సహనం ప్రయోజనాలు – సలీం జామిఈ [వీడియో & టెక్స్ట్]

సహనం ప్రయోజనాలు
https://youtu.be/gxR-9kJ-B6g [45 నిముషాలు]
వక్త: షేఖ్ సలీం జామిఈ హఫిజహుల్లాహ్

ఈ ప్రసంగంలో, షేక్ సలీం జామిఈ గారు ఇస్లాంలో సహనం (సబ్ర్) యొక్క ప్రాముఖ్యత మరియు దాని ప్రయోజనాల గురించి వివరించారు. సహనం పాటించేవారికి పరలోకంలో స్వర్గం లభిస్తుందని, దైవదూతలు వారికి స్వాగతం పలుకుతారని ఖుర్ఆన్ ఆధారాలతో తెలిపారు. సహనం పాటించడం వల్ల అల్లాహ్ ప్రేమ, సహాయం లభిస్తాయని, వారికి అపరిమితమైన పుణ్యం ప్రసాదించబడుతుందని నొక్కిచెప్పారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహనాన్ని గొప్ప అనుగ్రహంగా అభివర్ణించారని గుర్తుచేశారు. నిషిద్ధ విషయాలను త్యజించడం, పేదరికం మరియు కష్ట సమయాలు, శత్రువును ఎదుర్కోవడం, దైవ మార్గంలో పిలుపునివ్వడం, ఆత్మీయులను కోల్పోవడం, మరియు వ్యాధి సోకినప్పుడు వంటి వివిధ సందర్భాలలో సహనం ఎలా పాటించాలో ఉదాహరణలతో సహా వివరించారు. సహనం అనేది విశ్వాసంలో తల లాంటిదని, దాని విలువెంతో గొప్పదని ఈ ప్రసంగం స్పష్టం చేస్తుంది.

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వస్తోత్రాలు. (1:2)

وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَأَصْحَابِهِ أَجْمَعِينَ
(వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహీ వ అస్ హాబిహీ అజ్మయీన్)

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

గౌరవనీయులైన ఇస్లామీయ సోదర సోదరీమణులారా, మీ అందరికీ నా ఇస్లామీయ అభివాదం,

السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు)

ఇంతకుముందు మీరు సహోదరుడు అబ్దుర్రహ్మాన్ గారి నోట వినే ఉన్నారు. నేటి మన ప్రసంగ అంశం సహనం ప్రయోజనాలు. సహనం వల్ల మనిషికి ఎలాంటి ఎలాంటి ప్రయోజనాలు సమకూరుతాయో ఈ ప్రసంగంలో మనము ఇన్ షా అల్లాహ్ ఖుర్ఆన్ మరియు హదీసుల వెలుగులో ఇన్ షా అల్లాహ్ కొన్ని ఉదాహరణలతో సహా కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాము కాబట్టి నేను మీ అందరితో కోరే విషయం ఏమిటంటే, జాగ్రత్తగా, ఏకాగ్రతతో విషయాలన్నింటినీ గమనించి వినాలని కోరుతున్నాను. అన్న విన్న మాటల మీద ఆచరించే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక.

మనం పండితుల నోట అనేకసార్లు పరలోకం గురించి ప్రసంగాలలో విని ఉన్నాము కదండీ. మానవులందరూ మరణించిన తర్వాత పరలోకంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మానవులందరితో లెక్కింపు తీసుకున్న తర్వాత నరకవాసులేమో నరకానికి వెళ్ళిపోతారు, స్వర్గవాసులేమో స్వర్గానికి చేరుకుంటారు. అయితే స్వర్గవాసులు ఎప్పుడైతే స్వర్గానికి చేరుకుంటారో, వారు స్వర్గంలో ప్రవేశిస్తున్నప్పుడు అక్కడ దైవదూతలు కొందరు ఆ స్వర్గవాసులకు ఆహ్వానం పలుకుతూ ఉంటారు. ఏమని పలుకుతూ ఉంటారు? దాని ప్రస్తావన అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ గ్రంథంలోని 13వ అధ్యాయము 24వ వాక్యంలో ప్రకటించి ఉన్నాడు.

దైవదూతలు వారికి ఆహ్వానిస్తూ ఏమంటారంటే,

سَلَامٌ عَلَيْكُم بِمَا صَبَرْتُمْ ۚ فَنِعْمَ عُقْبَى الدَّارِ
(సలామున్ అలైకుం బిమా సబర్ తుం ఫ ని’అమ ఉఖ్బద్ దార్)

“మీరు చూపిన సహనానికి బదులుగా మీపై శాంతి కురియు గాక! (మీకు లభించిన) ఈ అంతిమ గృహం ఎంత మంచిది!” అని వారు అంటారు. (13:24)

సలామున్ అలైకుం బిమా సబర్ తుం అనే వాక్యం మీద ఒకసారి ఆలోచిస్తే దాని అర్థం ఏమిటంటే, “మీరు చూపిన సహనానికి బదులుగా మీపై శాంతి కురియు గాక. మీకు లభించిన ఈ అంతిమ గృహం ఎంత మంచిది” అని వారు అంటారు. మిత్రులారా, మీరు చూపించిన సహనానికి బదులుగా మీరు ఈ రోజు ఇక్కడ చేరుకుంటున్నారు అని ఆ రోజు దైవదూతలు స్వర్గవాసులు స్వర్గంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఆహ్వానిస్తూ ఆ మాటలు అంటారు అంటే అర్థం ఏమిటండీ? ప్రపంచంలో దైవభక్తులు ఎంతో ఓపిక, సహనం కలిగి ఉంటారు కాబట్టి, వారు చూపించిన, ప్రదర్శించిన ఆ సహనం, ఓపిక వల్ల వారు అక్కడ స్వర్గానికి చేరుకుంటారు అని అర్థం మిత్రులారా.

అంతేకాదు, స్వర్గవాసులు స్వర్గంలో చేరిపోతారు కదా. స్వర్గవాసులు స్వర్గంలోకి చేరిపోయినప్పుడు వారిని ఉద్దేశించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏమంటాడో తెలుసా? అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏమంటాడో ఆ విషయాన్ని ఖుర్ఆన్ గ్రంథము 23వ అధ్యాయము 111వ వాక్యంలో తెలియజేశాడు,

إِنِّي جَزَيْتُهُمُ الْيَوْمَ بِمَا صَبَرُوا أَنَّهُمْ هُمُ الْفَائِزُونَ
(ఇన్నీ జజైతుహుముల్ యౌమ బిమా సబరూ అన్నహుం హుముల్ ఫాయిజూన్)

నేను ఈ రోజు వారికి వారి సహనానికి తగిన ప్రతిఫలం ఇచ్చాను. వాస్తవానికి వారు (ఆశించిన మేరకు) సఫలీకృతులయ్యారు (అని అల్లాహ్‌ సెలవిస్తాడు).” (23:111)

అల్లాహు అక్బర్. అక్కడ దైవదూతలు కూడా ఏమంటున్నారంటే మీరు చూపించిన సహనానికి బదులుగా మీరు ఈ రోజు ఇక్కడికి చేరుకుంటున్నారు, మీ మీద శాంతి కురియు గాక అని వారు స్వాగతిస్తూ ఉన్నారు. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏమని ప్రకటిస్తున్నారంటే, ఈ రోజు మీరు ఇక్కడికి చేరుకున్నారు, ఈ స్వర్గం నేను మీకు ఇచ్చాను అంటే దానికి ఒక ముఖ్యమైన కారణం ఏమిటంటే మీరు చూపించిన సహనానికి బదులుగా నేను ఈ స్వర్గం మీకు ఇచ్చాను అని అల్లాహ్ అంటున్నాడు.

అల్లాహు అక్బర్. ఈ రెండు మాటలు వింటూ ఉంటే మనకు ఏమనిపిస్తుందండి? అంటే ప్రపంచంలో మనం ఎంతో ఓపికగా సహనం కలిగి ఉండాలన్న మాట. అలా ఉంటేనే మనము స్వర్గానికి చేరుకుంటామన్న మాట. అలా సహనం ఓపిక కలిగి ఉంటేనే రేపు దైవదూతలు మనకు స్వాగతిస్తారన్న మాట. కాబట్టి ఆ దృశ్యాన్ని ఒకసారి మనము మైండ్లో తెచ్చుకొని ఆలోచించుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న సమస్యలు, బాధలు అన్నీ కూడా తేలికమైనవి, చిన్నవి, వీటన్నింటి మీద మనము సహనం కలిగి ఉంటే, ఓపిక కలిగి ఉంటే ఇన్ షా అల్లాహ్ రేపు మనము స్వర్గానికి చేరుకుంటాము, దైవదూతలు మాకు స్వాగతిస్తారు అన్న ఊహతోనే ఆ ఆలోచనతోనే ఆ నమ్మకంతోనే మనము ఈ జీవితం గడిపేయొచ్చు మిత్రులారా.

కాబట్టి సహనం ఇది చిన్న విషయం కాదు. సహనం పాటించడం వలన మనిషి స్వర్గానికి చేరుకుంటాడు, స్వర్గానికి చేర్చే ఒక ముఖ్యమైన సాధనం సహనం. కాబట్టి సహనం మామూలు విషయం కాదు మిత్రులారా. సహనం మామూలు విషయం కాదన్న విషయం కూడా ఇన్ షా అల్లాహ్ నా ప్రసంగంలో ముందు ముందు నేను మీకు తెలియజేస్తాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా సహనం వల్ల ఏంటి ప్రయోజనాలు? మనిషికి, భక్తునికి ప్రయోజనాలు ఏంటి అనేటివి మనము ఇన్ షా అల్లాహ్ తెలుసుకుందాం.

సహనం వల్ల ఏ భక్తుడైతే సహనం పాటిస్తాడో, ఓపికను ప్రదర్శిస్తాడో, అలాంటి భక్తుణ్ణి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇష్టపడతాడు. అల్లాహు అక్బర్. దీనికి ఆధారం ఏమిటి? దీనికి ఆధారము మూడవ అధ్యాయము 146వ వాక్యము. అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేస్తున్నాడు,

وَاللَّهُ يُحِبُّ الصَّابِرِينَ
(వల్లాహు యుహిబ్బుస్ సాబిరీన్)
సహనం వహించే వారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. (3:146)

అల్లాహ్ సహనశీలురులను ఇష్టపడతాడు. అల్లాహు అక్బర్. మనం ప్రపంచంలో సహనం కలిగి ఉంటే అల్లాహ్ మనల్ని మెచ్చుకుంటాడు. ఇంతకంటే మనకు ఎక్కువ ఇంకేం కావాలండి? అల్లాహ్ మెప్పు కోసమే కదా మనము ప్రయత్నిస్తాము, అల్లాహ్ ఇష్టపడాలనే కదా మనము సత్కార్యాలు చేస్తాము. కాబట్టి ఇక్కడ మనము అల్లాహ్ మెప్పు పొందటానికి ఒక మంచి అవకాశము, మంచి సాధనము సహనం పాటించడం. ఎవరైతే సహనం పాటిస్తారో, అలాంటి భక్తుల్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇష్టపడతాడు అని స్వయంగా ఖుర్ఆన్ లో మూడవ అధ్యాయము 146వ వాక్యంలో ప్రకటించి ఉన్నాడు కాబట్టి మనము సహనం పాటించాలి.

సహనం పాటించడం వలన కలిగే ప్రయోజనాలలో ఒక ప్రయోజనం ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనల్ని ఇష్టపడతాడు.

అలాగే మరోక ప్రయోజనం ఏమిటంటే, ఎవరైతే సహనం పాటిస్తారో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారికి తోడుగా ఉంటాడు. అల్లాహు అక్బర్. దీనికి ఆధారం ఏమిటి? ఎనిమిదవ అధ్యాయము 46వ వాక్యాన్ని చూడండి. అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

وَاصْبِرُوا ۚ إِنَّ اللَّهَ مَعَ الصَّابِرِينَ
(వస్బిరూ ఇన్నల్లాహ మ’అస్ సాబిరీన్)
సహన స్థయిర్యాలను పాటించండి. స్థయిర్యం కనబరచే వారికి అల్లాహ్‌ తోడుగా ఉంటాడు.” (8:46)

సహన స్థైర్యాలను పాటించండి, స్థైర్యం కనబరిచే వారికి అల్లాహ్ తోడుగా ఉంటాడు. అల్లాహు అక్బర్. అల్లాహ్ సహాయము, అల్లాహ్ మనకు తోడుగా ఉండటము, ఇదే కదా మనము కావాల్సింది. మనము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తోడుగా ఉంటే ఎంతటి విషయాన్ని అయినా మనము ఓపికగా, ఎంతో తేలికగా మనము ఎదుర్కోవచ్చు. అల్లాహ్ మనకు తోడుగా ఉంటే ప్రపంచంలో మనము ఎవరితోనూ భయపడటానికి అవసరం ఉండదు అని అల్లాహ్ మనకు తోడు ఉంటే చాలు అని చాలా సందర్భాలలో అనుకుంటూ ఉంటాము కదండీ. అయితే అల్లాహ్ మనకు తోడుగా ఉండాలంటే మనము సహనం ప్రదర్శించాలి, ఓపిక ప్రదర్శించాలి. అలా సహనం కలిగి ఉండినట్లయితే అల్లాహ్ మనకు తోడుగా ఉంటాడని ఎనిమిదవ అధ్యాయం 46వ వాక్యంలో ప్రకటించి ఉన్నాడు కాబట్టి సహనం కలిగి ఉంటే మరొక ప్రయోజనం ఏమిటంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు తోడుగా ఉంటాడు.

అంతే కాదండి. ఎవరైతే సహనం కలిగి ఉంటారో, ఓపికను ప్రదర్శిస్తారో, అలాంటి వారికి అపరిమిత పుణ్యము లభిస్తుంది. దీనికి ఆధారం ఏమిటండి? 39వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూడండి. అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

إِنَّمَا يُوَفَّى الصَّابِرُونَ أَجْرَهُم بِغَيْرِ حِسَابٍ
(ఇన్నమా యువఫస్ సాబిరూన అజ్రహుం బిగైరి హిసాబ్)
సహనం వహించేవారికి లెక్కలేనంత పుణ్యఫలం ప్రసాదించబడుతుంది.” (39:10)

అల్లాహు అక్బర్. మనం రంజాన్ నెలలో ఉపవాసాల గురించి వింటూ వింటూ ఏమంటామంటే, ఉపవాసం ఉంటే భక్తునికి అపరిమితమైన పుణ్యం ఇవ్వబడుతుంది అని వింటూ ఉంటాం కదా. అచ్చం అలాగే సహనం పాటిస్తే, ఓపికను ప్రదర్శిస్తే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా లెక్కలేనంత పుణ్యము అతనికి, ఆ భక్తునికి ప్రసాదిస్తాడు అని ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేసి ఉన్నాడు, 39వ అధ్యాయము, 10వ వాక్యం. కాబట్టి సహనం పాటించడం వలన మనిషికి లెక్కలేనంత పుణ్యం ఇస్తాడు.

ఒక మనిషి ఒక మనిషికి లెక్కలేనంత సహాయం చేశాడు అంటే దాన్ని మనం అంచనా వేయలేకపోతూ ఉంటాం. అదే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భక్తునికి లెక్కలేనంత పుణ్యం ఇచ్చేస్తే, దాన్ని అసలు మనం అంచనా వేయగలమా? మన అంచనాలకు చాలా పైన ఉంటుంది ఆ విషయం. కాబట్టి సహనం పాటిస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భక్తునికి లెక్కలేనంత పుణ్యం ఇస్తాడు అని వాగ్దానం చేసి ఉన్నాడు. ఇది కూడా సహనం వలన మనిషికి కలిగే ఒక ప్రయోజనం.

అలాగే మిత్రులారా, ఎవరైతే సహనం పాటిస్తారో, వాళ్ళకి స్వర్గం దక్కుతుంది అని ఇప్పుడు మనము రెండు వాక్యాలు విని ఉన్నాం. ఒకటి, దైవదూతలు స్వాగతించేది. రెండవది, స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రకటించేది. దైవదూతలు కూడా మీరు చూపించిన సహనానికి బదులుగా ఈ రోజు ఇక్కడికి చేరుకుంటున్నారు అని మీ మీద శాంతి కురియు గాక అని ఆహ్వానిస్తారు. ఆ వాక్యం ద్వారా కూడా స్పష్టమవుతుంది సహనం పాటిస్తే స్వర్గం లభిస్తుంది అని. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కూడా మీరు చూపించిన సహనానికి బదులుగా ఈ రోజు నేను మీకు ఈ స్వర్గం ఇచ్చాను అని ప్రకటిస్తాడు. ఆ వాక్యము ద్వారా కూడా మనకు రూఢీ అవుతుంది అదేమిటంటే మనిషికి సహనం పాటించడం వలన స్వర్గం ప్రసాదించబడుతుంది.

మిత్రులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తోడుగా ఉంటాడు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇష్టపడతాడు, అపరిమితమైన పుణ్యం ప్రసాదిస్తాడు, స్వర్గం ప్రసాదిస్తాడు, ఇన్ని ప్రయోజనాలు కలుగుతాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే సహనం మామూలు విషయం అని అనిపిస్తుందా? కాదు కదా.

సహనం గొప్ప విషయం అని మనకు ఇవన్నీ ఈ ఉదాహరణల ద్వారా, ఈ వాక్యాల ద్వారా తెలుస్తుంది. అదే విషయం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తెలియజేసి ఉన్నారు. బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు,

وَمَا أُعْطِيَ أَحَدٌ عَطَاءً خَيْرًا وَأَوْسَعَ مِنَ الصَّبْرِ
(వమా ఊతియ అహదున్ అతఆన్ ఖైరన్ వ ఔసఆ మినస్సబ్ర్)
“సహనం కంటే ఉత్తమమైన మరియు విస్తృతమైన బహుమతి మరెవరికీ ఇవ్వబడలేదు.” (సహీహ్ అల్-బుఖారీ)

అంటే మనిషికి ఇవ్వబడిన అనుగ్రహాలలో పెద్ద అనుగ్రహం, గొప్ప అనుగ్రహం, విశాలవంతమైన అనుగ్రహం అది సహనం అని ప్రవక్త వారు తెలియజేశారు. కాబట్టి మనిషికి ఎన్నో అనుగ్రహాలు దక్కుతాయి. కొందరికి మేధస్సు ఇవ్వబడుతుంది, కొందరికి కండబలం ఇవ్వబడుతుంది, కొందరికి వాక్ చాతుర్యం ఇవ్వబడుతుంది, మరికొందరికి డబ్బు ఇవ్వబడుతుంది, మరికొందరికి రకరకాల అనుగ్రహాలు ఇవ్వబడతాయి. అవన్నీ మనం లెక్క చేయలేం. ప్రతి భక్తునికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రకరకాల అనుగ్రహాలు ఇస్తాడు. అయితే ఆ అనుగ్రహాలన్నింటిలో గొప్ప అనుగ్రహం సహనం, ఓపిక పాటించే గుణం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరికైతే ఓపిక ప్రదర్శించే గుణం ఇవ్వబడిందో, ఎవరికైతే సహనం పాటించే గుణం ఇవ్వబడిందో, వారు గొప్ప వరం అల్లాహ్ తరపున పొంది ఉన్నారనే విషయాన్ని ఈ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం ద్వారా గ్రహించాలి.

అయితే మిత్రులారా, మరొకచోట ఖుర్ఆన్ గ్రంథం రెండవ అధ్యాయం 155 నుంచి 157 వాక్యాల వరకు మనము చూచినట్లయితే, అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సహనం పాటించే వారికి మూడు శుభవార్తలు తెలియజేసి ఉన్నాడు. ఏమన్నాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా?

وَبَشِّرِ الصَّابِرِينَ. الَّذِينَ إِذَا أَصَابَتْهُم مُّصِيبَةٌ قَالُوا إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ. أُولَٰئِكَ عَلَيْهِمْ صَلَوَاتٌ مِّن رَّبِّهِمْ وَرَحْمَةٌ ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُهْتَدُونَ
(వబష్షిరిస్ సాబిరీన్. అల్లజీన ఇజా అసాబత్ హుం ముసీబతున్ ఖాలూ ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ఉలాయిక అలైహిం సలవాతుమ్ మిర్ రబ్బిహిం వ రహ్మ వ ఉలాయిక హుముల్ ముహ్తదూన్)

ఈ సహనమూర్తులకు శుభవార్త ఇవ్వండి.వారికెప్పుడు ఏ ఆపద వచ్చిపడినా, “మేము ఖుద్దుగా అల్లాహ్‌కు చెందినవారము, మేము మరలిపోవలసింది కూడా ఆయన వద్దకే కదా!” అని అంటారు. వారిపై వారి ప్రభువు దయానుగ్రహాలు, కారుణ్యం ఉన్నాయి. సన్మార్గాన్ని పొందినవారు కూడా వీరే.” (2:155-157)

ఈ సహన మూర్తులకు శుభవార్త ఇవ్వండి. ఎవరు వారు? వారికి ఏమైనా ఆపద వస్తే వారు ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్, మేము కూడా అల్లాహ్ వైపు మరలవలసిందే, మేము కూడా అల్లాహ్ అల్లాహ్ వాళ్ళమే అని వారు అంటారు. వారి కొరకే వారి ప్రభువు తరపున అనుగ్రహాలు, కారుణ్యం ఉన్నాయి. సన్మార్గాన్ని పొందిన వారు కూడా వీరే అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ వాక్యాలలో తెలియజేశాడు. అంటే ఇక్కడ మూడు అనుగ్రహాల ప్రస్తావన ఉంది గమనించారా? వారిపై ప్రభువు దయానుగ్రహాలు ఉంటాయి, అంటే వారి మీద అల్లాహ్ దయ చూపుతాడు. రెండవది, వారి మీద కారుణ్యం ఉంటుంది, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క కారుణ్యం వారి మీద వర్షిస్తుంది. సన్మార్గాన్ని పొందిన వారు కూడా వీరే, వారు సన్మార్గం మీద ఉంటారు. అల్లాహు అక్బర్.

అంటే సహనం పాటించే వారికి మూడు అనుగ్రహాల ప్రస్తావన ఒకేచోట అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రస్తావించాడు. వారి మీద అల్లాహ్ దయ ఉంటుంది, వారి మీద అల్లాహ్ కారుణ్యం ఉంటుంది, వారు సన్మార్గంలో నడుచుకుంటూ ఉంటారు. అల్లాహు అక్బర్. కాబట్టి సహనం పాటించడం వలన ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి మిత్రులారా.

అందుకోసమే సహాబాలు ఈ సహనం గురించి ఏమనేవారంటే ముఖ్యంగా ఉమర్ రజియల్లాహు త’ఆలా అన్హు వారు ఏమనేవారంటే, వజద్నా ఖైర ఐషినా బిస్సబ్ర్. మేము మా జీవితంలో ఉత్తమమైన రోజులు ఎప్పుడు చూశామంటే సహనం పాటించే రోజుల్లోనే చూశాము అని చెప్పేవారు. ఎప్పుడైతే మనము సహనం పాటించామో, ఆ రోజుల్లోనే మా జీవితంలోని ఉత్తమమైన రోజులు మేము చూశాము అన్నారు ఆయన. అల్లాహు అక్బర్. అంటే సహనం పాటిస్తూ జీవిస్తే జీవితంలోని మరుపురాని ఉత్తమమైన రోజులు అయిపోతాయి ఆ దినాలు, మిత్రులారా.

అలాగే అలీ రజియల్లాహు త’ఆలా అన్హు వారు ఏమనేవారంటే “అస్సబ్ రు మినల్ ఈమాని బి మంజిలతిర్ రాస్“. విశ్వాసంలో సహనం యొక్క స్థానం ఏమిటంటే మనిషి శరీరంలో తలకు ఉన్న స్థానం లాంటిది అన్నారు. తల లేకుండా ఆ దేహానికి ఏమైనా విలువ ఉంటుందండీ? తల తీసేసి పక్కన పడేస్తే ఆ కాళ్ళకు, చేతులకు, ఆ దేహానికి ఏమైనా విలువ ఉంటుందా? ఎవరైనా ఆ దేహాన్ని గుర్తిస్తారా అసలు? గుర్తించరు, దానికి విలువ ఉండదు. తల లేని దేహానికి విలువ ఉండదు, అదే తల ఉన్న దేహానికి విలువ ఉంటుంది. అలాగే అలీ రజియల్లాహు త’ఆలా అన్హు వారు ఏమంటున్నారంటే సహనం కూడా విశ్వాసంలో తల లాంటిది. సహనం లేని విశ్వాసానికి విలువ ఉండదు. విశ్వాసంలో సహనం ఉంటే ఆ విశ్వాసానికి చాలా అంటే చాలా విలువ ఉంటుంది అని ఆయన చెప్పిన మాటలకు అర్థం మిత్రులారా.

కాబట్టి ఇప్పటివరకు మనము విన్న మాటలలో మనకు అర్థమైన విషయం ఏమిటంటే మిత్రులారా, సహనం ప్రదర్శిస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇష్టపడతాడు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తోడుగా ఉంటాడు, అపరిమితమైన పుణ్యం ఇవ్వబడుతుంది, స్వర్గం ఇవ్వబడుతుంది, ఉత్తమమైన అనుగ్రహాలు ఇవ్వబడతాయి. అలాగే అల్లాహ్ యొక్క దయ ఉంటుంది, అల్లాహ్ కారుణ్యం ఉంటుంది, వారు సన్మార్గం మీద ఉంటారు, వారి విశ్వాసానికి ఎంతో విలువ ఉంటుంది, మరియు సహనంతో జీవిస్తే వారు జీవించిన ఆ రోజులు మధుర క్షణాలుగా వారి జీవితంలో నిలిచిపోతాయి. ఇన్ని విషయాలు మనము సహనం గురించి, ప్రయోజనాల గురించి తెలుసుకున్నాము.

అయితే మిత్రులారా, ఇప్పుడు సహనం ఎప్పుడెప్పుడు ప్రదర్శించాలన్న విషయాన్ని తెలుసుకుందాం. సహనం ఎప్పుడెప్పుడు ప్రదర్శించవలసి ఉంటుంది? ఏ ఏ సందర్భాలలో మనము సహనం ప్రదర్శించవలసి ఉంటుంది? అది కూడా ఇన్ షా అల్లాహ్ ఆధారాలతో తెలుసుకుందాం. ఒక్కొక్కటిగా చెబుతాను, మొత్తం తొమ్మిది విషయాలు ఉన్నాయండి. ఒక్కొక్కటిగా ఇన్ షా అల్లాహ్ చెబుతాను, బాగా శ్రద్ధగా వినండి, గుర్తుంచుకోండి.

మొదటి విషయం ఏమిటంటే, నిషిద్ధ విషయాలను త్యజించేటప్పుడు చాలా సహనం ప్రదర్శించవలసి ఉంటుంది. దీనికి మనం చూచినట్లయితే 79వ అధ్యాయము 40, 41 వాక్యాలలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

وَأَمَّا مَنْ خَافَ مَقَامَ رَبِّهِ وَنَهَى النَّفْسَ عَنِ الْهَوَىٰ فَإِنَّ الْجَنَّةَ هِيَ الْمَأْوَىٰ
(వ అమ్మా మన్ ఖాఫ మఖామ రబ్బిహీ వనహన్ నఫ్స అనిల్ హవా ఫ ఇన్నల్ జన్నత హియల్ మ’అవా)

మరెవడు తన ప్రభువు ఎదుట నిలబడే విషయమై భయపడ్డాడో, ఇంకా తన మనస్సును చెడు వాంఛల నుండి ఆపుకున్నాడో అతని నివాసం స్వర్గమే అవుతుంది.” (79:40-41)

ఈ వాక్యం యొక్క అర్థము మరియు సారాంశం ఏమిటంటే మిత్రులారా, మనిషి యొక్క మనసులో షైతాను కూర్చొని చెడ్డ కోరికలు కలిగిస్తూ ఉంటాడు. మనం ప్రసంగాలలో విని ఉన్నాము కదండీ, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో సైతాను అనుమతి తీసుకొని మనిషి మనసులో ఒక చిన్న చోటు తీసుకొని అక్కడ కూర్చున్నాడు, అక్కడ కూర్చొని మనిషికి చెడు కోరికలు, చెడు ఆలోచనలు అన్నీ కూడా కలిగిస్తూ ఉంటాడు అని మనము వేరే ప్రసంగాలలో విని ఉన్నాము కదండీ. కాబట్టి ఆ చెడు కోరికలు వచ్చినప్పుడు, చెడు ఆలోచనలు వచ్చినప్పుడు మనము సహనం ప్రదర్శించవలసి ఉంటుంది, ఏమని? అల్లాహ్ కు భయపడి ఈ పనులు చేయకూడదు, అల్లాహ్ నిషేధం చేశాడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిషేధం చేశారు. ఈ తప్పు చేస్తే, లేదంటే ఈ కోరికను నేను తీర్చుకుంటే రేపు నాకు ఇలాంటి శిక్షలు ఉంటాయి, రేపు నేను నష్టపోతాను. కాబట్టి రేపు శిక్షించబడకుండా ఉండటానికి, రేపు నష్టపోకుండా ఉండటానికి ఈ రోజు నా మనసును నేను కంట్రోల్ లో పెట్టుకుంటాను అని ఆ రోజు అతను ఒకవేళ సహనం ప్రదర్శించి, మనిషి తన మనసును కంట్రోల్ లో పెట్టుకొని, కోరికలను అదుపులో ఉంచుకుంటే అప్పుడు అతను ఎంతో సహనం ప్రదర్శించవలసి ఉంటుంది. అలా చేస్తే రేపు ఇన్ షా అల్లాహ్ అతను శిక్షల నుండి రక్షించబడతాడు మరియు అతను సఫలీకృతుడైపోతాడు.

అయితే మిత్రులారా, ఆ కోరికలను అదుపులో పెట్టుకోవాలంటే మనిషికి సహనం కావాలి. ఎంతో పెద్ద సహనం అతనికి అవసరం అవుతుంది. మనం సమాజంలో నివసిస్తూ ఉన్నాం. మనం ఎక్కడైతే ప్రజల మధ్య నివసిస్తూ ఉన్నామో, మన ఇరుపక్కల మనం చూస్తూ ఉంటాం. మన మిత్రులు కావచ్చు, మన పొరుగువారు కావచ్చు, పెద్దలు కావచ్చు, పిల్లలు కావచ్చు, రకరకాల పనులు చేస్తూ ఉంటారు. అవన్నీ అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిషేధించిన పనులై ఉంటాయి. వారు చేస్తూ ఎంతో ఆనందం పొందుతూ ఉంటారు, ఎంతో పాపులారిటీ పొందుతూ ఉంటారు. కానీ ఒక భక్తుడు అతనికి కూడా షైతాను రెచ్చగొడతాడు, నువ్వు కూడా ఈ పని చేస్తే నీకు కూడా పాపులారిటీ వస్తుంది, నువ్వు కూడా ఇది చేస్తే నీకు కూడా ఆనందం కలుగుతుంది, నువ్వు కూడా ఇది చేస్తే నువ్వు కూడా సంతోషపడతావు అని అతనికి షైతాను రెచ్చగొడతాడు. కానీ అలా సైతాను మాటల్లోకి రాకుండా మనసుని అదుపులో పెట్టుకోవాలి. అలా మనసుని అదుపులో పెట్టుకోవడానికి ఎంతో సహనం, ఓపిక అతనికి అవసరం అవుతుంది మిత్రులారా.

మొదటి విషయం నిషిద్ధ విషయాలను త్యజించేటప్పుడు సహనం ప్రదర్శించవలసి ఉంటుంది. రెండో విషయం ఏమిటంటే, పేదరికం, గడ్డు పరిస్థితులలో ఉన్నప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ పుట్టించాడు. కొంతమందిని ధనవంతులు చేశాడు., మరికొంతమందిని మధ్య తరగతి వాళ్ళలాగా చేశాడు., మరికొంతమందిని పేదవారిలాగా చేశాడు.. అది ఆయన నిర్ణయం. అయితే ఎప్పుడైతే మనిషికి పేదరికం, గడ్డు పరిస్థితి ఏర్పడుతుందో, అప్పుడు అతను ఎంతో ఓపిక, సహనం పాటించవలసి ఉంటుంది. దీనికి మనం చూసినట్లయితే 25వ అధ్యాయము 75వ వాక్యాన్ని మనం చూస్తే, అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

أُولَٰئِكَ يُجْزَوْنَ الْغُرْفَةَ بِمَا صَبَرُوا وَيُلَقَّوْنَ فِيهَا تَحِيَّةً وَسَلَامًا
(ఉలాయిక యుజ్ జౌనల్ గుర్ ఫత బిమా సబరూ వ యులక్కౌన ఫీహా తహియ్యతన్ వ సలామా)
ఇలాంటి వారికే వారి సహన స్థైర్యాలకు బదులుగా స్వర్గంలోని అత్యున్నత స్థానాలు వొసగబడతాయి. అక్కడ సలాం, దీవెనలతో వారికి స్వాగత సత్కారాలు లభిస్తాయి.” (25:75)

మిత్రులారా, దీనికి నేను రెండు ఉదాహరణలు మీ అందరి ముందు ఉంచుతాను. గడ్డు పరిస్థితి ఏర్పడినప్పుడు ఏ విధంగా సహనం పాటించాలనేదానికి ఒక ఉదాహరణ, అలాగే పేదరికం మరియు గడ్డు పరిస్థితి రెండూ ఒకేసారి ఏర్పడితే ఎలా సహనం పాటించాలో అది ఒక ఉదాహరణ చెబుతాను చూడండి.

ముందుగా మనము యూసుఫ్ అలైహిస్సలాం వారి గురించి చూచినట్లయితే, యూసుఫ్ అలైహిస్సలాం వారు యాకూబ్ అలైహిస్సలాం వారి కుమారుడు. అదంతా కథ మనం ఈ రోజు చర్చించుకునే అవకాశం లేదు. యూసుఫ్ అలైహిస్సలాం వారిని వారి అన్నలు ఏం చేశారంటే తీసుకొని వెళ్లి బావిలో పడవేశారు. ఆయన చేసిన నేరం ఏమిటి? ఆయన ఏమైనా తప్పు చేశాడా? లేదు. చేయని నేరానికి అన్నలు తీసుకొని వెళ్లి ఆయనను బావిలో పడవేశారు. తర్వాత అక్కడి నుంచి కొంతమంది ఆయనను తీసుకొని వెళ్లి ఈజిప్ట్ నగరంలో అమ్మేశారు. బానిసగా మార్చబడ్డారు. కానీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దయతో రాజు ఇంటికి చేరుకున్నారు. అక్కడ మళ్లీ పెద్దవారైన తర్వాత చేయని నేరానికి ఒక మహిళ ఆయన మీద నింద మోపి జైలుకు పంపించింది. ఆయన జైలుకు కూడా వెళ్లారు. ఆయన చేసిన నేరం ఏమిటండి? ఆయన జైలుకు వెళ్లారు కదా, కటకటాలకు వెనక్కి వెళ్లారు కదా, చేసిన నేరం ఏమిటి? ఏమీ చేయలేదు. చేయని నేరానికి మళ్లీ ఆయన జైలు జీవితం అనుభవించవలసి వచ్చింది. చూశారా? ఎంత గడ్డు పరిస్థితి చూడండి. అన్నలు తీసుకొని వెళ్లి బావిలో పడవేయటం ఏమిటి, తర్వాత మార్కెట్లో అమ్మివేయబడటం ఏమిటి, ఆ తర్వాత చేయని నేరానికి నింద మోపబడటం ఏమిటి, మరియు జైల్లో జీవితం గడపడం ఏమిటి. ఇంత గడ్డు పరిస్థితి ఏర్పడింది. అయితే ఆయన ఏం చేశారండి? సహనం పాటించారు. ఆయన పాటించిన సహనానికి మూలంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇచ్చిన ఫలితం ఏమిటో చూశారు కదా? ఏ చోట అయితే ఆయన జైలు జీవితం గడిపారో, అదే చోట మళ్లీ ఆయన ఆర్థిక మంత్రి అయిపోయారు అల్హందులిల్లాహ్. ఎంతో గొప్ప పోస్ట్ ని, ఎంతో గొప్ప హోదాని అక్కడ ఆయన సంపాదించుకోగలిగారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు ఆ హోదాకు, ఆ స్థాయికి చేర్చారు. అంటే ఇక్కడ యూసుఫ్ అలైహిస్సలాం వారి సంఘటనలో మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, గడ్డు పరిస్థితులు, పేదరికము ఏర్పడినప్పుడు సహనం పాటిస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉన్నతమైన స్థానాలకు చేర్చుతాడు.

అలాగే మూసా అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలోని బనీ ఇస్రాయీలు వారి పరిస్థితుల్ని ఒకసారి మనం దృష్టిలో పెట్టుకోవాలండి. బనీ ఇస్రాయీలు వారు మూసా అలైహిస్సలాం వారు వచ్చే సమయానికి ఎలాంటి స్థితిలో ఉన్నారు? మనం ప్రసంగాలలో విని ఉన్నాం. ఫిరౌన్ అనే రాజు వారిని బానిసలుగా మార్చేసి రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. వెట్టి చాకిరి చేయిస్తూ ఉన్నాడు, కొడుతూ ఉన్నాడు, తిడుతూ ఉన్నాడు, ఆకలితో సరైన ఆహారం పెట్టకుండా హింసిస్తూ ఉన్నాడు. అంతే కాదు, వారి వంశంలో పుట్టిన మగబిడ్డలను వారి కళ్ళ ముందే చంపి వేయిస్తూ ఉన్నాడు. ఎలాంటి క్లిష్టమైన స్థితులు ఇవి? ఎలాంటి గడ్డు పరిస్థితులు ఇవి? ఒక వైపు ఏమో కడుపు నిండా ఆహారము లేదు, పైనుంచి వెట్టి చాకిరి చేయవలసి వస్తూ ఉంది, తర్వాత దెబ్బలు తినవలసి వస్తూ ఉంది, మాటలు పడాల్సి వస్తూ ఉంది, అంతేకాదు పుడుతున్న మగబిడ్డల్ని కళ్ళ ముందరే కోల్పోవలసి వస్తూ ఉంటుంది. పేదరికం, గడ్డు పరిస్థితి దీనికంటే ఇంకా హీనమైనది ఇంకోటి ఉంటుందా? అలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా మూసా అలైహిస్సలాం వారు ఏమనేవారో తెలుసా? ఇస్తఈనూ బిల్లాహి వస్బిరూ. మీరు సహనం పాటించండి, అల్లాహ్ సహాయం అర్థించండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తప్పనిసరిగా మీకు సహాయపడతాడు అని చెప్పేవారు. వారు అలాగే చేశారు. సహనం పాటించారు, అల్లాహ్ సహాయం కోరారు. చివరికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మూసా అలైహిస్సలాం వారితో పాటు బనీ ఇస్రాయీలు వారిని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయేటట్టుగా అనుమతి ఇచ్చేశాడు. వెళ్తూ ఉంటే ముందర సముద్రం వచ్చింది. కథ మనమంతా విని ఉన్నాం. అల్లాహ్ ఆజ్ఞతో సముద్రంలో దారి తెరవబడింది. మూసా అలైహిస్సలాం మరియు బనీ ఇస్రాయీలు వారు ఆ సముద్రం మధ్యలో ఉన్న దారిలో నుండి అటువైపు గట్టుకు చేరుకున్నారు. అదే మార్గంలో ఏ ఫిరౌన్ అయితే బనీ ఇస్రాయీలు వారిని హింసించాడో, పీడించాడో, కొట్టాడో, తిట్టాడో, వారి బిడ్డల్ని చంపించాడో, అతను అదే మార్గం నుండి వారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు బాగా మధ్యలో వచ్చేసినప్పుడు మళ్లీ సముద్రం నీళ్లు కలిసిపోయాయి. చివరికి ఏమైందో తెలుసు కదండీ. ఫిరౌన్ బనీ ఇస్రాయీలు ప్రజల కళ్ళ ముందే సముద్ర నీటిలో మునిగి కుక్క చావు చచ్చాడు. చచ్చే ముందు ప్రాణభిక్ష పెట్టండయ్యా అని దీనంగా వేడుకున్నాడు. కానీ ప్రాణాలు దక్కలేదు. కుక్క చావు చచ్చాడు. చూశారా? అంటే ఇక్కడ చెప్పుకొచ్చే విషయం ఏమిటంటే, బనీ ఇస్రాయీలు ప్రజలు కూడా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు, పేదరికాన్ని ఎదుర్కొన్నారు. అయితే మూసా అలైహిస్సలాం వారు చెప్పినట్టుగా సహనం పాటించి, అల్లాహ్ సహాయం కోరారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారిని సహనం పాటించి మరియు అల్లాహ్ యొక్క సహాయం కోరిన కారణంగా ఆ పరిస్థితుల నుంచి గట్టు ఎక్కించాడు. అల్హందులిల్లాహ్.

కాబట్టి పేదరికం ఉన్నప్పుడు సహనం పాటించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు పేదరికంలో ఉన్నప్పుడు బిడ్డలు సహనం పాటించాలి. వారిని దూషించరాదు. ఇతరులను చూసి తల్లిదండ్రులను తక్కువగా అంచనా వేయరాదు. చాలామంది బిడ్డలు తల్లిదండ్రులు వారు కోరుతున్న విషయాలు ఇప్పించట్లేదు అని తల్లిదండ్రులను తిడతారు, కొంతమంది అయితే ఇల్లు వదిలేసి పారిపోయే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా చేయడం సమంజసము కాదు. సహనం పాటించాలి.

సరే, రెండు విషయాలు తెలుసుకున్నాము కదండీ. మూడో విషయం ఏమిటంటే, శత్రువుని ఎదుర్కొంటున్నప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది. దీనికి ఆధారం రెండవ అధ్యాయం 250వ వాక్యం, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

وَلَمَّا بَرَزُوا لِجَالُوتَ وَجُنُودِهِ قَالُوا رَبَّنَا أَفْرِغْ عَلَيْنَا صَبْرًا وَثَبِّتْ أَقْدَامَنَا وَانصُرْنَا عَلَى الْقَوْمِ الْكَافِرِينَ
(వలమ్మా బరజూ లిజాలూత వ జునూదిహీ ఖాలూ రబ్బనా అఫ్రిగ్ అలైనా సబ్రన్ వ సబ్బిత్ అఖ్దామనా వన్సుర్నా అలల్ ఖౌమిల్ కాఫిరీన్)

వారు జాలూత్, అతని సైన్యంతో ముఖాముఖి అయినప్పుడు, “ప్రభూ! మాకు సహన స్థైర్యాలు ప్రసాదించు. మా కాళ్ళకు నిలకడను ఇవ్వు. అవిశ్వాస జనులపై జరిగే పోరాటంలో మాకు తోడ్పడు.” అని ప్రార్ధించారు.” (2:250)

ఇది తాలూత్ మరియు జాలూత్ మధ్య జరిగిన యుద్ధం సంఘటన. ఈ సంఘటన గురించి మనం చర్చించుకుంటే చాలా సమయం అయిపోతుంది. ప్రవక్త దావూద్ అలైహిస్సలాం జీవిత చరిత్ర అని నాది ఒక ప్రసంగం ఉంది YouTube లో, అది మీరు వింటే అక్కడ దీని వివరణ మొత్తం అక్కడ ఉంది అండి. క్లుప్తంగా విషయం ఏమిటంటే, శత్రువు సైన్యంలో జాలూత్ అనేవాడు ఒకడు ఉండేవాడు, గొప్ప బలశీలి, బలవంతుడు. అయితే అతన్ని ఎదుర్కోవడానికి ఎప్పుడైతే తాలూత్ వారు వెళ్లారో, వీరి వద్ద విశ్వాసుల సైన్యము చాలా తక్కువ సంఖ్యలో ఉండేది. అవిశ్వాసుల సంఖ్య ఎక్కువగా ఉండేది. వారి వద్ద సైన్యం ఎక్కువగా ఉండేది, ఆయుధాలు కూడా ఎక్కువగా ఉండేవి. కానీ అల్లాహ్ దయవల్ల ఈ తక్కువ సంఖ్యలో ఉన్న విశ్వాసులు యుద్ధ మైదానంలో సహనం పాటించారు. కాబట్టి శత్రువును ఎదుర్కొన్నప్పుడు సహనం పాటించవలసి ఉంటుంది. విశ్వాసులు సంఖ్యలో తక్కువ ఉన్నప్పుడు, అవిశ్వాసులు సంఖ్యలో ఎక్కువగా ఉన్నప్పుడు భయపడరాదు. ఓపికగా సహనం ప్రదర్శించి అల్లాహ్ మార్గంలో ముందడుగు వేయవలసి ఉంటుంది. ఇది మూడవ విషయం.

నాలుగో విషయం ఏమిటంటే, అల్లాహ్ వైపు పిలుపు ఇచ్చినప్పుడు. మిత్రులారా, ఈ విషయం ముఖ్యంగా ఎవరైతే ఫీల్డ్ లో వెళ్లి ప్రజలకు దైవ వాక్యాలు వినిపించే పని చేస్తూ ఉన్నారో, వారికి వర్తిస్తుంది. అల్లాహ్ వైపు పిలుపు ఇచ్చినప్పుడు ప్రజలు రకరకాలుగా మాట్లాడుతారు. అలా మాట్లాడినప్పుడు వారి మాటలతో గుండె భారం పెంచుకోకుండా ఓపిక, సహనం ప్రదర్శించవలసి ఉంటుంది. ఖుర్ఆన్ గ్రంథం 16వ అధ్యాయము 127వ వాక్యాన్ని చూస్తే,

وَاصْبِرْ وَمَا صَبْرُكَ إِلَّا بِاللَّهِ ۚ وَلَا تَحْزَنْ عَلَيْهِمْ وَلَا تَكُ فِي ضَيْقٍ مِّمَّا يَمْكُرُونَ
(వస్బిర్ వమా సబ్ రుక ఇల్లా బిల్లాహ్ వలా తహ్జన్ అలైహిం వలా తకు ఫీ జైకిమ్ మిమ్మా యమ్కురూన్)

ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు సహనం వహించు. అయితే అల్లాహ్ తోడ్పాటు లేకుండా నువ్వు సహనం వహించలేవు. వారి పరిస్థితిపై బాధపడకు. వారు పన్నే కుట్రలు, కుయుక్తులకు లోలోపలే దుఃఖించకు.” అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేశారు.

అర్థం ఏమిటంటే, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు సహనం వహించు. అయితే అల్లాహ్ తోడ్పాటు లేకుండా నువ్వు సహనం వహించలేవు. వారి పరిస్థితిపై బాధపడకు. వారు పన్నే కుట్రలు, కుయుక్తులకు లోలోపలే దుఃఖించకు. సహనం ప్రదర్శించు. నువ్వు చేస్తున్న పని దైవ వాక్యాలు ప్రజలకు వినిపించే పని. ఆ పని చేస్తున్నప్పుడు ప్రజలు నీ పట్ల కుట్రలు పన్నుతూ ఉన్నారు. వారు పన్నుతున్న కుట్రలకు నువ్వు దుఃఖించకు. సహనం ప్రదర్శించు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేస్తూ ఉన్నాడు.

కాబట్టి ఇదే విషయం, ఇదే ఆదేశం మనకు వర్తిస్తుంది. మనము దేవుని విషయాలు, దేవుని వాక్యం ప్రజలకు వినిపించే ప్రయత్నం చేసినప్పుడు కుట్రలు పన్నే వాళ్ళు రకరకాలుగా కుట్రలు పన్నుతారు. అయితే మనము దుఃఖించకూడదు, అలాగే వెనకడుగు వేయకూడదు. సహనం పాటించాలి, అల్లాహ్ మార్గంలో ముందడుగు వేయాలి.

ఐదో విషయం ఏమిటంటే, వ్యతిరేకులు విమర్శించినప్పుడు కూడా చాలా సహనం ప్రదర్శించవలసి ఉంటుంది. మనం చెప్పే మాటలకు ఏకీభవించే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. ఏకీభవించే వాళ్ళు మా మాటను వినేస్తారు. అయితే వ్యతిరేకించే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే విమర్శలు చేస్తారు. అప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది. 73వ అధ్యాయం, 10వ వాక్యాన్ని చూడండి. అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

وَاصْبِرْ عَلَىٰ مَا يَقُولُونَ وَاهْجُرْهُمْ هَجْرًا جَمِيلًا
(వస్బిర్ అలా మా యఖూలూన వహ్జుర్ హుం హజ్రన్ జమీలా)
వారు చెప్పే మాటలపై ఓర్పు వహించు. హుందాగా వారి నుండి నిష్క్రమించు.” (73:10)

వారు రకరకాలుగా విమర్శిస్తూ ఉంటారు. వారి విమర్శించే విమర్శలను నువ్వు పట్టించుకోవద్దు. వారి విమర్శలపై ఓర్పు, సహనం పాటించు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేసి ఉన్నాడు.

అలాగే ఆరో విషయం ఏమిటంటే, ఆత్మీయులను కోల్పోయినప్పుడు. అల్లాహు అక్బర్, ఇది గొప్ప విషయం అండి. మన కుటుంబంలో మన బిడ్డలు కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, అన్న, చెల్లెళ్ళు ఎవరైనా కావచ్చు, మన ఆత్మీయుల్ని ఎప్పుడైతే మనము కోల్పోతామో, అప్పుడు కూడా చాలా సహనం పాటించవలసి ఉంటుంది.

ఇది మామూలు విషయం కాదు. మన కుటుంబ సభ్యుల్లో, మన ఆత్మీయుల్లో ఎవరో ఒకరు మరణించారంటే అది పెద్ద ప్రాణ నష్టం. ఆ నష్టం ఎప్పుడైతే వాటిల్లుతుందో, మనిషి కుంగిపోతాడు, కదిలిపోతాడు. అయినా గానీ ఓపిక సహనం పాటించవలసి ఉంటుంది.

బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనాన్ని చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తూ ఉన్నారు,

మాలి అబ్ దిల్ మోమిని ఇందీ జజావున్ ఇజా కబస్తు సఫియ్యహు మిన్ అహ్లిద్దున్యా సుమ్మ హతసబహు ఇల్లల్ జన్నా.
విశ్వాసి అయిన నా దాసుని యొక్క ఆత్మీయులు ప్రపంచంలో నివసించు వారిలో ఒకరిని నేను తీసుకున్నప్పుడు అతను నాపై నమ్మకం ఉంచి సహనంగా ఉంటే అతని కొరకు నా వద్ద స్వర్గం తప్ప మరో బహుమతి లేదు.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ప్రవక్త అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట తెలిపిన మాట ఏమిటంటే, విశ్వాసి అయిన నా దాసుని యొక్క ఆత్మీయులు ప్రపంచంలో నివసించు వారిలో ఒకరిని నేను తీసుకున్నప్పుడు అతను నాపై నమ్మకం ఉంచి సహనంగా ఉంటే అతని కొరకు నా వద్ద స్వర్గం తప్ప మరో బహుమతి లేదు. అల్లాహు అక్బర్. ఆత్మీయుల్లో ఎవరో ఒకరు మరణించినప్పుడు మనము సహనం ప్రదర్శిస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏమంటున్నాడంటే అతని ఆత్మీయుల్ని నిన్ను తీసుకున్నాను, అయినా అతను సహనం పాటించాడు కాబట్టి అతనికి నా వద్ద స్వర్గం తప్ప మరొక బహుమతి లేదు, నేను అతనికి స్వర్గమే ఇచ్చేస్తాను బహుమానంగా అని అల్లాహ్ తెలియజేసి ఉన్నాడు. కాబట్టి ఆత్మీయుల్ని కోల్పోయినప్పుడు సహనం పాటించవలసి ఉంటుంది, అలా పాటిస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ భక్తునికి బహుమానంగా స్వర్గం ఇస్తాడు.

అలాగే ఏడో విషయం ఏమిటంటే, ప్రజల మధ్య సంచరిస్తున్నప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది. ఎందుకంటే, ఒక వ్యక్తి అల్లాహ్ ఆదేశాలను పాటిస్తూ ప్రజల మధ్య నడుస్తూ ఉంటే అతని టోపీని చూసి గానీ, అతని గడ్డాన్ని చూసి గానీ, అతను ధరించిన జుబ్బాలను చూసి గానీ, లేదంటే ఏదో ఒక విషయాన్ని చూసి కొంతమంది వెక్కిరిస్తారు, లేదంటే హేళన చేస్తారు, రకరకాల ఎత్తిపొడిచే మాటలు మాట్లాడతారు. అయినా గానీ, నన్ను చూసి, నేను అమలు చేస్తున్న నా ఈ గడ్డాన్ని చూసి, లేదంటే నా బట్టలను చూసి, నా టోపీని చూసి వీరు నన్ను హేళన చేస్తున్నారు అని మనము కృంగిపోకూడదు, ఆ విషయాలను త్యజించకూడదు. సహనం పాటించవలసి ఉంటుంది. ప్రజల మధ్య ఉన్నప్పుడు లోకులు కాకులని విన్నారు కదా, ఆ విధంగా వాళ్ళు కావు కావు అంటారు. కానీ మనము సహనం పాటించాలి. ప్రజల మధ్య ఉండి, వారి మాటల మీద సహనం ప్రదర్శించినవాడు గొప్ప విశ్వాసి అని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు.

ఎనిమిదో విషయం ఏమిటంటే, వ్యాధి సోకినప్పుడు సహనం పాటించవలసి ఉంటుంది. ఒక మనిషి ఆరోగ్యంగా ఎంతో కాలం జీవించుకుంటూ వస్తాడు. అయితే అకస్మాత్తుగా అతనికి ఒక వ్యాధి సోకుతుంది. ఆ వ్యాధి సోకిన తరువాత అతను ఎప్పుడైతే వైద్యం చేయించుకుంటాడో, అప్పటి నుండి అతని జీవితం తలకిందులైపోతుంది. డాక్టర్లు, వైద్యులు అతనికి ఇవి తినకూడదు, అవి తినకూడదు, అక్కడ కూర్చోకూడదు, అది ఎత్తకూడదు, అది మోయకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని కొన్ని విషయాలు, కొన్ని ఆంక్షలు పెడతారు. అలా ఆంక్షలు పెట్టినప్పుడు అతని జీవితం మొత్తం తలకిందులైపోతుంది. అన్ని రోజులు అతను తోచింది తిన్నాడు, తోచినట్టు అతను నడుచుకున్నాడు. కానీ ఈ వ్యాధి వచ్చిన తర్వాత నుంచి అతను తోచింది తినలేడు, తోచినట్టు అతను ఏదీ చేయలేడు, క్రమశిక్షణతో అతను కొన్ని ఆంక్షలను పాటించవలసి వస్తూ ఉంటుంది. అలా జీవితం ఎప్పుడైతే తలకిందులైపోతుందో, అప్పుడు కూడా అతను సహనం పాటించవలసి ఉంటుంది.

దీనికి ఉదాహరణగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలో ఒక మహిళకు ఒక వ్యాధి సోకింది. ఆవిడ స్పృహ కోల్పోయి దారిలో ఎక్కడంటే అక్కడ పడిపోయేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఆవిడ విన్నవించుకున్నారు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నాకు ఫలానా వ్యాధి ఉంది, ఆ వ్యాధి వల్ల నేను ఎక్కడంటే అక్కడ స్పృహ కోల్పోయి పడిపోతూ ఉంటాను కాబట్టి మీరు అల్లాహ్ తో దుఆ చేయండి, నా ఈ వ్యాధి తొలగిపోవాలని అల్లాహ్ ను ప్రార్థించండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఆవిడ కోరుకున్నారు.

అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆవిడ ముందర రెండు విషయాలు ఉంచారు. మొదటి విషయం ఏమిటంటే, చూడమ్మా నువ్వు సహనం పాటిస్తే ఈ వ్యాధి మీద నీకు స్వర్గం ఇవ్వబడుతుంది. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏమిటంటే నువ్వు కోరినట్టుగానే నిన్ను దుఆ చేయమంటే నిన్ను దుఆ చేసేస్తాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ వ్యాధి తొలగించేస్తాడు. ఈ రెండు విషయాల్లో నీకు ఏది కావాలో కోరుకో అన్నారు. ఆవిడ ఏమన్నారో తెలుసా? ఓ దైవ ప్రవక్త, నేను సహనం పాటిస్తాను, నాకు స్వర్గమే కావాలి అన్నారు. అల్లాహు అక్బర్. సుబ్ హా నల్లాహ్. చూశారా మిత్రులారా? కాబట్టి వ్యాధి సోకినప్పుడు సహనం పాటించవలసి ఉంటుంది.

అలాగే చివరి విషయం ఏమిటంటే, సేవ చేసేటప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది. మానవ సేవ అండి, సేవ అంటే ధార్మిక సేవ కావచ్చు, మానవ సేవ కావచ్చు, ఏ రకమైన సేవ అయినా సరే. సేవ చేసినప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది. ఎందుకు?

ఎందుకు అంటే మీరు సేవ కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నప్పుడు ప్రజలు మీ మీద నోరు పారేసుకుంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీదనే ఒక వ్యక్తి వెళ్లి మాట్లాడాడు. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పంచే కొన్ని విషయాలు పంచుతూ ఉన్నారు. ప్రజల మధ్య కొన్ని విషయాలు పంచుతూ ఉన్నారు. పంచుతూ ఉంటే ఒక వ్యక్తి వచ్చి యా ముహమ్మద్ ఇ’దిల్, ఓ ముహమ్మద్ నువ్వు న్యాయంగా వ్యవహరించు అంటూ ఉన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కోపం వచ్చేసింది. ఎంత కోపం వచ్చింది అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మొహం ఎర్రబడిపోయింది. సహాబాలు చూసి గమనించేశారు. ప్రవక్త వారికి అంత కోపం వచ్చింది అని. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఆయన కారుణ్యమూర్తి కదండీ, కోపం వచ్చినా గానీ కోపం ప్రదర్శించరు. ఆయన ప్రశాంతంగా మాట్లాడుతారు. ఆయన ఏమన్నాడో తెలుసా? నేను న్యాయం చేయకపోతే ఎవరు న్యాయం చేస్తారయ్యా అన్నారు. అల్లాహు అక్బర్. కాబట్టి సేవ కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నప్పుడు కూడా ప్రజలు నోరు పారేసుకుంటారు. కాబట్టి విశ్వాసంగా, నిజాయితీగా మనము సేవ కార్యక్రమాలు, అది ధర్మ సేవ కావచ్చు, మానవ సేవ కావచ్చు, అలాంటి కార్యక్రమాలలో పాల్గొనాలి. అలా పాల్గొనేటప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది.

చివరిగా ధార్మిక పండితులు కొందరు ఏమన్నారంటే, సహనం మూడు రకాలు, అస్సబరు సలాసతు అన్వా. సబర్, సహనం మూడు రకాలు.

మొదటిది, అస్సబరు అలా అదాయిత్తాఅ. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క ఆదేశాలను పాటిస్తున్నప్పుడు సహనం పాటించవలసి ఉంటుంది.

రెండవది, అస్సబరు అన్ ఇర్తికాబిల్ మాసియ. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నిషేధించిన విషయాలను త్యజించేసేటప్పుడు సహనం పాటించవలసి ఉంటుంది.

మూడవది, అస్సబరు అలా అఖ్దారిల్లాహిల్ మూలిమా. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భక్తుని మీద కొన్ని నిర్ణయాలు ఎప్పుడైతే చేసేస్తాడో, ఆ అల్లాహ్ నిర్ణయాలను కట్టుబడి ఉండేటప్పుడు కూడా మనిషి సహనం పాటించవలసి ఉంటుంది.

ఈ మూడు విషయాలు ధార్మిక పండితులు తెలియజేశారు. చూడటానికి మూడు విషయాలు కానీ దీని అర్థము, భావము చాలా విశాలమైనది, లోతైనది.

ఇంతటితో నా మాటను ముగిస్తూ నేను అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉన్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ఓపిక, సహనం అనే గుణం ప్రసాదించు గాక. మనందరికీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అల్లాహ్ ఆరాధనల్లో, అల్లాహ్ ఆదేశాలు పాటించే విషయంలో సహనం పాటించే గుణం ప్రసాదించు గాక. అలాగే పాప కార్యాల నుండి, అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిషేధించిన విషయాల నుండి దూరం ఉండేటప్పుడు కూడా అల్లాహ్ మనందరికీ సహనం ప్రసాదించు గాక.

అలాగే ప్రవక్త వారు తెలియజేసినట్టుగా అల్లాహ్ ఇచ్చిన అనుగ్రహాలలో గొప్ప అనుగ్రహం సహనం, ఆ గొప్ప అనుగ్రహం సహనం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక. అల్లాహ్ మనందరికీ స్వర్గం ప్రసాదించు గాక. నరకం మరియు సమాధి శిక్షల నుండి, ఇతర శిక్షల నుండి అల్లాహ్ మనందరినీ కాపాడు గాక. ఆమీన్.

وَ جَزَاكُمُ اللّٰهُ خَيْرًا
(వ జజాకుముల్లాహు ఖైరన్)

السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు)

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43525

ప్రాణాంతకమైన 7 విషయాలు! [వీడియో & టెక్స్ట్]

ప్రాణాంతకమైన 7 విషయాలు!
వక్త: షేక్ హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)
https://youtu.be/gRDAnqTbVpY [9 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ఇస్లాంలో ఏడు ఘోరమైన, ప్రాణాంతకమైన పాపాల గురించి వివరించబడింది. మునుపటి ప్రసంగంలో చర్చించిన ఏడు రకాల పుణ్యకార్యాలకు విరుద్ధంగా, ఈ పాపాలు ఒక వ్యక్తిని నాశనం చేస్తాయని చెప్పబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసును ఉటంకిస్తూ, ఈ ఏడు పాపాలను జాబితా చేశారు: 1) అల్లాహ్‌కు భాగస్వాములను కల్పించడం (షిర్క్), 2) చేతబడి (సిహ్ర్), 3) అన్యాయంగా ఒక ప్రాణాన్ని తీయడం, 4) వడ్డీ తినడం (రిబా), 5) అనాథ ఆస్తిని తినడం, 6) ధర్మయుద్ధం నుండి పారిపోవడం, మరియు 7) పవిత్రులైన విశ్వాస స్త్రీలపై అపనిందలు వేయడం. ఈ పాపాలు ఎంత తీవ్రమైనవో, వాటికి కేవలం సాధారణ పుణ్యకార్యాలు కాకుండా, ప్రత్యేక పశ్చాత్తాపం (తౌబా) అవసరమని నొక్కి చెప్పబడింది. ఈ ఘోరమైన పాపాల నుండి రక్షణ పొందాలని అల్లాహ్‌ను ప్రార్థిస్తూ ప్రసంగం ముగుస్తుంది.


అభిమాన సోదరులారా! కారుణ్య వర్షిణి రమదాన్ అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహ్.

అభిమాన సోదరులారా! ఈ రోజు మనం ప్రాణాంతకమైన ఏడు విషయాలు తెలుసుకుందాం. నిన్న ఎపిసోడ్ లో మనం ప్రళయ దినాన ఏడు రకాల మనుషులకి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన నీడను ప్రసాదిస్తాడు అని తెలుసుకున్నాము. అంటే నిన్న తెలుసుకుంది కావలసిన ఏడు విషయాలు. న్యాయం కావాలి, నమాజ్ చేయాలి, యవ్వనం అల్లాహ్ మార్గంలో గడపాలి, గుప్తంగా దానం చేయాలి, వ్యభిచారానికి దూరంగా ఉండాలి, ఏకాంతంలో అల్లాహ్ కు భయపడాలి, ఏడవాలి భయపడి, కలుసుకుంటే అల్లాహ్ ప్రసన్నత, విడిపోతే అల్లాహ్ ప్రసన్నత – ఈ ఏడు కావలసిన, చేయవలసిన విషయాలు నిన్న తెలుసుకున్నాము.

ఈ రోజు ఏడు విషయాలని వదులుకోవాలి. ప్రాణాంతకమైన ఏడు విషయాలు. పాపంతో కూడుకున్న ఏడు విషయాలు. ఘోరమైన పాపంతో కూడుకున్న ఏడు విషయాలు. అందుకే, దానికి ప్రాణాంతకమైన విషయాలు అని చెప్పడం జరిగింది. ఆ హదీస్ ఏమిటంటే, అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు కథనం, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు:

اجْتَنِبُوا السَّبْعَ الْمُوبِقَاتِ
(ఇజ్తనిబు అస్సబ్’అల్ మూబికాత్)
“ప్రాణాంతకమైన ఏడు విషయాలకు దూరంగా ఉండండి” అని అన్నారు.

ఇది విన్న సహాబాలు రిజ్వానుల్లాహి అలైహిం అజ్మయీన్

قَالُوا يَا رَسُولَ اللهِ وَمَا هُنَّ
(ఖాలూ యా రసూలల్లాహ్, వమా హున్)
“ఓ దైవ ప్రవక్తా! ఆ ప్రాణాంతకమైన ఏడు విషయాలు ఏమిటి?” అని అడిగారు.

దానికి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఏడు విషయాలు వివరించారు. వాటిల్లో మొదటి విషయం

اَلشِّرْكُ بِاللهِ
(అష్-షిర్కు బిల్లాహ్)
అల్లాహ్‌కు సహవర్తుల్ని నిలబెట్టడం.

ఇది అన్నింటికంటే ఘోరమైన పాపం, ప్రాణాంతకమైన విషయం.

ప్రియ వీక్షకుల్లారా! షిర్క్ అంటే ఏమిటి? అల్లాహ్ అస్తిత్వములో లేదా అల్లాహ్‌కు కొరకు మాత్రమే ప్రత్యేకమైన ఉన్న భావములో ఆయన గుణగణాలలో లేదా ఆయన హక్కులలో ఎవరినైనా సహవర్తునిగా ఎంచటమే షిర్క్. వాడుక భాషలో చెప్పాలంటే, అల్లాహ్‌ను నమ్ముతూ, అల్లాహ్ తో పాటు ఇతరులని కూడా పూజ చేయటం, ఆరాధించటం. ఆరాధన అల్లాహ్‌కే ప్రత్యేకం కదా, కానీ ఆ ఆరాధన ఇతరులకు కూడా చేయటం. ఇది కూడా షిర్క్ అవుతుంది. అంటే బహుదైవారాధన.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో సూరె లుఖ్మాన్ లో ఇలా తెలియజేశాడు:

يَا بُنَيَّ لَا تُشْرِكْ بِاللَّهِ ۖ إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ
(యా బునయ్య లా తుష్రిక్ బిల్లాహ్, ఇన్నష్షిర్క ల జుల్మున్ అజీమ్)
“ఓ నా కుమారా! అల్లాహ్‌కు భాగస్వాములను కల్పించకు. నిశ్చయంగా షిర్క్‌ చాలా పెద్ద దుర్మార్గం.” (31:13)

ఇది లుఖ్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి హితోపదేశిస్తూ చెప్పిన విషయం ఇది. “యా బునయ్య! ఓ నా ముద్దుల పుత్రుడా! లా తుష్రిక్ బిల్లాహ్ – అల్లాహ్‌కు భాగస్వాములను కల్పించకు. అల్లాహ్ తో షిర్క్ చేయవద్దు, సాటి కల్పించవద్దు. ఇన్నష్షిర్క ల జుల్మున్ అజీమ్ – ఎందుకంటే నిస్సందేహంగా షిర్క్ అనేది మహా పాపం, ఘోరమైన అన్యాయం.”

ఇది క్లుప్తంగా షిర్క్. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రాణాంతకమైన ఏడు విషయాలలో ఇది మొట్టమొదటిది, చాలా ఘోరమైనది – షిర్క్. షిర్క్ చేస్తూ చనిపోతే అటువంటి వారికి క్షమాపణ లేదని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ప్రతి షిర్క్ నుండి – పెద్ద షిర్క్, చిన్న షిర్క్, అన్ని రకాల షిర్క్ నుండి అల్లాహ్ మనల్ని రక్షించు గాక, కాపాడు గాక.

ఇది మొదటి విషయం. ప్రాణాంతకమైన ఏడు విషయాలలో మొదటి విషయం షిర్క్ చేయటం. అల్లాహ్‌కు భాగస్వాములు నిలబెట్టడం.

రెండవది:

وَالسِّحْرُ
(వస్-సిహ్ రు)
చేతబడి.

జాదూ. చేతబడి చేయటం, చేయించటం ఇస్లాంలో హరాం, నిషిద్ధం, అధర్మం, ఘోరమైన పాపం.

అలాగే మూడవది:

وَقَتْلُ النَّفْسِ الَّتِي حَرَّمَ اللهُ إِلَّا بِالْحَقِّ
(వ కత్లున్-నఫ్సిల్లతీ హర్రమల్లాహు ఇల్లా బిల్-హఖ్)
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నిషిద్ధం చేసిన ప్రాణిని అన్యాయంగా చంపటం.

హత్య చేయటం ఘోరమైన పాపం.

అలాగే నాలుగవది:

وَأَكْلُ الرِّبَا
(వ అకులుర్-రిబా)
వడ్డీ తినటం.

ఇస్లాం ధర్మంలో వడ్డీ సమంజసం కాదు. అధర్మం, నిషిద్ధం, హరాం, ఘోరమైన పాపం, అన్యాయం, దగా, మోసం కిందకి లెక్కించబడుతుంది. ఇస్లాం ధర్మంలో వడ్డీ ఇచ్చినా, వడ్డీ పుచ్చుకున్నా, దానికి సాక్ష్యంగా ఉన్నా, అందరూ పాపములో సమానులే అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అలాగే ఐదవ విషయం:

وَأَكْلُ مَالِ الْيَتِيمِ
(వ అకులు మాలిల్-యతీమ్)
అనాథుని సొమ్ము తినేయటం.

ఎవరి సొమ్మయినా సరే అన్యాయంగా తినేస్తే, కాజేస్తే అది అధర్మమే, అది పాపమే. దాంట్లో ముఖ్యంగా అనాథుని సొమ్ము తినేస్తే ఇది ఇంకా ఘోరమైన పాపం.

ఆరవది:

وَالتَّوَلِّي يَوْمَ الزَّحْفِ
(వత్-తవల్లీ యౌమజ్-జహ్ఫి)
దైవ తిరస్కారులతో యుద్ధం జరిగినప్పుడు వెన్ను చూపి పారిపోవటం.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ధర్మయుద్ధం అది. ఎక్కడైతే అక్కడ గొడవ చేయటం, ధర్మయుద్ధం కిందకి రాదు. బాంబులు వేసేయటం, ధర్మయుద్ధం కిందకి రాదు. ఇది అపోహ. దానికి కొన్ని రూల్స్, కండిషన్లు ఉన్నాయి. అల్లాహ్ మార్గంలో యుద్ధం జరిగినప్పుడు వెన్ను చూపి పారిపోవటం.

అలాగే ఏడవది:

وَقَذْفُ الْمُحْصَنَاتِ الْمُؤْمِنَاتِ الْغَافِلَاتِ
(వ కజ్ఫుల్ ముహ్సినాతిల్ ము’మినాతిల్ గాఫిలాత్)
అమాయకులు, శీలవంతులు అయిన విశ్వాస స్త్రీల మీద అభాండాలు వేయటం, అపనిందలు మోపటం.

ఈ ఏడు రకాల పాపాలు ప్రాణాంతకమైనవి. పాపాలలో అతి ఘోరమైనవి. దీనికి పెద్ద పాపాలు అంటారు, కబాయిర్ అంటారు. అంటే, ఈ పాపాలు నమాజ్ వల్ల, దుఆ వల్ల, వేరే పుణ్యాల వల్ల క్షమించబడవు. దీనికి తప్పనిసరిగా పశ్చాత్తాపం చెందాల్సిందే, తౌబా చేసుకోవాల్సిందే. ఈ పాపాలకి తప్పనిసరిగా తౌబా చేసుకోవాలి, పశ్చాత్తాప పడాలి. అప్పుడే ఇవి క్షమించబడతాయి.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఈ ఘోరమైన పాపాల నుండి రక్షించు గాక! అల్లాహ్ మనందరినీ షిర్క్ నుండి కాపాడు గాక! వడ్డీ నుండి కాపాడు గాక! చేతబడి చేయటం, చేయించటం నుండి కాపాడు గాక! అనాథుని సొమ్ముని కాజేయటం నుండి అల్లాహ్ మనల్ని రక్షించు గాక! ప్రతి పాపం నుండి, ఆ పాపం పెద్దదైనా, ఆ పాపం చిన్నదైనా, అల్లాహ్ మనందరినీ రక్షించు గాక! అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనల్ని అల్లాహ్ ఆదేశాలను, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలను అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించు గాక! అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఇహపరలోకాలలో సాఫల్యాన్ని ప్రసాదించు గాక! ఆమీన్.

వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=42368

పాపాలు (Sins):
https://teluguislam.net/sins/

ఏమీ లేనివారు దానం చేసేదెలా? – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో | టెక్స్ట్]

ఏమీ లేనివారు దానం (సదకా) చేసేదెలా?
https://youtu.be/wB4zgYE0JwQ [21 నిముషాలు]
వక్త: షేక్ హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, దానం (సదకా) యొక్క ప్రాముఖ్యత మరియు దాని విస్తృతమైన అర్థం గురించి వివరించబడింది. గత వారం ప్రసంగంలోని 18 ప్రయోజనాలను గుర్తుచేస్తూ, ఈ వారం ముఖ్యంగా ఏమీ లేని వారు కూడా ఎలా దానం చేయవచ్చో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల ద్వారా స్పష్టం చేయబడింది. శారీరక శ్రమ చేసి సంపాదించి ఇవ్వడం, అది కూడా సాధ్యం కాకపోతే ఇతరులకు శారీరకంగా సహాయపడటం, అది కూడా చేయలేకపోతే కనీసం చెడు పనుల నుండి దూరంగా ఉండటం కూడా దానమేనని వివరించబడింది. మంచి మాట పలకడం, దారి చూపడం, ఇబ్బంది కలిగించే వస్తువులను తొలగించడం వంటి ప్రతి మంచి పని సదకాగా పరిగణించబడుతుందని చెప్పబడింది. దానం చేసేటప్పుడు ప్రదర్శనా బుద్ధి (రియా) ఉండకూడదని, అల్లాహ్ ప్రసన్నతను మాత్రమే ఆశించాలని ఖురాన్ ఆయతుల ద్వారా నొక్కి చెప్పబడింది. దానం రహస్యంగా ఇవ్వడం ఉత్తమమని, కానీ ఫర్జ్ అయిన జకాత్‌ను ఇతరులను ప్రోత్సహించడానికి బహిరంగంగా ఇవ్వవచ్చని కూడా పేర్కొనబడింది.

الْحَمْدُ لِلَّهِ الَّذِي يُجْزِلُ الْمُتَصَدِّقِينَ
దాతలకు గొప్ప ప్రతిఫలాన్నిచ్చే అల్లాహ్ కే సర్వ స్తోత్రములు.

وَيُخْلِفُ عَلَى الْمُنْفِقِينَ
ఖర్చు చేసేవారికి ప్రతిఫలం ఇస్తాడు.

وَيُحِبُّ الْمُحْسِنِينَ
సజ్జనులను ప్రేమిస్తాడు.

وَلَا يُضِيعُ أَجْرَ الْمُؤْمِنِينَ
మరియు విశ్వాసుల ప్రతిఫలాన్ని వృధా చేయడు.

أَحْمَدُهُ سُبْحَانَهُ
నేను ఆయన పవిత్రతను కొనియాడుతున్నాను,

عَلَىٰ نِعَمِهِ الْعَظِيمَةِ
ఆయన గొప్ప అనుగ్రహాలకు,

وَآلَائِهِ الْجَسِيمَةِ
మరియు ఆయన అపారమైన వరాలకు,

وَصِفَاتِهِ الْكَرِيمَةِ
మరియు ఆయన ఉదార గుణాలకు.

وَأَسْأَلُهُ أَنْ يَجْعَلَ عَمَلَنَا فِي الْخَيْرِ دِيمَةً
మంచి పనులలో మా ఆచరణను నిరంతరం ఉండేలా చేయమని నేను ఆయనను వేడుకుంటున్నాను.

وَأَشْهَدُ أَنْ لَا إِلَٰهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ
మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధనకు అర్హులు కారు, ఆయన ఒక్కడే, ఆయనకు భాగస్వాములు లేరు.

وَهُوَ الرَّبُّ الْعَظِيمُ
ఆయనే గొప్ప ప్రభువు,

وَالْإِلَٰهُ الرَّحِيمُ
దయగల ఆరాధ్యుడు,

الْجَوَّادُ الْمُحْسِنُ الْكَرِيمُ
దాత, సజ్జనుడు, ఉదారుడు.

وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ
మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, నిశ్చయంగా ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త.

النَّبِيُّ الْأَمِينُ
విశ్వసనీయ ప్రవక్త,

وَالرَّسُولُ الْكَرِيمُ
గౌరవనీయమైన ప్రవక్త.

كَانَ أَجْوَدَ النَّاسِ
ప్రజలందరిలోకెల్లా అత్యంత దాతృత్వంగలవారు.

وَأَكْرَمَ النَّاسِ
ప్రజలందరిలోకెల్లా అత్యంత గౌరవనీయులు.

فَكَانَ أَجْوَدَ بِالْخَيْرِ مِنَ الرِّيحِ الْمُرْسَلَةِ
ఆయన మంచి చేయడంలో వేగంగా వీచే గాలి కంటే ఎక్కువ దాతృత్వం కలవారు.

صَلَّى اللَّهُ عَلَيْهِ وَعَلَى آلِهِ وَصَحْبِهِ
అల్లాహ్ ఆయనపై, ఆయన కుటుంబంపై మరియు ఆయన సహచరులపై శాంతిని వర్షింపజేయుగాక.

الَّذِينَ كَانُوا يُسَارِعُونَ فِي الْخَيْرَاتِ
వారు మంచి పనులలో పోటీపడేవారు.

فَكَانُوا يُنْفِقُونَ مِمَّا يُحِبُّونَ
వారు తమకు ఇష్టమైన వాటి నుండి ఖర్చు చేసేవారు.

وَيُؤْثِرُونَ عَلَىٰ أَنْفُسِهِمْ وَلَوْ كَانَ بِهِمْ خَصَاصَةٌ
మరియు తమకు అవసరం ఉన్నప్పటికీ, ఇతరులకు ప్రాధాన్యత ఇచ్చేవారు.

وَمَنْ يُوقَ شُحَّ نَفْسِهِ فَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ
మరియు ఎవరైతే తన మనస్సు యొక్క పిసినారితనం నుండి రక్షించబడ్డాడో, అటువంటి వారే సాఫల్యం పొందేవారు.

సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు, సకల ప్రశంసలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన, సకల లోకాలకు సృష్టికర్త అయిన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక.

అభిమాన సోదరులారా! గత శుక్రవారం మనం ఇహపర లోకాలలో దానం వల్ల కలిగే 18 ప్రయోజనాలు తెలుసుకున్నాం.

ఈరోజు ఏమీ లేని వారు దానం చేసేది ఎలా? ఈ అంశంపై కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. ఒక హదీసులో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాట ఇలా ఉంటుంది.

عَلَى كُلِّ مُسْلِمٍ صَدَقَةٌ
[అలా కుల్లి ముస్లిమిన్ సదఖతున్]
ప్రతి ముస్లింపై దానం (సదకా) చేయడం తప్పనిసరి.

ఇది హదీస్ కి అర్థం. ప్రతి ముస్లింపై దానం చేయడం తప్పనిసరి విధి. మరి సహాబాలలో చాలామంది పేదవారు, లేనివారు. అంతెందుకు, కొంతమంది సహాబాకి ఇల్లు కూడా లేదు, మస్జిద్ లో ఉంటున్నారు. వారి నివాసం మస్జిద్. వారిలో కొంతమంది కూలి పని చేసుకుని తన జీవితం గడిపితే, మరి కొంతమంది దీన్ నేర్చుకోవడం కోసం పూర్తి జీవితాన్ని అంకితం చేశారు కాబట్టి మస్జిద్ లోనే ఉండిపోయేవారు. అబూ హురైరా (రదియల్లాహు అన్హు) లాంటి వారు. అంటే ఎవరైనా ఏదైనా దానం చేసి ఖర్జూరం తీసుకుని వచ్చి ఇస్తే అది తినేవారు, లేకపోతే పస్తులు ఉండేవారు. మరి అటువంటి వారు దానం ఎలా చేయాలి? ఈ హదీస్ కి అర్థం ఏమిటి? “అలా కుల్లి ముస్లిం సదకా” – ప్రతి ముస్లింపై దానం చేయడం, సదకా చేయడం తప్పనిసరి. మరి సహాబాలకి ఆశ్చర్యం వేసింది, సహాబాలు అడిగారు. ఏం అడిగారు? “ఓ ప్రవక్తా, ఒకవేళ అతని వద్ద స్థోమత లేకుంటే ఏం చేసేది?”

قِيلَ: أَرَأَيْتَ إِنْ لَمْ يَجِدْ؟
దానం చేసే అంత స్థోమత లేదు, మరి ఏం చేయాలి?

قَالَ
మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు,

يَعْتَمِلُ بِيَدَيْهِ
అతను కూలి పని చేయాలి.

فَيَنْفَعُ نَفْسَهُ
తద్వారా వచ్చిన వేతనంతో తాను తినాలి,

وَيَتَصَدَّقُ
అవసరార్థులకు తినిపించాలి.

ప్రశ్న ఏమిటి? ఓ దైవ ప్రవక్తా దానం చేసే స్థోమత లేదు. అటువంటి వారు ఏం చేయాలి? దానికి సమాధానం ప్రవక్త గారు ఏం చెప్పారు? కూలి పని చేయండి. తద్వారా వచ్చిన వేతనంతో స్వయంగా తినండి, అవసరార్థులకు తినిపించండి అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు.

అంటే మనలో చాలామంది ఏమనుకుంటారంటే మిడిల్ క్లాస్ వారు, అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారు, పేదవారు, లేనివారు దానం అనేది ధనవంతులు మాత్రమే చేస్తారు, వారు చేసే పని, నాలాంటి వారికి, మాలాంటి వారికి దానం లేదు, పేదవాళ్ళం కదా అని ఆ భ్రమలోనే జీవితాంతం అలాగే ఉండిపోతారు. కానీ ఈ హదీసులో ఏమీ లేని వారు కూడా తమ స్థోమతను బట్టి దానం చేయాలని మహాప్రవక్త ఆజ్ఞాపించారు. అంతటితో హదీస్ పూర్తి అవ్వలేదు. ఆ తర్వాత మళ్లీ సహాబాలు అడిగారు.

أَرَأَيْتَ إِنْ لَمْ يَسْتَطِعْ؟
కూలి పని చేసే అంత శక్తి కూడా అతనికి లేదు.

కొందరు ఉంటారు, అనారోగ్యం మూలంగా, ముసలితనం మూలంగా, ఇంకో ఏదైనా కారణంగా ఆ పని కూడా చేయలేరు. మరి మీరేమో “అలా కుల్లి ముస్లిం సదకా” అని చెప్పేశారు, తప్పనిసరి అని చెప్పేశారు. కూలి పని చేసే అంత శక్తి కూడా లేదు, ఆ అవకాశం కూడా లేదు. అటువంటి వారు ఏం చేయాలి? అంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, ఒకవేళ అతను కూలి పని కూడా చేయగలిగే శక్తి లేనివాడైతే ఆ వ్యక్తి దుఖితులకు, అవసరార్థులకు శారీరక సేవను చేయాలి. ఇది కూడా దానం కిందకే వస్తుంది. అంటే పేదవాడు, డబ్బు లేదు, ఏమీ లేదు, కూలి కూడా చేయలేడు, అటువంటి వాడు శారీరకంగా ఇతరులకు సహాయం చేయగలిగితే సహాయం చేయాలి, అది కూడా దానం కిందకే వస్తుంది. ఆ తర్వాత అది కూడా చేయలేకపోతే? అనారోగి. ఒక రోగి అనారోగ్యంతో ఉన్నాడు. శారీరకంగా కూడా సహాయం చేసే స్థితిలో లేడు. దాని గురించి అన్నారు, అది కూడా చేయకపోతే చెడు పనుల నుండి తన్ను తాను కాపాడుకోవాలి. ఇది కూడా సదకా కిందకే వస్తుంది. చెడు నుండి తనకు తాను కాపాడుకోవాలి. ఇది కూడా సదకా, దానం గానే పరిగణించబడుతుందని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అలాగే బుఖారీలో ఒక హదీస్ ఉంది, అది ఏమిటంటే:

كُلُّ مَعْرُوفٍ صَدَقَةٌ
ప్రతి మంచి మాట కూడా దానం కిందకే వస్తుంది.

ఒక మంచి మాట పలకడం కూడా దానమే అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అలాగే అనేక హదీసులలో దారి తప్పిన బాటసారికి దారి చూపటం కూడా దానమే, ఒక గుడ్డివాని చేయి పట్టి మార్గదర్శకత్వం వహించడం కూడా దానమే, దారిలో నుండి ముల్లును, రాయిని, ఎముకను తొలగించడం కూడా దానమే. తన బొక్కెనలో ఉన్న నీరును తోటి సోదరుని కడవలో పోయటం కూడా దానమే అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. అంటే దానం చేయాలంటే అనేక మార్గాలు మనకు ఇస్లాం తెలియపరుస్తుంది. కాకపోతే తన స్థోమత మేరకు ఆర్థికపరంగానైనా, శారీరకపరంగానైనా, ఏదో విధంగానైనా దానం చేయాలి, సహాయం చేయాలని బోధపడింది.

ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, దానం చేసిన తర్వాత వాటి నుంచి ఏదీ ఆశించకూడదు. ఇది చాలా ముఖ్యమైన అంశం. మొదటి వహీ వచ్చింది: “ఇఖ్రా బిస్మి రబ్బికల్లజీ ఖలఖ్”. ఆ తర్వాత రెండవ వహీ సూరహ్ ముద్దస్సిర్. దాంట్లో ఒక వాక్యం ఉంది.

وَلَا تَمْنُن تَسْتَكْثِرُ
ఉపకారం చేసి ఎక్కువ (ప్రతిఫలం) పొందాలని ఆశించకు. (74:6)

నేను దానం చేస్తే, నేను సహాయం చేస్తే, తిరిగి అతనితో నాకు ఏదైనా ప్రయోజనం కలుగుతుంది అనే ఉద్దేశ్యంతో దానం చేస్తే అది దానం కాదు. అది సదకా కాదు. నువ్వు ఒక ఉద్దేశ్యంతో, ఒక లాభంతో, మళ్లీ నీకు ఏదో రూపంలో తిరుగు వస్తుందనే భావంతో నువ్వు ఇస్తున్నావు కదా? అది దానం ఎలా అయ్యింది? ఆ ఉద్దేశ్యంతో దానం, ఉపకారం చేయకు అని అల్లాహ్ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను ఉద్దేశించి అంటున్నాడు. “వలా తమ్నున్ తస్తక్ సిర్” – ఓ ప్రవక్తా, అధికంగా పొందాలన్న ఆశతో ఉపకారం చేయకు. సర్వసాధారణమైన రీతిలో ముస్లింలకు ఈ విధంగా తాకీదు చేయడం జరిగింది.

అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సెలవిచ్చాడు:

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُبْطِلُوا صَدَقَاتِكُم بِالْمَنِّ وَالْأَذَىٰ كَالَّذِي يُنفِقُ مَالَهُ رِئَاءَ النَّاسِ وَلَا يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ
ఓ విశ్వాసులారా! తన ధనాన్ని పరుల మెప్పుకోసం ఖర్చుచేస్తూ, అల్లాహ్‌ను గానీ, అంతిమదినాన్ని గానీ విశ్వసించని వ్యక్తి మాదిరిగా మీరు మీ ఉపకారాన్ని చాటుకుని, (గ్రహీతల) మనస్సులను నొప్పించి మీ దానధర్మాలను వృధా చేసుకోకండి. (2:264)

ఈ ఆయతులో ప్రదర్శనా బుద్ధితో దానం చేయటం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అవిశ్వాసులతో పోల్చాడు. ఏ విధంగా అయితే “వలా యు’మిను బిల్లాహ్”, అల్లాహ్‌ను ఎవరు విశ్వసించరో, అల్లాహ్‌ను ఎవరు నమ్మరో, వారు ఈ విధానాన్ని పాటిస్తారు. వారికి మరణం తర్వాత జీవితం, వారికి అల్లాహ్ ప్రసన్నత, అల్లాహ్ పట్ల విశ్వాసం, అల్లాహ్ పట్ల భీతి లేదు కదా? విశ్వాసమే లేదు. అటువంటి వారు చేసే దానం, మీరు విశ్వసించే వారు, మీరు చేసే దానం ఒకే రకంగా ఉంటే తేడా ఏంటి? వారు ప్రదర్శనా బుద్ధితో దానం చేస్తారు, మీరు అలా చేయకండి. అలా చేస్తే వారు చేసిన దానం మాదిరిగా అవుతుంది అని అల్లాహ్ ఉపమానం ఇచ్చాడు. అలాగే సూరహ్ బఖరాలో ఇలా ఉంది:

قَوْلٌ مَّعْرُوفٌ وَمَغْفِرَةٌ خَيْرٌ مِّن صَدَقَةٍ يَتْبَعُهَا أَذًى ۗ وَاللَّهُ غَنِيٌّ حَلِيمٌ
దానం చేసిన తరువాత మనసు నొప్పించటం కంటే మంచి మాట పలకటం, క్షమించటం ఎంతో మేలు. అల్లాహ్‌ అక్కరలేనివాడు, సహనశీలుడు.(2:263)

అంటే మీరు ప్రదర్శనా బుద్ధితో దానం చేస్తున్నారు, దానికంటే మంచి మాట చెప్పటం మంచిది. పుణ్యం వస్తుంది. దీనికి పుణ్యం రాదు కదా. అది రియా అయిపోయింది కదా, పాపం అయిపోయింది కదా. డబ్బు పోయింది, పుణ్యం పోయింది. దానికంటే అటువంటి దానం కంటే మంచి మాట పలకటం ఇది గొప్పది అని అల్లాహ్ అంటున్నాడు ఖురాన్ లో. అలాగే సూరహ్ బఖరాలో ఇలా ఉంది:

إِن تُبْدُوا الصَّدَقَاتِ فَنِعِمَّا هِيَ ۖ وَإِن تُخْفُوهَا وَتُؤْتُوهَا الْفُقَرَاءَ فَهُوَ خَيْرٌ لَّكُمْ ۚ وَيُكَفِّرُ عَنكُم مِّن سَيِّئَاتِكُمْ ۗ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ
[ఇన్ తుబ్దుస్ సదఖాతి ఫనిఇమ్మా హియ, వ ఇన్ తుఖ్ఫూహా వ తు’తూహల్ ఫుఖరాఅ ఫహువ ఖైరుల్ లకుమ్, వ యుకఫ్ఫిరు అన్కుమ్ మిన్ సయ్యిఆతికుమ్, వల్లాహు బిమా త’అమలూన ఖబీర్]
ఒకవేళ మీరు బహిరంగంగా దానధర్మాలు చేసినా మంచిదే గాని, గోప్యంగా నిరుపేదలకు ఇస్తే అది మీ కొరకు ఉత్తమం. (దీనివల్ల) అల్లాహ్‌ మీ పాపాలను తుడిచిపెడతాడు. అల్లాహ్‌కు మీరు చేసేదంతా తెలుసు.(2:271)

ఇక్కడ బహిరంగంగా అంటే కొంతమంది పండితులు ఇది జకాత్, ఫర్జ్ జకాత్. ఈ ఫర్జ్ జకాత్‌ని కొందరికి తెలిసి నేను ఇస్తే, వేరే వాళ్ళకి నేను ఆదర్శంగా ఉంటాను. ఇది ఫర్జ్ కదా. ఇప్పుడు మనం నమాజ్ ఫర్జ్, దాన్ని గోప్యంగా చేసే అవసరం లేదు. ఉపవాసం ఫర్జ్, గోప్యం అవసరం లేదు. ఉన్నవారికి హజ్ ఫర్జ్, గోప్యం అవసరం లేదు. ఆ విధంగా జకాత్ ఫర్జ్ అయిన వారు కొందరికి తెలిసి జకాత్ ఇస్తే అది మంచిదే. కానీ నార్మల్ సదకా, సాధారణమైన సదకా దానాలు, “వ ఇన్ తుఖ్ఫూహా వ తు’తూహల్ ఫుఖరాఅ ఫహువ ఖైరుల్ లకుమ్” అయితే మీరు వాటిని గోప్యంగా నిరుపేదల వరకు చేరిస్తే అది మీకు మరీ మంచిది. అల్లాహ్ మీ పాపాలను మీ నుండి దూరం చేస్తాడు. మీరు చేసేదంతా అల్లాహ్‌కు బాగా తెలుసు. అలాగే:

الَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُم بِاللَّيْلِ وَالنَّهَارِ سِرًّا وَعَلَانِيَةً فَلَهُمْ أَجْرُهُمْ عِندَ رَبِّهِمْ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
ఎవరయితే తమ సిరిసంపదలను రేయింబవళ్లు రహస్యంగానూ, బహిరంగంగానూ ఖర్చుచేస్తారో వారి కొరకు వారి ప్రభువు వద్ద (గొప్ప) పుణ్యఫలం ఉంది. వారికెలాంటి భయంగానీ, దుఃఖంగానీ ఉండదు. (2:274)

ఇక దానం చేసిన తర్వాత మనసులో బాధ కలిగితే, అది ఎటువంటి దానం అది? ఇష్టం లేకుండా, అయిష్టకరంగా ఇవ్వటం. వారు ఇస్తున్నారు, నేను ఇవ్వకపోతే బాగుండదు కదా, అనుకుని ఇవ్వటం. ఇచ్చిన తర్వాత బాధపడటం, అయ్యో పోయింది అని చెప్పి. దీన్ని ఏమంటారు? ఖురాన్ లో ఉంది.

وَلَا يُنفِقُونَ إِلَّا وَهُمْ كَارِهُونَ
వారు, అంటే కపట విశ్వాసులు, మునాఫిఖీన్లు, ఒకవేళ దైవ మార్గంలో ఖర్చు పెట్టినా అయిష్టంగానే ఖర్చు పెడతారు. (9:54)

ఇది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కపట విశ్వాసుల గురించి చెప్పాడు. బాధపడుతూ దానం చేయటం, అయిష్టకరంగా దానం చేయటం, దానం చేసిన తర్వాత కుమిలిపోవటం, ఎందుకు ఇచ్చానా అని చెప్పి, డబ్బు పోయిందా అని అనుకోవటం, ఇది ఎవరి గుణము? కపట విశ్వాసుల గుణం. సూరహ్ తౌబాలో ఉంది. అంటే అయిష్టంగా ఖర్చు పెట్టడం ఇది కపట విశ్వాసుల లక్షణం.

وَمَثَلُ الَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُمُ ابْتِغَاءَ مَرْضَاتِ اللَّهِ وَتَثْبِيتًا مِّنْ أَنفُسِهِمْ كَمَثَلِ جَنَّةٍ بِرَبْوَةٍ
దైవ ప్రసన్నతను చూరగొనటానికి (అల్లాహ్ ప్రసన్నత, అల్లాహ్ కి మర్జీ, అల్లాహ్ కి రజా పానే కే లియే) తమ పనులను, మనసులను నిమ్మళించడానికి సంపదను ఖర్చు పెట్టే వారి ఉపమానం ఎత్తైన ప్రదేశంలో ఉన్న తోట వంటిది.

وَمَا تُنفِقُونَ إِلَّا ابْتِغَاءَ وَجْهِ اللَّهِ ۚ وَمَا تُنفِقُوا مِنْ خَيْرٍ يُوَفَّ إِلَيْكُمْ وَأَنتُمْ لَا تُظْلَمُونَ
ఇంకా మీరు కేవలం అల్లాహ్ ప్రసన్నతను బడయటానికే ఖర్చు చేయండి. మీరేం ఖర్చు చేసినా అది మీకు పూర్తిగా తిరిగి ఇవ్వబడుతుంది. మీకు ఎంత మాత్రం అన్యాయం జరగదు. (2:272)

అంటే దానాల ప్రయోజనం అల్లాహ్ ఈ లోకంలో కూడా ప్రసాదిస్తాడు, పరలోకంలో కూడా ప్రసాదిస్తాడు.

అభిమాన సోదరులారా, ఒకటి, ప్రతి వ్యక్తి దానం చేయవచ్చు. డబ్బు ఉన్నవారు ఆర్థికపరంగా, తక్కువ ఉన్నవారు తమ స్థోమతపరంగా, ఏమీ లేని వారు ఇతర మార్గాల ద్వారా ప్రతి వ్యక్తి దానం చేసే అవకాశం ఉంది. రెండవది ఏమిటి? ప్రదర్శనా బుద్ధితో దానం చేయకూడదు, అది రియా అవుతుంది, చిన్న షిర్క్ అవుతుంది, దానికి ప్రతిఫలం రాదు.

మూడవ విషయం,

كُلُّ مَعْرُوفٍ صَدَقَةٌ
[కుల్లు మ’అరూఫిన్ సదఖతున్]
మేలుతో కూడుకున్న ప్రతి మంచి పని సదకా క్రిందకే వస్తుంది.

కుల్లు మ’అరూఫిన్ సదకా, మేలుతో కూడుకున్న ప్రతి మంచి పని సదకా కిందకే వస్తుంది. కావున స్థోమత ఉన్నవారు తమ స్థోమత పరంగా ఏదో రూపంలోనైనా దానం చేయాలి, అది చిన్నది అని అల్పంగా భావించకూడదు. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

لَا تَحْقِرَنَّ مِنَ الْمَعْرُوفِ شَيْئًا وَلَوْ أَنْ تَلْقَى أَخَاكَ بِوَجْهٍ طَلْقٍ
ఏ సత్కార్యాన్ని అల్పంగా, అతి సామాన్యంగా తలపోయకండి. ఆఖరికి తమ సోదరుణ్ణి నగుమోముతో పలకరించడాన్ని అయినా సరే.

అంటే చిరునవ్వుతో నవ్వటం కూడా మంచి సంకల్పంతో సదకా కిందకే వస్తుంది. అది ఎంత చిన్నదైనా, ఎంత రవ్వంత అయినా సరే, అల్పంగా భావించకండి. అల్లాహ్ మనసు చూస్తాడు, అల్లాహ్ నియ్యత్, సంకల్పం చూస్తాడు. ఎటువంటి సంకల్పంతో, ఎటువంటి బుద్ధితో ఇస్తున్నావు, అది ముఖ్యం. ఎంత ఇస్తున్నావు అది ముఖ్యం కాదు.

అలాగే చివర్లో ఒక హదీస్ చెప్పి నేను ముగిస్తున్నాను. అది ఏమిటంటే, ఒక హదీసులో ఇలా ఉంది:

كُلُّ سُلامَى مِنَ النَّاسِ عَلَيْهِ صَدَقَةٌ، كُلَّ يَوْمٍ تَطْلُعُ فِيهِ الشَّمْسُ
ప్రతి ముస్లిం ప్రతి రోజూ అతని శరీరంలో ఎముకలు ఎన్ని జాయింట్లు ఉన్నాయో, ఎముకల జాయింట్లు, కొందరు అంటారు దాదాపు 360 జాయింట్లు ఉన్నాయి అంటారు. శరీరంలో ఎముకల జాయింట్లు 360 ఉన్నాయి. అంటే ప్రతి రోజూ ప్రతి జాయింట్ కి బదులుగా ఒక దానం చేయాలి, సదకా ఇవ్వాలి.

అంటే ప్రతి రోజు 360 దానాలు చేయాలి. కాకపోతే ఇక్కడ దానం అంటే డబ్బు రూపంలోనే కాదు. అది ఏమిటి?

يَعْدِلُ بَيْنَ اثْنَيْنِ صَدَقَةٌ
ఇద్దరు వ్యక్తుల మధ్య న్యాయం చేయటం సదకా.

وَيُعِينُ الرَّجُلَ عَلَى دَابَّتِهِ فَيَحْمِلُ عَلَيْهَا
ముందు కాలంలో గుర్రాల్లో, గాడిదల్లో, ఒంటెల్లో సవారీ చేసేవారు. దానిపై వారికి ఎక్కించడానికి, కొందరు అనారోగ్యం మూలంగా, వృద్ధాప్యం వలన పైకి ఎక్కలేరు. ఇప్పుడు కూడా బస్సులో, కార్లలో, మోటార్లలో, రైళ్లలో సామాన్లు ఎక్కువగా ఉంటాయి. ఆ సామాన్లు ఎక్కించడానికి వారికి సహాయం చేయటం, కొందరికి ఆరోగ్యం బాగా లేదు, వికలాంగులు, వారికి కూర్చోబెట్టడానికి సహాయం చేయటం అది కూడా దానమే, సదకాయే.

أَوْ يَرْفَعُ عَلَيْهَا مَتَاعَهُ صَدَقَةٌ
సామాన్లు మోయటం అది సదకా.

وَالْكَلِمَةُ الطَّيِّبَةُ صَدَقَةٌ
మంచి మాట చెప్పటం, అది కూడా సదకా.

وَكُلُّ خُطْوَةٍ يَخْطُوهَا إِلَى الصَّلَاةِ صَدَقَةٌ
నమాజు కోసం మనము వేసే ప్రతి అడుగు సదకా కిందకే వస్తుంది.

وَيُمِيطُ الْأَذَى عَنِ الطَّرِيقِ صَدَقَةٌ
దారి నుండి హాని కలిగించే, నష్టం కలిగించే ముల్లు లాంటిది, బండ లాంటిది, రాయి లాంటిది, ఏదైనా అశుద్ధత లాంటిది దూరం చేయటం కూడా అది కూడా సదకా కిందకే వస్తుంది.

కావున, ఏమీ లేని వారు కూడా అనేక రకాలుగా దానాలు చేయవచ్చు, ప్రతి రోజు చేయవచ్చు, ప్రతి సమయం చేయవచ్చు.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ఇటువంటి దానాలు చేసే సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరికీ ఇహపర లోకాలలో సాఫల్యం ప్రసాదించుగాక. ఆమీన్.

وآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
[వా ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్]
మా చివరి ప్రార్థన సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వ స్తోత్రములు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=42048

జకాతు & సదఖా: (మెయిన్ పేజీ )
https://teluguislam.net/five-pillars/zakah/

ఉజైర్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర – “మరణించిన 100 సంవత్సరాలకు మళ్ళీ బతికిన వ్యక్తి” – సలీం జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

ఉజైర్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర – “మరణించిన 100 సంవత్సరాలకు మళ్ళీ బతికిన వ్యక్తి”
https://youtu.be/D1oAzBvsApU [32 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో వక్త, బనీ ఇస్రాయీల్ ప్రవక్తలలో ఒకరైన ఉజైర్ (అలైహిస్సలాం) గారి అద్భుతమైన జీవిత చరిత్రను వివరించారు. ముఖ్యంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు మరణం ఇచ్చి 100 సంవత్సరాల తర్వాత తిరిగి ఎలా బ్రతికించారో, ఆ సమయంలో జరిగిన చారిత్రక పరిణామాలు (బాబిలోనియా రాజు నెబుకద్ నెజర్ ద్వారా జెరూసలేం నాశనం, తౌరాత్ గ్రంథం దహనం, యూదుల బానిసత్వం మరియు విడుదల) గురించి చర్చించారు. ఉజైర్ (అలైహిస్సలాం) నాశనమైన నగరాన్ని చూసి ఆశ్చర్యపోవడం, అల్లాహ్ ఆయనను 100 సంవత్సరాలు మృతునిగా ఉంచి తిరిగి లేపడం, ఆయన ఆహారం చెడిపోకుండా ఉండటం మరియు గాడిద ఎముకలు తిరిగి ప్రాణం పోసుకోవడం వంటి దృష్టాంతాలను ఖురాన్ వాక్యాల (సూర బఖరా 2:259) ద్వారా వివరించారు. అలాగే, యూదులు ఉజైర్ (అలైహిస్సలాం) ను దైవ కుమారుడిగా భావించి చేసిన మార్గభ్రష్టత్వాన్ని ఖండిస్తూ (సూర తౌబా 9:30), మరణానంతర జీవితం, పునరుత్థానం, మరియు అల్లాహ్ శక్తిసామర్థ్యాలపై విశ్వాసం ఉంచాలని ఈ ప్రసంగం ద్వారా బోధించారు.

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَأَصْحَابِهِ أَجْمَعِينَ
[అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ అస్ హాబిహి అజ్మయీన్]

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్య మూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా! మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈనాటి ప్రసంగంలో మనము ఒక ప్రవక్త గురించి తెలుసుకోబోతున్నాము. ఆయన ప్రత్యేకత ఏమిటంటే, ఆయనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరణం ఇచ్చి వంద సంవత్సరాల తర్వాత మళ్ళీ బ్రతికించాడు. ఎవరండీ ఆయన? ఆశ్చర్యకరంగా ఉంది కదా వింటూ ఉంటే. ఆయన మరెవరో కాదు ఆయనే ప్రవక్త ఉజైర్ అలైహిస్సలాం వారు.

ఉజైర్ అలైహిస్సలాం వారి ప్రస్తావన ఖురాన్ గ్రంథంలో రెండు సూరాలలో వచ్చి ఉంది. ఒకటి సూర బఖరా రెండవ సూరా, రెండవది సూర తౌబా తొమ్మిదవ సూరా. ఈ రెండు సూరాలలో ప్రవక్త ఉజైర్ అలైహిస్సలాం వారి ప్రస్తావన వచ్చి ఉంది. ప్రవక్త ఉజైర్ అలైహిస్సలాం బనీ ఇస్రాయీల్ ప్రజల వద్దకు పంపించబడిన ప్రవక్తలలో ఒక ప్రవక్త.

ఆయన బనీ ఇస్రాయీల్ ప్రజల వద్దకు పంపించబడే సరికి, బనీ ఇస్రాయీల్ ప్రజల్లోని అధిక శాతం ప్రజలు కనుమరుగైపోయారు లేదా బానిసత్వానికి గురైపోయారు. అల్-ఖుద్స్ నగరంలో, పాలస్తీనా దేశంలో చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే బనీ ఇస్రాయీల్ వారు మిగిలి ఉన్నారు. అంతే కాదండీ, వారు నివసిస్తున్న పట్టణము కూడా నేలమట్టం అయిపోయింది. వారు ఎంతగానో పవిత్రంగా భావించే బైతుల్ మఖ్దిస్ కూడా నేలమట్టం అయిపోయింది. అలా ఎందుకు జరిగిందంటే, దాన్ని తెలుసుకోవడానికి బనీ ఇస్రాయీల్ వారి క్లుప్తమైన చరిత్ర మనము దృష్టిలో ఉంచుకోవాలి.

సులైమాన్ అలైహిస్సలాం వారి మరణానంతరం పరిస్థితులన్నీ తలకిందులైపోయాయి. సులైమాన్ అలైహిస్సలాం వారి సంతానంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయం కలిగింది. వారు ఎంతో పటిష్టంగా ఉన్న వారి సామ్రాజ్యాన్ని రెండు ముక్కలు చేసుకున్నారు. ఒక తమ్ముడు సగ భాగాన్ని, మరో తమ్ముడు సగ భాగాన్ని పంచుకొని, ఒక భాగానికి ‘ఇస్రాయీల్ రాజ్యం‘ అని పేరు పెట్టుకున్నారు, దానికి సామరియా రాజధాని అయ్యింది. మరో భాగానికి ‘యహూదా రాజ్యం’ అని పేరు పెట్టుకున్నారు, దానికి యెరూషలేము రాజధాని అయ్యింది.

అయితే ఆ తర్వాత ఇస్రాయీల్ లో ఉన్న బనీ ఇస్రాయీల్ ప్రజలు తొందరగా మార్గభ్రష్టత్వానికి గురైపోయారు. విగ్రహారాధనకు పాల్పడ్డారు, ‘బాల్‘ అనే విగ్రహాన్ని ఆరాధించారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అక్కడికి ప్రవక్తల్ని పంపించాడు. హిజ్కీల్ అలైహిస్సలాం వారు వచ్చారు, ఇలియాస్ అలైహిస్సలాం వారు వచ్చారు, అల్-యస అలైహిస్సలాం వారు వచ్చారు. ప్రవక్తలు వచ్చి వారికి చక్కదిద్దేటట్టు ప్రయత్నం చేసినా, దైవ వాక్యాలు బోధించినా, అల్లాహ్ వైపు పిలిచినా, వారు మాత్రము పాపాలను వదలలేదు, విగ్రహారాధనను కూడా వదలలేదు, మార్గభ్రష్టులుగానే మిగిలిపోయారు.

చివరికి ఏమైందంటే, పక్కనే ఉంటున్న ఆషూరీయులు వచ్చి ఇస్రాయీల్ సామ్రాజ్యం మీద యుద్ధం ప్రకటించి ఆ రాజ్యాన్ని వశపరుచుకున్నారు. ఆ ప్రకారంగా బనీ ఇస్రాయీల్ ప్రజలు రెండు భాగాలుగా విడిపోయి ఉన్న ఆ రెండు రాజ్యాలలో నుంచి ఒక రాజ్యము ఆషూరీయుల చేతికి వెళ్ళిపోయింది.

అయితే ఆశూరీయులు మిగిలిన రెండవ భూభాగాన్ని కూడా ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేసినా వారి పప్పులు ఉడకలేదు. ఎందుకంటే ఇక్కడ దైవభీతి మిగిలి ఉండింది కాబట్టి. కానీ కొద్ది రోజులు గడిచాక ఇక్కడ పరిస్థితులు కూడా మళ్ళీ మారిపోయాయి. ఇక్కడ ప్రజలు కూడా మార్గభ్రష్టత్వానికి గురైపోయారు, పాపాల్లో మునిగిపోయారు. అలాంటప్పుడు ఇరాక్ దేశము నుండి, బాబిలోనియా నుండి నెబుకద్ నెజరు (అరబ్బీలో ‘బుఖ్తె నసర్‘) అనే రాజు సైన్యాన్ని తీసుకొని వచ్చి యహూదా దేశం మీద, రాజ్యం మీద దాడి చేశాడు. యుద్ధం ప్రకటించి బనీ ఇస్రాయీల్ వారిని ఊచకోత కోశాడు. అలాగే బనీ ఇస్రాయీల్ వారి ఆస్తుల్ని ధ్వంసం చేయటంతో పాటు, వారు ఎంతగానో పవిత్రంగా భావించే బైతుల్ మఖ్దిస్ ని కూడా నేలమట్టం చేసేశాడు. వారు ఎంతో గౌరవంగా చదువుకునే, ఆచరించుకునే పవిత్రమైన గ్రంథం తౌరాత్ ని కూడా అతను కాల్చేశాడు.

బనీ ఇస్రాయీల్ ప్రజల్ని అయితే ముందు చిన్న, పెద్ద, ఆడ, మగ తేడా లేకుండా హతమార్చాడు. తర్వాత ఎవరెవరైతే పనికొస్తారు అని అతను భావించాడో వారిని బానిసలుగా ఇరాక్ దేశానికి, బాబిలోనియా పట్టణానికి తీసుకెళ్లిపోయాడు. ఎవరితో అయితే నాకు అవసరం లేదులే వీళ్ళతో అని అనుకున్నాడో, అలాంటి వారిని మాత్రము అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. అయితే మిత్రులారా! ఆ ప్రకారంగా బనీ ఇస్రాయీల్ ప్రజలు, ముందు ఇస్రాయీల్ సామ్రాజ్యాన్ని ఆషూరీయుల చేతికి అప్పగించాల్సి వచ్చింది, యహూదా సామ్రాజ్యాన్ని నెబుకద్ నెజరు రాజుకి అప్పగించాల్సి వచ్చింది

ఆ ప్రకారంగా వారి రెండు రాజ్యాలు కూడా రెండు వేరు వేరు శత్రువులు లాక్కున్నారు. అలాగే జయించి వశపరచుకున్నారు. మళ్ళీ బనీ ఇస్రాయీల్ ప్రజలు పరాభవానికి గురి అయ్యి ఉన్నారు, బానిసలుగా మార్చబడి ఉన్నారు. ఎంతో కొంతమంది మాత్రమే అక్కడ మిగిలిపోయి ఉన్నారు. అలాంటి పరిస్థితిలో, పట్టణము కూల్చబడి ఉంది, పుణ్యక్షేత్రము కూల్చబడి ఉంది, ప్రజలు కూడా చెల్లాచెదురైపోయి ఉన్నారు, బానిసలుగా మార్చబడి ఉన్నారు, ఎంతో కొంతమంది మాత్రమే మిగిలి ఉన్నారు. అలాంటి స్థితిలో ఉజైర్ అలైహిస్సలాం వారు వచ్చారు.

ఆయన మామూలుగా పొలం వద్ద పని కోసము గాడిద మీద కూర్చొని బయలుదేరి వెళ్లారు. వెళ్లి అక్కడ పొలం పనులన్నీ ముగించుకొని కొన్ని ద్రాక్ష పండ్లు, అలాగే అత్తి పండ్లు తీసుకొని మళ్ళీ అదే గాడిద మీద కూర్చొని తిరిగి ఇంటికి పయనమయ్యారు. వస్తూ వస్తూ ఒకచోట లోయలోకి ప్రవేశించి కాసేపు నీడలో సేద తీరుదాము అని ఒక గోడ నీడలో లేదా ఒక చెట్టు నీడలో ఆయన కూర్చోవడానికి ప్రయత్నిస్తూ, ఆయన వద్ద ఉన్న గాడిదను ఒకచోట కట్టేశారు.

తర్వాత నీడలో కూర్చొని ఆయన వద్ద ఉన్న ద్రాక్ష పండ్లను ముందుగా ఒక పాత్రలో పిండారు. ఆ ద్రాక్ష రసంలో కొన్ని రొట్టె ముక్కలు నాన్చడానికి ఉంచారు. ఆ రొట్టెలు నానే వరకు ఆయన గోడను లేదా చెట్టుని అలా వీపుతో ఆనుకొని, కంటి ముందర కనిపిస్తున్న దృశ్యాలను చూడసాగారు. ముందర పాడుబడిపోయిన పట్టణము, కూల్చబడిన పట్టణము, కూల్చబడిన పుణ్యక్షేత్రము అవి దర్శనమిస్తున్నాయి. అవి చూస్తూ ఉంటే, ఊహించని రీతిలో, అనుకోకుండా ఆయన ప్రమేయం లేకుండానే ఆయన నోటి నుండి ఒక మాట వచ్చింది. ఏంటి ఆ మాట అంటే:

أَنَّىٰ يُحْيِي هَٰذِهِ اللَّهُ بَعْدَ مَوْتِهَا
[అన్నా యుహ్ యీ హాజిహిల్లాహు బాద మౌతిహా]
దీని చావు తర్వాత అల్లాహ్ తిరిగి దీనికి ఎలా ప్రాణం పోస్తాడు? (ఖుర్ఆన్, 2:259)

అంటే ఈ నగరం మొత్తం పాడుబడిపోయింది కదా, మళ్ళీ ప్రజల జీవనంతో ఈ నగరం కళకళలాడాలంటే ఇది సాధ్యమవుతుందా? అని ఆశ్చర్యం వ్యక్తపరిచారు. అనుమానం వ్యక్తపరచలేదు, ఇది ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఉజైర్ అలైహిస్సలాం వారు గొప్ప దైవభీతిపరులు, గ్రంథ జ్ఞానము కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి అల్లాహ్ తో ఇది సాధ్యమేనా అని అనుమానము, సందేహము ఎప్పుడూ వ్యక్తపరచరు. అల్లాహ్ శక్తి మీద ఆయనకు పూర్తి నమ్మకం ఉంది. ఆశ్చర్యం వ్యక్తపరిచారు – ఇది ఎప్పుడు అవుతుంది? ఎలా అవుతుంది? ఇప్పట్లో ఇది అయ్యే పనేనా? అనేటట్టుగా ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వెంటనే ఆయన ఏ స్థితిలో అయితే నీడలో అలా వీపు ఆంచుకొని కూర్చొని ఉన్నారో, అదే స్థితిలో ఆయనకు మరణం ఇచ్చేశాడు. ఎన్ని సంవత్సరాల వరకు ఆయన అదే స్థితిలో ఉన్నారు అంటే, వంద సంవత్సరాల వరకు ఆయన అదే స్థితిలో ఉన్నారు.

فَأَمَاتَهُ اللَّهُ مِائَةَ عَامٍ
[ఫ అమాతహుల్లాహు మిఅత ఆమిన్]
“అల్లాహ్ అతన్ని నూరేళ్ళ వరకు మరణ స్థితిలో ఉంచాడు.” (ఖుర్ఆన్, 2:259)

ఖురాన్ లో నూరేళ్ళ వరకు ఆయనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అదే స్థితిలో ఉంచాడు అని స్పష్టంగా తెలియజేయడం జరిగింది.

అయితే 100 సంవత్సరాలు ఆయన అదే స్థితిలో ఉన్నారు కదా, మరి ఈ 100 సంవత్సరాలలో ఏమి జరిగిందంటే చాలా ముఖ్యమైన విషయాలు చోటు చేసుకున్నాయి. ఏమి జరిగిందంటే, నెబుకద్ నెజరు బనీ ఇస్రాయీల్ వారి మీద దాడి చేసి, పుణ్యక్షేత్రం కూల్చేసి, గ్రంథము కాల్చేసి, బనీ ఇస్రాయీల్ వారిని పురుషుల్ని అలాగే మహిళల్ని బానిసలుగా మార్చి ఇరాక్ దేశానికి, బాబిలోనియా పట్టణానికి పట్టుకెళ్లిపోయాడు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడంటే…

పక్కనే ఉన్న పార్షియా దేశం (ఇరాన్ దేశం అని మనం అంటున్నాం కదా), ఆ పార్షియా దేశానికి చెందిన రాజు ఇరాక్ దేశం మీద యుద్ధం ప్రకటించాడు. యుద్ధం చేసి ఇరాక్ దేశాన్ని జయించేశాడు. ఇరాక్ దేశము ఇప్పుడు పార్షియా దేశ రాజు చేతికి వచ్చేసింది. ఆ పార్షియా దేశము (అనగా ఇరాన్ దేశపు రాజు) ఇరాక్ దేశాన్ని కూడా జయించిన తర్వాత, అక్కడ బానిసలుగా నివసిస్తున్న యూదులను స్వతంత్రులుగా చేసేసి, “మీరు మీ సొంతూరికి, అనగా పాలస్తీనా దేశానికి, అల్-ఖుద్స్ నగరానికి తిరిగి వెళ్లిపోండి” అని అనుమతి ఇచ్చేశాడు.

చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము 50-60 సంవత్సరాల తర్వాత ఆ రాజు ద్వారా బనీ ఇస్రాయీల్ ప్రజలకి మళ్ళీ బానిసత్వం నుండి స్వతంత్రం లభించింది. అప్పుడు వారందరూ కూడా స్వతంత్రులై బాబిలోనియా పట్టణాన్ని వదిలేసి, మళ్ళీ పాలస్తీనాలో ఉన్న అల్-ఖుద్స్ నగరానికి పయనమయ్యారు. అయితే ఈ 50-60 సంవత్సరాలలో వారు భాష మర్చిపోయారు, సంప్రదాయాలు మర్చిపోయారు, ధర్మ ఆదేశాలు కూడా చాలా శాతము మర్చిపోయారు. సరే ఏది ఏమైనప్పటికీ వాళ్ళు తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. వచ్చి అక్కడ మళ్ళీ నివాసం ఏర్పరచుకున్నారు. ఆ ప్రకారంగా కూల్చివేయబడిన ఆ పట్టణము, నగరము మళ్ళీ ప్రజల నివాసంతో కళకళలాడటం ప్రారంభించింది. ఇలా వంద సంవత్సరాల లోపు జరిగిన కొన్ని ముఖ్యమైన విషయాలు చోటు చేసుకున్న తర్వాత, అప్పుడు రెండవసారి మళ్ళీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉజైర్ అలైహిస్సలాం వారికి మళ్ళీ బ్రతికించాడు.

చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము ఆయన మరణించే సమయానికి ఆయన వయస్సు 40 సంవత్సరాలు ఉండింది. 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ బ్రతికించబడుతున్నప్పుడు కూడా ఆయన 40 సంవత్సరాల వయసులో ఏ విధంగా ఉన్నాడో అదే విధంగా, అదే శక్తితో, అదే శరీరంతో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనను మళ్ళీ బ్రతికించాడు.

దూత వచ్చాడు. దూత వచ్చి ఆయనను లేపి:

قَالَ كَمْ لَبِثْتَ
[ఖాల కమ్ లబిస్త]
“నీవు ఎంత కాలం ఈ స్థితిలో ఉన్నావు?” అని అడిగాడు. (ఖుర్ఆన్, 2:259)

ఉజైర్ అలైహిస్సలాం వారు లేచి ముందు అటూ ఇటూ చూశారు. చూస్తే గాడిద కనిపించట్లేదు. గాడిద బంధించిన చోట పాడుబడిపోయిన ఎముకలు కనిపిస్తున్నాయి. 100 సంవత్సరాలు గడిచిన విషయం ఆయనకు తెలియదు. ఈ 100 సంవత్సరాలలో గాడిద చనిపోయింది, ఎముకలు కూడా పాడుబడిపోయాయి, కొన్ని పాడుబడిన ఎముకలు కనిపిస్తున్నాయి. పక్కనే ఉంచబడిన ద్రాక్ష రసంలో ఉంచబడిన రొట్టె ముక్కలు, అవి మాత్రము తాజాగా అలాగే ఉన్నాయి, ఫ్రెష్ గా ఉన్నాయి. ఆహారాన్ని చూస్తూ ఉంటే, ఇప్పుడే కొద్దిసేపు ఏమో నేను అలా పడుకొని లేచానేమో అనిపిస్తూ ఉంది. గాడిదను చూస్తూ ఉంటే అసలు గాడిద కనిపించట్లేదు. కాబట్టి వెంటనే ఆయన ఏమన్నారంటే:

لَبِثْتُ يَوْمًا أَوْ بَعْضَ يَوْمٍ
[లబిస్తు యౌమన్ ఔ బాద యౌమ్]
“ఒక రోజు లేదా ఒక రోజులో కొంత భాగం మాత్రమే నేను ఈ స్థితిలో ఉన్నాను” అని చెప్పారు. (ఖుర్ఆన్, 2:259)

ఆహారాన్ని చూసి ఆయన ఆ విధంగా అనుమానించారు. అయితే దూత వచ్చి:

بَل لَّبِثْتَ مِائَةَ عَامٍ
[బల్ లబిస్త మిఅత ఆమ్]
“కాదు, నీవు ఈ స్థితిలో వంద సంవత్సరాలు ఉన్నావయ్యా” (ఖుర్ఆన్, 2:259)

అని చెప్పి, “చూడండి మీ గాడిద మరణించి ఎముకలు ఎముకలైపోయింది. మీ కళ్ళ ముందరే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దానిని మళ్ళీ బ్రతికిస్తాడు చూడండి” అని చెప్పగానే, అల్లాహ్ నామంతో పిలవగానే ముందు ఎముకలు తయారయ్యాయి. ఎముకలు జోడించబడ్డాయి. ఆ ఎముకల మీద మాంసము జోడించబడింది. ఆ తర్వాత దానికి ప్రాణము వేయడం జరిగింది. ఆ ప్రకారంగా ఉజైర్ అలైహిస్సలాం వారి కళ్ళ ముందరే ఎముకలుగా మారిపోయిన ఆ గాడిద మళ్ళీ జీవించింది. అప్పుడు ఉజైర్ అలైహిస్సలాం వారు అదంతా కళ్ళారా చూసి వెంటనే ఈ విధంగా పలికారు:

قَالَ أَعْلَمُ أَنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
[ఖాల ఆలము అన్నల్లాహ అలా కుల్లి షైఇన్ ఖదీర్]
“అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడని నాకు తెలుసు” అని ఉజైర్ అన్నారు. (ఖుర్ఆన్, 2:259)

ఈ ప్రస్తావన మొత్తము ఖురాన్ గ్రంథము రెండవ అధ్యాయము 259వ వాక్యంలో వివరంగా తెలుపబడి ఉంది.

సరే, 100 సంవత్సరాల తర్వాత ఆయన బ్రతికారు, పట్టణం ప్రజలతో కళకళలాడుతూ ఉంది, పట్టణం పూర్తిగా మళ్ళీ నిర్మించబడి ఉంది, పుణ్యక్షేత్రము కూడా మళ్ళీ నిర్మించబడి ఉంది. గాడిద మీద కూర్చొని ఆయన పట్టణానికి వెళ్లారు.

పట్టణానికి వెళ్ళినప్పుడు చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము, ఆయన మరణించేటప్పుడు ఆయన ఇంటిలో ఒక సేవకురాలు ఉండేది, అప్పుడు ఆవిడ వయస్సు 20 సంవత్సరాలు. ఇప్పుడు ఈయన 100 సంవత్సరాల తర్వాత వెళ్తున్నారంటే ఆవిడ వయస్సు ఎంత అయి ఉంటుందండి? 20 + 100, కలిపితే 120 సంవత్సరాలకు చేరుకొని ఉంది. ఆవిడ పూర్తిగా ముసలావిడగా మారిపోయి, వృద్ధాప్యానికి గురయ్యి, కంటిచూపు దూరమైపోయింది, కాళ్ళు కూడా పడిపోయి ఉన్నాయి. ఆవిడ ఒక మంచానికే పరిమితమైపోయి ఉంది.

ఆవిడ వద్దకు ముందు ఉజైర్ అలైహిస్సలాం వారు వెళ్ళారు. వెళ్లి “అమ్మా నేను ఉజైర్ ని” అంటే, ‘ఉజైర్’ అన్న పేరు వినగానే ఆవిడ బోరున ఏడ్చేసింది. “ఎన్నో సంవత్సరాల క్రితము మా యజమాని ఉండేవారు” అని ఏడుస్తూ ఉంటే, “అమ్మా నేనే మీ యజమాని ఉజైర్ ని” అని చెప్పారు. అప్పుడు ఆ మహిళ, “అరె! 100 సంవత్సరాల తర్వాత వచ్చి మీరు నా యజమాని అంటున్నారు, ఎలాగండి నేను నమ్మేది? ఉజైర్ గొప్ప భక్తుడు. ఆయన ప్రార్థన చేస్తే, దుఆ చేస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తప్పనిసరిగా ఆమోదించేవాడు. మీరు ఉజైర్ అయితే, నాకు కంటిచూపు మళ్ళీ రావాలని, అలాగే చచ్చుబడిపోయిన నా కాళ్ళు మళ్ళీ ఆరోగ్యంగా మారాలని దుఆ చేయండి” అని కోరారు.

ఉజైర్ అలైహిస్సలాం వారు దుఆ చేశారు. దుఆ చేయగా ఆవిడకు కంటిచూపు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తిరిగి ఇచ్చేశాడు, ఆవిడ కాళ్ళు కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మళ్ళీ నయం చేసేశాడు. అప్పుడు ఆవిడ లేచి, ఉజైర్ అలైహిస్సలాం వారిని చూసి, చెయ్యి పట్టుకొని, “నేను సాక్ష్యం ఇస్తున్నాను ఈయనే ఉజైర్ అలైహిస్సలాం” అని సాక్ష్యం ఇచ్చారు.

తర్వాత “రండయ్యా మీ ఇంటిని చూపిస్తాను, మీ కుటుంబీకుల్ని చూపిస్తాను” అని ఉజైర్ అలైహిస్సలాం వారిని వెంటబెట్టుకొని ఉజైర్ అలైహిస్సలాం వారి ఇంటికి వెళితే, అప్పుడు కుటుంబ సభ్యులలో ఉజైర్ అలైహిస్సలాం వారి కుమారులు ఉన్నారు. వారి వయస్సు కూడా 100 దాటిపోతూ ఉంది. ఉజైర్ అలైహిస్సలాం వారిని ఇంటి బయట నిలబెట్టి, ఆవిడ ఇంటిలోనికి ప్రవేశించి ఉజైర్ అలైహిస్సలాం వారి కుమారుల వద్దకు వెళ్లి, “మీ నాన్నగారు వచ్చారు” అంటే వారందరూ షాక్ అయ్యారు. అవాక్కయిపోయారు. “అదేమిటి 100 సంవత్సరాల క్రితం ఎప్పుడో కనుమరుగైపోయిన మా తండ్రి ఇప్పుడు తిరిగి వచ్చారా ఇంటికి?” అని వారు షాక్ అయిపోతూ ఉంటే, “అవునండీ, చూడండి నాకు కంటిచూపు ఉండేది కాదు, నాకు కాళ్ళు కూడా చచ్చుబడిపోయి ఉండేవి. కానీ ఆయన వచ్చి ప్రార్థన చేయగా నాకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కంటిచూపు ఇచ్చాడు, కాళ్ళను నయం చేశాడు. నేను మళ్ళీ ఆరోగ్యంగా తిరగగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను. చూడండి బయట ఉన్నారు” అని చెప్పగానే, వచ్చి ఉజైర్ అలైహిస్సలాం వారిని మళ్ళీ ఇంట్లోకి ఆహ్వానించగా, ముందుగా కుమారులు ఆశ్చర్యపడ్డారు.

సందేహం వ్యక్తపరుస్తూ ఒక కుమారుడు ఏమన్నాడంటే, “చూడండి మా నాన్నగారికి భుజం పక్కన మచ్చ లాంటి ఒక గుర్తు ఉండేది, అది ఉందేమో చూడండి” అన్నారు. ఉజైర్ అలైహిస్సలాం వారు బట్టలు కొంచెం పక్కకు జరిపి చూపియగా, అక్కడ నిజంగానే ఆ మచ్చ లాంటి గుర్తు కనిపించింది. అప్పుడు కుటుంబ సభ్యులు ఉజైర్ అలైహిస్సలాం వారిని “ఈయనే మా తండ్రి” అని గ్రహించారు.

అయితే, చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము ఉజైర్ అలైహిస్సలాం వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా 40 సంవత్సరాల వ్యక్తి లాగే సిద్ధం చేశాడు. వారి కుమారులు మాత్రము 100 సంవత్సరాలు చేరుకున్న వృద్ధుల్లా కనిపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఇలా సంఘటన జరిగిన తర్వాత ఉజైర్ అలైహిస్సలాం వారు మళ్ళీ నగరంలోకి వచ్చారు, నగర ప్రజల్ని ప్రోగు చేశారు. ప్రోగు చేసి “ఎవరెవరికి తౌరాత్ గ్రంథంలోని వాక్యాలు కంఠస్థమై ఉన్నాయో, ఎన్ని కంఠస్థమై ఉంటే వారు వచ్చి నాకు వినిపించండి” అని పిలుపునిచ్చారు. ఎవరెవరికి ఎన్ని వాక్యాలు కంఠస్థం చేయబడి ఉన్నాయో వారందరూ వచ్చి ఉజైర్ అలైహిస్సలాం వారికి వారు కంఠస్థం చేసిన ఆ తౌరాత్ గ్రంథంలోని దైవ వాక్యాలు వినిపించారు.

అప్పుడు ఉజైర్ అలైహిస్సలాం వారు ఒక చెట్టు నీడలో కూర్చొని, ఇతర వ్యక్తుల నోట విన్న వాక్యాలు, ఆయన స్వయంగా కంఠస్థం చేసిన వాక్యాలు అన్నీ కూడా మళ్ళీ రచించారు. ఆ ప్రకారంగా మళ్ళీ తౌరాత్ గ్రంథం (నెబుకద్ నెజరు రాజు దాన్ని కాల్చేసి వెళ్లిపోయాడని చెప్పాము కదా), ఆ కాలిపోయి కనుమరుగైపోయిన తౌరాత్ గ్రంథంలోని వాక్యాలను, ఎవరెవరు ఎంత కంఠస్థం చేసి ఉన్నారో అన్ని వాక్యాలు మళ్ళీ తిరిగి ఉజైర్ అలైహిస్సలాం వారు రచించారు. రచించి ప్రజలకు గ్రంథము ఇవ్వడంతో పాటు ఆ గ్రంథంలోని వాక్యాలు, వాటి సారాంశము ప్రజలకు బోధించడం ప్రారంభించారు.

ఆ తర్వాత ఉజైర్ అలైహిస్సలాం వారు ఎన్ని సంవత్సరాలు జీవించారు అంటే, చరిత్రలో ప్రామాణికమైన ఆధారాలు మనకు ఎక్కడా దొరకలేదు. ఆయన మాత్రము మరణించారు. ఎప్పుడు మరణించారు? ఎన్ని సంవత్సరాల వయసులో మరణించారు? ఏ విధంగా ఆయన మరణం సంభవించింది? అన్న వివరాలు మాత్రము ప్రామాణికమైన ఆధారాలలో మనకు ఎక్కడా దొరకలేదు. అయితే ఆయన సమాధి మాత్రము ‘డమస్కస్’ నగరంలో నేటికీ ఉంది అని చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. అసలు విషయం అల్లాహ్ కు తెలుసు.

ఆయన మరణానంతరం చోటు చేసుకున్న పరిస్థితుల్ని మనం చూసినట్లయితే, చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారం, ఉజైర్ అలైహిస్సలాం వారు జీవించినన్ని రోజులు ప్రజలు ఆయనను ఒక బోధకునిగా గౌరవించారు. ఆయన మరణించిన తర్వాత… ఆయన 100 సంవత్సరాలు మరణించి మళ్ళీ జీవించారన్న ఒక అభిప్రాయం ఉండేది, ఆయన దుఆతో ప్రజల సమస్యలు తీరాయని మరొక అభిప్రాయం ఉండేది, అలాగే ఆయన గ్రంథాన్ని రచించి ప్రజలకు వినిపించారు, ఇచ్చారు అనే మరో అభిప్రాయం ఉండింది. ఇలా అనేక అభిప్రాయాల కారణంగా ఉజైర్ అలైహిస్సలాం వారి గౌరవంలో బనీ ఇస్రాయీల్ ప్రజలు హద్దు మీరిపోయారు. ఆ గౌరవంలో, అభిమానంలో ఏకంగా ఉజైర్ అలైహిస్సలాం వారిని “దైవ కుమారుడు” అని చెప్పటం ప్రారంభించారు. తర్వాత అదే వారి విశ్వాసంగా మారిపోయింది, “ఉజైర్ దైవ కుమారుడు” అని నమ్మటం ప్రారంభించారు. వారి ఈ నమ్మకం సరికాదు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలోని తొమ్మిదవ అధ్యాయం, 30వ వాక్యంలో స్పష్టంగా ఖండించి ఉన్నాడు.

وَقَالَتِ الْيَهُودُ عُزَيْرٌ ابْنُ اللَّهِ وَقَالَتِ النَّصَارَى الْمَسِيحُ ابْنُ اللَّهِ ۖ ذَٰلِكَ قَوْلُهُم بِأَفْوَاهِهِمْ ۖ يُضَاهِئُونَ قَوْلَ الَّذِينَ كَفَرُوا مِن قَبْلُ ۚ قَاتَلَهُمُ اللَّهُ ۚ أَنَّىٰ يُؤْفَكُونَ

“ఉజైర్ అల్లాహ్ కుమారుడు” అని యూదులు అంటున్నారు. “మసీహ్ (క్రీస్తు) అల్లాహ్ కుమారుడు” అని క్రైస్తవులు అంటున్నారు. ఇవి వారి నోటి మాటలు మాత్రమే. తమ పూర్వీకులలోని అవిశ్వాసులు చెప్పిన మాటలనే వీళ్ళు అనుకరిస్తున్నారు. అల్లాహ్ వారిని నాశనం చేయుగాక! సత్యం నుండి వారెలా తిరిగిపోతున్నారో చూడండి. (ఖుర్ఆన్, 9:30)

అంటే ఈ వాక్యాలలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారు నమ్ముతున్న నమ్మకాన్ని ఖండిస్తూ, ఇది నిజము కాదు, వారు కల్పించుకున్న కల్పితాలు మాత్రమే, వారి నోటి మాటలు మాత్రమే అని స్పష్టంగా తెలియజేసి ఉన్నాడు.

ఉజైర్ అలైహిస్సలాం వారి గురించి ఒక హదీసులో పరోక్షంగా ప్రస్తావన వచ్చి ఉంది. బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఒక హదీసు ఉందండి. ఆ హదీసు ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:

‘పూర్వము ఒక ప్రవక్త ఉండేవారు. ఆయన వెళుతూ ఉంటే ఒకచోట కూర్చున్నప్పుడు, ఆయనకు ఒక చీమ కరిచింది. చీమ కరిచినప్పుడు ఆయన కోపగించుకొని, కోపంతో చీమ పుట్టను త్రవ్వేసి, ఆ పుట్టలో ఉన్న చీమలన్నింటినీ దహనం చేసేశారు.వెంటనే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ ప్రవక్త వద్దకు వహీ (దైవవాణి) పంపించాడు. ‘నీకు హాని కలిగించింది, నీకు కుట్టింది ఒక చీమ కదా. నీకు కోపం ఉంటే ఒక చీమను చంపుకోవాలి. కానీ, పూర్తి పుట్టలో ఉన్న చీమలన్నింటినీ దహనం చేసేయటము, కాల్చేయటం ఏమిటి?’ అని ఒక ఉల్లేఖనంలో ఉంది.

మరో ఉల్లేఖనంలో ఈ విధంగా తెలుపబడి ఉంది: ‘నీకు ఒక్క చీమ కుట్టిందన్న సాకుతో, నీవు ఆ పుట్టలో ఉన్న చీమలన్నింటినీ దహనం చేసేశావు. వాస్తవానికి ఆ సమూహము అల్లాహ్ ను స్మరించేది (తస్బీహ్ చేసేది). అల్లాహ్ ను స్మరించే ఒక సమూహాన్ని ఒక్క చీమ కుట్టిన కారణంగా నీవు దహనం చేశావేమిటి?’ అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆక్షేపించాడు.’

మరి ఎవరి గురించి ఇక్కడ ప్రస్తావన ఉంది అంటే ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హు మరియు హసన్ బస్రీ రహిమహుల్లా వారు ఏమంటున్నారు అంటే, ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన ఆ ప్రవక్త ఉజైర్ అలైహిస్సలాం అని తెలియజేసి ఉన్నారు. అసలు విషయం అల్లాహ్ కు తెలుసు.

ఉజైర్ అలైహిస్సలాం ఏ కాలానికి చెందిన వారు అంటే చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము, సులైమాన్ అలైహిస్సలాం మరియు ఈసా అలైహిస్సలాం వీరిద్దరి మధ్యలో వచ్చిన ప్రవక్త. అలాగే మరికొంతమంది ధార్మిక పండితులు ఏమంటున్నారు అంటే, ఉజైర్ అలైహిస్సలాం వారు ప్రవక్త కాదు, ఆయన గొప్ప భక్తుడు, గ్రంథ జ్ఞాని అని అంటున్నారు. అసలు విషయం అల్లాహ్ కు తెలుసు.

ఇది ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర. ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనము గ్రహించాల్సిన పాఠాలు ఏమిటి అనే విషయాన్ని క్లుప్తంగా తెలుసుకొని మాటను ముగిస్తాను.

1. అల్లాహ్ మృతులను తిరిగి బ్రతికించగలడు:

ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనం గ్రహించాల్సిన మొదటి విషయం ఏమిటంటే, మృతులను మళ్ళీ బ్రతికించేవాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అన్న విషయం ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనకు స్పష్టంగా తెలుపబడింది. ఉజైర్ అలైహిస్సలాం వారు 100 సంవత్సరాల కోసము మరణించి, 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ అల్లాహ్ ఆజ్ఞతో జీవించబడ్డారు, మళ్ళీ బ్రతికించబడ్డారు. చూసారా? మొదటిసారి ప్రాణం పోసిన ఆయన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, ఆయనకు 100 సంవత్సరాల కోసం మరణం ఇచ్చి, 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయనకు బ్రతికించి ప్రాణం పోసి నిలబెట్టాడు. కాబట్టి మానవులను మళ్ళీ పుట్టించగల శక్తి అల్లాహ్ కు ఉంది అని ఈ ఉజైర్ అలైహిస్సలాం వారి ద్వారా మనకు స్పష్టం చేయబడింది.

ఖురాన్ గ్రంథం 36వ అధ్యాయం, 78-79 వాక్యాలలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ విషయాన్ని స్పష్టంగా తెలియజేసి ఉన్నాడు.

قَالَ مَن يُحْيِي الْعِظَامَ وَهِيَ رَمِيمٌ * قُلْ يُحْيِيهَا الَّذِي أَنشَأَهَا أَوَّلَ مَرَّةٍ ۖ وَهُوَ بِكُلِّ خَلْقٍ عَلِيمٌ

“కుళ్లి కృశించి పోయిన ఎముకలను ఎవడు బ్రతికిస్తాడు?” అని వాడు (మానవుడు) సవాలు విసురుతున్నాడు. వారికి సమాధానం ఇవ్వు, “వాటిని తొలిసారి సృష్టించినవాడే మలిసారి కూడా బ్రతికిస్తాడు. ఆయన అన్ని రకాల సృష్టి ప్రక్రియను గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు.” (ఖుర్ఆన్, 36:78-79)

తొలిసారి పుట్టించిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మలిసారి కూడా పుట్టించగలుగుతాడు, ఆయనకు అలా చేయటం చాలా సులభం అని తెలుపబడటం జరిగింది. ఖురాన్ లో ఇలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇబ్రహీం అలైహిస్సలాం వారు అల్లాహ్ తో, “నీవు మరణించిన వారిని మళ్ళీ ఎలా బ్రతికిస్తావు?” అని అడిగినప్పుడు, పక్షుల్ని తీసుకొని వాటి ఎముకల్ని అటూ ఇటూ పడవేయ్యండి, తర్వాత అల్లాహ్ పేరుతో పిలవండి, అవి మళ్ళీ బ్రతికి వస్తాయి అని చెప్పగా, ఆయన అలాగే చేశారు. అల్లాహ్ పేరుతో పిలవగానే ఎముకలుగా మార్చబడిన ఆ పక్షులు మళ్ళీ పక్షుల్లాగా జీవించి ఎగురుకుంటూ ఆయన వద్దకు వచ్చాయి.

అలాగే హిజ్కీల్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో, ఇంచు మించు 35 వేల మంది లోయలో మరణించారు. ప్రవక్త కళ్ళ ముందరే మళ్ళీ వారు బ్రతికించబడ్డారు. అలాగే మూసా అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో, ఇంచు మించు 70 మంది బనీ ఇస్రాయీల్ తెగకు చెందిన నాయకులు పర్వతం మీద మరణించారు. తర్వాత మూసా అలైహిస్సలాం దుఆతో వాళ్ళు మళ్ళీ బ్రతికించబడ్డారు.

ఈ విధంగా ఖురాన్ లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరణించిన వారు, మరణించిన తర్వాత మళ్ళీ లేపబడతారు అన్న కొన్ని ఉదాహరణలు తెలియజేసి ఉన్నాడు. అలాగే గుహవాసులు, ‘అస్ హాబుల్ కహఫ్’ అని మనం అంటూ ఉంటాం. వారిని కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ముందు మరణం ప్రసాదించి, తర్వాత మళ్ళీ జీవించేలాగా చేశాడు. ఇలాంటి కొన్ని ఉదాహరణలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో తెలియజేసి ఉన్నాడు.

ఆ ఉదాహరణల ద్వారా మనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరణించిన వారిని మళ్ళీ లేపగలుగుతాడు అని స్పష్టంగా, ఉదహరించి మరీ నిజమైన ఆధారాలతో తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి విశ్వాసి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరణించిన వారిని మళ్ళీ లేపగలుగుతాడు, మళ్ళీ బ్రతికించగలుగుతాడు అని నమ్మాలి, విశ్వసించాలి.

2. సమాజ సంస్కరణ బాధ్యత:

ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనం గ్రహించాల్సిన మరొక విషయం, సమాజ సంస్కరణకు కృషి చేయాలి. ఉజైర్ అలైహిస్సలాం వారు రెండవసారి లేపబడినప్పుడు, ప్రజల వద్దకు వెళ్లి దైవ వాక్యాలు రచించి, ప్రజలకు అందజేయడంతో పాటు బోధించారు. సమాజాన్ని సంస్కరించారు, ప్రజలను సంస్కరించారు. కాబట్టి ప్రతి విశ్వాసి సమాజాన్ని సంస్కరించడానికి కృషి చేయాలి. చూడండి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచర సమాజమైన మనకు “ఉత్తమ సమాజం” అని బిరుదు ఇస్తూ, “మీరు మంచిని బోధిస్తారు, చెడును నిర్మూలిస్తారు” అని బాధ్యత ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రతి విశ్వాసి సమాజ సంస్కరణ కోసము కృషి చేయాలన్న విషయం ఇక్కడ మనము గుర్తు చేసుకోవాలి.

3. మరణానంతర జీవితం:

మరణానంతరం జీవితం ఉంది అన్న విషయం కూడా ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనకు తెలుపబడింది. ఉజైర్ అలైహిస్సలాం వారు మరణించారు, మళ్ళీ బ్రతికించబడ్డారు. అదే విధంగా పుట్టిన తర్వాత మరణించిన ప్రతి మనిషిని పరలోకంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మళ్ళీ బ్రతికిస్తాడు. అక్కడ లెక్కింపు ఉంటుంది, చేసిన కర్మలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అక్కడ లెక్క తీసుకొని స్వర్గమా లేదా నరకమా అనేది నిర్ణయిస్తాడు. మరణానంతర జీవితం ఉంది అని స్పష్టపరచడానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇలా ప్రజలకు కొన్ని ఉదాహరణలు ప్రపంచంలోనే చూపించి ఉన్నాడు. మరణించిన వాడు మరణించాడు, ఇక మట్టిలో కలిసిపోయాడు అంతే, ఆ తర్వాత మళ్ళీ జీవితం అనేది లేదు అని భ్రమించే వారికి, చూడండి మరణించిన వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మళ్ళీ లేపుతాడు అని ఇక్కడ కొంతమందిని లేపి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చూపించి ఉన్నాడు కాబట్టి, ఆ ప్రకారంగా మరణానంతర మరొక జీవితం ఉంది అన్న విషయం ఇక్కడ తెలియజేయడం జరిగింది. ప్రతి విశ్వాసి ఆ విషయాన్ని గుర్తు చేసుకోవాలి.

4. సృష్టి యావత్తు అల్లాహ్ ను స్తుతిస్తుంది:

అల్లాహ్ ను స్తుతిస్తూ ఉండాలి. చీమల గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏమన్నారంటే, “అవి అల్లాహ్ ను స్తుతిస్తూ ఉన్నాయి. అల్లాహ్ ను స్తుతించే చీమలని మీరు దహనం చేసేసారు ఏమిటి?” అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అక్కడ ఆ ప్రవక్తను నిలదీశాడు అంటే, చీమలు సైతం అల్లాహ్ ను స్తుతిస్తూ ఉన్నాయి. ఉత్తమ జీవులైన మానవులు మరీ ఎక్కువగా అల్లాహ్ ను స్తుతిస్తూ ఉండాలి, అల్లాహ్ ను స్మరిస్తూ ఉండాలి.

ఖురాన్ గ్రంథం 62వ అధ్యాయం, 1వ వాక్యంలో అల్లాహ్ ఈ విధంగా తెలియజేశాడు:

يُسَبِّحُ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ
[యుసబ్బిహు లిల్లాహి మాఫిస్ సమావాతి వమా ఫిల్ అర్జ్]
“భూమ్యాకాశాలలో ఉన్న వస్తువులన్నీ అల్లాహ్ పవిత్రతను కొనియాడుతున్నాయి.” (ఖుర్ఆన్, 62:1)

భూమి ఆకాశాలలో ఉన్న ప్రతిదీ అల్లాహ్ ను స్తుతిస్తూ ఉంది, అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉంది, అల్లాహ్ ను స్మరిస్తూ ఉంది. కాబట్టి మానవులు కూడా అల్లాహ్ ను స్తుతిస్తూ, అల్లాహ్ ను స్మరిస్తూ, అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉండాలి. ఎవరైతే అల్లాహ్ ను స్తుతిస్తారో వారు ఇహపర సాఫల్యాలు మరియు అనుగ్రహాలు పొందుతారన్న విషయం కూడా తెలియజేయడం జరిగింది.

5. అగ్నితో శిక్షించే అధికారం:

చివర్లో ఒక విషయం ఏమిటంటే, అగ్నితో శిక్షించే అధికారం అల్లాహ్ కు మాత్రమే ఉంది. ఆయన (పూర్వం ఒక ప్రవక్త) చీమ కుట్టింది అని చీమలను కాల్చేశాడు. కాల్చేస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా “ఎందుకు వారిని కాల్చింది? కుట్టింది ఒక చీమే కదా. ఆ ఒక చీమని కావాలంటే మీరు చంపుకోవాలి గాని, మొత్తం చీమలను దహనం చేశారు ఏమిటి?” అని నిలదీశాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమని తెలియజేశారు అంటే:

“నిశ్చయంగా, అగ్నితో శిక్షించే అధికారం అగ్నిని సృష్టించిన ప్రభువు (అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా) కు మాత్రమే ఉంది” అన్నారు. (అబూ దావూద్). మరొక ఉల్లేఖనంలో, “అగ్నితో శిక్షించే అధికారం ఎవ్వరికీ లేదు అల్లాహ్ కు తప్ప” అన్నారు (బుఖారీ). అంటే అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ అగ్నితో శిక్షించే అధికారం లేదు.

ఇవి ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర నుండి మనకు బోధపడిన కొన్ని విషయాలు. నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మిమ్మల్ని అందరినీ అన్న విన్న విషయాల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వజజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

2:259 أَوْ كَالَّذِي مَرَّ عَلَىٰ قَرْيَةٍ وَهِيَ خَاوِيَةٌ عَلَىٰ عُرُوشِهَا قَالَ أَنَّىٰ يُحْيِي هَٰذِهِ اللَّهُ بَعْدَ مَوْتِهَا ۖ فَأَمَاتَهُ اللَّهُ مِائَةَ عَامٍ ثُمَّ بَعَثَهُ ۖ قَالَ كَمْ لَبِثْتَ ۖ قَالَ لَبِثْتُ يَوْمًا أَوْ بَعْضَ يَوْمٍ ۖ قَالَ بَل لَّبِثْتَ مِائَةَ عَامٍ فَانظُرْ إِلَىٰ طَعَامِكَ وَشَرَابِكَ لَمْ يَتَسَنَّهْ ۖ وَانظُرْ إِلَىٰ حِمَارِكَ وَلِنَجْعَلَكَ آيَةً لِّلنَّاسِ ۖ وَانظُرْ إِلَى الْعِظَامِ كَيْفَ نُنشِزُهَا ثُمَّ نَكْسُوهَا لَحْمًا ۚ فَلَمَّا تَبَيَّنَ لَهُ قَالَ أَعْلَمُ أَنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ

ఉజైర్ (అలైహిస్సలాం)
(వందేళ్ళు నిద్రపోయిన మనిషి)
(500-400 క్రీ.పూ.)

ఉజైర్ (అలైహిస్సలాం) తన తోటలోకి ప్రవేశించి అక్కడి ప్రకృతి సౌందర్యానికి మ్రాన్పడి అలాగే కాసేపు నిలబడి పోయారు. పచ్చగా కళకళలాడే చెట్లు, వాటిపై ఒక కొమ్మ మీద నుంచి మరొక కొమ్మపైకి కిలకిలరావాలతో ఎగిరే పక్షులు, విసనకర్రల్లాంటి చెట్ల ఆకుల నుంచి వీస్తున్న స్వచ్ఛమైన పిల్లతెమ్మరలు ఆస్వాదిస్తూ తన చేతిలో ఉన్న బుట్టను క్రింద పెట్టారు. అలా చాలా సేపు నిలబడిపోయారు. చెట్ల కొమ్మలు నోరూరించే పండ్ల భారంతో క్రిందికి వంగిపోయి ఉన్నాయి. ఆయన తన బుట్టను తీసుకుని అందులో రకరకాల పండ్లు కోసుకున్నారు. ఆ బుట్టను తన గాడిద వీపున కట్టారు. దాని పై కూర్చుని వెళ్ళిపోయారు.

దారిలో కూడా ప్రకృతి సౌందర్యం గురించి, ప్రకృతిలోని రమణీయత గురించి ఆలోచించి ఆశ్చర్యపోసాగారు. గాడిద దారితప్పి తనను ఎటో తీసుకు పోవడాన్ని ఆయన గుర్తించలేదు. ఆలోచనల నుంచి బయటపడి చూసేసరికి ఆయన ఒక పాడుపడిన ఊరిలో ఉన్నారు. నేలపై మానవుల కంకాళాలు, జంతువుల అస్థిపంజరాలు చెల్లాచెదరుగా పడఉన్నాయి. వారంతా గతించిన కాలాల ప్రజలని, వారి చిహ్నాలు చిందర వందరగా పడి ఉన్నాయని గ్రహించారు.

ఆయన గాడిదపై నుంచి క్రిందికి దిగారు. గాడిదపై ఉన్న బరువును క్రిందికి దించి, ఒక కూలిపోయిన గోడకు అనుకుని కూర్చున్నారు. ఆ ఊరి ప్రజలకు ఏమయ్యిందో అని ఆలోచించసాగారు. ఆయనకు మరణానంతర జీవితం గురించి ఆలోచన వచ్చింది. మరణించిన వారు మళ్ళీ ఎలా బ్రతికించబడతారు? ఆయన మనసులో ఇలాంటి ఆలోచనలు ముసురుకున్నాయి. ఆలోచనల్లో మునిగి అలాగే కునికిపాట్లు పడుతూ నిద్రలోకి జారిపోయారు.

అలా రోజులు గడచపోయాయి, నెలలు గతించాయి. సంవత్సరాలు కాల గర్భంలో కలసపోయాయి. ఉజైర్ (అలైహిస్సలాం) నిద్రలోనే ఉన్నారు. ఈ సుదీర్ఘకాలంలో ఆయన పిల్లలు, వాళ్ళ పిల్లలు, పిల్లల పిల్లలు ఇలా తరాలు గడచిపోయాయి. జాతులు అంతరించాయి. కొత్త జాతులు ఉనికిలోకి వచ్చాయి.

అల్లాహ్ తన ప్రవక్తలతో వ్యవహరించే తీరు విభిన్నంగా ఉంటుంది. సాధారణ విశ్వాసికి ఆధ్యాత్మిక విశ్వాసానికి సంబంధించిన అనుభూతి లభించక పోయినా అతను తన విధులను నిర్వర్తించవలసి ఉంటుంది. కాని దేవుని సందేశ హరులైన ప్రవక్తలకు వారి విధుల నిర్వహణలో, దేవుని సందేశం ప్రజలకు అంద జేయడంలో పటిష్టమైన సంకల్పం అవసరం. అందుకుగాను జీవితానికి సంబంధించిన లోతయిన వాస్తవాలను తెలుసుకోవలసిన అవసరం కూడా వారికి ఉంటుంది. అందుకే ప్రవక్తల వద్దకు దైవదూతలు వచ్చేవారు. స్వర్గనరకాలు, భూమ్యాకాశాలు, మరణానంతరం జీవితం వగైరా వాస్తవాలను వారికి చూపించడం జరిగేది.

ఉజైర్ (అలైహిస్సలాం) తన దీర్ఘనిద్ర నుంచి మేల్కొన్నారు. అల్లాహ్ ఆదేశానుసారం ఆయన నిద్ర పూర్తయ్యింది. ఆయన నిద్ర పోయినప్పుడు ఎలా ఉన్నారో నిద్ర లేచినప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఒక దైవదూత ఆయన ముందు ప్రత్యక్ష మయ్యాడు. ఉజైర్తో దైవదూత, “ఎంతకాలం నిద్రపోయానని భావిస్తున్నావు?” అని ప్రశ్నించాడు. ఉజైర్ (అలైహిస్సలాం) జవాబిస్తూ, “నేను రోజులో చాలా భాగం నిద్ర పోయి ఉంటాను” అన్నారు. దైవదూత ఆయన్ని చూస్తూ, “కాదు, నువ్వు వంద సంవత్సరాలు నిద్రపోయావు. చూడు! నీ పండ్లు అప్పుడు ఎంత తాజాగా ఉన్నాయో ఇప్పుడు కూడా అంతే తాజాగా ఉన్నాయి. నీ త్రాగునీరు కూడా చాలా స్వచ్ఛంగా ఉంది. కాని నీ గాడిదను చూడు, కేవలం దాని అస్థిపంజరం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు.. అల్లాహ్ మహత్యాన్ని చూడు..మరణించిన వారిని మళ్ళీ ఆయన ఎలా బతికిస్తాడో అర్థం చేసుకో.. దీన్ని నీ ప్రభువు తరపు నుంచి నిదర్శ నంగా భావించు. నీ మనస్సులో ఉన్న అనుమానాలన్నీ తొలగించుకో” అన్నాడు.

ఉజైర్ (అలైహిస్సలాం) చూస్తుండగానే గాడిద అస్థిపంజరంపై మాంసం కండరాలు చోటు చేసుకున్నాయి. గాడిద మళ్ళీ సజీవంగా లేచి నిలబడింది. ఆయన ఆశ్చర్యంగా, “అల్లాహ్ ఏమైనా చేయగల శక్తి కలిగినవాడని నేనిప్పుడు దృఢంగా నమ్ముతున్నాను” అన్నారు.

ఉజైరు తెలిసిన ప్రాంతాలన్నీ పూర్తిగా మారిపోయాయి. తన ఇంటిని వెదకడానికి చాలా సమయం పట్టింది. చివరకు ఇంటికి చేరుకుంటే అక్కడ ఆయనకు ఒక వృద్ధ మహిళ కనబడింది. ఆమె కళ్ళు కనబడడం లేదు. కాని ఆమె జ్ఞాపకశక్తి చాలా బలంగా ఉంది. ఉజైర్ (అలైహిస్సలాం) ఆమెను గుర్తించారు. తాను ఇల్లు వదలి వచ్చినప్పుడు ఆమె తన ఇంటిలో పనిచేసే చిన్నపిల్ల. ఆయన ఆమెతో, “ఇది ఉజైర్ ఇల్లేనా” అని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇస్తూ, “అవును” అంది. ఆమె దుఃఖంతో, “ఉజైర్ ఇల్లు వదలి వెళ్ళిపోయారు. చాలా సంవత్సరాలై పోయాయి. ఆ తర్వాత ఎవరికీ ఆయన ఎక్కడికెళ్ళిందీ తెలియరాలేదు. ఆయన గురించి తెలిసిన వాళ్ళు చాలా మంది చనిపోయారు. చాలా కాలంగా ఆయన పేరు ప్రస్తావించిన వాళ్ళు కూడా లేరు” అంది. ఉజైర్ (అలైహిస్సలాం) ఆమెతో, “నేనే ఉజైర్. అల్లాహ్ అభీష్టం వల్ల నేను చాలా కాలం నిద్ర పోయాను. అల్లాహ్ నన్ను వంద సంవత్సరాల తర్వాత నిద్ర లేపాడు” అన్నారు.

ఈ మాటలు విని ఆ వృద్ధమహిళ చాలా ఆశ్చర్యపోయింది. కాస్సేపు ఏమీ మాట్లాడలేదు. తర్వాత, “ఉజైర్ (అలైహిస్సలాం) చాలా ధర్మాత్ముడు. అల్లాహ్ ఆయన ప్రార్థనలను వినేవాడు. ఆయన రోగుల స్వస్థత కోసం ప్రార్థించిన ప్రతిసారీ వారికి ఆరోగ్యం చేకూరేది. కాబట్టి, నువ్వు ఉజైర్అ యితే అయితే నా ఆరోగ్యం కోసం, నా కంటిచూపు కోసం అల్లాహ్ ను ప్రార్థించు” అని అడిగింది.

ఉజైర్ (అలైహిస్సలాం) అల్లాహ్ ను వేడుకున్నారు. అల్లాహ్ ఆయన ప్రార్థనలకు ప్రతిస్పందించాడు. ఆ వృద్ధమహిళకు ఆరోగ్యం చేకూరింది. ఆమె కంటిచూపు మళ్ళీ వచ్చింది. ఆమె ఆయనకు ధన్యవాదాలు చెప్పి ఈ వార్త అందరికీ చెప్పడానికి తక్షణమే బయటకు వెళ్ళింది. ఉజైర్ పిల్లలు, మనుమలు, మనుమల పిల్లలు అందరూ పరుగున వచ్చారు. యువకునిగా కనబడుతున్న ఉజైర్ని చూసి ఆయన తమకు తాతగారని వారు నమ్మలేకపోయారు. “ఇది నిజమా!” అని గుసగుసలాడు కోసాగారు. ప్రస్తుతం ముసలివాడై పోయిన ఉజైర్ కొడుకు ఒకరు “నా తండ్రికి భుజంపై ఒక పుట్టుమచ్చ ఉండేది. మా అందరికీ ఆ పుట్టుమచ్చ గురించి బాగా తెలుసు. మీరు ఆయనే అయితే ఆ పుట్టుమచ్చ చూపించండి” అని ప్రశ్నించాడు. ఉజైర్ తన భుజంపై ఉన్న పుట్టుమచ్చను చూపించారు. అయినా వారికి సంతృప్తి కలగలేదు. మరో కుమారుడు, “జెరుసలేమ్ను బుఖ్స్సర్ ఆక్రమించుకుని తౌరాత్ గ్రంథాలన్నింటినీ ధ్వంసం చేసినప్పటి నుంచి తౌరాత్ కంఠస్థం చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది మిగిలారు. అలా తౌరాత్ కంఠస్థం చేసిన వారిలో మా తండ్రిగారు కూడా ఒకరు. మీరు ఆయనే అయితే తౌరాత్ వినిపించండి” అనడిగాడు. ఉజైర్ తౌరాత్ మొత్తం పఠించి వినిపించారు. ఆయన స్వరానికి వారు మంత్రముగ్ధులై విన్నారు. నిజంగా ఉజైర్ (అలైహిస్సలాం) తిరిగి వచ్చారని వారికి అప్పటికి నమ్మకం కలిగింది. అందరూ ఆయన్ను ప్రేమతో కౌగిలించుకున్నారు. ఆనంద భాష్పాలు రాల్చారు.

ఆ పిదప యూదులు, “అల్లాహ్ ఉజైర్ను మళ్ళీ బ్రతికించాడు. కాబట్టి ఆయన తప్పక అల్లాహ్ కుమారుడై ఉండాలి” అనడం ప్రారంభించారు. (చదవండి దివ్యఖుర్ఆన్: 9:30, 2:259)

9:30 وَقَالَتِ الْيَهُودُ عُزَيْرٌ ابْنُ اللَّهِ وَقَالَتِ النَّصَارَى الْمَسِيحُ ابْنُ اللَّهِ ۖ ذَٰلِكَ قَوْلُهُم بِأَفْوَاهِهِمْ ۖ يُضَاهِئُونَ قَوْلَ الَّذِينَ كَفَرُوا مِن قَبْلُ ۚ قَاتَلَهُمُ اللَّهُ ۚ أَنَّىٰ يُؤْفَكُونَ

“ఉజైర్‌ అల్లాహ్‌ కుమారుడు” అని యూదులంటున్నారు. “మసీహ్‌ (ఏసు క్రీస్తు) అల్లాహ్‌ కుమారుడు” అని నసారా (క్రైస్తవులు) అంటున్నారు. ఇవి వారి నోటి మాటలు మాత్రమే. తమ పూర్వీకుల్లోని అవిశ్వాసులు చెప్పిన మాటలనే వీళ్ళూ అనుకరిస్తున్నారు. అల్లాహ్‌ వారిని నాశనం చేయుగాక! (సత్యం నుండి) వారెలా తిరిగిపోతున్నారు!?

సాధారణంగా మనిషి కళ్ళకు కనబడే వాటిని పట్టించుకోకుండా తమ స్వంత ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు. ఉజైర్ తిరిగి రావడం అల్లాహ్ చూపించిన మహత్యంగా గ్రహించే బదులు యూదులు ఆయన్ను దేవుని కుమారునిగా పిలువడం ప్రారంభించారు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=17430

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

ప్రవక్తలు (మెయిన్ పేజీ)
https://teluguislam.net/prophets/

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

ధర్మ విద్య ఎందుకు నేర్చుకోవాలి? [ఆడియో & టెక్స్ట్]

ధర్మ విద్య ఎందుకు నేర్చుకోవాలి?
https://youtu.be/dkJiN7q3VZA (38నిముషాలు)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగం ఇస్లాంలో ధార్మిక విద్య యొక్క ప్రాముఖ్యత మరియు దాని విధిగా ఉండటంపై దృష్టి సారిస్తుంది. ప్రపంచ విద్యకు లభించే విలువను, ధార్మిక విద్య పట్ల ప్రజల నిర్లక్ష్యంతో పోల్చి చూపిస్తుంది. కంపెనీ నియమాలు పాటించడం ఉద్యోగానికి ఎలా అవసరమో, సృష్టికర్త నిర్దేశించిన మార్గాన్ని అనుసరించడం మానవ గౌరవాన్ని నిలబెట్టడానికి అంతకంటే ముఖ్యం అని వక్త ఉద్ఘాటించారు. ధార్మిక విద్య అంటే ఒక ఉత్తమ మానవునిగా ఎలా జీవించాలో సృష్టికర్త నేర్పిన పద్ధతి అని నిర్వచించారు. విద్యను అభ్యసించడం మొదలుపెట్టిన క్షణం నుండే పుణ్యాలు లభిస్తాయని, అది స్వర్గానికి మార్గాన్ని సులభతరం చేస్తుందని, మరియు విద్యార్థి కోసం సృష్టిలోని ప్రతి జీవి ప్రార్థిస్తుందని వివరించారు. ఇస్లాం యొక్క మొట్టమొదటి ఆదేశం “ఇఖ్రా” (చదువు) అని గుర్తుచేస్తూ, జ్ఞానం ఇస్లాంకు పునాది అని స్పష్టం చేశారు.

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
(బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం)
అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో.

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ، أَمَّا بَعْدُ
(అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బ’అద్)
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు. ప్రవక్తల నాయకుడైన మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబంపై మరియు వారి అనుచరులందరిపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక. ఆ తర్వాత.

మహాశయులారా, అల్లాహ్ దయతో ఈరోజు మనం, ధర్మ విద్య అభ్యసించడం, ధర్మ జ్ఞానం నేర్చుకోవడం దీనికి సంబంధించిన ఘనతలు ఏమిటి? మరియు ధర్మ జ్ఞానం నేర్చుకోవడం మనపై విధిగా ఉందా? అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.

సామాన్యంగా ఈ రోజుల్లో ప్రజలు, రండి ఒకచోట కూర్చుందాం, ఫలానా రోజు మనం మస్జిద్ లో ఒక కూటమి ఉంది, ఒక ఇజ్తిమా ఉంది, అక్కడికి వెళ్లి ధర్మ విద్య నేర్చుకుందాము, ధర్మ జ్ఞానం నేర్చుకుందాము అని ఎవరికైనా మనం ఆహ్వానిస్తే, ధర్మ విద్య సమావేశాల్లో పాల్గొనడానికి మనసు అంతగా ఆకర్షించదు. అదే వేరే ఏదైనా జనరల్ ప్రోగ్రాం గానీ లేక వేరే ఏదైనా ఆటపాటల ప్రోగ్రాం అయితే, చెప్పకున్నా గానీ కేవలం తెలిస్తే సరిపోతుంది. ప్రజలు తమకు తామే వచ్చేస్తారు.

అంతకు ముందు మనం ధర్మ విద్య నేర్చుకోవడం మనపై విధియా? నేర్చుకోకపోతే నష్టం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాము.

ఈ ప్రశ్నకు సమాధానం డైరెక్ట్ సూటిగా ఖురాన్ మరియు హదీసు ఆధారంగా ఇచ్చే ముందు ఒక చిన్న సంఘటన, ఒక చిన్న విషయం మనం మాట్లాడుకుందాము. అదేమిటంటే, ఈరోజు ఒక వ్యక్తి కలిశాడు, జుహర్ కంటే కొంచెం ముందు. నాకు తెలిసిన వ్యక్తి, అతని బావ గురించి చెప్తున్నాడు. ఏమని?

మొన్న మూడు నాలుగు రోజుల క్రితం నేను ఫోన్ చేశాను అతనికి, అంటే మా బావకు. ఒక ట్రైనింగ్ లో, ఏం ట్రైనింగ్ నాకు తెలియదు కానీ, ఆ ట్రైనింగ్ విషయంలో ఢిల్లీకి వచ్చాడు. ప్రాపర్ అసలు ఉండేది హైదరాబాద్. ఢిల్లీకి వచ్చాడు అని. ఈరోజు నేను ఫోన్ చేశాను, చేసేసరికి ఈరోజు నైట్ లో దమ్మాంకు ఫ్లైట్ ఉంది, అతను ఒక నెల విజిట్ వీసా మీద ఒక ఏదో పెద్ద కంపెనీలో ఏదో సాఫ్ట్వేర్ కు సంబంధించిన మంచి చదువు చదివి ఉన్నారు, మంచి డిగ్రీ చేసి ఉన్నారు. దాని మీద కంపెనీ అతన్ని పంపుతుంది. టికెట్, ఇక్కడికి వచ్చిన తర్వాత జీతం, అన్నీ వాళ్ళే భరిస్తున్నారు.

హైదరాబాద్ నుండి బయలుదేరే లేరి, ఇక్కడ దమ్మాంలో చేరుకునేసరికి ప్రయాణ ఖర్చులు ఏదైతే అంటాం కదా? టికెట్ కాదు, కేవలం జేబు ఖర్చుకు ప్రయాణ ఖర్చులు అంటాం కదా, 300 డాలర్లు ఇచ్చారంట. 300 డాలర్లా? మాషా అల్లాహ్. కేవలం ప్రయాణ ఖర్చులు. హైదరాబాద్ నుండి దమ్మాం వచ్చేసరికి ఎన్ని గంటలు పడుతుంది? మహా ఎక్కువ అంటే ఐదు, ఆరు గంటలు అంతే.

తర్వాత ఏం చెప్పాడంటే, వాస్తవానికి ఎవరు ఎంత గొప్ప విద్య అభ్యసించి, ఎంత పెద్ద డిగ్రీలు సంపాదించి, ఆ ప్రకారంగా జీవితం గడుపుతారో, అతనికి ఇహలోకంలో ఎంత హైఫై, అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి.

అయితే అతను చెప్పిన సంఘటన మీద కొంచెం గ్రహిస్తే, ఈ ప్రపంచంలో ప్రపంచానికి సంబంధించిన ఏదైనా విద్య చాలా ఎక్కువ మోతాదులో, పెద్ద పెద్ద డిగ్రీలు సంపాదించి నేర్చుకుంటే, దానికి అనుకూలంగా మంచి హోదా అంతస్తులు, మంచి జీతాలు, మంచి ఉద్యోగాలు లభిస్తాయి అన్నటువంటి ఆశ మనిషికి ఉంటుంది.

దీనిని బట్టి మీరు ఒక విషయం తెలుసుకోండి. ప్రపంచానికి సంబంధించిన విద్య నేర్చుకొని లక్షలు ఖర్చు పెట్టి అంతా నేర్చుకున్న తర్వాత, దానికి తగిన ఫలం కూడా మనకు లభిస్తుంది అన్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో, మన సృష్టికర్త పంపించినటువంటి గ్రంథం, దాని యొక్క విద్య మనం నేర్చుకుంటే ఏం లాభం ఉంటుంది అని అనుకోవడం, ఇది మన సృష్టికర్త పట్ల మనకు ఎంతటి గొప్ప భావన మనసులో ఉందో అట్లాగే మనకు అర్థమైపోతుంది. ఆలోచించండి. మనుషులు, ప్రజలు తయారు చేసిన విద్యలు, వారు స్వయంగా పుస్తకాలు రచించి, ఇహలోకంలో కొన్ని విషయాలు కనుక్కొని, వాటికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకొని, మంచి హైఫై ఉద్యోగాలు దొరికినందుకు ఎంత సంతోషించిపోతున్నారు, ఎంత సంబరపడుతున్నారు.

అదే మన సృష్టికర్త అయిన అల్లాహ్ ఆయనకు సంబంధించిన విద్య, ఆయనకు సంబంధించిన విషయాలు, ఆయన ఇచ్చిన ఆదేశాలు, ఆయన తమ అతి గౌరవనీయులైన మహనీయ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇచ్చిన ఆదేశాలు నేర్చుకోవడం ఎంతో హీనంగా, ఎంతో తక్కువగా మనం భావిస్తున్నామంటే, మనమే ఆలోచించుకోవాలి, మన మనసులో, మన హృదయంలో అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అదే విధంగా నేను అల్లాహ్ తో కూడా మహబ్బత్ కర్తా హు, నాకు అల్లాహ్ పట్ల పిచ్చి ప్రేమ ఉంది, అని ఏదైతే మనం నోటితో అంటామో, అది ఎంతవరకు నిజమనేది అట్లాగే మనం తెలుసుకోవచ్చు.

రెండో విషయం. దీనికి సంబంధించిందే. ఏదైనా కంపెనీలో మంచి ఉద్యోగం మనం పొందిన తర్వాత, కేవలం ఇప్పుడు ఊహించండి, ఒక వ్యక్తి హైఫై డిగ్రీలు సంపాదించి మంచి ఉద్యోగం అతను పొందాడు. కంపెనీలోని రూల్స్ రెగ్యులేషన్స్, డ్యూటీ టైమింగ్స్, ఆ డ్యూటీ ఎలాంటిదో, దానికి సంబంధించిన మరి కరెక్ట్ గా చేసినప్పుడే కదా అతను అంత జీతం వేసేది? ఒకవేళ ఏమైనా దొంగ గ్యాంబ్లింగ్ చేసి, పని చక్కగా చేయకుంటే, ఏ విధంగా, ఏ పద్ధతిలో చేయాలో అలా చేయకుంటే, ఒక నెల, రెండేళ్లు ఏదైనా అట్లాంటి మిస్సింగ్ చేస్తే, తర్వాత అయినా గాని పట్టుబడవచ్చు కదా? అతని అంతటి గొప్ప ఉద్యోగం అంతా వృధా అయిపోవచ్చు కదా? సంవత్సరం, రెండు సంవత్సరాల క్రితం సత్యం కంప్యూటర్ యొక్క యజమాని, ఏం పేరు మర్చిపోయాను? రామలింగరాజు, అతని పరిస్థితి, కొందరు అంటారు అతను వాస్తవానికి డబ్బులు దోచాడు, దొంగలించడం, ఏదైనా గ్యాంబ్లింగ్ చేయడం అలాంటివి చేయలేదట. ఏదో కేవలం కంపెనీని ఇంకా డెవలప్ చేసే ఉద్దేశంతోనే ఏదో లెక్కలు కొంచెం అటూ ఇటూ చేశారు అని కొందరు అంటారు. వాస్తవం ఏంటో మనకు తెలియదు. కానీ ఒక ఉదాహరణ మీకు చూపిస్తున్నాను. సత్యం కంప్యూటర్ అంటే ఇండియాలోనే కాదు, హైదరాబాద్ లోనే కాదు, వరల్డ్ లెవెల్ లో ఇంత అతనికి హోదా అంతస్తు ఉండేది. కానీ చిన్నపాటి మిస్టేక్ చేసినందుకు, తప్పు చేసినందుకు,

అయితే, దేవుడు అల్లాహ్ త’ఆలా మనల్ని అంటే ముందు మనం మానవుల్ని, ఇహలోకంలో సర్వ సృష్టిలో ఒక అతి ఉత్తమమైన సృష్టిగా మనకు హోదా అంతస్తు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. అందులో ఇంకా మనం ఎవరైతే మనకు మనం ముస్లింలము అని అనుకుంటామో, ఇస్లాం పై ఉన్న వాళ్ళం అని మనం భావిస్తామో, మనకు మనుషుల్లోనే, మానవుల్లోనే ఇతర జాతులపై ఒక హోదా అంతస్తు, ఒక గౌరవం అనేది ఉందా లేదా? ఉంది. మరి ఈ గౌరవం, ఈ హోదా అంతస్తు ఎలా వచ్చేస్తుంది? విద్య లేకుండా, ఎలాంటి మనకు జ్ఞానం లేకుండా అలాగే మనం సంపాదించాలంటే ఈ హోదా దానికి మనం అర్హులం అవుతామా? ఎంతమాత్రం కాము.

షరియత్ యొక్క ఇల్మ్, ధర్మ జ్ఞానం, ధర్మశాస్త్ర జ్ఞానం ఎంత మనకు అవసరం ఉన్నదో ఖురాన్, హదీసుల ఆధారంగా ఎన్నో ఆధారాలు ఉన్నాయి. కానీ అది తెలపడానికి ముందు నేను ఇలాంటి కొన్ని ఉదాహరణల ద్వారా మీకు తెలుపుతున్నాను విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది డైరెక్ట్ ఖురాన్ హదీస్ ఏం చెప్తే, ఆ ఇదేంటి ఖురాన్ హదీస్ తప్ప ఇంకా వేరే రానే రాదా? ఇది మాకు విని విని బోర్ అవుతుందయ్యా అని అంటుంటారు. కానీ ఇది చాలా బాధాకరమైన విషయం.

వాస్తవానికి ఈ 21వ శతాబ్దంలో సైన్స్, మెడికల్ సైన్స్, ఇంకా వేరే టెక్నాలజీలో ఏ డెవలప్మెంట్ అయితే మనం చూస్తున్నామో, కొందరు శాస్త్రార్థులు ఏమంటారో తెలుసా? సైన్స్, టెక్నాలజీ యొక్క డెవలప్ అనేది ఇంతకుముందు కాలాల్లో ఎందుకు జరగలేదు? ఇప్పుడు ఎందుకు జరిగింది? దానికి అసలు మూలం ఇది.

అల్లాహ్ పంపినటువంటి దివ్య గ్రంథం. అంటే ఈ బుక్, అంటే ఈ దివ్య గ్రంథం, సైన్స్ బుక్ అని నేను చెప్పడం లేదు. టెక్నాలజీకి సంబంధించిన దీని యొక్క ముఖ్య ఉద్దేశం, మానవుడు ఇహలోకంలో మంచి జీవితం ఎలా గడపాలి, పరలోకంలో స్వర్గం ఎలా పొందాలి. ఆ మార్గం చూపుతుంది. ఇంకా, మనిషి ఏ తప్పుడు మార్గాలను అవలంబిస్తే స్వర్గంను కోల్పోయి నరకం పాలవుతాడో అది తెలుపుతుంది. సంక్షిప్తంగా నేను తెలిపే విషయం. కానీ ఇందులో, ఈనాటి కాలంలో విద్యకు సంబంధించిన ఎన్ని రకాలు ఉన్నాయో వాటన్ని మూల విషయాలు ఇందులో ఉన్నాయి. దీని మీద రీసెర్చ్ చేస్తూ చేస్తూ చేస్తూ ఇంకా ముందుకు సాగుతున్నారు.

కానీ మనం, మనకు మనం ముస్లింలం అని అనుకునే వాళ్ళం, ఇల్లా మన్ రహిమ రబ్బు, చాలా అరుదైన, చాలా తక్కువ మంది తప్ప, అనేక మంది ముస్లింలం ఈ ధర్మ విద్య నుండి, ఖురాన్ యొక్క విద్య నుండి దూరం అయినందుకే దినదినానికి మన పరిస్థితి ఇంకా దిగజారిపోతుంది. ఇలాంటి సందర్భంలోనే ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆ హదీసును గుర్తుంచుకోండి.

إِنَّ اللَّهَ يَرْفَعُ بِهَذَا الْكِتَابِ أَقْوَامًا وَيَضَعُ بِهِ آخَرِينَ
(ఇన్నల్లాహ యర్ఫ’ఉ బి హాదల్ కితాబి అఖ్వామవ్ వయద’ఉ బిహి ఆఖరీన్)
నిశ్చయంగా అల్లాహ్ ఈ గ్రంథం ద్వారా కొందరు ప్రజలను ఉన్నత స్థానానికి తీసుకువస్తాడు, మరియు దాని ద్వారానే మరికొందరిని పడగొడతాడు.

అల్లాహ్ త’ఆలా ఈ గ్రంథం ద్వారా ప్రజల్లో కొందరిని పై స్థానానికి తీసుకొస్తాడు. ఎవరు వారు? ఖురాన్ ను చదివేవారు, దీని విద్య అభ్యసించేవారు, దాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారంగా ఆచరించేవారు. ఇంకా ఎవరైతే ఈ ఖురాన్, దీని నుండి వెనుతిరుగుతారో, దీన్ని నేర్చుకోకుండా దూరం అవుతారో, దీని మీద ఏ నమ్మకం, ఏ విశ్వాసం, దీని మీద ఎలా ఆచరించాలో అలా ఆచరించకుండా ఉంటారో, వారి గురించి ఏం చెప్పారు?

وَيَضَعُ بِهِ آخَرِينَ
(వయద’ఉ బిహి ఆఖరీన్)
మరియు దాని ద్వారానే మరికొందరిని పడగొడతాడు.

వారిని చాలా అధోగతికి పాలు చేస్తాడు. చాలా తక్కువ స్థానానికి. అందుగురించి సోదరులారా, ఈ హదీస్ ఇలాంటి సందర్భంలో మనం గుర్తు చేసుకోవాలి. మనిషికి ధర్మ విద్య, తను ఈ జఠర కడుపు గురించి ఏదైతే తింటాడో, త్రాగుతాడో, బ్రతకడానికి రేపటి రోజు మళ్లీ లేచి నిలబడి మంచి ఏదైనా మనం పని చేసుకోవాలి అన్న ఉద్దేశంతో నాలుగు ముక్కలు తింటాడో, ఆ కూడు కంటే, ఆ భోజనం కంటే ధర్మ విద్య ఎంతో ముఖ్యమైనది.

ఇమాం ఇబ్నుల్ ఖయ్యిం రహమతుల్లాహ్ అలైహ్ ఒక సందర్భంలో చెప్తారు, ధర్మ విద్య మనిషికి లభించే దొరికే ఉపాధి కంటే ఎంతో ముఖ్యం. ఒకవేళ మనిషికి తిండి లేకుంటే ఏం నష్టం జరుగుద్ది? ఇహలోకంలో జీవితం కోల్పోతాడు. తింటూ బతికినా గాని, ఉపవాసంతో ఉన్నా గాని ఒక రోజు చనిపోయేదే ఉంది. కానీ ధర్మ విద్య లేకుండా, విశ్వాసపరమైన జీవితం గడపకుండా అతను చనిపోయాడు అంటే, శాశ్వతంగా సదాకాలం నరకంలో ఉండే అలాంటి దుర్భాగ్యం కూడా కలగవచ్చు. అందుగురించి ఈ లోకం మనం సామాన్యంగా తెలుగులో ఎన్నో సామెతలు ఉన్నాయి, నీటి బుగ్గ లాంటిది. ఒక ముస్లిమేతర తెలుగు కవి, క్షణమైన మన జీవితం అని ఒక పాట కూడా పాడాడు.

ఈ తక్కువ వ్యవధి, కొద్ది రోజుల్లో అంతమైపోయే జీవితంలో ధర్మ విద్య నేర్చుకొని, మనం దీని ప్రకారంగా జీవితం గడిపితే, చనిపోయిన తర్వాత జీవితం ఏదైతే శాశ్వతంగా ఉందో అక్కడ మనం బాగుపడతాము.

మరో విషయం. మీరు ఈ ప్రాపంచిక జీవితంలో ఏ పని చేయాలన్నా, మన కడుపు గురించి, పొట్టలో మన కడుపులో రెండు ముక్కలు రావడానికి ఏ పని చేయాలన్నా దానికి సంబంధించిన జ్ఞానం నేర్చుకోవడం తప్పనిసరి. అవునా కాదా? లేనిదే అది మనం ఏమీ చేయలేము. అయితే ఈ నాలుగు ముక్కల గురించి, 50, 60 సంవత్సరాల జీవితం ఏదైతే మనం గడుపుతామో, అందులో కొంచెం సుఖంగా ఉండడానికి మనం ఎంత విద్య నేర్చుకొని, ఎంత సంపాదించి, ఎంత మనం కూడబెట్టుకుంటామో, ఆ సదాకాలమైన, శాశ్వతమైన ఆ జీవితం సుఖపడడానికి మనకు ఏ విద్య, ఎలాంటి ఆచరణ అవసరం లేదా?

ఎవరైతే ధర్మ విద్య అవసరం లేదు అని అనుకుంటున్నారో, వారు ఆలోచించాలి. ఇహలోకంలో ఒక్క పూట అన్నం దొరకడానికి మనం రెక్క ఆడనిది మన డొక్క నిండదు. అలాంటి పరిస్థితిలో పరలోకం, శాశ్వతమైన జీవితం, అక్కడి సుఖం మనం పొందాలంటే ఉక్కెక్కనే దొరకాలి? ఎలాంటి ఖర్చు లేకుండా దొరకాలి? ఏ విద్య అభ్యసించకుండా దొరకాలి? ఏ మంచి ఆచరణ లేకుండా దొరకాలి? కేవలం పేరుకు ముస్లిం అని మనం అనుకుంటే సరిపోతుంది అని అనుకోవడం ఇది ఎంత మూర్ఖత్వమో ఆలోచించాలి.

అందుకే సోదరులారా, బహుశా ఈ జనరల్ టాపిక్, ఇలాంటి కొన్ని ఉదాహరణల ద్వారా ధార్మిక విద్య అనేది ఎంత అవసరమో మనకు అర్థమవుతుంది.

ధార్మిక విద్య అంటే ఏమిటి? సామాన్యంగా కొందరు ఏమంటారు, అరే నేను ఒక జనరల్ గా ఒక మనిషిగా మంచి మనిషిగా బ్రతకాలనుకుంటా కానీ, మస్జిద్ కి పోవడం, ధర్మ విద్య నేర్చుకోవడం ఈ.. నేను ఇది చాలా క్రిటికల్ ఇవన్నీ, ఇదంతా దీనివల్ల గొడవలు జరుగుతాయి అది ఇది అని కొందరు తప్పుడు భావనలో కూడా పడతారు. అసలు మనం ధార్మిక విద్య, ధర్మ విద్య, ధర్మ జ్ఞానం అని అంటున్నాం కదా, ధార్మిక విద్య అంటే ఏంటి?

వాస్తవానికి సోదరులారా, ధార్మిక విద్య అంటే మనం ఒక ఉత్తమ మనిషిగా, ఉత్తమ మనిషిగా ఎలా జీవించగలుగుతామో ఇహలోకంలో, ఆ పద్ధతి మనల్ని సృష్టించిన ఆ సృష్టికర్త అల్లాహ్ తెలిపాడు. దానిని నేర్చుకొని ఆ ప్రకారంగా జీవితం గడపడమే ధార్మిక విద్య. అదే ధార్మిక జీవితం.

ఇంతకుముందు నేను ఒక విషయం చెప్పాను. ఏ కంపెనీలో పని చేయాలనుకున్నా గాని ఆ కంపెనీకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. పాటించకుంటే మనకు దొరికే జీతం అనేది సరిగా రాదు. ఆ కంపెనీ ద్వారా ఏ సుఖం మనం పొందాలనుకుంటున్నామో పొందలేము. అలాగే ఒక ఉత్తమ మనిషిగా, ఉత్తమ మనిషిగా మనం జీవితం గడపాలనుకుంటే, మనకు ఏ డైరెక్షన్, ఏ రూల్స్, ఏ రెగ్యులేషన్స్, ఏ పద్ధతి, ఏ చట్టము, ఏ నియమము అవసరం లేదా? ఆలోచించండి.

ఏ మనం జాబ్ చేస్తామో, ఏ డ్యూటీ చేస్తామో, ఏ ఉద్యోగం చేస్తామో, అక్కడ ఏయే నియమాలు ఉంటాయో, ఏయే చట్టాలు ఉంటాయో, అవన్నీ పాటించడానికి సిద్ధపడతాం మనం. ఎందుకు? జీతం దొరకాలి మనకు.

అయితే, ఉత్తమ మనిషిగా జీవించి పరలోకంలో స్వర్గం పొందడానికి మనకు ఏ పద్ధతి, ఏ డైరెక్షన్స్, ఏ రెగ్యులేషన్స్ అవసరం లేకుండా ఎలా జీవించగలుగుతాము? అయితే ఈ డైరెక్షన్స్, ఈ రూల్స్, రెగ్యులేషన్స్ ఎవరు మనకు మంచి విధంగా చూపించగలుగుతారు? ఎవరైతే మనల్ని పుట్టించారో ఆయనే చూపించగలుగుతాడు. ఉదాహరణకు, మెకానికల్ లైన్ లో పనిచేసేవాళ్లు, టయోటా కంపెనీకి సంబంధించిన బండి, నిస్సాన్ కంపెనీకి సంబంధించిన పార్ట్స్ తీసుకువచ్చి దానిలో పెడితే ఫిట్ అవుతాయా? కావు. చూడడానికి నిస్సాన్ బండి మరియు టయోటా బండి, చూడడానికి సేమ్ ఒకే రకంగా ఉన్నప్పటికీ లోపల కూడా ఎన్నో విషయాలు వేరువేరుగా ఉండవచ్చు. నేను ఒక చిన్న ఉదాహరణ ఇస్తున్నా. అది 100% ఈ ఉదాహరణ అక్కడ ఫిట్ అవుతుందా లేదా అది కాదు, నేను చెప్పే విషయం ఏంటంటే, అల్లాహ్ మనల్ని పుట్టించాడు. మన గురించి, మన భవిష్యత్తు గురించి అల్లాహ్ కు ఎంత మంచి విధంగా తెలుసునో, ఇంకా వేరే ఎవరికైనా తెలిసి ఉంటుందా? ఉండదు. ఆయన చూపిన విధానమే అది సంపూర్ణ విధానం అవుతుంది. ఆయన చూపిన విధానం మీద, ఆ ప్రకారం మనం జీవితం గడిపితేనే మనకు ఇహ-పర రెండు లోకాల సుఖాలు అనేటివి ప్రాప్తమవుతాయి. అందుగురించి అల్లాహ్ త’ఆలా, 28వ పారాలో,

يَرْفَعِ اللَّهُ الَّذِينَ آمَنُوا مِنكُمْ وَالَّذِينَ أُوتُوا الْعِلْمَ دَرَجَاتٍ
(యర్ఫ’ఇల్లా హుల్లదీన ఆమనూ మిన్కుమ్ వల్లదీన ఊతుల్ ఇల్మ దరజాత్)
మీలో విశ్వసించిన వారికి, మరీ ముఖ్యంగా జ్ఞానం వొసగబడిన వారికి అల్లాహ్ ఉన్నతమైన హోదాలను ప్రసాదిస్తాడు. (58:11)

మీలో ఎవరైతే విశ్వసించారో మరియు ఎవరైతే విద్య అభ్యసిస్తారో, వీరిద్దరి స్థానాలను అల్లాహ్ త’ఆలా పెంచుతూ పోతాడు, హెచ్చింపు చేస్తూ పోతాడు.

يَرْفَعِ اللَّهُ
(యర్ఫ’ఇల్లాహ్)
అల్లాహ్ హెచ్చిస్తాడు.

హెచ్చుతూ పోతాడు, పైకి తీసుకెళ్తూ ఉంటాడు.

الَّذِينَ آمَنُوا مِنكُمْ
(అల్లదీన ఆమనూ మిన్కుమ్)
మీలో ఎవరైతే విశ్వసించారో వారిని

وَالَّذِينَ أُوتُوا الْعِلْمَ
(వల్లదీన ఊతుల్ ఇల్మ్)
మరియు ఎవరికైతే విద్య ఇవ్వబడ్డారో,

ఎవరికైతే విద్య లభించినదో, వారిద్దరి స్థానాలను, దరజాత్, అల్లాహ్ త’ఆలా పైకి ఎత్తుతూ పోతాడు. ఇంతకుముందు నేను ఫస్ట్ లో, స్టార్టింగ్ లో ఒక ఉదాహరణ చెప్పాను కదా, ఒక వ్యక్తి తన బావ గురించి. అయితే, ఎంత మంచి విద్య నేర్చుకొని, ఎంత మంచి అతని దగ్గర ఒక పని, షార్ప్నెస్ ఉంటే, అతను అంత హాయిగా సుఖంగా జీవిస్తాడు అని ఏదైతే భావిస్తున్నామో, అల్లాహ్ పంపినటువంటి ధర్మ జ్ఞానం, అల్లాహ్ పంపినటువంటి విద్య, అది నేర్చుకొని చాలా నీచంగా ఉంటాము అని మనం ఎలా భావిస్తున్నాము? మరి అల్లాహ్ త’ఆలా ఖురాన్ లో ఇంత స్పష్టంగా చెప్తున్నాడు. ఎవరైతే విశ్వసించి నా విశ్వాస మార్గంలో ఉంటారో, ఎవరైతే నేను పంపిన విద్యను నేర్చుకొని ఆ ప్రకారంగా జీవితం గడుపుతారో, వారి స్థానాలను నేను ఇంకా మీదికి చేస్తూ ఉంటాను, వారికి హోదా అంతస్తులు ప్రసాదిస్తూ ఉంటాను అని అల్లాహ్ త’ఆలా చెప్తున్నాడు. అల్లాహ్ మాటలో ఏమైనా పొరపాటు, అనుమానం అనేది ఉంటుందా? ఉండదు.

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అందుకే చెప్పారు,

طَلَبُ الْعِلْمِ فَرِيضَةٌ عَلَى كُلِّ مُسْلِمٍ
(తలబుల్ ఇల్మి ఫరీదతున్ అలా కుల్లి ముస్లిం)
విద్యాన్వేషణ ప్రతి ముస్లింపై విధిగా ఉంది.

విద్యా అభ్యసించడం ప్రతి ముస్లిం పై, స్త్రీ అయినా, పురుషుడైనా, ప్రతి ఒక్కరిపై విధిగా ఉన్నది. విధిగా ఉన్నది.

فَرِيضَةٌ
(ఫరీదతున్)
విధి

ఈ ఫరీదా, నమాజ్ ఫర్జ్, రోజా ఫర్జ్ హై, జకాత్ ఫర్జ్ హై అని మనం అనుకుంటాం కదా? ఇక్కడ ప్రవక్త ఏమంటున్నారు?

طَلَبُ الْعِلْمِ فَرِيضَةٌ
(తలబుల్ ఇల్మి ఫరీదతున్)
విద్యాన్వేషణ విధి.

ఇల్మ్, విద్య తలబ్, అభ్యసించడం, నేర్చుకోవడం ఫరీదా, అది కూడా ఒక విధి. కానీ ఈ విధి నుండి మనం సామాన్యంగా ముస్లింలు ఎంత దూరం ఉన్నాము?

తొలిసారిగా ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించిన సూరా ఏది? ఇఖ్రా.

اقْرَأْ بِاسْمِ رَبِّكَ الَّذِي خَلَقَ
(ఇఖ్ర’ బిస్మి రబ్బికల్లదీ ఖలఖ్)
చదువు, సృష్టించిన నీ ప్రభువు పేరుతో. (96:1)

خَلَقَ الْإِنسَانَ مِنْ عَلَقٍ
(ఖలఖల్ ఇన్సాన మిన్ అలఖ్)
ఆయన మానవుణ్ణి రక్తపు గడ్డతో సృష్టించాడు. (96:2)

اقْرَأْ وَرَبُّكَ الْأَكْرَمُ
(ఇఖ్ర’ వరబ్బుకల్ అక్రమ్)
చదువు, నీ ప్రభువు పరమ దయాశీలి. (96:3)

الَّذِي عَلَّمَ بِالْقَلَمِ
(అల్లదీ అల్లమ బిల్ ఖలమ్)
ఆయనే కలము ద్వారా జ్ఞానాన్ని నేర్పాడు. (96:4)

عَلَّمَ الْإِنسَانَ مَا لَمْ يَعْلَمْ
(అల్లమల్ ఇన్సాన మా లమ్ య’అలమ్)
మానవునికి అతను ఎరుగని విషయాలను నేర్పాడు. (96:5)

ఈ ఐదు ఆయతులు తొలిసారిగా ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించాయి. ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రవక్త పదవి, ప్రవక్త కిరీటం అనేది ప్రసాదించబడింది. ఈ ఆయతుల మీద శ్రద్ధ వహించండి. ఇఖ్రా, ఈ పదమే ఏమున్నది? చదవండి, చదువు. ఇస్లాం లోని మొట్టమొదటి విషయం చదువు. ఈ చదువు నుండి మనం ఎంత దూరం ఉన్నామో ఈ రోజుల్లో చూడండి.

అచ్చా, చదువులో అబ్బాయి మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు అతనికి ముందు మనం ఏం నేర్పాలి? పిల్లవాడు స్కూల్ పోవడానికి మూడు, మూడున్నర, నాలుగు సంవత్సరాల వయసుకు వచ్చినప్పుడు స్కూల్ కి పంపుతాము. మొట్టమొదటిసారిగా ఏ చదువు ఇవ్వాలి మనం? ఆ విషయం కూడా దీని ద్వారా నేర్పడం జరిగింది. ఏంటది?

اقْرَأْ بِاسْمِ رَبِّكَ الَّذِي خَلَقَ
(ఇఖ్ర’ బిస్మి రబ్బికల్లదీ ఖలఖ్)
చదువు, సృష్టించిన నీ ప్రభువు పేరుతో. (96:1)

ఎవరైతే మిమ్మల్ని సృష్టించాడో ఆ సృష్టికర్త పేరుతో మీ చదువును ఆరంభించండి.

خَلَقَ الْإِنسَانَ مِنْ عَلَقٍ
(ఖలఖల్ ఇన్సాన మిన్ అలఖ్)
ఆయన మానవుణ్ణి రక్తపు గడ్డతో సృష్టించాడు. (96:2)

మనిషి పుట్టుక ఎలా జరిగింది? మనిషి యొక్క సృష్టి ఎలా జరిగింది? ఆ విషయం ఇక్కడ తెలపాడు అల్లాహ్ త’ఆలా. ఆ తర్వాత మరోసారి,

اقْرَأْ وَرَبُّكَ الْأَكْرَمُ
(ఇఖ్ర’ వరబ్బుకల్ అక్రమ్)
చదువు, నీ ప్రభువు పరమ దయాశీలి. (96:3)

చదువు, అక్రం అంటే ఏంటి? మహా గౌరవనీయుడు. ఇజ్జత్ ఓ ఇక్రాం అన్న పదం ఉర్దూలో కూడా వాడుతూ ఉంటారు. ఇక్రాం, అక్రం అంటే అంతకంటే మించిన కరమ్ చేసేవాడు ఇక లేడు అని.

ఇక్కడ ఖురాన్ వ్యాఖ్యానకర్తలు, ముఫస్సిరీనె కిరామ్ ఒక చాలా సున్నితమైన విషయం అంటారా? బారీక్ నుక్తా ఏం తెలుపుతారో తెలుసా? ఇఖ్రా చదువు, వరబ్బుకల్ అక్రమ్, నీ ప్రభువు చాలా గౌరవప్రదమైనవాడు. అంటే ఏంటి? చదువు వల్ల నీకు గౌరవప్రదము లభిస్తుంది. చదువు లేకుంటే మరి తర్వాత,

الَّذِي عَلَّمَ بِالْقَلَمِ
(అల్లదీ అల్లమ బిల్ ఖలమ్)
ఆయనే కలము ద్వారా జ్ఞానాన్ని నేర్పాడు. (96:4)

ఆ అల్లాహ్ కలము ద్వారా మనిషికి విద్య నేర్పాడు.

عَلَّمَ الْإِنسَانَ مَا لَمْ يَعْلَمْ
(అల్లమల్ ఇన్సాన మా లమ్ య’అలమ్)
మానవునికి అతను ఎరుగని విషయాలను నేర్పాడు. (96:5)

మనిషికి తెలియని జ్ఞానాలు అల్లాహ్ త’ఆలా పంచి నేర్పాడు.

సోదరులారా, తొలిసారిగా అవతరించిన ఈ ఆయతులో మనం శ్రద్ధ వహిస్తే ఎంత గొప్ప విషయం మన గురించి ఉంది. అంతేకాదు. తొలి మానవుడు ఎవరు? ఆదం అలైహిస్సలాం. స్కూళ్లలో చదివిన డార్విన్ థియరీ, డార్విన్ సిద్ధాంతం, కోతి నుండి మనిషి వచ్చినాడు, అది తప్పుడు విషయం. స్వయంగా డార్విన్ దానిని తిరస్కరించాడు. తిరస్కరించి ఒక పెద్ద బోర్డ్ లాగా రాసి సైన్ కూడా చేశాడు. ఈ సిద్ధాంతం, ఈ థియరీ నేనే సృష్టించాను, కానీ దీనికి ఎలాంటి ఆధారం లేదు, ఇది తప్పు అని ఖండించాడు. కానీ ఈ రోజుల్లో అతని ఆ ఖండనను ముందు తీసుకురాకుండా అతని ఆ తప్పుడు సిద్ధాంతాన్ని ప్రజలకు నేర్పుతున్నారు సైన్స్ బుక్ లో. కానీ అల్లాహ్ యొక్క దయవల్ల మనం ముస్లింలము గాని, అలాగే క్రిస్టియన్లు గాని, వారి విశ్వాసం ఏంటి? తొలి మానవుడు ఆదం అలైహిస్సలాం.

ఆదం అలైహిస్సలాం విషయం చెప్పేకి ముందు, మనలో మనలాంటి, తిని త్రాగి సంభోగించి శ్వాస పీల్చుకొని జీవించే ఇంకా వేరే జీవరాసులు ఉన్నాయా లేదా? ఉన్నాయి కదా. వారిలో మనలో తేడా ఏంటి? మనలో వారిలో వ్యత్యాసం, వారికి లేకుండా మనకు అల్లాహ్ ఏదైతే,

وَلَقَدْ كَرَّمْنَا بَنِي آدَمَ
(వ లఖద్ కర్రమ్నా బనీ ఆదమ)
నిశ్చయంగా మేము ఆదం సంతతికి గౌరవాన్ని ప్రసాదించాము (17:70)

మానవులకు మేము ఒక గౌరవమైన, ఒక మంచి గౌరవం అనేది ప్రసాదించాము అని అల్లాహ్ ఏదైతే అంటున్నాడో, అది మనకు ఆ గౌరవం ఎలా లభించింది? అయితే సూర బఖరాలో చూడండి మీరు,

وَعَلَّمَ آدَمَ الْأَسْمَاءَ كُلَّهَا
(వ అల్లమ ఆదమల్ అస్మా’అ కుల్లహా)
మరియు అల్లాహ్ ఆదమ్ కు అన్ని వస్తువుల పేర్లు నేర్పాడు. (2:31)

అల్లాహ్ త’ఆలా ఆదంకు అన్ని విషయాల పేర్లు నేర్పాడు. తర్వాత ఓ దేవదూతలారా, మీరు ఆదంకు సజ్దా చేయండి అని ఆదేశం ఇచ్చాడు. ఆదంకు ఇతరుల మీద గౌరవం అనేది ఏ విషయంలో ప్రసాదించబడింది? విద్య ద్వారా. అర్థమవుతుందా విషయం? విద్య ప్రసాదించి అల్లాహ్ త’ఆలా ఈ విద్య ద్వారా మానవునికి గౌరవం అనేది ప్రసాదించాడు. ఇలాంటి అల్లాహ్ స్వయంగా ప్రసాదించిన ఈ విద్యను ఈరోజు మనం తిరస్కరిస్తున్నాము అంటే, అనేక మంది అనేక మన ప్రజలు, మన ముస్లిం సోదరులు ప్రత్యేకంగా, సోదరులారా, ఇది మనకు మనం ఎంత నష్టంలో పోతున్నామో చాలా గంభీరంగా ఆలోచించవలసిన విషయం.

ఇంకా చెప్పుకుంటూ పోతే విద్య నేర్చుకోవడంలో ఉన్న ఘనతలు, లాభాలు నేర్చుకుంటే ఏం లాభాలు, అవన్నీ మరో పెద్ద టాపిక్ అవుతుంది. కానీ అవన్నీ విషయాలు చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు. కానీ ఒకే విషయం చెప్తాను, కొంచెం శ్రద్ధ వహించే ప్రయత్నం చేయండి.

ఇస్లాం ధర్మం చాలా సులభమైనది. మానవుల కొరకు అనుకూలమైనది. అల్లాహ్ ఇస్లాంకు సంబంధించిన ఏ ఆదేశం మనకు ఇచ్చినా, అందులో మన కొరకు ఇహ-పరలోకాల మేలే మేలు ఉన్నది తప్ప నష్టం లేదు. అయితే, ప్రపంచంలో ఏ ఉద్యోగం పొందడానికైనా, ఏ మీరు పని నేర్చుకున్నా, ఏ విద్య నేర్చుకున్నా, కొన్ని సంవత్సరాలు కష్టపడి ఆ పని, ఆ విద్య నేర్చుకున్న తర్వాత కొద్ది రోజులకు, కొన్ని సంవత్సరాలకు దాని ఫలితం మీకు ముందుకు వస్తుంది. అవునా లేదా? ఇప్పుడు ఈయన కంప్యూటర్ మీద పని చేస్తున్నారు, ఈయన వెళ్లి ఏదో ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు, అన్నయ్య గారు ఏదో ఆ పెయింటింగ్ విషయంలో పని చేస్తున్నారు, ఆ పనులు, మెకానిక్ లైన్ పనులు గాని, నేర్చుకోవడానికి కొంత కాలం పడుతుందా లేదా? ఆ నేర్చుకునే సమయం ఏదైతే ఉందో, ఆ నేర్చుకునేటప్పుడే దాని యొక్క ఫలితం మనకు తొందరగా కనబడుతుందా? కనబడదు. కనబడకుండా గానీ, ఉంటుందా అంత తొందరగా ఫలితం? ఉండదు. కానీ ధర్మ విద్య, ఇల్మె దీన్ దీని గురించి ఎన్నో హదీసులు వచ్చి ఉన్నాయి.

ధర్మానికి సంబంధించిన మీరు విద్య నేర్చుకున్నప్పుడు, నేర్చుకొని ఏ విషయం ఎట్లా ఆచరించాలి అని ఆచరించినప్పుడు ఏదైతే మీకు పుణ్యం దొరుకుతుందో, అది తర్వాత దొరుకుతుంది. కానీ ఈ విద్య నేర్చుకునేటప్పుడు కూడా మీకు పుణ్యం దొరుకుతుంది. ఇప్పుడు ఉదాహరణకు, ఉదాహరణకు అన్నయ్య దగ్గర అనుకోండి ఒక లక్ష రూపాయలు ఉన్నాయి. దాంతో జకాత్ ఇవ్వడం విధి ఉందా లేదా? ఉంది. అరే జకాత్ విషయం నేను నేర్చుకోవాలి, జకాత్ నాపై విధి ఉంది అని అన్నయ్య ఇప్పుడు జకాత్ గురించి నేర్చుకోవడం మొదలుపెట్టాడు. జకాత్ ఇచ్చినప్పుడు జకాత్ ఇచ్చిన పుణ్యం దొరుకుద్ది కదా? కానీ జకాత్ కు సంబంధించిన జ్ఞానం ఏదైతే నేర్చుకుంటున్నారో అప్పుడు కూడా అల్లాహ్ అతనికి ఆ పుణ్యం ప్రసాదిస్తూ ఉన్నాడు. ఏ పుణ్యం? ఆ ఇల్మ్ నేర్చుకునే, ఆ విద్య ఏదైతే నేర్చుకుంటున్నారో, ఆ నేర్చుకునే యొక్క పుణ్యం. అంటే మనం నేర్చుకోవడానికి ఏ సమయం అయితే ఉపయోగిస్తున్నామో, వెచ్చిస్తున్నామో, అది కూడా మనకు వృధా పోతలేదు. అది కూడా మనకు లాభకరంగా ఉంది.

అందుగురించే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారు? ఒక మహదీసులో,

مَنْ قَرَأَ حَرْفًا مِنْ كِتَابِ اللَّهِ فَلَهُ بِهِ حَسَنَةٌ، وَالْحَسَنَةُ بِعَشْرِ أَمْثَالِهَا
(మన్ ఖర’అ హర్ఫమ్ మిన్ కితాబిల్లాహి ఫలహు బిహి హసనతున్, వల్ హసనతు బి అష్రి అమ్సాలిహా)
ఎవరైతే అల్లాహ్ గ్రంథంలోని ఒక్క అక్షరాన్ని పఠిస్తారో, అతనికి ఒక పుణ్యం లభిస్తుంది, మరియు ఆ పుణ్యం పదింతలు చేయబడుతుంది.

ఎవరైతే ఖురాన్ గ్రంథంలోని ఒక్క అక్షరం చదువుతారో, అతనికి ఎన్ని పుణ్యాలు? ఒక్క అక్షరం పై పది పుణ్యాలు. ఇంకా ఎవరికైనా అర్థం చేసుకోవడంలో కన్ఫ్యూజ్ కావొద్దు అని ప్రవక్త ఇంకా ఒక ఉదాహరణ ఇచ్చి చెప్పారు. సూర బఖరా స్టార్టింగ్ లో ఏముంది?

الٓمٓ
(అలిఫ్ లామ్ మీమ్)
(2:1)

ఇన్ని లా అఖూలు అలిఫ్ లామ్ మీమ్ హర్ఫున్, అలిఫ్ లామ్ మీమ్ ఇది మొత్తం ఒక అక్షరం కాదు. అలిఫున్ హర్ఫున్, వ లామున్ హర్ఫున్, వ మీమున్ హర్ఫున్. అలిఫ్ ఒక అక్షరం, లామ్ ఒక అక్షరం, మీమ్ ఒక అక్షరం. అలిఫ్ లామ్ మీమ్ అని మనం చదివితే ఎన్ని పుణ్యాలు దొరుకుతాయి ఇన్షా అల్లాహ్? 30 పుణ్యాలు దొరుకుతాయి. ఆ తర్వాత,

ذَٰلِكَ الْكِتَابُ لَا رَيْبَ ۛ فِيهِ ۛ هُدًى لِّلْمُتَّقِينَ
(దాలికల్ కితాబు లా రైబ ఫీహి, హుదల్లిల్ ముత్తఖీన్)
ఇది అల్లాహ్ గ్రంథం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇది దైవభీతి పరులకు మార్గదర్శకత్వం చూపుతుంది. (2:2)

الَّذِينَ يُؤْمِنُونَ بِالْغَيْبِ وَيُقِيمُونَ الصَّلَاةَ وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ
(అల్లదీన యు’మినూన బిల్ గైబి వ యుఖీమూనస్సలాత వ మిమ్మా రజఖ్నాహుమ్ యున్ఫిఖూన్)
వారు అగోచర విషయాలను విశ్వసిస్తారు. నమాజును స్థాపిస్తారు. మేము వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి ఖర్చు చేస్తారు. (2:3)

సలాత్, నమాజ్. నమాజ్ చేసినప్పుడు నమాజ్ పుణ్యం దొరుకుతుంది. కానీ నమాజ్ ఎలా చేయాలి? ఏయే నమాజులు విధిగా ఉన్నాయి? నమాజు ఏయే నమాజులు సున్నతులు ఉన్నాయి, నఫీల్లు ఉన్నాయి? నమాజ్ యొక్క కంప్లీట్ పద్ధతి ఏంటిది? నమాజ్ లో ఏమేం చదవాలి? ఇవన్నీ నేర్చుకోవటానికి మనం ఏ సమయం అయితే వెచ్చిస్తామో, అవి నేర్చుకునేటప్పుడు కూడా మనకు పుణ్యం లభిస్తూనే ఉంటుంది. అందుగురించి ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఒక్క హదీస్ వినండి, చాలా శ్రద్ధగా వినండి.

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు,

مَا اجْتَمَعَ قَوْمٌ فِي بَيْتٍ مِنْ بُيُوتِ اللَّهِ
(మా ఇజ్తమ’అ ఖవ్మున్ ఫీ బైతిమ్ మిన్ బుయూతిల్లాహ్)
అల్లాహ్ యొక్క గృహాలలో ఒక గృహంలో ఎప్పుడైతే ఒక సమూహం సమావేశమవుతుందో,

అల్లాహ్ యొక్క గృహాల్లో నుండి ఏదైనా ఒక గృహంలో కొందరు సమూహమై ఒకచోట వారు జమా అయి,

يَتْلُونَ كِتَابَ اللَّهِ وَيَتَدَارَسُونَهُ بَيْنَهُمْ
(యత్ లూన కితాబల్లాహి వ యతదారసూనహు బైనహుమ్)
వారు అల్లాహ్ గ్రంథాన్ని పఠిస్తూ, దానిని తమలో తాము బోధించుకుంటూ ఉంటారో,

అల్లాహ్ యొక్క గ్రంథాన్ని చదువుతారు, పరస్పరం దాని విద్య ఒకరికి ఒకరు చెప్పుకుంటారు, దానిని పాఠాలు ఒకరికి ఒకరు చెప్పుకుంటారు, ఏమవుతుంది?

إِلَّا نَزَلَتْ عَلَيْهِمُ السَّكِينَةُ
(ఇల్లా నజలత్ అలైహిముస్సకీనహ్)
వారిపై ప్రశాంతత అవతరించకుండా ఉండదు,

వారిపై ఒక శాంతి, ఒక తృప్తి, ఒక నెమ్మది, నిదానం అల్లాహ్ వైపు నుండి అవతరిస్తుంది.

وَغَشِيَتْهُمُ الرَّحْمَةُ
(వ గషియతుహుముర్రహ్మహ్)
వారిని కారుణ్యం ఆవరిస్తుంది,

అల్లాహ్ యొక్క కారుణ్యం అనేది వారిని చుట్టుకుంటుంది.

وَحَفَّتْهُمُ الْمَلَائِكَةُ
(వ హఫ్ఫత్ హుముల్ మలా’ఇకహ్)
దేవదూతలు వారిని చుట్టుముడతారు,

దేవదూతలు ఆ సమావేశంలో పాల్గొంటారు. ఎన్ని లాభాలని? మూడు కదా? సుకూనత్, రహ్మత్ మరియు దేవదూతలు.

وَذَكَرَهُمُ اللَّهُ فِيمَنْ عِنْدَهُ
(వ దకరహుముల్లాహు ఫీమన్ ఇందహ్)
మరియు అల్లాహ్ తన వద్ద ఉన్నవారి ముందు వారిని ప్రస్తావిస్తాడు.

అల్లాహ్ వద్ద అతి చేరువుగా ఏ దూతలైతే, ఏ గొప్ప సృష్టి అయితే ఉందో, వారి ముందు అల్లాహ్ త’ఆలా వీరిని ప్రశంసిస్తూ ఉంటాడు. ఇంతటి గొప్ప విషయమో, ఇన్ని లాభాలు మనకు ఉన్నాయో చూడండి. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరో హదీస్ లో చెప్పారు,

مَنْ سَلَكَ طَرِيقًا يَلْتَمِسُ فِيهِ عِلْمًا
(మన్ సలక తరీఖన్ యల్తమిసు ఫీహి ఇల్మన్)
ఎవరైతే విద్యాన్వేషణకై ఒక మార్గంలో పయనిస్తారో,

ఎవరైతే ఇల్మ్, విద్య నేర్చుకోవడానికి, అభ్యసించడానికి ఒక దారిలో నడుస్తారో,

سَهَّلَ اللَّهُ لَهُ بِهِ طَرِيقًا إِلَى الْجَنَّةِ
(సహ్హలల్లాహు లహు బిహి తరీఖన్ ఇలల్ జన్నహ్)
అల్లాహ్ దాని ద్వారా అతని కోసం స్వర్గానికి వెళ్ళే మార్గాన్ని సులభతరం చేస్తాడు.

ఆ దారిని అల్లాహ్ త’ఆలా అతని గురించి స్వర్గం వైపునకు సుగమం చేస్తాడు, సులభం చేస్తాడు. మరో హదీస్ లో చెప్పారు, ఎవరైనా విద్య నేర్చుకోవడానికి ఒక దారి మీద వెళ్తూ ఉంటే దేవదూతలు వారి గురించి తమ రెక్కలను చాచుతారు. అంతేకాదు, ఈ సృష్టిలో ఉన్నటువంటి సర్వ సృష్టి, ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి జీవరాశి, ప్రతి సృష్టి అతని గురించి, ఓ అల్లాహ్ ఇతన్ని క్షమించండి, ఓ అల్లాహ్ ఇతని మీద కరుణించండి, ఓ అల్లాహ్ ఇతని మీద నీ దయ చూపండి, అని దుఆ చేస్తూ ఉంటారు. పక్షులు గాని, చీమలు గాని, చేపలు గాని, ప్రతి సృష్టి. ఎందుకు?

رِضًا لِمَا يَصْنَعُ طَالِبُ الْعِلْمِ
(రిదల్ లిమా యస్న’ఉ తాలిబుల్ ఇల్మ్)
విద్యాన్వేషి చేసే పని పట్ల సంతృప్తితో.

ఈ తాలిబుల్ ఇల్మ్, ఈ ధర్మ విద్య అభ్యసించే ఈ వ్యక్తి ఏ మంచి ఉద్దేశంతో ఈ ధర్మ విద్య నేర్చుకుంటున్నాడో, దానికి సంతోషపడి. అందుగురించి సోదరులారా, చెప్పాలంటే ఇంకా ఘనతలు ఉన్నాయి, కానీ ഇന്നటితో ఇంతటి విషయాలపై మనం శ్రద్ధ వహించి, ఇంకా మనం మన సోదరులకు, మన మిత్రులకు, మన దగ్గరి బంధువులకు అందరికీ ఈ ఘనతలు తెలిపి, వారందరినీ కూడా ఇలాంటి సమావేశాల్లో పాల్గొనడానికి మనం ప్రయత్నం చేద్దాము. ఇందులో కూడా మనకు ఎంతో గొప్ప పుణ్యం, ఫలితం, అజర్, సవాబ్ ఉంది.

جَزَاكُمُ اللَّهُ خَيْرًا وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللَّهِ وَبَرَكَاتُهُ
(జజాకుముల్లాహు ఖైరన్, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహ్)
అల్లాహ్ మీకు ఉత్తమ ప్రతిఫలం ఇచ్చుగాక. మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ఇతరములు: