యూట్యూబ్ ప్లే లిస్ట్ (తఫ్సీరె సూర అత్ తలాఖ్ ):
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV19HRZXclr7zrnTQ2HYWqfn
ఈ సూరా మదీనా కాలానికి చెందినది. ఇందులో 12 ఆయతులు ఉన్నాయి. ఇది ముఖ్యంగా విడాకుల గురించి ప్రస్తావించిన అధ్యాయం. మొదటి ఆయత్లో వచ్చిన పదాన్నే ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. ఈ సూరా కుటుంబ బంధాల ప్రాముఖ్యాన్ని చాటి చెప్పింది. వివాహ మర్యాదను కాపాడాలని, తొందరపడి విడాకుల నిర్ణయానికి రాకూడదని బోధిస్తూ, ఆ విధంగా హక్కులకు భంగం కలిగే పరిస్థితిని నివారించింది. ఇస్లామ్ అనుమతించిన వాటన్నింటిలోను అల్లాహ్ కు అత్యంత అయిష్టమైన చర్య విడాకులు. కాని అందుకు అనుమతి ఇవ్వబడింది. గృహ సంబంధమైన ఇలాంటి వ్యవహారాల్లో అల్లాహ్ పట్ల భక్తితో, అల్లాహ్ పట్ల భయంతో వ్యవహరించాలని, తమ నిర్ణయాన్ని ఒకటికి రెండుసార్లు పునరాలోచించు కోవాలని విశ్వాసులను ఈ విషయమై హెచ్చరించడం జరిగింది. భార్యకు విడాకులిచ్చే హక్కు భర్తకు ఉంది. కాని విడాకులన్నవి సరియైన పద్ధతిలో, సరియైన సమయంలో ఇస్లామీయ చట్టం ప్రకారం జరగాలి. ఎలా అంటే :
- భార్య రుతుకాలంలో ఉన్నప్పుడు విడాకులు ఇవ్వరాదు.
- నిర్దిష్ట సమయం గడిచేవరకు ఆమెను ఇంటినుంచి బలవంతంగా బయటకు పంపరాదు.
- నిర్ధిష్ట సమయం (ఇద్దత్) మూడువిధాలుగా ఉంటుంది.
- ఈ నిర్దిష్ట కాలంలోనూ, గర్భంతో ఉన్న కాలంలోను భర్త తన భార్యపోషణకు ఖర్చు చేయాలి.
- శిశువు జన్మించిన తర్వాత భర్త తాను విడాకులిచ్చిన భార్య కొరకు వేరుగా నివాస వసతి ఏర్పాటు చేయాలి.
- విడాకులిచ్చిన భార్య శిశువుకు పాలుపట్టడానికి అంగీకరిస్తే, అందుకు భర్త తగిన పారితోషికం చెల్లించాలి.
- పాలుపట్టే విషయంలో వారిద్దరి మధ్య ఎలాంటి అంగీకారం కుదరనట్లయితే, వేరే మహిళతో పాలుపట్టించే ఏర్పాటు చేయాలి.
Read More “65. తఫ్సీర్ సూర అత్ తలాఖ్ (విడాకులు) – Tafsir Surah at-Talaq [వీడియో] “
You must be logged in to post a comment.