https://youtu.be/nPCbMBCxVJE [36 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
[వీడియోలో చూపించిన డాక్యుమెంట్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [13 పేజీలు]
వీడియో లో చెప్పిన కొన్న ముఖ్యమైన పాయింట్లు:
శవానికి స్నానం చేయించేకి ముందు
1- మయ్యిత్ ఎవరికైనా వసియ్యత్ చేసి ఉంటే, అతనికి స్నానం చేయించే విధానం తెలిసి ఉంటే అతనే స్నానం చేయించాలి. అబూ బక్ర్ (రజియల్లాహు అన్హు) తన భార్యకు, అనస్ (రజియల్లాహు అన్హు) ముహమ్మద్ బిన్ సీరీన్ కు వసియ్యత్ చేసి ఉండిరి. (తబఖాత్ ఇబ్ను సఅద్)
2- స్నానం చేయించే వ్యక్తి ఎంత దగ్గరివారయితే అంతే మంచిది. అయితే స్నానం చేయించే విధానం తెలిసి ఉండడం తప్పనిసరి
3- భర్త భార్యకు, భార్య భర్తకు స్నానం చేయించవచ్చును. ఒక సందర్భంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయిషా (రజియల్లాహు అన్హా)తో చెప్పారు: “నీవు నాకంటే ముందు చనిపోతే నేనే నీకు స్నానం చేయించుదును, కఫన్ ధరింపజేయుదును” (ఇబ్ను మాజ 1465, షేఖ్ అల్బానీ: హసన్).
హజ్రత్ అబూ బక్ర్ సిద్దీఖ్ (రజియల్లాహు అన్హు) వసియ్యత్ చేశారు: ఆయనకు ఆయన భార్య అస్మా బిన్త్ ఉమైస్ (రజియల్లాహు అన్హా) స్నానం చేయించాలని. (ముసన్నఫ్ అబ్దుర్ రజ్జాఖ్ 6117).
4- పురుషులు మగవారికి, మగపిల్లలకు స్నానం చేయించాలి, స్త్రీలు స్త్రీలకు, ఆడపిల్లలకు స్నానం చేయించాలి.
5- స్నానం చేయించే వ్యక్తి రెండు షరతులను పాటిస్తే గొప్ప పుణ్యం పొందుతాడు:
“40 సార్లు క్షమించబడతాడు”. (సహీ తర్గీబ్ 3492).
- అల్లాహ్ ప్రసన్నత మాత్రమే కోరాలి. (ఇది తప్పనిసరి).
- ఏదైనా దోషం చూస్తే ఎవరికీ చెప్పకుండా కప్పిఉంచాలి. (ఇది విధిగా ఉంది).
శవానికి స్నానం చేయించే విధానం
1- ప్రజల దృష్టి పడని చోట స్నానం చేయించాలి.
2- నాభి నుండి మోకాళ్ళ వరకు ఏదైనా వస్త్రం కప్పి, అతని శరీరంపై ఉన్న కుట్టిన బట్టలు తీయాలి. (అబూ దావూద్ 3141లో ప్రవక్త దుస్తులు తీసే విషయంలో సహాబాల చర్చ).
3- శవాన్ని ఏదైనా కొంచెం ఎత్తైన ప్రదేశంలో పెట్టాలి.
తల మరియు వీపు క్రింద చేయి వేసి చిత్రంలో చూస్తున్నట్లు కొంచెం పైకి ఎత్తి కడుపులో ఏదైనా ఆగి ఉన్నది పోయే విధంగా తిన్నగా ఒత్తాలి.
4- స్నానం చేయిస్తున్న నియ్యత్ మనస్సులో చేసుకోవాలి.
5- హ్యాండ్ గ్లోవ్స్ వేసుకోవాలి. ఏ అడ్డు లేకుండా మృతుని మర్మాంగాన్ని ముట్టకూడదు. మృతుని మర్మాంగాన్ని చూడ కూడదు. (ముస్లిం 338). لَا يَنْظُرُ الرَّجُلُ إِلَى عَوْرَةِ الرَّجُلِ وَلَا الْمَرْأَةُ إِلَى عَوْرَةِ الْمَرْأَةِ
6- నమాజు కొరకు చేసే విధంగా వుజూ చేయించాలి. ఆ తర్వాత కుడి వైపు నుండి స్నానం చేయించడం మొదలెట్టాలి.
(బుఖారీ 167, ముస్లిం 939). «ابْدَأْنَ بِمَيَامِنِهَا وَمَوَاضِعِ الوُضُوءِ مِنْهَا»
وفي الفتح: الحكمة في الأمر بالوضوء تجديد أثر سمة المؤمنين في ظهور أثر الغرة والتحجيل.
7- తల పై నుండి ఆ తర్వాత కుడి వైపున, ఎడమ వైపున రేగాకు కలిపిన నీళ్ళతో మంచిగా స్నానం చేయించాలి.
8- మూడు సార్లు, అవసరమైతే ఎక్కువ సార్లు పర్లేదు, కాని బేసి సంఖ్యలో ఉండే విధంగా గమనించాలి. (నిసాయి 1865).
9- చివరిలో కర్పూరం కలిపిన నీళ్ళతో స్నానం చేయించాలి. అది లేనిచో ఏ సువాసన అయినా ఉపయోగించవచ్చును.
10- స్త్రీల వెంట్రుకలను మూడు భాగాలుగా చేసి జడవేయాలి. (నిసాయి 1865).
11- మృతునికి స్నానం చేయించిన వ్యక్తి స్నానం చేయడం తప్పనిసరి కాదు.