
[3:04 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
తెలుగుఇస్లాం.నెట్ * తెలుగులో ఇస్లాం జ్ఞాన సంపద *
[3:04 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
“ప్రజలను అల్లాహ్ మార్గం నుండి తప్పించడానికి “లహ్‌వల్ హదీస్” కొనేవాడూ…. ” (31: లుఖ్మాన్: 6)
పై ఆయతులోని “లహ్ వల్ హదీస్” అన్న పదానికి అర్థం పాటలు, మ్యూజిక్‌లు అని ఇబ్ను మస్ఊద్ (రది అల్లాహు అన్హు) ప్రమాణం చేసి చెప్పేవారు. (తఫ్సీర్ ఇబ్నె కసీర్).
అబూ ఆమిర్, అబూ మూలిక్ అష్‌అరీ & ఉల్లేఖనాల ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు:
“తప్పక నా అనుచరుల్లో ఒక సంఘం వ్యభిచారం, పట్టు దుస్తులు, మత్తు పానీయాలు మరియు సంగీత సామాగ్రి, వీటన్నింటినీ ధర్మసమ్మతం చేసుకుంటుంది… (వాస్తవానికి అవి నిషిద్ధం)”. (బుఖారి, కితాబుల్ అష్రబ, బాబు మా జాఅ ఫీ మన్ యస్తహిల్లుల్ ఖమ్ర…)
అనస్ (రదియల్లాహు అన్హు) ప్రవక్తతో ఉల్లేఖించారు:
“ఈ అనుచర సంఘంలో ఇలాంటి విపత్తులు వచ్చి ఉంటాయి. అవేమనగా: భూమిలో అణగద్రొక్కబడుట. రాళ్ళ వర్షం కురియుట. ముఖాలను మార్చుట. ఎప్పుడైతే ఈ అనుచర సంఘంలో కొందరు మత్తు పానీయాలు సేవించడం, ఆటపాటకత్తెలను ఉంచుకొనడం, వాద్యం వాయించడం లాంటి అలవాట్లకు లోనవుతారో అప్పుడు వారిపై ఈ విపత్తులు కురుస్తాయి.” (సహీహ: 2203. ఈ భావం తిర్మిజిలో కూడా ఉంది 2212).
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఢోలు (డప్పు) వాయించడాన్ని నివారించారు. సంగీత సామాగ్రి దుర్మార్గుల, బుద్ధిహీనుల ధ్వని అని తెలిపారు. ఇమాం అహ్మద్ రహిమహుల్లాహ్ లాంటి పూర్వ పండితులు సితారు, వీణ, తంబురా లాంటి ఆటపాటలు, మ్యూజిక్ పరికరాలు నిషిద్ధం అని స్పష్టంగా చెప్పారు. నిస్సందేహంగా ఇవన్నియు మ్యూజిక్ పరికరాల్ని నివారించిన ప్రవక్త హదీసులోనే వస్తాయి. ఇంకా పియానో (piano), గిటారు (guitar) వగైరా కూడా ఈ కోవలోకే వస్తాయి. ఏ పాత మ్యూజిక్ సాధనాల గురించి నిషిధ్ధత హదీసులో వచ్చిందో, వాటికంటే ఆధునిక సాధనాల ద్వారా వినువారిని మత్తులో పడవేసే ప్రభావం ఎక్కువ ఉంది.
ఇబ్ను అల్-ఖయ్యిం (రహిమహుల్లాహ్) లాంటి పండితుల కథనం:
“మ్యూజిక్ (సంగీతం) యొక్క నిషా, మత్తు సారాయి మత్తుకంటే భయంకరమైనది.“
మ్యూజిక్ తో పాట, పాటకత్తెల (గాయకురాలి) స్వరం కూడా కలసిందంటే నిషిద్ధత మరీ పెరిగిపోతుంది. పాపం మరీ ఎక్కువవుతుంది. ఒకవేళ ప్రేమ, మోహం మరియు అందకత్తెల అందాలను వర్ణించే పాటలు ఉంటే, నిషిధ్ధత సమస్య మరింత తీవ్రమౌతుంది. అందుకే పాట వ్యభిచారానికి ఒక సాధనం లాంటిదన్నారు పండితులు. ఇంకా అది హృదయంలో నిఫాఖ్ (కపటత్వం) మొలకల్ని మొలకిస్తుంది.
ఇక ఈ కాలంలో పాటలు, మ్యూజిక్ లు మహా అల్లకల్లోలాన్ని సృష్టించేవిగా తయారయినాయి. దానిపై మరో సమస్య ఏమనగా గడియారం, బెల్లు, అలారం, పిల్లవాళ్ళ ఆట వస్తువులు, కంప్యూటర్లు, మరియు సెల్ ఫోన్, టెలిఫోన్లలో కూడా మ్యూజిక్ రాగాలు ఉన్నాయి. ఇక దాని నుండి జాగ్రత్త పడుట ధైర్యవంతుల పనే.
[ఇది ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) గారు రాసిన “ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు”అను పుస్తకం నుంచి తీసుకుబడింది]
You must be logged in to post a comment.