24. హజ్రత్ అబ్దుల్లా బిన్ అమ్ర్ (రధి అల్లాహు అన్హు) కధనం:-
ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చి “ఇస్లాం కు సంబంధించిన ఆచరణలలో అన్నిటికన్నా శ్రేష్ఠమైన ఆచరణ ఏది ?” అని అడిగాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “నీవు బీదసాదలకు అన్నంపెట్టు . (అలాగే) పరిచయమున్నా లేకపోయినా ప్రతివ్యక్తి కీ సలాం చెయ్యి. ఇవే అన్నిటికంటే శ్రేష్ఠమైన ఆచరణలు” అని బోధించారు.