ఖుత్బా అంశము: దైవ గ్రంధాల పై విశ్వాసం
إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسۡلِمُونَ١٠٢
يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا١
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَقُولُواْ قَوۡلٗا سَدِيدٗا٧٠ يُصۡلِحۡ لَكُمۡ أَعۡمَٰلَكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ فَازَ فَوۡزًا عَظِيمًا٧١
మొదటి ఖుత్బా :-
స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :
అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.
ఓ ముస్లింలారా! నేను మీకు మరియు స్వయాన నాకు అల్లాహ్ యొక్క దైవభీతి కలిగి ఉండాలని ఉపదేశిస్తున్నాను. అల్లాహ్ తఆలా మన ముందు తరాల వారి కొరకు మరియు మన తర్వాత తరాల వారి కొరకు కూడా ఇదే ఉపదేశం చేయడం జరిగింది. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు.
وَلَقَدۡ وَصَّيۡنَا ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ مِن قَبۡلِكُمۡ وَإِيَّاكُمۡ أَنِ ٱتَّقُواْ ٱللَّهَۚ
వాస్తవానికి మేము అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండమని, పూర్వం గ్రంథం ఇచ్చిన వారికీ మరియు మీకూ ఆజ్ఞాపించాము. (అల్ నిసా :131)
కనుక అల్లాహ్ తో భయపడండి, ఆయనకు విధేయత చూపండి మరియు అవిధేయత నుండి దూరంగా ఉండండి.
తెలుసుకోండి! ఇస్లాం ధర్మంలో దైవ గ్రంథాలపై విశ్వాసం యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. ఇది విశ్వాస మూల స్థంభాలలో మూడవది. అల్లాహ్ తన దాసులపై కనుకరిస్తూ వారి సన్మార్గమునకై ప్రవక్త ద్వారా ఒక గ్రంథాన్ని కూడా పంపించాడు, కారణం ఇహపరాల సాఫల్యం.
అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు:
[لَقَدۡ أَرۡسَلۡنَا رُسُلَنَا بِٱلۡبَيِّنَٰتِ وَأَنزَلۡنَا مَعَهُمُ ٱلۡكِتَٰبَ وَٱلۡمِيزَانَ]
నిశ్చయంగా మేము మా ప్రవక్తలకు స్పష్టమైన నిదర్శనాలను ఇచ్చి పంపాము. వారితో పాటు గ్రంథాన్ని, ధర్మకాటాను కూడా అవతరింపజేశాము. (అల్ హదీద్ 57:25)
నిశ్చయంగా అల్లాహ్ తఆలా ఆయన అవతరింపజేసిన గ్రంథాలన్నిటిపై విశ్వాసం తేవడం విధిగా చేశాడు.
అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు:
[قُولُوٓاْ ءَامَنَّا بِٱللَّهِ وَمَآ أُنزِلَ إِلَيۡنَا وَمَآ أُنزِلَ إِلَىٰٓ إِبۡرَٰهِۧمَ وَإِسۡمَٰعِيلَ وَإِسۡحَٰقَ وَيَعۡقُوبَ وَٱلۡأَسۡبَاطِ وَمَآ أُوتِيَ مُوسَىٰ وَعِيسَىٰ وَمَآ أُوتِيَ ٱلنَّبِيُّونَ مِن رَّبِّهِمۡ لَا نُفَرِّقُ بَيۡنَ أَحَدٖ مِّنۡهُمۡ وَنَحۡنُ لَهُۥ مُسۡلِمُونَ]
(ముస్లిములారా!) మీరు ఇలా ప్రకటించండి: ”మేము అల్లాహ్‌ను విశ్వసించాము. మాపై అవతరింపజేయబడిన దానినీ, ఇబ్రాహీం, ఇస్మాయీల్, ఇస్‌హాఖ్, యాఖూబ్ మరియు వారి సంతతిపై అవతరింపజేయబడిన దానినీ, మూసా, ఈసా ప్రవక్తలకు వారి ప్రభువు తరఫున వొసగబడిన దానిని కూడా మేము విశ్వసించాము. మేము వారిలో ఎవరిమధ్య కూడా ఎలాంటి విచక్షణ (వివక్ష)ను పాటించము. మేము ఆయనకే విధేయులము.” (అల్ బఖర 2:136)
ఓ విశ్వాసులారా! దైవగ్రంథాలపై ఏడు విషయాలలో తప్పక విశ్వాసం ఉంచాలి (షరహ్ సలాసతు ఉసూల్ )
ఒకటి : అల్లాహ్ అవతరింపజేసిన గ్రంథాలు నిజమైనవి అని విశ్వాసం ఉంచాలి. ఉదాహరణకు అల్లాహ్ ఇలా తెలియజేస్తున్నాడు.
[ءَامَنَ ٱلرَّسُولُ بِمَآ أُنزِلَ إِلَيۡهِ مِن رَّبِّهِۦ وَٱلۡمُؤۡمِنُونَۚ كُلٌّ ءَامَنَ بِٱللَّهِ وَمَلَٰٓئِكَتِهِۦ وَكُتُبِهِۦ وَرُسُلِهِۦ]
తన ప్రభువు తరఫున అవతరింపజేయబడిన దానిని ప్రవక్త విశ్వసించాడు. దాన్ని విశ్వాసులు కూడా (సత్యమని నమ్మారు). వారంతా అల్లాహ్‌ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలనూ విశ్వసించారు (అల్ బఖర: 285)
గ్రంథ అవతరణ వహీ ద్వారా జరిగింది. వాస్తవంగా అల్లాహ్ తఆలా ఆకాశం నుండి భూమి పైకి వహీ తీసుకురావడానికి దైవదూతలను నియమించాడు. ఆ దూత పేరు జిబ్రయిల్ (అలైహిస్సలాం). ఈయన ప్రవక్తకు తన ప్రత్యేక గ్రంథాన్ని వెల్లడించాడు.
రెండో విషయం: ఏ గ్రంథాల గురించే అయితే మనకు తెలుసో వాటిని విశ్వసించడం. అవి ఆరు ఉన్నాయి. ఇబ్రహీం మరియు మూసా సహీఫాలు. తౌరాత్ మూసా (అలైహిస్సలాం) వారిపై అవతరింప చేయబడిన గ్రంథం, ఇంజీల్ ఈసా (అలైహిస్సలాం) వారిపై అవతరింప చేయబడిన గ్రంథం. జబూర్ దావూద్ (అలైహిస్సలాం) వారిపై అవతరింప చేయబడిన గ్రంథం మరియు ఖుర్ఆన్ మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిపై అవతరింప చేయడం జరిగింది. కొంతమంది పండితుల అభిప్రాయం ఏమిటంటే మూసా సహీఫాలు మరియు తౌరాత్ ఒక్కటే అయితే ఈ విధంగా ఐదు పేర్లు అవుతాయి. మరియు అదే విధంగా ఏ గ్రంధాల గురించైతే మనకు తెలియదో వాటిపై కూడా మనం పరిపూర్ణంగా విశ్వాసం తీసుకురావాలి.
మూడో విషయం: దైవ ప్రవక్తలపై ఏ గ్రంథాలు అయితే అవతరించాయో వాటిపై మాత్రమే విశ్వాసముంచాలి. ఏ గ్రంధాలలోనైతే మార్పు చేర్పులు జరిగాయో వాటి పై విశ్వాసం ఉంచరాదు. ఉదాహరణకు మూసా ప్రవక్తపై అవతరింప చేయబడిన తౌరాత్ ను విశ్వసించాలి మరియు ఈసా ప్రవక్త పై అవతరించబడిన ఇంజీల్ గ్రంథం పై విశ్వాసం ఉంచాలి. ఇవి అసలు గ్రంథాలు. కానీ ఇప్పుడు ఏ గ్రంధాలైతే యూదులు చేతుల్లో మరియు క్రైస్తవుల చేతుల్లో ఉన్నాయో అవి మార్పులకు లోనయ్యాయి. గ్రంథాలకు అవే పేర్లు పెట్టినప్పటికీ వారు తమ పూర్వీకులు చెప్పినటువంటి విషయాలను అందులో చేర్చారు మరియు ఇవే అసలు గ్రంథాలని ప్రకటించారు. మరియు సంవత్సరాల తరబడి ప్రజలు ఆ కల్పిత కథనాలను పాటించుకుంటూ వారు మార్గభష్టత్వానికి లోనయ్యారు మరియు ప్రజలను కూడా మార్గభష్టత్వానికి లోను చేశారు. కనుక గతించిన ప్రవక్తలపై అవతరింపజేసిన గ్రంథాలు మార్పు చేర్పులకు లోనవడం వలన అల్లాహ్ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరింపచేయబడినటువంటి దివ్య ఖుర్ఆన్ యొక్క రక్షణ బాధ్యతను స్వయంగా అల్లాహ్ నే తీసుకున్నాడు. అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు.
[إِنَّا نَحۡنُ نَزَّلۡنَا ٱلذِّكۡرَ وَإِنَّا لَهُۥ لَحَٰفِظُونَ]
మేమే ఈ ఖుర్‌ఆన్‌ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని రక్షిస్తాము (అల్ హిజ్ర్ :9)
ఈ వాక్యంలో జిక్ర్ అనగా ఖురాన్ అనే భావం
నాల్గొవ విషయం: ఏ విషయాలు అయితే ఆ గ్రంథాల ద్వారా వెల్లడించబడ్డాయో వాటిని సత్యమని నమ్మడం. ఉదాహరణకు ఖుర్ఆన్ మరియు ఖుర్ఆన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాలు, వాటిలో మార్పు చేర్పులకు గురికాకుండా ఉన్నటువంటి సంఘటనలు. అదేవిధంగా ఖుర్ఆన్ తెలియచేయనటువంటి విషయాలను మేము ధ్రువీకరించము మరియు తిరస్కరించం, ఎందుకంటే మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసులో ఇలా వచ్చింది – ఏదైతే గ్రంథ ప్రజలు మీకు తెలియ పరుస్తారో దానిని మీరు సత్యం లేక అసత్యం అని అనకండి, ఈ విధంగా అనండి – “మేము అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పై విశ్వాసం తెచ్చాము“. ఎందుకంటే ఒకవేళ వారి మాట సత్యం అయితే ధ్రువీకరించినట్లు అవుతుంది మరియు అసత్యం అయితే దానిని తిరస్కరించినట్లు అవుతుంది (అబూ దావూద్-3644)
ఐదొవ విషయం: ఆ గ్రంథాలలో ఉన్నటువంటి ఆదేశాలు ఏవైతే రద్దు కాలేదో వాటిపై ఆచరించడం. ఉదాహరణకు: అల్లాహ్ తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు.
[يُرِيدُ ٱللَّهُ لِيُبَيِّنَ لَكُمۡ وَيَهۡدِيَكُمۡ سُنَنَ ٱلَّذِينَ مِن قَبۡلِكُمۡ وَيَتُوبَ عَلَيۡكُمۡۗ]
అల్లాహ్ మీకు (ధర్మాధర్మాలను) విడమరచి చెప్పాలనీ, మీ పూర్వీకుల్లోని (సజ్జనుల) మార్గంపై మిమ్మల్ని నడిపించాలనీ, మీ పశ్చాత్తాపాన్ని ఆమోదించాలని అభిలషిస్తున్నాడు (అల్ నిసా :26)
మరోచోట ఇలా తెలియజేస్తున్నాడు.
[أُوْلَٰٓئِكَ ٱلَّذِينَ هَدَى ٱللَّهُۖ فَبِهُدَىٰهُمُ ٱقۡتَدِهۡۗ]
అల్లాహ్ సన్మార్గం చూపించినటువంటివారు వీరే. కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు కూడా వారి మార్గాన్నే అనుసరించు (అల్ అన్ ఆమ్ :90)
ఆ ఆదేశాలలో ఖిసాస్ (ప్రతీకారం) కు సంబంధించినటువంటి ఆదేశాలు కూడా ఉన్నాయి. అల్లాహ్ తఆలా తౌరాత్ గురించి ప్రస్తావిస్తూ ఇలా తెలియజేశాడు.
وَكَتَبْنَا عَلَيْهِمْ فِيهَا أَنَّ النَّفْسَ بِالنَّفْسِ وَالْعَيْنَ بِالْعَيْنِ وَالْأَنفَ بِالْأَنفِ وَالْأُذُنَ بِالْأُذُنِ وَالسِّنَّ بِالسِّنِّ وَالْجُرُوحَ قِصَاصٌ ۚ فَمَن تَصَدَّقَ بِهِ فَهُوَ كَفَّارَةٌ لَّهُ ۚ وَمَن لَّمْ يَحْكُم بِمَا أَنزَلَ اللَّهُ فَأُولَٰئِكَ هُمُ الظَّالِمُونَ
(మేము తౌరాతు గ్రంథంలో యూదుల కోసం ఒక శాసనాన్ని లిఖించాము: (దీని ప్రకారం) ప్రాణానికి బదులు ప్రాణం, కన్నుకు బదులు కన్ను, ముక్కుకు బదులు ముక్కు, చెవికి బదులు చెవి, పంటికి బదులు పన్ను. అలాగే కొన్ని ప్రత్యేక గాయాల కోసం కూడా (సరిసమానంగా) ప్రతీకారం ఉంది. కాని ఎవరయినా క్షమాభిక్ష పెడితే అది అతని పాలిట పరిహారం (కప్ఫారా) అవుతుంది. అల్లాహ్ అవతరింపజేసిన దానికనుగుణంగా తీర్పు ఇవ్వనివారే దుర్మార్గులు.) (అల్ మాయిదా : 45)
మరియు ఈ ఆజ్ఞ మన షరీఅత్ (చట్టం)లో కూడా భాగమై ఉంది. దీనిపై ఆచరించడం కూడా జరుగుతుంది అని విశ్వసించాలి. మన ధర్మం దీనికి విరుద్ధం కాదు మరియు ఈ ఆజ్ఞ రద్దు చేయబడలేదు.
ఆరవ విషయం: ఈ గ్రంథాలు మానవులందరినీ ఒకే ధర్మం వైపునకు ఆహ్వానిస్తాయి అని విశ్వసించడం. దీనినే తౌహీద్ అంటారు. తౌహీద్ మూడు రకాలు. 1. తౌహీదె ఉలూహియత్ 2. తౌహీదె రుబూబియత్ 3. తౌహీదె అస్మా వసిఫాత్.
ఏడవ విషయం: ఖురాన్ గ్రంథం పూర్వ గ్రంథాలను ధ్రువీకరిస్తుంది. మరియు వాటిపై ఆధిపత్యం కలిగినటువంటిది. మరియు పూర్వ గ్రంథాలను పరిరక్షిస్తుంది. పూర్వ గ్రంథాలన్నీ కూడా ఈ దివ్య ఖురాన్ ద్వారానే రద్దు చేయబడ్డాయి. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు:
[وَأَنزَلۡنَآ إِلَيۡكَ ٱلۡكِتَٰبَ بِٱلۡحَقِّ مُصَدِّقٗا لِّمَا بَيۡنَ يَدَيۡهِ مِنَ ٱلۡكِتَٰبِ وَمُهَيۡمِنًا عَلَيۡهِۖ]
ఇంకా (ఓ ప్రవక్తా!) మేము నీ వైపుకు ఈ గ్రంథాన్ని సత్య సమేతంగా అవతరింపజేశాము. అది తనకన్నా ముందు వచ్చిన గ్రంథాలను సత్యమని ధృవీకరిస్తుంది, వాటిని పరిరక్షిస్తుంది. (అల్ మాయిదా :48)
ఇబ్న్ తైమియా (రహిమహుల్లాహ్) ఇలా తెలియజేస్తున్నారు : “ఖురాన్ లో ఇలానే ఉంది, అల్లాహ్ మరియు అంతిమ దినం గురించి పూర్వ గ్రంథాలలో వచ్చిన వార్తలు ధృవీకరించబడ్డాయి మరియు మరింత వివరంగా పేర్కొనబడ్డాయి. ఈ విషయాలపై. స్పష్టమైన రుజువులు మరియు వాదనలు సమర్పించబడ్డాయి. అదేవిధంగా, ప్రవక్తలందరి ప్రవక్త పదవులు మరియు సందేశహరుల సందేశం అంగీకరించబడింది. మరియు అదే విధంగా ప్రవక్తల ద్వారా పంపబడిన అన్ని చట్టాలను అంగీకరించడం జరిగింది, మరియు వివిధ ఆధారాల ద్వారా మరియు స్పష్టమైన రుజువుల ద్వారా ప్రవక్తలను మరియు గ్రంథాలను తిరస్కరించిన వారితో చర్చలు వాదన చేయటం. అదేవిధంగా అల్లాహ్ వారికి విధించిన శిక్షలను గురించి మరియు గ్రంథాలను అనుసరించే వారికి అల్లాహ్ చేసే సహాయాన్ని గురించి మరియు గ్రంథవహులు మునుపటి గ్రంధాలలో జరిపిన మార్పుల గురించి మరియు వక్రీకరణల గురించి అల్లాహ్ ప్రస్తావించాడు. గ్రంథాలలో వారు చేసిన పనులను, అలాగే వారు దాచిన అల్లాహ్ ఆజ్ఞలను కూడా పేర్కొన్నాడు. మరియు ప్రతి ప్రవక్త తీసుకువచ్చిన షరీఅత్ చట్టం గురించి తెలియజేయడం జరిగింది. మరియు అలానే పవిత్ర ఖుర్ఆన్ గురించి తెలియపరచడం జరిగింది. అందువల్ల, పవిత్ర ఖురాన్ అనేక విధాలుగా మునుపటి గ్రంథాల కంటే ఆధిక్యతను ప్రాధాన్యత పొందింది. ఈ ఖుర్ఆన్ గ్రంథాల ప్రామాణికతకు సాక్షి మరియు ఈ గ్రంథాలలోని వక్రీకరణల అబద్ధానికి సాక్షి.” (మజ్ మూఅల్ ఫతావా17/44)
ఆయన ఇంకా ఇలా తెలియజేశారు “ఖుర్ఆన్ విషయానికొస్తే, ఇది స్వతంత్ర గ్రంథం. దానిని విశ్వసించిన వారికి మరే ఇతర గ్రంథం అవసరం లేదు. ఈ ఖుర్ఆన్ మునుపటి అన్ని గ్రంధాల లక్షణాల కలయిక మరియు ఇతర గ్రంథాలలో ఉన్న అనేక లక్షణాలను కలిగి ఉంది. అందుకే ఈ గ్రంధం మునుపటి గ్రంధాలన్నింటిని ధృవీకరిస్తుంది మరియు అన్నింటికంటే శ్రేష్ఠమైనది. ఇది మునుపటి పుస్తకాలలోని సత్యాన్ని రుజువు చేస్తుంది మరియు వాటిలోని తిరోగమనాలను తిరస్కరిస్తుంది. మరియు అల్లాహ్ ఏ ఆజ్ఞలను రద్దు చేశాడో, ఇది వాటిని రద్దు చేస్తుంది, కాబట్టి ఈ ధర్మం సత్యాన్ని రుజువు చేస్తుంది, ఇది మునుపటి గ్రంథాలలో బలమైన భాగం, మరియు ఈ గ్రంధాలు మారిన మతాన్ని చెల్లుబాటు చేయవు, ఈ గ్రంథాలలో రద్దు చేయబడిన విషయాలు చాలా తక్కువగా ఉన్నాయి“. (మజ్ మూఅల్ ఫతావా 19/184-185)
ఓ ముస్లింలారా! దైవ గ్రంథాలు ఆరు విషయాలను ఏకీభవిస్తాయి
[1] దైవ గ్రంథాలు ఏకీభవించే విషయాలలో మొదటిది:- కేవలం అల్లాహ్ ని మాత్రమే ఆరాధించాలి. ఆయన ఆరాధనలో ఎవరిని సాటి కల్పించకూడదు, వారు ఎవరైనా సరే, విగ్రహం అయినా, మనుషులైనా ప్రవక్తలైనా, రాళ్ళు అయినా, ఇక వేరే ఇతర ఏ వస్తువులైనా సరే సాటి కల్పించరాదు. దీన్నిబట్టి అర్థం అవుతున్నటువంటి విషయం దైవ ప్రవక్తలందరి ధర్మం ఒక్కటే, వాళ్ళు కేవలం అల్లాహ్ ని మాత్రమే ఆరాధించేవారు.
[2] దైవ గ్రంథాలు ఏకీభవించే విషయాలలో రెండవది:- విశ్వాస ప్రాథమిక విషయాలపై విశ్వాసం ఉంచడం. అవేమిటంటే అల్లాహ్ పై, దైవదూతలపై, దైవ గ్రంథాలపై, దైవ ప్రవక్తలపై, ప్రళయ దినంపై, విధిరాత మంచి చెడు అవడంపై విశ్వాసం ఉంచాలి.
[3] దైవ గ్రంథాలు ఏకీభవించే విషయాలలో మూడవది:- ప్రత్యేక ఆరాధనలను కేవలం అల్లాహ్ కొరకు విధిగా చేయడం. ఉదాహరణకు నమాజ్, జకాత్, రోజా మొదలైనవి. కానీ ప్రవక్తల రాకడ ప్రకారంగా ఆరాధనలు నిర్వహించబడే విధానములు విభిన్నంగా ఉన్నాయి. ఉదాహరణకు తౌరాత్ గ్రంథం కూడా నమాజ్ చదవమని ఆజ్ఞాపిస్తుంది మరియు ఇంజీల్ గ్రంథం కూడా నమాజ్ నమాజ్ చదవమని ఆజ్ఞాపిస్తుంది. అదే విధంగా ఖురాన్ గ్రంథం కూడా నమాజ్ గురించి ఆజ్ఞాపిస్తుంది. కానీ నమాజ్ విధానము, నమాజ్ ఆచరించే సమయము ఈ మూడు మతాలలో వేరువేరుగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఉపవాసం యొక్క ఆజ్ఞ కూడా అంతే.
షరియత్ యొక్క వివరణాత్మక తీర్పులకు సంబంధించినంతవరకు, సాధారణ పరంగా అన్ని గ్రంధాలు ఈ విషయాన్ని అంగీకరిస్తాయి, అయితే కొన్నిసార్లు అవి అల్లాహ్ యొక్క జ్ఞానం మరియు అతని ఆధిపత్యానికి అనుగుణంగా ఉంటాయి ఎందుకంటే అల్లాహ్ కు తన దాసులకు ఏది మేలో తెలుసు కాబట్టి ఆయన దానికి తగినటువంటి నిర్ణయాన్ని తీసుకుంటాడు. అల్లాహ్ ఇలా అంటున్నాడు :
[وَرَبُّكَ يَخۡلُقُ مَا يَشَآءُ وَيَخۡتَارُۗ مَا كَانَ لَهُمُ ٱلۡخِيَرَةُۚ]
(నీ ప్రభువు తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు, తాను కోరిన వారిని ఎంపిక చేసుకుంటాడు.)(అల్ ఖసస్ :68)
మరోచోట ఇలా అంటున్నాడు:
[لِكُلّٖ جَعَلۡنَا مِنكُمۡ شِرۡعَةٗ وَمِنۡهَاجٗاۚ]
(మీలో ప్రతి ఒక్కరి కోసం మేము ఒక విధానాన్ని, మార్గాన్నీ నిర్ధారించాము.)(అల్ మాయిదా:48)
ఉదాహరణకు అల్లాహ్ తఆలా వేటినైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మత్ కొరకు హలాల్ అనగా ధర్మ సమ్మతం చేశాడో వాటిలో కొన్నింటిని తన జ్ఞానము మరియు వివేకంతో బనీ ఇస్రాయీల సమాజంపై వాటిని నిషిద్ధం చేశాడు. అవి వారి కంటే ముందు ధర్మసమ్మతం గావించబడినవి.
అల్లాహ్ ఇలా అంటున్నాడు:
[فَبِظُلۡمٖ مِّنَ ٱلَّذِينَ هَادُواْ حَرَّمۡنَا عَلَيۡهِمۡ طَيِّبَٰتٍ أُحِلَّتۡ لَهُمۡ وَبِصَدِّهِمۡ عَن سَبِيلِ ٱللَّهِ كَثِيرٗ]
యూదుల దుర్మార్గం వల్ల వారికి ధర్మసమ్మతంగా ఉన్న అనేక పరిశుద్ధ వస్తువులను మేము వారికోసం నిషేధించాము. వారు ఎంతో మందిని దైవమార్గం నుంచి అడ్డుకోవటం వల్లనూ (అల్ నిసా:160)
[4] దైవ గ్రంథాలు ఏకీభవించే విషయాలలో నాల్గవది:- న్యాయం యొక్క ఆజ్ఞ. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు:
[لَقَدۡ أَرۡسَلۡنَا رُسُلَنَا بِٱلۡبَيِّنَٰتِ وَأَنزَلۡنَا مَعَهُمُ ٱلۡكِتَٰبَ وَٱلۡمِيزَانَ لِيَقُومَ ٱلنَّاسُ بِٱلۡقِسۡطِۖ]
నిశ్చయంగా మేము మా ప్రవక్తలకు స్పష్టమైన నిదర్శనాలను ఇచ్చి పంపాము. వారితో పాటు గ్రంథాన్ని, ధర్మకాటాను కూడా అవతరింపజేశాము ప్రజలు న్యాయంపై నిలిచి ఉండటానికి! (అల్ హదీద్ :25)
[5] దైవ గ్రంథాలు ఏకీభవించే విషయాలలో ఐదొవది:- ఐదు విషయాలను తప్పక కాపాడుకోవాలి అనే ఆజ్ఞాపించబడింది. అవి ఏమిటంటే ధర్మం, విశ్వాసం, ధనము, గౌరవము మరియు ప్రాణం.
[6] దైవ గ్రంథాలు ఏకీభవించే విషయాలలో ఆరవది:- మంచి నైతికత గురించి ఆజ్ఞాపించడం జరిగింది మరియు చెడు నడవడిక నుండి వారించడం జరిగింది. ఉదాహరణకు: గ్రంథాలన్నీటిలో తల్లిదండ్రులకు విధేయత చూపాలని మరియు బంధువులతో బాంధవ్యాలు కలుపుకోవాలని, అతిధులకు గౌరవ మర్యాదలు చేయాలని, నిరుపేదలను ఆదుకోవాలని అనేటువంటి ఆజ్ఞలను జారీ చేయడం జరిగింది. అదే విధంగా చెడును వారించడం ఉదాహరణకు: దౌర్జన్యం, తిరుగుబాటు, తల్లిదండ్రుల అవిధేయత, ఒకరి గౌరవ మర్యాదలతో ఆడుకోవడం, అబద్ధం, దొంగతనం, చాడీలు చెప్పడం, గీబత్ మొదలైనవి.
దైవ గ్రంథాలపై విశ్వాసం గురించి కొన్ని లాభదాయకమైనటువంటి విషయాలు మీ ముందు ఉంచడం జరిగింది. అల్లాహ్ ఖురాన్ యొక్క శుభాలను మనజీవితాలలో వర్షింప చేయుగాక. ఆయన వివేకంతో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరిని క్షమించుగాక. మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి. నిశ్చయంగా ఆయన (తౌబా) పశ్చాతాపం చెందే వారిని తప్పక మన్నిస్తాడు.
రెండవ ఖుత్బా
స్తోత్రం మరియు దరూద్ తరువాత
తెలుసుకోండి! అల్లాహ్ మీపై కరుణించు గాక. అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు – ఆకాశం నుంచి అవతరింప చేయబడిన గ్రంథాలలో గొప్ప గ్రంధాలు రెండు ఉన్నాయి. అవి తౌరాత్ మరియు ఖుర్ఆన్. దివ్య ఖురాన్ లో అనేకచోట్ల ఈ రెండు గ్రంథాల ప్రస్తావన ఒకేసారి వచ్చింది. ఎందుకంటే ఈ రెండు గ్రంథాలు ఉన్నతమైనవి మరియు ఈ రెండు గ్రంథాల లో ఉన్నటువంటి చట్టము పరిపూర్ణం గావించబడినది.
ఓ అల్లాహ్ దాసులారా! నిశ్చయంగా ఖుర్ఆన్ అన్ని గ్రంథాల కంటే ఎంతో ఉన్నతమైనది. అందుకే అల్లాహ్ ఈ ఖురాన్ కు పూర్వ గ్రంథాలన్నీటిపై ఆధిక్యతను ప్రసాదించాడు. ఈ గ్రంథంలో ఇతర గ్రంథాలలో లేని అద్భుతాలు మరియు జ్ఞానానికి సంబంధించినటువంటి ఎన్నో మేలైన విషయాలు ఉన్నాయి.
ఖురాన్ అనగా ఇది అల్లాహ్ యొక్క వాక్యము. దీని ద్వారా అల్లాహ్ మాట్లాడాడు. అల్లాహ్ మాట్లాడినటువంటి వాక్యాలను జిబ్రాయిల్ దూత ద్వారా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి వరకు చేరవేయబడ్డాయి తర్వాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారు ఆ వాక్యాలను తన అనుచరులు వరకు చేర్చారు. వారు ఖుర్ఆన్ ను తమ హృదయాలలో భద్రపరుచుకున్నారు. వాటిని ఆకులపై లేక కాగితాలపై లిఖించి భద్రపరిచారు. ఆ తర్వాత మూడవ ఖలీఫా ఉస్మాన్ (రదియల్లాహు అన్హు ) గారి పరిపాలనలో ఒక పుస్తక రూపంలో సంకలనం చేశారు. ఆ తర్వాత దాని నుంచి అనేక కాపీలను చేసి ప్రచురించడం జరిగింది. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు:
[إِنَّا نَحۡنُ نَزَّلۡنَا ٱلذِّكۡرَ وَإِنَّا لَهُۥ لَحَٰفِظُونَ]
మేమే ఈ ఖుర్‌ఆన్‌ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని రక్షిస్తాము (అల్ హిజ్ర్ :9)
ఓ ముస్లింలారా గ్రంథాలలోకెల్లా చిట్టచివరి గ్రంథము దివ్య ఖురాన్. అల్లాహ్ తఆలా ఈ గ్రంథాన్ని తన జ్ఞానంతో మరియు వివేకంతో అవతరింపజేశాడు.
[1] ఈ ఖుర్ఆన్ అవతరణకు గల ఒక వివేకం ఏమిటంటే: ఆ ఖుర్ఆన్ యొక్క వాక్యాల పై యోచన చేసి బుద్ధిమంతులు ఉపదేశం పొందాలి అని మరియు వారిలో దైవభీతి జనించాలని. అల్లాహ్ ఇలా అంటున్నాడు :
[كِتَٰبٌ أَنزَلۡنَٰهُ إِلَيۡكَ مُبَٰرَكٞ لِّيَدَّبَّرُوٓاْ ءَايَٰتِهِۦ وَلِيَتَذَكَّرَ أُوْلُواْ ٱلۡأَلۡبَٰبِ]
ఇదొక శుభప్రదమైన గ్రంథం. ప్రజలు దీని వాక్యాలపై చింతన చేసేటందుకు, బుద్ధిజీవులు దీని ద్వారా గుణపాఠం నేర్చుకునేందుకు మేము దీనిని నీ వైపుకు పంపాము. (సాద్ : 29)
ఒకచోట ఇలా సెలవిస్తున్నాడు:
[وَكَذَٰلِكَ أَنزَلۡنَٰهُ قُرۡءَانًا عَرَبِيّٗا وَصَرَّفۡنَا فِيهِ مِنَ ٱلۡوَعِيدِ لَعَلَّهُمۡ يَتَّقُونَ أَوۡ يُحۡدِثُ لَهُمۡ ذِكۡرٗا]
ఇదే విధంగా (ఓ ప్రవక్తా!) మేము దీనిని నీపై అరబ్బీ ఖుర్‌ఆన్‌గా అవతరింపజేశాము. ప్రజలు భయభక్తులు కలిగి ఉండగలందులకు, లేదా వారిలో ధర్మచింతన రేకెత్తేందుకు పలు విధాలుగా ఇందులో భయబోధ చేశాము. (తహా :113)
[2] మరొక వివేకవంతమైన విషయం ఏమిటంటే: దైవభీతిపరులకు ప్రతిఫలం ప్రసాదించుటకు మరియు తిరస్కారుల కొరకు శిక్ష ఉందని హెచ్చరించుటకు.
ఇలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు:
[ فَإِنَّمَا يَسَّرۡنَٰهُ بِلِسَانِكَ لِتُبَشِّرَ بِهِ ٱلۡمُتَّقِينَ وَتُنذِرَ بِهِۦ قَوۡمٗا لُّدّٗا]
నువ్వు ఈ గ్రంథం ఆధారంగా భయభక్తులు గలవారికి శుభవార్తను వినిపించటానికీ, తగవులమారులను హెచ్చరించ టానికీ దీనిని నీ భాషలో చాలా సులభతరం చేశాము. (మర్యమ్ :97)
[3] మరొక వివేకవంతమైన విషయం ఏమిటంటే: ధర్మ ఆదేశాలను ప్రజలకు తెలియజేయడానికి అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు.
[وَأَنزَلۡنَآ إِلَيۡكَ ٱلذِّكۡرَ لِتُبَيِّنَ لِلنَّاسِ مَا نُزِّلَ إِلَيۡهِمۡ وَلَعَلَّهُمۡ يَتَفَكَّرُونَ]
(అలాగే) ప్రజల వద్దకు పంపబడిన దానిని నువ్వు వారికి స్పష్టంగా విడమరచి చెప్పేందుకు, తద్వారా వారు యోచన చేసేందుకుగాను మేము నీపై ఈ జ్ఞాపిక (గ్రంథము)ను అవతరింపజేశాము (అల్ నహ్ల్ :44)
మరొకచోట ఇలా అంటున్నాడు.
[وَمَآ أَنزَلۡنَا عَلَيۡكَ ٱلۡكِتَٰبَ إِلَّا لِتُبَيِّنَ لَهُمُ ٱلَّذِي ٱخۡتَلَفُواْ فِيهِ]
వారు విభేదించుకునే ప్రతి విషయాన్నీ నువ్వు వారికి స్పష్టంగా విడమరచి చెప్పాలని మేము ఈ గ్రంథాన్ని నీపై అవతరింపజేశాము. (అల్ నహ్ల్ :64)
[4] మరోక వివేకవంతమైన విషయమేమిటంటే: విశ్వాసులు తమ విశ్వాసంపై స్థిరంగా ఉండాలని.
అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు
[قُلۡ نَزَّلَهُۥ رُوحُ ٱلۡقُدُسِ مِن رَّبِّكَ بِٱلۡحَقِّ لِيُثَبِّتَ ٱلَّذِينَ ءَامَنُواْ وَهُدٗى وَبُشۡرَىٰ لِلۡمُسۡلِمِينَ]
ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “విశ్వసించిన వారికి నిలకడను వొసగటానికి, ముస్లింలకు సన్మార్గం చూపటానికీ, వారికి శుభవార్తను వినిపించటానికీ నీ ప్రభువు వద్ద నుంచి పరిశుద్ధాత్మ (జిబ్రయీల్) దీన్ని సత్యసమేతంగా అవతరింపజేశాడు.” (అల్ నహ్ల్ :64)
[5] మరొక వివేకవంతమైన విషయం ఏమిటంటే : ప్రజల మధ్య ఖుర్ఆన్ ద్వారా తీర్పు జరగాలని.
అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు.
[إِنَّآ أَنزَلۡنَآ إِلَيۡكَ ٱلۡكِتَٰبَ بِٱلۡحَقِّ لِتَحۡكُمَ بَيۡنَ ٱلنَّاسِ بِمَآ أَرَىٰكَ ٱللَّهُۚ]
(ఓ ప్రవక్తా!) అల్లాహ్ నీకు చూపిన విధంగా నీవు ప్రజల మధ్య తీర్పు చెయ్యటానికిగాను మేము నీ వైపుకు ఈ గ్రంథాన్ని సత్యంతోపాటు పంపాము.) (అల్ నిసా : 105)
ఈ విషయాన్ని కూడా తెలుసుకోండి. అల్లాహ్ మీపై కరుణించుగాక . అల్లాహ్ మీకు ఒక గొప్ప సత్కార్యానికై అజ్ఞాపించి ఉన్నాడాని మీరు గుర్తుపెట్టుకోండి. అల్లాహ్ ఇలా అన్నాడు.
[إِنَّ ٱللَّهَ وَمَلَٰٓئِكَتَهُۥ يُصَلُّونَ عَلَى ٱلنَّبِىِّۚ يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ صَلُّوا۟ عَلَيْهِ وَسَلِّمُوا۟ تَسْلِيمًا]
నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి.
ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీ ప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై నీ కారుణ్యాన్ని అవతరింప చేయి. ఆయన ఖలీఫాలు, తాబయీనులను పూర్తి చిత్తశుద్ది తో అనుసరించే వారిని ఇష్టపడు, ప్రేమించు.
ఓ అల్లాహ్! ఇస్లాం, ముస్లింలకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్క్, ముష్రిక్ లను అవమాన బరుచు. నీవు నీ ధర్మం అయిన ఇస్లాం కు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయి మరియు ఏకేశ్వరోపశకులకు నీ సహాయాన్ని అందించు. ఓ అల్లాహ్! మా దేశాలలో భద్రత ను ప్రసాదించు, మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు, సన్మార్గం చూపే మరియు సన్మార్గము పై నడిచే వారిగా చేయి. ఓ అల్లాహ్ మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని, పరలోకం లో సాఫల్యాన్ని ప్రసాదించు, నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు. ఆమీన్
سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِينَ
—
ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
‘ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ
—
దైవ గ్రంధాలపై విశ్వాసం (మెయిన్ పేజీ ):
https://teluguislam.net/belief-in-books/

You must be logged in to post a comment.