మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .
జనాజ ప్రకరణం [PDF]
6వ అధ్యాయం – మనిషి చనిపోవడం పట్ల రోదించడం, పెడబొబ్బలు పెట్టడం గురించి (البكاء على الميت)
531 – حديث أُسَامَةَ بْنِ زَيْدٍ، قَالَ: أَرْسَلَتِ ابْنَةُ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِلَيْهِ، إِنَّ ابْنًا لِي قُبِضَ فَأْتِنَا، فَأَرْسَلَ يُقْرِئُ السَّلاَمَ وَيَقُولُ: إِنَّ للهِ مَا أَخَذَ وَلَهُ مَا أَعْطَى، وَكُلٌّ عِنْدَهُ بِأَجَلٍ مُسَمًّى، فَلْتَصْبِرْ وَلْتَحْتَسِبْ فَأَرْسَلَتْ إِلَيْهِ، تُقْسِمُ عَلَيْهِ لَيأْتِيَنَّهَا؛ فَقَامَ وَمَعَهُ سَعْدُ بْنُ عُبَادَةَ، وَمُعَاذُ بْنُ جَبَلٍ، وَأُبَيُّ بْنُ كَعْبٍ، وَزَيْدُ بْنُ ثَابِتٍ، وَرِجَالٌ؛ فَرُفِعَ إِلَى رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ الصَّبِيُّ وَنَفْسُهُ تَتَقَعْقَعُ كَأَنَّهَا شَنٌّ، فَفَاضَتْ عَيْنَاهُ فَقَالَ سَعْدٌ: يَا رَسُولَ اللهِ مَا هذَا فَقَالَ: هذِهِ رَحْمَةٌ جَعَلَهَا اللهُ فِي قُلُوبِ عِبَادِهِ، وَإِنَّمَا يَرْحَمُ اللهُ مِنْ عِبَادِهِ الرُّحَمَاءُ
__________
أخرجه البخاري في: 32 كتاب الجنائز: 33 باب قول النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يعذب الميت ببعض بُكاء أهله عليه
531. హజ్రత్ ఉసామా బిన్ జైద్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కుమార్తెలలో ఒకరు, (ఒక వ్యక్తి ద్వారా) “నా కొడుకు చావు బ్రతుకుల్లో ఉన్నాడు. మీరు వెంటనే మా ఇంటికి వచ్చేయండి” అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు కబురు చేశారు. అయితే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దానికి సమాధానంగా “అల్లాహ్ వెనక్కి తీసుకున్నది ఆయనదే; తాను ప్రసాదించినది కూడా ఆయనదే. ఆయన ప్రతి వస్తువుకూ ఒక గడువు (జీవితకాలం) నిర్ణయించాడు. అందువల్ల (ఈ విషాద సంఘటన పట్ల) నీవు సహనం వహించి పుణ్యాన్ని ఆశించు” అని చెప్పి పంపారు. ప్రవక్త కుమార్తె ప్రమాణం చేసి “మీరు తప్పకుండా రావాలి” అని మళ్ళీ కబురు పంపారు.
దాంతో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ సాద్ బిన్ ఉబాదా (రదియల్లాహు అన్హు), ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు), అబీ బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు), జైద్ బిన్ సాబిత్ (రదియల్లాహు అన్హు) మరికొందరు సహచరుల్ని వెంట బెట్టుకొని వెళ్ళారు. పిల్లవాడ్ని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరకు తీసుకు వచ్చారు. ఆ పసివాడి ఊపిరి కొట్టుమిట్టాడుతోంది. ఖాళీ అయిపోయిన నీటి తిత్తి మాదిరిగా మారిపోయాడు. ఆ పరిస్థితి చూసి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కంటతడిపెట్టారు. అప్పుడు హజ్రత్ సాద్ బిన్ ఉబాదా (రదియల్లాహు అన్హు) (ఆశ్చర్యపోయి చూస్తూ) “దైవప్రవక్తా! ఇదేమిటీ (మీరు దు:ఖిస్తున్నారు)?” అని అడిగారు. దానికి దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “ఇది అల్లాహ్ తన దాసుల హృదయాల్లో ఉంచిన కారుణ్యం. తోటి మానవుల్ని కరుణించే వారినే అల్లాహ్ కరుణిస్తాడు”.
[సహీహ్ బుఖారీ : 23వ ప్రకరణం – జనాయెజ్, 33వ అధ్యాయం]
532 – حديث عَبْدِ اللهِ بْنِ عُمَرَ، قَالَ: اشْتَكَى سَعْدُ بْنُ عُبَادَةَ شَكْوَى لَهُ، فَأَتَاهُ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، يَعُودُهُ، مَعَ عَبْدِ الرَّحْمنِ بْنِ عَوْفٍ، وَسَعْدِ بْنِ أَبِي وَقَّاصٍ، وَعَبْدِ اللهِ بْنِ مَسْعُودٍ، فَلَمَّا دَخَلَ عَلَيْهِ، فَوَجَدَهُ فِي غَاشِيَةِ أَهْلِهِ، فَقَالَ: قَدْ قَضَى [ص:184] قَالُوا: لاَ يَا رَسُولَ اللهِ فَبَكَى النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ؛ فَلَمَّا رَأَى الْقَوْمُ بُكَاءَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بَكَوْا، فَقَالَ: أَلاَ تَسْمَعُونَ، إِنَّ اللهَ لاَ يُعَذِّبُ بِدَمْعِ الْعَيْنِ وَلاَ بِحُزْنِ الْقَلْبِ، وَلكِنْ يُعَذِّبُ بِهذَا وَأَشَارَ إِلَى لِسَانِهِ أَوْ يَرْحَمُ، وَإِنَّ الْمَيِّتَ يُعَذَّبُ بِبُكَاءِ أَهْلِهِ عَلَيْهِ
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 54 باب البكاء عند المريض
532. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:- హజ్రత్ సాద్ బిన్ ఉబాదా (రదియల్లాహు అన్హు) వ్యాధిగ్రస్తులయితే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళారు. అప్పుడు దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రదియల్లాహు అన్హు), సాద్ బిన్ అబీ వఖ్కాస్ (రదియల్లాహు అన్హు), అబ్దుల్లా బిన్ మసూద్ (రదియల్లాహు అన్హు)లు కూడా ఉన్నారు. దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) అక్కడకు చేరుకోగానే ఆ ఇంటి వాళ్ళు ఆయన చుట్టూ మూగారు. అది చూసి దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) (సందేహిస్తూ) “ఏమిటి ఆయన చనిపోయారా?” అని అడిగారు. దానికి వారు “చనిపోలేదు దైవప్రవక్తా!” అన్నారు.
ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (రోగి స్థితి చూసి) కంట తడిపెట్టారు. ఆయన్ని చూసి అందరూ దుఃఖించడం మొదలెట్టారు. తరువాత దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు “వినండి. హృదయావేదన కన్నీళ్ళ వల్ల గానీ లేదా నోట దయార్ద్ర పలుకులు వెలువడటం వల్ల గానీ అల్లాహ్ మనిషిని శిక్షించడు. అయితే దీని విషయంలో (దైవప్రవక్త నోటి వైపు చూపిస్తూ అన్నారు) మాత్రం (పెడబొబ్బలు పెడితే) అల్లాహ్ తప్పకుండా శిక్షిస్తాడు. కుటుంబ సభ్యులు ఏడ్చినా సరే మృతునికి శిక్ష వుంటుంది.”
[సహీహ్ బుఖారీ : 23వ ప్రకరణం – జనాయెజ్, 54వ అధ్యాయం ]
8వ అధ్యాయం – ఆపద ప్రారంభంలో వహించే సహనమే సహనం
في الصبر على المصيبة عند أول الصدمة
533 – حديث أَنَسِ بْنِ مَالِكٍ رضي الله عنه، قَالَ: مَرَّ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بِامْرَأَةٍ تَبْكِي عِنْدَ قَبْرٍ فَقَالَ: اتَّقِي اللهَ وَاصْبِرِي قَالَتْ: إِلَيْكَ عَنِّي، فَإِنَّكَ لَمْ تُصَبْ بِمُصِيبَتِي وَلَمْ تَعْرِفْهُ فَقِيلَ لَهَا: إِنَّهُ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ؛ فَأَتَتْ بَابَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَلَمْ تَجِدْ عِنْدَهُ بَوَّابِينَ؛ فَقَالَتْ: لَمْ أَعْرِفْكَ فَقَالَ: إِنَّمَا الصَّبْرُ عِنْدَ الصَّدْمَةِ الأُولَى
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 32 باب زيارة القبور
533. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం:- ఓ రోజు ఒక స్త్రీ సమాధి మీద కూర్చొని ఏడుస్తుంటే, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అటుగా పోవడం జరిగింది. అపుడు ఆయన ఆ స్త్రీని చూసి “అల్లాహ్ కు భయపడి కాస్త సహనం వహించు” అని అన్నారు. దానికి ఆ స్త్రీ (ముఖం చిట్లించుకుంటూ) “మీ దారి మీరు వెళ్ళండి, నన్ను నా మానాన వదిలెయ్యండి. నా మీద వచ్చిపడిన ఆపద మీ మీద రాలేదు. అందువల్ల మీరు (నా) బాధను అర్థం చేసుకోలేరు” అని అన్నది.
తరువాత (కొందరు) ఆ స్త్రీకి ఆయనగారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అని తెలియజేశారు. అది విని ఆమె (పరుగుపరుగున) దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంటికి వెళ్ళింది. చూస్తే ఆయన వాకిలి ముందు ఒక్క ద్వారపాలకుడు కూడా లేడు. సరే, ఆ మహిళ (దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను కలుసుకొని) “నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను (క్షమించండి)” అని అన్నది. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఆపద ప్రారంభంలో వహించే సహనమే (అసలు) సహనం” (*) అని అన్నారు.
[సహీహ్ బుఖారీ : 23వ ప్రకరణం – జనాయెజ్, 32వ అధ్యాయం]
[*] ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనానికి భావం ఏమిటంటే – నీ వన్న మాటలకు నువ్వు క్షమాపణ చెప్పుకోనవసరం లేదు. నేను స్వవిషయం గురించి ఎవరి మీదా కోపగించుకోను. నా ఇష్టాయిష్టాలన్నీ దైవప్రసన్నత కోసమే పరిమితం. కాకపోతే నువ్వు కష్టసమయంలో సహనం వహించకుండా ఏడ్పులు పెడబొబ్బలు పెట్టి నీకు దక్కే పుణ్యాన్ని పోగొట్టుకున్నావు. ఇది నీ పొరపాటు. నా విషయంలో నీవు చేసిన పొరపాటు క్షమించబడింది. కాని దైవధర్మం విషయంలోనే నీవు పొరబడ్డావు. ఆపద ప్రారంభంలో సహనం వహించి ఉంటే పుణ్యం లభించి ఉండేది. నువ్వలా చేయలేకపోయావు.
9వ అధ్యాయం – కుటుంబ సభ్యుల ఏడ్పులు, పెడబొబ్బల వల్ల మృతునికే నష్టం
الميت يعذب ببكاء أهله عليه
534 – حديث عُمَرَ بْنَ الْخَطَّابِ رضي الله عنه، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: الْمَيِّتُ يُعَذَّبُ فِي قَبْرِهِ بِمَا نِيحَ عَلَيْهِ
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 34 باب ما يكره من النياحة على الميت
534. హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- “మనిషి మరణం పట్ల ప్రజలు ఏడ్పులు, పెడబొబ్బలు పెడితే అతడ్ని సమాధిలో శిక్షించడం జరుగుతుంది”.
[సహీహ్ బుఖారీ : 23వ ప్రకరణం – జనాయెజ్, 34వ అధ్యాయం]
535 – حديث عُمَرَ بْنِ الْخَطَّابِ عَنْ أَبِي مُوسى، قَالَ: لَمَّا أُصِيبَ عُمَرُ رضي الله عنه، جَعَلَ صُهَيْبٌ يَقُولُ: وَاأَخَاهْ فَقَالَ عُمَرُ: أَمَا عَلِمْتَ أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: إِنَّ الْمَيِّتَ لَيُعَذَّبُ بِبُكَاءِ الْحَيِّ
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 32 باب قول النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يعذب الميت ببعض بكاء أهله عليه
535. హజ్రత్ అబూ మూసా (రదియల్లాహు అన్హు) కథనం:- హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) తీవ్రంగా గాయపడటం చూసి హజ్రత్ సుహైబ్ (రదియల్లాహు అన్హు) “అయ్యో నా సోదరా!” అని ఏడ్వసాగారు. అప్పుడు హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) (ఆయనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాన్ని గుర్తు చేస్తూ) “బ్రతికున్నవారు ఏడిస్తే చనిపోయినవాడి (ఆత్మ)కి యాతన కలుగుతుందని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పిన విషయం నీకు తెలియదా?” అని అన్నారు.
[సహీహ్ బుఖారీ : 23వ ప్రకరణం – జనాయెజ్, 33వ అధ్యాయం]
536 – حديث عَبْدِ اللهِ بْنِ عُمَرَ، وَعُمَرَ، وَعَائِشَةَ عَنْ عَبْدِ اللهِ بْنِ عُبَيْدِ اللهِ بْنِ أَبِي مُلَيْكَةَ، قَالَ: تُوُفِّيتْ ابْنَةٌ لِعُثْمَانَ رضي الله عَنهُ بِمكَّةَ، وَجِئْنَا لِنَشْهَدَهَا، وَحَضَرَهَا ابْنُ عُمَرَ وَابْنُ عَبَّاسٍ، وَإِنِّي لَجَالِسٌ بَيْنَهُمَا (أَوْ قَالَ جَلَسْتُ إِلَى أَحَدِهِمَا ثُمَّ جَاءَ الآخَرُ فَجَلَسَ إِلَى جَنْبِي) فَقَالَ عَبْدُ اللهِ بْنُ عُمَرَ، لِعَمْرِو بْنِ عُثْمَانَ: أَلاَ تَنْهَى عَنِ الْبُكَاءِ فَإِنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: إِنَّ الْمَيِّتَ لَيُعَذَّبُ بِبُكَاءِ أَهْلِهِ عَلَيْهِ فَقَالَ ابْنُ عَبَّاسٍ: قَدْ كَانَ عُمَرُ رضي الله عنه يَقُولُ بَعْضَ ذلِك ثُمَّ حَدَّثَ، قَالَ: صَدَرْتُ مَعَ عُمَرَ رضي الله عنه مِنْ مَكَّةَ، حَتَّى إِذَا كُنَّا بِالْبَيْدَاءِ إِذَا هُوَ بِرَكْبٍ تَحْتَ ظِلِّ سَمُرَةٍ، فَقَالَ: اذْهَبْ فَانْظُرْ مَنْ هؤلاءِ الرَّكْبُ؛ قَالَ فَنَظَرْتُ فَإِذَا صُهَيْبٌ، فَأَخْبَرتُهُ، فَقَالَ: ادْعُهُ لِي، فَرَجَعْتُ إِلَى صُهَيْبٍ، فَقُلْتُ: ارْتَحِلْ فَالْحَقْ أَمِيرَ الْمُؤمِنِينَ فَلَمَّا أُصِيبَ عُمَرُ دَخَلَ صُهَيْبٌ يَبْكِي يَقُولُ: وَاأَخَاهْ وَاصَاحِبَاهْ؛ فَقَالَ عُمَرُ رضي الله عنه: يَا صُهَيْبُ أَتَبْكِي عَلَيَّ وَقَدْ قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِنَّ الْمَيِّتَ يُعَذَّبُ [ص:186] بِبَعْضِ بُكَاءِ أَهْلِهِ عَلَيْهِ قَالَ ابْنُ عَبَّاسٍ: فَلَمَّا مَاتَ عُمَرُ رضي الله عنه ذَكَرْتُ ذلِكَ لِعَائِشَةَ، فَقَالَتْ: رَحِمَ اللهُ عُمَرَ وَاللهِ مَا حَدَّثَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِنَّ اللهَ لَيُعَذِّبُ الْمُؤمِنَ بِبُكَاءِ أَهْلِهِ عَلَيْهِ؛ وَلكِنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: إِنَّ اللهَ لَيَزِيدُ الْكَافِرَ عَذَابًا بِبُكَاءِ أَهْلِهِ عَلَيْهِ وَقَالَتْ: حَسْبُكُمُ الْقُرْآنُ وَلاَ تَزِرُ وزِرَةٌ وِزْرَ أُخْرى قَالَ ابْنُ عَبَّاسٍ، عِنْدَ ذلِكَ: وَاللهُ هُوَ أَضْحَكَ وَأَبْكَى
قَالَ ابْنُ أُبِي مُلَيْكَةَ: وَاللهِ مَا قَالَ ابنُ عُمَرَ شَيْئًا
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 33 باب قول النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يعذب الميت ببعض بكاء أهله عليه
536. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉబైదుల్లా బిన్ అబీములైక కథనం:- మక్కాలో హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) గారి కుమార్తె ఒకరు చనిపోతే మేము ఆమె అంత్యక్రియల్లో పాల్గొనడానికి వెళ్ళాము. హజ్రత్ ఇబ్న్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా), హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా)లు కూడా వచ్చారు. నేను వాళ్ళిద్దరి మధ్య కూర్చున్నాను. (లేక నేను వారిద్దరిలో ఒకరి చెంత కూర్చొని ఉంటే రెండో ఆయన నా ప్రక్కన వచ్చి కూర్చున్నారు – ఉల్లేఖకుని అసలు పదాలేమిటో సరిగా గుర్తులేవు)
అప్పుడు హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు), హజ్రత్ అమ్ర్ బిన్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు)తో మాట్లాడుతూ, “మీరీ ఏడ్పును అరికట్టరా? మృతుని కుటుంబ సభ్యుల ఏడ్పు మూలంగా మృతునికి (సమాధిలో) యాతన కలుగుతుందని దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు కదా!” అని అన్నారు. హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఈ మాటలు విని “కొన్ని రకాల ఏడ్పుల మూలంగా (మృతునికి యాతన కలుగుతుంది) అని హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కూడా చెబుతుండేవారు” అని తెలియజేశారు.
ఆ తరువాత ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) విషయాన్ని వివరిస్తూ ఇలా అన్నారు – నేను హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు)తో కలసి మక్కా నుండి (మదీనాకు) తిరిగొస్తూ ‘బైదా’ ప్రదేశానికి చేరుకున్నాము. అప్పుడక్కడ ఓ పెద్ద చెట్టు క్రింద నీడలో కొందరు వాహనదారులు కన్పించారు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) “వాళ్ళెవరో చూసిరా” అన్నారు నాతో. నేను వెళ్ళి చూస్తే అక్కడ హజ్రత్ సుహైబ్ (రదియల్లాహు అన్హు) కూడా ఉన్నారు. నేను తిరిగొచ్చి ఈ సంగతి హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు)కు తెలియజేశాను. ఆయన “ఆయన్ని నా దగ్గరకు పిలుచుకురా” అన్నారు. నేను వెళ్ళి హజ్రత్ సుహైబ్ (రదియల్లాహు అన్హు)తో “అమీరుల్ మోమినీన్ (ఖలీఫాగారు) పిలుస్తున్నారు. పద!” అన్నాను.
(ఆ తరువాత కొంత కాలానికి) హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గాయపడ్డారు. అప్పుడు హజ్రత్ సుహైబ్ (రదియల్లాహు అన్హు) “అయ్యో నా సోదరా! అయ్యో నా సోదరా!!” అని ఏడ్వనారంభించారు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) అది విని “సుహైబ్! నీవు నా పరిస్థితిపై ఏడుస్తున్నావా?! మృతుని కుటుంబ సభ్యుల కొన్ని రకాల ఏడ్పుల మూలంగా మృతునికి (సమాధిలో) యాతన కలుగుతుందని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పిన విషయం తెలియదా?” అని అన్నారు.
హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఇంకా ఇలా తెలియజేస్తున్నారు – హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) చనిపోయిన తరువాత నేనీ హదీసు గురించి విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ముందు ప్రస్తావించాను. ఆమె అది విని “అల్లాహ్ హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు)ని కరుణించుగాక! దైవసాక్షి! విశ్వాసిని అతని కుటుంబ సభ్యులు ఏడ్వడం వల్ల అల్లాహ్ శిక్షిస్తాడని దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఎన్నడూ చెప్పలేదు. అవిశ్వాసికి అతని కుటుంబ సభ్యులు ఏడ్వటం వల్ల మరింత యాతనకు గురిచేస్తాడని మాత్రమే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు” అని అన్నారు. ఆ తరువాత హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) “కావాలంటే, ‘బరువు మోసేవాడెవడూ ఇతరుల బరువును మోయడు’ అన్న ఖుర్ఆన్ సూక్తి చూడు చాలు” అని చెప్పారు. హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఈ సందర్భంలో ……….. “నవ్వించేవాడు కూడా ఆ అల్లాహ్ నే, ఏడ్పించేవాడు కూడా ఆ అల్లాహ్ నే” అని అన్నారు.
ఇబ్నె అబీ మలీక ఇలా అన్నారు : “అల్లాహ్సాక్షి! ఈ మాటలన్నీ విన్న తరువాత హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) మారు మాట్లాడలేదు.”
[సహీహ్ బుఖారీ : 23వ ప్రకరణం – జనాయెజ్, 33వ అధ్యాయం]
537 – حديث عَائِشَةَ وَابْنِ عُمَرَ عَنْ عُرْوَةَ قَالَ: ذُكِرَ عِنْدَ عَائِشَةَ أَنَّ ابْنَ عُمَرَ رَفَعَ إِلَى النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: أَنَّ الْمَيِّتَ يُعَذَّبُ فِي قَبْرِهِ بِبُكَاءِ أَهْلِهِ فَقَالَتْ: وَهَلَ ابْنُ عُمَرَ رَحِمَهُ اللهُ إِنَّمَا قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِنَّهُ لَيُعَذَّبُ بِخَطِيئَتِهِ وَذَنْبِهِ، وَإِنَّ أَهْلَهُ لَيَبْكُونَ عَلَيْهِ الآنَ قَالَتْ: وَذَاكَ مِثْلُ قَوْلِهِ إِنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ [ص:187] قَامَ عَلَى الْقَلِيبِ وَفيهِ قَتْلَى بَدْرٍ مِنَ الْمُشْرِكينَ، فَقَالَ لَهُمْ مَا قَالَ: إِنَّهُمْ لَيَسْمَعُونَ مَا أَقُولُ إِنَّمَا قَالَ: إِنَّهُمُ الآنَ لَيَعْلَمُونَ أَنَّ مَا كُنْتُ أَقُولُ لَهُمْ حَقٌ ثُمَّ قَرَأَتْ (إِنَّكَ لاَ تُسْمِعُ الْمَوْتَى) وَ (وَمَا أَنْتَ بِمُسْمِعٍ مَنْ فِي الْقُبُورِ) يَقُولُ حينَ تَبَوَّءُوا مَقَاعِدَهُمْ مِنَ النَّارِ
__________
أخرجه البخاري في: 64 كتاب المغازى: 8 باب قتل أبي جهل
537. హజ్రత్ ఉర్వా (రహిమహుల్లాహ్) కథనం:- “మృతునికి అతని కుటుంబ సభ్యులు ఏడ్వటం వల్ల సమాధిలో యాతన కలుగుతుంది” అన్న హదీసు మర్ఫూ హదీస్ (ఉల్లేఖనాల పరంపర దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వరకు చేరిన హదీస్) అని హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) అన్నారు. ఈ విషయాన్ని హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ముందు ప్రస్తావించగా ఆమె (దాన్ని ఖండిస్తూ) “అల్లాహ్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) పై కరుణించుగాక! ఈ విషయంలో ఆయన పొరబడ్డారు. నిజానికి దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) (అలా చెప్పలేదు.) మృతుడ్ని అతని పాపాల కారణంగా శిక్షిస్తూ ఉండటం జరుగుతుంది. అదే సమయంలో అతని కుటుంబ సభ్యులు శోకాలు తీస్తూ ఉంటారని చెప్పారు” అని అన్నారు.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఇంకా ఇలా తెలియజేశారు: “ఇది హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) భ్రమ మాత్రమే. ఇది ఎలాంటి భ్రమంటే, బద్ర్ (యుద్ధ మైదానంలోని) పాడుబడిన గుంటలో హతులు వేయబడిన తరువాత, దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) దాని ఒడ్డు మీద నిలబడి చెప్పవలసిన విషయాలు చెప్పిన పిదప, వీరు నా మాటలు వింటున్నారని అన్నారని ఆయన అన్నారు. నిజానికి దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) (అలా అనలేదు) ‘వీరిప్పుడు లోగడ నేను చెబుతూ వచ్చిన విషయాలు నిజమని తప్పకుండా తెలుసుకున్నార’ని మాత్రమే అన్నారు. ఆ తరువాత ఆయన ‘నీవు మృతులకు (ఏ విషయమూ) విన్పించలేవు; నీవు సమాధుల్లో పూడ్చి వేయబడిన వారికి (ఏదీ) విన్పించలేవు’ అన్న ఖుర్ఆన్ సూక్తులు (నమల్ : 80, ఫాతిర్:22) విన్పించారు.”
హజ్రత్ ఉర్వా (రహిమహుల్లాహ్) ఇలా తెలియజేస్తున్నారు: ఈ సూక్తుల్ని ప్రస్తావించడంలో హజ్రత్. ఆయిషా (రదియల్లాహు అన్హా)గారి ఉద్దేశ్యం “ఆ సత్య తిరస్కారులకు నరకంలో స్థానం లభించిన తరువాత ఇక వారికి ఏది విన్పించినా ఎలాంటి ప్రయోజనం లేదు; వారు వినలేరు కూడా”అన్నదే. [*]
[సహీహ్ బుఖారీ : 64వ ప్రకరణం – మగాజీ, 8వ అధ్యాయం]
[*] ఈ ఉల్లేఖనంలో, దీనికి ముందు పేర్కొన్న (536) ఉల్లేఖనంలో హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) మాటతో హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) విభేదించారు. దానిపై హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) మౌనం వహించారు. అంతమాత్రాన ఆయన చెప్పినది తప్పనడానికి వీల్లేదు. జైన్ బిన్ మునీర్ (రహిమహుల్లాహ్) అభిప్రాయం ప్రకారం హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా)తో వివాదం కొనితెచ్చుకోవడం ఇష్టం లేక మౌనం వహించి ఉంటారు.
ఖుర్తబీ (రహిమహుల్లాహ్) అభిప్రాయం ప్రకారం హజ్రత్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) మౌనం వహించడానికి కారణం, తానన్న ఆ మాటలో తనకు అనుమానం కలిగిందని కాదు. ఆయన స్వయంగా ఈ మాట (తన తండ్రి) హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) నోట విన్నారు. హదీసులో విషయ వివరణకు అవకాశం ఉండటం వల్ల వాదోపవాదాలకు అది సమయం కాకపోవడం వల్ల ఆయన అప్పుడు మౌనం వహించారు. ఖతాబి (రహిమహుల్లాహ్) అభిప్రాయం ప్రకారం, ఈ రెండు ఉల్లేఖనాలలో ఎలాంటి వైరుధ్యం లేదు గనక హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) చెప్పిన మాట తప్పని ఖండించలేము. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు), అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు)ల హదీసులో మరో గూఢార్థం ఉండవచ్చు. అంటే, మృతుడు చనిపోయే ముందు అరబ్బుల్లో ఉండే దురాచారం ప్రకారం తన మృతి పట్ల ఏడ్పులు పెడబొబ్బలు పెట్టాలని మరణ శాసనం రాసి ఉంటే, అప్పుడు అతను (సమాధిలో) యాతనలకు గురయ్యే అవకాశం ఉంది. ఈ దురాచారం గురించి పూర్వం కవితలు కూడా వెలువడ్డాయి. ఉదాహరణకు ప్రముఖ కవి తర్ఫా బిన్ మాబుద్ ఒక కవితలో ఇలా పేర్కొన్నాడు : “మాబుద్ కుమారా! నేను చనిపోయినప్పుడు నీవు నా అంతస్తును బట్టి నన్ను తలచుకొని ఏడ్పులు, పెడబొబ్బలు పెట్టాలి సుమా! అంతేకాదు చొక్కా చించి గుండెలు బాదుకుంటూ మరీ ఏడ్వాలి నువ్వు”.
దీన్ని బట్టి మృతుడు స్వయంగా తన మృతిపట్ల ఇలా ఏడ్వాలని మరణ శాసనం రాసిపోతే అతను (సమాధి) యాతనలకు గురవుతాడని అత్యధిక మంది ధర్మవేత్తలు ఈ హదీసును గురించి వ్యాఖ్యానించారు. అయితే మరి కొందరు దీనికి భిన్నంగా వ్యాఖ్యానిస్తూ, మృతుడు వారి ఏడ్పులు, పెడబొబ్బలను వింటాడని, దాని వల్ల అతనికి కష్టం కలుగుతుందని, అతని మనస్సు బాధపడుతుందని అన్నారు. ఈ అభిప్రాయాన్ని ఖాజీ అయాజ్ సమర్థించారు. – నవవీ (రహిమహుల్లాహ్)
538 – حديث عَائِشَةَ زَوْجِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَتْ: إِنَّمَا مَرَّ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَلَى يَهُودِيَّةٍ يَبْكِي عَلَيْهَا أَهْلُهَا، فَقَالَ: إِنَّهُمْ ليبْكُونَ عَلَيْهَا، وَإِنَّهَا لَتُعَذَّبُ فِي قَبْرِهَا
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 33 باب قول النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يعذب الميت ببعض بكاء أهله عليه
538. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక యూద స్త్రీ (సమాధి) ప్రక్కగా వెళ్ళడం జరిగింది. దాని పట్ల (అంటే ఆ స్త్రీ మరణం పట్ల) ఆమె కుటుంబ సభ్యులు శోకాలు తీస్తుంటే (విని) “వీరు (ఇక్కడ) ఏడుస్తున్నారు. (అక్కడ) ఆమెకు సమాధిలో యాతన కలుగుతోంది” అని అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).
[సహీహ్ బుఖారీ : 23వ ప్రకరణం – జనాయెజ్, 33వ అధ్యాయం]
539 – حديث الْمُغِيرَةِ رضي الله عنه، قَالَ: سَمِعْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: مَنْ نِيحَ عَلَيْهِ يُعَذَّبُ بِمَا نِيحَ عَلَيْهِ
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 34 باب ما يكره من النياحة على الميت
539. హజ్రత్ ముగైరా బిన్ షాబ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- “ఎవరి (మరణం) పట్ల శోకాలు తీయడం జరుగుతుందో అతనికి ఆ శోకాలను బట్టి (సమాధిలో) యాతన కలుగుతుంది.”
[సహీహ్ బుఖారీ : 23వ ప్రకరణం – జనాయెజ్, 34వ అధ్యాయం ]
10వ అధ్యాయం – మనిషి మరణం పట్ల ఏడ్పులు, పెడబొబ్బలు, పెట్టడం నిషిద్ధం
التشديد في النياحة
540 – حديث عَائِشَةَ، قَالَتْ: لَمَّا جَاءَ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَتْلُ ابْنِ حَارِثَةَ وَجَعْفَرٍ وَابْنِ رَوَاحَةَ، جَلَسَ يُعْرَفُ فِيهِ الْحُزْنُ، وَأَنَا أَنْظُرُ مِنْ صَائرِ الْبَابِ، شَقِّ الْبَابِ؛ فَأَتَاهُ رَجُلٌ فَقَالَ: إِنَّ نِسَاءَ جَعْفَرٍ، وَذَكَرَ بُكَاءَهُنَّ فَأَمَرَهُ أَنْ يَنْهَاهُنَّ، فَذَهَبَ، ثُمَّ أَتَاهُ الثَّانِيَةَ، لَمْ يُطِعْنَهُ، فَقَالَ: أنْهَهُنَّ فَأَتَاهُ الثَّالِثَةَ، قَالَ: وَاللهِ غَلَبْنَنَا يَا رَسُولَ اللهِ فَزَعَمَتْ أَنَّه قَالَ: فَاحْثُ فِي أَفْوَاهِهِنَّ التُّرَابَ فَقُلْتُ: أَرْغَمَ اللهُ أَنْفَكَ، لَمْ تَفْعَلْ مَا أَمَرَكَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَلَمْ تَتْرُكْ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مِنَ الْعَنَاءِ
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 41 باب من جلس عند المصيبة يعرف فيه الحزن
540. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- హజ్రత్ జైద్ బిన్ హారిస్ (రదియల్లాహు అన్హు), హజ్రత్ జాఫర్ బిన్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హు), హజ్రత్ అబ్దుల్లా బిన్ రవాహ (రదియల్లాహు అన్హు)లు అమరగతులయ్యారన్న వార్త చేరిన తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మస్జిదుకు వెళ్ళారు. ఆయన ముఖార విందంపై విషాద ఛాయలు స్పష్టంగా కానరాసాగాయి. నేనా సమయంలో తలుపు సందు నుంచి చూస్తూ ఉంటే ఒకతను వచ్చి “జాఫర్ (రదియల్లాహు అన్హు) కుటుంబ స్త్రీలు ఆయన మృతి పట్ల శోకతాపాలు తీస్తున్నార”ని తెలియజేశాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అది విని “వెళ్ళి వాళ్ళను (ఏడ్పులు, పెడబొబ్బలు) మానెయ్యమని చెప్పు” అని ఆదేశించారు. అతను వెళ్ళి వచ్చి ఆ స్త్రీలు తన మాట వినడం లేదని చెప్పాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తిరిగి “వెళ్ళి వారిని వారించు” అని అన్నారు. ఆ వ్యక్తి మూడవసారి వెళ్ళొచ్చి “దైవప్రవక్తా! అల్లాహ్ సాక్షి!! ఆ స్త్రీలు ఎంత చెప్పినా వినే స్థితిలో లేరు” అని అన్నారు.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఇంకా ఇలా తెలియజేస్తున్నారు:- అప్పుడు దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) “వారి నోట మన్ను కొట్టు” అని అన్నారనుకుంటా. నేనా పరిస్థితి చూసి ఆ వ్యక్తితో “అల్లాహ్ నీ ముక్కుకు మన్ను తగిలించు గాక! నువ్విటు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆజ్ఞాపించిన పనీ చేయవు; అటు దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఊపిరీ సలుపుకోనూనియ్యవు” అని అన్నాను.
[సహీహ్ బుఖారీ : 23వ ప్రకరణం – జనాయెజ్, 41వ అధ్యాయం]
541 – حديث أُمِّ عَطِيَّةَ، قَالَتْ: أَخَذَ عَلَيْنَا النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عِنْدَ الْبَيْعَةِ أَنْ لاَ نَنُوحَ، فَمَا وَفَتْ مِنَّا امْرَأَةٌ غَيْرُ خَمْسِ نِسْوَةٍ: أُمُّ سُلَيْمٍ، وَأُمُّ الْعَلاَءِ، وَابْنَةُ أَبِي سَبْرَةَ امْرَأَةُ مُعَاذٍ، وَامْرَأَتَيْنِ؛ أَوِ ابْنَةُ أَبِي سَبْرَةَ، وَامْرَأَةُ مُعَاذٍ، وَامْرَأَةٌ أُخْرَى
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 46 باب ما ينهى عن النوح والبكاء والزجر عن ذلك
541. హజ్రత్ ఉమ్మె అతియా (రదియల్లాహు అన్హా) కథనం:- మేము ఇస్లాం స్వీకరించేటప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మా చేత చేయించిన ప్రమాణంలో మేము (మా బంధువుల మృతి పట్ల) ఏడ్పులు పెడబొబ్బలు పెట్టమన్న విషయం కూడా ఉంది. కాని ఈ వాగ్దానాన్ని ఐదుగురు స్త్రీలు తప్ప ఎవరూ పాటించలేదు. వారు (1) ఉమ్మె సలీం (రదియల్లాహు అన్హా), (2) ఉమ్మె అలా (రదియల్లాహు అన్హా), (3) అబూ సమ్రా (రదియల్లాహు అన్హు) కూతురు, (4) హజ్రత్ ముఆజ్ (రదియల్లాహు అన్హు) భార్య, (5) మరో ఇద్దరు స్త్రీలు.
ఈ హదీసును ఉల్లేఖించిన వారు ఇలా చెబుతున్నారు – లేక ఉమ్మె అతియా (రదియల్లాహు అన్హా) ఇలా చెప్పి ఉంటారు – “(3) అబూసమ్రా (రదియల్లాహు అన్హు) కూతురు, (4) హజ్రత్ ముఆజ్ (రదియల్లాహు అన్హు) భార్య (5) మరొక మహిళ. ”
[సహీహ్ బుఖారీ : 23వ ప్రకరణం – జనాయెజ్, 46వ అధ్యాయం]
542 – حديث أُمِّ عَطِيَّةَ، قَالَتْ: بَايَعْنَا رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَرَأَ عَلَيْنَا (أَنْ لاَ يُشْرِكْنَ بِاللهِ شَيْئًا) وَنَهَانَا عَنِ النِّيَاحَةِ، فَقَبَضَتِ امْرَأَةٌ يَدَهَا، فَقَالَتْ: أَسْعَدَتْنِي فُلاَنَةُ أُرِيدُ أَنْ أَجْزيهَا، فَمَا قَالَ لَهَا النَّبِي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ شَيْئًا، فَانْطَلَقَتْ وَرَجَعَتْ فَبَايَعَهَا
__________
أخرجه البخاري في: 65 كتاب التفسير: 60 سورة الممتحنة: 3 باب إذا جاءك المؤمنات يبايعنك
542. హజ్రత్ ఉమ్మె అతియా (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మా చేత బైత్ (ప్రమాణం) చేయించినప్పుడు “వారు అల్లాహ్ తో పాటు మరెవరినీ ఆయన దైవత్వంలో సాటి కల్పించమని ప్రమాణం చేయడానికి వస్తే….(వారి చేత ప్రమాణం చేయించు)” అన్న ఖుర్ఆన్ సూక్తి పఠించారు. దాంతో పాటు మేము (మా బంధుమిత్రుల) మృతిపట్ల ఏడ్పులు, పెడబొబ్బలు పెట్టబోమని మాచేత ప్రమాణం చేయించేటప్పుడు ఒక స్త్రీ తన చేతిని వెనక్కి లాక్కొని “ఫలానా స్త్రీ (శోకాలు తీయడంలో) నాతో సహకరించింది. ఇప్పుడు నేనా స్త్రీకి దాని బదులు తీర్చనా?” అని అడిగింది. దానికి దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. అప్పుడామె వెళ్ళిపోయింది. తర్వాత ఆమె తిరిగి వస్తే దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఆమె చేత ప్రమాణం చేయించారు.
[సహీహ్ బుఖారీ : 65వ ప్రకరణం]
11వ అధ్యాయం – స్త్రీలు శవపేటిక వెంట (శ్మశానానికి) వెళ్ళడం నిషిద్ధం
نهى النساء عن اتباع الجنائز
543 – حديث أُمِّ عَطِيَّةَ، قَالَتْ: نُهينَا عَنِ اتِّبَاعِ الْجَنَائِزِ وَلَمْ يُعْزَمْ عَلَيْنَا
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 30 باب اتباع النساء الجنائز
543. హజ్రత్ ఉమ్మె అతియా (రదియల్లాహు అన్హా) కథనం:- మమ్మల్ని (స్త్రీలను) జనాజాల (శవపేటికల) వెంట (శ్మశానానికి) వెళ్ళకుండా వారించటం జరిగేది. అయితే ఈ విషయంలో మరీ అంత తీవ్రవైఖరి అవలంబించేవారు కాదు.
[సహీహ్ బుఖారీ : 23వ ప్రకరణం – జనాయెజ్, 30వ అధ్యాయం]
12వ అధ్యాయం – శవస్నానం في غسل الميت
544 – حديث أُمَّ عَطِيَّةَ الأَنْصَارِيَّةِ قَالَتْ: دَخَلَ عَلَيْنَا رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ حينَ تُوُفِّيَتِ ابْنَتُهُ فَقَالَ: اغْسِلْنَهَا ثَلاَثًا أَوْ خَمْسًا أَوْ أَكْثَرَ مِنْ ذلِكَ، إِنْ رَأَيْتُنَّ ذلِكَ، بِمَاءٍ وَسِدْرٍ، وَاجْعَلْنَ فِي الآخِرَةِ كَافُورًا أَوْ شَيْئًا مِنْ كَافورٍ، فَإِذَا فَرَغْتُنَّ فَآذِنَّنِي فَلَمَّا اذنَّاهُ، فَأَعْطَانَا حَقْوَهُ فَقَالَ: أَشْعرْنَهَا إِيَّاهُ تَعْنِي إِزَارَهُ
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 8 باب غسل الميت ووضوئه بالماء والسدر
544. హజ్రత్ ఉమ్మె అతియా (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కుమార్తె ఒకరు చనిపోయినపుడు ఆయన మా దగ్గరికి వచ్చి ఇలా చెప్పారు : “ఆమెను నీటిలో రేగాకులు వేసి మూడు లేక అయిదు సార్లు లేదా అవసరమనుకుంటే అంతకంటే ఎక్కువసార్లు స్నానం చేయించండి. చివరిసారి కర్పూరం కలపాలి” లేక “కొంచెం కర్పూరం కలపాలి” అన్నారు ఆయన – “ఇలా స్నానం చేయించాక నాకు కబురు చేయండి.” మేము (శవానికి స్నానం చేయించి) ఆయనకు కబురు చేశాము. ఆయన (వచ్చి) మాకు తన లుంగీ ఇస్తూ, “ఈ వస్త్రాన్ని ఆమె దేహానికి తాకే విధంగా చుట్టండి” అని చెప్పారు.
[సహీహ్ బుఖారీ : 23వ ప్రకరణం – జనాయెజ్, 8వ అధ్యాయం]
545 – حديث أُمِّ عَطِيَّةَ الأَنْصَارِيَّةِ، قَالَتْ: دَخَلَ عَلَيْنَا رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَنَحْنُ نَغْسِلُ ابْنَتَهُ، فَقَالَ: اغْسِلْنَهَا ثَلاَثًا أَوْ خَمْسًا أَوْ أَكْثَرَ مِنْ ذلِكَ بِمَاءٍ وَسِدْرٍ، وَاجْعَلْنَ فِي الآخِرَةِ كَافُورًا، فَإِذَا فَرَغْتُنَّ فَآذِنَّنِي فَلَمَّا فَرَغْنَا آذَنَّاهُ فَأَلْقَى إِلَيْنَا حَقْوَهُ فَقَالَ: أَشْعِرْنَهَا إِيَّاهُ
فَقَالَ أَيُّوبُ (أَحَد الرواة) : وَحَدَّثَتْنِي حَفْصَةُ بِمِثْلِ حَدِيثِ مُحَمَّدٍ، وَكَانَ فِي حَدِيثِ حَفْصَةَ اغْسِلْنَهَا وِتْرًا َكَانَ فِيهِ ثَلاَثًا أَوْ خَمْسًا أَوْ سَبْعًا وَكَانَ فِيهِ أَنَّهُ قَالَ: ابْدَأْنَ بِمَيَامِنِهَا وَمَواضِعِ الْوُضُوءِ مِنْهَا وَكَانَ فِيهِ، أَنَّ أُمَّ عَطِيَّةَ قَالَتْ: وَمَشَطْنَاهَا ثَلاَثَةَ قُرُونٍ
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: باب ما يستحب أن يغسل وترا
545. హజ్రత్ ఉమ్మె అతియా (రదియల్లాహు అన్హా) కథనం:- మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కుమార్తె భౌతిక కాయానికి స్నానం చేయిస్తున్నప్పుడు ఆయన మా దగ్గరికి వచ్చి “ఆమెకు నీటిలో రేగాకులు వేసి మూడు లేక అయిదుసార్లు, లేదా (అవసరమనుకుంటే) అంతకంటే ఎక్కువసార్లు స్నానం చేయించండి. చివరిసారి కర్పూరం ఉపయోగించాలి. ఇలా స్నానం చేయించి నాకు తెలియజేయండి” అని అన్నారు. మేము (అలా) స్నానం చేయించి ఆయనకు తెలియజేశాము. అప్పుడు ఆయన మాకు తన లుంగీ ఇచ్చి “దీన్ని ఆమె శరీరానికి అంటి ఉండేలా చుట్టబెట్టండి” అని చెప్పారు.
ఈ హదీసు ఉల్లేఖకులలో ఒకరైన హజ్రత్ అయ్యూబ్ (రహిమహుల్లాహ్) ఇలా తెలియజేస్తున్నారు:- నాకు విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ హఫ్సా (రదియల్లాహు అన్హు) కూడా హజ్రత్ ఉమ్మె అతియా (రదియల్లాహు అన్హా) నుండి గ్రహించి ముహమ్మద్ (రహిమహుల్లాహ్) చెప్పినటువంటి హదీసే విన్పించారు. కాకపోతే ఈ రెండింటి మధ్య కాస్త తేడా ఉంది. హజ్రత్ హఫ్సా (రదియల్లాహు అన్హు) హదీసు ప్రకారం “ఆమెను బేసి సంఖ్యలో (అన్ని సార్లు) స్నానం చేయించండి” అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్నారు. ఉమ్మె అతియా (రదియల్లాహు అన్హా) హదీసు ప్రకారం ఆయన “మూడు లేక అయిదు లేక ఏడుసార్లు స్నానం చేయించండి” అని అన్నారు. అదీగాక “కుడివైపు నుండి ప్రారంభించండి; మొదట వుజూ చేయించవలసిన అవయవాలను కడగండి” అని దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పినట్లు కూడా ఈ హదీసులో ఉంది. పోతే; హజ్రత్ ఉమ్మె అతియా (రదియల్లాహు అన్హా), తాము ఆమె శిరోజాలు దువ్వి వాటిని మూడు పాయలుగా చేశామని కూడా తెలిపారు.
[సహీహ్ బుఖారీ : 23వ ప్రకరణం – జనాయెజ్, 9వ అధ్యాయం]
546 – حديث أُمِّ عَطِيَّةَ، قَالَتْ: لَمَّا غَسَّلْنَا بِنْتَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ لَنَا، وَنَحْنُ نَغْسِلُهَا: ابْدَأْنَ بِمَيَامِنِهَا وَمَوَاضِعِ الْوُضُوءِ مِنْهَا
__________
أخرجه البخاري في: 33 كتاب الجنائز: 11 باب مواضع الوضوء من الميت
546. హజ్రత్ ఉమ్మె అతియా (రదియల్లాహు అన్హా) కథనం:- మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కుమార్తె (భౌతికకాయం)కు స్నానం చేయిస్తుంటే ఆయన (మమ్మల్ని పిలిచి) “స్నానం కుడివైపు నుండి మొదలు పెట్టండి; మొదట వుజూ చేయవలసిన అవయవాలు కడగండి” అని అన్నారు.
[సహీహ్ బుఖారీ : 23వ ప్రకరణం – జనాయెజ్, 11వ అధ్యాయం]
13వ అధ్యాయం – శవ వస్త్ర సంస్కారం في كفن الميت
547 – حديث خَبَّاتٍ رضي الله عنه، قَالَ: هَاجَرْنَا مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ نَلْتَمِسُ وَجْهَ اللهِ، فَوَقَعَ أَجْرُنَا عَلَى اللهِ، فَمِنَّا مَنْ مَاتَ لَمْ يَأْكُلْ مِنْ أَجْرِهِ شَيْئًا، مِنْهُمْ مُصْعَبُ بْنُ عُميْرٍ؛ [ص:191] وَمِنَّا مَنْ أَيْنَعَتْ لَهُ ثَمَرَتُهُ، فَهُوَ يَهْدِبُهَا قُتِلَ يَوْمَ أُحُدٍ فَلَمْ نَجِدْ مَا نُكَفِّنُهُ إِلاَّ بُرْدَةً إِذَا غَطَّيْنَا بِهَا رَأْسَهُ خَرَجَتْ رِجْلاَهُ، وَإِذَا غَطَّيْنَا رِجْلَيْهِ خَرَجَ رَأْسُهُ، فَأَمَرَنَا النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَنْ نُغَطِّيَ رَأْسَهُ وَأَنْ نَجْعَلَ عَلَى رِجْلَيْهِ مِنَ الإِذْخِرِ
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 28 باب إذا لم نجد كفنا إلا ما يوري رأسه أو قدميه غطى رأسه
547. హజ్రత్ ఖబ్బాబ్ బిన్ అరత్ (రదియల్లాహు అన్హు) కథనం:- మేము అల్లాహ్ ప్రసన్నత పొందే ఉద్దేశ్యంతో మాత్రమే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట హిజ్రత్ చేశాము. (అంటే మక్కా నుండి మదీనాకు వలస వచ్చాము) అందువల్ల మాకు దాని పుణ్యఫలం ప్రసాదించడం అల్లాహ్ బాధ్యతయిపోయింది. మాలో కొందరు ఇహలోకం వీడి పోయారు. వారు ఇహలోకంలో తమ ప్రతిఫలాన్ని వసూలు చేయలేదు. ఉదాహరణకు (హజ్రత్ ముస్ అబ్ బిన్ ఉమైర్ రదియల్లాహు అన్హు) ఉహద్ యుద్ధంలో అమరగతి నొందినపుడు ఆయనకు వస్త్ర సంస్కారం జరపడానికి ఒక దుప్పటి తప్ప మరేమీ లభించలేదు. అది కూడా చాలా చిన్న దుప్పటి. దాంతో తలవైపు నుంచి కప్పితే కాళ్ళు బయట ఉండేవి. కాళ్ళ వైపు నుంచి కప్పితే తల బయట ఉండేది. అందువల్ల “తలవైపు నుండి కప్పి కాళ్ళను అజ్జర్ (ఒక విధమైన సువాసనగల గడ్డి)తో చుట్టబెట్టండ”ని దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఆజ్ఞాపించారు.
[సహీహ్ బుఖారీ : 23వ ప్రకరణం – జనాయెజ్, 28వ అధ్యాయం]
548 – حديث عَائِشَةَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ كُفِّنَ فِي ثَلاثَةِ أَثْوَابٍ يَمَانِيَةٍ بِيضٍ سَحُولِيَّةٍ مِنْ كُرْسُفٍ، لَيْسَ فيهِنَّ قَمِيصٌ وَلاَ عِمَامَةٌ
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 19 باب الثياب البيض للكفن
548. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (భౌతిక కాయం)కు యమన్ దేశంలోని సహూల్ ప్రాంతంలో తయారయిన మూడు తెల్లని వస్త్రాలలో చుట్టడం జరిగింది. ఆయన (భౌతికకాయం)కు చుట్టిన వస్త్రాలలో చొక్కాగాని, తలపాగాగాని లేవు.
[సహీహ్ బుఖారీ : 23వ ప్రకరణం – జనాయెజ్, 19వ అధ్యాయం]
14వ అధ్యాయం – మృతుని దేహంపై దుప్పటి కప్పడం గురించి في تسجية الميت
549 – حديث عَائِشَةَ، زَوْجِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ حينَ تُوُفِّيَ سُجِّيَ بِبُرْدٍ حِبَرَةٍ
__________
أخرجه البخاري في: 77 كتاب اللباس: 18 باب البرود والحبرة والشملة
549. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దివంగతులయినపుడు ఆయన (భౌతిక కాయం)పై యమన్లో తయారయిన ఒక ఆకుపచ్చ రంగు దుప్పటి కప్పారు.
[సహీహ్ బుఖారీ: 77వ ప్రకరణం – లిబాస్, 18వ అధ్యాయం]
16వ అధ్యాయం – శవాన్ని ఖననం చేయడంలో తొందరచేయాలి الإسراع بالجنازة
550 – حديث أَبِي هُرَيْرَةً رضي الله عنه، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: أَسْرِعُوا بِالْجِنَازَةِ، [ص:192] فَإِنْ تَكُ صَالِحَةً فَخَيْرٌ تُقَدِّمُونَهَا، وَإِنْ يَكُ سِوَى ذلِكَ، فَشَرٌّ تَضَعُونَهُ عَنْ رِقَابِكُمْ
__________
أخرجه البخاري في: 23 كتاب الجنازة: 52 باب السرعة بالجنازة
550. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించారని హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) తెలిపారు: మృతదేహాన్ని (శ్మశానానికి) తీసికెళ్ళడంలో తొందర చేయండి. ఎందుకంటే మృతుడు పుణ్యాత్ముడయి ఉంటే అతడ్ని మీరు సత్ పర్యవసానం వైపుకు తీసికెళ్తున్నారన్నమాట. ఒకవేళ అతను పాపాత్ముడయి ఉంటే అతనొక చెడుమయం. దాన్ని మీరు మీ భుజాల నుండి దించి వేయడానికి వెళ్తున్నారన్నమాట. (అందువల్ల మృతదేహాన్ని ఎంత త్వరగా శ్మశానానికి చేర్చితే అంత మంచిది).
[సహీహ్ బుఖారీ : 23వ ప్రకరణం – జనాయెజ్, 52వ అధ్యాయం]
17వ అధ్యాయం జనాజా నమాజ్‌లో పాల్గొనడం వల్ల పుణ్యం فضل الصلاة على الجنازة واتباعها
551 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: مَنْ شَهِدَ الْجَنَازَةَ حَتَّى يُصَلِّي عَلَيْهَا فَلَهُ قِيرَاطٌ، وَمَنْ شَهِدَ حَتَّى تُدْفَنَ كَانَ لَهُ قِيرَاطَانِ، قِيلَ: وَمَا الْقيرَاطَانِ قَالَ: مِثْلُ الْجَبَلَيْنِ الْعظيمَيْنِ
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 59 باب من انتظر حتى تدفن
551. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- (శవ ప్రస్థానం)లో పాల్గొని జనాజా నమాజు అయ్యేవరకు శవంతో పాటు ఉండే వ్యక్తికి ఒక యూనిట్ పుణ్యం లభిస్తుంది. శవఖననం అయ్యే వరకు ఉండే వ్యక్తికి రెండు యూనిట్ల పుణ్యం లభిస్తుంది”. రెండు యూనిట్లు అంటే ఏమిటని అడగ్గా ‘రెండు పెద్ద కొండల పరిమాణం’ అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియజేశారు.
[సహీహ్ బుఖారీ : 23వ ప్రకరణం – జనాయెజ్, 59వ అధ్యాయం]
552 – حديث أَبِي هُرَيْرَةَ وَعَائِشَةَ حَدَّثَ ابْنُ عُمَرَ، أَنَّ أَبَا هُرَيْرَةَ رضي الله عنه يَقُولُ: مَنْ تَبِعَ جَنَازَةً فَلَهُ قِيرَاطٌ، فَقَالَ: أَكْثَرَ أَبُو هُرَيْرَةَ عَلَيْنَا، فَصَدَّقَتْ، يَعْنِي عَائِشَةَ أَبَا هُرَيْرَةَ؛ وَقَالَتْ: سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُهُ؛ فَقَالَ ابْنُ عُمَرَ: لَقَدْ فَرَّطْنَا فِي قَرَارِيطَ كَثيرَةٍ
__________
أخرجه البخاري في: 13 كتاب الجنائز:58 باب فضل اتباع الجنائز
552. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:- “జనాజా (శవం) వెంట వెళ్ళే వ్యక్తికి ఒక యూనిట్ పుణ్యం లభిస్తుంద”ని హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) చెబుతున్నారు. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) చాలా హదీసులు విన్పిస్తున్నారు. (ఈ హదీసుని గురించి విచారించగా) హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) (దాన్ని) ధృవపరుస్తూ “నేను కూడా దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచిస్తూ ఉండగా విన్నాను” అని అన్నారు. నేనీ మాట విని “అయితే మేము చాలా యూనిట్లు వృధా చేసుకున్నాం*” అని అన్నాను.
[సహీహ్ బుఖారీ : 23వ ప్రకరణం – జనాయెజ్, 58వ అధ్యాయం ]
20వ అధ్యాయం – మృతుడ్ని గురించి మంచిగా లేక చెడుగా ప్రస్తావిస్తే?
فيمن يثنى عليه خير أو شر من الموتى
553 – حديث أَنَسِ بْنِ مَالِكٍ رضي الله عنه، قَالَ: مَرُّوا بِجَنَازَةٍ فَأَثْنَوْا عَلَيْهَا خَيْرًا، فَقَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: وَجَبَتْ ثُمَّ مَرُّوا بِأُخْرى فَأَثْنَوْا عَلَيْهَا شَرًّا، فَقَالَ: وَجَبَتْ فَقَالَ عُمَرُ بْنُ الْخَطَّابِ رضي الله عنه، مَا وَجَبَتْ قَالَ: هذَا أَثْنَيْتُمْ عَلَيْهِ خَيْرًا فَوَجَبَتْ لَهُ الْجَنَّةُ، وَهذَا أَثْنَيْتُمْ عَلَيْهِ شَرًّا فَوَجَبَتْ لَهُ النَّارُ، أَنْتُمْ شُهَدَاءُ اللهِ فِي الأَرْضِ
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 86 باب ثناء الناس على الميت
553. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం:- ఒకసారి (వీధిలో) ఒక శవపేటికను మోసుకెళ్తుంటే ప్రజలు మృతుని మంచిని గురించి ప్రస్తావిస్తూ అతడ్ని ప్రశంసించారు. దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) వారి మాటలు విని “వాజిబ్ (తప్పనిసరి) అయ్యింద”ని అన్నారు. ఆ తర్వాత మరొక శవం వెళ్తుంటే ప్రజలు ఆ మృతుడ్ని గురించి చెడుగా చెప్పుకున్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మళ్ళీ వారి మాటలు విని “వాజిబ్ (తప్పనిసరి) అయ్యింద”ని అన్నారు. అప్పుడు హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) విషయం తెలుసుకోవడానికి “ఏం వాజిబ్ (తప్పనిసరి) అయ్యిందీ?” అని అడిగారు. “మీరు ప్రశంసించిన వ్యక్తికి స్వర్గ ప్రవేశం వాజిబ్ (తప్పనిసరి) అయ్యింది. మీరు చెడుగా ప్రస్తావించిన రెండవ వ్యక్తికి నరకం వాజిబ్ (తప్పనిసరి) అయ్యింది. ఎందుకంటే మీరు ప్రపంచంలో అల్లాహ్ సాక్షులుగా ఉన్నారు” అని సమాధానమిచ్చారు దైవప్రవక్త(సల్లం). (*)
ఈ మాట వినక ముందు హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) జనాజా నమాజ్ చేసిన తరువాత వెళ్ళిపోయేవారు. (శ్మశానానికి పోయేవారు కాదు). అందువల్ల ఆయన ఈ హదీసు విని తాను చాలా పుణ్యం పోగొట్టుకున్నానని అన్నారు.
[సహీహ్ బుఖారీ : 23వ ప్రకరణం – జనాయెజ్, 86వ అధ్యాయం]
[*] ఇక్కడ ‘వాజిబ్ అయ్యింది’ అంటే ధృవపడిందని అర్థం తీసుకోవాలి. అల్లాహ్ పై ఏ విషయం వాజిబ్ కాదు. ఒక వ్యక్తికి పుణ్యఫలం లభించిందంటే అది ఆయన అనుగ్రహం; మరొక వ్యక్తి శిక్షకు గురయ్యాడంటే అది ఆయన ఇచ్చిన న్యాయమైన తీర్పు. ఆయన సర్వశక్తిమంతుడు, స్వయం నిర్ణయాధికారి. ఆయన చేసిన పనికి ఏ ఒక్కడూ ఎందుకూ, ఎలా అని అడగలేడు.
21వ అధ్యాయం – సౌఖ్యాన్ని పొందేవాడు, సౌఖ్యాన్నిచ్చేవాడు అంటే ఎవరు?
ما جاء في مستريح ومستراح منه
554 – حديث أَبِي قَتَادَةَ بْنِ رِبْعِيٍّ الأَنْصَارِيِّ أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مُرَّ عَلَيْهِ بِجَنَازَةٍ فَقَالَ: مُسْتَرِيحٌ وَمُسْتَراحٌ مِنْهُ قَالُوا: يَا رَسُولَ اللهِ مَا الْمُسْتَرِيحُ وَالْمُسْتَرَاحُ مِنْهُ قَالَ: الْعَبْدُ الْمُؤمِنُ يَسْتَريحُ مِنْ نَصَبِ الدُّنْيَا وَأَذَاهَا إِلَى رَحْمَةِ اللهِ، وَالْعَبْدُ الْفَاجِرُ يَسْتَريحُ مِنْهُ الْعِبَادُ وَالْبِلاَدُ وَالشَّجَرُ وَالدَّوَابُّ
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 42 باب سكرات الموت
554. హజ్రత్ అబూ ఖతాదా రబయీ అన్సారీ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) తన సమీపం నుంచి ఒక శవం పోతుంటే చూసి “సౌఖ్యాన్ని పొందేవాడు లేక సౌఖ్యాన్నిచ్చేవాడు” అని అన్నారు. అప్పుడు దైవప్రవక్త సహచరులు విషయం అర్థంగాక “సౌఖ్యాన్ని పొందేవాడు లేక సౌఖ్యాన్నిచ్చేవాడు అంటే ఏమిటి దైవప్రవక్తా!” అని అడిగారు. దానికి దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధానమిస్తూ “అంటే విశ్వాసి (చనిపోయిన తరువాత) ఇహలోక కష్టాల నుండి విముక్తి పొంది అల్లాహ్ కారుణ్యఛాయ (స్వర్గం)లో సౌఖ్యాన్ని పొందుతాడు. పాపాత్ముడు చనిపోవడం వల్ల ప్రజలు, పట్టణం, దేశం, చెట్లు, చతుష్పాదాలు, సర్వానికి అతని కీడు నుండి విముక్తి కలుగుతుంది” అని తెలియజేశారు.
[సహీహ్ బుఖారీ : 81వ ప్రకరణం – రిఖాఖ్, 42వ అధ్యాయం]
22వ అధ్యాయం – జనాజా నమాజులో తక్బీర్లను గురించి
في التكبير على الجنازة
555 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، أَنَّ رَسُولَ اللهِ نَعَى النَّجَاشِيَّ فِي الْيَوْمِ الَّذِي مَاتَ فِيهِ، خَرَجَ إِلَى الْمُصَلَّى فَصَفَّ بِهِمْ وَكَبَّرَ أَرْبَعًا
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 4 باب الرجل ينعى إلى أهل الميت بنفسه
555. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- నజాషీ (రదియల్లాహు అన్హు) (నీగస్ చక్రవర్తి) ఏ రోజు చనిపోయాడో అదే రోజు ఆయన మరణవార్తను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాకు విన్పించి నమాజు చేసే స్థలానికి వెళ్ళిపోయారు. అక్కడ అనుయాయులతో కలసి (జనాజా నమాజు కోసం) పంక్తులు ఏర్పరచి నాలుగు తక్బీర్లు పలికారు.
[సహీహ్ బుఖారీ : 23వ ప్రకరణం – జనాయెజ్, 4వ అధ్యాయం]
556 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: نَعَى لَنَا رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ النَّجَاشِيَّ، صَاحِبَ الْحَبَشَةِ، الْيَوْمَ الَّذِي مَاتَ فِيهِ، فَقَالَ: اسْتَغْفِرُوا َلأخِيكُمْ
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 61 باب الصلاة على الجنائز بالمصلى والمسجد
556. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- అబిసీనియా చక్రవర్తి హజ్రత్ నజాషీ ఏ రోజు చనిపోయారో ఆయన మరణవార్తను దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ రోజే మాకు విన్పించి “మీ సోదరుని కోసం మన్నింపు ప్రార్ధన (జనాజా నమాజు) చేయండి” అని అన్నారు.
[సహీహ్ బుఖారీ : 23వ ప్రకరణం – జనాయెజ్, 61వ అధ్యాయం]
557 – حديث جَابِرٍ رضي الله عنه، أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ صَلَّى عَلَى أَصْحَمَةَ النَّجَاشِيِّ، فَكَبَّرَ أَرْبَعًا
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 65 باب التكبير على الجنازة أربعاً
557. హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ అస్హమా నజాషీ కోసం జనాజా నమాజ్ చేశారు. అందులో ఆయన నాలుగు సార్లు తక్బీర్లు పలికారు.
[సహీహ్ బుఖారీ : 23వ ప్రకరణం – జనాయెజ్, 65వ అధ్యాయం]
558 – حديث جَابِرِ بْنِ عَبْدِ اللهِ، قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: قَدْ تُوُفِّيَ الْيَوْمَ رَجُلٌ صَالِحٌ مِنَ الْحَبَشِ، فَهَلُمَّ فَصَلُّوا عَلَيْهِ قَالَ: فَصَفَفْنَا، فَصَلَّى النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَلَيْهِ، وَنَحْنُ صُفُوفٌ
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 55 باب الصفوف على الجنازة
558. హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- “ఈ రోజు అబిసీనియాకు చెందిన ఒక పుణ్యాత్ముడు చనిపోయాడు. అతని (మన్నింపు) కోసం జనాజా నమాజ్ చేద్దాం రండి”.
హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) ఇంకా ఇలా తెలియజేస్తున్నారు:- అప్పుడు మేమంతా బారులు తీరి నిలబడ్డాము. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జనాజా నమాజు చేయించారు. ఆయన వెనుక జనం అనేక పంక్తులు తీరి నిల్చున్నారు.
[సహీహ్ బుఖారీ : 23వ ప్రకరణం – జనాయెజ్, 55వ అధ్యాయం]
23వ అధ్యాయం – సమాధి ముందు జనాజా నమాజు చేయడం గురించి الصلاة على القبر
559 – حديث ابْنِ عَبَّاسٍ عَنْ سُلَيْمَانَ الشَّيْبَانِيِّ قَالَ: سَمِعْتُ الشَّعْبِيَّ، قَالَ: أَخْبَرَنِي مَنْ مَرَّ مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَلَى قَبْرٍ مَنْبُوذٍ فَأَمَّهُمْ وَصَفُّوا عَلَيْهِ فَقُلْتَ يَا أَبَا عَمْرٍو: مَنْ حَدَّثَكَ فَقَالَ: ابْنُ عَبَّاسٍ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 161 باب وضوء الصبيان ومتى يجب عليهم الغسل والطهور وحضورهم الجماعة
559. హజ్రత్ సులైమాన్ షైబానీ (రహిమహుల్లాహ్) కథనం ప్రకారం హజ్రత్ షాబి (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు:- “వేరుగా నిర్మించబడిన ఒక సమాధి దగ్గరకు దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట వెళ్ళినటువంటి ఒక వ్యక్తి నాకీ సమాచారం అందజేశాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అక్కడ జనాజా నమాజు కోసం నాయకత్వం వహించారు. ఆయన వెనుక అందరూ బారులు తీరి నిలబడి జనాజా నమాజు చేశారు.”
ఈ హదీసు ఉల్లేఖించిన షైబాని (రహిమహుల్లాహ్) హజ్రత్ షాబి (రహిమహుల్లాహ్)ని “అబూ అమ్! ఈ హదీసు మీకు ఎవరు తెలిపారు?” అని అడిగారు. దానికి ఆయన “హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు)” అని సమాధానమిచ్చారు.
[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 161వ అధ్యాయం]
560 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، أَنَّ أَسْوَدَ، رَجُلاً أَوِ امْرَأَةً، كَانَ يَقُمُّ الْمَسْجِدَ، فَمَاتَ، وَلَمْ يَعْلَمِ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بِمَوْتِهِ، فَذَكَرَهُ ذَاتَ يَوْمٍ، فَقَالَ: مَا فَعَلَ ذَلِكَ الإِنْسَانُ قَالُوا: مَاتَ يَا رَسُولَ اللهِ قَالَ: أَفَلاَ آذَنْتُمُونِي فَقَالُوا: إِنَّهُ كَانَ كَذَا وَكَذَا، قِصَّتَهُ؛ قَالَ: فَحَقَرُوا شَأْنَهُ قَالَ: فَدُلُّونِي عَلَى قَبْرِهِ فَأَتَى قَبْرَهُ فَصَلَّى عَلَيْهِ
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 67 باب الصلاة على القبر بعد ما يدفن
560. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- ఒక నల్ల వర్ణం పురుషుడు లేక స్త్రీ యో – మస్జిద్ సేవ చేస్తూ ఉండేవాడు. అతను చనిపోయినపుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు అతని మరణవార్త (వెంటనే) అందలేదు. తర్వాత ఒక రోజు ఆయన ఆ మనిషిని జ్ఞాపకం చేయగా అతను చనిపోయాడని చెప్పారు ప్రవక్త అనుచరులు. అప్పుడు దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) “ఆ సంగతి నాకెందుకు తెలియజేయలేదు మీరు?” అని అడిగారు. “అతని మరణం అంత పెద్ద సంఘటన కాదనుకొని, దానికి మేమంత ప్రాముఖ్యత నివ్వలేదు. అతని అంతస్తుని మేము తక్కువగా పరిగణించాము” అన్నారు ప్రవక్త సహచరులు. దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) అది విని “సరే, నాకతని సమాధి చూపండి” అని అన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతని సమాధి దగ్గరకు వెళ్ళి అతని కోసం జనాజా నమాజు చేశారు.”
[సహీహ్ బుఖారీ : 23వ ప్రకరణం – జనాయెజ్, 67వ అధ్యాయం]
24వ అధ్యాయం – జనాజా వస్తుంటే గౌరవసూచకంగా నిలబడాలి
القيام للجنازة
561 – حديث عَامِرِ بْنِ رَبِيعَةَ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: إِذَا رَأَيْتُمُ الْجَنَازَةَ فَقُومُوا حَتَّى تُخَلِّفَكُمْ
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 47 باب القيام للجنازة
561. హజ్రత్ ఆమిర్ బిన్ రబీయా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:- “మీరు శవయాత్ర వస్తుండగా చూస్తే నిలబడండి. అది ముందుకు సాగిపోయే వరకు అలాగే నిలబడండి”.
[సహీహ్ బుఖారీ : 23వ ప్రకరణం – జనాయెజ్, 47వ అధ్యాయం]
562 – حديث عَامِرِ بْنِ رَبِيعَةَ رضي الله عنه عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: إِذَا رَأَى أَحَدُكُمْ جَنَازَةً، فَإِنْ لَمْ يَكُنْ مَاشِيًا مَعَهَا، فَلْيَقُمْ حَتَّى يُخَلِّفَهَا أَوْ تخَلِّفهُ أَوْ تَوضَعَ مِنْ قَبْلِ أَنْ تُخَلِّفَهُ
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 48 باب متى يقعد إذا قام للجنازة
562. హజ్రత్ ఆమిర్ బిన్ రబీయా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- (మీలో) ఎవరైనా శవపేటిక వస్తుండగా చూడటం జరిగితే అతను దాని వెంట వెళ్ళకపోతే (కనీసం) నిలబడిపోవాలి. అతను జనాజా వెనుక ఉండిపోయేవరకూ లేదా జనాజా తన వద్ద నుంచి ముందుకు సాగిపోయే వరకు (హదీసు ఉల్లేఖకునికి అనుమానం వచ్చింది) అలాగే నిలబడిపోవాలి.
[సహీహ్ బుఖారీ : 23వ ప్రకరణం – జనాయెజ్, 48వ అధ్యాయం]
563 – حديث أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رضي الله عنه، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: إِذَا رَأَيْتُمُ الْجَنَازَةَ فَقُومُوا، فَمَنْ تَبِعَهَا فَلاَ يَقْعُدْ حَتَّى تُوضَعَ
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 49 باب من تبع جنازة فلا يقعد حتى توضع عن مناكب الرجال، فإن قعد أمر بالقيام
563. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ కథనం ప్రకారం దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:- “మీరు శవపేటిక (జనాజా) వస్తుండగా చూస్తే నిలబడిపోండి. జనాజా వెంట వెళ్ళేవాడు జనాజాను క్రింద పెట్టనంత వరకు కూర్చోరాదు.”
[సహీహ్ బుఖారీ : 23వ ప్రకరణం – జనాయెజ్, 49వ అధ్యాయం]
564 – حديث جَابِرِ بْنِ عَبْدِ اللهِ، قَالَ: مَرَّتْ بِنَا جَنَازَةٌ، فَقَامَ لَهَا النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَقُمْنَا بِهِ، فَقُلْنَا يَا رَسُولَ اللهِ إِنَّهَا جَنَازَةُ يَهُودِيٍّ، قَالَ: إِذَا رأَيْتُمُ الْجِنَازَةَ فَقُومُوا
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 50 باب من قام لجنازة يهودي
564. హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం:- మా సమీపం నుండి ఒక జనాజా వెళ్తుంటే దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) దానికి గౌరవసూచకంగా నిలబడిపోయారు. మేము కూడా ఆయనతోపాటు నిలబడిపోయాము. ఆ తరువాత మేము “దైవప్రవక్తా! ఇది యూదుని శవం కదా?” అని అన్నాము. దానికి ఆయన “(ఎవరిదైనా సరే) జనాజా వస్తుండగా చూస్తే నిలబడిపోండి” అని అన్నారు.
[సహీహ్ బుఖారీ : 23వ ప్రకరణం – జనాయెజ్, 50వ అధ్యాయం]
565 – حديث سَهْلِ بْنِ حُنَيْفٍ وَقَيْسِ بْنِ سَعْدٍ عَنْ عَبْدِ الرَّحْمنِ بْنِ أَبِي لَيْلَى، [ص:196] قَالَ: كَانَ سَهْلُ بْنُ حُنَيْفٍ وَقَيْسُ بْنُ سَعْدٍ قَاعِدَيْنِ بِالْقَادِسِيَّةِ، فَمَرُّوا عَلَيْهِمَا بِجَنَازَةٍ فَقَامَا، فَقِيلَ لَهُمَا إِنَّهَا مِنْ أَهْلِ الأَرْضِ، أَيْ مِنْ أَهْلِ الذمَّةِ؛ فَقَالاَ: إِنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مَرَّتْ بِهِ جَنَازَةٌ فَقَامَ، فَقِيلَ لَهُ إِنَّهَا جَنَازَةُ يَهُودِيٍّ، فَقَالَ: أَلَيْسَتْ نَفْسًا
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 50 باب من قام لجنازة يهودي
565. హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ అబీ లైలా (రహిమహుల్లాహ్) కథనం:- హజ్రత్ సహల్ బిన్ హనీఫ్ (రజి), హజ్రత్ ఖైస్ బిన్ సాద్ (రదియల్లాహు అన్హు)లు – ఇద్దరూ ఖాదిసియాలో కూర్చొని ఉండగా, అక్కడి ప్రజలు ఒక శవాన్ని మోసుకొని వారి ముందు నుంచి సాగిపోయారు. అప్పుడు వీళ్ళిద్దరు లేచి నిలబడ్డారు. అది చూసి ఎవరో “ఈ జనాజా స్థానిక వ్యక్తిది, అంటే జిమ్మీ (ఈరాన్కు చెందిన జోరాస్ట్రియన్)ది” అని అన్నారు. ఇది విని వారిరువురు ఇలా సమాధానమిచ్చారు: “లోగడ ఒకసారి దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ముందు నుంచి ఒక యూదుని జనాజా వెళ్ళింది. ఆ మృతుని గౌరవార్థం ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) లేచి నిలబడ్డారు. ఇది యూదుని జనాజా కదా! అని ఆయన్ని ప్రశ్నిస్తే యూదునిలో ఉండేది ఆత్మకాదా?” అని ఎదురు ప్రశ్న వేశారు.
[సహీహ్ బుఖారీ : 23వ ప్రకరణం – జనాయెజ్, 50వ అధ్యాయం]
27వ అధ్యాయం – జనాజా నమాజు చేస్తున్నప్పుడు ఇమామ్ భౌతిక కాయానికి ఎటువైపు నిలబడాలి أين يقوم الإمام من الميت للصلاة عليه
566 – حديث سَمُرَةَ بْنِ جُنْدَبٍ رضي الله عنه، قَالَ: صَلَّيْتُ وَرَاءَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَلَى امْرَأَةٍ مَاتَتْ فِي نِفَاسِهَا، فَقَامَ عَلَيْهَا، وَسَطَهَا
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 63 باب الصلاة على النفساء إذا ماتت في نفاسها
566. హజ్రత్ సమూరా బిన్ జున్దుబ్ (రదియల్లాహు అన్హు) కథనం:- నేను ఒకసారి దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) వెనుక ఒక స్త్రీ జనాజా నమాజు చేశాను. ఆ స్త్రీ ప్రసూతి స్థితిలో ఉండగా చనిపోయింది. దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) జనాజా నమాజు చేయిస్తున్నప్పుడు శవానికి మధ్య (ఎదురుగా) నిలబడ్డారు.
[సహీహ్ బుఖారీ : 23వ ప్రకరణం – జనాయెజ్, 63వ అధ్యాయం – అస్సలాతి అలన్నుఫసాయి ఇజామాతల్ ఫీనిఫాసిహీ]
—
మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .