ఇస్లామీయ జీవన విధానం [పుస్తకం]

Islamic way of Life
ఇస్లామీయ జీవన విధానం [పుస్తకం]

అంశాల నుండి: ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
అనువాదం: అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)

[ఇక్కడ పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [92 పేజీలు] [1.57 MB]

విషయసూచిక

 1. ఈమాన్ బిల్లాహ్
 2. ప్రవక్త ﷺ అనుచరుల ప్రేమ
 3. ఇస్లాం నాయకుల్లో ఖుర్’ఆన్ పండితులు, హదీస్ వేత్తలు, ధర్మవేత్తలు
 4. నాయకులు
 5. అల్లాహ్ పట్ల మర్యాద
 6. అల్లాహ్ యొక్క గ్రంధం పట్ల మర్యాద
 7. ప్రవక్త ﷺ పట్ల మర్యాద
 8. విశ్వాసి స్వయం తనపట్ల పాటించవలసిన మర్యాద
  • క్షమాబిక్ష (తౌబా)
  • మురాఖబ
  • ఆత్మపరిశీలన (ముహాసబ)
  • తీవ్రప్రయత్నం (ముజాహద)
 9. తల్లిదండ్రుల హక్కు
 10. సంతానము హక్కులు
 11. సోదరభావం
 12. భార్యాభర్తలు
 13. భార్య హక్కులు భర్తపై
 14. భర్త హక్కులు భార్యపై
 15. బంధువుల పట్ల మర్యాద
 16. ఇరుగుపొరుగు వారిపట్ల మర్యాద
 17. విశ్వాసుల పరస్పర హక్కులు
 18. అవిశ్వాసుల పట్ల మర్యాద
 19. పశుపక్షాదుల హక్కులు
 20. సభా మర్యాదలు
 21. దారిలో కూర్చున్నప్పుడు క్రింది ధర్మాలను అనుసరించాలి
 22. తినుత్రాగు పద్ధతులు
  • ప్రారంభానికి ముందు పాటించవలసినవి
  • భోజనం చేయునపుడు పాటించవలసినవి
  • భుజించిన తర్వాత పాటించవలసినవి
 23. ప్రయాణ నియమాలు
 24. ప్రయాణ ధర్మాలు
 25. వస్త్రధారణ పద్ధతులు
 26. ప్రకృతి ధర్మాలు
 27. నిద్రించడం ఎలా?

[పూర్తి పుస్తకం క్రింద చదవండి]

منهاج المسلم

అల్లాహ్ పై విశ్వాసం:

‘ముస్లిం అల్లాహ్ ను విశ్వసిస్తాడు’ అన్నదానికి అర్థం ఏమిటంటే ఆ పరమ పవిత్రుని ఉనికిని నమ్ముతాడు. ఆ గొప్ప మహానుభావుడే భూమ్యాకాశాల సృష్టికర్త, గోచర అగోచర విషయాలు తెలిసినవాడు, సర్వమునకు పోషకుడు అదికారి. సత్య ఆరాధ్యుడు ఆయన తప్ప మరెవ్వడూ లేడు. ఆ పరమ పవిత్రుడు సకల సద్గుణాల సంపన్నుడు. అన్ని లోపాలకు, దోషాలకు అతీతుడని నమ్ముతాడు. దీనికి గ్రాంథిక మరియు హేతుబద్ధమైన నిదర్శనాలున్నాయి. వాటిలో కొన్ని ఈ క్రింది విధంగా ఉన్నాయి:

1- అల్లాహ్ తన ఉనికి మరియు తానే సకల సృష్టికి సృష్టికర్త, పోషనకర్త అని మరియు తన నామముల, గుణవిశేషముల గురించి స్వయంగా తెలిపాడు. అల్లాహ్ ఆదేశం:

إِنَّ رَبَّكُمُ اللهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَى عَلَى الْعَرْشِ
يُغْشِي اللَّيْلَ النَّهَارَ يَطْلُبُهُ حَثِيثًا وَالشَّمْسَ وَالْقَمَرَ وَالنُّجُوْمَ مُسَخَّرَاتٍ بِأَمْرِهِ، أَلَا لَهُ الْخَلْقُ وَالْاَمْرُ تَبَارَكَ اللهُ رَبُّ الْعَالَمِينَ ﴾ الأعراف : ٥٤

{వాస్తవంగా మీ ప్రభువు అల్లాహ్ యే. ఆయన ఆకాశాలనూ, భూమినీ ఆరు దినాలలో సృష్టించాడు. తరువాత అర్ష్ (సింహాసనం)పై ఆసినుడాయేను. రాత్రిని పగటిపై కప్పివేస్తాడు. ఆ తరువాత పగలు రాత్రి వెంట పరుగుతీస్తూ ఉంటుంది. ఇంకా ఆయన సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలను పుట్టించాడు. అన్నీ ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి. తెలుసుకోండి! సృష్టి ఆయనదే. దానిపై ఆధిపత్యమూ ఆయనదే. అల్లాహ్ అనంతమైన శుభాలు కలవాడు. సకల లోకాలకు ప్రభువు, స్వామి}. (ఆరాఫ్ 7:54). మరో చోటః

يَا مُوسَى اِنّي اَنَا اللهُ رَبُّ الْعَالَمِين﴾ القصص: ۳۰ 
{ఓ మూసా! నేను అల్లాహ్ ను, సకల లోకాలకు ప్రభువును}. (ఖసస్ 28:30). ఇంకా ఈ ఆదేశమూ చదవండిః

انا اللهُ لَا إِلَهَ إِلا أَنَا فَاعْبُدْنِي وَأَقِمِ الصَّلوةَ لِذِكْرِى – طه: ١٤ 
{నేనే అల్లాహ్ ను, నేను తప్ప మరొక సత్య ఆరాధ్యుడెవ్వడు లేడు. కనుక నీవు నాకు దాస్యం చెయ్యి, నా జ్ఞాపకం కోసం నమాజును స్థాపించు}. (తాహా 20:14). మరో ఆదేశం చదవండిః

لوكان فيهما آلِهَةٌ إلا اللهَ لَفَسَدَنَا فَسُبْحَانَ اللهِ رَبِّ الْعَرْشِ عَمَّا يَصِفُون – الأنبياء: ٢٢ 
{ఒకవేళ ఆకాశములో, భూమిలో ఒక్క అల్లాహ్ తప్ప ఇతర దేవుళ్ళు కూడ ఉంటే, అప్పుడు (భూమ్యాకాశాల) రెండింటి వ్యవస్థ ఛిన్నాభిన్నమై ఉండేది. కనుక అర్ష్ (సింహాసము)నకు ప్రభువైన అల్లాహ్, వారు కల్పించే విషయాల నుండి పరిశుద్ధుడు}. (అంబియా 21:22).

అదే విధంగా వివిధ లోకాలు మరియు రకరకాల సృష్టి, ఒక సృష్టికర్త ఉన్నాడని సాక్ష్యమిస్తున్నాయి, ఆ సృష్టికర్త అల్లాహ్ యే. అంతెందుకు ఈ సృష్టిని సృష్టించింది, కనిపెట్టింది నేనే అని ఆరోపణ చేసే నాదుడే ఈ లోకంలో లేడు. అయితే హేతుబద్ధకంగా కూడా నిర్మాత లేనిదే నిర్మాణముంది అనడం అసంభవం. ఈ గ్రాంథిక మరియు హేతుబద్ధకమైన నిదర్శనాల ద్వారా ఒక ముస్లిం అల్లాహ్ యే సర్వ సృష్టికి సృష్టకర్త, పోషకుడని, పూర్వీకుల మరియు కడపటివారి సత్య ఆరాధ్యుడని విశ్వసిస్తాడు.

అల్లాహ్ యే సర్వసృష్టికి పోషకుడు. అతని పోషణ కర్తవ్యములో ఎవరు సాటి లేరు. చదవండి అల్లాహ్ ఆదేశం:

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِيْنَ – الفاتحة: 1 
{సమస్త స్తోత్రములు సర్వలోకములకు పోషకుడగు అల్లాహ్ కే చెందును}. (ఫాతిహా 1:1).

1. చిన్నా, పెద్దా ప్రతీ వస్తువును సృష్టించడంలో అద్వితీయుడు ఆయనే.

وقُلِ اللهُ خَالِقَ كُلِّ شَيْءٍ – الرعد: ١٦ 
{ఇలా అను: ప్రతీ వస్తువునూ అల్లాహ్ యే సృష్టించువాడు}. (రఅద్ 13:16).

2. సర్వసృష్టికి ఆహారం అందించడములో అద్వితీయుడు ఆయనే.  

و وَمَا مِنْ دَابَّةٍ فِي الْأَرْضِ إِلَّا عَلَى اللَّهِ رِزْقُهَا – هود: ٦ 
{ధరణిపై సంచరించే ఏ ప్రాణి ఉపాధి అయినా అల్లాహ్ బాధ్యతలో లేకుండా లేదు}. (హూద్ 11:6).

3. మానవనైజం కూడా ఆయనే పోషకుడని సాక్ష్యమిస్తుంది. ప్రతీ మానవుడు తన అంతరంగములో ఈ విషయాన్ని గ్రహిస్తాడు. ఆ విషయమే అల్లాహ్ ఇలా తెలిపాడు.

وقُلْ مَنْ رَبُّ السَّمَاوَاتِ السَّبْعِ وَرَبُّ العَرْشِ الْعَظِيمِ، سَيَقُولُونَ – اللَّهَ المؤمنون: ٨٦ 
{వారిని ఇలా అడుగు, ‘సప్తకాశాలకూ, మహోన్నతమైన అర్ష్ (పీఠాని, సింహాసనాని)కి ప్రభువు ఎవరు?’ వారు తప్పకుండా, “అల్లాహ్” అని అంటారు}. (మూమినూన్ 23:86,87).

4. ప్రతీ వస్తువునకు అధికారముగల అద్వితీయుడు ఆ పరమ పవిత్రుడే. అందులో మార్పు చేసే అధికారమంతా ఆయనకే ఉంది.

قُلْ مَنْ يَرْزُقُكُمْ مِّنَ السَّمَاءِ وَالْأَرْضِ أَمْ مَّنْ يَمْلِكُ السَّمْعَ وَالْأَبْصَارَ، وَمَنْ يُخْرِجُ  الْحَيَّ مِنَ الْمَيِّتِ وَيُخْرِجُ الْمَيِّتَ مِنَ الْحَيِّ، وَمَنْ يُدَبِّرُ الْأَمْرَ، فَسَيَقُوْلُوْنَ اللَّهَ، فَقُلْ اَفَلاَ تَقُون. فَذَلِكُمُ اللهُ رَبُّكُمُ الْحَقُّ، فَمَاذَا بَعْدَ الْحَقِّ إِلا الضَّلال يونس: ٣١-٣٢ 
{వారిని అడుగు, ఆకాశం నుండి భూమి నుండి మీకు ఉపాధినచ్చేవాడు ఎవడు? వినే శక్తి చూసే శక్తి ఎవడి ఆధీనంలో ఉన్నాయి? ప్రాణములేని దాని నుండి ప్రాణమున్నదానినీ ప్రాణమున్న దాని నుండి ప్రాణము లేని దానినీ వెలికి తీసేవాడు ఎవడు? ఈ విశ్వ వ్యవస్థను నడుపుతున్నవాడు ఎవడు? వారు అల్లాహ్ అని తప్పకుండా అంటారు. ఇలా అనుః ‘అలాంటప్పుడు మీరు (సత్యానికి వ్యతిరేకంగా నడవటం) మానుకోరేమిటి? ఆ అల్లాహ్ యే మీ నిజమైన ప్రభువు. కనుక సత్యాన్ని తృణికరిస్తే మార్గభ్రష్టత్వం తప్ప ఇక మిగిలేదేమిటి?}. (యూనుస్ 10:31,32).

అలాగే అల్లాహ్ పూర్వీకుల మరియు కడపటివారి పూజ్యదైవం అని, అతని తప్ప వేరే సత్య ఆరాధ్యుడు, పూజ్యుడు లేడని కూడా ముస్లిం విశ్వసిస్తాడు.

وشَهِدَ اللهُ أَنَّهُ لا إِلَهَ إِلَّا هُوَ وَالْمَلَائِكَةُ وَأُولُو الْعِلْمِ قَائِمَا بِالْقِسْطِ لَا إِلَهَ إِلَّا هُوَ الْعَزِيزُ الْحَكِيمُ – آل عمران: ۱۸ 
{అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవం లేడని స్వయంగా అల్లాహ్, ఆయన దూతలు, జ్ఞాన సంపన్నులూ సాక్ష్యమిస్తున్నారు. ఆయన సమత్వం, సమతూకంతో ఈ విశ్వాన్ని నిలిపి ఉంచాడు. సర్వాధిక్యుడు, వివేచనాశీలి ఆయిన ఆయన తప్ప మరొకరెవరూ ఆరాధనకు అర్హులు కారు}. (ఆలె ఇమ్రాన్ 3:18).

అల్లాహ్ ఈశ్వరత్వము (ఉలూహియత్)లో అద్వితీయుడనటానికి మరో నిదర్శన ప్రవక్తలు తమ జాతికి ఇచ్చిన పిలుపు. వారు ఒకే అల్లాహ్ ను ఆరాధించాలని చెప్పారు. నూహ్ అలైహిస్సలాం ఇలా చెప్పారుః

يَا قَوْمِ اعْبُدُوا اللهَ مَالَكُمْ مِنْ اللَّهِ غَيْرَه – الأعراف: ٥٩ 
{నా జాతి సోదరులారా! అల్లాహ్ ను ఆరాధించండి ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యుడు లేడు}. (ఆరాఫ్ 7:59). అదే విధంగా హూద్, సాలిహ్ మరియు షుఐబ్ (అలైహిముస్సలాం) మొదలగు ప్రవక్తలు ఇలా చెప్పారుః

و يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَالَكُمْ مِنْ إِلَهِ غَيْره – الأعراف : ٨٥،٧٣،٦٥ 
{నా జాతి సోదరులారా! అల్లాహ్ ను ఆరాధించండి ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యుడు లేడు}. (ఆరాఫ్ 7:65, 73, 85). మరో నిదర్శనః

وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَّسُولاً أن اعْبُدُوا اللَّهَ وَاجْتَنِبُوا الطَّاغُوتِ – النحل: ٣٦ 
{మేము ప్రతీ జాతిలోనూ ఒక ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా అందరికీ ఇలా హెచ్చరిక చేశాము. అల్లాహ్ ను ఆరాధించండి. మిథ్వాదైవాల ఆరాధనకు దూరంగా ఉండండి}. { (నహల్ 16:36).

ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు కు బోధిస్తూ ప్రవక్త ఇలా చెప్పారుః

(إِذَا سَأَلْتَ فَسَأَلِ اللَّهَ وَإِذَا اسْتَعَنْتَ فَاسْتَعِنْ بِاللَّهِ) 
“నీవు ఏదైనా అడిగినప్పుడు కేవలం అల్లాహ్ తో అడుగు. సహాయము కోరినప్పుడు కేవలం అల్లాహ్ తో కోరు”. (తిర్మిజి 2516). మరో ప్రవచనం ఇలా ఉందిః

إِنَّهُ لاَ يُسْتَغَاتُ بِي، وَإِنْمَا يُسْتَغَاتُ بِالله – الطبراني ضعيف 
నా యదుట కాదు మొర పెట్టుకునేది అల్లాహ్ తో మొర పెట్టు కోవాలి“. (తబ్రాని. జఈఫ్). తిర్మిజి హదీసు గ్రంథంలో మరో ప్రవచనం ఇలా ఉంది: 

عن ابْن عُمَرَ قال: إِنِّي سَمِعْتُ رَسُولَ اللَّهِ ” يَقُولُ: مَنْ حَلَفَ بِغَيْرِ اللَّهِ فَقَدْ أَشْرَكَ. (أبو داود).
“అల్లాహ్ తప్ప ఇతరుల ప్రమాణం చేసిన వ్యక్తి షిర్క్ చేసినట్లే”. ఇబ్ను ఉమర్ ఉల్లేఖనం. (అబూ దావూద్ 3251). మరో సారి ఇలా సెలవిచ్చారుః

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా తాను విన్నాను అని అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:

(إِنَّ الرُّقَى وَالْعَمَالِمَ وَالتَّوَلَةَ شِرْكٌ) رواه أحمد و أبو داود. 
“మంత్రములు, తాయత్తులు మరియు ‘తివల’ మొదలగునవన్నీ షిర్క్ కు సంబంధించినవి”. (అబూ దావూద్ 3883). ‘తివల’ అంటే భార్యభర్తల మధ్య ప్రేమ పెరుగుటకు చేయబడే చేతబడి.

అదే విధంగా ఒక ముస్లిం అల్లాహ్ యొక్క మంచి నామముల మరియు సద్గుణాలలో ఎవరినీ సాటి కల్పకుండా, తప్పుగా వ్యాఖ్యానించకుండా, నిరాకారునిగా భావించకుండా, ఇతరులతో పోల్చకుండా అల్లాహ్ తన గురించి ఎలా తెలిపాడో మరియు ప్రవక్త ఎలా తెలిపారో అలా విశ్వసిస్తాడు. ఆయన ఉనికి అన్ని లోపాలకు, దోషాలకు అతీతమైనదని కూడా తన గురించి స్వయం ఆయన మరియు ఆయన ప్రవక్త తెలిపిన తీరు నమ్మాలి.

وَلِلَّهِ ٱلْأَسْمَآءُ ٱلْحُسْنَىٰ فَٱدْعُوهُ بِهَا ۖ وَذَرُوا۟ ٱلَّذِينَ يُلْحِدُونَ فِىٓ أَسْمَـٰٓئِهِۦ ۚ سَيُجْزَوْنَ مَا كَانُوا۟ يَعْمَلُونَ ١٨٠
{అల్లాహ్ మంచి పేర్లకు అర్హుడు. ఆయనను మంచి పేర్లతోనే వేడుకోండి. ఆయనను మంచిపేర్లతో పిలిచే విషయంలో సత్యం నుండి వైదొలగే వారిని వదలిపెట్టండి. వారు తాము చేస్తున్నదానికి ప్రతిఫలం పొంది తీరుతారు}. (7: ఆరాఫ్: 180). మరో చోట ఇలా ఆదేశించడం జరిగిందిః

قُلِ ٱدْعُوا۟ ٱللَّهَ أَوِ ٱدْعُوا۟ ٱلرَّحْمَـٰنَ ۖ أَيًّۭا مَّا تَدْعُوا۟ فَلَهُ ٱلْأَسْمَآءُ ٱلْحُسْنَىٰ ١١٠
{ప్రవక్తా! వారితో ఇలా అనుః అల్లాహ్ అని అయినా పిలవండి, లేదా రహ్మాన్ అని అయినా సరే. ఏ పేరుతో అయినా పిలవండి. ఆయనకు గల పేర్లు అన్నీ చక్కనివే}. (17: బనీ ఇస్రాఈల్: 110). దీనికి నిదర్శనంగా ఉన్న హదీసులు ఇవిః

عَنْ أَبِي هُرَيْرَةَ – أَنَّ رَسُولَ اللَّهِ ” قَالَ: يَضْحَكُ اللَّهُ إِلَى رَجُلَيْنِ يَقْتُلُ أَحَدُهُمَا الْآخَرَ يَدْخُلَانِ الْجَنَّةَ. متفق عليه
“అల్లాహ్ (ప్రళయదినాన) ఇద్దర్ని చూసి (సంతోషంతో) నవ్వుతాడు. వారిలో ఒకడు మరొకడ్ని వధిస్తాడు. అయనప్పటికీ ఇద్దరూ స్వర్గానికి వెళ్తారు”. అబూ హురైర ఉల్లేఖనం. (బుఖారి 2826, ముస్లిం 1890. మహాప్రవక్త (స) మహితోక్తులు 1238).

عَنْ أَنَسِ بْنِ مَالِكٍ عَنْ النَّبِيِّ أَنَّهُ قَالَ: لَا تَزَالُ جَهَنَّمُ يُلْقَى فِيهَا وَتَقُولُ هَلْ مِنْ مَزِيدٍ حَتَّى يَضَعَ رَبُّ الْعِزَّةِ فِيهَا قَدَمَهُ فَيَنْزَوِي بَعْضُهَا إِلَى بَعْضٍ وَتَقُولُ قَطْ قَطْ. متفق عليه
“నరకమును నింపబడుతుండగా అది ఇంకేదయినా ఉంటే తెచ్చి పడేయండి అని అంటూ ఉంటుంది. చివరికి శక్తిమంతుడై అల్లాహ్ తన కాలిని దాని మీద పెడతాడు. అప్పుడు నరకం “చాలు చాలు” అని అంటుంది. అది తనంతట తాను సంకోచించిపోతుంది”. అనస్ బిన్ మాలిక్ ఉల్లేఖనం. (బుఖారి 7384, ముస్లిం 2848).

عَنْ أَبِي هُرَيْرَةَ عَنْ النَّبِيِّ قَالَ: يَقْبِضُ اللَّهُ الْأَرْضَ وَيَطْوِي السَّمَاءَ بِيَمِينِهِ ثُمَّ يَقُولُ أَنَا الْمَلِكُ أَيْنَ مُلُوكُ الْأَرْضِ. البخاري و مسلم
“ప్రళయదినాన అల్లాహ్ భూమిని తన పిడికిలో తీసుకుంటాడు. ఆకాశాన్ని కుడి చేతిలో చుట్టుకుంటాడు. అప్పుడు “నేనే రాజుని, భూమిపై రాజ్యాలు చేసిన వారెక్కడున్నారు?” అని ప్రశ్నిస్తాడు”. అబూ హురైర ఉల్లేఖనం. (బుఖారి 6519, ముస్లిం 2787).

అల్లాహ్ గుణవిశేషాలను విశ్వసించిన ముస్లిం అల్లాహ్ గుణవిశేషాలను ఉదా. అల్లాహ్ చెయ్యిని సృష్టిరాసుల చెయ్యితో పోల్చడు. అలా ఉంటందని ఊహించడు. కేవలం పేరు మాత్రం ఒకటి. (అనగా అల్లాహ్ చెయ్యిని చెయ్యి అంటారు. మానవుని చెయ్యిని చెయ్యి అంటారు. కాని రెండు చేతుల్లో గల బేధము చాలా స్పష్టమయినది).

لَيْسَ كَمِثْلِهِ شَيْءٌ وَهُوَ السَّمِيعُ الْبَصِيرُ- الشوري: ۱۱ 
{ఆయనకు పోలినది ఏదీ లేదు. ఆయన వినువాడు, చూచువాడు}. (42: షూరా: 11).

ప్రవక్త అనుచరుల ప్రేమ

ప్రవక్త అనుచరులతో, వారి కుటుంబీకులతో ప్రేమ ఉంచడము, ఇతర ముస్లిములపై వారి ఘనత గొప్పతనాలను నమ్ముట విధిగా ఉందని ముస్లిం విశ్వసించాలి. వారి అన్యోన్యఘనతలో వ్యత్యాసము గలదు. వారిలో అందరికంటే ముందు ఇస్లాం స్వీకరించినవారి స్థానం, గొప్పతనం ఎక్కువ అని కూడా విశ్వసించాలి.

అందరిలో ఘనతగలవారు ఖులఫాయె రాషిదీన్, వారి తరువాత స్వర్గం శుభవార్త పొందిన పదిసహచరులు. అందులో నలుగురైతే ఖలీఫాలు. (అబూ బక్ర్ సిద్దీఖ్, ఉమర్ ఫారూఖ్, ఉస్మాన్ గనీ, అలీ). మిగిత ఆరుగురు వీరుః 5. తల్ హా బిన్ ఉబైదుల్లాహ్, 6. జుబైర్ బిన్ అవ్వామ్, 7. సఅద్ బిన్ అబీ వఖ్ఖాస్, 8. సఈద్ బిన్ జైద్, 9. అబూ ఉబాద ఆమిర్ బిన్ జర్రాహ్ మరియు 10. అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రజియల్లాహు అన్హుం అజ్ మఈన్. వీరి తరువాత ఘనతగలవారు బద్ర్ యుధ్ధంలో పాల్గొన్నవారు. మళ్ళీ (పై పదిసహచరులు గాకా) స్వర్గశుభవార్త పొందిన ఫాతిమ జహ్రా రజియల్లాహు అన్హా, ఆమె ఇద్దరు సుకుమారులు హసన్, హుసైన్ రజియల్లాహు అన్హుమా, సాబిత్ బిన్ ఖైస్, బిలాల్ బిన్ రిబాహ్ తదితర సహచరులు రజియల్లాహు అన్హుం.

ఇస్లాం ధర్మవేత్తలను గౌరవించుట, మర్యాదతో వారిని ప్రస్తావించుట కూడా విధిగా ఉందని విశ్వసించాలి. వారు తాబిఈన్([1]), తబెతాబిఈన్([2]) లోగల ఖుర్ఆన్ పండితులు, ధర్మవేత్తలు, హదీసు వేత్తలు, ఖుర్ఆను వ్యాఖ్యానికులు. వీరందరు ధర్మ నాయకులు. అల్లాహ్ వారిని ప్రేమించి వారిపై కరుణించుగాకా.

ముస్లిం నాయకుల విధేయత, వారిని గౌరవించుట, వారితో ఆదేశమేరకు యుధ్ధం చేయుట విధిగా ఉందని, వారి అవిధేయతకు గురై, వారిపై తిరుగుబడుట నిషిద్ధం అని విశ్వసించాలి.

అందుకు ముస్లిం పైన తెలుపబడినవారిలో ప్రతీ ఒకరితో ప్రత్యేకమైన సభ్యత పాటించాలి.

ప్రవక్త సహచరుల మరియు కుటుంబీకుల పట్ల పాటించవసిన సభ్యత

 • వారిని అల్లాహ్, ఆయన ప్రవక్త ప్రేమిస్తున్నారు గనక మనము ప్రేమించాలి.
 • అల్లాహ్ ఆదేశము మరియు ప్రవక్త యొక్క ప్రవచనాల ఆధారంగా వారి ఘనత, గొప్పతనము ఇతర ముస్లిములకన్నా ఎక్కువ అని విశ్వసించాలి.

وَالسَّابِقُونَ الْأَوَّلُونَ مِنَ الْمُهَاجِرِينَ وَالْأَنْصَارِ وَالَّذِينَ اتَّبَعُوهُمْ بِإِحْسَانٍ رَضِيَ الله عَنْهُمْ وَرَضُوا عَنْه – التوبة: ١٠٠ 
{అందరికంటే ముందు విశ్వాస సందేశాన్ని స్వీకరించటానికి ముందంజ వేసిన ముహాజిరుల (వలసవచ్చినవారి) పట్లా, అన్సారుల (ఆశ్రయమిచ్చిన వారి) పట్లా తరువాత నిజాయితితో వారి వెనుక వచ్చినవారి పట్లా అల్లాహ్ తృప్తి చెందాడు. వారు కూడా అల్లాహ్ పట్లా తృప్తి చెందారు}. (9: తౌబాః 100).

వారి ఘనతలో ప్రవక్త యొక్క ఈ ప్రవచనం చూడండిః

عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ قَالَ: قَالَ النَّبِيُّ “: لَا تَسُبُّوا أَصْحَابِي فَلَوْ أَنَّ أَحَدَكُمْ أَنْفَقَ مِثْلَ أُحُدٍ ذَهَبًا مَا بَلَغَ مُدَّ أَحَدِهِمْ وَلَا نَصِيفَهُ
“నా సహచరులను (సహాబాలను) దూషించకండి. మీలోనెవరైనా ఉహుద్ పర్వతమంత బంగారము దానము చేసినా, వారు దానము చేసిన ఒక ‘ముద్’ లేక దాని సగభాగమునకు చేరదు. (‘ముద్’ అనగా ప్రవక్త కాలములోని ఒక కొలత. ఈ రోజు లెక్క ప్రకారం అది సుమారు 700 గ్రాముల బియ్యంతో నిండుతుంది). (బుఖారి 3673, ముస్లిం 2541).

 • సహచరుల్లో అబూబక్ర్ సిద్దీఖ్ చాలా ఘనతగలవారని, తర్వాత ఉమర్, ఉస్మాన్, తర్వాత అలీ రజియల్లాహు అన్హుం అని నమ్మాలి. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ ఇలా చెప్పారుః

إِنَّ ابْنَ عُمَرَ قَالَ: كُنَّا نَقُولُ وَرَسُولُ اللَّهِ حَيٌّ أَفْضَلُ أُمَّةِ النَّبِيِّ بَعْدَهُ أَبُو بَكْرٍ ثُمَّ عُمَرُ ثُمَّ عُثْمَانُ رَضِيَ اللَّهُ عَنْهُمْ أَجْمَعِينَ. أبو دواد
“ప్రవక్త తరువాత ఆయన అనుచర సంఘంలో అందరికంటే శ్రేష్ఠులు అబూ బక్ర్, తరువాత ఉమర్, తరువాత ఉస్మాన్ రజియల్లాహు అన్హుం అని మేము అనేవారము. అప్పుడు ప్రవక్త సజీవముగానే ఉన్నారు. (అంటే ఆయన దీన్ని సమ్మతించారు). (అబూ దావూద్, కితాబుస్సున్న, బాబున్ ఫిత్తఫ్ జీల్, 4628).

