ఆత్మ శుద్ధి కొరకు నాలుగు సూత్రాలు | విశ్వాసి స్వయం తనపట్ల పాటించవలసిన మర్యాద | ఇస్లామీయ జీవన విధానం [వీడియో & టెక్స్ట్]

విశ్వాసి స్వయం తనపట్ల పాటించవలసిన మర్యాద | ఇస్లామీయ జీవన విధానం
https://youtu.be/SPvnqC42DTg [31 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఖుర్ఆన్ మరియు హదీసుల వెలుగులో ఆత్మ శుద్ధి (తజ్కియతున్ నఫ్స్) యొక్క ప్రాముఖ్యతను ఈ ప్రసంగం వివరిస్తుంది. మనిషి ఇహపర లోకాలలో సాఫల్యం పొందాలంటే తన ఆత్మను పరిశుద్ధం చేసుకోవడం ఎంత అవసరమో సూరహ్ అష్-షమ్స్ మరియు సూరహ్ అల్-అస్ర్ ఆధారంగా బోధించబడింది. ఆత్మ ప్రక్షాళన కొరకు నాలుగు ప్రధాన సోపానాలను – తౌబా (పశ్చాత్తాపం), మురాఖబా (దైవ చింతన/పర్యవేక్షణ), ముహాసబా (ఆత్మ పరిశీలన), మరియు ముజాహదా (నిరంతర పోరాటం) – ప్రసంగీకులు వివరించారు. వ్యాపారంలో లాభనష్టాలను బేరీజు వేసుకున్నట్లుగానే, ప్రతి ముస్లిం తన పుణ్యకార్యాలు మరియు పాపాలను నిత్యం సమీక్షించుకోవాలని, అల్లాహ్ యే తనను చూస్తున్నాడన్న స్పృహతో జీవించాలని ఈ ప్రసంగం ఉద్బోధిస్తుంది.

అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

అల్హమ్దులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అమ్మా బాద్.

ప్రియ విద్యార్థులారా! శుభప్రదమైన రమదాన్ మాసంలోని ఎనిమిదవ రోజు మనం ‘ఇస్లామీయ జీవన విధానం‘ అనే పుస్తకం నుండి ఎనిమిదవ పాఠం చదవబోతున్నాము. “స్వయం మనము మన పట్ల పాటించవలసిన మర్యాద.”

తన ఇహపరాల శుభం, తనకు తాను మంచి శిక్షణలో నడిపించుటపై ఆధారపడి ఉందని ముస్లిం విశ్వసిస్తాడు. అర్థమైందా? ఎప్పటివరకైతే మనం స్వయం మనల్ని సంస్కరించుకోమో, మన మనస్సును అదుపులో పెట్టుకొని ఒక మంచి మార్గంలో ఉండమో, అప్పటివరకు మనం ఇహపరాల శుభాలు, మేళ్లు, అన్ని రకాల సౌభాగ్యాలు పొందలేము. గమనించండి సూరతుష్ షమ్స్ లోని ఈ ఆయత్:

قَدْ أَفْلَحَ مَن زَكَّىٰهَا وَقَدْ خَابَ مَن دَسَّىٰهَا
[ఖద్ అఫ్ లహ మన్ జక్కాహా * వఖద్ ఖాబ మన్ దస్సాహా]
{నిశ్చయంగా తన ఆత్మను పరిశుద్ధ పరచుకున్న వ్యక్తి సఫలుడయ్యాడు. దానిని అణచివేసినవాడు విఫలుడయ్యాడు}. (91: షమ్స్: 9,10).

ఇక సూరతుల్ అస్ర్ ను గమనిస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా:

وَٱلْعَصْرِ إِنَّ ٱلْإِنسَـٰنَ لَفِى خُسْرٍ إِلَّا ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ وَتَوَاصَوْا۟ بِٱلْحَقِّ وَتَوَاصَوْا۟ بِٱلصَّبْرِ
[వల్ అస్రి * ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్] [ఇల్లల్లజీన ఆమనూ వ అమిలుస్స్వా లిహాతి వ తవాసౌ బిల్ హఖ్ఖి వ తవాసౌ బిస్సబ్ర]
{కాలం సాక్షిగా! నిస్సందేహంగా మానవుడు పెద్ద నష్టానికి గురిఅయి ఉన్నాడు. విశ్వసించి సత్కార్యాలు చేస్తూ ఉండేవారు, ఒకరికొకరు సత్యోపదేశం, సహనబోధ చేసుకునేవారూ తప్ప}. (103: అస్ర్))

కాలం సాక్షి, కాలం ప్రమాణంతో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనిషి నష్టంలో పడి ఉన్నాడు అని చెప్పిన తర్వాత, ఆ నష్టం లో నుండి బయటికి వచ్చేవారు ఎవరు? పేర్లు తీసి చెప్పలేదు, వారిలోని నాలుగు గుణాలు, మంచి క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రస్తావించాడు:

దీనిలో మొట్టమొదటిది విశ్వాసం మరియు సత్కార్యాలు. మన యొక్క మనస్సు శుభ్రంగా ఉండడానికి, మన ఆత్మ సంస్కరణలో ఉండడానికి, ఈ సత్కార్యాలు ఎంత ముఖ్యమో ఇంకా ముందుకు తెలుసుకోనున్నారు, గమనించండి.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

عَنْ أَبِي هُرَيْرَةَ أَنَّ رَسُولَ اللَّهِ قَالَ: كُلُّ أُمَّتِي يَدْخُلُونَ الْجَنَّةَ إِلَّا مَنْ أَبَى قَالُوا: يَا رَسُولَ اللَّهِ وَمَنْ يَأْبَى قَالَ: مَنْ أَطَاعَنِي دَخَلَ الْجَنَّةَ وَمَنْ عَصَانِي فَقَدْ أَبَى. البخاري

“నా అనుచరసంఘంలో ప్రతీ ఒకడు స్వర్గంలో ప్రవేశించగలడు. తిరస్కరించినవాడు తప్ప”. తిరస్కరించినవాడెవడు? ప్రవక్తా అని వారడగ్గా, “నా విధేయులైనవారు స్వర్గంలో చేరుదురు. విధేయులు కానివారు తిరస్కరించినవారు” అని ప్రవక్త బదులిచ్చారు. (బుఖారి 7280).

స్వర్గంలో అందరూ ప్రవేశిస్తారు కానీ ఎవరైతే తిరస్కరిస్తాడో (అంటే స్వర్గంలో పోను అని అంటాడో)… ఎవరైనా ఇలా అంటారా? అదే సహాబాలకు చాలా ఆశ్చర్యం కలిగింది ప్రవక్త మాట ద్వారా. “ఎవరైతే తిరస్కరించాడో” అంటే ప్రవక్త, స్వర్గంలో వెళ్ళడానికి ఎవరు తిరస్కరిస్తారు? అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా వర్ణించారు, ఎలా వివరించారో గమనించండి, శ్రద్ధగా వినండి.

“ఎవరు నాకు విధేయత పాటిస్తారో, నా విధేయులైన వారు స్వర్గంలో చేరుదురు. విధేయులు కాని వారు (నా మాట వినని వారు) తిరస్కరించిన వారు.”

ఇక ఇంతకుముందు ఇప్పుడిప్పుడే నేను చెప్పినట్లు, ఆత్మను శుభ్రపరచి మంచి శిక్షణలో ఉంచునది విశ్వాసము మరియు సత్కార్యాలని; ఈ మనస్సును అణచివేయునది, పాడుచేయునది అవిశ్వాసము, దుష్కార్యాలు, పాపాలు అని ఒక విశ్వాసి నమ్ముతాడు.

అల్లాహ్ యొక్క ఈ ఆదేశంపై శ్రద్ధ వహించండి, సూరహ్ హూద్ ఆయత్ నెంబర్ 114:

وَأَقِمِ ٱلصَّلَوٰةَ طَرَفَىِ ٱلنَّهَارِ وَزُلَفًۭا مِّنَ ٱلَّيْلِ
[వ అఖిమిస్సలాత తరఫయిన్నహారి వ జులఫమ్ మినల్లైల్, ఇన్నల్ హసనాతి యుజ్ హిబ్ నస్సయ్యి ఆత్]
{పగటి రెండు కొనలయందు, రాత్రి కొంతకాలమున నమాజు స్థాపించు. నిశ్చయముగా పుణ్యములు పాపములను దూరం చేస్తాయి}. (11: హూద్: 114).

ఈ ఆయత్ ద్వారా పాపాల నష్టం, ఆ పాపాలను తుడిచివేసే పుణ్యాలు చేస్తే, మన ఆత్మ శుద్ధి యొక్క విషయం కూడా ఇందులో బోధపడుతుంది. వాటన్నిటిలో నమాజ్ ఆచరణ పరంగా చాలా గొప్ప విషయం అని కూడా బోధపడుతుంది.

ఇక పాపాల నష్టాన్ని, దీనివల్ల మన ఆత్మ ఎంత చెడిపోతుందో గమనించండి, సూరతుల్ ముతఫ్ఫిఫీన్ ఆయత్ నెంబర్ 14:

كَلَّا ۖ بَلْ ۜ رَانَ عَلَىٰ قُلُوبِهِم مَّا كَانُوا۟ يَكْسِبُونَ
[కల్లా బల్ రాన అలా ఖులూబిహిమ్ మా కానూ యక్సిబూన్]
{ఇట్లు కాదు. కాని వీరి కర్మల యొక్క చిలుము వీరి హృదయాలను క్రమ్ముకొని యున్నది}. (83: తత్ ఫీఫ్: 14).

అల్లాహ్ మనల్ని ఇలాంటి పరిస్థితికి గురి కాకుండా కాపాడుగాక, ఓ అల్లాహ్ మమ్మల్ని కాపాడు. ఇలాంటి సందర్భంలో కొన్ని దుఆలు కూడా గుర్తొస్తాయి కదా? చెప్పాలా ఏదైనా ఒక దుఆ? మీరు కూడా నేర్చుకుంటున్నారా? శ్రద్ధగా వినండి మరి:

اللَّهُمَّ آتِ نَفْسِي تَقْوَاهَا، وَزَكِّهَا أَنْتَ خَيْرُ مَنْ زَكَّاهَا
[అల్లాహుమ్మ ఆతి నఫ్సీ తఖ్వాహా, వ జక్కిహా అంత ఖైరు మన్ జక్కాహా]
ఓ అల్లాహ్! నా ఆత్మకు భయభక్తులను ప్రసాదించు. దానిని (నా ఆత్మను) పరిశుద్ధపరచు. దానిని పరిశుద్ధ పరచేవారిలో నీవే ఉత్తముడవు. (సహీహ్ ముస్లిం)

ఇప్పుడు ఈ ఆయత్ సూరతుల్ ముతఫ్ఫిఫీన్ ది ఏదైతే మీరు చదివారో, దాని యొక్క అనువాదం కూడా విన్నారో, దీని వ్యాఖ్యానంలోనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహీహ్ హదీస్ వస్తుంది. దాని సంక్షిప్త భావం ఏమిటంటే:

ఎప్పుడైతే మనిషి ఒక పాపం చేస్తాడో అతని మనస్సులో ఒక నల్ల మచ్చ గుర్తు పడుతుంది. ఒకవేళ అతను తౌబా చేసుకున్నాడు, ఏదైనా పుణ్యకార్యం చేశాడు అంటే ఆ మచ్చ దూరమైపోయి, మనస్సు మళ్ళీ శుభ్రంగా, తెల్లగా ఉంటుంది (మెరుస్తూ ఉంటుంది అనండి, పర్లేదు).

ఒకవేళ తౌబా చేయకుండా, పుణ్యకార్యాల వైపునకు తిరగకుండా, అదే పాపంపై పాపం, పాపంపై పాపం, పాపాలు పాపాలు చేస్తూ ఉంటాడో… అల్లాహు అక్బర్! పెనం తెలుసు కదా? దోశలు వేస్తారు, ఆమ్లెట్లు వేస్తారు, దాని వెనుక కింద ఎలా ఉంటుంది? ఆ విధంగా అతని యొక్క మనస్సు మొత్తం నల్లగా మారిపోతుంది. అల్లాహు అక్బర్. అదే విషయం అల్లాహ్ ఈ ఆయత్ లో తెలుపుతున్నాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయత్ ను తిలావత్ చేశారు.

మన ఆత్మ శుభ్రపరచుకోవాలంటే, విశ్వాసం కరెక్ట్ గా, బలంగా ఉండాలి మరియు పుణ్యాలపై పుణ్యాలు, సత్కార్యాలపై సత్కార్యాలు చేస్తూ ఉండాలి. రండి శ్రద్ధగా వినండి కొన్ని విషయాలు. ఈ ఆయతులు ఏవైతే మనం చదివామో, అర్థం చేసుకున్నామో, అందుకే ముస్లిం ఎల్లప్పుడూ తన ఆత్మను శుద్ధి చేస్తూ, మంచి శిక్షణ, సంస్కరణలో ఉంచాలి. రేయింబవళ్లు సత్కార్యాలు చేయడానికి ప్రయత్నిస్తూ, చెడు నుండి దూరం ఉండాలి. ఆత్మ పరిశీలన చేస్తూ ఉండాలి. అనగా తన ఆత్మ చెడు వైపునకు మొగ్గుతుందా, లేక మంచి వైపునకా అనేది పరిశీలిస్తూ ఉండాలి. దానిని మంచి వైపునకు, విధేయత వైపునకు మలచి, చెడు మరియు అరాచకాల నుంచి దూరం ఉంచడానికి, ఇప్పుడు నేను తెలపబోతున్న నాలుగు ముఖ్య విషయాలు గుర్తుంచుకోండి.

సంక్షిప్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే: మీరు మీ ఇహపరాల శుభాలు కోరుతూ అల్లాహ్ ను సంతృప్తి పరచాలనుకుంటే, మీ ఆత్మ శుద్ధి కలగడం తప్పనిసరి. మనస్సు పరిశుభ్రంగా ఉండడం తప్పనిసరి. ఇబ్రహీం (అలైహిస్సలాం) వారి ప్రస్తావనలో ఆ ఆయత్ గుర్తుందా?

إِلَّا مَنْ أَتَى اللَّهَ بِقَلْبٍ سَلِيمٍ
[ఇల్లా మన్ అతల్లాహ బిఖల్బిన్ సలీం]
ఎవరు ప్రవేశిస్తారు స్వర్గంలో? ఖల్బె సలీం – శుద్ధమైన, మంచి మనస్సు ఉన్నవారే. (26:89)

అయితే మన మనస్సు మంచిగా, శుభ్రంగా, సంస్కరణలో, మంచి శిక్షణలో ఉండడానికి ఇప్పుడు నేను చెప్పబోయే నాలుగు విషయాలు మంచిగా గుర్తుంచుకోండి.

మొదటి విషయం: క్షమాభిక్ష, తౌబా, ఇస్తిగ్ఫార్. అంటే ఏమిటి? తౌబా అని అంటాము కదా, ఏమిటి? తౌబా మనం అల్లాహ్ తో తౌబా చేస్తున్నాము, మనం ఇస్తిగ్ఫార్ చేస్తున్నాము, పాపాల క్షమాభిక్ష కోరుతున్నాము అల్లాహ్ తో అంటే ఈ మూడు సూత్రాలు అనండి, మూల విషయాలు అనండి.. ఆ తౌబా, ఇస్తిగ్ఫార్ లో ఉండడం తప్పనిసరి:

  1. సర్వ చెడులను, పాపాలను విడనాడాలి. వాటి జోలికి వెళ్ళకూడదు.
  2. జరిగిన పాపంపై పశ్చాత్తాప పడాలి. “అయ్యో, ఛీ! ఎందుకైతే నాతో జరిగిందో” అని ఒక బాధ ఉండాలి. “ఆహా ఇంత మంచిగుండే కదా నేను ఎందుకు చేయకపోతిని” ఈ విధంగా కాదు, అస్తగ్ఫిరుల్లాహ్.
  3. ఇక ముందు, ఇన్ ఫ్యూచర్ (భవిష్యత్తులో) తిరిగి ఆ పాపం చేయను అని దృఢ సంకల్పం చేసుకోవాలి.

ఇలాంటి తౌబా చేసిన వారి కొరకు అల్లాహ్ ఎంత గొప్ప శుభవార్త ఇస్తున్నాడో గమనించండి, సూరతుత్ తహ్రీమ్ ఆయత్ నెంబర్ 8:

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ تُوبُوٓا۟ إِلَى ٱللَّهِ تَوْبَةًۭ نَّصُوحًا عَسَىٰ رَبُّكُمْ أَن يُكَفِّرَ عَنكُمْ سَيِّـَٔاتِكُمْ وَيُدْخِلَكُمْ جَنَّـٰتٍۢ تَجْرِى مِن تَحْتِهَا ٱلْأَنْهَـٰرُ
{ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ తో నిజమైన క్షమాపణ వేడుకోండి. మీ ప్రభువు మీ పాపములను క్షమించి, కాలువలు ప్రవహించు స్వర్గ వనములలో మిమ్ము ప్రవేశింపజేయునని ఆశ గలదు}. (66: తహ్రీం: 8).

ఏం జరుగుతుంది?

అప్పుడు మీ ప్రభువు మీ పాపాలను మీ నుండి దూరం చేసి, క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో మీకు ప్రవేశం కల్పించవచ్చు.

“వచ్చు” అంటే ఆశనే కాదు, పక్కా నమ్మకం. ఎందుకు? ఉలమాల యొక్క ఇత్తిఫాక్ (ఏకాభిప్రాయం), వ్యాఖ్యానకర్తల యొక్క ఇత్తిఫాక్: “అసా రబ్బుకుమ్” (ప్రభువు) అల్లాహ్ ఈ పని చేస్తాడు అన్నట్లుగా “అసా” అన్న పదం వస్తే అది ఖచ్చితమైన విషయం అని నమ్మాలి.

ఇక మరో శుభవార్త. శుభవార్తతో పాటు ఇందులో గొప్ప మన కొరకు ఒక సందేశం కూడా. వినండి హదీస్, అబూ మూసా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

عَنْ أَبِي مُوسَى عَنْ النَّبِيِّ قَالَ: إِنَّ اللَّهَ عَزَّ وَجَلَّ يَبْسُطُ يَدَهُ بِاللَّيْلِ لِيَتُوبَ مُسِيءُ النَّهَارِ وَيَبْسُطُ يَدَهُ بِالنَّهَارِ لِيَتُوبَ مُسِيءُ اللَّيْلِ حَتَّى تَطْلُعَ الشَّمْسُ مِنْ مَغْرِبِهَا

“పగలు పాపము చేసినవారు తౌబా చేయాలని, అల్లాహ్ రాత్రి సమయమున తన చేయి చాపుతాడు. రాత్రి పాపము చేసినవారు తౌబా చేయాలని, పగలు తన చేయి చాపుతాడు. ఇలా పశ్చిమాన సూర్యోదయము అయ్యే వరకు ఉంటుంది}. (ముస్లిం 2759).

అల్లాహ్ మన పాపాల్ని మన్నించడానికి తను చేయి చాపుతున్నాడు. “రా నా దాసుడా! నేను మన్నించడానికి సిద్ధంగా ఉన్నాను. త్వరగా నా వద్దకు వచ్చేసెయ్, నా వైపునకు తిరుగు, పాపాన్ని వదులు.” తౌబా, ఇస్తిగ్ఫార్ చెయ్ అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన చేయిని చాపుతాడు. ఇప్పటికీ కూడా మనం తౌబా కొరకు ముందడుగు వేయకుంటే నష్టం ఎవరిది? అల్లాహ్ ది ఏమాత్రం కాదు, మనదే. ఈ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రాత్రి, పగలు చేయి చాపుతూ ఆహ్వానిస్తూ ఉంటాడు తౌబా గురించి. ఎప్పటి వరకు? పశ్చిమాన సూర్యోదయం అయ్యే వరకు ఇలా జరుగుతూ ఉంటుంది. (ముస్లిం షరీఫ్ యొక్క సహీహ్ హదీస్: 2759).

అయితే ఈ నాలుగు విషయాలు తప్పనిసరి మన ఆత్మ శుద్ధి కొరకు అని చెప్పాను కదా, అందులో మొదటిది తౌబా. ఎంత ఎక్కువగా తౌబాలు చేస్తారో అంతే ఎక్కువగా మనస్సు శుభ్రం అవుతుంది. తౌబా దాని అసలైన భావంలో, దాని మూడు మూల సూత్రాలు ఏవైతే నేను ప్రారంభంలో తెలిపానో, వాటిని ఎల్లవేళలా గుర్తుంచుకోవాలి. మర్చిపోయారా? లేదు కదా. మరోసారి గుర్తుంచుకోండి:

1. సర్వ చెడులను, పాపాలను విడనాడాలి.
2. జరిగిన పాపంపై పశ్చాత్తాప పడాలి.
3. మరియు ఇక ముందు (ఇన్ ఫ్యూచర్) నేను తిరిగి ఆ పాపం చేయనని దృఢ సంకల్పం చేసుకోవాలి.

ఇక రెండవది: మురాఖబా. మురాఖబా అంటే ఏమిటి? ప్రతి క్షణం విశ్వాసి తన ప్రభువుతో భయపడుతూ ఉండాలి. అల్లాహ్ అతన్ని చూస్తూ ఉన్నాడు, అతని రహస్య బహిరంగ విషయాలను గుర్తెరుగువాడు అని మంచిగా, గట్టిగా, బలంగా నమ్మాలి. ఈ విధంగా మనస్సు అల్లాహ్ దృష్టి తనపై ఉన్నదని విశ్వసించి, అతని ధ్యానంతో (అంటే అల్లాహ్ యొక్క జిక్ర్ తో), అల్లాహ్ యొక్క విధేయతతో ఆనందం పొందుతుంది. నిజంగానా? ఇది చూద్దాం ఒకసారి, మౌల్వీ సాబ్ చెప్పిండు కదా నిజంగానా? అని కాదు. ఆయతులు వస్తున్నాయి, హదీసులు వస్తున్నాయి. అల్లాహ్ తెలిపినటువంటి మాట ఇది, కనుక అనుభవం గురించి పాటించకండి. నిజంగా మీ జీవితంలో మీరు ఆనందం పొందడానికి, నిజంగా మీరు శాంతి పొందడానికి ఇలా చేయండి, తప్పకుండా పొందుతారు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులో, ఇన్షా అల్లాహ్ ముందుకు తెలుసుకుందాము, కానీ రండి. సూరతున్నీసా ఆయత్ నెంబర్ 125 లో:

أَسْلَمَ وَجْهَهُ لِلَّهِ
[అస్లమ వజ్ హహూ లిల్లాహ్]
తనను తాను అల్లాహ్ వైపునకు సమర్పించినవాడు. అల్లాహ్ ముందు తలవంచిన వాడు. అల్లాహ్ ఆజ్ఞా పాలన కొరకు శిరస్సు వహించిన వాడు, తల వంచిన వాడు. అతడే నిజమైన రీతిలో, వాస్తవ రూపంలో ఆనందం పొందగలుగుతాడు. చదవండి ఈ ఆయత్:

وَمَنْ أَحْسَنُ دِينًۭا مِّمَّنْ أَسْلَمَ وَجْهَهُۥ لِلَّهِ وَهُوَ مُحْسِنٌۭ
[వమన్ అహ్ సను దీనమ్ మిమ్మన్ అస్లమ వజ్ హహూ లిల్లాహి వహువ ముహ్సిన్]
{అల్లాహ్ ఆజ్ఞలకు శిరసావహించి సత్కార్యములు చేయువాని మతముకంటే ఎవ్వని మతము శ్రేష్ఠమైనది}. (4: నిసా: 125). 

“కాజాలడు” అన్న మాటను ప్రశ్న రూపంలో తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ గమనించారా, అల్లాహ్ స్వయంగా ప్రశంసిస్తున్నాడు “అహ్ సను దీనా” – అతని ధర్మం అందరికంటే ఉత్తమమైన ధర్మం అని. ఈ విధంగా మనం అల్లాహ్ ఆజ్ఞల పట్ల శిరసావహించడం అంటే ఏంటి? మనస్సులో ఆ భావం ఉన్నప్పుడే కదా? అర్థమైందా?

ఇక గమనించండి, మురాఖబా – అల్లాహ్ మనల్ని చూస్తూ ఉన్నాడు, అల్లాహ్ నుండి ఏ క్షణం కూడా మనం ఎక్కడా దాగి లేము, కనుమరుగై లేము. అల్లాహ్ మనల్ని చూడకుండా మనం ఎక్కడైనా ఉండగలుగుతాము అలాంటి అవకాశమే లేదు. చదవండి ఈ ఆయత్ సూరహ్ యూనుస్ లో ఆయత్ నెంబర్ 61:

وَمَا تَكُونُ فِى شَأْنٍۢ وَمَا تَتْلُوا۟ مِنْهُ مِن قُرْءَانٍۢ وَلَا تَعْمَلُونَ مِنْ عَمَلٍ إِلَّا كُنَّا عَلَيْكُمْ شُهُودًا إِذْ تُفِيضُونَ فِيهِ
[వమా తకూను ఫీ షానిన్ వమా తత్లూ మిన్హు మిన్ ఖుర్ ఆనిన్ … ఇల్లా కున్నా అలైకుమ్ షుహూదన్ ఇజ్ తుఫీదూన ఫీహ్]
{నీవు ఏ స్థితిలో ఉన్నా, ఖుర్ఆను నుండి దేనిని వినిపించినా, (మానవులారా) మీరు ఏది చేసినా, ఆ అన్ని సందర్భాలలోనూ మేము మిమ్మల్ని చూస్తునే ఉంటాము}. (10: యూనుస్: 61). 

అల్లాహ్ అంటున్నాడు “మేము మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాము.” ఎక్కడ? మీరు ఎక్కడ ఉన్నా గాని. చీకటిలో ఉన్నా, వెలుతురులో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, నలుగురిలో ఉన్నా… చివరికి లక్షలాది మంది మధ్యలో ఉండి, ఆ లక్షలాది మంది తమ తమ భాషల్లో, తమ తమ ప్రతి ఒక్కరి కోరికలు వేరువేరు ఉన్నప్పటికీ… అల్లాహ్ అందరిని చూస్తున్నాడు, అందరి మాట వింటున్నాడు, అందరి భాషలు అర్థం చేసుకుంటున్నాడు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అందరి గురించి అన్ని రకాలుగా తెలిసి ఉన్నాడు.

అయితే చాలా చిన్న చిన్న విషయాలు కూడా అల్లాహ్ కు తెలుసా? అవును చదవండి ఆయత్ ఇంకా ముందుకు:

وَمَا يَعْزُبُ عَن رَّبِّكَ مِن مِّثْقَالِ ذَرَّةٍ فِي الْأَرْضِ وَلَا فِي السَّمَاءِ وَلَا أَصْغَرَ مِن ذَٰلِكَ وَلَا أَكْبَرَ إِلَّا فِي كِتَابٍ مُّبِينٍ

భూమిలో, ఆకాశాలలో ఉన్న రవ్వంత వస్తువు కూడా నీ ప్రభువు నుండి గోప్యంగా లేదు. ఆ రవ్వంత దానికంటే చిన్నదైనా సరే, పెద్దదైనా సరే ఏదీ కూడా (అల్లాహ్ నుండి గోప్యంగా లేదు), ప్రతీదీ కూడా స్పష్టమైన గ్రంథంలో (నమోదు చేసి) ఉంది. (10:61)

అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఈ రోజుల్లో ఎక్కడైనా కెమెరా ఉన్నది అని అంటే ఎంత భయంగా ఉంటారు? సిగ్నల్ పై కెమెరా ఉన్నది అంటే రెడ్ లైట్ ని క్రాస్ చేస్తారా? కానీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నుండి ఎక్కడా ఏమీ దాగి మనం ఉండలేము, అల్లాహ్ కు తెలియనిది ఏదీ లేదు అని ఇంత స్పష్టంగా తెలిసినప్పటికీ, మనం ఇంకా అల్లాహ్ విషయంలో ఎంత మోసానికి గురి అయి ఉంటాము, ఎన్ని పాపాలకు ప్రతిరోజు పాల్పడుతూ ఉంటాము?

మురాఖబా యొక్క అసలైన భావం ఈ హదీస్ లో కూడా ఉంది గమనించండి. హదీసే జిబ్రీల్ అన్నటువంటి పేరు గాంచిన హదీస్ కదా? అందులో మూడో ప్రశ్న, మొదటి ప్రశ్న ఈమాన్ గురించి, రెండో ప్రశ్న ఇస్లాం గురించి, మూడో ప్రశ్న “ఇహ్సాన్” గురించి. ప్రవక్త ఏం సమాధానం ఇచ్చారు?

أَنْ تَعْبُدَ اللَّهَ كَأَنَّكَ تَرَاهُ فَإِنْ لَمْ تَكُنْ تَرَاهُ فَإِنَّهُ يَرَاكَ
[అన్ తఅ బుదల్లాహ క అన్నక తరాహు, ఫ ఇన్ లమ్ తకున్ తరాహు ఫ ఇన్నహూ యరాక్]
“నీవు అల్లాహ్ ను ప్రార్థిస్తున్నప్పుడు అతన్ని చూస్తున్నట్లుగా భావించు. అతన్ని చూస్తున్నట్లు నీవు భావించలేకపోతే, నిశ్చయంగా ఆయన నిన్ను చూస్తున్నాడని నమ్ము”. (బుఖారి 50, ముస్లిం 8).

ఎన్ని విషయాలు తెలుసుకున్నారు నాలుగిట్లో? రెండు. మొదటిది తౌబా, రెండవది మురాఖబా.

ఇప్పుడు మూడవది: ఆత్మ పరిశీలన. మన ఆత్మ పరిశుద్ధి, పరిశుద్ధంగా ఉండడానికి తౌబా మరియు మురాఖబా తర్వాత ఇది కూడా చాలా అవసరం – ఆత్మ పరిశీలన. ఎప్పుడైతే ముస్లిం ఇహలోకంలో రేయింబవళ్లు కష్టపడతాడో, శ్రమిస్తాడో దాని మంచి ఫలితం పరలోకంలో పొందాలని, అతనికి గౌరవ స్థానం కలగాలని, అల్లాహ్ సంతృప్తి పొందాలని, మరియు ఈ లోకంలో కష్టపడి పుణ్యాలు సంపాదించడానికే ఉన్నప్పుడు… ఇక అతని ఆలోచన ఎలా ఉండాలి? ఒక బిజినెస్ మ్యాన్ లాగ.

అవును, ఈ రచయిత ఎంత గొప్పవారు, మస్జిద్ నబవీలో దర్స్ ఇచ్చేవారు, చాలా రోజుల క్రితం చనిపోయారు అల్లాహ్ స్వర్గం ప్రసాదించుగాక వారికి. అయితే ఎంత మంచి ఒక ఉదాహరణ ఇచ్చారు! పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు కానివ్వండి, చిన్న కొంత సరుకు అమ్ముకొని ఓ పూట అన్నం తినేవారైనా గాని.. ఆత్మ పరిశీలనను ఒక బిజినెస్ తో ఎలా పోల్చారో గమనించండి.

ఒక వ్యాపారి దృష్టిలో తన మూలధనం విలువ ఎంతనో, అంతకంటే మించిన విలువ ముస్లిం దృష్టిలో అల్లాహ్ విధించిన విధులు ఉండాలి. అల్లాహు అక్బర్. వ్యాపారి మూలధనంపై వచ్చే లాభాన్ని చూసుకున్నట్లు, ఒక ముస్లిం తన నఫిల్ (విధిగా లేని అదనపు) సత్కార్యాలను చూసుకోవాలి. ఇక పాపాలను, అల్లాహ్ పట్ల పాటించే అవిధేయత, ప్రవక్త ఆదేశాల ఆజ్ఞల పట్ల పాటించే అవిధేయత – వాటిని ఎలా చూడాలి? వ్యాపారంలో నష్టం మాదిరిగా భావించాలి.

అంతేకాకుండా, పొద్దంతా చేసిన వాటిని పడుకునేకి ముందు కనీసం లెక్కించుకొనుటకు, ఆత్మ పరిశీలనకై ఒకానొక సమయంలో ఏకాంతంలో గడపాలి. ఇక ఇలా ఏకాంతంలో గడిపి ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు ఏం చేయాలి? విధులలో ఏదైనా లోటు, కొరత చూసినట్లయితే తనను తాను మందలించుకొని, నిందించుకొని అప్పటికప్పుడే ఆ కొరతను పూర్తిచేసేవి ఉంటే పూర్తి చేయాలి. అలా పూర్తి అయ్యేవి కాకుంటే, నఫిల్ ల ద్వారా, అదనపు సత్కార్యాల ద్వారా ఆ కొరతను పూర్తి చేయాలి. ఒకవేళ నఫిల్ లలో ఏదైనా కొరత ఉంటే, లోటు ఉంటే, వాటికి బదులుగా అధికంగా నఫిల్ లు చేసి ఆ లోటును తీర్చాలి.

ఇక బిజినెస్ లాసెస్ (నష్టాలు) – నిషిద్ధ కార్యాలకు పాల్పడి నష్టం వాటిల్లినట్లయితే పశ్చాత్తాప పడి క్షమాపణ వేడుకోవాలి. ఫస్ట్ పాయింట్ తెలిపాము కదా నాలుగిట్లో – అల్లాహ్ వైపునకు మరలి, దానికి బదులుగా మంచి పని చేయాలి. ఆత్మ పరిశీలన – “ముహాసబయే నఫ్స్” అన్న దానికి ఇదే అర్థం. మరియు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరతుల్ హష్ర్ ఆయత్ నెంబర్ 18 లో ఇదే విషయం తెలియజేస్తున్నాడు:

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ ٱتَّقُوا۟ ٱللَّهَ وَلْتَنظُرْ نَفْسٌۭ مَّا قَدَّمَتْ لِغَدٍۢ ۖ وَٱتَّقُوا۟ ٱللَّهَ ۚ إِنَّ ٱللَّهَ خَبِيرٌۢ بِمَا تَعْمَلُونَ ١٨
{విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్ కు భయపడండి. ప్రతి వ్యక్తీ తాను రేపటి కొరకు ఏమి సమకూర్చుకున్నాడో చూసుకోవాలి. అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ కు మీరు చేసే పనులన్నీ తెలుసు}. (59: హష్ర్: 18).

మరియు ఇదే భావంలో హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గుర్తు చేస్తూ ఉండేవారు ప్రజలకు:

عَنْ عُمَرَ بْنِ الْخَطَّابِ قَالَ: حَاسِبُوا أَنْفُسَكُمْ قَبْلَ أَنْ تُحَاسَبُوا
[హాసిబూ అన్ఫుసకుమ్ ఖబ్ల అన్ తుహాసబూ]
‘మీరు పరిశీలింపబడే (రోజు రాక ముందే) మీ ఆత్మలను పరిశీలించుకోండి”. (తిర్మిజి 2459).

ఆత్మ శుద్ధి కొరకు, ఆత్మ సంస్కరణ కొరకు నాలుగు మూల విషయాలు – వాటిలో తౌబా గురించి విన్నాము, మరియు మురాఖబా గురించి విన్నాము, ముహాసబా గురించి విన్నాము.

ఇప్పుడు రండి ముజాహదా. ముజాహదా అంటే తీవ్ర ప్రయత్నం. ఎలాంటిది? శత్రువులలో అతి పెద్ద శత్రువు తన మనసే అన్న విషయం ప్రతి ముస్లిం తెలుసుకోవాలి. అల్లాహు అక్బర్. అందుకొరకే చూడండి సర్వసామాన్యంగా మనం ఏమంటాము? “ఒరేయ్ షైతాన్ వాడు చాలా బద్ధ శత్రువు”. అవును ఖుర్ఆన్ లో అల్లాహ్ చెప్పాడు: “నిశ్చయంగా షైతాన్ మీకు బహిరంగ శత్రువు” (2:168). కానీ దానితో పాటు మన యొక్క నఫ్స్ (ఆత్మ/మనసు)… ఇది ఎంత పెద్ద షైతానో దీనిని కూడా గమనించండి.

ఈ రోజుల్లో, ప్రత్యేకంగా రమదాన్ లో అంటాము “అయ్యో షైతాన్లు బందీఖానాలో ఉన్నాయి కదా, ఎలా మనకు ఈ పాపాలు జరుగుతున్నాయి?” మన షైతాన్ మనలో… మన నఫ్స్, మన కోరిక, మన ఆత్మ. అందుకొరకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పినటువంటి ఉదయం సాయంకాలపు దుఆలలో ఒకటి ఏమున్నది? ఒక దుఆలోని భాగం: “అవూజు బిక మిన్ షర్రి నఫ్సీ వ షర్రిష్ షైతాని వ షిర్కిహి (ఔ షరికిహి).” షైతాన్ నుండి ఎలా శరణు కోరడం జరుగుతుందో, తన ఆత్మ కీడు నుండి కూడా “మిన్ షర్రి నఫ్సీ” అని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ నేర్పారు. ఈ దుఆలు నేర్చుకోండి, చదువుతూ ఉండండి.

అయితే శత్రువులలో అతిపెద్ద శత్రువు తన మనసే అన్న విషయం ప్రతి ముస్లిం తెలుసుకోవాలి. చెడు వైపునకు ప్రేరేపించుట, మంచి నుండి దూరం ఉంచుట, ఇంకా చెడును ఆదేశించి సుఖశాంతులను కోరుట, మరియు మనోవాంఛలను – అందులో నష్టమే ఉన్నప్పటికీ – వాటిని పూర్తి చేయుటకు ప్రేరేపించుట ఈ మనస్సు యొక్క స్వాభావిక గుణం.

وَمَا أُبَرِّئُ نَفْسِي ۚ إِنَّ النَّفْسَ لَأَمَّارَةٌ بِالسُّوءِ
[వమా ఉబర్రిఉ నఫ్సీ ఇన్నన్నఫ్స లఅమ్మారతుమ్ బిస్సూ]
నేను నా అంతరాత్మ పవిత్రతను చాటుకోవడం లేదు. నిశ్చయంగా ఆత్మ చెడునే ఎక్కువగా ప్రేరేపిస్తుంది. (12:53) – పదమూడవ పారాలోని మొదటి ఆయత్ ఉంది కదా.

ఈ విషయం తెలుసుకున్న ముస్లిం తన మనస్సును సత్కార్యాలు చేయుటకు, చెడు నుండి దూరం ఉంచుటకు తీవ్ర ప్రయత్నం చేయాలి. ఇదే ముజాహదా. మరియు ఇలా చేసే వారి గురించి సూరతుల్ అంకబూత్ లోని ఆయత్ నెంబర్ 69 లో అల్లాహ్ ఎంత గొప్ప శుభవార్త ఇచ్చాడో చూడండి:

وَٱلَّذِينَ جَـٰهَدُوا۟ فِينَا لَنَهْدِيَنَّهُمْ سُبُلَنَا
[వల్లజీన జాహదూ ఫీనా లనహ్ దియన్నహుమ్ సుబులనా]
{మా కొరకు తీవ్ర ప్రయత్నం చేసేవారికి మేము మార్గాలను చూపుతాము}. (29: అన్ కబూత్: 69).

గమనించండి “సుబులనా” అని అల్లాహ్ బహువచనం చెబుతున్నాడు. అల్లాహు అక్బర్. మీరు ఒక్క అల్లాహ్ మార్గంలో నడవండి, అల్లాహ్ మీ కొరకు ఎన్నో సులభతరాలను ప్రసాదిస్తాడు. వాస్తవానికి ఇది అసలైన భక్తుల యొక్క ఉత్తమ గుణం. విశ్వాసుల, సత్యవంతుల బాట ఇదే.

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రివేళ చాలా దీర్ఘంగా తహజ్జుద్ నమాజ్ (తరావీహ్ నమాజ్ మరియు రాత్రి యొక్క నమాజ్ చేస్తుండేవారు – ఇషా తర్వాత నుండి మొదలుకొని ఫజర్ ప్రవేశించే వరకు ఉన్నటువంటి రాత్రి నమాజ్ ఏదైతే ఉందో దానినే తహజ్జుద్, తరావీహ్, ఖియాముల్ లైల్, సలాతుల్ లైల్, రాత్రి నమాజ్.. ఇవన్నీ పేర్లు ఉన్నాయి, విషయం ఒకటే). ఎంత దీర్ఘంగా చేసేవారంటే, ప్రవక్త యొక్క కాళ్లు వాపు వచ్చేవి. అది చూసి ప్రశ్నించినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం సమాధానం ఇచ్చారు? ప్రశ్న ఏం జరిగింది ప్రవక్తతో? “ఓ ప్రవక్తా! మీ పాపాలన్నీ మన్నించేసాడు అల్లాహ్ తాలా. ఎందుకు ఇంత కఠోరంగా మీరు శ్రమిస్తున్నారు?” అంటే ఏమన్నారు?

أَفَلاَ أَكُونُ عَبْدًا شَكُورًا
[అఫలా అకూను అబ్దం షకూరా]
ఏమి నేను అల్లాహ్ యొక్క కృతజ్ఞత తెలిపే దాసుణ్ణి కాకూడదా? (సహీహ్ బుఖారీ: 4837, సహీహ్ ముస్లిం: 2819)

అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఇక మనం మన పాపాల మన్నింపు కొరకు ఇంకెంత శ్రమించాలో ఆలోచించండి, ప్రయత్నం చేయండి. తౌబా, మురాఖబా, ముహాసబా, ముజాహదా – ఈ నాలుగు విషయాలను పాటించండి, ఆత్మ శుద్ధి కలుగుతుంది. తద్వారా ఇహపర లోకాల శుభాలు, మేళ్లు, అన్ని రకాల భోగభాగ్యాలు అల్లాహ్ ప్రసాదిస్తాడు. చివరికి స్వర్గ ప్రవేశం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క తోడు, అల్లాహ్ యొక్క దర్శన భాగ్యం.

అల్లాహ్ మనందరికీ మన ఆత్మ శుద్ధి గురించి ఆలోచించే అటువంటి భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.

వ ఆఖిరు దఆవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43400

హృదయాన్ని నిర్మల హృదయంగా మార్చే కార్యాలు – షేఖ్ షరీఫ్ మదనీ [ఆడియో & టెక్స్ట్]

హృదయాన్ని నిర్మల హృదయంగా మార్చే కార్యాలు
(హృదయ ఆచరణలు – 4వ భాగం)

షేఖ్ షరీఫ్, మదీనా గ్రాడ్యుయేట్ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/EBJjib6Qhmo [10 నిముషాలు]
హృదయ ఆచరణలు (భాగాలు 1 – 12) [2 గంటల 8 నిముషాలు]

السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ. نَحْمَدُهُ وَنُصَلِّي عَلَى رَسُولِهِ الْكَرِيمِ أَمَّا بَعْدُ
అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు. నహ్మదుహు వ నుసల్లీ అలా రసూలిహిల్ కరీమ్ అమ్మాబాద్.

సోదరులారా! ఈరోజు మనము తెలుసుకోబోయే అంశము హృదయ ఆచరణలు నాలుగవ భాగం. ప్రియమైన సోదరులారా, ప్రియమైన ధార్మిక సోదరీమణులారా! ఈరోజు మనము తెలుసుకోబోయే విషయము మన హృదయాలను ఏ విధంగా మనం నిర్మలమైన హృదయాలుగా, భక్తి కలిగిన హృదయాలుగా, ఉత్తమ హృదయాలుగా మార్చుకోవాలి. ఆ విధంగా మన హృదయాలను మార్చటానికి ఏ ఆచరణ మనము చేయాలి. ఆ ఆచరణలో కొన్ని బయటకు కనిపించే ఆచరణలు ఉన్నాయి మరికొన్ని బయటకు కనిపించని ఆచరణలు ఉన్నాయి. అందులో కొన్ని వాజిబ్ (కచ్చితంగా చేయాల్సిన ఆచరణలు) మరికొన్ని ముస్తహబ్బాత్ (అభిలషణీయమైన ఆచరణలు).

ఇబ్నె ఖయ్యీమ్ రహమహుల్లాహ్ ఇలా తెలియజేస్తున్నారు, అల్లాహ్ యొక్క దాసులు చేసే సత్కార్యాలు అనగా అల్లాహ్ యొక్క దాస్యము మరియు అల్లాహ్ యొక్క విధేయత మొదలైనవి. వాటి ప్రభావం మనిషి జీవితములో కనిపిస్తుంది. ఇలా చెప్పటం జరిగింది:

إِنَّ لِلْحَسَنَةِ نُورًا فِي الْقَلْبِ، وَقُوَّةً فِي الْبَدَنِ، وَضِيَاءً فِي الْوَجْهِ، وَزِيَادَةً فِي الرِّزْقِ، وَمَحَبَّةً فِي قُلُوبِ الْخَلْقِ
ఇన్న లిల్ హసనతి నూరన్ ఫిల్ ఖల్బ్, వ కువ్వతన్ ఫిల్ బదన్, వ జియా అన్ ఫిల్ వజ్హ్, వ జియాదతన్ ఫిర్రిజ్క్, వ మహబ్బతన్ ఫీ ఖలూబిల్ ఖల్క్
ఎవరైతే సత్కార్యాలు చేస్తారో వారి హృదయాలలో అల్లాహ్ ఒక వెలుగును, కాంతిని జనింపజేస్తాడు. వారి శరీరంలో శక్తి మరియు బలము జనిస్తుంది. వారి ముఖవర్చస్సుపై ఒక రకమైన కాంతి వెలుగు జనిస్తుంది. వారి ఉపాధిలో వృద్ధి మరియు శుభము కలుగుతుంది. మరియు ప్రజల హృదయాలలో వారిపై ప్రేమను కలిగించటం జరుగుతుంది.

మరియు అదే విధంగా దుష్కార్యాలు, పాప కార్యాల యొక్క ప్రభావం కూడా మనిషి జీవితంపై పడుతుంది. ఎవరైతే పాపాలు చేస్తూ ఉంటారో వారి హృదయం చీకట్లతో నిండిపోతుంది. శరీరం బలహీనపడిపోతుంది. ఉపాధి లాక్కోబడుతుంది. మరియు ప్రజల హృదయాలలో వారిపై ద్వేషాన్ని కలిగించటం జరుగుతుంది.

చూస్తున్నాము కదా సోదరులారా ఏ విధంగా పాప కార్యాల ప్రభావం మన జీవితాలలో ఉంటుందో. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఆయన రక్షణలో ఉంచు గాక ఆమీన్.

ఆ తర్వాత సోదరులారా మన హృదయాలను మనము నిర్మలమైన హృదయాలుగా మార్చుకోవటానికి దోహదపడే మరికొన్ని ఆచరణలలో ఒక మహోన్నత ఆచరణ ఇంతకుముందు ప్రస్తావించబడిన విధంగా అల్లాహ్ యొక్క జిక్ర్ ప్రియులారా. అల్లాహ్ యొక్క నామస్మరణ ప్రియులారా. ఖురాన్ యొక్క పారాయణం ప్రియులారా. ఖురాన్ యొక్క పారాయణంతో మన హృదయాలు సంస్కరించబడతాయి ప్రియులారా.

సలఫ్‌కు చెందిన వారిలో సులైమాన్ అల్ ఖవ్వాస్ రహమహుల్లాహ్ జిక్ర్ కు సంబంధించి ఆయన తెలియజేస్తున్నారు:

لِلْقَلْبِ بِمَنْزِلَةِ الْغِذَاءِ لِلْجَسَدِ
లిల్ ఖల్బి బి మన్జిలతిల్ గిజాయి లిల్ జసద్
అల్లాహ్ స్మరణ హృదయానికి ఎలాంటిది అంటే శరీరానికి ఆహారము లాంటిది.

ఏ విధంగానైతే శరీరానికి ఆహారము లేకపోతే శరీరం బలహీనపడిపోతుందో హృదయానికి అల్లాహ్ యొక్క జిక్ర్ లేకపోతే హృదయం బలహీనపడిపోతుంది ప్రియులారా. ఆ తర్వాత ఒక వ్యాధిగ్రస్తుడైన వ్యక్తి ముందు ఎంత మంచి ఆహారం పెట్టినా అది అతని వ్యాధి మూలంగా అందులో అతనికి రుచి అనిపించదు. అదే విధంగా మన హృదయాలలో ప్రాపంచిక భోగ భాగ్యాలు, ప్రాపంచిక ప్రేమ మనం ఉంచుకొని మనము కూడా ఎంత జిక్ర్ చేసినా ఆ జిక్ర్ హృదయానికి మాధుర్యము కలిగించదు ప్రియులారా. ఎందుకంటే పెదవులపై అయితే అల్లాహ్ యొక్క జిక్ర్ చేయబడుతుంది, కానీ హృదయాలలో ప్రాపంచిక వ్యామోహం ఉంది ప్రియులారా. అందుకే సులైమాన్ అల్ ఖవ్వాస్ రహమహుల్లాహ్ తెలియజేస్తున్నారు,

دواء القلب خمسة أشياء
దవావుల్ ఖల్బి ఖమ్సతు అష్ యా
హృదయానికి చికిత్స ఐదు విషయాలలో ఉంది.

ప్రతిదానికి మందు ఉన్నట్లే హృదయానికి కావలసిన మందు ఐదు విషయాలలో ఉంది.

మొదటి విషయం ప్రియులారా:

قِرَاءَةُ الْقُرْآنِ بِالتَّدَبُّرِ
ఖిరాఅతుల్ ఖుర్ఆని బిత్తదబ్బుర్
ఖురాన్ గ్రంథాన్ని ఆలోచిస్తూ ఏకాగ్రతతో అవగాహన చేసుకుంటూ మనం ఖురాన్ గ్రంథాన్ని పఠించాలి.

ఈరోజు సోదరులారా మనం కేవలం ఖురాన్ గ్రంథాన్ని అరబీ భాషలో చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం, దాని అర్థము చేసుకోవటానికి, దాని యొక్క అర్థము తెలుసుకోవటానికి మనం ప్రయత్నము చేయటం లేదు ప్రియులారా. లేదు సోదరులారా మనం ఖురాన్ గ్రంథాన్ని అరబీ భాషలో పఠిస్తూ కచ్చితంగా దాని యొక్క అర్థము కూడా మనకు తెలిసిన భాషలో తెలుసుకోవటానికి ప్రయత్నము చేయాలి.

ఆ తర్వాత రెండవ విషయం ప్రియులారా:

خَلَاءُ الْبَطْنِ
ఖలావుల్ బతన్
పొట్టలో కాస్త ఖాళీ స్థలం ఉంచాలి.

మనం భుజించాలి, పొట్ట నిండాలి కానీ ప్రియులారా మరీ ఎక్కువగా తిని ఆరాధన చేయలేనంతగా మనం మన పొట్టను నింపకూడదు ప్రియులారా. అల్లాహ్ త’ఆలా ప్రవక్తలతో అంటూ ఉన్నారు,

يَا أَيُّهَا الرُّسُلُ كُلُوا مِنَ الطَّيِّبَاتِ وَاعْمَلُوا صَالِحًا
యా అయ్యుహర్రుసులు కులూ మినత్ తయ్యిబాతి వ’అమలూ సాలిహా
ఓ ప్రవక్తలారా పరిశుద్ధమైన వాటి నుండి తినండి మరియు సత్కార్యాలు చేయండి.

కాబట్టి సోదరులారా మనం తినాలి కానీ మరీ అంతగా తినకూడదు ఆరాధన చేయలేనంతగా. పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు మనిషికి అల్లాహ్ యొక్క జ్ఞాపకం వస్తుంది ప్రియులారా, మనిషికి అల్లాహ్ గుర్తుకు వస్తాడు. మనం మన నడుం నిలబడటానికి ఎంత అవసరమో అంత తినాలి ప్రియులారా, తద్వారా మనం అల్లాహ్‌ను ఆరాధించగలగాలి.

ఆ తర్వాత హృదయ చికిత్సకు సంబంధించిన విషయాలలో మూడవ విషయం:

قِيَامُ اللَّيْلِ
ఖియాముల్లైల్
రాత్రి పూట ఆరాధన

ప్రియులారా రాత్రి పూట ఆరాధన, తహజ్జుద్ ఆరాధన, అల్లాహ్ ముందు రాత్రి పూట నిలబడాలి. ఇది కూడా మన హృదయాలకు ఒక మంచి చికిత్స ప్రియులారా.

ఆ తర్వాత సోదరులారా నాలుగవ మాట:

التَّضَرُّعُ عِنْدَ السَّحَرِ
అత్తదర్రువు ఇందస్ సహర్
సహ్రీ సమయములో అల్లాహ్‌ను వేడుకోవాలి

ఇది చాలా గొప్ప విషయం ప్రియులారా అనగా సహ్రీ సమయములో అల్లాహ్‌ను వేడుకోవాలి. సహ్రీ సమయములో అల్లాహ్ ముందు మన విషయాలను అల్లాహ్ ముందు అడగాలి ప్రియులారా. అనేకమందికి ఈ భాగ్యం లభించదు. కొంతమంది పడుకుంటారు, కొంతమంది మేల్కొని ఉన్నా కూడా ఆ సమయాన్ని వృధా చేస్తారు. ఫోన్లో అనవసర విషయాలలో సమయాన్ని వృధా, ఇతరత్రా విషయాలలో కూడా మనం సమయాన్ని వృధా చేస్తాం. లేదు ప్రియులారా, సహ్రీ సమయం కూడా అత్యంత శుభాలతో కూడిన సమయం ప్రియులారా. ఆ సమయములో మనం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాను కడు దీనంగా వేడుకోవటానికి అది ఉత్తమ సమయం.

ఆ తర్వాత హృదయ చికిత్సకు సంబంధించిన విషయాలలో ఐదవ మాట ప్రియులారా:

مُجَالَسَةُ الصَّالِحِينَ
ముజాలసతుస్ సాలిహీన్
ఉత్తమ వ్యక్తుల సాంగత్యం

ఉత్తమ వ్యక్తులతో మనం కూర్చోవాలి, ఉత్తమ వ్యక్తులతో గడపాలి ప్రియులారా.

ఈ విధంగా సోదరులారా మన హృదయానికి సంబంధించిన చికిత్సలో ఖురాన్ గ్రంథాన్ని అవగాహనతో అర్థము చేసుకుంటూ మనం పఠించాలి ప్రియులారా. అదే విధంగా పొట్టను కాస్త ఖాళీగా ఉంచాలి ప్రియులారా. ఆ తర్వాత ఖియాముల్లైల్ రాత్రి పూట అల్లాహ్ ముందు మనము నమాజులో నిలబడాలి సోదరులారా. నాలుగవ మాట సహ్రీ సమయములో అల్లాహ్ ముందు మనము కడు దీనంగా వేడుకోవాలి ప్రియులారా. ఐదవ మాట మంచి వారి సాంగత్యములో మనం మన జీవితాన్ని గడుపుతూ ఉండాలి ప్రియులారా.

ఈ విధంగా మనం మన హృదయానికి చికిత్స చేయగలం, దానిని సంస్కరించుకోగలం, దానిని అల్లాహ్ వైపునకు మరలే హృదయంగా, నిర్మలమైన హృదయంగా తయారు చేసుకోవటంలో ఇన్షా అల్లాహ్ త’ఆలా మనం ముందుకు వెళ్ళగలం ప్రియులారా.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించు గాక, మనందరికీ అల్లాహ్ త’ఆలా మనల్ని మనం సంస్కరించుకునే భాగ్యాన్ని ప్రసాదించు గాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్.

وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ
వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

హృదయ ఆరాధనలు:
https://teluguislam.net/ibadah-of-heart/

షేఖ్ షరీఫ్, మదీనా గ్రాడ్యుయేట్ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0AKZXyDn6KYNFu5ok4ZFtb

అల్లాహ్ కోసం మాత్రమే ఇతరులను ప్రేమించటం  – షేఖ్ షరీఫ్ మదనీ [ఆడియో & టెక్స్ట్]

అల్లాహ్ కోసం మాత్రమే ఇతరులను ప్రేమించటం
(హృదయ ఆచరణలు – 12వ భాగం)
షేఖ్ షరీఫ్, మదీనా గ్రాడ్యుయేట్ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/CoiTVUw5Gq4 [10 నిముషాలు]
హృదయ ఆచరణలు (భాగాలు 1 – 12) [2 గంటల 8 నిముషాలు]

السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ. الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى رَسُولِهِ الْأَمِينِ أَمَّا بَعْدُ
అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ అమీన్ అమ్మాబాద్.

హృదయ ఆచరణలు పన్నెండవ భాగంలో మనము తెలుసుకోబోయే విషయము అల్లాహ్ కోసం మాత్రమే ఇతరులను ప్రేమించటం.

ప్రియులారా, హృదయ ఆచరణలు ఏదైతే అంశాన్ని మనం వింటూ ఉన్నామో ఇది చాలా ప్రాధాన్యత కలిగిన అంశము మరియు అత్యంత ఆవశ్యకమైన అంశం. ఎందుకంటే స్వర్గంలో ఉన్నత స్థానాలను అధిరోహించటానికి హృదయ ఆచరణ ఒక ముఖ్యమైన కారకం, స్వర్గం. దాని గురించి ఇలా చెప్పటం జరిగింది, మీరు అర్ధిస్తే జన్నతుల్ ఫిర్దౌస్‌ను అర్ధించండి.

అనేకమంది సహాబాలు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సాహచర్యాన్ని స్వర్గంలో పొందాలని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో కలిసి స్వర్గంలో ఉండాలని కోరుకునేవారు. మరి స్వర్గంలో ఉన్నత స్థానాలను అధిరోహించటానికి హృదయ ఆచరణ ఒక ముఖ్యమైన కారకం. మరి అందులో నుండి మరొక ముఖ్యమైన ఆచరణ అల్లాహ్ కోసం మాత్రమే ఇతరులను ప్రేమించటం.

మనిషి కేవలం అల్లాహ్ కోసం మాత్రమే ఇతరులను ప్రేమించటం అనేది చాలా గొప్ప విషయం సోదరులారా. సాధారణంగా ప్రజలు తమ అవసరాల కోసం ప్రజలతో సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఈ రోజులలో ప్రజలు ఇతరుల గురించి చాలా తక్కువగా ఆలోచిస్తారు, చాలా తక్కువగా ఇతరుల బాగోగుల గురించి యోగక్షేమాల గురించి తెలుసుకుంటారు. కానీ ఇలాంటి కాలంలో ప్రస్తుత క్లిష్టతర పరిస్థితులలో ఎవరైనా ఒక వ్యక్తి అల్లాహ్ యొక్క దాసులను కేవలం అల్లాహ్ కోసం మాత్రమే ప్రేమిస్తే అలాంటి వ్యక్తికి స్వర్గంలో ఇన్షా అల్లాహ్ ఉన్నత స్థానం లభిస్తుంది ప్రియులారా.

తబ్రానీ గ్రంథంలో ఉల్లేఖించబడిన ఒక సహీ హదీసు ప్రకారం హజరతే ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు హదీసు ఉల్లేఖిస్తున్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు సోదరులారా. ప్రళయ దినాన కొంతమంది అల్లాహ్‌తో కలిసి కూర్చుంటారు. హదీసులో చెప్పబడింది,

إِنَّ لِلَّهِ جُلَسَاءَ
ఇన్న లిల్లాహి జులసా
కొంతమంది అల్లాహ్‌తో కలిసి కూర్చుంటారు.

మరియు ఆ సమావేశం గురించి చెప్పబడింది:

عَنْ يَمِينِ الْعَرْشِ
అన్ యమీనిల్ అర్ష్
అర్ష్ యొక్క కుడివైపున వారు కూర్చుంటారు. అంటే అల్లాహ్ యొక్క కుడివైపున వారు కూర్చుంటారు.

وَكِلْتَا يَدَيِ اللَّهِ يَمِينٌ
వ కిల్తా యదైల్లాహి యమీనున్
మరియు అల్లాహ్ యొక్క రెండు చేతులు కుడి చేతులే.

ఇక్కడ చెప్పడం జరుగుతుంది అల్లాహ్ యొక్క రెండు చేతులు కుడి చేతులే. దీన్ని బట్టి మనకి తెలుస్తున్న విషయం ఏమిటంటే అల్లాహ్‌కు చేతులు ఉన్నాయి. మరి ఆ చేతులను గురించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఆ రెండు చేతులు కుడి చేతులు.

ఇక్కడ మనము అల్లాహ్ యొక్క చేతులకు సంబంధించి షేఖ్ సాలెహ్ అల్ ఉసైమీన్ రహమహుల్లాహ్ వారు తెలియజేసిన విషయాలను తెలుసుకుందాం. ఎప్పుడైతే అల్లాహ్ యొక్క రెండు చేతులు కుడి చేతులు అన్న విషయాన్ని మనం వింటామో, వాస్తవానికి కొన్ని హదీసులలో ఎడమ చేతి ప్రస్తావన కూడా ఉంది. ఈ హదీసులో దైవ ప్రవక్త వారి మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలి, అల్లాహ్ యొక్క రెండు చేతులు కుడి చేతులు అన్న విషయాన్ని? అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన దాని ఉద్దేశం ఏమిటంటే అల్లాహ్ యొక్క రెండు చేతులు మంచిలో, శుభాలలో, మంచిలో మరియు శుభాలలో పూర్తిగా సరిసమానమైనవే. ఎవరూ దానిని ఇలా అర్థం చేసుకోకూడదు ఎలాగైతే మనిషి చేతులు ఉంటాయో ఆ విధంగా ఎవరూ కూడా అల్లాహ్ యొక్క చేతులను పోల్చకూడదు. అల్లాహ్ మనల్ని రక్షించు గాక. ఆ తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎడమ చేతితో ఇవ్వటాన్ని వారించారు, ఎడమ చేతితో పుచ్చుకోవటాన్ని వారించారు, ఎడమ చేతితో భోజనం చేయటం నుండి వారించారు, నీళ్లు త్రాగటాన్ని వారించారు. కానీ మనము అల్లాహ్ యొక్క చేతులను ఈ విధంగా మనం ఎంత మాత్రమూ ఊహించకూడదు. వాస్తవానికి అల్లాహ్ యొక్క రెండు చేతులు మేలులో, మంచిలో, సరిసమానమైనవే అన్న విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేయటం జరిగింది. ఎలాగైతే హదీసులో మనము విన్నామో. ఆ తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులో ఇలా తెలియజేస్తున్నారు:

وَكِلْتَا يَدَيِ اللَّهِ يَمِينٌ عَلَىٰ مَنَابِرِهِمْ مِنْ نُورٍ
వ కిల్తా యదైల్లాహి యమీనున్ అలా మనాబిరిహిమ్ మిన్ నూర్
అల్లాహ్ ఎవరినైతే తనతో కూర్చోబెడతారో వారు కాంతిలీనుతున్న మింబర్లపై కూర్చుంటారు.

وُجُوهُهُمْ مِنْ نُورٍ
వుజూహుహుమ్ మిన్ నూర్
వారి ముఖాలు కాంతిలీనుతూ ఉంటాయి.

لَيْسُوا بِأَنْبِيَاءَ وَلَا شُهَدَاءَ وَلَا صِدِّيقِينَ
లైసూ బి అంబియా వలా షుహదా వలా సిద్దీఖీన్
ఎవరైతే కాంతిలీనుతున్న మింబర్లపై కూర్చుంటారో, ఎవరి ముఖాలైతే దగదగా మెరిసిపోతూ ఉంటాయో, వారు ప్రవక్తలు కాదు, షహీదులు కాదు, సిద్దీఖులు కారు.

మరి ఎందుకు వారికి అలాంటి ఘనత దక్కింది? అడగటం జరిగింది,

قِيلَ يَا رَسُولَ اللَّهِ مَنْ هُمْ؟
ఖీల యా రసూలల్లాహి మన్ హుమ్?
అడగబడింది, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, వారు ఎవరు?

ప్రవక్త వారు సమాధానం ఇచ్చారు,

هُمُ الْمُتَحَابُّونَ بِجَلَالِ اللَّهِ تَبَارَكَ وَتَعَالَى
హుముల్ ముతహాబ్బూన బి జలాలిల్లాహి తబారక వ త’ఆలా
వారు అల్లాహ్ యొక్క ఘనత కోసం, అల్లాహ్ యొక్క గొప్పతనం కోసం, కేవలం అల్లాహ్ కోసం ఒండొకరిని ప్రేమించేవారు, అల్లాహ్ కోసం ఇతరులను ప్రేమించేవారు.

ఎవరైతే అల్లాహ్‌కు విధేయత చూపుతారో, అల్లాహ్‌కు దాస్యం చేస్తారో అలాంటి వారిని వీరు ప్రేమిస్తారు. ఏ ముస్లింనైనా వారు కేవలం అల్లాహ్ యొక్క ప్రసన్నత కోసం వారు ప్రేమిస్తారు. అది తప్ప వేరే ఎలాంటి ఉద్దేశము వారికి ఉండదు. ఇలాంటి వారినే అల్లాహ్ తన అర్ష్ యొక్క కుడివైపున కూర్చోబెడతాడు. దీన్ని బట్టి తెలుస్తున్న విషయం ఏమిటంటే మనం అల్లాహ్ కోసం ఇతరులను ప్రేమించాలి. ఎవరైతే అల్లాహ్ కోసం ఇతరులను ప్రేమిస్తారో అలాంటి వారికి అల్లాహ్ త’ఆలా గొప్ప సన్మానాన్ని ఇస్తాడు.

కాబట్టి ఈ హదీసు ద్వారా మనకు తెలిసిన విషయము కొంతమంది అల్లాహ్‌తో పాటు అల్లాహ్ యొక్క అర్ష్ యొక్క కుడివైపున వారు కూర్చుంటారు. వారి ముఖాలు దగదగా మెరిసిపోతుంటాయి. అల్లాహ్ యొక్క రెండు చేతుల ప్రస్తావన ఉంది. ఆ తర్వాత ఎవరైతే ఆ ప్రళయ దినాన కూర్చుంటారో వారు అల్లాహ్ యొక్క అర్ష్ కు కుడివైపున మింబర్లపై కూర్చుంటారని, వారి ముఖాలు దగదగా మెరిసిపోతాయని చెప్పబడింది. అయినప్పటికీ వారు ప్రవక్తలు కానీవారు, షహీదులు కానీవారు, సిద్దీఖులు కానీవారు కానీ ప్రవక్తతో అడిగారు మరి ఎవరు ప్రవక్త? “హుముల్ ముతహాబ్బూన్ బి జలాలిల్లాహి తబారక వ త’ఆలా“, వారు అల్లాహ్ కోసం ఇతరులను ప్రేమించేవారు అన్న విషయం మనకు తెలుస్తుంది.

ఆ తర్వాత ఇదే విధంగా హృదయ ఆచరణలలో ఇతర నైతిక ఉత్తమ నైతిక కార్యాలు కూడా ఉన్నాయి. ఒకటి అల్ హయా అనగా సిగ్గు బిడియం మనిషి బిడియాన్ని కలిగి ఉండటం. అదే విధంగా రధా, అల్లాహ్‌ను ఇష్టపెట్టే ప్రయత్నము చేయటం. వస్సబ్ర్ ఓర్పు సహనాన్ని కలిగి ఉండటం. ఇవన్నీ హృదయ ఆచరణలకు సంబంధించిన విషయాలు.

అదే విధంగా హజరతే అబూ దర్దా రదియల్లాహు త’ఆలా అన్హు వారి ఉల్లేఖనం ప్రకారం వేరే హృదయ ఆచరణ, ఉత్తమ హృదయ ఆచరణ ప్రళయ దినాన మనిషికి గౌరవాన్ని తీసుకువచ్చే ఆరాధన ప్రవక్త వారు అన్నారు,

مَا مِنْ شَيْءٍ أَثْقَلُ فِي مِيزَانِ الْمُؤْمِنِ يَوْمَ الْقِيَامَةِ مِنْ حُسْنِ الْخُلُقِ
మా మిన్ షైయిన్ అస్ఖలు ఫిల్ మీజానిల్ ము’మిని యౌమల్ ఖియామతి మిన్ హుస్నిల్ ఖులుఖి

ప్రవక్త వారు అన్నారు ఏమన్నారు, “మా మిన్ షైయిన్”, ఆ ప్రళయ దినాన ఏ వస్తువు ఉండదు, “అస్ఖలు ఫిల్ మీజానిల్ ము’మిన్” అంటే ఆ విశ్వాసి యొక్క ఆ త్రాసులో ఏ వస్తువు వేరేది బరువైనది ఉండదు, “యౌమల్ ఖియామతి యౌమల్ ఖియామతి” ప్రళయ దినాన దేనికంటే “మిన్ హుస్నిల్ ఖులుఖ్”, ఉత్తమ నడవడిక కంటే వేరే మంచి వస్తువు ఏదీ ఉండదు.

కాబట్టి ప్రియులారా ఈ హదీసులో మనకి తెలిసిన విషయము, ప్రళయ దినాన విశ్వాసి యొక్క త్రాసులో అన్నింటి కంటే బరువైన వస్తువు అతని ఉత్తమ నైతికత. కాబట్టి సోదరులారా మనిషి ప్రజలతో మంచిగా ప్రవర్తించాలి, ప్రజలను అల్లాహ్ కోసం ప్రేమించాలి, కష్టకాలంలో మనిషి ఓర్పు సహనాన్ని కలిగి ఉండాలి, మనిషిలో సిగ్గు బిడియం కూడా ఉండాలి, అల్లాహ్‌ను మనం ఇష్టపెట్టే కార్యాలు చేయాలి. వీటన్నింటి ద్వారా మనకి ప్రళయ దినాన అల్లాహ్ వద్ద గొప్ప గౌరవం లభిస్తుంది ప్రియులారా. ఇక చిట్టచివరిగా ఈ రోజుల్లో మనం మంచి ప్రవర్తన ప్రజల పట్ల కలిగి ఉందాం. ప్రజలకు ఈ కష్టకాలంలో ప్రజల యొక్క కష్ట నష్టాలలో వారితో మనం పాలుపంచుకోవాలి, వారికి సహాయపడాలి. ఎవరైతే ప్రజల కష్టాలు తీర్చటంలో వారికి తోడుగా ఉంటారో అలాంటి వారి కష్టాలను అల్లాహ్ త’ఆలా ప్రళయ దినాన వారి కష్టాలను అల్లాహ్ దూరము చేస్తాడు.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ కేవలం అల్లాహ్ కోసం ఇతరులను ప్రేమించే సద్భాగ్యాన్ని ప్రసాదించు గాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్.

وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ
వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

హృదయ ఆచరణలు (12 భాగాలు) – షేఖ్ షరీఫ్ మదనీ [ఆడియో & టెక్స్ట్]
https://teluguislam.net/2023/09/03/actions-of-the-heart/

షేఖ్ షరీఫ్, మదీనా గ్రాడ్యుయేట్ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0AKZXyDn6KYNFu5ok4ZFtb

అల్లాహ్ కు భయపడే హృదయాలు, భయపడని హృదయాలు – షేఖ్ షరీఫ్ మదనీ [ఆడియో & టెక్స్ట్]

అల్లాహ్ కు భయపడే హృదయాలు, భయపడని హృదయాలు
(హృదయ ఆచరణలు – 2వ భాగం)
షేఖ్ షరీఫ్, మదీనా గ్రాడ్యుయేట్
https://youtu.be/hHPKoRppvPs [16 నిముషాలు]
హృదయ ఆచరణలు (భాగాలు 1 – 12) [2 గంటల 8 నిముషాలు]

హృదయ ఆచరణలు – రెండవ భాగం

السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ. الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى رَسُولِهِ الْأَمِينِ أَمَّا بَعْدُ
అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ అమీన్ అమ్మాబాద్.

నా ప్రియమైన ధార్మిక సోదరులారా! అల్హందులిల్లాహ్ అల్లాహ్ యొక్క దయవలన మనం హృదయాల ఆచరణ అనే అంశానికి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము. అల్హందులిల్లాహ్ అదే క్రమములో భాగంగా నిన్న మనం మనిషి యొక్క హృదయాల సంస్కరణ, అదే విధంగా నియ్యత్ యొక్క వాస్తవికతకు సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. సోదరులారా! అదే పరంపరలో భాగంగా ఈరోజు మనము తెలుసుకోబోయే అంశము మూడవ అంశము అల్లాహ్‌కు భయపడే హృదయాలు, అల్లాహ్‌కు భయపడని హృదయాలు.

3. అల్లాహ్‌కు భయపడే హృదయాలు, భయపడని హృదయాలు

సోదరులారా! అల్లాహ్‌కు భయపడే హృదయాలు ఏమిటి? అల్లాహ్‌కు భయపడే హృదయాలు అవే ప్రియులారా, ఎవరైతే సత్కార్యాలు చేసి కూడా అల్లాహ్‌కు భయపడుతూ ఉంటారో. ఏ విధంగానైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పవిత్ర ఖురాన్ గ్రంథములో తెలియజేశారో 23వ సూరా, సూరె అల్ ముమినూన్, వాక్యము సంఖ్య 60. అల్లాహ్ అంటూ ఉన్నారు,

وَالَّذِينَ يُؤْتُونَ مَا آتَوا وَّقُلُوبُهُمْ وَجِلَةٌ أَنَّهُمْ إِلَىٰ رَبِّهِمْ رَاجِعُونَ
వల్లజీన యుతూన మా ఆతవ్ వ ఖులూబుహుమ్ వజిలతున్ అన్నహుమ్ ఇలా రబ్బిహిమ్ రాజిఊన్
ఇంకా ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఇవ్వవలసిన దానిని ఇస్తూ కూడా తమ ప్రభువు వద్దకు మరలిపోవలసి ఉందన్న భావనతో ఎవరి హృదయాలు వణుకుతూ ఉంటాయో.

దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయత్‌ యొక్క వివరణలో ఈ విషయాన్ని తెలియజేశారు. ఇది వారే ఎవరైతే ఉపవాసం ఉంటూ, నమాజులు ఆచరిస్తూ, దానధర్మాలు చెల్లిస్తూ ఆ పిదప కూడా వారి హృదయాలు భయపడుతూ ఉంటాయి, వారి సత్కార్యాలు స్వీకరింపబడ్డాయా లేవా అనే విషయమును గురించి ఆలోచిస్తూ.

అదే క్రమములో సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా 25వ సూరా సూరె ఫుర్ఖాన్ వాక్యము సంఖ్య 65 లో ఇలా పలికాడు.

وَالَّذِينَ يَقُولُونَ رَبَّنَا اصْرِفْ عَنَّا عَذَابَ جَهَنَّمَ ۖ إِنَّ عَذَابَهَا كَانَ غَرَامًا
వల్లజీన యఖూలూన రబ్బనస్ రిఫ్ అన్నా అజాబ జహన్నమ ఇన్న అజాబహా కాన ఘరామా
వారు ఇలా ప్రార్థిస్తూ ఉంటారు, “మా ప్రభు, మాపై నుంచి నరకపు శిక్షను తొలగించు. ఎందుకంటే ఆ శిక్ష ఎన్నటికీ వీడనది”.

సోదరులారా! ఇక్కడ నరకపు శిక్షను మాపై నుండి తొలగించు అని ప్రార్థిస్తున్న వారు ఎవరు ప్రియులారా? ఎవరు నరకపు శిక్ష మా నుండి తొలగించు అని ప్రార్థిస్తున్నారు? దానికి ముందు వాక్యములో అల్లాహ్ తెలుపుతున్నారు, ఎవరు అడుగుతున్నారు అల్లాహ్‌తో ఈ దుఆ? వారే,

وَالَّذِينَ يَبِيتُونَ لِرَبِّهِمْ سُجَّدًا وَقِيَامًا
వల్లజీన యబీతూన లి రబ్బిహిమ్ సుజ్జదన్ వ ఖియామా
వారే ఎవరైతే తమ ప్రభువు సన్నిధిలో సాష్టాంగపడుతూ, నిలబడుతూ రాత్రులు గడుపుతారో.

అల్లాహ్ ముందు సజ్దా చేసేవారు, అల్లాహ్ ముందు సాష్టాంగపడేవారు, అల్లాహ్ ముందు తహజ్జుద్ నమాజ్ చేసేవారు అయినప్పటికీ వారు అల్లాహ్‌తో ప్రార్థిస్తున్నారు “అల్లాహ్, మాపై నుంచి నరకపు శిక్షను తొలగించు” సుబ్ హా నల్లాహ్! ఎందుకంటే ప్రియులారా ఇవి ఆ హృదయాలు, అల్లాహ్‌కు భయపడే హృదయాలు ప్రియులారా.

ఈ వాక్యానికి సంబంధించి అమ్మ ఆయిషా సిద్దీకా రదియల్లాహు త’ఆలా అన్హా ప్రవక్తతో ఇలా అంటూ ఉన్నారు. తిర్మిజీ గ్రంథములో, కితాబుత్ తఫ్సీర్‌లో ఈ విషయం తెలియజేయబడుతుంది ప్రియులారా. హజరతే ఆయిషా సిద్దీకా రదియల్లాహు త’ఆలా అన్హా ప్రవక్తతో అడుగుతున్నారు, “ఓ ప్రవక్త, ఇంతకీ ఈ విధంగా భయపడే ఈ భక్తులు ఎవరు? వారు సారాయి తాగేవారా లేక దొంగతనము చేసేవారా?“. దానికి ప్రవక్త వారు సమాధానం చెబుతున్నారు, “ఓ అబూబకర్ పుత్రిక, వారు అటువంటి జనము కారు, వారు నమాజు చేసేవారు, ఉపవాసాలు పాటించేవారు, దానధర్మాలు చేసేవారై ఉంటారు. అయినప్పటికీ తమ ఆచరణలు స్వీకారయోగ్యం అవుతాయో లేవో అని భయపడుతూ ఉంటారు.”

సుబ్ హా నల్లాహ్! ప్రియులారా, ఇవి అల్లాహ్‌కు భయపడే హృదయాలు సోదరులారా. వారు సత్కార్యాలు చేసినప్పటికీ ఆ హృదయాలు వణుకుతూ ఉంటాయి, అల్లాహ్‌తో ప్రార్థిస్తూ ఉంటాయి ప్రియులారా.

అలా కాక రెండవ వైపున ప్రియులారా వారు ఎవరైతే కపటులు, మునాఫికులు, వారికి మరియు విశ్వాసుల మధ్య తేడా ఏమిటి ప్రియులారా? విశ్వాసి సుబ్ హా నల్లాహ్ సత్కార్యము చేస్తాడు, ఆ తర్వాత కూడా అల్లాహ్‌తో భయపడుతూ ఉంటాడు, తన సత్కార్యాలు స్వీకరింపబడ్డాయా లేవా అని. కానీ మునాఫిక్, కపట విశ్వాసి పాప కార్యాలు చేస్తూ ఉంటాడు, అల్లాహ్‌తో భయపడడు. విశ్వాసి పుణ్య కార్యాలు చేస్తూ అల్లాహ్‌తో భయపడుతూ ఉంటాడు అల్లాహ్ స్వీకరిస్తాడా లేదా అని, కానీ కపట విశ్వాసి పాప కార్యాలు చేస్తూ అల్లాహ్‌తో భయపడడు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భయం వారికి ఉండదు.

కాబట్టి సోదరులారా, ప్రస్తుత పరిస్థితులలో అన్నింటికంటే ముందు నేను నాకు నేను ఆ తర్వాత మీ అందరికీ విన్నవిస్తున్న విషయం ప్రియులారా మనం ఏ విధంగా మన హృదయాలను సంస్కరించుకోవాలో తెలుసుకోవాలి ప్రియులారా. ఈరోజు మన హృదయాల సంస్కరణ మనకి అవసరం ప్రియులారా. మనం సత్కార్యాలు చేస్తూ అల్లాహ్‌తో భయపడే వారిగా ఉన్నామా లేక పాప కార్యాలు చేస్తూ అల్లాహ్‌కు భయపడని వారిగా ఉన్నామా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ప్రియులారా.

సోదరులారా, ఈరోజు మన హృదయాలపై నిర్లక్ష్యపు తెరలు పడి ఉన్నాయి సోదరులారా. దాని వలన మన హృదయాల జీవితం మారిపోయింది. ఆరాధనలలో ప్రశాంతత, మాధుర్యము మన నుండి లాక్కోబడ్డాయి సోదరులారా. ఖురాన్ చదివే వారికి దాని పారాయణములో మాధుర్యం అనిపించటం లేదు. అల్లాహ్ ఆరాధనలో, నమాజులో నిలబడుతున్నాం కానీ మన నమాజులు మాధుర్యం నుండి ఖాళీగా ఉన్నాయి ప్రియులారా. ఎందుకు ఖాళీగా ఉన్నాయి అంటే ఆ నమాజులు మనల్ని చెడు కార్యాలు, అశ్లీలము, చెడు పనుల నుండి దూరము చేసినప్పుడు మాత్రమే మన నమాజులలో మాధుర్యం వస్తుంది ప్రియులారా. మనం చెడు కార్యాలకు, పాప కార్యాలకు దూరమైనప్పుడు మాత్రమే మనం అల్లాహ్‌తో సామీప్యాన్ని పొందగలము సోదరులారా. కాబట్టి సోదరులారా మనం మన హృదయాల సంస్కరణ చేసుకోవాలి, అల్లాహ్‌కు భయపడే హృదయాలుగా మన హృదయాలను మార్చుకోవాలి ప్రియులారా. అల్లాహ్ త’ఆలా మనందరికీ మన హృదయాలను సంస్కరించుకొని సౌభాగ్యాన్ని ప్రసాదించు గాక. ఆమీన్.

4. అసలు హృదయం అంటే ఏమిటి? దాని వాస్తవికత ఏమిటి?

ఆ తర్వాత సోదరులారా ఇదే హృదయ ఆచరణ అనే విషయానికి సంబంధించి నాలుగవ అంశం ప్రియులారా. అసలు హృదయం అంటే ఏమిటి? సోదరులారా, హృదయ ఆచరణలు అంటున్నారు కదా మరి వాస్తవానికి హృదయం అంటే ఏమిటి అని మీరు అడగవచ్చు. పదండి సోదరులారా హృదయం అంటే ఏమిటి దాని వాస్తవికత ఏమిటో తెలుసుకునే ప్రయత్నము చేద్దాం.

హృదయాన్ని అరబీ భాషలో అల్ ఖల్బ్ అని అంటారు ప్రియులారా. అల్ ఖల్బ్. అల్ ఖల్బ్ అంటే అరబీలో రెండు అర్థాలు ఉన్నాయి ప్రియులారా, మొదటిది ఖాలిసు షై అంటే ఏదైనా వస్తువు యొక్క అసలు విషయాన్ని హృదయము అంటారు. ఖల్బున్ అంటారు ప్రియులారా మరియు రెండవ అర్థం ఒక వస్తువును మరొక వస్తువు పై మరలించటాన్ని కూడా హృదయము అని అంటారు ప్రియులారా.

దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అత్యధికంగా ఈ దుఆ చేసేవారు ప్రియులారా తిర్మిజీ గ్రంథములో హదీసు నఖలు చేయబడుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా దుఆ చేసేవారు:

يَا مُقَلِّبَ الْقُلُوبِ ثَبِّتْ قَلْبِي عَلَى دِينِكَ
యా ముకల్లిబల్ ఖులూబ్ సబ్బిత్ ఖల్బీ అలా దీనిక్
ఓ హృదయాలను తిప్పేవాడా నా హృదయాన్ని నీ ధర్మంపై స్థిరముగా ఉంచు.

అనస్ రదియల్లాహు త’ఆలా అన్హు తెలియజేస్తున్నారు ప్రియులారా. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు, హృదయం, రహ్మాన్ అంటే అల్లాహ్ యొక్క రెండు వేళ్ళ మధ్య ఉంది. అల్లాహ్ కోరిన విధంగా దానిని తిప్పుతారు ప్రియులారా.

హజరతే అబూ ఉబైదా బిన్ జర్రాహ్ రదియల్లాహు త’ఆలా అన్హు తెలియజేస్తున్నారు, “విశ్వాసి యొక్క హృదయం ఒక పక్షి వంటిది అది ఎటు కావాలంటే అటు ఎగురుతుంది“.

అబూ మూసా అష్’అరీ రదియల్లాహు త’ఆలా అన్హు తెలియజేస్తున్నారు ప్రియులారా హృదయాన్ని హృదయం అని ఎందుకు అన్నారు అంటే అది ఎడారిలో ఉన్న ఒక పక్షి రెక్క వంటిది కాబట్టి హృదయం ఎటు కావాలంటే అటు ఎగురుతుంది. కాబట్టి మనం అల్లాహ్‌తో ఏమి దుఆ చేయాలి? అల్లాహ్ ధర్మంపై స్థిరత్వాన్ని ప్రసాదించమని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో మనం దుఆ చేస్తూ ఉండాలి ప్రియులారా.

ఆ తర్వాత హజరతే నోమాన్ బిన్ బషీర్ రదియల్లాహు త’ఆలా అన్హు వారి ప్రసిద్ధమైన హదీసులో ఇలా తెలుపబడింది ప్రియులారా,

أَلَا وَإِنَّ فِي الْجَسَدِ مُضْغَةً إِذَا صَلَحَتْ صَلَحَ الْجَسَدُ كُلُّهُ وَإِذَا فَسَدَتْ فَسَدَ الْجَسَدُ كُلُّهُ أَلَا وَهِيَ الْقَلْبُ
అలా వ ఇన్న ఫిల్ జసది ముద్గతన్ ఇదా సలహత్ సలహల్ జసదు కుల్లుహు వ ఇదా ఫసదత్ ఫసదల్ జసదు కుల్లుహు అలా వ హియ అల్ ఖల్బ్
బాగా వినండి, శరీరములో ఒక మాంసపు ముద్ద ఉంది. ఒకవేళ అది బాగుంటే పూర్తి శరీరము బాగుంటుంది. ఒకవేళ అది పాడైపోతే, అది చెడిపోతే పూర్తి శరీరము పాడైపోతుంది. అదే హృదయము.

(ముత్తఫఖున్ అలైహ్ , బుఖారి , ముస్లిం గ్రంధాలలో నకలు చేయబడింది)

కాబట్టి ఆ మాంసపు ముద్దను మనం జాగ్రత్తగా ఉంచాలి ప్రియులారా దానిని సంస్కరణ చేసుకుంటూ దానిని ఉంచాలి ప్రియులారా.

హజరతే అనస్ రదియల్లాహు త’ఆలా అన్హు హదీసు ఉల్లేఖిస్తున్నారు ప్రియులారా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బాల్యంలో ఉన్నప్పుడు హజరతే జిబ్రయీల్ ప్రవక్త వద్దకు వచ్చారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పిల్లలతో ఆడుకుంటున్నారు. హజరతే జిబ్రయీల్ ప్రవక్తను పట్టుకున్నారు, ప్రవక్త వారిని కిందన పరుండబెట్టారు. ఆ తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఛాతిని చీల్చి హృదయాన్ని బయటకు తీశారు ప్రియులారా. అందులో నుండి ఒక మాంసపు ముద్దను బయటకు తీశారు మరియు చెప్పడం జరిగింది, ఇది షైతాన్ యొక్క భాగం మీ నుండి తీసివేయటం జరుగుతుంది. దానిని ఒక బంగారు పళ్ళెములో పెట్టడం జరిగింది, దానిని జమ్ జమ్ నీటితో కడగటము జరిగింది, తిరిగి దానిని దాని స్థానములో ఎలా ఉండేదో అలా పెట్టటం జరిగింది ప్రియులారా.

దీని బట్టి తెలుస్తుంది ఏమిటంటే ఏదైతే ఛాతి లోపల హృదయం ఉంటుందో దానిలోనే సన్మార్గము మరియు మార్గభ్రష్టత్వం రెండింటి సంబంధం దానితోనే ఉంటుంది ప్రియులారా. కాబట్టి మనిషి తన హృదయాన్ని పరిశీలించుకోవాలి. అది సన్మార్గం పై ఉందా లేదా మార్గభ్రష్టత్వం పైకి వెళుతుందా ఇది చాలా అవసరమైన విషయం ప్రియులారా. మనిషి తన హృదయం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి, అది ఎటువైపు పయనిస్తుంది అని తెలుసుకోవాలి ప్రియులారా. అల్లాహ్ త’ఆలా మనందరికీ హృదయ సంస్కరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు గాక.

5. హృదయం బాగుంటే అన్నీ బాగుంటాయి

ఇక తర్వాత మాట ప్రియులారా ఐదవ అంశం ఈ విషయానికి సంబంధించి హృదయం బాగుంటే అన్నీ బాగుంటాయి. వాస్తవానికి హృదయం యొక్క స్థానం ఏమిటి ప్రియులారా? హృదయం యొక్క స్థానం గురించి చెప్పడం జరుగుతుంది:

أَشْرَفُ مَا فِي الْإِنْسَانِ قَلْبُهُ
అష్రఫు మా ఫిల్ ఇన్సాని ఖల్బుహు
మనిషి శరీరములో ఏదైనా శ్రేష్ఠమైన ఉన్నతమైన వస్తువు ఉంది అంటే అది అతని హృదయము.

ఎందుకంటే హృదయానికి అల్లాహ్ ఎవరో తెలుసు. అది మనిషిని అల్లాహ్ వైపునకు తీసుకువెళుతుంది. అందుకే చెప్పడం జరుగుతుంది ఎప్పుడైతే హృదయం బాగైపోతుందో దానిలో మంచి పనులు అవుతాయి. అల్లాహ్ యొక్క దాస్యం, అల్లాహ్ యొక్క విధేయత వైపునకు మనిషి వెళతాడు ప్రియులారా.

అందుకే హసన్ బస్రీ రహమహుల్లాహ్ తెలుపుతున్నారు, దావీ ఖల్బక్ – మీ హృదయాలకు చికిత్స చేయండి. అల్లాహ్‌కు దాసుల నుండి ఏ విషయం యొక్క అవసరం ఉంది అంటే అదే మంచి హృదయం యొక్క అవసరం. ఎప్పుడైతే హృదయం సంస్కరింపబడుతుందో మంచి ఆచరణలు జరుగుతాయి. హృదయము చెడిపోతే ఆచరణలు చెడిపోతాయి ప్రియులారా.

ఒక చిన్న ఉదాహరణ ఇచ్చి నా మాటను ముగిస్తాను ప్రియులారా. పవిత్ర ఖురాన్ గ్రంథములో 31వ సూరా, సూరె లుక్మాన్. హజరతే లుక్మాన్ అలైహిస్సలాతు వస్సలామ్‌కు సంబంధించి చిన్న ఉపమానం బోధిస్తాను. హజరతే లుక్మాన్ చాలా సజ్జనులైన దైవదాసులు ప్రియులారా. ఆయన ఒకరి వద్ద బానిసగా ఉండేవారు ప్రియులారా. ఆయన ఒకని వద్ద బానిసగా ఉండేవారు. ఒకసారి అతని యొక్క యజమాని హజరతే లుక్మాన్ వారికి ఏమి చెప్పాడంటే, ఒక మేకను కోసి ఆ మేకలో అత్యుత్తమ రెండు భాగాలు తెమ్మని ఒకసారి యజమాని చెప్పాడు. హజరతే లుక్మాన్ మేకను కోసి మేక యొక్క హృదయాన్ని నాలికను తీసుకువచ్చారు. మరో సమయములో యజమాని మేకను కోసి అత్యంత హీనమైన రెండు భాగాలను తెమ్మని ఆదేశించగా హజరతే లుక్మాన్ హృదయము నాలికనే తీసుకువచ్చారు. అది ఏమని అడిగితే ఆయన ఇలా అన్నారు, “నోరు హృదయము సజావుగా ఉన్నంత కాలం వాటికంటే వేరే ఉత్తమ వస్తువు లేదు. నోరు హృదయం పాడైపోతే ఆ రెండింటి కన్నా హీనమైన వస్తువు మరొకటి లేదు” [ఇబ్నె కసీర్]. సోదరులారా మాటను అర్థము చేసుకొనే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక. ఇన్షా అల్లాహ్ మరిన్ని విషయాలు తదుపరి భాగంలో వస్తాయి ప్రియులారా.

وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ
వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

షేఖ్ షరీఫ్, మదీనా గ్రాడ్యుయేట్ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5Ii

హృదయ ఆచరణలు (12 భాగాలు) – షేఖ్ షరీఫ్ మదనీ [ఆడియో & టెక్స్ట్]

హృదయ ఆచరణలు (భాగాలు 1 – 12) – షేఖ్ షరీఫ్ మదనీ [ఆడియో]
https://youtu.be/xNr_BXFT7WU [2 గంటల 8 నిముషాలు]

ప్రతి ఒక్కరూ తప్పకుండా వినాల్సిన ఆడియో. మన హృదయాన్ని, దాని ఆచరణలను సరిదిద్దుకోవడం ఎంతో అవసరం, ప్రియులారా ఓర్పు చేసుకొని వినండి, లాభం పొందండి మరియు మీ బంధు మిత్రులకు షేర్ చెయ్యడం మర్చిపోవద్దు సుమా!

ఈ ప్రసంగంలో, వక్త రమజాన్ ఉపవాసం యొక్క నిజమైన ఉద్దేశ్యం కేవలం ఆకలి దప్పులతో ఉండటం కాదని, అల్లాహ్ పట్ల భయభక్తులు (తఖ్వా) పెంపొందించుకోవడమని ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా వివరిస్తారు. ఈ తఖ్వా హృదయ శుద్ధి ద్వారానే సాధ్యమని, అందుకే ‘హృదయ ఆచరణలు’ శారీరక ఆచరణల కన్నా ముఖ్యమైనవని నొక్కి చెబుతారు. ప్రసంగం ముఖ్యంగా హృదయాన్ని శుభ్రపరచుకోవడం (సంస్కరణ), నియ్యత్ యొక్క ప్రాముఖ్యత, అల్లాహ్ పట్ల భయం, మరియు సజ్జనుల సాంగత్యం వంటి అంశాలపై దృష్టి సారిస్తుంది. హృదయం అనారోగ్యం పాలవడానికి గల కారణాలను (అనవసర స్నేహాలు, అతిగా తినడం, పాపాలు చేయడం) మరియు దానికి చికిత్సలను (ఖురాన్ పఠనం, తహజ్జుద్ నమాజ్, తెల్లవారుజామున దుఆ) కూడా వివరిస్తారు. అల్లాహ్ స్మరణ (జిక్ర్) హృదయానికి ప్రశాంతతను ఇస్తుందని, పాపాలు దానిని తుప్పు పట్టేలా చేస్తాయని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి హదీసుల ద్వారా స్పష్టం చేస్తారు. అంతిమంగా, ప్రతి ముస్లిం తన హృదయాన్ని పరిశుభ్రంగా మరియు అల్లాహ్‌కు అంకితం చేసి ఇహపరలోకాల సాఫల్యం పొందాలని పిలుపునిచ్చారు.

السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ
అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ وَعَلَى آلِهِ وَأَصْحَابِهِ وَمَنْ تَبِعَهُمْ بِإِحْسَانٍ إِلَى يَوْمِ الدِّينِ أَمَّا بَعْدُ
అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాఇ వల్ ముర్సలీన్ వ అలా ఆలిహి వ అస్హాబిహి వమన్ తబియహుమ్ బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్ అమ్మాబాద్.

ప్రియమైన నా ధార్మిక సోదరులారా! నా ధార్మిక సోదరీమణులారా! ముందుగా సర్వ స్తోత్రములు సకల లోకాలకు ప్రభువైన అల్లాహ్‌కే ప్రత్యేకము అల్హందులిల్లాహ్. పిదప అల్లాహ్ యొక్క సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క కారుణ్యములు, శుభములు మరియు శాంతి వర్షించును గాక. ప్రత్యేకముగా చిట్టచివరి దైవ ప్రవక్త హజరతే ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై. పిదప మనందరిపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యము మరియు శుభములు వర్షించును గాక, ఆమీన్.

ప్రియమైన సోదరులారా, మనమంతా రమజాన్ మాసం గుండా మన జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. మరి ఈ రమజాన్ ఉపవాసాల ద్వారా మనం మన జీవితాలలో ఎలాంటి మార్పును తీసుకువస్తున్నాం? కేవలం అన్నపానీయాలు మానేయటం మాత్రమే ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశమా? లేదు సోదరులారా! ఎంత మాత్రమూ కాదు. ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం మనందరి జీవితంలో తఖ్వా, భయభక్తి రావాలి. అందుకే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేశారు, పవిత్ర ఖురాన్ గ్రంథము, రెండవ సూరా, సూరె బఖరా, వాక్యము సంఖ్య 183. అల్లాహ్ అంటూ ఉన్నారు,

أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ. بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ
అవూజు బిల్లాహి మినష్షైతానిర్రజీమ్. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُتِبَ عَلَيْكُمُ الصِّيَامُ كَمَا كُتِبَ عَلَى الَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ
యా అయ్యుహల్లజీన ఆమనూ కుతిబ అలైకుముస్సియాము కమా కుతిబ అలల్లజీన మిన్ ఖబ్లికుమ్ లఅల్లకుమ్ తత్తఖూన్
ఓ విశ్వాసులారా! మీపై ఉపవాసాలు విధిగా చేయబడ్డాయి, ఏ విధంగానైతే మీకు పూర్వికులపై విధిగా చేయబడ్డాయో, తద్వారా మీరు భక్తిపరులు కావాలని.

అంటే, ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశము మన జీవితాలలో భయభక్తి రావాలి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పట్ల తఖ్వా రావాలి. మరి మన జీవితాలలో భయభక్తి ఎప్పుడు వస్తుంది? మనం హృదయములో అల్లాహ్‌కు భయపడినప్పుడు వస్తుంది. అది రావాలంటే మన హృదయం నిర్మలంగా ఉండాలి. మన హృదయాలలో కాపట్యమనే వ్యాధి ఉండకూడదు. ఈ కాపట్యం హృదయంలో పెట్టుకొని మనం ఎన్ని ఉపవాసాలు పెట్టినా మనలో భయభక్తి రాదు సోదరులారా. కాబట్టి మన హృదయాన్ని మనం సంస్కరించుకోవాలి. ఎలాగైతే మన దేహంతో మనం ఆరాధన చేస్తున్నామో మన హృదయంతో కూడా మనం ఆరాధన చేయాలి. ఎందుకంటే శారీరక ఆరాధన కంటే హృదయ ఆరాధన చాలా గొప్పది ప్రియులారా. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటూ ఉన్నారు,

إِنَّ اللهَ لَا يَنْظُرُ إِلَى أَجْسَامِكُمْ وَلَا إِلَى صُوَرِكُمْ وَلَكِنْ يَنْظُرُ إِلَى قُلُوبِكُمْ
ఇన్నల్లాహ లా యన్జురు అజ్సామికుమ్ వలా ఇలా సువరికుమ్ వలాకిన్ యన్జురు ఆమాలకుమ్ ఇలా ఖులూబికుమ్
నిశ్చయంగా అల్లాహ్ మీ దేహాలను కానీ, మీ ముఖాలను కానీ చూడడు, కానీ అల్లాహ్ మీ ఆచరణను, మీ హృదయ ఆంతరంగీకాలను చూస్తాడు.

కాబట్టి సోదరులారా, మనం మన హృదయాలను సంస్కరించుకోవాలి. దానికోసం మనం శారీరక ఆచరణతో పాటు హృదయ ఆచరణ ఏమిటన్న విషయాన్ని తెలుసుకోవాలి. మరి పదండి ఇన్షా అల్లాహ్, హృదయ ఆచరణలో ఏముంది ఏమిటి అనే విషయాన్ని తెలుసుకునే చిరు ప్రయత్నం ఇన్షా అల్లాహ్ మనము చేద్దాం.

సోదరులారా, మరి హృదయ ఆచరణ అనే ఈ విషయములో మన మొదటి అంశం హృదయాల సంస్కరణ. హృదయ ఆచరణ అనేది జీవితం యొక్క అతి ప్రధానమైన విషయం సోదరులారా. మనిషి ఎలాగైతే శరీరంతో ఆచరిస్తున్నాడో, శరీరంతో ఆరాధన చేస్తున్నాడో అదే విధంగా హృదయముతో కూడా ఆరాధించటం, హృదయముతో కూడా ఆచరణ చేయటము అనేది మన జీవితము యొక్క అతి ప్రధానమైన విషయము సోదరులారా. కానీ మనం సాధారణంగా ఈ విషయమై తక్కువ శ్రద్ధ చూపుతూ ఉంటాం. వాస్తవానికి మన హృదయాల సంస్కరణ, మన హృదయాల శిక్షణ చాలా అవసరమైనది సోదరులారా. ఒకవేళ మనిషి హృదయము గనుక సంస్కరింపబడితే, మనిషి యొక్క ఆచరణలు, వ్యవహారాలు చాలా చక్కగా సంస్కరింపబడతాయి. అప్పుడు మనిషి ఒక రకమైన తన్మయత్వానికి, ఆనందానికి లోనై ఆనందముతో కూడిన మార్గదర్శకత్వపు మార్గం వైపునకు తన జీవిత ప్రయాణాన్ని మొదలు పెడతాడు. అతని హృదయపరమైన జీవితం, శారీరక పరమైన జీవితం మారిపోతుంది. అతడు ఎంతగా మారిపోతాడంటే, ప్రళయానికి ముందే ప్రపంచములోనే ఒక స్వర్గములో తాను ఉన్నట్లుగా భావిస్తాడు ప్రియులారా. తద్వారా చాలా ఆనందానికి గురి అవుతాడు, సంతోషిస్తాడు. ఇది కేవలం దేని ద్వారా సాధ్యము ప్రియులారా? హృదయ సంస్కరణ ద్వారా మాత్రమే ఇది మన జీవితాలలో సాధ్యమవుతుంది. కాబట్టి సోదరులారా మనం మన హృదయాలను సంస్కరించుకోవటానికి ప్రయత్నము చేయాలి. అల్లాహ్ త’ఆలా మనందరికీ మన హృదయాలను సంస్కరించుకునే భాగ్యాన్ని ప్రసాదించు గాక. ఆమీన్.

సోదరులారా, హృదయ ఆచరణ అనే ఈ విషయములో రెండవ అంశం, నియ్యత్ (సంకల్పం) యొక్క వాస్తవికత. ఇమామ్ ఇబ్నె ఖయ్యీమ్ రహమహుల్లాహ్ తెలియజేస్తున్నారు, “హృదయ ఆచరణలే అసలైన ఆచరణలు మరియు ఇవే ఉద్దేశింపబడిన ఆచరణలు. మరియు ఏ ఆచరణ అయితే మనం శరీర అవయవాలతో చేస్తామో వాస్తవానికి అవి హృదయ ఆచరణలను పూర్తి చేయటానికే“.

వాస్తవం ఏమిటంటే సోదరులారా, నియ్యత్, సంకల్పం అనేది హృదయ ఆచరణ మరియు మనం అవయవాలతో, కాళ్ళు చేతులతో మనం చేసేది శారీరక ఆచరణ. నియ్యత్, సంకల్పం అనేది హృదయ ఆచరణ, మనం అవయవాలతో చేసేది శారీరక ఆచరణ. మరి ఇక్కడ నియ్యత్ అనే హృదయ ఆచరణలో ఇఖ్లాస్ లేకపోతే, చిత్తశుద్ధి లేకపోతే అల్లాహ్‌ను ఇష్టపెట్టే సంకల్పము లేనప్పుడు మనం శరీర అవయవాలతో ఎన్ని ఆచరణలు చేసినా వ్యర్థమే సోదరులారా. మన నియ్యత్, సంకల్పంలో చిత్తశుద్ధి లేకపోతే, అంటే హృదయములో ఇఖ్లాస్ లేకపోతే, శారీరక ఆరాధనలు వ్యర్థము ప్రియులారా. దానితో ఎలాంటి ప్రతిఫలము ఉండదు. అలాంటప్పుడు మన శరీరం ఉండి కూడా అది ఒక మృతదేహము లాంటిది. మన మనస్సులో, మన హృదయంలో ఇఖ్లాస్ లేనప్పుడు మన శరీరం ఉండి కూడా అది ఒక మృతదేహము లాంటిది. ఎందుకంటే హృదయ ఆచరణలో లోపం ఉంది కాబట్టి. అందుకే ముందుగా మన సంకల్పాన్ని సంస్కరించుకోవాలి. సంకల్పం, నియ్యత్ బాగుంటేనే అల్లాహ్ వద్ద ఆ ఆచరణ స్వీకరింపబడుతుంది. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు,

إِنَّمَا الْأَعْمَالُ بِالنِّيَّاتِ
ఇన్నమల్ ఆమాలు బిన్నియాత్
ప్రతి ఆచరణ సంకల్పంపై ఆధారపడి ఉంటుంది.

కాబట్టి దీని ద్వారా మనకు తెలిసిన విషయం ఏమిటంటే, మనిషి ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, ఎన్ని సత్కార్యాలు చేసినా, సంకల్పం, నియ్యత్ లో గనుక ఇఖ్లాస్ లేకపోతే అది బలహీనమైన ఆరాధనగా మారిపోయి సత్కార్యాలన్నింటినీ నాశనం చేస్తుంది ప్రియులారా. ఎలాగైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథములో తెలియజేశారో,

فَمَن كَانَ يَرْجُو لِقَاءَ رَبِّهِ فَلْيَعْمَلْ عَمَلًا صَالِحًا وَلَا يُشْرِكْ بِعِبَادَةِ رَبِّهِ أَحَدًا
మన్ కాన యర్జు లికాఅ రబ్బిహీ ఫల్ య’అమల్ అమలన్ సాలిహన్ వలా యుష్రిక్ బి ఇబాదతి రబ్బిహీ అహదా
తన ప్రభువును కలుసుకోవాలన్న ఆకాంక్ష ఉన్నవాడు సత్కార్యాలు చేయాలి, తన ప్రభువు ఆరాధనలో వేరొకరికి భాగస్వామ్యము కల్పించకూడదు.

అంటే సోదరులారా, పూర్తి ఇఖ్లాస్‌తో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క ఆరాధన మనం చేయాలి సోదరులారా. కాబట్టి ఇన్షా అల్లాహ్ త’ఆలా మన సంకల్పాలను మనం పరిశుద్ధి చేసుకుందాం, ఉన్నతమైన సంకల్పంతో అల్లాహ్‌ను ఆరాధిద్దాం. మన హృదయ ఆచరణ, నియ్యత్ ను మనం సంస్కరించుకుందాం ప్రియులారా. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ఇఖ్లాస్‌తో అల్లాహ్‌ను ఆరాధించే భాగ్యాన్ని ప్రసాదించు గాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్.

ఇన్షా అల్లాహ్ త’ఆలా వేరొక అంశం, ఇదే అంశానికి సంబంధించి రెండవ భాగం మీ ముందు ఉంచడం జరుగుతుంది.

وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ
వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ. الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى رَسُولِهِ الْأَمِينِ أَمَّا بَعْدُ
అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ అమీన్ అమ్మాబాద్.

నా ప్రియమైన ధార్మిక సోదరులారా! అల్హందులిల్లాహ్ అల్లాహ్ యొక్క దయవలన మనం హృదయాల ఆచరణ అనే అంశానికి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము. అల్హందులిల్లాహ్ అదే క్రమములో భాగంగా నిన్న మనం మనిషి యొక్క హృదయాల సంస్కరణ, అదే విధంగా నియ్యత్ యొక్క వాస్తవికతకు సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. సోదరులారా! అదే పరంపరలో భాగంగా ఈరోజు మనము తెలుసుకోబోయే అంశము మూడవ అంశము అల్లాహ్‌కు భయపడే హృదయాలు, అల్లాహ్‌కు భయపడని హృదయాలు.

సోదరులారా! అల్లాహ్‌కు భయపడే హృదయాలు ఏమిటి? అల్లాహ్‌కు భయపడే హృదయాలు అవే ప్రియులారా, ఎవరైతే సత్కార్యాలు చేసి కూడా అల్లాహ్‌కు భయపడుతూ ఉంటారో. ఏ విధంగానైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పవిత్ర ఖురాన్ గ్రంథములో తెలియజేశారో 23వ సూరా, సూరె అల్ ముమినూన్, వాక్యము సంఖ్య 60. అల్లాహ్ అంటూ ఉన్నారు,

وَالَّذِينَ يُؤْتُونَ مَا آتَوا وَّقُلُوبُهُمْ وَجِلَةٌ أَنَّهُمْ إِلَىٰ رَبِّهِمْ رَاجِعُونَ
వల్లజీన యుతూన మా ఆతవ్ వ ఖులూబుహుమ్ వజిలతున్ అన్నహుమ్ ఇలా రబ్బిహిమ్ రాజిఊన్
ఇంకా ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఇవ్వవలసిన దానిని ఇస్తూ కూడా తమ ప్రభువు వద్దకు మరలిపోవలసి ఉందన్న భావనతో ఎవరి హృదయాలు వణుకుతూ ఉంటాయో.

దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయత్‌ యొక్క వివరణలో ఈ విషయాన్ని తెలియజేశారు. ఇది వారే ఎవరైతే ఉపవాసం ఉంటూ, నమాజులు ఆచరిస్తూ, దానధర్మాలు చెల్లిస్తూ ఆ పిదప కూడా వారి హృదయాలు భయపడుతూ ఉంటాయి, వారి సత్కార్యాలు స్వీకరింపబడ్డాయా లేవా అనే విషయమును గురించి ఆలోచిస్తూ.

అదే క్రమములో సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా 25వ సూరా సూరె ఫుర్ఖాన్ వాక్యము సంఖ్య 65 లో ఇలా పలికాడు.

وَالَّذِينَ يَقُولُونَ رَبَّنَا اصْرِفْ عَنَّا عَذَابَ جَهَنَّمَ ۖ إِنَّ عَذَابَهَا كَانَ غَرَامًا
వల్లజీన యఖూలూన రబ్బనస్ రిఫ్ అన్నా అజాబ జహన్నమ ఇన్న అజాబహా కాన ఘరామా
వారు ఇలా ప్రార్థిస్తూ ఉంటారు, “మా ప్రభు, మాపై నుంచి నరకపు శిక్షను తొలగించు. ఎందుకంటే ఆ శిక్ష ఎన్నటికీ వీడనది”.

సోదరులారా! ఇక్కడ నరకపు శిక్షను మాపై నుండి తొలగించు అని ప్రార్థిస్తున్న వారు ఎవరు ప్రియులారా? ఎవరు నరకపు శిక్ష మా నుండి తొలగించు అని ప్రార్థిస్తున్నారు? దానికి ముందు వాక్యములో అల్లాహ్ తెలుపుతున్నారు, ఎవరు అడుగుతున్నారు అల్లాహ్‌తో ఈ దుఆ? వారే,

وَالَّذِينَ يَبِيتُونَ لِرَبِّهِمْ سُجَّدًا وَقِيَامًا
వల్లజీన యబీతూన లి రబ్బిహిమ్ సుజ్జదన్ వ ఖియామా
వారే ఎవరైతే తమ ప్రభువు సన్నిధిలో సాష్టాంగపడుతూ, నిలబడుతూ రాత్రులు గడుపుతారో.

అల్లాహ్ ముందు సజ్దా చేసేవారు, అల్లాహ్ ముందు సాష్టాంగపడేవారు, అల్లాహ్ ముందు తహజ్జుద్ నమాజ్ చేసేవారు అయినప్పటికీ వారు అల్లాహ్‌తో ప్రార్థిస్తున్నారు “అల్లాహ్, మాపై నుంచి నరకపు శిక్షను తొలగించు” సుబ్ హా నల్లాహ్! ఎందుకంటే ప్రియులారా ఇవి ఆ హృదయాలు, అల్లాహ్‌కు భయపడే హృదయాలు ప్రియులారా.

ఈ వాక్యానికి సంబంధించి అమ్మ ఆయిషా సిద్దీకా రదియల్లాహు త’ఆలా అన్హా ప్రవక్తతో ఇలా అంటూ ఉన్నారు. తిర్మిజీ గ్రంథములో, కితాబుత్ తఫ్సీర్‌లో ఈ విషయం తెలియజేయబడుతుంది ప్రియులారా. హజరతే ఆయిషా సిద్దీకా రదియల్లాహు త’ఆలా అన్హా ప్రవక్తతో అడుగుతున్నారు, “ఓ ప్రవక్త, ఇంతకీ ఈ విధంగా భయపడే ఈ భక్తులు ఎవరు? వారు సారాయి తాగేవారా లేక దొంగతనము చేసేవారా?“. దానికి ప్రవక్త వారు సమాధానం చెబుతున్నారు, “ఓ అబూబకర్ పుత్రిక, వారు అటువంటి జనము కారు, వారు నమాజు చేసేవారు, ఉపవాసాలు పాటించేవారు, దానధర్మాలు చేసేవారై ఉంటారు. అయినప్పటికీ తమ ఆచరణలు స్వీకారయోగ్యం అవుతాయో లేవో అని భయపడుతూ ఉంటారు.”

సుబ్ హా నల్లాహ్! ప్రియులారా, ఇవి అల్లాహ్‌కు భయపడే హృదయాలు సోదరులారా. వారు సత్కార్యాలు చేసినప్పటికీ ఆ హృదయాలు వణుకుతూ ఉంటాయి, అల్లాహ్‌తో ప్రార్థిస్తూ ఉంటాయి ప్రియులారా.

అలా కాక రెండవ వైపున ప్రియులారా వారు ఎవరైతే కపటులు, మునాఫికులు, వారికి మరియు విశ్వాసుల మధ్య తేడా ఏమిటి ప్రియులారా? విశ్వాసి సుబ్ హా నల్లాహ్ సత్కార్యము చేస్తాడు, ఆ తర్వాత కూడా అల్లాహ్‌తో భయపడుతూ ఉంటాడు, తన సత్కార్యాలు స్వీకరింపబడ్డాయా లేవా అని. కానీ మునాఫిక్, కపట విశ్వాసి పాప కార్యాలు చేస్తూ ఉంటాడు, అల్లాహ్‌తో భయపడడు. విశ్వాసి పుణ్య కార్యాలు చేస్తూ అల్లాహ్‌తో భయపడుతూ ఉంటాడు అల్లాహ్ స్వీకరిస్తాడా లేదా అని, కానీ కపట విశ్వాసి పాప కార్యాలు చేస్తూ అల్లాహ్‌తో భయపడడు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భయం వారికి ఉండదు.

కాబట్టి సోదరులారా, ప్రస్తుత పరిస్థితులలో అన్నింటికంటే ముందు నేను నాకు నేను ఆ తర్వాత మీ అందరికీ విన్నవిస్తున్న విషయం ప్రియులారా మనం ఏ విధంగా మన హృదయాలను సంస్కరించుకోవాలో తెలుసుకోవాలి ప్రియులారా. ఈరోజు మన హృదయాల సంస్కరణ మనకి అవసరం ప్రియులారా. మనం సత్కార్యాలు చేస్తూ అల్లాహ్‌తో భయపడే వారిగా ఉన్నామా లేక పాప కార్యాలు చేస్తూ అల్లాహ్‌కు భయపడని వారిగా ఉన్నామా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ప్రియులారా.

సోదరులారా, ఈరోజు మన హృదయాలపై నిర్లక్ష్యపు తెరలు పడి ఉన్నాయి సోదరులారా. దాని వలన మన హృదయాల జీవితం మారిపోయింది. ఆరాధనలలో ప్రశాంతత, మాధుర్యము మన నుండి లాక్కోబడ్డాయి సోదరులారా. ఖురాన్ చదివే వారికి దాని పారాయణములో మాధుర్యం అనిపించటం లేదు. అల్లాహ్ ఆరాధనలో, నమాజులో నిలబడుతున్నాం కానీ మన నమాజులు మాధుర్యం నుండి ఖాళీగా ఉన్నాయి ప్రియులారా. ఎందుకు ఖాళీగా ఉన్నాయి అంటే ఆ నమాజులు మనల్ని చెడు కార్యాలు, అశ్లీలము, చెడు పనుల నుండి దూరము చేసినప్పుడు మాత్రమే మన నమాజులలో మాధుర్యం వస్తుంది ప్రియులారా. మనం చెడు కార్యాలకు, పాప కార్యాలకు దూరమైనప్పుడు మాత్రమే మనం అల్లాహ్‌తో సామీప్యాన్ని పొందగలము సోదరులారా. కాబట్టి సోదరులారా మనం మన హృదయాల సంస్కరణ చేసుకోవాలి, అల్లాహ్‌కు భయపడే హృదయాలుగా మన హృదయాలను మార్చుకోవాలి ప్రియులారా. అల్లాహ్ త’ఆలా మనందరికీ మన హృదయాలను సంస్కరించుకొని సౌభాగ్యాన్ని ప్రసాదించు గాక. ఆమీన్.

ఆ తర్వాత సోదరులారా ఇదే హృదయ ఆచరణ అనే విషయానికి సంబంధించి నాలుగవ అంశం ప్రియులారా. అసలు హృదయం అంటే ఏమిటి? సోదరులారా, హృదయ ఆచరణలు అంటున్నారు కదా మరి వాస్తవానికి హృదయం అంటే ఏమిటి అని మీరు అడగవచ్చు. పదండి సోదరులారా హృదయం అంటే ఏమిటి దాని వాస్తవికత ఏమిటో తెలుసుకునే ప్రయత్నము చేద్దాం.

హృదయాన్ని అరబీ భాషలో అల్ ఖల్బ్ అని అంటారు ప్రియులారా. అల్ ఖల్బ్. అల్ ఖల్బ్ అంటే అరబీలో రెండు అర్థాలు ఉన్నాయి ప్రియులారా, మొదటిది ఖాలిసు షై అంటే ఏదైనా వస్తువు యొక్క అసలు విషయాన్ని హృదయము అంటారు. ఖల్బున్ అంటారు ప్రియులారా మరియు రెండవ అర్థం ఒక వస్తువును మరొక వస్తువు పై మరలించటాన్ని కూడా హృదయము అని అంటారు ప్రియులారా.

దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అత్యధికంగా ఈ దుఆ చేసేవారు ప్రియులారా తిర్మిజీ గ్రంథములో హదీసు నఖలు చేయబడుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా దుఆ చేసేవారు:

يَا مُقَلِّبَ الْقُلُوبِ ثَبِّتْ قَلْبِي عَلَى دِينِكَ
యా ముకల్లిబల్ ఖులూబ్ సబ్బిత్ ఖల్బీ అలా దీనిక్
ఓ హృదయాలను తిప్పేవాడా నా హృదయాన్ని నీ ధర్మంపై స్థిరముగా ఉంచు.

అనస్ రదియల్లాహు త’ఆలా అన్హు తెలియజేస్తున్నారు ప్రియులారా. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు, హృదయం, రహ్మాన్ అంటే అల్లాహ్ యొక్క రెండు వేళ్ళ మధ్య ఉంది. అల్లాహ్ కోరిన విధంగా దానిని తిప్పుతారు ప్రియులారా.

హజరతే అబూ ఉబైదా బిన్ జర్రాహ్ రదియల్లాహు త’ఆలా అన్హు తెలియజేస్తున్నారు, “విశ్వాసి యొక్క హృదయం ఒక పక్షి వంటిది అది ఎటు కావాలంటే అటు ఎగురుతుంది“.

అబూ మూసా అష్’అరీ రదియల్లాహు త’ఆలా అన్హు తెలియజేస్తున్నారు ప్రియులారా హృదయాన్ని హృదయం అని ఎందుకు అన్నారు అంటే అది ఎడారిలో ఉన్న ఒక పక్షి రెక్క వంటిది కాబట్టి హృదయం ఎటు కావాలంటే అటు ఎగురుతుంది. కాబట్టి మనం అల్లాహ్‌తో ఏమి దుఆ చేయాలి? అల్లాహ్ ధర్మంపై స్థిరత్వాన్ని ప్రసాదించమని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో మనం దుఆ చేస్తూ ఉండాలి ప్రియులారా.

ఆ తర్వాత హజరతే నోమాన్ బిన్ బషీర్ రదియల్లాహు త’ఆలా అన్హు వారి ప్రసిద్ధమైన హదీసులో ఇలా తెలుపబడింది ప్రియులారా,

أَلَا وَإِنَّ فِي الْجَسَدِ مُضْغَةً إِذَا صَلَحَتْ صَلَحَ الْجَسَدُ كُلُّهُ وَإِذَا فَسَدَتْ فَسَدَ الْجَسَدُ كُلُّهُ أَلَا وَهِيَ الْقَلْبُ
అలా వ ఇన్న ఫిల్ జసది ముద్గతన్ ఇదా సలహత్ సలహల్ జసదు కుల్లుహు వ ఇదా ఫసదత్ ఫసదల్ జసదు కుల్లుహు అలా వ హియ అల్ ఖల్బ్
బాగా వినండి, శరీరములో ఒక మాంసపు ముద్ద ఉంది. ఒకవేళ అది బాగుంటే పూర్తి శరీరము బాగుంటుంది. ఒకవేళ అది పాడైపోతే, అది చెడిపోతే పూర్తి శరీరము పాడైపోతుంది. అదే హృదయము.

(ముత్తఫఖున్ అలైహ్ , బుఖారి , ముస్లిం గ్రంధాలలో నకలు చేయబడింది)

కాబట్టి ఆ మాంసపు ముద్దను మనం జాగ్రత్తగా ఉంచాలి ప్రియులారా దానిని సంస్కరణ చేసుకుంటూ దానిని ఉంచాలి ప్రియులారా.

హజరతే అనస్ రదియల్లాహు త’ఆలా అన్హు హదీసు ఉల్లేఖిస్తున్నారు ప్రియులారా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బాల్యంలో ఉన్నప్పుడు హజరతే జిబ్రయీల్ ప్రవక్త వద్దకు వచ్చారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పిల్లలతో ఆడుకుంటున్నారు. హజరతే జిబ్రయీల్ ప్రవక్తను పట్టుకున్నారు, ప్రవక్త వారిని కిందన పరుండబెట్టారు. ఆ తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఛాతిని చీల్చి హృదయాన్ని బయటకు తీశారు ప్రియులారా. అందులో నుండి ఒక మాంసపు ముద్దను బయటకు తీశారు మరియు చెప్పడం జరిగింది, ఇది షైతాన్ యొక్క భాగం మీ నుండి తీసివేయటం జరుగుతుంది. దానిని ఒక బంగారు పళ్ళెములో పెట్టడం జరిగింది, దానిని జమ్ జమ్ నీటితో కడగటము జరిగింది, తిరిగి దానిని దాని స్థానములో ఎలా ఉండేదో అలా పెట్టటం జరిగింది ప్రియులారా.

దీని బట్టి తెలుస్తుంది ఏమిటంటే ఏదైతే ఛాతి లోపల హృదయం ఉంటుందో దానిలోనే సన్మార్గము మరియు మార్గభ్రష్టత్వం రెండింటి సంబంధం దానితోనే ఉంటుంది ప్రియులారా. కాబట్టి మనిషి తన హృదయాన్ని పరిశీలించుకోవాలి. అది సన్మార్గం పై ఉందా లేదా మార్గభ్రష్టత్వం పైకి వెళుతుందా ఇది చాలా అవసరమైన విషయం ప్రియులారా. మనిషి తన హృదయం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి, అది ఎటువైపు పయనిస్తుంది అని తెలుసుకోవాలి ప్రియులారా. అల్లాహ్ త’ఆలా మనందరికీ హృదయ సంస్కరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు గాక.

ఇక తర్వాత మాట ప్రియులారా ఐదవ అంశం ఈ విషయానికి సంబంధించి హృదయం బాగుంటే అన్నీ బాగుంటాయి. వాస్తవానికి హృదయం యొక్క స్థానం ఏమిటి ప్రియులారా? హృదయం యొక్క స్థానం గురించి చెప్పడం జరుగుతుంది:

أَشْرَفُ مَا فِي الْإِنْسَانِ قَلْبُهُ
అష్రఫు మా ఫిల్ ఇన్సాని ఖల్బుహు
మనిషి శరీరములో ఏదైనా శ్రేష్ఠమైన ఉన్నతమైన వస్తువు ఉంది అంటే అది అతని హృదయము.

ఎందుకంటే హృదయానికి అల్లాహ్ ఎవరో తెలుసు. అది మనిషిని అల్లాహ్ వైపునకు తీసుకువెళుతుంది. అందుకే చెప్పడం జరుగుతుంది ఎప్పుడైతే హృదయం బాగైపోతుందో దానిలో మంచి పనులు అవుతాయి. అల్లాహ్ యొక్క దాస్యం, అల్లాహ్ యొక్క విధేయత వైపునకు మనిషి వెళతాడు ప్రియులారా.

అందుకే హసన్ బస్రీ రహమహుల్లాహ్ తెలుపుతున్నారు, దావీ ఖల్బక్ – మీ హృదయాలకు చికిత్స చేయండి. అల్లాహ్‌కు దాసుల నుండి ఏ విషయం యొక్క అవసరం ఉంది అంటే అదే మంచి హృదయం యొక్క అవసరం. ఎప్పుడైతే హృదయం సంస్కరింపబడుతుందో మంచి ఆచరణలు జరుగుతాయి. హృదయము చెడిపోతే ఆచరణలు చెడిపోతాయి ప్రియులారా.

ఒక చిన్న ఉదాహరణ ఇచ్చి నా మాటను ముగిస్తాను ప్రియులారా. పవిత్ర ఖురాన్ గ్రంథములో 31వ సూరా, సూరె లుక్మాన్. హజరతే లుక్మాన్ అలైహిస్సలాతు వస్సలామ్‌కు సంబంధించి చిన్న ఉపమానం బోధిస్తాను. హజరతే లుక్మాన్ చాలా సజ్జనులైన దైవదాసులు ప్రియులారా. ఆయన ఒకరి వద్ద బానిసగా ఉండేవారు ప్రియులారా. ఆయన ఒకని వద్ద బానిసగా ఉండేవారు. ఒకసారి అతని యొక్క యజమాని హజరతే లుక్మాన్ వారికి ఏమి చెప్పాడంటే, ఒక మేకను కోసి ఆ మేకలో అత్యుత్తమ రెండు భాగాలు తెమ్మని ఒకసారి యజమాని చెప్పాడు. హజరతే లుక్మాన్ మేకను కోసి మేక యొక్క హృదయాన్ని నాలికను తీసుకువచ్చారు. మరో సమయములో యజమాని మేకను కోసి అత్యంత హీనమైన రెండు భాగాలను తెమ్మని ఆదేశించగా హజరతే లుక్మాన్ హృదయము నాలికనే తీసుకువచ్చారు. అది ఏమని అడిగితే ఆయన ఇలా అన్నారు, “నోరు హృదయము సజావుగా ఉన్నంత కాలం వాటికంటే వేరే ఉత్తమ వస్తువు లేదు. నోరు హృదయం పాడైపోతే ఆ రెండింటి కన్నా హీనమైన వస్తువు మరొకటి లేదు” [ఇబ్నె కసీర్]. సోదరులారా మాటను అర్థము చేసుకొనే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక. ఇన్షా అల్లాహ్ మరిన్ని విషయాలు తదుపరి భాగంలో వస్తాయి ప్రియులారా.

وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ
వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ. نَحْمَدُهُ وَنُصَلِّي عَلَى رَسُولِهِ الْكَرِيمِ أَمَّا بَعْدُ
అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు. నహ్మదుహు వ నుసల్లీ అలా రసూలిహిల్ కరీమ్ అమ్మాబాద్.

ప్రియమైన ధార్మిక సోదరులారా! ప్రియమైన ధార్మిక సోదరీమణులారా! హృదయ ఆచరణలు అనే ఈ అంశములో మూడవ భాగానికి మీకు స్వాగతం. సోదరులారా ఈరోజు మనము తెలుసుకునే అంశం హృదయము, కన్ను మరియు చెవి. వీటిని అల్లాహ్ మనకు ప్రసాదించాడు. ఇవి మన దేహములో గొప్ప ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. కాబట్టి వీటిని గురించి కూడా మనల్ని ప్రశ్నించటం జరుగుతుంది. అల్లాహ్ త’ఆలా ఖురాన్ గ్రంథములో తెలియజేస్తున్నారు 17వ సూరా, సూరె బనీ ఇస్రాయీల్ వాక్యము సంఖ్య 36. అల్లాహ్ అంటూ ఉన్నారు,

إِنَّ السَّمْعَ وَالْبَصَرَ وَالْفُؤَادَ كُلُّ أُولَٰئِكَ كَانَ عَنْهُ مَسْئُولًا
ఇన్నస్సమ్’అ వల్ బసర వల్ ఫుఆద కుల్లు ఉలాయిక కాన అన్హు మస్’ఊలా
నిశ్చయముగా చెవి, కన్ను, హృదయము వీటన్నింటిని గురించి ప్రశ్నించటం జరుగుతుంది.

కాబట్టి సోదరులారా మనం మన కళ్ళతో మంచిని చూడాలి. మన చెవులతో మంచిని వినాలి. మన హృదయముతో మంచిని గురించి ఆలోచించాలి.

ఆ తర్వాత ప్రియులారా ఈ మూడింటిలో కూడా ఎక్కువ ప్రాధాన్యత హృదయానికి ఉంది అనగా చెవి, కన్ను కంటే హృదయానికి ప్రాధాన్యత ఎక్కువగా ఉన్నది.

హజరతే ఖాలిద్ బిన్ మాదాన్ రహమహుల్లాహ్ ఇలా తెలియజేస్తున్నారు, ప్రతి వ్యక్తికి నాలుగు కళ్ళు ఉంటాయి. రెండు కళ్ళు అతని ముఖంపై ఉంటాయి వేటితోనైతే అతడు ప్రాపంచిక వ్యవహారాలను చూస్తాడో. ఆ తర్వాత,

وَعَيْنَانِ فِي قَلْبِهِ
వ ఐనాని ఫీ ఖల్బిహీ
మరియు రెండు కళ్ళు అతని హృదయంలో ఉంటాయి.

వాటితో అతడు పరలోక జీవితమును చూస్తాడు ప్రియులారా. ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏ దాసునికైనా మేలు చేయాలనుకుంటాడో, మంచి చేయాలనుకుంటాడో అప్పుడు ఆ వ్యక్తి యొక్క హృదయములో ఉన్న ఆ కళ్ళను అల్లాహ్ తెరచి వేస్తాడు ప్రియులారా. అప్పుడు అతడు ఆ హృదయములో ఉన్న ఆ కళ్ళతో అల్లాహ్ యొక్క అనుగ్రహాలన్నింటినీ చూస్తాడు. ఎలాగైతే అల్లాహ్ త’ఆలా ఖురాన్ గ్రంథములో తెలియజేస్తూ ఉన్నారో 47వ సూరా, సూరె ముహమ్మద్ వాక్యము సంఖ్య 24 లో అల్లాహ్ అంటూ ఉన్నారు ప్రియులారా,

أَمْ عَلَىٰ قُلُوبٍ أَقْفَالُهَا
అమ్ అలా కులూబిన్ అఖ్ఫాలుహా
ఏమిటి వారు ఆలోచించరా లేక వారి హృదయాలపై తాళాలు పడి ఉన్నాయా?

కాబట్టి సోదరులారా దీని ద్వారా మనకు తెలుస్తున్న విషయం ఏమిటంటే, హృదయం యొక్క స్థాయి చాలా గొప్పది ప్రియులారా. దీని గురించి మనము తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఈ హృదయాన్ని భయభక్తి కలిగినదిగా మనం ఎలా తయారు చేసుకోవాలి, మంచి హృదయంగా ఎలా మరల్చుకోవాలి, ఖల్బే సలీం, నిర్మలమైన హృదయంగా దీనిని ఎలా తయారు చేసుకోవాలి, దీని విషయమై మీకు మరియు నాకు చింతింపవలసి ఉన్నది సోదరులారా. ఎందుకంటే ప్రతి హృదయంలోనైతే, ప్రతి శరీరంలోనైతే హృదయం ఉంటుంది ప్రియులారా, కానీ ఎలాంటి హృదయం ఆ శరీరములో ఉంది? మంచి హృదయమా? భయభక్తితో, భయభక్తితో కూడిన హృదయమా? ఎలాంటి హృదయం ఆ శరీరంలో ఉన్నది? మరి అలాంటి హృదయం కోసం మనం ఏమి చేయాలి? పదండి సోదరులారా దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా అయితే మనం మన హృదయాన్ని మంచి హృదయంగా మార్చుకోగలం.

మొదటి విషయం ప్రియులారా, పూర్తి ఇఖ్లాస్, చిత్తశుద్ధితో మనం అల్లాహ్ వైపునకు మరలాలి. ఆ విధంగా మన హృదయం దాని ప్రభువుతో దృఢ సంబంధం ఏర్పరచుకోవాలి. అది దానిని సృష్టించిన వానితో సంబంధం పెట్టుకోవాలి. అంటే పూర్తి విశ్వాసం, చిత్తశుద్ధితో అల్లాహ్ వైపునకు మరలాలి. ఇంకా నేను మీకు ఒక వాస్తవ విషయం గురించి తెలుపుతున్నాను ప్రియులారా. అది మీకు చాలా అవసరమైనది, నాకు చాలా అవసరమైనది. ఆ వాస్తవ విషయం ఏమిటంటే మన హృదయం దానిని సృష్టించిన దాని సృష్టికర్త అల్లాహ్‌తో కాకుండా వేరే వాటితో దాని సంబంధం పెట్టుకుంటే అది రాయి అయినా, స్త్రీ అయినా, ఆస్తిపాస్తులైనా, సిరిసంపదలైనా అవి ఆ హృదయం కొరకు నష్టాన్ని తీసుకువచ్చే కారణాలు అయిపోతాయి ప్రియులారా. ఇది చాలా ముఖ్యమైన విషయం ప్రియులారా. హృదయాన్ని దాని సృష్టికర్త ఎందుకు తయారు చేశాడంటే అది ఆయనతోనే బంధాన్ని ఏర్పరచుకోవటానికి, ఆయనతో కాకుండా వేరే వాటితో మన హృదయం బంధాన్ని ఏర్పరచుకుంటే అది అతనికి ప్రమాద ఘంటిక వంటిది ప్రియులారా. అంటే అల్లాహ్ కంటే ఎక్కువ ప్రాధాన్యత, అల్లాహ్ ఆరాధన కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇతర విషయాలకు గనుక ఇస్తే అది మన కోసం ప్రమాద ఘంటిక ప్రియులారా. కాబట్టి మనం అన్ని విషయాల కంటే ఎక్కువగా ప్రాధాన్యత అల్లాహ్ యొక్క ఆరాధనకే కల్పించాలి.

మన హృదయాలలో మన తండ్రి తాతల కంటే, అన్నదమ్ముల కంటే, భార్యల కంటే, ఆస్తిపాస్తుల కంటే, బంధు మిత్రుల కంటే, వ్యాపారము కంటే, మనం ఎంతగానో ప్రేమించే మన నివాసాల కంటే, సమస్త ప్రాపంచిక విషయాల కంటే ఎక్కువ ప్రేమ మన హృదయంలో అల్లాహ్ పై ఉండాలి ప్రియులారా. అల్లాహ్ పై అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి, అప్పుడే మన హృదయం మహోన్నతమైన హృదయంగా మారుతుంది ప్రియులారా.

ఇక రెండవ విషయం:

اسْتِعْمَالُ الْقَلْبِ فِيمَا خُلِقَ
ఇస్తి’మాలుల్ ఖల్బి ఫీమా ఖులిక
హృదయాన్ని దాని కోసం ఉపయోగించాలి దేనికోసమైతే అల్లాహ్ దానిని పుట్టించాడో.

అల్లాహ్ దానిని అల్లాహ్ దాస్యము కోసం పుట్టించాడు ప్రియులారా. హృదయం గురించి ఇలా చెప్పడం జరుగుతుంది:

سَيِّدُ الْأَعْضَاءِ وَرَأْسُهَا
సయ్యిదుల్ ఆ’దా వ రా’సుహా
అది అవయవాలన్నింటికీ నాయకుని లాంటిది మరియు అవయవాలన్నింటికీ శిరస్సు లాంటిది.

కాబట్టి సోదరులారా ఆ హృదయాన్ని మనం మంచి పనుల కోసం ఉపయోగించాలి, అల్లాహ్ ఆరాధనలో ఉపయోగించాలి, మంచి పనుల కోసం ఆలోచించటంలో ఉపయోగించాలి, అల్లాహ్ యొక్క జిక్ర్ లో ఉపయోగించాలి, ఖురాన్ యొక్క పారాయణములో ఉపయోగించాలి. దానిలోనే ప్రశాంతత ఉంది ప్రియులారా. అల్లాహ్ తెలియజేస్తున్నారు, 13వ సూరా, అర్ రాద్ వాక్యము సంఖ్య 28. అల్లాహ్ అంటూ ఉన్నారు:

أَلَا بِذِكْرِ اللَّهِ تَطْمَئِنُّ الْقُلُوبُ
అలా బి జిక్రిల్లాహి తత్మఇన్నుల్ కులూబ్
తెలుసుకోండి, అల్లాహ్ నామ స్మరణలోనే హృదయాలకు ప్రశాంతత ఉంది.

కాబట్టి మనం జిక్ర్, అల్లాహ్ యొక్క స్మరణలోనే ప్రశాంతత పొందగలం ప్రియులారా. అల్లాహ్‌కు విధేయత చూపే హృదయం అల్లాహ్ యొక్క నామస్మరణలో ప్రశాంతత పొందుతుంది. మరి మనము నేడు అల్లాహ్ యొక్క జిక్ర్ లో ప్రశాంతత పొందుతున్నామా లేక సినిమాలలో, డాన్సులలో, నృత్యాలలో, పాటలు వినటములో, సంగీతములో, టీవీ సీరియల్లు చూడటములో, ఇతరత్రా పనికిమాలిన విషయాలలో ప్రశాంతతను పొందుతున్నామా ప్రియులారా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఒకవేళ మనము గనుక ఈ సినిమాలతో, సంగీతముతో మన హృదయానికి ప్రశాంతత గనుక లభిస్తుంటే మన హృదయం ఒక రోగగ్రస్తమైన హృదయం ప్రియులారా.

షేఖుల్ ఇస్లామ్ ఇబ్నె తైమియా రహమహుల్లాహ్ తెలియజేస్తున్నారు ప్రియులారా, సంగీతం మ్యూజిక్ మనిషి హృదయానికి మద్యపానము లాంటి ఒక వ్యసనము. మ్యూజిక్, సంగీతం వినటము హృదయానికి ఎలాంటిది? మద్యపానము లాంటి ఒక వ్యసనం ప్రియులారా. అది మనిషిని సన్మార్గము నుండి తప్పించేస్తుంది సుబ్ హా నల్లాహ్! అల్లాహు అక్బర్ ప్రియులారా! కానీ జిక్ర్ మనిషి హృదయానికి ఎలాంటిది ప్రియులారా? నీటిలో ఉన్న చేపకు నీరు లాంటిది సుబ్ హా నల్లాహ్!. ఆ నీరు ఉంటేనే ఆ నీరు ఉంటేనే ఆ చేప బ్రతుకుతుంది ప్రియులారా. అదే విధంగా అల్లాహ్ యొక్క జిక్ర్ ఉంటేనే మన హృదయం బ్రతుకుతుంది, అల్లాహ్ యొక్క జిక్ర్ లేకపోతే మన హృదయం కూడా చనిపోతుంది ప్రియులారా. ఏ విధంగానైతే నీళ్లు లేకపోతే చేప చనిపోతుందో, అల్లాహ్ యొక్క జిక్ర్ లేకపోతే మన హృదయం చనిపోతుంది ప్రియులారా. కాబట్టి సోదరులారా, ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మన యొక్క హృదయాలకు ప్రశాంతత కచ్చితంగా అల్లాహ్ యొక్క స్మరణలో మాత్రమే, అల్లాహ్ యొక్క జిక్ర్ లో మాత్రమే మన హృదయాలకు ప్రశాంతత రావాలి ప్రియులారా. మనము గనక అల్లాహ్ యొక్క జిక్ర్ చేయకపోతే మన హృదయాలు చనిపోయిన హృదయాలు అవుతాయి ప్రియులారా.

బుఖారీ గ్రంథములో ఒక హదీసు నఖలు చేయబడుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు ప్రియులారా:

مَثَلُ الَّذِي يَذْكُرُ رَبَّهُ وَالَّذِي لَا يَذْكُرُ رَبَّهُ مَثَلُ الْحَيِّ وَالْمَيِّتِ
మసలుల్లజీ యజ్కురు రబ్బహు వల్లజీ లా యజ్కురు రబ్బహు మసలుల్ హయ్యి వల్ మయ్యితి
అల్లాహ్ యొక్క జిక్ర్ చేసే హృదయం సజీవమైన వారితో సమానము. అల్లాహ్ యొక్క జిక్ర్ చేయని వారి హృదయం, అల్లాహ్ యొక్క జిక్ర్ చేయని వారు మరణించిన వారితో సమానము.

కాబట్టి సోదరులారా మనం జిక్ర్ అలవాటు చేసుకోవాలి, ఎల్లవేళలా అల్లాహ్‌ను స్మరిస్తూ ఉండాలి, “సుబ్ హా నల్లాహ్” దీని అర్థం ప్రియులారా అల్లాహ్ పరమ పవిత్రుడు. “అల్హందులిల్లాహ్” దీని అర్థము సర్వ స్తోత్రములు అల్లాహ్‌కే శోభిస్తాయి. “అల్లాహు అక్బర్” అంటే అల్లాహ్ చాలా గొప్పవాడు ప్రియులారా. మనం అల్లాహ్‌ను జ్ఞాపకం చేసుకుంటే అల్లాహ్ మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు ప్రియులారా. అల్లాహ్ సెలవిస్తున్నారు:

فَاذْكُرُونِي أَذْكُرْكُمْ
ఫజ్కురూనీ అజ్కుర్కుమ్
మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను.

కాబట్టి సోదరులారా, చివరిగా జిక్ర్ కు సంబంధించి కొన్ని విషయాలు చెప్పటానికి ప్రయత్నిస్తాను ప్రియులారా. మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, బుఖారీ గ్రంథములో హదీసు నఖలు చేయబడుతుంది. ప్రవక్త వారు అంటూ ఉన్నారు,

రెండు పదాలు, రెండు వచనాలు పలకటానికి చాలా తేలికైనవి, త్రాసులో చాలా బరువైనవి, కరుణామయుడైన అల్లాహ్‌కు చాలా ఇష్టమైనవి. ఆ రెండు పదాలు “సుబ్ హా నల్లాహి వ బిహందిహీ, సుబ్ హా నల్లాహిల్ అజీమ్”.

ఈ రెండు వచనాలు అల్లాహ్‌కు చాలా ఇష్టం ప్రియులారా. ఆ తర్వాత ముస్లిం హదీసు గ్రంథములో ఇలా ఉంది ప్రియులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటూ ఉన్నారు,

“సుబ్ హా నల్లాహి వల్హందులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లహు అక్బర్” అని పలకటం సూర్యుడు ఉదయించే ఈ ప్రపంచములో ఉన్న వస్తువులన్నింటికంటే నాకు ప్రియమైనది.”

ఏమిటి ప్రియులారా? “సుబ్ హా నల్లాహి వల్హందులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లహు అక్బర్” అని పలకటం ప్రియులారా సూర్యుడు ఉదయించే ఈ ప్రపంచములో వస్తువులన్నింటికంటే ఎక్కువగా ప్రవక్తకు ప్రియమైనది ప్రియులారా.

అదే విధంగా సోదరులారా, బుఖారీ గ్రంథములో ఇలా ఉంది, ఎవరైతే రోజుకు వంద సార్లు “లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీకలహు లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైయిన్ ఖదీర్” అని పలుకుతారో వారి కోసం వంద పుణ్యాలు లిఖించబడతాయి. వంద పాపాలు క్షమించబడతాయి. ఆ రోజు సాయంత్రం వరకు ఆ పలుకులు వారిని షైతాన్ బారి నుండి రక్షిస్తాయి.

ఆ తర్వాత సోదరులారా బుఖారీ గ్రంథములో ఇలా ఉంది, ఎవరైతే వంద సార్లు “సుబ్ హా నల్లాహి వ బిహందిహీ” అని పలుకుతారో వారి పాపాలు క్షమించబడతాయి ప్రియులారా అవి సముద్రపు నురుగుకు సమానంగా ఉన్నా సరే.

ఆ తర్వాత ప్రవక్త తెలియజేస్తున్నారు ప్రియులారా, అల్హందులిల్లాహ్ అనే పదం త్రాసును నింపి వేస్తుంది. “సుబ్ హా నల్లాహ్, అల్హందులిల్లాహ్” అని పలుకులు భూమి ఆకాశాల మధ్య ఉన్న ఖాళీ స్థలాన్ని నింపేస్తాయి ప్రియులారా.

కాబట్టి అల్లాహ్ యొక్క నామస్మరణతో మన హృదయానికి ప్రశాంతత లభిస్తుంది ప్రియులారా. కాబట్టి జిక్ర్ అనే ఆ హృదయ ఆచరణ మనం చేయాలి. ఏదైతే జిక్ర్ మనం చేస్తున్నామో అదే సమయములో దాని యొక్క అర్థము కూడా మన హృదయంలో రావాలి ప్రియులారా. మనం చేసే జిక్ర్ యొక్క అర్థాన్ని కూడా మనం తెలుసుకొని ఆ జిక్ర్ చేస్తే మనం దాని యొక్క మాధుర్యాన్ని పొందుతాం ప్రియులారా.

ఇన్షా అల్లాహ్ మరిన్ని విషయాలు తర్వాత దర్సులో మీ ముందు ఉంచటానికి ప్రయత్నం చేస్తాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ చెప్పటం, వినటం కంటే ఎక్కువగా ఆచరణ చేసే భాగ్యాన్ని ప్రసాదించు గాక.

وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ
వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ. نَحْمَدُهُ وَنُصَلِّي عَلَى رَسُولِهِ الْكَرِيمِ أَمَّا بَعْدُ
అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు. నహ్మదుహు వ నుసల్లీ అలా రసూలిహిల్ కరీమ్ అమ్మాబాద్.

సోదరులారా! ఈరోజు మనము తెలుసుకోబోయే అంశము హృదయ ఆచరణలు నాలుగవ భాగం. ప్రియమైన సోదరులారా, ప్రియమైన ధార్మిక సోదరీమణులారా! ఈరోజు మనము తెలుసుకోబోయే విషయము మన హృదయాలను ఏ విధంగా మనం నిర్మలమైన హృదయాలుగా, భక్తి కలిగిన హృదయాలుగా, ఉత్తమ హృదయాలుగా మార్చుకోవాలి. ఆ విధంగా మన హృదయాలను మార్చటానికి ఏ ఆచరణ మనము చేయాలి. ఆ ఆచరణలో కొన్ని బయటకు కనిపించే ఆచరణలు ఉన్నాయి మరికొన్ని బయటకు కనిపించని ఆచరణలు ఉన్నాయి. అందులో కొన్ని వాజిబ్ (కచ్చితంగా చేయాల్సిన ఆచరణలు) మరికొన్ని ముస్తహబ్బాత్ (అభిలషణీయమైన ఆచరణలు).

ఇబ్నె ఖయ్యీమ్ రహమహుల్లాహ్ ఇలా తెలియజేస్తున్నారు, అల్లాహ్ యొక్క దాసులు చేసే సత్కార్యాలు అనగా అల్లాహ్ యొక్క దాస్యము మరియు అల్లాహ్ యొక్క విధేయత మొదలైనవి. వాటి ప్రభావం మనిషి జీవితములో కనిపిస్తుంది. ఇలా చెప్పటం జరిగింది:

إِنَّ لِلْحَسَنَةِ نُورًا فِي الْقَلْبِ، وَقُوَّةً فِي الْبَدَنِ، وَضِيَاءً فِي الْوَجْهِ، وَزِيَادَةً فِي الرِّزْقِ، وَمَحَبَّةً فِي قُلُوبِ الْخَلْقِ
ఇన్న లిల్ హసనతి నూరన్ ఫిల్ ఖల్బ్, వ కువ్వతన్ ఫిల్ బదన్, వ జియా అన్ ఫిల్ వజ్హ్, వ జియాదతన్ ఫిర్రిజ్క్, వ మహబ్బతన్ ఫీ ఖలూబిల్ ఖల్క్
ఎవరైతే సత్కార్యాలు చేస్తారో వారి హృదయాలలో అల్లాహ్ ఒక వెలుగును, కాంతిని జనింపజేస్తాడు. వారి శరీరంలో శక్తి మరియు బలము జనిస్తుంది. వారి ముఖవర్చస్సుపై ఒక రకమైన కాంతి వెలుగు జనిస్తుంది. వారి ఉపాధిలో వృద్ధి మరియు శుభము కలుగుతుంది. మరియు ప్రజల హృదయాలలో వారిపై ప్రేమను కలిగించటం జరుగుతుంది.

మరియు అదే విధంగా దుష్కార్యాలు, పాప కార్యాల యొక్క ప్రభావం కూడా మనిషి జీవితంపై పడుతుంది. ఎవరైతే పాపాలు చేస్తూ ఉంటారో వారి హృదయం చీకట్లతో నిండిపోతుంది. శరీరం బలహీనపడిపోతుంది. ఉపాధి లాక్కోబడుతుంది. మరియు ప్రజల హృదయాలలో వారిపై ద్వేషాన్ని కలిగించటం జరుగుతుంది.

చూస్తున్నాము కదా సోదరులారా ఏ విధంగా పాప కార్యాల ప్రభావం మన జీవితాలలో ఉంటుందో. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఆయన రక్షణలో ఉంచు గాక ఆమీన్.

ఆ తర్వాత సోదరులారా మన హృదయాలను మనము నిర్మలమైన హృదయాలుగా మార్చుకోవటానికి దోహదపడే మరికొన్ని ఆచరణలలో ఒక మహోన్నత ఆచరణ ఇంతకుముందు ప్రస్తావించబడిన విధంగా అల్లాహ్ యొక్క జిక్ర్ ప్రియులారా. అల్లాహ్ యొక్క నామస్మరణ ప్రియులారా. ఖురాన్ యొక్క పారాయణం ప్రియులారా. ఖురాన్ యొక్క పారాయణంతో మన హృదయాలు సంస్కరించబడతాయి ప్రియులారా.

సలఫ్‌కు చెందిన వారిలో సులైమాన్ అల్ ఖవ్వాస్ రహమహుల్లాహ్ జిక్ర్ కు సంబంధించి ఆయన తెలియజేస్తున్నారు:

لِلْقَلْبِ بِمَنْزِلَةِ الْغِذَاءِ لِلْجَسَدِ
లిల్ ఖల్బి బి మన్జిలతిల్ గిజాయి లిల్ జసద్
అల్లాహ్ స్మరణ హృదయానికి ఎలాంటిది అంటే శరీరానికి ఆహారము లాంటిది.

ఏ విధంగానైతే శరీరానికి ఆహారము లేకపోతే శరీరం బలహీనపడిపోతుందో హృదయానికి అల్లాహ్ యొక్క జిక్ర్ లేకపోతే హృదయం బలహీనపడిపోతుంది ప్రియులారా. ఆ తర్వాత ఒక వ్యాధిగ్రస్తుడైన వ్యక్తి ముందు ఎంత మంచి ఆహారం పెట్టినా అది అతని వ్యాధి మూలంగా అందులో అతనికి రుచి అనిపించదు. అదే విధంగా మన హృదయాలలో ప్రాపంచిక భోగ భాగ్యాలు, ప్రాపంచిక ప్రేమ మనం ఉంచుకొని మనము కూడా ఎంత జిక్ర్ చేసినా ఆ జిక్ర్ హృదయానికి మాధుర్యము కలిగించదు ప్రియులారా. ఎందుకంటే పెదవులపై అయితే అల్లాహ్ యొక్క జిక్ర్ చేయబడుతుంది, కానీ హృదయాలలో ప్రాపంచిక వ్యామోహం ఉంది ప్రియులారా. అందుకే సులైమాన్ అల్ ఖవ్వాస్ రహమహుల్లాహ్ తెలియజేస్తున్నారు,

دواء القلب خمسة أشياء
దవావుల్ ఖల్బి ఖమ్సతు అష్ యా
హృదయానికి చికిత్స ఐదు విషయాలలో ఉంది.

ప్రతిదానికి మందు ఉన్నట్లే హృదయానికి కావలసిన మందు ఐదు విషయాలలో ఉంది.

మొదటి విషయం ప్రియులారా:

قِرَاءَةُ الْقُرْآنِ بِالتَّدَبُّرِ
ఖిరాఅతుల్ ఖుర్ఆని బిత్తదబ్బుర్
ఖురాన్ గ్రంథాన్ని ఆలోచిస్తూ ఏకాగ్రతతో అవగాహన చేసుకుంటూ మనం ఖురాన్ గ్రంథాన్ని పఠించాలి.

ఈరోజు సోదరులారా మనం కేవలం ఖురాన్ గ్రంథాన్ని అరబీ భాషలో చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం, దాని అర్థము చేసుకోవటానికి, దాని యొక్క అర్థము తెలుసుకోవటానికి మనం ప్రయత్నము చేయటం లేదు ప్రియులారా. లేదు సోదరులారా మనం ఖురాన్ గ్రంథాన్ని అరబీ భాషలో పఠిస్తూ కచ్చితంగా దాని యొక్క అర్థము కూడా మనకు తెలిసిన భాషలో తెలుసుకోవటానికి ప్రయత్నము చేయాలి.

ఆ తర్వాత రెండవ విషయం ప్రియులారా:

خَلَاءُ الْبَطْنِ
ఖలావుల్ బతన్
పొట్టలో కాస్త ఖాళీ స్థలం ఉంచాలి.

మనం భుజించాలి, పొట్ట నిండాలి కానీ ప్రియులారా మరీ ఎక్కువగా తిని ఆరాధన చేయలేనంతగా మనం మన పొట్టను నింపకూడదు ప్రియులారా. అల్లాహ్ త’ఆలా ప్రవక్తలతో అంటూ ఉన్నారు,

يَا أَيُّهَا الرُّسُلُ كُلُوا مِنَ الطَّيِّبَاتِ وَاعْمَلُوا صَالِحًا
యా అయ్యుహర్రుసులు కులూ మినత్ తయ్యిబాతి వ’అమలూ సాలిహా
ఓ ప్రవక్తలారా పరిశుద్ధమైన వాటి నుండి తినండి మరియు సత్కార్యాలు చేయండి.

కాబట్టి సోదరులారా మనం తినాలి కానీ మరీ అంతగా తినకూడదు ఆరాధన చేయలేనంతగా. పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు మనిషికి అల్లాహ్ యొక్క జ్ఞాపకం వస్తుంది ప్రియులారా, మనిషికి అల్లాహ్ గుర్తుకు వస్తాడు. మనం మన నడుం నిలబడటానికి ఎంత అవసరమో అంత తినాలి ప్రియులారా, తద్వారా మనం అల్లాహ్‌ను ఆరాధించగలగాలి.

ఆ తర్వాత హృదయ చికిత్సకు సంబంధించిన విషయాలలో మూడవ విషయం:

قِيَامُ اللَّيْلِ
ఖియాముల్లైల్
రాత్రి పూట ఆరాధన

ప్రియులారా రాత్రి పూట ఆరాధన, తహజ్జుద్ ఆరాధన, అల్లాహ్ ముందు రాత్రి పూట నిలబడాలి. ఇది కూడా మన హృదయాలకు ఒక మంచి చికిత్స ప్రియులారా.

ఆ తర్వాత సోదరులారా నాలుగవ మాట:

التَّضَرُّعُ عِنْدَ السَّحَرِ
అత్తదర్రువు ఇందస్ సహర్
సహ్రీ సమయములో అల్లాహ్‌ను వేడుకోవాలి

ఇది చాలా గొప్ప విషయం ప్రియులారా అనగా సహ్రీ సమయములో అల్లాహ్‌ను వేడుకోవాలి. సహ్రీ సమయములో అల్లాహ్ ముందు మన విషయాలను అల్లాహ్ ముందు అడగాలి ప్రియులారా. అనేకమందికి ఈ భాగ్యం లభించదు. కొంతమంది పడుకుంటారు, కొంతమంది మేల్కొని ఉన్నా కూడా ఆ సమయాన్ని వృధా చేస్తారు. ఫోన్లో అనవసర విషయాలలో సమయాన్ని వృధా, ఇతరత్రా విషయాలలో కూడా మనం సమయాన్ని వృధా చేస్తాం. లేదు ప్రియులారా, సహ్రీ సమయం కూడా అత్యంత శుభాలతో కూడిన సమయం ప్రియులారా. ఆ సమయములో మనం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాను కడు దీనంగా వేడుకోవటానికి అది ఉత్తమ సమయం.

ఆ తర్వాత హృదయ చికిత్సకు సంబంధించిన విషయాలలో ఐదవ మాట ప్రియులారా:

مُجَالَسَةُ الصَّالِحِينَ
ముజాలసతుస్ సాలిహీన్
ఉత్తమ వ్యక్తుల సాంగత్యం

ఉత్తమ వ్యక్తులతో మనం కూర్చోవాలి, ఉత్తమ వ్యక్తులతో గడపాలి ప్రియులారా.

ఈ విధంగా సోదరులారా మన హృదయానికి సంబంధించిన చికిత్సలో ఖురాన్ గ్రంథాన్ని అవగాహనతో అర్థము చేసుకుంటూ మనం పఠించాలి ప్రియులారా. అదే విధంగా పొట్టను కాస్త ఖాళీగా ఉంచాలి ప్రియులారా. ఆ తర్వాత ఖియాముల్లైల్ రాత్రి పూట అల్లాహ్ ముందు మనము నమాజులో నిలబడాలి సోదరులారా. నాలుగవ మాట సహ్రీ సమయములో అల్లాహ్ ముందు మనము కడు దీనంగా వేడుకోవాలి ప్రియులారా. ఐదవ మాట మంచి వారి సాంగత్యములో మనం మన జీవితాన్ని గడుపుతూ ఉండాలి ప్రియులారా.

ఈ విధంగా మనం మన హృదయానికి చికిత్స చేయగలం, దానిని సంస్కరించుకోగలం, దానిని అల్లాహ్ వైపునకు మరలే హృదయంగా, నిర్మలమైన హృదయంగా తయారు చేసుకోవటంలో ఇన్షా అల్లాహ్ త’ఆలా మనం ముందుకు వెళ్ళగలం ప్రియులారా.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించు గాక, మనందరికీ అల్లాహ్ త’ఆలా మనల్ని మనం సంస్కరించుకునే భాగ్యాన్ని ప్రసాదించు గాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్.

وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ
వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ
అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు

సోదరులారా! నేడు మనం తెలుసుకోబోయే అంశం హృదయ ఆచరణలు ఐదవ భాగం. ప్రియులారా నిన్న మనం హృదయ చికిత్సకు సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అందులో ఖురాన్ యొక్క పారాయణం, కడుపును కాస్త ఖాళీగా ఉంచటం, తహజ్జుద్ నమాజ్ ఆచరించటం, సహ్రీ సమయములో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాను కడు దీనంగా వేడుకోవటం, ఉత్తమ వ్యక్తుల సాంగత్యములో కూర్చోవటం గురించి.

ఈరోజు మనం ఉత్తమ వ్యక్తుల సాంగత్యములో కూర్చోవటం అనే విషయాన్ని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సోదరులారా.

ఉత్తమ వ్యక్తులంటే ఎవరు? వారే ఉత్తమ వ్యక్తులు ఎవరైతే అల్లాహ్ యొక్క భయభక్తి కలిగి ఉంటారో, అల్లాహ్‌ను ఆరాధిస్తూ ఉంటారో, అల్లాహ్ యొక్క స్మరణ చేస్తూ ఉంటారో, ఖురాన్ మరియు హదీసు ప్రకారం జీవితాన్ని గడుపుతూ వాటి విషయాలను ప్రజలకు బోధిస్తూ ఉంటారో అలాంటి వారి మాటలను మనము వినాలి. తద్వారా మన యొక్క హృదయాలకు మార్గదర్శకత్వం లభించవచ్చు మరియు మన హృదయాల నుండి చింతా బెంగా దూరం కావచ్చు.

ఇమామ్ ఇబ్నె ఖయ్యీమ్ రహమహుల్లాహ్ తెలియజేస్తున్నారు, “ఎప్పుడైతే మా హృదయాలలో భయం ఆవహించుకుంటుందో మా మనో మస్తిష్కాలలో రకరకాల వింత ఆలోచనలు రావటం ప్రారంభమవుతుందో మరియు భూమి విశాలంగా ఉండి కూడా మా కోసం కుశించుకుపోయినట్లు అనిపించినప్పుడు మేము షేఖుల్ ఇస్లామ్ ఇబ్నె తైమియా రహమహుల్లాహ్ సేవలో హాజరవుతాం. ఎప్పుడైతే మేము అతని వద్దకు చేరుకుంటామో మా ఈ పరిస్థితులన్నీ మా నుండి దూరమైపోతాయి. మా యొక్క హృదయం విప్పబడుతుంది మరియు మా యొక్క నమ్మకం పెరిగిపోతుంది. మాలో ఒక ప్రశాంతమైన వాతావరణం వచ్చేస్తుంది.”

ఎందుకు సోదరులారా? దీనికి కారణం ఇమామ్ ఇబ్నె తైమియా రహమహుల్లాహ్ యొక్క భయభక్తి, ఆయన యొక్క మహోన్నతమైన జీవితం ప్రియులారా.

కాబట్టి సోదరులారా, మనం అల్లాహ్‌తో భయపడేవారితో, ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకునేవారితో మనం కూర్చోవటానికి ప్రయత్నము చేయాలి. వారి యొక్క బోధనలు, వారి యొక్క మాటలు విని తద్వారా మనకు మార్గదర్శకత్వం లభించవచ్చును ప్రియులారా.

ఎప్పుడైతే మనిషి భయభక్తి కలిగి ఉత్తమంగా మారిపోతాడో అల్లాహ్ ప్రజల హృదయాలలో అతనిపై ప్రేమను గౌరవాన్ని జనింపజేస్తాడు. అది అల్లాహ్ యొక్క కారుణ్యం, అతడు ప్రజలను సంస్కరిస్తాడు.

జాఫర్ బిన్ సులైమాన్ రహమహుల్లాహ్ ఇలా తెలియజేస్తున్నారు, “ఎప్పుడైతే నా హృదయంలో కాఠిన్యం పుట్టటాన్ని నేను చూస్తానో నేను ముహమ్మద్ బిన్ వాసే రహమహుల్లాహ్ తో కలిసి కూర్చుంటాను. ఎందుకంటే ముహమ్మద్ బిన్ వాసే రహమహుల్లాహ్ అల్లాహ్‌కు చాలా భయపడేవారు. ఆయనతో కూర్చున్నప్పుడు ప్రాపంచిక మాటలు విడిచిపెట్టి ఆయన పరలోకపు విషయాలను చర్చించేవారు, అల్లాహ్‌కు దగ్గరయ్యే విషయాలు, అల్లాహ్‌కు దగ్గరయ్యే మాటలు పలికేవారు. అప్పుడు మా హృదయాలు మరణానంతర జీవితం వైపునకు మరలిపోయేవి.”

కానీ ఈ రోజులలో ప్రాపంచిక మాటలు మాట్లాడేవారు ఉన్నారు, రాజకీయాలు మాట్లాడేవారు ఉన్నారు, ఇతరత్రా విషయాలు మాట్లాడేవారు ఉన్నారు. కానీ అన్నింటికంటే మేలైన మాట ఏమిటంటే అల్లాహ్ యొక్క దాసులను అల్లాహ్‌కు దగ్గర చేయటం. మనం దీనిపై శ్రద్ధ ఉంచాలి. ఇది అన్నింటికంటే గొప్ప విషయం సోదరులారా. దీనితో మనకు తెలుస్తున్న విషయం ఏమిటంటే, మనం మంచి వ్యక్తుల, ఉన్నతమైన వ్యక్తుల సాంగత్యములో కూర్చోవాలి. అలా కాకుండా మనం చెడు కార్యాలు చేస్తూ, చెడు చూస్తూ, చెడు వ్యక్తులతో మనం కలిసి కూర్చుంటే అది మన హృదయంపై చాలా ప్రభావం చూపుతుంది. కాబట్టి మనం మంచి వ్యక్తుల సాంగత్యములో కూర్చోవాలి.

ఎలాగైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన విధంగా మంచి వ్యక్తితో స్నేహం కస్తూరి అమ్మేవాడితో సమానం. ఎవరైతే కస్తూరి అమ్మేవాడితో కూర్చుంటాడో అతడు ఇతడికి కస్తూరి బహుమతిగానైనా ఇస్తాడు లేదా అతడు వీడి వద్ద కస్తూరి కొన్నైనా కొంటాడు లేదా అతని వద్ద కూర్చొని కూర్చొని వీడి వద్ద కస్తూరి సువాసన వేస్తుంది. అలా కాకుండా చెడ్డ వ్యక్తితో స్నేహం చేసేవాడు ఇనుప కొలిమి ఊదేవాడి పక్కన కూర్చోవటంతో సమానం. ఎవరైతే ఇనుప కొలిమి ఊదేవాడి పక్కన కూర్చుంటాడో వాడి బట్టలపై కన్నాలు పడతాయి, వాడి వద్ద మురికి వాసన, కంపు వాసన కూడా వేస్తుంది అన్నారు. కాబట్టి సోదరులారా, మనం మంచి వ్యక్తులతో సాంగత్యములో వారి సాంగత్యములో కూర్చోవటానికి ప్రయత్నము చేయాలి.

ఆ తర్వాత సోదరులారా మన హృదయాల సంస్కరణ కోసం అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం అలాంటి వ్యక్తులను చూడాలి ఎవరైతే సక్రాతు స్థితిలో ఉన్నారో, మరణ మూర్ఛలో ఉన్నారో. ఎవరైతే మరణ మూర్ఛలో ఉన్నారో, సక్రాతు స్థితిలో ఉన్నారో అలాంటి వారిని మనం చూసినప్పుడు మనకు మరణాన్ని అత్యధికంగా జ్ఞాపకం చేసుకునే అవకాశం లభిస్తుంది. తద్వారా మన హృదయాలు భయభక్తి కలిగిన హృదయాలుగా మారుతాయి సోదరులారా. కాబట్టి పరలోక జీవితాన్ని, మరణానంతర జీవితాన్ని, ప్రళయ దినాన్ని, సమాధిని గుర్తుకు తెచ్చుకుంటూ మనం ఎక్కువగా జీవితం గడపటానికి ప్రయత్నము చేయాలి.

ఏ విధంగానైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారో, కోరికలకు కళ్లెం వేసే మరణాన్ని అత్యధికంగా జ్ఞాపకం చేసుకోండి అని ప్రవక్త వారు చెప్పడం జరిగింది. అదే విషయాన్ని ప్రవక్త వారు సహబాలకు కూడా తెలియజేశారు. ప్రవక్త వారు ఎల్లప్పుడూ సహబాలను మరణానంతర జీవితం కోసం వారిని తయారు చేసేవారు ప్రియులారా. ప్రవక్త వారు ఇలా పలికారు, “మరణానంతర జీవితానికి సంబంధించి నాకు తెలిసిన విషయాలు గనుక మీకు తెలిస్తే మీరు నవ్వటం మానేస్తారు, ఏడవటం మొదలు పెడతారు, మీ భార్యల వద్దకు వెళ్ళటానికి కూడా ఇష్టపడరు, ఏ కొండ కోనల్లో వెళ్ళిపోతారు”.

అందుకే సహబాలు ప్రియులారా, ప్రతి సమయములో భయపడేవారు. హజరతే అబూజర్ గిఫ్ఫారీ రదియల్లాహు త’ఆలా అన్హు అంటున్నారు, “అయ్యో నేను చెట్టునైపోతే ఎంత బాగుండేది, నన్ను ప్రశ్నించటం జరిగేది కాదు“. ప్రియులారా సహబాలు ఏ విధంగా మరణాన్ని, మరణానంతర జీవితాన్ని జ్ఞాపకం చేసుకునేవారో సోదరులారా.

హజరతే అమర్ బిన్ ఆస్ రదియల్లాహు త’ఆలా అన్హు సక్రాతు స్థితిలో ఉన్నప్పుడు ఆయనతో ప్రశ్నించటం జరిగింది ఏ విధంగా సక్రాతు స్థితి ఉంది అని. హజరతే అమర్ బిన్ ఆస్ రదియల్లాహు త’ఆలా అన్హు తెలుపుతున్నారు, “నా శరీరం భూమి ఆకాశాల మధ్య నలిగిపోతున్నట్లు అనిపిస్తుంది. నా శరీరం భూమి ఆకాశాల మధ్య నలిగిపోతున్నట్లు అనిపిస్తుంది. నా మెడపై పర్వతం పెట్టినట్లు అనిపిస్తోంది. నా యొక్క కడుపులో ఖర్జూరపు చెట్టు యొక్క ముళ్ళతో నింపినట్లు అనిపిస్తోంది. నా యొక్క శ్వాస సూది రంధ్రము గుండా వెళ్తోందా అన్నంత బాధగా అనిపిస్తుంది” అల్లాహు అక్బర్ ఇది సక్రాతు స్థితి ప్రియులారా.

ఇబ్నె మస్’ఊద్ రదియల్లాహు త’ఆలా అన్హు ఎప్పుడైతే కమ్మరి దుకాణం గుండా వెళ్ళేవారో కమ్మరి దుకాణంలో నిప్పు రవ్వలను చూసి ఇబ్నె మస్’ఊద్ రదియల్లాహు త’ఆలా అన్హు స్పృహ కోల్పోయి పడిపోయేవారు ప్రియులారా, ఆయనకు నరకపు అగ్ని జ్ఞాపకం వచ్చేది.

హజరతే ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు ప్రళయ దినాన జ్ఞాపకం చేసుకొని ఇంతగా ఏడ్చేవారు అంటే ఆయన ఏడ్చి ఏడ్చి ఆఖరికి అనారోగ్యం పాలైపోయేవారు. ప్రజలు వచ్చి ఆయన్ని పరామర్శించేవారు ప్రియులారా.

హజరతే ఉస్మాన్ రదియల్లాహు త’ఆలా అన్హు సమాధిని గురించి ఏడ్చి ఏడ్చి ఆయన కంటి కింద చారలు ఏర్పడటం జరిగింది.

హజరతే అబ్దుల్లా బిన్ రవాహా రదియల్లాహు త’ఆలా అన్హు ప్రళయ దినాన సిరాత్ వంతెన ఏదైతే ప్రళయ దినాన ఆ వంతెన ఉంటుందో ఆ వంతెన దాటగలనా దాటలేనా అన్న బెంగతో ఆయన ఏడుస్తూ ఉండేవారు.

అమ్మ ఆయిషా సిద్దీకా రదియల్లాహు త’ఆలా అన్హా నమాజులో నరకపు వాక్యాల ప్రస్తావన వచ్చే ఆయతులను పఠించి ఆమె ఎల్లప్పుడూ ఏడుస్తూ ఉండేవారు.

హజరతే రబీ రదియల్లాహు త’ఆలా అన్హు నరకానికి భయపడటం వలన ఆయనకు రాత్రి పూట నిద్ర వచ్చేది కాదు. కూతురు ప్రశ్నించేది, “నాన్నగారు ప్రపంచమంతా ప్రశాంతంగా పడుకుంటుంది, మీకు మాత్రం నిద్ర రావటం లేదేమిటి?“. హజరతే రబీ సమాధానం ఇస్తున్నారు, “నరకపు నరకాగ్ని నీ తండ్రికి నిద్ర పట్టకుండా చేస్తుందమ్మా“.

హజరతే సుఫ్యాన్ సౌరీ రహమహుల్లాహ్ అతని ముందు నరకపు యొక్క ప్రస్తావన చేసినప్పుడు అతని యొక్క మూత్రములో రక్తము కారేది ప్రియులారా.

ఈ విధంగా సహబాలు అల్లాహ్‌కు భయపడేవారు, మరణానంతర జీవితాన్ని జ్ఞాపకం చేసుకునేవారు, సమాధి జీవితాన్ని జ్ఞాపకం చేసుకునేవారు. మరి ఈరోజు మనం ఎంతవరకు ఆ మరణానంతర జీవితాన్ని, సమాధి జీవితాన్ని, ప్రళయ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా, ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ సమయములో మనం ప్రపంచం నుండి వెళ్ళిపోతే అల్లాహ్ వద్దకు ఏమి తీసుకు వెళ్తున్నాం.

ఎవడు ప్రియులారా గొప్పవాడు? ఎవడు ప్రియులారా తెలివైనవాడు? తెలివైనవాడు వాడే ఎవరైతే మరణాన్ని అత్యధికంగా జ్ఞాపకం చేసుకుంటూ మరణానంతర జీవితం కోసం సామాగ్రి తయారు చేసుకుంటాడో. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ మరణానంతర జీవితం కోసం సామాగ్రి ఏర్పాటు చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు గాక ఆమీన్.

సోదరులారా! ఈరోజు మనం హృదయ ఆచరణలు ఐదవ భాగంలో రెండు విషయాలు తెలుసుకున్నాం, మొదటి మాట ఉత్తమ వ్యక్తుల సాంగత్యం, రెండవ మాట మరణాన్ని అత్యధికంగా జ్ఞాపకం చేసుకోవటం.

అల్లాహ్ మనందరికీ చెప్పటం, వినటం, దానితో పాటు ఆచరణ చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించు గాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్.

وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ
వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ. نَحْمَدُهُ وَنُصَلِّي عَلَى رَسُولِهِ الْكَرِيمِ أَمَّا بَعْدُ
అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు. నహ్మదుహు వ నుసల్లీ అలా రసూలిహిల్ కరీమ్ అమ్మాబాద్.

సోదరులారా! హృదయ ఆచరణలు ఆరవ భాగం. ఇంతకుముందు భాగంలో మనము తెలుసుకున్న విషయాలు ఏమిటంటే హృదయ సంస్కరణ కోసం, హృదయ చికిత్స కోసం మనం ఏమి చేయాలి. సత్పురుషుల సాంగత్యములో కూర్చోవాలి, మరణాన్ని, సమాధిని, మరణానంతర జీవితాన్ని అత్యధికంగా జ్ఞాపకం చేసుకోవాలి. అదే విధంగా సక్రాతు స్థితిలో, మరణ మూర్ఛకు లోనైన వారిని, అలాంటి వ్యక్తులను మనం చూడటం వలన మనకు ప్రపంచ జీవితం యొక్క వాస్తవికత, అసలు ప్రపంచ జీవితం అసలు జీవితం కాదన్న వాస్తవం తెలుస్తుంది ప్రియులారా. ఎందుకంటే మనిషి ప్రపంచం నుండి వెళుతున్నప్పుడు తన యొక్క ఆకాంక్షలు, తన యొక్క కోరికలు అన్నింటినీ విడిచిపెట్టి వెళ్ళిపోతాడు సోదరులారా. జీవితమంతా సంపాదించిన ఆస్తిపాస్తులు, అన్నింటినీ విడిచిపెట్టేస్తాడు. అన్నింటినీ విడిచిపెట్టి తన అంతిమ ప్రయాణం వైపునకు, ప్రపంచానికి వీడుకోలు పలికి వెళ్ళిపోతాడు. మనలో ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళిపోవాల్సింది సోదరులారా. ప్రపంచములో గర్వంతో విర్రవీగిన మహామహులందరూ ప్రపంచం నుండి వెళ్ళిపోయారు. కాబట్టి సోదరులారా, ఆ మరణం రాకమునుపే దాని వాస్తవికతను గ్రహించి మనం మన జీవితాలను సంస్కరించుకోవాలి. మరి దీని కోసం మనం మరణాన్ని అత్యధికంగా జ్ఞాపకం చేసుకోవాలి.

హజరతే సయీద్ బిన్ జుబైర్ రహమహుల్లాహ్ తెలియజేస్తున్నారు, నేను క్షణం పాటు అయినా నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటం మరచిపోతే, నా హృదయం నాశనమైపోయిందా అన్నంతగా భయపడతాను. అల్లాహు అక్బర్. అంటున్నారు గురువుగారు, నేను క్షణం పాటు అయినా నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటం మరచిపోతే, నా హృదయం నాశనమైపోయిందా అన్నంతగా భయపడతాను. కాబట్టి సోదరులారా, మనం ఆ యొక్క మరణాన్ని అత్యధికంగా జ్ఞాపకం చేసుకోవాలి.

ఆ తర్వాత సోదరులారా, మనము తెలుసుకోబోయే విషయం, ఈ యొక్క హృదయ సంస్కరణకు, హృదయ చికిత్సకు చాలా శ్రమ పడాల్సి వస్తుంది ప్రియులారా. ఇబ్నుల్ మున్కదిర్ రహమహుల్లాహ్ తెలియజేస్తున్నారు, “నేను నలభై సంవత్సరాల ప్రయత్నము చేశాను నా హృదయ సంస్కరణ కోసం“. కాబట్టి హృదయాన్ని సంస్కరించటానికి, దానిని ఉత్తమంగా మార్చటానికి చాలా శ్రమ పడాల్సి వస్తుంది మరియు ప్రతి క్షణం మనిషి తన హృదయ సంస్కరణ యొక్క ధ్యాసను కలిగి ఉండాలి, దానికి ఎంత సమయం అవసరమైనా సరే ప్రియులారా.

హృదయం గురించి ఇలా తెలుపబడింది సోదరులారా, ఎప్పుడైతే మనిషి యొక్క హృదయం మంచిదైపోతుందో, అతని మాటలు మంచివైపోతాయి, అతని ఆచరణలు మంచివైపోతాయి. ఎందుకంటే షైతాన్ ఎవరి మీదనైనా దాడి చేయటానికి ప్రయత్నిస్తే, అన్నింటికంటే ముందుగా వాడు హృదయంపై దాడి చేస్తాడు. అందువలన మన హృదయాలు అల్లాహ్ యొక్క విధేయతలో ఉండి, అల్లాహ్ పై దృఢ నమ్మకం కలిగి ఉన్నప్పుడు, షైతాన్ మన హృదయాలపై దాడి చేయలేడు సోదరులారా. కానీ దానికి వ్యతిరేకంగా, మన హృదయంలో అల్లాహ్ యొక్క భయభక్తి లేనప్పుడు, దానిని మనం ఉత్తమంగా తీర్చిదిద్దనప్పుడు, మన జీవితంలో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి ప్రియులారా. కేవలం ప్రాపంచిక వ్యామోహంలో, ప్రాపంచిక విషయాలలో మనం ఇతరులతో శత్రుత్వాన్ని కొనితెచ్చుకుంటాం. ఎందుకంటే ఆ విధంగా మనం మన హృదయాలను సంస్కరించి ఉండము కాబట్టి సోదరులారా.

సోదరులారా, ఇంతవరకు మనం హృదయాల సంస్కరణ, హృదయ చికిత్స ఏ విధంగా చేయాలి అన్న విషయాన్ని తెలుసుకున్నాం. ఇన్షా అల్లాహ్, ఇప్పుడు హృదయాలు ఏ విధంగా చెడిపోతాయి, హృదయాలు చెడిపోవటానికి కారణాలు ఏమిటి అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ప్రియులారా.

మొదటి కారణం: హృదయంలో ఇఖ్లాస్, చిత్తశుద్ధి లోపించటం వలన. మన హృదయంలో కేవలం అల్లాహ్‌ను మాత్రమే ఇష్టపెట్టే ఉద్దేశముతో మనం ఆచరణ చేయకపోతే, ఇఖ్లాస్, చిత్తశుద్ధి లోపిస్తే, మనం ఎన్ని కార్యాలు చేసినా అవి అల్లాహ్ వద్ద స్వీకరింపబడవు. కాబట్టి మన హృదయాలు రోగగ్రస్త హృదయాలుగా మారిపోవటానికి మొదటి కారణం ఇఖ్లాస్ లేకపోవటం, ఆచరణలో ప్రదర్శనా బుద్ధి, రియా వచ్చేయటం. దాని వలన మన హృదయం రోగగ్రస్తమైపోతుంది సోదరులారా.

రెండవ విషయం: అల్లాహ్ యేతరులపై హృదయాన్ని లగ్నం చేయటం, అల్లాహ్ ఏతరులపై నమ్మకాన్ని కలిగి ఉండటం. ముస్లింగా పుట్టి, ముస్లింగా జీవిస్తూ కూడా అల్లాహ్‌తో పాటు ఇతరులపై నమ్మకాన్ని కలిగి ఉండటం. బాబాలు, వలీలు, మూఢనమ్మకాలు, తాయెత్తులపై నమ్మకం కలిగి ఉండటం, తావీజులపై నమ్మకాన్ని కలిగి ఉండటం, బలహీనుల్ని ఆరాధించటం. మనము గనుక బలహీనుల్ని ఆరాధిస్తే మన హృదయాలు రోగగ్రస్తమైపోతాయి. ఎందుకంటే హృదయాన్ని దానిని సృష్టించిన దాని సృష్టికర్తతో మనం బంధాన్ని కలపాలి. అలా కాకుండా హృదయం సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని ఆరాధిస్తే అది రోగగ్రస్తమైపోతుంది. కాబట్టి సోదరులారా, బలహీనుల ఆరాధన చేయరాదు. బలహీనుల ఆరాధన చేస్తే హృదయము రోగగ్రస్తమైపోతుంది.

ఆ తర్వాత మూడవ మాట సోదరులారా: అవసరం కంటే ఎక్కువగా పొందే ప్రయత్నము చేయటం ఉదాహరణ, అవసరము కంటే ఎక్కువగా తినటము, త్రాగటము, అవసరము కంటే ఎక్కువగా నిద్రపోవటం, అవసరము కంటే ఎక్కువగా మాటలు మాట్లాడటం, అవసరము కంటే ఎక్కువగా నవ్వటం, చమత్కరించటం. ఈ విషయాలు తమ అవసరాన్ని మించిపోయినప్పుడు అది మన హృదయంపై ప్రభావం చూపుతుంది ప్రియులారా.

ఇబ్నె ఇయాద్ రహమహుల్లాహ్ తెలియజేస్తున్నారు, రెండు విషయాలు హృదయాలను కఠినంగా మార్చేస్తాయి.

كَثْرَةُ الْكَلَامِ وَكَثْرَةُ الْأَكْلِ
కస్రతుల్ కలామ్ వ కస్రతుల్ అక్ల్
మనిషి ఎప్పుడైతే విపరీతంగా మాట్లాడతాడో మరియు విపరీతంగా తింటాడో ఆ రెండు విషయాలు అతని హృదయాన్ని కఠినము చేసేస్తాయి

అబూ సులైమాన్ అద్దారానీ రహమహుల్లాహ్ ఇలా తెలియజేస్తున్నారు ప్రియులారా:

لِكُلِّ شَيْءٍ صَدَأٌ
లికుల్లి షైయిన్ సదా
ప్రతిదానికి చెద పడుతుంది. హృదయం యొక్క చెద అతిగా భుజించటం.

అంటే కడుపు నిండిన తర్వాత కూడా ఇంకా తినటం తినటం.

ఇమామ్ షాఫయీ రహమహుల్లాహ్ ఇలా తెలియజేస్తున్నారు “అతిగా తినటం దేహాలను భారంగా మార్చేస్తుంది. హృదయాలను కఠినంగా చేసేస్తుంది. మెదడు యొక్క చురుకుదనాన్ని తగ్గించేస్తుంది. మనిషికి నిద్ర వచ్చేటట్టు చేసేస్తుంది. తత్ఫలితంగా ఆరాధన కోసం దేహాన్ని బద్ధకంగా మార్చేస్తుంది”. అల్లాహు అక్బర్. ఆలోచించాల్సిన విషయం ప్రియులారా.

ఆ తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గురించి చెప్పడం జరిగింది, అమ్మ ఆయిషా సిద్దీకా రదియల్లాహు త’ఆలా అన్హా సెలవిస్తున్నారు, “వారాలు గడిచిపోయేవి, నెలలు గడిచిపోయేవి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లో మాత్రం పొయ్యి వెలిగేది కాదు. ఖర్జూరము మరియు నీళ్లతో వారి జీవితము గడిచేది”. అల్లాహు అక్బర్. నెలలు గడిచిపోయేవి, వారాలు గడిచిపోయేవి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట పొయ్యి వెలిగేది కాదు. ఖర్జూరము మరియు నీళ్లతో వారి జీవితం గడిచిపోయేది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సుదీర్ఘ ఆరాధన, సుదీర్ఘ నమాజ్ ఎక్కువ శాతం ఖాళీ పొట్టతోనే జరిగేది సోదరులారా.

బదర్ బిన్ జమా రహమహుల్లాహ్ తెలియజేస్తున్నారు, ఎంతమందైతే సత్పురుషులు గతిఇంచారో, ఇమాములు గతిఇంచారో, వారి జీవిత చరిత్రలు చదివినప్పుడు, వారి జీవిత చరిత్రలు విన్నప్పుడు, మనకు తెలిసే విషయం ఏమిటంటే, వారు ఎక్కువగా భుజించేవారు కాదు. వారు వారి నడుం నిలబడటానికి ఎంత అవసరమో అంత మాత్రం భుజించేవారు సోదరులారా. తద్వారా వారు ఆరాధన చేయగలగటానికి. అందుకే సుబ్ హా నల్లాహ్, మనం ఈరోజు ఆలోచించుకోవాలి సోదరులారా, వారి జీవితాలు ఎలా ఉండేవి, వారు ఏ విధంగా జీవితం గడిపారు, మనం ఏ విధంగా జీవితం గడుపుతున్నాం.

సోదరులారా! ఈరోజు మనం తెలుసుకున్న విషయాలు హృదయాన్ని రోగగ్రస్తంగా చేసే విషయాలు ఏమిటి. మనం తెలుసుకున్నాం హృదయాన్ని రోగగ్రస్తంగా చేసే విషయాలు, మనస్సులో, హృదయంలో ఇఖ్లాస్, చిత్తశుద్ధి లోపించటం, బలహీనులపై విశ్వాసం పెట్టుకొని అల్లాహ్‌తో పాటు అల్లాహ్‌ను కాకుండా బలహీనుల్ని ఆరాధించటం, ఏదైనా విషయంలో అవసరం కంటే ఎక్కువ పొందే ప్రయత్నం చేయటం, తినటంలో త్రాగటంలో, ఇతరత్రా విషయాలలో. కాబట్టి వీటి నుండి మనం దూరం అవ్వటానికి ప్రయత్నము చేయాలి

ప్రియులారా. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ఆచరణ చేసే భాగ్యాన్ని ప్రసాదించు గాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్.

وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ
వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

السلام عليكم ورحمة الله وبركاته
అస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు

نَحْمَدُهُ وَنُصَلِّي عَلَى رَسُولِهِ الْكَرِيمِ أَمَّا بَعْدُ
నహ్మదుహు వనుసల్లీ అలా రసూలిహిల్ కరీమ్ అమ్మాబాద్

నా ప్రియమైన ధార్మిక సోదరులారా! ఈ రోజు మనం తెలుసుకోబోయే అంశం హృదయ ఆచరణలు ఏడవ భాగం.ప్రియులారా నిన్న మనం హృదయం రోగగ్రస్త హృదయంగా, కలుషితమైన హృదయంగా ఏ విధంగా మారిపోతుంది అన్న విషయాన్ని తెలుసుకున్నాం. అదే క్రమంలో ఈరోజు మరికొన్ని విషయాలు అంటే ఏ విషయాలు మన హృదయాన్ని రోగగ్రస్త హృదయంగా మార్చేస్తాయి అన్న దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

హృదయాన్ని కలుషితం చేసే ఐదు విషయాలు

ఇమామ్ ఇబ్నె ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ ఇలా తెలుపుతున్నారు సోదరులారా:

مفسدات القلب خمسة
ముఫ్సిదాతుల్ ఖల్బి ఖమ్సా
హృదయాన్ని కలుషితం చేసే విషయాలు ఐదు.

كثرة الخلطة (కస్రతుల్ ఖుల్తా – అనవసరమైన స్నేహాలు): అనవసరంగా స్నేహితులతో సంబంధాలు కలిగి ఉండటం. అంటే అవసరం కంటే ఎక్కువగా స్నేహితులను చేసుకోవటం, వారితో తిరగటం, వారితో ధర్మపరమైన ఎలాంటి లాభం ఉండనప్పటికీ వారితో తిరగటం వలన మన హృదయం చెడిపోతుంది.

والإسراف في الطعام (వల్ ఇస్రాఫి ఫిత్తఆమ్ – అతిగా తినడం): అవసరము కంటే ఎక్కువగా తినటము, త్రాగటము.

وكثرة النوم (వ కస్రతున్ నౌమ్ – అతిగా నిద్రించడం): అవసరము కంటే ఎక్కువగా నిద్రించటం ప్రియులారా.

وتعلق بغير الله (వ తఅల్లుక్ బి’గైరిల్లాహ్ – అల్లాహ్‌ను కాకుండా ఇతరులతో సంబంధం): అల్లాహ్ తో కాకుండా అల్లాహ్ ఏతరులతో సంబంధాన్ని కలిగి ఉండటం, వారిపై నమ్మకం ఉంచటం.

والتمني (వ తమన్నీ – అనవసరమైన కోరికలు): అనవసరమైన కోరికలు ఎక్కువైపోవటం, వాంఛలు పెరిగిపోవటం, ఆకాంక్షలు పెరిగిపోవటం అనవసరంగా, ఇవన్నీ హృదయాన్ని చెడిపోయేటట్లు చేసేస్తాయి సోదరులారా.

పాపాలు మరియు హృదయ కాలుష్యం

ఆ తర్వాత చెప్పడం జరుగుతుంది:

إِنَّ كُلَّ الْمَعَاصِي تُفْسِدُ الْقَلْبَ
ఇన్న కుల్లల్ మఆసీ తుఫ్సిదుల్ ఖల్బ్
ప్రతి పాపము, అవిధేయత హృదయాన్ని కలుషితం చేసేస్తుంది.

అల్లాహ్ నిషేధించిన కార్యాలు మనిషి చేస్తే వాటితో కూడా హృదయం చెడిపోతుంది. ఉదాహరణకు, అల్లాహ్ నిషేధించిన వాటిని చూడటం, అల్లాహ్ నిషేధించిన వాటిని వినటం, అల్లాహ్ నిషేధించిన హరామ్ తినటం ప్రియులారా.

హృదయాన్ని చెడగొట్టే నాలుగు విషయాలు

ముహమ్మద్ బిన్ వాసె రహిమహుల్లాహ్ తెలుపుతున్నారు, నాలుగు విషయాలు మనిషి హృదయాన్ని చెడిపోయేటట్టుగా చేసేస్తాయి.

పాపాలపై పాపాలు చేయుట: మనం ఏదైనా పాపము చేస్తే దాని నుండి అల్లాహ్ తో తౌబా చేసుకొని ఆ పాపము నుండి దూరమైపోవాలి, అల్లాహ్ వైపునకు మరలాలి. కానీ అలా కాకుండా పాపంపై పాపము చేస్తూ పోతుంటే అది మనిషి హృదయాన్ని కలుషితం చేస్తుంది సోదరులారా, రోగగ్రస్త హృదయంగా మార్చేస్తుంది.

స్త్రీలతో ఎక్కువగా మాట్లాడటం: స్త్రీలతో ఎక్కువగా మాట్లాడటాన్ని ఇష్టపడటం. అంటే పరస్త్రీలతో ఎక్కువ మాట్లాడటం, వారితో మాట్లాడటాన్ని ఇష్టపడటం, ఇది కూడా హృదయాన్ని చెడగొడుతుంది, రోగగ్రస్త హృదయంగా చేసేస్తుంది. కాబట్టి అనవసరంగా గంటలు గంటలు పరస్త్రీలతో మాట్లాడటం మంచిది కాదు. దీని వలన మన హృదయం చెడిపోతుంది.

మూర్ఖులతో వాగ్వాదం: మూర్ఖులు, అజ్ఞానులతో వాగ్వాదం చేయటం. వారు ఏదో చెప్పటం, మనం ఏదో చెప్పటం, ఎక్కువ వాదోపవాదాలు చేసుకోవటం. ప్రత్యేకంగా నేటి కాలంలో సోషల్ మీడియాలో మూర్ఖులతో సమయాన్ని వృధా చేసుకోవటం కూడా మనకు నష్టము కలిగించే అంశం.

మృతులతో కూర్చోవటం: ముహమ్మద్ బిన్ వాసె రహిమహుల్లాహ్ తో ఇలా ప్రశ్నించారు: మృతులతో కూర్చోవటం ఎలా సాధ్యం? ఆయన సమాధానం ఇస్తున్నారు, మృతులతో కూర్చోవటం అంటే అలాంటి వ్యక్తితో కూర్చోవటం, ఎవరైతే తన సంపదపై గర్విస్తాడో, డాబులు కొడుతూ ఉంటాడో, బడాయి మాటలు చెబుతూ ఉంటాడో, అలాంటి వ్యక్తులతో కూర్చొని సమయాన్ని వృధా చేసుకోవటం. ఆ తర్వాత దౌర్జన్యము చేసే పాలకునితో కూర్చోవటం.

కాబట్టి సోదరులారా, ఇలాంటి విషయాల నుండి మనం దూరంగా ఉండాలి.

పాపాల ప్రభావం మరియు హృదయ మరణం

ఆ తర్వాత, ఇమామ్ ఇబ్నె ముబారక్ రహిమహుల్లాహ్ తెలుపుతున్నారు, “నేను చూశాను, పాపాలు, పాప కార్యాలు హృదయాన్ని చంపేస్తాయి. పాప కార్యాలతో మనిషి యొక్క హృదయం మరణిస్తుంది. ఎప్పుడైతే మనిషి పాపాన్ని విడిచిపెట్టి పుణ్యకార్యం వైపునకు అడుగులు వేస్తాడో, అప్పుడు తిరిగి అతని హృదయం బ్రతుకుతుంది.” అల్లాహు అక్బర్! సోదరులారా, పాప కార్యాలతో మనిషి యొక్క హృదయం మరణిస్తుంది, అల్లాహ్ త’ఆలా మనల్ని రక్షించు గాక.

హృదయం మరియు పాపాల సారూప్యత

ఆ తర్వాత ప్రియులారా, ముజాహిద్ రహిమహుల్లాహ్ ఇలా తెలుపుతున్నారు: “హృదయం అరచేతిని పోలి ఉంది. ఎప్పుడైతే మనిషి ఒక పాపము చేస్తాడో, అతని ఒక వేలు ముడుచుకుంటుంది. ఎలాగైతే పాపాలు చేస్తూ పోతాడో, అతని చేతి వేళ్ళు ముడుచుకుంటూ పోతాయి. చివరికి అతని పిడికిలి మూసుకుపోతుంది”. అంటే ఆఖరికి అలాంటి హృదయం తుప్పు పట్టినట్లు అయిపోతుంది. పాపాల వలన ఆ హృదయం తుప్పు పట్టినట్లు అయిపోతుంది సోదరులారా. దీని ప్రస్తావన అల్లాహ్ త’ఆలా ఖురాన్ గ్రంథములో ఈ విధంగా చేస్తూ ఉన్నారు. అల్లాహ్ అంటూ ఉన్నారు:

كَلَّا ۖ بَلْ ۜ رَانَ عَلَىٰ قُلُوبِهِمْ مَا كَانُوا يَكْسِبُونَ
కల్లా బల్ రాన అలా ఖులూబిహిమ్ మా కానూ యక్సిబూన్
అలా కాదు, అసలు విషయం ఏమిటంటే వారి దురాగతాల మూలంగా వారి హృదయాలకు తుప్పు పట్టింది.

ఎవరైతే పాపాత్ములు ఉంటారో, ఎవరైతే పాప కార్యాలు చేస్తారో, ఎవరైతే అల్లాహ్ యొక్క మాటలను తిరస్కరిస్తారో, ప్రతిఫల దినాన్ని తిరస్కరిస్తారో, ఖురాన్ మరియు హదీసు మాటలు వారి ముందు చెప్పబడినప్పుడు ఇవన్నీ పూర్వీకుల కట్టుకథలే అని తిరస్కరిస్తారో, అలాంటి వారి గురించి ఖురాన్ గ్రంథములో చెప్పడం జరిగింది ప్రియులారా. ఎవరి గురించి? ఒకసారి ఖురాన్ గ్రంథములో ముతఫ్ఫిఫీన్ సూరాలో కొన్ని వాక్యాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అల్లాహ్ అంటున్నారు, పవిత్ర ఖురాన్ గ్రంథములో 83వ సూరా, సూరె ముతఫ్ఫిఫీన్, వాక్యము సంఖ్య 7 నుండి:

كَلَّآ إِنَّ كِتَـٰبَ ٱلْفُجَّارِ لَفِى سِجِّينٍ
కల్లా ఇన్న కితాబల్ ఫుజ్జారి లఫీ సిజ్జీన్
ముమ్మాటికీ కాదు. నిశ్చయంగా పాపాత్ముల కర్మల చిట్టా సిజ్జీనులో ఉంది.

وَمَآ أَدْرَىٰكَ مَا سِجِّينٌ
వమా అద్రాక మా సిజ్జీన్
సిజ్జీన్ అంటే ఏమిటో నీకు తెలుసా?

كِتَـٰبٌ مَّرْقُومٌ
కితాబుమ్ మర్ఖూమ్
అది లిఖిత పూర్వక గ్రంథం.

وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
వయ్లుయ్ యౌమఇదిల్ లిల్ ముకద్దీబీన్
ధిక్కరించే వారికి ఆ రోజు మూడటం ఖాయం.

ٱلَّذِينَ يُكَذِّبُونَ بِيَوْمِ ٱلدِّينِ
అల్లదీన యుకద్దిబూన బి యౌమిద్దీన్
వారు ప్రతిఫల దినాన్ని ధిక్కరించేవారు.

وَمَا يُكَذِّبُ بِهِۦٓ إِلَّا كُلُّ مُعْتَدٍ أَثِيمٍ
వమా యుకద్దిబు బిహీ ఇల్లా కుల్లు ము’తదిన్ అసీమ్
బరితెగించిన పాపాత్ముడు మాత్రమే దానిని త్రోసి పుచ్చుతాడు.

إِذَا تُتْلَىٰ عَلَيْهِ ءَايَـٰتُنَا قَالَ أَسَـٰطِيرُ ٱلْأَوَّلِينَ
ఇదా తుత్లా అలైహి ఆయాతునా ఖాల అస్సాతీరుల్ అవ్వలీన్
వాడికి మా వాక్యాలు చదివి వినిపించినప్పుడు, ‘ఇవి పూర్వికుల కట్టుకథలే కదా’ అని వాడు అంటాడు.

కారణం ఏమిటి ప్రియులారా? అల్లాహ్ తెలుపుతున్నారు:

كَلَّا ۖ بَلْ ۜ رَانَ عَلَىٰ قُلُوبِهِمْ مَا كَانُوا يَكْسِبُونَ
కల్లా బల్ రాన అలా ఖులూబిహిమ్ మా కానూ యక్సిబూన్
అది కాదు. అసలు విషయం ఏమిటంటే వారి దురాగతాల మూలంగా వారి హృదయాలకు తుప్పు పట్టింది.

కాదు కాదు, ఆ రోజు వారు తమ ప్రభువును చూడకుండా ఉండే విధంగా చాటున ఉంచబడతారు. ఆ పైన వారు తప్పకుండా నరకములోకి త్రోసివేయబడతారు అని చెప్పడం జరిగింది. అంటే అవిశ్వాసులకు అల్లాహ్ యొక్క దర్శన భాగ్యం లభించదు. కానీ విశ్వాసులకు అల్లాహ్ యొక్క దర్శన భాగ్యం లభిస్తుంది. కాబట్టి మనం మన హృదయాలను తుప్పు పట్టకుండా ఉండేటట్లు చేయాలి అంటే మనం అల్లాహ్ కు దగ్గరవ్వాలి.

ఆ తర్వాత చివరి మాట, మనిషి అలాంటి సమావేశాలలో కూర్చున్నప్పుడు ఎక్కడైతే అల్లాహ్ యొక్క స్మరణ జరగదో, ప్రజలు ప్రపంచంలో మునిగి ఉంటారో, వ్యర్థమైన విషయాలలో ఉంటారో, అలాంటి సమావేశాలలో మనం కూర్చోవటం వలన కూడా మన హృదయం కలుషితమైపోతుంది. అనవసరంగా బజార్లలో తిరుగుతుండటం వలన కూడా, ఎలాంటి అవసరం లేకుండా అలా తిరుగుతూ ఉండటం వలన కూడా మన యొక్క హృదయం కలుషితమైపోతుంది. కాబట్టి సోదరులారా, మనం మంచి సమావేశాలలో కూర్చోవాలి, అల్లాహ్ మరియు ప్రవక్త మాట అయ్యే సమావేశాలలో కూర్చోవాలి, తద్ఫలితంగా మన హృదయాలకు సంస్కరణ జరుగుతుంది.

కాబట్టి సోదరులారా, మనం మన హృదయాల సంస్కరణ చేసుకోవాలి. ఎవరైతే చెడు కార్యాల వైపునకు వెళ్తున్నారో వారిని అల్లాహ్ వైపునకు పిలవాలి, వారికి ధర్మ బోధన చేయాలి, అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని బోధించాలి. మన హితబోధ ఇన్ షా అల్లాహ్ వారికి లాభదాయకం కాగలదు సోదరులారా. కాబట్టి ప్రజలను సంస్కరించే ప్రయత్నము చేద్దాం. ఇది మనందరి బాధ్యత.

అల్లాహ్ త’ఆలా మనందరినీ ఖురాన్ మరియు హదీసు బోధిస్తూ, దానిపై ఆచరిస్తూ, దానిని ప్రజల వరకు తెలియజేసే భాగ్యాన్ని మనకు ప్రసాదించు గాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు.

అస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ అమీన్, అమ్మాబాద్.

సోదరులారా, నేడు మనం తెలుసుకొనే అంశం హృదయ ఆచరణలు, ఎనిమిదవ భాగం. ప్రియులారా, మనిషి హృదయం పాడైపోయినప్పుడు, మనిషి హృదయం చెడిపోయినప్పుడు ఏం జరుగుతుంది? అది కఠినమైన హృదయంగా మారిపోతుంది సోదరులారా, దానికి వ్యాధి పట్టేస్తుంది, అది రోగగ్రస్తమైన హృదయంగా మారిపోతుంది.

అల్లాహ్ శిక్షలు మరియు వాటి ప్రభావం

హజ్రతే మాలిక్ బిన్ దీనార్ రహిమహుల్లాహ్ తెలుపుతున్నారు, “అల్లాహ్ తరఫు నుండి వచ్చే కొన్ని శిక్షల ప్రభావం మనుషుల హృదయాలపై మరియు వారి దేహాలపై ఉంటుంది.”

మొదటి మాట, అది ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందంటే మనిషి యొక్క ఉపాధి భారమైపోతుంది.

రెండవ మాట, ఆరాధన బలహీనమైపోతుంది, అల్లాహ్ ను ఆరాధించటం పట్ల మనస్సు లాగదు, మనిషి బలహీనమైపోతాడు. అలాంటి పక్షంలో దానిని మనం అల్లాహ్ యొక్క శిక్షగా భావించాలి. ఎప్పుడైతే శరీరం ఆరాధనకు సహకరించలేదో, బాగుండి కూడా ఆరాధన పట్ల అశ్రద్ధ వహిస్తున్నప్పుడు, అలాంటి వ్యక్తి అల్లాహ్ యొక్క శిక్షకు గురయ్యాడు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి, మనల్ని మనం సంస్కరించుకోవాలి.

ఇక మూడవ మాట, ఉపాధి లభిస్తుంది కానీ చాలా కష్టంగా లభిస్తుంది. ఆ ఉపాదితో అల్లాహ్ ఆ వ్యక్తిని పరీక్షిస్తూ ఉంటారు. సంపద ఇచ్చి పరీక్షిస్తారు, సంపద ఇవ్వకుండా పరీక్షిస్తారు, ఉపాధి పెంచి కూడా అల్లాహ్ అతన్ని పరీక్షిస్తూ ఉంటారు

ప్రియులారా. ఈ మూడు విషయాలను మనం తెలుసుకోవాల్సి ఉంది ప్రియులారా.

అవయవాల సృష్టి మరియు హృదయం యొక్క ప్రయోజనం

ఇమామ్ గజాలీ రహిమహుల్లాహ్ తెలుపుతున్నారు, మనిషి యొక్క ప్రతి అవయవాన్ని అల్లాహ్ ఒక ప్రత్యేక బాధ్యతతో సృష్టించాడు. ఒకవేళ మనిషి యొక్క ప్రతి అవయవం దానికి నిర్ధారింపబడిన పని చేయకపోతే, చేసినా బద్ధకంతో చేస్తే, ఆ అవయవానికి రోగం పట్టినట్లు అర్థం. అది రోగగ్రస్తమైపోయింది అని చెప్పటానికి ఒక తార్కాణం. ఉదాహరణకు, చెయ్యి పట్టుకోవటానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ చెయ్యి పట్టుకోలేకపోతుంది అంటే, దానిలో ఆ బలము లేదు అంటే, ఆ అవయవం పనికిరానిదిగా మనకి అర్థమవుతుంది.

అదే విధంగా హృదయమును అల్లాహ్ జ్ఞానము పొందటానికి, వివేకమును పొందటానికి, తన ప్రభువైన అల్లాహ్ ను గుర్తించటానికి సృష్టించాడు. ఆ హృదయముతో మనిషి జ్ఞానాన్ని నేర్చుకుంటాడు, అల్లాహ్ ను గుర్తించే జ్ఞానాన్ని తెలుసుకుంటాడు. మరి ఆ హృదయం, అల్లాహ్ దానిని సృష్టించిన పని చేయనప్పుడు, ఆ హృదయంతో మనిషి గనక అల్లాహ్ ను గుర్తించకపోతే అది కూడా రోగగ్రస్తమైపోతుంది.

కాబట్టి సోదరులారా, మనం అల్లాహ్ ను గుర్తించాలి. ఎప్పుడైతే మన హృదయం అల్లాహ్ ను గుర్తిస్తుందో, అది అల్లాహ్ ను ప్రేమించటం మొదలు పెడుతుంది మరియు అల్లాహ్ యొక్క స్మరణను పెదవులపై అలంకరిస్తుంది, అది అల్లాహ్ ను తెలుసుకుంటుంది. ఎప్పుడైతే అది అల్లాహ్ ను తెలుసుకుంటుందో, అల్లాహ్ యొక్క భయం, అల్లాహ్ యొక్క భీతి, అల్లాహ్ పట్ల వినమ్రత ఆ హృదయంలో జనిస్తుంది. మనిషి అల్లాహ్ ను ఎంత ఎక్కువగా గుర్తిస్తాడో, తెలుసుకుంటాడో అంతే ఎక్కువగా అల్లాహ్ తో భయపడతాడు.

ఆ తర్వాత, కొంతమంది ఇలా కూడా ఉంటారు. వారికి అన్ని విషయాలు తెలుసు. వారు అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత కూడా అల్లాహ్ ను మాత్రం తెలుసుకోలేరు. అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని గుర్తించలేరు. అలాంటి హృదయం ఏ జ్ఞానాన్ని పొందనట్టే ప్రియులారా. అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని గుర్తించలేకపోతే అలాంటి హృదయం దేనిని కూడా తెలుసుకో పోయినట్లే. కాబట్టి మనలో ప్రతి ఒక్కరు అల్లాహ్ ను గుర్తించాలి, అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా యొక్క ఏకత్వాన్ని తెలుసుకోవాలి, తౌహీద్ అంటే ఏమిటో తెలుసుకోవాలి, తౌహీదే రుబూబియత్ అంటే ఏమిటి, తౌహీదే ఉలూహియత్ అంటే ఏమిటి, తౌహీదే అస్మా వస్సిఫాత్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఈ రోజు నేను నన్ను, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను సోదరులారా, మనలో ఎంతమందికి తౌహీద్ అంటే తెలుసు? తౌహీదే రుబూబియత్ అంటే ఏమిటో తెలుసు? తౌహీదే ఉలూహియత్ అంటే ఏమిటో తెలుసు? తౌహీదే అస్మా వస్సిఫాత్ అంటే ఏమిటో తెలుసు? సోదరులారా, మనం ఖచ్చితంగా వీటిని తెలుసుకోవలసిన అవసరం ఉంది ప్రియులారా.

హృదయాల రకాలు

ఆ తర్వాత, సలఫ్ ఇలా తెలియజేస్తున్నారు ప్రియులారా:

الْقُلُوبُ ثَلَاثَةٌ
అల్ ఖులూబు సలాసః
హృదయాలు మూడు రకాలుగా ఉంటాయి.

పర్వతం వంటి హృదయం:
قَلْبٌ مِثْلُ الْجَبَلِ لَا يُزِيلُهُ شَيْءٌ
ఖల్బున్ మిస్లల్ జబల్ లా యజీలుహు షై
ఒక హృదయం పర్వతాన్ని పోలి ఉంటుంది, దాన్ని ఏదీ కదల్చలేదు.

ఖర్జూరపు చెట్టు వంటి హృదయం:
وَقَلْبٌ مِثْلُ النَّخْلِ
వ ఖల్బున్ మిస్లన్ నఖల్
ఆ హృదయం ఏ హృదయం అంటే, ఏ హృదయం అయితే ఖర్జూరపు చెట్టును పోలి ఉంటుందో, దాని వేళ్ళు భూమిలో చొచ్చుకుపోయి ఉంటాయి, అయినప్పటికీ గాలి వీచినప్పుడు అది కాస్తా ఊగుతుంది సోదరులారా.

రెక్క వంటి హృదయం:
وَقَلْبٌ كَالرِّيشَةِ
వ ఖల్బున్ కర్ రీషః
ఆ హృదయము ఏ హృదయం అయితే ఒక రెక్కను పోలి ఉంటుందో, దాని పరిస్థితి ఇలా ఉంటుంది, ఎటు గాలి వీస్తే అటు ఆ రెక్క ఎగిరిపోయి వెళ్ళిపోతుంది. ఎవడు ఎటు తీసుకువెళ్తే అలాంటి హృదయాలు అటు వెళ్ళిపోతాయి.

కాబట్టి సోదరులారా, మనం మన హృదయాలను ప్రశ్నించుకోవాలి. మనం ఎలాంటి హృదయాన్ని కలిగి ఉన్నాము? మన హృదయం పర్వతం వలే దృఢంగా ఉందా? అల్లాహ్ పై అచంచల విశ్వాసము కలిగి ఉందా? పూర్తి నమ్మకం కలిగి ఉందా? లేక ఖర్జూరపు చెట్టు వలే ఉందా, గాలి వీచినప్పుడు అటూ ఇటూ కాస్తా నెమ్మదిగా కదులుతున్నట్లు? అలా కాకుండా అది ఆ రెక్క వలే ఉందా, ఏ రెక్క అయితే ఎలాంటి విలువ లేకుండా ఉన్నదో, అది ఎటు గాలి వీస్తే అటు వెళ్ళిపోతుందో, దాని వలన మనిషి ఏం చేస్తాడు, అలాంటి హృదయం వలన దేని ముందు పడితే దాని ముందు సాష్టాంగం చేస్తాడు, దానిని లాభ నష్టాలు కలిగించే యజమాని అనుకుంటాడు, అల్లాహ్ ను కాకుండా ఇతరులను కూడా ఆరాధించేస్తాడు. ఇది ముష్రికుల పద్ధతి. అలాంటి రెక్క వంటి హృదయం మనది కాకూడదు ప్రియులారా. మన హృదయం పర్వతం వలే దృఢమైన హృదయంగా మారాలి. ఏదీ దాన్ని కదల్చలేదు, తౌహీద్ అనే ఆ పునాదిపై మనము దృఢంగా నిలబడిపోవాలి. అల్లాహ్ యే నా ప్రభువు అని పలికిన పిదప దానిపై స్థిరంగా ఉండిపోయే వారికే అల్లాహ్ శుభవార్తను ఇచ్చాడు ప్రియులారా. కాబట్టి మన హృదయం పర్వతం వలే దృఢమైన విశ్వాసము కలిగి ఏదీ దాన్ని కదల్చనటువంటి దాని విధంగా మన హృదయం మారిపోవాలి.

హృదయం యొక్క స్థితులు

ఈరోజు మనం తెలుసుకునే చివరి మాట ప్రియులారా,

أَحْوَالُ الْقُلُوبِ
అహ్వాలుల్ ఖులూబ్
హృదయం యొక్క పరిస్థితులు.

మనిషి హృదయాలు ఎలాంటి పరిస్థితులు కలిగి ఉంటాయి?

జీవించి ఉన్న హృదయం: ఏ హృదయానికైతే మార్గదర్శకత్వం లభిస్తుందో అది జీవించి ఉన్న హృదయం.

మరణించిన హృదయం: ఏ హృదయానికైతే మార్గదర్శకత్వం లభించకుండా అది మార్గభ్రష్టత్వంలో ఉండిపోయిందో అది మరణించిన హృదయం.

ఆరోగ్యమైన, బలమైన హృదయం: పరిశుద్ధమైన హృదయం, ద్వేషాలు, కుతంత్రాలకు దూరంగా ఉండే హృదయం, ఆరోగ్యమైన, బలమైన హృదయం.

అనారోగ్య హృదయం: ద్వేషం, కుతంత్రాలతో నిండి ఉన్న హృదయం అనారోగ్యమైన హృదయం.

మేల్కొని ఉన్న హృదయం: ఏ హృదయం అయితే అల్లాహ్ యొక్క జిక్ర్ చేస్తూ ఉంటుందో, అది మేల్కొని ఉన్న హృదయం, స్పృహతో ఉన్న హృదయం.

నిద్రిస్తున్న హృదయం: అది అశ్రద్ధతో ఉంటుంది, నిర్లక్ష్యంతో జీవనము గడుపుతూ ఉంటుంది. అశ్రద్ధ, నిర్లక్ష్యపు జీవితాలు గడుపుతున్న హృదయాలు నిద్రిస్తున్న హృదయాలతో సమానం.

కాబట్టి సోదరులారా, ఈ రోజు మనం మనల్ని ప్రశ్నించుకోవాలి. మన హృదయాలు ఎలా ఉన్నాయి? అల్లాహ్ తో సంబంధం, అల్లాహ్ యొక్క ఆరాధన, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తో ప్రార్థన, మనం మన హృదయాలను అల్లాహ్ తో సంబంధం పెట్టుకున్న హృదయాల వలె మార్చుకుందాం. అలాంటి హృదయాలే ఇహపరలోకాలలో సాఫల్యాన్ని పొందే హృదయాలు.

అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరికీ చెప్పటం, వినటంతో పాటు ఆచరణ చేసే భాగ్యాన్ని ప్రసాదించు గాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు.

అస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు
సోదరులారా, ఈ రోజు మనం తెలుసుకోబోయే అంశం హృదయ ఆచరణలు తొమ్మిదవ భాగం.

హృదయ ఆచరణలు అంటే ఏమిటి?

ప్రియులారా, వాస్తవానికి హృదయ ఆచరణలు అంటే ఏమిటి? హృదయ ఆచరణలు అని వేటిని అంటారు? హృదయ ఆచరణలు అనగా అలాంటి ఆచరణలు, ఏవైతే మనిషి హృదయంతో చేయబడతాయో. వీటిలో అన్నింటికంటే మొదటిది అల్లాహ్ ను విశ్వసించటం, ధృవీకరించటం, హృదయంలో దానిని ఆమోదించటం. అల్లాహ్ పై ప్రేమ కలిగి ఉండటం, అల్లాహ్ యొక్క భీతి, అల్లాహ్ యొక్క కారుణ్యం పట్ల ఆశ, అల్లాహ్ పై దృఢ నమ్మకం, ఓర్పు, ఇవన్నీ హృదయ ఆచరణలకు సంబంధించిన విషయాలు సోదరులారా.

అయితే ఇక్కడ ఒక విషయం గురించి మనం స్పష్టంగా తెలుసుకోవాలి. అదేమిటంటే కొంతమంది ఉంటారు, వారు ఇలా అంటారు, “ఈమాన్ (విశ్వాసం) హృదయంలో ఉంటుంది”. ఒక వ్యక్తి ఉన్నాడు, ముఖంపై గడ్డము లేదు, బట్టలు చూస్తే చీలమండ కిందకు వేలాడుతున్నాయి, పాపాలలో మునిగి ఉన్నాడు. అడిగితే అంటున్నాడు, “అరే, విశ్వాసం హృదయానికి సంబంధించినది, అది బయటకు కనిపించదు.”

విశ్వాసం (ఈమాన్) యొక్క సమగ్ర నిర్వచనం

కానీ వాస్తవం ఏమిటంటే, అహ్లు సున్నత్ వల్ జమాత్ యొక్క అభిప్రాయం, అహ్లు సున్నత్ వల్ జమాత్ యొక్క విశ్వాసం ప్రకారం, ఈమాన్ అంటే:

قَوْلٌ بِاللِّسَانِ وَاعْتِقَادٌ بِالْقَلْبِ وَعَمَلٌ بِالْجَوَارِحِ
ఖౌలుం బిల్ లిసాన్, వ’ఏతిఖాదుం బిల్ ఖల్బ్, వ’అమలుం బిల్ జవారిహ్
నోటితో పలకటం, హృదయంలో ధృవీకరించటం, మరియు చేతులు-కాళ్ళు మొదలగు అవయవాలతో ఆచరించటం.

ఈమాన్ అంటే నోటితో ఉచ్చరించటం, హృదయంలో ధృవీకరించటం, చేతులు-కాళ్ళు మొదలగు అవయవాలతో ఆచరించటం. మూడు విషయాలను కలిపి ఈమాన్ అంటారు. కేవలం నోటితో పలకటం మాత్రమే ఈమాన్ కాదు. కేవలం హృదయంలో విశ్వసించటం మాత్రమే ఈమాన్ కాదు. కేవలం అవయవాలతో ఆరాధించటం మాత్రమే ఈమాన్ కాదు. ఈ మూడు విషయాలు కలిసినప్పుడే అది ఈమాన్ అనబడుతుంది.

ఒకవేళ ఎవరైనా పాపాలలో మునిగి ఉండి, అల్లాహ్ యొక్క విధేయత, ఆరాధన విడిచిపెట్టి, మరియు ప్రశ్నిస్తే “ఈమాన్ మనస్సులో ఉంది” అని అంటే అది అతని తప్పుడు మాట సోదరులారా. వాస్తవానికి అల్లాహ్ త’ఆలా ఖురాన్ గ్రంథంలో చాలా చోట్ల తెలిపారు. ఉదాహరణకు, సూరె ఆలె ఇమ్రాన్, వాక్యము సంఖ్య 130 లో అల్లాహ్ అంటున్నారు:

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَأْكُلُوا الرِّبَا
యా అయ్యుహల్లజీన ఆమనూ లా త’కులుర్ రిబా
ఓ విశ్వసించిన ప్రజలారా, వడ్డీ తినకండి.

అదేవిధంగా, సూరె మాయిదా, వాక్యము సంఖ్య 35 లో అల్లాహ్ తెలియజేస్తున్నారు:

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ
యా అయ్యుహల్లజీన ఆమనూత్తఖుల్లాహ్
ఓ విశ్వసించిన ప్రజలారా, అల్లాహ్ తో భయపడండి.

ఈ విషయాలతో తెలుస్తున్న విషయం ఏమిటంటే, విశ్వాసం అప్పటి వరకు పూర్తి కాదు, ఎప్పటి వరకైతే దానితో పాటు సత్కార్యాలు ఆచరింపబడవో, మనిషి పాపాల నుండి దూరమవ్వడో. అల్లాహ్ త’ఆలా సూరె అస్ర్ లో చాలా చక్కగా వివరించారు:

وَالْعَصْرِ إِنَّ الْإِنْسَانَ لَفِي خُسْرٍ
వల్ అస్ర్, ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్
కాలము సాక్షిగా, మానవుడు నష్టానికి గురి అయి ఉన్నాడు.

إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَتَوَاصَوْا بِالْحَقِّ وَتَوَاصَوْا بِالصَّبْرِ
ఇల్లల్లజీన ఆమనూ వ’అమిలుస్ సాలిహాతి వ’తవాసవ్ బిల్ హఖ్ఖి వ’తవాసవ్ బిస్సబ్ర్
అంటే, కాలము సాక్షిగా మానవుడు నష్టములో ఉన్నాడు కానీ, విశ్వసించి సత్కార్యాలు చేసేవారు మరియు ఒకరికొకరు సత్యాన్ని బోధించుకునేవారు, సహనాన్ని బోధించుకునేవారు తప్ప.

దీని బట్టి తెలుస్తున్న విషయం ఏమిటంటే, ఈమాన్ అనగా హృదయంలో విశ్వసించాలి, దానితో పాటు సత్కార్యాలు కూడా చేయవలసి ఉంటుంది.

కపట విశ్వాసం మరియు దాని పర్యవసానం

ఆ తర్వాత మనకు తెలుస్తున్న విషయం ఏమిటంటే, ఒకవేళ ఎవరైనా బయటకు కనిపిస్తున్నారు ఆచరణ చేస్తున్నట్లుగా, కానీ అతని హృదయంలో విశ్వాసము లేకపోతే, ఇది కపట విశ్వాసం సోదరులారా. వారి స్థలం నరకములో అట్టడుగు అంతస్తు. అల్లాహ్ త’ఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నారు:

إِنَّ الْمُنَافِقِينَ فِي الدَّرْكِ الْأَسْفَلِ مِنَ النَّارِ
ఇన్నల్ మునాఫిఖీన ఫిద్ దర్కిల్ అస్ఫలి మినన్ నార్
నిశ్చయంగా, కపట విశ్వాసులు నరకములో అట్టడుగు స్థానములో ఉంటారు.

కాబట్టి సోదరులారా, మనం మనస్సులో విశ్వసించాలి, శరీర అవయవాలతో ఆచరించాలి. అప్పుడే విశ్వాసం పూర్తవుతుంది, అప్పుడే మన చేతులు, మన కాళ్ళు మనం విశ్వాసులమని సాక్ష్యమిస్తాయి. విశ్వాసమున్నవాడు పాపాలు చేయడు. ఒకవేళ హృదయంతో విశ్వసిస్తున్నాను అని చెప్పి, తిరిగి పాప కార్యాలు చేస్తున్నాడు అంటే అర్థం, అలాంటి వ్యక్తిలో విశ్వాసము లేనట్టు, ఒకవేళ ఉన్నా అది బలహీన విశ్వాసం అని అర్థం.

వాస్తవానికి విశ్వాసం ఉన్నవాడు పాపాలు చేయడు. కానీ, ఒకవేళ హృదయంలో విశ్వసిస్తున్నాను అని చెప్పి, తిరిగి పాపకార్యాలు చేస్తున్నాడు అంటే, అలాంటి వ్యక్తిలో విశ్వాసము లేదు, ఒకవేళ ఉన్నా అది బలహీనమైన విశ్వాసం అని అర్థము సోదరులారా.

విశ్వాసం పెరుగుతుంది మరియు తరుగుతుంది

ఈమాన్ గురించి ఇలా చెప్పటం జరిగింది:

لِأَنَّ الْإِيمَانَ يَزِيدُ بِالطَّاعَةِ وَيَنْقُصُ بِالْمَعْصِيَةِ
లి’అన్నల్ ఈమాన యజీదు బిత్తా’అతి, వ’యన్ఖుసు బిల్ మ’సియతి
విశ్వాసం అల్లాహ్ యొక్క విధేయతతో పెరుగుతుంది, అల్లాహ్ యొక్క అవిధేయతతో విశ్వాసము తగ్గుతుంది.

వాస్తవానికి విశ్వాసం యొక్క బలం మనిషి హృదయంలో ఉంటుంది సోదరులారా. విశ్వాసం యొక్క బలం మనిషి హృదయంలో ఉంటుంది. దానిని మనం ప్రజలలో చూస్తూ ఉంటాం. ఉదాహరణకు, ఒక వృద్ధుడు నమాజులో నిలబడుతున్నాడు, సుదీర్ఘంగా నమాజ్ చేస్తున్నాడు. వయస్సు మీదపడిపోయింది, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 55 సంవత్సరాలు. వృద్ధాప్యానికి చేరుకున్న తర్వాత కూడా అతనికి నిలబడి నమాజ్ ఆచరించటంలో మధురానుభూతి కలుగుతుంది. అతనికి అలసట అనిపించదు. కారణం, అతడి హృదయంలో విశ్వాసం బలంగా ఉంది. కానీ దానికి వ్యతిరేకంగా మరో యువకుడు ఉన్నాడు, అతడికి సుదీర్ఘ నమాజ్ కష్టం అనిపిస్తుంది. రెండు రకాతుల నమాజ్ కూడా అతడు ఆచరించలేడు. కారణం, అతడి విశ్వాసం బలహీనంగా ఉంది. అసలు విషయం ఏమిటంటే, విశ్వాసం యొక్క అసలైన బలం మనిషి హృదయంలో ఉంటుంది. ఎవరిలో ఎంత ఎక్కువగా విశ్వాసం ఉంటుందో, అల్లాహ్ అలాంటి వ్యక్తి శరీరానికి అంతే బలాన్ని ఇస్తారు.

కాబట్టి సోదరులారా, మనం అల్లాహ్ కు విధేయత చూపాలి, తద్వారా మన విశ్వాసం పెరుగుతుంది. మంచి కార్యాలలో, పుణ్యకార్యాలలో మనం ముందుకు వెళ్తూ ఉండాలి, తద్వారా ఇన్ షా అల్లాహ్ మన విశ్వాసం పెరుగుతుంది.

కాబట్టి ఈ రోజు మనం తెలుసుకున్న విషయం ఏమిటంటే, ఈమాన్, విశ్వాసం యొక్క సంబంధం మూడు విషయాలతో ఉంటుంది: మొదటిది, నోటితో ప్రకటించటం, నోటితో ఉచ్చరించటం. రెండవది, హృదయంలో దానిని పూర్తిగా ధృవీకరించి ఆమోదించటం. మూడవది, శరీర అవయవాలతో ఆచరించటం. ఇందులో ఏ ఒక్కటి తక్కువైపోయినా, అది విశ్వాసం పూర్తి కానట్టు లెక్క.

అల్లాహ్ త’ఆలా మనందరికీ విషయాలను తెలుసుకొని, వాటిపై ఆచరిస్తూ, వాటిని ప్రజలకు తెలియజేసే భాగ్యాన్ని ప్రసాదించు గాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు.

అస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ అమీన్, అమ్మాబాద్. సోదరులారా, హృదయ ఆచరణలు, 10వ భాగం.

మనం చేసే ఆచరణలు, హృదయ ఆచరణలు అయినా లేక శారీరక ఆచరణలు అయినా, వాటితో మనకి పుణ్యము లభించవచ్చు లేదా మనం శిక్షింపబడవచ్చు. ఉదాహరణకు, ఒక వ్యక్తి తన నోటితో ఇతరులపై పరోక్ష నింద చేస్తున్నాడు. కష్టకాలంలో, బాధలలో ప్రార్థించేటప్పుడు అల్లాహ్ ను కాకుండా లేదా అల్లాహ్ తో పాటుగా ఇతరులను మొరపెట్టుకుంటూ జీవితం గడుపుతున్నాడు. అతడు గనక తౌబా చేయకపోతే, అతడి ఆ ఆచరణ మూలంగా అతనికి కఠిన శిక్ష విధింపబడుతుంది.

అదే విధంగా, ఎవరైనా వ్యక్తి హృదయములో నిషిద్ధమైన వాంఛలు, నిషిద్ధమైన కోరికలు, హృదయములో షిర్క్ అనే మాలిన్యము కలిగి ఉండి, అల్లాహ్ పై చెడు తలంపు కలిగి ఉండి, అల్లాహ్ పై అపనమ్మకము కలిగి ఉండి మరణిస్తే, అలాంటి వారికి కూడా శిక్ష విధింపబడుతుంది.

మనం చూస్తూ ఉంటాం, సమాజంలో కొంతమంది అల్లాహ్ పై అపనమ్మకం కలిగి ఉంటారు, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా పై చెడు తలంపు కలిగి ఉంటారు. వారు ఇలా అంటూ ఉంటారు, మనం వింటూ ఉంటాం, “అల్లాహ్ నాపై కారుణ్యపు చూపు చూడటము లేదు, అల్లాహ్ నా వైపునకు చూడనే చూడటము లేదు.” ఇలాంటి మాటలు సోదరులారా. వాస్తవానికి ఇలాంటి మాటలు యూదులు పలికేవారు. యూదులు అన్నారు, “అల్లాహ్ చేతులు కట్టివేయబడ్డాయి.” వెంటనే అల్లాహ్ త’ఆలా సమాధానం ఇచ్చారు:

وَقَالَتِ الْيَهُودُ يَدُ اللَّهِ مَغْلُولَةٌ ۚ غُلَّتْ أَيْدِيهِمْ وَلُعِنُوا بِمَا قَالُوا ۘ بَلْ يَدَاهُ مَبْسُوطَتَانِ يُنْفِقُ كَيْفَ يَشَاءُ
యూదులు అన్నారు, అల్లాహ్ యొక్క చేతులు కట్టివేయబడ్డాయని. వాస్తవానికి వారి చేతులే కట్టివేయబడ్డాయి. వారు అన్న ఈ మాట మూలంగా వారిని శపించటం జరిగింది. నిజానికి అల్లాహ్ చేతులు రెండూ విశాలంగా ఉన్నాయి, తాను తలచుకున్న విధంగా అల్లాహ్ త’ఆలా ఖర్చు పెడుతున్నాడు.

హదీసె ఖుద్సీలో ఇలా వస్తుంది ప్రియులారా:

يَدُ اللَّهِ مَلْأَى
యదుల్లాహి మల్’ఆ
అల్లాహ్ యొక్క చెయ్యి నిండి ఉంది. ఆయన రాత్రింబవళ్ళు ఖర్చు పెట్టినా ఆయన ఖజానాలో ఏ మాత్రమూ లోటు రాదు.

బుఖారీ గ్రంథంలో ఒక హదీసు నకలు చేయబడుతుంది. హజ్రతే అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు హదీసు ఉల్లేఖిస్తున్నారు, “ఎప్పుడైతే అల్లాహ్ భూమి ఆకాశాలను సృష్టించారో, అప్పటి నుండి అల్లాహ్ ఖర్చు పెడుతూనే ఉన్నారు, అయినా ఆయన చేతిలో ఖజానా ఏ మాత్రం తగ్గలేదు.”

దీని ద్వారా మనకు తెలుస్తున్న విషయం ఏమిటంటే, అల్లాహ్ యొక్క చెయ్యి నిండి ఉన్నది, ఖజానాలు నిండి ఉన్నాయి. ఎవరున్నారు ఆ ఖజానాలు అల్లాహ్ వద్ద నుండి అడిగేవారు? వాటిని అల్లాహ్ వద్ద నుండి పొండేవారు? అలాంటివాడే పొందగలడు, ఎవడైతే అల్లాహ్ పై మంచి నమ్మకం కలిగి ఉన్నాడో, అల్లాహ్ పై భరోసా కలిగి ఉన్నాడో.

నమ్మకం – హృదయ ఆచరణ

వాస్తవానికి సోదరులారా, అల్లాహ్ పై నమ్మకం, అల్లాహ్ పై నమ్మకం అనేది హృదయ ఆచరణకు సంబంధించిన విషయం. కాబట్టి మనం ఎల్లవేళలా అల్లాహ్ పై సకారాత్మక నమ్మకం కలిగి ఉండాలి, కారుణ్యపు ఆశాభావము కలిగి ఉండాలి, క్షమాభిక్ష యొక్క ఆశ కలిగి ఉండాలి, స్వర్గం యొక్క ఆశ కలిగి ఉండాలి. ఇదే విషయాన్ని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన మరణానికి మూడు రోజుల ముందు తెలియజేశారు: “విశ్వాసి అల్లాహ్ పై మంచి నమ్మకము, ఆశ కలిగి ఉన్న స్థితిలోనే మరణించాలి.” అలాంటి ఆశ కలిగి ఉండాలి, అల్లాహ్ తనకు క్షమాభిక్ష ప్రసాదిస్తాడన్న నమ్మకము కలిగి ఉండాలి.

హృదయాచరణ – ఆరాధనకు ఆత్మ

ఇమామ్ ఇబ్నె ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ ఇలా తెలియజేస్తున్నారు:

عَمَلُ الْقَلْبِ هُوَ رُوحُ الْعُبُودِيَّةِ وَلُبُّهَا
అమలుల్ ఖల్బి హువ రూహుల్ ఉబూదియ్యతి వ లుబ్బుహా
హృదయ ఆచరణలు దాస్యము మరియు ఆరాధన యొక్క ప్రధానమైన విషయాలు, ప్రధానమైన భాగాలు.

హృదయ ఆచరణ, హృదయంతో చేసే ఆచరణ, దాస్యం యొక్క మరియు ఆరాధన యొక్క ప్రధానమైన విషయం ప్రియులారా. మనం శరీర అవయవాలతో ఎన్ని ఆచరణలు చేసినా, అందులో హృదయ ఆచరణల భాగస్వామ్యం లేకపోతే అవి వ్యర్థము. అలాంటి దేహం ఒక మృతదేహం, అందులో ఎలాంటి ప్రాణము లేదు. కాబట్టి, నియత్ అనే హృదయ ఆచరణే అసలైన విషయం. మనం ఏ ఆచరణ చేసినా, దాని సంకల్పం యొక్క స్థానం మాత్రం హృదయమే. మనం హృదయంలో సంకల్పం చేసుకుంటాం. కాబట్టి, మన హృదయాలలో మంచి సంకల్పం ఉండాలి, అప్పుడు అలాంటి ఆచరణలే అల్లాహ్ త’ఆలా వద్ద స్వీకరింపబడతాయి. కాబట్టి దీని కోసం మనం ప్రయత్నము చేస్తూ ఉండాలి.

హృదయ ఆచరణలు మరియు శారీరక ఆచరణల మధ్య ఒక సంబంధం

ఆ తర్వాత సోదరులారా, హృదయ ఆచరణలు మరియు శారీరక ఆచరణలు, ఈ రెండింటి మధ్య ఒక సంబంధం ఉంది. అవి రెండూ పరస్పరం కలిసి నడుస్తూ ఉంటాయి. కాబట్టి చెప్పడం జరుగుతుంది:

فَمَرْكَبُ الْإِيمَانِ الْقَلْبُ وَمَرْكَبُ الْإِسْلَامِ الْجَوَارِحُ
ఫ మర్కబుల్ ఈమాని అల్ ఖల్బ్, వ మర్కబుల్ ఇస్లామి అల్ జవారిహ్
విశ్వాసం యొక్క వాహనం హృదయం అయితే, ఇస్లాం యొక్క వాహనం చేతులు, కాళ్ళు, ఇతర అవయవాలు.

ఈమాన్ యొక్క వాహనం హృదయము, ఇస్లాం యొక్క వాహనం చేతులు, కాళ్ళు, ఇతర అవయవాలు. కాబట్టి ఇదే విషయంపై, ఈ హృదయంలో నమ్మకం, హృదయంలో విశ్వాసం అన్న హృదయ ఆచరణ ఆధారంగా మనం మోమిన్ మరియు మునాఫిక్ ని తేడా చూపగలం. హృదయ ఆచరణల మూలంగానే ఒక విశ్వాసి మరియు కపట విశ్వాసి యొక్క మధ్యలో వ్యత్యాసము కనిపిస్తుంది. ఎందుకంటే కపటి విశ్వాసి కూడా విశ్వాసుల వరుసలలో దూరిపోతాడు, వారితో కలిసి కూర్చుంటాడు, వారితో కలిసి నించోటం చేస్తాడు. కానీ ఇద్దరి మధ్య వ్యత్యాసం కేవలం హృదయ ఆచరణ. కపట విశ్వాసి శరీరంతోనైతే ఆచరణ చేస్తాడు, కానీ వాడి హృదయంలో అల్లాహ్ పై ఉండాల్సిన విధంగా నమ్మకం, అల్లాహ్ పై ఉండాల్సిన విధంగా ఆశ వాడి మనసులో ఉండవు. కానీ విశ్వాసి తన దేహంతో ఆచరిస్తాడు, అదే సమయంలో హృదయంలో కూడా అల్లాహ్ పై అచంచల నమ్మకాన్ని కలిగి ఉంటాడు.

అల్లాహ్ త’ఆలా మనందరికీ దేహాలతో ఆచరణ చేస్తూ, హృదయములో కూడా అల్లాహ్ త’ఆలా పై అచంచలమైన విశ్వాసము, అల్లాహ్ పై ప్రేమ, అల్లాహ్ పై దృఢ నమ్మకము, అల్లాహ్ త’ఆలా పై కారుణ్యపు, అల్లాహ్ కారుణ్యము కురిపిస్తాడన్న ఆశ కలిగి ఉండే జీవితాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు.

అస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు. హృదయ ఆచరణలు, 11వ భాగం.

హృదయ ఆచరణల ప్రాముఖ్యత

హృదయ ఆచరణల ప్రాముఖ్యత ఏమిటి? హృదయ ఆచరణలు నరక విముక్తికి మార్గాలు మరియు స్వర్గాన్ని పొందే అత్యుత్తమ కారకాలు. ఉదాహరణకు, తౌహీద్, అల్లాహ్ యొక్క ఏకత్వం, పూర్తి ఇస్లాం ధర్మం దాని మీదనే నిలబడి ఉన్నది. ఇంకా అనేక రకాల హృదయ ఆచరణలు ఉన్నాయి. వాటిలో మన కొరకు అనేక లాభాలు ఉన్నాయి. ఉదాహరణకు, తోటి ముస్లిం సోదరుని గురించి మన హృదయం నిర్మలంగా ఉండటం, మన హృదయాలలో ఇతర ముస్లిం సోదరుల గురించి చెడు ఆలోచనలు ఉండకపోవటం.

స్వర్గ శుభవార్త పొందిన సహాబీ

దీనికి సంబంధించి ఒక హదీసును గనక మనం పరిశీలించినట్లయితే, హజ్రతే అనస్ రదియల్లాహు త’ఆలా అన్హు వారి ఉల్లేఖనం, ముస్నద్ అహ్మద్ గ్రంథంలో నకలు చేయబడినది. ఆ హదీసును ఇన్ షా అల్లాహ్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

హజ్రతే అనస్ రదియల్లాహు త’ఆలా అన్హు ఇలా తెలియజేస్తున్నారు, ఒకసారి మేము దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో కలిసి సమావేశంలో కూర్చున్నాం. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు, “ఇప్పుడు మీ ముందుకు ఒక స్వర్గవాసి రానున్నాడు.” కాసేపటికి ఒక అన్సారీ సహాబీ సమావేశానికి విచ్చేశారు. మరుసటి రోజు కూడా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అదే విషయాన్ని మరలా చెప్పారు, “ఇప్పుడు మీ ముందుకు ఒక స్వర్గవాసి రాబోతున్నాడు.” ఆ రోజు కూడా అదే అన్సారీ సహాబీ విచ్చేశారు. మరియు మూడవ రోజు కూడా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలాగే చెప్పారు. మూడవ రోజు కూడా అదే అన్సారీ సహాబీ అక్కడికి విచ్చేయటం జరిగింది.

సమావేశం ముగిసిన అనంతరం హజ్రతే అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ రదియల్లాహు త’ఆలా అన్హు వారు ఆ అన్సారీ సహాబీని అనుసరించారు మరియు ఆ అన్సారీ సహాబీతో ఇలా విన్నవించుకున్నారు, “నాకు మీ వద్ద మూడు రాత్రులు ఉండేందుకు అనుమతి ఇవ్వండి.” ఆ అన్సారీ సహాబీ సంతోషంతో అనుమతి ఇచ్చారు. మూడు రాత్రుల అనంతరం హజ్రతే అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ రదియల్లాహు త’ఆలా అన్హు ఆ వ్యక్తితో అన్నారు, “ఓ దైవదాసుడా, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నోటి వెంట మూడు సార్లు మీ గురించి ఇలా చెప్పగా విన్నాను.” ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, “ఇప్పుడు మీ ముందుకు ఒక స్వర్గవాసి రాబోతున్నాడు.” మూడు సార్లు కూడా మీరే వచ్చారు. కాబట్టి నేను మీ వద్ద మూడు రాత్రులు ఉందామని నిశ్చయించుకున్నాను, తద్వారా మీరు ఆచరిస్తున్న ఆ సత్కార్యాలను ఏమిటో చూద్దాం అనుకున్నాను. దాన్ని నేను కూడా పాటిద్దాం అనుకున్నాను. కానీ అలాంటి గొప్ప ఆచరణ మీరు చేస్తున్నట్లు నేను పొందలేదు. కాబట్టి ఇక మీరే తెలియజేయండి, అలాంటి ఏ సత్కార్యం మీరు చేయటం వలన మీరు అంత ఉన్నత స్థాయికి చేరుకున్నారు, దాని ఫలితంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీకు స్వర్గం యొక్క శుభవార్త ఇచ్చారు.

అప్పుడు ఆ స్వర్గ శుభవార్త పొందిన అన్సారీ సహాబీ ఇలా సమాధానం పలికారు, “నేను ఆ కార్యాలే చేస్తుంటాను, దేన్నైతే మీరు మూడు రోజుల పాటు చూశారో. కానీ నేను ఒక ఆచరణ అయితే ఖచ్చితంగా చేస్తాను. నేను ఏ ముస్లిం సోదరుని కోసం కూడా నా హృదయంలో క్రోధాన్ని, కల్మషాన్ని ఉంచను. నా హృదయం ప్రతి ముస్లిం సోదరుని విషయంలో చాలా నిర్మలంగా ఉంటుంది, ఎలాంటి కల్మషం లేకుండా ఉంటుంది. ఒకవేళ ఏ దాసునికైనా అల్లాహ్ ప్రత్యేక అనుగ్రహాన్ని గనక ఇస్తే, నేను ఆ అనుగ్రహం పట్ల ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆ వ్యక్తితో అసూయ చెందను.”

ఇది ఆ హదీసు యొక్క సారాంశం సోదరులారా, ముస్నద్ అహ్మద్ గ్రంథంలో హదీసు నకలు చేయబడింది. ఈ హదీసు యొక్క ప్రామాణికత గురించి విద్వాంసుల మధ్యలో అనేక రకాల భేదాభిప్రాయాలు ఉన్నాయి. అల్బానీ రహిమహుల్లాహ్ ఈ హదీసును జయీఫ్ గా ఖరారు చేశారు. ఇబ్నె కసీర్ రహిమహుల్లాహ్ ఈ హదీసును సహీగా చెప్పినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి.

కల్మషం లేని హృదయం

ఏది ఏమైనప్పటికీ సోదరులారా, షరియత్ లో, ఇస్లామీయ ధర్మశాస్త్రంలో, ఇస్లామీయ జీవన విధానంలో మనకు తెలుస్తున్న విషయం ఏమిటంటే, వేరే హదీసుల ద్వారా కూడా ప్రతి ముస్లిం సోదరుడు ఇతర ముస్లిం సోదరుని పట్ల తన మనస్సులో కల్మషాన్ని, వైరాన్ని, క్రోధాన్ని ఉంచుకోకూడదు. తద్ఫలితంగా అది మన యొక్క ఆచరణలను నష్టపరుస్తుంది.

మనం ఈ రోజు సమాజంలో చూస్తూ ఉంటాం సోదరులారా, అనేక మంది ఉంటారు, వారు పెద్ద పెద్ద పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు, కానీ వారికి హృదయ ఆచరణలపై ఎలాంటి పట్టు ఉండదు. వారు ఇలా అంటూ ఉంటారు, “నేను ఇంటి నుండి బయటకు వెళ్ళాను, ఫలానా వ్యక్తికి సలాం చెప్పాను, కానీ ఆ వ్యక్తి నిలబడలేదు, పరిగెత్తుకుంటూ నా వద్దకు రాలేదు.” ఈ విధంగా ఇతరుల గురించి చెడుగా చెబుతుంటారు, పరోక్ష నిందలు చేస్తుంటారు, రకరకాల నిందలు వేస్తుంటారు. చాలామంది ఇతరులపై రకరకాల కోపతాపాలు, క్రోధాలు, కల్మషాలు కలిగి ఉంటారు. ఇవన్నీ, హృదయ ఆచరణలు గనక మనం సక్రమంగా ఉంచుకోకపోతే, మనం చేసే శారీరక ఆచరణల వల్ల ప్రయోజనము లేకుండా, ఈ హృదయ ఆచరణలు మనం ఏదైతే నష్టపోయే కార్యాలు చేస్తున్నామో, దాని వలన మనకి నష్టము కలుగుతుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ, మనం శారీరక ఆచరణలు చేస్తూ, హృదయ ఆచరణలు కూడా చేసినప్పుడే దానివల్ల మనకి లాభము కలుగుతుంది. హృదయ ఆచరణ అత్యంత ముఖ్యమైనది. కాబట్టి మనం మంచి ఆచరణ చేయటానికి ప్రయత్నించాలి, మన హృదయాలను సంస్కరించుకోవటానికి ప్రయత్నించాలి. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరికీ చెప్పటం, వినటం కంటే ఎక్కువగా ఆచరణ చేసే భాగ్యాన్ని ప్రసాదించు గాక.

నాలుక మరియు హృదయం

వేరే మాట తిరిగి మీ ముందు చెప్పి ఈ యొక్క విషయాన్ని నేను ముగిస్తాను సోదరులారా. ఇంతకుముందు కూడా మనం హజ్రతే లుఖ్మాన్ అలైహిస్సలాతు వస్సలాం గురించి తెలుసుకున్నాం.

హజ్రతే లుఖ్మాన్ అలైహిస్సలాం యజమాని ఎప్పుడైతే లుఖ్మాన్ అలైహిస్సలాం వారికి మేక కోసి అత్యుత్తమ అవయవాలు తీసుకురమ్మన్నారో, అప్పుడు హజ్రతే లుఖ్మాన్ అలైహిస్సలాం మేక యొక్క నాలుక, హృదయాన్ని తీసుకువెళ్లారు. ఆ తర్వాత అత్యంత చెడ్డ అవయవాలు తీసుకురమ్మన్నప్పుడు కూడా హజ్రతే లుఖ్మాన్ అలైహిస్సలాం మేకను కోసి దాని యొక్క నాలుకను, హృదయాన్ని తీసుకువెళ్లారు. కాబట్టి ఆయన సమాధానం ఇచ్చారు, “ఏంటి, మంచివి తెమ్మన్నా నాలుక, హృదయాన్ని తీసుకువచ్చావు, చెడువి తెమ్మన్నా నాలుక, హృదయాన్ని తీసుకువచ్చావు.” హజ్రతే లుఖ్మాన్ అలైహిస్సలాం చాలా మంచి సమాధానం ఇచ్చారు. “ఎప్పటివరకైతే ఈ ప్రపంచంలో నాలుక మరియు హృదయము బాగుంటాయో, వాటికంటే మంచిది ప్రపంచంలో మరొకటి ఉండదు. ఎప్పుడైతే నాలుక, హృదయము పాడైపోతాయో, వాటికంటే చెడ్డవి ప్రపంచంలో మరొకటి ఉండవు.”

కాబట్టి సోదరులారా, ఈ నాలుక, హృదయం ఇవి హృదయ ఆచరణలకు సంబంధించిన విషయాలు. వీటిని మనం చక్కగా ఉపయోగించుకోవాలి తద్వారా ఇహపరలోకాలలో సాఫల్యం పొందటానికి ప్రయత్నం చేయాలి. నాలుక ద్వారా మంచి మాట్లాడాలి, ఇతరుల గురించి మంచిగా ప్రస్తావించాలి, హృదయంలో ముస్లిం సోదరుని గురించి ప్రేమను కలిగి ఉండాలి. ఈ అన్ని విషయాలు మనకి లాభదాయకమైన విషయాలు.

అల్లాహ్ త’ఆలా మనందరికీ ఆచరించే సద్భాగ్యాన్ని ప్రసాదించు గాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు.

السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ. الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى رَسُولِهِ الْأَمِينِ أَمَّا بَعْدُ
అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ అమీన్ అమ్మాబాద్.

హృదయ ఆచరణలు పన్నెండవ భాగంలో మనము తెలుసుకోబోయే విషయము అల్లాహ్ కోసం మాత్రమే ఇతరులను ప్రేమించటం.

ప్రియులారా, హృదయ ఆచరణలు ఏదైతే అంశాన్ని మనం వింటూ ఉన్నామో ఇది చాలా ప్రాధాన్యత కలిగిన అంశము మరియు అత్యంత ఆవశ్యకమైన అంశం. ఎందుకంటే స్వర్గంలో ఉన్నత స్థానాలను అధిరోహించటానికి హృదయ ఆచరణ ఒక ముఖ్యమైన కారకం, స్వర్గం. దాని గురించి ఇలా చెప్పటం జరిగింది, మీరు అర్ధిస్తే జన్నతుల్ ఫిర్దౌస్‌ను అర్ధించండి.

అనేకమంది సహాబాలు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సాహచర్యాన్ని స్వర్గంలో పొందాలని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో కలిసి స్వర్గంలో ఉండాలని కోరుకునేవారు. మరి స్వర్గంలో ఉన్నత స్థానాలను అధిరోహించటానికి హృదయ ఆచరణ ఒక ముఖ్యమైన కారకం. మరి అందులో నుండి మరొక ముఖ్యమైన ఆచరణ అల్లాహ్ కోసం మాత్రమే ఇతరులను ప్రేమించటం.

మనిషి కేవలం అల్లాహ్ కోసం మాత్రమే ఇతరులను ప్రేమించటం అనేది చాలా గొప్ప విషయం సోదరులారా. సాధారణంగా ప్రజలు తమ అవసరాల కోసం ప్రజలతో సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఈ రోజులలో ప్రజలు ఇతరుల గురించి చాలా తక్కువగా ఆలోచిస్తారు, చాలా తక్కువగా ఇతరుల బాగోగుల గురించి యోగక్షేమాల గురించి తెలుసుకుంటారు. కానీ ఇలాంటి కాలంలో ప్రస్తుత క్లిష్టతర పరిస్థితులలో ఎవరైనా ఒక వ్యక్తి అల్లాహ్ యొక్క దాసులను కేవలం అల్లాహ్ కోసం మాత్రమే ప్రేమిస్తే అలాంటి వ్యక్తికి స్వర్గంలో ఇన్షా అల్లాహ్ ఉన్నత స్థానం లభిస్తుంది ప్రియులారా.

తబ్రానీ గ్రంథంలో ఉల్లేఖించబడిన ఒక సహీ హదీసు ప్రకారం హజరతే ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు హదీసు ఉల్లేఖిస్తున్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు సోదరులారా. ప్రళయ దినాన కొంతమంది అల్లాహ్‌తో కలిసి కూర్చుంటారు. హదీసులో చెప్పబడింది,

إِنَّ لِلَّهِ جُلَسَاءَ
ఇన్న లిల్లాహి జులసా
కొంతమంది అల్లాహ్‌తో కలిసి కూర్చుంటారు.

మరియు ఆ సమావేశం గురించి చెప్పబడింది:

عَنْ يَمِينِ الْعَرْشِ
అన్ యమీనిల్ అర్ష్
అర్ష్ యొక్క కుడివైపున వారు కూర్చుంటారు. అంటే అల్లాహ్ యొక్క కుడివైపున వారు కూర్చుంటారు.

وَكِلْتَا يَدَيِ اللَّهِ يَمِينٌ
వ కిల్తా యదైల్లాహి యమీనున్
మరియు అల్లాహ్ యొక్క రెండు చేతులు కుడి చేతులే.

ఇక్కడ చెప్పడం జరుగుతుంది అల్లాహ్ యొక్క రెండు చేతులు కుడి చేతులే. దీన్ని బట్టి మనకి తెలుస్తున్న విషయం ఏమిటంటే అల్లాహ్‌కు చేతులు ఉన్నాయి. మరి ఆ చేతులను గురించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఆ రెండు చేతులు కుడి చేతులు.

ఇక్కడ మనము అల్లాహ్ యొక్క చేతులకు సంబంధించి షేఖ్ సాలెహ్ అల్ ఉసైమీన్ రహమహుల్లాహ్ వారు తెలియజేసిన విషయాలను తెలుసుకుందాం. ఎప్పుడైతే అల్లాహ్ యొక్క రెండు చేతులు కుడి చేతులు అన్న విషయాన్ని మనం వింటామో, వాస్తవానికి కొన్ని హదీసులలో ఎడమ చేతి ప్రస్తావన కూడా ఉంది. ఈ హదీసులో దైవ ప్రవక్త వారి మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలి, అల్లాహ్ యొక్క రెండు చేతులు కుడి చేతులు అన్న విషయాన్ని? అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన దాని ఉద్దేశం ఏమిటంటే అల్లాహ్ యొక్క రెండు చేతులు మంచిలో, శుభాలలో, మంచిలో మరియు శుభాలలో పూర్తిగా సరిసమానమైనవే. ఎవరూ దానిని ఇలా అర్థం చేసుకోకూడదు ఎలాగైతే మనిషి చేతులు ఉంటాయో ఆ విధంగా ఎవరూ కూడా అల్లాహ్ యొక్క చేతులను పోల్చకూడదు. అల్లాహ్ మనల్ని రక్షించు గాక. ఆ తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎడమ చేతితో ఇవ్వటాన్ని వారించారు, ఎడమ చేతితో పుచ్చుకోవటాన్ని వారించారు, ఎడమ చేతితో భోజనం చేయటం నుండి వారించారు, నీళ్లు త్రాగటాన్ని వారించారు. కానీ మనము అల్లాహ్ యొక్క చేతులను ఈ విధంగా మనం ఎంత మాత్రమూ ఊహించకూడదు. వాస్తవానికి అల్లాహ్ యొక్క రెండు చేతులు మేలులో, మంచిలో, సరిసమానమైనవే అన్న విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేయటం జరిగింది. ఎలాగైతే హదీసులో మనము విన్నామో. ఆ తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులో ఇలా తెలియజేస్తున్నారు:

وَكِلْتَا يَدَيِ اللَّهِ يَمِينٌ عَلَىٰ مَنَابِرِهِمْ مِنْ نُورٍ
వ కిల్తా యదైల్లాహి యమీనున్ అలా మనాబిరిహిమ్ మిన్ నూర్
అల్లాహ్ ఎవరినైతే తనతో కూర్చోబెడతారో వారు కాంతిలీనుతున్న మింబర్లపై కూర్చుంటారు.

وُجُوهُهُمْ مِنْ نُورٍ
వుజూహుహుమ్ మిన్ నూర్
వారి ముఖాలు కాంతిలీనుతూ ఉంటాయి.

لَيْسُوا بِأَنْبِيَاءَ وَلَا شُهَدَاءَ وَلَا صِدِّيقِينَ
లైసూ బి అంబియా వలా షుహదా వలా సిద్దీఖీన్
ఎవరైతే కాంతిలీనుతున్న మింబర్లపై కూర్చుంటారో, ఎవరి ముఖాలైతే దగదగా మెరిసిపోతూ ఉంటాయో, వారు ప్రవక్తలు కాదు, షహీదులు కాదు, సిద్దీఖులు కారు.

మరి ఎందుకు వారికి అలాంటి ఘనత దక్కింది? అడగటం జరిగింది,

قِيلَ يَا رَسُولَ اللَّهِ مَنْ هُمْ؟
ఖీల యా రసూలల్లాహి మన్ హుమ్?
అడగబడింది, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, వారు ఎవరు?

ప్రవక్త వారు సమాధానం ఇచ్చారు,

هُمُ الْمُتَحَابُّونَ بِجَلَالِ اللَّهِ تَبَارَكَ وَتَعَالَى
హుముల్ ముతహాబ్బూన బి జలాలిల్లాహి తబారక వ త’ఆలా
వారు అల్లాహ్ యొక్క ఘనత కోసం, అల్లాహ్ యొక్క గొప్పతనం కోసం, కేవలం అల్లాహ్ కోసం ఒండొకరిని ప్రేమించేవారు, అల్లాహ్ కోసం ఇతరులను ప్రేమించేవారు.

ఎవరైతే అల్లాహ్‌కు విధేయత చూపుతారో, అల్లాహ్‌కు దాస్యం చేస్తారో అలాంటి వారిని వీరు ప్రేమిస్తారు. ఏ ముస్లింనైనా వారు కేవలం అల్లాహ్ యొక్క ప్రసన్నత కోసం వారు ప్రేమిస్తారు. అది తప్ప వేరే ఎలాంటి ఉద్దేశము వారికి ఉండదు. ఇలాంటి వారినే అల్లాహ్ తన అర్ష్ యొక్క కుడివైపున కూర్చోబెడతాడు. దీన్ని బట్టి తెలుస్తున్న విషయం ఏమిటంటే మనం అల్లాహ్ కోసం ఇతరులను ప్రేమించాలి. ఎవరైతే అల్లాహ్ కోసం ఇతరులను ప్రేమిస్తారో అలాంటి వారికి అల్లాహ్ త’ఆలా గొప్ప సన్మానాన్ని ఇస్తాడు.

కాబట్టి ఈ హదీసు ద్వారా మనకు తెలిసిన విషయము కొంతమంది అల్లాహ్‌తో పాటు అల్లాహ్ యొక్క అర్ష్ యొక్క కుడివైపున వారు కూర్చుంటారు. వారి ముఖాలు దగదగా మెరిసిపోతుంటాయి. అల్లాహ్ యొక్క రెండు చేతుల ప్రస్తావన ఉంది. ఆ తర్వాత ఎవరైతే ఆ ప్రళయ దినాన కూర్చుంటారో వారు అల్లాహ్ యొక్క అర్ష్ కు కుడివైపున మింబర్లపై కూర్చుంటారని, వారి ముఖాలు దగదగా మెరిసిపోతాయని చెప్పబడింది. అయినప్పటికీ వారు ప్రవక్తలు కానీవారు, షహీదులు కానీవారు, సిద్దీఖులు కానీవారు కానీ ప్రవక్తతో అడిగారు మరి ఎవరు ప్రవక్త? “హుముల్ ముతహాబ్బూన్ బి జలాలిల్లాహి తబారక వ త’ఆలా“, వారు అల్లాహ్ కోసం ఇతరులను ప్రేమించేవారు అన్న విషయం మనకు తెలుస్తుంది.

ఆ తర్వాత ఇదే విధంగా హృదయ ఆచరణలలో ఇతర నైతిక ఉత్తమ నైతిక కార్యాలు కూడా ఉన్నాయి. ఒకటి అల్ హయా అనగా సిగ్గు బిడియం మనిషి బిడియాన్ని కలిగి ఉండటం. అదే విధంగా రధా, అల్లాహ్‌ను ఇష్టపెట్టే ప్రయత్నము చేయటం. వస్సబ్ర్ ఓర్పు సహనాన్ని కలిగి ఉండటం. ఇవన్నీ హృదయ ఆచరణలకు సంబంధించిన విషయాలు.

అదే విధంగా హజరతే అబూ దర్దా రదియల్లాహు త’ఆలా అన్హు వారి ఉల్లేఖనం ప్రకారం వేరే హృదయ ఆచరణ, ఉత్తమ హృదయ ఆచరణ ప్రళయ దినాన మనిషికి గౌరవాన్ని తీసుకువచ్చే ఆరాధన ప్రవక్త వారు అన్నారు,

مَا مِنْ شَيْءٍ أَثْقَلُ فِي مِيزَانِ الْمُؤْمِنِ يَوْمَ الْقِيَامَةِ مِنْ حُسْنِ الْخُلُقِ
మా మిన్ షైయిన్ అస్ఖలు ఫిల్ మీజానిల్ ము’మిని యౌమల్ ఖియామతి మిన్ హుస్నిల్ ఖులుఖి

ప్రవక్త వారు అన్నారు ఏమన్నారు, “మా మిన్ షైయిన్”, ఆ ప్రళయ దినాన ఏ వస్తువు ఉండదు, “అస్ఖలు ఫిల్ మీజానిల్ ము’మిన్” అంటే ఆ విశ్వాసి యొక్క ఆ త్రాసులో ఏ వస్తువు వేరేది బరువైనది ఉండదు, “యౌమల్ ఖియామతి యౌమల్ ఖియామతి” ప్రళయ దినాన దేనికంటే “మిన్ హుస్నిల్ ఖులుఖ్”, ఉత్తమ నడవడిక కంటే వేరే మంచి వస్తువు ఏదీ ఉండదు.

కాబట్టి ప్రియులారా ఈ హదీసులో మనకి తెలిసిన విషయము, ప్రళయ దినాన విశ్వాసి యొక్క త్రాసులో అన్నింటి కంటే బరువైన వస్తువు అతని ఉత్తమ నైతికత. కాబట్టి సోదరులారా మనిషి ప్రజలతో మంచిగా ప్రవర్తించాలి, ప్రజలను అల్లాహ్ కోసం ప్రేమించాలి, కష్టకాలంలో మనిషి ఓర్పు సహనాన్ని కలిగి ఉండాలి, మనిషిలో సిగ్గు బిడియం కూడా ఉండాలి, అల్లాహ్‌ను మనం ఇష్టపెట్టే కార్యాలు చేయాలి. వీటన్నింటి ద్వారా మనకి ప్రళయ దినాన అల్లాహ్ వద్ద గొప్ప గౌరవం లభిస్తుంది ప్రియులారా. ఇక చిట్టచివరిగా ఈ రోజుల్లో మనం మంచి ప్రవర్తన ప్రజల పట్ల కలిగి ఉందాం. ప్రజలకు ఈ కష్టకాలంలో ప్రజల యొక్క కష్ట నష్టాలలో వారితో మనం పాలుపంచుకోవాలి, వారికి సహాయపడాలి. ఎవరైతే ప్రజల కష్టాలు తీర్చటంలో వారికి తోడుగా ఉంటారో అలాంటి వారి కష్టాలను అల్లాహ్ త’ఆలా ప్రళయ దినాన వారి కష్టాలను అల్లాహ్ దూరము చేస్తాడు.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ కేవలం అల్లాహ్ కోసం ఇతరులను ప్రేమించే సద్భాగ్యాన్ని ప్రసాదించు గాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్.

وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ
వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్:
హృదయ ఆచరణలు (12 భాగాలు) – షేఖ్ షరీఫ్ మదనీ [ఆడియో & టెక్స్ట్]
https://teluguislam.net/2023/09/03/actions-of-the-heart/

షేఖ్ షరీఫ్, మదీనా గ్రాడ్యుయేట్ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0AKZXyDn6KYNFu5ok4ZFtb

హృదయ రోగాల చికిత్స – హబీబుర్రహ్మాన్ జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

హృదయ రోగాల చికిత్స
https://youtu.be/g7cxTBS8jHo [25 నిముషాలు]
వక్త: హబీబుర్రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగం “హృదయ రోగాల చికిత్స” అనే అంశంపై సాగుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన హదీసు ప్రకారం, శరీరంలో హృదయం (ఖల్బ్) యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, అది బాగుంటేనే శరీరమంతా బాగుంటుందని, అది చెడిపోతే శరీరమంతా చెడిపోతుందని వివరించారు. ఖురాన్ ప్రకారం ప్రవక్త ఆగమన ఉద్దేశ్యం ప్రజల ఆత్మలను పరిశుద్ధం చేయడమేనని తెలిపారు. హృదయానికి సోకే ఐదు ప్రధాన వ్యాధులైన 1. షిర్క్ (బహుదైవారాధన), 2. కపటత్వం (నిఫాఖ్), 3. రియా (ప్రదర్శనా బుద్ధి), 4. అతిగా అనుమానించడం (జన్), 5. అసూయ (హసద్) గురించి సవివరంగా చర్చించారు. చివరగా, హృదయ శుద్ధి కోసం 7 మార్గాలను (అల్లాహ్ పై పరిపూర్ణ ప్రేమ, చిత్తశుద్ధి, ప్రవక్త అనుసరణ, దైవధ్యానం/భయం, దానధర్మాలు, రాత్రి పూట నమాజు, దుఆ) సూచించారు.

అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్, అమ్మా బాద్.

అభిమాన సోదరులారా! మీకందరికీ నా ఇస్లామీయ అభివాదం “అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు”.

ఈ రోజు మనం “హృదయ రోగాల చికిత్స” అనే అంశం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ అంశంలో ముఖ్యమైన మూడు విషయాలు తెలుసుకుందాం.

మొదటి విషయం ఏమిటంటే హృదయం గురించి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక విషయం చెప్పారు. బుఖారీలో హదీసు ఉంది, అది సుదీర్ఘమైన హదీసు. ఆ హదీసులోని చివరి భాగం ఏమిటంటే:

أَلَا وَإِنَّ فِي الْجَسَدِ مُضْغَةً إِذَا صَلَحَتْ صَلَحَ الْجَسَدُ كُلُّهُ، وَإِذَا فَسَدَتْ فَسَدَ الْجَسَدُ كُلُّهُ، أَلَا وَهِيَ الْقَلْبُ
[అలా వ ఇన్న ఫిల్ జసది ముజ్ గతన్ ఇజా సలహత్ సలహల్ జసదు కుల్గుహు, వఇజా ఫసదత్ ఫసదల్ జసదు కుల్గుహు, అలా వహియల్ ఖల్బ్]

“వినండి! నిశ్చయంగా దేహంలో ఒక మాంసపు ముక్క ఉంది. ఆ ఒక్క ముక్క క్షేమంగా ఉంటే పూర్తి దేహం, పూర్తి శరీరం క్షేమంగా ఉంటుంది. అదే గనక, ఆ ఒక్క ముక్క గనక పాడైపోతే సంపూర్ణ దేహం పాడైపోతుంది. వినండి! అదే హృదయం (ఖల్బ్).”

అంటే హృదయ పరిశుభ్రత, పరిశుద్ధత చాలా అవసరము. హృదయం పాడైపోతే పూర్తి శరీరం పాడైపోతుంది అన్నమాట. కావున శరీరంలోని హృదయానికి ముఖ్యమైన స్థలం ఉంది.

అలాగే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సూర జుమాలో ఇలా తెలియజేశాడు:

هُوَ الَّذِي بَعَثَ فِي الْأُمِّيِّينَ رَسُولًا مِّنْهُمْ يَتْلُو عَلَيْهِمْ آيَاتِهِ وَيُزَكِّيهِمْ وَيُعَلِّمُهُمُ الْكِتَابَ وَالْحِكْمَةَ وَإِن كَانُوا مِن قَبْلُ لَفِي ضَلَالٍ مُّبِينٍ

ఆయనే నిరక్షరాస్యులైన జనులలో – స్వయంగా వారిలోనుంచే ఒక ప్రవక్తను ప్రభవింపజేశాడు. అతడు వారికి అల్లాహ్ వాక్యాలను చదివి వినిపిస్తున్నాడు. వారిని పరిశుద్ధపరుస్తున్నాడు, వారికి గ్రంథాన్నీ, వివేకాన్ని బోధిస్తున్నాడు. అంతకు ముందు వారు స్పష్టమైన మార్గవిహీనతకు లోనైఉండేవారు. (62:2)

ఆయనే అంటే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నిరక్షరాస్యులైన జనులలో స్వయంగా వారిలోనే, వారిలో నుంచే ఒక ప్రవక్తను ప్రభవింపజేశాడు. ఆ ప్రవక్త చేసే పని ఏమిటి? అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నిరక్షరాస్యులలోనే ఒక ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త పని ఏమిటి? పంపడానికి గల ఉద్దేశ్యం ఏమిటి? ఆయన వారికి అల్లాహ్ వాక్యాలను చదివి వినిపిస్తున్నాడు. అంటే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మన కోసము మనలోనే ఒక ప్రవక్తను పంపాడు. ఆ ప్రవక్త ఖురాన్ వాక్యాలను, అల్లాహ్ వచనాలను, అల్లాహ్ వాక్యాలను చదివి వినిపిస్తున్నాడు. ఎందుకు? దాని ద్వారా వారిని పరిశుద్ధపరుస్తున్నాడు. వారికి గ్రంథాన్ని, వివేకాన్ని బోధిస్తున్నాడు. అంతకు ముందు వారు స్పష్టమైన మార్గ విహీనతకు లోనై ఉండేవారు.

ఈ వాక్యంలో అనేక విషయాలు ఉన్నాయి. ఒక్క మాట ఏమిటంటే, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ ఆయతుల ద్వారా వారిని పరిశుద్ధపరుస్తున్నాడు. ఇక్కడ పరిశుద్ధత అంటే అసలైన పరిశుద్ధత, మానసిక పరిశుద్ధత, ఆత్మ పరిశుద్ధత, మనసు పరిశుద్ధత, హృదయ పరిశుద్ధత అని అర్థం.

అభిమాన సోదరులారా! ఇక ఖురాన్ లోని సూరా ముద్దస్సిర్ లో ఒక ఆయత్ ఉంది. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇలా సెలవిచ్చాడు:

وَثِيَابَكَ فَطَهِّرْ
[వ సియాబక ఫతహ్హిర్]
నీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకో. (74:4)

ఈ ఆయత్ లో ‘సియాబ్’ అంటే సాధారణంగా దానికి అర్థం దుస్తులే. ఇమామ్ ఇబ్నె ఖయ్యిమ్ రహ్మతుల్లాహి అలైహి ‘వ సియాబక ఫతహ్హిర్’ ఈ ఆయత్ వివరణలో ఆయన ఇలా అన్నారు:

جُمْهُورُ الْمُفَسِّرِينَ مِنَ السَّلَفِ وَمِنْ بَعْدِهِمْ عَلَى أَنَّ الْمُرَادَ بِالثِّيَابِ هُنَا الْقَلْبُ
[జుమ్హూరుల్ ముఫస్సిరీన మినస్సలఫి వ మిన్ బాదిహిమ్ అలా అన్నల్ మురాద బిస్సియాబి హునల్ ఖల్బ్]

అంటే ఈ ఆయత్ లో ‘సియాబ్’ అంటే, దుస్తులు అంటే అర్థం, జుమ్హూర్ సలఫ్ లో ముఫస్సిరీన్లు, అలాగే సలఫ్ లోని తర్వాత తరం వారిలో కూడా, అంటే పూర్వం తరం వారిలో, తర్వాత తరం వారిలో జుమ్హూర్ ముఫస్సిరీన్ల అభిప్రాయం ఒక్కటే. అది ఏమిటంటే ఈ ఆయత్ లో ‘అస్-సియాబ్’ దుస్తులు అంటే హృదయం అన్నమాట.

అభిమాన సోదరులారా! ఇప్పుడు నేను మూడు విషయాలు (రెండు ఆయతులు, ఒక్క హదీసు) హృదయానికి, మనసుకి సంబంధించినది తెలియపరిచాను. దీని అర్థం ఏమిటి? అసలైన పరిశుద్ధత, అసలైన పరిశుభ్రత అది శరీరం కంటే ఎక్కువ, దేహం కంటే ఎక్కువ అది ఆత్మ పరిశుద్ధత, హృదయ పరిశుద్ధత అని అర్థం. ఎందుకంటే అది అసలైన విషయం. అది క్షేమంగా ఉంటే పూర్తి దేహం క్షేమంగా ఉంటుంది, అది పాడైపోతే పూర్తి దేహం పాడైపోతుంది.

ఇక రెండవ విషయం ఏమిటంటే, అటువంటి ముఖ్యమైన, విలువైన హృదయాన్ని దేని నుంచి కాపాడాలి? ఏ రోగాల నుంచి కాపాడాలి? అంటే హృదయానికి సంబంధించిన రోగాలు అనేక ఉన్నాయి. షిర్క్ ఉంది, బిద్అత్ ఉంది, కపటత్వం ఉంది, ఈ విధంగా చాలా రకాల రోగాలు ఉన్నాయి. కానీ ఈ రోజు మనం కేవలం హృదయానికి సంబంధించిన ఐదు రోగాలు తెలుసుకుందాం. ఇది ఈ రోజు అంశంలోని రెండవ ముఖ్యమైన విషయం.

మొదటిది షిర్క్. ఇది అన్నింటికంటే ముఖ్యమైన విషయం అన్నమాట. ఎందుకంటే ఇస్లాం ధర్మాన్ని అన్వేషించిన వారు, అనుసరించే వారు, వారికి ఈ విషయం బాగా తెలుస్తుంది. ఇస్లాం ధర్మంలో అన్నింటికంటే గొప్పది ‘తౌహీద్’ (ఏక దైవారాధన) అయితే, అన్నింటికంటే ఘోరమైనది అది ‘షిర్క్’. ఇస్లాం ధర్మంలో షిర్క్ కి మించిన పాపం ఏదీ లేదు. కావున షిర్క్ గురించి వివరం చెప్పడం నా ఉద్దేశ్యం కాదు ఈ రోజు టాపిక్ లో. హృదయానికి సంబంధించిన రోగాలలో మొదటి రోగం షిర్క్. ఎందుకంటే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సెలవిచ్చాడు:

إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ
[ఇన్నష్ షిర్క లజుల్మున్ అజీమ్]
నిస్సందేహంగా అల్లాహ్‌కు భాగస్వాముల్ని కల్పించటం (షిర్క్‌ చేయటం) ఘోరమైన అన్యాయం. (31:13)

నిస్సందేహంగా షిర్క్ అనేది ఘోరమైన అన్యాయం. ఒక వ్యక్తి తౌబా (పశ్చాత్తాపం) చేసుకోకుండా షిర్క్ లోనే మరణిస్తే అతనికి క్షమాపణ లేదు. కావున అన్నింటికంటే ముందు మనం మన మనసుని షిర్క్ నుండి రక్షించుకోవాలి, కాపాడుకోవాలి, శుభ్రం చేసుకోవాలి. ఇక షిర్క్ వివరాలు ఉన్నాయి, పెద్ద షిర్క్ అని, చిన్న షిర్క్ అని ఆ వివరాలు ఉన్నాయి. అది ఇప్పుడు అవసరం లేదు. షిర్క్ ఘోరమైన అన్యాయం, ఘోరమైన పాపం గనక అన్నిటికంటే ముందు మనం మన హృదయాన్ని, మనసుని షిర్క్ నుండి కాపాడుకోవాలి. ఇది మొదటి విషయం.

రెండవది, రెండవ రోగం కపటత్వం. ఇది కూడా చాలా ఘోరమైనది. సూర బఖరా మనం చదివితే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సూర బఖరా ప్రారంభంలో విశ్వాసుల గురించి ప్రస్తావన వస్తుంది, ఆ తర్వాత అవిశ్వాసుల గురించి ప్రస్తావన వస్తుంది, ఆ తర్వాత కపట విశ్వాసుల గురించి ప్రస్తావన వస్తుంది. ఖురాన్ మరియు హదీసులో కపట విశ్వాసుల శిక్ష గురించి చాలా కఠినంగా చెప్పడం జరిగింది.

కపటత్వం అంటే ఏమిటి? ఏ వ్యక్తిలో కపటత్వం ఉంటే ఆ వ్యక్తికి కపట విశ్వాసి అంటాం. అరబ్బీలో కపటత్వాన్ని ‘నిఫాఖ్‘ అంటారు, కపట విశ్వాసిని ‘మునాఫిఖ్‘ అంటారు. కపటత్వం అంటే క్లుప్తంగా చెప్పాలంటే, ఇస్లాం గురించి, మంచిని గురించి ప్రకటించటం, దాంతో పాటు మనసులో అవిశ్వాసాన్ని లేదా తిరస్కార భావాన్ని, కపటత్వాన్ని మనసులో దాచిపెట్టడం. ఓ పక్కన ఇస్లాం గురించి, మంచి గురించి ప్రకటిస్తారు, ఇంకో పక్కన మనసులో కపటత్వాన్ని దాచి ఉంచుతారు, తిరస్కార భావాన్ని దాచి ఉంచుతారు.

ఇది రెండు రకాలు:

విశ్వాసపరమైన కపటత్వం: మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఆ కపట విశ్వాసులకు నాయకుడు అబ్దుల్లాహ్ బిన్ ఉబై. అంటే విశ్వాసపరమైన కపటత్వం – మనసులో విశ్వాసం లేదు, మనసులో ఈమాన్ లేదు, హృదయంలో అల్లాహ్ ను నమ్మటం లేదు కానీ ప్రకటిస్తున్నారు, యాక్టింగ్ చేస్తున్నారు. ఇది విశ్వాసపరమైన కపటత్వం. ఈ కపటత్వం కలవాడు ఇస్లాం నుండి పూర్తిగా బహిష్కృతుడైపోతాడు. ఇది పెద్ద కపటత్వం.

క్రియాత్మకమైన కపటత్వం (నిఫాఖె అమలీ): అంటే హృదయంలో విశ్వాసం ఉంటుంది, అతను విశ్వాసి, అతను ముస్లిం. హృదయంలో అల్లాహ్ ను, అల్లాహ్ ప్రవక్తను, ఖురాన్ ని విశ్వసిస్తున్నాడు, నమ్ముతున్నాడు మనసులో. కానీ ఆచరణలో కపటత్వం.

ఒక హదీసు మనము విందాం, అర్థమైపోతుంది. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు:

أَرْبَعٌ مَنْ كُنَّ فِيهِ كَانَ مُنَافِقًا خَالِسًا
[అర్బ ఉన్ మన్ కున్న ఫీహి కాన మునాఫికన్ ఖాలిసన్]
నాలుగు లక్షణాలు ఉన్నాయి, ఆ నాలుగు లక్షణాలు ఏ వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తి పక్కా కపట విశ్వాసి.

وَمَنْ كَانَتْ فِيهِ خَصْلَةٌ مِنْهُنَّ كَانَتْ فِيهِ خَصْلَةٌ مِنَ النِّفَاقِ حَتَّى يَدَعَهَا
[వమన్ కానత్ ఫీహి ఖస్లతుమ్ మిన్హున్న కానత్ ఫీహి ఖస్లతుమ్ మినన్నిఫాఖి హత్తా యదఅహా]
ఆ నాలుగు లక్షణాలు కాకుండా, ఆ నాలుగు లక్షణాలలో ఒక వ్యక్తిలో ఒక లక్షణం ఉంటే, కపటత్వానికి సంబంధించిన ఒక లక్షణం అతనిలో ఉందన్నమాట.

ఆ నాలుగు విషయాలు ఏమిటి? మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు:

إِذَا اؤْتُمِنَ خَانَ
[ఇజాఉ తుమిన ఖాన]:
అమానతు అప్పగిస్తే ద్రోహానికి పాల్పడతాడు.

وَإِذَا حَدَّثَ كَذَبَ
[వఇజా హద్దస కజబ]:
మాట్లాడితే అబద్ధం చెబుతాడు.

وَإِذَا عَاهَدَ غَدَرَ
[వఇజా ఆ హద గదర]:
నమ్మి ఒడంబడిక చేసుకున్న తర్వాత (నమ్మిన తర్వాత) నమ్మక ద్రోహం చేస్తాడు.

وَإِذَا خَاصَمَ فَجَرَ
[వఇజా ఖాసమ ఫజర]:
పోట్లాట జరిగినప్పుడు దుర్భాషకు దిగుతాడు.

ఈ నాలుగు విషయాలు. ఇది క్రియాత్మకమైన కపటత్వం. ఈ నాలుగు విషయాలు ఉంటే ఆ వ్యక్తి పక్కా కపట విశ్వాసి (మునాఫిక్) విశ్వాసపరంగా కాదు, క్రియాత్మకంగా. ఈ నాలుగులో ఒకటి ఉంటే కపటత్వానికి సంబంధించిన ఒక గుణం అతనిలో ఉందని అర్థం.

హృదయానికి సంబంధించిన మొదటి రోగం షిర్క్ అయితే, రెండవది కపటత్వం.

ఇక మూడవది ‘రియా’, ప్రదర్శనా బుద్ధి. ఇది చాలా డేంజర్. ఎందుకంటే కొన్ని పుణ్యాలు చాలా గొప్పగా ఉంటాయి. హజ్, ఉమ్రా ఉంది, ఎంత గొప్పదైన పుణ్యం అది. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా చాలా గొప్ప పుణ్యం ఉమ్రా మరియు హజ్. అలాగే జకాత్, ఐదు పూటల నమాజులు, దానధర్మాలు లక్షల కొద్ది, కోట్ల కొద్ది దానాలు చేస్తారు. మరి:

إِنَّمَا الْأَعْمَالُ بِالنِّيَّاتِ
[ఇన్నమల్ ఆ మాలు బిన్నియ్యాత్]
కర్మలు, ఆచరణలు సంకల్పంపై ఆధారపడి ఉన్నాయి.

కనుక మన సంకల్పాన్ని శుద్ధి చేసుకోవాలి. సంకల్ప శుద్ధి అవసరం. ప్రదర్శనా బుద్ధితో మనము ఏ పని చేయకూడదు. అల్లాహ్ ప్రసన్నత కోసమే చేయాలి, ప్రవక్త గారి విధానం పరంగానే ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. అందుకే హృదయానికి సంబంధించిన రోగాలలో ముఖ్యమైన మూడవ రోగం, అది ప్రదర్శనా బుద్ధి (రియా).

మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

مَنْ صَامَ يُرَائِي فَقَدْ أَشْرَكَ
[మన్ సామ యురాఈ ఫఖద్ అష్రక]
ఎవరైతే ప్రదర్శనా బుద్ధితో ఉపవాసం ఉన్నాడో ఆ వ్యక్తి షిర్క్ చేశాడు.

ఇంకా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

إِنِّي أَخَافُ عَلَيْكُمُ الشِّرْكَ الْأَصْغَرَ
[ఇన్నీ అఖాఫు అలైకుముష్ షిర్కల్ అజ్గర్]
నేను మీ విషయంలో చిన్న షిర్క్ (షిర్క్ అస్గర్) గురించి భయపడుతున్నాను అన్నారు.

చిన్న షిర్క్ అంటే ఏమిటి? ప్రదర్శనా బుద్ధితో ఆచరించటం. ఏ పుణ్యం చేసినా మంచి సంకల్పంతో కాదు, చిత్తశుద్ధితో కాదు, అల్లాహ్ ప్రసన్నత కోసం కాదు, నలుగురు మెప్పు కోసం, నలుగురు నన్ను పొగుడుతారని, నా గురించి గొప్పలు చెప్పుకుంటారని ప్రదర్శనా బుద్ధితో ఆచరిస్తే, అది ‘రియా‘. దానికి అంటారు షరియత్ పరిభాషలో అది చిన్న షిర్క్ అవుతుంది. ఆ ఆచరణ స్వీకరించబడదు. కావున హృదయ రోగాలలో మూడవది రియా (ప్రదర్శనా బుద్ధి).

నాలుగవది అనుమానం. అనుమానం గురించి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇలా సెలవిచ్చాడు:

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اجْتَنِبُوا كَثِيرًا مِّنَ الظَّنِّ إِنَّ بَعْضَ الظَّنِّ إِثْمٌ
[యా అయ్యుహల్లజీన ఆమనుజ్ తనిబూ కసీరమ్ మినజ్జన్ని ఇన్న బ అ జజ్జన్ని ఇస్మున్]
ఓ విశ్వాసులారా! అతిగా అనుమానించటానికి దూరంగా ఉండండి. కొన్ని అనుమానాలు పాపాల క్రిందికి వస్తాయి. (49:12)

‘జన్’ అంటే అసలు అనుమానం, తలపోయటం అని అర్థం. అయితే శ్రేయోభిలాషుల, భక్తిపరుల, సత్యమూర్తుల గురించి లేనిపోని అనుమానాలకు పోవటం దురనుమానాల క్రిందికి వస్తాయి. కావున షరియత్ లో దీనిని ‘అక్జబుల్ హదీస్’ (అన్నిటికంటే పెద్ద అబద్ధం) గా అభివర్ణించబడింది.

అభిమాన సోదరులారా! సారాంశం ఏమిటంటే మాటిమాటికి అతిగా అనుమానం చేయకూడదు. హృదయంలో ఏముందో అది అల్లాహ్ కు మాత్రమే తెలుసు. ఏదైనా కొంచెం చూసేసి చాలా వివరంగా చెప్పుకోకూడదు. అసలు అనుమానం మంచిది కాదు. إِنَّ بَعْضَ الظَّنِّ إِثْمٌ “ఇన్న బాజజ్జన్ని ఇస్మున్” (కొన్ని అనుమానాలు పాపం క్రిందికి వస్తాయి) అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేశాడు.

ఇక ఐదవ విషయం ఏమిటంటే అసూయ. అసూయ ఇది కూడా చాలా చెడ్డదండి. కర్మలు పాడైపోతాయి. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇలా సెలవిచ్చాడు, సూర నిసాలో ఉంది ఇది:

أَمْ يَحْسُدُونَ النَّاسَ عَلَىٰ مَا آتَاهُمُ اللَّهُ مِن فَضْلِهِ
[అమ్ యహ్ సుదూనన్నాస అలా మా ఆతాహుముల్లాహు మిన్ ఫజ్లిహి]
అల్లాహ్ తన అనుగ్రహంతో ప్రజలకు ప్రసాదించిన దానిపై వారు అసూయ పడుతున్నారా? (4:54)

అంటే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా పరీక్ష నిమిత్తం కొందరికి తక్కువ ఇస్తాడు, కొందరికి ఎక్కువ ఇచ్చేస్తాడు ఆర్థిక పరంగా, పదవి పరంగా, కొందరికి ఆరోగ్యం ఇస్తాడు, కొందరికి అనారోగ్యం ఇస్తాడు. ఇదంతా పరీక్ష నిమిత్తం అల్లాహ్ చేస్తాడు, అది అల్లాహ్ హిక్మత్ (వివేకం) లో ఉంది. కాకపోతే దాని మూలంగా ఒకరు ఇంకొకరిపై అసూయ చెందకూడదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

إِيَّاكُمْ وَالْحَسَدَ فَإِنَّ الْحَسَدَ يَأْكُلُ الْحَسَنَاتِ كَمَا تَأْكُلُ النَّارُ الْحَطَبَ
[ఇయ్యాకుమ్ వల్ హసద ఫఇన్నల్ హసద య అకులుల్ హసనాతి కమా త అకులున్నారుల్ హతబ]
అసూయకు దూరంగా ఉండండి. ఎందుకంటే అగ్ని కట్టెల్ని కాల్చినట్లు, అసూయ సత్కర్మల్ని కాల్చేస్తుంది (తినేస్తుంది).

ఏ విధంగా అగ్ని కట్టెల్ని కాల్చేసి బూడిద చేసేస్తుందో, అలాగే అసూయ అనేది మనిషి చేసిన పుణ్యాలకు, సత్కర్మలకు తినేస్తుంది అన్నమాట.

అభిమాన సోదరులారా! ఈ విధంగా హృదయ రోగాలు, హృదయానికి సంబంధించిన అనేక రోగాలు ఉన్నాయి. వాటిలో ఐదు నేను చెప్పాను. ఈ ఐదులో ప్రతి ఒక్కటికీ వివరం అవసరం ఉంది. షిర్క్ ఉంది, కపటత్వం ఉంది, అలాగే రియా ఉంది, అలాగే జన్ (అనుమానించటం) ఉంది, ఐదవది అసూయ. ఇవి కాక ఇంకా ఎన్నో ఉన్నాయి, నేను ముఖ్యమైన ఈ ఐదు చాలా ఘోరమైన పాపాలు గనక హృదయానికి సంబంధించిన రోగాలలో ఈ ఐదు తెలియజేశాను.

ఇక దీనికి చికిత్స ఏమిటి? హృదయం గురించి కొన్ని విషయాలు మొదటిగా నేను చెప్పాను. ఆ తర్వాత హృదయానికి సంబంధించిన రోగాలలో ఐదు రోగాల ప్రస్తావన వచ్చింది ఇప్పుడు. ఇప్పుడు వాటి చికిత్స ఎలా? హృదయ రోగాల చికిత్స ఏ విధంగా చేసుకోవాలి? ముఖ్యమైన ఏడు పాయింట్లు, సమయం అయిపోయింది గనక నేను క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను.

అల్లాహ్ ప్రేమలో పరిపూర్ణత కలిగి ఉండాలి. యాక్టింగ్ మాత్రమే కాదు, అల్లాహ్ ని ప్రేమిస్తున్నామని చెప్పటము మరి పాపాలు చేయటము, అల్లాహ్ కు అవిధేయత చూపటం అలా కాదు. “కమాలు ముహబ్బతిల్లాహ్” – అల్లాహ్ యొక్క ప్రేమలో పరిపూర్ణత కలిగి ఉండాలి. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా కపట విశ్వాసుల, అలాగే ముష్రికుల, బహుదైవారాధకుల ప్రస్తావన చేసిన తర్వాత విశ్వాసుల గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

وَالَّذِينَ آمَنُوا أَشَدُّ حُبًّا لِّلَّهِ
[వల్లజీన ఆమనకూ అషద్దు హుబ్బన్ లిల్లాహి]
విశ్వసించినవారు అల్లాహ్‌ను అంతకంటే ప్రగాఢంగా (అధికంగా) ప్రేమిస్తారు. (2:165)

విశ్వసించిన వారు, విశ్వాసులు, ముమినిన్లు అల్లాహ్ కు అంతకంటే ప్రగాఢంగా, అధికంగా ప్రేమిస్తారు. అంటే విశ్వాసులు అల్లాహ్ పట్ల అమితమైన ప్రేమ కలిగి ఉంటారు అన్నమాట. ఇది మొదటి విషయం.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

قُلْ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
[కుల్ ఇన్న సలాతీ వ నుసుకీ వ మహ్యాయ వ మమాతీ లిల్లాహి రబ్బిల్ ఆలమీన్]
ఇంకా ఈ విధంగా ప్రకటించు : “నిస్సందేహంగా నా నమాజు, నా సకల ఆరాధనలు, నా జీవనం, నా మరణం – ఇవన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌ కొరకే.” (6:162)

నా నమాజ్, ‘వ నుసుకీ’ దీనికి రెండు అర్థాలు ఉన్నాయి, ఒక అర్థం నా ఖుర్బానీ, రెండో అర్థం నా సకల ఆరాధనలు. నా నమాజు, నా సకల ఆరాధనలు, అంత మాత్రమే కాదు ‘వ మహ్యాయ’ – నా జీవనం, ‘వ మమాతీ’ – నా చావు, నా మరణం. ఇవన్నీ ‘లిల్లాహి రబ్బిల్ ఆలమీన్’ – సకల లోకాలకు ప్రభువైన అల్లాహ్ కు మాత్రమే, అల్లాహ్ కోసమే. అంటే నేను నమాజ్ చేస్తున్నాను అల్లాహ్ కోసమే చేస్తున్నాను. నా సకల ఆరాధనలు, నమాజ్ మాత్రమే కాదు నా సకల ఆరాధనలు – దానం చేసినా, ఒకరికి సహాయం చేసినా, ఒకరి హక్కు పూర్తి చేసినా, భార్య విషయంలో, పిల్లల విషయంలో, అమ్మ నాన్న విషయంలో, ఇరుగుపొరుగు వారి విషయంలో, స్నేహితుల విషయంలో, మిత్రుల విషయంలో, శత్రువుల విషయంలో, జంతువుల విషయంలో, ప్రతి విషయంలో. చివరికి నా పూర్తి జీవితం, నా మరణం కూడా అల్లాహ్ కోసమే. ఇది చిత్తశుద్ధి కలిగి ఉండాలి.

‘హుస్నుల్ ముతాబఅ’ అంటే ఆచరణ విశ్వాసపరంగా ఉండాలి. ఏదైతే చెబుతున్నామో అలాగే చేయాలి. ఏదైతే చేస్తామో అదే చెప్పాలి. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విధానం పరంగా ఉండాలి. దీనికి అంటారు ‘హుస్నుల్ ముతాబఅ’. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

قُلْ إِن كُنتُمْ تُحِبُّونَ اللَّهَ فَاتَّبِعُونِي يُحْبِبْكُمُ اللَّهُ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ
[కుల్ ఇన్ కున్తుమ్ తుహిబ్బూనల్లాహ ఫత్తబివూనీ యుహ్ బిబ్ కుముల్లాహు వ యగ్ఫిర్ లకుమ్ జునూబకుమ్]

(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : ”మీకు నిజంగానే అల్లాహ్‌ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి. (తత్ఫలితంగా) అల్లాహ్‌ మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీ పాపాలను మన్నిస్తాడు.” (3:31)

మీరు అల్లాహ్ కు ప్రేమిస్తున్నారా? అల్లాహ్ పట్ల మీకు ప్రేమ ఉందా? అల్లాహ్ పట్ల మీరు ప్రేమ కలిగి ఉన్నారా? అలాగైతే ‘ఫత్తబివూనీ’ – నన్ను అనుసరించండి (అంటే మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను అనుసరించండి, ఇత్తెబా చేయండి). దానికి ప్రతిఫలం ఏమిటి? అల్లాహ్ అంటున్నాడు ‘యుహ్ బిబ్ కుముల్లాహ్’ – అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు, ‘వ యగ్ఫిర్ లకుమ్ జునూబకుమ్’ – అల్లాహ్ మీ పాపాలు మన్నిస్తాడు.

అంటే ఈ ఆయత్ లో ఏది చెబుతామో అలాగే మనము ఆచరించాలి. అల్లాహ్ ను ప్రేమిస్తున్నాము చెబుతున్నాము, అల్లాహ్ ను విశ్వసిస్తున్నాము చెబుతున్నాము – ఆచరించాలి. ప్రవక్త గారి పట్ల మనకు ప్రేమ ఉంది చెబుతున్నాము – ఆచరించాలి. అలా చేస్తే అల్లాహ్ మమ్మల్ని ప్రేమిస్తాడు, అల్లాహ్ మన పాపాలు మన్నిస్తాడు.

‘అల్-మురాఖబా’ అంటే దైవ ధ్యానం, జవాబుదారీ భావన. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

وَهُوَ مَعَكُمْ أَيْنَ مَا كُنتُمْ
[వహువ మ అకుమ్ ఐన మా కున్తుమ్]
మీరెక్కడ ఉన్నా ఆయన మీతోనే ఉంటాడు. (57:4)

మీరు ఎక్కడైనా సరే, ఎక్కడున్నా సరే అల్లాహ్ మీకు తోడుగా ఉన్నాడు, అల్లాహ్ మీతోనే ఉన్నాడు, అల్లాహ్ గమనిస్తున్నాడు, అల్లాహ్ నిఘా వేసి ఉన్నాడు. ఈ భావన ఉంటే మనం పాపం చేయము కదా. ఏకాంతంలో ఉన్నాము, ఇంట్లో ఉన్నాము, బయట ఉన్నాము, రాత్రి పూట, పగటి పూట, చీకటి, వెలుగు – ఎక్కడైనా సరే అల్లాహ్ నన్ను కనిపెట్టుకొని ఉన్నాడు, నిఘా వేసి ఉన్నాడు, గమనిస్తున్నాడు, “అల్లాహ్ అలీముమ్ బిజాతిస్ సుదూర్” – హృదయాలలో ఏముంది అది అల్లాహ్ ఎరుగును. ఈ భావన ఉంటే మనిషి పాపాలకు దూరంగా ఉంటాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

إِنَّ اللَّهَ لَا يَخْفَىٰ عَلَيْهِ شَيْءٌ فِي الْأَرْضِ وَلَا فِي السَّمَاءِ
[ఇన్నల్లాహ లా యఖ్ ఫా అలైహి షైఉన్ ఫిల్ అర్జి వలా ఫిస్సమాఇ]
నిశ్చయంగా – భూమ్యాకాశాలలోని ఏ వస్తువూ అల్లాహ్‌కు గోప్యంగా లేదు. (3:5)

సదఖా చేస్తే కూడా దాని మూలంగా హృదయాలు శుద్ధి అవుతాయి. అల్లాహ్ సెలవిచ్చాడు:

خُذْ مِنْ أَمْوَالِهِمْ صَدَقَةً تُطَهِّرُهُمْ وَتُزَكِّيهِم بِهَا
[ఖుజ్ మిన్ అమ్ వాలిహిమ్ సదఖతన్ తుతహ్హిరుహుమ్ వ తుజక్కీహిమ్ బిహా]

(ఓ ప్రవక్తా!) నువ్వు వారిని పరిశుద్ధపరచటానికీ, వారిని తీర్చిదిద్దటానికీ వారి సంపదల నుంచి దానాలను తీసుకో. ఓ ప్రవక్త!) వారి సంపదల నుండి ‘సదఖా’ (దానధర్మాలు) వసూలు చేయి. దాని ద్వారా నీవు వారిని పరిశుద్ధులుగా, పవిత్రులుగా తీర్చిదిద్దగలవు. (9:103)

ఓ ప్రవక్త వారి నుండి దానాలను తీసుకో, దాని వల్ల ఏమవుతుంది? వారి హృదయాలు పరిశుద్ధం అవుతాయి. వారిని పరిశుభ్రపరచటానికి, వారిని తీర్చిదిద్దటానికి దానాలు తీసుకో అని అల్లాహ్ అంటున్నాడు. అంటే సదఖా మూలంగా పుణ్యంతో పాటు జీవితాలు, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తీర్చిదిద్దుతాడు, అలాగే హృదయాలు శుభ్రం అవుతాయి.

ఖియాముల్ లైల్. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

تَتَجَافَىٰ جُنُوبُهُمْ عَنِ الْمَضَاجِعِ
[తతజాఫా జునూబుహుమ్ అనిల్ మజాజిఇ]
వారి ప్రక్కలు వారి పడకల నుంచి వేరుగా ఉంటాయి. (32:16)

వారు రాత్రి పూట తక్కువగా నిద్రిస్తారు. అంటే తహజ్జుద్ నమాజ్, ఖియాముల్ లైల్ కి అమితమైన, ఎక్కువ పుణ్యం ఉంది.

‘అద్దుఆ హువల్ ఇబాద’, ‘అద్దుఆ ముఖ్ఖుల్ ఇబాద’. అసలైన ఆరాధన అది దుఆ అని ప్రవక్త సెలవిచ్చారు.

అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నాకు చెప్పటం కంటే ఎక్కువ, మిమ్మల్ని వినటం కంటే ఎక్కువ, అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. మనందరినీ హృదయానికి సంబంధించిన రోగాల నుండి రక్షించుగాక, శుభ్రపరచుగాక. ఇహపరలోకాలలో అల్లాహ్ సాఫల్యం ప్రసాదించుగాక. ఆమీన్.

వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=25349