ప్రయాణపు నియమాలు (శత సాంప్రదాయాలు) [వీడియో]

[13] ప్రవక్త ﷺ వారి శత సాంప్రదాయాలు (హదీసులు 44 – 47) : ప్రయాణపు నియమాలు
https://youtu.be/V1AsvkTzA30 [24 min]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రయాణపు నియమాలు:

44- ప్రయాణంలో నాయకుని ఎన్నిక:

ప్రవక్త ﷺ ఉపదేశించారని అబూ సఈద్ (రజియల్లాహు అన్హు) మరియు అబూ హురైరా (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఎవరైనా ముగ్గురు మనుషులు కలసి ప్రయాణానికి వెళ్తే వారు తమలో ఒకరిని నాయకునిగా ఎన్నుకోవాలి”. (అబూదావూద్ 2608).

45- ఎత్తు ఎక్కుతూ అల్లాహు అక్బర్, పల్లంలో దిగుతూ సుబ్ హానల్లాహ్ పలకడం:

“మేము ఎత్తు ప్రదేశంలో ఎక్కెటప్పుడు అల్లాహు అక్బర్ అని, ఎత్తు నుండి దిగేటప్పుడు సుబ్ హానల్లాహ్ అని అనేవారమని జాబిర్ (రజియల్లాహు అన్హు) తెలిపారు”. (బుఖారీ 2994).

46- మజిలీ వచ్చినప్పుడు చదవవలసిన దుఆ:

ప్రవక్త ﷺ చెప్పగా తాను విన్నానని ఖౌలా బిన్తె హకీం (రజియల్లాహు అన్హా) ఉల్లేఖించారుః “ఎవరైనా ప్రయాణం చేస్తూ ఏదైనా ప్రాంతంలో మజిలీ చేసినప్పుడు ఈ దుఆ చదివితే వారు అక్కడి నుండి బయలుదేరే వరకూ వారికి ఏ హానీ కలగదుః అఊజు బికలిమాతిల్లా హిత్తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ్. (నేను అయన సృష్టి కీడు నుండి అల్లాహ్ యొక్క సంపూర్ణ వచనాల శరణు కోరుతున్నాను). (ముస్లిం 2708).

47- ప్రయాణం నుండి వచ్చీరాగానే మస్జిద్ కు వెళ్ళడం:

కఅబ్ బిన్ మాలిక్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ﷺ ప్రయాణం నుండి తిరిగి రాగానే ముందు మస్జిద్ కు వెళ్ళి రెండు రకాతుల నమాజు చేసేవారు. ((బుఖారీ 443. ముస్లిం 716).).


శత సంప్రదాయాలు (100 సునన్ ) [పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ]
https://teluguislam.net/?p=415

శత సంప్రదాయాలు (100 Sunan) – యూట్యూబ్ ప్లే లిస్ట్:
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV27XmLiRnxNDRJ4vQPx2c2O

%d bloggers like this: