49. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రధి అల్లాహు అన్హు) కధనం:-
ఈదుల్ అజ్హా లేక ఈదుల్ ఫిత్ర్ (పండగ) దినాన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈద్గాహ్ లో మహిళా భక్తుల ముందు నుంచి పోతూ”మహిళల్లారా! నరకంలో మీ సంఖ్య అధికంగా ఉన్నట్లు నాకు ‘మేరాజ్’ రాత్రిన చూపడం జరిగింది. అందువల్ల మీరు (వీలైనంత ఎక్కువగా) దానం చేస్తూ ఉండండి” అని బోధించారు. స్త్రీలు ఈ మాటలు విని “దానిక్కారణం ఏమిటి ధైవప్రవక్తా?” అని అడిగారు.
“మీరు తరచుగా నోరు పారేసుకుంటారు; భర్తల పట్ల కృతజ్ఞులయి ఉండరు. ధర్మం, విజ్ఞతా వివేచనల దృష్ట్యా మీరు పురుషుల కన్నా తక్కువ అయినప్పటికీ పురుషుల్ని లోబరచుకుంటున్నారు”
అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).
“ధర్మం, విజ్ఞతా వివేచనల దృష్ట్యా మేము పురుషుల కన్నా తక్కువ ఎలా అయ్యాము ధైవప్రవక్తా?” అని అడిగారు స్త్రీలు.
దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “స్త్రీ సాక్ష్యం పురుష సాక్ష్యంలో సగానికి సమానం (అంటే ఒక పురుషుని సాక్ష్యం ఇద్దరు స్త్రీల సాక్ష్యంతో సమానం) కాదా?” అన్నారు. స్త్రీలు ‘ఔను, నిజమే’అన్నారు. “స్త్రీలలో విజ్ఞతా వివేచనలు తక్కువ అనడానికి ఇదే నిదర్శనం. అలాగే స్త్రీలు రుతు సమయంలో నమాజ్ చేయలేరు కదా? ఉపవాసాలు పాటించలేరు కదా?” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). దానికి స్త్రీలు ‘ఔను, నిజమే’ అన్నారు. “కనుక ధర్మం దృష్ట్యా స్త్రీలు పురుషుల కన్నా తక్కువ అనడానికి ఇదొక నిదర్శనం” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).