
[14:55 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
అన్నపానీయాల ఆదేశాలు
అల్లాహ్ తన దాసులకు పవిత్రమైన వస్తువులు తినుటకు ఆదేశించి, అపవిత్రమైన వాటిని వారిం- చాడు. అల్లాహ్ ఆదేశం సూర బఖర 2:172లో:
[يَا أَيُّهَا الَّذِينَ آَمَنُوا كُلُوا مِنْ طَيِّبَاتِ مَا رَزَقْنَاكُمْ]
“ఓ విశ్వాసులారా! మేమొసంగిన పవిత్ర వస్తువులను భుజించండి“. (2:172)
అన్నపానీయాల విషయంలో నియమం ఏమిటంటే: నిషేధింపబడిన కొన్ని వస్తువులు తప్ప అన్నియూ ధర్మసమ్మతమే (హలాల్). అల్లాహ్ తన దాసుల కొరకు పవిత్ర వస్తువులను ధర్మసమ్మతం చేసింది వారు వాటి నుండి ప్రయోజనం పొందాలని. అయితే వాటిని అల్లాహ్ అవిధేయత కొరకు ఉపయోగించుట ఎంత మాత్రం యోగ్యం కాదు.
తిను త్రాగు వస్తువుల్లో అల్లాహ్ తన దాసుల కొరకు నిషేధించిందేమిటో ఇలా స్పష్టపరిచాడు.
[وَقَدْ فَصَّلَ لَكُمْ مَا حَرَّمَ عَلَيْكُمْ إِلَّا مَا اضْطُرِرْتُمْ إِلَيْهِ ] {الأنعام:119}
“వాస్తవానికి గత్యంతరంలేని సంకట పరిస్థితులలో తప్ప, మిగతా అన్ని పరిస్థితులలోనూ అల్లాహ్ ఏ వస్తువుల వినియోగాన్ని నిషేధించాడో, వాటి వివరాలను మీకు ఆయన ఇది వరకే తెలియజేశాడు“. (అన్ఆమ్ 6: 119).
ఏ వస్తువు నిషిద్ధం అని తెలుపబడలేదో అది ధర్మసమ్మతం అన్న మాట. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారు:
إِنَّ اللهَ فَرَضَ فَرَائِضَ؛ فَلاَ تُضَيِّعُوْهَا، وَحَدَّ حُدُوْدًا؛ فَلاَ تَعْتَدُوهَا، وَحَرَّمَ أَشْيَاء؛ فَلاَ تَنْتَهِكُوْهَا، وَسَكَتَ عَنْ أَشْيَاءَ رَحْمَةً لَكُمْ مِنْ غَيْرِ نِسْيَانٍ؛ فَلاَ تَبْحَثُوا عَنْها. [سنن الدارقطني 4/184، حسنه النووي ].
“అల్లాహ్ మీపై కొన్ని విధులను విధించాడు; మీరు వాటిని వృధా చేయకండి. కొన్ని కట్టుబాట్లను నిర్ణయించాడు; వాటిని అతిక్రమించకండి. కొన్ని వస్తువులను నిషిద్ధపరిచాడు; వాటిని ఉల్లఘించకండి. మరికొన్ని విషయాల పట్ల మౌనం వహించాడు. మరచిపోయి కాదు, వాస్తవంలో మీపై కరుణిస్తూ; మీరు వాటి వెంటబడకండి”. (హాకిం 4/129. జామిఉల్ ఉసూల్ 5/59, నవవీ హసన్ అన్నారు).
తిను, త్రాగు, ధరించు ఏ విషయాలు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నిషిద్ధం అని తెలుపలేదో వాటిని నిషేధించుట యోగ్యం కాదు.
నియమం ఏమిటంటేః నష్టం లేని పవిత్రమైన ప్రతి వస్తువు ‘ముబాహ్‘ (యోగ్యం). అపవిత్రమైన మరియు నష్టంగల వస్తువులు నిషిద్ధం. ఉదా: పీనుగు [1], రక్తం [2], మత్తుపదార్థాలు, ధూమపానం మరియు అపరిశుభ్రంతో కలుషితమైన వస్తువులన్నియూ నిషిద్ధం. ఎందుకనగా అవి అపవిత్రంతో పాటు హాని కలిగించునవి కూడాను.
- [1] పీనుగు అంటే ధార్మిక పద్ధతితో జిబహ్ చేయకుండానే దానంతట అది చనిపోయినది.
- [2] రక్తం అంటే జిబహ్ చేసేటప్పుడు స్రవించే రక్తం. ధార్మిక పద్ధతితో జిబహ్ చేసిన తర్వాత మాంసం మధ్యలో లేదా నరాల్లో ఉండిపోయే కొంతపాటి రక్తం ధర్మసమ్మతమే.
యోగ్యమైన ఆహారాలు రెండు రకాలు: జంతువులు (మాంసాహారాలు). కూరగాయలు. (శాఖాహారాలు). వీటిలో నష్టం లేనివి యోగ్యం.
జంతువులు రెండు రకాలు: జలనివాస జంతువులు. భూనివాస జంతువులు. జల నివాస జంతువులన్నీ ధర్మసమ్మతమే. వాటిని జిబహ్ చేయాలన్న నిబంధన కూడా లేదు. చివరికి అవి దానంతటవే చనిపోయినవైనా యోగ్యమే.
భూనివాస జంతువుల్లో ఇస్లాం నిషేధించినవి తప్ప మిగితవన్నీ ధర్మసమ్మతమే. (కాని వాటిని జిబహ్ చేయాలి). ఇస్లాం నిషేధించినవి ఈ క్రింది విధంగా ఉన్నాయి:
- 1- పెంపుడు గాడిదలు.
- 2- కోరలు గల మృగాలన్నియూ నిషిద్ధం, సివంగి (దుమ్ముల గొండి) తప్ప.
పక్షులన్నియూ ధర్మసమ్మతమే. ఈ క్రింది పక్షులు తప్పః
(1) కాళ్ళ గోళ్ళ ఆధారంగా వేటాడే పక్షులు. ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారుః
نَهَي رَسُولُ الله ﷺ عَنْ كُلِّ ذِىْ نَابٍ مِنَ السِّبَاعِ، وَ عَنْ كُلِّ ذِيْ مِخْلَبٍ مِنَ الطُّيُوْر
“కోరలు గల ప్రతి మృగ జంతువు, మరియు కాళ్ళతో పట్టుకొని భక్షించే ప్రతి పక్షిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నివారించారు“. (ముస్లిం 1934).
(2) గద్ద, కాకి, రాబందుల్లాంటి శవాలను తినే పక్షులు. అవి మలినము, అపరిశుభ్రమైనవాటిని తింటాయి గనుక నిషిద్ధం.
(3) పాము, ఎలుక మరియు పురుగులు, క్రిమికీటకాలు లాంటి అశుద్ధమైనవి కూడా నిషిద్ధం.
పైన తెలుపబడిన జంతువులు, పక్షులు తప్ప మిగితవన్నీ ధర్మసమ్మతమే: గుఱ్ఱం, ఒంటె, ఆవు, ఎద్దు, మేక, గొర్రె, బర్రె, కోడి, అడవిగాడిద, నిప్పుకోడి, కుందేలు, ఉడుం వగైరాలు.
‘జల్లాల‘ నిషిద్ధం. జల్లాల అంటే ఎక్కువ శాతం మలినం తినే పక్షి, పశువు అని అర్థం. కాని దానిని మూడు రోజులు అలాంటి పదార్థాలు తినకుండా ఆపి, పరిశుభ్రమైన తిను పదార్థాలు ఇస్తూ ఉంటే ఆ తర్వాత అది ధర్మసమ్మతం అమవుతుంది.
ఉల్లి, ఎల్లి లాంటి దుర్వాసన గల వస్తువులు (ధర్మసమ్మత మైనప్పటికీ) మస్జిదుకు వెళ్ళే ముందు అవి పచ్చివిగా తినుట ‘మక్రూహ్’ (ఇష్టం లేని కార్యం).
ప్రాణం పోవులాంటి పరిస్థితి ఏర్పడి నిషిద్ధ వస్తువు తప్ప మరేది లేనప్పుడు ప్రాణం కాపాడుటకు సరిపడునంత పరిమాణంలో నిషిద్ధ వస్తువు తినవచ్చు. కాని విషం తినకూడదు.
చుట్టూ గోడ లేని మరియు కాపలాదారుడు లేని పండ్ల తోట నుండి దాటుతూ క్రింద పడిన పండ్లు తినవచ్చు. కాని తన వెంట తీసుకెళ్ళ కూడదు. అలాగే రాళ్ళు విసిరి పండ్లు క్రింద పడగొట్టి, లేదా చెట్టు ఎక్కి తినడం యోగ్యం కాదు. అలాగే ఒక చోట కుప్పజేసియున్న దానిలో నుండి తీసుకోవడం కూడా యోగ్యం కాదు. కాని మరీ అత్యవసర పరిస్థితిలో ఆకలిని తీర్చు పరిమాణంలో తింటే తప్పు లేదు.
తరువాతి పాఠం:
అన్నపానీయాల ఆదేశాలు – 2 : జిబహ్ & వేట [వీడియో]
You must be logged in to post a comment.