ఆదర్శమూర్తి ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) వారి కొన్ని జీవిత ఘట్టాలు

best-example-to-follow

దీనిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలోని కొన్ని ముఖ్య ఘటనలు ఉదాహరణకు ఆయన ప్రయాణం, వర్ణన, మాటతీరు, ఇంటివారితో మెలిగే తీరు, బంధువులతో వ్యవహరించే సరళి, ఇంటిలో ఎలా ఉండేవారు, జీవన సరళి, దాంపత్య జీవితం, భార్యలు, కుమార్తెలు, నిదురించే విధానం, తహజ్జుద్ నమాజు, ఫజర్ నమాజు తరువాత, చాష్త్ నమాజు, నఫిల్ నమాజులు ఇంటివద్దనే ఆచరించటం, పేదరికంలో ఆచరణా విధానం, వినయవిధేయతలు, సేవకులతో వ్యవహరించేతీరు, అతిథి మరియు బహుమతి, పిల్లల పట్ల ఆయన తీరు, వీరత్వం, సహనశీలత, క్షమాగుణం, భోజనం చేసే పద్ధతి, ఇతరులతో మెలిగే తీరు, ధ్యానం, ఇరుగుపొరుగువారితో మెలిగే వ్యవహారం, ఉన్నతమమైన వ్యవహారశైలి, బాధ్యతా నిర్వహణ, సహనం, కొన్ని దుఆలు మొదలైన ముఖ్యాంశాలు చర్చించబడినాయి.

ఆదర్శమూర్తి ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) వారి కొన్ని జీవిత ఘట్టాలు

ఉర్దూ మూలం: అబ్దుల్ మలిక్ అల్ ఖాసిం
తెలుగు అనువాదకులు: అబూబకర్ & అబుసాజిద (బహదుర్)

[ఇక్కడ చదవండి/ PDF డౌన్లోడ్ చేసుకోండి]

ప్రవక్త విధేయతే పరమావధి – ఇమామ్ బిన్ బాజ్[పుస్తకం]

Following the Sunnah - by Ibn Baz

Following the Sunnah is Compulsory [Sunnath par Amal Waajib]
సంకలనం : అల్లామ అబ్దుల్లా బిన్ బాజ్ (రహమతుల్లా అలై) (ibn Baz)
అనువాదకులు : ముహమ్మద్ అజీజుర్రహ్మాన్
ప్రకాశకులు : హదీస్ పబ్లికేషన్స్ ,హైదరాబాద్,ఆంధ్ర ప్రదేశ్,ఇండియా

[ఇక్కడ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [32 పేజీలు] [ఫైల్ సైజు: 1.4 MB] [మొబైల్ ఫ్రెండ్లీ]

విషయసూచిక 

అన్ని చాఫ్టర్లు PDF లింకులు గా క్రింద ఇవ్వబడ్డాయి. లింక్ క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా చదవవచ్చు.

  1. తొలిపలుకులు [1p]
  2. మహా ప్రవక్త విధానాన్ని అనుసరించటం అనివార్యం. కాదనటం కుఫ్ర్ కి తార్కాణం [18p]
    1. మొదటి (అసలు) ప్రాతిపదిక దైవ గ్రంథం
    2. రెండవ ప్రాతిపదిక దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) విధానం (సున్నత్‌)
  3. ప్రవక్త సహచరులు, వారి తరువాత వారు మరియు ఇస్లామీయ విద్వాంసులు దృష్టిలో సున్నత్‌ ఔన్నత్యం [10p]
  4. ఇదే మాసందేశం (పుస్తక పబ్లిషర్స్ నుండి) [1p]

తొలిపలుకులు

పొగడ్తలన్నీ సర్వలోకాల అధిపతియైన అల్లాహ్‌కే చెందును. ఆయన అంతిమ ప్రవక్తయైన ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు మరియు ఆయన బాటన నడిచిన పుణ్యాత్ములపై అల్లాహ్‌ కారుణ్యం  వర్షించు గాక, ఆమీన్…

మనందరికి తెలిసినట్లు ఇస్లాం (విధేయత) మాత్రమే అల్లాహ్‌ వద్ద స్వీకరించదగిన ధర్మము, ఇది అల్లాహ్‌ ఆరాధన మరియు ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి పద్ధతిని (సున్నత్‌) అనుసరించడం ద్వారా పూర్తవుతుంది. ఈ విషయాన్ని దివ్యఖుర్‌ఆన్ మరియు స్వయంగా ప్రవక్తగారి కంటే బాగా ఎవరూ భోధించలేరన్నది వాస్తవం. ఈ చిన్న పాఠం మనం ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది.

ఈ వాస్తవాన్ని జనాలకు నచ్చ చెప్పేందుకు తన జీవితాన్ని ధారపోసిన గొప్ప పండితుల్లో సౌదీ అరేబియాకు చెందిన షేక్‌ బిన్‌ బాజ్‌ గారు (మరణం 1420 హిజ్రీ) ఒకరు .

అల్లాహ్‌ ఆయన ఆత్మకు శాంతి కలిగించుగాక ! ఆమీన్‌. ఆయన ఓ గొప్ప మేధావి, ధార్మిక పండితుడు మరియు ఇస్లామీయ చట్టానికి అనుగుణంగా జీవితం చాలించిన మహా మనిషి. తన రచనల ద్వారా ప్రసంగాల ద్వారా ఆలోచన ప్రక్రియ ద్వారా ఇస్లాంకు సేవలందించిన మహానీయుడు. నేటికి కోట్లాది మందికి మార్గదర్శకత్వం వహిస్తున్న దార్శనికుడు.

ఆయన వ్రాసిన ఈ చిరు పుస్తకాన్ని తెలుగు పాఠకులకు సమర్పించడానికి మేము చేస్తున్న ఈ కృషిని అల్లాహ్‌ స్వీకరించుగాక మరియు మనందరికి ఈ పుస్తకం ద్వారా సన్మార్గం చూపుగాక ! ఆమీన్‌ …

– హాఫిజ్‌ ముహమ్మద్‌ అబ్దుర్ రవూఫ్‌ ఉమరి

మహాప్రవక్త విధానాన్ని అనుసరించటం అనివార్యం. కాదనటం కుఫ్ర్ కి తార్కాణం

(ఈ మధ్య కొన్ని మిథ్యావాదాలు ప్రబలి  ప్రవక్త విధానాన్ని అనుసరించే విషయమై విపరీతార్ధాలు తీస్తున్నాయి. అందుచేత మేము ఈ చిరు పుస్తకాన్ని ప్రచురించి ప్రవక్త సంప్రదాయాన్ని పాటించటం తప్పనిసరి అనీ, దాన్ని తిరస్కరించటం తిరస్కారానికి ఆనవాలు అని సృష్టంగా చెప్పదలిచాము. ప్రవక్త అనుయాయులైన ముస్లిం ప్రజానీకం ఈ ఘోర అపరాధానికి దూరంగా ఉండాలన్నదే మా అభిమతం).

ప్రశంసలు, పొగడ్తలన్నీ అల్లాహ్‌కే శోభిస్తాయి. శ్రేయాలు సదాచార సంపన్నులు, భయభక్తులు గల వారి కొరకే. మరియు సద్వర్తనులైన దాసులు, అతని ప్రవక్తలు, ఇంకా సకల లోకాల కొరకు కారుణ్యంగా ప్రభవింపచేయబడిన ప్రియ ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వ సల్లం) పై శాంతీ శుభాలు వర్షించుగాక! వాస్తవానికి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రభవనం సమస్త మానవాళి కొరకు సాక్ష్యం! ఆయనపై ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై, ఆయన అనంతరం దైవ గ్రంథాన్ని దైవప్రవక్త సంప్రదాయాన్ని కంటికి రెప్పలా కాపాడేందుకు ఉనికిలోకి తీసుకురాబడే సజ్జనులందరిపై దేవుడు శాంతీశ్రేయాలను కురిపించుగాక!!

ధర్మాధర్మాలు, సత్యాసత్యాలను నిర్ధారించే ప్రమాణాలు (లేక సూత్రాలు) ప్రధానంగా నాలుగు (4) అన్న విషయంలో పూర్వపు పండితులు, తరువాయి పండితుల మధ్య ఏకాభిప్రాయం ఉంది –

మొదటిది : దైవగ్రంథమైన ఖుర్‌ఆన్‌. దీనిలో ముందు నుంచి గానీ, వెనుక నుంచి గానీ అధర్మం జొరబడజాలదు.

రెండవది : మహాప్రవక్త ముహమ్మద్‌ (సల్లలాహు అలైహి వ సల్లం) వారి సంప్రదాయం. ఎందుకంటే ఆయన ఏది చెప్పినా తన మనోకాంక్షల కనుగుణంగా చెప్పరు. పైగా ఆయన చెప్పే ప్రతి ప్రవచనం దైవ సంకేతానికి (వహీ)కి లోబడి ఉంటుంది.

మూడవది : ముస్లిం సమాజానికి చెందిన పండితుల ఉమ్మడి అభిప్రాయం.

నాలుగవది : అంచనా కొంత మంది ఉలమా (పండితులు) “అంచనాతో ఏకీభవించరు. అంచనా ‘ప్రమాణబద్ధం కాదని వారి వాదన. అయితే అంచనాకి ఆధారభూతమైన అంశాలన్నీ ఎన్నదగ్గవైన పక్షంలో దాని ప్రామాణికతలో సందేహానికి తావుండదని అత్యధిక మంది పండితులు అభిప్రాయపడతారు. దీనికి సంబంధించిన నిదర్శనాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. అవి, ఎంత ప్రముఖమైన నిదర్శనాలంటే ఇక్కడ వాటిని పేర్కొనవలసిన అవసరం కూడా లేదు. అసలు చర్చనీయాంశం కూడా ఇది కాదు. మా చర్చనీయాంశం ప్రవక్త విధానాన్ని అనుసరించటం అవశ్యం అన్నదే.

మొదటి (అసలు) ప్రాతిపదిక దైవగ్రంథం :

విశ్వ ప్రభువు తరపున అవతరింపజేయబడిన పవిత్ర ఖుర్‌ఆన్‌లోని అనేక వచనాలలో చెప్పబడిన దాని ప్రకారం మనం ఈగ్రంధాన్ని అనుసరించటం విధి అవశ్యం. అలాగే అది నిర్ణయించిన హద్దులను అతిక్రమించకుండా ఉండటం అనివార్యం. విశ్వప్రభువు అయిన అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు :

“ప్రజలారా! మా ప్రభువు తరపు నుండి మీ పై అవతరింపజెయ్యబడిన దానిని అనుసరించండి. మీ ప్రభువును కాదని ఇతర సంరక్షకులను అనుసరించకండి – కాని మీరు హితబోధను స్వీకరించటం అరుదు” (అల్‌ ఆరాఫ్‌-39)

అల్లాహ్‌ ఇంకా ఇలా సెలవిస్తున్నాడు :

“మేము ఈ (గ్రంథాన్ని అవతరింపజేశాము. ఇది శుభాలు కల గ్రంధం. కనుక మీరు దీనిని అనుసరించండి. భయభక్తుల వైఖరిని అవలంబించండి. తద్వారా మీరు కనికారానికి నోచుకునే అవకాశముంది”. (అల్‌అన్‌ఆమ్‌ – 155)

వేరొక చోట ఏమనబడిందో చూడండి :

“మీవద్దకు అల్లాహ్‌ తరపు నుండి కాంతి వచ్చేసింది. సత్యం వైపునకు మార్గం చూపే ఒక గ్రంథం కూడా. దాని ద్వారా అల్లాహ్‌ తన సంతోషం పొందగోరే వారికి శాంతిపథాలను చూపుతాడు. తన ఇచ్చానుసారం వారిని చీకట్ల నుండి వెలికి తీసి వెలుగు వైపుకు తీసుకువస్తాడు. ఇంకా వారిని రుజుమార్గం వైపుకు నడుపుతాడు.” (అల్‌ మాయిద-15, 16)

పరమోన్నతుడైన అల్లాహ్‌ ఇంకా ఈ విధంగా అంటున్నాడు: –

“తమ ముందుకు హితబోధ వచ్చినపుడు, దానిని విశ్వసించకుండా తిరస్కరించిన వారు వీరే. కాని యదార్ధం ఏమిటంటే, ఇది ఒక శక్తిమంతమైన గ్రంథం. అసత్యం దాని మీదకు ముందు నుండీ రాజాలదు, వెనుక నుండీ రాజాలదు. వివేకవంతుడు, స్తుతిపాత్రుడూ అయిన దేవుడే అవతరింపజేసిన గ్రంథం ఇది”. (హామీమ్‌-అస్‌-సజ్దా  : 41, 42)

పరమ ప్రభువైన అల్లాహ్‌ ఈ విధంగా కూడా సెలవిచ్చి ఉన్నాడు :

“(ఓ ముహమ్మద్‌-(సల్లలాహు అలైహి వ సల్లం)) నీవు వారితో చెప్పు. “మిమ్మల్నీ, ఇంకా ఎవరెవరి వద్దకు చేరుతుందో వారందరినీ నేను హెచ్చరించడానికి గాను ఈ ఖుర్‌ఆన్‌ నా వద్దకు వహీ” ద్వారా పంపబడింది.” (అల్‌ అన్‌ఆమ్‌ -19)

వేరొకచోట అవతరించిన దైవాదేశం ఇది :

“సర్వ మానవులకు ఇదొక సందేశం. తద్వారా వారిని హెచ్చరించాలనీ” (ఇబ్రాహీమ్‌-52)

దివ్యఖుర్‌ఆన్‌ లో ఇంచుమించు ఇదే భావాన్ని స్ఫురింపజేసే ఆయతులు ఇంకా అనేకం ఉన్నాయి. ఇవిగాక మరికొన్ని హదీసులు కూడా దైవగ్రంథమైన ఖుర్‌ఆన్‌ను అనుసరించటం అవశ్యమని ధృవీకరిస్తున్నాయి. ఎవరయితే ఖుర్‌ఆన్‌ ఆదేశాలను శిరసావహించాడో అతడు సన్మార్గం పొందాడనీ మరెవరయితే ఖుర్‌ఆన్‌ పట్ల విముఖత చూపాడో అతడు మార్గభ్రష్టతకు లోనయ్యాడని కూడా ఈ హదీసుల ద్వారా రూఢీ అవుతోంది.

అంతిమ హజ్‌ యాత్ర సందర్భంగా మహాప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారు పలికిన నిర్ణయాత్మకమైన ప్రవచనాలు కూడా ఈ విషయాన్ని ధృవపరుస్తున్నాయి. ఆ సందర్భంగా ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు:

“మీ మధ్య ఆ వస్తువును వదలి వెళుతున్నాను. మీరు దానికి కట్టుబడి ఉన్నంతవరకు మీరు ఎట్టి పరిస్థితిలోనూ మార్గభ్రష్టులవరు. అదే దైవ గ్రంథం.” (ముస్లిం)

‘సహీహ్‌ ముస్లింలో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి మరొక ప్రవచనం ఇలా ఉల్లేఖించబడింది.

మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రబోధించారని జైద్‌బీన్‌ అర్‌ఖమ్‌ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు: నేను మీ మధ్య రెండు అమూల్యమైన, స్వఛ్చమైన వస్తువులను వదలి వెళుతున్నాను. ఆ రెండింటిలో మొదటిది, దైవగ్రంథం. అందులో మార్గదర్శకత్వం ఉంది, కాంతి ఉంది. కాబట్టీ మీరు దైవగ్రంథాన్ని గట్టిగా పట్టుకోండి. దానిపై స్థిరంగా ఆచరించండి. రెండవది : నా ఇంటి వారలు. నేను మీకు నా ఇంటివారల గురించి అల్లాహ్‌కు జ్ఞాపకం చేస్తాను. నేను మీకు నా ఇంటివారలగురించి అల్లాహ్‌కు జ్ఞాపకం చేస్తాను.”

మరో ఉల్లేఖనంలో “ఖుర్‌ఆన్‌ గురించి” అని ఉంది. ఖుర్‌ఆన్‌ అంటే అల్లాహ్ త్రాడు అన్నమాట. ఈ త్రాటిని ఎవరు గట్టిగా పట్టుకుంటారో వారు సన్మార్గాన్ని పొందారు. మరెవరు దాన్ని వదిలేశారో వారు మార్గం తప్పిపోయారు. ఈ అంశంపై ఎన్నో హదీసులు ఉన్నాయి. ఈ విషయంలో ఈ ఆధారాలు, నిదర్శనాలను కూలంకషంగా చర్చించవలసిన అవసరం లేదు. మహాప్రవక్త ప్రియ సహచరుల రిజ్వానుల్లాహి అలైహిమ్‌ అజమయీన్‌) మొదలుకుని విద్వాంసులు, విశ్వాసుల వరకు అందరూ ఒక విషయంలో ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. అదేమంటే దైవగ్రంథానుసారం మసలుకోవటం అవశ్యం. అంతేకాదు, ధార్మిక వ్యవహారాలన్నీ దైవగ్రంథంతో పాటు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సంప్రదాయానికి లోబడి పరిష్కరించబడతాయి, పరిపాలనా వ్యవహారాలు సయితం దైవగ్రంథానికి, దైవప్రవక్త విధానానికి కట్టుబడి అమలవుతాయి.

రెండవ ప్రాతిపదిక దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) విధానం (సున్నత్‌)

రెండవ ప్రామాణికమైన ప్రాతిపదిక దైవప్రవక్త(సల్లలాహు అలైహి వ సల్లం) గారి విధానం. అంటే ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) గారి ప్రవచనాలు, ఆచరణలు లేక ప్రసంగాలు. అయితే ఇవన్నీ విశ్వసనీయ వర్గాల ద్వారా ఉల్లేఖించబడినవై ఉండాలి. ఆ విధంగా ధృవీకరించబడినవన్నీ “హదీసు”గా పరిగణించబడతాయి. దీన్నే సున్నత్‌ (మహాప్రవక్త విధానం, సంప్రదాయం)గా వ్యవహరిస్తాడు.

మహాప్రవక్త గారి ప్రియసహచరుల నుండి నేటి పండితుల వరకూ- అందరూ ఈ సిసలైన (హదీసు) ప్రాతిపదికను దృఢంగా విశ్వసించడమేగాక దీనిని తమ ‘స్వీకృతికి కొలబద్దగా పరిగణిస్తారు. ముస్లిం సమాజానికి దీని ప్రకారం శిక్షణను ఇస్తారు. ఇంకా ఈ “విద్య”ను ప్రాచుర్యంలోకి తెచ్చే ఉద్దేశ్యంతో వారు గ్రంథాలను సంకలనం చేశారు. ఫికహ్‌ సూత్రాలను, హదీసు పరిభాషను వివరించే గ్రంథాలలో దీనిని ప్రముఖంగా విశదీకరించారు.

“సున్నత్‌ (ప్రవక్త విధానం) ప్రామాణికమైనదనే విషయమై ఎన్ని ఆధారాలు ఉన్నాయంటే, అసలు వాటిని గణించటమే గగనమైపోతుంది. వాటిలో కొన్ని ఆధారాల ప్రస్తావన ఖుర్‌ఆన్‌లోనూ ఉంది. అందులో మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) గారికి విధేయత చూపి, ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) అడుగుజాడలలో నడుచుకోవలసిందిగా ఆదేశించబడింది. ఈ ఆదేశం ఆయన సమకాలికులకు వర్తించినట్లుగానే ఆయన అనంతరం వచ్చే వారందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే ఆయనే అంతిమ దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం). కాబట్టి ఆయన అనుచరులందరూ ప్రళయదినం వరకూ ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) కు విధేయులై ఉండవలసి ఉంది. ఎందుకంటారేమో? మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)గారు దివ్యఖుర్‌ఆన్‌కు తాత్పర్యం వంటివారు. ఆయన మాటలుగానీ, చేతలుగానీ, ఆయన ప్రసంగాలు గానీ – అన్నీ దివ్యఖుర్‌ఆన్‌లోని ఆయతులను ప్రతిబింభిస్తాయి.

‘సున్నతే’ గనక లేకుంటే నమాజులో ఎన్నిరకతులున్నాయో, వాటి స్వరూప స్వభావాలేమిటో, అవసరాలేమిటో ప్రజలకు తెలిసేది కాదు. అలాగే ఉపవాసాలు, జకాత్‌, హజ్‌ వంటి విధుల రూపురేఖలను కూడా ప్రజలు తెలుసకోలేకపోయేవారు. అదే విధంగా సున్నత్‌ లేకుంటే ప్రజలకు మంచిని పెంపొందించే, చెడులను అరికట్టే ఆజ్ఞల తీరుతెన్నులు బోధపడేవి కావు. లావాదేవీలేమిటో, ధర్మాధర్మాలేమిటో, అల్లాహ్‌ విధించిన హద్దులు, కట్టుబాట్లు ఏమిటో కూడా నెలకొల్పబట్టి సులువుగా అర్ధం చేసుకోగలుగుతున్నారు.

ఈ సందర్భంగా దివ్యఖుర్‌ఆన్‌లోని పలు వాక్యాలను ఉదాహరించి మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) గారి విధానాన్ని అనుసరించటం అనివార్యమని నిరూపించవచ్చు. మచ్చుకు అలి ఇమ్రాన్‌ సూరాలో అల్లాహ్‌ ఇలా ఆదేశించాడు

“అల్లాహ్‌కూ, ప్రవక్తకూ విధేయత చూపండి. మీరు కరుణింపబడే అవకాశం ఉంది.” (ఆలి ఇమ్రాన్‌ : 132)

“నిసా” సూరాలో ఈ విధంగా సెలవీయబడింది :

“ఓ విశ్వసించిన వారలారా | అల్లాహ్‌కు, ప్రవక్తకూ, మీలో అధికారం అప్పగించబడిన పెద్దలకు విధేయత చూపండి. మీ మధ్య ఏ విషయంలోనయినా వివాదం తల ఎత్తితే దాన్ని అల్లాహ్‌ మరియు ప్రవక్తకు నివేదించండి. మీరు నిజంగానే అల్లాహ్‌ మరియు అంతిమదినం మీద విశ్వాసం గలవారైతే (మీరు ఇలాగే చేయాలి). ఇదే సరైన పద్ధతి. ఫలితాన్ని బట్టి కూడా ఇదే ఉత్తమమైనది.” (అన్‌ నిసా : 59)

“నిసా” సూరాలోనే వేరొక చోట పరమ ప్రభువు ఇలా ఆదేశిస్తున్నాడు :

“ప్రవక్తకు విధేయత చూపిన వాడు వాస్తవంగా అల్లాహ్‌కు విధేయత చూపినట్లే. కాని ఎవడయితే విముఖుడయ్యాడో అటువంటి వారిపై మేము నిన్ను కావలివానిగా చేసి పంపలేదు.” (నిసా సూరా, ఆయత్‌ నెం. 80)

మరి మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) గారి విధానం మనకు ప్రమాణబద్ధం కాదనుకుంటే, (లేక) అది సురక్షితంగా లేదని ఊహించుకుంటే, ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) గారికి విధేయత చూపటం ఎలా సాధ్యమవుతుంది? ఏదైనా విషయంలో వివాదం తలెత్తినప్పుడు దాన్ని దైవగ్రంథం మరియు దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) విధానం వైపుకు మరలించటం ఎలా సంభవమవుతుంది?

ఒకవేళ మన ఆలోచనలు గనక ఇలా వక్రంగా సాగినట్లయితే ఇంకా ఎన్నో భయంకరమైన సందేహాలు పొడసూపుతాయి – అంటే అసలు ఉనికిలో లేని విషయాల గురించి అల్లాహ్‌ తన దాసులకు ఆదేశాలిచ్చాడన్నమాట! ఇదంతా మిధ్య అన్న మాట!! (అల్లాహ్ మన్నించుగాక!)

అల్లాహ్‌ అన్‌ నహ్ల్‌ సూరాలో ఏమని అంటున్నాడో చూడండి :

“ఈ జ్ఞాపికను నీ (ప్రవక్త) పై కూడా అవతరింపజేశాము. నీవు ప్రజల ముందు వారి కోసం అవతరింపజేయబడిన ఉపదేశాన్ని సృష్టంగా వివరించటానికి, (స్వయంగా) ప్రజలు కూడా ఆలోచించటానికి.” (అన్‌ నహ్ల్‌ 44)

అన్‌ నహ్ల్‌ సూరాలోనే మరోచోట ఇలా అనబడింది :

“మేము ఈ గ్రంథాన్ని నీపై ఎందుకు అవతరింపజేశామంటే, వారు గురి అయివున్న విభేదాల యదార్దాన్ని నీవు వారికి స్పష్టం చేయాలని. ఈ గ్రంథం తనను విశ్వసించే వారి కోసం మార్గదర్శకత్వంగానూ, కారుణ్యంగానూ అవతరించింది.” (నహ్ల్‌ సూరా, ఆయత్‌ నెం. 64)

ఆలోచించండి! మహనీయ ముహమ్మద్‌ (సల్లలాహు అలైహి వ సల్లం) వారి సున్నత్‌ ఉనికిలో లేని పక్షంలో, ప్రవక్తగారి సున్నత్‌ ప్రమాణబద్ధం కాని పక్షంలో దైవగ్రంథాన్ని విడమరచి చెప్పే బాధ్యతను అల్లాహ్‌ తన అంతిమ ప్రవక్తకు ఎందుకు అప్పగిస్తాడు?

దివ్యఖుర్‌ఆన్‌లోని నూర్‌ సూరాలో కూడా అల్లాహ్‌ ఇదే విధంగా ఆదేశిస్తున్నాడు :

(ఓ ముహమ్మద్‌! వారితో ఇలా అను) “అల్లాహ్‌కు విధేయులు కండి, దైవప్రవక్త ఆదేశాలను పాటించండి. కాని ఒకవేళ మీరు విముఖలవుతే, బాగా తెలుసుకోండి, దైవప్రవక్తపై పెట్టబడిన కర్తవ్యభారం వరకే అతను బాధ్యుడు. మీపై మోపబడిన కర్తవ్య భారానికి మీరు బాద్యులు. దైవప్రవక్తకు విధేయులైతే మీరే మార్గదర్శకత్వం పొందుతారు. లేకపోతే స్పష్టంగా ఆజ్ఞను అందజేయటానికి మించి ఎక్కువ బాధ్యత దైవప్రవక్తపై లేదు.” (నూర్‌ సూరా, ఆయత్‌ నెం. 54)

నూర్‌ సూరాలోనే వేరొక చోట విశ్వ ప్రభువైన అల్లాహ్‌ ఆజ్ఞాపించాడు :

“నమాజును స్థాపించండి, జకాత్‌ ఇవ్వండి, దైవప్రవక్తకు విధేయులుగా ఉండండి. తద్వారా మీరు కరుణింపబడే అవకాశం ఉంది.”(నూర్‌ సూరా, ఆయత్‌ నెం. 56)

అల్‌ ఆరాఫ్‌ సూరాలో అల్లాహ్ ఇలా ఆదేశించాడు :

ఓ ముహమ్మద్‌! ఇలా ప్రకటించు – “మానవులారా! నేను మీ అందరి వైపుకు వచ్చిన అల్లాహ్‌ సందేశహరుణ్ణి. ఆయన భూమ్యాకాశాల సామ్రాజ్యానికి ప్రభువు. ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఆయనే జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఆయనే మృత్యువును ఇస్తాడు. కనుక విశ్వసించండి అల్లాహ్‌ను, ఆయన పంపిన నిరక్షరాస్యుడైన ప్రవక్తను – అతను అల్లాహ్‌ను, ఆయన సూక్తులను విశ్వసిస్తాడు – అతనిని అనుసరించండి. మీరు సరియైన మార్గం పొందే అవకాశం ఉంది.” (అల్‌ ఆరాఫ్‌ : 158)

మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు విధేయులై ఉంటూ, ఆయన విధానాన్ని అనుసరించినపుడే మనకు సన్మార్గం ప్రాప్తిస్తుందని, దైవ కారుణ్యం అవతరిస్తుందని ఈ ఆయతుల ద్వారా స్పష్టంగా బోధపడుతున్నది. దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)కు విధేయత చూపనిదే సరైన మార్గం ఎలా లభిస్తుంది? కరుణింపబడే అవకాశం ఎక్కడుంటుంది? సున్నత్‌ (ప్రవక్త విధానం) సరైంది కాదనలేక అది ఉల్లేఖించబడిన వైనం నమ్మశక్యం కాదనో వంకలు పెట్టినప్పుడు మానవుడు మార్గదర్శకత్వానికి ఎలా పాత్రుడు కాగలుగుతాడు ?

సూరె నూర్‌లో అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు :

“దైవప్రవక్త ఆజ్ఞను ఉల్లంఘించేవారు, తాము ఏదైనా ఉపద్రవంలో చిక్కుకు పోతామేమో అనీ, తమపై బాధాకరమైన శిక్ష ఏదైనా అవతరిస్తుందేమో అనీ భయపడాలి.”(అన్‌ నూర్‌ – 68)

హష్ర్  సూరాలో దైవాదేశం ఇలా ఉంది.

“దైవప్రవక్త మీకు ఇచ్చినదాన్ని తీసుకోండి, ఆయన మిమ్మల్ని నిషేధించిన దాని జోలికి పోకండి.” (అల్‌ హష్ర్ – 7)

ఈ భావార్థం గల ఆయతులు ఇంకెన్నో ఉన్నాయి. వీటన్నింటిలోనూ చెప్పబడిన విషయం ఒక్కటే – అదే, మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారికి విధేయులై ఉండటం, ఆయనను అనుసరించటం, ఆయన ప్రసాదించిన దానిని స్వీకరించటం, ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటం అవశ్యం, అనివార్యం అని ఈ ఆయతులు నొక్కి పలుకుతున్నాయి.

దైవగ్రంథం మరియు దైవప్రవక్త విధానం – ఈరెండూ ఒకదానితో మరొకటి పెనవేసుకుపోయిన మూలాధారాలు. ఒకటి లేకుండా ఇంకొకటి లేదు. వీటిలో ఏ ఒక్కదానిని కాదన్నా రెండవదానిని కూడా కాదన్నట్లే. వాస్తవానికి ఇది ధిక్కారం. అవిశ్వాసం కిందికి వస్తుంది. ఇంకా ఈ ధిక్కార వైఖరి మార్గ విహీనతకు, మార్గభ్రష్టతకు దారితీస్తుంది. ఈ ధిక్కార పోకడకు పాల్పడిన వ్యక్తి విశ్వాసుల, పండితుల పరిధి నుండి వెలివేయబడిన వాడవుతాడు. (అంతే కాదు, దైవప్రవక్త – (సల్లల్లాహు అలైహి వ సల్లం)-విధానాన్ని ప్రమాణబద్దమైనదిగా ఒప్పుకోనంతవరకూ నేనంటాను. పవిత్ర ఖుర్‌ఆన్‌ దైవగ్రంథం అని అసలు మనకు చెప్పింది ఎవరు?

హజ్రత్‌ ముహమ్మద్‌ (సల్లలాహు అలైహి వ సల్లం)గారే కదా! మరి ఆయనగారి హదీసులు, విధానాలే నమ్మశక్యం కానపుడు ఖుర్‌ఆన్‌ మాత్రం దైవగ్రంథం అని ఎలా నిరూపితం అవుతుంది? (దైవం మన్నించుగాక) అన్న ప్రశ్న ఈ సందర్భంగా ఉత్పన్నమవుతుంది.)

మహాప్రవక్త ముహమ్మద్‌ (సల్లలాహు అలైహి వ సల్లం)కు విధేయత చూపటం, ఆయన తీసుకు వచ్చిన వాటి ప్రకారం ఆచరించటం అవశ్యమవటం, ఆయన పట్ల అవిధేయత హరామ్‌ అవటం – ఇవన్నీ ప్రామాణికమైన హదీసుల ద్వారా రూఢీ అయినవి. పైగా ఈ ధర్మములు అందరికీ వర్తిస్తాయి. వారు మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) గారి సమకాలీకులైనా, లేక ఆయన తదనంతరం ప్రళయదినం వరకు పుట్టేవారైనా – అందరికీ యథాతథంగా వర్తిస్తాయి. ఆ హదీసులలో మచ్చుకు కొన్ని ఇక్కడ పేర్కొంటున్నాము-

మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచించారని హజ్రత్‌ అబూహూరైర (రది అల్లాహు అన్హు) చెప్పారు: “ఎవరు నాకు విధేయత చూపారో వారు అల్లాహ్‌కు విధేయత చూపారు. మరెవరు నా యెడల అవిధేయులుగా ఉన్నారో వారు అల్లాహ్‌ యెడల అవిధేయులయ్యారు.”

2. సహీహ్‌ బుఖారీలో దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వారు ప్రబోధించారని హజ్రత్‌ అబూహురైర (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు.

“నా అనుచర వర్గీయుల్లో నన్ను ధిక్కరించిన వారు తప్ప అందరూ స్వర్గంలో ప్రవేశిస్తారు.” ఓ దైవప్రవక్తా! మిమ్మల్ని ధిక్కరించిన వాడు అంటే ఎవరు? అని ప్రశ్నించగా, “నాకు విధేయుడై ఉన్నవాడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. మరి నా యెడల అవిధేయుడుగా మెలగినవాడు నన్ను ధిక్కరించిన వాడవుతాడు” అని అన్నారు.

3. అహ్మద్‌, అబూదావూద్‌ మరియు హాకిమ్‌లు ప్రామాణికమైన ఆధారాలతో క్రింది హదీసును పేర్కొన్నారు – వారు ఇలా వ్రాశారు :

ప్రవక్త మహనీయులు (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రవచించారని మఖ్ధమ్‌బిన్‌ మాదీకరబ్‌ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

“నిస్ససందేహంగా నాకు గ్రంథం వొసగబడింది. గ్రంథంతో పాటు దాని ఉపమానం (అంటే హదీసు. ఇది కూడా అల్లాహ్ సంకేతం ప్రకారమే అయి ఉంటుంది.) కూడా ప్రసాదించబడింది. జాగ్రత్త! అతి చేరువకాలంలోనే కడుపు నిండిన మనిషి ఒకడు బయలుదేరాడు. అతడు హాయిగా మెత్తని దిండుపై కూర్చుని – మీరు ఈ ఖుర్‌ఆన్‌ను మీ కొరకు అవసరమైనదని భావించండి. ఇందులో మీరు ధర్మసమ్మతమైనది (హలాల్‌)గా గ్రహించిన దానిని ధర్మసమ్మతంగా భావించండి. ఇందులో అధర్మమైనది (హరామ్‌)గా గ్రహించిన దానిని అధర్మమైనదిగా తలపోయండి” అని అంటాడు”.

(అంటే మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తరువాత కాలంలో జన్మించే వారిలో కొంతమంది; “మీకు ఖుర్‌ఆన్‌ మాత్రం చాలు అనే నినాదం విని హదీసులను త్రోసిపుచ్చటం మొదలెడతారు. ఉదాహరణకు : పాకిస్తాన్‌లో అబ్దుల్లా చక్‌డాల్వీ మరియు అతని మానస పుత్రులైన గులాం అహ్మద్‌ పర్వేజ్, డా. ఫజ్లుర్రహ్మాన్ తదితరులు ఇలాంటి నినాదమే ఇచ్చి మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) సున్నత్‌ను త్రోసిరాజన్నారు) – అనువాదకుడు

అబూదావూద్‌, ఇబ్నుమాజ యెన్నదగ్గ ఆధారాలతో క్రింది ఉల్లేఖనాన్ని పొందుపరచారు;

మహనీయ ముహమ్మద్‌ (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రవచించారని తన తండ్రి చెప్పినట్లు హజ్రత్‌ ఇబ్నె అబీ రాఫె చెప్పారు – “మీలో ఒకడు తప్పనిసరిగా ఇలా ఉంటాడు, అతడు తన దిండుకు ఆనుకుని ఆసీనుడవుతాడు. అతని వద్దకు నా ఆజ్ఞలలోని ఒక ఆజ్ఞ వస్తుంది. ఫలానా పనిని చేయాలనో లేక చేయకూడదనో నేను అందులో ఆజ్ఞాపించి ఉంటాను. అప్పుడతను, “అదేం మాకు తెలీదు (ఎందుకంటే) దైవగ్రంథంలో మా దృష్టికి వచ్చిన ఆజ్ఞను మాత్రమే మేము శిరసావహిస్తాము. అని అతనంటాడు”.

4. వేరొక ఉల్లేఖనంలో ఇలా వివరించబడింది. దానిని హసన్‌ బిన్‌ జాబీర్‌ గారు మఖ్‌దామ్‌ బిన్‌ మాదీకరబ్‌ నుండి సంగ్రహించారు : ఆయన ఇలా అంటున్నారు –

ఖైబర్‌ విజయం వరించిన నాడు ప్రవక్త మహనీయులవారు కొన్ని వస్తువులను హరామ్‌ (నిషిద్ధం)గా ఖరారు చేశారు. ఆ సందర్భంగానే ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా పలికారు – “త్వరలోనే మీలోని ఒకడు నన్ను ధిక్కరించవచ్చు. వాడు హాయిగా ఆనుకుని కూర్చుని ఉంటాడు. నా హదీసును ఎవరయినా వినిపిస్తే ‘మీకూ-మాకూ మధ్య ఖుర్‌ఆన్‌ ఎలాగూ ఉంది కదా! అందులో దేనిని హలాల్‌గా పొందుతామో దానినే ‘హలాల్‌ పరిగణిద్దాము. మరి దేనిని “’హరామ్ గా  పొందుతామో దానిని హరామ్‌గా భావిద్దాము’ అని అతను అంటాడు. జాగ్రత్త! దైవప్రవక్త దేనిని హరామ్‌ (నిషిద్ధం)గా చేశారో అది అల్లాహ్ హరామ్‌గా చేసిన దానితో సమానం.”

తరచూ మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వారు తన ప్రియ సహచరులను ఉద్దేశించి, “మీలో ఇక్కడ ఉన్నవారు ఇక్కడలేనివారికి” విషయాన్ని చేరవేయండి అని తాకీదు చేసేవారు. వారితో ఇంకా ఇలా అంటూ ఉండేవారు: “విషయాన్ని వినే వారిలో చాలామంది విషయాన్ని చేరవేసిన వారికన్నా బాగా గుర్తు పెట్టుకునే వారై ఉండవచ్చు. వివేకసంపన్నులై ఉండవచ్చు”. అంతిమ హజ్‌ యాత్ర సందర్భంగా కూడా మహనీయ ముహమ్మద్‌ (సల్లలాహు అలైహి వ సల్లం) గారు అరఫా రోజున తన సహచరులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇలా అన్నారని సహీహ్‌ హదీసుల ద్వారా తెలుస్తోంది

“ఇక్కడున్నవారు ఇక్కడలేని వారికి (నా సందేశాన్ని) అందజేయండి. ఎందుకంటే వినే వారిలో చాలామంది అందజేసిన వారికన్నా ఎక్కువ గుర్తు పెట్టుకోవచ్చు. ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) హదీసును విన్నవారిపై ఈ బాధ్యత పడి ఉండకపోతే, ప్రళయదినం వరకు ఆయన హదీసు మిగిలి ఉండకపోతే అసలు ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) దానిని ప్రచారం చేసే బాధ్యతనే మనకు అప్పగించేవారు కాదు. దీన్ని బట్టి బోధపడేదేమిటంటే ప్రవక్త మహనీయ (సల్లలాహు అలైహి వ సల్లం) వారి నోట ఎవరయితే హదీసును విన్నారో, ఇంకా ఎవరెవరి వద్దకయితే స్పష్టమైన ఆధారాల ద్వారా హదీసు చేరిందో వారందరిపై దాన్ని ఆచరించే, ప్రచారం చేసే బాధ్యత పడుతుంది. ఆ విధంగా అది వారందరి కొరకు “హుజ్జత్‌” అవుతుంది.

ప్రవక్తగారి ప్రియ సహచరులు (సహాబా-రది అల్లాహు అన్హుమ్) ప్రవక్తగారి మాటలను, చేతలను కేవలం తమ వరకే గుర్తు పెట్టుకోకుండా వారు తమ అనుయాయులకు హెచ్చుతగ్గులు లేకుండా వాటిని అందజేశారు. మరి ఆ అనుయాయులు తమ తరువాతి తరం వారికి ఈ అమానతును సురక్షితంగా అప్పగించారు. ఈ విధంగా ఒక తరం వారు ఇంకొక తరం వారికి వారసత్వంగా ఈ అమానతును యధాతథంగా అందజేసుకుంటూ వచ్చారు. ఉలమా (పండితులు) ఈ సున్నత్‌ను గ్రంథస్థం చేశారు. అత్యంత ప్రామాణికమైన ఉల్లేఖనాలను బలహీనమైన ఉల్లేఖనాల నుండి వేరు చేశారు. ప్రామాణికమైన హదీసులేవో, బలహీనమైనవి ఏవో పరీక్షించి నిర్ధారించడానికి కొన్ని సూత్రాలను సైతం క్రోడీకరించారు.

(ఈ ప్రక్రియలో భాగంగానే హదీసు సూత్రాలు – ముస్తలాహుల్‌ హదీస్‌, అస్మావుర్రిజాల్‌ యొక్క శాశ్వతమైన విద్యలు ఉనికిలోకి వచ్చాయి. ఈ అంశాల ఆధారంగా అనేక గ్రంథాలు రచించబడ్డాయి. ఆఖరికి బలహీనమైన హదీసుల గురించి, హదీసు అంశాల గురించి కూడా గ్రంథాలు వెలువడ్డాయి –  అనువాదకుడు).

పండితుల, హదీసువేత్తల నిరంతర కృషి ఫలితంగా బుఖారీ షరీఫ్‌, ముస్లిం షరీఫ్‌లతో పాటు మరెన్నో హదీసు గ్రంథాలు ఆవిష్కరించబడ్డాయి. ఆ విధంగా హదీసులు సురక్షితం గావించబడ్డాయి. ఏ విధంగానైతే పరమప్రభువైన అల్లాహ్‌ తన గ్రంథాన్ని (ఖుర్‌ఆన్‌ని) నాస్తికుల, మీథ్యావాదుల ప్రక్షిప్తాల నుండి, స్వార్ధపరుల కల్తీ బారి నుండి కాపాడాడో అదే విధంగా హదీసు వేత్తలు హదీసుల పరిరక్షణ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఖుర్‌ఆన్‌ కాపాడే విషయమై అల్లాహ్‌ స్వయంగా ఖుర్‌ఆన్‌లోనే ఈ విధంగా సెలవిచ్చాడు: .

“మేము ఈ ఖుర్‌అన్‌ను అవతరింజేశాము. మరి స్వయంగా మేమే దీనిని  కాపాడుతాము”.

మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) గారి ప్రవచనాలు మరియు సున్నత్‌ కూడా ఇదే కోవకు చెందినది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. (ఇవి కూడా అల్లాహ్ సంకేతానుసారమే అవతరింపజేయబడ్డాయి). అల్లాహ్ తన గ్రంథాన్ని రక్షించినట్లే సున్నత్‌ను కూడా రక్షించాడు.

అల్లాహ్‌ ఈ లక్ష్యం కొరకు ఉలమా (పండితుల) సమూహాన్ని ఉనికిలోకి తెచ్చి, హదీసులను సంరక్షించే సద్బుద్ధిని వారికి వొసగాడు. ఈ పండితులు నిరంతరం హదీసులకు రక్షా కవచంలా నిలబడ్డారు. మిధ్యావాదులు హదీసులలో ప్రక్షిప్తాలకు పాల్పడినప్పుడల్లా వాటిని ఖండించారు. అజ్ఞానంతో, మిడిమిడి జ్ఞానంతో ఎవరు హదీసులకు వక్రభాష్యాలు చెప్పినా వాటిని ఖండించారు. అజ్ఞానులు ఎప్పుడు ఈ హదీసులలో బూటకపు ఉల్లేఖనాలను మిళితం చేసినా ఉలమా వాటిని ప్రామాణికమైన హదీసుల నుండి వేరుపరచారు. ఆ విధంగా ఇది కూడా దైవికంగా జరిగిన ఏర్పాటు అనటంలో సందేహం లేదు. ఎందుకంటే అల్లాహ్‌ హదీసులను తన గ్రంథం యొక్క తాత్పర్యంగా చేశాడు. దివ్యఖుర్‌ఆన్‌లో ప్రతి విషయాన్ని కూలంకషంగా చర్చించటం సాధ్యం కాదు. అయితే హదీసులలో వాటి వివరాలు వస్తాయి. ఉదాహరణకు :- పాలు తాపే ఆదేశాలు, వారసత్వ పంపిణీకి సంబంధించిన వ్యవహారాలు, వివాహాది కార్యాలలోని ధర్మాధర్మాలు మొదలగునవి.

దీంతో పాటు మరెన్నో ఆదేశాలున్నాయి. సహీహ్‌ హదీసులలో వాటి ప్రస్తావన ఉంది. కాని ఖుర్‌ఆన్‌లో వాటి ప్రస్తావన లేదు.

ప్రవక్త సహచరులు, వారి తరువాత వారు మరియు ఇస్లామీయ విద్వాంసులు దృష్టిలో సున్నత్‌ ఔన్నత్యం

సహీహ్‌ హదీసులలో హజత్‌ అబూహురైర (రది అల్లాహు అన్హు)ఉల్లేఖనం ప్రకారం:

మహనీయ ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వ సల్లం) పరమపదించిన తరువాత అరేబియాలోని కొన్ని తెగలు ధర్మభ్రష్టమయ్యాయి. ఈ పరిస్థితిని గమనించిన హజ్రత్‌ అబూబకర్‌ (రది అల్లాహు అన్హు) ఇలా అన్నారు: “అల్లాహ్ సాక్షి! నమాజ్‌ మరియు జకాత్‌ల మధ్య తేడా కనబరచిన వానికి వ్యతిరేకంగా ధర్మయుద్ధం చేస్తాను”. ఈ మాట విన్న హజ్రత్‌ ఉమర్‌, “మీరు వారికి వ్యతిరేకంగా ఎలా పోరాడుతారు? వాస్తవానికి దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వారు ఈ విధంగా చెప్పి ఉన్నారు – “ప్రజలు లా ఇలాహ ఇల్లల్లాహ్‌ పఠించే వరకూ వారితో ధర్మయుద్ధం చేయమని నాకు ఆజ్ఞాపించబడింది. వారు ఈ కలిమాను గనక పఠిస్తే  వారి ధన ప్రాణాలు నా తరపున సురక్షితం గావించబడతాయి. దీని (కలిమా) సత్యతమూలంగా వారికి రక్షణ లభిస్తుంది. ఇది విన్న హజ్రత్‌ అబూబకర్‌ (రది అల్లాహు అన్హు), “ఏమిటీ జకాత్‌ దాని (కలిమా) సత్యతలో అంతర్భాగం కాదా!? అల్లాహ్ సాక్షి! వాళ్లు గనక మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) జీవితకాలంలో చెల్లిస్తూ ఉండే ఒంటె త్రాడును ఆపి ఉంచినా నేను వారికి వ్యతిరేకంగా ధర్మయుద్ధం చేస్తాను.” ఇది వినగానే హజ్రత్‌ ఉమర్‌ (రది అల్లాహు అన్హు) నాకిప్పుడు విషయం బోధపడింది. నిస్సందేహంగా అల్లాహ్‌ ధర్మయుద్ధం విషయంలో హజ్రత్‌ అబూబకర్‌ (రది అల్లాహు అన్హు)కు సరియైన అవగాహనను ప్రసాదించాడు. ఇదే సత్యమని నాకు తెలిసిపోయింది” అని అన్నారు. దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) సహచరులు ఈ విషయంలో హజ్రత్‌ అబూబకర్‌తో ఏకీభవించటమే గాకుండా ధర్మభ్రష్టతకు పాల్పడిన వారితో జిహాద్‌ చేసి వారిని తిరిగి రుజువర్తనుల్ని చేశారు. తమ ధర్మభ్రష్టతపై మొండికేసిన వారిని తుదముట్టించారు.

ఈ వృత్తాంతం ప్రకారం సున్నత్‌ యెడల గౌరవం కలిగి ఉండటం, దానిని తు.చ. తప్పకుండా పాటించటం అవసరమని స్పష్టంగా తెలుస్తోంది.

ఒక “తాతమ్మ” హజ్రత్‌ అబూబకర్‌ (రది అల్లాహు అన్హు) సన్నిధికి వచ్చి తన వారసత్వపు సమస్యను గురించి నివేదించుకుంది. దైవగ్రంథంలోనయితే దీని గురించిన వివరాలు లేవు. మహాప్రవక్త ముహమ్మద్‌ (సల్లలాహు అలైహి వ సల్లం) దీని గురించి ఒక నిర్ణయానికి వచ్చినట్లు కూడా నాకు తెలీదు. దీని గురించి నేను ప్రజలను అడిగి తెలుసకుంటాను అని హజ్రత్‌ అబూబకర్‌ (రది అల్లాహు అన్హు) అన్నారు. ఈ వ్యవహారం గురించి ఆయన ప్రజలను దర్యాప్తు చేయగా కొంతమంది ప్రవక్త సహచరులు (రది అల్లాహు అన్హు) ధృవీకరించారు. మహాప్రవక్తవారు ‘తాతమ్మకు వారసత్వంలో ఆరవభాగం ఇప్పించారని వారు సాక్ష్యం పలకగా తదనుగుణంగా అబూబకర్‌ (రది అల్లాహు అన్హు) తీర్పు ఇచ్చారు.

హజ్రత్‌ ఉమర్‌ (రది అల్లాహు అన్హు) గారు శిస్తును, జకాతును వసూలు చేసే ప్రతినిధులకు తాకీదు చేస్తూ ఇలా అనేవారు.

“మీరు  ప్రజల మధ్య అల్లాహ్ గ్రంథానుసారం తీర్పు చెయ్యండి. ఒకవేళ ఏ సమస్యకయినా పరిష్కారం దైవగ్రంథంలో మీకు కానరాకపోతే దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) సంప్రదాయం ప్రకారం పరిష్కరించాలి సుమా!”

ఒకసారి హజ్రత్‌ ఉమర్‌ (రది అల్లాహు అన్హు) గారికి ఒక మహిళ ఇమ్లాస్‌[1] కి సంబంధించిన సమస్య క్లిష్టతరంగా పరిణమించింది. అప్పుడాయన సహాబాను సంప్రతించగా, ముహమ్మద్‌ బిన్‌ సలమ, ముగైర బిన్‌ షాబ (రజి అల్లాహు అన్‌హుం)లు ఆయన సన్నిధికి వచ్చి, “ఈ వ్యవహారంలో ఒక బానిస లేక బానిసరాలికి స్వాతంత్రం వొసగటం తగిన పరిహారంగా మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)తీర్పు ఇచ్చారంటూ సాక్ష్యమిచ్చారు. ఆ మేరకు హజ్రత్‌ ఉమర్‌ (రది అల్లాహు అన్హు) కూడా తీర్పు ఇచ్చారు.

[1] ఇమ్లాస్‌ అంటే ఒక స్త్రీ తన గర్భస్థ శిశువును ఒకరి ఒత్తిడి లేక వేధింపు మూలంగా (భ్రూణ హత్య చేయటం]

హజ్రత్‌ ఉస్మాన్‌ (రది అల్లాహు అన్హు) దగ్గరకు ఒక సమస్య వచ్చింది. భర్త చనిపోయిన మీదట భార్య తన ఇంట్లో ఎన్ని రోజులు “ఇద్దత్‌” (శోకం) పాటించాలి? అన్నది ఆ సందేహం. ఈ వ్యవహారంపై ఆయన దర్యాప్తు చేయగా అబూసయీద్‌ (రది అల్లాహు అన్హు) సోదరి అయిన ఫరీయ బిన్తె మాలిక్‌ బిన్‌ సనాన్‌ కబురంపిస్తూ, తన భర్త మరణించినపుడు అతని ఇంట్లోనే నిలకడగా ఉంది నిర్ణీత ఇద్దత్‌ గడువును పూర్తి చేయవలసిందిగా దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తనకు ఆదేశించారని ధృవీకరించారు. చివరకు హజ్రత్‌ ఉస్మాన్‌ (రది అల్లాహు అన్హు) కూడా ఈ మేరకే తీర్పు ఇచ్చారు.

అలాగే హజ్రత్‌ ఉస్మాన్‌ (రది అల్లాహు అన్హు) గారు, వలీద్‌ బిన్‌ ఉఖబ మద్యం సేవించారని తెలిసి సున్నత్‌ ప్రకారం శిక్ష విధించారు.

హజ్‌ యాత్రకు సంబంధించిన ఒకానొక క్రియ (తమత్తు) విషయం హజ్రత్‌ ఉస్మాన్‌ (రది అల్లాహు అన్హు) గారి అభిప్రాయం భిన్నంగా ఉందని హజ్రత్‌ అలీ (రది అల్లాహు అన్హు)గారికి తెలిసినపుడు హజ్రత్‌ అలీ (రది అల్లాహు అన్హు) హజ్‌ మరియు ఉమ్రా రెండింటికీ సంబంధించిన “ఇహ్రామ్‌” కట్టుకుని ఇలా చెప్పారు. “నేను ప్రజలలో ఏ ఒక్కరో వెలిబుచ్చిన అభిప్రాయం ఆధారంగా దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) సున్నత్‌ను త్యజించజాలను”.

మరి కొంతమంది హజ్రత్‌ అబూబకర్‌, హజ్రత్‌ ఉమర్‌ (రది అల్లాహు అన్హు)ల అభిప్రాయం ఆధారంగా హజ్రత్‌ అబ్దుల్లా బిన్‌ అబ్బాస్‌ (రది అల్లాహు అన్హు) సన్నిధికి వచ్చి ‘తమత్తు”పై హజ్టె ఇఫ్రాద్‌ శ్రేష్టమైనదని నిదర్శనం ఇవ్వగా హజ్రత్‌ అబ్దుల్లా బిన్‌ అబ్బాస్‌ ఇలా పలికారు: “త్వరలోనే ఆకాశం మీద నుండి మీపై రాళ్లు పడతాయి! దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఈ విధంగా చెప్పారని నేనంటూ ఉండగా, అబూబకర్‌,ఉమర్‌ల అభిప్రాయం ఇలా ఉందని మీరంటారా?!”

ఎవరైనా హజ్రత్‌ అబూబకర్‌, ఉమర్‌ల మాటపై ఆచరిస్తూ సున్నత్‌ను వ్యతిరేకించగా దైవానుగ్రహం విరుచుకుపడే ప్రమాదం కనిపించినపుడు, ఇక అబూబకర్‌, ఉమర్‌ల కన్నా తక్కువస్థాయి గల వ్యక్తి మాటలపై, సలహాలపై నడుస్తూ నున్నత్‌ను’ వ్యతిరేకించిన వారి స్థితి ఇంకెంత నికృష్ణంగా తయారవుతుందో కాస్త ఆలోచించండి.

మరి కొంతమంది కొన్ని హదీసుల విషయంలో హజ్రత్‌ అబ్దుల్లా బిన్‌ ఉమర్‌ (రది అల్లాహు అన్హు)తో విభేదించగా, “ఏమిటీ, మనం ఉమర్‌ను అనుసరించడానికి కట్టుబడి ఉన్నామా!?” అని అబ్దుల్లా బిన్‌ ఉమర్‌ (రది అల్లాహు అన్హు) ఆశ్చర్యం వ్యక్తపరిచారు.

ఇమ్రాన్‌ బిన్‌ హసీన్‌ (రది అల్లాహు అన్హు) హదీసు పాఠం ఇస్తూ ఉండగా ఒక వ్యక్తి వచ్చి, “మీరు మాకు ఖుర్‌ఆన్‌ గురించి విశదీకరించండి” అని కోరాడు. ఇది విని ఆయన కోపగించుకున్నారు. పైగా ఆయన ఇలా అన్నారు: “దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వారి సున్నత్‌ ఖుర్‌ఆన్‌కు తాత్పర్యం వంటిది. సున్నతే గనక లేకుంటే జుహ్ర్‌లో నాలుగు రకాతులున్నాయనీ, మగ్రిబ్‌లో మూడు రకాతులనీ, ఫజ్ర్లో రెండు రకాతులనీ మనకు తెలిసేది కాదు. అలాగే జకాత్‌ తీరుతెన్నులను గురించి మనం తెలుసకోలేకపోయేవారం. అలాగే నేడు సున్నత్‌లో ఉన్న మరెన్నో అంశాలు మనకు తెలియకుండా పోయేవి”.

దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)గారి సున్నత్‌ పట్ల ప్రవక్త సహచరులకు గల భక్తి శ్రద్ధలు అపారం. ఒక్కో సున్నత్‌ను ఆచరణలో పెట్టాలని వారు ఉవ్విళ్లూరు తుండేవారు. ఏ సున్నత్‌నయినా ఎవరన్నా చిన్నచూపు చూస్తున్నట్లు అగుపిస్తే దైవానుగ్రహం ఎక్కడ విరుచుకు పడుతుందోనని వారు భీతిల్లేవారు. సున్నత్‌ను ఎవరయినా నిర్లక్ష్యం చేస్తే ఆగ్రహోదగ్రులయ్యేవారు. అలాంటి సంఘటనలు చరిత్రలో కోకొల్లలు. ఉదాహరణకు ఒక సంఘటనను చూడండి :-

“అల్లాహ్ దాసీలను (మహిళలను) మస్జిద్లకు రాకుండా అడ్డుపడకండి” అని మహనీయ ముహమ్మద్‌ (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రబోధించారని హజ్రత్‌ అబ్దుల్లా బిన్‌ ఉమర్‌ (రది అల్లాహు అన్హు) వివరిస్తుండగా ఆయన కుమారులలో ఒకరు కల్పించుకుని, ‘అల్లాహ్ సాక్షి! మేము వాళ్లను తప్పకుండా అడ్డుకుంటాము’ అని అన్నాడు. దానిపై అబ్దుల్లా బిన్‌ ఉమర్‌ (రది అల్లాహు అన్హు) తీవ్రమైన ఆగ్రహాన్ని వెలిబుచ్చటమే గాక తన కొడుకుని తీవ్రంగా మందలించారు. ఇంకా ఆయన ఇలా అన్నారు: – “దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రబోధించారు” అని నేనంటూ ఉండగా “మేము తప్పక అడ్డుకుంటాము” అని నువ్వంటావా?!”

మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రత్యక్ష సహచరులలో ఒకరైన అబ్దుల్లా బిన్‌ మగ్‌ఫిల్‌ ముజ్‌నీ (రది అల్లాహు అన్హు) గారు తన బంధువైన ఒక వ్యక్తి కంకరరాళ్లు విసురుతుండగా చూచి అతన్ని వారించారు. ఇంకా అతనికి ఇలా నచ్చజెప్పారు. “దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) కంకరరాళ్లు విసరడాన్ని వారించారు. ఎందుకంటే ఇవి వేటాడే వాటిని కూల్చడం గానీ, శత్రువును గాయపరచటం గానీ చేయలేవు. కాకపోతే వీటి మూలంగా పల్లు (దంతాలు) రాలటమో, కళ్లు పగలడమో జరుగుతుందని దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) సెలవిచ్చి ఉన్నారు.” మరి కొన్నాళ్ల తరువాత కూడా ఆ వ్యక్తి కంకరరాళ్లు విసరుతుండటం చూచి, “అల్లాహ్ సాక్ష్యం! నేను ఇక ఎన్నటికీ నీతో మాట్లాడను. దైవప్రవక్త గారు కంకరరాళ్లు విసరరాదని చెప్పారని నేను ఎంత మొత్తకున్నా నువ్వు మళ్లీ అదే పని చేస్తున్నావు” అని ఆయన తన అయిష్టాన్ని అసహనాన్ని అభివ్యక్తం చేశారు.

“మీరు ఎప్పుడయినా, ఎవరి ముందరయినా హదీసు పాఠం ఇస్తూ ఉండగా, “దీన్ని వదలండి, మాకు (కేవలం) పవిత్ర ఖుర్‌ఆన్‌ నుంచి ఏదైనా బోధించండి” అని అతనంటే అతడు మార్గవిహీనుడయ్యాడని మీరు తెలుసకోండి” అని ప్రముఖ తాబయీ అయూబ్‌ సక్తియానీ చెప్పినట్లు ఇమామ్‌ బైహఖీ నకలు చేశారు.

ఇమామ్‌ అవ్‌జాయి (రహమతుల్లా అలై) మాటల్లోనే చెప్పాలంటే సున్నత్‌ దైవగ్రంథానికి విపులీకరణ వంటిది. (భావమేమిటంటే) ఖుర్‌ఆన్‌లో క్లుప్తంగా ఉన్న దానిని ప్రవక్తగారి సున్నత్‌ వివరించి చెబుతుంది). నిక్షిప్తమై ఉన్న విషయాన్ని విడమరచి – అందరికీ అర్ధమయ్యేలా – చెబుతుంది. ఉదాహరణకు అల్లాహ్  ఇలా సెలవిచ్చాడు.

“(ఓ ప్రవక్తా!) ఈ జ్ఞాపికను (ఖుర్‌ఆన్‌ను) నీపై అవతరింపజేశాము. నీవు ప్రజల ముందు వారి కోసం అవతరింపజేయబడిన ఉపదేశాన్ని స్పష్టంగా వివరించటానికి, (స్వయంగా) ప్రజలు కూడా ఆలోచించటానికీనూ”. (ఆన్‌ నహ్ల్‌ – 44)

“నాకు గ్రంథం వొసగబడింది. దాంతో పాటు దాని ఉపమానం (సున్నత్‌) కూడా ప్రసాదించబడింది” అన్న ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) గారి పలుకు ఇంతకు ముందు కూడా వచ్చింది.

ఆమిర్‌ షాబీ గారు జనుల ఉద్దేశ్యించి ఇలా పలికారని ఇమామ్‌ బైహకీ పొందు పరిచారు. “ఎప్పుడైతే మీరు చిహ్నాలను (అనగా సహీహ్‌ హదీసులను) వదలి వేశారో అప్పుడు మీరు వినాశం పొందారని తెలుసుకోండి”.

ఇమామ్‌ అవ్‌జాయి కొంతమంది సహచరులనుద్దేసించి ఇలా ప్రబోధించారు: “దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) గారి ద్వారా నీకు ఏదయినా హదీసు చేరినపుడు మరో మాట చెప్పడానికి నీవు భయపడాలి. ఎందుకంటే దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వారుఅల్లాహ్ తరపున నియుక్తులైన సందేశ ప్రదాత”. (దీనిని కూడా ఇమామ్‌ బైహఖీ గారే నకలు చేశారు.)

ప్రఖ్యాత ఇమామ్‌ సుఫియాన్‌ సవ్రీ  చెప్పారని ఇమామ్‌ బైహఖీ ఉల్లేఖించారు: “జ్ఞానం అనేది ఏదైనా ఉంటే అది సాంతం చిహ్నాల (సహీహ్‌ హదీసుల) జ్ఞానమే”.

ఇమామ్‌ మాలిక్‌ (రహమతుల్లా అలై) ఇలా ఉపదేశించారు: “మనలో ప్రతి ఒక్కరిమాట స్వీరించవచ్చు లేక అతని మాట అతని పైనే రద్దు చేయవచ్చు. కాని ఈ సమాధివాసి విషయం అలా కాదు”. ఇలా పలుకుతూ ఆయన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి సమాధి వైపు సంజ్ఞ చేశారు. అంటే మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి హదీస్‌ పై అమల్‌ చేయటమేగాని తిరస్కరించరాదు. తిరస్కరిస్తే అది కుఫ్ర్కి దారి తీస్తుంది.

ఇమామ్‌ అబూహనీఫా (రహమతుల్లా అలై) ఉపదేశించారు: “మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం తరపున ఏదైనా హదీసు అందితే అది మాకు శిరోధార్యం అవుతుంది”.

ఇమామ్‌ షాఫయి (రహమతుల్లా అలై) ఒకసారి ఇలా అన్నారు: “మహనీయ ముహమ్మద్‌ (సల్లలాహు అలైహి వ సల్లం) ద్వారా ఏదైనా సహీహ్‌ హదీసు అందగా నేను దాన్ని స్వీకరించకపోతే నాకు మతి చలించిందనుకోవాలి. ఈ మాటకు మిమ్మల్ని సాక్ష్యంగా పెడుతున్నాను. (అంటే నేను పిచ్చివాణ్ణి అయినపుడే ఇలా విపరీతంగా ప్రవర్తిస్తాను)”.

ఆయన ఇంకా ఇలా అన్నారు:

నేను ఎప్పుడైనా ఏదైనా విషయంలో అభిప్రాయం వ్యక్తం చేయగా అది దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వారి హదీసుకు విరుద్ధంగా ఉంటే నా అభిప్రాయాన్ని గోడకేసి కొట్టండి”.

ఇమామ్‌ అహ్మద్‌ బిన్‌ హంబల్‌ (రహమతుల్లా అలై) తన సహచరులు కొంతమందిని ఉద్దేశ్యించి ఇలా ప్రబోధించారు:

“మీరు నన్ను గానీ, ఇమామ్‌ మాలిక్‌ని గాని, ఇమామ్‌ షాఫయిని గానీ అనుసరించకండి. దీనికి బదులు మేము ఎక్కడి నుంచి విషయాన్ని గ్రహించామో అక్కడి నుండి మీరూ గ్రహించండి”.

ఆయన ఈ విధంగా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు: “దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) గారి గురించి, ఆయన హదీసుల ప్రామాణికత గురించి క్షుణ్ణంగా తెలిసి కూడా సుఫియాన్‌ సూరీ అభిప్రాయల వైపుకు మొగ్గుచూపే ఈ జాతిని చూసి నాకు ఆశ్చర్యమేస్తుంది. వాస్తవానికి అల్లాహ్‌ ఇలా ఆజ్ఞాపించి ఉన్నాడు-

“దైవప్రవక్త ఆజ్ఞను ఉల్లంఘించేవారు, తాము ఏదయినా ఉపద్రవంలో చిక్కుకుపోతామేమో అనీ, తమపై బాధాకరమైన శిక్ష వదైనా అవతరిస్తుందేమో అనీ భయపడాలి”. (సూర నూర్‌ – 63)

తరువాత ఇమామ్‌గారు ఇలా అన్నారు: “చెడుగు (ఉపద్రవం) ఏమిటో మీకు తెలుసా? అదే షిర్క్‌ దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) గారి ఏ ప్రవచనాన్నయినా మనిషి రద్దు చేసినవాడు మనిషి హృదయంలో వక్రత చోటు చేసుకుని అది అతన్ని వినాశం పాలుజేసే అవకాశం ఉంది”.

ప్రముఖ తాబయి హజ్రత్‌ ముజాహిద్‌ గారి పలుకులను ఇమామ్‌ బైహఖీ ఉటంకించారు – హజ్రత్‌ ముజాహిద్‌ ఇలా అన్నారు – “మీ మధ్య ఏదేని విషయంలో వివాదం తలెత్తితే దాన్ని అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త వైపుకు మరలించండి అని ఖుర్‌ఆన్‌లో ఉంది. ఇక్కడ అల్లాహ్‌ అంటే భావం దైవగ్రంథం (ఖుర్‌ఆన్‌). దైవప్రవక్త అంటే భావం దైవప్రవక్త నెలకొల్పిన సంప్రదాయం వైపుకు మరలటం.”

హజ్రత్‌ ఇమామ్‌ జహ్‌రీ పలుకులను కూడా ఇమామ్‌ బైహఖి పొందుపరచారు: “మనకు పూర్వం గడచిన పండితులు, సున్నత్‌ను గట్టిగా పట్టుకొని ఉండటంలోనే మోక్షం ఉందని చెప్పేవారు”.

ఇంతకు ముందు ఉదాహరించబడిన సూరె నూర్‌లోని 63వ ఆయతుకు వ్యాఖ్యానం చెబుతూ అల్లామా ఇబ్నె కసీర్‌ ఇలా అన్నారు:

“దైవప్రవక్త ఆజ్ఞ అంటే ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) గారి మార్గం, పద్ధతి, విధానం, సంప్రదాయం, ధర్మం అని భావం. అంటే మనిషి యొక్క మాటలు, చేతలు అన్నీ దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) మాటలు, చేతల కనుగుణంగా ఉన్నాయో లేదా అని పరీక్షించబడతాయి. ఉంటే అవి స్వీకారాయోగ్యమవుతాయి. లేకుంటే మరుగుపరచబడతాయి – ఆ మనిషి ఎంత గొప్పవాడైనా సరే!”

సహీహ్‌ బుఖారీ, ముస్తిం మరియు ఇతర ప్రామాణికమైన గ్రంథాల ద్వారా ధృవీకరించబడిన ఒక హదీసులో మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వారు ఇలా ప్రవచించారు:

మన్‌ అమిల అమలన్‌ లైస అలైహి అమ్‌రునా ఫహువ రద్దున్‌.

ఎవరయినా మేము ఆజ్ఞాపించని దానిని ఆచరిస్తే అటువంటి ఆచరణ త్రోసిపుచ్చబడుతుంది.

కాబట్టి ఇలాంటి పోకడలకు దూరంగా ఉండటమే గాకుండా వాటికి భయపడాలి. ఎందుకంటే మహనీయ ముహమ్మద్‌ (సల్లలాహు అలైహి వ సల్లం)గారి షరీయత్‌ను “లోలోపలగానీ, బహిర్గతంగా గానీ వ్యతిరేకించినవాడు ఉపద్రవంలో చిక్కుకున్న వాడవుతాడు. అలాంటి వ్యక్తి హృదయంలో అవిశ్వాసం, కాపట్యం, అపసవ్యతలు జొరబడి అతడు దైవానుగ్రహానికి పాత్రుడయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది. ఆ ఆగ్రహం అనేక విధాలుగా ఉండవచ్చు. మార్గభ్రష్టతకు పాల్పడి గందరగోళాన్ని సృష్టించినందుకు అతడు హతమార్చబడవచ్చు, లేక ఆంక్షలకు గురికావచ్చు లేదా నిర్బంధించబడనూ వచ్చు!

మహనీయ ముహమ్మద్‌ (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రబోధించారని హజ్రత్ అబూహురైర (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

“నేను మరియు మీ యొక్క ఉపమానం అగ్నిని రాజేసిన వ్యక్తి లాంటిది. ఆ అగ్ని పరిసరాలను దేదీప్యమానం చేయగా దీపపు పురుగులు దాని చుట్టూ మూగి తమను తాము అగ్నికి ఆహుతి చేసుకోసాగాయి. అతను వాటిని ఆపసాగాడు. కాని అవి అతనిపై ఆధిక్యతను ప్రదర్శించి ఆత్మాహుతి చేసుకుంటాయి. నేనూ మరియు మీ యొక్క ఉపమానం కూడా ఇలాంటిదే. అగ్ని నుంచి కాపాడే ఉద్దేశ్యంతో నేను మిమ్మల్ని ఆపసాగాను. కాని మీరు నాపై ఆధిపత్యం చెలాయించి మిమ్మల్ని మీరు అగ్నికి ఆహుతి చేసుకుంటున్నారు”. (ఇహమ్‌ అహ్మద్‌)

అల్లామా సుయూతీగారు తన గ్రంథం “మిఫ్తాహుల్‌ జన్నతి ఫిల్‌ ఇహ్తే జాజ్‌ బిస్సున్నా లో ఇలా వ్రాశారు:

“అల్లాహ్‌ మీపై దయజూపుగాక! హదీసు సూత్రాల ప్రకారం ఏ హదీసు అయితే సహీహ్‌ హదీసుగా నిరూపించబడిందో – అది ఒకవేళ వాక్కు అయినా సరే, కర్మ అయినా సరే – దాని ప్రామాణికతను గనక ఎవరయినా త్రోసిపుచ్చితే అతడు కాఫిర్‌ అయిపోతాడు, ఇస్లాం పరిధి నుండి బహిష్మరించబడతాడు. ప్రళయదినాన అతడు యూదులు క్రైస్తవులతో పాటు లేపబడతాడు”.

సున్నత్‌ పట్ల గౌరవం, దాని ఆచరణ యొక్క ఆవశ్యకత, దాని పట్ల వ్యతిరేక భావం యొక్క దుష్పరిణామానికి సంబంధించిన ఎన్నో ఉల్లేఖనాలు సహాబాలు, తాబయీన్‌ల ద్వారా రూఢీ అవుతున్నాయి. ఆ మహనీయుల అనంతరం వచ్చిన పండితులు, విద్వాంసులు, హదీసువేత్తలు కూడా ఈ విషయంలో ప్రమాణబద్ధమైన ప్రకటనలు చేశారు….. ఈ అంశంపై నేను ఉదాహరించిన ఖుర్‌ఆన్‌ ఆయతులు, హదీసులు, ఉల్లేఖనాలు, ఉదంతాలు విషయావగాహనకు సరిపోతాయని ఆశిస్తాను. సత్యం కొరకు తహతహలాడే వారికి ఈ ఉదాహరణలు సంతృప్తిని కలిగిస్తాయని భావిస్తాను.

మేము మా కొరకు, సమస్త ముస్తిముల కొరకు ఈ సత్యార్యాలను చేసే సద్బుద్ధిని ప్రసాదించమని అల్లాహ్‌ను ప్రార్థిస్తున్నాము. అల్లాహ్‌ను ప్రసన్నుణ్ణి చేయడానికి ఆరాటపడే, ఆయన ఆగ్రహానికి దూరంగా ఉండాలని కాంక్షించే వారి కొరకు ప్రార్ధిస్తున్నాము. ఆయన మనందరినీ సన్మార్గంపై నడిపించాలని ప్రార్ధన! నిస్సందేహంగా ఆయన వినేవాడు, చేరువలో ఉన్నవాడు.

ఇదే మాసందేశం (పుస్తక పబ్లిషర్స్ నుండి)

అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన అనుచర వర్గానికి దేని గురించి ఆదేశించారో,దేనిని స్వయంగా ఆచరించి చూపించారో, మరి దేన్ని అనుమతించారో దాన్ని యధావిధిగా ఆచరించాలి. పవిత్ర ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు :

“దైవ ప్రవక్త మీకు ఇచ్చిన దానిని పుచ్చుకోండి, ఇంకా ఆయన మిమ్మల్ని వారించిన దానికి దూరంగా ఉండండి.” (59:7)

దైవ ప్రవక్త ముహమ్మద్‌ (సల్లలాహు అలైహి వ సల్లం) తన జీవిత కాలంలో చేయని దానిని మీరు మీ ఇష్టానుసారం చేసి కొత్త పుంతలు తొక్కకండి. అలా చేస్తే మీరు దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) విధానాన్ని నిర్లక్ష్యం చేసిన వారవుతారు. దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా హెచ్చరించాడు: “విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్తను మించి పోయే యత్నం చేయకండి.” (49:1)

మహనీయ ముహమ్మద్‌ (సల్లలాహు అలైహి వ సల్లం) గారి విధానమే ఆదర్శనీయం, అనుసరణీయం. దాన్ని కాదని ఇతరత్రా విధానాలను అనుసరించి, ఇతరుల అభిప్రాయాలను ప్రమాణంగా తీసుకుని మీ సదాచరణలను పాడు చేసుకోకండి. ఈ విషయాన్నే పరమ ప్రభువు తన గ్రంథంలో ఇలా పేర్కొన్నాడు : “ఓ విశ్వసించిన వారలారా! అల్లాహ్‌కు, మరియు ఆయన ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)కు విధేయత చూపండి. ఇంకా, మీ  ఆచరణలను వృధా చేసుకోకండి.” (47:99)

ప్రవక్త ఇబ్రాహీం (అలైహిస్ సలాం) కథ – The Story of Prophet Ibraheem (AlaihisSalaam)

prophet-ibraheemపుస్తకం నుండి: ఖురాన్ కథామాలిక
మూలం: షేఖ్ అబూ బకర్ నజార్
అనువాదం: అబ్దుల్ వాహెద్,హాఫిజ్  ఎస్.ఎం.రసూల్ షర్ఫీ
పబ్లిషర్స్: శాంతిమార్గం పబ్లికేషన్ ట్రస్ట్ , హైదరాబాద్

[ఇక్కడ చదవండి /డౌన్లోడ్ చేసుకోండి]

ప్రవక్త యూసుఫ్ (అలైహిస్సలాం) కథ – The Story of Yusuf (Peace be upon him)

the-story-of-yusufపుస్తకం నుండి: ఖురాన్ కథామాలిక
మూలం: షేఖ్ అబూ బకర్ నజార్
అనువాదం: అబ్దుల్ వాహెద్,హాఫిజ్  ఎస్.ఎం.రసూల్ షర్ఫీ
పబ్లిషర్స్: శాంతిమార్గం పబ్లికేషన్ ట్రస్ట్ , హైదరాబాద్

[ఇక్కడ చదవండి / డౌన్లోడ్ చేసుకోండి]

షిర్క్ నాలుగు సూత్రాలు – షేఖుల్ ఇస్లాం ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ [పుస్తకం & వీడియో పాఠాలు]

al-qawaid-al-arbah.gif

ఇస్లాం ధర్మం యొక్క నాలుగు నియమాలు
(అల్ ఖవాఇద్ అల్ ఆర్బా)
షిర్క్ నాలుగు సూత్రాలు

మూలం:షేఖుల్ ఇస్లాం ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ (రహమతుల్లాహ్ అలై)
అనువాదకులు:ముహమ్మద్ అజీజుర్రహ్మాన్
పుస్తకం నుండి:ఇస్లాం మూల సూత్రాలు (హదీసు పబ్లికేషన్స్)

[ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [9 పేజీలు] [మొబైల్ ఫ్రెండ్లీ]


بسم الله الرحمن الرحيم

أسأل الله الكريمَ ، ربَّ العرش العظيم: أن يتولاّك في الدنيا والآخرة، وأن يجعلك مباركاً أينما كُنْتَ

మహోన్నత సింహాననానికి అధిపతి అయిన అల్లాహ్‌ దర్బారులో అభ్యర్ధించుకుంటున్నాను – ఆయన ఇహపరాలలో మిమ్మల్ని పర్యవేక్షిస్తూ ఉండుగాక! మీరెక్కడున్నా మిమ్మల్ని శుభవంతుల్ని చేయుగాక!

  وأن يجعلكَ مِمن إذا أعطي شَكَر، وإذا ابْتُلي صَبر، وإذا أذنب استغفر، فإن هذه الثلاث عنوانُ السعادة

కలిమిని ప్రసాదించినపుడు కృతజ్ఞతలు తెలుపుకునే, లేమికి గురి చేసినప్పుడు సహనం వహించే, తప్పులు జరిగిపోయినప్పుడు పశ్చాత్తాపం చెందే సజ్జనులకోవలో మిమ్మల్ని చేర్చుగాక!- ఈ మూడు విషయాలే మహాభాగ్యం అనబడతాయి.

اعلم أرشدك الله لطاعته أن الحنيفية – مِلةَ إبراهيمَ – : أنْ تَعبُدَ الله مُخلصاً له الدين، وبذلك أمرَ الله جميع الناس، وخَلَقهم لها ، كما قال

ఆరాధనలో ఏకాగ్ర చిత్తం కలిగి ఉండటం – ఇబ్రాహీం (అలైహిస్సలాం) అనుయాయునిగా మారటం – అంటే ఏమిటో తెలుసా?! ఒక్కడైన అల్లాహ్‌ను సేవించడంలో చిత్తశుద్ధినీ, వజ్ర సంకల్పాన్ని కనబరచటం! అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు:

وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ

“మేము మానవుల్ని, జిన్నుల్ని మా దాస్యం కోసమే పుట్టించాము.” (అజ్జారియాత్‌ 51:56)

فإذا عرفتَ أن الله خلقك لعبادته: فاعلم أنّ العبادةَ لا تُسمى عبادةً إلا مع التوحيد، (كما أنّ الصلاة لا تُسمى صلاة إلا مع الطهارة)

అల్లాహ్‌ తన దాస్యం కోసమే మిమ్మల్ని పుట్టించాడన్న సంగతి మీకు తెలిసినప్పుడు, ఆ దాస్యం స్వచ్చమైన – ఏకేశ్వరోపాసన (తౌహీద్‌) – తో కూడుకున్నదై ఉండాలన్న సత్యం కూడా మీరు తెలుసుకోవటం అవసరం. ఏ విధంగానయితే మీరు శుచీ శుభ్రతల (తహారత్‌)ను పాటించినపుడే నమాజ్‌ నెరవేరుతుందో అదే విధంగా అద్వితీయుడైన అల్లాహ్ కు భాగస్వామ్యం (షిర్క్‌)కల్పించకుండా ఉన్నప్పుడే దాస్యం స్వీకార యోగ్యం అవుతుంది.

فإذا دخل الشركُ في العبادة فسدتْ، (كالحَدَثِ إذا دخل في الصلاة) ، كما قال تعالى

ఆరాధన (దాస్యం)లోనే గనక “షిర్క్‌” వచ్చి చేరితే అది కలుషితం అయిపోతుంది.శుచీ శుభ్రతలను అశుద్ధ వస్తువులు పాడు చేసేసినట్లే షిర్క్‌తో కూడుకున్న పనులు స్వచ్చమైన తౌహీద్‌ను పాడు చేసేస్తాయి. దివ్యగ్రంథంలో అల్లాహ్‌ ఈ విధంగా సెలవిచ్చాడు:

مَا كَانَ لِلْمُشْرِكِينَ أَن يَعْمُرُوا مَسَاجِدَ اللَّهِ شَاهِدِينَ عَلَىٰ أَنفُسِهِم بِالْكُفْرِ ۚ أُولَٰئِكَ حَبِطَتْ أَعْمَالُهُمْ وَفِي النَّارِ هُمْ خَالِدُونَ

“ముష్రిక్కులు అల్లాహ్‌ మసీదులలో సంరక్షకులుగా, సేవకులుగా ఉండటానికి పనికి రారు. ఎందుకంటే వారే స్వయంగా అవిశ్వాసులమని తమకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తున్నారు. వారి కర్మలైతే అన్నీ వ్యర్థమై పోయాయి.నరకంలో వారు కలకాలం ఉండాలి.” (అత్‌ తౌబా 9:17)

فإذا عرفتَ أنّ الشرْكَ إذا خالط العبادة أفسدها وأحبط العمل وصار صاحبه من الخالدين في النار: عرفتَ أن أهمَّ ما عليك: معرفةُ ذلك؛ لعل الله أن يخلصك من هذه الشبكة، وهي الشرْكُ بالله

‘షిర్క్‌’ (భాగస్వామ్యం) వల్ల ఆరాధనలు, ఆచరణలన్నీ వ్యర్థమైపోతాయనీ, ముష్రిక్కుల పర్యవసానం నరకమని మీకు తెలిసిపోయిన మీదట, ఆ “షిర్క్‌” గురించి క్షుణ్ణంగా తెలుసుకుని, దానిపట్ల జాగ్రత్త పడవలసిన బాధ్యత కూడా మీపై ఉంది; అప్పుడే మీరు ఆ వినాశకర చేష్ట నుండి మిమ్మల్ని మీరు రక్షించు కోగలుగుతారు. దాని గురించి అల్లాహ్‌ ఇలా అంటున్నాడు:

إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ

“అల్లాహ్‌ దృష్టిలో షిర్కు ఒక్కటే క్షమార్హం కానిది.అది తప్ప తాను కోరిన వారి అన్ని పాపాలను ఆయన క్షమిస్తాడు.” (అన్‌ నిసా 4:116)

: وذلك بمعرفة أربع قواعد ذكرها الله في كتابه

అల్లాహ్‌ తన గ్రంథంలో ప్రస్తావించిన ఈ క్రింది నాలుగు ప్రధానాంశాలను తెలుసుకున్నప్పుడే దీని గురించిన పూర్తి అవగాహన ఏర్పడుతుంది.

మొదటి నియమం :

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు వ్యతిరేకంగా వైర వైఖరిని అవలంబించి, కయ్యానికి కాలు దువ్విన అవిశ్వాసులు కూడా అల్లాహ్‌ను సృష్టికర్తగా, ఉపాధి ప్రదాతగా, విధాతగా అంగీకరించేవారు. కాని వారి ఈ అంగీకారం వారిని ఇస్లాంలో చేర్చలేకపోయింది. (అంటే ఒక్కడైన అల్లాహ్‌ను సేవించే వరకూ వారు ముస్లింలు కాలేకపోయారు.) దివ్యగ్రంథంలోని దైవోపదేశం ఇందుకు ప్రబల నిదర్శనం:

قُلْ مَن يَرْزُقُكُم مِّنَ السَّمَاءِ وَالْأَرْضِ أَمَّن يَمْلِكُ السَّمْعَ وَالْأَبْصَارَ وَمَن يُخْرِجُ الْحَيَّ مِنَ الْمَيِّتِ وَيُخْرِجُ الْمَيِّتَ مِنَ الْحَيِّ وَمَن يُدَبِّرُ الْأَمْرَ ۚ فَسَيَقُولُونَ اللَّهُ ۚ فَقُلْ أَفَلَا تَتَّقُونَ

వారిని అడుగు : ఆకాశం నుండీ, భూమి నుండీ మీకు ఉపాధినిచ్చేవాడు ఎవడు? వినే శక్తీ, చూసే శక్తీ ఎవడి అధీనంలో ఉన్నాయి? ప్రాణములేని దాని నుండి ప్రాణమున్న దానినీ, ప్రాణమున్న దాని నుండి ప్రాణములేని దానినీ వెలికి తీసేవారు తప్పకుండా అంటారు. ఇలా అను: “అలాంటప్పుడు మీరు (షిర్క్‌కు వ్యతిరేకంగా నడవటం) మానుకోరేమిటి?” (యూనుస్‌ 10:31)

రెండవ నియమం :

తాము వాళ్ళను (తమ మిథ్యా దైవాలను, వలీలను) కేవలం సామీప్యం కోసం, సిఫారసు కోసమే పిలుస్తున్నామని ముష్రిక్కులు అనేవారు. ఈ సామీప్యానికి వారిచ్చే నిదర్శనం ఏమిటంటే ఈ వలీలు, పుణ్య పురుషులు తమను అల్లాహ్‌కు చేరువ చేస్తారని అనేవారు. కాని ఇది పచ్చి షిర్క్‌. ఈ సందర్భంగా అల్లాహ్‌ ఇలా సెలవిస్తున్నాడు :

أَلَا لِلَّهِ الدِّينُ الْخَالِصُ ۚ وَالَّذِينَ اتَّخَذُوا مِن دُونِهِ أَوْلِيَاءَ مَا نَعْبُدُهُمْ إِلَّا لِيُقَرِّبُونَا إِلَى اللَّهِ زُلْفَىٰ إِنَّ اللَّهَ يَحْكُمُ بَيْنَهُمْ فِي مَا هُمْ فِيهِ يَخْتَلِفُونَ ۗ إِنَّ اللَّهَ لَا يَهْدِي مَنْ هُوَ كَاذِبٌ كَفَّارٌ

ఇక ఆయనను వదిలివేసి ఇతరులను సంరక్షకులుగా చేసుకున్న వారు, (తమ ఈ చర్యకు సమర్థింపుగా) “వారు మమ్మల్ని అల్లాహ్‌ వద్దకు చేరుస్తారని మాత్రమే వారిని ఆరాధిస్తున్నాము” అని అంటారు.అల్లాహ్‌ నిశ్చయంగా వారి మధ్యన వారు విభేదిస్తున్న అన్ని విషయాలను గురించి తీర్పు చెబుతాడు. అసత్యవాదీ, సత్య ధిక్కారి అయిన ఏ వ్యక్తికీ అల్లాహ్‌ సన్మార్గం చూపడు.” (జుమర్‌-3)

సిఫారనుకు సంబంధించిన (అంటే వారు కల్పించుకున్న కాల్పనిక దేవుళ్ళు వారికి వారధిగా ఉంటారన్న వారి నమ్మకం షిర్క్‌ అని చాటి చెప్పే) ఆయతు:

وَيَعْبُدُونَ مِن دُونِ اللَّهِ مَا لَا يَضُرُّهُمْ وَلَا يَنفَعُهُمْ وَيَقُولُونَ هَٰؤُلَاءِ شُفَعَاؤُنَا عِندَ اللَّهِ ۚ قُلْ أَتُنَبِّئُونَ اللَّهَ بِمَا لَا يَعْلَمُ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ ۚ سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ

“ఈ ప్రజలు అల్లాహ్‌ను కాదని తమకు నష్టాన్ని గానీ, లాభాన్ని గానీ కలిగించలేని వారిని పూజిస్తున్నారు.పైగా ఇలా అంటున్నారు : “వారు అల్లాహ్‌ వద్ద మా కొరకు సిఫారసు చేస్తారు.” (ప్రవక్తా!) వారితో ఇలా అను : ఆకాశాలలో గానీ, భూమిలో గానీ అల్లాహ్‌ ఎరుగని విషయాన్ని గురించి ఆయనకు మీరు తెలుపుతున్నారా?” ఆయన పరిశుద్దుడు.ఈ ప్రజలు చేసే షిర్కుకు అతీతుడు, ఉన్నతుడూను.” (యూనుస్‌ 10:18)

సిఫారసు రెండు రకాలు. ఒకటి: నకారాత్మక సిఫారను. రెండు : సకారాత్మక సిఫారసు.

1. నకారాత్మక సిఫారసు : అంటే అల్లాహ్‌కు మాత్రమే సాధ్యమైన వాటి కోసం దైవేతరుల ముందు అర్థించటం. దీనికి ఆధారం ఇది :

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَنفِقُوا مِمَّا رَزَقْنَاكُم مِّن قَبْلِ أَن يَأْتِيَ يَوْمٌ لَّا بَيْعٌ فِيهِ وَلَا خُلَّةٌ وَلَا شَفَاعَةٌ ۗ وَالْكَافِرُونَ هُمُ الظَّالِمُونَ

“విశ్వసించిన ఓ ప్రజలారా! క్రయ విక్రయాలు కూడా జరగని, మైత్రీ ఉపయోగ పడని, సిఫారసు కూడా చెల్లని, ఆ (చివరి) దినము రాక పూర్వమే, మేము మీకు ప్రసాదించిన సిరి సంపదలనుండి (మా మార్గంలో) ఖర్చుపెట్టండి. వాస్తవంగా అవిశ్వాస మార్గం అవలంబించేవారే దుర్మా ర్గులు”.’ (అల్‌ బఖర 2:254)


* ఈ సూక్తి గురించి వ్యాఖ్యానిస్తూ అల్లామా ఇబ్నె కసీర్‌ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు – అల్లాహ్‌ తన దాసులకు, తాను ప్రసాదించిన ఉపాధి నుండి, తన మార్గంలో ఖర్చుపెట్టమని ఆదేశిస్తున్నాడు.ఎందుకంటే వారు తవు ప్రభువు వద్ద తమ పుణ్య రాసులను సమకూర్చుకొవాలని! ప్రళయ దినం రాకముందే వారు ఈ పని చేసుకోవాలి.ఆ రోజు ఎంత కఠినమైనదంటే, ఆనాడక్కడ క్రయ విక్రయాలు గానీ, బేరసారాలు గానీ, స్నేహసంబంధాలు గానీ, రికమండేషన్లు గానీ ఏ మాత్రం పనికిరావు. పరిహారంగా సొమ్ము ఇవ్వటం కుదరదు. భూమండలం లోని బంగారాన్నంతటినీ ఇచ్చినా ఆనాడు మనిషి తనను విడిపించుకోలేడు. ఆవగింజంత ప్రయోజనం కూడా తన  ఆత్మకు చేకూర్చుకోజాలడు.

శంఖం ఊదబడిన రోజున వారు ఒక పట్టాన నిలదొక్కుకోవటం గానీ, ఒకరినొకరు పరామర్శించుకోవటం గానీ చేయలేరు. సిఫారసు చేసేవారి సిఫారసు కూడా ఏ విధంగానూ వారికి ఉపయోగ పడదు.


2. సకారాత్మక సిఫారసు : అంటే అల్లాహ్‌ను మాత్రమే వేడుకొనే సిఫారసు. సిఫారసు చేసేవాడు కూడా ఈ సిఫారసు మూలంగా ఆదరణీయుడవుతాడు. ఎవరి కోసమైతే సిఫారసు చేయబడుతుందో అతని వట్ల అల్లాహ్‌ కూడా ప్రసన్నుడవు తాడు. ఇటువంటి సిఫారసు కేవలం అల్లాహ్‌ నుండి మాత్రమే అర్థించబడుతుంది. ఎందుకంటే సిఫారసును ఆమోదించటం లేక ఆమోదించక పోవటమన్నది అల్లాహ్‌ అభీష్టంపైనే ఆధారపడి ఉంటుంది.కనుక దైవేతరుల నుండి అర్ధించేవాడు షిర్కుకు ఒడిగట్టినట్లే. ఎందుకంటే అతడు చేయరాని పనిని చేశాడు.’వేడుకోలు’కు విరుద్ధమైన వైఖరిని అవలంబించాడు.అల్లాహ్‌ కేవలం ఏకేశ్వరోపాసనను మాత్రమే ఇష్టపడతాడు. ఏకేశ్వరోపాసకులకై చేసే సిఫారసును మాత్రమే అంగీకరించి ఆమోదిస్తాడు. దివ్య ఖుర్‌ఆన్‌లో ఆయన సెలవిచ్చినట్లు:

مَن ذَا الَّذِي يَشْفَعُ عِندَهُ إِلَّا بِإِذْنِهِ

“ఆయన సన్నిధిలో ఆయన అనుజ్ఞ లేకుండా సిఫారసు చెయ్యగల వాడెవ్వడు?” (అల్‌ బఖర 2:255)

يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ وَلَا يَشْفَعُونَ إِلَّا لِمَنِ ارْتَضَىٰ

“వారు ఎవరిని గురించీ సిఫారసు చేయరు, సిఫారసు వినటానికి అల్లాహ్‌ ఇష్టపడిన వాని విషయంలో తప్ప.” (అంబియా 21:28)

قُل لِّلَّهِ الشَّفَاعَةُ جَمِيعًا

“ఇంకా ఇలా అను : సిఫారసు అనేది పూర్తిగా అల్లాహ్‌ చేతిలోనే ఉన్నది.” (అజ్‌ జుమర్‌ 29:44)

మూడవ నియమం:

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పెక్కు ఆరాధ్య దైవాలను పూజించే ప్రజల్లో ప్రభవింప జేయబడ్డారు.ఆ ప్రజల్లో కొందరు దైవదూతలను పూజించగా, మరి కొందరు దైవప్రవక్తలను ఆరాధించేవారు. కొందరు మహనీయులను కొలవగా, ఇంకొందరు చెట్టు పుట్టలను, రాళ్ళు రప్పలను కొలిచేవారు. మరికొందరు సూర్యచంద్రులను సేవించేవారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వీళ్ళందరి మిథ్యా విధానాన్ని అంతమొందించారు.ఈ విషయంలో వారి మధ్య ఎలాంటి వ్యత్యాసం కనబరచలేదు. దీనికి నిదర్శనం ఖుర్‌ఆన్‌లోని ఈ సూక్తి:

وَقَاتِلُوهُمْ حَتَّىٰ لَا تَكُونَ فِتْنَةٌ وَيَكُونَ الدِّينُ كُلُّهُ لِلَّهِ

“పీడన ఏ మాత్రం మిగలకుండా పోయే వరకు, అల్లాహ్‌నిర్ణయించిన ధర్మం పూర్తిగా నెలకొల్పబడే వరకు ఈ అవిశ్వాసు లతో యుద్ధం చేయండి.” (అన్‌ఫాల్‌ 8:39)

సూర్యచంద్రుల దాస్యానికి సంబంధించిన నిదర్శనం ఇది:

وَمِنْ آيَاتِهِ اللَّيْلُ وَالنَّهَارُ وَالشَّمْسُ وَالْقَمَرُ ۚ لَا تَسْجُدُوا لِلشَّمْسِ وَلَا لِلْقَمَرِ وَاسْجُدُوا لِلَّهِ الَّذِي خَلَقَهُنَّ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ

“రేయింబవళ్ళు, సూర్యచంద్రులు అన్నీ ఆయన(అద్వితీయ శక్తికి) నిదర్శనాలలోనివి. కనుక మీరు సూర్యునికి గానీ, చంద్రునికి గానీ సాష్టాంగ పడకండి. మీకు దైవారాధన చేయాలనే ఉంటే ఈ నిదర్శనాలన్నింటినీ సృష్టించిన దైవానికి మాత్రమే సాష్టాంగపడండి.” (హామీమ్‌సజ్దా 41:37)

దైవదూతలను పూజించటం కూడా షిర్కేనన్న దానికి తార్కాణం:

وَلَا يَأْمُرَكُمْ أَن تَتَّخِذُوا الْمَلَائِكَةَ وَالنَّبِيِّينَ أَرْبَابًا

“మీరు దైవదూతలను, దైవప్రవక్తలను మీ ప్రభువుగా చేసుకోమని ఆయన మిమ్మల్ని ఆదేశించటం లేదు.” ‘ (ఆలె ఇమ్రాన్‌ 3:80)

దైవప్రవక్తలను పూజించటం, అక్కరల కోసం వారిని అర్థించటం ‘షిర్క్‌’ అన్న దానికి ఈ సూక్తి నిదర్శనం:

وَإِذْ قَالَ اللَّهُ يَا عِيسَى ابْنَ مَرْيَمَ أَأَنتَ قُلْتَ لِلنَّاسِ اتَّخِذُونِي وَأُمِّيَ إِلَٰهَيْنِ مِن دُونِ اللَّهِ ۖ قَالَ سُبْحَانَكَ مَا يَكُونُ لِي أَنْ أَقُولَ مَا لَيْسَ لِي بِحَقٍّ ۚ إِن كُنتُ قُلْتُهُ فَقَدْ عَلِمْتَهُ ۚ تَعْلَمُ مَا فِي نَفْسِي وَلَا أَعْلَمُ مَا فِي نَفْسِكَ ۚ إِنَّكَ أَنتَ عَلَّامُ الْغُيُوبِ

(ఆ సన్నివేశాన్ని గురించి కాస్త ఆలోచించండి) “మర్యమ్‌ కుమారుడవైన ఓ ఈసా! నీవు మనుష్య జాతితో, అల్లాహ్‌ను కాదని నన్నూ, నాతల్లిని దేవుళ్ళుగా భావించండి అని బోధించావా? అని అల్లాహ్‌ అడిగినప్పుడు అతను ఇలా మనవి చేనుకుంటాడు: “నీవు అత్యంత పవిత్రుడవు! ఏ మాటను అనే హక్కు నాకు లేదో ఆ మాటను అనడం నాకు యుక్తమైన పని కాదు. ఒకవేళ నేను ఆ విధంగా అని ఉంటే, అది నీకు తప్పకుండా తెలిసి ఉండేది. నామనస్సులో ఏముందో నీకు తెలుసు. నీమనస్సులో ఏముందో నాకు తెలియదు. నీవు గుప్తంగా ఉన్న యదార్థాలన్నీ తెలిసిన మహా జ్ఞానివి.” (అల్‌ మాయిద 5:116)

ఇక ఔలియాలు, పుణ్యపురుషులకు సంబంధించిన నిదర్శనం (అంటే వాళ్ళను వేడుకుని, వాళ్ళ ఆధారంగా దేవుని సామీప్యం పొందవచ్చుననుకోవటం షిర్క్‌. ఇలాంటి వ్యవహారాలకు అల్లాహ్‌ అతీతుడు, ఉన్నతుడు). ఈ సూక్తిని గమనించండి:

أُولَٰئِكَ الَّذِينَ يَدْعُونَ يَبْتَغُونَ إِلَىٰ رَبِّهِمُ الْوَسِيلَةَ أَيُّهُمْ أَقْرَبُ وَيَرْجُونَ رَحْمَتَهُ وَيَخَافُونَ عَذَابَهُ ۚ إِنَّ عَذَابَ رَبِّكَ كَانَ مَحْذُورًا

“ఈ ప్రజలు ఎవరిని మొర పెట్టుకుంటున్నారో వారే స్వయంగా తమ ప్రభువు సాన్నిధ్యాన్ని పొందడానికి మార్గాన్ని వెతుకుతున్నారు. ఒకరితో ఒకరు పోటీపడుతున్నారు. వారు, ఆయన కారుణ్యాన్ని ఆశిస్తున్నారు. ఆయన శిక్షకు భయపడుతున్నారు.” (బనీ ఇస్రాయీల్‌ 17:57)

ఇక చెట్టు పుట్టలు, రాళ్ళు రప్పలకు సంబంధించిన నిదర్శనం – అంటే వృక్షాలను, రాళ్ళను పూజించటం, మహనీయుల సమాధుల నుండి శుభం పొందాలని తాపత్రయ పడటం, తమ కష్టాలను, కడగండ్లను దూరం చేసుకోవటానికి వాళ్ళను మొక్కుకోవటం, వారి పేరున జంతువులను కోయటం, ఆ సమాధుల వద్ద కొంత కాలంపాటు గడపటం, అక్కడే ఆరాధనలు చేయటం, అక్కడి మట్టితో, వస్త్రాలతో ‘శుభం’ పొందగోరటం-ఇవన్నీ ‘షిర్క్‌’గా పరిగణించ బడతాయి. అల్లాహ్‌ ఈ విధంగా సెలవిచ్చాడు –

أَفَرَأَيْتُمُ اللَّاتَ وَالْعُزَّىٰ

ఇప్పుడు చెప్పండి : “ఈ లాత్‌, ఈ ఉజ్జా, మూడోది ఒక దేవత అయిన మనాత్‌ల వాస్తవికత గురించి మీరు కాస్తయినా ఆలోచించారా?” (అన్‌ నజ్మ్‌ 53:19)


1 ఈ సూక్తికి వ్యాఖ్యానంగా హాఫిజ్‌ ఇబ్నె కసీర్‌ ఇలా అంటున్నారు: తనను తప్ప మరొకరిని పూజించమని అల్లాహ్ ఎన్నడూ ఆదేశించడు. తన దూతలను పూజించమని గానీ, తాను పంపిన ప్రవక్తలను ఆరాధించమని గానీ కోరడు. ఇస్లాం స్వీకరించిన తరువాత ధిక్కార వైఖరికి ఒడిగట్టమని కూడా అనడు. దైవేతరుల దాస్యం చేయమని పిలుపు ఇచ్చేవాడే ఇలాంటి ఆజ్ఞలు జారీ చేస్తాడు. దైవేతరుల దాస్యం కొరకు ఆహ్వానించిన వాడు నిశ్చయంగా  కుఫ్ర్కి (అవిశ్వాసానికి) ఒడిగట్టాడు. కాగా; దైవప్రవక్తలు సతతం ఈమాన్‌ గురించి మాత్రమే ఉపదేశిస్తారు. సాటిలేని సృష్టికర్తను నమ్మటం, దాస్యం చేయటమే ఈమాన్‌ బిల్లాహ్‌.

2. “ఊలాయి కల్లజీన……..” సూక్తి గురించి బుఖారీలో హజ్రత్‌ అబ్దుల్లాహ్ చే ఇలా ఉల్లేఖించబడింది – “ప్రజలు మొర పెట్టుకునే ఆ కొంతమంది ఎవరంటే వారు జిన్ను వర్గానికి చెందిన వారు. తరువాత వారు ఇస్లాం స్వీకరించారు.”

హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రది అల్లాహు అన్హు) కథనం ఈ విధంగా వుంది: “ఈ ఆయతు జిన్నులను పూజించే అరబ్బులను ఉద్దేశించి అవతరించింది. ఆ జిన్నులు తరువాత ఇస్లాం స్వీకరించారు. ఆ సందర్భంగానే ఈ ఆయతు అవతరించింది. వాస్తవం అల్లాహ్‌ యెరుక” (షేఖ్‌ ముహమ్మద్‌ మునీర్‌ డెమాస్కసీ)


అల్లాహ్‌ ముష్రిక్కుల వైఖరిని ఖండిస్తూ ఈ ఆయతును అవతరింపజేశాడు. వాళ్లు విగ్రహాలను, దేవీదేవతలను పూజించేవారు. వాళ్ల పేరుతో కాబా గృహం మాదిరిగా కట్టడాలు నిర్మించేవారు.

లాత్‌ : తాయఫ్‌లో ఒక తెల్లని రాయి ఉండేది. దానిపై ఓ గృహం నిర్మించబడింది. అందులో అనేక తెరలు ఉండేవి. అనేక మంది సేవకులుండేవారు. దాని చుట్టూ మైదానాలుండేవి. తాయఫ్‌లో సఖీఫ్‌ తెగవారి దృష్టిలోఈ కట్టడం ఎంతో పవిత్రమైనదిగా, పూజనీయంగా ఉండేది.ఆ ప్రదేశంలో ఆ విగ్రహం ఉన్నందుకు ఖురైషులతోపాటు ఇతర అరబ్బు తెగలవారు కూడా గర్వపడేవారు.

ఉజ్జా: ఇదొక వృక్షం.ఇది ‘నఖ్లా’ అనే స్థలంలో ఉంది. ఈ “నఖ్లా’ మక్కా నగరానికి తాయఫ్‌ పట్టణానికి మధ్య ఉంది. ఈవృక్షంపై ఒక కట్టడం వెలిసింది. దానిపై కొన్ని పరదాలు వేలాడదీయబడ్డాయి. ఖురైష్‌ తెగవారు ఈ కట్టడాన్ని ఆరాధించేవారు. ఈ కారణంగానేనేమో ఉహుద్‌ యుద్ధ దినాన అబూ సుఫ్యాన్‌ ఈ కట్టడాన్ని తలచుకుంటూ”మాకు అండగా, ఉజ్జా దేవత ఉంది. మీకెవరున్నారు?!” అని ముస్లింలకు సవాలు విసిరాడు.దానికి సమాధానంగా మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన ప్రీయ సహచరుల చేత, “అల్లాహ్‌ మాకు అండగా ఉన్నాడు. మీకు అండగా ఎవరూ లేరు” అని చెప్పించారు.

మనాత్‌ : మక్కా-మదీనా నగరాల మధ్య ముసల్లల్‌ అనే స్ధలంలో ఈ విగ్రహం ఉండేది. అజ్ఞాన కాలంలో ఖుజాఅ, బెస్‌, ఖజ్రజ్‌ తెగల వారు ఈ విగ్రహానికి తమ శ్రద్ధాభక్తుల నివాళి ఘటించేవారు. హజ్‌ నెలలో కాబాకు వచ్చే యాత్రికులు ఈ స్థలం నుండే ఇహ్రామ్‌ దీక్ష బూనేవారు.ఈ కట్టడాలన్నింటినీ కూల్చడానికి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కొంతమంది సహాబీలను పంపించారు. హజ్రత్‌ ఖాలిద్‌ బిన్‌ వలీద్‌ (రజి యల్లాహు అన్హు)ని మాత్రం “ఉజ్జా’ వైపునకు పంపారు.ఆయన ఆ కట్టడాన్ని నేలమట్టం చేస్తూ ఇలా పలికారు:-

ఓ ఉజ్జా! నేను నిన్ను ధిక్కరిస్తున్నాను. నీ పవిత్రతను కొనియాడబోను. అల్లాహ్‌ నీకు దుర్గతి పట్టించాడు.”

హజ్రత్‌ ముగీరా బిన్‌ షోబ (రజి యల్లాహు అన్హు), హజ్రత్‌ సుఫ్యాన్‌ (రజి యల్లాహు అన్హు)లను “లాత్‌’ విగ్రహం వైపునకు పంపించగా వారిద్దరూ కలసి ఆ విగ్రహాన్ని కూల్చివేశారు. ఆస్థలంలో ఒక మస్జిద్ను కూడా నిర్మించారు.ఈ విగ్రహం తాయఫ్‌ పట్టణంలో ఉండేది. మనాత్‌ విగ్రహం వైపునకు హజ్రత్‌ సుఫ్యాన్‌ పంపించబడ్డారు.ఆయన దాన్ని పడగొట్టారు. హజ్రత్‌ అలీ బిన్‌ అబూ తాలిబ్‌ పడగొట్టారని కూడా ఒక ఉల్లేఖనం ఉంది.

మహాప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు సత్య ధర్మాన్ని తీసుకువచ్చారు. ఒక్కడైన సృష్టికర్తను సేవించమనీ, దైవారాధన స్వచ్భంగా ఉండాలనీ ఆయన ప్రజలకు బోధించారు. దురాచారాలను, షిర్కుతో కూడుకున్న కర్మలను ఆయన నిర్మూలించారు. ఆయన ప్రియ సహచరులు, వాళ్ల శిష్యులు కూడా ఈ సత్య ధర్మంపై స్థిరంగా ఉన్నారు. అయితే కాలక్రమేణా అనుయాయుల ధర్మావలంబనలో మార్చులు వచ్చాయి. ఆచరణలు కలగాపులగం అయి చాలా మంది ముస్లింలు షైతాన్‌ ఎత్తులకు చిత్తయిపోయారు. మిథ్యావాదులు ముస్లింలను లోబరుచు కున్నారు. వాళ్లు మళ్లీ విగ్రహారాధన వైపునకు మొగ్గసాగారు. తమకు తెలియ కుండానే వాళ్లు నెమ్మదిగా బహు దైవోపాసన వైపునకు తీసుకుపో బడుతున్నారు. కాని పండితులు ఈ విషయాన్ని పట్టించు కోవటం లేదు.ఇది ఎంతో శోచనీయం.

– షేక్‌ ముహమ్మద్‌ మునీర్‌ డెమాస్కసీ

హజ్రత్‌ అబూ వాఖిద్‌ లైసీ (రజి యల్లాహు అన్హు) ఇలా అంటున్నారు: “మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో కలిసి హునైన్‌ వైపునకు బయలుదేరాము. ఆరోజుల్లోనే మేము దైవధిక్కార (కుఫ్ర్) ఊబిలో నుండి బయటపడి ఉన్నాము. దారిలో ఒక రేగి చెట్టు ఉండేది. బహు దైవారాధకులు ఆ వృక్షం వద్ద బైఠాయించేవారు. తమ ఆయుధాలను ఆ వృక్షానికి వ్రేలాడదీసేవారు. ఆ వృక్షం “జాతుల్‌ నవాద్‌”గా పిలువబడేది. ఆ వృక్షం వద్దకు సమీపించగానే, “దైవప్రవక్తా! ఏవిధంగానయితే ఈ వృక్షం వాళ్లకోసం ‘జాతుల్‌ నవాద్‌’గా ఉందో ఆ విధంగా మాక్కూడా ‘జాతుల్‌ నవాద్‌’ గా చేయండి”అని మేము ప్రాధేయపడ్డాము.దీనిపై మహాప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు ఆగ్రహం చెందారు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా వ్యాఖ్యానించారు:

“అల్లాహు అక్బర్‌! ఇవైతే ప్రాచీన కాలవు ఆచారాలు. ఎవరి అధీనంలో నా ప్రాణముందో ఆయన సాక్షిగా చెబుతున్నాను. ఇస్రాయీల్‌ సంతతి వారు మూసా (అలైహిస్సలాం)తో అన్న మాటలే ఈనాడు మీరు అన్నారు.”వాళ్ళకున్న ఆరాధ్య దైవాల వంటివే మాకోసం కూడా కల్పించండి” అని ఇస్రాయీల్‌ వంశీయులు చెప్పి ఉన్నారు. మీరు ఒట్టి అజ్ఞానులు. మీరు మీ పూర్వీకులయిన యూదుల, కైస్తవుల పద్ధతులను అనుసరించేలా ఉన్నారు.” (తిర్మిజీ)

నాల్గవ నియమం :

ఈ కాలపు ముష్రిక్కులు పూర్వకాలపు ముష్రిక్కుల కన్నా కడు హీనంగా ఉన్నారు. ఎందుకంటే, పూర్వకాలపు ముష్రిక్కులు కలిమిలో షిర్క్‌ (బహు దైవోపాసన)కు పాల్చడే వారు. కష్టకాలం దాపురించగానే ఒక్కడైన దైవం వైపుకు చిత్తశుద్ధితో మరలేవారు. కాని ఈ కలికాలపు ముష్రిక్కులైతే కష్ట కాలంలోనే గాక,సుఖ సంతోషాల సమయాల్లో సైతం బహు దైవారాధనకు పాల్పడుతున్నారు. దైవ గ్రంథంలోని ఈ దైవోపదేశం ఇందుకు ప్రబల తార్కాణం :

فَإِذَا رَكِبُوا فِي الْفُلْكِ دَعَوُا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ فَلَمَّا نَجَّاهُمْ إِلَى الْبَرِّ إِذَا هُمْ يُشْرِكُونَ

“వారు పడవలోకి ఎక్కినప్పుడు తమ ధర్మాన్ని అల్లాహ్‌కే ప్రత్యేకించుకుని ఆయన్ని వేడుకుంటారు.తరువాత ఆయన వారిని రక్షించి నేలపైకి తీసుకు రాగానే, అకస్మాత్తుగా వారు బహుదైవారాధన చేయటం ఆరంభిస్తారు.” (అన్‌కబూత్‌ 29:65)

మనలోని చాలా మంది తమ పూర్వీకుల, సజ్జనుల సమాధుల వద్దకు పోయి,వాటి ముందు చేయి చాచి అర్థించటం మనం చూస్తూ ఉన్నాము. కలిమిలోనూ లేమిలోనూ కూడా వీళ్లు ఈ పని చేస్తున్నారు. ప్రాచీన కాలపు ముష్రిక్కులే నయం. ఎందుకంటే వాళ్లు కష్టాల్లో మాత్రం నిజదైవం వైపునకు మరలి, కష్టాలు తీరిపోయిన తరువాత బూటకపు దైవాల వద్దకు పోయేవారు. కాని నవీన ముష్రిక్కులకు ఇలాంటి తేడా పాడా లేమీ లేవు. పైగా కష్టకాలంలో వీళ్ల బహు దైవోపాసనా చేష్టలు మరింత పెరిగిపోతున్నాయి. లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహిల్‌ అలియ్యిల్‌ అజీమ్‌.

సర్వోన్నతుడైన అల్లాహ్‌ ఇలా సెలవిస్తున్నాడు:

وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ لَيَقُولُنَّ اللَّهُ ۚ قُلْ أَفَرَأَيْتُم مَّا تَدْعُونَ مِن دُونِ اللَّهِ إِنْ أَرَادَنِيَ اللَّهُ بِضُرٍّ هَلْ هُنَّ كَاشِفَاتُ ضُرِّهِ أَوْ أَرَادَنِي بِرَحْمَةٍ هَلْ هُنَّ مُمْسِكَاتُ رَحْمَتِهِ ۚ قُلْ حَسْبِيَ اللَّهُ ۖ عَلَيْهِ يَتَوَكَّلُ الْمُتَوَكِّلُونَ

“మీరు అల్లాహ్‌ను కాదని వేడుకునే మీ దేవీలు ఆయన కలిగించే నష్టం నుండి నన్ను కాపాడగలరా? లేదా అల్లాహ్‌ నాపై కనికరం చూపగోరికే, వారు ఆయన కారు ణ్యాన్ని అడ్డుకోగలరా? మీ అభిప్రాయ మేమిటీ? కనుక వారితో ఇలా అను : “నాకు అల్లాహ్‌ ఒక్కడే చాలు. నమ్ముకునే వారు ఆయననే నమ్ముకుంటారు.” (అజ్‌ జుమర్‌ 39:38)

ఇంకా ఈ విధంగా ఉపదేశించబడింది:

أَمَّن يُجِيبُ الْمُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوءَ وَيَجْعَلُكُمْ خُلَفَاءَ الْأَرْضِ ۗ أَإِلَٰهٌ مَّعَ اللَّهِ ۚ قَلِيلًا مَّا تَذَكَّرُونَ

“కలత చెందినవాడు మొర పెట్టుకున్నప్పుడు, అతని మొరను ఆలకించి, అతని బాధను తొలగించేవాడు ఎవడు? భూమిపై మిమ్మల్ని ప్రతినిధులుగా చేసినవాడు ఎవడు? అల్లాహ్‌తో పాటు (ఈ పనులు చేసే) మరొక దేవుడు కూడా ఎవడయినా ఉన్నాడా? కాని మీరు చాలా తక్కువగా ఆలో చిస్తారు?” (అన్‌ నమల్‌ 27:62)

ఇంకా ఈ విధంగా సెలవీయబడింది :

يُولِجُ اللَّيْلَ فِي النَّهَارِ وَيُولِجُ النَّهَارَ فِي اللَّيْلِ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ كُلٌّ يَجْرِي لِأَجَلٍ مُّسَمًّى ۚ ذَٰلِكُمُ اللَّهُ رَبُّكُمْ لَهُ الْمُلْكُ ۚ وَالَّذِينَ تَدْعُونَ مِن دُونِهِ مَا يَمْلِكُونَ مِن قِطْمِيرٍ إِن تَدْعُوهُمْ لَا يَسْمَعُوا دُعَاءَكُمْ وَلَوْ سَمِعُوا مَا اسْتَجَابُوا لَكُمْ ۖ وَيَوْمَ الْقِيَامَةِ يَكْفُرُونَ بِشِرْكِكُمْ ۚ وَلَا يُنَبِّئُكَ مِثْلُ خَبِيرٍ

“ఆయనను కాదని మీరు పిలిచే ఇతరులు కనీసం ఒక గడ్డిపోచకు కూడా యజమానులు కారు. వారిని వేడుకుంటే, వారు మీ ప్రార్థనలను వినలేరు. ఒకవేళ విన్నా, వాటికి ఏ నమాధానమూ మీకు ఇవ్వలేరు. మీరు కల్పించిన దైవత్వపు భాగస్వామ్యాన్ని వారు ప్రళయంనాడు తిరస్కరిస్తారు. సత్యాన్ని గురించిన ఈ సరైన సమాచారాన్ని తెలిసినవాడు తప్ప మరొకడెవ్వడూ మీకు అందజెయ్యలేడు.” (ఫాతిర్‌ 35: 13,14)

ఇంకా ఈ విధంగా కూడా ఉపదేశించబడింది:

وَمَنْ أَضَلُّ مِمَّن يَدْعُو مِن دُونِ اللَّهِ مَن لَّا يَسْتَجِيبُ لَهُ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ وَهُمْ عَن دُعَائِهِمْ غَافِلُونَ وَإِذَا حُشِرَ النَّاسُ كَانُوا لَهُمْ أَعْدَاءً وَكَانُوا بِعِبَادَتِهِمْ كَافِرِينَ

“అల్లాహ్‌ను కాదని, ప్రళయం వచ్చే వరకు అతనికి నమాధానమైనా ఇవ్వలేని వారిని, మొరపెట్టుకునే వారు తమకు మొరపెట్టుకుంటున్నారనే విషయం కూడా ఎరుగని వారిని వేడుకునే వాడికంటే పరమభ్రష్టుడైన మానవుడు ఎవడు ఉంటాడు? మానవులందరినీ సమావేశ పరచినప్పుడు, వారు తమనువేడుకున్న వారికి విరోధులై పోతారు. వారి ఆరాధనను తిరస్కరిస్తారు.” (అల్‌ అహ్‌ఖాఫ్‌ 46:5,6)


[వీడియో పాఠం]

షిర్క్ కి సంబంధించిన నాలుగు సూత్రాలు (The Four Principles of Shirk)
https://youtu.be/nAglSs0ggPE [~ 40 నిముషాలు]
వక్త: సయ్యద్ అబ్దుస్సలామ్ ఉమ్రి (హఫిజహుల్లాహ్)

 

దైవ మార్గంలో ఖర్చు (Spending in the way of Allah)

sadaqah

పుస్తకం నుండికలామే హిక్మత్ – 1(వివేక వచనం)
రచన: సఫీ అహ్మద్ మదనీ,
అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
ప్రకాశకులు: జమీ అతే అహ్ లె హదీస్, ఆంధ్రప్రదేశ్

[ఇక్కడ చదవండి / డౌన్ లోడ్ చేసుకోండి]

బలవంతుడైన విశ్వాసి – బలహీనుడైన విశ్వాసి (Strong Believer – Weak Believer)

strong-believer-weak-believer-telugu-islam

పుస్తకం నుండికలామే హిక్మత్ – 1(వివేక వచనం)
రచన: సఫీ అహ్మద్ మదనీ
అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
ప్రకాశకులు: జమీ అతే అహ్ లె హదీస్, ఆంధ్రప్రదేశ్

 [ఇక్కడ చదవండి / PDF డౌన్ లోడ్ చేసుకోండి]

అంతిమ దైవప్రవక్త ప్రవచించారని హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

“బలవంతుడైన విశ్వాసి బలహీనుడైన విశ్వాసికంటే మేలైనవాడు. ఇంకా – అతను-అల్లాహ్ కు ప్రీతిపాత్రుడు. ఇంకా, ప్రతివాని లోనూ మంచి ఉంటుంది. మీ కొరకుప్రయోజనకరమయిన వాటిని ఆశించండి. ఇంకా, దైవ సహాయం కోరండి, నిస్పృహకులోనవబాకండి. మీకు ఏదయినా బాధ కలిగితే, ‘ఒకవేళ నేను అలాచేసి ఉంటేఇలా జరిగేది’ అని అనబాకండి. దానికి బదులు, ‘ఇది అల్లాహ్ నిర్ణయించిన విధి.ఆయన తలచినదే అయింది’ అని అనండి. ఎందుకంటే, ‘ఒకవేళ అలా జరిగిఉంటే…..’ (అనే ఊహాగానాలు) షైతాన్ మార్గాన్ని తెరచివేస్తాయి.’ (ముస్లిం)

ఈ హదీసులో దైవప్రవక్త (సఅసం) మూడు ముఖ్య విషయాలను ప్రబోధించారు :

“ఇక్కడ బలం అంటే అన్ని రకాల బలం అని భావం. ఇమామ్ నవవి (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు – “ఇక్కడ బలం అంటే మనో నిబ్బరం కలిగి ఉండి, పరలోక విషయాలలో ముందంజ వేయడం అని భావం. ఈ గుణాలున్న వ్యక్తి ధర్మ పోరాటంలో అందరికంటే ముందుకు పోయి శత్రువుపై దాడి జరుపుతాడు.అందరికంటే ముందు దైవాన్వేషణలో మునుముందు ఉంటాడు, మంచిని పెంచడంలో, చెడులను నిర్మూలించడంలో, సహనం వహించటంలో వజ్ర సంకల్పుడై ఉంటాడు. దైవ మార్గంలో ఎన్ని ఆపదలు ఎదురైనా ఓరిమిని ప్రదర్శిస్తాడు. నమాజ్, రోజా, జకాత్ తదితర ఆరాధనలకై, ఇంకా వాటి రక్షణకై అందరికంటే ఎక్కువగా చురుకుదనం కలిగి ఉంటాడు.”

శారీరక బలం లేదా శరీర దారుఢ్యం కూడా దైవానుగ్రహమే. హజ్రత్ దావూద్ (అలైహిస్సలాం) గురించి చెబుతూ అల్లాహ్ ఇలా అన్నాడు:

అల్లాహ్ ఆయనకు బుద్ధిబలాన్ని, కండబలాన్ని సమృద్ధిగా ప్రసాదించాడు.” (అల్ బఖర : 247)

జ్ఞానశక్తి కూడా మహదానుగ్రహమే. తన అంతిమ గ్రంథంలో సర్వోన్నతప్రభువు ఏమన్నాడో చూడండి –

మీరు (వారితో) అనండి, జ్ఞానులు, అజ్ఞానులు ఇద్దరూ ఒకటేనా? కేవలం బుద్ధిమంతులే హితబోధను స్వీకరిస్తారు.” (అజ్జుమర్ : 9)

ధనబలం కూడా దైవప్రసాదితమైన వరమే. అల్లాహ్ సెలవిచ్చాడు :

ఇంకా చూడండి. అల్లాహ్ మీలో కొందరికి కొందరికంటే ఉపాధివిషయంలో ఆధిక్యత ప్రసాదించాడు. అయితే ఎవరికయితే ఈ ఆధిక్యతఇవ్వబడిందో, వారు తమ ఉపాధిని తమ బానిసల వైపునకు మళ్ళించేవారు కాదు. ఇద్దరూ ఈ ఉపాధిలో సమానమైన భాగస్థులు అయ్యేందుకు.అయితే అల్లాహ్ ఉపకారాన్నే ఒప్పుకోవటానికి వీరు తిరస్కరిస్తున్నారా?” (అన్ నహ్ల్ – 71)

ఒక మనిషికి రెండో మనిషిపై ఆధిక్యతను ఇచ్చే, ఇంకా అతని వ్యవహారాలలో సరళతను సృష్టించే ప్రతిదీ బలంగానే పరిగణించ బడుతుంది. అటువంటి బలం గనక దైవ విధేయతలో, దైవ ప్రసన్నతను పొందే పనుల్లో వినియోగమైతే అది ఎంతో ప్రశంసనీయమైన దవుతుంది. ఈమాన్ (విశ్వాసం) అనేది ఎలాంటి ప్రేరణంటే అది మనిషి శక్తి సామర్థ్యాలు సరైన మార్గంలో వ్యయమయ్యేలా చేస్తుంది. తద్వారా మేలును, శుభాన్ని కలిగిస్తుంది. అందుకనే, “బలవంతుడైన విశ్వాసి బలహీనుడైన విశ్వాసి కన్నా మేలైనవాడు, అల్లాహ్ కు ప్రీతిపాత్రుడు” అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించారు.

(2). “ప్రతి వానిలోనూ మంచి ఉంది.”

అంటే విశ్వాసి బలవంతుడైనా, బలహీనుడైనా అతను మంచివాడే. ఎందుకంటేఅతనిలో విశ్వాసం ఉంది. విశ్వాసం స్వతహాగా బలమైనది. అన్ని రకాల శక్తులు క్షీణించినా కనీసం విశ్వాస బలమైతే ఉండనే ఉంటుంది. కనుక ఏ విశ్వాసినైనా హీనుడుగా, అల్పుడుగా పరిగణించడం సమ్మతం కాదు.

(3). “మీ కొరకు మేలైన వాటిని ఆశించండి.”

ఇక్కడ ఆశించడమంటే భావం ప్రయత్నించడం, దానికోసం శక్తియుక్తులన్నీ ఒడ్డటం.ప్రాపంచికంగా నయినా, పారలౌకికంగా నైనా శ్రేయస్కరమైన ప్రతిదాన్నీ పొందమని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశించారు. విశ్వాసి ప్రతి మంచినీ పొందే ప్రయత్నంలో ఉంటాడు. ఎందుకంటే అతను తన ప్రభువు అనుగ్రహానికి అతీతుడు కాలేడు. అల్లాహ్ సెలవిచ్చాడు:

(ఓ ప్రవక్తా! అనండి) నాకే గనక అగోచరాల జ్ఞానం ఉండి ఉంటే,ప్రయోజనకరమైన వాటిని నేను పుష్కలంగా పొందేవాడిని. నాకు నష్టమే వాటిల్లేది కాదు.”(అల్ ఆరాఫ్ – 188)

  1. “దైవ సహాయం అడగండి”

లాభదాయకమైన వాటిని పొందమని ఆదేశించిన తరువాత మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం),’లాభకరమైన వస్తువు దైవ ప్రమేయంతోనే ప్రాప్తిస్తుంద’ని కూడా చెప్పారు. అందుకే లక్ష్య సాధన కొరకు దైవ సహాయాన్నే వేడుకోవాలి. ప్రతి మేలు, ప్రతి సహాయంఆయన అనుగ్రహంతోనే లభిస్తుంది. అల్లాహ్ తలచనంతవరకూ ఏ కారణాలూఏమీ చేయలేవు. ఎందుకంటే కారణాలను పర్యవసానాలను సృష్టించిన వాడు అల్లాహ్ యే గనక. ధర్మసమ్మతమైన కోర్కెల సాధనకై విశ్వాసి ధర్మ సమ్మతమైనఒనరులనే వినియోగిస్తాడు. అయితే నమ్మకం మాత్రం లాభనష్టాలను చేకూర్చగలశక్తిని కలిగిఉన్న దైవంపై పెట్టుకుంటాడు.

  1. “నిస్పృహకు లోనవబాకండి”

అంటే దైవవిధేయతలో, దైవ సహాయం కోరే విషయంలో అలసత్వం, బద్దకంపనికిరావు. దానికి బదులు దైవాన్ని ఆశతో వేడుకోవాలి. వేడుకోవటంతో పాటు’సాధన’ చేయాలి. దైవానుగ్రహాలను పొందే విషయంలో మందకొడిగా ఉండటం, విముఖతను చూపటం ఎంతకీ మంచిది కాదు. అలా చేస్తే దైవానుగ్రహాలనుఆక్షేపించినట్లవుతుంది. విశ్వసించిన వ్యక్తి దైవానుగ్రహాలను ఎన్నడూ ఆక్షేపించడు.

  1. మీకేదయినా బాధ కలిగినపుడు, ‘మేము గనక అలాచేసి ఉంటే ఇలా జరిగిఉండేది’ అని అనటం ఎంతమాత్రం భావ్యం కాదు.

విశ్వాసి సమస్త ప్రయత్నాలను చేసిన తరువాత కూడా అనుకున్నది నెరవేరకపోతే,దాని నష్టం నుండి బయటపడకపోతే, అప్పుడు దైవ నిర్ణయానికి రాజీపడిపోవాలి.దైవచిత్తం కాని దాన్ని సాధించలేనని తెలుసుకోవాలి. ఫలానా కారణంగా ఈ పనికాలేదని నిందమోపటం, లేదా ఒకవేళ ఆ చర్య గైకొని ఉంటే అది నెరవేరేది అనికాకి లెక్కలు వేయటం మోమిన్ (విశ్వాసి) స్థాయికి ఎంతమాత్రం తగదు.

  1. ఈ హదీసులో “ఒకవేళ” అనే పదం ఉపయోగించరాదని చెప్పబడింది. అయితే కొన్ని ఇతర హదీసుల్లో ఈ “పదం” వాడినట్లు కూడా ఉంది. అంతిమ హజ్సందర్భంగా మహాప్రవక్త (సఅసం), ‘ఒకవేళ ఇప్పుడు నా దృష్టికి వచ్చిన విషయం ముందే తెలిసి ఉంటే ఖుర్బానీ పశువుల్ని తెచ్చేవాడ్ని కాను’ అని అన్నారు. అలాగేదివ్య ఖుర్ఆన్,

“ఒకవేళ నాకే గనక అగోచర విషయజ్ఞానం ఉంటే ప్రయోజనకరమైనవాటినెన్నో పొందేవాడిని, నాకు కష్టనష్టాలే రాకుండా ఉండేవి (అని ఓప్రవక్తా వారితో చెప్పివేయండి)” అని అనబడింది.

దీని భావం ఏమంటే భవిష్యత్తులో ఏదైనా మంచి పని చేయాలన్న సంకల్పం ఉంటే, ఉదాహరణకు, ‘ఒకవేళ వచ్చే సంవత్సరం దాకా నేను బ్రతికి వుంటే హజ్ చేస్తాను’ అనవచ్చు. అందులో తప్పులేదు. లేదా గత జీవితంలో దైవవిధేయత విషయంలో జరిగిన లోటుపాట్లను తల్చుకుని సిగ్గుపడుతూ, ‘ఒకవేళ నేను నమాజ్ను క్రమం తప్పకుండా చేసివుంటే ఎంత బాగుండేది!’ అని అనవచ్చు. ఇంకా, అల్లాహు అయిష్టం కాని రీతిలో ఏదన్నా వాక్యం పలికినా దోషం లేదు. ఉదాహరణకు హిజ్రత్సందర్భంగా హజ్రత్ అబూబకర్ (రజిఅన్) సూర్ గుహలో, ఓ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)!బహు దైవారాధకులలో ఎవరయినా తల ఎత్తాడంటే చాలు, మిమ్మల్ని చూసేస్తాడు”అని అన్నారు.

అయితే గతంలో జరిగిపోయిన నష్టాన్ని తలచుకుని ‘అరె అలా చేసే బదులు ఇలాచేసి ఉంటే లాభదాయకంగా ఉండేదేమో!’ అని మాత్రం అనకూడదు. అలా అనటం వల్ల దైవంపై నమ్మకం సడలి పోయిన భావం వ్యక్తమవుతుంది. ఉదాహరణకు,“నేను ఫలానా వస్తువు తిని ఉంటే స్వస్థత చేకూరేదేమో” అని అనడం విశ్వాసరాహిత్యానికి ఆనవాలుగా ఉంటుంది.

ఈ హదీసులో ఎన్నో ముఖ్యమైన విషయాలు చెప్పబడ్డాయి. మొదటి విషయమేమంటే విశ్వాసులలో ఒకటికి రెండు కోవలకు చెందిన వారుంటారు. అయితే వారిలోనిబలవంతుడంటే అల్లాహ్ కు ఇష్టం. ఎందుకంటే దైవాజ్ఞాపాలనలో అతను తన బలాన్నిశక్తిని ధారపోస్తాడు. బలహీనుడైన విశ్వాసికన్నా సక్రమంగా ఎక్కువగా దైవాన్నిసేవిస్తాడు. అందుకే బలాన్ని, శక్తిని పొందడానికి ప్రయత్నించమని దైవప్రవక్త నొక్కిపలికారు. ఎందుకంటే ప్రతిదీ ప్రయత్నం ద్వారానే హస్తగతమవుతుంది. అలసత్వం సోమరితనాలవల్ల ఏదీ ప్రాప్తించదు. సోమరితనం, బద్దకాలను దూరంచేసి ధర్మసమ్మతమయిన ఒనరులను వినియోగించుకోవాలని చెప్పబడింది.

అయితే ఒక విశ్వాసి ప్రత్యేకత ఏమంటే అతని మనసు ఎంతసేపటికీ భౌతికవనరుల పైకాక, దైవ ప్రోద్బలంపై ఆధారపడి ఉంటుంది. మనిషి ఎన్ని ఒనరుల్నిసమకూర్చుకున్నా, ఎన్ని జాగ్రత్తలు గైకొన్నా నిర్ణీత లక్ష్యం నెరవేరి తీరుతుందన్ననమ్మకం లేదు. మనిషి విఫలుడవటం సంభవమే. ఒక్కోసారి అతను నిర్ణయించుకున్నలక్ష్యాన్ని అందుకోకపోవటంలోనే అతని శ్రేయస్సు ఇమిడి ఉండవచ్చు. ఎందులోఏం మేలుందో దైవానికే తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో విశ్వాసి నిరాశకుగురికాకుండా తన ప్రభువేచ్ఛతో రాజీపడిపోతాడు. విధిని విదిలించే, ఒనరులనుతప్పుపట్టే బదులు ‘దైవచిత్తం ఇలా ఉంది కాబోలు. కనుక ఇది నాకు ఆమోదమే’అని అంటాడు. అలాగే అతని ఆంతర్యం ఈర్ష్య, అసూయ, కపటత్వం, ద్వేషంవంటి నకారాత్మక భావనల నుడి, తుచ్ఛమైన భావాల నుండి సురక్షితంగా ఉంటుంది.ఇంకా అతని ఆంతర్యంపై దైవ కారుణ్యం ప్రశాంతత అవతరిస్తాయి.

పశ్చాత్తాపం (Repentance)

repentance-telugu-islam

పుస్తకం నుండికలామే హిక్మత్ – 1(వివేక వచనం)
రచన: సఫీ అహ్మద్ మదనీ
అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
ప్రకాశకులు: జమీ అతే అహ్ లె హదీస్, ఆంధ్రప్రదేశ్

[ఇక్కడ PDF డౌన్ లోడ్ చేసుకోండి]

క్లుప్తంగా ఇమామ్ బుఖారీ & ఇమామ్ ముస్లిం గురుంచి | అల్-లూలు వల్ మర్జాన్

nature-bukhari-muslim

Brief Biography of Imam Bukhari & Imam Muslim

[ఇక్కడ చదవండి / PDF డౌన్లోడ్ చేసుకోండి]

రచయిత :సయ్యిద్ షబ్బీర్ అహ్మద్
మూలం:మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) గ్రంధ పరిచయం నుండి

కరుణామయుడు, కృపాసాగరుడయిన అల్లాహ్ పేరుతో

అల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదుల్ ముర్సలీన్, అలా ఆలిహీ వ అస్ హాబిహీ అజ్మయీన్. ఈ గ్రంథం అసలు పేరు అరబీ భాషలో “అల్ లూలు వల్ మర్జాన్”. ఇందులోని పదావళి దివ్యఖుర్ఆన్లో ఈ విధంగా ప్రస్తావించబడింది:

مَرَجَ الْبَحْرَيْنِ يَلْتَقِيَانِ بَيْنَهُمَا بَرْزَخٌ لَّا يَبْغِيَانِ فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ يَخْرُجُ مِنْهُمَا اللُّؤْلُؤُ وَالْمَرْجَانُ فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

“ఆయన రెండు సముద్రాలను పరస్పరం కలిసిపోయేలా వదలి పెట్టాడు. అయినా వాటిమధ్య ఒక అడ్డుతెర ఉంది. దానివల్ల అవి ఒకదానిలోకొకటి చొచ్చుకుపోలేవు. కనుక (మానవులారా! జిన్నులారా!!) మీ ప్రభువు శక్తి పరిధిలోని ఏ మహిమను మీరు నిరాకరించగలరు? ఈ సముద్రాలలో ముత్యాలు, పగడాలు కూడా లభిస్తాయి. కనుక (మానవులారా! జిన్నులారా!!) మీ ప్రభువులోని ఏ ఔన్నత్యాన్ని మీరు కాదనగలరు?”(55:19-23)

ఈ గ్రంథంలో మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) సంప్రదాయాల (హదీసుల)కు సంబంధించిన సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం అనే రెండు హదీసు గ్రంథాలను రెండు సముద్రాలతో పోల్చడంజరిగింది. అయితే ప్రస్తుత సంకలన కర్త అల్లామా ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ హదీసుల మూలం (Text) ని బుఖారీ గ్రంథం నుండి గ్రహించి స్కంధాలు, అధ్యాయాల క్రమాన్ని, శీర్షికలపేర్లను మాత్రం ముస్లిం గ్రంథం నుండి స్వీకరించారు. అదీగాక పై రెండు గ్రంథాలలోనూ ఒకే ఉల్లేఖకుడు తెలిపిన ఉమ్మడి హదీసుల్ని మాత్రమే ఈ గ్రంథం కోసం ఎంచుకున్నారు. వీటిని “ముత్తఫఖున్ అలైహ్” (ఉభయోకీభవిత) హదీసులని అంటారు. వీటినే ఈ సంకలనకర్త ముత్యాలు,పగడాలుగా అభివర్ణించి, దాన్నే తన గ్రంథానికి నామకరణం చేశారు.

అంతిమ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి ప్రవచనాలు, ఆచార వ్యవహారాలు, ఆజ్ఞలు, అనుజ్ఞలు, అలవాట్లు, అభిరుచులు, కదలికలు, కథనాలు, సలహాలు, సూచనలు, స్వరూప స్వభావాలు -ఒక్కటేమిటి, ఆ మహనీయుని జీవితంలోని ప్రతి అంశానికి, ప్రతి కోణానికి సంబంధించిన హదీసుల్ని సేకరించి, సంకలనం చేసి పకడ్బందీగా భద్రపరిచారు హదీసు వేత్తలు. ఈ మహాకార్యం వెనుక వారి అవిరళ కృషి, అవిశ్రాంత శ్రమ, అసామాన్య సాహసం మనకు స్పష్టంగా గోచరిస్తాయి.

హదీసువేత్తలు ఉల్లేఖకుల నుండి హదీసుల్ని సేకరిస్తున్నప్పుడు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గౌరవోన్నతుల పై అణుమాత్రం కూడా మచ్చరాని విధంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ మహానాయకుని పట్ల విశ్వాసం, ప్రేమాభిమానాలు ఇసుమంత సడలినట్లనిపించినాసరే అలాంటి హదీసుల్ని వారసలు స్వీకరించనే లేదు. హదీసుల సేకరణ తరువాత వారా హదీసుల్ని పరి పరి విధాల పరిశీలించి, శల్యపరీక్ష చేసి, క్షుణ్ణంగా వడపోసి వాటి నుండి పూర్తిగా నమ్మకమయినవని, నిజమయినవని ధృవీకరించుకున్న హదీసుల్ని మాత్రమే ఎంచుకొని సంకలనం చేశారు. హదీసులు ప్రామాణికత విషయంలో వారి దైవభీతి పరాయణత, నిజాయితీ, విశ్వసనీయలతో పాటు, హదీసుల ప్రామాణికతను పరిశీలించడానికి వారు నిర్దేశించిన కొలమానాలు యావత్తు ముస్లిం జగత్తులో ఎంతో గుర్తింపు పొందాయి. ఇలా సంకలనం చేసిన గ్రంథాలలో సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం, తిర్మిజి, అబూదావూద్, నసాయి. ఇబ్ను మాజా, ఇమాం మాలిక్ గారి మువత్తా, ఇమాం ముహమ్మద్ గారి మువత్తా, ముస్నద్ అహ్మద్, దార్మి, దారెఖత్ని, బైహఖీ మొదలైనవెన్నో ఉన్నాయి. వీటిలో హదీసుల ఆరోగ్యస్థితి, ప్రామాణికతల రీత్యా మొదటి ఆరు గ్రంథాలు అత్యున్నత స్థాయికి చెందిన గ్రంథాలుగా ఖ్యాతి చెందాయి. ఈ ఆరు గ్రంథాలను “సహీ సిత్తా” (షడ్నీజాలు) అంటారు.

వీటిలో మన సంకలనకర్త తన గ్రంథం కోసం ఎంచుకున్న రెండు గ్రంథాలు సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలను గురించి, వాటిని సంకలనం చేసిన ప్రముఖ హదీసు వేత్తలు ఇమాం బుఖారీ (రహిమహుల్లాహ్), ఇమాం ముస్లిం (రహిమహుల్లాహ్) గార్ల జీవిత చరిత్రలను గురించి ఇక్కడ సంక్షిప్తంగానయినా తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

సహీహ్ బుఖారీ గ్రంథాన్ని సంకలనం చేసిన ఇమామ్ అబూ అబ్దుల్లా ముహమ్మద్ బిన్ ఇస్మాయీల్ బిన్ ఇబ్రాహీమ్ అల్ బుఖారీ (రహిమహుల్లాహ్) హిజ్రీ శకం 194, షవ్వాల్ మాసం 13వ తేదీ శుక్రవారం నాడు బుఖారాలో ఒక పేద కుటుంబంలో జన్మించారు. ఆయన పదేళ్ళ ప్రాయంలో విద్యాభ్యాసం ప్రారంభించారు. స్వగ్రామంలో ప్రాథమిక విద్యనభ్యసించిన తరువాత ఉన్నత విద్యకోసం ముస్లిం జగత్తులోని యావత్తు ప్రధాన విద్యా కేంద్రాలన్నీ పర్యటించారు. ఈ సుదీర్ఘ పర్యటనలో ఆయన 1080 మంది ధర్మవేత్తల నుండి హదీసు విద్య నేర్చుకున్నారు. పదేళ్ళ ప్రాయంలోనే ఆయన బుఖారాలో ఆనాటి హదీసు విద్యాపారంగతులు ఇమామ్ దాఖలీ (రహిమహుల్లాహ్) గారి పాఠశాలలో చేరారు.

ఒక రోజు ఇమామ్ దాఖలీ (రహిమహుల్లాహ్) ఒక హదీసు ప్రమాణాన్ని పేర్కొంటూ “సుఫ్యాన్ అన్ అబీజుబైర్ అన్ ఇబ్రాహీం” అని అన్నారు. అప్పుడు ఇమాం బుఖారీ (రహిమహుల్లాహ్) కల్పించుకొని “ఈ హదీసు ప్రమాణం ఈ విధంగా లేదండీ! అబూజుబైర్ ఈ హదీసుని ఇబ్రాహీం నుండి ఉల్లేఖించ లేదు”అని అన్నారు.

అతి పిన్న వయస్సులో ఉన్న ఒక శిష్యుడు తనను ఇలా తప్పుబట్టడంతో గురువు గారుఉలిక్కిపడ్డారు. ఆయన కోపంతో కొర కొర చూశారు. ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) గురువు గారి పట్లఎంతో వినయ విధేయతలతో వ్యవహరిస్తూ “మీ దగ్గర అసలు గ్రంథం ఉంటే అందులో ఓసారిచూసుకోండి” అని ప్రశాంతంగా అన్నారు.

ఇమామ్ దాఖలీ (రహిమహుల్లాహ్) ఇంటికి వెళ్ళి అసలు గ్రంథాన్ని పరిశీలించి ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) చేసిన విమర్శ సహేతుకమయినదేనని గ్రహించారు. ఆయన తిరిగి వచ్చి “అయితే సరయిన ప్రమాణం ఏమంటావు?” అని అడిగారు. ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) తక్షణమే సమాధానమిస్తూ “సుఫ్యాన్ అనిజ్జుబైరి వహు వన్బు అదియ్యి అన్ ఇబ్రాహీం (ఇబ్రాహీం నుండి జుబైర్ బిన్ అదీ రహిమహుల్లాహ్-ఉల్లేఖించారు; అబూజుబైర్ అనడం సరికాదు)” అని అన్నారు.

అప్పటికి ఇమామ్ బుఖారీ వయస్సు పదకొండేండ్లు కూడా నిండలేదు. పదహారు సంవత్సరాలవయస్సులో ఆయన హజ్రత్ అబ్దుల్లా బిన్ ముబారక్ (రహిమహుల్లాహ్), ఇమామ్ వకీ (రహిమహుల్లాహ్)లు సేకరించిన హదీసులన్నీ కంఠస్తం చేశారు. 18వ యేట చరిత్ర గ్రంథాన్ని రచించ నారంభించారు. ఇందులో సహాబీలు (ప్రవక్త ప్రత్యక్ష అనుచరులు), తాబయీల (ఆ తరువాతి అనుచరుల) జీవిత చరిత్ర, వారుచెప్పిన మాటలు, చేసిన నిర్ణయాలన్నీ సమీకరించబడ్డాయి. ఈ గ్రంథాన్ని ఆయన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధి దగ్గర కూర్చొని వెన్నెల రాత్రులలో రాశారు.

ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) అసామాన్య జ్ఞాపకశక్తి గల మేధా సంపన్నులు. ఎంత పెద్ద హదీసయినాసరే ఒక్కసారి చదివితే లేక వింటే చాలు కంఠస్తమయిపోయేది.

ఇమాం బుఖారీ (రహిమహుల్లాహ్) గారి సమకాలిక హదీసువేత్త హామిద్ బిన్ ఇస్మాయీల్ ఇలాతెలియజేస్తున్నారు: “ఇమామ్ బుఖారీ బస్రాలో మాతో పాటు హదీసు తరగతులకు హాజరవుతూ ఉండేవారు. అయితే ఆయన కేవలం వినేవారు. ఒక్క అక్షరం కూడా వ్రాసుకునేవారు కాదు. ఈవిధంగా 16 రోజులు గడిచిపోయాయి. చివరికి ఓ రోజు నేను, హదీసులు వ్రాసుకోకపోవడం పట్ల ఆయన్ని విమర్శించాను. దానికాయన సమాధానమిస్తూ “ఈ పదహారు రోజుల కాలంలో నీవు వ్రాసుకున్న విషయాలన్నీ తీసుకురా. వాటన్నిటినీ నేను చూడకుండా చదువుతాను విను” అని అన్నారు. ఆ విధంగా ఆయన పదిహేను వందలకు పైగా హదీసుల్ని ఒక్క పొల్లు పోకుండా ఉన్నది ఉన్నట్లు మాకు వినిపించారు. స్వయంగా మేము అనేక చోట్ల మా రాతల్లో దొర్లిన తప్పులను ఆయన నోట విని సవరించుకోవలసి వచ్చింది”.

ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) గారి జ్ఞాపకశక్తి గాధలు దశ దిశలా వ్యాపించిపోయాయి. ఆయనఏ ప్రాంతానికి బయలుదేరినా, ఆయనకు ముందే ఆ ప్రాంతానికి ఆయన పేరు ప్రఖ్యాతులు చేరుకునేవి. ప్రజలు వివిధ రకాలుగా ఆయన జ్ఞాపకశక్తిని పరీక్షించేవారు. చివరికి వారు ఆయన అసాధారణ జ్ఞాపకశక్తికి ఆశ్చర్యచకితులయి ఎంతో అభినందించేవారు. ఆ కాలంలోనే షేఖ్ అబూ జరఆ (రహిమహుల్లాహ్), అబూ హాతిం (రహిమహుల్లాహ్), ముహమ్మద్ బిన్ నస్ర్ (రహిమహుల్లాహ్), ఇబ్ను ఖుజైమా (రహిమహుల్లాహ్), ఇమామ్ తిర్మిజి (రహిమహుల్లాహ్), ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్)లు ఆయనకు శిష్యులయిపోయారు.

ఇమాం బుఖారీ (రహిమహుల్లాహ్) ని ప్రశంసిస్తూ కొందరు ప్రముఖులు వెలిబుచ్చిన అభిప్రాయాలు వినండి:

“బుఖారీ (రహిమహుల్లాహ్) హదీసు విద్యలో నాకంటే ఎక్కువ వివేకం, దూరదృష్టి కల వ్యక్తి. ఆయన దైవదాసుల్లోకెల్లా ఎక్కువ వివేచనాపరుడు. నిజం చెప్పాలంటే బుఖారీని మించిన వారే లేరు.”- ఇమామ్ దార్మి (రహిమహుల్లాహ్)

“ఖురాసాన్ భూభాగంలో ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) లాంటి మహోన్నత వ్యక్తి మరొకరుజన్మించ లేదు.”-ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్)

“స్వయంగా ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) కూడా తన లాంటి వ్యక్తిని చూడలేదు.”- ఇబ్నుల్ మదీనీ (రహిమహుల్లాహ్)

“ఇమామ్ ముస్లిం బిన్ అల్ హిజాజ్ (రహిమహుల్లాహ్) ఓ సారి ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) సన్నిధికివెళ్ళి ఆయన రెండు కళ్ళ మధ్య (నుదుటిని) ముద్దాడుతుండగా నేను కళ్ళారా చూశాను. ఆ తరువాతఆయన ‘గురువులకు గురువూ! హదీసువేత్తల నాయకా! మీ పాదాలు చుంబించడానికి నాకు అనుమతి ఇవ్వండి’ అని అన్నారు.’- అహ్మద్ బిన్ హమ్డాన్ (రహిమహుల్లాహ్)

“ఆకాశం క్రింద ఈ ధరిత్రిపై ముహమ్మద్ బిన్ ఇస్మాయీల్ బుఖారీ (రహిమహుల్లాహ్)ని మించిన హదీసు పండితుడు, పారంగతుడు మరొకరు లేరు.” – ఇబ్నె ఖుజైమా (రహిమహుల్లాహ్)

ఇమామ్ జీవిత విశేషాల్లో ముఖ్యంగా చెప్పుకోదగిన ఒక విశేషం ఉంది. ఆయన తనజీవితంలో ఏనాడూ ఎవరినీ నిందించలేదు, దూషించలేదు, బాధించనూలేదు. ఆయన స్వయంగా ఈవిషయాన్ని ప్రస్తావిస్తూ “పరలోక విచారణ దినాన పరోక్ష నిందను గురించి నన్ను ప్రశ్నించడం జరగదనినేను ఆశిస్తున్నాను” అని అప్పుడప్పుడు అంటుండేవారు.

ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) ఎంతో ఆత్మాభిమానం గల వ్యక్తి. దీన్ని గురించి ఉమర్ బిన్ హఫ్స్(రహిమహుల్లాహ్) ఇలా తెలియజేస్తున్నారు: “బస్రాలోని హదీసు పాఠశాలలో నేను, ఇమామ్ బుఖారీ సహవిద్యార్థులంగా ఉండేవాళ్ళం. ఒక రోజు ఇమామ్ పాఠశాలకు రాలేదు. విచారిస్తే ఆ రోజు ఇమామ్ బుఖారీ దగ్గర ధరించి బయటికి రావడానికి సరిపడ్డ బట్టలు కూడా లేవని తెలిసింది. ఈ విషయం ఇతరుల ముందు బహిర్గతం కావడం ఆయనకు ఏ మాత్రం ఇష్టంలేదు. అందువల్ల ఆయన ఆ రోజు ఇంటి నుంచి బయటికే రాలేదు. ఆ తరువాత మేము ఆయన కోసం బట్టలు సంపాదించి తీసికెళ్ళి ఇచ్చాము. దాంతో ఆయన మరునాటి నుంచి పాఠశాలకు రావడం ప్రారంభించారు.

ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) రాజులకు, పాలకులకు ఎల్లప్పుడూ దూరంగా ఉండేవారు.అయితే ఓ రోజు బుఖారా గవర్నర్, తన దర్బారుకు వచ్చి తనకు హదీసులు వినిపించవలసిందిగా ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్)కి విజ్ఞప్తి చేశాడు. దాంతో పాటు, ఇతరులెవరూ పాల్గొనకుండా ఉండే ఓ ప్రత్యేక సమావేశంలో తన పిల్లలకు హదీసు విద్య నేర్పవలసిందిగా కూడా అతను ఇమామ్ని కోరాడు.ఇమామ్ ఈ రెండు కోర్కెలను తిరస్కరిస్తూ “విద్యను గురువు దగ్గరకెళ్ళి నేర్చుకోవలసి ఉంటుంది.నా సమావేశంలో ధనికుడు-పేద అనే తారతమ్యం లేదు. ఇక్కడికొచ్చి హదీసు విద్య నేర్చుకోవడానికిప్రతి ఒక్కరికీ హక్కుంది” అని సమాధానమిచ్చారు.

ఈ సమాధానం విని బుఖారా గవర్నర్ ఆగ్రహోదగ్రుడయ్యాడు. ఆ తరువాత వారిద్దరి మధ్య దూరం మరింత పెరిగిపోయింది. గవర్నర్ ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) మీద పగబూని బుసలు కొట్టడం ప్రారంభించాడు. దాంతో ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) బుఖారా పట్నం వదలి ఖర్తుంగ్ అనే ప్రాంతానికివెళ్ళి తలదాచుకోవలసి వచ్చింది. అక్కడకు వెళ్ళిన తరువాత ఆయన వ్యాధిగ్రస్తులయ్యారు. చివరికి హిజ్రి శకం 256లో ఈదుల్ ఫిత్ర్ నాడు 62 సంవత్సరాల వయస్సులో ఆయన తనువు చాలించారు. -రహ్మతుల్లా అలై-

ఇది ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) జీవితాంతం శ్రమించి, అనేక ప్రాంతాలు పర్యటించి సంకలనం చేసిన హదీసు గ్రంథం. ఆయన వివిధ ప్రాంతాల నుండి మొత్తం ఆరు లక్షల హదీసులు సేకరించి, వాటిలో ఈ గ్రంథం కోసం అత్యంత ప్రామాణికమైన 7,397 హదీసుల్ని ఎంపిక చేసి సంకలనం చేశారు. ఈ 7,397 హదీసుల్లో నుండి పునరావృత్త హదీసుల్ని తీసివేస్తే 2,602 హదీసులు మాత్రమే మిగిలి ఉంటాయి. ఇవన్నీ పటిష్ఠమైన ఆధారాలు గల నిజమైన హదీసులు. వీటిని ఆయన వివిధ శీర్షికల క్రింద ప్రకరణలుగా, అధ్యాయాలుగా విభజించి ఒక క్రమ పద్ధతిలో సంకలనం చేశారు.

ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) ఈ మహాకార్యాన్ని నిరంతరాయంగా 16 సంవత్సరాల పాటు అహోరాత్రులు చెమట ధారపోసి పూర్తి చేశారు. ఆయన ప్రతి హదీసు గ్రంథస్తం చేయడానికి ముందుగా స్నానం చేసి, రెండు రకాతులు నఫిల్ నమాజ్ చేసేవారు. ఆ తరువాతనే ఆ హదీసు రాయడానికి ఉపక్రమించేవారు. ఈ విధంగా ఆయన మొత్తం హదీసుల్ని పూర్తి పరిశుద్ధావస్థలో, ఎంతో భక్తిభావంతో గ్రంధస్తం చేశారు.

ప్రసిద్ధి చెందిన వందలాది మంది హదీసువేత్తలు ఈ గ్రంథం ప్రామాణికతను పరీక్షించడానికివివిధ రకాలుగా ప్రయత్నించారు. కాని ఏ ఒక్కరూ ఇందులోని ఏ ఒక్క హదీసు ప్రామాణికతతో కూడా విభేదించలేకపోయారు. కనీసం దానిపట్ల సందేహం కూడా వెలిబుచ్చలేకపోయారు. చివరికి వారంతా దివ్యఖుర్ఆన్ తరువాత పటిష్ఠమైన ప్రామాణికతతో కూడిన నిజగ్రంథం ఏదయినా ఉందంటే అది సహీహ్ బుఖారీ మాత్రమేనని తీర్మానించారు. ఈ విధంగా ఇస్లామీయ గ్రంథాలలో సహీహ్ బుఖారీ ద్వితీయ స్థానం పొందగలిగింది.

ఈ గ్రంథ ప్రాశస్త్యం, ప్రత్యేకతలను గురించి చెప్పాలంటే ఎన్నో విషయాలున్నాయి. ఇక్కడరెండు విషయాలను మాత్రం ప్రస్తావిస్తున్నాం. ఇందులోని హదీసుల్ని స్వయంగా ఇమామ్ బుఖారీ(రహిమహుల్లాహ్) నోట తొంభై వేల మంది హదీసువేత్తలు విన్నారు. ఈ గ్రంథానికి 53 వివరణ గ్రంథాలువెలువడ్డాయి. వాటిలో కొన్ని వివరణ గ్రంథాలు పద్నాలుగేసి సంపుటాలలో వెలువడ్డాయి. దీన్ని బట్టిసహీహ్ బుఖారీ ఎంత జనాదరణ పొందిన గ్రంథమో ఊహించవచ్చు.

సహీహ్ ముస్లిం గ్రంధాన్ని సంకలనం చేసిన ఇమామ్ అబుల్ హుసైన్ ముస్లిం బిన్ హిజాజ్(రహిమహుల్లాహ్) హిజ్ర శకం 204లో నీషాపూర్లో జన్మించారు. బాల్యం నుండే హదీసు విద్యార్జనలో నిమగ్నులయిపోయారు. హదీసుల అన్వేషణ కోసం ఆయన ఇరాఖ్, హిజాజ్, ఈజిప్టు దేశాలు పర్యటించి, అక్కడి పండితుల దగ్గర హదీసులు నేర్చుకున్నారు. అలాంటి పండితులలో ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) గారి గురువులు కూడా ఉన్నారు. చివరికి ఆయన నీషాపూర్లో ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్)ని కలుసుకొని, ఆయన దగ్గర కూడా శిష్యరికం చేశారు.

ఆ కాలంలో గొప్ప గొప్ప హదీసువేత్తలు సయితం తరచుగా ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) దగ్గరకొచ్చి హదీసులు వినిపోతుండేవారు. వారిలో అబూ హాతిం రాజి (రహిమహుల్లాహ్), మూసాబిన్ హారూన్(రహిమహుల్లాహ్), అహ్మద్ బిన్ సల్మ (రహిమహుల్లాహ్), ఇమామ్ తిర్మిజీ (రహిమహుల్లాహ్) ప్రభృతులు కూడా ఉన్నారు.ఆయన బాల్యం నుండి అంతిమ శ్వాస వరకు ఎంతో దైవభీతి, ధర్మపరాయణతలతో కూడిన పవిత్ర జీవితం గడిపారు. ఆయన ఏనాడూ ఒకరిని నిందించడం గాని, బాధించడం గాని చేయలేదు.

ఇమామ్ ముస్లిం మరణ సంఘటన చాలా విచిత్రంగా జరిగింది. ఒక సారి ఓ పండిత గోష్ఠిలో ఒక వ్యక్తి ఏదో హదీసుని గురించి సమాచారం అడిగాడు. అయితే ఆ సమయంలో ఇమామ్ గారికి ఆ హదీసు గురించిన సరయిన వివరాలు తెలియకపోవడం వల్ల సమాధానం ఇవ్వలేకపోయారు.తరువాత ఆయన ఇంటికి వెళ్ళి ఆ హదీసుని అన్వేషించడం ప్రారంభించారు. గ్రంథ పుటలను తిరగేస్తూ ప్రక్కనే ఉన్న ఖర్జూరపండ్ల బుట్టలో నుంచి ఒక్కొక్క ఖర్జూరాన్ని తీసి తింటూ పోయారు.హదీసు అన్వేషణలో తానెన్ని ఖర్జూర పండ్లు తిన్నానన్న సంగతిని కూడా గమనించలేదు. చివరికి అన్వేషిస్తున్న హదీసు లభించిన తరువాత బుట్ట వైపు చూస్తే అది దాదాపు ఖాళీ అయిపోయింది.అప్పుడర్ధమైంది ఆయనకు తాను బుట్టలోని పండ్లన్నీ తిన్నానని. కాని ఇక చేసేదేమీ లేదు; జరగవలసింది జరిగిపోయింది. ఎక్కువ పండ్లు తినడం వల్ల ఆయన వ్యాధిగ్రస్తులయ్యారు. ఆ వ్యాధితోనే ఆయన హిజ్రీ శకం 261, రజబ్ నెల 24వ తేదీ ఆదివారం నాడు సాయంత్రం శాశ్వతంగా ఇహలోకం వీడిపోయారు. చనిపోయే నాటికి ఆయన వయస్సు 55 సంవత్సరాలు మాత్రమే. స్వగ్రామమైన నీషాపూర్లోనే ఆయన్ని ఖననం చేశారు.

అబూహాతిం (రహిమహుల్లాహ్) ఇలా తెలియజేస్తున్నారు: “ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) చనిపోయిన తరువాత ఓ రాత్రి నేను ఆయన్ని కలలో చూశాను. ఆయన దగ్గరికెళ్ళి మీ పరిస్థితి ఎలా ఉందని అడిగాను. దానికి ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) అల్లాహ్ తనకు మంచి స్థితి కల్పించాడని, స్వర్గంలో తాను కోరుకున్న ప్రదేశానికి వెళ్ళే, కోరుకున్న చోట ఉండే అనుమతినిచ్చాడ’ని అన్నారు.”

ఈ గ్రంథం కూడా హదీసుల ప్రామాణికత రీత్యా, వాటి ఆరోగ్యస్థితి రీత్యా సహీహ్ బుఖారీకిఏ మాత్రం తీసిపోదు. సహీహ్ ముస్లిం కూడా సహీహ్ బుఖారీతో సమానమైన విలువ గల గ్రంథమన్న విషయంతో ధర్మవేత్తలంతా ఏకీభవించారు.

ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) ఈ గ్రంథాన్ని ఎంతో నేర్పుతో, వివేకంతో సంకలనం చేశారు.అందువల్ల దీన్ని చాలా సులభంగా అధ్యయనం చేయడానికి, అర్థం చేసుకోవడానికి అవకాశం కలిగింది. ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) ఈ గ్రంథంలో ఇంచుమించు ఒకే భావం గల హదీసులన్నీ ఒకచోట చేర్చారు. దాంతో పాటు హదీసుల ప్రమాణ పద్ధతుల్ని, వాటి పదజాలాల్లోని వ్యత్యాసాలను కూడా సంక్షిప్త వాక్యాలలో కడు జాగ్రత్తగా తెలియజేశారు.

ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) యావత్తు ముస్లిం జగత్తులో జరిపిన తన సుదీర్ఘ పర్యటన సందర్భంగా నాలుగు లక్షల హదీసుల్ని సేకరించారు. మొదట వాటిలో ఒక లక్ష పునరావృత హదీసుల్ని ఏరివేసి మూడు లక్షల హదీసుల్ని సంకలనం చేశారు. ఆ తరువాత ఓ సుదీర్ఘ కాలం పాటు వాటిని నిశితంగా పరిశీలించి చివరికి అన్ని విధాల నమ్మకమైనవని, ప్రామాణికమైనవని, భావించినహదీసుల్ని మాత్రమే ఆయన ఈ గ్రంథానికి ఎంచుకున్నారు. ఇలా మూడు లక్షల హదీసుల్లో 7,275హదీసులు మాత్రమే గ్రంథస్తం చేయబడ్డాయి. అయితే వాటిలోనూ పునరావృత హదీసుల్ని తొలగిస్తే నాలుగు వేల హదీసులు మాత్రమే మిగులుతాయి.

ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) స్వయంగా తన గ్రంథం గురించి ఇలా అన్నారు: “నేనీ గ్రంథంలోఏ హదీసుని గ్రంథస్తం చేసినా క్షుణ్ణంగా ఆలోచించిన మీదట తగిన ఆధారాలతోనే దాన్ని గ్రంథస్థం చేశాను. అలాగే ఈ గ్రంథంలో నుంచి ఏ హదీసుని తొలగించినా క్షుణ్ణంగా ఆలోచించిన తరువాత తగిన ఆధారాలతోనే దాన్ని తొలగించాను. అందువల్ల ప్రపంచంలోని జనమంతా రెండొందల యేండ్లపాటు హదీసుల్ని పరిశీలించి రాసినా, చివరికి వారి నమ్మకం ఈ గ్రంథం మీదే ఉంటుంది.”

సహీహ్ ముస్లిం, సహీహ్ బుఖారీ గ్రంథాలలో ప్రామాణికత తదితర విషయాల రీత్యా ఏదిగొప్ప అనే విషయంలో ధర్మవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. సహీహ్ బుఖారీ అన్నిటికంటేఉన్నతమైనదని కొందరు అభిప్రాయపడితే, సహీహ్ ముస్లిం అన్నటికంటే ఉన్నతమైన గ్రంథమని,మరి కొందరు అభిప్రాయపడ్డారు. ఈ రెండు అభిప్రాయాలకు భిన్నంగా ఇంకొందరు, కొన్ని విషయాలరీత్యా సహీహ్ బుఖారీ ఉన్నతమైనది, మరికొన్ని విషయాల రీత్యా సహీహ్ ముస్లిం ఉన్నతమైనదనిఅభిప్రాయపడ్డారు.

ఏమయినప్పటికీ ఈ గ్రంథకర్తలిద్దరూ గొప్ప ధర్మపరాయణులు, దైవభీతిపరులు, నిజాయితీపరులన్న విషయంలో మాత్రం ఎవరి మధ్యా ఎలాంటి భేదాభిప్రాయం లేదు. అలాంటి మహనీయులు సంకలనం చేసిన బుఖారీ, ముస్లిం గ్రంథాలలోని ఏకీభవిత (ముత్తఫఖుల్అలై) హదీసుల సంగతి ఇక చెప్పేదేముంది? పటిష్ఠమైన ప్రామాణిక గ్రంథాలలోని ఈ ‘ఏకీభవిత’ హదీసులు మరెంత ప్రామాణికమైనవో ప్రత్యేకంగా వివరించనవసరం లేదు.

సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలను రెండు సముద్రాలుగా, వాటిలో ఉన్న హదీసుల్నిముత్యాలు, పగడాలుగా ప్రస్తుత సంకలన కర్త ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ అభివర్ణించిన సంగతిప్రారంభంలో నేను ప్రస్తావించాను. అంటే ఒక సముద్రంలో ముత్యాలు ఉంటే, మరో సముద్రంలోపగడాలు ఉన్నాయన్నమాట. ఈ రెండు సముద్రాలలోని ముత్యాలు, పగడాలను ఏరి కూర్చిన హారం ఇంకెంత విలువైనదో ఊహించండి. ఆ అమూల్యమైన హారమే మీ ముందున్న ఈ గ్రంథం!

ఇందులో మొత్తం 1906 హదీసులున్నాయి. సహీహ్ బుఖారీలో పునరావృత హదీసులుతీసివేయగా 2602 హదీసులు ఉన్నాయి. అంటే ఈ గ్రంథంలో సహీహ్ బుఖారీలోని 696 హదీసులుతగ్గిపోయాయి. మరో మాటలో చెప్పాలంటే ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) గారి గ్రంథంలో లేని 696 హదీసులు ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) గారి గ్రంథంలో చోటు చేసుకున్నాయన్నమాట. వేరొక రకంగాచెప్పాలంటే ఈ 696 హదీసుల విషయంలో ఇరువురు ఇమాముల మధ్య పూర్తిగా ఏకీభావం లేదన్నమాట.

దీన్ని బట్టి మన ముందున్న ఈ గ్రంథంలో ఆ ఇరువురు ఇమాములు పూర్తిగా ఏకీభవించినహదీసులే ఉన్నాయని అర్థమవుతుంది. ఇలాంటి హదీసులున్న గ్రంథం వెలకట్టలేని వినూత్న ఉద్గ్రంధం అనడంలో ఇక సందేహమేముంది? కనుక దీన్ని పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తూ ఈ గ్రంథం అనువాదంలో నాకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

-సయ్యిద్ షబ్బీర్ అహ్మద్(ఉర్దూ అనువాదకుడు, లాహోర్)

నమాజు కొరకై 11 చిన్న సూరాలు నేర్చుకోండి తెలుగులో

11-short-surahs-quran

అంశాల నుండి : నవముస్లిం మార్గదర్శిని, దారుస్సలాం పుస్తకాలయం

తెలుగులో సూరా ఎలా చదవాలి మరియు సూరా అర్ధం
ప్రతి సూరాకు ఆడియో కూడా జత చేయబడింది. ఈ ఆడియో లో షేక్ చదివిన తర్వాత, స్టూడెంట్ రిపీట్ చేస్తాడు.మీరు కూడా సూరా వింటూ నేర్చుకుంటే తప్పులు పోకుండా ఉంటాయి

క్రింది పుస్తకం డౌన్లోడ్ చేసుకొని పూర్తి ఖురాన్ ను చదవవచ్చు.
అహ్సనుల్ బయాన్ – తెలుగులో అరబీ ఉచ్చారణ (తెలుగు ఆవాజ్)

సూరతుల్ ఫాతిహా 1 

ఇది మక్కాలో అవతరించినది. దీనిలో 7 ఆయతులు ఉన్నాయి.

1. అనంత కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో ….బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ
2. సకల లోకాల ప్రభువు అయిన అల్లాహ్ మాత్రమే స్తుతింపదగినవాడుఅల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్الحَمْدُ للهِ رَبِّ العَالَمِينَ
3. అనంత కరుణామయుడూ, అపార కృపాశీలుడూను.అర్రహ్మా నిర్రహీమ్الرَّحْمَنِ الرَّحِيمِ
4. ప్రతిఫల దినానికి యజమాని.మాలికి యౌమిద్దీన్مَالِكِ يَوْمِ الدِّينِ
5. మేము కేవలం నిన్నే ఆరాధిస్తాము మరియు సహాయం కోసం మేము కేవలం నిన్నే అర్థిస్తాము.ఇయ్యాక నఅఁబుదు వ ఇయ్యాక నస్తఈఁన్إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ
6. మాకు ఋజుమార్గం చూపించు.ఇహ్ దినస్సిరాతల్ ముస్తఖీంإِهْدِنَا الصِّرَاطَ المُسْتَقِيمَ
7.అది – నీవు అనుగ్రహించిన వారి మార్గము. నీ ఆగ్రహానికి గురికాని వారూ మరియు మార్గభ్రష్టులు కాని వారూ అనుసరించిన మార్గము.సిరాతల్లదీన అన్ అమ్ త అలైహిమ్ , గైరిల్ మగ్దూబి అలైహిమ్  వలద్దాల్లీన్ !صِرَاطَ الَّذِينَ أَنْـعَمْتَ عَلَيْهِمْ غَيْرِ المَغْضُوبِ عَلَيْهِمْ وَلَا الضَّالِّينَ

 సూరతుల్ ఫీల్ – 105

ఇది మక్కాలో అవతరించినది. దీనిలో ఐదు ఆయతులు ఉన్నాయి.

అనంత కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ
1. ఏమిటీ, ఏనుగుల వారితో నీ ప్రభువు ఎలా ప్రవర్తించాడో నీకు తెలియదా?అలమ్ తర కైఫ ఫఅఁల రబ్బుక బిఅస్ హాబిల్ ఫీల్أَلَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِأَصْحَابِ الفِيلِ
2. ఏమిటీ, ఆయన వారి కుట్రను భంగం చేయలేదా?అలమ్ యజ్అఁల్ కైదహుమ్ ఫీ తద్లీల్أَلَمْ يَجْعَلْ كَيْدَهُمْ فِي تَضْلِيلٍ
3. మరియు వారి పైకి పక్షుల గుంపులను పంపాడు.వ అర్సల అఁలైహిమ్ తైరన్ అబాబీల్وَأَرْسَلَ عَلَيْهِمْ طَيْرًا أَبَابِيلَ
4. అవి వారి మీద బాగా కాల్చిన మట్టి గడ్డల వర్షం కురిపించాయి.తర్మీహిమ్ బిహిజారతిమ్ మిన్ సిజ్జీల్تَرْمِيهِمْ بِحِجَارَةٍ مِنْ سِجِّيلٍ
5.ఆ విధంగా ఆయన వారిని (పక్షులు) తిని వదిలి వేసిన పొట్టుగా మార్చివేశాడు.ఫజఅఁలహుమ్ క అస్ ఫిమ్ మ’కూల్ فَجَعَلَهُمْ كَعَصْفٍ مَأْكُولٍ

 సూరతు ఖురైష్ – 106

ఇది మక్కాలో అవతరించినది. దీనిలో నాలుగు ఆయతులున్నాయి.

అనంత కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో ….బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ
1. (చూడండి) ఖురైష్ ప్రజలు ఎలా అలవాటు పడ్డారో!లి ఈలాఫి ఖురైష్لِإِيلَافِ قُرَيْشٍ
2. చలికాలంలోనూ, ఎండాకాలంలోనూ ప్రయాణాలకు ఎలా అలవాటు పడ్డారో!ఈలాఫి హిమ్ రిహ్లతష్షితాఇ వస్సైఫ్إِيلَافِهِمْ رِحْلَةَ الشِّتَاءِوَالصَّيْفِ
3. కనుక వారు ఈ గృహపు ప్రభువును ఆరాధించాలి.ఫల్ యఅఁబుదూ రబ్బహాదల్ బైత్فَلْيَعْبُدُوا رَبَّ هَذَا البَيْتِ
4. ఆయనే వారికి ఆహారమిచ్చి ఆకలి బాధ నుండి కాపాడాడు,శాంతిని ప్రసాదించి భయం నుండి రక్షించాడు.అల్లదీ అత్అమహుమ్ మిన్ జూఇవ్ వ ఆమనహుమ్ మిన్ ఖౌఫ్الَّذِي أَطْعَمَهُمْ مِنْ جُوعٍ وَآَمَنَهُمْ مِنْ خَوْفٍ

 సూరతుల్ మాఊన్ – 107

ఇది మక్కాలో అవతరించినది. దీనిలో ఏడు ఆయతులు ఉన్నాయి.

అనంత  కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ
1. పరలోకతీర్పును ధిక్కరించేవాడిని నీవు చూశావా?అరఅయ్ తల్లదీ యుకద్దిబు బిద్దీన్أَرَأَيْتَ الَّذِي يُكَذِّبُ بِالدِّينِ
2.వారే అనాథులను కసరి కొట్టేవారు.ఫదాలికల్లదీ యదువ్వుల్ యతీంفَذَلِكَ الَّذِي يَدُعُّ اليَتِيمَ
3. నిరుపేదలకు అన్నం పెట్టమని ప్రోత్సహించని వారువలా యహుద్దు అలా తఆమిల్ మిస్కీన్وَلَا يَحُضُّ عَلَى طَعَامِ المِسْكِينِ
4. ఐతే నమాజు చేసే (అలాంటి) వారూ నాశనమౌతారు.ఫవైలుల్ లిల్ ముసల్లీన్فَوَيْلٌ لِلْمُصَلِّينَ
5. ఎవరైతే తమ నమాజుల పట్ల అశ్రద్ధ చూపేవారోఅల్లదీన హుమ్ అన్ సలాతిహిం సాహూన్الَّذِينَ هُمْ عَنْ صَلَاتِهِمْ  سَاهُونَ
6. ఎవరైతే ప్రదర్శనా బుద్ధితో వ్యవహరించేవారో,అల్లదీన హుమ్ యురాఊన్الَّذِينَ هُمْ  يُرَاءُونَ
7. ఎవరైతే చిన్న పాటి సహాయం అర్థించిన వారిని కూడా తిరస్కరించే వారో.వయం నఊనల్ మాఊన్وَيَمْنَعُونَ المَاعُونَ

 సూరతుల్ కౌథర్ – 108

ఇది మక్కాలో అవతరించినది. దీనిలో మూడు ఆయతులున్నాయి.

అనంత  కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో …బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ
1. (ప్రవక్తా) మేము నీకు కౌథర్ (సరస్సు) ను ప్రసాదించాము.ఇన్నా  అఅతైనా కల్ కౌథర్إِنَّا أَعْطَيْنَاكَ الكَوْثَرَ
2. కనుక నీవు నీ ప్రభువు కొరకు నమాజు చెయ్యి మరియు ఖుర్బానీ చెయ్యి.ఫసల్లి లి రబ్బిక వన్ హర్فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ
3. నిస్సందేహంగా నీ శత్రువే నామరూపాలు లేకుండా నశించిపోతాడు.ఇన్న షానిఅక హువల్ అబ్తర్إِنَّ شَانِئَكَ هُوَ الأَبْتَرُ

సూరతుల్ కాఫిరూన్ – 109

ఇది మక్కాలో అవతరించినది. దీనిలో ఆరు ఆయాతులు ఉన్నాయి.

అనంత  కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో …బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ
1. (ప్రవక్తా) ప్రకటించు!  ఓ అవిశ్వాసులారాఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్قُلْ يَا أَيُّهَا الكَافِرُونَ
2. నేను ఆరాధించను మీరు ఆరాధించే వాటినిలా అఅబుదు మా తఅబుదూన్لَا أَعْبُدُ مَا تَعْبُدُونَ
3. మరియు మీరు ఆరాధించరు నేను ఆరాధించేవాడినివలా అన్ తుం ఆబిదూన మా అఅబుద్وَلَا أَنْتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ
4. మరియు నేను ఆరాధించను మీరు ఆరాధిస్తున్న వాటినివలా అన ఆబిదుమ్ మా అబత్తుంوَلَا أَنَا عَابِدٌ مَا عَبَدْتُمْ
5. మరియు మీరు ఆరాధించరు నేను ఆరాధించేవాడినివలా అన్ తుం ఆబిదూన మా అఅబుద్وَلَا أَنْتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ
6. మీ ధర్మం మీదే మరియు నా ధర్మం నాదే.లకుం దీనుకుమ్ వ లి యదీన్لَكُمْ دِينُكُمْ وَلِيَ دِينِ

 సూరతున్నస్ర్ – 110

ఇది మక్కాలోనే అవతరించినా మదీనా సూరహ్ అనబడుతుంది. దీనిలో మూడు ఆయాతులు ఉన్నాయి.

అనంత  కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో …బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ
1. ఎప్పుడైతే అల్లాహ్ సహాయం వచ్చినదో మరియు విజయం లభించినదోఇదా జాఅ నస్రుల్లాహి వల్ ఫత్ హ్إِذَا جَاءَ نَصْرُ اللهِ وَالفَتْحُ
2. మరియు ప్రజలు తండోపతండాలుగా అల్లాహ్ ధర్మంలో ప్రవేశించటాన్ని నీవు చూసినప్పుడువ రఅయ్ తన్నాస యద్ ఖులూన ఫీ దీనిల్లాహి అఫ్ వాజాوَرَأَيْتَ النَّاسَ يَدْخُلُونَ فِي دِينِ اللهِ أَفْوَاجًا
3. నీ ప్రభువు స్తోత్రంతో పాటు (ఆయన) పవిత్రనామాల్ని స్మరించు మరియు అతడి మన్నింపును అర్థించు, నిస్సందేహంగా అతడు పశ్చాత్తాపాన్ని స్వీకరించువాడు.ఫసబ్బిహ్ బిహమ్ ది రబ్బిక వస్ తగ్ఫిర్ హు, ఇన్నహూ కాన తవ్వాబాفَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَاسْتَغْفِرْهُ إِنَّهُ كَانَ تَوَّابًا

 సూరతు లహబ్ (సూరతుల్ మసద్) – 111

ఇది మక్కాలో అవతరించినది. దీనిలో ఐదు ఆయాతులు ఉన్నాయి.

అనంత  కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో …బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ
1. అబీ లహబ్ చేతులు విరిగి పోయాయి! అతడు సర్వనాశనం అయిపోయాడుతబ్బత్ యదా అబీ లహబివ్ వతబ్బ్تَبَّتْ يَدَا أَبِي لَهَبٍ وَتَبَّ
2. అతడి మొత్తం ఆస్తిపాస్తులు, సంపాదనా దేనికీ పనికి రాకుండా పోయింది.మాఅగ్ నా అన్హు మాలుహూ వమా కసబ్బ్مَا أَغْنَى عَنْهُ مَالُهُ وَمَا كَسَبَ
3. అతడు అతి త్వరలో భగభగ మండే అగ్నిలో చేరతాడు.సయస్ లా నారన్ దాత లహబ్బ్سَيَصْلَى نَارًا ذَاتَ لَهَبٍ
4. అంతే కాదు (అతడితోపాటు) అతడి భార్యా అందులో చేరు తుంది. (ఆమె చాడిలుచెబుతూ కలహాలురేపే స్త్రీ)వమ్రఅతుహూ హమ్మా లతల్ హతబ్బ్وَامْرَأَتُهُ حَمَّالَةَ الحَطَبِ
5. ఆమె మెడలో దృఢంగా పేనిన ఒక త్రాడు ఉంటుంది.ఫీ జీదిహా హబ్లుమ్ మిమ్మసద్ద్فِي جِيدِهَا حَبْلٌ مِنْ مَسَدٍ

సూరతుల్ ఇఖ్లాస్ – 112

ఇది మక్కాలో అవతరించినది. దీనిలో నాలుగు ఆయాతులున్నాయి.

అనంత  కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో …బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ
1. (ఓ ప్రవక్తా!) ప్రకటించు! అల్లాహ్ ఏకైక అద్వితీయుడు.ఖుల్ హువల్లాహు అహద్ద్قُلْ هُوَ اللهُ أَحَدٌ
2. అల్లాహ్ ఎలాంటి అక్కరా లేనివాడు (సమర్ధుడు).అల్లాహు స్సమద్ద్اللهُ الصَّمَدُ
3. ఆయనకు సంతానం లేదు  ఆయనెవరి సంతానం కాదులమ్ యలిద్ద్ వ లమ్ యూలద్ద్لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ
4. ఆయనకు సరిసమానులు ఎవ్వరూ లేరు.వ లమ్ యకుల్లహూ కుఫువన్ అహద్ద్وَلَمْ يَكُنْ لَهُ كُفُوًاأَحَدٌ

సూరతుల్ ఫలఖ్ – 113

ఇది మక్కాలో అవతరించినది. దీనిలో ఐదు ఆయాతులు ఉన్నాయి.

అనంత  కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో …బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ
1. (ప్రవక్తా!) ప్రకటించు! నేను ఉదయం యొక్క ప్రభువును శరణు కోరుతున్నాను.ఖుల్ అ, ఊదు బిరబ్బిల్ ఫలఖ్ఖ్قُلْ أَعُوذُ بِرَبِّ الفَلَقِ
2. ఆయన సృష్టించిన ప్రతి దాని కీడు నుండి.మిన్ షర్రి మా ఖలఖ్ఖ్مِنْ شَرِّ مَا خَلَقَ
3. కమ్ముకునే చీకటి రేయి కీడు నుండి.వ మిన్ షర్రి గాసిఖిన్ ఇదా వఖబ్బ్.وَمِنْ شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ
4. ముడులపై మంత్రించే వారి కీడు నుండి. వ మిన్ షర్రిన్ నఫ్పాసఆతి ఫిల్ ఉఖద్ద్.وَمِنْ شَرِّ النَّفَّاثَاتِ فِي العُقَدِ
5. మరియు ఈర్ష్యాపరుడు, ఈర్ష్య చెందేటప్పటి కీడు నుండివ మిన్ షర్రి హాసిదిన్ ఇదా హసద్ద్وَمِنْ شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ

 సూరతున్నాస్ – 114

ఇది మక్కాలో అవతరించినది. దీనిలో ఆరు ఆయాతులు ఉన్నాయి.

అనంత  కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో …బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ
1. అను: నేను మానవుల ప్రభువు యొక్క శరణు వేడుకుంటున్నాను,ఖుల్ అఊదు బిరబ్బిన్నాస్.قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ
2. మానవుల పరిపాలకుడి (శరణు వేడు కుంటున్నాను),మలికిన్నాస్مَلِكِ النَّاسِ
3. మానవుల ఆరాధ్యుడి (శరణు వేడు కుంటున్నాను),ఇలాహిన్నాస్إِلَهِ النَّاسِ
4. మాటిమాటికీ మరలివస్తూ దుష్టభావాలు రేకేత్తించేవాడి కీడు నుండి,మిన్ షర్రిల్ వస్ వాసిల్ ఖన్నాస్مِنْ شَرِّ الوَسْوَاسِ الخَنَّاسِ
5. వాడు ప్రజల మనస్సుల్లో దుష్టభావాలను రేకెత్తిస్తాడు,అల్లదీ యు వస్ విసు ఫీ సుదూరిన్నాస్الَّذِي يُوَسْوِسُ فِي صُدُورِ النَّاسِ
6. వాడు జిన్నాతుల జాతిలోని వాడు లేదా మానవజాతిలోని వాడు.మినల్ జిన్నతి వన్నాస్مِنَ الجِنَّةِ وَالنَّاسِ