 • వారి లోపాలను ఎంచకూడదు. వారి మధ్య జిరిగిన అననుకూలత విషయం పట్ల మౌనం వహించాలి.
 • ప్రవక్త సతీమణుల గౌరవ మర్యాదలను విశ్వసించాలి. వారు నిరపరాధులు, పరిశుద్ధులు, శీలవంతులు. అందరిలో ముందు ఖదీజ బిన్తె ఖువైలిద్ తరువాత ఆయిషా బిన్తె అబూ బక్ర్ ఘనతగలవారని విశ్వసించాలి.

ఇమాముల, ఖుర్ఆను పండితుల, హదీసు వేత్తల మరియు ధర్మవేత్తల పట్ల పాటించవలసిన సభ్యత

 • వారిని ప్రేమించాలి. వారి గొప్పతనాన్ని నమ్మాలి.
 • వారి ప్రస్తావన మంచి విధంగా చేయాలి. వారి మాట, అభిప్రాయములో దోషము చూపకూడదు. వారు ఉత్తమ ధర్మశాస్త్రులని, వారి అభిప్రాయము వారి తరువాత వచ్చినవారి అభిప్రాయముకన్నా మేలైనదని తెలుసుకోవాలి. అయితే అల్లాహ్ ఆయన ప్రవక్త మరియు సహాబాల మాటకు వ్యతిరేకమైన వారి మాటలను తీసుకోకూడదు.
 • ఇక ఇమాములు; అబూ హనీఫ, మాలిక్, షాపి మరియు అహ్మద్ రహిమహుముల్లాహ్ గారులు రచించిన రచణలు, వారు చెప్పిన ధర్మ విషయాలు, అల్లాహ్ గ్రంథం మరియు ప్రవక్త యొక్క సున్నతుల ఆధారంగా చెప్పారు. వారు చెప్పిన విషయాలు ఖుర్ఆను, హదీసుల మూలంగా అర్థం చేసుకున్నవి లేక దాని నుండి సంగ్రహించి లేక ఆ రెండింటి మూలంగా ఆలోచించి (ఖియాస్) చేసి చెప్పినవి మాత్రమే.
 • వారు కూడా మనుషులే గనుక వారి నుండి తప్ప ఒప్పులు రెండూ జరిగే ఆస్కారం ఉంటుంది. వారు ఏ హక్కు విషయములో గాని తెలిసి, ఉద్దేశ పూర్వకంగా తప్పు చేయలేదు. కాని అది తెలియక లేక మరచిపోయి లేక పూర్తి విద్య అందక జరిగినది మాత్రమే. అందుకు ఏ ముస్లిం కూడా ఏ ఒకరి అభిప్రాయాన్నే ఏకపక్షంగా అనుసరించకుండా, ఎవరి అభిప్రాయం ప్రవక్త సాంప్రదాయానికి దగ్గరగా, సమానంగా ఉందో దానిని స్వీకరించాలి.

నాయకుల పట్ల సభ్యత

 • అల్లాహ్ ఆయన ప్రవక్త ఆదేశమాధారంగా వారి విధేయత విధిగా ఉందని నమ్మాలి.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُوْلَ وَأُولِي الأمْرِ مِنْكُمْ – النساء: ٥٩ 
{విశ్వసించిన ప్రజలారా! విధేయత చూపండి అల్లాహ్ కు, విధేయత చూపండి ప్రవక్తకు, మీలో అధికారం అప్పగించబడిన పెద్దలకు}. (4: నిసాః 59).

عَنْ أَنَسِ بْنِ مَالِكٍ قَالَ قَالَ رَسُولُ اللَّهِ “: اسْمَعُوا وَأَطِيعُوا وَإِنْ اسْتُعْمِلَ عَلَيْكُمْ عَبْدٌ حَبَشِيٌّ كَأَنَّ رَأْسَهُ زَبِيبَةٌ. البخاري
“మీపై ఐథోపియా దేశానికి చెందిన వ్యక్తిని నాయకునిగా నియమింపచబడి, అతని తల ఎండిన ద్రాక్ష (కిష్మిష్) వలే ఉన్నప్పటికీ అతని మాట వినండి, అతనికి విధేయత చూపండి” ప్రవక్త చెప్పారని అనసు ఉల్లేఖించారు. (బుఖారి 7142).కాని అల్లాహ్ అవిధేయతకు గురి చేసే వారి ఆదేశాలను పాటించకూడదు. ఎందుకనగా అల్లాహ్ విధేయత వారి విధేయత కంటే ముఖ్యమైనది. ప్రవక్త ఆదేశించారుః

لاَ طَاعَةَ لِمَخلُوقٍ فِي مَعصِيةِ الْخَالِق. صحيح الجامع
“అల్లాహ్ అవిధేయతకు గురి చేసే ఏ మానవుని ఆజ్ఞ పాలించకూడదు”. (బఘవి ‘షర్హుస్సున్న’ హ.నం: 2455లో సేకరించారు. సహీహుల్ జామి 7520).

 • వారి అవిధేయత ప్రకటిస్తూ, వారికి తిరుగుబడుట నిషిద్ధం అని భావించాలి.

مَنْ كَرِهَ مِنْ أَمِيرِهِ شَيْئًا فَلْيَصْبِرْ فَإِنَّهُ مَنْ خَرَجَ مِنْ السُّلْطَانِ شِبْرًا مَاتَ مِيتَةً جَاهِلِيَّةً
“ఎవరికి తన నాయకుని యొక్క ఏదైనా విషయం అసహ్యకరంగా ఏర్పడుతుందో వారు ఓపిక వహించాలి. ఆ నాయకునికి వ్యతిరేకంగా ఒక జానెడు కూడా దూరమైన వ్యక్తి ఆ స్థితిలోనే మరణిస్తే అతని చావు ‘జాహిలియ్యత్’ చావు అవుతుంది”. (అనగా అజ్ఞాన కలంలో దుర్మార్గంలో మరణించినవానితీరు అతని చావు అవుతుంది). ఇబ్ను అబ్బాస్ ఉల్లేఖనం. (బుఖారి 7053, ముస్లిం 1849).

 • వారు చక్కని, సన్మార్గమైన దారిపై ఉండి, చెడు నుండి దూరముండాలని దుఆ చెయ్యాలి. వారి క్షేమములోనే ప్రజల క్షేమము, వారి దుర్మార్గంలో ప్రజల నష్టము ఉంది.
 • స్పష్టమైన కుఫ్ర్ గాకుండా, దుర్మార్గం, దుష్ట పనులు చేసినప్పటికీ వారి వెంటనే ఉండి యుద్ధం చేస్తూ, వారి వెనక నమాజు చేస్తూ ఉండాలి.

ఒక వ్యక్తి నాయకుల విధేయత విషయములో ప్రవక్తతో అడగ్గా,

اسْمَعُوا وَأَطِيعُوا فَإِنَّمَا عَلَيْهِمْ مَا حُمِّلُوا وَعَلَيْكُمْ مَا حُمِّلْتُمْ. مسلم
“వారి మాట వినండి, ఆజ్ఞ పాలించండి. వారిపై ఉన్న బాధ్యత గురించి వారు, మీ బాధ్యత గురించి మీరు ప్రశ్నింపబడనున్నారు” అని ప్రవక్త బదులిచ్చారు. (ముస్లిం 1846).

عن عُبَادَةَ بْنِ الصَّامِتِ قَالَ: دَعَانَا النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَبَايَعْنَاهُ فَقَالَ فِيمَا أَخَذَ عَلَيْنَا أَنْ بَايَعَنَا عَلَى السَّمْعِ وَالطَّاعَةِ فِي مَنْشَطِنَا وَمَكْرَهِنَا وَعُسْرِنَا وَيُسْرِنَا وَأَثَرَةً عَلَيْنَا وَأَنْ لَا نُنَازِعَ الْأَمْرَ أَهْلَهُ إِلَّا أَنْ تَرَوْا كُفْرًا بَوَاحًا عِنْدَكُمْ مِنْ اللَّهِ فِيهِ بُرْهَانٌ. البخاري و مسلم

“అల్లాహ్ ప్రవక్త మమ్మల్ని ప్రమాణం చేయడానికి పిలిచినప్పుడు మేము ఆయన చేతిపై ప్రమాణం చేశాము. ఈ ప్రమాణంలో ఆయన మాచేత వాగ్దానం చేయించుకున్న విషయాలలో ఆజ్ఞలు విని పాటిస్తామని, అవి మాకు నచ్చినా నచ్చకపోయినా, కలిమిలోనూ లేమిలోనూ, మా హక్కులు కాలరాయబడినా, ఎట్టి పరిస్థతిలోనయినా సరే మేము వాటిని శరసావహిస్తామన్న వాగ్దానం కూడా ఉంది. ఇంకా ప్రభుత్వ వ్యవహారాలను గురించి ప్రభుత్వాధికారులతో తగవుపడరాదన్న వాగ్దానం కూడా ఉంది. అయితే (పాలకులు) బహిరంగంగా సత్య వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినప్పుడు మీ దగ్గర దేవునికి సంబంధించిన స్పష్ట ప్రమాణం, తగిన నిదర్శనాలు ఉంటే మటుకు (మీరు వారికి తల ఒగ్గరాదు). (బుఖారి 7056, ముస్లిం 1709).

అల్లాహ్ పట్ల మర్యాద

విశ్వసించిన భక్తుడు తను, తన తల్లి గర్భములో బిందువుగా ఉన్నప్పటి నుండి తన ప్రభువుతో కలుసుకనే వరకు, తనపై ఉన్న అనన్యమైన దైవానుగ్రహాలను గుర్తు తెచ్చుకొని నాలుకతో ఆయన స్తోత్రములు పొగడి, ఆయన నొసంగిన శరీరాంగములను ఆయన విధేయతకే అంకితం చేసి, ఆయన కృతజ్ఞత తెలుపవలెను. ఇదే అల్లాహ్ పట్ల మర్యాద (అదబ్) అగును. ఆయన అనుగ్రహాలకు కృతాఘ్నుడై, ఆయన అనుగ్రహాలను తిరస్కరించడము మర్యాద కాదు. అల్లాహ్ ఆదేశం చదవండిః

وَمَا بِكُمْ مِنْ نِعْمَةٍ فَمِنَ اللَّهِ – النحل: ٥٣ 
మీకు లభించిన అనుగ్రహం ఏదైనా అది అల్లాహ్ తరపు నుండి లభించినది. (16: నహల్: 53). మరో ఆదేశం చదవండి: 

وَإِنْ تَعُدُّوا نِعْمَةَ اللَّهِ لَا تُحْصُوهَا – النحل: ۱۸ 
మీరు అల్లాహ్ అనుగ్రహములను లెక్కింపదలచిన లెక్కింప జూలరు. (16: నహల్ : 18). మరో ఆదేశం చదవండి: 

فَاذْكُرُونِي أَذْكُرَكُمْ وَاشْكُرُوا لِي وَلَا تَكْفُرُونَ – البقرة: ١٥٢ 
{మీరు నన్ను స్మరించండి. నేను మిమ్ము జ్ఞప్తి చేయుదును. నాకు కృతజ్ఞతలు తెలుపండి. కృతఘ్నులు కాకండి}. (2: బఖరః 152).

అల్లాహ్ తన సర్వ పరిస్తితులను గుర్తెరుగువాడని ముస్లిం గ్రహించాలి. అందు వల్ల తన మనుసు ఆయన భయముతో, ఆత్మ గౌరవభావంతో నిండిపోవాలి. పాపమ చేయుట అవమానంగా భావించి, ఆయన ఆజ్ఞ వ్యతిరేకత నుండి సిగ్గు పడాలి. ఇదే అల్లాహ్ పట్ల పాటించవలసిన మర్యాద.  ఒక దాసుడు తన యజమాని ముందు తప్పు పని చేయడము, అతను చూస్తుండగా దుష్కార్యాలు చేయడము మర్యాద కాజాలదు. అల్లాహ్ ఆదేశం:

يَعْلَمُ مَا تُسِرُّوْنَ وَمَا تُعْلِنُوْنَ – تغابن: ٤ 
{మీరు దాచేదీ, వెల్లడి చేసేదీ, అంతా ఆయనకు తెలుసు}. (64: తగాబున్: 4).

అల్లాహ్ తన అదృష్టం వ్రాసియుంచాడని విశ్వసించిన భక్తుడు గ్రహించాలి. ఆయన నుండి పరిగెత్తి పోవుట, తప్పించుకొని పోవుట కాని పని. మొక్షము, శరణము ఆయన తప్ప మరో చోట లభించదు. తన వ్యవహారాన్ని ఆయనకే అప్పగించాలి. ఆయనపై మాత్రమే నమ్మకం ఉంచాలి. ఇది తన పోషకుడైన, సృష్టికర్త అయిన అల్లాహ్ పట్లగల మర్యాద. ఆయన్ని వదలి స్థానమివ్వని వాని వైపు పరుగిడిట, శక్తిసామర్థ్యం లేనివానిపై నమ్మకం ఉంచుట మర్యాద కాదు. అల్లాహ్ ఆదేశాలు చదవండిః

مَّا مِن دَآبَّةٍ إِلَّا هُوَ ءَاخِذٌۢ بِنَاصِيَتِهَآ
{ఏ ప్రాణి జుట్టు అయినా ఆయన చేతులలో లేకుండా లేదు}. (11: హూద్: 56).

وَعَلَى ٱللَّهِ فَتَوَكَّلُوٓا۟ إِن كُنتُم مُّؤْمِنِينَ
{మీరు విశ్వాసులైనచో అల్లాహ్ పై నమ్మకం ఉంచండి}. (5: మాఇదః 23).

ముస్లిం భక్తుడు తనపై, ఇతర సృష్టిపై ఉన్న అల్లాహ్ కారుణ్యాన్ని గ్రహించి వినయ నమ్రతలతో ఆయన్ని వేడుకుంటూ మంచి మాటల, సత్కార్యాల ఆధారంగా, ఆయన కారుణ్యాన్ని కాంక్షించడము అల్లాహ్ పట్ల గల మర్యాదను పాటించినట్లవుతుంది. ప్రతి వస్తువును ఆవరించుకొనియున్న ఆయన కారుణ్యం పట్ల ఆశ వదులుట, సర్వ సృష్టికి ఉపకారము చేయువాని పట్ల నిరాశ చెందుట మర్యాద కాజాలదు. అల్లాహ్ ఆదేశాలు చదవండిః

وَرَحْمَتِى وَسِعَتْ كُلَّ شَىْءٍۢ
{నా కరుణ సర్వమును వ్యాపించియుంది}. (7: ఆరాఫ్: 156).

لَا تَقْنَطُوا۟ مِن رَّحْمَةِ ٱللَّهِ ۚ
{అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశచెందకండి}. (39: జుమర్: 53).

పటిష్టమైన ప్రభవు పట్టును, ఆయన బలమైన ప్రతీకారమును గ్రహించి, ఆయనకే విధేయత చూపి, అవిధేయత నుండి దూరముండి, దాని నుండి రక్షణ పొందాలి. ఇదే అల్లాహ్ పట్ల మర్యాద. బలహీనుడు, అశక్తుడైన దాసుడు అధికారుడు, శక్తిసామర్థ్యాలుగల అల్లాహ్ యొక్క అవిధేయతకు గురి కావడం, ఆయన ఆజ్ఞను పాలించకపోవడం మర్యాద కాదు. అల్లాహ్ ఆదేశాలు చదవండిః

وَإِذَآ أَرَادَ ٱللَّهُ بِقَوْمٍۢ سُوٓءًۭا فَلَا مَرَدَّ لَهُۥ ۚ وَمَا لَهُم مِّن دُونِهِۦ مِن وَالٍ
{అల్లాహ్ ఒక జాతిని శిక్షకు గురి చేయదలచినచో అది తొలగదు. అతడు తప్ప ఇతరులెవ్వరూ వారికి సహాయకులు కారు}. (13: రఅద్: 11).

إِنَّ بَطْشَ رَبِّكَ لَشَدِيدٌ ١٢
{నిశ్చయముగా నీ ప్రభువు యొక్క పట్టు చాలా కఠినమైనది}. (85: బురూజ్: 12).

ముస్లిం పాపము చేస్తూ, అల్లాహ్ ఆజ్ఞకు తిరుగుబాటుగా ప్రవర్తించినచో, ఆయన హెచ్చరించినదానికి గురవుతాడని, అల్లాహ్ శిక్ష అతనిపై పడుతుందని గ్రహించాలి. ఆయన ఆజ్ఞ పాలిస్తూ, ధర్మ ప్రకారం అనుసరిస్తూ అల్లాహ్ వాగ్దానము వాస్తవమని ఆయన ప్రేమకు పాత్రులవుతామని గ్రహించడమే అల్లాహ్ పట్ల మంచి నమ్మకం ఉంచినట్లు. అల్లాహ్ పట్ల మంచి తలంపు ఉంచక ఆయన మాటను ధిక్కరిస్తూ, ఆయన ఆజ్ఞకు వ్యతిరేకిస్తూ, ఆయన తనని కనిపెట్టడని భావించి, తను చేసిన పాపానికి పట్టుబడడని అనుకోవడం ఇది అల్లాహ్ పట్ల పాటించవలసిన మర్యాద కాదు. క్రింది అల్లాహ్ ఆదేశం పై శ్రద్ధ వహించండి.

وَلَـٰكِن ظَنَنتُمْ أَنَّ ٱللَّهَ لَا يَعْلَمُ كَثِيرًۭا مِّمَّا تَعْمَلُونَ وَذَٰلِكُمْ ظَنُّكُمُ ٱلَّذِى ظَنَنتُم بِرَبِّكُمْ أَرْدَىٰكُمْ فَأَصْبَحْتُم مِّنَ ٱلْخَـٰسِرِينَ …
{…. అంతే కాదు, మీరు చేసే చాలా పనులను గురించి అల్లాహ్ కు కూడా తెలియదని మీరు అనుకునేవారు. మీరు మీ ప్రభువు పట్ల కలిగి ఉన్న ఈ ఆలోచనే మిమ్మల్ని నట్టేట ముంచింది. ఈ కారణం వల్లనే మీరు నష్టానికి గురి అయ్యారు}. (41: హామ్మీం అస్సజ్దా: 22,23).

అల్లాహ్ తో భయపడుతూ, ఆయన ఆజ్ఞ పాలిస్తూ, తను చేసిన సత్కార్యానికి సత్ఫలితం లభించదని, తను చేసిన ఆరాధన అంగీకరింపబడదని అనుకోవడం కూడా అల్లాహ్ పట్ల పాటించవలసిన మర్యాద కాదు. అల్లాహ్ యొక్క ఈ ఆదేశం చదవండిః

وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ وَيَخْشَ ٱللَّهَ وَيَتَّقْهِ فَأُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْفَآئِزُونَ
{అల్లాహ్ కు, ప్రవక్తకు విధేయత చూపేవారు, అల్లాహ్ కు భయపడేవారు, ఆయన పట్ల అవిధేయతకు దూరంగా ఉండేవారు మాత్రమే విజయం పొందుతారు}. (24: నూర్: 52).

సారంశమేమనగాః ముస్లిం తన పోషకుడైన అల్లాహ్ వరాల కృతజ్ఞత తెలుపడం, పాపానికి మ్రొగ్గినప్పుడు సిగ్గపడటం, స్వచ్ఛంగా ఆయన వైపునకు మరలడం, ఆయనపై మాత్రమే నమ్మకం ఉంచి, ఆయన కారుణ్యాన్ని కాంక్షిస్తూ, ఆయన శిక్ష నుంచి భయపడుతూ, ఆయన చేసిన వాగ్దానము పూర్తి చేస్తాడని, తన దాసులలో తను కోరినవారికి హెచ్చరికను పంపిస్తాడని, మంచి తలంపు ఉంచడము అల్లాహ్ పట్ల పాటించవలసిన మర్యాద. ఎంత వరకు అతను ఈ ప్రకారం ఆచరిస్తూ, దానిపై ఖచ్చితంగా ఉంటాడో అతని ఉన్నత స్థానములో రెట్టింపుగుతూ ఉంటుంది.

అల్లాహ్ యొక్క గ్రంథం పట్ల మర్యాద

అల్లాహ్ యొక్క ‘కలాం’ (మాట, వాక్కు) పవిత్రమైనదని, అన్ని మాటలకన్నా శ్రేష్ఠమైనదని, ఘనతగలదని మరియు ఖుర్ఆన్ ఆయన వాక్కుయేనని ముస్లిం విశ్వసించాలి. దాని ఆధారంగా మాట్లాడినవారు సత్యం పలికినవారు. దాని ప్రకారం తీర్పు చేయువారు న్యాయం చేసినవారు. దాన్ని చదివి ఆచరించువారు అల్లాహ్ యొక్క (ప్రియ) దాసులు. దానిని గట్టిగా పట్టుకున్న (ఆచరించిన)వారే విజయం పొందువారు. దాన్ని తిరస్కరించేవారే నాశనమై నష్టం పొందువారు. ప్రవక్త e ఉపదేశాలను శ్రద్ధగా చదవండిః

عَن أُمَامَةَ الْبَاهِلِيِّ قَالَ: سَمِعْتُ رَسُولَ اللَّهِ ” يَقُولُ: اقْرَءُوا الْقُرْآنَ فَإِنَّهُ يَأْتِي يَوْمَ الْقِيَامَةِ شَفِيعًا لِأَصْحَابِهِ. مسلم
“ఖుర్ఆన్ పారాయణం చేయండి. దాన్ని చదివినవారి పట్ల అది ప్రళయ దినాన సిఫారసు చేస్తుంది”. (ముస్లిం 804).

عَنْ أَنَسِ بْنِ مَالِكٍ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ “:هُمْ أَهْلُ الْقُرْآنِ أَهْلُ اللَّهِ وَخَاصَّتُهُ. ابن ماجة
“ఖుర్ఆన్ చదివి ఆచరించువారే అల్లాహ్ యొక్క (విధేయులు, ప్రియ) దాసులు”. (ఇబ్ను మాజ 215).

అందుకే విశ్వాసుడు అది దేనిని ధర్మ సమ్మతం (హలాల్) చేసిందో దానిని ధర్మసమ్మతంగా, దేనిని నిషిద్ధపరిచిందో దానిని నిషిద్ధంగా నమ్మి, అందులో తెలుపబడిన సంస్కారం, సభ్యతలను పాటించి ఆ గుణాలను అలవర్చుకోవాలి. దాని పారాయణ సమయంలో ఈ క్రింది పద్ధతులను పాటించాలి.

 • వుజూతో ఖిబ్లా దిశలో మర్యాదతో కూర్చుండి శ్రద్ధతో చదవాలి.
 • ‘తర్ తీల్’ అనగా నెమ్మదిగా, స్పష్టముగా చదవాలి. మూడుకంటె తక్కువ రోజుల్లో ఖుర్ఆను పఠనము పూర్తి చేయకూడదు. ప్రవక్త e ఇలా సెలవిచ్చారుః

عَنْ عَبْدِ اللَّهِ بْنِ عَمْرٍو عَنِ النَّبِيِّ قَالَ:لَمْ يَفْقَهْ مَنْ قَرَأَ الْقُرْآنَ فِي أَقَلَّ مِنْ ثَلَاثٍ. الترمذي و ابن ماجة
“ఎవరయితే మూడు రోజుల్లోపుగా పూర్తి ఖుర్ఆన్ చదివారో, వారు దాన్ని అర్థం చేసుకోలేదన్న మాట”. (తిర్మిజి 2946, ఇబ్ను మాజ 1347).

 • శ్రద్ధ మరియు అల్లాహ్ భయభీతితో పారాయణం చేయాలి.
 • మంచి స్వరముతో పారాయణం చేయాలి. ప్రవక్త ఇలా సెలవిచ్చారుః

عَنِ الْبَرَاءِ بْنِ عَازِبٍ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ : زَيِّنُوا الْقُرْآنَ بِأَصْوَاتِكُمْ. أبو داود و النسائي
“మీరు ఖుర్ఆన్ మంచి స్వరముతో చదవండి”. (అబూ దావూద్ 1468).

 • చూపుగోళు కొరకు అవుతుందన్న, లేదా నమాజు చేస్తున్నవారికి కలత పెట్టినవారవుతారన్న భయమున్నచో శబ్దంతో గాకుండా మెల్లగా చదవ వచ్చును.
 • ఖుర్ఆన్ పఠనము శ్రద్ధతో, ఏకాగ్రతతో దాని అర్థభావాలను గ్రహిస్తూ, అర్థం చేసుకుంటూ పఠించాలి.
 • పఠించినప్పుడు ఏమరుపాటుతనముగాని, దాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగాని వ్యవహరించకూడదు. అలాంటప్పుడు స్వయంగా తనకుతాను శపించు కున్నట్లవుతుంది. ఎందుకనగా అతను ఈ సందర్భంలో ఈ క్రింది ఆయతులు చదివితే తనకుతాను శపించినవాడవుతాడు.

ثُمَّ نَبْتَهِلْ فَنَجْعَل لَّعْنَتَ ٱللَّهِ عَلَى ٱلْكَـٰذِبِينَ …
{అసత్యం పలికేవారిపై అల్లాహ్ శాపం పడుగాకా అని ప్రార్థిద్ధాము}. (3: ఆలె ఇమ్రాన్: 61).

أَلَا لَعْنَةُ ٱللَّهِ عَلَى ٱلظَّـٰلِمِينَ
{విను! దుర్మార్గుల మీద అల్లాహ్ శాపం పడుతుంది}. (11: హూద్: 18).

 • అల్లాహ్ యొక్క ప్రత్యేక దాసుల, ప్రత్యేక గుణాలు అవలంబించుటకు ప్రయత్నించాలి.

ప్రవక్త పట్ల మర్యాద

ప్రవక్త పట్ల పూర్తి మర్యాదను పాటించడము విధి అని ముస్లిం హృదయాంతరముతో గ్రహిస్తాడు. ఎందుకనగాః

 • విశ్వాసంగల ప్రతీ స్త్రీపురుషుడు ప్రవక్త పట్ల మర్యాద పాటించడము విధి అని అల్లాహ్ తెలిపాడు. అది దివ్య గ్రంథములోని ఈ ఆయతులలోః

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ لَا تُقَدِّمُوا۟ بَيْنَ يَدَىِ ٱللَّهِ وَرَسُولِهِۦ ۖ
{విశ్వాసులారా! మీరు అల్లాహ్ యొక్క, ఆయన ప్రవక్త యొక్క సెలవుకు ముందే తొందర పడకండి}. (49: హుజురాత్: 1).

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ لَا تَرْفَعُوٓا۟ أَصْوَٰتَكُمْ فَوْقَ صَوْتِ ٱلنَّبِىِّ وَلَا تَجْهَرُوا۟ لَهُۥ بِٱلْقَوْلِ كَجَهْرِ بَعْضِكُمْ لِبَعْضٍ أَن تَحْبَطَ أَعْمَـٰلُكُمْ وَأَنتُمْ لَا تَشْعُرُونَ
{విశ్వాసులారా! మీ కంఠస్వరాన్ని, ప్రవక్త కంఠస్వరముకంటే పెంచకండి. మీరు పరస్పరం మాట్లాడుకునే విధంగా ప్రవక్తతో బిగ్గరగా మాట్లాడకండి. దానివల్ల బహుశా మీరు చేసినదంతా మీకు తెలియకుండానే వ్యర్థమై పోవచ్చు}. (49: హుజురాత్: 2).

 • ప్రవక్త పట్ల విధేయత మరియు ప్రేమను అల్లాహ్ విశ్వాసులపై విధిగా జేశాడు. అల్లాహ్ ఆదేశాలు చదవండిః

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَطِيعُوا اللهَ وَأَطِيعُوا الرَّسُول
{విశ్వసులారా! మీరు అల్లాహ్ కు విధేయత చూపండి. ప్రవక్తకు విధేయత చూపండి}. (47: ముహమ్మద్: 33).

وَمَآ ءَاتَىٰكُمُ ٱلرَّسُولُ فَخُذُوهُ وَمَا نَهَىٰكُمْ عَنْهُ فَٱنتَهُوا۟ ۚ
{అల్లాహ్ ప్రవక్త మీకు ఇచ్చిన దాన్ని తీసుకోండి. ఆయన మిమ్మల్ని నిషేధించినదాని జోలికి పోకండి}. (59: హష్ర్: 7).

قُلْ إِن كُنتُمْ تُحِبُّونَ ٱللَّهَ فَٱتَّبِعُونِى يُحْبِبْكُمُ ٱللَّهُ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ
{మీరు అల్లాహ్ ను ప్రేమించుచున్నచో, నన్ను అనుసరించండి అల్లాహ్ మిమ్ము ప్రేమించును. మరియు మీ పాపములను క్షమించును అని ఓ ప్రవక్త నీవు తెలుపుము}. (3: ఆలెఇమ్రాన్: 31). ప్రవక్త ఇలా ఉపదేశించారుః

عَنْ أَبِي هُرَيْرَةَ أَنَّ رَسُولَ اللَّهِ ” قَالَ: لَا يُؤْمِنُ أَحَدُكُمْ حَتَّى أَكُونَ أَحَبَّ إِلَيْهِ مِنْ وَالِدِهِ وَوَلَدِهِ وَالنَّاسِ أَجْمَعِينَ. البخاري
“మీలో నెవరి దృష్టిలోనైనా నేను అతని కుమారునికన్నా, అతని తండ్రికన్నా మరియు ప్రజలందరికన్నా, అధికంగా ప్రేమ పాత్రుణ్ణి కానంత వరకు మీలో ఎవడూ నిడమయిన విశ్వాసుడు కాజాలడు”. (బుఖారి 15, ముస్లిం 44).

ఆయన పట్ల మర్యాద ఎలా మరియు ఎందుకు ఉండాలి అంటేః

 • ఆయన విధేయత ద్వారా. ధార్మిక, ప్రాపంచిక సకల వ్యవహరాల్లో ఆయన అనుకరణ ద్వారా.
 • ఆయన ప్రేమ మరియు గౌరవ మర్యాదపై ఇతరుల ప్రేమ, గౌరవ మర్యాద అధికమించకుండా. అది ఎవరైనా సరే.
 • ఆయన స్నేహం చేసినవారితో స్నేహం, శతృత్వముగా మెదిలినవారితో అదే విధంగా మరియు దేనినైతే ఇష్టపడేవారో దానితో ఇష్టపడి, దేనితోనైతే అయిష్టపడ్డారో దానితో అయిష్టపడి.
 • ఆయన ప్రస్తావించబడినప్పుడు ఆయనపై కరుణ, శాంతికై దుఆ (దరూద్, సలాం) చదువుతూ.
 • ఆయన ఇహపరాల గురించి తెలిపిన వాటిని సత్యపరుచుతూ, మరియు అదే విధంగా ఇహపరలోకాల ఏ అగోచర విషయాలైతే (అల్లాహ్ ఇచ్చిన జ్ఞానంతో) తెలిపారో వాటిని కూడా సత్యపరుచుతూ.
 • ఆయన యొక్క ఏ సున్నతు (సాంప్రదాయా)లను ప్రజలు మరచిపోయారో వాటిని ఆచరణరూపంలో తీసుకొచ్చి, ఆయన తెచ్చిన సత్య ధర్మం యొక్క చాటింపు చేసి, ఆయన ఇచ్చిన పిలుపు అందరి వరకు చేరవేసి మరియు ఆయన శాసనాలను అమలుపరచి.

విశ్వాసుడు స్వయం తనపట్ల పాటించవలసిన మర్యాద

తన ఇహపరాల శుభం, తనకుతాను మంచి శిక్షణలో నడిపించుటపై ఆధార పడియుందని ముస్లిం విశ్వసిస్తాడు. అల్లాహ్ ఇలా తెలిపాడుః

قَدْ أَفْلَحَ مَن زَكَّىٰهَا وَقَدْ خَابَ مَن دَسَّىٰهَا
{నిశ్చయంగా తన ఆత్మను పరిశుద్ధ పరచుకున్న వ్యక్తి సఫలుడయ్యాడు. దానిని అణచివేసినవాడు విఫలుడయ్యాడు}. (91: షమ్స్: 9,10).

وَٱلْعَصْرِ إِنَّ ٱلْإِنسَـٰنَ لَفِى خُسْرٍ إِلَّا ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ وَتَوَاصَوْا۟ بِٱلْحَقِّ وَتَوَاصَوْا۟ بِٱلصَّبْرِ
{కాలం సాక్షిగా! నిస్సందేహంగా మానవుడు పెద్ద నష్టానికి గురిఅయి ఉన్నాడు. విశ్వసించి సత్కార్యాలు చేస్తూ ఉండేవారు, ఒకరికొకరు సత్యోపదేశం, సహనబోధ చేసుకునేవారూ తప్ప}. (103: అస్ర్)). ప్రవక్త సెలవిచ్చారుః

عَنْ أَبِي هُرَيْرَةَ أَنَّ رَسُولَ اللَّهِ قَالَ: كُلُّ أُمَّتِي يَدْخُلُونَ الْجَنَّةَ إِلَّا مَنْ أَبَى قَالُوا: يَا رَسُولَ اللَّهِ وَمَنْ يَأْبَى قَالَ: مَنْ أَطَاعَنِي دَخَلَ الْجَنَّةَ وَمَنْ عَصَانِي فَقَدْ أَبَى. البخاري
“నా అనుచరసంఘంలో ప్రతీ ఒకడు స్వర్గంలో ప్రవేశించగలడు. తిరస్కరించినవాడు తప్ప”. తిరస్కరించినవాడెవడు? ప్రవక్తా అని వారడగ్గా, “నా విధేయులైనవారు స్వర్గంలో చేరుదురు. విధేయులు కానివారు తిరస్కరించినవారు” అని ప్రవక్త బదులిచ్చారు. (బుఖారి 7280).

ఆత్మను శుభ్రపరచి, మంచి శిక్షణలో ఉంచునది విశ్వాసమని, దానిని అణచివేయునది, పాడు చేయునది అవిశ్వాసము, సత్యతరిస్కారము మరియు పాపమని నమ్ముతాడు. అల్లాహ్ ఇలా ఆదేశించాడుః

وَأَقِمِ ٱلصَّلَوٰةَ طَرَفَىِ ٱلنَّهَارِ وَزُلَفًۭا مِّنَ ٱلَّيْلِ
{పగటి రెండు కొనలయందు, రాత్రి కొంతకాలమున నమాజు స్థాపించు. నిశ్చయముగా పుణ్యములు పాపములను దూరం చేస్తాయి}. (11: హూద్: 114). మరోఆదేశం గమనించండిః

كَلَّا ۖ بَلْ ۜ رَانَ عَلَىٰ قُلُوبِهِم مَّا كَانُوا۟ يَكْسِبُونَ
{ఇట్లు కాదు. కాని వీరి కర్మల యొక్క చిలుము వీరి హృదయాలను క్రమ్ముకొని యున్నది}. (83: తత్ ఫీఫ్: 14).

అందుకు ముస్లిం ఎల్లప్పుడూ తన ఆత్మను శుద్ధి చేస్తూ, మంచి శిక్షణ, సంస్కరణలో ఉంచాలి. రేయింబవళ్ళు సత్కార్యాలు చేయడానికి ప్రయత్నిస్తూ, చెడు నుంచి దూరముండాలి. ఆత్మవిమర్శన చేస్తూ ఉండాలి. (అనగా తన ఆత్మ చెడు వైపునకు మ్రొగ్గుతుందా లేక మంచి వైపుకా అనేది పరిశీలిస్తూ ఉండాలి). దానిని మంచి వైపుకు, విధేయత వైపునకు మలచి చెడు మరియు అరాచకము నుంచి దూరముంచడానికి ఈ క్రింది సూత్రాలను అనుకరించాలి.

A- క్షమాభిక్ష (తౌబా):

దాని అర్థం: సర్వ చెడు కార్యాలను, పాపాలను విడనాడుట, ఆ చేసిన పాపముపై పశ్తాత్తాప పడుట మరియు ఇక ముందు తిరిగి ఆ పాపం చేయనని దృఢ సంకల్పం చేయుట. అల్లాహ్ ఆదేశం గమనించండిః

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ تُوبُوٓا۟ إِلَى ٱللَّهِ تَوْبَةًۭ نَّصُوحًا عَسَىٰ رَبُّكُمْ أَن يُكَفِّرَ عَنكُمْ سَيِّـَٔاتِكُمْ وَيُدْخِلَكُمْ جَنَّـٰتٍۢ تَجْرِى مِن تَحْتِهَا ٱلْأَنْهَـٰرُ
{ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ తో నిజమైన క్షమాపణ వేడుకోండి. మీ ప్రభువు మీ పాపములను క్షమించి, కాలువలు ప్రవహించు స్వర్గ వనములలో మిమ్ము ప్రవేశింపజేయునని ఆశ గలదు}. (66: తహ్రీం: 8).

عَنْ أَبِي مُوسَى عَنْ النَّبِيِّ قَالَ: إِنَّ اللَّهَ عَزَّ وَجَلَّ يَبْسُطُ يَدَهُ بِاللَّيْلِ لِيَتُوبَ مُسِيءُ النَّهَارِ وَيَبْسُطُ يَدَهُ بِالنَّهَارِ لِيَتُوبَ مُسِيءُ اللَّيْلِ حَتَّى تَطْلُعَ الشَّمْسُ مِنْ مَغْرِبِهَا
“పగలు పాపము చేసినవారు తౌబా చేయాలని, అల్లాహ్ రాత్రి సమయమున తన చేయి చాపుతాడు. రాత్రి పాపము చేసినవారు తౌబా చేయాలని, పగలు తన చేయి చాపుతాడు. ఇలా పశ్చిమాన సూర్యోదయము అయ్యే వరకు ఉంటుంది}. (ముస్లిం 2759).

B- మురాఖబ:

అనగా ప్రతీ క్షణం విశ్వాసుడు తన ప్రభువుతో భయపడుతూ ఉండాలి. అల్లాహ్ అతన్ని చూస్తున్నాడు, అతని రహస్య బహిరంగ విషయాలను గుర్తెరుగువాడని తెలుసుకోవాలి. ఈ విధంగా మనుసు అల్లాహ్ దృష్టి తనపై ఉన్నదని విశ్వసించి, అతని ధ్యానంతో చనువు, అతని విధేయతతో ఆనందం పొందుతుంది. అతని వైపు మరలి అతనిపై నమ్మకం ఉంచి తను ఇతరులపై ఆధారపడకుండా ఉంటాడు. క్రింది ఆయతులలో తెలుపబడిన ‘అస్లమ వజ్ హహు’ యొక్క భావము ఇదే.

وَمَنْ أَحْسَنُ دِينًۭا مِّمَّنْ أَسْلَمَ وَجْهَهُۥ لِلَّهِ وَهُوَ مُحْسِنٌۭ
{అల్లాహ్ ఆజ్ఞలకు శిరసావహించి సత్కార్యములు చేయువాని మతముకంటే ఎవ్వని మతము శ్రేష్ఠమైనది}. (4: నిసా: 125). అదే విధంగా ఈ క్రింది ఆయతులో కూడా తెలుపబడిందిః

وَمَا تَكُونُ فِى شَأْنٍۢ وَمَا تَتْلُوا۟ مِنْهُ مِن قُرْءَانٍۢ وَلَا تَعْمَلُونَ مِنْ عَمَلٍ إِلَّا كُنَّا عَلَيْكُمْ شُهُودًا إِذْ تُفِيضُونَ فِيهِ
{నీవు ఏ స్థితిలో ఉన్నా, ఖుర్ఆను నుండి దేనిని వినిపించినా, (మానవులారా) మీరు ఏది చేసినా, ఆ అన్ని సందర్భాలలోనూ మేము మిమ్మల్ని చూస్తునే ఉంటాము}. (10: యూనుస్: 61). ప్రవక్త ఆదేశం:

أَنْ تَعْبُدَ اللَّهَ كَأَنَّكَ تَرَاهُ فَإِنْ لَمْ تَكُنْ تَرَاهُ فَإِنَّهُ يَرَاكَ
“నీవు అల్లాహ్ ను ప్రార్థిస్తున్నప్పుడు అతన్ని చూస్తున్నట్లుగా భావించు. అతన్ని చూస్తున్నట్లు నీవు భావించలేకపోతే, నిశ్చయంగా ఆయన నిన్ను చూస్తున్నాడని నమ్ము”. (బుఖారి 50, ముస్లిం 8).

C- ఆత్మ పరిశీలన ( ముహాసబ):

ఎప్పుడైతే ముస్లిం ఇహలోకములో రేయింబవళ్ళు కష్టపడతాడో, శ్రమిస్తాడో, దాని మంచి ఫలితం పరలోకములో పొందాలని, అతనికి గౌరవ స్థానం కలగాలని, అల్లాహ్ సంతృప్తి పొందాలని. మరియు ఈ లోకము కష్టపడి (పుణ్యాలు సంపాదించడానికే) ఉన్నప్పుడు, ఒక వ్యాపారి దృష్టిలో తన మూలధనం విలువ ఎంతనో అంతకంటే మించిన విలువ ముస్లిం దృష్టిలో అల్లాహ్ విధించిన విధులు ఉండాలి. వ్యాపారి మూలధనంపై వచ్చే లాభాన్ని చూసుకున్నట్లు తను నఫిల్ (విధిగా లేని అదనపు) సత్కార్యాలను చూసుకోవాలి. పాపాలను, (అల్లాహ్, ఆయన ప్రవక్త అవిధేయతలను) వ్యాపారంలో నష్టం మాదిరిగా భావించాలి. పొద్దంతా చేసిన వాటిని లెక్కించుకునుటకు, ఆత్మపరిశీలనకై ఒకానొక సమయం ఏకాంతంలో గడపాలి. విధులలో ఏదైనా లోటు, కొరతా చూసినట్లైతే తననుతాను మందలించుకొని, నిందించుకొని అప్పటికప్పుడే – ఆ కొరతను పూర్తి చేసేవి ఉంటే – పూర్తి చేయాలి. అలా పూర్తి అయ్యేవి కాకుంటే నఫిల్ల ద్వారా పూర్తి చేయాలి. ఒకవేళ నఫిల్లో ఏదైనా కొరత, లోటు ఉంటే వాటికి బదులుగా అధికంగా నఫిల్లు చేసి ఆ లోటును తీర్చాలి. నిశిద్ధ కార్యాలకు పాల్పడి నష్టం వాటిల్లినట్లయితే పశ్చాత్తాపపడి, క్షమాపణ వేడుకోవాలి. అల్లాహ్ వైపునకు మరలి దానికి ప్రతికారంగా మంచి పనిచేయాలి. ఆత్మ పరిశీలన (ముహసబయె నఫ్స్) అన్నదానికి ఇదే అర్థం. దీనికి నిదర్శన అల్లాహ్ యొక్క ఈ ఆదేశం:

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ ٱتَّقُوا۟ ٱللَّهَ وَلْتَنظُرْ نَفْسٌۭ مَّا قَدَّمَتْ لِغَدٍۢ ۖ وَٱتَّقُوا۟ ٱللَّهَ ۚ إِنَّ ٱللَّهَ خَبِيرٌۢ بِمَا تَعْمَلُونَ ١٨
{విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్ కు భయపడండి. ప్రతి వ్యక్తీ తాను రేపటి కొరకు ఏమి సమకూర్చుకున్నాడో చూసుకోవాలి. అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ కు మీరు చేసే పనులన్నీ తెలుసు}. (59: హష్ర్: 18).

ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఇలా అనేవారుః

عَنْ عُمَرَ بْنِ الْخَطَّابِ قَالَ: حَاسِبُوا أَنْفُسَكُمْ قَبْلَ أَنْ تُحَاسَبُوا
‘మీరు పరిశీలింపబడే (రోజు రాక ముందే) మీ ఆత్మలను పరిశీలించుకోండి”. (తిర్మిజి 2459).

D- తీవ్ర ప్రయత్నం (ముజాహద):

శత్రువులలో అతి పెద్ద శత్రువు, తన మనసేనన్న విషయం ప్రతి ముస్లిం తెలుసుకోవాలి. చెడు వైపునకు ప్రేరేపించుట, మంచి నుండి దూరముంచుట, చెడునాదిశించి, సుఖశాంతులను కోరుట మరియు మనోవాంఛలను, అందులో నష్టమే ఉన్నప్పటికీ వాటిని పూర్తి చేయుటకు ప్రేరేపించుట దాని స్వాభావిక గుణం. ఈ విషయం తెలుసుకున్న ముస్లిం తన మనస్సును సత్కార్యాలు చెయుటకు, చెడు నుండి దూరముంచుటకు ప్రయత్నిస్తాడు. అల్లాహ్ ఆదేశం:

وَٱلَّذِينَ جَـٰهَدُوا۟ فِينَا لَنَهْدِيَنَّهُمْ سُبُلَنَا
{మా కొరకు తీవ్ర ప్రయత్నం చేసేవారికి మేము మార్గాలను చూపుతాము}. (29: అన్ కబూత్: 69).

ఇది భక్తుల సుగుణము, విశ్వాసుల, సత్యవంతుల బాట. ప్రవక్త e రాత్రి నమాజు చేస్తూ చేస్తూ తమ పాదాలలో వాపు వచ్చేది. దీని గురించి ప్రశ్నింపబడినప్పుడు “ఏమి? నేను అతని కృతజ్ఞత తెలుపే దాసున్ని కాకూడదా?అని అనేవారు. (బుఖారి 1130, ముస్లిం 2819).

తల్లిదండ్రుల హక్కు

విశ్వాసుడు తన తల్లిదండ్రుల హక్కు తనపై ఉన్నదని, వారి సేవ సత్కర్యాలు వారి విధేయత విధి అని విశ్వసిస్తాడు. అది వారు జన్మనిచ్చి నందుకు లేక వారు చిన్నతనము నుండి చేసిన ఉపకారానికి బదులుగా అని కాదు. వారి విధేయత అల్లాహ్ విధి చేశాడని మాత్రమే. చదవండి ఈ ఆయుతుః

وَقَضَىٰ رَبُّكَ أَلَّا تَعْبُدُوٓا۟ إِلَّآ إِيَّاهُ وَبِٱلْوَٰلِدَيْنِ إِحْسَـٰنًا
{నీ ప్రభువు తనను తప్ప ఇతరులను మీరు ఆరాధింప కూడదనియు, తల్లి దండ్రులకు మేలు చేయువలెననియు ఆజ్ఞాపించెను}. (17: బనీ ఇస్రాయీల్: 23). ప్రవక్త e ఉపదేశించారని అబూ బక్ర ఉల్లేఖించారుః

عَن أَبِي بَكْرَةَ قَالَ: قَالَ النَّبِيُّ : أَلَا أُنَبِّئُكُمْ بِأَكْبَرِ الْكَبَائِرِ ثَلَاثًا قَالُوا بَلَى يَا رَسُولَ اللَّهِ قَالَ: الْإِشْرَاكُ بِاللَّهِ وَعُقُوقُ الْوَالِدَيْنِ
“అతి పెద్ద ఘోర పాపము ఏదో మీకు తెలుపనా?” అని ఒకసారి ప్రవక్త అడుగగా, తప్పక తెలుపండి ఓ దైవప్రవక్తా! అని వారు విన్నవించుకోగా, “అల్లాహ్ కు సాటి కల్పించుట మరియు తల్లిదండ్రులకు అవిధేయులగుట” అని బదులిచ్చారు మహా ప్రవక్త. (బుఖారి 2654, ముస్లిం 87).

عن عَبْدِ اللَّهِ قَالَ: سَأَلْتُ النَّبِيَّ ” أَيُّ الْعَمَلِ أَحَبُّ إِلَى اللَّهِ قَالَ: الصَّلَاةُ عَلَى وَقْتِهَا قَالَ: ثُمَّ أَيٌّ قَالَ: ثُمَّ بِرُّ الْوَالِدَيْنِ قَالَ: ثُمَّ أَيٌّ قَالَ: الْجِهَادُ فِي سَبِيلِ اللَّهِ
అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ కథనం, నేను ప్రవక్తతో ‘అల్లాహ్ కు ప్రీతికరమైన సత్కార్యమేది’ అని అడిగాను, దానికి మహాప్రవక్త “నమాజు దాని సమయంలో చేయుట” అని చెప్పారు. మళ్ళీ ఏది అని అడుగుతే “తల్లిదండ్రులతో ఉపకారము” అని చెప్పారు. మళ్ళీ ఏది అని అడగ్గా, “అల్లాహ్ మార్గంలో యుధ్ధం చేయుట” అని బదులిచ్చారు. (బఖారి 527, ముస్లిం 85).

جَاءَ رَجُلٌ إِلَى النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَاسْتَأْذَنَهُ فِي الْجِهَادِ فَقَالَ: أَحَيٌّ وَالِدَاكَ قَالَ: نَعَمْ قَالَ: فَفِيهِمَا فَجَاهِدْ. البخاري ، مسلم
ఒక వ్యక్తి ప్రవక్త వద్దకు ధర్మపోరాటంలో పాల్గొనటానికి అనుమతి కొరకు వచ్చాడు. ప్రవక్త “నీ తల్లిదండ్రి ఉన్నారా?” అని అడిగారు. ‘అవును’ అని అతను సమాధానం చెప్పగా“వెళ్ళి వారి సేవలో ఉండు” అని చెప్పారు ప్రవక్త. (బుఖారి 3004, ముస్లిం 2549).

ఒక ముస్లిం, తల్లిదండ్రుల ఈ హక్కును గుర్తించి దాన్ని నెరవేర్చాలి. అది అల్లాహ్ యొక్క విధేయత, ఆయన ఆజ్ఞ పాలిస్తున్నట్లు భావించాలి. తన తల్లిదండ్రుల పట్ల ఈ క్రింది పద్ధతులను కూడా పాటించాలిః

 • అల్లాహ్ విధేయత మరియు ధర్మానికి వ్యతిరేకము లేని, వారి ప్రతీ ఆజ్ఞను పాలించి, నిషేధించిన దాని నుండి దూరముండాలి. ఎందుకనగా సృష్టికర్త అవిధేయతకు గురి చేసే ఏ వ్యక్తి మాట వినకూడదు. అల్లాహ్ ఇలా ఆదేశించాడుః

وَإِن جَـٰهَدَاكَ عَلَىٰٓ أَن تُشْرِكَ بِى مَا لَيْسَ لَكَ بِهِۦ عِلْمٌۭ فَلَا تُطِعْهُمَا ۖ وَصَاحِبْهُمَا فِى ٱلدُّنْيَا مَعْرُوفًۭا
{నీకు తెలియని దానిని నాకు సాటిగా కల్పించమని వారిద్దరు నిన్ను బలవంతం పెట్టినచో నీవు వారి మాట వినకుము. మరి ఇహలోక విషయములో ధర్మ ప్రకారముగా వారికి తోడుగా ఉండుము}. (31: లుఖ్మాన్: 15). ప్రవక్త ఉపదేశించారుః

=لاَ طَاعَةَ لِمَخلُوقٍ فِي مَعصِيةِ الْخَالِق. صحيح الجامع
“అల్లాహ్ అవిధేయతకు గురి చేసే ఏ మానవుని ఆజ్ఞ పాలించకూడదు”. (బఘవి ‘షర్హుస్సున్న’ హ.నం: 2455లో సేకరించారు. సహీహుల్ జామి 7520).

 • తల్లిదండ్రులతో గౌరవ మర్యాదలతో మెలగాలి. కరుణతో మెలగి, మృదువుగా, మంచి పద్ధతిలో మాట్లడాలి. మంచి విధంగా వ్యవహరించాలి. వారితో గొంతెత్తి మాట్లాడకూడదు. వారిని అతిక్రమించకూడదు. భార్యాపిల్లలను వారిపై ఆధిక్యత ఇవ్వకుండా ఉండాలి. వారి అనుమతి, ఇష్టము లేనిది ప్రయాణము చేయకూడదు.
 • ఏ ఏ విధంగా వారికి మేలు చేయగలుగుతారో చేస్తూ ఉండాలి. ఉదాః తిండి, దుస్తులు మంచి విధంగా ఇవ్వడం. అనారోగ్య స్థితిలో తగిన చికిత్స చేయించి, వారిని కష్టకాలాల్లో ఆదుకోవడం. వారిని తన ఆత్మపై ప్రాధాన్యత ఇవ్వడం.
 • వారి గురించి దుఆ, ఇస్తిగ్ఫార్ చేయాలి. వారి స్నేహితులను, అభిమానులను గౌరవించాలి.

సంతానం హక్కులు

సంతానం హక్కులు తండ్రిపై గలవు. మొదటి హక్కు వారి గురించి మంచి తల్లిని ఎన్నుకొనుట. పుట్టిన తరువాత మంచి పేరు పెట్టుట. ఏడవ రోజు అఖీఖ చేయుట. సున్నతీ (ఖత్న) చేయుట. కరుణ, దయతో చూస్తూ వారి ఖర్చులను భరిస్తూ, వారికి ఇస్లామీయ విద్యాశిక్షణల మంచి ఏర్పాట్లు చేయుట. ఇస్లాం ధర్మ ప్రకారం ఆ విధులను, సాంప్రదాయాలను నెరవేర్చే శిక్షణ కూడా ఇస్తూ, యౌవనములో చేరిన తరువాత వివాహము చేయుట. ఆ తరువాత తను తల్లిదండ్రి ఛాయలో ఉండవచ్చు లేక స్వయంగా జీవితం గడపవచ్చుయ ఈ విషయంలో ముందు అల్లాహ్ ఆదేశాలను, పిదప ప్రవక్త ప్రవచనాలను గమనించండిః

وَالْوَالِدَاتُ يُرْضِعْنَ أَوْلَادَهُنَّ حَوْلَيْنِ كَامِلَيْنِ لِمَنْ أَرَادَ أَنْ يُتِمَّ الرَّضَاعَةَ وَعَلَى الْمَوْلُودِ لَهُ رِزْقُهُنَّ وَكِسْوَتُهُنَّ بِالْمَعْرُوفِ ﴾ البقرة: ۲۳۳ 
{తమ సంతానము యొక్క పాలు పట్టే గడువు పూర్తి కావాలని తండ్రులు కోరిన పక్షంలో, తల్లులు తమ బిడ్డలకు పూర్తిగా రెండు సంవత్సరాలు పాలు పట్టాలి. అప్పుడు ఆమెకు పిల్లల తండ్రి తగు రీతిగా భోజన, వస్త్రాలను ఇచ్చి పోషించవలసిన బాధ్యత ఉంటుంది}. (2: బఖరః 233).

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ قُوٓا۟ أَنفُسَكُمْ وَأَهْلِيكُمْ نَارًۭا وَقُودُهَا ٱلنَّاسُ وَٱلْحِجَارَةُ
{విశ్వాసులారా! మీరు మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులనూ మానవులు రాళ్ళు ఇంధనం కాబోయే నరకాగ్ని నుండి కాపాడుకోండి}. (66: తహ్రీమ్: 6).

وَلَا تَقْتُلُوٓا۟ أَوْلَـٰدَكُمْ خَشْيَةَ إِمْلَـٰقٍۢ ۖ نَّحْنُ نَرْزُقُهُمْ وَإِيَّاكُمْ
{పేదరికానికి భయపడి మీరు మీ సంతానాన్ని హతమార్చకండి. మేము వారికీ ఉపాధిని ఇస్తాము, మీకూ ఇస్తాము}. (17: బనీ ఇస్రాయీల్: 31). ప్రవక్త ఆదేశాలను కూడా శ్రద్ధగా చదవండిః

عَنْ سَمُرَةَ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ : الْغُلَامُ مُرْتَهَنٌ بِعَقِيقَتِهِ يُذْبَحُ عَنْهُ يَوْمَ السَّابِعِ وَيُسَمَّى وَيُحْلَقُ رَأْسُهُ
“పిల్లవాడు అఖీఖకు బదులుగా కుదువకు ఉంటాడు. ఏడవ రోజు అతని పేరున అఖీఖ జంతువు జిబహ్ చేయాలి. అదే రోజు మంచి పేరు పెట్టి తల వెంట్రుకలు తీయాలి”. (తిర్మిజి 1522).

عَنِ النُّعْمَانَ بْنَ بَشِيرٍ قَالَ: قَالَ النَّبِيُّ :وَاعْدِلُوا بَيْنَ أَوْلَادِكُمْ
“మీ సంతానానికి ఏదైనా ఇవ్వదలుచుకుంటే అందరికీ సమానంగా ఇవ్వండి}. (బుఖారి 2587, ముస్లిం 1623).

مُرُوا أَوْلَادَكُمْ بِالصَّلَاةِ وَهُمْ أَبْنَاءُ سَبْعِ سِنِينَ وَاضْرِبُوهُمْ عَلَيْهَا وَهُمْ أَبْنَاءُ عَشْرٍ وَفَرِّقُوا بَيْنَهُمْ فِي الْمَضَاجِعِ
“మీ సంతానం ఏడేళ్ళ వయస్సుకు చేరుకోగానే వారిని నమాజ్ చేయుటకు ఆదేశించండి. వారు పదేళ్ళ వయస్సులో అడుగుపెట్టి కూడా నమాజ్ చేయకున్నట్లైతే వారిని దండించండి. ఇంకా వారి పడకల్ని కూడా వేరు చేసెయ్యండి”. (అబూ దావూద్ 495).

సోదరభావం

ఒక ముస్లింకు తన తల్లిదండ్రి మరియు సంతానము పట్ల ఉన్నటువంటి ప్రేమ, మర్యాదలు తన సోదరుల పట్ల కూడా ఉండాలి. తల్లిదండ్రుల పట్ల పాటించునటువంటి మర్యాద చిన్నవారు (తమ్ముళ్ళు, చెల్లెలు) తమ పెద్దల (అన్నల, అక్కల) పట్ల పాటించాలి. తల్లిదండ్రులు తమ సంతానాన్ని చూసుకునే విధంగా పెద్దవారు తమ చిన్నవారిని పట్లగల హక్కులను గమనించాలి. ఇది ప్రవక్త యొక్క ఈ ఆదేశానుసారం:

يَدُ الْمُعْطِي الْعُلْيَا وَابْدَأْ بِمَنْ تَعُولُ أُمَّكَ وَأَبَاكَ وَأُخْتَكَ وَأَخَاكَ ثُمَّ أَدْنَاكَ أَدْنَاكَ
“ఎల్లప్పుడూ ఇచ్చేవారి చెయ్యే పై చెయ్యి. నీకు అతి దగ్గర ఉన్న బంధువులపై నీవు ముందుగా ఖర్టు పెట్టు. నీ తల్లి, నీ తండ్రికి, మళ్ళి నీ సోదరిమణి, నీ సోదరినికి, ఆ తరువాత ఎవరు ఎంత దగ్గరివారో వారికి”. (నిసాయి 2532).

భార్యాభర్తలు

క్రింద తెలుపబడే భార్యాభర్తలిద్దరిపై ఉన్న పరస్పర హక్కులను ముస్లిం తెలుసుకోవాలి. అల్లాహ్ యొక్క ఆదేశం ఇలా వుంది.

وَلَهُنَّ مِثْلُ ٱلَّذِى عَلَيْهِنَّ بِٱلْمَعْرُوفِ ۚ وَلِلرِّجَالِ عَلَيْهِنَّ دَرَجَةٌۭ ۗ وَٱللَّهُ عَزِيزٌ
{మగవారికి మహిళలపై ఉన్నటువంటి హక్కులే ధర్మం ప్రకారం మహిళలకు కూడా మగవారిపై ఉన్నాయి. కాని పురుషులకు స్త్రీలపై కొంచెం ఆధిక్యం ఉన్నది}. (2: బఖరః 228).

ఈ ఆయతు వధువరులిద్దరిలో ప్రతీ ఒక్కరిపై హక్కులున్నవని స్పష్టం చేసింది. మరియు పురుషునికి ప్రత్యేకంగా వారిపై ఉన్న ఆధిక్యతను కూడా తెలుపబడింది. ప్రవక్త హజ్జతుల్ విదాలో ఇలా సెలవిచ్చారుః

أَلَا إِنَّ لَكُمْ عَلَى نِسَائِكُمْ حَقًّا وَلِنِسَائِكُمْ عَلَيْكُمْ حَقًّا . الترمذي
“వినండి! మీ హక్కులు కొన్ని మీ భార్యాలపై ఉన్నాయి. మరియు మీ భార్యాల హక్కులు కూడా కొన్ని మీపై ఉన్నాయి”. (తిర్మిజి 1163).

కొన్ని హక్కులు పరస్పరంగా కలసి ఉన్నాయి. మరి కొన్ని ప్రతీ ఒక్కరికి ప్రత్యేకంగా వేరువేరున్నవి. పరస్పరములో ఉన్న హక్కలు ఇవిః

1- విశ్వసనీయతః పరస్పరము ప్రతీ ఒకరు తన సంఘజీవితో విశ్వసనీయతతో మెలగాలి. ఏ చిన్న విషయములోనైనా, పెద్ద విషయములోనైనా, మోసము చేయకూడదు.

2- పరస్పర ప్రేమాభీమానాలు కలిగి జీవితాంతరము ఒకరు మరొకరితో ప్రేమ, ఉల్లాసము, సంతోషముతో మెలిగి యుండాలి. ఇది అల్లాహ్ యొక్క ఈ ఆదేశానుసారం:

وَمِنْ ءَايَـٰتِهِۦٓ أَنْ خَلَقَ لَكُم مِّنْ أَنفُسِكُمْ أَزْوَٰجًۭا لِّتَسْكُنُوٓا۟ إِلَيْهَا وَجَعَلَ بَيْنَكُم مَّوَدَّةًۭ وَرَحْمَةً
{ఆయన సూచనలలో మరొకటి ఏమిటంటే; ఆయన మీ కొరకు భార్యలను మీ జాతిలో నుండే సృష్టించాడు. మీరు వారి వద్ద శాంతిని పొందటానికి మీ మధ్య ప్రేమనూ, కారుణ్యాన్నీ సృజించాడు}. (30: రూమ్: 21). ప్రవక్త చెప్పారుః

مَنْ لَا يَرْحَمُ لَا يُرْحَمُ . البخاري و مسلم
“కరుణించనివాడు కరుణింపబడడు”. (బుఖారి 5997, ముస్లిం 2318).

3- పరస్పర నమ్మకముః ప్రతీ ఒకరు మరొకరితో పూర్తి నమ్మకముతో జీవించాలి. ఇద్దరి మధ్య సత్యము, మంచితనము మరియు చిత్త శుద్ధిలో ఏలాంటి మోసం, అనుమానం రానివ్వకూడదు. విశ్వాసుల విషయములో ఖుర్ఆన్ ఇలా చెప్పిందిః

إِنَّمَا ٱلْمُؤْمِنُونَ إِخْوَةٌۭ فَأَصْلِحُوا۟ بَيْنَ أَخَوَيْكُمْ
{నిస్సందేహంగా విశ్వాసులు పరస్పరం సోదరులు}. (49: హుజురాత్: 10). ప్రవక్త ముహమ్మద్ ఇలా సెలవిచ్చారుః

عَنْ أَنَسٍ عَنْ النَّبِيِّ قَالَ: لَا يُؤْمِنُ أَحَدُكُمْ حَتَّى يُحِبَّ لِأَخِيهِ مَا يُحِبُّ لِنَفْسِهِ . البخاري ، مسلم
“మీలోనెవరైనా తనకు ఇష్టమున్న దానిని తన సోదరుని కొరకు కూడా ఇష్టపడనంత వరకు నిజమైన విశ్వాసి కాజాలడు”. (బుఖారి 13, ముస్లిం 45).

భార్యభర్తల సంబంధము విశ్వసనీయమైన సోదరత్వాన్ని మరీ నమ్మకమైనదిగా చేస్తుంది.

4- పరస్పర ప్రతీ విషయములో మృదుత్వమును పాటిస్తూ, నగుముఖము, గౌరవ మర్యాదతో ఉండాలి. ఇవే వైవాహిక జీవిత సంస్కారాలు. ఈ ఆదేశమే అల్లాహ్ ఈ క్రింది ఆయతులో ఇచ్చాడుః

وَعَاشِرُوهُنَّ بِالْمَعْرُوفِ
{వారితో సద్భావంతో జీవతం గడపండి}. (4: నిసా: 19). ఇదే మంచి హితువు చేస్తూ ప్రవక్త ఇలా సెలవిచ్చారుః

عَنْ أَبِي هُرَيْرَةَ عَنِ النَّبِيِّ قَالَ: وَاسْتَوْصُوا بِالنِّسَاءِ خَيْرًا
“స్త్రీలకు ఉత్తమరీతిలో బోధచేయండి”. (బుఖారి 5186, ముస్లిం 1468).

పైన తెలుపబడినవి పరస్పర హక్కులు. ప్రతీ ఒకరికీ ప్రత్యేకమైన హక్కులు కూడా ఉన్నాయి. వాటిని వారిద్దరిలో ప్రతీఒకరు మరొకరి పట్ల పాటించాలి.

భార్య హక్కులు భర్తపై

1- ఆమెతో మంచితనముతో సంసారము చేయాలి. ఈ ఆదేశమే అల్లాహ్ ఇచ్చాడుః

وَعَاشِرُوهُنَّ بِالْمَعْرُوفِ
{వారితో సద్భావంతో జీవతం గడపండి}. (4: నిసా: 19). ఇదే మంచి హితువు చేస్తూ ప్రవక్త ఇలా సెలవిచ్చారుః

తను తినేది ఆమెకు తినిపించాలి. తను తొడుగునది ఆమెకు తొడిగించాలి. భర్త అవిధేయతకు ఆమె గురి అవుతున్న సందర్భంలో అల్లాహ్ ఆదేశించిన రీతిలో ఆమెకు మంచి శిక్షణ ఇవ్వాలి. తిట్టకుండా, దూషించకుండా, శాపనార్థాలు ఇవ్వకుండా హితువు చెప్పాలి. ఇంతలో విధేయురోలయితే సరే. లేనిచో దండించాలి. కాని రక్తము చిల్లకుండా, గాయపడకుండా, శరీరాంగములో ఏ అంగము విరగకుండా. ముఖముపై కూడా కొట్టకూడదు. అల్లాహ్ ఇలా ఆదేశించాడుః

وَٱلَّـٰتِى تَخَافُونَ نُشُوزَهُنَّ فَعِظُوهُنَّ وَٱهْجُرُوهُنَّ فِى ٱلْمَضَاجِعِ وَٱضْرِبُوهُنَّ ۖ فَإِنْ أَطَعْنَكُمْ فَلَا تَبْغُوا۟ عَلَيْهِنَّ سَبِيلً
{ధిక్కరిస్తారనే భయం మీకు ఏ స్త్రీల విషయంలో కలుగుతుందో వారికి నచ్చజెప్పండి. పడక గదులలో వారికి దూరంగా ఉండండి. మరియు దండంచండి. తురవాత వారు మీకు విధేయులైతే అకారణంగా వారిని వేధించటానికి సాకులు వెతక్కండి}. (4: నిసా: 34).

మా భార్యల హక్కు మాపై ఏముందని అడిగిన వ్యక్తకి సమాధానమిస్తూ ప్రవక్త చెప్పారుః

عَنِْ مُعَاوِيَةَ الْقُشَيْرِيِّ قَالَ قُلْتُ يَا رَسُولَ اللَّهِ مَا حَقُّ زَوْجَةِ أَحَدِنَا عَلَيْهِ قَالَ: أَنْ تُطْعِمَهَا إِذَا طَعِمْتَ وَتَكْسُوَهَا إِذَا اكْتَسَيْتَ وَلَا تَضْرِبِ الْوَجْهَ وَلَا تُقَبِّحْ وَلَا تَهْجُرْ إِلَّا فِي الْبَيْتِ . أبو داود
“నీవు తిన్నప్పుడు ఆమెకు తినిపించు. నీవు తొడిగినప్పుడు ఆమెకు తొడిగించు. ముఖముపై కొట్టకు. ఆమెను దూషించకు. ఇంటి హద్దులోనే ఉండి ఆమెతో దూరముండు”. (అబూ దావూద్ 2142). మరోసారి చెప్పారుః

=لَا وَحَقُّهُنَّ عَلَيْكُمْ أَنْ تُحْسِنُوا إِلَيْهِنَّ فِي كِسْوَتِهِنَّ وَطَعَامِهِنَّ
“వినండి! వారి పట్ల మీపై ఉన్న హక్కు ఏమనగా వారికి మీరు మంచి విధంగా ఆహారము, వస్త్రములు సమకూర్చండి”. (తిర్మిజి). మరీ చదవండిః

عَن أَبِي هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ : لَا يَفْرَكْ مُؤْمِنٌ مُؤْمِنَةً إِنْ كَرِهَ مِنْهَا خُلُقًا رَضِيَ مِنْهَا آخَرَ. مسلم
“విశ్వాసి తన విశ్వాసురాలయిన భార్యను అసహ్యించుకోకూడదు. ఆమెలోని ఏదయినా ఒక గుణము తనకు నచ్చకపోయినా ఆమెలోని ఇతర గుణములతో ఇష్టపడవచ్చు”. (ముస్లిం 1469).

2- ధార్మిక నియమాలు తెలియని భార్యకు ధార్మిక విద్య నేర్పాలి. ధార్మిక సభల్లో పాల్గొనుటకు ప్రోత్సహించి, అనుమతివ్వాలి. ధార్మిక నియమాలు తెలుసుకోవడము అన్నపానియాల అవసరాలకన్నా ఎక్కువ అవశ్యకమైనది. అల్లాహ్ యొక్క ఈ ఆదేశంపై శ్రద్ధ వహించండిః

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ قُوٓا۟ أَنفُسَكُمْ وَأَهْلِيكُمْ نَارًۭا وَقُودُهَا ٱلنَّاسُ وَٱلْحِجَارَةُ
{విశ్వాసులారా! మీరు మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులనూ, మానవులు, రాళ్ళు ఇంధనం కాబోయే అగ్ని నుండి కాపాడుకోండి}. (66: తహ్రీం: 6).

3- ఇస్లాం బోధనల ప్రకారం తాను ఆచరిస్తూ, ఆమెను కూడా ఆచరించుటకు ఆదేశించాలి. తన భార్యను పర్ద లేకుండా, మహ్రం[3] లేకుండా బైటికి వెళ్ళనీయ కూడదు. భార్య యొక్క బాధ్యుడు భర్త గనక ఆమెను కాపాడటము, ఆమె మంచి చెడులు చూసుకొనుట అతని బాధ్యతే.

الرِّجَالُ قَوَّامُوْنَ عَلَى النِّسَاءِ
{పురుషులు స్త్రీలకు అధికారులు}. (4: నిసా: 34). ప్రవక్త ఇలా ఆదేశించారుః

وَالرَّجُلُ رَاعٍ فِي أَهْلِهِ وَهُوَ مَسْئُولٌ عَنْ رَعِيَّتِهِ
“భర్త తనింటి యజమాని, బాధ్యుడు. అతని సంరక్షణలో ఉన్నదాని గురించి అతన్నే ప్రశ్నించబడును”. (బుఖారి 893, ముస్లిం 1829).

భర్త హక్కులు భార్యపై

క్రింద తెలుపబడే పద్ధతులు, హక్కులను భార్య తన భర్త పట్ల పాటించాలి.

1- అల్లాహ్ అవిధేయతకు గురిచేయని భర్త మాటను అనుసరించాలి. అల్లాహ్ ఆదేశం కూడా ఇదేః

فَإِنْ أَطَعْنَكُمْ فَلَا تَبْعُوْا عَلَيْهِنَّ سَيْلام
{వారు మీకు విధేయులైతే అకారణంగా వారిని వేధించటానికి సాకులు వెతక్కండి}. (4: నిసా: 24). ప్రవక్త ఆదేశం ఇలా వుంది:

عَنْ أَبِي هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ : إِذَا دَعَا الرَّجُلُ امْرَأَتَهُ إِلَى فِرَاشِهِ فَأَبَتْ فَبَاتَ غَضْبَانَ عَلَيْهَا لَعَنَتْهَا الْمَلَائِكَةُ حَتَّى تُصْبِحَ
“భర్త తన భార్యను పడక వైపునకు పిలిచినప్పుడు ఆమె రాకపోతే, ఆ కారణంగా భర్త రాత్రంతా ఆమెపై కోపంతో గడిపితే, ఆ భార్యను అల్లాహ్ దూతలు ఉదయం వరకు శపిస్తూ ఉంటారు”. (బుఖారి 3237, ముస్లిం 1736). మరోసారి ఇలా ఆదేశించారుః

عَنْ أَبِي هُرَيْرَةَ عَنْ النَّبِيِّ : قَالَ لَوْ كُنْتُ آمِرًا أَحَدًا أَنْ يَسْجُدَ لِأَحَدٍ لَأَمَرْتُ الْمَرْأَةَ أَنْ تَسْجُدَ لِزَوْجِهَا
“నేను ఎవరినైనా మరొకరి ఎదుట సజ్దా చేయుటకు సెలవిచ్చేవాణ్ణైతే; భార్య తన భర్త ఎదుట సజ్దా చేయాలని ఆజ్ఞ ఇచ్చేవాణ్ణి”. (అల్లాహ్ తప్ప ఇతరులకు సజ్దా చేయుట యోగ్యం లేదు గనక ఈ ఆజ్ఞ ఇవ్వలేదు). (తిర్మిజి 1159).

2- తను భర్త యొక్క గౌరవప్రతిష్టలను కాపాడాలి. అతని ధనసంతానము మరియు సర్వ గృహ సామాగ్రిని జాగ్రత్తపరచాలి. అల్లాహ్ ఆదేశం చూడండి:

فَٱلصَّـٰلِحَـٰتُ قَـٰنِتَـٰتٌ حَـٰفِظَـٰتٌۭ لِّلْغَيْبِ بِمَا حَفِظَ ٱللَّهُ
(సుగుణవంతులైన స్త్రీలు విధేయత కలిగివుంటారు. పురుషులు లేనప్పుడు అల్లాహ్ రక్షణలో ఉంటూ వారి హక్కులను కాపాడుతారు. (4: నిసా: 34). ప్రవక్త ఇలా ఉపదేశించారు:

وَالْمَرْأَةُ رَاعِيَةٌ فِي بَيْتِ زَوْجِهَا وَمَسْؤُولَةٌ عَنْ رَعِيَّتِهَا – البخاري 
స్త్రీ తన భర్త ఇంటి బాధ్యురాలు. తన బాధ్యతలో ఉన్నవాటి గురించి ఆమెను ప్రశ్నించబడును“. (బుఖారి).

3– భర్త ఇంటిలోనే ఉండాలి. అతని ఇష్టము మరి అనుమతి లేనిదే బయటకు వెళ్ళకూడదు. తన చూపులను క్రిందికి దించుకొని, స్వరాన్ని తగ్గించి, తన చేతులను పాపానికి దూరంగా ఉంచాలి. తన భర్త యొక్క బంధువులతో మేలు చేసుకుంటూ ప్రేమగా ఉండాలి.

అల్లాహ్ మరియు ప్రవక్త ఆదేశాల్ని గమనించండి:

وَقَرْنَ فِي بُيُوتِكُنَّ وَلَا تَبَرَّجْنَ تَبَرُجَ الْجَاهِلِيَّةِ الْأَوْلَى – الأحزاب: ٣٣ 
(ఇళ్లల్లోనే ఉండిపోండి. పూర్వపు అజ్ఞాన కాలంలో మాదిరిగా అలంకరణను ప్రదర్శిస్తూ తిరగకండి). (33: అహ్జాబ్: 33),

మరో అల్లాహ్ ఆదేశం:

فَلَا تَخْضَعْنَ بِٱلْقَوْلِ فَيَطْمَعَ ٱلَّذِى فِى قَلْبِهِۦ مَرَضٌۭ
తగ్గు స్వరముతో మాట్లాడకండి. ఎందుకంటే దుష్ట మనస్సుగల వ్యక్తి ఎవడైన వ్యామోహపడవచ్చు. (33: అహా జాబ్: 32). మరో ఆదేశం:

وَقُل لِّلْمُؤْمِنَـٰتِ يَغْضُضْنَ مِنْ أَبْصَـٰرِهِنَّ وَيَحْفَظْنَ فُرُوجَهُنَّ وَلَا يُبْدِينَ زِينَتَهُنَّ إِلَّا مَا ظَهَرَ مِنْهَا
ప్రవక్తా! విశ్వసించిన మహిళలకు ఇలా చెప్పు, తమ చూపులను కాపాడుకోండి అని, తమ మర్మాంగాలను రక్షించుకోండి అని, తమ అలంకరణను ప్రదర్శించవలదని దానంతట అదే కనిపించేది తప్ప. (24: నూర్ 31).

ఉత్తమమైన స్త్రీ ఎవరనేది ప్రవక్త ఇలా తెలిపారు:

خَيْرُ النِّساءِ الَّتِي إِذَا نَظَرْتَ إِلَيْهَا مَرَّتْكَ، وَإِذَا اَمَرْتَهَا أَطَاعَتِكَ، وَإِذَا غِيْتَ عَنْهَا حَفِظَكَ فِي نَفْسِهَا وَمَا لِهَا
“స్త్రీలలో ఉత్తమమైన స్త్రీ (భార్య); నీవు ఆమెను చూడగా నిన్ను సంతోషపెట్టి, నీ ఆజ్ఞకు విధేయురాలై, నీవు ఆమె నుంచి దూరమున్నప్పుడు కూడ తన ధన ప్రాణాన్ని నీ కొరకు కాపాడుతుంది”. (తబ్రాని).

బంధువుల పట్ల మర్యాద

బంధువుల, రక్త సంబంధమున్న వారి పట్ల తల్లిదండ్రి, సంతానము మరియు సోదరుల పట్ల పాటించినటువంటి మర్యాదను పాటించాలి. పినతల్లి (తల్లి తోడు బుట్టిన అక్క,చెల్లి), మేనత్త (తండ్రి తోడుబుట్టిన అక్క, చెల్లి)తో తల్లి తీరు. పినతండ్రి (తండ్రి తోడుబుట్టిన అన్న దమ్ములు), మేనమామ (తల్లి తోడుబుట్టిన అన్నదమ్ముల)తో తండ్రి తీరు వ్యవహరించాలి. వారి పట్ల మంచి నడవడిక కనబరచాలి. బంధువులు విశ్వాసులైనా, అవిశ్వాసులైనా అందరితో బాంధవ్యాన్ని పెంపొందించుకొని, వారితో మంచితనముతో వ్యవహరిస్తూ, ఉపాకారము చేస్తూ, పెద్దవారిని గౌరవిస్తూ, చిన్నవారిని కరుణిస్తూ, వ్యాధిగ్రస్తులను పరామర్శిస్తూ, దుఃఖములో ఉన్నవారిని ఓదార్చుతూ, అధైర్యము మరి దిగులు చెందియున్నవారికి ధైర్యము చెబుతూ, వారు సంబంధాలు తెంపుకున్నప్పటికీ వారితో బాంధవ్యము పెంపొదించుకోవాలి. వారు కఠినంగా ప్రవర్తించినా వారితో మృదుత్వముతో మెలగాలి. ఈ విషయాలన్నియు అల్లాహ్ అంతిమ దివ్య గ్రంధము మరియు కారుణ్యమూర్తి, అల్లాహ్ సందేశహరుని ప్రవచనాల ఆధారంగా తెలుసుకున్న విషయాలే.

ఇక ఆ నిదర్శనాలను గమనించండి. అల్లాహ్ ఆదేశం:

وَاتَّقُوا اللَّهَ الَّذِي تَسَاءَلُوْنَ بِهِ وَالْأَرْحَامَ . النساء: ۱
మీరు ఎవరి పేరుతో ఒకరినొకరు అడుగుకొందురో ఆ అల్లాహ్ కు భయ పడండి. బంధుత్వ విషయమున జాగ్రత్తగా ఉండండి). (4: నిసా: 1)

فَاتِ ذَا الْقُرْبَى حَقَّه ) الروم: ۳۸
బంధువుకు అతని హక్కు ఇచ్చి వేయి. (30: రూం: 38).

إِنَّ اللهَ يَأْمُرُ بِالْعَدْلِ وَالْإِحْسَانِ وَإِيتَاءِ ذِي الْقُرْبَي النحل: ٩٠
అన్యాయం చేయకండి అనీ, ఉపకారం చేయండి అనీ, బంధువుల హక్కులు నెరవేర్చండి అనీ అల్లాహ్ ఆజ్ఞాపిస్తున్నాడు. (16: నహల్ : 90).

وَسُئِلَ الرَّسُولُ عَمَّا يُدْخِلُ الْجَنَّةَ مِنَ الْأَعْمَالِ، وَيُبَاعِدُ عَنِ النَّارِ، فَقَالَ: (( تَعْبُدُ الله ولا تُشْرِكَ بِهِ شَيْئًا، وَتُقِيمُ الصَّلاةَ، وَتُؤْتِي الزَّكَاةَ، وَتَصلُ الرَّحِمَ)). متفق عليه.
“స్వర్గములో ప్రవేశింపజేయు, నరకము నుంచి దూరముంచు సత్యార్యాలు ఏవి? అని ప్రవక్త ప్రశ్నింపబడినప్పుడు, “అల్లాహ్ నే ఆరాధించు. ఆయనకు ఎవరిని సాటి కల్పించకు. నమాజు స్థాపించు. విధిదానము చెల్లించు మరి బాంధవ్యమును కాపాడుకో” అని చెప్పారు. (బుఖారి, ముస్లిం).

మరో ప్రవచనం:

(( الصَّدَقَةُ عَلَي الْمِسْكِيْنِ صَدَقَةٌ، وَعَلَى ذِي الرَّحِمِ صَدَقَةٌ وَ صِلَةٌ)).
“మిస్కీన్ కు దానం ఇచ్చుట ఒక “సదఖ” (ఒక పుణ్యం) అయితే బంధువునికి దానమివ్యడం “సదఖ” మరియు బంధుత్వం. (రెట్టింపు పుణ్యం). (బుఖారి).

وَقَالَ لِأَسْمَاءِ بِنْتِ أَبِي بَكْرٍ رَضِيَ اللهُ عَنْهُمَا وَقَدْ سَأَلْتُهُ عَنْ صِلَتِهَا أُمَّهَا حِيْنَمَا
قَدِمَتْ مِنْ مَكَّةَ وَهِيَ مُشْرِكَةً فَقَالَ لَهَا: ((نَعَمْ صِلِي أُمَّكِ)). متفق عليه.
అస్మా బిన్తె అబీ బకర్ రజియల్లాహు అన్హుమా మక్కా నుంచి వచ్చిన తమ అవిశ్వాసురాలయిన తల్లి పట్ల ప్రేమతో దయతో మెలగాలా? అని అడిగిన ప్రశ్నకు “ఔను, నీవు నీ తల్లి పట్ల ప్రేమానురాగాలతో వ్యవహరించు” అని ప్రవక్త బదులిచ్చారు. (బుఖారి, ముస్లిం).

ఇరుగుపొరుగువారి పట్ల మర్యాద

ముస్లిం, ఇరుగుపొరుగు వారి హక్కులను స్వీకరించి వాటి ప్రకారము వారితో మసలుకోవాలి. వారితో చేదోడు వాదోడుగా ఉంటూ వారిపై ఖర్చు చేయాలి. బహుమానాలు పంపాలి. (ఈ విధంగా పరస్పర ప్రేమాభిమానాలు రెట్టింపగును). ఈ ప్రవర్తన వారితో అల్లాహ్ యొక్క ఈ ఆదేశ మూలంగా:

وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا وَبِذِي الْقُرْبَى وَالْيَتَامَى وَالْمَسَاكِينِ وَالْجَارِ ذِي الْقُرْبَى وَالْجَارِ
الْجُنبِ. النساء: ٣٦
తల్లిదండ్రులకు, బంధువులకు, తండ్రిలేని బిడ్డలకు, పేదలకు, దగ్గరా, దూరమున ఉండు ఇరుగుపొరుగువారికి ఉపకారము చేయండి. (4: నిసా: 36).

ما زَالَ جِبْرِيلُ يُوْصِيْنِي بِالْجَارِ حَتَّى ظَنَنتُ أَنَّهُ سَيُوَرَلُه)). متفق عليه.
అల్లాహ్ సందేశహరులైన ముహమ్మద్ చెప్పారు: “ప్రతీసారి జిబ్రీల్ పొరుగువారి పట్ల మంచిగా ప్రవర్తించాలని నాకు తాకీదు చేసేవారు. చివరికి ఇరుగుపొరుగువారిని పరస్పరం వారసులుగా ప్రకటిస్తారెమోనని నాకు అనుమానము కలిగేది”. (బుఖారీ, ముస్లిం). ఒక సారి ఇలా బోధించారు:

مَنْ كَانَ يُؤْمِنُ بِاللهِ وَالْيَوْمِ الآخِرِ فَلْيُكْرِمْ جَارَه)). متفق عليه.
“అల్లాహ్ మరియు పరలోకదినాన్ని విశ్వసించేవారు ఇరుగుపొరుగువారితో మంచి విధంగా ప్రవర్తించాలి”. (బుఖారి, ముస్లిం).

సంక్షిప్తంగా వారి పట్ల పాటించవలసిన కొన్ని హక్కులను తెలుసుకుందాము:

1- ప్రవక్త గారి క్రింది ఆదేశాల మూలంగా మాటా, చేత ఏ విధంగానైనా వారికి హాని కలిగించకూడదు.

ప్రవక్త ఆదేశాలు:

((مَنْ كَانَ يُؤْمِنُ بِاللهِ وَالْيَوْمِ الآخِرِ فَلْيُكْرِمْ جَارَه)). متفق عليه.
అల్లాహ్ మరియు పరలోకదినాన్ని విశ్వసించేవారు ఇరుగుపొరుగువారితో మంచి విధంగా ప్రవర్తించాలి“. (బుఖారి, ముస్లిం).

(( وَاللهِ لاَ يُؤْمِن، وَاللهِ لاَ يُؤْمِن)) فَقِيلَ: مَنْ يَا رَسُولَ اللَّهِ؟ فَقَالَ: ((الَّذِي لَا يَأْمَنُ
جَارُهُ بَوَالِقَهُ.
“అల్లాహ్ సాక్షిగ అతను విశ్వాసి కాడు. అల్లాః సాక్షిగా అతను విశ్వాసి కాడు” అని ప్రవక్త అనగా, అక్కడున్నవారు ఎవరు ఓ ప్రవక్తా!? అని అడిగారు. దానికి మహాప్రవక్త “ఎవరి పొరుగువారికైతే వారు పెట్టే కష్టాలవల్ల ఆశాంతి కలుగుతుందో వారు” అని బదులిచ్చారు. (బుఖారి, ముస్లిం).

2- వారితో ఉపకారము చేయడము. అనగ వారు సహాయము కోరునప్పుడు సహాయపడుట. వ్యాధిగ్రస్తులైతే పరామర్శించుట. వారి సంతోష సమయాన శుభాకాంక్షలు తెలియజేయుట. వారు బాధితులైనపుడు సన్నిహితులై ఉండుట. అవసరమైనప్పుడు మద్దతు ఇచ్చుట. సలాం చేయడంలో వారికి ముందు ఉండుట. సున్నితముగా మాట్లాడుట. వారి సంతానముతో ప్రేమ భావముతో మెలుగుట. ఇహపరలోకాల మేలు ఎందులో గలదో దాని వైపు వారికి దారిచూపుట. వారి తప్పులను మన్నిస్తూ, వారి లోపాలను వెతక్కుండ ఉండుట. వారికి తమ ఇంటి నిర్మాణ, దారి విషయములో ఇబ్బంది కలిగించ కుండ. వారి ఇంటి యదుట చెత్త లేక మరేదైన పడేసి ఇబ్బంది పెట్టకుండ. సంతోషముగా పరస్పరము మరియు సహాకరించుకుంటుండాలి. ఇదే ఆదేశం ఇవ్వబడినది.

3– వారికి కానుకగా ఏదైనా పంపిస్తూ ఆదరించాలి. ప్రవక్త చెప్పారు:

يَا نِسَاءَ الْمُسْلِمَاتِ لَا تَحْقِرَنَّ جَارَةً لِجَارَتِهَا وَلَوْ فِرْمِينَ شَاةٍ)) متفق عليه
ముస్లిం మహిళల్లారా! పొరిగింటి వనితకు ఇచ్చేందుకు ఏ కానుకనూ తక్కు వయినదిగా భావించకండి. అది ఒక మేక కాలిడెక్కయినా సరే. (బుఖారీ, ముస్లిం).

يَا أَبَا ذَرًا إِذَا طَبَحْتَ مَرَقَةٌ فَاكْثِرْ مَاءَهَا وَتَعَاهَدْ جَيْرَانَكَ)). مسلم
అబూ జర్ కు ఇలా బోధించారు మహాప్రవక్త :
అబూ జర్! నీవు ఏదైనా కూర వండినపుడు అందులో కాస్త నీళ్ళు ఎక్కువ కలుపు. పొరుగు వారిని కూడ కనిపెడుతూ ఉండు“. (ముస్లిం).

وَقَوْلُهُ لِعَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا لَمَّا قَالَتْ: إِنَّ لِي جَارَيْنِ، فَإِلَى مَنْ أَهْدِي؟ قَالَ: ((إِلَى أَقْرَبِهِمَا مِنْكَ بَابًا)) متفق عليه.
నాకు ఇద్దరు పొరుగు వారుంటె, వారిలో కానుక ఎవరికి పంపాలి’ అని ఒక సారి ఆయిషా రజియల్లాహు అన్హా అడగగా “నీ వాకిలికి చేరువుగా ఉన్న వాకిలి వారికి” అని బదులిచ్చారు కారుణ్యమూర్తి . (బుఖారి, ముస్లిం).

4- ప్రవక్త ఆదేశానుసారం వారిని గౌరవించి మర్యాదగా చూడాలి. వారు తమ గోడలో మేకు నాటుకుంటే ఆపవద్దు. తమ గదులు లేక ఏదైనా ఇతరులకు అద్దెకు ఇచ్చే ముందు లేక అమ్మడానికి ముందు పొరుగు వారికి తెలిపి సలహా తీసుకోవాలి. ఈ ప్రవక్త ఆదేశం పై శ్రద్ధ చూపండి:

لَا يَمْنَعَنَّ أَحَدُكُمْ جَارَهُ أَنْ يَضَعَ خَشَبَةً فِي جِدَاره)). أحمد، و مسلم بمعناه
“ఎవరు కూడ తమ పొరుగువారిని గోడలో మేకు నాటుకుంటే ఆపకూడదు”. (అహ్మద్. ఇదే భావం సహ ముస్లింలో ఉంది). మరో ప్రవచనం:

وَمَنْ كَانَ لَهُ جَارٌ فِي حَالِطٍ اَوْ شَرِيكَ فَلَا يَعْهُ حَتَّى يَعْرِضَهُ عَلَيْهِ)).
ఎవరైతే తమ తోటను అమ్మదలుచుకున్నారో వారు ముందు తమ పొరుగువారికి లేక భాగస్వామి ఉంటే వారికి తెలియజేయాలి“. (హాకిం).

విశ్వాసుల పరస్పర హక్కులు

ఒక విశ్వాసుడు తన విశ్వాసుడైన సోదరుని పట్ల విధిగా పాటించవలసిన హక్కులను నమ్మాలి. ఆ హక్కులను నిర్వర్తించడంలో పూర్తి ప్రయత్నం చేయాలి. ఇది కూడా అల్లాహ్ యొక్క ఆరాధన, అల్లాహ్ సన్నిధిలో చేరుకొనటానికి ఒక సాధనం అని విశ్వసించాలి. ఎందుకనగా ఈ హక్కులను ఒక ముస్లిం తన ముస్లిం సోదరుని పట్ల పాటించాలని అల్లాహ్ విధించాడు. ఆ హక్కులు ఇవి:

1- తను కలసినపుడు మాట్లాడే ముందు “అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు” అనాలి. “ముసాఫహా” (కరచాలనం) చేయలి. అతను సలాం చేస్తే “వఅలైకుముస్సలాము వరహిమ తుల్లాహి వబరకాతుహు” అని జవాబివ్వాలి. అల్లా ఇలా బోధించాడు:

وَإِذَا حُيِّيْتُمْ بِتَحِيَّةٍ فَحَبُوْا بِأَحْسَنَ مِنْهَا أَوْ رُدُّوْهَا﴾ النساء: ٨٦
మీకు ఎవరైనా గౌరవభావంతో సలాము చేస్తే అతనికి మీరు అంతకంటె ఉత్తమమైన పద్ధతిలో ప్రతిసలాము చెయ్యండి. లేదా కనీసం అదే విధంగా- నైనా బదులివ్వండి. (4: నిసా: 86). ప్రవక్త ఇలా ఉపదేశించారు:

يُسَلِّمُ الرَّاكِبُ عَلَى الْمَاشِي، وَالمَاشِي عَلَى الْقَاعِدِ، وَالْقَلِيلُ عَلَى الْكَثِيرِ)).
వాహనం పై సవారి చేయువారు కాలినడకన పొయేవారికి. కాలినడకన పొయేవారు కూర్చున్నవారికి. కొంతమంది జనం అత్యధిక జనానికి సలాం చేయుటకు ముందుకురావాలి”. (బుఖారి, ముస్లిం). మరొక ఆదేశం:

وَتَقْرَأُ السَّلامَ عَلَى مَنْ عَرَفْتَ وَمَنْ لَمْ تَعْرِف أبو داود
పరిచయమున్నవారికి, పరిచయము లేనివారికీ అందరికీ సలాం చేయండి“.

2-అతను తుమ్మి “అల్ హందులిల్లా” అన్నప్పుడు దానికి జవాబ్ “యర్హముకల్లాః” అని ఇవ్వాలి. అప్పుడా తుమ్మినవారు “యహా దికు ముల్లాహు వయుస్లిహు బాలకుం” అనాలి అని ప్రవక్త బోధించారు:

(( إِذَا عَطَسَ أَحَدُكُمْ فَلْيَقُلْ لَهُ اَخُوهُ يَرْحَمُكَ اللهُ، فَإِذَا قَالَ لَهُ يَرْحَمُكَ اللَّهُ، فَلْيَقُلْ لَهُ يَهْدِيكُمُ اللهُ وَيُصْلِحُ بَالَكُمْ)). رواه البخاري.
మీలో నెవరైన తుమ్మినప్పుడు తన సోదరుడు “యర్ హముకల్లా అనాలి. తను “యర్ హముకల్లా” అన్నప్పుడు తుమ్మినవాడు యహా దికుముల్లాః వ యుస్లిహు బాలకుం” అనాలి. (బుఖారి, ముస్లిం).

وَقَالَ أَبُو هُرَيْرَةَ : (كَانَ رَسُوْلَ اللهِ إِذَا عَطَسَ وَضَعَ يَدَهُ أَوْ ثَوْبَهُ عَلَى فِيْهِ وَخَفَضَ بِهَا صَوْتَهُ). متفق عليه.
అబూ హురైర రజియల్లాహు అన్హు చెప్పారు: ప్రవక్త తుమ్మినప్పుడు చేయి లేక రుమాలు నోటికి అడ్డం పెట్టుకునేవారు. తక్కువ స్వరముతో తుమ్మేవారు. (బుఖారీ, ముస్లిం).

3- అతను వ్వాదిగ్రస్తుడైనప్పుడు పరామర్శించి, అతని స్వస్థత కొరకై దుఆ చేయాలి అని ప్రవక్త తో చెప్పారు:

حَقُّ الْمُسْلِمِ عَلَى الْمُسْلِمِ خَمْسَ؛ رَدُّ السَّلَامِ، وَعِيَادَةُ الْمَرِيضِ، وَالْبَاعُ الْجَنَائِزِ، وَإجَابَةُ الدَّعْوَةِ، وَتَسْمِيتُ الْعَاطِسِ )). متفق عليه.
ఒక ముస్లిం హక్కులు మరో ముస్లిం పై ఐదున్నవి; సలాంకు జవాబివ్వడం. రోగిని పరామర్శించడం. జనాజకు తోడుగా వెళ్ళటం. ఆహ్వానాన్ని స్వీకరిం చడం. తుమ్మినవారికి “యర్ హముకల్లాహ్” అని బదులు పలకడం. (బుఖారి, ముస్లిం).

4-ప్రవక్త గారి ఆదేశ మూలంగా అతను చనిపోయినపుడు అతని జనాజ వెంట నడవడం. ప్రవక్త ఆదేశం:

حَقُّ الْمُسْلِمِ عَلَى الْمُسْلِمِ خَمْسَ رَدُّ السَّلاَمِ، وَعِيَادَةُ الْمَرِيْضِ، وَالْبَاعُ الْجَنَائِزِ، وَإِجَابَةُ الدَّعْوَةِ، وَتَسْمِيتُ الْعَاطِسِ )). متفق عليه.
ఒక ముస్లిం హక్కులు మరో ముస్లిం పై ఐదున్నవి; సలాంకు జవాబివ్వడం. రోగిని పరామర్శించడం. జనాజకు తోడుగా వెళ్ళటం. ఆహ్వానాన్ని స్వీకరిం చడం. తుమ్మినవారికి “యర్ హముకల్లాహ్” అని బదులు పలకడం. (బుఖారి, ముస్లిం).

5- అతను ప్రమాణం చేసి యుంటే, దానికి విరుద్ధము చేయకుండా అతనికి సహాయపడటం.

బరా ఉబ్ను ఆజిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖిస్తున్నారు: ప్రవక్త మాకు ఇలా ఆదేశించారు:

(أَمَرَنَا رَسُولُ اللهِ : بِعِبَادَةِ الْمَرِيضِ، وَاتَّبَاعِ الْجَنَائِزِ، وَتَسْمِيْتِ الْعَاطِسِ، وَإِبْرَارِ الْقَاسِمِ، وَنَصْرِ الْمَظْلُوْمِ، وَإِجَابَةِ الدَّاعِي، وَافْشَاءِ السَّلام). رواه البخاري.
“వ్యాధిగ్రస్తున్ని పరామర్శించండి. జనాజకు తోడుగా వెళ్ళండి. తుమ్మిన వారికి జవాబివ్వండి. ప్రమాణం చేసినవారు దాన్ని పూర్తి చేయడానికి సహాయపడండి. బాధితునికి మద్దతివ్వండి. ఆహ్వానించువారి ఆహ్వానాన్ని స్వీకరించండి మరియు సలాంను వ్యాపింప జేయండి”. (బుఖారి, ముస్లిం).

6- నసీహత్ (నీతి మాటలు, మంచి సలహ) కోరినపుడు నసీహత్ చేయాలి. అనగా అతను అడిగిన విషయములో ఏది వాస్తవమో దాన్ని తెలుపాలి. ప్రవక్త ఇలా సెవిచ్చారు:

(( إِذَا اسْتَنْصَحَ أَحَدُكُمْ أَخَاهُ فَلْيَنْصَحْ لَهُ)). رواه البخاري.
మీ సోదరుడు మీతో మేలును కాంక్షిస్తే దాన్ని అందజేయాలి“. (బుఖారి).

7- తన కొరకు కోరినది తన సోదరునికి కోరాలి. తన కొరకు అసహ్యించు కున్న దానిని తన సొదరుని కోసం కూడా అసహ్యించు కోవాలి.
ప్రవక్త ఆదేశం:

لا يُؤْمِنُ اَحَدُكُمْ حَتَّى يُحِبُّ لِأَخِيهِ مَا يُحِبُّ لِنَفْسِهِ)). رواه مسلم.
తన కొరకు ఇష్టపడిన దాన్ని తన సోదరునికి కూడ ఇష్టపడనంత వరకు మీలో నెవరు విశ్వాసికాజాలడు“. (బఖారి, ముస్లిం). మరో ఆదేశం:

)) الْمُؤْمِنَ لِلْمُؤْمِنِ كَالْبُنْيَانِ يَشَدُّ بَعْضَهُ بَعْضًا)). متفق عليه.
విశ్వాసి మరొక విశ్వాసితో కలసి ఒక కట్టడం వలె రూపొందుతాడు. దాని ఒక భాగం మరొక భాగానికి బలం చేకూర్చుతుంది“. (బుఖారి, ముస్లిం).

8- అతనికి అండదండగా ఉండి, సహాయం కావలసినప్పుడు సహాయపడాలి. అతన్ని నిస్సహాయతగా వదలి అవమానపరచ కూడదు. ప్రవక్త ఆదేశం:

أنْصُرْ أَخَاكَ ظَالِمًا أَوْ مَظْلُوماً)). متفق عليه.
నీ సోదరుడు దౌర్జన్యపరుడైనా, దౌర్జన్యానికి గురైనవాడైనా ఇరువురికీ సహాయపడు”. ఇది విన్నవారు దౌర్జన్యపరుడికి ఎలా సహాయపడాలి అని అడగ్గా, “అతని చేతులను పట్టుకోవాలి. అనగా దౌర్జన్యం చేయనివ్వకూడదు అతనికి అతని దౌర్జన్యానికి మధ్య అడ్డు పడాలి. ఇదే అతనికి కావలసిన సహాయం అని చెప్పారు ఆయన. (బుఖారి, ముస్లిం). మరో ఆదేశం:

(( مَنْ رَدَّ عَنْ عِرْضِ أَخِيْهِ رَدَّ اللهُ عَنْ وَجْهِهِ النَّارَ يَوْمَ الْقِيَامَةِ)). الترمذي
ఎవరైతే తన సోదరుని పరువును కాపాడుటకు పోటి పడతారో, అల్లా ప్రళయదినాన నరకాగ్నిని వారి నుంచి దూరముంచుతాడు“. (తిర్మిజీ).

9- చెడుగా వ్యవహరిస్తూ, అసహ్యకరంగ ఇచ్చుపుచ్చుకోకూడదు.

(كُلُّ الْمُسْلِمِ عَلَى الْمُسْلِمِ حَرَامٌ، دَمُهُ، وَمَالُهُ، وَعِرْضُهُ)). مسلم.

ప్రవక్త చెప్పారు: ఒక ముస్లిం యొక్క ధన మాన ప్రాణములు, మరొక ముస్లిం పై నిషిద్ధం. (ముస్లిం). మరో సారి ఇలా ఆదేశించారు:

(( لَا يَحِلُّ لِمُسْلِمٍ أَن يُرَوْعَ مُسلِماً)). رواه أحمد و أبو داود.
ఒక ముస్లిం మరొక ముస్లిమును బెదిరించుట, భయపెట్టుట యోగ్యం లేదు”. (అహ్మద్, అబూ దావూద్).

నిజ ముస్లిం ఎవరనేది ఇలా తెలిపారు:

الْمُسْلِمُ مَنْ سَلِمَ الْمُسْلِمُونَ مِنْ لِسَانِهِ وَيَدِهِ)). متفق عليه.
తన మాటల, చేతల ద్వారా ఇతర ముస్లింకు శాంతి నిచ్చేవాడే ఉత్తమ ముస్లిం”. (బుఖారి, ముస్లిం).

10- అతనితో వినయ, అణుకువతో ప్రవర్తించాలి. అహంభావముతో ప్రవర్తించ కూడదు. ఒక స్థలములో కూర్చున్నవారిని ఆ స్థలము నుంచి లేపకూడదు. అల్లాః ఆదేశం (31 లుఖ్మాన్: 18) లో ఇలా వుంది:

وَلَا تُصَعِّرْ خَدَّكَ لِلنَّاسِ وَلَا تَمْشِ فِي الْأَرْضِ مَرَحاً إِنَّ اللَّهَ لَا يُحِبُّ كُلَّ مُخْتَالٍ
فَخَوْرٍ ) لقمان: ۱۸
ప్రజలతో ముఖం ప్రక్కకు త్రిప్పి మాట్లాడకు. భూమిపై అహంకారంతో నడవకు. అహంభావి, బడాయికోరు అయిన ఏ వ్యక్తినీ అల్లా ప్రేమించడు.

مَا تَوَاضَعَ اَحَدٌ لِلَّهِ إِلَّا رَفَعَهُ اللَّهُ تَعَالَى)).
ప్రవక్త ఇలా శుభవార్త ఇచ్చారు: “అల్లాహ్ కొరకు ఎవరు వినయ, వినమ్రతగా ఉంటారో అల్లాః వారి గౌరవస్థానం పెంచుతాడు“(ముస్లిం).

ప్రవక్త ప్రతీ ఒకరితో వినయ వినమ్రతతో మెదిలేవారు. ఎవరితో కూడ అహంభావము, దురభిమానముతో ప్రవర్తించేవారు కాదు. పేదవాళ్ళను, విధవలను చూస్తూ వారికి తగిన సహాయము చేస్తూ వెళ్ళేవారు.

) لَا يُقِيْمَنَّ أَحَدُكُمْ رَجُلاً مِنْ مَجْلِسِهِ، ثُمَّ يَجْلِسَ فِيهِ، وَلَكِنْ تَوَسَّعُوا وَتَفَسَّحُوا)).
ప్రవక్త చెప్పారు: “ఎవరు కూడ తన సోదరుడు కూర్చున్న స్థలము నుంచి అతన్ని లేపి, అచ్చట కూర్చోకోడదు. కాని సర్దుకొని కూర్చోవలెను“. (బుఖారి, ముస్లిం).

11- మూడు రోజులకు పైగా మాట్లాడకుండ ఉండరాదు. ప్రవక్త చెప్పారు:

لا يَحِلُّ لِمُسْلِمٍ أَنْ يَهْجُرَ أَخَاهُ فَوْقَ ثَلَاثِ يَلْتَقِيَانِ فَيَعْرِضُ هَذَا وَيَعْرِضُ هَذَا وَخَيْرُهُمَا الَّذِي يَبْدَأُ بِالسَّلَامِ)).
“ముస్లిం మూడు రాత్రులకు మించి తోటి సోదరునితో సంబంధాలు తెంచుకొని యుండటం, ఇద్దరు దారిలో కలసినప్పుడు ఎడముఖం పెడముఖంగా తప్పుకోవటం ధర్మ సమ్మతం కాదు. వారిద్దరిలో సలాం చేసేందుకు ఎవరు ముందుకు వస్తారో వారు ఉత్తములు”. (బుఖారీ, ముస్లిం). మరో ఆదేశం:

وَلَا تَدَابَرُوْا، وَكُونُوْا عِبَادَ اللهِ اِخْوَانًا)). رواه مسلم.
పరస్పరం మీరు ద్వేషం పెంచుకొని విడిపోకండి. అల్లాహ్ దాసులుగా, పరస్పరం సోదరులుగా మెలగండి”. (ముస్లిం).

12- అతనిని పరోక్షంగా నిందించకూడదు. అవమాన పరచకూడదు. లోపాలు ఎంచకూడదు. ఎగతాలి చేయకూడదు. చెడ్డ పేర్లతో పిలువకూడదు. ఉపద్రవం రేకెత్తించడానికి అతని గురించి చాడీలు చెబుతూ తిరుగకూడదు. అల్లాహ్ బోధ ఎలా ఉందో వినండి!

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اجْتَنِبُوا كَثِيرًا مِّنَ الظَّنِّ إِنَّ بَعْضَ الظَّنِّ إِثْمٌ، وَلَا تَجَسَّسُوا وَلَا يَغْتَبْ بَعْضُكُمْ بَعْضًا أَيُحِبُّ أَحَدُكُمْ أَنْ يَأْكُلَ لَحْمَ أَخِيهِ مَيْتًا فَكَرِهْتُمُوْهُ الحجرات: ١٢
ఓ విశ్వాసులారా! అతిగా అనుమానించటం మానివేయండి. కొన్ని అనుమానాలు పాపాలు అవుతాయి. గూడచారులుగా వ్యవహరించకండి. మీలో ఎవరూ ఎవరినీ పరోక్షంగా నిందించరాదు. మీలో ఎవరైనా మీ మృత సోదరుని దేహ మాంసం తినటానికి ఇష్టపడతారా? చూడండి, మీరే స్వయంగా దీనిని అసహ్యించుకుంటారు. (49: హుజ్రాల్: 12). మరో చోట ఇలా ఆదేశించాడు:

و يَا أَيُّهَا الَّذِينَ آمَنُوْا لَاَيَسْخَرْ قَوْمٌ مِّنْ قَوْمٍ عَسَى أَن يَكُوْنُوْا خَيْرًا مِّنْهُمْ وَلَا نِسَاءٌ مِنْ نِسَاءٍ عَسَى أَنْ يَكُنَّ خَيْرًا مِنْهُنَّ، وَلَا تَلْمِرُوْا أَنْفُسَكُمْ، وَلَا تَنَابَرُوْا بِالْأَلْقَابِ بِئْسَ الْاِسْمُ الْفُسُوقُ بَعْدَ الْإِيْمَانِ، وَمَنْ لَمْ يَتُبْ فَأُولَئِكَ هُمُ الظَّالِمُوْن الحجرات: ۱۱
(ఓ విశ్వాసులారా! పురుషులు ఒకరితోనొకరు పరిహాసములాడ కూడదు. ఎవరిని గూర్చి పరిహసింతులో వారు పరిహాసములాడు వారికంటె శ్రేషులైన వారులుగానుందురేమో! మరియు స్త్రీలు, స్త్రీలతో పరిహాసములాడ కూడదు. పరిహసింపబడు స్త్రీలు పరిహాసములాడు స్త్రీలకంటెను శ్రేష్ఠురాండ్రుగా నుందురేమో. మరియు పరస్పరము లోపములను ఎన్నుకొనకండి. తప్పుడు పేర్లు పెట్టి ఒకరినొకరు పిలువకండి. విశ్వాసము వహించిన పిదప తప్పు పేరు గలుగుట చాల చెడ్డది. మరెవరు మానుకొనలో వారు అన్యాయము చేయువారులు). (49: హుజ్రాల్ : 11).
))

قَالَ النَّبِيُّ : (( أَتَدْرُونَ مَا الْغِيْبَة؟)) قَالُوْا : اللَّهُ وَرَسُولُهُ أَعْلَمُ، قَالَ: ((ذِكْرُكَ أَخَاكَ بِمَا يَكْرَهُ) قِيلَ: أَرَأَيْتَ إِنْ كَانَ فِي أَخِي مَا أَقُولُ؟ قَالَ: (( إِنْ كَانَ فِيهِ مَا تَقُولُ فَقَدِ اغْتَبَتْهُ، وَإِنْ لَمْ يَكُنْ فِيهِ مَا تَقُولُ فَقَدْ بَهَتْهُ)). رواه مسلم.

“గీబత్” అంటేమిటో మీకు తెలుసా? అని ప్రవక్త ఒక సారి అడిగారు. దానికి వారి అనుచరులు అల్లాహ్ మరియు ప్రవక్త కి మాత్రమే తెలుసు అని విన్నవించుకోగా, అప్పుడు ఆయన చెప్పారు: “నీ సోదరుని ప్రస్తావన అతను నచ్చని విధంగా చెయ్యడం”. మేము ప్రస్తావించే ఆ విషయం అతనిలో ఉంటే? అని వారు అడగ్గా, మహాప్రవక్త “అవును నీవు చెప్పేది అతనిలో ఉంటేనే అది “గీబత్“. నీవు చెప్పేది అతనిలో లేనిచో నీవు అతనిపై నింద మోపిన వానివవుతావు” అని సముదాయించారు. (ముస్లిం). ప్రవక్త “హజ్ఙతుల్ విదాత్”లో ప్రసంగిస్తూ ఇలా ప్రభోదించారు:

(( إِنَّ دِمَاءَكُمْ وَاَمْوَالَكُمْ وَأَعْرَاضَكُمْ حَرَامٌ عَلَيْكُمْ)).
మీ రక్తము, మీ ధనము, మీ ప్రాణము పరస్పరము మీపై నిషిద్ధమైనది“. (ముస్లిం). మరో సారి ఇలా హెచ్చరించారు:

చాడీలు చెబుతూ తిరుగువాడు స్వర్గంలో ప్రవేశించడు“. (బుఖారీ, ముస్లిం).

13- అతను బ్రతికియున్నా, చనిపోయినా దూషించకూడదు, తిట్టకూడదు. బుఖారి, ముస్లిం లో ప్రవక్త ఆదేశం ఇలా వుంది:

ముస్లింను దూషించడం పాపకార్యం. అతన్ని హత మార్చడం కుఫ్ర్ కు సమానం“. మరో సారి హితువు చెప్పారు:

لا تَسُبُّوا الْأَمْوَات فَإِنْهُمْ قَدْ أَفْضَوْا إِلَى مَا قَدَّمُوا)). متفق عليه.
చనిపోయినవారిని దూషించకండి. వారు చేసిన కర్మలను వారు పొందు తారు”. (బఖారి, ముస్లిం).

14– వారి పట్ల అసూయపడకూడదు. చెడుగా అనుమానించి వైరమున్న వానిగా ప్రవర్తించి వారి లోపాలనెన్న కూడదు. అల్లాహ్ ఆదేశం వినండి!

هو يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اجْتَنِبُوا كَثِيرًا مِنَ الظَّنِّ إِنَّ بَعْضَ الظَّنِّ إِثْمٌ، وَلَا تَجَسَّسُوا وَلَا يَغْتَبْ بَعْضُكُمْ بَعْضًا الحجرات: ۱۲
విశ్వాసులారా! అతిగా అనుమానించటం మానివేయండి. కొన్ని అనుమానాలు పాపాలు అవుతాయి. గూడచారులుగా వ్యవహరించకండి. మీలో ఎవరూ ఎవరినీ పరోక్షంగా నిందించరాదు. (49: హుజ్రాత్ : 12).

15- అతన్ని మోసగించకూడదు. అతనికి అన్యాయము చేయకూడదు. అసత్య వ్యవహారము కూడ అతనితో చేయకూడదు. అల్లాహ్ఆ దేశం:

﴿وَالَّذِينَ يُؤْذُونَ الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ بِغَيْرِ مَا اكْتَسَبُوا فَقَدِ احْمَلُوا بُهْتَانًا وَإِثْمًا مُّبِيْنَا
الأحزاب: ٥٨
ఎవరు, నేరము చేయని ముస్లిం పురుషులను స్త్రీలను బాధింతురో, వారు అపనిందను, స్పష్టమైన పాపమును మోసిన వారగుచున్నారు. (33: అహా జాబ్ : 58). బుఖారి, ముస్లింలో ఉంది, ప్రవక్త ఇలా బోధించారు:

اربَعٌ مَنْ كُنَّ فِيهِ كَانَ مُنَافِقًا خَالِصًا، وَمَن كَانَتْ فِيهِ حَصَلَةٌ مِنهُنَّ كَانَ فِيهِ حَصَلَةٌ مِنَ النِّفَاقِ حَتَّى يَدَعَهَا، إِذَا اؤْتُمِنَ خَانَ، وَإِذَا حَدَّثَ كَذَبَ، وَإِذَا عَاهَدَ غَدَرَ، وَإِذَا خَاصَمَ فَجَرَ)). متفق عليه.
“ఈ నాలుగు గుణాలు ఎవరిలో ఉండునో అతను అసలైన కపట విశ్వాసి (మునాఫిఖ్). ఒక వేళ వీటిలోని ఏ ఒక గుణం అతనిలో ఉన్నా దాన్ని విసర్జించనంత వరకు నిఫాఖ్కు సంబంధించిన ఒక గుణము అతనిలో ఉన్నట్లే. ఆ గుణాలు ఇవి:

1- అమానత్ అతనికి అప్పగించినచో అతను దాన్ని కాజేస్తాడు.
2- మాట్లాడినచో అబద్ధము పలుకుతాడు.
3- మాటిచ్చి మోసం చేస్తాడు.
4 ఎవరితోనైనా వాదోపవాదం జరిగెతే తిట్లకు దిగుతాడు”.

16- అతనితో సత్ప్రవర్తనతో మెలగాలి. అతని పట్ల మంచితనమును కోరుతూ బాధకలిగించకుండ ఉండాలి. మందహాసము, చిరునవ్వుతో కలవాలి. అతను చేసిన ఉపకారాన్ని స్వీకరిస్తూ, అతని తప్పిదాలను మన్నిస్తూ, అతని శక్తికి మించిన భారము అతనిపై వేయకుండ ఉండాలి. ప్రవక్త చెప్పారు:

الْقِ اللهَ حَيْثُ مَا كُنتَ، وَاتَّبِعِ السَّيِّئَةَ الْحَسَنَةَ تَمْحُهَا، وَخَالِقِ النَّاسَ بِخُلُقٍ حَسَنٍ)).
నీవు ఎక్కడ వున్నా అల్లాహ్ తో భయపడు. పాపము జరిగిన వెంటనే పుణ్యం చేయి. అందువలన పాపము తూడ్చుక పావును. ప్రజలతో సద్వర్తనతో మెలుగు“. (హాకిం, తిర్మిజి).

17– పెద్దవారిని గౌరవించాలి. చిన్న వారిని ప్రేమించాలి. ప్రవక్త ఆదేశం:

لَيْسَ مِنَّا مَنْ لَمْ يُؤَفِّرْ كَبِيرَنَا وَيَرحَمْ صَغِيرَنَا)). رواه أبو داود والترمذي.
పెద్దలను గౌరవించని, చిన్నలను ప్రేమించని వారు మాలోని వారు కాదు “. (అబూ దావూద్, తిర్మిజి).

అవిశ్వాసుల పట్ల మర్యాద

“ఇస్లాం తప్ప అన్ని మతాలు అధర్మమైనవి. ఆ మతాలను అవలంబించు వారు అవిశ్వాసులు. కేవలం ఇస్లాం మాత్రమే సత్యమైన ధర్మం. దీన్ని అవలంబించువారు విశ్వాసులు, విధేయులు” అని ముస్లిం విశ్వసించాలి. ఇది అల్లాహ్ యొక్క ఈ ఆదేశమూలంగా:

إِنَّ الدِّينَ عِنْدَ اللهِ الْإِسْلام ﴾ آل عمران: ۱۹
నిశ్చయముగా అల్లాకు సమ్మతమైన మతము ఇస్లాం. (3: ఆలె ఇమ్రాన్ : 19). మరో ఆదేశం ఇలా వుంది:

﴿وَمَنْ يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِيْنَا فَلَنْ يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ﴾ آل عمران: ٨٥
ఎవడు ఇస్లాం మతము తప్ప వేరు మతము కోరునో అది ఎన్నటికి అంగీకరింపబడదు. (3: ఆలె ఇమ్రాన్ : 85).

ఎవరైతే ఇస్లాంను తన ధర్మంగా నమ్మరో, అల్లాహ్ కు విధేయులు కారో, వారు అవిశ్వాసులని ముస్లిం తెలుసుకోవాలి. వారి పట్ల ఈ క్రింది పద్ధతులను పాటించాలి.

1- అతని కుఫ్ర్ ను నమ్మకూడదు. దానితో ఇష్టపడకూడదు. కుఫ్ర్ తో ఇష్టపడుట కూడ కుఫ్ర్ అవుతుంది..
2- ఒకరితో ప్రేమ అల్లాహ్ కొరకు, ద్వేషమూ అల్లాహ్ కొరకే ఉండాలి గనుక అల్లాహ్ ద్వేషించు దానిని ద్వేషించాలి. అల్లాహ్ నిరంతరం కుఫ్ర్ (అవిశ్వాసం) ను అవలంబించిన వానితో ద్వేషించాడు గనుక ముస్లిం కూడ ద్వేషించాలి.
3- వారితో స్నేహం, ప్రేమ ఉంచకూడదు.

అల్లాహ్ ఇట్లు ఆదేశించెను:

لاَ يَتَّخِذِ الْمُؤْمِنُونَ الْكَافِرِيْنَ أَوْلِيَاء ﴾ آل عمران: ۲۸
ముసల్మానులు ముసల్మానులను వీడి అవిశ్వాసులతో స్నేహము చేయ రాదు. (3: ఆలె ఇమ్రాన్ : 28).

మరో ఆదేశం:

لاَ تَجدُ قَوْماً يُؤْمِنُوْنَ باللهِ وَالْيَوْمِ الْآخِرِ يُوَادُّوْنَ مَنْ حَادَّ اللَّهَ وَرَسُولَهُ وَلَوْ كَانُوْا
ابَاءَهُمْ أَوْ أَبْنَاءَهُمْ أَوْ إِخْوَانَهُمْ أَوْ عَشِيْرَتَهُمْ ﴾ المجادلة: ٢٢
(అల్లాహ్ నూ, పరలోకాన్నీ విశ్వసించేవారు, అల్లాహ్ నూ ఆయన ప్రవక్తనూ వ్యతిరేకించేవారిని ప్రేమించటాన్ని నీవు ఎన్నడూ చూడలేవు. ఆ వ్యతిరేకించే వారు వారి తల్లిదండ్రులైనా, వారి కుమారులైనా, వారి సోదరులైనా సరే. లేదా వారి కుంటుంబీకులైనా సరే). (58: ముజాదల: 22).

4- అతను శతృత్వము చేయనివాడైతే అతనితో మంచితనంతో మెలగాలి. న్యాయంగా ప్రవర్తించాలి. (60: ముమ్ తహిన: 8)లో ఈ అల్లాహ్ ఆదేశం:

ولاَ يَنْهَاكُمُ اللهُ عَنِ الَّذِيْنَ لَمْ يُقَاتِلُوكُمْ فِي الدِّينِ وَلَمْ يُخْرِجُوْكُمْ مِنْ دِيَارِكُمْ أَنْ تَبَرُوْهُمْ وَتُقْسِطُوا إِلَيْهِمْ إِنَّ اللَّهَ يُحِبُّ الْمُقْسِطِين `[الممتحنة: ۸
ఎవరైతే ధర్మం విషయంలో మీతో యుద్ధం చేయలేదో, మిమ్మల్ని మీ ఇళ్ళ నుండి వెళ్ళగొట్టలేదో, వారి పట్ల మీరు మంచితనంతో, న్యాయంతో వ్యవహరించటాన్ని అల్లాహ్ నిరోధించడు. అల్లాహ్ న్యాయం చేసేవారిని ప్రేమిస్తాడు).

5- అతని పట్ల కరుణదయను వెల్లడిస్తు, ఆకలితో ఉన్నప్పుడు తినిపించాలి. దాహముతో ఉన్నప్పుడు త్రాగించాలి. అనారోగ్యముగా ఉంటే పరామర్శిం చాలి. కష్టములో ఆదరించి బాధకలిగించకుండ ఉండాలి. ప్రవక్త ఇలా ఆదేశించారు:

ارْحَمْ) مَنْ فِي الْأَرْضِ يَرْحَمْكَ مَنْ فِى السَّمَاء)). الطبراني والحاكم.
భూమిపై ఉన్నవారిని నీవు కరుణించు. ఆకాశములో ఉన్నవాడు నిన్ను కరుణిస్తాడు”. (తబ్రాని, హాకిం).

6- శత్రువుగా మెదలనివారి ధనమానానికి నొప్పి కలిగించకూడదు.

ముస్లిం గ్రంథంలో ఉంది, అల్లా ఇలా సెలవిచ్చాడని ప్రవక్త చెప్పారు:

قَالَ النَّبِيُّ : ((قَالَ اللهُ تَعَالَى: يَا عِبَادِي إِنِّي حَرَّمْتُ الظُّلْمَ عَلَى نَفْسِي وَجَعَلْتُهُ بَيْنَكُمْ مُحَرَّماً فَلاَ تَظَالَمُوا)). رواه مسلم.
ఓ నా దాసులారా! నేను దౌర్జన్యాన్ని నిషేధిస్తున్నాను. మీరు కూడ ఒకరిపై ఒకరు దౌర్జన్యము చేయడము నిషిద్ధంగా భావించండి. అలాగే ఆచరించండి“.

7- వారికి బహుమతులు పంపడం, వారి బహుమతులు స్వీకరించడం యోగ్యం. పూర్వము ఆకాశ గ్రంధమివ్వబడిన యూదులు మరియు క్రైస్తవులు (యోగ్యమైన జంతువులను జుబా చేసినచో, ఆ మాంసహార) భోజనము చేయడము యోగ్యం.

وَطَعَامُ الَّذِينَ أُوتُوا الْكِتَابَ حِلٌّ لَكُمْ﴾ المائدة: ٥
గ్రంధప్రజల భోజనం మీకు హలాల్. (అంటే యోగ్యమైన జంతువులను వారు జుబా చేసినది). (5: మాఈద: 5).

ప్రవక్త మదీనలో ఉన్నప్పుడు యూదుల విందులో పాల్గొన్నారు. వారు తినుటకు తెచ్చిపెట్టిన దాన్ని (అది యోగ్యమైనప్పుడు) భుజించేవారు.

8- విశ్వాసురాళ్ళ వివాహము వారితో చేయరాదు. కాని యూదురాలు లేక క్రైస్తవరాలితో విశ్వాస పురుషులు వివాహమాడవచ్చును. అల్లాః ఆదేశం:

وَلَا تُنْكِحُوا الْمُشْرِكِينَ حَتَّى يُؤْمِنُوا ) البقرة: ۲۲۱
ముష్రికు పురుషులు విశ్వాసులు కానంతవరకు మీరు మీ మహిళలను వారికిచ్చి ఎన్నటికీ వివాహం చెయ్యకండి. (2: బఖర: 221),

గ్రంధమివ్వబడిన స్త్రీలతో వివాహమాడవచ్చునని ఈ వాక్యములో చెప్ప బడింది:

وَالْمُحْصَاتُ مِنَ الَّذِيْنَ اُوْتُوا الْكِتَابَ مِنْ قَبْلِكُمْ إِذَا آتَيْتُمُوهُنَّ أُجُورَهُنَّ مُحْصِنِيْنَ غَيْرَ مُسَافِحِيْنَ وَلَا مُتَّخِذِي أَحْدَانَ – المائدة: •
వ్యబిచారముగాని, మరుగు స్నేహముగాని చేయక, నీతి కొరకు నీతిమంతురాండ్రైన మీకు పూర్వము గ్రంధము పొందిన వారి స్త్రీలను, వారికియ్యవలసిన మహరు ఇచ్చినపుడు మీరు వివాహమాడవచ్చును. (5: మాఇద: 5).

10– ముందుపడి వారికి సలాం చేయకూడదు. వారు సలాం చేస్తే కేవలం “వఅలైకుం” అనాలి. ఇది ప్రవక్త ఆదేశం:

((إِذَا سَلَّمَ عَلَيْكُمْ أَهْلَ الْكِتَابِ فَقُولُوا وَعَلَيْكُم)) متفق عليه.
“యూదులు క్రైస్తవులు మీకు సలాం చేస్తే మీరు కేవలం “వఅలైకుం” అని జవాబివ్వండి”.(బుఖారి, ముస్లిం).

11- వారి లాంటి పనులు చేయకూడదు. వారు చేసే పనులకు భిన్నత్వం పాటించాలి. ప్రవక్త చెప్పారు:

«من تَشبَّه بقوم، فهو منهم»
متفق عليه
ఎవరు ఇతరులకు పోల్చినది చేయుదురో వారు వారిలోనగుదురు“. (బుఖారీ, ముస్లిం).

పశు పక్ష్యాదులు హక్కులు

పశువులను అల్లాహ్ సృష్టించిన వాటిలో ఒక సృష్టి అని నమ్మి వాటిని జాగ్రత్తగా చూసుకుంటు ఈ క్రింది ధర్మాలను పాటించాలి:

1-వారి ఆకలిదాహమును తీర్చడానికి సరిగ్గా ఆహారమివ్వాలి.

బుఖారి, ముస్లిం సేకరించారు, ప్రవక్త ఇలా ప్రభోదించారు:

)) فِي كُلِّ كَدِ رَطْبَةٍ أَجْرٌ )). متفق عليه
ప్రతి ప్రాణి పట్ల ఉపాకారం చేయుట వలన పుణ్యం లభించును“.

2- వారి పట్ల కరుణదయ చూపాలి. ఒక సారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ అనుచరులు ఒక పిట్ట పిల్లల్ని పట్టుకొన్నారు, ఆ పిట్ట తన పిల్లల కొరకు పైన ఎగురుట చూసి “ఈ పిట్టని దాని పిల్లల కారణంగా బాధ పెట్టిందెవరు? ఆ పిల్లల్ని వాటి తల్లికి అప్పగించండి” అన్నారు. (అబూ దావూద్).

3- సంహరించినపుడు లేక జిబహా చేయునపుడు వాటికి హాయి, నెమ్మది కలిగించాలి. ప్రవక్త చెప్పారు:

(( إِنَّ اللهَ كَتَبَ الْإِحْسَان عَلَى كُلِّ شَيْءٍ، فَإِذَا قَتَلْتُمْ فَاحْسِنُوا الْقِبْلَةَ، وَإِذَا ذَبَحْمْ فَاحْسِنُوا الذَّبْحَ، وَلْيُحِدَّ اَحَدُكُمْ شَفْرَتَهُ وَلْيُرِحْ ذَبَيْحَهُ)). رواه مسلم.
ప్రతి పని ఎంతో సంస్కారవంతంగా చేయుట విధ్యుక్త ధర్మమని అల్లాహ్ ఆదేశించాడు. సంహరించదలచినా సంస్కారము, చాకచక్యంతో సంహరించాలి. జిబహా కూడ ఎంతో సంస్కారంతో, అలవోకగా చెయ్యాలి. కత్తిని సాన పట్టాలి. జిబహా చేయబడే జంతువుకు నెమ్మది కలగనివ్వాలి. (ముస్లిం).

4- ఏ విధంగానైనా వాటికి బాధ కలిగించ కూడదు. అది వాటి ఆకలిదప్పుల్ని తీర్చకపోవడము, కొట్టడము, దాని శక్తికి మించి పని చేయించుకొనుట, అవయవాలను కోసివేయుట లేక అగ్నిలో కాల్చుట లాంటివి చేయ కూడదు.

ఇమాం బుఖారి సేకరించారు, ప్రవక్త చెప్పారు:

) دَخَلَتِ امْرَأَةُ النَّارَ فِي هِرَّةٍ حَبَسَتْهَا حَتَّى مَالَتْ: فَدَخَلَتْ فِيْهَا النَّارَ فَلَا هِيَ أَطْعَمَتْهَا وَسَقَتْهَا إِذْ حَبَسَتْهَا وَلَا هِيَ تَرَكَتْهَا تَأْكُلُ مِنْ خَشَاشِ الْأَرْضِ)). رواه البخاري.
ఒక స్త్రీ పిల్లి కారణంగా నరకములో చేరుకుంది. దాన్ని కట్టివేసింది. దాని వలన అది చనిపోయింది, ఆమె నరకములో చేరింది. దాని ఆకలిదప్పుల్ని తీర్చలేదు, కట్టివేసింది. దాన్ని వదిలేసినా అది ఏ కీటకాలనైనా తినేది“.

ومرّ النَّبِيُّ بِمَوضع نَمْلِ وَقَدْ أُخْرِقَتْ فَقَالَ: (( إِنَّهُ لَا يَنْبَغِي أَن يُعَذِّبَ بِالنَّارِ إِلَّا
ప్రవక్త దారిలో వెళ్తూ కాల్చివేయబడిన చీమల పుట్టను చూసి “అగ్ని శిక్ష ఇచ్చే హక్కు అగ్నికి ప్రభువైన అల్లాహ్ కే ఉంది” అని అన్నారు. (అబూ దావూద్ ).

5- విషముగల మరి క్రూర జంతువులను చంపవచ్చును. ఉదా: కరిచే కుక్క, తోడేలు, పాము, తేలు, ఎలుక లాంటివి.

ప్రవక్త చెప్పారు:

خَمْسٌ فَوَاسِقُ يُقْتَلْنَ فِي الْحِلِّ وَالْحَرَمِ الْحَيَّةُ وَالْغُرَابَ وَالْكَلْبُ الْعَقُورُ وَالْحَدَيَّا)).
ఐదు దుష్టమృగ జీవులను హరంలో మరి హరం బైటకూడ చంపవచ్చును: పాము, కాకి, కరిచే కుక్క మరియు గద్ద“. (ముస్లిం). తేలును చంపవచ్చునని మరో హదీసులో చెప్పబడింది మరియు దాన్ని శపించారు కూడా.

6- అవసరానికి పశువుల (అవి ఒంటె ఆవు మేక మాత్రమే) చెవిని కాల్చి మచ్చ పెట్టవచ్చును. ప్రవక్త తన చేతితో జకాత్ ఒంటెలకు అగ్ని మరక (గుర్తు) పెట్టారు. కాని ఒంటె ఆవు మేక తప్ప ఇతరుల పశువులకు మరక పెట్టరాదు. ప్రవక్త ఒక సారి గాడిద ముఖము పై అగ్ని మరకలు చూసి ఇలా హెచ్చరించారు:

((لَعَنَ اللهُ مَنْ وَسَمَ هَذَا فِي وَجْهِهِ)). رواه مسلم.
దీని ముఖముపై అగ్ని మరకలు పెట్టినవానిని అల్లా శపించుగాక. (ముస్లిం).

7- ఆ పశువుల్లో అల్లాహ్ హక్కు ఏమున్నదనేది గ్రహించి జకాత్ చెల్లింప వలసిన పశువులుంటే అందులో జకాత్ చెల్లించాలి.

8- వాటి ద్వార అల్లాహ్ అవిధేయతకు, అతని ధ్యానము నుండి దూరమై, ఆటపాటలలో నిమగ్నులు కాకూడదు. అల్లాహ్ ఇలా ఆదేశించెను:

يا أَيُّهَا الَّذِينَ آمَنُوْا لاَ تُلْهِكُمْ اَمْوَالُكُمْ وَلَا اَوْلَادُكُمْ عَنْ ذِكْرِ الله المنافقون: ٩
ఓ విశ్వాసులారా! మీ ధనములు, మీ బిడ్డలు మిమ్మల్ని అల్లాహ్ ధ్యానము నుండి మరలింపగూడదు”. (63: మునాఫిఖూన్: 9). ప్రవక్త ఇలా ప్రవచించారు:

الْخَيلُ ثَلاثَةٌ هُنَّ لِرَجُلٍ أَجْرٌ، وَلِرَجُلٍ سِرٌ، وَلِرَجُلٍ وِزْرٌ، فَأَمَّا الَّذِي هِيَ لَهُ أَجْرٌ فَرَجُلٌ رَبَطَهَا فِي سَبِيلِ اللهِ فَاطَالَ طِيْلَهَا فِي مَرْجِ أَوْ رَوْضَةٍ فَمَا أَصَابَتْ فِي طِلِهَا مِنَ الْمَرْجِ اَوِ الرَّوْضَةِ كَانَتْ لَهُ حَسَنَاتٍ وَلَوْ أَنهَا قَطَعَتْ طِيْلَهَا فَاسْتَتْ شَرَفًا أَوْ شَرَقَيْن كَانَتْ آثَارُهَا وَاَرْوَالُهَا حَسَنَاتٍ لَهُ، وَهِيَ لِذَلِكَ الرَّجُل أَجْرٌ. وَرَجُلٌ رَبَطَهَا تَغَنياً وَتَعَقْفاً وَلَمْ يُنْسَ حَقَّ اللهِ فِي رِقَابِهَا وَلَا ظُهُورِهَا فَهِيَ لَهُ سِحْرٌ. وَرَجُلٌ رَبَطَهَا فَحْرًا وَرِيَاءًا وَنِوَاءٌ فَهِيَ عَلَيْهِ وِزْرٌ)). رواه البخاري.

“గుఱ్ఱాలు మూడు రకాలు. వాటిద్వార ఒకరికి మంచిఫలితము లభిస్తుంది. మరొకరికి (నరకము నుంచి) అడ్డుగానుంటుంది. మరొకరికి అది భారమవుతుంది. ఎవరికైతే మంచి ఫలితమగునో అతను దాన్ని అల్లాహ్ కొరకు కట్టివేసి దాని త్రాడును కంచలో, మేతపాలములో పొడుగ్గా వదిలేస్తాడు. అందులో అది ఎంతవరకు మేయునో అంత పుణ్యం అతనికి లభించును. ఒక వేళ అది త్రాడును తెంపుకొని ఒకటో, రెండో మట్టి దిబ్బలు దాటిపోయినచో దాని అడుగడుగుకు మరియు ఎన్ని సార్లు మలమూత్రము చేయునో అన్ని పుణ్యాలు లభించును. ఇది అతనికి పుణ్యార్థమగును. మరో వ్యక్తి దాని ద్వారా తన ఆర్థిక పరిస్థితిని బలపరుచు కుంటాడు. ఇతరుల ఎదుట చేతులు జూపె పరిస్తితి రానివ్వడు. అల్లాహ్ హక్కును మరచి పోకుండ అవసరమున్న వారికి సహాయపడుతూ, దాని జకాత్ ఆదా చేస్తాడు. అది అతనికి (నరకము నుండి) అడ్డగును. ఎవరైతే గర్వానికి నలుగురు చూసి పొగడాలని, ముస్లిములకు నష్టము కలుగుటకు ఉంచుతాడో, అది అతనికి భారమగును. (అనగ పాపమగును) (బుఖారి).

ప్రతి ముస్లిం పశువుల పట్ల ఈ ధర్మాలను అల్లాహ్, ఆయన ప్రవక్త విధేయతలో ఉండి పాటించాలి. అన్ని ధర్మాలలో మేలైన ధర్మం, సృష్టిలో ప్రతి ఒకరి కొరకు మేలైన ఇస్లాం ధర్మమాదేశాలను అనుసరించాలి.

సభా మర్యాదలు

ఒక విశ్వాసపరుని జీవితం నిరంతరం ఇస్లాం ధర్మానికనుగుణంగనే ఉంటుంది. అది జీవిత సర్వ వ్యవహారాలకి మంచి మార్గదర్శం చూపింది. చివరికి వారి మీటింగులు తోటి సోదరులతో అందులో పాల్గొనే పద్ధతులూ తెలిపింది. అందుకు ప్రతి ముస్లిం ఏ సభలో పాల్గొన్నా, సభ మర్యాదలను పాటించాలి.

1- ఏ సభలో కూర్చుండబోతున్నాడో ముందు వారికి సలాం చేయాలి. తరువాత కూర్చుండాలి. ఒకరిని లేని అతని స్థానంలో కూర్చుండ కూడదు. ఇద్దరి మధ్య సందుజేసి, వారి అనుమతి లేనిది కూర్చుండ కూడదు. ప్రవక్త నే చెప్పారు:

) لَا يُقِيمَنَّ أَحَدُكُمْ رَجُلاً مِنْ مَجْلِسِهِ ثُمَّ يَجْلِسُ فِيهِ، وَلَكِنْ تَوَسَّعُوا أَوْ تَفْسَحُوا)).
మీలోనెవరు కూడ మరొకరిని వారి స్థలమునుంచి లేపి అచ్చట కూర్చో కూడదు. కాని సర్దుబాటు చేసుకొని కూర్చోవాలి. (బుఖారి, ముస్లిం).

) لاَ يَحِلُّ لِرَجُلٍ أَن يُفَرِّقَ بَيْنَ اثْنَيْنِ إِلَّا بِإِذْنِهِمَا)). رواه أبو داود والترمذي.
మరో సారి ఇలా చెప్పారు: “దగ్గరగా కూర్చున్న వారిద్దరిని, వారి అనుమతి లేనిది విడదీయరాదు”. (అబూ దావూద్, తిర్మిజీ).

2- ఎవరైన కూర్చున్న స్థలమునుంచి లేచిపోయి, మళ్ళి వస్తే ఆ స్థలములో కూర్చునే హక్కు వారిదే. ప్రవక్త చెప్పారు:

((إِذَا قَامَ أَحَدُكُمْ مِنْ مَجْلِسِ ثُمَّ رَجَعَ إِلَيْهِ فَهُوَ أَحَقُّ بِهِ)). رواه مسلم.
మీలోనెవరైనా తన స్థలమునుంచి లేచిపోయి, మళ్ళి తిరిగి వస్తే అచ్చట కూర్చునే హక్కు అతనికే ఉంది. (అనగ ఇతరులు ఆ స్థలాన్ని ఆక్రమించు కోకూడదు) (ముస్లిం).

3- వృత్తాకారములో ఉన్న సభలో ప్రవేశించి మధ్యలో ఏ వ్యక్తి కూర్చోకూడదు.

“వృత్తాకారంలో కూర్చున్నవారి మధ్యలో పోయి కూర్చునేవారిని ప్రవక్త శపించారు”. (అబూ దావూద్ ).
(إِنَّ رَسُولَ اللهِ لَعَنَ مَنْ جَلَسَ فِي وَسط الحلقة). رواه أبو داود.

4- సభమర్యాదల్లో పాటించవలసినవి; పళ్ళలో పుల్లలు చేయరాదు. ముక్కులో మాటిమాటికి వేలు పెట్టరాదు. ఉమ్మి వేయుట, చీదుట మానుకోని, నిర్మానుష్యంగా, అధిక చలనము చేయకుండా, మాట్లాడదలుచుకుంటే సత్యమే మాట్లాడాలి. ఆత్మ ప్రదర్శన గౌరవభావం ఏర్పడేలా మాట్లాడకూడదు. ఎవరైనా మాట్లాడి నప్పుడు నిశబ్ధంగా, శ్రద్ధగా వినాలి. అతని మాటను ఆపవద్దు.

నియమాలను పాటించే ముస్లిం ఈ రెండు విషయాలను కూడ ఆవశ్యకతగా భావించాలి. ఒకటేమనగా తన ప్రవర్తన, తన క్రియతో తన సోదరునికి హాని కలిగించకూడదు. విశ్వాసపరుణ్ణి బాధించడం నిషిద్ధం.

الْمُسلِمُ مَنْ سَلِمَ المُسلِمُونَ مِنْ لِسَانِهِ وَيَدِهِ )). متفق عليه
తన ముస్లిం సోదరునికి తన మాటలు చేతల ద్వార హాని కలిగించని వ్యక్తే నిజమయిన ముస్లిమని ప్రవక్త చెప్పారు” (బుఖారి,ముస్లిం).

రెండవ విషయము: పరస్పర ప్రేమబంధాల్ని పెంచుకొని ఒకరినొకరు కలుస్తూ ఉండాలని ప్రవక్త ప్రభోదించారు.

దారిలో కూర్చున్నప్పుడు క్రింది ధర్మాలను అనుసరించాలి

1- కనుచూపులను క్రిందికి దించుకొని యుండాలి. దారినుంచి వచ్చి పోతున్న స్త్రీలవైపు కన్నెత్తి చూడకూడదు. అసూయపరంగా మరి హాస్యంగా, ఎగితాళి చేయునట్లు ఎవరి వైపు చూడ కూడదు.

2- బాటసారిని చేతల, మాటల ద్వార కష్టపెట్టడం, బాధించడం మానుకోవాలి. అది మాట ద్వార దూషించడమైనా, లోపాలు ఎన్నడమైనా, లేక చేయి ద్వార కొట్టడం, ఇతరుల సొమ్మును అక్రమంగా తీసుకోవడం. దారి నుంచి వేళ్ళే వారిని అడ్డుకొని వారి రాస్తా బందు చేయకూడదు.

3- దారినుంచి వేళ్ళే వారు చేసే సలాంకు ప్రతిగా సలాం చేయుట వాజిబ్. అల్లాహ్ ! ఇలా సెలవిచ్చెను:

وَإِذَا حَيْتُمْ بِحِيَّةٍ فَحَبُوْا بِأَحْسَنَ مِنْهَا أَوْ رُدُّوْهَا﴾ النساء: ٨٦
(మీకు ఎవరైనా గౌరవభావంతో సలాము చేస్తే అతనికి మీరు అంతకంటే ఉత్తమమైన పద్ధతిలో ప్రతిసలాము చెయ్యండి. లేదా కనీసం అదే విధంగానైనా చెయ్యండి). (4: నిసా: 86).

4- తన ఎదుట ఒక ధర్మాన్ని విలువనివ్వకుండ వదిలేసిన వారిని చూసినచో, ఆ సమయములో దాని గురించి బోధించడం అతని బాధ్యత. ఎందుకనగా మంచిని ఆదేశించడం ప్రతి ముస్లిం పై (తన శక్తి ప్రకారం) విదైన బాధ్యత. ఉదా: నమాజు కొరకు అజాన్ అయినప్పటికీ, దారిలో కూర్చున్నవారు లేక వారిలో ఒకరు నమాజుకు రానప్పుడు, వారి వద్దకు వెళ్ళి నమాజుకు రమ్మని చెప్పడం అతని బాధ్యత.

5- తన ఎదుట చెడు జరుగుతుండగా చూసినచో దాన్ని నివారించాలి. ప్రతి ముస్లిం పై చెడును చూసి దాని రూపు మాపడం, మంచిని బోధించడము లాంటి బాధ్యతే. అది ప్రవక్త ఈ ఆదేశానుసారం: “మీలోనెవరైనా చెడు చూసినచో (తమ శక్తి ప్రకారం) దాని రూపు మాపాలి“.

) مَنْ رَأَى مِنكُمْ مُنكَرًا فَلْيُغَيرَهُ)). رواه مسلم
ఉదా: ఒక వ్యక్తి మరో వ్యక్తిని అన్యాయంగా కొడుతూ, చితకబాదుతు లేక అతని సొమ్మును అక్రమంగా తీసుకుంటు ఉండగా, తను చూసినచో తన శక్తి ప్రకారం ఆ చెడును నివారించుట అతని విధి.

6- దారి తప్పిన వారికి దారి చూపాలి.

పైన తెలిపిన ధర్మాలన్నియు ప్రవక్తగారి ఈ హదీసు మూలంగా తెలుపబడినవి:

((إِيَّاكُمْ وَالجُلُوسَ عَلَى الطَّرْقَاتِ، فَقَالُوا: مَا لَنَا بُدٌ إِنَّمَا هِيَ مَجَالِسُنَا نَتَحَدَّثُ فِيهَا، قَالَ: فَإِذَا أَبَيْتُمْ إِلا الْمَجْلِسَ فَاعْطُوا الطَّرِيقَ حَقَّهُ، قَالُوا: وَمَا حَقَّ الطَّرِيقِ؟ قَالَ: غَصْ البَصرِ، وَكَف الأذى، وَرَدُّ السَّلامِ، وَالْاَمرُ بِالمَعرُوفِ وَالنَّهِي عَنِ المُنكَرِ، وَفِي بَعضٍ

“దారిలో కూర్చోవడం మానొకోండి” అని ప్రవక్త చెప్పగా, ‘అది మాకు తప్పనిసరి, అది మా సమావేశం. అచ్చట మేము మాట్లాడుకుంటాము, చర్చించుకుంటాము’ అని విన్నవించుకున్నారు సహచరులు. దానికి ప్రతిగా ప్రవక్త చెప్పారు: మీకు కూర్చోవటమే తప్పనిసరి అయితే, దారి హక్కుల్ని పాటించండి. ఆ హక్కులు ఏమిటి? అని అడగ్గా, “చూపులు క్రిందికి యుంచాలి. బాధకలిగించే వాటిని దూరము చేయాలి. సలాము చేసిన వారికి జవాబివ్వాలి. మంచిని ఆదేశిస్తూ చెడును నివారించాలి. అబూ దావూద్ లోని రివాయత్లో తప్పిపోయిన వారికి దారి చూపాలని కూడ ప్రవక్త ప్రభోదించారు. (బుఖారి, ముస్లిం).

సభమర్యాదల్లో ఒకటేమనగ సభనుంచి లేచిపోవునపుడు “కప్పారతుల్ మజ్లిస్” చదవాలి. అనగ సభలో కుర్చున్న సందర్భములో ఏదైనా తప్పు జరుగవచ్చు. అందుకు సభముగించే ముందు అల్లాహ్ తో క్షమాపణ వేడుకోవాలి. ప్రవక్త సభ ముగించేముందు ఈ దుఆ చదివేవారు:

سُبْحَانَكَ اللهُمَّ وَبِحَمْدِكَ اَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلا أَنتَ اسْتَغْفِرُكَ وَأَتُوبُ إِلَيكَ
సుబ్హాన కల్లాహుమ్మ వబిహమక అవదు అల్ లాఇలాహ ఇల్లా అర్హత అస్తగ్ఫరుక ప అతూబు ఇలైక

దీని గురించి ప్రశ్నించబడినపుడు ప్రవక్త ఇలా సమాధానమిచ్చారు: “ఇది సభలో జరిగిన తప్పిదాలకు పరిహారమగును”. (అబూ దావూద్, తిర్మిజి, నసాయి).

తిను త్రాగు పద్దతులు

(తన జీవితము గడపుటకు) అన్నపానియాలు ఒక సబబు, వసీల అని ముస్లిం భావించాలి. తిండి కోసమే (తను జీవితం గడుపుతున్నట్లు) భావించ కూడదు. అనగ అతను తిను త్రాగేది తన శారీరక ఆరోగ్యానికి, శక్తివంతంగా ఉండి అల్లాహ్ ఆరాధన చేయుటకు. ఈ ఆరాధన ద్వారాయే పరలోకములో ప్రతిఫలము మరియు సుఖాంతులు లభించును. అన్నపానియాలను ఈ విధమైన వసీల గాకుండ, కేవలం తినెత్రాగి రోజులు గడుపుటకు అని ముస్లిం భావించడు. అందుకు ముస్లిం అన్నపానియాలు భుజించునపుడు క్రింది ధర్మాలననుసరించాలి.

A- ప్రారంభానికి ముందు పాటించవలసినవి:

1- ధర్మసమ్మతమైన ఆహారము ఉపయోగించాలి. ధర్మానికి అసమ్మతమైనది, నిషిద్దమైనది అన్న సందేహములో నుంచి దూరముంచుగల అన్న పానీయాలు ఉపయోగించాలి. అల్లాహ్ ఆదేశం చూడండి:

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُلُوا مِنْ طَيِّبَاتِ مَا رَزَقْنَاكُمْ﴾ البقرة: ۷۲
{ఓ విశ్వాసులారా! మేమొసంగిన పవిత్ర వస్తువులను భుజించండి). (2: బఖర: 172). ప్రవక్త ఇలా ఆదేశించారు:

) مَا نَبَتَ مِنْ سُحْتِ فَالنَّارُ أَولَى بِهِ)).
హరాం సంపాదనతో పెరిగిన, పోషించబడిన శరీరం నరకం పాలగుటకే అర్హత గలది. (హాకిం, బ్రహభి భీ ఎల్బిల్ ఈమాన్).

2- అన్నపానీయాలు అల్లాహ్ ఆరాధన, ఆయన ప్రార్థన చేయుటకు బలము ఇస్తాయన్న ఉద్దేశముండాలి. ఈ ఉద్దేశము వలన పుణ్యము లభించును. “యోగ్యమైన” వస్తువు యొక్క ఉపయోగములో సత్సంకల్పముంటే అది ఒక సత్కార్యమగును మరియు సత్ఫలితము లభ్యమగును.

3- భుజించడానికి ముందు చేతులు పరిశుభ్ర పరుచుకోవాలి.

4- ప్రవక్త కూర్చునే విధంగా వినయముతో కోర్చోవాలి. ఆయన ఇలా ప్రభోధించారు: “నేను ఆనుకొని తినను“. (బుఖారి).

నేను దాసుణ్ణి. దాసుడు తిను విధంగానే తింటాను. దాసుడు కూర్చునే విధంగా కూర్చుంటాను”. (ముస్నదు అబి యాలా).

5- ముందున్నది ఇష్టముంటే తినాలి. లేకుంటే వదిలి వెయాలి. కాని లోపాలు ఎంచ కూడదు. అబూ హరైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ప్రవక్త ఈ ఎప్పుడూ భోజనాన్ని వంకలు పెట్టలేదు (లోపాలు ఎంచలేదు). ఇష్టముంటే తిన్నారు లేకుంటే వదిలేసారు. (బుఖారి).

(( مَا عَابَ رَسُولُ اللهِ صلى الله عليه وسلم طَعَامًا قَطُّ إِن اشْتَهَاهُ أَكَلَ وَإِنْ كَرِهَهُ تَرَكَم. البخاري

6- అతిథి లేక ఇంటివారిలో ఏ ఒకరితోనైనా కలిసి భోజనము చేయాలి. అందులో బర్కత్ (శుభము) కలుగును. ప్రవక్త చెప్పారు: “మీరు కలిసి భోజనము చేయండి. అల్లాహ్! అందులో “బర్కత్” ప్రసాధిస్తాడు“. (అబూ దావూద్ ).
اجْتَمِعُوا عَلَى طَعَامِكُمْ يُبَاركَ اللهُ فِيهِ)). رواه أبو داود.

B- బోజనము చేయునపుడు పాటించవలసినవి:

1- అల్లాహ్ పవిత్ర నామముతో ప్రారంబించాలి. ప్రవక్త ఇలా ఉపదేశించారు:

(( إِذَا أَكَلَ أَحَدُكُمْ فَلْيَذْكُرِ اسمَ اللهِ تَعَالَى، فَإِنْ نَسِيَ أَنْ يَذْكُرَ اسْمَ اللهِ تَعَالَى

في أَوْلِهِ فَلْيَقُلْ: بِسمِ اللهِ أَوَّلِهِ وَآخِره)). رواه أبو داود والترمذي.
మీలోనెవరైనా భోజనము చేయునపుడు “బిస్మిల్లాహ్” అనాలి. ఆరంభములో మరచి పోయినచో గుర్తొచ్చినప్పుడు “బిస్మిల్లాహ్ అవ్వలిహి వఆఖిరిహి” అనాలి. (అబూ దావూద్, తిర్మిజి).

2- ప్రవక్త ఆదేశానుసారం భోజనము చేసిన తరువాత అల్లాహ్ స్తోత్రములు ఈ విధంగా తెలుపుకోవాలి. ప్రవక్త చెప్పారు: బోజనము చేసిన తరువాత “అల్ హందులిల్లాహిల్లజీ అత్ అమనీ హాజా వరజఖనీహీ మిన్ గైరి హౌలిమ్ మిన్నీ వలా ఖువ్వతిన్” చదివినవారి పూర్వ పాపాలు మన్నించబడుతాయి. (బుఖారీ, ముస్లిం).

(( مَنْ أَكَلَ طَعَامًا وَقَالَ: الْحَمْدُ لِلَّهِ الَّذِي أَطْعَمَنِي هَذَا وَرَزَقَنِيْهِ مِنْ غَيْرِ حَوْل مِني وَلَا قُوَّةٍ غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِن ذَنْبِهِ)). متفق عليه.

3- కుడి చేయితో మూడు వ్రేళ్ళతో చిన్న చిన్న ముద్దలు (లుఖ్మ) చేసి ప్రతి “లుఖ్మ”ను బాగుగా నమలాలి. పళ్ళెము మధ్యలో నుంచి తినకుండ, తన సమీపమునుంచి తినాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇదే విధానం నేర్పుతూ ఇలా బోధించారు:

ఓ అబ్బాయి! తిను సమయములో అల్లాహ్ నామము పఠిస్తు, కుడి చేతితో సమీపములో ఉన్నదే భుజించు.” (బుఖారి, ముస్లిం).

4- మెతుకు క్రిందపడినచో దానిని శుభ్రము చేసి తినాలి. ముస్లిం గ్రంథంలో ఉంది, ప్రవక్త . ఇలా ఉపదేశించారు:

((إِذَا سَقَطَتْ لُقْمَةُ أحَدِكُمْ فَلْيَأخُذْهَا، وَلْيُمِطْ عَنْهَا الْأَذَى وَلْيَأْكُلْهَا، وَلَا يَدَعْهَا للشيطان)). رواه مسلم.
“మీరు భోజనము చేయునపుడు మెతుకులు క్రింద పడినచో ఎత్తుకోవాలి. ఏదైన అంటినచో శుభ్రము చేసి తినాలి. షైతాన్ కొరకు మిగిలించకూడదు”.

5- వేడి అన్నపానీయాల్లో ఊద కూడదు. చల్లారక ముందే భుజించకూడదు. నీళ్ళు త్రాగుతూ అందులోనే శ్వాస వదలకుండ పక్కన తీసుకోవాలి.

انَّ النبيَّ صلى الله عليه وسلم نَهَى أَن يَتَنفْسَ فِي الْإِنَاءِ أَوْ يَنْفُخَ فِيه). رواه الترمذي.
ఇబ్నె అబ్బాన్ రజియల్లాహు అర్హుమా ఉల్లెఖించారు ప్రవక్త పళ్ళెములో శ్వాస తీసుకొనుట మరియు ఊదుట నిషేధించారు. (తిర్మిజి).

6- ఆకళింపు చేసుకునంతే తినాలి. అంతకు మించి దురాశగా తినువారికి బోధనార్థం ప్రవక్త ఇలా ఉపదేశించారు:

) مَا مَلَا آدَمِيٌّ وِعَاءً شَرًّا مِنْ بَطْنِهِ، حَسْبُ ابنِ آدَمَ لُقَيْمَاتٌ يُقِمْنَ صُلْبَهُ، فَإِن لَمْ يَفْعَلْ فَخَلَتْ لِطَعَامِهِ، وَثُلُثٌ لِشَرَابِهِ، وَثُلُثٌ لِنَفَسِه)). رواه أحمد وابن ماجة.
మానవుడు తన కడుపుకన్న చెడ్డది ఏది నింపడు. మానవునికి తన వీపు చక్కగ నిలబడుటకు కొద్ది మెతుకులు తిన్న సరిపోయేది. మరి ఎక్కువ తినాలనుకుంటే తను మూడు భాగాల్లో ఒక భాగము తిండికి, మరో భాగము త్రాగుటకు, మరొక భాగము గాలి కొరకుంచాలి“. (అహ్మద్, ఇబ్ను మాజ).

7- భోజనము చేయుటకు కూర్చున్న సమావేశములో పెద్దవారున్నచో వారికంటె ముందు తినత్రాగడానికి ప్రయత్నించడము అసభ్యత అనబడును.

8- భోజనము చేస్తు సహచరుల వైపు చూడకూడదు అందువలన వారు సిగ్గు పడవచ్చు.

9- భోజనము చేసే సమయంలో తోటి సోదరులు అసహ్యించుకునే విధంగా ప్రవర్తించ కూడదు. చేయిని ప్లేట్లో దులపకూడదు. నోటి నుంచి మెతుకులు క్రిందపడే విధంగా తల క్రిందికి వంచకూడదు. రొట్టె ముక్క పళ్ళతో కొరికి మిగిలినది పళ్ళములో వేయకుండ చేతులోనే ఉంచవలెను. సహచరులకు ఇబ్బంది కలిగే విధంగా వారు అసహ్యించుకునే విధంగా మాట్లాడకూడదు.

C- భుజించిన తరువాత పాటించవలసినవి:

1- ప్రవక్త సాంప్రదాయాన్ని అనుసరిస్తూ కడుపునిండా తినకుండ ఉండాలి.

2- భోజనం చేసిన తరువాత వేళ్ళల్లో మెతుకులు మిగులకుండ తినవలెను. తరువాత వ్రేళ్ళు తుడుచుకొని, కడిగి పరిశుభ్రం చేయవలెను.

3- క్రిందపడిన మెతుకులను తీసుకొనవలెను. ఇది అల్లాహ్ ప్రసాదమును విలువనిచ్చి కృతజ్ఞత తెలిపినవారగుదురు.

4- పళ్ళు, నోరు పరిశుభ్రత కొరకు పళ్ళల్లో పుల్ల (ఖిలాల్) చేసి పుక్కిళించ వలెను.

5- తినత్రాగిన తరువాత అల్లాహ్ కృతజ్ఞతలు తెలుపాలి. ఇతరుల వద్ద భోంచేసినపుడు వారికొరకు ఇలా దుఆ చెయ్యాలి, అల్లాహుమ్మ బారిక్ లహుమ్ ఫీమా రజఖ్ తహుమ్ వగ్ ఫిర్ లహుమ్ వర్హముహుమ్

ప్రయాణ నియమాలు

ప్రయాణం జీవిత అవసరాల్లో ఒకటి. అది హజ్, ఉమ్రా, యుద్ధం, విద్యా భ్యాసం మరియు బంధువులను కలుసుకొనుటకు ఏదో ఒక నియమంతో ప్రయాణం అవశ్యకత విషయం. ఈ ప్రయాణం, దాని సిద్ధాంతాలు, ఆదేశాలు తెలుపడంలో ఇస్లాంధర్మం ఎంతో శ్రద్ధ చూపింది. ప్రతీ ముస్లిం వాటిని తెలుసుకోవాలి. ఆ ప్రకారమే ఆచరించాలి. ఆదేశాలు ఇవి:

1- నాలుగు రకాతుల నమాజులను తగ్గించి రెండు చదవాలి. మగ్రిబ్ మాత్రం పూర్తి మూడు చేసుకోవాలి. తను నివసించే ప్రాంతమును వదలినప్పటి నుండి మళ్ళీ తిరిగి చేరుకునెంత వరకు అదే విధంగా చేయాలి. ఏ ప్రాంతానికైతే పయనమయ్యారో ఒక వేళ అచ్చట నాలుగు లేక అంతకు ఎక్కువ రోజులు ఉండుటకు నిర్ణయించుకున్నచో స్వగ్రామము చేరుకునెంత వరకు పూర్తి నమాజు చెయ్యాలి. అల్లాహ్ ఆదేశం ఇలా వుంది:

وَإِذَا ضَرَبْتُمْ فِي الْأَرْضِ فَلَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ أَن تَقْصُرُوْا مِنَ الصَّلَاةِ ﴾ النساء: ١٠١
మీరు ప్రయాణానికి బయలు దేరినపుడు నమాజును సంక్షిప్తం చేస్తే, అది తప్పుకాదు. (4: నిసా: 101).

خَرَجْنَا مَعَ رَسولِ اللهِ مِنَ الْمَدِينَةِ إِلَى مَكَّةَ فَكَانَ يُصَلِّيِّ الرُّبَاعِيةَ رَكَعَتَينِ رَكَعَتَيْنِ حَتي رَجَعْنَا إِلَى المَدِينَةِ – رواه البخاري و مسلم.
అనస్ రజియల్లాహు అన్హు చెప్పారు: మేము ప్రవక్త వెంట మదీన నుంచి మక్కా వెళ్ళాము. మళ్ళీ మేము మదీన చేరుకునెంత వరకు ప్రవక్త నాలుగు రకాతుల నమాజు రెండు రెండేసి చదివేవారు. (బుఖారి, ముస్లిం).

2- అలీ రజియల్లాహు అను గారి ఉల్లేఖనం ప్రకారం మూడు పగలు మూడు రాత్రులు మేజోళ్ళపై మసా (స్పర్శ) చేయవచ్చును. ఆయన ఉల్లేఖనం:

جَعَلَ لَنَا النَّبِيُّ ثَلَاثَةَ أَيَّامٍ وَلَيَالِيَهُنَّ لِلْمُسَافِرٍ، وَيَوْمًا وَلَيْلَةً لِلْمُقِيمِ، يَعْنِي فِيالمسح عَلَى الحُفْين – رواه أحمد ومسلم.
ప్రయాణికునికి మూడు పగలు మూడు రాత్రులు మరియు నివాసునికి ఒక పగలు ఒక రాత్రి మేజోళ్ళపై మసా (స్పర్శ) చేయుటకు ప్రవక్త మాకు సెలవిచ్చారు.” (అహ్మద్, ముస్లిం, నసాయి, ఇబ్ను మాజ).

3- నీళ్ళు లేనియడల, లేక దాన్ని పొందడం కష్టమైనపుడు మరి దాని ధర పెరిగినపుడు “తయమ్ముమ్” చేయవచ్చును. అల్లా ఆదేశం చదవండి;

وَإِن كُنتُمْ مَرْضَى اَوْ عَلَى سَفَرٍ، أَوْ جَاءَ اَحَدٌ مِنْكُمْ مِنَ الْغَائِطِ أَوْ لَأَمَسْتُمُ النِّسَاءَ
فَلَمْ تَجِدُوا مَاءً فَتَيَمَّمُوا صَعِيْدًا طَيِّباً فَامْسَحُوْا بِوُجُوْهِكُمْ وَأَيْدِيَكُمْ﴾ النساء: ٤٣
(మీరు ఎప్పుడైనా అస్వస్థులైతే, లేక ప్రయాణంలో ఉంటే, లేక మీలో ఎవరైనా మలమూత్ర విసర్జనం చేసివుంటే, లేక మీరు మీ స్త్రీలతో సంభోగము జరిపివుంటే, మీకు నీరు లభ్యంకాని పక్షంలో, పరిశుభ్రమైన మట్టిని ఉపయోగించండి, దానితో మీ ముఖాలను చేతులను రుద్దుకొండి(*). (4: నిసా: 43).

(*) దీనినే తయమ్ముం అంటారు. దాని విధానం: ఒక సారి రెండు చేతులు భూమిపై కొట్టి ముఖముపై ఒకసారి, మణికట్ల వరకు చేతులపై ఒకసారి తుడుచుకోవాలి.

4- ప్రయాణ రోజుల్లో ఉపవాసముండ కుండా తరువాత ఉండవచ్చు. అల్లాహ్ ఆదేశం ఇది:

فَمَنْ كَانَ مِنْكُمْ مَرِيضًا أَوْ عَلَى سَفَرٍ فَعِدَّةٌ مِنْ أَيَّامٍ أُخَركم البقرة: ١٨٤
(మీలో ఎవరైనా వ్యాధిగ్రస్థులైతే, లేక ప్రయాణంలో ఉంటే వేరే దినాలలో ఆ ఉపవాస దినాలను పూర్తిచెయ్యాలి). (2: బఖర: 184).

5- నఫిల్ నమాజు వాహనము పై చేయవచ్చును. అది ఏ వైపున తిరిగినను ఫర్వా లేదు.

ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హు చెప్పారు: “ప్రవక్త తన ఒంటె ఎటుతిరిగినా దానిపైనే నఫిల్ నమాజు చేసేవారు.” (బుఖారి, ముస్లిం).

6– జొహర్ అసర్ మరియు మగ్రిబ్ ఇషా “జమ తఖ్ దీమ్” చేయవచ్చును. (అనగ జొహర్ అసర్ ఒకేసారి జొహర్ సమయములో మరియు మగ్రిబ్ ఇషా ఒకేసారి మగ్రిబ్ సమయములో చేయుట). అదే విధంగా “జమ తాఖిర్” చేయవచ్చును. (అనగ జోహర్ అసర్ ఒకేసారి అసర్ సమయం లో మరియు మగ్రిబ్ ఇషా ఒకేసారి ఇషా సమయములో).

خَرَجْنَا مَعَ رَسُولِ اللهِ فِي غَرَوَةِ تَبُوكَ فَكَانَ يُصَلِّي الظُّهَرَ وَالعَصْرَ جَمِيعًا
ముఆజ్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త తో మేము “తబూక్” యుద్ధానికి వెళ్ళాము. ప్రవక్త జోహర్ అసర్ ఒకసారి, మరియు మగ్రిబ్ ఇషా ఒకసారి చేసేవారు. (ముస్లిం: 706).

ప్రయాణ ధర్మాలు

1- ప్రయాణములో వెళ్ళే ముందు తనపై ఉన్న ఇతరుల హక్కులను వారి వారి అమానతులను ఆదా చేయాలి. ఎందుకనగా ప్రయాణం నుండి తిరిగి సురక్షితంగా వచ్చే నమ్మకం తక్కువ.

2- తనపై విధియున్న తల్లిదండ్రుల, భార్యసంతానముల ఖర్చులను తీసియుంచి, తను కూడ పవిత్రమైన హలాల్ అన్నపానియాలు వెంట తీసుకొని వెళ్ళవలెను.

3- తన ఇంటివారు, సోదరులు, బంధువులతో వీడుకోలు తీసుకుంటూ ఈ దుఆ చదవాలి: “అస్ తౌది ఉల్లాహ్ దీనకుం వ అమానతకుం వ ఖవాతీమ అఅ’ మాలికుం

సాగనంపుటకు వచ్చినవారు అతనికి ఇలా దుఆ ఇవ్వాలి: “జవ్వదకల్లాహు బిత్తఖ్వా వ గఫర జంబక వజ్ఞహక ఇలల్ ఖైరి హైసు తవజ్ఞహత“. (అల్లాహ్ నీకు భయబీతి గుణం ప్రసాదించుగాకా, నీ పాపాలు మన్నించుగాకా, నీవు ఎటు వెళ్ళిన మేలును నీ వెంట చేయుగాకా). ప్రవక్త చెప్పారు:

((إِنَّ لُقْمَان قَالَ: إِنَّ اللَّهَ تَعَالَى إِذَا اسْتَوْدَعَ شَيْئًا حَفِظَة). مسند أحمد
హజ్రత్ లుఖ్మాన్ చెప్పారు: “అల్లాహు తఆలా దేనిని కాపాడుటకు బాధ్యత తీసుకున్నాడో దానిని కాపాడుతాడు“. (కన్ జుల్ ఉమ్మాల్ V: 6 P:702)

اسْتَوْدِعُ اللَّهَ دِيْنَكَ وَاَمَانَتَكَ وَخَوَانِيْمَ أَعْمَالِكَ)) أبو داود.
ప్రవక్త తనని సాగనంపుటకు వచ్చిన వారికి ఇలా దుఆ ఇచ్చేవారు: “అస్ తౌది ఉల్లాహ్ దీనక వ అమానతక వ ఖవాతీమ అ’మాలిక “. (నీ ధర్మం, అమానతు, నీ అంతిమ ఆచరణ అల్లాకు అప్పగిస్తున్నాను). (అబూ దావూద్, తిర్మిజీ).

4 ప్రయాణములో తోడుకు మంచి స్నేహితులను ఎన్నుకొని ముగ్గురు నలుగురు కలసి వెళ్ళాలి. ప్రవక్త చెప్పారు:

((الرَّاكِبْ شَيْطَانٌ، وَالرَّاكِبَان شَيْطَانَان، والثلاثَةُ رَكْبٌ)) أبو داود وغيره
ఒంటరి బాటసారి షైతాన్, ఇద్దరు బాటసారులు షైతానులే, ముగ్గురయితే నిజమయిన బాటసారులు“. (అబూ దావూద్ : జిహాద్ 86. 2607, తిర్మిజీ: ఫజాయిలె జిహాద్ 4, నసాయి).

మరో సారి ఇలా ప్రవచించారు ప్రవక్త :

لَو أَنَّ النَّاسَ يَعْلَمُونَ مِنَ الْوَحْدَةِ مَا أَعْلَمُ مَا سَارَ رَاكِبٌ بِلَيلِ وَحْدَه)). البخارى
ఒంటరి ప్రయాణం గురించి నాకు తెలిసిన తీరు ప్రజలకు తెలిసియుంటె ఏ ఒకరు కూడ రాత్రి ఒంటరిగా ప్రయాణం చేసేవారు కారు”. (బుఖారీ: 2998).

5- బాటసారులు తమలోని ఏ ఒకరినైనా నాయకునిగా (అమీర్) ఎన్నుకొన వలెను. అతను వారి సలహాలతో వారిలో నాయకత్వము వహించును. ప్రవక్త బోధించారు:

((اذَا خَرَجَ ثَلَاثَةٌ فِي سَفَرٍ فَلْيُؤَمِّرُوا أَحَدَهُم)) رواه أبو داود
ముగ్గురు కలసి ప్రయాణం చేసినపుడు ఒకరిని నాయుకునిగా ఎన్నుకొన వలెను.” (అబూ దావూద్: జిహాద్ 87. 2609).

6- పయనించే ముందు ఇస్తిఖార నమాజు చేసుకోవాలి. ప్రవక్త ఈ విషయమున చాల ప్రోత్సహించి ఖుర్ఆన్ సూరాలు నేర్పే విధంగా ఇస్తిఖార దుఆ నేర్పేవారు. (బుఖారి).

7- సవారిపై ఎక్కి ఈ దుఆ చదవాలి:

بِسْمِ اللهِ الْحَمْدُ لِلَّهِ وَاللَّهُ اَكْبَرُ، سُبْحَانَ الَّذِي سَخْرَلَنَا هَذَا وَمَا كُنَّا لَهُ مُقْرِنِيْنَ، وَإِنَّا إِلَى رَبِّنَا لَمُنْقَلِبُوْنَ اللهُمْ إِنَّا نَسْأَلُكَ فِي سَفَرِنَا هَذَا الْبِرَّ وَالتَّقْوَى، وَمِنَ الْعَمَلِ مَا تَرْضَي، اللهُمَّ هَوْنَ عَلَيْنَا سَفَرَنَا هَذَا وَاطْوِعَنا بُعْدَهُ، اللهُمَّ أَنْتَ الصَّاحِبُ فِي السَّفَرِ وَالْخَلِيْفَةُ فِي الْأَهْلِ وَالْمَالِ. اَللَّهُمْ إِنِّي أَعُوذُ بِكَ مِنْ وَعْدَاء السَّفَر وَكَابَةِ الْمَنْظَرِ وَحَيْبَةِ الْمُثْقَلَب وَسُوْء الْمَنْظَرِ فِي الْمَالِ وَالْأَهْلِ وَالْوَلَدِ. رواه مسلم

“బిస్మిలాహి, వల్ హందు లిల్లాహి, వల్లాహు అక్బర్, సుబ్ హా నల్లజీ సఖ్ఖరలనా హాజా వమాకున్నా లహూ ముక్రినీన్, వఇన్నా ఇలా రబ్బినా లమున్ ఖలిబూన్, అల్లాహుమ్మ ఇన్నా నస్ అలుక ఫీ సఫరినా హాజల్ బిర్ర వత్తఖ్వా, వ మినల్ అమలి మాతర్జా, అల్లాహుమ్మ హవ్విన్ అలైనా సఫరనా హాజా, వత్ విఅన్నా బు’దహు, అల్లాహుమ్మ అంత స్సాహిబు ఫిస్సఫరి వల్ ఖలీఫతు ఫిల్ అహ్లి వల్ మాలి, అల్లాహుమ్మ, ఇన్నీ అఊజుబిక మిన్ వ’దాయి స్సఫరి వకాబతిల్ మన్ జరి వ సూఇల్ మున్ ఖలబి ఫిల్ మాలి వల్ అహ్లి వల్ వలద్.

భావం: అల్లా నామముతో వెళ్తున్నాను. సర్వస్తోత్రములు అల్లాకే అల్లాహ్ మహోన్నతుడు. ఆ ఉన్నతుడైన అల్లాయే దీన్ని (వాహనమును) మా ఆధీనంలోకి ఇచ్చాడు. లేకపోతే మేము దీన్ని ఆధీనపరుచుకోలేక పోయే వారము. నిస్సందేహంగా మేము మా ప్రభువు వైపునకే మరలవలసిన వారమే. ఓ అల్లాహ్ మేము ఈ ప్రయాణంలో సత్కార్యాలు చేసే, భయభక్తుల తో మెలిగే, నీ ప్రసన్నత లభించే కార్యాల బుద్ధిని కోరుకుంటున్నాము. అల్లా ఈ ప్రయాణాన్ని మాకు సులభతరం చెయ్యి. దీని దూరాలను మాకు దగ్గర చెయ్యి. అల్లాహ్ నీవే ఈ ప్రయాణంలో మా సన్నిహితుడివి. నీవే మా ఇంటివారిని, మా ధనాన్ని కనిపెట్టుకు ఉండే వాడివి. అల్లా! నేను నీ శరణు కోరుతున్నాను. ప్రయాణంలోని కష్టాలనుండి, అయిష్టకరమైన దృష్యాల నుండి కాపాడు. నా సంపద వ్యర్థమవకుండా, నా ఆత్మియులకు నా సంతానానికి నేను తిరిగి వెళ్ళేటప్పటికి హాని కలగకుండా కూడ నీ శరణయే కోరుతున్నాను.

8- గురువారము రోజు పొద్దున ప్రయాణం చేయడం మంచిది. ప్రవక్త ఇలా దు చేసారు:
)) اللهُمَّ بَارِكْ لِأُمَّتِي فِي بُكُورِها)). رواه أبو داود

ఓ అల్లాహ్ !! నా ఉమ్మతీయులకు వారి తెల్లవారిజాములో బర్కత్ (శుభం) ప్రసాదించు” (అబూ దావూద్: జిహాద్ 85, 2606). ఆయన కూడ గురువారమే ప్రయాణం చేసేవారు.

9-వాహనము ఎత్తు ప్రదేశములో ఎక్కునప్పుడు అల్లాహు అక్బర్ అనాలి. అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ఒక వ్యక్తి ప్రవక్త తో ‘ఓ ప్రవక్తా నేను ప్రయాణం చేయదల్చుకున్నాను మీరు నాకు ఉపదేశించండి’ అని కోరగా, ప్రవక్త చెప్పారు: “ఎల్లవేళల్లో అల్లాహ్ తో భయపడు. ప్రతి ఎత్తు ప్రదేశములో “అల్లాహు అక్బర్” పలుకు. (తిర్మిజీ. 3441).

10– ఎవరితోనైనా భయమున్నపుడు ఈ దుఆ చదవాలి:-

)) اَللّهُمَّ إِنَّا نَجْعَلُكَ فِي نُحُوْرِهِمْ، وَنَعُوْذُ بِكَ مِنْ شُرُوْرِهِمْ ((
(అల్లాహుమ్మ ఇన్నా నజ్ అలుక ఏ నుహూరిహిమ, వ నఊజు బిక మిన్ షురూరిహిం. భావం: (ఓ అల్లా నిన్ను వారి ఎదుట ఉంచుతూ, వారి కీడు నుండి నీ శరణు వేడుతున్నాము). ఇలా ప్రవక్త చదివేవారు. (అబూ దావూద్. 1537)

11- ప్రయాణములో చేయు దుఆ అంగీకార యోగ్యమైనది గనుక ఇహ పరాల మేలు కొరకు దుఆ చేస్తూ ఉండాలి. ప్రవక్త చెప్పారు:

(( ثَلَاثُ دَعْوَاتٍ مُسْتَجَابَاتٌ لَاشَكَ فِيهِنَّ : دَعوَةُ المَظْلُومِ، وَدَعوَةُ المُسافِرِ، وَدَعْوَةُ الوَالِدِ عَلَى وَلَدِهِ)). رواه أبو داود والترمذي.
మూడు రకాల దుఆలు అంగీకార యోగ్యమైనవి అందులో ఏలాంటి సందేహము లేదు: పీడుతునిది. ప్రయాణికునిది. తండ్రి దుఆ (ఆర్థనాదన) సంతానముపై” (అబూ దావూద్ 1536. తిర్మిజి. 1906).

12- ఏదైనా ప్రాంతములో బస చేసినపుడు ఈ దుఆ చదవాలి:

(( اَعُوْذُ بِكَلِمَاتِ اللهِ التَّامَّاتِ مِنْ شَرِّ مَا خَلَقَ )).
అఊజు బికలిమాతిల్లాహిత్తామ్మాతి మిన్ షర్రి మాఖలఖ్” భావం: సృష్టిలోని కీడునుండి అల్లాహ్ పవిత్ర వచనాల శరణు కోరుచున్నాను. (ముస్లిం. 2708).

రాత్రి అయినపుడు ఈ దుఆ చదవాలి:
(( يَا أَرْضُ رَبِّي وَرَبُّكَ اللهُ، إِنِّي اَعُوْذُ باللهِ مِنْ شَرِّكِ وَشَرِّ مَا فِيْكِ، وَشَرِّ مَا يَدُبُّ عَلَيْكِ، وَاَعُوْذُ بِاللَّهِ مِنْ شَرِّ أَسَدِ وَاسْوَدِ مِنْ حَيَّةٍ وَعَقْرَبِ، وَمِنْ سَاكِنِي الْبَلَدِ، وَمِنْ وَالِهِ وَمَا وَلَدَ )).

“యా అర్జు రబ్బీ వరబ్బుకెల్లాః, ఇన్నీ అఊజు బిల్లాహి మిన్ షర్రికి విషర్రి మాఫికి, వషర్రి మా యదుబ్బు అలైకి, వఅఊజు బిల్లాహి మిన్ షర్రి అసదివ్వఅస్వదిన్, మిన్ హయ్యతివ్ పఅఖ్ రబివ్ (వమిన్ సాకినీల్ బలద్, వమిన్ వాలిదివ్వమా వలద్. (అబూ దావూద్. 2603). భావం: ఓ భూమీ! నీ ప్రభవు, నా ప్రభువు అల్లా మాత్రమే. నేను అల్లా శరణు కోరుతున్నాను నీ కీడుల నుండి నీ లోపల ఉన్న కీడుల నుండి. నీపై సందరించే ప్రాణుల కీడునుండి. పులి, పాము, తేలు, ఈ పురవాసుల కీడునుండి, ఇంకా తండ్రి కొడుకుల కీడునుండి కూడ అల్లాహ్ శరణు కోరుకుంటున్నాను.

13-భయము ఏర్పడినచో “సుబహానల్ మలికిల్ ఖుద్దూసి, రబ్బిల్ మలాఇకతి వర్రూహి, జుల్లిలతిస్సమావాతు బిల్ ఇజ్జతి వల్ జబ్రూతి” చదవాలి. (భావం: సర్వాధికారి, లోపాలకు, దోషాలకు అతీతుడు, దైవదూతల, రూహుల్ అమీన్ యొక్క ప్రభువు (అయిన అల్లా) యొక్క పవిత్రత కొనియాడుతున్నాను. ఆకాశాలపై అధికారం, ప్రాబల్యం ఆయనదే).

سُبْحَانَ الْمَلِكِ الْقُدُّوْسِ رَبِّ الْمَلَائِكَةِ وَالرُّوْحِ
جُلّلَتِ السَّمَاوَاتِ بِالْعِزَّةِ وَالْجَبَرُوتِ

14- పట్టణములో చేరుకున్నప్పుడు ఈ దుఆ చదవాలి:

اللَّهُمَّ اجْعَلْ لَنَا بِهَا قَرَارًا، وَارْزُقْنَا فِيهَا رِزْقًا حَلَالاً، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ خَيْرَ هَذِهِ الْمَدِينَةِ وَخَيْرَ مَا فِيْهَا، وَاَعُوْذُ بِكَ مِنْ شَرِّهَا وَشَرِّ مَا فِيْهَا.

“అల్లాహుమ్మజ్ అల్లనా బిహా ఖరార, వరుఖ్నా విహా రిజ్ ఖన్ హలాల, అల్లాహుమ్మ ఇన్నీ అన్అలుక ఖైర హాజిపాల్ మదీనతి వఖైర మాఫీహ, వ అఊజుబిక మిన్ షర్రిహా వ షర్రి మాఫీహా. ఈ దుఆ ప్రవక్త చదివేవారు. (భావం: ఓ అల్లా ఇచ్చట మాకు ఉండుటకు స్థానం ప్రసాదించు. పవిత్రమైన, ధర్మసమ్మతమైన ఆహారం ప్రసాదించు. ఓ అల్లాహ్ నీతో ఈ నగరము, ఇందులోని మేలును కోరుతున్నాను. ఈ నగరము, ఇందులోని కీడుతో నీ శరణు వేడుతున్నాను).

15- ప్రయాణము నుంచి తిరిగి వచ్చినపుడు మూడు సార్లు “అల్లాహు అక్బర్” అని పలికి ఇది చదవాలి;

آنِبُونَ تَائِبُونَ عَابِدُونَ لِرَبِّنَا حَامِدُونَ
ఆయిబూన తాయిబూన ఆబిదూన అరబ్బినా హామిదూన” మరీ మరి చదవాలి. ఇలా ప్రవక్త చదివేవారు. (ముస్లిం.1342).

16- రాత్రి వేళ ఆకాస్మికంగా ఇంట్లో ప్రవేశించకూడదు. తను వస్తున్న వార్త ముందే ఇంటివారికి తెలియజేయాలి. ఇది ప్రవక్త గారి సాంప్రదాయం.

17- స్త్రీ తన వెంట “మహ్రమ్” (వరుస రీత్యా వివాహానికి నిషధమైనవారు) లేనిదే ప్రయాణము చేయకూడదు. ప్రవక్త ఇలా ఉపదేశించారు:

((لَا يَحِلُّ لِامْرَأَةٍ أَنْ تُسَافِرَ مَسِيْرَةَ يَوْمٍ وَلَيْلَةٍ إِلَّا مَعَ ذِي مَحْرَمٍ عَلَيها)) متفق عليه.
ఏ స్త్రీ కూడ ఒక రాత్రి ఒక పగలు “మహ్రమ్” లేనిది ప్రయాణము చేయ కూడదు. (బుఖారి. 1087. ముస్లిం. 1331).

వస్త్ర ధారణ పద్ధతులు

విశ్వాసుడు తన వస్త్ర ధారణ విషయములో క్రింది పద్ధతులను పాటించాలి:

1- పట్టువస్త్రాలు ధరించ కూడదు. అది తలకు చుట్టే రుమాలె గాని లేక దుస్తులే గాని ఇంకా మరేదైనా సరే. ప్రవక్త ﷺ చెప్పారు:

حُرِّمَ لِبَاسُ الحَرِيرِ والدّهبِ عَلَى ذُكُورِ أُمَّتِي، وَأحِلَّ لِإِنَاثِهِمْ)) رواه الترمذي ۱۷۲۰
పట్టు దుస్తులు, బంగారము నా అనుచరుల పురుషుల పై నిషేధించ బడినవి, స్త్రీలకు యోగ్యమయినవి“. (తిర్మిజీ: 1720).

2- బట్ట, అది లుంగి అయిన లేక పైజామ అయినా పొడుగ్గా, చీల మండలము క్రిందికి ఉండేలా కట్టుకోకూడదు. ప్రవక్త ﷺ ఇలా హెచ్చరించారు:

(( مَا أَسْفَلَ مِنَ الكَعَيْنِ مِنَ الْإِزَارِ فِي النَّارِ (( البخاري
చీలమండల క్రిందికి వ్రేలాడే వస్త్రము నరకం పాలగును“. (బుఖారీ: 5787),

3- తెల్ల రంగు బట్టను ఇతర రంగుల పై ప్రాధాన్యతనివ్వాలి. ప్రతి రంగు బట్టను యోగ్యమైనదిగా భావించాలి. ప్రవక్త ﷺ బోధించారు:

الْبَسُوا الْبَيَاضَ فَإِنَّهَا مِنْ خَيْرِ ثِيَابِكُمْ، وَكَفْنُوا فِيهَا مَوْتَاكُمْ
మీరు తెల్లని వస్త్రాలు ధరించండి. మీ వస్త్రాల్లో అది చాల మంచిది. మీరు వాటినే మీ శవాలకు తొడిగి సమాధి చేయండి.” (అబూ దావూర్ 3872, తిర్మిజి 994).

4 ముస్లిం వనిత దుస్తులను పొడుగ్గా పాదాలు కనబడకుండా ధరించాలి. దుప్పటితో, తలతో పాటు వక్షః స్థలమును, మెడను కప్పియుంచాలి. అల్లాహ్ ఇలా ఆదేశించాడు:

يَا أَيُّهَا النَّبِيُّ قُلْ لِأَزْوَاجِكَ وَبَنَاتِكَ وَنِسَاءِ الْمُؤْمِنِينَ يُدْنِينَ عَلَيْهِنَّ مِنْ جَلَابِيبِهِنَّ الأحزاب: ٥٩
ప్రవక్తా! నీ భార్యలకూ, నీ కూతుళ్ళకూ, విశ్వాసుల యొక్క స్త్రీలకూ తమ దుప్పట్ల కొంగులను తమపై వ్రేలాడ తీసుకోమని చెప్పు“. (33: అహా జాబ్ : 59).

మరో చోట ఇలా ఆదేశించబడింది.
وَلْيَضْرِبْنَ بِخُمُرِهِنَّ عَلَى جُيُوبِهِنَّ وَلَا يُبْدِينَ زِينَتَهُنَّ إِلَّا لِبُعُولَتِهِنَّ أَوْ آبَالِهِن….)
النور: ٣١
“స్త్రీ తమ వక్షఃస్థలాలను ఓణి అంచులతో కప్పుకోవాలి. వారు తమ అలంకరణను వీరి ముందు తప్ప మరెవరి ముందూ ప్రదర్శించకూడదు; భర్త, తండ్రి……”. (24: నూర్: 31).

5- బంగారపు ఉంగురము పురుషులు తొడుగ కూడదు. ప్రవక్త ﷺ దానిని నిషేధించారు:

((حُرِّمَ لِبَاسٌ الْحَرِيرِ وَالذَّهْبِ عَلَى ذُكُورِ أُمَّتِي، وَأحِلَّ لِيَسَاتِهِمْ)) رواه الترمذي ١٧٢٠
పట్టు దుస్తులు మరియు బంగారము నా అనుచరులు పురుషుల పై నిషేధించబడినవి. స్త్రీలకు యోగ్యమయినవి“. (తిర్మిజి.1720). వెండి ఉంగరము ఉపయోగించ వచ్చును.

6- ఒక చెప్పు తొడిగి నడవకూడదు. ప్రవక్త ﷺ చెప్పారు:

((لَا يَمْشِ أَحَدُكُمْ فِي نَعْلِ وَاحِدَةٍ لِيُحْفِهِمَا، أَوْ لِيَنْعَلْهُمَا جَمِيْعًا)). البخاري و مسلم.
మీలోనెవరు కూడ ఒక చెప్పుతో నడవకూడదు. తీస్తే రెండు తీయాలి. లేక రెండు తొడగాలి“. (బుఖారీ: 5855, ముస్లిం: 2097).

తొడుగెటప్పుడు కుడి కాలిలో ముందు తొడగాలి. తీసెటప్పుడు ఎడమ కాలునుంచి ముందు తీయాలి. ప్రవక్త ﷺ చెప్పారు:

((إِذَا انْتَعَلَ أَحَدُكُمْ فَلْيَبْدَأُ بِالْيَمِينِ، وَإِذَا نَزَعَ فَلْيَبْدَا بِالشِّمَالِ)). البخاري ومسلم.
మీలోనెవరైనా చెప్పులు తొడిగినచో కుడి నుంచి ప్రారభించాలి. తీయునప్పుడు ఎడమ నుంచి ప్రారంభించాలి“. (బుఖారి: 5856, ముస్లిం: 2097).

అదే విధంగా దుస్తులు ధరించినప్పుడు.

كَانَ رَسُولُ اللهِ يُحِبُّ التَّيَمُّنَ فِي شَأْنِ كُلِّهِ فِي تَنَعْلِهِ، وَتَرَجُلِهِ، وَطَهُوْرِهِ))
ఆయిషా (రజియల్లాహు అన్హా) తెలిపారు: ప్రవక్త ﷺ ప్రతీకార్యము కుడివైపు నుండి చేయుట ప్రేమించేవారు. అదిచెప్పులు తొడుగుటలో, తల దువ్వుట లో మరియు వుజుచేయునప్పుడు కూడ. (బుఖారి: 426, ముస్లిం: 268).

7-పురుషుడు స్త్రీ వస్త్రాలు, స్త్రీ పురుషుని వస్త్రాలు ధరించకూడదు. ప్రవక్త ﷺ దీనిని కఠినంగా నిషేధించారు:

((لَعَنَ اللهُ الرَّجُلَ يَلْبَسُ لِبْسَةَ الْمَرْأَةِ، وَالْمَرْأَةَ تَلْبَسُ لِبْسَةَ الرَّجُلَ)). أبو داود: ٤٠٩٢
స్త్రీ వస్త్రాలు ధరించిన పురుషులను, పురుషుల వస్త్రాలు ధరించిన స్త్రీలను అల్లాహ్ శపించాడు”. (అబూ దావూద్: 4092). మరో ఆదేశం:

لَعَنَ رَسُولُ اللهِ الْمُتَشَهِينَ مِنَ الرِّجَالِ بالنِّسَاءِ، وَالْمُتَشَبُهَاتِ مِنَ النِّسَاءِ
స్త్రీల వేషము వేసే పురుషులను, పురుషుల వేషము వేసే స్త్రీలను ప్రవక్త శపించారు”. (బుఖారి: 5885).

8-కొత్త బట్ట లేక కొత్త వస్త్రములు ధరించినప్పుడు ఈ దుఆ చదవాలి. ఇలా ప్రవక్త ﷺ చదివేవారు:

اَللَّهُمَّ لَكَ الْحَمْدُ أَنْتَ كَسَوْتَنِيهِ، أَسْأَلُكَ خَيْرَهُ، وَخَيْرَ مَا صُنِعَ لَهُ، ( وَاَعُوذُ بكَ مِنْ شَرِّهِ، وَشَرِّ مَا صُنِعَ لَهُ)). رواه أبو داود والترمذي.
అల్లాహుమ్మ లకల్ హందు అంత కసౌతనీహి, అన్ అలుక ఖైరహు, వ ఖైర మాసునిఅ లహూ, వ అఊజుబిక మిన్ షర్రిహీ వ షర్రి మాసునిఅ లహూ. (భావం: అల్లాహ్ సర్వ కృతజ్ఞతలు నీకే, నీవే ఈ వస్త్రాలు ధరింపజేశావు. దీని మేలును దీని తయారీలోని మేలును నీతోనే వేడుకుంటున్నాను. మరియు దీని కీడునుండి దీని తయారీలోని కీడునుండి నీ శరణు వేడుకుంటున్నాను). (అబూ దావూద్ 4013, తిర్మిజీ: 1767).

ప్రకృతి ధర్మాలు

ప్రవక్త ﷺ ఐదు విషయాలు స్వాభావికమైనవని తెలిపారు:

خَمْسٌ مِنَ الفِطْرَةِ الْاِسْتِحْدَادُ، والخِيَانُ، وَقَصَّ الشَّارِبِ، وَنَتْفُ الْإِبْطِ، وَتَقْلِيمُ الأظافِرِ )). رواه البخاري ومسلم
మర్మాంగ వెంట్రుకలు తీయడం, ఖత్న చేయడం, మీసాలు కత్తిరించడం, చంక వెంట్రుకలు తీయడం, గోళ్ళు తీయడం. (బుఖారి. 5891, ముస్లిం. 257).

 • 1- మర్మాంగ వెంట్రుకలు వస్తరా (బ్లేడ్/రేజర్) మరే దానితోనైనా తీయవచ్చును.
 • 2- ఖత్న; అది పురుష లింగము పై ముందు భాగమును కప్పియుంచు చర్మమును కత్తిరించడము. అది ఏడు రోజులకి చేయడం మంచిది. ఆలస్యమైనచో ప్రాజ్ఞ వయస్సుకు చేరుకునే ముందే చేయాలి.
 • 3- మీసాలు కత్తిరించడం. అనగా పై పెదవును కప్పినటువంటి వెంట్రుకలను కత్తిరించడం. గడ్డము పూర్తిగా వదలాలి (ఏ మాత్రం కత్తిరించ కూడదు).

ప్రవక్త ﷺ ఇలా బోధించారు:

جُرُّوا الشَّارِبَ وَاَرْحُوا اللَّحَى…)) رواه مسلم
మీసాలు కత్తిరించండి, గడ్డము వదలండి“. (ముస్లిం. 260). మరో ఆదేశం:

((خَالِفُوا الْمُشْرِكِينَ اَحْفُوا الشَّوَارِبَ وَاعْفُوا اللَّحَى)) مفق عليه.
ముష్రికులకు వ్యెతిరేకంగా మీరు మీసాలు కత్తిరించండి. గడ్డము వదలండి“. (బుఖారి. 5892, 5893. ముస్లిం. 259).

తల వెంట్రుకలు కొన్ని కత్తిరించి కొన్ని ఉంచడం మంచిది కాదు. ప్రవక్త ﷺ అలా చేయకూడదని చెప్పారని, హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రజియల్లాహు అన్హు) తెలుపుతున్నారు:

తల వెంట్రుకలు కొన్నియుంచి కొన్ని కత్తిరించడం ప్రవక్త వారించారు.” (బుఖారి. 5921, ముస్లిం. 2120).

ఏ ముస్లిం వ్యక్తి అయినా తల వెంట్రుకలుంచినచో వాటిని మర్యాదగా శుభ్రంగా ఉంచాలి. ప్రవక్త ﷺ చెప్పారు:

مَنْ كَانَ لَهُ شِعْرٌ فَلْيَكْرِمْهُ – رواه أبو داود
వెంట్రుకలుంచువారు వాటిని శుభ్రంగా ఉంచాలి“. (అబూ దావూర్, 4163).

4- చంక వెంట్రుకలు వస్తరా (బ్లేడ్/రేజర్)తో కాకుండ చేతితో తీయాలి. అది సులభము కానిచో వస్తరాతో తీయవచ్చును.

5- స్వాభావిక విషయాల్లో ఒకటి గోళ్ళు తీయడం. అది ముందు కుడి చేయి, పిమ్మట ఎడమ చేయి. తరువాత కుడి కాలు, ఎమ్మట ఎడమకాలు నుంచి తీయడం మంచిది. ఇవన్నియు కూడ ఒక ముస్లిం ప్రవక్త సాంప్రదాయాన్ని అనుసరిస్తున్న ఉద్దేశంతో, అతని ఈ అనుకరణ పై పుణ్యము లభించాలన్న ఉద్దేశంతో చేయాలి. మరియు కర్మలు మనోసంకల్పం పై ఆధారపడి ఉంటాయి. ఎవరి సంకల్పం ఏది యుండునో వారికి అదే ప్రాప్తమవుతుంది.

మర్మాంగ, చంక వెంట్రుకలు, మీసాలు, గోళ్ళు కనీసం నలబై (40) రోజుల కొకసారి తీస్తూ ఉండాలి. అంతకు ఆలస్యం ఏ మాత్రం చేయకూడదు” ఈ ఆదేశం ప్రవక్త ﷺ ఇచ్చారని అనస్ రజియల్లాహు అన్హు తెలిపారు. (ముస్లిం: 258).

నిద్రించడం ఎలా? (ఆదాబు న్నౌం)

అల్లాహ్ తన దాసులకు అనుగ్రహించిన అనుగ్రహాల్లో ఒకటి నిద్ర, అని ఒక ముస్లిం భావిస్తాడు. అల్లాహ్ ఇలా తెలిపెను:

وَمِنْ رَحْمَتِهِ جَعَلَ لَكُمُ الْيْلَ والنَّهَارَ لِتَسْكُنُوا فِيهِ وَلِتَبْتَغُوا مِنْ فَضْلِهِ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ القصص: ۷۳
ఆయన మీ కొరకు రాత్రినీ, పగలునూ సృష్టించాడు. మీరు (రాత్రి సమయములో) విశ్రాంతి పొందటానికీ, (పగటి సమయములో) మీ ప్రభువు అనుగ్రహాన్ని అన్వేషించటానికీ; బహుశా మీరు కృతజ్ఞులవుతారేమో అని. (28:ఖసన్ : 73).

అల్లాహ్ అనుగ్రహమునకు కృతజ్ఞత తెలుపుతు, నిద్రించునప్పుడు ఈ పద్ధతులను అనుసరించాలి:

1- ఇషా తరువాత నిద్రించడములో ఆలస్యము చేయకూడదు. ధర్మ జ్ఞాన చర్చల్లో అతిథితో సంభాషణములో, భార్యతో వినోదము జరుపుటలో తప్ప, అబూ బర్జ ఉల్లేఖిస్తు చెప్పారు:

(( أَنَّ رَسُولَ اللهِ كَانَ يَكْرَهُ التَّوْمَ قَبْلَ صَلاةِ الْعِشَاء وَالحَدِيثَ بَعْدَهَا)) .
ప్రవక్త ﷺ ఇషాకు ముందు నిద్రించడము, ఇషా తరువాత మాట్లాడటము అసహ్యించుకునేవారు. (బుఖారీ, ముస్లిం).

2-వుజు చేసుకొని పడుకునే ప్రయత్నం చెయ్యాలి. ప్రవక్త ﷺ బరా ఇబ్ను ఆజిబ్ గారికి ఇలా ఉపదేశించారు:

إِذَا أَتَيْتَ مَضْجَعَكَ فَتَوَضَّاً وُضُوءَكَ لِلصَّلاةِ)). متفق عليه.
పడక పై వచ్చినప్పుడు నమాజు కోసం చేయు విధంగా వుజు చేయుము“. (బుఖారి. 247).

3- పడుకునెటప్పుడు కుడి వైపు పడుకోవాలి. అదే పక్కపై దిండును పెట్టుకోవాలి. ఆ తరువాత (నిద్రలో) పక్క మార్చినా పరవా లేదు. ప్రవక్త ఇలా బోధించారు:

(( إِذَا أَتَيْتَ مَضْجَعَكَ لَحَوَضًا وُضُوءَكَ لِلصَّلاةِ، ثُمَّ اصْطَجَعَ عَلَى شِقِّكَ الْأَيْمَنِ)).
నీవు పడకపై వచ్చునప్పుడు నమాజు కొరకు చేయు విధంగా వుజు చేసి కుడి పక్కన పడుకొనుము.” (బుఖారీ, ముస్లిం. 710) మరో ఆదేశం:

(( إِذَا أَوَيْتَ إِلَى فِرَاشِكَ وَانْتَ طَاهِرٌ فَتَوَسَّدْ يَمِيْنَكَ ) .
నీవు పడకపై ఆనుకొనునప్పుడు వుజు స్థితిలో కుడి చెయ్యిని కుడి చెంప క్రింద పెట్టుకొని పడుకొనుము“. (అబూ దావూద్: 5037).

4- పగలైన, రాత్రిలోనైనా కడుపు భూమికి ఆనుకునే విధంగా (బోర్లా) పడుకోకూడదు. ప్రవక్త ﷺ చెప్పారు:

إِنهَا صَجْعَةٌ لا يُحِبُّهَا اللهُ عَزَّوَجَلَّ)). رواه الترمذي.
బోర్ల పడుకోవడం అల్లాకు ఇష్టం లేదు“. (తిర్మిజీ: 2768).

5- పడుకునే ముందు దుఆలు చదివి, పడుకునే ప్రయత్నం చెయ్యాలి. అందులో కొన్ని:

“సుబ్హానల్లా 33, అల్ హందులిల్లా 33 మరియు అల్లాహు అక్బర్ 34 సార్లు చదవాలి. అలీ మరియు ఫాతిమ రజియాల్లహు అన్హుమా గారులు తమ ఇంటి పనుల సహాయానికి ఒక సేవకుడిని కోరుతు వచ్చినప్పుడు ప్రవక్త వారికి ఇలా చెప్పారు: “మీరడిగిన దానికన్న మేలైనది మీకు తెలుపనా? మీరు మీ పడకలపై వచ్చినప్పుడు “సుబహానల్లాహ్ అల్ హందులిల్లా” 33,33 సార్లు, అల్లాహు అక్బర్ 34 సార్లు చదవండి. ఇది మీకు సేవకుడికన్న చాల మంచిది“. (బుఖారీ. 3705, ముస్లిం.2727).

మళ్ళీ సూరె ఫాతిహ, సూరె బఖరలోని మొదటి నాలుగు వాక్యాలు, ఆయతుల్ కుర్సి, సూరె బఖరలోని చివరి రెండు ఆయతులు మరియు ఖుల్ హువల్లాహు అహద్, ఖుల్ అఊజు బిరబ్బిల్ ఫలఖ్, ఖుల్ అఊజు బిరబ్బిన్నాసి సూరాలు చదవాలి. ఇవి చదవాలని చాల ప్రోత్సహించ బడినది.

మేల్కొన్న తరువాత ఈ దుఆ చదవాలి:

الْحَمْدُ لِلَّهِ الَّذِي أَحْيَانَا بَعْدَ مَا أَمَاتَنَا وَإِلَيْهِ النُّشُور
అల్ హందు లిల్లా హిల్లజీ లిల్లాహిల్లజీ అహ్యానా బ’దమా మాఅమాతనా వఇలైహిన్ను షూర్. (బుఖారి. 6314).
(మమ్మల్ని నిర్జీవావస్థకు గురి చేసి తిరిగి మాకు జీవం పోసిన ఆ అల్లా కే సర్వ స్తోత్రములు, తిరిగి ఆయన సమక్షంలోనే లేచి నిలబడేవారము).

ఓ అల్లాహ్! మాకు ఇస్లాం ప్రకారం జీవితం గడిపే భాగ్యం నొసంగుము.


[1] ప్రవక్త సహచరులను విశ్వాస స్థితిలో కలసి అదే స్థితిలో మరణించినవారిని తాబిఈన్ అంటారు.

[2] తాబిఈన్ లను విశ్వాస స్థితిలో కలసి అదే స్థితిలో మరణించినవారిని తబెతాబిఈన్ అంటారు.

[3] ఒక స్త్రీతో ఏ పురుషుల వివాహము శాశ్వతంగా నిషిద్ధమో వారు ఆమెకు మహ్రం.

ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books)
https://teluguislam.net/telugu-islamic-books/

%d bloggers like this: