ఇస్లాం ధర్మంలో తుమ్మినప్పుడు ఆచరించవలసిన పధ్దతి

హదీథ్׃ 05

من آداب العطاس ఇస్లాం ధర్మంలో తుమ్మినప్పుడు ఆచరించవలసిన పధ్దతి

عن أبي هريرةَ رضيَ الله عنه عنِ النبيّ صلى الله عليه وسلم قال: إذا عطَسَ أحدُكم فليقل الحمد لله, وليقلْ له أخوه أو صاحبه ـ يَرحمكَ الله, فإذا قال له يَرحمكَ الله, فليقل: يَهديكُم الله ويُصلحُ بالكم) .رواه البخاري .

అన్ అబీ హురైరత రదియల్లాహు అన్హు, అనిన్నబియ్యి సల్లల్లాహు అలైహి వసల్లం ఖాల – ఇదా అతస అహదుకుమ్ ఫల్ యఖుల్ అల్ హదులిల్లాహ్, వల్ యఖూలల్లాహు అఖూహు అవ్ సాహిబహు యర్ హమకల్లాహ్, ఫఇదా ఖాల లహు యర్ హమకల్లాహ, ఫల్ యఖుల్ యహ్ దీ కుముల్లాహ్ వ యుశ్ లిహు బాలకుమ్ బుఖారి.

అనువాదం: మీలో ఎవరైనా ఒకవేళ తుమ్మినప్పుడు, అల్ హందులిల్లాహ్ అని పలకవలెను. మరియు అతని దగ్గరున్న సోదరుడు గాని లేదా మిత్రుడు గాని జవాబుగా అతడి కోసం యర్ హమకల్లాహ్ అని పలకవలెను. అలా యర్ హమకల్లాహ్ అని పలికినప్పుడు, తుమ్మినతడు బదులుగా వారికోసం యహ్ దీ కుముల్లాహ్ వ యుశ్ లిహు బాలకుమ్ అని పలకవలెను.

హదీథ్ ఉల్లేఖించినవారి పరిచయం:- అబుహురైరా అబ్దుర్రహ్మాన్ బిన్ సఖర్ అద్దౌసి రదియల్లాహు అన్హు ఖైబర్ యుద్ధం జరిగిన 7హి సంవత్సరంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహచర్యంలోనికి చేరారు. ఎక్కువ హదీథ్ లను జ్ఞాపకం ఉంచుకున్నవారిలో ఒకరు.

వివరణ:- ఈ హదీథ్ లో తుమ్మినతడు పొందే అల్లాహ్ యొక్క దీవెనల గురించి ప్రస్తావించబడినది. అతడికి లభించే పుణ్యాల గురించి తెలుపబడినది. అల్లాహ్ యొక్క అనంతమైన కరుణాకటాక్షాలు అతడి పై ఎలా అవతరిస్తున్నాయో ఈ హదీథ్ తెలియజేస్తున్నది. మానవుడికి అనారోగ్యం కలిగించే కొన్ని వాయువుల నుండి తుమ్ము మనల్ని కాపాడును. అటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించే తుమ్ముకు బదులుగా అల్ హమ్ దులిల్లాహ్ అని పలుకుతూ అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకోమని ఇస్లాం ధర్మం ఆదేశిస్తున్నది. అలా పలకటం ద్వారా తన చుట్టుప్రక్కల ఉన్నవారి ఆశీస్సులూ లభించటం జరుగును.

Source : హదీథ్ – మొదటి స్థాయి (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  సయ్యద్ యూసుఫ్ పాషా

%d bloggers like this: