నువ్వు అల్లాహ్ ప్రసన్నత కోసం నీ భార్య నోట్లో పెట్టే ముద్దకు కూడా ప్రతిఫలం పొందుతావు https://youtu.be/H4nt2ZIXdcA [12 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తాను అంతిమ హజ్ యాత్ర చేసిన యేట వ్యాధిగ్రస్తుణ్ణయి ఉన్న నన్ను పరామర్శించే నిమిత్తం నా వద్దకు వచ్చారు. అప్పుడు నేను విపరీతమైన నొప్పితో బాధపడుతున్నాను. నేను ఆయన్ని “దైవప్రవక్తా! నా నొప్పి ఎంత తీవ్రంగా తయారయిందో తమరు చూస్తూనే ఉన్నారు. నేనా డబ్బు కలవాణ్లి. నాకు ఒక్కగానొక్క కూతురు తప్ప ఇతర వారసులెవరూ లేరు. నేను నా ధనంలోని మూడింట రొండొంతులను ఎవరికైనా దానం చేయవచ్చా?” అని అడిగాను. దానికి ఆయన “కూడదు” అన్నారు. తిరిగి నేను “సగం ధనం దానం చేయనా” అని అడిగాను. దానికి కూడా ఆయన “కూడదు” అనే అన్నారు. మళ్ళీ నేను “మూడింట ఒక వంతైనా దానం చేయలేనా దైవ ప్రవక్తా!” అని విన్నవించుకోగా అందుకు ఆయన “మూడింట ఒక వంతు అయితే చేయగలవు. కాని అది కూడా ఎక్కువే (లేక) పెద్దదే అవుతుంది” (అని అన్నారు). “ఎందుకంటే నువ్వు నీ వారసులను పరుల ముందు చేయి చాపుతూ తిరిగి దరిద్రులుగా వదలి వెళ్ళడంకన్నా స్టితిమంతులుగా వదలి వెళ్ళడమే ఎంతో శ్రేయస్కరం. (గుర్తుంచుకో!) నువ్వు దైవప్రసన్నత కోసం ఏది ఖర్చు పెట్టినా దానికి నువ్వు ప్రతిఫలం పొందుతావు. ఆఖరికి నువ్వు నీ భార్య నోట్లో పెట్టే ముద్దకు కూడా ప్రతిఫలం పొందుతావు” అని ఉపదేశించారు.
అప్పుడు నేను “ఓ దైవప్రవక్తా! నేను నా సహచరుల వెనుక ఉండిపోతానా? (అంటే నా సహచరులు ముందుగానే చనిపోయి నేను ఈ లోకంలో ఒక్కడినే ఉండిపోతానా?)” అని సందేహపడగా దానికి ఆయన “(అయితేనేమి? మంచిదేగా) ఎందుకంటే నీ సహచరుల అనంతరం నువ్వు బ్రతికివుంటే దైవప్రసన్నత కోసం నువ్వు చేసుకునే ప్రతి ఆచరణతో నీ స్థాయి, అంతస్థులు పెరుగుతాయి. బహుశా నీకు ఇంకా జీవితం గడిపే అవకాశం లభిస్తుందేమో! అప్పుడు కొంత మంది (విశ్వాసులకు) నీవల్ల మేలు కలగవచ్చు, ఇంకొంతమంది (దైవ తిరస్కారులకు) నీ వల్ల కీడు కలగవచ్చు. ఓ అల్లాహ్! నా సహచరుల హిజ్రత్‌ని (ప్రస్థానాన్ని) పరిపూర్ణం గావించు. వారిని పరాజయం పాలుచేయకు’ అని వేడుకున్నారు. కాని “సాద్ బిన్ ఖౌలా” దయార్హులు. ఎందుకంటే ఆయన మక్కాలో ఉండగానే కన్నుమూశారు. అందుకని ఆయన కనికరించబడాలని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దుఆ చేసేవారు. (బుఖారీ – ముస్లిం)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
మనిషి సామూహికంగా చేసే నమాజు అతను తన ఇంట్లో /బజారులో చేసే నమాజుకన్నా 20 రెట్లకు పైగా ఘనమైనది, ఎందుకంటే? https://youtu.be/sPhvRWKKhMY [19 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
“మనిషి సామూహికంగా చేసే నమాజు అతను తన ఇంట్లో లేక బజారులో చేసే నమాజుకన్నా ఇరవై రెట్లకు పైగా ఘనమైనది. ఎందుకంటే ఒక వ్యక్తి చక్కగా వుజూ చేసుకుంటాడు, తరువాత నమాజు కోసం మస్జిద్ కు వస్తాడు. నమాజు మాత్రమే అతణ్ణి మస్జిద్కు తీసుకువస్తే – అలాంటి వ్యక్తి మస్జిద్ చేరుకునేంత వరకూ అతను వేసే ఒక్కో అడుగుకు బదులుగా అతని ఒక్కో అంతస్తు పెరుగుతూ ఉంటుంది. అతని వల్ల జరిగిన ఒక్కో పాపం తొలగించబడుతూ ఉంటుంది. ఆ తరువాత మస్జిద్లో ప్రవేశించిన పిదప నమాజు అతన్ని ఆపివుంచినంతసేపూ అతను నమాజు చేస్తున్నట్టుగానే పరిగణించ బడతాడు. మీలో ఎవడైనా నమాజు చేసిన స్థానంలో కూర్చొని ఉన్నంత వరకూ దైవదూతలు అతనిపై అల్లాహ్ కారుణ్యం కురవాలని వేడుకుంటూనే ఉంటారు. ఆ వ్యక్తి పరులకు హాని కలిగించనంతవరకు, అతని వుజూ భంగం కానంతవరకు దైవదూతలు “ఓ అల్లాహ్! ఈ వ్యక్తిని కరుణించు. ఓ అల్లాహ్! ఇతన్ని మన్నించు. ఓ అల్లాహ్! ఇతన్ని కనిపెట్టుకుని ఉండు ‘ అని విన్నవించుకుంటూ ఉంటారు”
(బుఖారీ – ముస్లిం). హదీసు వాక్యాలు మాత్రం ముస్లింలోనివి. హదీసులో వచ్చిన పదం “యన్‌హజుహూ” అంటే అతన్ని బయటికి తీసుకువస్తుంది లేక అతన్ని లేపుతుందని అర్థం.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అల్లాహ్ మీ శరీరాలను, మీ ముఖాలను చూడడు. ఆయన మీ అంతరంగాలను, ఆచరణలను మాత్రమే చూస్తాడు https://youtu.be/5AZinozb7W8 [18 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
హజ్రత్ అబూ హురైరా అబ్దుర్రహ్మాన్ బిన్ సఖర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు: “అల్లాహ్ మీ శరీరాలను, మీ ముఖాలను చూడడు. ఆయన మీ అంతరంగాలను, ఆచరణలను మాత్రమే చూస్తాడు.” (ముస్లిం)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఇద్దరు ముస్లింలు తమ తమ ఖడ్గాలతో పరస్పరం దాడికి దిగితే, హంతకుడు, హతుడు – ఇద్దరూ నరకానికి వెళతారు https://youtu.be/hVPv5X3woKA [10 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
9. హజ్రత్ అబూబక్రహ్ నుఫైబిన్ హారిస్ సఖఫీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) :
“ఇద్దరు ముస్లింలు తమ తమ ఖడ్గాలతో పరస్పరం దాడికి దిగితే, హంతకుడు, హతుడు – ఇద్దరూ నరకానికి వెళతారు” అని చెప్పారు. నేను “దైవప్రవక్తా! హంతకుని మాట సరేగాని హతుడేం పాపం చేశాడని నరకానికి వెళతాడు? అని సందేహపడ్డాను. అందుకాయన “అతనూ తన ప్రత్యర్థిని చంపాలన్న కసితోనే ఉన్నాడు కదా!” అని బదులిచ్చారు. (బుఖారీ -ముస్లిం)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అల్లాహ్ సత్కార్యాలను, దుష్కార్యాలను రాసి, పిదప వాటిని గురించి వివరించాడు – రియాదుస్ సాలిహీన్ https://youtu.be/LEj9zcBqzMI [16 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
[11] దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన ప్రభువు ద్వారా ఉల్లేఖించిన విషయాన్ని హజ్రత్ అబుల్ అబ్బాస్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ (రదియల్లాహు అన్హు) ఈ విధంగా ఉటంకించారు :
“అల్లాహ్ సత్కార్యాలను, దుష్కార్యాలను రాసి, పిదప వాటిని గురించి వివరించాడు; ఎవరైనా ఏదైనా మంచి పని చేయాలని సంకల్పించుకొని, (ఏదయినా కారణంచేత) దానిని అమలుపరచలేక పోయినప్పటికీ అల్లాహ్ తన వద్ద అతను ఒక సత్కార్యం పూర్తి చేసినట్టు రాసుకుంటాడు. మరి ఆవ్యక్తి ఆ మంచి పని చేయాలని ఉద్దేశించుకొన్న పిదప దాన్ని నెరవేరిస్తే దానికి అల్లాహ్ పది నుండి ఏడు వందల రెట్లు – ఇంకా దానికంటే ఎన్నో రెట్లు అధికంగానే సత్కర్మలు చేసినట్లు అతని ఖాతాలో రాస్తాడు. (దీనికి భిన్నంగా) ఎవడైనా ఒక చెడుపని చేయాలనుకుని ఏదయినా కారణంచేత చేయకుండా ఉంటే అప్పటికీ అల్లాహ్ తన వద్ద, ఆ వ్యక్తి పూర్తిగా ఒక మంచి పని చేసినట్టు రాసుకుంటాడు. అయితే అతను ఆ చెడ్డపని చేయాలని సంకల్పించుకున్న పిదప దాన్ని చేసేస్తే మాత్రం ఒక్క చెడ్డపని చేశాడని పొందుపరుస్తాడు” (బుఖ్లూరీ -ముస్లిం)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో మొత్తం 21 ఆయతులు ఉన్నాయి. ఈ సూరా ముఖ్యంగా అల్లాహ్ మార్గంలో కృషిచేయడం గురించి, ఇహ లోకంలో మన సంఘర్షణ గురించి తెలియజేసింది. మొదటి ఆయతులో వచ్చిన ‘లైల్’ (రాత్రి) అన్న ప్రస్తావన ఆధారంగా ఈ సూరాకు ఈ పేరు పెట్టడం జరిగింది. ఇహలోక జీవితం ఒక సంఘర్షణ అని, ఇహపరలోకాల్లో సాఫల్యం లేదా వైఫల్యం అన్నది ఈ సంఘర్షణపై ఆధారపడి ఉందని, మనం అల్లాహ్ ను విశ్వసించి మంచి పనులు చేస్తే, అల్లాహ్ పట్ల భయభీతులు కలిగి ఉండి, దానధర్మాలు చేస్తే, సత్యాన్ని విశ్వసిస్తే సాఫల్యం పొందగలమనీ, అల్లాహ్ మనకు శాశ్వత స్వర్గవనాలు ప్రసాదిస్తాడని తెలిపింది. కాని మనిషి దుర్మార్గానికి కట్టుబడి, అల్లాహు దూరమైతే, స్వార్ధంతో, దురాశతో వ్యవహరిస్తే, సత్యాన్ని తిరస్కరిస్తే దారుణంగా విఫలమవుతాడు. అల్లాహ్ఆ దేశాలను తిరస్కరించిన వారికి భగభగమండే అగ్నిశిక్ష సిద్ధంగా ఉందని హెచ్చరించడం జరిగింది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
పరిచయం: ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో మొత్తం 8 ఆయతులు ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై అల్లాహ్ అనుగ్రహాలను ఈ సూరాలో ముఖ్యంగా ప్రస్తావించడం జరిగింది. ఈ సూరా మొదటి ఆయతులో వచ్చిన ప్రస్తావన ఆధారంగా ఈ సూరాకు ఈ పేరు పెట్టడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) హృదయాన్ని అల్లాహ్ కారుణ్యంతో నింపాడు. ప్రజలందరినీ ఆహ్వానించే హృదయవైశాల్యం ప్రసాదించాడు. కష్టనష్టాలను తొలగించి, ఆయన హోదా గౌరవాలను ఇనుమడింపచేసాడు. కాబట్టి, అధైర్యపడకుండా, క్రుంగిపోకుండా, అల్లాహ్ ప్రసన్నత పొందడానికి తీరిక లభించినపుడు ఆరాధనలో నిమగ్నమై పోవాలని ఆయనకు బోధించడం జరిగింది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో 11 ఆయతులు ఉన్నాయి. అల్లాహ్ పట్ల మనిషి కృతఘ్నతను, ప్రాపంచిక జీవితం పట్ల వ్యామోహాన్ని ఈ సూరా ప్రస్తావించింది. ఈ సూరాకు పెట్టిన పేరు మొదటి ఆయతులో ప్రస్తావనకు వచ్చింది. ఈ సూరా యుద్ధ రంగంలో విశ్వాసులు ఉపయోగించే గుర్రాలకు సంబంధించిన వర్ణనతో ప్రారంభమయ్యింది. ప్రజలు తమ సంపద పట్ల, ప్రాపంచిక భోగభాగ్యాల పట్ల ఎలా వ్యామోహం పెంచుకుంటారో వివరించింది. అల్లాహ్ పట్ల ఎలా కృతఘ్నులు అవుతారో తెలిపింది. తీర్పుదినాన ప్రతి ఒక్కరి కర్మల చిట్టా అతని ముందు ఉంటుందని, ప్రతి ఒక్కరి రహస్యాలు బట్టబయలవుతాయని తెలియజేసింది.
100:2 فَالْمُورِيَاتِ قَدْحًا మరి డెక్కల రాపిడితో నిప్పు రవ్వలను చెరిగేవాటి సాక్షిగా![2]
100:3 فَالْمُغِيرَاتِ صُبْحًا మరి ప్రభాత సమయాన (ప్రత్యర్ధులపై) మెరుపుదాడి చేసేవాటి సాక్షిగా![3]
100:4 فَأَثَرْنَ بِهِ نَقْعًا – మరి ఆ సమయంలో అవి దుమ్ము ధూళిని రేపుతాయి.[4]
100:5 فَوَسَطْنَ بِهِ جَمْعًا మరి దాంతో పాటు (శత్రు) సైనిక పంక్తుల మధ్యలోకి చొచ్చుకు పోతాయి.[5]
100:6 إِنَّ الْإِنسَانَ لِرَبِّهِ لَكَنُودٌ అసలు విషయం ఏమిటంటే మానవుడు తన ప్రభువు (విషయంలో) చేసిన మేలును మరచినవాడుగా తయారయ్యాడు.[6]
100:7 وَإِنَّهُ عَلَىٰ ذَٰلِكَ لَشَهِيدٌ నిజానికి ఈ విషయానికి స్వయంగా అతనే సాక్షి![7]
100:8 وَإِنَّهُ لِحُبِّ الْخَيْرِ لَشَدِيدٌ యదార్ధానికి అతను ధన ప్రేమలో మహా ఘటికుడు.[8]
100:9 أَفَلَا يَعْلَمُ إِذَا بُعْثِرَ مَا فِي الْقُبُورِ ఏమిటి, సమాధుల్లోని వాటిని బయటికి కక్కించబడే సమయం గురించి అతనికి తెలియదా?[9]
100:10 وَحُصِّلَ مَا فِي الصُّدُورِ గుండెల్లోని గుట్టంతా రట్టు చేయబడే సమయం గురించి (అతనికి తెలీదా?)[10]
100:11 إِنَّ رَبَّهُم بِهِمْ يَوْمَئِذٍ لَّخَبِيرٌ నిశ్చయంగా ఆ రోజు వారి ప్రభువుకు వారి గురించి బాగా తెలిసి ఉంటుంది.[11]
Footnotes:
[1] ‘ఆదియాత్‘ అంటే చాలా వేగంగా పరుగెత్తే గుఱ్ఱాలని అర్థం. ‘దబ్ హున్‘ అంటే వగర్చటం, రొప్పటం అని ఒక అర్థం. సకిలించటం అని మరో అర్థం. అంటే రొప్పుతూ లేక ఆవేశంతో సకిలిస్తూ రణరంగంలో శత్రు సేనల వైపు దూసుకుపోయే గుర్రాలని భావం.
[2] ఆ విధంగా అవి పరుగెత్తుతూ పోతున్నప్పుడు వాటి డెక్కల రాపిడికి నిప్పు కూడా పుడుతుంది. ముఖ్యంగా అవి పర్వత కనుమల మీదుగా పోతున్నప్పుడు, రాతి ప్రదేశాలలో తమ ఖురములను నేలకు కొడుతూ పోతున్నప్పుడు ఈ దృశ్యం కనిపిస్తుంది. అటువంటి అశ్వాల మీద ప్రమాణం చేసి రానున్న వాక్యాలలో ఒక ముఖ్య విషయం చెప్పబడుతోంది.
[3] ‘ముగీరాత్‘ అంటే ఆకస్మిక దాడి జరిపేవి అని అర్థం. పూర్వం అరేబియాలో సాధారణంగా ఉదయం పూటే యుద్ధం మొదలయ్యేది. రాత్రిపూట అందరూ ఆదమరిచి నిద్రపోతుండగా శత్రు శిబిరాలపై విరుచుకుపడటం పిరికితనానికి నిదర్శనమని, శూరులైన వారెవరూ అలాంటి వెన్నుపోటుకు పాల్పడరని వారు భావించేవారు.
[4] అంటే – ఆ గుర్రాలు వేగంగా దూసుకు పోతున్నప్పుడు, శత్రుశిబిరంపై ఆకస్మిక దాడులు జరిపినప్పుడు ఆ ప్రాంతమంతా దుమ్ముధూళితో నిండిపోతుంది.
[5] ‘వసత్న‘ అంటే మధ్యలోకి అని అర్థం. తాము రేపిన దుమ్ముతో ఆ ప్రదేశమంతా కలుషితమై, ఏమీ కానరాని పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ గుర్రాలు అకస్మాత్తుగా శత్రువుల శ్రేణులలోకి చొచ్చుకుపోయి కలకలాన్ని సృష్టిస్తాయి.
[6] మొదటి ఐదు ఆయతులలో చేయబడిన ప్రమాణాలకు సమాధానం ఈ (6వ) ఆయతులో ఇవ్వబడింది. ఇక్కడ ‘మానవుడు’ అంటే సత్య తిరస్కారి, దైవధిక్కారి అయినవాడు అన్నమాట! మేలును మరచిన వారే ఇలా తయారవుతారు.
[7] అంటే – మనిషి తన ప్రవర్తన ద్వారా, మాటల ద్వారా తాను దేవుని కృతఘ్నుణ్ణి అని ఖుద్దుగా నిరూపించుకుంటున్నాడు.
[8] ఇక్కడ “ఖైర్” అనే అరబీ పదం ధనం, డబ్బు, సిరిసంపదలు అన్న అర్థంలో ప్రయోగించ బడింది. ఉదాహరణకు: అల్ బఖరా సూరాలోని 180వ వచనంలో “ఇన్ తరకల్ ఖైరా….” ను చూడండి. అక్కడ ఆ పదం ఆస్తిపాస్తులు, సిరిసంపదలు అన్న అర్థంలోనే ఉంది. “షదీద్‘ అంటే ‘చాలా గట్టివాడు’ అని అసలు అర్థం. అయితే ధనాశ కలవాడు, పిసినారి అని కూడా చెప్పవచ్చు. సాధారణంగా సంపద వ్యామోహంలో చిక్కుకుపోయినవాడే పిసినిగొట్టుగా, పేరాశాపరునిగా తయారవుతాడు.
[9] అంటే – సమాధులలో ఉన్న మృతులంతా బ్రతికించబడి, లేపబడే సమయం….
[10] అంటే – హృదయాలలో దాగివున్న రహస్య విషయాలన్నీ బయటపెట్టబడిన వేళ.
[11] మృతులను సమాధుల నుంచి సజీవంగా లేపిన పరమప్రభువు, వారి ఆంతర్యాల్లోని రహస్య విషయాలను వెళ్ళగ్రక్కించే అల్లాహ్ ఎంతటి సూక్ష్మద్రష్టయో ఊహించవచ్చు. ఆయన నుండి ఏ వస్తువూ దాగిలేదు. మరి ఆయన ప్రతి ఒక్కరికీ వారి కర్మలనుబట్టి పుణ్యఫలమో, పాపఫలమో ఇస్తాడు. దైవానుగ్రహాలను అనుక్షణం ఆస్వాదిస్తూ అల్లాహ్ మేళ్లను మరచి విర్రవీగే వారికి ఇదొక హెచ్చరిక! అలాగే ధనవ్యామోహంలో పడిపోయి తమ సంపదలో నుంచి హక్కుదారుల హక్కు చెల్లించ కుండా ఉండే పిసినారులకు కూడా ఇది హెచ్చరికే!
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనం, ”మీలో ఎవ్వరూ చావును కోరుకోరాదు. ఒకవేళ అతడు ఉత్తముడైతే అధిక ఆయుష్షు వల్ల ఇంకా అధికంగా మంచి పనులు చేయవచ్చు, ఒకవేళ చెడ్డవాడైతే తౌబహ్, ఇస్తిగ్‌ఫార్ చేసి దైవాన్ని సంతృప్తి పరచ వచ్చు.” (బు’ఖారీ)
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) కథనం:ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనం – “మీలో ఎవ్వరూ చావును కోరటం గానీ, దాన్ని గురించి దు’ఆ చేయటం గానీ చేయరాదు. ఎందుకంటే మరణిస్తే కోరికలన్నీ వ్యర్థమవుతాయి. విశ్వాసి ఆయుష్షు అతని కోసం మంచినే పెంచుతుంది“. (ముస్లిమ్)
1600 -[ 3 ] ( متفق عليه ) (1/502)
وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَتَمَنَّيَنَّ أَحَدُكُمُ الْمَوْتَ مِنْ ضُرٍّ أَصَابَهُ فَإِنْ كَانَ لَابُدَّ فَاعِلًا فَلْيَقُلِ: اَللّهُمَّ أحْيِنِيْ مَا كَانَتِ الْحَيَاةُ خَيْرًا لِّيْ وَتَوَفَّنِيْ إِذَا كَانَتْ الْوَفَاةُ خَيْرًا لِيْ. متفق عليه.
అనస్ (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనం, ”మీలో ఎవరికైనా కష్టాలువస్తే, చావును కోరుకోరాదు. కోరితే ఈ విధంగా కోరాలి. ”ఓ అల్లాహ్! నేను సజీవంగా ఉండటం నాకు లాభకరంగా ఉన్నంత వరకు నన్ను సజీవంగా ఉంచు. మరణం లాభకరంగా ఉన్నప్పుడు నాకు మరణం ప్రసాదించు.” (బు’ఖారీ, ముస్లిమ్)
వివరణ-1600: ఈ ‘హదీసు’ల ద్వారా చావును కోరుకోరాదని తెలుస్తుంది. అయితే ఉపద్రవాల, కల్లోలాల భయంవల్ల వీరమరణం పొందే కోరికవల్ల కోరటం సమంజసమే. ‘ఉమర్ (రదియల్లాహు అన్హు) ఇలా కోరుకునేవారు. ”అల్లాహుమ్మర్ ‘జుఖ్‌నీ షహాదతన్ ఫీ సబీలిక వజ్’అల్ మౌతీ బిబలది రసూలిక.”
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.