తహజ్జుద్‌ పుణ్యానికి సరిసమానమైన సత్కారాలు – జొహ్ర్ నమాజుకు ముందు నాలుగు రకాతుల సున్నత్ చేయుట [ఆడియో]

మరణాంతర జీవితం – పార్ట్ 25 నుండి తీసుకోబడింది
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు [పుస్తకం & ముందు వీడియో పాఠాలు ]
https://teluguislam.net/books/deeds-heavy-meezan

త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://bit.ly/3xYzpbN

తహజ్జుద్‌ పుణ్యానికి సరిసమానమైన సత్కారాలు – జొహ్ర్ నమాజుకు ముందు నాలుగు రకాతుల సున్నత్ చేయుట
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) [10 నిముషాలు]

జొహ్ర్ నమాజుకు ముందు నాలుగు రకాతుల సున్నత్ చేయుట

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని, అబూ సాలిహ్ రహిమహుల్లాహ్ ‘మర్ ఫూఅ’, ‘ముర్ సల్’ ఉల్లేఖించారుః

أَرْبَعُ رَكَعَاتٍ قَبْلَ الظُّهْرِ، يَعْدِلْنَ بِصَلَاةِ السَّحَرِ
“జుహ్ర్ కు ముందు నాలుగు రకాతుల నమాజు సహర్ లో చేసే (తహజ్జుద్) నమాజుకు సమానమైనది”.
(ముసన్నఫ్ ఇబ్ను అబీ షైబ 5940, అల్బానీ సహీహ 1431లో హసన్ అని చెప్పారు.

ఈ నాలుగు రకాతుల మరో ప్రత్యేకత ఏమిటంటే వాటి కొరకై ఆకాశపు ద్వారాలు తెరువబడతాయి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారని అబూ అయ్యూబ్ అన్సారీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

أَرْبَعٌ قَبْلَ الظُّهْرِ تُفْتَحُ لَهُنَّ أَبْوَابُ السَّمَاءِ
జుహ్ర్ కు ముందు నాలుగు రకాతులున్నాయి, వాటి కొరకు ఆకాశపు ద్వారాలు తెరువబడతాయి”.
(అబూ దావూద్ 3128, షమాఇల్ తిర్మిజి, అల్బానీ సహీహుత్తర్గీబ్ 585లో హసన్ లిగైరిహీ అని చెప్పారు).

అందుకనే ప్రవక్త ﷺ ఈ రకాతులు చేయుటకు అతిగా కాంక్షించేవారు. అకాస్మాత్తుగా ఏదైనా కారణం వల్ల తప్పిపోయినా ఫర్జ్ నమాజు తర్వాత వాటిని చేసేవారు. ఈ విషయం ఆయిషా (రజియల్లాహు అన్హా) తెలిపారుః

“ఆయన ﷺ ఎప్పుడైనా జుహ్ర్ కు ముందు నాలుగు రకాతులు చేయలేక పోతే జుహ్ర్ తర్వాత చేసేవారు.”

ఇంకా బైహఖీ ఉల్లేఖనంలో ఆమె రజియల్లాహు అన్హా  ఇలా తెలిపినట్లు ఉందిః

జుహ్ర్ కు ముందు నాలుగు రకాతులు తప్పిపోతే జుహ్ర్ తర్వాత చేసేవారు.”

(తిర్మిజి 426, బైహఖీ, అల్బానీ సహీ తిర్మిజి 350లో హసన్ అని అన్నారు).

అందుకు, ఈ నాలుగు రకాతులు ఎవరికైనా తప్పిపోతే, లేదా ఏదైనా పని వల్ల చేయుటకు వీలు పడకపోతే -ఉదాహరణకుః కొందరు టీచర్లు- ఆ పని అయిన తర్వాత తమ ఇంటికి వచ్చి చేసుకోవచ్చును.

Source: త్రాసును బరువు చేసే సత్కార్యాలు (Meezaan) – PDF Book

Great Rewards – చిన్న పనులు – గొప్ప పుణ్యాలు

%d bloggers like this: