Qur'an Surah 78. An-Naba – Telugu Subtitles [video]

Qur’an Surah 78.An-Naba – Telugu Subtitles

78 సూరహ్ అన్-నబా
అనంత కరుణామయుడు అపార కరుణాప్రదాత అయిన అల్లాహ్ పేరుతో
1. (*) ఏ విషయాన్ని గురించి వారు (ఒకరినొకరు) ప్రశ్నించుకుంటున్నారు?
2. ఆ మహా వార్తను గురించేనా?
3. దేనిని గురించైతే వారు భేదాభిప్రాయాలు కలిగి ఉన్నారో!
4. అదికాదు! వారు త్వరలోనే దానిని తెలుసుకోగలరు.
5. ఎంత మాత్రము కాదు! వారు త్వరలోనే దానిని తెలుసుకోగలరు.
6. ఏమీ? మేము భూమిని పరుపుగా చేయలేదా?
7. మరియు పర్వతాలను మేకులుగా?
8. మరియు మేము మిమ్మల్ని (స్త్రీ , పురుషుల) జంటలుగా సృష్టించాము.
9. మరియు మేము నిద్రను, మీకు విశ్రాంతి నిచ్చేదిగా చేశాము.
10. మరియు రాత్రిని ఆచ్చాదంగా చేశాము.
11. మరియు పగటిని జీవనోపాధి సమయంగా చేశాము.
12. మరియు మేము మీపైన పటిష్ఠమైన ఏడు (ఆకాశాలను) నిర్మించాము.
13. మరియు (అందులో) ప్రకాశించే దీపాన్ని (సూర్యుణ్ణి) ఉంచాము.
14. మరియు మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపించాము.
15. దానితో మేము ధాన్యం మరియు పచ్చికను (చెట్లుచేమలను) పెరిగించటానికి!
16. మరియు దట్టమైన తోటలను.
17. నిశ్చయంగా, తీర్పుదినం ఒక నిర్ణీత సమయం.
18. ఆ రోజు బాకా ఊదబడినప్పుడు! అప్పుడు మీరంతా గుంపులు గుంపులుగా లేచివస్తారు.
19. మరియు ఆకాశం తెరువబడుతుంది, అందులో ద్వారాలు ఏర్పడుతాయి;
20. మరియు పర్వతాలు ఎండమావులుగా అదృశ్యమైపోతాయి.
21. నిశ్చయంగా, నరకం ఒక మాటు;
22. ధిక్కారుల గమ్యస్థానం;
23. అందులో వారు యుగాలతరబడి ఉంటారు.
24. అందులో వారు ఎలాంటి చల్లదనాన్ని గానీ మరియు (చల్లని) పానీయాన్ని గానీ చవిచూడరు.
25. సలసల కాగే నీరు మరియు చీములాంటి మురికి (పానీయం) తప్ప!
26. (వారి కర్మలకు) తగిన పూర్తి ప్రతిఫలంగా!
27. వాస్తవానికి వారు లెక్క తీసుకోబడుతుందని ఆశించలేదు.
28. పైగా వారు మా సూచన (ఆయాత్) లను అసత్యాలని తిరస్కరించారు.
29. మరియు మేము (వారు చేసిన) ప్రతి దానిని ఒక పుస్తకంలో వ్రాసిపెట్టాము.
30. కావున మీరు (మీ కర్మల ఫలితాన్ని) చవిచూడండి. ఎందుకంటే, మేము మీకు శిక్ష తప్ప మరేమీ అధికం చేయము.
31. నిశ్చయంగా, దైవభీతి గలవారికి సాఫల్యం (స్వర్గం) ఉంది;
32. ఉద్యానవనాలూ, ద్రాక్షతోటలూ!
33. మరియు ఈడూజోడూ గల (యవ్వన) సుందరకన్యలు;
34. మరియు నిండి పొర్లే (మధు) పాత్ర.
35. అందులో (స్వర్గంలో) వారు ఎలాంటి వ్యర్ధపు మాటలు గానీ, అసత్యాలు గానీ వినరు.
36. (ఇదంతా) నీ ప్రభువు తరుఫు నుండి లభించే ప్రతిఫలం, చాలినంత బహుమానం.
37. భూమ్యాకాశాలు మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువైన  అనంత కరుణామయుని (బహుమానం); ఆయన ముందు మాట్లాడే సాహసం ఎవ్వరికీ లేదు.
38. ఏ రోజునయితే ఆత్మ (జిబ్రీల్) మరియు దేవదూతలు వరుసలలో నిలిచిఉంటారో! అప్పుడు ఆ అనంత కరుణామయుడు అనుమతించిన వాడు తప్ప, మరెవ్వరూ మాట్లాడలేరు; ఒకవేళ ఎవడైనా మాట్లాడినా అతడు సరైన మాటే మాట్లాడుతాడు.
39. అదే అంతిమ సత్యదినం. కావున ఇష్టమున్నవాడు, తన ప్రభువు వైపునకు చేరే మార్గాన్ని అవలంబించాలి!
40. నిశ్చయంగా, మేము అతి సమీపంలో ఉన్న శిక్షను గురించి మిమ్మల్ని హెచ్చరించాము. ఆ రోజు ప్రతిమనిషి తన చేజేతులా చేసుకొని ముందు పంపుకున్నదంతా ప్రత్యక్షంగా చూసుకుంటాడు. మరియు సత్యతిరస్కారి: “అయ్యో, నా పాడుగానూ! నేను మట్టినయి ఉంటే ఎంత బాగుండేది!” అని వాపోతాడు.

Telugu Translation Source: దివ్య ఖురాన్ సందేశం

Qur'an Telugu – Surah 47. Surah Muhammad – Youtube Video

Qur’an Telugu – Surah 47. Surah Muhammad – Youtube Video

Check other videos

Qur'an Telugu – Surah 92. AL-Layl (The Night) – Youtube Video

Qur'an Telugu – Surah 29. Al Ankaboot (The Spider) – Youtube

Qur’an Telugu – Surah 29. Al Ankaboot (The Spider)

పరిచయం :
ఇది మక్కాలో అవతరించిన సూరా. ఇందులో 69 ఆయతులు ఉన్నాయి. ఎకధైవారాధన, ప్రవక్తల పరంపర, మరణానంతరం మళ్ళీ లేపబడటం, ప్రవక్తలందరినీ విశ్వసించడం, వారు తీసుకు వచ్చిన దైవగ్రంధాలన్నింటిని విశ్వసించడం మొదలైన మౌలిక ధార్మిక విశ్వాసాలను ఇందులో నొక్కిచెప్పడం జరిగింది. ఈ సూరాలో సాలీడు గురించి, దాని సాలెగూటి గురించి ప్రస్తావన వచ్చింది. ఆ ప్రస్తావన ఆధారంగా ఈ సూరాకు ఈ పేరు పెట్టడం జరిగింది. అవిశ్వాసులకు – సాలీడుకు మధ్య పోలికలు చెప్పడం జరిగింది. సాలీడు ఒక బలహీనమైన ప్రాణి, అది తన బలహీనమైన సాలెగూటిలో రక్షణ పొందాలని చూస్తుంది. కాని ఈ సాలెగూడు దానిని బయటి ప్రమాదాల నుంచి కాపాడలేదు. అదేవిధంగా అవిశ్వాసులు కూడా బలహీనమైనవారు, తాము ఆరాధించే బలహీనమైన, సామర్ధ్యం లేని విగ్రహాల ద్వారా రక్షణ పొందాలని చూస్తున్నారు. ఈ కుహనా దేవుళ్ళుకాని, మానవులు కాని, కలపతో లేదా రాళ్ళతో చేయబడిన దేవుళ్ళు కాని అవిశ్వాసులకు రక్షణ ఇవ్వలేరు. వారి ప్రయోజనాలు కాపాడలేరు. వారికి హాని కూడా కలిగించలేరు. కాగా విశ్వాసులు విశ్వప్రభువు, సర్వ శక్తిసంపన్నుడైన అల్లాహ్ ను రక్షణ కోరుతారు. అల్లాహ్ వారికి బహుమానాలు ప్రసాదించే శక్తికలిగినవాడు, అహంభావులకు, దేవునికి భాగస్వాములను కల్పించిన వారికి శిక్ష విధించే సామర్ధ్యం కలిగినవాడు.

అల్లాహ్ కే గల ప్రత్యేకమైన సృష్టి సామర్ధ్యాన్ని ఈ సూరా క్లుప్తంగా తెలియజేసింది. ఆయనకున్న శక్తిసామర్ధ్యాలను స్పష్టం చేసింది. అల్లాహ్ ఈ సృష్టిని ప్రారంభించాడు. ఆయనే దీనిని మళ్ళీ పునరావృత్తం చేస్తాడు. ఆయన స్వర్గాన్ని, భూమిని ఒక ఉద్దేశ్యంతో సృష్టించాడు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తం ఆయనకు తెలుసు.

Telugu Qur'an – Surah Al Sajdah – Youtube Video

బిస్మిల్లాహ్

Telugu Qur'an – Surah Al-Zukhruf – Youtube Video

అజ్ జుఖ్ రుఫ్ (బంగారు ఆభరణాలు) సూరా  పరిచయం

ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) సంక్షిప్త జీవిత చరిత్ర – షేఖ్ సఫియుర్ రహ్మాన్ ముబారక్ ఫూరి

ముఖ బంధిత ముధు కలశ౦
(అర్రహీఖుల్‌ మఖ్ తూమ్ సంక్షిప్తీకరణ)

మూలం: మౌలానా సఫియుర్ రహ్మాన్  ముబారక్‌పూరీ
తెలుగు రూపం: సయ్యిద్‌ అబ్బుస్సలామ్‌ ఉమ్రీ

[ఇక్కడ బుక్ చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
[76 పేజీలు PDF]

Ar-Raheeq al Makhtoum - Summarized

విషయ సూచిక

  • ఆశీర్వచనం
  • పవిత్ర జీవితం
  • ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) గారి వంశావళి
  • మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) గారి పితామహులు అబ్దుల్లాహ్
  • జననం – దైవ దౌత్యానికి పూర్వం 40 సంవత్సరాలు
  • శుభాలు పొంగి పొర్లిన వేళ…
  • సద్గుణ సంపన్నులు ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లమ్)
  • దైవ దౌత్యానికి పూర్వ స్ధితి
  • శుభోదయ కిరణాలు
  • పురి విప్పిన పౌరుషం
  • హబ్షా (అబిసీనియా)కు వలస (హిజ్రత్‌)
  • విషాద సంవత్సరం
  • మక్కా వెలుపల ఇస్లాంప్రచారం
  • ఇస్రా – మేరాజ్‌
  • అఖ్బా శపథం – 1,2
  • విశ్వాసం త్యాగాన్ని కోరుతుంది
  • ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) వారి హిజ్రత్‌
  • యాత్రిబులో అపూర్వ స్వాగతం
  • మదీనాలో నవ సమాజ సంస్థాపన
  • బద్ర్‌ సంగ్రామం
  • ముఖ్య సంఘటనలు
  • ఉహద్‌ సంగ్రామం
  • ఐహిక లాలస అనర్ధదాయకం
  • కందక పోరాటం
  • హుదైబియా ఒప్పందం
  • నిర్యుద్ధ సంధి ఫలితాలు
  • మక్కా విజయం
  • గజ్వయె హునైన్‌
  • గజ్వయె తబూక్‌
  • హజత్‌ అబూ బకర్‌ (రది అల్లాహు అన్హు) గారి హజ్‌ ప్రయాణం
  • చివరి హజ్‌ ప్రయాణం
  • పరమోన్నత మిత్రుని వైపునకు
  • ఆ మహా మిత్రుడే కావాలి

సత్యాన్వేషణ (Search for the Truth)

 

 

మానవజాతి సృష్టి యెక్క ఉద్దేశ్యం ఏమిటి? (The Purpose of Creation)

మానవజాతి సృష్టి యెక్క ఉద్దేశ్యం ఏమిటి? అనే చిక్కు ప్రశ్న ప్రతి మానవుడికీ తన జీవితంలో ఎక్కడో ఒక చోట ఎదురవుతుంది. ఏదో ఒక సందర్బంలో ప్రతి మానవుడు  “నేనెందుకు జీవిస్తున్నాను?“, “దేనికోసం నేను ఈ భూమిపై ఉన్నాను?“, “నా జీవితలక్ష్యం ఏమిటి?” అని తనను తాను ప్రశ్నించుకోవటం కూడా జరుగుతుంది. కానీ సమాధానం కనుక్కోవటానికి మనం ఎప్పుడైనా ప్రయత్నించామా? నిజాయితీగా చూస్తే, ఆ ఆలోచనే ఇంత వరకు రానివాళ్ళు అధికంగా ఉన్నారు.

మానవజాతి సృష్టి యెక్క ముఖ్య ఉద్దేశ్యాన్ని గురించి అల్లాహ్ ఖురాన్ లో ఇలా తెలుపుతున్నాడు:

నేను జిన్నాతులను, మానవులను సృష్టించినది వారు నన్ను ఆరాధించటానికి  మాత్రమే“. (ఖురాన్ 51:56)

మానవులను, జిన్నులను పుట్టించటం లోని తన ఉద్దేశం ఏమిటో అల్లాహ్ పై వాక్యం లో తెలియపరిచాడు. వారంతా తనను మాత్రమే ఆరాధించాలి, తనకు మాత్రమే విధేయత చూపాలన్నది ఆయన అభిమతం. అయితే దానికోసం ఆయన మనుషులను గానీ, జిన్నాతులను గానీ కట్టుబానిసలుగా చేసుకోలేదు. వారి స్వేచ్చా స్వాతంత్ర్యాలను హరించలేదు. ఒకవేళ అదే కనక అయి ఉంటే మనుషులు, జిన్నాతులు తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా ధైవారాధనకు కట్టుబడి ఉండేవారు. కానీ అల్లాహ్ వారికి స్వేచ్చను ఇస్తూనే తనను ఆరాధించమని కోరాడు. వారి పుట్టుక లోని పరమార్ధాన్ని వారికి ఇక్కడ జ్ఞాపకం చేశాడు. ఈ పరమార్ధాన్ని విస్మరించిన వారికి పరలోకంలో ఎదురయ్యే పరాభవాన్ని గురించి కూడా హెచ్చరించాడు.

ఈ ఆరాధన మరియు విధేయత ద్వారా అల్లాహ్ పోషణ జరుగుతుందని అనుకుంటున్నారేమో. అదేమీ కాదు. ప్రపంచంలో అవిశ్వాసులు కల్పించే చిల్లరదేవుళ్ళ లాంటివాడు కాదు అల్లాహ్.

దీనిని గురుంచి అల్లాహ్ ఇలా తెలుపుతున్నాడు:

నేను వారినుండి జీవనోపాధిని కోరడంలేదు. వారునాకు అన్నం పెట్టాలని కూడా నేను కోరటం లేదు“.
అల్లాహ్ యే స్వయంగా అందరికీ ఉపాధిని సమకూర్చేవాడు. ఆయన మహాశక్తిశాలి, మహాబలుడు“. (ఖురాన్51:57-58)

అల్లాహ్ కు మానవుల ఆరాధన యెక్క అవసరంలేదు. ఆయన తన అవసరాలను పూర్తిచేసుకోవటం కోసం మానవులను సృష్టించలేదు.  భూమ్యాకాశాల్లోని సమస్త ఖజానాలు అల్లాహ్ అధీనంలోనే ఉన్నాయి. అల్లాహ్ ఆరాధన వల్ల అల్లాహ్ భక్తులకే లాభం చేకూరుతుంది. వారికి ఇహపరాల సాఫల్యం కలుగుతుంది. అంతేగానీ అల్లాహ్ కు చేకూరే ప్రయోజనం ఏమీ ఉండదు.ఒక్కమానవుడు కూడా ఆయనను ఆరాధించక పోయినా ఆయన యెక్క మహొన్నత స్థానానికి ఎటువంటి హానీ కలగదు. అలాగే, ప్రతి ఒక్క మానవుడు ఆయనను ఆరాధించిన, ఆయన యెక్క మహొన్నత స్థానానికి ఎటువంటి లాభము చేకూరదు. ఆయన సంపూర్ణుడు. కేవలం ఆయన మాత్రమే ఎటువంటి అవసరాలు లేకుండా ఉనికిలో ఉన్నాడు. సృష్టించ బడిన వాటన్నింటికీ అవసరాలు ఉన్నాయి. కాబట్టి, మానవజాతికే  ఆయనను ఆరాధించే అవసరం ఉన్నది.

ఘోరాతి ఘోరమైన మహా పాపం:

పైన తెలుపబడిన సృష్టి యెక్క ఉద్దేశ్యం (అంటే అల్లాహ్ ను మాత్రమే ఆరాధించుట)తో విభేదించటమనేది మానవుడు చేయగల అత్యంత ఘోరమైన మహా పాపం. ఒకసారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను “అల్లాహ్ దృష్టిలో అత్యంత ఘోరమైన పాపం ఏది?” అని  అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హు ప్రశ్నించగా, వారిలా జవాబిచ్చినారు “అల్లాహ్ యే మీ సృష్టికర్త అయినప్పటికీ, ఆయనకు భాగస్వామ్యం కల్పించటం (షిర్క్ చేయటం)”.

సృష్టికర్తతో పాటు లేక సృష్టికర్తను వదిలి, ఇతరులను ఆరాధించటాన్ని అరబీ భాషలో షిర్క్ చేయటం అంటారు. కేవలం ఇది మాత్రమే ఎట్టి పరిస్థితిలోను, అస్సలు క్షమించబడని అత్యంత ఘోరమైన మహాపాపం. ఒకవేళ మానవుడు అటువంటి ఘోరమైన మహాపాపం నుండి పశ్చాత్తాప పడకుండా, క్షమాపణ కోరకుండా మరణించినట్లయితే, అల్లాహ్ వారి మిగిలిన పాపాలన్నింటినీ క్షమిస్తాడు గాని, షిర్క్ ను మాత్రం అస్సలు క్షమించడు. ఈ విషయమై అల్లాహ్ దివ్యఖురాన్ లో ఇలా ప్రకటిస్తున్నాడు:

నిశ్చయంగా, అల్లాహ్ తనకు  భాగస్వామి(సాటి)ని కల్పించటాన్ని ఏ మాత్రమూ క్షమించాడు. మరియు అది తప్ప దేనినీ (ఏ పాపాన్ని) అయినా, ఆయన తానుకోరిన వారిని క్షమిస్తాడు. మరియు అల్లాహ్ కు భాగస్వాములను కల్పించిన వాడే, వాస్తవానికి మహాపాపం చేసినవాడు!“(ఖురాన్ 4:48).

అల్లాహుతా’ఆలాకు  సాటి (భాగస్వాములను) కల్పించటం మహా దుర్మార్గం మరియు క్షమించరాని పాపం. కావున ఇది ఎంత మాత్రం క్షమించబడదు. ముష్రికులకు స్వర్గం నిషేధించబడినది. నిశ్చయంగా, బహుధైవారాధన (షిర్క్) గొప్ప దుర్మార్గం.

అల్లాహ్ ఎవరు? (Who is Allah?)

అల్లాహ్ భూమ్యాకాశాలకు  మరియు సర్వానికి సృష్టి కర్త. మీ సృష్టి కర్త ను గురించి తెలుసుకొని ,ఎందుకు ఆతని ఆజ్ఞకు లోబడి ఇస్లాం స్వీకరించాలో తెలుసుకొనండి.

“దైవం గురుంచి మానవ జాతి యెక్క తప్పుడు నమ్మకాలను,సిద్దాంతాలను సరిదిద్దడమే ఇస్లాం యెక్క ప్రధాన కర్తవ్యమని స్పష్టంగా అర్ధం చేసుకోండి”

విశ్వప్రభువుకు అన్నివిధాలా శోభాయమానమైన పదం ‘అల్లాహ్’ :

“అల్లాహ్” అనేది అరబీ భాషాపదం. ఇది “అల్” మరియు “ఇలాహ్” అనే రెండు పదాలు కలిసి ఏర్పడింది. అల్ అనేది ఇంగ్లీషులో వాడబడే THE వంటి ఉపపడం – ఆర్టికల్. దీని అర్ధం నిర్దిష్టమైన,నిర్ణీతమైన, ప్రత్యేకమైన, ఇంతకూ ముందు ప్రస్తావించబడిన, ఏకైక మరియు వాస్తవమైన అని.

అల్ (The) + ఇలాహ్ (God) = అల్లాహ్ (The God)

ఇప్పుడు ఈ రెండు పదాలను (అల్+ఇలాహ్)ను కలిపితే “అల్లాహ్” అనే పడం ఏర్పడింది.అదే విధంగా దాని ప్రత్యేక అర్ధం కూడ ఉనికిలోకి వచ్చింది. అనగా నిజ ఆరాధ్యుడు, ఏకైక ఆరాధ్యుడు, సాటిలేని ఆరాధ్యుడు, అసలైన ఆరాధ్యుడు, అందరికి తెలిసిన ఆరాధ్యుడు. ఇస్లాం దృష్టిలో సర్వ లోకాల సృష్టికర్త మాత్రమే ఆరాధనలకు అర్హుడు. మిగతా జీవరాశులు, ఇతర సృష్టి రాశులు ఆరాధనలకు అనర్హమైనవి. ఎందుకంటే అవి కూడా తమ సృష్టికర్త ద్వారా ఉనికిలోకి వచ్చినవే. అవన్నీ అల్లాహ్ ఆజ్ఞ మేరకు తమ కాలం వేల్లబుచ్చుతున్నవి మాత్రమే. అంతిమ లక్ష్యం వైపు పయనిస్తున్నవి మాత్రమే.

తెలుగులో మనం ‘దేవుడు’ అంటాం. అరబీలో “అల్లాహ్” అంటారు. ఇంగ్లీషులో గాడ్ (God) అని అంటారు. ఇలా మానవుల ఆరాధ్య దైవాన్ని ఒక్కో భాషలో ఒక్కో పేరుతో పిలుస్తుండవచ్చు. కాని ఇన్ని పదాల్లోకెల్లా “అల్లాహ్” అనేది ఎంతో విలక్షణమైన పదం. విశ్వప్రభువుకు అది అన్ని విధాలా శోభాయమానమైన పదం.

అరబ్బీ మాట్లాడే క్రైస్తవులు మరియు యూదులు “దేవుడు” అనే పదానికి  బదులుగా “అల్లాహ్” అనే పదాన్ని వాడుతారు. ఇంగ్లిష్ Bible లో God అని వాడిన చోటల్లా అరబిక్ Bible లో “అల్లాహ్” అనే పదం  కనపడుతుంది.

‘దేవుడు’ అనే పదం బహువచనమైతే దేవుళ్ళు అయిపోతుంది. స్త్రీలింగ మయితే దేవత అవుతంది. అలాగే ఇంగ్లీషులో కూడా  God అనే పదం  gods మరియు  goddess అవటానికి ఆస్కారముంది. అలాగే ఆ పదం స్త్రీ పురుష భేదాన్ని సూచించేటట్టుగా కూడా ఉండరాదు మరియు ఆయన అస్తిత్వాన్ని సూచించటానికి బహువచన పదం అక్కర్లేదు.నిజానికి మానవుల ఆరాధ్యదైవం ఎన్నటికీ ఒక్కడే. అందువల్ల అరబీ భాషలోని అల్లాహ్ అనే పదం విశ్వప్రభువుకు అన్నివిధాలా శోభాయమానమైనదని చెప్పవచ్చు.

ఒక అపోహ :

ముస్లిమేతరులకు ఇస్లాం గురించి ఉన్న అనేక పెద్ద అపోహల్లో “అల్లాహ్” అనే పదానికి సంబంధించిన అపోహ కూడా ఒకటి. ముస్లింలు క్రైస్తవుల, యూదుల దేవుణ్ణి కాకుండా వేరెవరో దేవుణ్ణి ఆరాధిస్తారని చాలామంది అనుకుంటారు. కాని నిజానికి ఇదంతా ఓ అపోహ మాత్రమే. ఎందుకంటే “అల్లాహ్” అనేపదం దేవుడు అనే పదానికి పర్యాయపదం. దేవుడు అందరికీ  ఒక్కడే.

దేవుడు ఎవరు? ఆయన అస్తిత్వం ఏమిటి? అనే విషయాల్లో యూదులు-క్రైస్తవులు-ముస్లింల మధ్య భేదాభిప్రాయాలున్నాయి, ఉదా; క్రైస్తవుల్లో ఉన్న త్రిత్వభావన (Trinity) ను  యూదులు తిరస్కరిస్తారు. ముస్లింలు కూడా దాన్ని తిరస్కరిస్తారు. అంతమాత్రం చేత ఆ మూడు మతాలకు వేర్వేరు దేవుళ్ళు ఉన్నారని అర్ధంకాదు. ఎందుకంటే- విశ్వమంతటికి నిజదేవుడు ఒక్కడే. ఇస్లాం చెప్పేది ఏమిటంటే- ఇతర మతాలవాళ్ళు కూడా అల్లాహ్ నే విశ్వసిస్తున్నారు. కాని అల్లాహ్ ను ఏ విధంగా విశ్వసించాలో ఆవిధంగా విశ్వసించటం లేదు. దేవుడు ఫలానా విధంగా ఉంటాడని స్వయంగా కల్పనలు చేసుకుని విశ్వసిస్తున్నారు.

అల్లాహ్ ముస్లింల దేవుడు మాత్రమే కాదు :

అల్లాహ్ అంటే ముస్లిముల దైవం, ఇంకో పేరున మరోజాతి వారి దైవం అని జనం చెప్పుకుంటూ ఉంటారు. ఇది కూడా పొరపాటే. ఇస్లాం సర్వమానవాళిని ఒకే తల్లిదండ్రుల సంతానంగా పరిగణిస్తుంది. వారందరి దైవం కూడా ఒక్కడే. ఆ దైవం మరియు ఆరాధ్యుని వివరణ మరియు విశ్లేషణ దివ్యఖురాన్ లో ఇలా ఉన్నది:

” మీరు చెప్పండి! ఆయన, అల్లాహ్ అద్వితీయుడు(ఒక్కడే).
అల్లాహ్ నిరపేక్షాపరుడు (ఎవరి ఆధారము, అక్కరా లేనివాడు, అందరూ ఆయనపై ఆధారపడేవారే).
ఆయనకు సంతానము ఎవరూ లేరు మరియు ఆయన ఎవరి సంతానమూ కాదు.
ఆయనకు సరిసమానులెవరూ లేరు.” (ఖురాన్ 112 వ అధ్యాయం)

నీ ప్రభువు పుట్టుపూర్వోత్తరాలను, అయన వంశ పరంపరను గురించి కాస్త వివరించమని బహుదైవారాధకులు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను డిమాండు చేసిన నేపధ్యంలో ఈ  ఖురాన్ అధ్యాయం  అవతరించింది.

అల్లాహ్ నిజమైన ఆరాధ్యుడు ఒక్కడు. ఆయనకు ఎవరి అవసరమూ లేదూ.ఆయన ఎవరిపైనా ఆధారపడిన వాడుకాడు. అందరికీ ఆయన అవసరం ఉంది. అందరూ ఆయన పైనే ఆధారపడి ఉన్నారు. అల్లాహ్ అందరికన్నా వేరైనవాడు, నిరపేక్షాపరుడు. ఆయనకు సంతానం లేదు. ఆయనకు తల్లిదండ్రులు సైతం లేరు. ఆయన ఎవ్వరినీ కూడా కుమారులుగా కాని, కుమార్తెలుగా గాని చేసుకోలేదు. ఆయన ఉనికిలోగాని, ఆయన గుణగణాలలో కానీ, ఆయన అధికారాలో కానీ ఆయనకు భాగస్వాములు లేరు. ఆయనకు సరిజోడీ కూడా లేరు.

” ఆయన లాంటిది  సృష్టిలో ఏదీ లేదు”(ఖురాన్ షూరా – 11).

ఒక హదీస్ ఖుద్సీలో అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు:
“మానవుడు నన్ను దూషిస్తున్నాడు. అంటే నాకు సంతానాన్ని ఆపాదిస్తున్నాడు. వాస్తవానికి నేను ఒక్కడినే. నేను నిరపెక్షాపరున్ని. నేనెవరినీ కనలేదు. నేనెవరికీ పుట్టనూలేదు. నాకు సరిజోడీ కూడా ఎవరూ లేరు.

ఈవిధంగా బహుధైవారాధకుల మూడనమ్మకాలు, అల్లాహ్ కు కుమారులను ఆపాదించే వారి మిధ్యా వాదాలు, దైవానికి భాగస్వాములను కల్పించేవారి యెక్క కాల్పనిక సిద్ధాంతాలు అన్నీ నిర్ద్వంద్వంగా ఖండించబడ్డాయి.