطِلُونَ * وَكَذَٰلِكَ نُفَصِّلُ الْآيَاتِ وَلَعَلَّهُمْ يَرْجِعُونَ

నీ ప్రభువు ఆదం సంతతి వీపుల నుండి వారి సంతానాన్ని తీసి, స్వయంగా వారినే వారికి సాక్షులుగా పెట్టి, “నేను మీ ప్రభువును కానా?” అని అడిగినప్పుడు “ఎందుకు కావు? (నువ్వే మా ప్రభువువి). ఈ విషయానికి మేమంతా సాక్షులుగా ఉన్నాం” అని వారు చెప్పారు. ‘దీని గురించి మాకేమీ తెలియదు’ అని ప్రళయ దినాన మీరు అనకుండా ఉండటానికీ * లేదా “మొదట్లో మా పూర్వీకులు షిర్కుకు పాల్పడ్డారు. మేము వారి తరువాతివారి సంతతిలో పుట్టినవారము. ఆ దుర్జనులు చేసిన పాపానికి నువ్వు మమ్మల్ని వినాశానికి గురిచేస్తావా?!” అని మీరు అనకుండా ఉండటానికిగాను (మేము ముందే మీ నుండి ఈ విధంగా ఖరారు చేయించాము.) * వారు (బహుదైవారాధన నుండి ఏకదైవారాధన వైపుకు) మరలివస్తారేమోనని మేము ఈ విధంగా ఆయతులను విడమరచి చెబుతున్నాము.

صَحِيحِ مُسْلِمٍ 2865، عَنْ عِيَاضِ بْنِ حِمَارٍ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “يَقُولُ اللَّهُ [تَعَالَى) إِنِّي خَلَقْتُ عِبَادِي حُنَفَاءَ فَجَاءَتْهُمُ الشَّيَاطِينُ فَاجْتَالَتْهُمْ عَنْ دِينِهِمْ وَحَرَّمَتْ عَلَيْهِمْ مَا أَحْلَلْتُ لَهُمْ”

సహీ ముస్లిం 2865లో ఉంది, ఇయాజ్ బిన్ హిమార్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు: అల్లాహ్ ఇలా తెలిపాడని: “నేను నా దాసులను ముస్లిములుగా, సత్యాన్ని స్వీకరించి బహుదైవత్వాలకు దూరంగా ఉండేవారిగా పుట్టించాను, కాని షైతానులు వారి వద్దకు వచ్చి వారిని సత్యధర్మం నుండి దూరం చేశారు, నేను వారి కొరకు హరాం (నిషిద్ధం) చేసిన దానిని హరాం చేశారు”.

))قال النووي: قَوْلُهُ تَعَالَى (وَإِنِّي خَلَقْتُ عِبَادِي حُنَفَاءَ كُلَّهُمْ) أَيْ مُسْلِمِينَ وَقِيلَ طَاهِرِينَ مِنَ الْمَعَاصِي وَقِيلَ مُسْتَقِيمِينَ مُنِيبِينَ لِقَبُولِ الْهِدَايَةِ وَقِيلَ الْمُرَادُ حِينَ أَخَذَ عَلَيْهِمُ الْعَهْدَ فِي الذَّرِّ وَقَالَ أَلَسْتُ بِرَبِّكُمْ قالوا بلى[[

البخاري 6557 ، مسلم 2805:- أَنَسَ بْنَ مَالِكٍ رَضِيَ اللَّهُ عَنْهُ، عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: ” يَقُولُ اللَّهُ تَعَالَى لِأَهْوَنِ أَهْلِ النَّارِ عَذَابًا يَوْمَ القِيَامَةِ: لَوْ أَنَّ لَكَ مَا فِي الأَرْضِ مِنْ شَيْءٍ أَكُنْتَ تَفْتَدِي بِهِ؟ فَيَقُولُ: نَعَمْ، فَيَقُولُ: أَرَدْتُ مِنْكَ أَهْوَنَ مِنْ هَذَا، وَأَنْتَ فِي صُلْبِ آدَمَ: أَنْ لاَ تُشْرِكَ بِي شَيْئًا، فَأَبَيْتَ إِلَّا أَنْ تُشْرِكَ بِي “

అనస్ బిన్ మాలిక్ ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు: “అల్లాహ్ ప్రళయదినాన అతితక్కువ నరక శిక్ష అనుభవిస్తున్న వ్యక్తిని అల్లాహ్ అడుగుతాడు: భూమిలో ఉన్న సమస్తం నీదై ఉంటే దానిని పరిహారంగా చెల్లించి నరకం నుండి రక్షణ పొందాలనుకుంటున్నావా? అతడు అవును అని అంటాడు, అప్పుడు అల్లాహ్ అంటాడు: నీవు ఆదం వీపులో ఉండగానే నేను నీతో దీనికంటే ఎంతో తేలికైన విషయం ఒకటి కోరాను: నీవు నాతో పాటు ఎవ్వరినీ భాగస్వామిగా చేయకు అని, కాని నీవు తిరస్కరించావు, నాకు భాగస్వాములకు నిలబెట్టావు”.

2) జ్యోతిష్యుని వద్దకు వెళ్లి సమాచారం అడిగేవాని ఎన్ని రోజుల నమాజ్ స్వీకరించబడదు?

C) 40 రోజుల

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారని సఫియ్య (రజియల్లాహు అన్హా) ప్రవక్తగారి ఒక భార్య ద్వారా ఉల్లేఖించారు:

مَنْ أَتَى عَرَّافًا فَسَأَلَهُ عَنْ شَيْءٍ، لَمْ تُقْبَلْ لَهُ صَلَاةٌ أَرْبَعِينَ لَيْلَةً

ఎవరైనా జ్యోతిష్యుని వద్దకు వచ్చి దేని గురించైనా అతన్ని ప్రశ్నిస్తే అతని నలబై రోజుల నమాజు స్వీకరించబడదు”. (ముస్లిం పదాలు 2230).

ఇది మనుషుల రూపంలో ఉన్నవారి వద్దకు వెళ్ళి అడగడం వరకే పరిమితం కాదు. ఈ రోజుల్లో కొందరు తమ జాతకలు తెలుసుకోడానికి టీవిలలో కొన్ని ప్రోగ్రామ్స్ ఫాలో అవుతుంటారు. మరి కొందరు స్మార్ట్ ఫోన్లో వచ్చిన ఆప్స్ లను ఫాలో అవుతారు

గుర్తుంచుకోండి:
వెబ్ సైట్లోకెల్లి జాతకం గురంచి వెతకడం కూడా ఈ హదీసులో వస్తుంది అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి

మరో ముఖ్య విషయం: 40 రోజుల నమాజు అంగీకరింపబడదని అంటే వాటి పుణ్యం లభించదని భావం, కాని చేయకుండా ఉంటే అది మరింత ఘోరమైన పాపం అవుతుంది.

3) జనాజ నమాజ్ చేసి దానివెంట వెళ్లి ఖననం అయ్యేవరకు పాల్గొంటే ఎన్ని ఖిరాతుల పుణ్యం దొరుకుతుంది?

C) 02 ఖిరాతులు

జనాజ వెంట వెళ్ళడం, జనాజ నమాజు చేయడం

గొప్ప పుణ్య కార్యాల్లో ఒకటి; జనాజ వెంట వెళ్ళడం, జనాజ నమాజు చేయడం, దానిపై లభించే పుణ్యం బరువు మానవుని త్రాసులో ఉహద్ పర్వతం కంటే అధికిమించి ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని ఉబై బిన్ కఅబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

مَنْ تَبِعَ جَنَازَةً حَتَّى يُصَلَّى عَلَيْهَا، وَيُفْرَغَ مِنْهَا، فَلَهُ قِيرَاطَانِ، وَمَنْ تَبِعَهَا حَتَّى يُصَلَّى عَلَيْهَا، فَلَهُ قِيرَاطٌ، وَالَّذِي نَفْسُ مُحَمَّدٍ بِيَدِهِ لَهُوَ أَثْقَلُ فِي مِيزَانِهِ مِنْ أُحُدٍ

“ఎవరు నమాజు మరియు (ఖననం) అయ్యే వరకు జానాజ వెంట ఉంటాడో అతనికి రెండు ఖీరాతులు, మరెవరయితే కేవలం నమాజు అయ్యే వరకు దాని వెంట ఉంటాడో అతనికి ఒక ఖీరాతు లభిస్తుంది. నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన (అంటే అల్లాహ్) సాక్షి! ఒక్క ఖీరాత్ బరువు అల్లాహ్ వద్ద ఉన్న త్రాసులో ఉహద్ పర్వతంకంటే ఎక్కువ ఉండును”. (అహ్మద్ 5/ 131 ఇది సహీ హదీస్).

ప్రవక్త ﷺ తెలిపారని, అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు;

مَنْ شَهِدَ الجَنَازَةَ حَتَّى يُصَلِّيَ، فَلَهُ قِيرَاطٌ، وَمَنْ شَهِدَ حَتَّى تُدْفَنَ كَانَ لَهُ قِيرَاطَانِ، قِيلَ: وَمَا القِيرَاطَانِ؟ قَالَ: مِثْلُ الجَبَلَيْنِ العَظِيمَيْنِ

“ఎవరు జనాజలో పాల్గొని నమాజు చేస్తాడో అతనికి ఒక ఖీరాత్, మరెవరయితే (నమాజు మరియు) ఖననం అయ్యే వరకు పాల్గొంటాడో అతనికి రెండు ఖీరాతులు లభించును”. రెండు ఖీరాతులంటే ఏమిటి? అని ప్రశ్న వచ్చినప్పుడు, ప్రవక్త చెప్పారు: “రెండు పెద్ద కొండల వంటివి”. (బుఖారి 1325, ముస్లిం 945, తిర్మిజి 1040, నిసాయి 1940, ఇబ్ను మాజ 1539, అహ్మద్ 2/ 401, ఇబ్ను హిబ్బాన్ 3080)

ముస్లింలో ఉంది; ఇబ్ను ఉమర్ (రజియల్లాహు అన్హు) జనాజ నమాజు చేసుకొని వెళ్ళేవారు, ఎప్పుడయితే వారికి అబూహురైరా (రజియల్లాహు అన్హు) గారి ఈ హదీసు చేరిందో ‘వాస్తవానికి మనం అనేక ఖీరాతులు పోగుట్టుకున్నాము’ అని బాధ పడ్డారు.

ఇతరములు :

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

తెలుగు ఇస్లామిక్ క్విజ్: పార్ట్ 29 [ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 29
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ప్రశ్నల పత్రం – 29

1) ఒక వ్యక్తి పుణ్యం మరియు పేరు ప్రఖ్యాతుల కొరకు పోరాటం చేస్తే అతనికి ఏమి దక్కుతుంది?

A) పుణ్యం – పేరు ప్రఖ్యాతులు దక్కుతాయి
B) స్వర్గం దక్కుతుంది
C) అతనికి ఏ పుణ్యం దక్కదు

2) హజ్జ్ లో ఏ ఆచరణ అన్నిటికంటే ప్రధానమైనది?

A) లబ్బయిక్ అని బిగ్గరగా పలకడం – ఖుర్భానీ ఇవ్వడం
B) జమ్ జమ్ నీటిని నిలబడి త్రాగడం
C) జాగరణ చేస్తూ నమాజ్ చెయ్యడం

3) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తెల్పినటువంటి ” నాలుకపై సులభంగానూ ..త్రాసులో బరువుగానూ ఉండే ఆ రెండు వాక్యాలు ఏవి?

A) అల్లాహు అక్బర్
B) రబ్బనా వ లకల్ హమ్ద్
C) సుబ్ హానల్లాహి వబిహందిహీ సుబ్ హానల్లాహిల్ అజీం

క్విజ్ 29: సమాధానాలు & వివరణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [14:04 నిమిషాలు]


1) ఒక వ్యక్తి పుణ్యం మరియు పేరు ప్రఖ్యాతుల కొరకు పోరాటం చేస్తే అతనికి ఏమి దక్కుతుంది?

C] అతనికి ఏ పుణ్యం దక్కదు

ప్రతి కార్యానికి పునాది సంకల్పశుద్ధి. ఏ కార్యం ఎంత సంకల్ఫశుద్ధితో కూడుకొని ఉంటుందో త్రాసులో అంతే బరువుగా ఉంటుంది, అది కొంచమైనా సరే. ఒకవేళ చూపుగోలు, పేరు, ప్రఖ్యాతులతో సమ్మిళితమై ఉంటే త్రాసు తేలికగా ఉంటుంది, అది ఎంత ఎక్కువగా అయినప్పటికీ సూక్ష్మకణాలుగా, దుమ్ము, ధూళివలే అయిపోతుంది (అంటే రవ్వంత పుణ్యం లభించదు). అల్లాహ్ సుబ్ హానహు వతఆలా వద్ద కర్మల ఘనత, వాటిని చేసేవారి మనస్సులో ఉండే సంకల్పశుద్ధిని మరియు వారిలో ఉండే అల్లాహ్ పట్ల ప్రేమను బట్టి పెరుగుతూ, తరుగుతూ ఉంటుంది.

عَنْ أَبِي أُمَامَةَ الْبَاهِلِيِّ ، قَالَ: جَاءَ رَجُلٌ إِلَى النَّبِيِّ ﷺ، فَقَالَ: أَرَأَيْتَ رَجُلًا غَزَا يَلْتَمِسُ الْأَجْرَ وَالذِّكْرَ، مَالَهُ؟ فَقَالَ رَسُولُ اللَّهِ ﷺ: لَا شَيْءَ لَهُ فَأَعَادَهَا ثَلَاثَ مَرَّاتٍ، يَقُولُ لَهُ رَسُولُ اللَّهِ ﷺ: لَا شَيْءَ لَهُ ثُمَّ قَالَ: إِنَّ اللهَ لَا يَقْبَلُ مِنَ الْعَمَلِ إِلَّا مَا كَانَ لَهُ خَالِصًا، وَابْتُغِيَ بِهِ وَجْهُهُ

అబూ ఉమామహ్ బాహిలీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఓ మనిషి వచ్చి, ‘ఒక వ్యక్తి పుణ్యఫలం మరియు పేరుప్రఖ్యాతులనుద్దేశించి పోరాడుతుంటే అతనికి ప్రాప్తమయ్యేదేమిటి?’ అని అడిగాడు. “అతనికి ఏ పుణ్యమూ దక్కదు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానమిచ్చారు. ఆ మనిషి తిరిగి మూడు సార్లు అదే ప్రశ్న అడిగాడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అతనికి ఏ పుణ్యమూ దక్కదు” అని మూడు సార్లు జవాబిచ్చారు, మళ్ళీ ఆ తర్వాత ఇలా చెప్పారు: “అల్లాహ్ సంకల్పశుద్ధితో, ఆయన అభీష్టాన్ని కోరుతూ చేసిన సత్కార్యాన్ని మాత్రమే స్వీకరిస్తాడు”. (నిసాయి 3140, తబ్రానీ కబీర్ 7628, సహీహుల్ జామి 1856).

అబ్దుల్లాహ్ బిన్ ముబారక్ రహిమహుల్లాహ్ చెప్పారు: ‘ఒక చిన్న కార్యాన్ని సంకల్పం గొప్పదిగా, పెద్దదిగా చేయవచ్చు, ఒక పెద్ద కార్యాన్ని సంకల్పం చిన్నదిగా చేయవచ్చు’. (జామిఉల్ ఉలూమి వల్ హికం, రచయితః ఇబ్ను రజబ్ అల్ హంబలీ 1/71).

మైమూన్ బిన్ మహ్రాన్ రహిమహుల్లాహ్ చెప్పారు: ‘మీ ఆచరణలు ఉన్నవే చాలా తక్కువ, ఆ తక్కువవాటిని సంకల్పశుద్ధితో ఆచరించండి’. (హిల్ యతుల్ ఔలియా వ తబ్ ఖతుల్ అస్ఫియా, రచయితః అబూ నుఐమ్ 4/92).

ఇఖ్లాస్ (సంకల్పశుద్ధి)తో కూడుకొని ఉన్న సత్కార్యం యొక్క పుణ్యం ఎలా పెరుగుతుందో ఈ హదీసు చదవండి. అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త ﷺ చెప్పారు:

سَبَقَ دِرْهَمٌ مِائَةَ أَلْفِ دِرْهَمٍ ، قَالُوا: وَكَيْفَ؟ قَالَ: كَانَ لِرَجُلٍ دِرْهَمَانِ تَصَدَّقَ بِأَحَدِهِمَا وَانْطَلَقَ رَجُلٌ إِلَى عُرْضِ مَالِهِ فَأَخَذَ مِنْهُ مِائَةَ أَلْفِ دِرْهَمٍ فَتَصَدَّقَ بِهَا

“ఒక దిర్హమ్ ఒక లక్ష దిర్హములపై గెలుపొందింది”. అదెలా ప్రవక్తా! అని సహచరులు అడగ్గా, ఇలా సమాధానమిచ్చారుః “ఒక వ్యక్తి వద్ద రెండే రెండు దిర్హములు ఉండగా అతను అందులో నుండి ఒక దిర్హమ్ దానం చేశాడు, మరో వ్యక్తి తన ధన బంఢారం వైపనకు వెళ్ళి అందులో నుండి ఒక లక్ష దానం చేశాడు”.

(నిసాయి 2527, అహ్మద్ 2/379, హాకిం 1519, ఇబ్ను హిబ్బాన్ 3347, సహీహుల్ జామి 3606).

2) హజ్జ్ లో ఏ ఆచరణ అన్నిటికంటే ప్రధానమైనది ?

A] లబ్బయిక్ అని బిగ్గరగా పలకడం – ఖుర్భానీ ఇవ్వడం

తిర్మిజి 827 (సహీహా 1500)లో ఉంది, అబూ బక్ర్ సిద్దీఖ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ‘ఏ హజ్ అత్యుత్తమైనద’ని ఎవరో అడిగినందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

عَنْ أَبِي بَكْرٍ الصِّدِّيقِ، أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ سُئِلَ: أَيُّ الحَجِّ أَفْضَلُ؟ قَالَ: العَجُّ وَالثَّجُّ.

గొంతెత్తి, బిగ్గరగా తల్బియా పలకడం మరియు ఖుర్బానీ ఇవ్వడం.

తిర్మిజి 828 (సహీ తర్గీబ్ 1134)లో సహల్ బిన్ సఅద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

عَنْ سَهْلِ بْنِ سَعْدٍ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: مَا مِنْ مُسْلِمٍ يُلَبِّي إِلاَّ لَبَّى مَنْ عَنْ يَمِينِهِ، أَوْ عَنْ شِمَالِهِ مِنْ حَجَرٍ، أَوْ شَجَرٍ، أَوْ مَدَرٍ، حَتَّى تَنْقَطِعَ الأَرْضُ مِنْ هَاهُنَا وَهَاهُنَا.

ఏ ముస్లిం తల్బియా చదువుతాడో అతని కుడి ఎడమ పక్కన భూమి అంతమయ్యే వరకు ఉన్న రాళ్ళు, చెట్లు మరియు మట్టిపెడ్డలన్నీ అతనితో పాటు తల్పియా చదువుతూ ఉంటాయి.

ఖుర్ఆన్లోని సూర అంబియా 21:79, సూర సబ 34:10, సూర సాద్ 38:18లో ఉంది, దావూద్ అలైహిస్సలాంతో పాటు పర్వతాలు మరియు పక్షులు కూడా తస్బీహ్ చేస్తూ ఉండేవి.

సహీ తర్గీబ్ 1137లో ఉంది: అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

“ما أهلَّ مُهِلٌّ قط إلا بُشِّرَ، ولا كَبَّر مُكَبِّرٌ قط إلا بُشِّرَ”. قيل: يا رسول الله! بالجنة؟ قال: “نعم”.

తల్బియా చదివిన మరియు అల్లాహు అక్బర్ అని పలికిన వారికి శుభవార్త ఇవ్వడం జరుగుతుంది, ప్రవక్తా! స్వర్గ శుభవార్తనా? అని అడిగారు, అందుకు ప్రవక్త అవును అని చెప్పారు.

3) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం ) తెల్పినటువంటి ” నాలుకపై సులభంగానూ ..త్రాసులో బరువుగానూ ఉండే ఆ రెండు వాక్యాలు ఏవి ?

C] సుబ్ హానల్లాహి వబిహందిహి సుబ్ హానల్లాహిల్ అజీమ్

సహీ బుఖారీలోని చివరి హదీసు, అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త ﷺ తెలిపారుః

كَلِمَتَانِ خَفِيفَتَانِ عَلَى اللِّسَانِ، ثَقِيلَتَانِ فِي المِيزَانِ، حَبِيبَتَانِ إِلَى الرَّحْمٰنِ: سُبْحَانَ الله وَبِحَمْدِهِ ، سُبْحَانَ الله العَظِيمِ

“రెండు పదాలున్నాయి, అవిః నాలుకపై చాలా సులభంగా, త్రాసులో బరువుగా మరియు కరుణామయునికి చాలా ప్రియమైనవి. అవేః సుబ్ హానల్లాహి వబిహందిహీ సుబ్ హానల్లాహిల్ అజీం”. (బుఖారి 6406, ముస్లిం 2694).

అనేక మందికి ఈ రెండు పదాల ఘనత తెలుసు, కాని త్రాసు బరువు కావటానికి చదివేవారు చాలా అరుదు. (మరికొందరికైతే) ఏదైనా కల్చరల్ ప్రోగ్రాముల్లో పోటాపోటీలు, కాంపిటేషన్లు జరుగుతున్నప్పుడు అందులో ఇలాంటి ప్రశ్న ఏదైనా వచ్చినప్పుడు అవి గుర్తుకు వస్తాయి. (ఇది ఎంత దారుణంॽॽॽ).

వఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్

ఇతరములు :

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

తెలుగు ఇస్లామిక్ క్విజ్: పార్ట్ 28 [ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 28
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ప్రశ్నల పత్రం – 28

1) అల్లాహ్ వ్రాసిన విధివ్రాత ప్రకారం ఒక విశ్వాసి ప్లేగు వంటి అంటువ్యాధుల వల్ల మరణిస్తే అది ఏ విధమైన మరణం అవుతుంది?

A) అకాల మరణం చెందినట్లు
B) షహీద్ (అమరగతి) చెందినట్లు
C) సహజ మరణం చెందినట్లు

2) ఏ కారణంగా స్త్రీలు అధికంగా నరకంలో ప్రవేశిస్తారు?

A) భర్త పట్ల అవిధేయత – కృతఘ్నత వల్ల
B) శాపనార్ధాలు – ఎత్తిపొడుపుల వల్ల
C) పై రెండూ కూడా కారణం

3) నరకంలో కాలిన కొంతకాలం తర్వాత ఎవరిని బయటకు తీసి స్వర్గంలో వెయ్యడం జరుగును?

A) అసాధ్యం ఎవ్వరినీ లేదు
B) యూదులనందరినీ
C) ఎవరి హృదయంలో గోధుమగింజంత స్వచ్ఛమైన ఏకదైవారాధన విశ్వాసం ఉందొ

క్విజ్ 28: సమాధానాలు & వివరణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [14:59 నిమిషాలు]


ఇతరములు :

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

తెలుగు ఇస్లామిక్ క్విజ్: పార్ట్ 27 [ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 27
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ప్రశ్నల పత్రం – 27

1) దైవప్రవక్త (ﷺ) తెల్పిన రెండు వరాలను ప్రజలు దుర్వినియోగం చేసుకుంటున్నారు అవి ఏవి?

A) ఆరోగ్యం – తీరిక సమయం
B) అందం – యవ్వనం
C) ధనం – జీవితం

2) సూరాహ్ మూమినూన్ 23:1 నుండి 11 వాక్యాలలో ఆచరించదగిన ఆదేశాలు ఏమిటి వ్రాయండి?

ఖుర్ఆన్ చూసి పఠించి జవాబును వ్రాయండి

3) కరోనా వైరస్ నుండి రక్షణ కొరకు ప్రతీ ముస్లిం పాటించవలసిన రెండు ముఖ్య విషయాలు ఏమిటి?

A) అల్లాహ్ తో సత్సంబంధం మరియు ఆరోగ్య జాగ్రత్తలు
B) హజ్ మరియు ఉమ్రా
C) ఏమీ అవసరం లేదు ఇంటి వద్ద ఉంటే చాలు!

క్విజ్ 27: సమాధానాలు & వివరణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [19:54 నిమిషాలు]


ఇతరములు :

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

తెలుగు ఇస్లామిక్ క్విజ్: పార్ట్ 26 [ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 26
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ప్రశ్నల పత్రం – 26

1) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం ) వారు రమజాన్ నెల తర్వాత ఏ నెలలో అత్యధికంగా ఉపవాసాలు పాటించేవారు?

A) షాబాన్
B) రజబ్
C) జిల్ ఖాదా

2) మానవుల కర్మలను వారంలోని ఏ రెండు రోజుల్లో అల్లాహ్ వద్దకు సమర్పించబడుతాయి?

A) గురువారం – శుక్రవారం
B) సోమవారం – గురువారం
C) బుధవారం – ఆదివారం

3) ఏ మస్జిదులో రెండు రకాతుల నమాజు చేస్తే ఒక ఉమ్రా చేసిన పుణ్యంతో సమానం అవుతుంది ?

A) మస్జిదే అక్సా
B) మస్జిదే నబవి
C) మస్జిదే ఖుభా

క్విజ్ 26: సమాధానాలు & వివరణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [14:29 నిమిషాలు]


ఇతరములు :

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

తెలుగు ఇస్లామిక్ క్విజ్: పార్ట్ 24[ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 24
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ప్రశ్నల పత్రం – 24

1) మూసా (అలైహిస్సలాం) కాలంలో “నన్ను ముట్టుకోకండి” అని పారిపోయిన శాపగ్రస్తుడు ఎవరు ?

A) ఫిరౌన్
B) సామిరి
C) ఖారూన్

2) “అస్సలాముఅలైకుం వ రహ్మాతుల్లాహి వ బరకాతుహ్” అని చెబితే ఎన్ని పుణ్యాలు లభిస్తాయి ?

A) 1 పుణ్యం
B) 20 పుణ్యాలు
C) 30 పుణ్యాలు

3) స్వస్థత లభించే ఈ 3 విధానాలలో దైవప్రవక్త (ﷺ) వారు ఇష్టపడని ఆ ఒక్కటి ఏది ?

A) స్వల్పగా గాట్లు చేసి చెడు రక్తం తీసే ప్రక్రియ
B) కాల్చి వాతలు పెట్టె ప్రక్రియ
C) తేనె సేవించుట.

క్విజ్ 24: సమాధానాలు & వివరణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [20:01 నిమిషాలు]


1 ] మూసా (అలైహిస్సలాం) కాలంలో “నన్ను ముట్టుకోకండి” అని పారిపోయిన శాపగ్రస్తుడు ఎవరు?

B] సామిరి

20:95-98 قَالَ فَمَا خَطْبُكَ يَا سَامِرِيُّ * قَالَ بَصُرْتُ بِمَا لَمْ يَبْصُرُوا بِهِ فَقَبَضْتُ قَبْضَةً مِّنْ أَثَرِ الرَّسُولِ فَنَبَذْتُهَا وَكَذَٰلِكَ سَوَّلَتْ لِي نَفْسِي * قَالَ فَاذْهَبْ فَإِنَّ لَكَ فِي الْحَيَاةِ أَن تَقُولَ لَا مِسَاسَ ۖ وَإِنَّ لَكَ مَوْعِدًا لَّن تُخْلَفَهُ ۖ وَانظُرْ إِلَىٰ إِلَٰهِكَ الَّذِي ظَلْتَ عَلَيْهِ عَاكِفًا ۖ لَّنُحَرِّقَنَّهُ ثُمَّ لَنَنسِفَنَّهُ فِي الْيَمِّ نَسْفًا * إِنَّمَا إِلَٰهُكُمُ اللَّهُ الَّذِي لَا إِلَٰهَ إِلَّا هُوَ ۚ وَسِعَ كُلَّ شَيْءٍ عِلْمًا

“సామిరీ! ఇక నీ సంగతేమిటీ?” అని (మూసా) అడిగాడు. “వారు చూడని దాన్ని నేను చూశాను. నేను దైవసందేశవాహకుని పాద ముద్రలో నుంచి ఒక పిడికెడు మన్ను తీసుకుని అందులో వేశాను. నా మనసు కూడా నాకు దీనిని సరైనదిగా సూచింపజేసింది” అని అతను జవాబిచ్చాడు. అప్పుడు మూసా,”సరే! ఇక్కణ్ణుంచి వెళ్ళిపో. నీకు శిక్ష ఏమిటంటే, నీవు జీవితాంతం ‘అమ్మో నన్ను ముట్టుకోకండి’ అని అంటూ ఉంటావు. నీ నుంచి ఎట్టి పరిస్థితిలోనూ తప్పిపోని వాగ్దానం మరొకటి కూడా నీ కోసం ఉంది. ఇన్నాళ్ళూ నువ్వు అంటిపెట్టుకుని ఉన్న నీ ఆరాధ్య దేవునికి పట్టే గతేమిటో కూడా చూసుకో. మేము దాన్ని కాల్చి, భస్మం చేసి సముద్రంలో విసిరేస్తాము” అన్నాడు. యదార్థమేమిటంటే మీ అందరి ఆరాధ్యదైవం అల్లాహ్‌ మాత్రమే. ఆయన తప్ప వేరొక ఆరాధ్య దైవం లేనే లేడు. ఆయన జ్ఞానం అన్నింటినీ ఆవరించి ఉంది” (అని చెప్పాడు).

ఇమాం బిఖాఈ చెప్పారు: ఐక్యంగా ధర్మంపై ఉన్న బనీఇస్రాఈల్ ను సామిరీ విడగొట్టాడు, దుర్మార్గ చేష్టను ఉనికిలోకి తెచ్చి లీడరయ్యాడు, అందుకే అతను పాల్పడిన చేష్టకు తగిన శిక్ష అతనికివ్వడం జరిగింది, అంతకంటే ఘోర శిక్ష మరేముంటుంది? అందరికీ దూరమయ్యాడు, ఎవడిని కలుసుకోలేడు, ఎవడు వానితో కలవలేడు. ఆయుషున్నన్ని రోజులు ధూత్కరింపబడి ఒంటరితనంతో జీవించడమే.

Quarantine అంటే ఇదేనేమో ఈ రోజుల్లో చాలా వినబడుతుంది కదా, కొంచెం దూరపు, లోతు ఆలోచనతో యోచించండి. టైం సరిపోదు వివరాల్లోకి వెల్లడానికి. ప్రత్యేకంగా మా సైన్యం, మా శక్తి, మా పార్టీ, మా బాస్, మా మా అన్ని లెక్కించుకుంటూ గర్వించేవారు ఇకనైనా గుణపాఠం నేర్చుకోండి!!

వానికి ఇలా ఎందుకు జరిగింది? ఇమాం బిఖాఈ చెప్పారు: సర్వ శక్తిమంతుడు, నిజ సృష్టి కర్త అయిన అల్లాహ్ ను వదలి ఏ శక్తి లేనిదానిని ఆరాధ్యదైవంగా చేసుకున్నందుకు. అంతే కాదు అమాయక ప్రజలను సైతం ఈ దుర్మార్గం వైపునకు ఆహ్వానించినందుకు.

2 ] “అస్సలాముఅలైకుం వ రహ్మాతుల్లాహి వ బరకాతుహ్ అని చెబితే ఎన్ని పుణ్యాలు లభిస్తాయి?

C] 30 పుణ్యాలు

అబూ దావూద్ 5195లో ఉంది, షేఖ్ అల్బానీ సహీ అన్నారు: ఇమ్రాన్ బిన్ హుసైన్ ఉల్లేఖించారు:

عَنْ عِمْرَانَ بْنِ حُصَيْنٍ، قَالَ: جَاءَ رَجُلٌ إِلَى النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَالَ: السَّلَامُ عَلَيْكُمْ، فَرَدَّ عَلَيْهِ السَّلَامَ، ثُمَّ جَلَسَ، فَقَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «عَشْرٌ» ثُمَّ جَاءَ آخَرُ فَقَالَ: السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللَّهِ، فَرَدَّ عَلَيْهِ، فَجَلَسَ، فَقَالَ: «عِشْرُونَ» ثُمَّ جَاءَ آخَرُ فَقَالَ: السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللَّهِ وَبَرَكَاتُهُ، فَرَدَّ عَلَيْهِ، فَجَلَسَ، فَقَالَ: «ثَلَاثُونَ»

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఒక వ్యక్తి వచ్చి అస్సలాముఅలైకుమ్ అని అన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి సమాధానం ఇచ్చారు. ఆ వ్యక్తి కూర్చున్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 10 పుణ్యాలు అన్నారు. ఆ తరువాత మరో వ్యక్తి వచ్చాడు, అతడు అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్ అన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి సమాధానం ఇచ్చారు. ఆ వ్యక్తి కూర్చున్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 20 పుణ్యాలు అన్నారు. మరో వ్యక్తి వచ్చి అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు అని అన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి సమాధానం ఇచ్చారు. అతడు కూర్చున్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 30 పుణ్యాలు అన్నారు.

قَالَ الْقَفَّالُ [أبو بكر محمد بن علي بن إسماعيل الشاشي المعروف بـ “القفال الكبير 291هـ – 365هـ (904 – 976 م)] فِي فَتَاوِيهِ تَرْكُ الصَّلَاةِ يَضُرُّ بِجَمِيعِ الْمُسْلِمِينَ لِأَنَّ الْمُصَلِّيَ … لَا بُدَّ أَنْ يَقُولَ فِي التَّشَهُّدِ السَّلَامُ عَلَيْنَا وَعَلَى عِبَادِ اللَّهِ الصَّالِحِينَ فَيَكُونُ مُقَصِّرًا بِخِدْمَةِ اللَّهِ وَفِي حَقِّ رَسُولِهِ وَفِي حَقِّ نَفْسِهِ وَفِي حَقِّ كَافَّةِ الْمُسْلِمِينَ وَلِذَلِكَ عُظِّمَتِ الْمَعْصِيَةُ بِتَرْكِهَا
وَاسْتَنْبَطَ مِنْهُ السُّبْكِيُّ أَنَّ فِي الصَّلَاةِ حَقًّا لِلْعِبَادِ مَعَ حَقِّ اللَّهِ وَأَنَّ مَنْ تَرَكَهَا أَخَلَّ بِحَقِّ جَمِيعِ الْمُؤْمِنِينَ مَنْ مَضَى وَمَنْ يَجِيءُ إِلَى يَوْمِ الْقِيَامَةِ لِوُجُوبِ قَوْلِهِ فِيهَا السَّلَامُ عَلَيْنَا وَعَلَى عِبَادِ اللَّهِ الصَّالِحِينَ [فتح الباري 2/317]

సహీ బుఖారీ యొక్క ప్రక్యాతి గాంచిన వ్యాఖ్యానకర్త ఇమాం ఇబ్ను హజర్ అస్కలానీ ఫత్హుల్ బారీ 2/317లో తెలిపారు: ఇమాం ఖఫ్ఫాల్ రహిమహుల్లాహ్ తన ఒక ఫత్వాలో చెప్పారు: ఒక్క వ్యక్తి నమాజు వదలడం వల్ల ముస్లిములందరికీ నష్టం జరుగుతుంది, ఎందుకనగా నమాజీ … తషహ్హుద్ లో అస్సలాము అలైనా వఅలా ఇబాదిల్లాహిస్సాలిహీన్ అనడం తప్పనిసరి, నమాజు చేయని వ్యక్తి ఇది అనలేదు గనక అతడు, అల్లాహ్ పట్ల, ప్రవక్త పట్ల, స్వయం తన పట్ల మరియు ముస్లిములందరి పట్ల కొరత చేసినవాడయ్యాడు. అందుకే నమాజు వదలడం మహా ఘోరమైన పాపంగా పరిగణించడం జరిగింది.

ఇమాం సుబ్కీ రహిమహుల్లాహ్ చెప్పారు: నమాజులో అల్లాహ్ హక్కుతో పాటు దాసుల హక్కు కూడా ఉంది. ఎవరు దానిని వదిలారో అతడు గతంలో చనిపోయిన మరియు ప్రళయం వరకు వచ్చే విశ్వాసులందరి హక్కును కాజేసినవాడవుతాడు. ఎందుకనగా తషహ్హుద్ లో అస్సలాము అలైనా వఅలా ఇబాదిల్లాహిస్సాలిహీన్ అనడం విధిగా ఉంది.

3 ] స్వస్థత లభించే ఈ 3 విధానాలలో దైవప్రవక్త (ﷺ) వారు ఇష్టపడని ఆ ఒక్కటి ఏది?

B] కాల్చి వాతలు పెట్టె ప్రక్రియ

“يجوز كي المريض بالنار لعلاجه إذا احتاج إلى ذلك ، ويرجى أن ينفعه الله به ؛ لما ثبت عن جابر بن عبد الله قال : بعث رسول الله صلى الله عليه وسلم إلى أبي بن كعب طبيباً فقطع منه عرقاً ثم كواه عليه ، وما ثبت من أن سعد بن معاذ رضي الله عنه لما رُمي ، كواه النبي صلى الله عليه وسلم . بمشقص (نوع من السهام) في أكحله ، ولما رواه الترمذي عن أنس رضي الله عنه ، أن النبي صلى الله عليه وسلم كوى أسعد بن زرارة من الشوكة ، وقال : حسن غريب ، ولما رواه البخاري ومسلم عن ابن عباس رضي الله عنهما أن النبي صلى الله عليه وسلم قال : (الشفاء في ثلاثة : شربة عسل ، وشرطة محجم ، وكية نار ، وأنهى أمتي عن الكي) وفي لفظ آخر : ( وما أحب أن أكتوي ) فدل فعله وإخباره صلى الله عليه وسلم ، بأنه من أسباب الشفاء على جواز العلاج به عند الحاجة إليه ، وأما نهيه أمته عن الكي فيحمل على ما إذا لم يحتج إليه المريض ؛ لإمكان العلاج بغيره ، أو على أن العلاج به خلاف الأولى والأفضل ؛ لما فيه من زيادة الألم والشبه بتعذيب الله العصاة بالنار ، ولهذا أخبر النبي صلى الله عليه وسلم عن نفسه بأنه لا يحب أن يكتوي ، وأثنى على الذين لا يكتون ؛ لكمال توكلهم على الله ، وينبغي أن يتولى ذلك خبير بشؤون الكي ؛ ليكوي من يحتاج إلى هذا النوع من العلاج في الموضع المناسب من جسده ، ويراعى ظروف المريض وأحواله ” انتهى .
“فتاوى اللجنة الدائمة للبحوث العلمية والإفتاء” ( 25/6(.

وَلِهَذَا كَانَتِ الْعَرَبُ تَقُولُ فِي أَمْثَالِهَا آخِرُ الدَّوَاءِ الْكَيُّ [فتح الباري 10/138]

దీని గురించి సంక్షిప్తం విషయం ఏమిటంటే

కాల్చి వాతలు పెట్టి చికిత్స చేయించడం హరాం (నిషిద్ధం) ఏమీ కాదు. అందుకే ప్రశ్నలో కూడా ఇష్టపడని అని పెట్టడం జరిగింది. సహీ బుఖారీ 5680, మరియు సహీ ముస్లిం 2205లో చికిత్స కొరకు ఈ మూడు పద్ధతులు ఉపయోగించవచ్చు అని చెప్పారు ప్రవక్త: తేనె త్రాగడం, కప్పించడం (Cupping, సూదులు పొడిచి, కప్ పెట్టి చెడు రక్తం తీయడం). వేడి వాతలు పెట్టడం. వెంటనే చెప్పారు. నేను వాతలు పెట్టడాన్ని ఇష్టపడను (బుఖారీ 5683, ముస్లిం 2205), మరో ఉల్లేఖనంలో ఉంది: మిమ్మల్ని కూడా వాతలు పెట్టడడం నుండి ఆపుతున్నాను.

కాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా అస్అద్ బిన్ జురారాకు వాతలు పెట్టారు. (తిర్మిజి 2050, మిష్కాత్ 4534).
«أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ كَوَى أَسْعَدَ بْنَ زُرَارَةَ مِنَ الشَّوْكَةِ»

అలాగే సహీ ముస్లిం 2207లో ఉంది: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉబై బిన్ కఅబ్ వద్దకు ఒక వైద్యుడిని పంపారు, అతను నరాన్ని కోసి అక్కడ వాత పెట్టాడు.

عَنْ جَابِرٍ، قَالَ: «بَعَثَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ إِلَى أُبَيِّ بْنِ كَعْبٍ طَبِيبًا، فَقَطَعَ مِنْهُ عِرْقًا، ثُمَّ كَوَاهُ عَلَيْهِ»

సహీ ముస్లిం 2208లోనే ఉంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా సఅద్ బిన్ ముఆజ్ కు వాత పెట్టారు.

ప్రవక్త స్వయంగా వాత పెట్టినవారు, దీని గురించి వైద్యుణ్ణి పంపినవారు మళ్ళీ దీని నుండి ఆపారు, దీనిని ఇష్టపడలేదంటే: విషయం అర్థం చేసుకోండి!

  • 1- వాత పెట్టడంలో అవస్త, నొప్పి ఉంటుంది గనక ప్రవక్త ఇష్టపడలేదు.
  • 2- దీని తప్ప వేరే ఏ చికిత్స ప్రయోజనకరంగా లేకుంటే దీని ద్వార చికిత్స చేయవచ్చు.
  • 3- దీనికి బదులుగా వేరే దేని ద్వారానైనా (అంటే ధర్మపరమైన) చికిత్స సాధ్యమైతే అదే చేయడం మేలు, ఉత్తమం.
  • 4- ఇందులో అల్లాహ్ పాపాత్ములకు అగ్ని ద్వారా శిక్ష ఇచ్చే అటువంటి పోలిక ఉంది.
  • 5- డెబ్బై వేల మంది లెక్క, శిక్ష లేకుండా స్వర్గంలో వెళ్ళేవారి ఉత్తమ గుణాల్లో ఒకటి వాతలు పెట్టే, పెట్టించే వారు కాకపోవడం. (బుఖారీ 5705, ముస్లిం 218).

ఇతరములు :

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz