మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .
تحريم طلاق الحائض بغير رضاها وأنه لو خالف وقع الطلاق ويؤمر برجعتها
1వ అధ్యాయం – భార్యకు బహిష్టు స్థితిలో విడాకులివ్వడం నిషిద్ధం
936 – حديث ابْنِ عُمَرَ، أَنَّهُ طَلَّقَ امْرَأَتَهُ وَهِيَ حَائِضٌ عَلَى عَهْدِ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَسَأَلَ عُمَرُ بْنُ الْخَطَّابِ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَنْ ذلِكَ، فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: مُرْه فَلْيُرَاجِعْهَا ثُمَّ لِيُمْسِكْهَا حَتَّى تَطْهُرَ، ثُمَّ تَحِيضَ، ثُمَّ تَطْهُرَ، ثُمَّ إِنْ شَاءَ أَمْسَكَ بَعْدُ، وَإِنْ شَاءَ طَلَّقَ قَبْلَ أَنْ يَمَسَّ؛ فَتِلْكَ الْعِدَّةُ الَّتِي أَمَرَ اللهُ أَنْ تُطَلَّقَ لَهَا النِّسَاءُ
__________
أخرجه البخاري في: 68 كتاب الطلاق: 1 باب قول الله تعالى (يأيها النبي إذا طلقتم النساء فطلقوهن لعدتهن وأحصوا العدة)
936. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కాలంలో నేను నా భార్యకు బహిష్టు స్థితిలో విడాకులిచ్చాను. ఆ విషయంలో (నా తండ్రి) హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను విచారిస్తే ఆయన ఇలా అన్నారు: అబ్దుల్లా (రదియల్లాహు అన్హు)కు ఆ విడాకుల్ని ఉపసంహరించుకోమని చెప్పేయి. అతని భార్య బహిష్టు ఆగిపోయి పరిశుద్ధం అయ్యేవరకు ఆమెను తన దగ్గర ఆపి ఉంచాలి. తిరిగి ఆమె బహిష్టు అయి, తిరిగి పరిశుద్ధమయిన తర్వాత అతను కావాలనుకుంటే ఆమెను (తన దాంపత్యంలో) ఆపి ఉంచవచ్చు లేదా విడాకులివ్వవచ్చు. అయితే అప్పటిదాకా అతను ఆమెను తాకరాదు. ఇదే విడాకుల గడువు. దీని ప్రకారమే అల్లాహ్ స్త్రీలకు విడాకులివ్వాలని ఆజ్ఞాపించాడు.
[సహీహ్ బుఖారీ: 68వ ప్రకరణం – తలాఖ్, 1వ అధ్యాయం – ఖౌలిల్లాహి యా అయ్యుహన్నబియ్యు ఇజాతల్లఖ్ తుమ్)
937 – حديث ابْنِ عُمَرَ عَنْ يُونُسَ بْنِ جُبَيْرٍ، قَالَ: سَأَلْتُ ابْنَ عُمَرَ؛ فَقَالَ طَلَّقَ ابْنُ عُمَرَ امْرَأَتَهُ وَهِيَ حَائِضٌ، فَسَأَلَ عُمَرُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَأَمَرَهُ أَنْ يُرَاجِعَهَا، ثُمَّ يُطَلِّقَ مِنْ قُبُلِ عِدَّتِهَا؛ قُلْتُ: فَتَعْتَدُّ بِتِلْكَ التَّطْلِيقَةِ قَالَ: أَرَأَيْتَ إِنْ عَجَزَ وَاسْتَحْمَقَ
__________
أخرجه البخاري في: 68 كتاب الطلاق: 45 باب مراجعة الحائض
937. హజ్రత్ యూనుస్ బిన్ జుబైర్ (రహిమహుల్లాహ్) కథనం:- నేను హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు)ని బహిష్టు స్థితిలో విడాకులిచ్చేయడం గురించి అడిగితే ఆయన ఇలా అన్నారు – ఉమర్ కొడుకు కూడా తన భార్యకు బహిష్టు స్థితిలో విడాకులిచ్చాడు. దాని గురించి హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను విచారిస్తే “అబ్దుల్లా బిన్ ఉమర్ కు విడాకుల్ని ఉపసంహరించుకోమని ఆజ్ఞాపించు” అని చెప్పారు. అంతేకాకుండా ఇద్దత్ (గడువు) ప్రారంభమైనపుడు ఆమెకు తిరిగి విడాకులివ్వాలని ఆయన తెలియజేశారు.
అప్పుడు నేను హజ్రత్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు)ని “మరి ఆ (బహిష్టు లో ఇచ్చిన) విడాకులు విడాకుల క్రిందికి వస్తాయా?” అని అడిగాను. దానికి ఆయన “ఎందుకు రావు? ఒకవేళ ఎవరైనా గత్యంతరం లేని స్థితిలో లేదా బుద్ధి గడ్డి తినడం వల్ల విడాకులిస్తే అవి విడాకులుగా పరిగణించబడవా?” అని అన్నారు.
[సహీహ్ బుఖారీ : 68వ ప్రకరణం – తలాఖ్, 45వ అధ్యాయం – మురాజాతిల్ హాయిజ్]
وجوب الكفارة على من حرّم امرأته ولم ينو الطلاق
3వ అధ్యాయం – విడాకులిచ్చే ఉద్దేశ్యం లేకుండా ఎవరైనా తన భార్యతో ‘నీవు నా కొరకు నిషిద్ధం ‘ అంటే……. ?
938 – حديث ابْنِ عَبَّاسٍ، قَالَ: فِي الْحَرَامِ يُكَفِّرُ؛ وَقَالَ: (لَقَدْ كَانَ لَكُمْ فِي رَسُولِ اللهِ أُسْوَةٌ حَسَنَةٌ)
__________
أخرجه البخاري في: 65 كتاب التفسير: 66 سورة التحريم: 1 باب (يا أيها النبي لم تحرم ما أحل الله لك)
938. హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం:- “ఎవరైనా తన భార్యకు, ‘నీవు నా కోసం నిషిద్ధం అని అంటే అతను పాపపరిహారం (కప్పారా) చెల్లించుకోవలసి ఉంటుంది. ఆ తర్వాత ఆయన ఈ సూక్తి పఠించారు- “నిస్సందేహంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మీకెంతో ఆదర్శనీయులు”. (దివ్యఖుర్ఆన్-అహ్ జాబ్: 21)
[సహీహ్ బుఖారీ : 65వ ప్రకరణం – 66, తహ్రీం సూరా, 1వ అధ్యాయం – యా అయ్యుహన్నబియ్యు లిమ తుహర్రిము మా అహల్లలక]
939 – حديث عَائِشَةَ، أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ يَمْكُثُ عِنْدَ زَيْنَبَ ابْنَةِ جَحْشٍ وَيَشْرَبُ عِنْدَهَا عَسَلاً، فَتَوَاصَيْتُ أَنَا وَحَفْصَةُ أَنَّ أَيَّتَنَا دَخَلَ عَلَيْهَا النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَلْتَقُلْ: إِنِّي أَجِدُ مِنْكَ رِيحَ مَغَافِيرَ، أَكَلْتَ مَغَافِيرَ فَدَخَلَ عَلَى إِحْدَاهُمَا، فَقَالَتْ لَهُ ذلِكَ؛ فَقَالَ: لاَ بَلْ شَرِبْتُ عَسَلاً عِنْدَ زَيْنَبَ ابْنَةِ جَحْشٍ، وَلَنْ أَعُودَ لَهُ فَنَزَلَتْ (يأَيُّهَا النَّبِيُّ لِمَ تُحَرِّمُ مَا أَحَلَّ اللهُ لَكَ) إِلَى (إِنْ تَتُوبَا إِلَى اللهِ) لِعَائِشَةَ وَحَفْصَةَ وَإِذْ أَسَرَّ النَّبِيُّ إِلَى بَعْضِ أَزْوَاجِهِ لِقَوْلِهِ: بَلْ شَرِبْتُ عَسَلاً
__________
أخرجه البخاري في: 68 كتاب الطلاق: 8 باب لم تحرم ما أحل الله لك
939. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ జైనబ్ బిన్తె జహష్ (రదియల్లాహు అన్హా) దగ్గర (ఇంట్లో) ఆగి తేనె సేవించేవారు. ఓ రోజు నేను, హజ్రత్ హఫ్సా (రదియల్లాహు అన్హా) కలసి పరస్పరం కూడ బలుక్కున్నాము. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మనిద్దరిలో ఎవరి ఇంటికి వచ్చినా “మీ దగ్గర మగాఫీర్ (ఒక విధమైన జిగురు పదార్థం. రుచిలో తియ్యగానే ఉంటుంది. కాని దాని వాసన రోత పుట్టిస్తుంది. ఆ జిగురు పై వాలిన తేనెటీగలు ఉత్పత్తి చేసే తేనెలో కూడా ఆ వాసన ప్రభావం ఉంటుంది.) వాసన వస్తోంది, మీరేమైనా మగాఫీర్ తిన్నారా?” అని అడుగుదాం అని చెప్పుకున్నాం. దాని ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మా ఇద్దరిలో ఒకరి దగ్గరకు వచ్చినపుడు ఆమె ఈమాటే అన్నది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అది విని, “తినలేదు. నేను జైనబ్ (రదియల్లాహు అన్హా) దగ్గర తేనె సేవించాను. సరే ఇక నుండి నేను ఎన్నటికీ తేనె సేవించను” అని అన్నారు. ఆ సందర్భంలో ఈ సూక్తులు అవతరించాయి.
“ప్రవక్తా! అల్లాహ్ నీ (ముస్లింల) కోసం ధర్మసమ్మతం చేసిన దాన్ని నీవు ఎందుకు నిషేధించుకుంటావు? (ఇలా చేసి) నీవు నీ భార్యలను సంతోష పెట్టదలిచావా? (సరే, జరిగిందేదో జరిగిపోయింది). అల్లాహ్ క్షమాశాలి, దయామయుడు. ఆయన మీ కోసం మీ ప్రమాణాల పరిపూర్తి నుండి బయటపడేందుకు ఒక పద్ధతి నిర్ణయించాడు.* అల్లాహ్ మీ రక్షకుడు. ఆయన సర్వం తెలిసినవాడు, ఎంతో వివేకవంతుడు”
* ప్రమాణ భంగానికి పరిహారంగా పదిమంది పేదలకు రెండు పూటలు (సాధారణ) భోజనం పెట్టాలి. లేదా పదిమంది పేదలకు వస్త్రదానం చేయాలి. లేదా ఒక బానిసకు స్వాతంత్ర్యం ఇవ్వాలి. ఒక వేళ వీటినిచ్చే స్తోమత లేకపోతే మూడు రోజులు ఉపవాసం పాటించాలి.
“ప్రవక్త తన భార్యలలో ఒక భార్యతో రహస్యంగా ఒక మాటన్నారు. తర్వాత ఆ రహస్యాన్ని ఆమె (మరొకరి ముందు) బహిర్గతం చేసింది. ఆ సంగతి అల్లాహ్ వెంటనే తన ప్రవక్తకు తెలియజేశాడు. అప్పుడు దైవప్రవక్త (ఆ భార్యకు) ఆ విషయమై కాస్త మందలించారు. మరికాస్త సడలింపుల వైఖరిని ప్రదర్శించారు. ఆ తర్వాత ఈ (రహస్యం బయట పడిన) సంగతి ప్రస్తావించినపుడు ఆమె (ఆశ్చర్యపోయి) “మీకీ సంగతి ఎవరు తెలియజేశారు?” అని అడిగింది. దానికి దైవప్రవక్త “సర్వం ఎరిగినవాడు, బాగా తెలిసినవాడు నాకు తెలియజేశాడు” అని అన్నారు.
“(ప్రవక్త సతీమణులారా!) మీరిద్దరి హృదయాలు గాడి తప్పాయి. కనుక పశ్చాత్తాపంతో అల్లాహ్ ను క్షమాపణ కోరుకోండి (అందులోనే మీ శ్రేయస్సు ఉంది)”. (దివ్య ఖుర్ఆన్ -66:1-4)
ఇందులో ‘మీరిద్దరూ’ అంటే హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా), హజ్రత్ హఫ్సా (రదియల్లాహు అన్హా) అని అర్ధం. రహస్యం అంటే “తినలేదు. నేను జైనబ్ దగ్గర తేనె సేవించాను” అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పిన మాట.
(సహీహ్ బుఖారీ : 68వ ప్రకరణం – అత్తలాఖ్, 8వ అధ్యాయం – లిమ తుహర్రిము మా అహల్లల్లాహులక్)
940 – حديث عَائِشَةَ، قَالَتْ: كَانَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، يُحِبُّ الْعَسَلَ وَالْحَلْوَاءَ، وَكَانَ إِذَا انْصَرَفَ مِنَ الْعَصْرِ دَخَلَ عَلَى نِسَائِهِ، فَيَدْنُو مِنْ إِحْدَاهُنَّ، فَدَخَلَ عَلَى حَفْصَةَ بِنْتِ عُمَرَ، فَاحْتَبَسَ أَكْثَرَ مَا كَانَ يَحْتَبِسُ، فَغِرْتُ، فَسَأَلْتُ عَنْ ذَلِكَ، فَقِيلَ لِي، أَهْدَتْ لَهَا امْرَأَةٌ مِنْ قَوْمِهَا عُكَّةً مِنْ عَسَلٍ، فَسَقَتِ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مِنْهُ شَرْبَةً فَقُلْتُ: أَمَا وَاللهِ لَنَحْتَالَنَّ لَهُ فَقُلْتُ لِسَوْدَةَ بِنْتِ زَمْعَةَ أَنَّهُ سَيَدْنُو مِنْكِ، فَإِذَا دَنَا مِنْكِ فَقُولِي: أَكَلْتَ مَغَافِيرَ فَإِنَّهُ سَيَقُولُ لَكِ: لاَ فَقُولِي لَهُ: مَا هذِهِ الرِّيحُ الَّتِي أَجِدُ مِنْكَ [ص:114] فَإِنَّهُ سَيَقُولُ لَكِ: سَقَتْنِي حَفْصَةُ شَرْبَةَ عَسَلٍ، فَقُولِي لَهُ: جَرَسَتْ نَحْلُهُ الْعُرْفُطَ، وَسَأَقُولُ ذَلِكَ، وَقُولِي أَنْتِ يَا صَفِيَّةُ ذَاك
قَالَتْ: تَقُولُ سَوْدَةُ فَوَاللهِ مَا هُوَ إِلاَّ أَنْ قَامَ عَلَى الْبَابِ فَأَرَدْتُ أَنْ أُبَادِيَهُ بِمَا أَمَرْتِنِي بِهِ فَرَقًا مِنْكِ فَلَمَّا دَنَا مِنْهَا، قَالَتْ لَهُ سَوْدَةُ: يَا رَسُولَ اللهِ أَكَلْتَ مَغَافِيرَ قَالَ: لاَ قَالَتْ: فَمَا هذِهِ الرِّيحُ الَّتِي أَجِدُ مِنْكَ قَالَ: سَقَتْنِي حَفْصَةُ شَرْبَةَ عَسَلٍ، فَقَالَتْ: جَرَسَتْ نَحْلُهُ الْعُرْفُطَ فَلَمَّا دَارَ إِلَيَّ، قُلْتُ لَهُ نَحْوَ ذَلِكَ؛ فَلَمَّا دَارَ إِلَى صَفِيَّةَ قَالَتْ لَهُ مِثْلَ ذَلِكَ فَلَمَّا دَارَ إِلَى حَفْصَةَ، قَالَتْ: يَا رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَلاَ أَسْقِيكَ مِنْهُ قَالَ: لاَ حَاجَةَ لِي فِيهِ
قَالَتْ: تَقُولُ سَوْدَةُ وَاللهِ لَقَدْ حَرَمْنَاهُ؛ قُلْتُ لَهَا: اسْكُتِى
__________
أخرجه البخاري في: 68 كتاب الطلاق: 8 باب لم تحرم ما أحل الله لك
940. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు తేనె, తీపి అంటే ఎంతో ఇష్టం. ఆయన సాధారణంగా అసర్ నమాజు తర్వాత తన భార్యల దగ్గరికి వెళ్తుంటారు. వారిలో ఒకరికి కాస్త సన్నిహితంగా ఉండేవారు. ఓ రోజు ఆయన యధాప్రకారం హజ్రత్ హఫ్సా (రదియల్లాహు అన్హా) ఇంటికి వెళ్ళారు. అయితే ఆ రోజు ఆయన అక్కడ కొంచెం ఎక్కువ సేపు గడిపారు. అందుచేత నాలో అసూయ కలిగింది. తర్వాత నేను విషయం ఏమిటని విచారిస్తే, హజ్రత్ హఫ్సా (రదియల్లాహు అన్హా)కు ఆమె తెగకు చెందిన ఒకావిడ. ఓ తోలుతిత్తిలో తేనె పంపిందని తెలిసింది. అందులో కొంత తేనె దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ఇచ్చింది. అందువల్ల (ఇక ముందు దైవప్రవక్త తేనె సేవించకుండా ఉండేందుకుగాను) ఈ విషయంలో ఏదో ఒక ఎత్తుగడ వేయాలని నేను నిర్ణయించుకున్నాను.
అలా నిర్ణయానికి వచ్చిన తరువాత నేను హజ్రత్ సౌదా బినై జమా (రదియల్లాహు అన్హా) ఇంటికి వెళ్ళి “దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) నీ దగ్గరకు వచ్చినపుడు, నీకు దగ్గరగా వస్తే ఇలా చెప్పు ‘మీరు మగాఫీర్ (ఒక విధమైన తియ్యటి జిగురు) తిన్నారా?’ అని అడుగు. ఆయన తప్పకుండా తినలేదంటారు. అప్పుడు నువ్వు ‘మరి మీ దగ్గర వస్తున్న ఈ వాసనేమిటి?’ అని చెప్పు. అప్పుడాయన ‘నాకు హఫ్సా (రదియల్లాహు అన్హా) తేనె ఇస్తే సేవించాను’ అని తప్పకుండా అంటారు. ఆ తర్వాత నీవు ఆయనతో ‘తేనెటీగ మకరందాన్ని జుర్రుకోవడానికి బహుశా ఉర్పుత్ చెట్టు (మగాఫిర్ అనే జిగురు గల చెట్టు) మీద వాలి ఉంటుంది’ అని చెప్పాలి. నేను కూడా ఇలాగే చెబుతాను. సఫియా! నువ్వు కూడా ఇలాగే చెప్పు” అని అన్నాను.
(ఈ విధంగా మేము పథకం చేసుకొని దాన్ని ఆచరణలో పెట్టాము) ఆ తర్వాత హజ్రత్ సౌదా (రదియల్లాహు అన్హా) (విషయం తెలియజేస్తూ! దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నా ఇంట్లో అడుగు పెట్టగానే నేను నీకు భయపడి నీవు చెప్పమన్న మాటలు చెప్పాలనుకున్నాను అని అన్నది. మొత్తం మీద దైవ ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ సౌదా (రదియల్లాహు అన్హు) దగ్గరకు వచ్చినపుడు ‘దైవప్రవక్తా! మీరు మగాఫిర్ తిన్నారా?’ అని అడిగిందామె. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ‘తినలేద’న్నారు. మరి మీ దగ్గర నాకు వస్తున్న ఈ వాసనేమిటి? అని అడిగిందామె. “హఫ్సా (రదియల్లాహు అన్హా) నాకు తేనె ఇచ్చింది సేవించడానికి” అని చెప్పారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). “ఆ తేనెటీగ బహుశా ఉర్ఫుత్ చెట్టు (పువ్వు)ను జుర్రుకొని ఉంటుంది” అని అన్నారు హజ్రత్ సౌదా (రదియల్లాహు అన్హా).
ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నా దగ్గరకు వస్తే నేను కూడ ఈ మాటలే అన్నాను. (తత్ఫలితంగా ఆయన తన వైఖరి మార్చుకున్నారు.) తర్వాత ఆయన హజ్రత్ హఫ్సా (రదియల్లాహు అన్హా) ఇంటికి వెళ్ళినపుడు “(దైవప్రవక్తా! మీకు తేనె తెమ్మంటారా?” అని అడిగిందామె. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “నాకిప్పుడు దాని అవసరం లేదు” అని అన్నారు.
ఈ సంఘటన జరిగిన తరువాత హజ్రత్ సౌదా (రదియల్లాహు అన్హు) నాతో మాట్లాడుతూ “అయ్యో! మనం దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం)ను తేనె సేవించకుండా చేశామే”! అని అన్నది. నేను “ఇక మాట్లాడకు” అన్నాను.
(సహీహ్ బుఖారీ : 68వ ప్రకరణం – అత్తలాఖ్, 8వ అధ్యాయం – లిమ తుహర్రమూ మా అహల్లల్లాహు లక్)
بيان أن تخيير امرأته لا يكون طلاقا إِلا بالنية
4వ అధ్యాయం – విడాకులిచ్చే ఉద్దేశ్యం లేనంతవరకు భార్యకు ఇంట్లో నుండి వెళ్ళిపోయే అధికారం ఇచ్చినంత మాత్రాన అది విడాకుల క్రిందికి రాదు
941 – حديث عَائِشَةَ زَوْجِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَتْ: لَمَّا أُمِرَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بِتَخْيِيرِ أَزْوَاجِهِ، بَدَأَ بِي؛ فَقَالَ: إِنِّي ذَاكِرٌ لَكِ أَمْرًا فَلاَ عَلَيْكِ أَنْ لاَ تَعْجَلِي حَتَّى تَسْتَأْمِرِى أَبَوَيْكِ، قَالَتْ: وَقَدْ عَلِمَ أَنَّ أَبَوَيَّ لَمْ يَكُونَا يَأَمُرَانِي بِفِرَاقِهِ قَالَتْ، ثُمَّ قَالَ: إِنَّ الله جَلَّ ثَنَاؤُهُ قَالَ (يأَيُّهَا النَّبِيُّ قُلْ َلأزْوَاجِكَ إِنْ كُنْتُنَّ تُرِدْنَ الْحَيَاةَ الدُّنْيَا وَزِينَتَهَا) إِلَى (أَجْرًا عَظِيمًا) قَالَتْ: فَقُلْتُ فَفِي أَيِّ هذَا أَسْتَأْمِرُ أَبَوَيَّ، فَإِنِّي أُرِيدُ الله وَرَسُولَهُ وَالدَّارَ الآخِرَةَ؛ قَالَتْ: ثُمَّ فَعَلَ أَزْوَاجُ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مِثْلَ مَا فَعَلْتُ
[ص:115] أخرجه البخاري في: 65 كتاب التفسير: 33 سورة الأحزاب: 5 باب قوله (إن كنتن تردن الله ورسوله والدار الآخرة)
941. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- అల్లాహ్ తన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ‘ఇహపరలోకాల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకోవడానికి నీ భార్యలకు అధికారమివ్వు’ అని ఆదేశించాడు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముందుగా నా దగ్గరికొచ్చి మాట్లాడుతూ “నేను నీతో ఒక మాట అంటాను. కానీ ఈ విషయంలో నీవు తొందరపడి ఏదీ చెయ్యకు. నీ తల్లిదండ్రులను సంప్రదించకుండా నువ్వు ఏ నిర్ణయం తీసుకోకు” అని అన్నారు.
నా తల్లిదండ్రులు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నుండి విడిపొమ్మని ఎలాంటి పరిస్థితిలోనూ సలహా ఇవ్వరని ఆయనకు నమ్మకం ఉంది. అందువల్ల ఆయన ఈ విధంగా చెప్పిన తర్వాత అల్లాహ్ ఇలా అన్నాడని ఈ (క్రింది) సూక్తి విన్పించారు:
“ప్రవక్తా! నీ భార్యలతో ఇలా చెప్పెయ్యి – మీరొక వేళ ఇహలోకాన్ని, అందులోని తళుకు బెళుకుల్ని కోరుకుంటుంటే, రండి, నేను మీకు ఎంతో కొంత ఇచ్చి మంచిగా సాగనంపుతాను. దానికి బదులు మీరు అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను, పరలోక గృహాన్ని కోరుకుంటే ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోండి. మీలో సజ్జనుల కోసం అల్లాహ్ గొప్ప పుణ్యఫలాన్ని సిద్ధం చేసి ఉంచాడు.”
నేనీ సూక్తి విన్న తర్వాత “ఇందులో నా తల్లి దండ్రుల్ని సలహా అడగవలసినటువంటి ముఖ్య విషయం ఏముందని? నేను అల్లాహ్ ను, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను, పరలోక గృహాన్ని మాత్రమే కోరుకుంటున్నాను” అని అన్నాను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో. ఆ తర్వాత ప్రవక్త భార్యలందరూ (రదియల్లాహు అన్హుమ్) నేనిచ్చిన సమాధానమే ఇచ్చారు.
(సహీహ్ బుఖారీ : 65వ ప్రకరణం – తఫ్సీర్, 33 – అష్టబ్ సూరా, 5వ అధ్యాయం – వ ఇన్ కన]
942 – حديث عَائِشَةَ عَنْ مُعَاذَةَ، عَنْ عَائِشَةَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ يَسْتَأْذِنُ فِي يَوْمِ الْمَرْأَةِ مِنَّا بَعْدَ أَنْ أُنْزِلَتْ هذِهِ الآيَةُ (تُرْجِي مَنْ تَشَاءُ مِنْهُنَّ وَتُؤْوِي إِلَيْكَ مَنْ تَشَاءُ وَمَنِ ابْتَغَيْتَ مِمَّنْ عَزَلْتَ فَلاَ جُنَاحَ عَلَيْكَ) فَقُلْتُ لَهَا مَا كُنْتِ تَقُولِينَ قَالَتْ: كُنْتُ أَقُولُ لَهُ: إِنْ كَانَ ذَاكَ إِلَيَّ فَإِنِّي لاَ أُرِيدُ، يَا رَسُولَ اللهِ أَنْ أُوثِرَ عَلَيْكَ أَحَدًا
__________
أخرجه البخاري في: 65 كتاب التفسير: 33 سورة الأحزاب: 7 باب قوله (ترجي من تشاء منهن)
942. హజ్రత్ ముఆజ్ (రహిమహుల్లాహ్) కథనం:- హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) యిలా తెలిపారు “(అల్లాహ్ తన ప్రవక్తను ఉద్దేశించి) ‘నీ భార్యలలో నీవు కోరుకున్న వారిని నీతో పాటు ఉంచుకోవడానికి, నీవు కోరిన వారిని నీ నుండి వేరు చేయడానికి, నీవు కోరిన వారిని వేరుపరచిన మీదట తిరిగి నీ వద్దకు రప్పించుకోవటానికి నీకు అధికారం ఇవ్వబడుతోంది. ఈ విషయంలో నీ పై ఎలాంటి నిందలేదు’ అన్న ఆయతును అవతరింపజేశాడు. ఈ సూక్తి అవతరించిన తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాలో ఎవరో ఒక భార్య వంతు వచ్చిన రోజు మరో భార్య దగ్గర ఉండటానికి అనుమతి అడిగేవారు”.
హజ్రత్ ముఆజ్ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు. నేను హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా)ను, “అప్పుడు మీరేమని సమాధానమిచ్చారు?” అని అడిగాను. అందుకామె ఇలా అన్నారు. నేను “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో ‘దైవప్రవక్తా! నాకా అధికారం ఇస్తే, మీ సాంగత్య భాగ్యాన్ని మరొక స్త్రీకి సమర్పించాలని నేను ఎన్నటికీ కోరుకోను’ అని అంటుండేదాన్ని”.
[సహీహ్ బుఖారీ : 65వ ప్రకరణం – అత్తఫ్సీర్, 33 – అహ్జాబ్ సూరా, 7వ అధ్యాయం – తుర్జీమన్ తషావుమిన్ హున్న]
943 – حديث عَائِشَةَ، قَالَتْ: خَيَّرَنَا رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَاخْتَرْنَا الله وَرَسُولَهُ، فَلَمْ يَعُدَّ ذَلِكَ عَلَيْنَا شَيْئًا
__________
أخرجه البخاري في: 68 كتاب الطلاق: 5 باب من خير نساءه
943. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాకు (ఆయన నుండి విడాకులు తీసుకోవడానికి లేదా తీసుకోకపోవడానికి) అధికారం ఇచ్చినపుడు మేము అల్లాహ్ ను, దైవప్రవక్తనే కోరుకున్నాము. ఆ అధికారం లభించిన తరువాత ఆయన మా విషయంలో (విడాకులు మొదలైన) ఎలాంటి ఆలోచనకు తావీయలేదు.
[సహీహ్ బుఖారీ : 68వ ప్రకరణం – తలాఖ్, 5వ అధ్యాయం – మన్ ఖయ్యరిన్నిసా]
في الإيلاء واعتزال النساء وتخييرهن وقوله تعالى (وإِن تظاهرا عليه)
5వ అధ్యాయం – భార్యకు దూరంగా ఉంటానని ప్రమాణం చేయడం గురించి
944 – حديث عُمَرَ بْنِ الْخَطَّابِ عَنِ ابْنِ عَبَّاسٍ، قَالَ: مَكَثْتُ سَنَةً أُرِيدُ أَنْ أَسْأَلَ عُمَرَ بْنَ الْخَطَّابِ عَنْ آيَةٍ، فَمَا أَسْتَطِيعُ أَنْ أَسْأَلَهُ هَيْبَةً لَهُ؛ حَتَّى خَرَجَ حَاجًّا فَخَرَجْتُ مَعَهُ، فَلَمَّا رَجَعْتُ، وَكُنَّا بِبَعْضِ الطَّرِيقِ، عَدَلَ إِلَى الأَرَاكِ لِحَاجَةٍ لَهُ، قَالَ: فَوَقَفْتُ لَهُ حَتَّى فَرَغَ، ثُمَّ سِرْتُ مَعَهُ فَقُلْتُ: يَا أَمِيرَ الْمُؤْمِنِينَ مَنِ اللَّتَانِ تَظَاهَرَتَا عَلَى النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مِنْ أَزْوَاجِهِ فَقَالَ: تِلْكَ حَفْصَةُ وَعَائِشَةُ قَالَ: فَقُلْتُ: وَاللهِ إِنْ كُنْتُ لأُرِيدُ أَنْ أَسْأَلَكَ عَنْ هذَا مُنْذُ سَنَةٍ فَمَا أَسْتَطِيعُ هَيْبَةً لَكَ قَالَ: فَلاَ تَفْعَلْ؛ مَا ظَنَنْتَ أَنَّ عِنْدِي مِنْ عِلْمٍ فَاسْأَلْنِي، فَإِنْ كَانَ لِي عِلْمٌ خَبَّرْتُكَ به قَالَ ثُمَّ قَالَ عُمَرُ: وَاللهِ [ص:116] إِنْ كُنَّا فِي الْجَاهِلَيَّةِ مَا نَعُدُّ لِلنِّسَاءِ أَمْرًا حَتَّى أَنْزَلَ اللهُ فِيهِنَّ مَا أَنْزَلَ، وَقَسَمَ لَهُنَّ مَا قَسَمَ؛ قَالَ: فَبَيْنَا أَنَا فِي أَمْرٍ أَتَأَمَّرُهُ، إِذْ قَالَتْ امْرَأَتِي: لَوْ صَنَعْتَ كَذَا وَكَذا قَالَ فَقُلْتُ لَهَا: مَا لَكِ وَلِمَا ههُنَا، فِيمَا تَكَلُّفُكِ فِي أَمْرٍ أُرِيدُهُ فَقَالَتْ لِي: عَجَبًا لَكَ يَا ابْنَ الْخَطَّابِ مَا تُرِيدُ أَنْ تُرَاجَعَ أَنْتَ، وَإِنَّ ابْنَتَكَ لَتُرَاجِعُ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ حَتَّى يَظَلَّ يَوْمَهُ غَضْبَانَ فَقَامَ عُمَرُ فَأَخَذَ رِدَاءَهُ مَكَانَهُ حَتَّى دَخَلَ عَلَى حَفْصَةَ؛ فَقَالَ لَهَا: يَا بُنَيَّةُ إِنَّكِ لَتُرَاجِعِينَ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ حَتَّى يَظَلَّ يَوْمَهُ غَضْبَانَ فَقَالَتْ حَفْصَةُ: وَاللهِ إِنَّا لَنُرَاجِعُهُ فَقُلْتُ: تَعْلَمِينَ أَنِّي أُحَذِّرُكِ عُقُوبَةَ اللهِ وَغَضَبَ رَسُولِهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، يَا بُنَيَّةُ لاَ يَغُرَّنَّكَ هذِهِ الَّتي أَعْجَبَهَا حُسْنُهَا حُبُّ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِيَّاهَا (يُريدُ عَائِشَةَ)
قَالَ، ثُمَّ خَرَجْتُ حَتَّى دَخَلْتُ عَلَى أُمَّ سَلَمَةَ، لِقَرَابَتِي مِنْهَا، فَكَلَّمْتُهَا؛ فَقَالَتْ أُمُّ سَلَمَةَ: عَجَبًا لَكَ يَا ابْنَ الْخَطَّابِ دَخَلْتَ فِي كُلِّ شَيْءٍ حَتَّى تَبْتَغِي أَنْ تَدْخُلَ بَيْنَ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَأَزْوَاجِهِ فَأَخَذَتْنِي، وَاللهِ أَخْذًا كَسَرَتْنِي عَنْ بَعْضِ مَا كُنْتُ أَجِدُ، فَخَرَجْتُ مِنْ عِنْدِهَا
وَكَانَ لِي صَاحِبٌ مِنَ الأَنْصَارِ، إِذَا غِبْتُ أَتَانِي بِالخَبَرِ، وَإِذَا غَابَ كُنْتُ أَنَا آتِيهِ بِالْخَبَرِ؛ وَنَحْنُ نَتَخَوَّفُ مَلِكًا مِنْ مُلُوكِ غَسَّانَ ذُكِرَ لَنَا أَنَّهُ يُرِيدُ أَنْ يَسيرَ إِلَيْنَا، فَقَدِ امْتَلأَتْ صُدُورُنَا مِنْهُ فَإِذَا صَاحِبِي الأَنْصَارِيُّ يَدُقُّ الْبَابَ؛ فَقَالَ: افْتَحْ افْتَحْ [ص:117] فَقُلْتُ: جَاءَ الْغَسَّانِيُّ فَقَالَ: بَلْ أَشَدُّ مِنْ ذَلِكَ، اعْتَزَلَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَزْوَاجَهُ؛ فَقُلْتُ: رَغَمَ أَنْفُ حَفْصَةَ وَعائِشَةَ فَأَخَذْتُ ثَوْبِي فَأَخْرُجُ حَتَّى جِئْتُ فَإِذَا رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فِي مَشْرُبَةٍ لَهُ يَرْقَى عَلَيْهَا بِعَجَلَةٍ، وَغُلاَمٌ لِرَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَسْوَدُ عَلَى رَأْسِ الدَّرَجَةِ؛ فَقُلْتُ لَهُ: قُلْ هذَا عُمَرُ بْنُ الْخَطَّابِ، فَأَذِنَ لِي قَالَ عُمَرُ: فَقَصَصْتُ عَلَى رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ هذَا الْحَدِيثَ، فَلَمَّا بَلَغْتُ حَدِيثَ أُمِّ سَلَمَةَ تَبَسَّمَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَإِنَّهُ لَعَلَى حَصِيرٍ مَا بَيْنَهُ وَبَيْنَهُ شَيْءٌ، وَتَحْتَ رَأْسِهِ وِسَادَةٌ مِنْ أَدَمٍ حَشْوُهَا لِيفٌ، وَإِنَّ عِنْدَ رِجْلَيْهِ قَرَظًا مَصْبُوبًا، وَعِنْدَ رَأْسِهِ أَهَبٌ مُعَلَّقَةٌ؛ فَرَأَيْتُ أَثَرَ الْحَصِيرِ فِي جَنْبِهِ، فَبَكَيْتُ؛ فَقَالَ: مَا يُبْكِيكَ فَقُلْتُ: يَا رَسُولَ اللهِ إِنَّ كِسْرى وَقَيْصَرَ فِيمَا هُمَا فِيهِ، وَأَنْتَ رَسُولُ اللهِ فَقَالَ: أَمَا تَرْضى أَنْ تَكُونَ لَهُمُ الدُّنْيا وَلَنَا الآخِرَةُ
__________
أخرجه البخاري في: 65 كتاب التفسير: 66 سورة التحريم: 2 باب (تبتغي مرضاة أزواجك)
944. హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం:- నేను ఓ సూక్తిని గురించి ఒక సంవత్సరం నుండి హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు)ని అడిగి తెలుసుకోవాలని అనుకుంటూ ఉండేవాడ్ని. కాని ఆయన వ్యక్తిత్వంలోని గాంభీర్యతకు భయపడి అడగలేకపోయేవాడ్ని. చివరికి ఆయన హజ్ యాత్రకు బయలుదేరితే నేను కూడా ఆయన వెంట వెళ్ళాను. తిరుగు ప్రయాణంలో ఒక చోట హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఒంటె దిగి (మూత్ర విసర్జన కోసం) దారి పక్కన గల పీలూ చెట్ల చాటుకు పోయారు. నేను ఆయన కోసం నిరీక్షిస్తూ ఆగిపోయాను. కాస్సేపటికి ఆయన పని ముగించుకొని వచ్చారు. (మేము తిరిగి బయలుదేరాము).
అప్పుడు నేను ఆయనతో పాటు నడుస్తూ “దైవప్రవక్త భార్యలలో ఇద్దరు ఒక విషయంలో పరస్పరం సంప్రదించుకొని ఏకాభిప్రాయానికి వచ్చారు కదా, ఆ ఇద్దరు ఎవరు?” అని అడిగాను. దానికి హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) “హజ్రత్ హఫ్సా (రదియల్లాహు అన్హా), హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా)” అని అన్నారు. ఆ తర్వాత నేను హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు)తో “అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, నేనీ విషయం గురించి మిమ్మల్ని ఒక సంవత్సరం నుంచి అడగాలని అనుకుంటూ ఉండేవాడ్ని. కాని మీ గంభీర వ్యక్తిత్వానికి భయపడి అడగలేకపోయాను” అని అన్నాను. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఈ మాట విని “ఇక ముందు అలా చేయకు. ఏదైనా విషయం నాకు తెలుసని నీవు భావిస్తే నన్ను తప్పకుండా అడుగు. నాకు తెలిసి ఉంటే నీకు తెలియజేస్తాను” అని అన్నారు.
ఆ తర్వాత ఆయన (విషయాన్ని వివరిస్తూ) ఇలా అన్నారు:- అజ్ఞాన కాలంలో మాకు స్త్రీల వాస్తవస్థానం ఏమిటో బొత్తిగా తెలియదు. చివరికి అల్లాహ్ స్త్రీలను గురించి అవతరింపజేయవలసిన ఆజ్ఞలేమిటో అవతరింపజేశాడు. వారికి రావలసిన హక్కు లేమిటో ఇప్పించాడు – ఓ రోజు నేను ఏదో నా పని విషయంలో దీర్ఘంగా ఆలోచిస్తుంటే, నా భార్య వచ్చి ‘మీరిలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది’ అని అన్నది. నేను (మండిపడుతూ) “నీకిలా మాట్లాడే అధికారం ఎవరిచ్చారు? అసలు నువ్విక్కడికెందుకొచ్చావు? నేను చేయదలచుకున్న పనిలో నువ్వెందుకు అనవసరంగా తలదూర్చబోతావు?” అని అన్నాను. దానికామె ఇలా అన్నది – “ఉమర్! మీ ధోరణి చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. మిమ్మల్నెవరూ ఏ విషయంలోనూ ప్రశ్నించకూడదని, అసలు మీ ముందు నిలబడి ఎవరూ మాట్లాడకూడదని మీరు కోరుకుంటున్నారు. కాని మీ కూతురేమో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ప్రశ్నిస్తుంది, సమాధానం రాబడుంది. ఒక్కోసారి పరిస్థితి చాలా తీవ్రంగా మారి ఆ రోజంతా ఎడమోహం పెడమొహంగా తయారవుతోంది పరిస్థితి.”
హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:- నేనీ మాట విని తక్షణమే నా దుప్పటి తీసుకొని లేచి నిలబడ్డాను. సరాసరి (నా. కూతురు) హఫ్సా (రదియల్లాహు అన్హా) ఇంటికి వెళ్ళి “అమ్మాయ్! నువ్వు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ఎదురు తిరుగుతున్నావా? నీ మాటలవల్ల (ఒక్కోసారి) ఆయన అలిగి రోజంతా ముభావంగా ఉండటం కూడా జరుగుతున్నదా?” అని అడిగాను. దానికామె “అల్లాహ్ సాక్షి! మేము ఆయన్ని ప్రశ్నిస్తుంటాము, సమాధానం రాబడుతుంటాము కూడా” అని అన్నది. “(అమ్మాయ్!) బాగా గుర్తుంచుకో (పరలోక పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి). నేను నిన్ను అల్లాహ్ శిక్ష గురించి, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆగ్రహం గురించి హెచ్చరిస్తున్నాను. (నీ వైఖరి మార్చుకోకపోతే నాశనమవుతావు!) ఏ స్త్రీ తన అందాన్ని, ప్రవక్త ప్రేమను చూసుకొని మురిసిపోతున్నదో ఆమెను చూసి నువ్వు మోసపోకూడదు” అని చెప్పాను నేను.
ఆ తరువాత నేను హఫ్సా (రదియల్లాహు అన్హా) ఇంటి నుండి బయలుదేరి, నేరుగా హజ్రత్ ఉమ్మె సల్మా (రదియల్లాహు అన్హా) ఇంటికి చేరుకున్నాను. ఆమె నాకు బంధువు కూడా అవుతుంది. నేనామెతో కూడా ఈ విషయం గురించి మాట్లాడాను. హజ్రత్ ఉమ్మె సల్మా (రదియల్లాహు అన్హా) నా మాటలు విని (ఒకింత కోపం వెలిబుచ్చుతూ) “నీ ధోరణి చాలా వింతగా ఉంది. నువ్వు ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటున్నావు. చివరికి నువ్విప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) భార్యల వ్యవహారంలో కూడా తలదూర్చడానికి సిద్ధమయ్యావన్నమాట” అని అన్నది. ఆమె తీవ్ర స్వరంతో పలికిన వాడి మాటలు నా నోటికి తాళం వేశాయి. నా కోపం చల్లబడిపోయింది. అక్కడ్నుంచి నేను (మారు మాట్లాడకుండా) వెళ్ళిపోయాను.
ఆ రోజుల్లో నా పొరుగులో ఒక అన్సారీ స్నేహితుడుండేవాడు. నేను దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వెళ్ళలేకపోయినప్పుడు అతను అక్కడి సమాచారమంతా సేకరించి నాకు విన్పించేవాడు. అతను వెళ్ళనప్పుడు నేను సమాచారం సేకరించి అతనికి విన్పించేవాడ్ని. ఆ రోజుల్లోనే గస్సాన్ ప్రాంతానికి చెందిన ఒక రాజు గురించిన భయం మమ్మల్ని పట్టి పీడించసాగింది. అతను మాపై దాడి చేయడానికి సమాయత్తమవుతున్నాడన్న వార్త (కార్చిచ్చులా) ప్రాకిపోవడంతో మేము అనుక్షణం ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బిక్కుబిక్కు మంటూ ఉండేవాళ్ళం. ఓ రోజు ఉన్నట్టుండి హఠాత్తుగా అన్సారీ మిత్రుడు వచ్చి మా ఇంటి తలుపులు దబా దబా తడూ ‘తెరవండీ, తెరవండీ’ అంటూ అరిచాడు. నేను (కంగారు పడుతూ బయటికి వచ్చి, “ఏమిటీ గస్సాన్ రాజు వచ్చేశాడా?” అని అడిగాను. “లేదు, అంతకంటే పెద్ద ఘోరమే జరిగిపోయింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు తమ భార్యల నుండి వేరయి పోయారు” అన్నాడతను. “హఫ్సా (రదియల్లాహు అన్హా), ఆయిషా (రదియల్లాహు అన్హా)ల ముక్కుకు మన్ను తగల! (ఇదంతా వాళ్ళిద్దరి నిర్వాకమే)”. నా నోట (అప్రయత్నంగా) ఈ మాటలు వెలువడ్డాయి.
ఆ తరువాత నేను (ఆదరాబాదరాగా) బట్టలు వేసుకొని ఇంటి నుంచి బయలుదేరాను. చివరికి నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి చేరుకున్నాను. విచారిస్తే ఆయన పై అంతస్తులో ఉన్నారని తెలిసింది. పైకి ఎక్కడానికి అక్కడ ఒక నిచ్చెన ఉంది. ఆ నిచ్చెన మీద ప్రవక్త గారి నీగ్రో బానిస నిల్చున్నాడు. నేనతనితో “ఖత్తాబ్ కొడుకు ఉమర్ వచ్చాడని ఆయనకు చెప్పు” అని అన్నాను. అలా నాకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన దగ్గరికి రావడానికి అనుమతిచ్చారు.
నేను జరిగిన వృత్తాంతమంతా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు విన్పించాను. చివర్లో నేను ఉమ్మెసల్మా (రదియల్లాహు అన్హా) సంగతి వినిపించినపుడు ఆయన చిరునవ్వు చిందించారు. ఆ సమయంలో ఆయన ఒక చాప మీద పడుకొని ఉన్నారు. ఆ చాపకు, ఆయన దేహానికి మధ్య ఎలాంటి అడ్డు (పడక) లేదు. కాకపోతే తల క్రింద ఖర్జూరపు బెరడుతో నిండిన ఒక తోలు తలగడ మాత్రం ఉంది. ఆయన కాళ్ళ దగ్గర ‘సలమ్’ * ఆకుల కుప్పు ఉంది. తలగడ వైపు ముడిచర్మాలు కొన్ని వ్రేలాడదీసి ఉన్నాయి. ఆయన ఒంటి మీద చాప (ఈనెల) గుర్తులు పడి వున్నాయి. వాటిని చూడగానే నాకు దుఃఖం ముంచుకొచ్చింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నా వైపు చూసి, “ఎందుకు దుఃఖిస్తున్నావు?” అని అడిగారు. “దైవప్రవక్తా! ఈరాన్, రోము చక్రవర్తులు భోగభాగ్యాల్లో తేలియాడుతూ ఉంటే, మీరు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అయి ఉండి కూడా ఈ (దైన్య) స్థితిలో ఉండటమా?” అన్నాను నేను (కళ్ళు తుడుచుకుంటూ). దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ మాటలు విని “వాళ్ళకు క్షణభంగురమైన ఇహలోకం మాత్రమే ఉంటే, మనకు శాశ్వత సుఖాన్నిచ్చే] పరలోకం ఉంది. ఈ విషయం మీకు సంతోషం కలిగించడం లేదా?” అని అన్నారు.
* అరేబియాలో ఇది ఒక రకమైన చెట్టు పేరు. దీని ఆకులు చర్మం పదును చేయడానికి ఉపయోగపడతాయి.
[సహీహ్ బుఖారీ : 65వ ప్రకరణం – అత్తఫ్సీర్, 66 – తహ్రీం సూరా, 2వ అధ్యాయం – తబ్ తగీ మర్దాత అజ్వాజిక]
945 – حديث عُمَرَ عَنْ عَبْدِ اللهِ بْنِ عَبَّاسٍ، قَالَ: لَمْ أَزَلْ حَرِيصًا عَلَى أَنْ أَسْأَلَ عُمَرَ ابْنَ الْخَطَّابِ عَنِ الْمَرْأَتَيْنِ مِنْ أَزْوَاجِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ اللَّتَيْنِ قَالَ اللهُ تَعَالى (إِنْ تَتُوبَا إِلَى اللهِ فَقَدْ صَغَتْ قُلُوبُكُمَا) حَتَّى حَجَّ وَحَجَجْتُ مَعَهُ، وَعَدَلَ وَعَدَلْتُ مَعَهُ بِإِدَاوَةٍ، فَتَبَرَّزَ، ثُمَّ جَاءَ فَسَكَبْتُ عَلَى يَدَيْهِ مِنْهَا فَتَوَضَّأَ؛ فَقُلْتُ لَهُ: يَا أَمِيرَ الْمُؤْمِنِينَ مَنِ الْمَرْأَتَانِ مِنْ أَزْوَاجِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ اللَّتَانَ قَالَ اللهُ تَعَالَى (إِنْ تَتُوبَا إِلَى اللهِ فَقَدْ صَغَتْ قُلُوبُكُمَا) قَالَ: وَاعَجَبًا لَكَ يَا ابْنَ عَبَّاسٍ هُمَا عَائِشَةُ وَحَفْصَة [ص:118] ثُمَّ اسْتَقْبَلَ عُمَرُ الْحَدِيثَ يَسُوقُهُ، قَالَ: كُنْتُ أَنَا وَجَارٌ لِي مِنَ الأَنْصَارِ فِي بَنِي أُمَيَّةَ بْنِ زَيْدٍ، وَهُمْ مِنْ عَوَالِي الْمَدِينَةِ، وَكُنَّا نَتَنَاوَبُ النُّزُولَ عَلَى النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَيَنْزِلُ يَوْمًا وَأَنْزِلُ يَوْمًا، فَإِذَا نَزَلْتُ جِئْتُهُ بِمَا حَدَثَ مِنْ خَبَرِ ذَلِكَ الْيَوْمِ مِنَ الْوَحْيِ أَوْ غَيْرِهِ، وَإِذَا نَزَلَ فَعَلَ مِثْلَ ذَلِكَ؛ وَكُنَّا، مَعْشَرَ قُرَيْشٍ، نَغْلِبُ النِّسَاءَ؛ فَلَمَّا قَدِمْنَا عَلَى الأَنْصَارِ إِذَا قَوْمٌ تَغْلِبُهُمْ نِسَاؤُهُمْ، فَطَفِقَ نِسَاؤُنَا يَأْخُذْنَ مِنْ أَدَبِ الأَنْصَارِ؛ فَصَخِبْتُ عَلَى امْرَأَتِي فَرَاجَعَتْنِي، فَأَنْكَرْتُ أَنْ تُرَاجِعَنِي؛ قَالَتْ: وَلِمَ تُنْكِرُ أَنْ أُرَاجِعَكَ فَوَاللهِ إِنَّ أَزْوَاجَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ لَيُرَاجِعْنَهُ، وَإِنَّ إِحْدَاهُنَّ لَتَهْجُرُهُ الْيَوْمَ حَتَّى اللَّيْلِ، فَأَفْزَعَنِي ذَلِكَ، وَقُلْتُ لَهَا: قَدْ خَابَ مَنْ فَعَلَ ذَلِكَ مِنْهُنَّ
ثُمَّ جَمَعْتُ عَلَيَّ ثِيَابِي، فَنَزَلْتُ فَدَخَلْتُ عَلَى حَفْصَةَ؛ فَقُلْتُ لَهَا: أَيْ حَفْصَةُ أَتُغَاضِبُ إِحْدَاكُنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ الْيَوْمَ حَتَّى اللَّيْلِ قَالَتْ: نَعَمْ فَقُلْتُ: قَدْ خِبْتِ وَخَسِرْتِ، أَفَتَأْمَنِينَ أَنْ يَغْضَبَ اللهُ لِغَضَبِ رَسُولِهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَتَهْلِكِي لاَ تَسْتَكْثِرِي النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَلاَ تُرَاجِعِيهِ فِي شَيْءٍ وَلاَ تَهْجُرِيهِ، وَسَلِينِي مَا بَدَا لَكِ، وَلاَ يَغُرَّنَّكَ أَنْ كَانَتْ جَارَتُكِ أَوْضَأَ مِنْكِ وَأَحَبَّ إِلَى النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ (يُرِيدُ عَائِشَةَ)
قَالَ عُمَرُ: وَكُنَّا قَدْ تَحَدَّثْنَا أَنَّ غَسَّانَ تُنْعِلُ الْخَيْلَ لِغَزْوِنَا، فَنَزَلَ صَاحِبِي الأَنْصَارِيُّ يَوْمَ نَوْبَتِهِ، فَرَجَعَ إِلَيْنَا عِشَاءً، فَضَرَبَ بَابِي ضَرْبًا شَدِيدًا؛ وَقَالَ: أَثَمَّ هُوَ فَفَزِعْتُ، فَخَرَجْتُ إِلَيْهِ؛ فَقَالَ: قَدْ حَدَثَ الْيَوْمَ أَمْرٌ عَظِيمٌ، قُلْتُ: مَا هُوَ، أَجَاءَ غَسَّان قَالَ: لاَ، [ص:119] بَلْ أَعْظَمُ مِنْ ذَلِكَ وَأَهْوَلُ، طَلَّقَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ نِسَاءَهُ؛ فَقُلْتُ: خَابَتْ حَفْصَةُ وَخَسِرَتْ، قَدْ كُنْتُ أَظُنُّ هذَا يُوشِكُ أَنْ يَكُونَ فَجَمَعْتُ عَلَيَّ ثِيَابِي، فَصَلَّيْتُ صَلاَةَ الْفَجْرِ مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَدَخَلَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مَشْرُبَةً لَهُ، فَاعْتَزَلَ فِيهَا، وَدَخَلْتُ عَلَى حَفْصَةَ فَإِذَا هِيَ تَبْكِي؛ فَقُلْتُ: مَا يُبْكِيكِ أَلَمْ أَكُنْ حَذَّرْتُكِ هذَا أَطَلَّقَكنَّ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَتْ: لاَ أَدْرِي، هَا هُوَ ذَا مُعْتَزِلٌ فِي الْمَشْرُبَةِ فَخَرَجْتُ فَجِئْتُ إِلَى الْمِنْبَرِ، فَإِذَا حَوْلَهُ رَهْطٌ، يَبْكِي بَعْضُهُمْ؛ فَجَلَسْتُ مَعَهُمْ قَلِيلاً، ثُمَّ غَلَبَنِي مَا أَجِدُ، فَجِئْتُ الْمَشْرُبَةَ الَّتِي فِيهَا النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقُلْتُ لِغُلاَمٍ لَهُ أَسْوَدَ، اسْتَأْذِنْ لِعُمَرَ؛ فَدَخَلَ الْغُلاَمُ، فَكَلَّمَ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، ثُمَّ رَجَعَ، فَقَالَ: كَلَّمْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَذَكَرْتُكَ لَهُ فَصَمَتَ؛ فَانْصَرَفْتُ، حَتَّى جَلَسْتُ مَعَ الرَّهْطِ الَّذِينَ عِنْدَ الْمِنْبَرِ ثُمَّ غَلَبَنِي مَا أَجِدُ، فَجِئْتُ فَقْلتُ لِلْغُلاَمِ اسْتَأْذِنْ لِعُمَرَ؛ فَدَخَلَ ثُمَّ رَجَعَ، فَقَالَ: قَدْ ذَكَرْتُكَ لَهُ فَصَمَتَ؛ فَرَجَعْتُ فَجَلَسْتُ مَعَ الرَّهْطِ الَّذِينَ عِنْدَ الْمِنْبَرِ ثُمَّ غَلَبَنِي مَا أَجِدُ فَجِئْتُ الْغُلاَمَ، فَقُلْتُ: اسْتَأْذِنْ لِعُمَرَ؛ فَدَخَلَ ثُمَّ رَجَعَ إِلَيَّ فَقَالَ: قَدْ ذَكَرْتُكَ لَهُ فَصَمَتَ؛ فَلَمَّا وَلَّيْتُ مُنْصَرِفًا (قَالَ) إِذَا الْغُلاَمُ يَدْعُونِي فَقَالَ: قَدْ أَذِنَ لَكَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ
فَدَخَلْتُ عَلَى رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَإِذَا هُوَ مُضْطَجِعٌ عَلَى رِمَالِ حَصِيرٍ لَيْسَ بَيْنَهُ وَبَيْنَهُ فِرَاشٌ، قَدْ أَثَّرَ الرِّمَالُ بِجَنْبِهِ، مَتَّكِئًا عَلَى وِسَادَةٍ مِنْ أَدَمٍ، حَشْوُهَا لِيفٌ؛ فَسَلَّمْتُ عَلَيْهِ ثُمَّ قُلْتُ، وَأَنَا قَائِمٌ: يَا رَسُولَ اللهِ أَطَلَّقْتَ نِسَاءَكَ فَرَفَعَ إِلَيَّ بَصَرَهُ، فَقَالَ: لاَ، فَقُلْتُ: اللهُ أَكْبَرُ ثُمَّ قُلْتُ، وَأَنَا قَائِمٌ: أَسْتَأْنِسُ، يَا رَسُولَ اللهِ لَوْ رَأَيْتَنِي، وَكُنَّا، مَعْشَرَ قُرَيْشٍ، نَغْلِبُ النِّسَاءَ، فَلَمَّا قَدِمْنَا الْمَدِينَةَ، إِذَا قَوْمٌ تَغْلِبُهُمْ نِسَاؤُهُمْ؛ [ص:120] فَتَبَسَّمَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ ثُمَّ قُلْتُ: يَا رَسُولَ اللهِ لَوْ رَأَيْتَنِي، وَدَخَلْتُ عَلَى حَفْصَةَ، فَقُلْتُ لَهَا: لاَ يَغُرَّنَّكِ أَنْ كَانَتْ جَارَتُكِ أَوْضَأَ مِنْكِ وَأَحَبَّ إِلَى النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ (يُرِيدُ عَائِشَةَ) فَتَبَسَّمَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ تَبَسُّمَةً أُخْرَى؛ فَجَلَسْتُ حِينَ رَأَيْتُهُ تَبَسَّمَ، فَرَفَعْتُ بَصَرِي فِي بَيْتِهِ، فَواللهِ مَا رَأَيْتُ فِي بَيْتِهِ شَيْئًا يَرُدُّ الْبَصَرَ غَيْرَ أَهَبَةٍ ثَلاَثَةٍ فَقُلْتُ: يَا رَسُولَ اللهِ ادْعُ اللهَ فَلْيُوَسِّعْ عَلَى أُمَّتِكَ، فَإِنَّ فَارِسًا وَالرُّومَ قَدْ وُسِّعَ عَلَيْهِمْ، وَأُعْطُوا الدُّنْيَا وَهُمْ لاَ يَعْبُدُونَ اللهَ
فَجَلَسَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَكَانَ مُتَّكِئًا، فَقَالَ: أَوَ فِي هذَا أَنْتَ يَا ابْنَ الْخَطَّابِ إِنَّ أُولئِكَ قَوْمٌ عُجِّلُوا طَيِّبَاتِهِمْ فِي الْحَيَاةِ الدُّنْيَا فَقُلْتُ: يَا رَسُولَ اللهِ اسْتَغْفِرْ لِي
فَاعْتَزَلَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ نِسَاءَهُ مِنْ أَجْلِ ذلِكَ الْحَدِيثِ، حِينَ أَفْشَتْهُ حَفْصَةُ إِلَى عَائِشَةَ، تِسْعًا وَعِشْرِينَ لَيْلَةً، وَكَانَ قَالَ: مَا أَنَا بِدَاخِلٍ عَلَيْهِنَّ شَهْرًا مِنْ شِدَّةِ مَوْجِدَتِهِ عَلَيْهِنَّ، حِينَ عَاتَبَهُ اللهُ
فَلَمَّا مَضَتْ تِسْعٌ وَعِشْرُونَ لَيْلَةً، دَخَلَ عَلَى عَائِشَةَ فَبَدَأَ بِهَا، فَقَالَتْ لَهُ عَائِشَةُ: يَا رَسُولَ اللهِ إِنَّكَ كُنْتَ قَدْ أَقْسَمْتَ أَنْ لاَ تَدْخُلَ عَلَيْنَا شَهْرًا، وَإِنَّمَا أَصْبَحْتَ مِنْ تِسْعٍ وَعِشْرِينَ لَيْلَةً أَعُدُّهَا عَدًّا فَقَالَ: الشَّهْرُ تِسْعٌ وَعِشْرُونَ
فَكَانَ ذلِكَ الشَّهْرُ تِسْعًا وَعِشْرِينَ لَيْلَةً قَالَتْ عَائِشَةُ: ثُمَّ أَنْزَلَ اللهُ تَعَالَى آيَةَ التَّخَيُّرِ، فَبَدَأَ بِي أَوَّلَ امْرَأَةٍ مِنْ نِسَائِهِ فَاخْتَرْتُهُ ثُمَّ خَيَّرَ نِسَاءَهُ كُلَّهُنَّ، فَقُلْنَ مِثْلَ مَا قَالَتْ عَائِشَةُ
__________
أخرجه البخاري في: 67 كتاب النكاح: 83 باب موعظة الرجل ابنته لحال زوجها
945. హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) భార్యలలో ఇద్దరి గురించి “మీరిద్దరు. పశ్చాత్తాప హృదయంతో అల్లాహ్ ను క్షమాపణ కోరుకోండి. (అందులోనే మీ శ్రేయస్సు ఉంది)” అన్న దైవసూక్తి (66:4) అవతరించింది కదా! దాని గురించి నేను హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు)ని చాలా కాలం నుంచి అడుగుదామనుకుంటూ ఉండేవాడ్ని. (కాని అవకాశం లభించలేదు.) చివరికి హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) హజ్ యాత్రకు వెళ్తుంటే నేను కూడ ఆయన వెంట బయలుదేరాను. (తిరుగు) ప్రయాణంలో ఒకచోట ఆయన దారి ప్రక్కన ఒక వైపుకు వెళ్ళారు. నేను కూడా నీళ్ళ తిత్తి తీసుకొని అటువైపు వెళ్ళాను. అక్కడ ఆయన (మూత్రవిసర్జన) పని ముగించుకొని వెనక్కి వచ్చేశారు. అప్పుడు నేను తోలుతిత్తితో ఆయన చేతుల పై నీళ్ళు పోస్తే ఆయన వుజూ చేసుకున్నారు.
నేనీ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ “అమీరుల్ మోమినీన్! ప్రవక్త భార్యలను గురించి “మీరిద్దరు పశ్చాత్తాపంతో అల్లాహ్ ను క్షమాపణ కోరుకోండి’ అని అవతరించిన దైవసూక్తిలో ‘ఇద్దరు స్త్రీలు’ ఎవరూ?” అని అడిగాను. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) (నా వైపు వింతగా చూస్తూ) “ఇబ్నె అబ్బాస్! నీ ధోరణి చాలా ఆశ్చర్యకరంగా ఉంది. (ఇన్నాళ్ళ నుంచి నన్నీ విషయం ఎందుకు అడగలేదు?) వారిద్దరూ హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా), హజ్రత్ హఫ్సా (రదియల్లాహు అన్హా)” అని అన్నారు.
ఆ తర్వాత హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) విషయాన్ని వివరంగా చెబుతూ ఇలా అన్నారు – నేను, నా పొరుగింటి అన్సారీ మిత్రుడు ఇద్దరం ‘బనీ ఉమయ్య బిన్ జైద్’ వాడలో నివసిస్తూ ఉండేవాళ్ళము. బనీ ఉమయ్య తెగ మదీనా శివార్లలో ఉండేది. మేమిద్దరం వంతుల వారీగా ఒకరి తరువాత మరొకరు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వెళ్తుండే వాళ్ళము. అంటే ఒక రోజు నేను వెళ్తే మరొక రోజు అతను వెళ్ళేవాడన్నమాట. నేను వెళ్ళొచ్చినప్పుడు ఆ రోజు జరిగిన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దివ్యసందేశం అవతరించడం వగైరా విశేషాలన్నీ అతనికి తెలియజేసేవాణ్ణి. అలాగే అతను ప్రవక్త దగ్గరకి వెళ్ళిస్తే ఆనాటి విశేషాలు తెచ్చి నాకు విన్పించేవాడు.
(పూర్వం) మా ఖురైష్ తెగ పురుషులు స్త్రీలపై ఆధిక్యత కలిగి ఉండేవారు. (అంటే మాది పురుషాధిక్యతా సమాజమన్న మాట). అయితే మేము (మదీనాలో) అన్సార్ల దగ్గరికి వచ్చి చూస్తే ఇక్కడ పురుషులపై స్త్రీలు ఆధిక్యత కలిగి ఉన్నారు. మేమిక్కడికి వచ్చిన తర్వాత మా స్త్రీలు కూడా అన్సారీ స్త్రీల వైఖరిని అనుసరించడం ప్రారంభించారు. ఓ రోజు ఒక విషయంలో నేను నా భార్యను గద్దిస్తే ఆమె నాకు ఎదురు సమాధానమిచ్చింది. దాంతో నేను (ఒళ్ళుమండిపోయి) కోపాన్ని వెళ్ళగక్కాను. అది విని ఆమె ఇలా అన్నది: “నా సమాధానం విని మీరెందుకు అంత కోపగించుకుంటారు? కాని అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ఆయన భార్యలు కూడా ఎదురు సమాధానాలిస్తుంటారు. ఒక్కోసారి వారిలో ఒక భార్య అయితే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మీద అలిగి ఒక పగలు రాత్రీ ముభావంగా ఉండిపోతుంది (తెలుసా?)”
ఈ మాట విని నేను చాలా ఆందోళన పడ్డాను. “ప్రవక్త భార్యలలో ఎవరైనా ఇలా ప్రవర్తించారంటే ఆమె ఘోర నష్టంలో పడిపోయినట్లే” అన్నాను నేను.
ఆ తర్వాత నేను (వెంటనే) బట్టలు వేసుకొని బయలుదేరాను. నేను (మా వాడ గుట్టలు) దిగి మొదట హఫ్సా (రదియల్లాహు అన్హా) ఇంటికెళ్ళాను. నేను (పోయి పోగానే) “మీలో ఎవరో ఒకరు (అప్పుడప్పుడు) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మీద అలిగి ఒక రోజంతా ముభావంగా ఉంటారట నిజమేనా?” అని అడిగాను. ఆమె నిజమే అన్నది. “అయితే మీకు వినాశం దాపురించింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆగ్రహం వల్ల అల్లాహ్ ఆగ్రహానికి గురయి నాశనమవుతారన్న భయం మీలో కాస్తయినా లేదా? (అమ్మాయ్!) జాగ్రత్త! దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను, అది కావాలి ఇది కావాలి అంటూ ఎక్కువగా కోరకు. అలాగే ఆయనతో వితండవాదానికి దిగకు. ఆయన మీద అలిగి కూర్చోకు. నీకేదయినా కావాలంటే నన్నడుగు (నేనిస్తాను. అంతేగాని దైవప్రవక్తను చీటికి మాటికీ వేధించకు). ఒక విషయం గుర్తు పెట్టుకో. నీ పొరుగు స్త్రీ (అంటే నీ సవతి హజ్రత్ ఆయిషా రదియల్లాహు అన్హా) నీ కంటే ఎంతో అందమైనది. పైగా ఆమె అంటే దైవప్రవక్తకు చాలా ఇష్టం. అందువల్ల (ఆమె ఏది చేసినా చెల్లుతుంది) నువ్వు ఆమెను చూసి మోసపోకు” అన్నాను నేను.
ఆ రోజుల్లో గస్సాన్ రాజు గుర్రాలకు నాడాలు వేయిస్తూ సకల విధాల ఆయుధాలతో మా పై యుద్దానికి సమాయత్తమవుతున్నాడని విని మేము దాన్ని గురించే తరచుగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళము. తర్వాత ఓ రోజు నా స్నేహితుడు తన వంతు ప్రకారం దైవప్రవక్త సన్నధికి వెళ్ళి ఇషా (నమాజు) వేళకు తిరిగొచ్చాడు. వచ్చీ రాగానే అతను మా ఇంటి తలుపులు దబదబా బాదుతూ “లోపల ఎవరైనా ఉన్నారా?” అని అరిచాడు. నేను కంగారు పడుతూ ఒక్క ఉదుటున బయటికి వచ్చాను. అతను (నన్ను చూడగానే) “ఈ రోజు పెద్ద ఘోరం జరిగిపోయింది” అన్నాడు. నేను (ఆత్రుతతో) “ఏం జరిగింది గస్సాన్ రాజు వచ్చేశాడా?” అని అడిగాను. “లేదు. అంతకంటే కూడా పెద్ద ఘోరం జరిగిపోయింది. దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) తమ భార్యలకు విడాకులిచ్చేశారు” అన్నాడతను. నేనీ మాట వినగానే “హఫ్సా (రదియల్లాహు అన్హా) నాశనమయిపోయింది! ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందే ఊహించాను” అని అన్నాను.
ఆ తర్వాత (మరునాడు ఉదయం ) నేను బట్టలు వేసుకొని వెళ్ళి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో కలసి ఫజ్ర్ నమాజు చేశాను. నమాజయిన తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై అంతస్తులోకి వెళ్ళి కూర్చొన్నారు. అందరికీ వేరయి ఒంటరిగా కూర్చొన్నారు. అదే సమయంలో నేను హఫ్సా (రదియల్లాహు అన్హా) ఇంటికి వెళ్ళాను. చూస్తే ఆమె ఏడుస్తూ కూర్చున్నది. “ఎందుకు ఏడుస్తున్నావు? ఈనాటి సంఘటన గురించి నేను నిన్ను ముందే హెచ్చరించలేదా? దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మీకందరికీ విడాకులిచ్చేశారట నిజమేనా?” అని అడిగాను నేను. “నాకేమీ తెలియదు. ఆయన అందరినీ వదిలేసి పై అంతస్తులో ఒంటరిగా కూర్చొన్నారని మాత్రం తెలుసు” అన్నది ఆమె.
నేను అక్కడ్నుంచి బయలుదేరి మస్జిదులోని వేదిక దగ్గరకు వెళ్ళాను. అక్కడ జనం గుమిగూడి ఉన్నారు. వారిలో కొందరు రోదిస్తున్నారు. నేను వాళ్ళ దగ్గర కొంచెం సేపు కూర్చున్నాను (ఏమీ పాలుపోక). కాని నాలో ఆందోళన, ఆత్రుతలు ఎక్కువయిపోవడంతో నేను లేచి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూర్చొని ఉన్న పై అంతస్తు దగ్గరికి వెళ్ళాను. అక్కడ (కాపలాదారునిగా) ఒక నీగ్రో బాలుడు ఉన్నాడు. నేనతనితో “ఉమర్ (పైకి) రావడానికి అనుమతి అడిగిరా”అని అన్నారు. అతను వెళ్ళి వచ్చి “నేను మీ పేరు ప్రస్తావించి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను అనుమతి అడిగాను. కాని ఆయన ఏ మాటా చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు” అని చెప్పాడు.
నేను తిరిగి మస్జిదులో వేదిక చుట్టూ మూగి ఉన్న జనం దగ్గరికొచ్చి కూర్చున్నాను. అయితే కాస్సేపటి తర్వాత నాలో ఆందోళన, ఆత్రుతలు అధికమవడంతో నేను మళ్ళీ ఆ నీగ్రో బాలుడి దగ్గరికెళ్ళి “వెళ్ళి ఉమర్ కోసం అనుమతి అడిగిరా”అన్నాను. అతను (పైకి) వెళ్ళి వచ్చి “నేను దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ముందు మీ సంగతి ప్రస్తావించాను. కాని ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వలేదు” అని అన్నాడు. నేను తిరిగొచ్చి వేదిక చుట్టూ గుమిగూడిన జనం దగ్గర కూర్చున్నాను. కాని కాస్సేపటికి నాలో ఆందోళన, ఆత్రుతలు మరింత ఎక్కువయిపోయాయి. అందువల్ల నేను మళ్ళీ ఆ బాలుడి దగ్గరి కెళ్ళి “వెళ్ళి ఉమర్ కోసం అనుమతి అడిగిరా” అని చెప్పాను. అతను వెళ్ళొచ్చి “నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముందు మీ సంగతి ప్రస్తావించాను. కాని ఆయన సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయారు” అని అన్నాడు.
నేను (చేసేదేమీ లేక కాళ్ళీడ్చుకుంటూ) వెనక్కి తిరిగాను. కాని అంతలోనే ఆ బాలుడు నన్ను కేకవేస్తూ “రండి, రండి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మిమ్మల్ని రావడానికి అనుమతించారు, రండి” అని అన్నాడు. అది విని నేను వెళ్ళాను. లోపలికెళ్ళి చూస్తే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓ గోనె చాప మీద పడుకొని ఉన్నారు. ఆ చాపమీద ఓ గుడ్డ పడక కూడా లేదు. చాప ఈనెల గుర్తులు ఆయన శరీరం మీద స్పష్టంగా కనిపిస్తున్నాయి. తలక్రింద ఖర్జూరపు బెరడుతో నిండిన ఒక తోలు దిండు ఉంది.
నేను సలాం చేసి నిల్చొని ఉండే “దైవప్రవక్తా! మీరు మీ భార్యలకు విడాకులిచ్చారా?” అని అడిగాను. ఆయన తల పైకెత్తి నా వైపు చూస్తూ లేదన్నారు. ఈ మాట విని నేను (తృప్తిగా ఊపిరి పీల్చుకుంటూ) “అల్లాహు అక్బర్ (అల్లాహ్ గొప్పవాడు)” అన్నాను. ఆ తర్వాత నేను అలా నిలబడే ఆవేదనాపూరిత వాతావరణాన్ని దూరం చేయడానికి “దైవప్రవక్తా! కాస్త నావైపు చూడండి. మనం ఖురైష్ వంశస్థులం ఒకప్పుడు స్త్రీల మీద ఆధిక్యత కలిగి ఉండేవాళ్ళము. కాని మనం మదీనా వచ్చాక మన స్త్రీలు మనమీదే పెత్తనం చెలాయించడం మొదలెట్టారు” అని అన్నాను. ఈ మాట విని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చిరునవ్వు చిందించారు. ఆ తర్వాత నేను “దైవప్రవక్తా! కాస్త నా వైపు దృష్టి సారించండి. నేను హఫ్సా (రదియల్లాహు అన్హా) ఇంటిక్కూడ వెళ్ళోచ్చాను. ఆమెతో ‘నీ సవతి ఆయిషా (రదియల్లాహు అన్హా) ను చూసి మోసపోకు; ఆమె నీకంటే అందమైనదే కాకుండా, అందరికంటే ఎక్కువ ఆమెనే దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రేమిస్తున్నారు’ అని చెప్పాను” అని అన్నాను. దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ మాటలు విని మరోసారి చిరునవ్వు నవ్వారు.
ఈ విధంగా ప్రవక్త ముఖారవిందం విప్పారడం చూసి నేను (నిశ్చింతగా) కూర్చున్నాను. నేను మరోసారి తల పైకెత్తి గదిలో నలువైపుల కలియజూశాను. కాని నాకక్కడ చెప్పుకోదగ్గ వస్తువేమీ కన్పించలేదు. కాకపోతే ఒక చోట మూడు చర్మాలు (వ్రేలాడుతూ) కన్పించాయి. వాటిని చూసి “దైవప్రవక్తా! మీ అనుచర సమాజానికి భోగభాగ్యాలు ప్రసాదించమని అల్లాహ్ ను ప్రార్ధించండి. రోమన్లు, ఫార్సీలు అల్లాహ్ ను ఆరాధించకపోయినా అన్ని రకాల భోగభాగ్యాలతో ఎలా తులతూగుతున్నారో చూడండి. వారికి పెద్ద ఎత్తున ప్రాపంచిక సిరులు ప్రసాదించబడ్డాయి (మనకా అదృష్టం లేదా?)” అని అన్నాను.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ మాటలు విని దిండుకానుకొని కూర్చున్నవారల్లా ఒక్కసారిగా వదిలి నిటారుగా కూర్చొన్నారు. “ఖత్తాబ్ పుత్రుడా! నువ్వు ఈ విధంగా ఆలోచిస్తున్నావా? ఈ జాతులకు ఐహిక జీవితంలోనే తమకు ప్రియమైన సంపదలన్నీ ఇవ్వబడ్డాయి (పరలోకంలో వారికి ఎలాంటి సుఖాలు ఉండవు)” అన్నారు ఆయన (వత్తి పలుకుతూ). నేను (వెంటనే నా తప్పు తెలుసుకొని) “దైవప్రవక్తా! నా తప్పు క్షమించమని అల్లాహ్ ను ప్రార్ధించండి” అని అన్నాను.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ భార్యలకు ఇరవై తొమ్మిది రోజుల (రాత్రుల) పాటు వేరుగా ఉండిపోయారు. దీనిక్కారణం హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా)కు హఫ్సా (రదియల్లాహు అన్హా) తెలిపిన విషయమే. దీని వల్ల దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎంతో ఆవేదనకు గురయి “నేను ఒక నెల దాకా వాళ్ళ దగ్గరకి పోను” అని అన్నారు. అయితే ఈ నిర్ణయాన్ని అల్లాహ్ నిరసించాడు.
ఇలా ఇరవైతొమ్మిది రాత్రులు గడిచిన తర్వాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అందరికంటే ముందుగా హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) దగ్గరకి వెళ్ళారు. ఆ సందర్భంలో హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) “మీరు ఒక నెల దాకా మా దగ్గరకు రానని ఒట్టేసుకున్నారుగా. (మరి అప్పుడే వచ్చారేమిటీ)! నేను ఒక్కొక్క రోజును లెక్క పెడ్తూ ఉన్నాను” అని అన్నారు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఇరవై తొమ్మిది రోజుల నెల కూడ ఉంటుంది. ఈ నెల ఇరవై తొమ్మిది రోజుల నెలే మరి” అని అన్నారు.
ఆ తర్వాత హజ్రత్ ఆయిషా ఇలా తెలియజేశారు – “ఆ తర్వాత అల్లాహ్ (అహ్జాబ్ సూరాలో) ‘తఖ్ యీర్’ (*) సూక్తిని అవతరింపజేశాడు. అప్పుడు కూడా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అందరికంటే ముందు నా దగ్గరికే వచ్చి దాన్ని గురించి నా అభిప్రాయం అడిగారు. నేను మిమ్మల్నే కోరుకుంటున్నానని నా అభిప్రాయం తెలియజేశాను. ఆ తర్వాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మిగిలిన భార్యల దగ్గర క్కూడ వెళ్ళి వారి అభిప్రాయాలు అడిగారు. అప్పుడు వారు కూడా నేనిచ్చిన సమాధానమే ఇచ్చారు”.
(*) తయిర్ సూక్తి ఖుర్ఆన్లో ఈ విధంగా ఉంది. (ప్రవక్తా!) నీ భార్యలకు ఇలా చెప్పెయ్యి – “ఒక వేళ మీరు ప్రాపంచిక జీవితాన్ని, దాని తళుకు బెళుకుల్ని (మాత్రమే) కోరుతున్నట్లయితే రండి, నేను మీకు ఎంతో కొంత ఇచ్చి మంచిగా సాగనంపుతాను. అలా కాకుండా మీరు అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను, పరలోకాన్ని (కూడా) కోరుతున్నట్లయితే, తెలుసుకోండి – మీలో పుణ్యవతుల కోసం అల్లాహ్ గొప్ప ప్రతిఫలాన్ని సిద్ధపరచి ఉంచాడు”. (33:28,29)
[సహీహ్ బుఖారీ : 67వ ప్రకరణం – నికాహ్, 83వ అధ్యాయం – మౌ ఇజతిర్రజులిబ్ నతహూ)
المطلقة ثلاثا لا نفقة لها
6వ అధ్యాయం – మూడు తలాఖులు ఇవ్వబడిన స్త్రీ భరణానికి అర్హురాలు కాదు
946 – حديث عَائِشَةَ وَفَاطِمَةَ بِنْتِ قَيْسٍ عَنْ عَائِشَةَ، أَنَّهَا قَالَتْ: مَا لِفَاطِمَةَ أَلاَ تَتَّقِي اللهَ، يَعْنِي فِي قَوْلِهَا لاَ سُكْنَى وَلاَ نَفَقَةَ
__________
أخرجه البخاري في:68 كتاب الطلاق: 41 باب قصة فاطمة بنت قيس
946. హజ్రత్ ఖాసిమ్ బిన్ ముహమ్మద్ (రహిమహుల్లాహ్) కథనం:- హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా), హజ్రత్ ఫాతిమా బినై ఖైస్ (రదియల్లాహు అన్హా)ను గురించి మాట్లాడుతూ “ఫాతిమా బినై ఖైస్ (రదియల్లాహు అన్హా)కు ఏమయింది, ఆమె అల్లాహ్ కి భయపడదా?” అని అన్నారు. అంటే హజ్రత్ ఫాతిమా బినై ఖైస్ (రదియల్లాహు అన్హా)గారు విడాకులు పొందిన స్త్రీకి (భర్త) ఇంట్లో ఉండేందుకుగాని, (అతని నుండి) భరణం పొందేందుకు గాని హక్కు లేదని అంటారేమిటీ; ఆమె అల్లాహ్ కి భయపడదా? అని హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) గారి మాటల భావం.”(*)
[సహీహ్ బుఖారీ : 68వ ప్రకరణం – తలాఖ్, 41వ అధ్యాయం – ఖిస్సతు ఫాతిమా బిన్ ఖైస్ (రదియల్లాహు అన్హా)]
(*) ఫాతిమా బినై ఖైస్ (రదియల్లాహు అన్హా) విడాకులు పొందిన తరువాత మాజీ భర్త ఇంట్లో గాకుండా వేరే ఇంట్లో ‘ఇద్దత్ గడపాలని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆమెను ఆజ్ఞాపించారు. ఇది సాధారణ ఆజ్ఞ కాదు, గత్యంతరం లేని పరిస్థితిలో ఇవ్వబడిన ఆజ్ఞ. ఈ సంగతి ఆమెకు తెలుసు. అయితే ఆమె కారణం చెప్పకుండా వేరే ఇంట్లో ‘ఇద్దత్’ గడిపేందుకు తనకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుమతించారని అన్నారు. ఈమె గాథ సహీహ్ ముస్లిం, లోని 48వ హదీసులో ఈ విధంగా ఉంది:
అబూబకర్ బిన్ జహమ్ (రహిమహుల్లాహ్) కథనం ప్రకారం బినై ఖైస్ (రదియల్లాహు అన్హా) ఆయనకు ఇలా వివరించారు – నా భర్త అబూ ఉమర్ బిన్ హబ్స్ (రదియల్లాహు అన్హు) నాకు విడాకులిచ్చారు. ఆ సందర్భంలో ఆయన నా కోసం అయిదు ‘సా’ల ఎత్తు ఖర్జూరపండ్లు, మరో అయిదు ‘సా’ల ఎత్తు గోధుమలు పంపించారు. అప్పుడు నేను, “నా మనోవర్తి (నుఫ్కా) ఇంతేనా? నా ఇద్దత్ గడువును మీ ఇంట్లో గడపకూడదా” అని అడిగాను. దానికాయన లేదన్నారు. ఆ తర్వాత నేను నా దుస్తుల్ని సర్దుకొని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వెళ్ళాను.
దైషప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (నా మాటలు విని) “నీకు ఎన్ని తలాఖులు ఇచ్చాడు?” అని అడిగారు. నేను ‘మూడు’ అని చెప్పాను. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు. “అయితే అతను నిజమే అన్నాడు. నీకు మనోవర్తి లభించదు. నువ్వొక పని చెయ్యి. నీ ఇద్దత్లు నీ పెద్దనాన్న కొడుకు అయిన ఇబ్నె ఉమ్మె మక్తూము (రదియల్లాహు అన్హు) ఇంట్లో గడుపు. అతను అంధుడు కదా! నువ్వక్కడ నీ బట్టలు కూడా మార్చుకోవచ్చు. ఇలాగే నీ ఇద్దత్ కాలం ముగిసిన తర్వాత నాకు మళ్ళీ విషయం తెలియజెయ్యి.”
ఫాతిమా బినై ఖైస్ (రదియల్లాహు అన్హా) కథనం:- ఆ రోజుల్లో నాకు అనేకమంది వివాహ సందేశం పంపారు. అలాంటి వారిలో ముఆవియా (రదియల్లాహు అన్హు), అబూ జహీమ్ (రదియల్లాహు అన్హు) కూడా ఉన్నారు. ఈ విషయం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దృష్టికి తీసికెళ్తే ఆయన నాకిలా సలహా ఇచ్చారు . “ముఆవియా (రదియల్లాహు అన్హు) చాలా పేదవాడు. అబూ జహీమ్ (రదియల్లాహు అన్హు) విషయానికొస్తే అతను భార్యలను కొడతాడని లేక వారిపట్ల కఠినంగా ప్రవర్తిస్తాడని తెలిసింది. లేక అలాంటివే మరేవో మాటలు ప్రచారంలో ఉన్నాయి. అందువల్ల నువ్వు ఉసామా బిన్ జైద్ (రదియల్లాహు అన్హు)ని పెళ్ళి చేసుకో” – సంకలనకర్త.
947 – حديث عَائِشَةَ، وَفَاطِمَةَ بِنْتِ قَيْسٍ قَالَ عُرْوَةُ بْنُ الزُّبَيْرِ لِعَائِشَةَ: أَلَمْ تَرَيْنَ إِلَى فُلاَنَةَ بِنْتِ الْحَكَمِ، طَلَّقَهَا زَوْجُهَا الْبَتَّةَ فَخَرَجَتْ فَقَالَتْ: بِئْسَ مَا صَنَعَتْ قَالَ: أَلَمْ تَسْمَعِي فِي قَوْلِ فَاطِمَةَ قَالَتْ: أَمَا إِنَّهُ لَيْسَ لَهَا خَيْرٌ فِي ذِكْرِ هذَا الْحَدِيثِ
__________
أخرجه البخاري في: 68 كتاب الطلاق: 41 باب قصة فاطمة بنت قيس
947. హజ్రత్ ఖాసిం బిన్ ముహమ్మద్ (రహిమహుల్లాహ్) కథనం:- హజ్రత్ ఉర్వా బిన్ జుబైర్ (రదియల్లాహు అన్హు) హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా)తో మాట్లాడుతూ “మీరు హకమ్ కుమార్తె గురించి విన్నారా? ఆమెకు భర్త (మూడుసార్లు) తలాఖ్ ఇచ్చేస్తే (ఇద్దత్ గడువు తీరక ముందే) ఆమె ఆ ఇంట్లో ఉండకుండా ఎక్కడికో వెళ్ళి పోయింది?” అని అన్నారు. దానికి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) “ఆమె తప్పు చేసింది” అన్నారు. తర్వాత హజ్రత్ ఉర్వా (రహిమహుల్లాహ్) “మీరు బినై ఖైస్ (రదియల్లాహు అన్హా) చెబుతున్న మాటలు వినలేదా?” అని అన్నారు. “ఫాతిమా (రదియల్లాహు అన్హు) అలా చెప్పడం సమంజసంగా లేదు”(*) అన్నారు హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా).
* అంటే విడాకులు పొందిన స్త్రీకి వసతి, మనోవర్తులు పొందే అధికారం లేదని, ఆమె వేరే చోటు నివసించవచ్చు. హజ్రత్ ఫాతిమా (రదియల్లాహు అన్హా) అన్న మాటలు.
[సహీహ్ బుఖారీ : 68వ ప్రకరణం – తలాఖ్, 41వ అధ్యాయం – ఖిస్సతు బినై ఖైస్ (రదియల్లాహు అన్హా)]
انقضاء عدة المتوفى عنها زوجها وغيرها بوضع الحمل
8వ అధ్యాయం – ప్రసవించిన తర్వాత ఇద్దత్ (గడువు) తీరిపోతుంది
948 – حديث سُبَيْعَةَ بِنْتِ الْحارِثِ: أَنَّهَا كَانَتْ تَحْتَ سَعْدِ بْنِ خَوْلَةَ، وَهُوَ مِنْ بَنِي عَامِرِ بْنِ لُؤَىٍّ، وَكَانَ مِمَّنْ شَهِدَ بَدْرًا، فَتُوُفِّيَ عَنْهَا فِي حَجَّةِ الْوَدَاعِ، وَهِيَ حَامِلٌ، [ص:122] فَلَمْ تَنْشَبْ أَنْ وَضَعَتْ حَمْلَهَا بَعْدَ وَفَاتِهِ؛ فَلَمَّا تَعَلَّتْ مِنْ نِفَاسِهَا تَجَمَّلَتْ لِلْخُطَّابِ، فَدَخَلَ عَلَيْهَا أَبُو السَّنَابِلِ بْنُ بَعْكَكٍ، رَجُلٌ مِنْ بَنِي عَبْدِ الدَّارِ؛ فَقَالَ لَهَا: مَا لِي أَرَاكِ تَجَمَّلْتِ لِلْخُطَّابِ تُرَجِّينَ النِّكَاحَ، فَإِنَّكِ، وَاللهِ مَا أَنْتِ بِنَاكِحٍ حَتَّى تَمُرَّ عَلَيْكِ أَرْبَعَةُ أَشْهُرٍ وَعَشْرٌ قَالَتْ سُبَيْعَةُ: فَلَمَّا قَالَ لِي ذلِكَ جَمَعْتُ عَلَيَّ ثِيَابِي حِينَ أَمْسَيْتُ، وَأَتَيْتُ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَسَأَلْتُهُ عَنْ ذَلِكَ، فَأَفْتَانِي بِأَنِّي قَدْ حَلَلْتُ حِينَ وَضَعْتُ حَمْلِي، وَأَمَرَنِي بِالتَّزَوُّجِ إِنْ بَدَا لِي
__________
أخرجه البخاري في: 64 كتاب المغازي: 10 باب حدثني عبد الله بن محمد الجعفي
948. హజ్రత్ ఉమర్ బిన్ అబ్దుల్లా (రహిమహుల్లాహ్) కథనం:- హజ్రత్ సబియా బినై హారిస్ (రదియల్లాహు అన్హా) హజ్రత్ సాద్ బిన్ ఖోలా (రదియల్లాహు అన్హు) గారి భార్య. హజ్రత్ సాద్ (రదియల్లాహు అన్హు) ‘బనీ ఆమిర్ బిన్ లోయి’ తెగకు చెందిన వ్యక్తి. ఆయనకు బదర్ యుద్ధంలో పాల్గొనే భాగ్యం లభించింది. అయితే ఆయన హజ్జతుల్ విదా (వీడ్కోలు హజ్) సందర్భంలో చనిపోయారు. హజ్రత్ సాద్ (రదియల్లాహు అన్హు) చనిపోయేటప్పుడు ఆయన భార్య సబియా (రదియల్లాహు అన్హా) గర్భవతిగా ఉన్నారు. ఆయన మరణించిన కొన్నాళ్ళకే ఆమె ప్రసవించారు. ప్రసవ మైల నుండి బయట పడగానే ఆమె రెండో సంబంధం కోసం అందంగా సింగారించు కోవడం ప్రారంభించారు.
ఆ రోజుల్లో ‘బనీ అబ్దుద్ధార్’ తెగకు చెందిన హజ్రత్ అబుస్సనా బిల్ బిన్ బాకక్ (రదియల్లాహు అన్హు) ఆమె దగ్గరకు వచ్చి “ఏమిటీ నీవు అప్పుడే అలంకరించుకొని కూర్చున్నావు! రెండవ సంబంధం రావాలనా! నీవు నిజంగా (రెండవ) పెళ్ళి చేసుకోదలిచావా? కాని అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. నాలుగు నెలల పది రోజుల (ఇద్దత్) గడువు తీరే దాకా నీవు పెళ్ళి చేసుకోవడానికి ఏమాత్రం వీల్లేదు” అని అన్నారు.
ఆ తర్వాత హజ్రత్ సబియా (రదియల్లాహు అన్హా) ఇలా తెలియజేస్తున్నారు; నేనీ మాట వినగానే అదే రోజు సాయంత్రం (నిండుగా) దుస్తులు ధరించి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వెళ్ళాను. ఆయన ముందు విషయం ప్రస్తావించి సమాధానం అడిగాను. దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇది విని, నేను ప్రసవించగానే నా ఇద్దత్ (గడువు) తీరిపోయిందని, (రెండవ) పెళ్ళి చేసుకోవచ్చని చెప్పారు.
(సహీహ్ బుఖారీ : 64వ ప్రకరణం – మగాజి, 10వ అధ్యాయం – హద్దసనా అబ్దుల్లాహ్ బిన్ ముహమ్మదిల్ జూఫి)
949 – حديث أُمِّ سَلَمَةَ عَنْ أَبِي سَلَمَةَ، قَالَ: جَاءَ رَجُلٌ إِلَى ابْنِ عَبَّاسٍ وَأَبُو هُرَيْرَةَ جَالِسٌ عِنْدَهُ، فَقَالَ: أَفْتِنِي فِي امْرَأَةٍ وَلَدَتْ بَعْدَ زَوْجِهَا بِأَرْبَعِينَ لَيْلَةً؛ فَقَالَ ابْنُ عَبَّاسٍ: آخِرُ الأَجَلَيْنِ قُلْتُ أَنَا (وَأُولاَتُ الأَحْمَالِ أَجَلُهُنَّ أَنْ يَضَعْنَ حَمْلَهُنَّ) قَالَ أَبُو هُرَيْرَةَ: أَنَا مَعَ ابْنِ أَخِي (يَعْنِي أَبَا سَلَمَةَ) فَأَرْسَلَ ابْنُ عَبَّاسٍ غُلاَمَهُ كُرَيْبًا إِلَى أُمِّ سَلَمَةَ يَسْأَلُهَا فَقَالَتْ: قُتِلَ زَوْجُ سُبَيْعَةَ الأَسْلَمِيَّةِ، وَهِيَ حُبْلَى، فَوَضَعَتْ بَعْدَ مَوْتِهِ بِأَرْبَعِينَ لَيْلَةً، فَخُطِبَتْ، فَأَنْكَحَهَا رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَكَانَ أَبُو السَّنَابِلِ فِيمَنْ خَطَبَهَا
__________
أخرجه البخاري في: 65 كتاب التفسير: 65 سورة الطلاق: 2 باب وأولات الأحمال
949. హజ్రత్ అబూసల్మా (రహిమహుల్లాహ్) కథనం:- హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి “భర్త చనిపోయిన నలభై రోజుల తరువాత బిడ్డను కన్న స్త్రీ గురించి (ఆమె ఇద్దత్ గడువు తీరిందో లేదో) నాకు తెలియజేయండి” అని అన్నాడు. ఆ సమయంలో అక్కడ హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కూడా ఉన్నారు. హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఆ వ్యక్తి ప్రశ్నకు సమాధానమిస్తూ “రెండు గడువుల్లో ఏ గడువు మొదట పూర్తి అవుతుందో దాని ప్రకారం ఇద్దత్ (గడువు) తీరిపోతుంది’ అని అన్నారు. నేనప్పుడు “గర్భవతి గడువు ఆమె ప్రసవించే దాకా ఉంటుంది” అన్న దైవసూక్తి (తలాఖ్ -4) విన్పించాను.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కూడా నన్ను సమర్ధిస్తూ “నేను నా సోదరుడి కుమారుని పక్షాన ఉన్నాను” అని అన్నారు. అప్పుడు హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఈ సమస్యను గురించి హజ్రత్ ఉమ్మెసల్మా (రదియల్లాహు అన్హా)ని అడిగి రమ్మని తన బానిస కురైబ్ (రహిమహుల్లాహ్)ని పంపించారు. దానికి హజ్రత్ ఉమ్మె సల్మా (రదియల్లాహు అన్హు) ఇలా సమాధానమిచ్చారు:
“సబియా (రదియల్లాహు అన్హా) భర్త (సాద్ బిన్ ఖిలా) అమరగతి నొందినపుడు ఆమె గర్భవతిగా ఉండింది. భర్త మరణించిన నలభై రోజుల తరువాత ఆమె ప్రసవించింది. ఆ తర్వాత ఆమెకు (రెండో) పెళ్ళి సంబంధాలు రాసాగాయి. కనుక దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఆమెకు వివాహం చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఆమెను వివాహమాడేందుకు ముందుకొచ్చిన వారిలో అబుస్సనా బిల్ (రదియల్లాహు అన్హు) కూడా ఉన్నారు.”
[సహీహ్ బుఖారీ : 65వ ప్రకరణం – అత్తఫ్సీర్ – 65 – తలాఖ్ సూరా, 2వ అధ్యాయం – వఅతిల్ అహ్మాల్ ]
وجوب الإحداد في عدة الوفاة، وتحريمه في غير ذلك إِلا ثلاثة أيام
9వ అధ్యాయం – భర్త చనిపోయిన స్త్రీ శోకాన్ని పాటించడం విధి. ఇతరులు మూడు రోజులకు మించి శోకాన్ని పాటించడం ధర్మసమ్మతం కాదు
950 – حديث أُمِّ حَبِيبَة زَوْجِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَزْيْنَبَ ابْنَةِ جَحْشٍ، وَأُمِّ سَلَمَةَ، وَزَيْنَبَ ابْنَةِ أَبِي سَلَمَةَ: [ص:123] قَالَتْ زَيْنَبُ: دَخَلْتُ عَلَى أُمِّ حَبِيبَةَ، زَوْجِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، حِينَ تُوُفِّيَ أَبُوهَا، أَبُو سُفْيَانَ بْنُ حَرْبٍ، فَدَعَتْ أُمُّ حَبِيبَةَ بِطِيبٍ فِيهِ صُفْرَةٌ، خَلُوقٌ أَوْ غَيْرُهُ، فَدَهَنَتْ مِنْهُ جَارِيَةً، ثُمَّ مَسَّتْ بِعَارِضَيْهَا، ثُمَّ قَالَتْ: وَاللهِ مَالِي بِالطِّيبِ مِنْ حَاجِةٍ، غَيْرَ أَنِّي سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ لاَ يَحِلُّ لاِمْرَأَةٍ تُؤْمِنُ بِاللهِ وَالْيَوْمِ الآخِرِ أَنْ تُحِدَّ عَلَى مَيِّتٍ فَوْقَ ثَلاَثِ لَيَالٍ إِلاَّ عَلَى زَوْجٍ، أَرْبَعَةَ أَشْهُرٍ وَعَشْرًا
قَالَتْ زَيْنَبُ: فَدَخَلْتُ عَلَى زَيْنَبَ ابْنَةِ جَحْشٍ، حِينَ تُوُفِّيَ أَخُوهَا، فَدَعَتْ بِطِيبٍ فَمَسَّتْ مِنْهُ، ثُمَّ قَالَتْ: أَمَا وَاللهِ مَالِي بِالطِّيبِ مِنْ حَاجَةٍ، غَيْرَ أَنِّي سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ عَلَى الْمِنْبَرِ لاَ يَحِلُّ لاِمْرَأَةٍ تُؤْمِنُ بِاللهِ وَالْيَوْمَ الآخِرِ أَنْ تُحِدَّ عَلَى مَيِّتٍ فَوْقَ ثَلاَثٍ لَيَالٍ إِلاَّ عَلَى زَوْجٍ أَرْبَعَةَ أَشْهُرٍ وَعَشْرًا
قَالَتْ زَيْنَبُ: وَسَمِعْتُ أُمَّ سَلَمَةَ تَقُولُ: جَاءَتِ امْرَأَةٌ إِلَى رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَتْ: يَا رَسُولَ اللهِ إِنَّ ابْنَتِي تُوُفِّيَ عَنْهَا زَوْجُهَا، وَقَدِ اشْتَكَتْ عَيْنُهَا، أَفَتَكْحُلُهَا فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: لاَ مَرَّتَيْنِ أَوْ ثَلاَثًا، كُلُّ ذَلِكَ يَقُولُ: لاَ ثُمَّ قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِنَّمَا هِيَ أَرْبَعَةُ أَشْهُرٍ وَعَشْرٌ، وَقَدْ كَانَتْ إِحْدَاكُنَّ فِي الْجَاهِلَيَّةِ تَرْمِي بِالْبَعَرَةِ علَى رَأْسِ الْحَوْلِ
قَالَ حُمَيْدٌ (الرَّاوِي عَنْ زَيْنَبَ) فَقُلْتُ لِزَيْنَبَ: وَمَا تَرْمِي بِالْبَعَرَةِ عَلَى رَأْسِ الْحَوْلِ فَقَالَتْ زَيْنَبُ: كَانَتِ الْمَرْأَةُ إِذَا تُوُفِّيَ عَنْهَا زَوْجُهَا، دَخَلَتْ حِفْشًا وَلَبِسَتْ شَرَّ ثِيَابِهَا، وَلَمْ تَمَسَّ طِيبًا حَتَّى تَمُرَّ بِهَا سَنَةٌ ثُمَّ تُؤْتَى بِدَابَّةٍ، حِمَارٍ، أَوْ شَاةٍ، أَوْ طَائِرٍ، [ص:124] فَتَفْتَضُّ بِهِ، فَقَلَّمَا تَفْتَضُّ بِشَيْءٍ إِلاَّ مَاتَ، ثُمَّ تَخْرُجُ فَتُعْطَى بَعَرَةً فَتَرْمِي، ثُمَّ تُرَاجِعُ بَعْدُ مَا شَاءَتْ مِنْ طِيبٍ أَوْ غَيْرِهِ
سُئِلَ مَالِكٌ (أَحَدُ رِجَالِ السَّنَدِ) مَا تَفْتَضُّ بِهِ قَالَ: تَمْسَحُ بِهِ جِلْدَهَا
__________
أخرجه البخاري في: 68 كتاب الطلاق: 46 باب تحد المتوفى عنها زوجها أربعة أشهر وعشرا
950. హజ్రత్ జైనబ్ బిన్తె అబీ సల్మా (రదియల్లాహు అన్హా) కథనం:- విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఉమ్మె హబీబా (రదియల్లాహు అన్హా)గారి తండ్రి హజ్రత్ అబూ సుఫ్యాన్ (రదియల్లాహు అన్హు) చనిపోయినపుడు నేను (సంతాపం ప్రకటించడానికి) ఆమె దగ్గరకు వెళ్ళాను. అప్పుడు హజ్రత్ ఉమ్మె హబీబా (రదియల్లాహు అన్హా) ఒక విధమైన ఎరుపురంగు సువాసన తెప్పించారు. ఆమె దాన్ని ఒక బాలికకు పూశారు. ఆ తర్వాత ఆ చేతిని తన చెంపలకు రాసుకుంటూ “అల్లాహ్ సాక్షి! నాకు సువాసన అవసరం లేదు. ఇప్పుడేదో కాస్త ఇలా రాసుకుంటున్నానంటే దానిక్కారణం దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇచ్చిన ఆదేశమే. అల్లాహ్ ను, పరలోకాన్ని విశ్వసిస్తున్న ఏ స్త్రీ కూడా తన భర్త మరణం పట్ల తప్ప మరెవరి మృతిపట్ల కూడా మూడు రోజులకు మించి శోకాన్ని పాటించడం ధర్మసమ్మతం కాదనీ, భర్త చనిపోతే నాలుగు నెలల పదిరోజులు (శోకం పాటిస్తూ) విధిగా ఇద్దత్ (గడువు) పాటించాలని ఆయన అన్నారు” అని తెలిపారు.
తర్వాత నేను విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ జైనబ్ బిన్తె జహష్ (రదియల్లాహు అన్హా)గారి సోదరుడు చనిపోయినపుడు ఆమె ఇంటిక్కూడా (సంతాపం ప్రకటించడానికి) వెళ్ళాను. ఆమె కూడా సువాసన తెప్పించి, కాస్త వంటికి రాసుకొని ఇలా అన్నారు. “అల్లాహ్ సాక్షి! నాకు సువాసన పూసుకోవాల్సిన అవసరం లేదు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వేదిక ఎక్కి ‘అల్లాహ్ ను, పరలోకాన్ని విశ్వసిస్తున్న ఏ స్త్రీ కూడా తన భర్త తప్ప ఇతరులు చనిపోతే మూడు రోజులకు మించి శోకం పాటించడం ధర్మసమ్మతం కాదని, భర్త చనిపోతే మాత్రం విధిగా నాలుగు నెలల పదిరోజులు ఇద్దత్ (గడువు) కాలం గడపవలసి ఉంటుంద’ని చెబుతుంటే విన్నాను.”
నేను హజ్రత్ ఉమ్మెసల్మా (రదియల్లాహు అన్హా) చెప్పిన ఈ విషయం కూడా విన్నాను. ఒక స్త్రీ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చి “దైవప్రవక్తా! నా కూతురి భర్త చనిపోయాడు. ఇప్పుడామె కళ్ళ జబ్బుతో బాధపడుతుంది. మరి నేను ఆమె కళ్ళకు సుర్మా పెట్టవచ్చా?” అని అడిగింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ‘పెట్టకూడద’ని అన్నారు. ఆ స్త్రీ ఇలా రెండు మూడు సార్లు అడిగింది. ప్రతిసారీ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పెట్టకూడదనే చెప్పారు. ఆ తరువాత ఇలా అన్నారు – “అజ్ఞానకాలంలో మీ ఆడవాళ్ళకు (భర్త చనిపోతే) పూర్తిగా ఒక సంవత్సరం గడచిన తరువాతే పెంటికలు పారేసే అనుమతి లభించేది. కాని ఇప్పుడు నీ కూతురు నాలుగు నెలల పది రోజులు మాత్రమే ఇద్దత్ (గడువు) కాలం గడపవలసి వస్తుంది. (ఈ మాత్రం గడువు కూడా తీరకముందే సింగారానికి సిద్ధమవుతే ఎలా?)”
హజ్రత్ జైనబ్ బిన్తె సల్మా (రదియల్లాహు అన్హా) నోట ఈ హదీసు విన్న హజ్రత్ హమీద్ (రహిమహుల్లాహ్) “పూర్తి సంవత్సరం గడచిన తరువాత పెంటికలు పారేయడం అంటే ఏమిటి?” అని అడిగారు హజ్రత్ జైనబ్ (రదియల్లాహు అన్హా)ని. దానికి ఆమె ఇలా సమాధానమిచ్చారు: “అజ్ఞాన కాలంలో ఏ స్త్రీ భర్త అయినా చనిపోతే ఆ స్త్రీని పక్షిగూడులాంటి ఓ ఇరుకైన చీకటి గదిలో ఉంచేవారు. అందులోనే ఆమె ఉంటుంది. ఆమె చింపిరి గుడ్డలు కట్టుకోవలసి వచ్చేది. సువాసన వస్తువుల్ని తాకడానిక్కూడా వీల్లేదు. ఈ విధంగా ఆమె ఆ చీకటి గదిలో సంవత్సరం పాటు (నికృష్ట జీవితం) గడపవలసి వచ్చేది. ఆ తరువాత గాడిదనో, మేకనో లేదా ఏదైనా పక్షినో ఆమె దగ్గరికి తెస్తారు. ఆమె దాన్ని ముట్టుకొని తన గడువుని విరమిస్తుంది. స్త్రీలు తమ గడువు విరమించడానికి ఉపయోగించిన జంతువులేవీ సాధారణంగా జీవించి ఉండవు. చాలా వరకు చనిపోతాయి. ఆ తరువాత ఆ స్త్రీ ఆ గది నుండి బయటకి వస్తుంది. అప్పుడు ఆమెకు ఒక (మేక) పెంటిక ఇవ్వబడుతుంది. ఆమె దాన్ని తీసుకొని విసిరిపారేస్తుంది. ఆ తరువాతే ఆమెకు సువాసన పూసుకోవడానికి లేదా అలంకరణ చేసుకోవడానికి అనుమతి లభిస్తుంది.”
(ఈ హదీసు ఉల్లేఖించిన వారిలో ఒకరైన) హజ్రత్ మాలిక్ (రహిమహుల్లాహ్)ని ఒకతను “గడువును విరమించడం అంటే ఏమిటి?” అని అడిగాడు. దానికి హజ్రత్ మాలిక్ (రహిమహుల్లాహ్) “స్త్రీ ఆ జంతువుని తన శరీరంతో రుద్దుతుంది (గడువుని విరమించడమంటే అదే)” అని సమాధానమిచ్చారు.
[సహీహ్ బుఖారీ : 68వ ప్రకరణం – తలాఖ్, 46వ అధ్యాయం – తుహిద్ధుల్ ముతవఫ్ఫీ అన్హా జాజహా అర్బతుషహర వ అష్ రా]
951 – حديث أُمِّ عَطِيَّةَ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَتْ: كُنَّا نُنْهَى أَنْ نُحِدَّ عَلَى مَيِّتٍ فَوْقَ ثَلاَثٍ، إِلاَّ عَلَى زَوْجٍ أَرْبَعَةَ أَشْهُرٍ وَعَشْرًا، وَلاَ نَكْتَحِلَ وَلاَ نَتَطَيَّبَ، وَلاَ نَلْبَسَ ثَوْبًا مَصْبُوغًا إِلاَّ ثَوْبَ عَصْبٍ، وَقَدْ رُخِّصَ لَنَا عِنْدَ الطُّهْرِ، إِذَا اغْتَسَلَتْ إِحْدَانَا مِنْ مَحِيضِهَا فِي نُبْذَةٍ مِنْ كُسْتِ أَظْفَارٍ
__________
أخرجه البخاري في: 6 كتاب الحيض: 12 باب الطيب للمرأة عند غسلها من المحيض
951. హజ్రత్ ఉమ్మె అతియా (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కాలంలో స్త్రీలు భర్త తప్ప ఇతరులు చనిపోతే మూడు రోజులకు మించి శోకాన్ని పాటించకూడదని మాపై ఆంక్ష విధించారు. భర్త చనిపోయిన స్త్రీ మాత్రం నాలుగు నెలల పదిరోజులు గడువుకాలం పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ గడువు రోజుల్లో మేము సుర్మా పెట్టుకోవడానికి, సువాసన పూసుకోవటానికి వీల్లేదు. అంతేకాదు, అద్దకపు యమన్ వస్త్రాలు మినహా మరెలాంటి రంగు బట్టలు కట్టుకోవడం కూడా నిషిద్ధమే. కాకపోతే రుతుక్రమం ముగిసి స్నానం చేసినప్పుడు కుస్తీ అజ్పార్ (అరేబియాలో దొరికే ఒక విధమైన పరిమళం) ను మాత్రం కొద్దిగా పూసుకోవచ్చు.
[సహీహ్ బుఖారీ : 6వ ప్రకరణం – హైజ్, 12వ అధ్యాయం – అత్తయ్యి బిల్ మర్ అతు ఇంద గుస్లిహా అనిల్ ము హైజ్)
మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .