సహాబాల విధానం & దాని అవసరం
https://youtu.be/nsxJhTZ1QP8 [45 నిముషాలు]
షేఖ్ హబీబుర్రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, వక్త సహాబాల విధానం (మన్హజ్) మరియు దాని ఆవశ్యకత గురించి వివరిస్తారు. సహాబీ అనే పదానికి అర్థం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఈమాన్ స్థితిలో కలుసుకుని, అదే స్థితిలో మరణించిన వారని నిర్వచించారు. సహాబాలు ముస్లిం సమాజంలో అత్యంత శ్రేష్ఠులని, వారి విశ్వాసం (ఈమాన్) మరియు అఖీదా ఖురాన్ ద్వారా ధృవీకరించబడిందని నొక్కి చెప్పారు. మన విశ్వాసం మరియు ఆచరణా విధానం సహాబాల వలె ఉండాలని, ఖురాన్ మరియు హదీసులను వారు అర్థం చేసుకున్న విధంగానే మనం అర్థం చేసుకోవాలని ఖురాన్ ఆయతుల ద్వారా స్పష్టం చేశారు. సహాబాల మార్గాన్ని విడిచిపెట్టడం నరకానికి దారితీస్తుందని హెచ్చరించారు. సహాబాల విధానాన్ని అనుసరించడమే నిజమైన సన్మార్గమని, వారి ఇత్తిబా (అనుసరణ) యొక్క ప్రాముఖ్యతను ఉదాహరణలతో వివరించారు.
اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِيْنَ
(అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు.
وَالْعَاقِبَةُ لِلْمُتَّقِيْنَ
(వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్)
శుభపరిణామం దైవభీతిపరులకే ప్రాప్తిస్తుంది.
وَلَا عُدْوَانَ اِلَّا عَلَى الظّٰلِمِيْنَ
(వలా ఉద్వాన ఇల్లా అలజ్జాలిమీన్)
అన్యాయం చేస్తోన్నవారిపైన మాత్రమే ప్రతిఘటన/పోరాటం అనుమతించబడింది
وَالصَّلٰوةُ وَالسَّلَامُ عَلٰى سَيِّدِ الْاَنْۢبِيَآءِ وَالْمُرْسَلِيْنَ
(వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్)
ప్రవక్తల నాయకునిపై మరియు దైవప్రవక్తలపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక.
وَمَنْ تَبِعَهُمْ بِاِحْسَانٍ اِلٰى يَوْمِ الدِّيْنِ اَمَّا بَعْدُ
(వమన్ తబిఅహుమ్ బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్ అమ్మా బఅద్)
మరియు ప్రళయదినం వరకు వారిని ఉత్తమ రీతిలో అనుసరించేవారిపై కూడా (శాంతి మరియు శుభాలు వర్షించుగాక). ఆ తర్వాత…
رَبِّ اشْرَحْ لِيْ صَدْرِيْ وَيَسِّرْ لِيْٓ اَمْرِيْ وَاحْلُلْ عُقْدَةً مِّنْ لِّسَانِيْ يَفْقَهُوْا قَوْلِيْ
(రబ్బిష్రహ్ లీ సద్రీ వ యస్సిర్ లీ అమ్ రీ వహ్ లుల్ ఉఖ్దతమ్ మిల్ లిసానీ యఫ్ఖహూ ఖవ్ లీ)
“ఓ నా ప్రభూ! నా హృదయాన్ని విశాలపరచు. నా కార్యాన్ని నాకు సులభతరం చెయ్యి. నా నాలుకలోని ముడిని విప్పు. ప్రజలు నా మాటను అర్థం చేసుకోగలగాలి.” (20:25-28)
సహాబాల విధానం, దాని అవసరం
మన్హజుస్ సహాబా. సహాబా ఈ పదం సహాబీ పదానికి బహువచనం. ఉర్దూలో సహాబీ ఏకవచనం, సహాబా అనేది బహువచనం. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహచరులు. ఈమాన్ స్థితిలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను కలుసుకొని, ఈమాన్ స్థితిలోనే మరణించిన వారంతా సహాబా, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు అనబడతారు. ఇది సహాబా లేదా సహాబీ అనే పదానికి అర్థం.
వారు ముస్లిం సమాజంలో అందరికన్నా శ్రేష్ఠులు. ఇస్లాం వైపు ముందంజ వేసినవారు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచర్య భాగ్యం పొందినవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి జిహాద్ చేసినవారు. షరీఅత్ బాధ్యతలను మోయటమే గాక దానిని తమ తరువాతి తరాల వారికి అందించిన ధన్యజీవులు. ఈ కారణంగా వారు ప్రపంచంలోనే అత్యుత్తమ సమూహం అని మనం విశ్వసించటం వాజిబ్. తప్పనిసరి. అంటే సహాబాల గురించి ఇలా అఖీదా, విశ్వాసం మనం కలిగి ఉండాలి.
సహాబాల విధానం కంటే ముందు, ముందుమాటగా నేను రెండు మూడు విషయాలు, ఈ సహాబాల యొక్క ఔన్నత్యం గురించి చెప్పదలిచాను. సహాబాల గురించి ఖురాన్‌లో అలాగే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలలో చాలా నొక్కి చెప్పడం జరిగింది. వారు ఎవరు, వారి విశ్వాసం ఏమిటి, వారి గొప్పతనం ఏమిటి అనేది. ఉదాహరణకు సూరా తౌబాలో ఆయత్ నెంబర్ 100.
وَالسّٰبِقُوْنَ الْاَوَّلُوْنَ مِنَ الْمُهٰجِرِيْنَ وَالْاَنْصَارِ وَالَّذِيْنَ اتَّبَعُوْهُمْ بِاِحْسَانٍ ۙ رَّضِيَ اللّٰهُ عَنْهُمْ وَرَضُوْا عَنْهُ وَاَعَدَّ لَهُمْ جَنّٰتٍ تَجْرِيْ تَحْتَهَا الْاَنْهٰرُ خٰلِدِيْنَ فِيْهَآ اَبَدًا ۭذٰلِكَ الْفَوْزُ الْعَظِيْمُ
“ముహాజిర్లలో, అన్సార్లలో ప్రప్రథమంగా ముందంజ వేసిన వారితోనూ, తర్వాత చిత్తశుద్ధితో వారిని అనుసరించిన వారితోనూ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల ప్రసన్నులయ్యారు. క్రింద కాలువలు ప్రవహించే స్వర్గ వనాలను అల్లాహ్ వారి కోసం సిద్ధం చేసి ఉంచాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు. గొప్ప సాఫల్యం అంటే ఇదే.” (9:100)
ఈ ఆయతులో మూడు వర్గాల గురించి చెప్పడం జరిగింది. ముహాజిర్లు ఒక వర్గం, అన్సార్లు ఒక వర్గం. అంటే సహాబాలలో ఇది రెండు వర్గాలు. ముహాజిర్లు, అన్సార్లు. మూడవది, వారి తర్వాత వారిని చిత్తశుద్ధితో అనుసరించేవారు. వారెవరు? కొంతమంది పండితులు తాబయీన్లు అయి ఉండవచ్చు అని చెప్పారు. కాకపోతే ప్రళయం వరకు వచ్చే విశ్వాసులందరూ దీనిలో వస్తారు. చిత్తశుద్ధితో వారిని అనుసరించేవారు. ఎవరిని? సహాబాలను. ముహాజిర్లను, సహాబాలను చిత్తశుద్ధితో అనుసరించేవారు కూడా ఈ కోవకి వస్తారు. ఇది సహాబాల యొక్క గొప్పతనం.
సహాబాల స్థానం మరియు విశ్వసనీయత
ఇంకో విషయం చెప్పాలంటే
اَلصَّحَابَةُ كُلُّهُمْ عُدُولٌ
(అస్సహాబా కుల్లుహుమ్ ఉదూల్)
న్యాయం విషయంలో సహాబాలందరూ ఒకే స్థాయికి చెందినవారు.
దీనికి మనం అర్థం చేసుకోవాలంటే, హదీసులో సనద్ ఉంటుంది కదా. ఆ సనద్‌లో ఆ హదీస్ సహీ హదీసా? జయీఫ్ హదీసా? మున్కర్ హదీసా? మౌజూ హదీసా? హసనా? హసన్ లిగైరిహీ, హసన్ లిజాతిహీ ఈ విధంగా చాలా హదీసుకి రకాలు ఉన్నాయి కదా. అవి హదీస్ యొక్క రావిని బట్టి ఉంటుంది. ఆ రావి గురించి చర్చ జరుగుతుంది. ఆ రావి ఎటువంటి వాడు? అతని విశ్వాసం ఎటువంటిది? అతని నడవడిక ఎటువంటిది? అతని హిప్జ్ కంఠస్థాయి ఎటువంటిది? ఈ విధంగా పలు రకాలుగా చర్చ జరుగుతుంది ఆ రావి గురించి. దాన్ని బట్టి ధర్మ పండితులు తీర్మానిస్తారు, హదీస్ జయీఫా, సహియా, మున్కరా, మౌజూఆ అని. కానీ సనద్‌లో రువాత్‌ల గురించి ఈ చర్చ కేవలం తాబయీ వరకే. సహాబీకి చర్చ ఉండదు. ఇది సహాబాల స్థాయి.
ఉదాహరణకు ఒక మష్హూర్ హదీస్ ఉంది, బుఖారీ గ్రంథంలో మొదటి హదీస్. ఇన్నమల్ ఆమాలు బిన్నియ్యాత్. ఈ హదీస్ ఇమామ్ బుఖారీ రహమతుల్లాహ్ అలైహి ఇలా తీసుకుని వస్తారు: హద్దసనా అల్ హుమైదీ అబ్దుల్లాహిబ్ను జుబైర్. ఖాల హద్దసనా సుఫియాన్. ఖాల హద్దసనా యహ్యా బిన్ సయీద్ అల్ అన్సారీ. ఖాల అఖ్బరనీ ముహమ్మద్ ఇబ్ను ఇబ్రాహీం అత్ తైమీ. అన్నహు సమిఅ అల్ఖమతబ్న వఖ్ఖాసిన్ అల్లైసీ. యఖూలు సమితు ఉమరబ్నల్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు అలల్ మింబర్ ఖాల, సమితు రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ యఖూలు, ఇన్నమల్ ఆమాలు బిన్నియ్యాత్ వ ఇన్నమా లికుల్లిమ్రిఇమ్ మానవా. ఫమన్ కానత్ హిజ్రతుహూ ఇలా దున్యా యుసీబుహా అవ్ ఇలా ఇమ్రఅతిన్ యన్కిహుహా ఫహిజ్రతుహూ ఇలా మా హజర ఇలైహి. ఇది పూర్తి హదీస్.
ఈ హదీస్ వివరణ నా ఉద్దేశ్యం కాదు. ఈ హదీస్ యొక్క అర్థం వివరణ ఈ సబ్జెక్టుకి సంబంధం కాదు. నేను ఉదాహరణగా ఈ హదీస్ చెప్పాను ఎందుకంటే, ఇమామ్ బుఖారీ రహమతుల్లాహ్ అలైహి ఈ హదీస్, సుబ్ హా నల్లాహ్ ఈ హదీస్ రువాత్‌ల సంఖ్యను బట్టి ఎటువంటి రువాత్‌లు ఎన్నుకున్నారు ఈ హదీస్ కోసము, మొదటగా హుమైదీని ఎందుకు ఎన్నుకున్నారు, ఈ సనద్ యొక్క అందము, బలము, దాని విశిష్టత, ఔన్నత్యము, ఇది సెపరేట్ సబ్జెక్టు అది. సుబ్ హా నల్లాహ్. కాకపోతే ఈ హదీసులో ఆరు మంది రువాత్‌లు (ఉల్లేఖకులు) ఉన్నారు, ఫస్ట్ హుమైదీ. ఈయన గురించి చర్చ జరుగుతుంది. ఈ హుమైదీ ఎవరు? నడవడిక ఏమిటి? విశ్వాస స్థితి ఏమిటి? అతని హిబ్జ్ స్థితి ఏమిటి? అతని గురువులు ఎవరు? ఆయన పూర్తి బయోడేటా ఆయన గురించి చర్చిస్తారు. ఆ తర్వాత నిర్ధారిస్తారు. అల్ జర్హ్ వత్ తాదీల్ అనే త్రాసులో, ఒక త్రాసు ఉంది. ఇప్పుడు మనము పాలలో ఎంత శాతం నీళ్లు ఉన్నాయి అనేది ఒక కొలత ఉంది, ఒక మీటర్ ఉంది. అలాగే కరెంట్‌లో ఎంత పవర్ ఉంది ఒక కొలత ఉంది, ఒక మీటర్ ఉంది. గాలి ఎంత ఫాస్ట్‌గా పోతా ఉంది దానికి ఒక మీటర్ ఉంది. ఆ విధంగా ఈ సనద్‌నుకి కూడా ఒక మీటర్ ఉంటుంది. ఆ మీటర్ పేరే అల్ జర్హ్ వత్ తాదీల్. ఆ త్రాసులో వారికి చూస్తారు. ఆ విధంగా ఈ హుమైదీ ఎవరు, చర్చ జరుగుతుంది.
ఆ తర్వాత ఈ హదీస్ హుమైదీకి ఎవరు చెప్పారు? సుఫియాన్ చెప్పారు. ఆ సుఫియాన్ ఎవరు? ఎంతమంది సుఫియాన్లు ఉన్నారు? సుఫియాన్ కి నాన్న ఎవరు? ఆ సుఫియాన్ చరిత్ర ఏమిటి? ఆయన విశ్వాసం ఏమిటి? ఆయన జ్ఞానం ఏమిటి? నడవడిక ఏమిటి? ఇదంతా చర్చ జరుగుతుంది. సుఫియాన్‌కి ఇది ఎవరు చెప్పారు? అల్ఖమా చెప్పారు. ఆ అల్ఖమా ఎవరు? చర్చ జరుగుతుంది. అల్ఖమాకి ఎవరు చెప్పారు? ఉమర్ బిన్ ఖత్తాబ్ చెప్పారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ గురించి చర్చ జరగదు. ఇది సహాబా అంటే. ఉమర్ బిన్ ఖత్తాబ్ గురించి చర్చ జరగదు. ఎందుకు? ఈయన సహాబీ. ఆయన ఎవరు అని చర్చ లేదు. సహాబీ అంటే సరిపోతుంది. ఆ విధంగా ప్రతి హదీస్, అన్ అబీ హురైరతా, అన్ అబీ సయీద్ ఖుద్రీ, అన్ అబ్దుల్లాహ్ ఇబ్ను మస్ఊద్, అన్ అబ్దుల్లాహ్ ఇబ్ను ఉమర్, అన్ ఉమర్ బిన్ ఖత్తాబ్, ఏ అన్ ఆయిషా, అన్ ఉమ్మె సలమా, అన్ మైమూనా, ఏ హదీస్ అయినా సరే, ఈ చర్చ అనేది అల్ జర్హు వత్ తాదీల్ అనే మీటర్‌లో, కొలత చేసేది కేవలం తాబయీ వరకే. సహాబాకి చెయ్యరు. ఎందుకు? సహాబా ఈమాన్ అటువంటిది. వారి స్థానం అటువంటిది. వారు ఎన్నుకున్న మార్గం, విధానం అటువంటిది. వారి గురించి అల్లాహ్ సాక్ష్యం ఇచ్చేశాడు. ప్రవక్త సాక్ష్యం ఇచ్చేశారు. ఇక సహాబాల గురించి చర్చ జరగదు. ఇది నా ఉద్దేశ్యం. సహాబా స్థానం ఏమిటి, సహాబా అంటే ఎవరు అనేది.
సహాబాల ఈమాన్ (విశ్వాసం)
ఇక సహాబాల ఈమాన్ గురించి వస్తే, ఒక రెండు ఉదాహరణ. సూరా ముజాదలా ఆయత్ 22.
اُولٰۤىِٕكَ كَتَبَ فِيْ قُلُوْبِهِمُ الْاِيْمَانَ وَاَيَّدَهُمْ بِرُوْحٍ مِّنْهُ
(ఉలాయిక కతబ ఫీ ఖులూబిహిముల్ ఈమాన వఅయ్యదహుమ్ బి రూహిమ్ మిన్హ్)
“అల్లాహ్ విశ్వాసాన్ని రాసి పెట్టినది ఇలాంటి వారి హృదయాలలోనే! ఆయన తన ఆత్మ ద్వారా వీరిని ప్రత్యేకంగా బలపరిచాడు.” (58:22)
వీరి హృదయాలలోనే అల్లాహ్ తన రూహ్ ద్వారా వీరిని ప్రత్యేకంగా బలపరిచాడు. అంటే వారి సహాబాల ఈమాన్‌ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన ఆత్మ ద్వారా, రూహ్ ద్వారా ప్రత్యేకంగా బలపరిచాడు అని అల్లాహ్ సాక్ష్యం ఇస్తున్నాడు. ఇది సహాబాల ఈమాన్ అంటే.
అలాగే సూరా అల్ ఫతహాలో అల్లాహ్ ఇలా తెలియజేశాడు. సూరా ఫతహా ఆయత్ నెంబర్ 26లో.
وَاَلْزَمَهُمْ كَلِمَةَ التَّقْوٰى وَكَانُوْٓا اَحَقَّ بِهَا وَاَهْلَهَا
(వ అల్జమహుమ్ కలిమతత్తఖ్వా వ కానూ అహఖ్ఖ బిహా వ అహలహా)
ఇంకా అల్లాహ్ ముస్లింలను భక్తి (తఖ్వా) వాక్కుకు కట్టుబడి ఉండేలా చేశాడు. వారు దానికి తగినవారు, హక్కుదారులు కూడా. (48:26)
ఇంకా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ముస్లింలను తఖ్వా వాక్కుకు, కలిమతుత్ తఖ్వా. కలిమా అంటే కలిమా, వాక్కు. తఖ్వా, దైవభీతి. కలిమతుత్ తఖ్వా, తఖ్వా వాక్కుకు కట్టుబడి ఉండేలా చేశాడు. వారు దానికి తగినవారు, హక్కుదారులు కూడా. అంటే కలిమతుత్ తఖ్వా అంటే ఇమామ్ ఇబ్నె కసీర్ రహమతుల్లాహ్ అలైహి తెలియజేశారు, కలిమతుత్ తఖ్వా అంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. అంటే కలిమతుత్ తఖ్వా, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ కి కట్టుబడి ఉండేలా అల్లాహ్ చేశాడు సహాబాలను. ఇది ఒక అర్థం.
రెండో అర్థం, కలిమతుత్ తఖ్వా అంటే, ముస్లిములు హుదైబియాలో ప్రదర్శించిన సహనం, హుందాతనం కావచ్చు. అంటే ఇది కూడా సహాబాలకే వర్తిస్తుంది. మూడవది, దైవభక్తి మూలంగా చేసిన ప్రమాణాన్ని నెరవేర్చటం, దాని మీద స్థిరంగా నిలబడటం కూడా కావచ్చు అని ఇమామ్ షౌకానీ రహమతుల్లాహ్ అలైహి తన తఫ్సీర్ ఫతుహుల్ ఖదీర్‌లో తెలియజేశారు. అంటే ఏ అర్థం అయినా సరే, దానికి మొదటిగా ఉండే వారు సహాబాలే. ఇది సహాబాల విశ్వాసం గురించి అల్లాహ్ ఇచ్చిన సాక్ష్యం.
మన విశ్వాసం ఎలా ఉండాలి?
మన విశ్వాసం ఎలా ఉండాలి? ఇది మన అసలు సబ్జెక్టు. సహాబాల విధానం సబ్జెక్టు కదా. మన విశ్వాసం సహాబాల విశ్వాసం మాదిరిగానే ఉండాలి. ఇది కూడా అల్లాహ్ చెప్పాడు, అల్లాహ్ ప్రవక్త చెప్పారు. మన విధానం ఎలా ఉండాలి? సహాబాల విధానం లాగా ఉండాలి. మన విశ్వాసం ఎలా ఉండాలి? సహాబాల విశ్వాసం లాగా ఉండాలి. సూర బఖరా, ఆయత్ 137.
فَاِنْ اٰمَنُوْا بِمِثْلِ مَآ اٰمَنْتُمْ بِهٖ فَقَدِ اهْتَدَوْا
(ఫ ఇన్ ఆమనూ బి మిస్లి మా ఆమన్ తుమ్ బిహీ ఫఖదిహ్ తదవ్)
ఒకవేళ వారు మీరు విశ్వసించినట్లే విశ్వసిస్తే, సన్మార్గం పొందగలరు.(2:137)
ఒకవేళ వారు మీరు విశ్వసించినట్లే విశ్వసిస్తే, వారు సన్మార్గం పొందుతారు. మీరు అంటే సహాబాలు ఇక్కడ ఉద్దేశ్యం. సహాబాల లాగా, మీలాగా అంటే సహాబాలు. మీలాగా విశ్వసిస్తే, సన్మార్గం పొందుతారు. అంటే సన్మార్గం పొందటానికి, హిదాయత్ భాగ్యం పొందటానికి నా ఇష్టపరంగా నేను విశ్వసించలేను. నా విశ్వాసాలు నా ఇష్టపరంగా ఉండకూడదు. సహాబాల లాగా ఉండాలి. ఫఇన్ ఆమనూ బిమిస్లి మా ఆమన్తుమ్. మీలాగా వారు విశ్వసిస్తే ఫఖదిహ్తదవ్, వారు సన్మార్గం పొందుతారు. అంటే హిదాయత్ కోసం విశ్వాసం సహాబాల లాగా ఉండాలి అని ఈ కొలమానం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు.
అలాగే సూర బఖరాలోనే ఆయత్ 13.
وَاِذَا قِيْلَ لَهُمْ اٰمِنُوْا كَمَآ اٰمَنَ النَّاسُ قَالُوْٓا اَنُؤْمِنُ كَمَآ اٰمَنَ السُّفَهَاۤءُ ۭ اَلَآ اِنَّهُمْ هُمُ السُّفَهَاۤءُ وَلٰكِنْ لَّا يَعْلَمُوْنَ
“ఇతరులు (అంటే ప్రవక్త ప్రియ సహచరులు) విశ్వసించినట్లే మీరూ విశ్వసించండి” అని వారితో చెప్పినప్పుడు, “మూర్ఖ జనులు విశ్వసించినట్లుగా మేము విశ్వసించాలా?” అని వారు (ఎదురు) ప్రశ్న వేస్తారు. తస్మాత్! ముమ్మాటికీ వీరే మూర్ఖులు. కాని ఆ సంగతి వీరికి తెలియటం లేదు.(2:13)
ఆ కపట విశ్వాసులకు ఇలా చెప్పినప్పుడు, ప్రజలు విశ్వసించినట్లే మీరు విశ్వసించండి. ఇక్కడ ఆమనన్నాసు, ఇతర జనులు, ఇతర ప్రజలు విశ్వసించినట్లే అంటే ఇక్కడ సహాబాలు. సహాబాలు విశ్వసించినట్లే, కండిషన్. సహాబాలు విశ్వసించినట్లే మీరు విశ్వసించండి అని అల్లాహ్ ఆజ్ఞ ఇస్తే, ఆ కపటులు మూర్ఖత్వంతో ఏమన్నారు? ఖాలూ అను’మిను కమా ఆమనస్సుఫహాఉ, మూర్ఖజనులు విశ్వసించినట్లుగా మేము విశ్వసించాలా? అని వారు ఎదురు ప్రశ్న వేశారు. తస్మాత్, అలా ఇన్నహుమ్ హుముస్సుఫహాఉ వలాకిన్ లా యఅలమూన్. ముమ్మాటికీ వీరే మూర్ఖులు, కానీ ఆ సంగతి వీరికి తెలియటం లేదు. ఈ రెండు ఆయతులలో, సూర బఖరా ఆయత్ 137 మరియు 13 లో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మన విశ్వాసం ఎలా ఉండాలి? సహాబాల విశ్వాసం లాగా, మన ఈమాన్ సహాబాల ఈమాన్ లాగా ఉండాలి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్లో స్పష్టంగా తెలియజేశాడు.
ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. మన కర్మలు స్వీకరించబడాలంటే ముందు విశ్వాసం బాగుండాలి కదా. విశ్వాసానికే కొలత సహాబాలు. విశ్వాసమే సహాబాల లాగా ఉండాలి అన్నప్పుడు, మన ఆమాల్ కూడా, ఆచరించే విధానం కూడా, దాని కోసం ఎన్నుకున్న మార్గం కూడా సహాబాల లాగా ఉండాలి అని మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. సూరా మునాఫిఖూన్ ఆయత్ 8లో ఇలా ఉంటుంది:
وَلِلّٰهِ الْعِزَّةُ وَلِرَسُوْلِهٖ وَلِلْمُؤْمِنِيْنَ وَلٰكِنَّ الْمُنٰفِقِيْنَ لَا يَعْلَمُوْنَ
(వలిల్లాహిల్ ఇజ్జతు వలి రసూలిహీ వలిల్ ము’మినీన వలాకిన్నల్ మునాఫిఖీన లా యఅలమూన్)
“నిజానికి గౌరవమైతే అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకు, విశ్వాసులకే చెందుతుంది. కాని ఈ కపటులు తెలుసుకోవటం లేదు.” (63:8)
నిజానికి గౌరవం అయితే అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకు, విశ్వాసులకే చెందుతుంది. అంటే ఒక ప్రత్యేకమైన సందర్భంలో ఈ ఆయత్ వచ్చింది. అంటే నిజమైన గౌరవం అనేది, ఇజ్జత్ అనేది ఇది అల్లాహ్ కు ఉంది, అల్లాహ్ ప్రవక్తకు ఉంది, విశ్వాసులకు ఉంది. ఇక్కడ విశ్వాసులలో ఫస్ట్ ఎవరు? సహాబాలు. ప్రత్యేకమైన సందర్భంలో ఈ ఆయత్ అవతరించింది. అంటే ఇక్కడ విశ్వాసులు అంటే సహాబాలు. అంటే నిజానికి గౌరవం అల్లాహ్ ఎవరికి ఇచ్చాడు? గౌరవం ఎవరికి ఉంది? అల్లాహ్ కు ఉంది, ఆయన ప్రవక్తకు ఉంది, సహాబాలకి ఉంది. కానీ కపటులు తెలుసుకోవటం లేదు. అంటే నేను మూడు ఉదాహరణలు ఇచ్చాను ఖురాన్ ద్వారా, మన విశ్వాసం సహాబాల విశ్వాసం లాగా ఉండాలి. అలాంటప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారికి ఇచ్చిన గౌరవం ఇజ్జత్ మనకు కూడా ఇస్తాడు, ఇన్షా అల్లాహ్.
సహాబాల మార్గాన్ని అనుసరించడం
ఇక, నాలుగవ విషయం, సహాబాల మార్గం, సహాబాల విధానం కాకుండా వేరొక మార్గాన్ని అవలంబిస్తే ఏమవుతుంది? సహాబాల మార్గాన్ని, సహాబాల విధానాన్ని వదిలి, ఇతర మార్గాన్ని అనుసరిస్తే, అవలంబిస్తే ఏమవుతుంది? దానికి సమాధానం స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇచ్చాడు. సూరతున్ నిసా, ఆయత్ 115.
وَمَنْ يُّشَاقِقِ الرَّسُوْلَ مِنْۢ بَعْدِ مَا تَبَيَّنَ لَهُ الْهُدٰى وَيَتَّبِعْ غَيْرَ سَبِيْلِ الْمُؤْمِنِيْنَ نُوَلِّهٖ مَا تَوَلّٰى وَنُصْلِهٖ جَهَنَّمَ ۭ وَسَاۤءَتْ مَصِيْرًا
“కాని ఎవరయినా సన్మార్గం ప్రస్ఫుటమైన మీదట కూడా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు వ్యతిరేకంగా పోతే, విశ్వాసులందరి మార్గాన్ని వీడి, ఇతర మార్గాన్ని అనుసరిస్తే, మేమతన్ని అతను మరలదలచుకున్న వైపుకే మరల్చుతాము. కడకు అతన్ని నరకంలో పడవేస్తాము. అది అత్యంత చెడ్డ గమ్యస్థానం.” (4:115)
ఎవరైనా సన్మార్గం, హిదాయత్ ప్రస్ఫుటమైన మీదట కూడా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు వ్యతిరేకంగా పోతే, అలాగే విశ్వాసులందరి మార్గాన్ని వీడి, విశ్వాసుల మార్గాన్ని వీడి, ఇతర మార్గాన్ని అనుసరిస్తే, ఇక్కడ విశ్వాసుల మార్గం అంటే సహాబాల మార్గం. సహాబాల మార్గాన్ని వదిలి, ఇతర మార్గాన్ని అనుసరిస్తే, మేమతన్ని అతను మరల దలుచుకున్న వైపుకే మరలుస్తాము. కడకు అతన్ని నరకంలో పడవేస్తాము. అది అత్యంత చెడ్డ గమ్యస్థానం. అంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సహాబాల మార్గం వదిలేసి వేరే మార్గానికి పోతే, అల్లాహ్ నరకం అని స్పష్టంగా ఈ ఆయత్ లో తెలియజేశాడు. అంటే ఎంత ముఖ్య అవసరమో సహాబాల విధానం మనకు స్పష్టంగా అర్థమైపోయింది ఈ ఆయత్ ద్వారా.
ఇక సహాబాల విధానం ఏమిటి? ఇంతవరకు మనము సహాబా అంటే ఎవరు? సహాబాల విశ్వాసం ఎటువంటిది? మన విశ్వాసం ఎలా ఉండాలి? వారిలాగా మన విశ్వాసం లేకపోతే ఏమవుతుంది తెలుసుకున్నాము.
ఇక సహాబాలు ఎన్నుకున్న విధానం ఏమిటి? దీనినే మన్హజె సహాబా అంటారు. మన్హజె సహాబా. అరబీ పదం. మన్హజ్ అంటే విధానం. సహాబా అంటే నేను అర్థం చెప్పాను. మన్హజ్ అంటే విధానం. ఈ మన్హజ్ అనే పదం ఖురాన్ లో వచ్చింది. సూరా మాయిదాలో ఉంటుంది ఆయత్ 48లో. వలికుల్లిన్ జఅల్నా మిన్కుమ్ షిర్ అతన్ వమిన్హాజా. మీలో ప్రతి ఒక్కరి కోసం మేము ఒక విధానాన్ని, మార్గాన్ని నిర్ధారించాము అని. అంటే మన్హజ్ అంటే విధానం, మార్గం అన్నమాట.
అంటే, సహాబాల మార్గం, సహాబాల విధానం ఎలా ఉండింది? ఇది చాలా ముఖ్యమైన మాట ఇది. సహాబాలు ఖురాన్ హదీసులను ఎలా అర్థం చేసుకున్నారో, వారు ఎలా ఆచరించారో, అలాగే అర్థం చేసుకుని ఆచరించే ప్రయత్నం చేయాలి. దీనినే మన్హజె సహాబా అంటారు. సహాబాల విధానం అంటారు.
అంటే ఖురాన్‌ను, హదీసును సహాబాలు ఎలా అర్థం చేసుకున్నారు? అలాగే మనం అర్థం చేసుకోవాలి. నా ఇష్టపరంగా అర్థం నేను చేసుకోలేను. సహాబాలు ఏ విధంగా ఆచరించారో, అలాగే మనం కూడా ఆచరించాలి. మన ఇష్టపరంగా మనం ఆచరించకూడదు. దీనినే సహాబాల విధానం, సహాబాల మన్హజ్, మన్హజె సహాబా అంటారు.
దీనికి మన్హజె సలఫ్ కూడా అంటారు. అంటే కొంచెం విశాలంగా పోతే, పూర్వకాలపు పుణ్యాత్ములు, సజ్జనులు అన్నమాట. సలఫ్ అంటే. అంటే ఇది ఇస్లాం యొక్క మొదటి మూడు తరాలను ప్రత్యేకంగా సూచిస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, సహాబాల తరం, ఒక తరం. తాబయీన్ అంటే సహాబాలను అనుసరించేవారు, సహాబాల అనుచరులు. మూడవది, తబెతాబయీన్. తాబయీన్లను అనుసరించేవారు, తాబయీన్ల సహచరులు.
దీనికి ఆధారం, బుఖారీ ముస్లింలో హదీస్ ఉంది.
خَيْرُ النَّاسِ قَرْنِيْ ثُمَّ الَّذِيْنَ يَلُوْنَهُمْ ثُمَّ الَّذِيْنَ يَلُوْنَهُمْ
(ఖైరున్ నాసి ఖర్నీ సుమ్మల్లజీన యలూనహుమ్ సుమ్మల్లజీన యలూనహుమ్)
ప్రజలలో శ్రేష్ఠులు నా తరంవారు. ఆ తర్వాత వారిని అనుసరించేవారు. ఆ తర్వాత వారిని అనుసరించేవారు.
అంటే ఈ తరాలలో అన్నిటికంటే శ్రేష్ఠమైన తరం, నా తరం. అంటే ప్రవక్త గారి తరం, ప్రవక్త మరియు సహాబాల తరం. సుమ్మల్లజీన యలూనహుమ్, ఆ తర్వాత వచ్చిన తరం, రెండవది, అంటే తాబయీన్ల తరం. సుమ్మల్లజీన యలూనహుమ్, ఆ తర్వాత తబెతాబయీన్.
కావున, మన్హజె సలఫ్. సలఫ్‌ల విధానం. సలఫ్‌లో ఫస్ట్ ఎవరు ఉన్నారు? సహాబాలు ఉన్నారు. మన విధానం ఎలా ఉండాలి? సహాబాల విధానం లాగా ఉండాలి. అంటే ఖురాన్ మరియు హదీసులను సహాబాలు ఎలా అర్థం చేసుకున్నారో అలాగే అర్థం చేసుకోవాలి. వారు ఎలా ఆచరించారో అలాగే మనం కూడా ఆచరించాలి. ముఖ్యంగా ఆ మూడు తరాల తర్వాత, రాను రాను ఇస్లాంలో కొత్త కొత్త అర్థాలు సృష్టించారు. అది సహాబాల విధానానికి విరుద్ధం. సరైన విధానం కాదు. తర్వాత వారు బిద్అతీలు, మోతజిలా, జహమియా, ఈ విధంగా రాఫిజియా, చాలా వర్గాలుగా విడిపోయారు.
మౌలానా మౌదూదీ గారు ఉన్నారు, వహీదుద్దీన్ ఖాన్ గారు ఉన్నారు, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు ఉన్నారు. వారు ఖురాన్ ఆయతులకు కొత్త కొత్త అర్థాలు చెప్పారు. సహాబాలు అర్థం చేసుకోని, సహాబాలు చెప్పని, వారి విధానం కాని, కొత్త కొత్త అర్థాలు తన తెలివిని ఉపయోగించి చెప్పుకున్నారు. ఇది అహలె సున్నత్ వల్ జమాఅత్ అఖీదాకు విరుద్ధం. ఇది కుదరదు. ఇది సరైన విధానం కాదు. నేను నా ఇష్టపరంగా అది ఎంత అందంగా కనిపించినా, ఎంత అనుకూలంగా ఉన్నా, నా ఇష్టపరంగా నా తెలివిని ఉపయోగించి నేను అర్థం చేసుకోలేను. సహాబాల విధానం అంటే, ఆ ఆయత్ కి, ఆ హదీస్ కి సహాబాలు ఎలా అర్థం చేసుకున్నారో, నేను అలాగే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వారి మాతృభాష అరబీ. రెండవది ఖురాన్ అవతరించేటప్పుడు వారు ఉన్నారు. మూడవది ఆ ఖురాన్ యొక్క అర్థాన్ని స్వయంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వివరించారు. అయినప్పటికీ కొన్ని సందర్భాలలో వారికి కొన్ని పదాల అర్థాలు తెలుసుకోవడంలో ఇబ్బంది కలిగేది, దానిని వారు ప్రవక్త గారికి అడిగి తెలుసుకునేవారు.
ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను నేను. ఖురాన్‌లో సూరే ఇస్రాలో ఒక ఆయత్ ఉంది. సూరే ఇస్రా ఆయత్ 78. సూరే ఇస్రా అంటే బనీ ఇస్రాయిల్. ఆ ఆయతులో కఠినమైన పదాలు లేవు. సులభమైన పదాలు ఉన్నాయి. ఆ ఆయత్ ఎలా ఉంటుంది? చదువుతాను వినండి.
اَقِمِ الصَّلٰوةَ لِدُلُوْكِ الشَّمْسِ اِلٰى غَسَقِ الَّيْلِ وَقُرْاٰنَ الْفَجْرِ ۭ اِنَّ قُرْاٰنَ الْفَجْرِ كَانَ مَشْهُوْدًا
(అఖిమిస్సలాత లిదులూకిష్షమ్సి ఇలా గసఖిల్లైలి వఖుర్ఆనల్ ఫజ్రి, ఇన్న ఖుర్ఆనల్ ఫజ్రి కాన మష్హూదా)
నమాజును నెలకొల్పు – సూర్యుడు నెత్తి నుండి వాలినప్పటి నుంచి రాత్రి చీకటి అలుముకునే వరకు. తెల్లవారు జామున ఖుర్‌ఆను పారాయణం చెయ్యి. నిశ్చయంగా తెల్లవారు జామున చేసే ఖుర్‌ఆన్ పారాయణానికి సాక్ష్యం ఇవ్వబడుతుంది. (17:78)
ఈ ఆయతులో ఏ పదము కఠినంగా లేదు. సులభమైన పదాలు ఉన్నాయి. అఖిమిస్సలా, నమాజును నెలకొల్పు. అఖిమిస్సలా అంటే నమాజ్ పాటించండి, నమాజ్ నెలకొల్పండి. (లిదులూకిష్షమ్సి, దులూక్) అంటే సూర్యుడు వాలటం. దలక యదులుకు దులూక్, సూర్యుడు వాలటం. మనం దీనికి ఉర్దూలో జవాల్ అంటాం. సూర్యుడు నెత్తి నుండి వాలినప్పటి నుంచి, అంటే జవాల్ నుంచి, ఇలా గసఖిల్లైలి, రాత్రి చీకటి అలుముకునే వరకు. అంటే ఈ ఆయత్ లో ఈ తర్జుమాతో మనకు ఏం అర్థమైంది? నమాజ్ చేయండి, జవాల్ నుండి రాత్రి చీకటి పడే వరకు. దీనికి అర్థం. మధ్యలో గ్యాప్ లేదు చూడండి. ఇది అల్లాహ్ ఆజ్ఞ ఇది. అఖిమిస్సలా లిదులూకిష్షమ్సి. నమాజ్ పాటించండి, నమాజ్ నెలకొల్పండి, జవాల్ నుండి రాత్రి చీకటి అలుముకునే వరకు. నమాజ్ చేస్తూ ఉండాలి. వ ఖుర్ఆనల్ ఫజర్. తెల్లవారుజామున ఖురాన్ పారాయణం చేయండి. (ఇన్న ఖుర్ఆనల్ ఫజ్రి కాన మష్హూదా). తెల్లవారుజామున చేసే ఖురాన్ పారాయణం దానికి సాక్ష్యం ఇవ్వబడుతుంది.
మరి ఈ అర్థమే దీనికి వస్తుంది. ఈ అర్థం మనం తీసుకుంటే, జవాల్ నుండి రాత్రి వరకు కంటిన్యూ నమాజ్ చేయాలి. అలా చేస్తున్నామా? చేయటం లేదు. అర్థం అదే కదా. నా తెలివిపరంగా అర్థం వస్తే, ఎవరికీ అడిగే అవసరమే లేదు. డిక్షనరీ ఓపెన్ చేసి నేను ఈ ఆయత్ కి అర్థం తెలుసుకుంటాను. అఖిమ్ అంటే నమాజ్ చెయ్యి. అస్సలా అంటే నమాజు. లిదులూక్ అంటే, దులూక్ అంటే సూర్యుడు వాలటం. దులూకిష్షమ్స్, సూర్యుడు వాలినప్పటి నుంచి అంటే ఉర్దూలో జవాల్ నుండి. ఎప్పుడు వరకు? ఇలా గసఖిల్లైలి. రాత్రి వరకు. రాత్రి చీకటి పడే వరకు. అంటే జవాల్ నుండి చీకటి పడే వరకు నమాజ్ చేస్తూ ఉండండి అని అర్థం వస్తుంది దీంట్లో. కానీ ఇదేనా దీనికి అర్థము? కాదు.
మరి దీనికి ఈ ఆయత్ లో ఐదు నమాజుల గురించి ఉంది. ఈ అర్థం ఎవరు చెప్పారు మనకు? నేను నా తెలివి, నా అరబీ జ్ఞానం ఉపయోగిస్తే, డిక్షనరీ పక్కన పెట్టుకుని చూసుకుంటే, దీనికి అర్థం ఎలా ఏం వస్తుంది? నేను జోహర్ నుంచి రాత్రి వరకు నమాజ్ చేస్తూనే ఉండాలి వస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలి? ఫజ్ర్ లో ఖురాన్ చదవండి అని ఉంటుంది. అసలైన అర్థం ఏమిటి దీనికి? దీనికి అసలు అర్థం ఏమిటి? ఈ ఆయత్ లో ఐదు నమాజులకు చెప్పడం జరిగింది. దురుకుష్షమ్స్ అంటే జవాల్ తర్వాత జోహర్ నమాజ్ చేస్తారు, అసర్ నమాజ్ కూడా చేస్తారు అది జవాల్ తర్వాతే. గసఖిల్లైలి అంటే మగ్రిబ్ ఇషా నమాజు. వ ఖుర్ఆనల్ ఫజర్, ఇక్కడ ఖురాన్ అంటే ఫజర్ నమాజు. ఈ ఆయత్ లో ఖురాన్ అనే పదానికి అర్థం సలాతుల్ ఫజర్. ఖుర్ఆనల్ ఫజర్ అనగా సలాతుల్ ఫజర్. ఎందుకంటే ఫజర్ నమాజులో ఖురాన్ పారాయణం కొంచెం సుదీర్ఘంగా జరుగుతుంది కాబట్టి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సలాతుల్ ఫజర్ కి ఖుర్ఆనుల్ ఫజర్ అన్నాడు.
ఏ విధంగానైతే సూరతుల్ ఫాతిహా కి ఏమంటారు? అస్సలా అనే పేరు కూడా వచ్చింది సూరే ఫాతిహాకి. సలా అంటే నమాజ్ కదా. సూరతుల్ ఫాతిహాకి అనేక పేర్లు ఉన్నాయి. ఒక పేరు అస్సలా. అది హదీస్ లో ఉంది కదా, హదీసే ఖుద్సీలో ఉంది. హదీసే జిబ్రాయిల్ లో,
قَسَمْتُ الصَّلَاةَ بَيْنِي وَبَيْنَ عَبْدِي نِصْفَيْنِ
(ఖసమ్తుస్సలాత బైనీ వ బైన అబ్దీ నిస్ఫైన్)
“నేను సలాహ్ ని రెండు భాగాలుగా విభజించాను. సగ భాగం నాది, సగ భాగం నా దాసునిది.“
అంటే ఇక్కడ సలాహ్ ని రెండు భాగాలు అల్లాహ్ అన్నాడు. ఆ హదీసులో సలాహ్ కి అర్థం ఏమిటి? సూరే ఫాతిహా. ఆ విధంగా ఈ ఆయతులో ఖుర్ఆనుల్ ఫజర్ అంటే సలాతుల్ ఫజర్. ఇన్న ఖుర్ఆనల్ ఫజ్రి కాన మష్హూదా. ఫజర్ నమాజ్ కి సాక్ష్యం ఇవ్వబడుతుంది. అంటే ఇది నేను ఉదాహరణ ఇచ్చాను.
ఈ విధంగా ఖురాన్ ఆయతులను, అహాదీసులను నా ఇష్టపరంగా కాదు, సహాబాలు ఎలా అర్థం చేసుకున్నారో నేను అలాగే అర్థం చేసుకోవాలి. ఇది సహాబాల విధానం. ఇదే మన్హజె సలఫ్. ఫిహ్మె సలఫ్. అప్పుడే మనకు సన్మార్గ, నిజమైన సన్మార్గ భాగ్యం దక్కుతుంది.
సహాబాల ఆచరణ
ఇక సహాబాలు ఏ విధంగా ఆచరించేవారు, ఆ విషయానికి వస్తే ఒక రెండు మూడు ఉదాహరణలు తెలుసుకుందాం.
అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రదియల్లాహు అన్హుమా కథనం, ఆయన అంటున్నారు, “సహాబాల గురించి చెడుగా మాట్లాడకండి. ఎందుకంటే సహాబాలు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో ఉన్న ఒక్క సాఅ (ఒక గంట, కొంత సమయం) మీరు నలభై సంవత్సరాలు ఆరాధిస్తారు కదా దాని కంటే మేలైనది” అని అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ తెలియజేస్తున్నారు. ఇది సహాబాల స్థానం. అంటే మీరు నలభై సంవత్సరాలు ఆచరిస్తారు కదా మంచి పుణ్యాలు, నలభై సంవత్సరాల ఆరాధన కంటే గొప్పది సహాబాల ఒక్క కొంత సమయం ప్రవక్తతో గడిచిన సమయం. అటువంటి వారు సహాబాలు. వారిని చెడుగా వారి ప్రవర్తన తీసుకురావద్దండి, వారిని చెడుగా చెప్పవద్దండి అని ఆయన తెలియజేశారు.
ఇక సహాబాల గురించి మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమి తెలియజేశారు? సహాబాల గురించి అల్లాహ్ చెప్పాడు, మనం విన్నాం, ఖురాన్ వాక్యాల రూపంలో, ఆయతుల రూపంలో వారి విశ్వాసం గురించి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, అబూ దావూద్ లో హదీస్ ఉంది.
عَلَيْكُمْ بِسُنَّتِي وَسُنَّةِ الْخُلَفَاءِ الْمَهْدِيِّينَ الرَّاشِدِينَ
(అలైకుం బిసున్నతీ వ సున్నతిల్ ఖులఫా ఇల్ మహ్దీయీన్ అర్ రాషిదీన్)
“మీరు నా సున్నత్ ను మరియు నా తరువాత వచ్చే మార్గదర్శకులైన ఖలీఫాల సున్నత్ ను గట్టిగా పట్టుకోండి.”
అల్లాహ్ ఖురాన్ లో సహాబాల ఈమాన్ గురించి చెప్పాడు కదా, ఈమాన్ ఎలా ఉండాలని? సహాబాల లాగా మన ఈమాన్ ఉండాలి. ప్రవక్తగారు అంటున్నారు, మన జీవన విధానం, విశ్వాస విధానం, ఆచరణ విధానం ఎలా ఉండాలి? ప్రవక్తగారు అంటున్నారు,
عَلَيْكُمْ بِسُنَّتِي
(అలైకుం బిసున్నతీ)
“నా విధానం.”
وَسُنَّةِ الْخُلَفَاءِ الْمَهْدِيِّينَ الرَّاشِدِينَ
(వ సున్నతిల్ ఖులఫా ఇల్ మహ్దీయీన్ అర్ రాషిదీన్)
“సజ్జనులైన, సన్మార్గం పొందిన నా ఖులఫాల మార్గం,”
అంటే సహాబాల మార్గం. అంటే ఖులఫాయె రాషిదీన్ ల మార్గం, నా మార్గం లాగా మీ మార్గం కూడా ఉండాలి అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు.
అఖీదా (విశ్వాసం)లో సహాబాల విధానం
ఇక అఖీదాలో కూడా మన విధానం సహాబాల విధానం మాదిరిగానే ఉండాలి. ప్రతి విషయంలో, ముఖ్యంగా అఖీదాలో కూడా మన విధానం ఎలా ఉండాలి? సహాబాల విధానం లాగా ఉండాలి. అఖీదాలో సహాబాల విధానం ఏమిటి? ఖురాన్ లో, హదీస్ లో విశ్వాసాల గురించి సహాబాల మధ్య ఇఖ్తిలాఫ్ లేదు. అల్లాహ్ పట్ల విశ్వాసం, దైవదూతల పట్ల విశ్వాసం, దైవగ్రంథాల పట్ల విశ్వాసం, దైవప్రవక్తల పట్ల విశ్వాసం, అంతిమ దినం పట్ల విశ్వాసం, మంచి చెడు విధి పట్ల విశ్వాసం, ఈ విశ్వాసాలలో అర్కానుల్ ఈమాన్, వీటిలో సహాబాల మధ్య ఇఖ్తిలాఫ్ లేదు. అల్లాహ్ గురించి, అల్లాహ్ పై విశ్వాసం గురించి, అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు, అల్లాహ్ గుణాల గురించి, అల్లాహ్ పట్ల విశ్వాసం గురించి వారు ఏ విధంగా విశ్వసించారో, ఉదాహరణకు ఒక ఫేమస్ హదీస్ ఉంది, ఈమాన్ అంటే ఆరుంటిని విశ్వసించాలి, ఇస్లాం అంటే ఐదు ఉన్నాయి, ‘బునియల్ ఇస్లాము అలా ఖమ్సిన్’. అలాగే ఎహ్సాన్, అలాగే ఖియామత్. ఇవి ముస్లింలో హదీస్ ఉంది కదా.
أَنْ تُؤْمِنَ بِاللهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ وَالْيَوْمِ الْآخِرِ وَتُؤْمِنَ بِالْقَدَرِ خَيْرِهِ وَشَرِّهِ
(అన్ తు’మిన బిల్లాహి వ మలాయికతిహీ వ కుతుబిహీ వ రుసులిహీ వల్ యౌమిల్ ఆఖిరి వ తు’మిన బిల్ ఖదరి ఖైరిహీ వ షర్రిహీ)
“నీవు అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, అంతిమ దినాన్ని, మరియు విధిలోని మంచి చెడులను విశ్వసించాలి.”
ముస్లిం కితాబుల్ ఈమాన్ లో ఈ హదీస్ ఉంది. సహాబాల విశ్వాసం. అంటే సారాంశం ఏమిటంటే అఖీదాలో మన విశ్వాసం సహాబాల విశ్వాసం లాగా ఉండాలి. మన అఖీదా సహాబాల అఖీదా లాగా ఉండాలి. అల్లాహ్ పట్ల మన అఖీదా ఎలా ఉండాలి? సహాబాల అఖీదా లాగా. దైవ ప్రవక్తల పట్ల మన అఖీదా ఎలా ఉండాలి? సహాబాల అఖీదా లాగా. దైవ దూతల పట్ల విశ్వాసం ఎలా ఉండాలి? సహాబాల అఖీదా లాగా. దైవ గ్రంథాల పట్ల విశ్వాసం సహాబాల లాగా, అంతిమ దినం పట్ల విశ్వాసం సహాబాల లాగా, అదృష్టం పట్ల విశ్వాసం సహాబాల లాగా. ఆ విశ్వాసాలలో మనం ఎన్నుకునే విధానం సహాబాల విధానం అయి ఉండాలి.
ఆచరణలో సహాబాల విధానం
ఆచరించే విషయంలో కూడా మన మన్హజ్, విధానం సహాబాల విధానమై ఉండాలి.ఎందుకు? వారు దైవ ప్రవక్తను అలా ఆచరించారు. కొంచెం కూడా తేడా లేకుండా, హెచ్చుతగ్గులు లేకుండా ఆచరించారు వారు. ఉదాహరణకు, సహాబాలు, ‘ఉసూలుద్ దావా’ అనే పుస్తకంలో షేఖ్ అబ్దుల్ కరీం జైదాన్ పేజీ నెంబర్ 39 లో ఆయన మూడు విషయాలు చెప్పారు. సహాబాలు ఆచరణ విషయంలో ఎలా ఉండేవారు. ఒకటి అఖీదా బాగుండాలి. అఖీదా బాగాలేకపోతే ఏ నమాజు లేదు, ఉపవాసం లేదు, సదకా లేదు, దానం లేదు, హజ్ లేదు, ఉమ్రా లేదు. ఏ ఆచరణ లేదు అఖీదా బాగాలేకపోతే. ఫస్ట్ అఖీదా. సిహ్హతే అఖీదా, కరెక్ట్ అఖీదా కలిగి ఉండాలి. రెండవది అల్ ఇఖ్లాసు ఫిల్ అమల్, ఆచరణలో చిత్తశుద్ధి కలిగి ఉండాలి. మూడవది అల్ మువాఫకతు అలల్ కితాబి వస్సున్నహ్, ఖురాన్ మరియు దైవ ప్రవక్త ప్రవచనాలు అంటే సహీహ్ హదీసుల పరంగా ఉండాలి విధానం. అంటే ఫస్ట్ నా అఖీదా బాగుండాలి, రెండవది చిత్తశుద్ధి కలిగి ఉండాలి, మూడవది ఖురాన్ మరియు సున్నత్ కి పరంగా ఉండాలి. సహాబాల ఆచరణ అలాగే ఉండేది. కావున మన విధానం కూడా సహాబాల విధానం లాగే ఉండాలి.
ఉదాహరణకు, సహాబాలు ఏ విధంగా ఆచరించేవారు ప్రవక్తగారిని? ఒక ఉదాహరణ చూడండి. ఈ హదీస్ అబూ దావూద్ లో ఉంది, బాబుస్సలా ఫిన్నాల్. ఈ హదీస్ ని అల్లామా అల్బానీ రహిమహుల్లాహ్ సహీహ్ అన్నారు. అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు తాలా అన్హు కథనం, ఒకసారి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ చేపిస్తున్నారు. ప్రవక్తగారు ఇమామ్, సహాబాలు ముఖ్తదీలు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చెప్పులు తీసేసి పక్కన పెట్టారు, నమాజ్ స్థితిలోనే, నమాజ్ చేస్తుండగానే ఒక పక్కన చెప్పులు తీసి పెట్టారు. వెనుక నమాజ్ చేసే సహాబాలు అది చూసి వారు కూడా తమ చెప్పులు తీసేసి పక్కన పెట్టేశారు. నమాజ్ అనంతరం ప్రవక్తగారు అడిగారు, మీరు ఎందుకు అలా చేశారంటే, మీరు చేస్తుంటే మేము చూశాము అందుకు మేము చేశాం. ఇది సహాబాల ఆచరణ. అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా చేశారో అలాగే సహాబాలు చేసేవారు.
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఫాలో అవ్వటంలో కొంచెం తేడా జరిగితే సహాబాలకి కోపం వచ్చేది. వేరేవాళ్ళు కొంచెం తేడా చూపిస్తే వారు సహించేవారు కాదు. ఒక సందర్భంలో బషర్ బిన్ మర్వాన్, ఈయన ఒక రాజు, మర్వాన్ కొడుకు. ఆయన ప్రసంగమిస్తున్నాడు. ఆయన ప్రసంగం ఇచ్చేటప్పుడు చేతులు ఎక్కువ పైకి ఎత్తారు. దుఆ చేసేలాగా ఇలా చేతులు పైకి ఎత్తారు దుఆ చేసినప్పుడు, ప్రసంగం చేసేటప్పుడు. ఇది చూసి ఆయన్ని అమ్మార్ బిన్ రువైబా రదియల్లాహు అన్హు, ఈ సహాబీ ఆయన అది చూసి ఆయనకి కఠినంగా ఖండించారు. అల్లాహ్ నీ చేతులు పాడు చేయుగాక! దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంత ఎత్తుగా చేతులు ఎత్తేవారు కాదే, నువ్వు ఎందుకు ఎత్తుతున్నావు? అంటే ఆయన తన వేలితో సైగ చేసి చూపించారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంతవరకు ఎత్తేవారు, నువ్వేమిటి అంతవరకు ఎత్తేస్తున్నావు? అంటే ఇంత చిన్న విషయానికి కూడా సహాబాలు సహించేవారు కారు. అంటే దైవ ప్రవక్త ఎంతవరకు చేతులు ఎత్తారో అంతవరకే ఎత్తాలి కదా, ఇదే కదా ఇత్తెబా అంటే. ఇతాఅత్ అంటే ఇదే కదా. ఇది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం. ప్రవక్త గారి మాటలకు అర్థం చేసుకునే విషయంలో, ఆచరించే విషయంలో.
అలాగే, చివరి మాట చెప్పి నేను నా మాటను నేను ముగిస్తాను. అది ఏమిటంటే, ఉమ్రా చేసేటప్పుడు, ఉమ్రా హజ్ సమయంలో మేము రెండు విషయాలు పాటిస్తాం. ఒకటి, రెండు సున్నత్ ని పాటిస్తాం. ఒక సున్నత్ హజ్రె అస్వద్ ను ముద్దాడటం. రెండవది రమల్ చేయటం, తవాఫ్ చేసేటప్పుడు రమల్. రమల్ అంటే ఫస్ట్ తవాఫ్ లో కొంచెం అడుగులు తొందర తొందరగా ఒకలా వేస్తారు కదా, అది రమల్ దానికి అంటారు. జైద్ బిన్ అస్లం తమ నాన్నతో ఇది రివాయత్ చేస్తున్నారు, ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తాలా అన్హు హజ్రె అస్వద్ ను ఉద్దేశించి ఇలా అన్నారు, “నాకు తెలుసు నువ్వు ఒక రాయి మాత్రమేనని, లాభం నష్టం నువ్వు చేయలేవు. నువ్వు లాభం చేకూర్చలేవు, నష్టం చేకూర్చలేవు, అది నీ దగ్గర లేదు. లాభం నష్టం అల్లాహ్ ఇచ్చేది. నువ్వు లాభం ఇవ్వలేవు, నష్టం ఇవ్వలేవు. కానీ నేను మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను చూశాను, ఆయన నీకు ముద్దాడేవారు కనుక నేను నీకు ముద్దాడ్తున్నాను,”.
ఆ తర్వాత ఇలా అనడం జరిగింది. ఒకరు అడిగారు, ఏమని అడిగారు? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో శత్రువులకు చూపించడానికి, అంటే శత్రువులు వీరు మక్కా నుంచి వెళ్ళిపోయారు, బలం పోయింది, డబ్బు లేదు, తిండి లేదు, పేదవాళ్ళు అయిపోయారు అలా అనుకుంటారేమో, మాకు ఇంకా బలం ఉంది, మేమేమీ అలా కాలేదు అని చూపించడానికి, శత్రువులకి చూపించడానికి మనము రమల్ చేసేవాళ్ళం కదా, ఇప్పుడు ఆ కాలమే పోయింది, మారిపోయింది, అల్హమ్దులిల్లాహ్ మేము ఇప్పుడు రాజైపోయాము, శక్తి వచ్చేసింది, మాది జరుగుతా ఉంది, హుకూమత్ మాదే, పెత్తనం మాదే. మరి రమల్ ఎందుకు? రమల్ కి ఒక కారణం ఉండింది, ప్రత్యేకంగా శత్రువులకి చూపించడానికి అలా చేసేవాళ్ళము, ఇప్పుడు అది లేదు కదా. దానికి సమాధానం ఏమిటంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేశారు, మనం చేయాలి. ఇది ఇత్తెబా.
ఈ విధంగా ఉదాహరణలు సహాబాల విధానం గురించి, వారు ప్రవక్తని ఏ విధంగా ఆచరించేవారు, ఏ విధంగా ఇత్తెబా చేసేవారు, వారి విశ్వాసం ఏమిటి, ఆచరణ ఏమిటి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎక్కువగా ఉన్నాయి.
నా ఈ ప్రసంగానికి సారాంశం ఏమిటంటే, మన విశ్వాసం సహాబాల విశ్వాసం లాగా ఉండాలి. మన విధానం ప్రతి విషయంలో సహాబాల విధానం లాగా ఉండాలి. అది మనకు అత్యవసరం. ఎందుకు? అలా కాకపోతే మన విశ్వాసమే పోతుంది, మన ఆచరణ స్వీకరించబడదు. దాని గురించి అల్లాహ్ ఖురాన్ లో సాక్ష్యం ఇచ్చాడు, దాని గురించి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ మన్హజె సలఫ్ ని ప్రసాదించుగాక. సహాబాల విధానాన్ని ప్రసాదించుగాక. మనందరికీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సరైన జ్ఞానం ప్రసాదించుగాక. ఆమీన్.
واخر دعوانا ان الحمد لله رب العالمين
(వ ఆఖిరు దఅవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
మన ఆఖరి ప్రార్థన ఏమిటంటే, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు.
వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.
—
ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43256