మిష్కాతుల్ మసాబీహ్ [హదీసులు]

బిస్మిల్లాహ్

సంకలనం: ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ అల్ ఖతీబ్ అత్ తబ్రీజీ
పరిశీలన: షేఖ్ ముహమ్మద్ నసీరుద్దీన్ అల్ – అల్బానీ 

తెలుగు అనువాదం: డా. అబ్దుర్రహీమ్ బిన్ ముహమ్మద్ మౌలానా 

మిష్కాతుల్ మసాబీహ్ [హదీసులు]

అల్లాహ్‌ (త’ఆలా) స్తోత్రం తర్వాత ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)ను పూర్తిగా అనుసరించనంత వరకు విశ్వాస మాధుర్యాన్ని చవిచూడలేము. ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ‘హదీసు‘లను పూర్తిగా అనుసరించినంత వరకే విధేయతా వాగ్దానం నెరవేరుతుంది. ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వివరణల ద్వారానే ఖుర్‌ఆన్‌ను అనుసరించటం జరుగుతుంది. వీటిని గురించి వ్రాయబడిన పుస్తకాల్లో “మిష్కాతుల్‌ మ’సాబీ’హ్‌” ప్రముఖమైనది. ఇందులో వివిధ ‘హదీసు’లను చేర్చడం జరిగింది. దీన్ని సమకూర్చి, ప్రవక్త సాంప్రదాయాలను వ్యాపింపజేస్తూ, బిద్‌’అత్‌లను రూపుమాపడానికి ప్రయత్నించిన వారు, అబూ ము’హమ్మద్‌ ‘హుసైన్‌ బిన్‌ మస్‌’ఊద్‌ బిన్‌ ముహమ్మద్‌ అల్‌ ఫరాఅ’ అల్‌ బ’గవీ (రహిమహుల్లాహ్). అల్లాహ్‌ (త’ఆలా) అతని తరగతులను అధికం చేయుగాక. అతడు దీన్ని సమకూర్చినప్పుడు. ‘హదీసు’ల పరంపరల ధృవీకరణ, ఉల్లేఖకుల పేర్లను ప్రస్తావించలేదు. ఈ కారణంగా కొందరు ‘హదీసు’ వేత్తలు దీన్ని విమర్శించారు.

తరువాత ము’హమ్మద్‌ బిన్‌ అబ్దుల్లాహ్ అల్‌ ఖ’తీబ్‌ అత్‌ తబ్రే’జీ (రహిమహుల్లాహ్) గారు. బ’గవీ గారి మ’సాబీహ్‌లో గుర్తుల్లేని ‘హదీసు’లకు గుర్తింపుపెట్టారు. అంటే ‘హదీసు’వేత్తల, వారి పుస్తకాల పేర్లను పేర్కొన్నారు. ‘హదీసు’ ప్రారంభంలో ‘హదీసు’లను ఉల్లేఖించిన ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) అనుచరుని పేరును, చివరలో ‘హదీసు’ను వ్రాసిపెట్టిన ‘హదీసు’వేత్తల పేర్లను, వారి పుస్తకాల పేర్లను కూడా పేర్కొనడం జరిగింది. బ’గవీ గారు సమకూర్చిన ఈ “అల్‌ మ’సాబీ’హ్” కు, ‘తబ్రీ’జీ గారు “మిష్కాతుల్‌ మసాబీహ్‌” అని పేరు పెట్టారు.

ఏవిధంగా బ’గవీ గారు తమ గ్రంథాన్ని 30 పుస్తకాలలో సమకూర్చారో తబ్రే’జీ గారు కూడా అలాగే చేసారు. బ’గవీ గారు ప్రతి అధ్యాయాన్ని 2 విభాగాలలో విభజించారు. మొదటి విభాగంలో బు’ఖారీ, ముస్లిమ్‌లు పేర్కొన్న ‘హదీసు’లను లేదా వారిద్దరిలో ఒక్కరు పేర్కొన్న ‘హదీసు’లను పెట్టారు. రెండవ విభాగంలో వీరిద్దరితో పాటు ఇతరులు కూడా ఉల్లేఖించిన ‘హదీసు’లను పేర్కొన్నారు. తబ్రే’జీ గారు మూడవ విభాగం అధికం చేసి ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) అనుచరులు, తాబయీన్లు పేర్కొన్న ‘హదీసు’లను కూడా చేర్చారు.

“మిష్కాతుల్‌ మ’సాబీ’హ్‌” ప్రపంచంలో ఎన్నో ఇస్లామీ ధార్మిక పాఠశాలలో ముఖ్య ‘హదీసు’ అభ్యాస గ్రంథంగా బోధించబడుతుంది. కాబట్టి దీన్ని ఎన్నో భాషలలోనికి అనువాదాలు చేయబడ్డాయి.

దీని ఉర్దూ అనువాదం చాలామంది చేసారు. వారిలో ‘అబ్దుస్సలాం బస్తవీ (రహిమహుల్లాహ్) ఒకరు. వారు దీనికి మంచి అనువాదం మరియు వ్యాఖ్యానం వ్రాసారు. బస్తవీ గారు సందర్భాన్నిబట్టి ‘హదీసు’లను ఉల్లేఖించిన ప్రముఖ ప్రవక్త సహచరుల జీవిత విశేషాలను మరియు చారిత్రక విషయాలను కూడా వ్యాఖ్యానాలలో వివరించారు.

ఇతర భాషలలో ఎంత నేర్పున్నా, ఒక పుస్తకాన్ని – తమ మాతృభాషలో చదివితే కలిగే సంతృప్తి – ఇతర భాషలలో చదివితే దొరుకదు. కాబట్టి మేము ఈ “మిష్కాతుల్‌ మ’సాబీ’హ్‌” ను బస్తవీ గారి వ్యాఖ్యానంతో సహా సులభమైన తెలుగు భాషలో అందజేయటానికి ప్రయత్నించాము.

ఏవిషయానికి గురించయిన ‘హదీసు’ చూడాలనుకుంటే, ఈ “మిష్కాతుల్‌ మసాబీహ్‌” చాలు. ఎందుకంటే ఇందులో 13 మంది ‘హదీసు’వేత్తలు ప్రోగుపరచిన, అనేక విషయాలకు సంబంధించిన ‘హదీసు’లున్నాయి. వాటిని, ఆ ‘హదీసు’వేత్తలదే కాక అల్బానీగారి ధృవీకరణ కూడా ‘హదీసు’ మొదటలో పేర్కొనబడింది.

“మిష్కాతుల్‌ మసాబీహ్‌” యొక్క 6294 ‘హదీసు’లు రెండు సంపుటాలలో విభజించబడ్డాయి. మొదటి సంపుటంలో 11 పుస్తకాలు (1012 పేజీలు), రెండవ సంపుటంలో 19 పుస్తకాలు (1019 పేజీలు) ఉన్నాయి.

విషయ సూచిక

మొదటి సంపుటం అధ్యాయాలు 

అధ్యాయ సూచిక – సంపుటం-1 : అధ్యాయాలు 1-11 (4 పేజీలు)

రెండవ సంపుటం అధ్యాయాలు

అధ్యాయ సూచిక – సంపుటం-2 : అధ్యాయాలు 12-30 (4 పేజీలు)

క్లుప్తంగా ఇమామ్ బుఖారీ & ఇమామ్ ముస్లిం గురుంచి | అల్-లూలు వల్ మర్జాన్

nature-bukhari-muslim

Brief Biography of Imam Bukhari & Imam Muslim

[ఇక్కడ చదవండి / PDF డౌన్లోడ్ చేసుకోండి]

రచయిత :సయ్యిద్ షబ్బీర్ అహ్మద్
మూలం:మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) గ్రంధ పరిచయం నుండి

కరుణామయుడు, కృపాసాగరుడయిన అల్లాహ్ పేరుతో

అల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదుల్ ముర్సలీన్, అలా ఆలిహీ వ అస్ హాబిహీ అజ్మయీన్. ఈ గ్రంథం అసలు పేరు అరబీ భాషలో “అల్ లూలు వల్ మర్జాన్”. ఇందులోని పదావళి దివ్యఖుర్ఆన్లో ఈ విధంగా ప్రస్తావించబడింది:

مَرَجَ الْبَحْرَيْنِ يَلْتَقِيَانِ بَيْنَهُمَا بَرْزَخٌ لَّا يَبْغِيَانِ فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ يَخْرُجُ مِنْهُمَا اللُّؤْلُؤُ وَالْمَرْجَانُ فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

“ఆయన రెండు సముద్రాలను పరస్పరం కలిసిపోయేలా వదలి పెట్టాడు. అయినా వాటిమధ్య ఒక అడ్డుతెర ఉంది. దానివల్ల అవి ఒకదానిలోకొకటి చొచ్చుకుపోలేవు. కనుక (మానవులారా! జిన్నులారా!!) మీ ప్రభువు శక్తి పరిధిలోని ఏ మహిమను మీరు నిరాకరించగలరు? ఈ సముద్రాలలో ముత్యాలు, పగడాలు కూడా లభిస్తాయి. కనుక (మానవులారా! జిన్నులారా!!) మీ ప్రభువులోని ఏ ఔన్నత్యాన్ని మీరు కాదనగలరు?”(55:19-23)

ఈ గ్రంథంలో మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) సంప్రదాయాల (హదీసుల)కు సంబంధించిన సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం అనే రెండు హదీసు గ్రంథాలను రెండు సముద్రాలతో పోల్చడంజరిగింది. అయితే ప్రస్తుత సంకలన కర్త అల్లామా ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ హదీసుల మూలం (Text) ని బుఖారీ గ్రంథం నుండి గ్రహించి స్కంధాలు, అధ్యాయాల క్రమాన్ని, శీర్షికలపేర్లను మాత్రం ముస్లిం గ్రంథం నుండి స్వీకరించారు. అదీగాక పై రెండు గ్రంథాలలోనూ ఒకే ఉల్లేఖకుడు తెలిపిన ఉమ్మడి హదీసుల్ని మాత్రమే ఈ గ్రంథం కోసం ఎంచుకున్నారు. వీటిని “ముత్తఫఖున్ అలైహ్” (ఉభయోకీభవిత) హదీసులని అంటారు. వీటినే ఈ సంకలనకర్త ముత్యాలు,పగడాలుగా అభివర్ణించి, దాన్నే తన గ్రంథానికి నామకరణం చేశారు.

అంతిమ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి ప్రవచనాలు, ఆచార వ్యవహారాలు, ఆజ్ఞలు, అనుజ్ఞలు, అలవాట్లు, అభిరుచులు, కదలికలు, కథనాలు, సలహాలు, సూచనలు, స్వరూప స్వభావాలు -ఒక్కటేమిటి, ఆ మహనీయుని జీవితంలోని ప్రతి అంశానికి, ప్రతి కోణానికి సంబంధించిన హదీసుల్ని సేకరించి, సంకలనం చేసి పకడ్బందీగా భద్రపరిచారు హదీసు వేత్తలు. ఈ మహాకార్యం వెనుక వారి అవిరళ కృషి, అవిశ్రాంత శ్రమ, అసామాన్య సాహసం మనకు స్పష్టంగా గోచరిస్తాయి.

హదీసువేత్తలు ఉల్లేఖకుల నుండి హదీసుల్ని సేకరిస్తున్నప్పుడు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గౌరవోన్నతుల పై అణుమాత్రం కూడా మచ్చరాని విధంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ మహానాయకుని పట్ల విశ్వాసం, ప్రేమాభిమానాలు ఇసుమంత సడలినట్లనిపించినాసరే అలాంటి హదీసుల్ని వారసలు స్వీకరించనే లేదు. హదీసుల సేకరణ తరువాత వారా హదీసుల్ని పరి పరి విధాల పరిశీలించి, శల్యపరీక్ష చేసి, క్షుణ్ణంగా వడపోసి వాటి నుండి పూర్తిగా నమ్మకమయినవని, నిజమయినవని ధృవీకరించుకున్న హదీసుల్ని మాత్రమే ఎంచుకొని సంకలనం చేశారు. హదీసులు ప్రామాణికత విషయంలో వారి దైవభీతి పరాయణత, నిజాయితీ, విశ్వసనీయలతో పాటు, హదీసుల ప్రామాణికతను పరిశీలించడానికి వారు నిర్దేశించిన కొలమానాలు యావత్తు ముస్లిం జగత్తులో ఎంతో గుర్తింపు పొందాయి. ఇలా సంకలనం చేసిన గ్రంథాలలో సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం, తిర్మిజి, అబూదావూద్, నసాయి. ఇబ్ను మాజా, ఇమాం మాలిక్ గారి మువత్తా, ఇమాం ముహమ్మద్ గారి మువత్తా, ముస్నద్ అహ్మద్, దార్మి, దారెఖత్ని, బైహఖీ మొదలైనవెన్నో ఉన్నాయి. వీటిలో హదీసుల ఆరోగ్యస్థితి, ప్రామాణికతల రీత్యా మొదటి ఆరు గ్రంథాలు అత్యున్నత స్థాయికి చెందిన గ్రంథాలుగా ఖ్యాతి చెందాయి. ఈ ఆరు గ్రంథాలను “సహీ సిత్తా” (షడ్నీజాలు) అంటారు.

వీటిలో మన సంకలనకర్త తన గ్రంథం కోసం ఎంచుకున్న రెండు గ్రంథాలు సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలను గురించి, వాటిని సంకలనం చేసిన ప్రముఖ హదీసు వేత్తలు ఇమాం బుఖారీ (రహిమహుల్లాహ్), ఇమాం ముస్లిం (రహిమహుల్లాహ్) గార్ల జీవిత చరిత్రలను గురించి ఇక్కడ సంక్షిప్తంగానయినా తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

సహీహ్ బుఖారీ గ్రంథాన్ని సంకలనం చేసిన ఇమామ్ అబూ అబ్దుల్లా ముహమ్మద్ బిన్ ఇస్మాయీల్ బిన్ ఇబ్రాహీమ్ అల్ బుఖారీ (రహిమహుల్లాహ్) హిజ్రీ శకం 194, షవ్వాల్ మాసం 13వ తేదీ శుక్రవారం నాడు బుఖారాలో ఒక పేద కుటుంబంలో జన్మించారు. ఆయన పదేళ్ళ ప్రాయంలో విద్యాభ్యాసం ప్రారంభించారు. స్వగ్రామంలో ప్రాథమిక విద్యనభ్యసించిన తరువాత ఉన్నత విద్యకోసం ముస్లిం జగత్తులోని యావత్తు ప్రధాన విద్యా కేంద్రాలన్నీ పర్యటించారు. ఈ సుదీర్ఘ పర్యటనలో ఆయన 1080 మంది ధర్మవేత్తల నుండి హదీసు విద్య నేర్చుకున్నారు. పదేళ్ళ ప్రాయంలోనే ఆయన బుఖారాలో ఆనాటి హదీసు విద్యాపారంగతులు ఇమామ్ దాఖలీ (రహిమహుల్లాహ్) గారి పాఠశాలలో చేరారు.

ఒక రోజు ఇమామ్ దాఖలీ (రహిమహుల్లాహ్) ఒక హదీసు ప్రమాణాన్ని పేర్కొంటూ “సుఫ్యాన్ అన్ అబీజుబైర్ అన్ ఇబ్రాహీం” అని అన్నారు. అప్పుడు ఇమాం బుఖారీ (రహిమహుల్లాహ్) కల్పించుకొని “ఈ హదీసు ప్రమాణం ఈ విధంగా లేదండీ! అబూజుబైర్ ఈ హదీసుని ఇబ్రాహీం నుండి ఉల్లేఖించ లేదు”అని అన్నారు.

అతి పిన్న వయస్సులో ఉన్న ఒక శిష్యుడు తనను ఇలా తప్పుబట్టడంతో గురువు గారుఉలిక్కిపడ్డారు. ఆయన కోపంతో కొర కొర చూశారు. ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) గురువు గారి పట్లఎంతో వినయ విధేయతలతో వ్యవహరిస్తూ “మీ దగ్గర అసలు గ్రంథం ఉంటే అందులో ఓసారిచూసుకోండి” అని ప్రశాంతంగా అన్నారు.

ఇమామ్ దాఖలీ (రహిమహుల్లాహ్) ఇంటికి వెళ్ళి అసలు గ్రంథాన్ని పరిశీలించి ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) చేసిన విమర్శ సహేతుకమయినదేనని గ్రహించారు. ఆయన తిరిగి వచ్చి “అయితే సరయిన ప్రమాణం ఏమంటావు?” అని అడిగారు. ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) తక్షణమే సమాధానమిస్తూ “సుఫ్యాన్ అనిజ్జుబైరి వహు వన్బు అదియ్యి అన్ ఇబ్రాహీం (ఇబ్రాహీం నుండి జుబైర్ బిన్ అదీ రహిమహుల్లాహ్-ఉల్లేఖించారు; అబూజుబైర్ అనడం సరికాదు)” అని అన్నారు.

అప్పటికి ఇమామ్ బుఖారీ వయస్సు పదకొండేండ్లు కూడా నిండలేదు. పదహారు సంవత్సరాలవయస్సులో ఆయన హజ్రత్ అబ్దుల్లా బిన్ ముబారక్ (రహిమహుల్లాహ్), ఇమామ్ వకీ (రహిమహుల్లాహ్)లు సేకరించిన హదీసులన్నీ కంఠస్తం చేశారు. 18వ యేట చరిత్ర గ్రంథాన్ని రచించ నారంభించారు. ఇందులో సహాబీలు (ప్రవక్త ప్రత్యక్ష అనుచరులు), తాబయీల (ఆ తరువాతి అనుచరుల) జీవిత చరిత్ర, వారుచెప్పిన మాటలు, చేసిన నిర్ణయాలన్నీ సమీకరించబడ్డాయి. ఈ గ్రంథాన్ని ఆయన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధి దగ్గర కూర్చొని వెన్నెల రాత్రులలో రాశారు.

ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) అసామాన్య జ్ఞాపకశక్తి గల మేధా సంపన్నులు. ఎంత పెద్ద హదీసయినాసరే ఒక్కసారి చదివితే లేక వింటే చాలు కంఠస్తమయిపోయేది.

ఇమాం బుఖారీ (రహిమహుల్లాహ్) గారి సమకాలిక హదీసువేత్త హామిద్ బిన్ ఇస్మాయీల్ ఇలాతెలియజేస్తున్నారు: “ఇమామ్ బుఖారీ బస్రాలో మాతో పాటు హదీసు తరగతులకు హాజరవుతూ ఉండేవారు. అయితే ఆయన కేవలం వినేవారు. ఒక్క అక్షరం కూడా వ్రాసుకునేవారు కాదు. ఈవిధంగా 16 రోజులు గడిచిపోయాయి. చివరికి ఓ రోజు నేను, హదీసులు వ్రాసుకోకపోవడం పట్ల ఆయన్ని విమర్శించాను. దానికాయన సమాధానమిస్తూ “ఈ పదహారు రోజుల కాలంలో నీవు వ్రాసుకున్న విషయాలన్నీ తీసుకురా. వాటన్నిటినీ నేను చూడకుండా చదువుతాను విను” అని అన్నారు. ఆ విధంగా ఆయన పదిహేను వందలకు పైగా హదీసుల్ని ఒక్క పొల్లు పోకుండా ఉన్నది ఉన్నట్లు మాకు వినిపించారు. స్వయంగా మేము అనేక చోట్ల మా రాతల్లో దొర్లిన తప్పులను ఆయన నోట విని సవరించుకోవలసి వచ్చింది”.

ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) గారి జ్ఞాపకశక్తి గాధలు దశ దిశలా వ్యాపించిపోయాయి. ఆయనఏ ప్రాంతానికి బయలుదేరినా, ఆయనకు ముందే ఆ ప్రాంతానికి ఆయన పేరు ప్రఖ్యాతులు చేరుకునేవి. ప్రజలు వివిధ రకాలుగా ఆయన జ్ఞాపకశక్తిని పరీక్షించేవారు. చివరికి వారు ఆయన అసాధారణ జ్ఞాపకశక్తికి ఆశ్చర్యచకితులయి ఎంతో అభినందించేవారు. ఆ కాలంలోనే షేఖ్ అబూ జరఆ (రహిమహుల్లాహ్), అబూ హాతిం (రహిమహుల్లాహ్), ముహమ్మద్ బిన్ నస్ర్ (రహిమహుల్లాహ్), ఇబ్ను ఖుజైమా (రహిమహుల్లాహ్), ఇమామ్ తిర్మిజి (రహిమహుల్లాహ్), ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్)లు ఆయనకు శిష్యులయిపోయారు.

ఇమాం బుఖారీ (రహిమహుల్లాహ్) ని ప్రశంసిస్తూ కొందరు ప్రముఖులు వెలిబుచ్చిన అభిప్రాయాలు వినండి:

“బుఖారీ (రహిమహుల్లాహ్) హదీసు విద్యలో నాకంటే ఎక్కువ వివేకం, దూరదృష్టి కల వ్యక్తి. ఆయన దైవదాసుల్లోకెల్లా ఎక్కువ వివేచనాపరుడు. నిజం చెప్పాలంటే బుఖారీని మించిన వారే లేరు.”- ఇమామ్ దార్మి (రహిమహుల్లాహ్)

“ఖురాసాన్ భూభాగంలో ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) లాంటి మహోన్నత వ్యక్తి మరొకరుజన్మించ లేదు.”-ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్)

“స్వయంగా ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) కూడా తన లాంటి వ్యక్తిని చూడలేదు.”- ఇబ్నుల్ మదీనీ (రహిమహుల్లాహ్)

“ఇమామ్ ముస్లిం బిన్ అల్ హిజాజ్ (రహిమహుల్లాహ్) ఓ సారి ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) సన్నిధికివెళ్ళి ఆయన రెండు కళ్ళ మధ్య (నుదుటిని) ముద్దాడుతుండగా నేను కళ్ళారా చూశాను. ఆ తరువాతఆయన ‘గురువులకు గురువూ! హదీసువేత్తల నాయకా! మీ పాదాలు చుంబించడానికి నాకు అనుమతి ఇవ్వండి’ అని అన్నారు.’- అహ్మద్ బిన్ హమ్డాన్ (రహిమహుల్లాహ్)

“ఆకాశం క్రింద ఈ ధరిత్రిపై ముహమ్మద్ బిన్ ఇస్మాయీల్ బుఖారీ (రహిమహుల్లాహ్)ని మించిన హదీసు పండితుడు, పారంగతుడు మరొకరు లేరు.” – ఇబ్నె ఖుజైమా (రహిమహుల్లాహ్)

ఇమామ్ జీవిత విశేషాల్లో ముఖ్యంగా చెప్పుకోదగిన ఒక విశేషం ఉంది. ఆయన తనజీవితంలో ఏనాడూ ఎవరినీ నిందించలేదు, దూషించలేదు, బాధించనూలేదు. ఆయన స్వయంగా ఈవిషయాన్ని ప్రస్తావిస్తూ “పరలోక విచారణ దినాన పరోక్ష నిందను గురించి నన్ను ప్రశ్నించడం జరగదనినేను ఆశిస్తున్నాను” అని అప్పుడప్పుడు అంటుండేవారు.

ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) ఎంతో ఆత్మాభిమానం గల వ్యక్తి. దీన్ని గురించి ఉమర్ బిన్ హఫ్స్(రహిమహుల్లాహ్) ఇలా తెలియజేస్తున్నారు: “బస్రాలోని హదీసు పాఠశాలలో నేను, ఇమామ్ బుఖారీ సహవిద్యార్థులంగా ఉండేవాళ్ళం. ఒక రోజు ఇమామ్ పాఠశాలకు రాలేదు. విచారిస్తే ఆ రోజు ఇమామ్ బుఖారీ దగ్గర ధరించి బయటికి రావడానికి సరిపడ్డ బట్టలు కూడా లేవని తెలిసింది. ఈ విషయం ఇతరుల ముందు బహిర్గతం కావడం ఆయనకు ఏ మాత్రం ఇష్టంలేదు. అందువల్ల ఆయన ఆ రోజు ఇంటి నుంచి బయటికే రాలేదు. ఆ తరువాత మేము ఆయన కోసం బట్టలు సంపాదించి తీసికెళ్ళి ఇచ్చాము. దాంతో ఆయన మరునాటి నుంచి పాఠశాలకు రావడం ప్రారంభించారు.

ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) రాజులకు, పాలకులకు ఎల్లప్పుడూ దూరంగా ఉండేవారు.అయితే ఓ రోజు బుఖారా గవర్నర్, తన దర్బారుకు వచ్చి తనకు హదీసులు వినిపించవలసిందిగా ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్)కి విజ్ఞప్తి చేశాడు. దాంతో పాటు, ఇతరులెవరూ పాల్గొనకుండా ఉండే ఓ ప్రత్యేక సమావేశంలో తన పిల్లలకు హదీసు విద్య నేర్పవలసిందిగా కూడా అతను ఇమామ్ని కోరాడు.ఇమామ్ ఈ రెండు కోర్కెలను తిరస్కరిస్తూ “విద్యను గురువు దగ్గరకెళ్ళి నేర్చుకోవలసి ఉంటుంది.నా సమావేశంలో ధనికుడు-పేద అనే తారతమ్యం లేదు. ఇక్కడికొచ్చి హదీసు విద్య నేర్చుకోవడానికిప్రతి ఒక్కరికీ హక్కుంది” అని సమాధానమిచ్చారు.

ఈ సమాధానం విని బుఖారా గవర్నర్ ఆగ్రహోదగ్రుడయ్యాడు. ఆ తరువాత వారిద్దరి మధ్య దూరం మరింత పెరిగిపోయింది. గవర్నర్ ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) మీద పగబూని బుసలు కొట్టడం ప్రారంభించాడు. దాంతో ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) బుఖారా పట్నం వదలి ఖర్తుంగ్ అనే ప్రాంతానికివెళ్ళి తలదాచుకోవలసి వచ్చింది. అక్కడకు వెళ్ళిన తరువాత ఆయన వ్యాధిగ్రస్తులయ్యారు. చివరికి హిజ్రి శకం 256లో ఈదుల్ ఫిత్ర్ నాడు 62 సంవత్సరాల వయస్సులో ఆయన తనువు చాలించారు. -రహ్మతుల్లా అలై-

ఇది ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) జీవితాంతం శ్రమించి, అనేక ప్రాంతాలు పర్యటించి సంకలనం చేసిన హదీసు గ్రంథం. ఆయన వివిధ ప్రాంతాల నుండి మొత్తం ఆరు లక్షల హదీసులు సేకరించి, వాటిలో ఈ గ్రంథం కోసం అత్యంత ప్రామాణికమైన 7,397 హదీసుల్ని ఎంపిక చేసి సంకలనం చేశారు. ఈ 7,397 హదీసుల్లో నుండి పునరావృత్త హదీసుల్ని తీసివేస్తే 2,602 హదీసులు మాత్రమే మిగిలి ఉంటాయి. ఇవన్నీ పటిష్ఠమైన ఆధారాలు గల నిజమైన హదీసులు. వీటిని ఆయన వివిధ శీర్షికల క్రింద ప్రకరణలుగా, అధ్యాయాలుగా విభజించి ఒక క్రమ పద్ధతిలో సంకలనం చేశారు.

ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) ఈ మహాకార్యాన్ని నిరంతరాయంగా 16 సంవత్సరాల పాటు అహోరాత్రులు చెమట ధారపోసి పూర్తి చేశారు. ఆయన ప్రతి హదీసు గ్రంథస్తం చేయడానికి ముందుగా స్నానం చేసి, రెండు రకాతులు నఫిల్ నమాజ్ చేసేవారు. ఆ తరువాతనే ఆ హదీసు రాయడానికి ఉపక్రమించేవారు. ఈ విధంగా ఆయన మొత్తం హదీసుల్ని పూర్తి పరిశుద్ధావస్థలో, ఎంతో భక్తిభావంతో గ్రంధస్తం చేశారు.

ప్రసిద్ధి చెందిన వందలాది మంది హదీసువేత్తలు ఈ గ్రంథం ప్రామాణికతను పరీక్షించడానికివివిధ రకాలుగా ప్రయత్నించారు. కాని ఏ ఒక్కరూ ఇందులోని ఏ ఒక్క హదీసు ప్రామాణికతతో కూడా విభేదించలేకపోయారు. కనీసం దానిపట్ల సందేహం కూడా వెలిబుచ్చలేకపోయారు. చివరికి వారంతా దివ్యఖుర్ఆన్ తరువాత పటిష్ఠమైన ప్రామాణికతతో కూడిన నిజగ్రంథం ఏదయినా ఉందంటే అది సహీహ్ బుఖారీ మాత్రమేనని తీర్మానించారు. ఈ విధంగా ఇస్లామీయ గ్రంథాలలో సహీహ్ బుఖారీ ద్వితీయ స్థానం పొందగలిగింది.

ఈ గ్రంథ ప్రాశస్త్యం, ప్రత్యేకతలను గురించి చెప్పాలంటే ఎన్నో విషయాలున్నాయి. ఇక్కడరెండు విషయాలను మాత్రం ప్రస్తావిస్తున్నాం. ఇందులోని హదీసుల్ని స్వయంగా ఇమామ్ బుఖారీ(రహిమహుల్లాహ్) నోట తొంభై వేల మంది హదీసువేత్తలు విన్నారు. ఈ గ్రంథానికి 53 వివరణ గ్రంథాలువెలువడ్డాయి. వాటిలో కొన్ని వివరణ గ్రంథాలు పద్నాలుగేసి సంపుటాలలో వెలువడ్డాయి. దీన్ని బట్టిసహీహ్ బుఖారీ ఎంత జనాదరణ పొందిన గ్రంథమో ఊహించవచ్చు.

సహీహ్ ముస్లిం గ్రంధాన్ని సంకలనం చేసిన ఇమామ్ అబుల్ హుసైన్ ముస్లిం బిన్ హిజాజ్(రహిమహుల్లాహ్) హిజ్ర శకం 204లో నీషాపూర్లో జన్మించారు. బాల్యం నుండే హదీసు విద్యార్జనలో నిమగ్నులయిపోయారు. హదీసుల అన్వేషణ కోసం ఆయన ఇరాఖ్, హిజాజ్, ఈజిప్టు దేశాలు పర్యటించి, అక్కడి పండితుల దగ్గర హదీసులు నేర్చుకున్నారు. అలాంటి పండితులలో ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) గారి గురువులు కూడా ఉన్నారు. చివరికి ఆయన నీషాపూర్లో ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్)ని కలుసుకొని, ఆయన దగ్గర కూడా శిష్యరికం చేశారు.

ఆ కాలంలో గొప్ప గొప్ప హదీసువేత్తలు సయితం తరచుగా ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) దగ్గరకొచ్చి హదీసులు వినిపోతుండేవారు. వారిలో అబూ హాతిం రాజి (రహిమహుల్లాహ్), మూసాబిన్ హారూన్(రహిమహుల్లాహ్), అహ్మద్ బిన్ సల్మ (రహిమహుల్లాహ్), ఇమామ్ తిర్మిజీ (రహిమహుల్లాహ్) ప్రభృతులు కూడా ఉన్నారు.ఆయన బాల్యం నుండి అంతిమ శ్వాస వరకు ఎంతో దైవభీతి, ధర్మపరాయణతలతో కూడిన పవిత్ర జీవితం గడిపారు. ఆయన ఏనాడూ ఒకరిని నిందించడం గాని, బాధించడం గాని చేయలేదు.

ఇమామ్ ముస్లిం మరణ సంఘటన చాలా విచిత్రంగా జరిగింది. ఒక సారి ఓ పండిత గోష్ఠిలో ఒక వ్యక్తి ఏదో హదీసుని గురించి సమాచారం అడిగాడు. అయితే ఆ సమయంలో ఇమామ్ గారికి ఆ హదీసు గురించిన సరయిన వివరాలు తెలియకపోవడం వల్ల సమాధానం ఇవ్వలేకపోయారు.తరువాత ఆయన ఇంటికి వెళ్ళి ఆ హదీసుని అన్వేషించడం ప్రారంభించారు. గ్రంథ పుటలను తిరగేస్తూ ప్రక్కనే ఉన్న ఖర్జూరపండ్ల బుట్టలో నుంచి ఒక్కొక్క ఖర్జూరాన్ని తీసి తింటూ పోయారు.హదీసు అన్వేషణలో తానెన్ని ఖర్జూర పండ్లు తిన్నానన్న సంగతిని కూడా గమనించలేదు. చివరికి అన్వేషిస్తున్న హదీసు లభించిన తరువాత బుట్ట వైపు చూస్తే అది దాదాపు ఖాళీ అయిపోయింది.అప్పుడర్ధమైంది ఆయనకు తాను బుట్టలోని పండ్లన్నీ తిన్నానని. కాని ఇక చేసేదేమీ లేదు; జరగవలసింది జరిగిపోయింది. ఎక్కువ పండ్లు తినడం వల్ల ఆయన వ్యాధిగ్రస్తులయ్యారు. ఆ వ్యాధితోనే ఆయన హిజ్రీ శకం 261, రజబ్ నెల 24వ తేదీ ఆదివారం నాడు సాయంత్రం శాశ్వతంగా ఇహలోకం వీడిపోయారు. చనిపోయే నాటికి ఆయన వయస్సు 55 సంవత్సరాలు మాత్రమే. స్వగ్రామమైన నీషాపూర్లోనే ఆయన్ని ఖననం చేశారు.

అబూహాతిం (రహిమహుల్లాహ్) ఇలా తెలియజేస్తున్నారు: “ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) చనిపోయిన తరువాత ఓ రాత్రి నేను ఆయన్ని కలలో చూశాను. ఆయన దగ్గరికెళ్ళి మీ పరిస్థితి ఎలా ఉందని అడిగాను. దానికి ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) అల్లాహ్ తనకు మంచి స్థితి కల్పించాడని, స్వర్గంలో తాను కోరుకున్న ప్రదేశానికి వెళ్ళే, కోరుకున్న చోట ఉండే అనుమతినిచ్చాడ’ని అన్నారు.”

ఈ గ్రంథం కూడా హదీసుల ప్రామాణికత రీత్యా, వాటి ఆరోగ్యస్థితి రీత్యా సహీహ్ బుఖారీకిఏ మాత్రం తీసిపోదు. సహీహ్ ముస్లిం కూడా సహీహ్ బుఖారీతో సమానమైన విలువ గల గ్రంథమన్న విషయంతో ధర్మవేత్తలంతా ఏకీభవించారు.

ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) ఈ గ్రంథాన్ని ఎంతో నేర్పుతో, వివేకంతో సంకలనం చేశారు.అందువల్ల దీన్ని చాలా సులభంగా అధ్యయనం చేయడానికి, అర్థం చేసుకోవడానికి అవకాశం కలిగింది. ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) ఈ గ్రంథంలో ఇంచుమించు ఒకే భావం గల హదీసులన్నీ ఒకచోట చేర్చారు. దాంతో పాటు హదీసుల ప్రమాణ పద్ధతుల్ని, వాటి పదజాలాల్లోని వ్యత్యాసాలను కూడా సంక్షిప్త వాక్యాలలో కడు జాగ్రత్తగా తెలియజేశారు.

ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) యావత్తు ముస్లిం జగత్తులో జరిపిన తన సుదీర్ఘ పర్యటన సందర్భంగా నాలుగు లక్షల హదీసుల్ని సేకరించారు. మొదట వాటిలో ఒక లక్ష పునరావృత హదీసుల్ని ఏరివేసి మూడు లక్షల హదీసుల్ని సంకలనం చేశారు. ఆ తరువాత ఓ సుదీర్ఘ కాలం పాటు వాటిని నిశితంగా పరిశీలించి చివరికి అన్ని విధాల నమ్మకమైనవని, ప్రామాణికమైనవని, భావించినహదీసుల్ని మాత్రమే ఆయన ఈ గ్రంథానికి ఎంచుకున్నారు. ఇలా మూడు లక్షల హదీసుల్లో 7,275హదీసులు మాత్రమే గ్రంథస్తం చేయబడ్డాయి. అయితే వాటిలోనూ పునరావృత హదీసుల్ని తొలగిస్తే నాలుగు వేల హదీసులు మాత్రమే మిగులుతాయి.

ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) స్వయంగా తన గ్రంథం గురించి ఇలా అన్నారు: “నేనీ గ్రంథంలోఏ హదీసుని గ్రంథస్తం చేసినా క్షుణ్ణంగా ఆలోచించిన మీదట తగిన ఆధారాలతోనే దాన్ని గ్రంథస్థం చేశాను. అలాగే ఈ గ్రంథంలో నుంచి ఏ హదీసుని తొలగించినా క్షుణ్ణంగా ఆలోచించిన తరువాత తగిన ఆధారాలతోనే దాన్ని తొలగించాను. అందువల్ల ప్రపంచంలోని జనమంతా రెండొందల యేండ్లపాటు హదీసుల్ని పరిశీలించి రాసినా, చివరికి వారి నమ్మకం ఈ గ్రంథం మీదే ఉంటుంది.”

సహీహ్ ముస్లిం, సహీహ్ బుఖారీ గ్రంథాలలో ప్రామాణికత తదితర విషయాల రీత్యా ఏదిగొప్ప అనే విషయంలో ధర్మవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. సహీహ్ బుఖారీ అన్నిటికంటేఉన్నతమైనదని కొందరు అభిప్రాయపడితే, సహీహ్ ముస్లిం అన్నటికంటే ఉన్నతమైన గ్రంథమని,మరి కొందరు అభిప్రాయపడ్డారు. ఈ రెండు అభిప్రాయాలకు భిన్నంగా ఇంకొందరు, కొన్ని విషయాలరీత్యా సహీహ్ బుఖారీ ఉన్నతమైనది, మరికొన్ని విషయాల రీత్యా సహీహ్ ముస్లిం ఉన్నతమైనదనిఅభిప్రాయపడ్డారు.

ఏమయినప్పటికీ ఈ గ్రంథకర్తలిద్దరూ గొప్ప ధర్మపరాయణులు, దైవభీతిపరులు, నిజాయితీపరులన్న విషయంలో మాత్రం ఎవరి మధ్యా ఎలాంటి భేదాభిప్రాయం లేదు. అలాంటి మహనీయులు సంకలనం చేసిన బుఖారీ, ముస్లిం గ్రంథాలలోని ఏకీభవిత (ముత్తఫఖుల్అలై) హదీసుల సంగతి ఇక చెప్పేదేముంది? పటిష్ఠమైన ప్రామాణిక గ్రంథాలలోని ఈ ‘ఏకీభవిత’ హదీసులు మరెంత ప్రామాణికమైనవో ప్రత్యేకంగా వివరించనవసరం లేదు.

సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలను రెండు సముద్రాలుగా, వాటిలో ఉన్న హదీసుల్నిముత్యాలు, పగడాలుగా ప్రస్తుత సంకలన కర్త ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ అభివర్ణించిన సంగతిప్రారంభంలో నేను ప్రస్తావించాను. అంటే ఒక సముద్రంలో ముత్యాలు ఉంటే, మరో సముద్రంలోపగడాలు ఉన్నాయన్నమాట. ఈ రెండు సముద్రాలలోని ముత్యాలు, పగడాలను ఏరి కూర్చిన హారం ఇంకెంత విలువైనదో ఊహించండి. ఆ అమూల్యమైన హారమే మీ ముందున్న ఈ గ్రంథం!

ఇందులో మొత్తం 1906 హదీసులున్నాయి. సహీహ్ బుఖారీలో పునరావృత హదీసులుతీసివేయగా 2602 హదీసులు ఉన్నాయి. అంటే ఈ గ్రంథంలో సహీహ్ బుఖారీలోని 696 హదీసులుతగ్గిపోయాయి. మరో మాటలో చెప్పాలంటే ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) గారి గ్రంథంలో లేని 696 హదీసులు ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) గారి గ్రంథంలో చోటు చేసుకున్నాయన్నమాట. వేరొక రకంగాచెప్పాలంటే ఈ 696 హదీసుల విషయంలో ఇరువురు ఇమాముల మధ్య పూర్తిగా ఏకీభావం లేదన్నమాట.

దీన్ని బట్టి మన ముందున్న ఈ గ్రంథంలో ఆ ఇరువురు ఇమాములు పూర్తిగా ఏకీభవించినహదీసులే ఉన్నాయని అర్థమవుతుంది. ఇలాంటి హదీసులున్న గ్రంథం వెలకట్టలేని వినూత్న ఉద్గ్రంధం అనడంలో ఇక సందేహమేముంది? కనుక దీన్ని పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తూ ఈ గ్రంథం అనువాదంలో నాకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

-సయ్యిద్ షబ్బీర్ అహ్మద్(ఉర్దూ అనువాదకుడు, లాహోర్)

రెండు ఉత్తమ వచనాలు (సుబహానల్లహి వబిహందిహీ, సుబహనల్లహిల్ అజీం)

subahanallahరెండు ఉత్తమ వచనాలు (సుబహానల్లహి వబిహందిహీ, సుబహనల్లహిల్ అజీం)
పుస్తకం నుండి:  కలామే హిక్మత్ – 1(వివేక వచనం)
రచన: సఫీ అహ్మద్ మదనీ
అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
ప్రకాశకులు: జమీ అతే అహ్ లె హదీస్, ఆంధ్రప్రదేశ్

[ఇక్కడ చదవండి / డౌన్ లోడ్ చేసుకోండి]

అల్లాహ్ అర్ష్ నీడలో.. (In the Shade of Allah’s Throne)

shade-of-allah

దైవ సింహాసనపు నీడలో..
పుస్తకం నుండి:  కలామే హిక్మత్ – 1(వివేక వచనం)
రచన: సఫీ అహ్మద్ మదనీ,
అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
ప్రకాశకులు: జమీ అతే అహ్ లె హదీస్, ఆంధ్రప్రదేశ్

[ఇక్కడ చదవండి / డౌన్ లోడ్ చేసుకోండి]

English version of this hadeeth:

The Prophet said: “There are seven whom Allah will shade in His Shade on the Day when there is no shade except His Shade: a just ruler; a youth who grew up in the worship of Allah, the Mighty and Majestic; a man whose heart is attached to the mosques; two men who love each other for Allah’s sake, meeting for that and parting upon that; a man who is called by a woman of beauty and position [for illegal intercourse], but be says: ‘I fear Allah’, a man who gives in charity and hides it, such that his left hand does not know what his right hand gives in charity; and a man who remembered Allah in private and so his eyes shed tears.”

Narrated by Abu Hurairah & collected in Saheeh al-Bukhari (english trans.) vol.1, p.356, no.629 & Saheeh Muslim (english trans.) vol.2, p.493, no.2248

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ ) – 2 వ భాగము – ఇమామ్ నవవి

riyadus-saliheen-telugu-islam-2Hadeesu Kiranaalu (Riyadus Saliheen) –
Download [Part 01Part 02]

Compiled by: Imam Abu Zakaria Yahya Bin Sharaf Navavi
Published by: AL-Huq Telugu Publications, Akbarbagh, Hyderabad


హదీసు కిరణాలు భాగము 1 (Volume 1) ఇక్కడ చదవొచ్చు

 

 

హదీసు కిరణాలు భాగము 2 (Volume 2):
విషయ సూచిక

మహత్యాల ప్రకరణం
180. దివ్య ఖురాన్ పారాయణ మహత్యం [pdf]
181. ఖురాన్ ను కంటస్థం చేసుకున్న తర్వాత దాన్ని మరచిపోకుండా గుర్తుంచుకోవాలి [pdf]
182. ఖురాన్ ను మధురాతి మధురంగా పారాయణం చేయటం , చదివించుకొని మరీ వినటం …. [pdf]
183. కొన్ని ముఖ్యమైన సూరాల , సూక్తుల పటనం [pdf]
184. అందరూ ఒక చోట చేరి ఖురాన్ పారాయణం చేయటం …. [pdf]
185. వుజూ ఘనత [pdf]
186. అజాన్ ఘనత [pdf]
187. నమాజుల ఘనత [pdf]
188. ఫజ్ర్ , అసర్ నమాజుల ఘనత [pdf]
189. మస్జిద్ లకు కాలి నడకన వెళ్ళటం [pdf]
190. నమాజ్ కై నిరీక్షించటం [pdf]
191. సామూహిక నమాజ్ ఘనత [pdf]
192. ఫజ్ర్ మరియు ఇషా సామూహిక నమాజుల్లో పాల్గొనటం [pdf]
193. ఫజ్ర్ నమాజుల పరిరక్షణ విషయమై ఆజ్ఞలు , వాటిని త్యజించటం పై కటినమైన వారింపులు [pdf]
194. మొదటి పంక్తి ఘనత , ముందుగా తొలి పంక్తుల్ని భర్తీ చేయాలి , పంక్తులు తిన్నగా మధ్యలో ఖాళీ స్థలం లేకుండా ఉండాలి [pdf]
195. ఫర్జ్ నమాజులతో పాటు సున్నతే ము అకద్దా ఘనత [pdf]
196. ఉదయపు నమాజులో రెండు రకాతుల సున్నత్ విషయమై తాకీదు [pdf]
197. ఫజ్ర్ వేళ సున్నత్ నమాజును సంక్షిప్తంగాచేయాలి , ఆ నమాజులో పటించవలసిన సూరాలు … [pdf]
198. ఫజ్ర్ వేళ సున్నత్ తర్వాత కాసేపు కుడివైపు తిరిగి పడుకోవటం … తహజ్జుదు నమాజు …. [pdf]
199. జుహర్ కు సంబంధిన సున్నత్ లు [pdf]
200. అసర్ కు సంబంధిన సున్నత్ లు [pdf]
201. మగ్ రిబ్ ముందు , దాని తర్వాత చేయబడే సున్నత్ లు [pdf]
202. ఇషాకు ముందు , ఆ తర్వాత చేయబడే సున్నత్ లు [pdf]
203. జుమా నమాజ్ వేళ చేయబడే సున్నత్ లు
204. నఫిల్ నమాజులను ఇంట్లో చేయటం , ఫర్జ్ తరువాత నఫిల్ కోసం స్థలం మార్చటం …. [pdf]
205. విత్ర్ నమాజు చేయమని ప్రోత్సాహం , అది సున్నతే ము అక్కదా …. [pdf]
206. చాప్త్ నమాజు – దాని రకాతుల సంఖ్య [pdf]
207. చాప్త్ నమాజుకు సమయం [pdf]
208. తహియ్యతుల్ మస్జిద్ నమాజు …. [pdf]
209. వుజూ తర్వాత రెండు రకాతుల నమాజు [pdf]
210. జుమానాటి ఘనత , జుమా నమాజు ….. [pdf]
211. వరాలు ప్రాప్తిన్చినప్పుడు , ఆపదలు తొలగిపోయినపుడు కృతజ్ఞతా పూర్వకంగా దైవ సన్నిధిలో మోకరిల్లటం [pdf]
212. రాత్రి పూట చేసే నమాజు ఘనత [pdf]
213. రంజాన్ లో ఖియాం ( తరావీహ్ నమాజు ) [pdf]
214. లైలతుల్ ఖద్ర్ లో చేయబడే నమాజు …. [pdf]
215. మిస్వాక్ ఘనత ,మానవ సహజమైన ఆచరణలు [pdf]
216. జకాత్ విధింపు – దాని ఘనత …
217. రంజాన్ ఉపవాసాల విధింపు , వాటి ఘనత …. [pdf]
218. రంజాన్ మాసంలో ముఖ్యంగా చివరి దశకంలో దానధర్మాలు , సత్కార్యాలు అధికంగా చేయాలి [pdf]
219. సగం షాబాన్ మాసం తరువాత రంజాన్ కి ముందు ఉపవాసం పాటించ కూడదు …. [pdf]
220. నెలవంకను చూసినప్పుడు పటించ వలసిన దుఅ [pdf]
221. సహరీ భోజనంలో ఆలస్యం చేయటం ….
222. ఇఫ్తార్ లో త్వరపడటం , ఇఫ్తార్ కోసం ఆహార పదార్ధాలు , ఇఫ్తార్ తరువాతి దుఆ [pdf]
223. ఉపవాసి తన నాలుకను , ఇతర అవయవాలను అధర్మమైన పనుల నుండి కాపాడుకోవాలి [pdf]
224. ఉపవాసానికి సంబంధించిన కొన్ని ఆదేశాలు [pdf]
225. ముహర్రం , షాబాన్ మరియు గౌరవ ప్రదమైన మాసాల్లో ఉపవాసం పాటించటం [pdf]
226. జిల్ హజ్జా మాసపు తొలి దశకంలో ఉపవాసం …. [pdf]
227. అరాఫా రోజు మరియు ముహర్రం మాసపు తొమ్మిదో పదో తేదీల్లో ఉపవాసం [pdf]
228. షవ్వాల్ మాసపు ఆరు రోజుల ఉపవాసం [pdf]
229. సోమ గురువారాల్లో ఉపవాసము ఉండటం [pdf]
230. ప్రతి నెల మూడు రోజులు ఉపవాసం పాటించటం [pdf]
231. ఇఫ్తార్ చేయించే వారి ఘనత , అతిధి ఆతిధ్య కర్తను దీవించే పద్ధతి [pdf]

ఏతెకాఫ్ ప్రకరణం
232. ఏతెకాఫ్ ప్రాశస్త్యం [pdf]

హజ్ ప్రకరణం
233. హజ్ విధింపు ఘనత [pdf]

జిహాద్ ప్రకరణం
234. జిహాద్ ఘనత [pdf]
235. పరలోకపు పుణ్యం రీత్యా అమరగతులుగా భావింపబడేవారి భౌతిక గాయాలకు గుస్ల్ చేయించి నమాజు చేయటం … అవిశ్వాసులతో యుద్ధం చేస్తూ అమరులైన వారి భౌతిక గాయాలకు గుస్ల్ అవసరం లేదు …. [pdf]
236. బానిస విమోచన విశిష్టత [pdf]
237. బానిసలపట్ల సద్వ్యవహారం [pdf]
238. యజమాని హక్కుల్ని నెరవేర్చే బానిస [pdf]
239. ఉపద్రవ కాలంలో దైవారాధన చేయటం [pdf]
240. పరస్పర వ్యవహారాల్లో మృదువుగా వ్యవహరించాలి .. [pdf]

విజ్ఞాన ప్రకరణం
241. విజ్ఞానం ఘనత [pdf]

దైవ స్తోత్రం , దైవ కృతజ్ఞతల ప్రకరణం
242. స్తోత్రం , కృతజ్ఞతల వైశిష్ట్యం [pdf]
243. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం ) కోసం దరూద్ పంపించటం [pdf]

దైవధ్యాన ప్రకరణం
244. ధైవస్మరణం విశిష్టత [pdf]
245. నించొని , కూర్చొని ….ఏ స్థితిలో అయినా ధైవస్మరణ చేయవచ్చు …. [pdf]
246. నిద్ర పోయేటప్పుడు , మేల్కొన్న తరువాత దుఆ [pdf]
247. ధైవస్మరణ సమావేశాలు ఎంతో పుణ్యప్రదమైనవి…. [pdf]
248. ఉదయం, సాయంత్రం ధైవస్మరణ [pdf]
249. నిద్ర పోయేటప్పుడు చేసే ప్రార్ధనలు [pdf]

ప్రార్ధనల ప్రకరణం
250. ప్రార్ధన విశిష్టత [pdf]
251. పరోక్ష ప్రార్ధన విశిష్టత [pdf]
252. ప్రార్ధనకు సంబంధించి కొన్ని ముఖ్య విషయాలు [pdf]
253. వలీల మహిమలు , వారి గొప్పదనం [pdf]

వారింపబడిన విషయాల ప్రకరణం
254. పరోక్ష నింద నిషిద్ధం , నాలుకను అదుపులో ఉంచుకోవాలి [pdf]
255. పరోక్ష నింద వినటం కూడా నిషిద్ధం …. [pdf]
256. పరోక్ష నింద కొన్ని పరిస్థితుల్లో సమ్మతమే [pdf]
257. చాడీలు చెప్పటం నిషిద్ధం [pdf]
258. ప్రజల సంభాషణలు , వారి మాటలు అనవసరంగా అధికారులకు చేరవేయరాదు [pdf]
259. రెండు నాల్కల ధోరణి [pdf]
260. అబద్ధం చెప్పటం నిషిద్ధం [pdf]
261. అబద్ధంలో ధర్మ సమ్మతమైన రకాలు [pdf]
262. మనిషి తాము చెప్పే దానిని ఒకరి నుంచి విని వివరించే దాన్ని పరిశోధించుకొని చెప్పాలి [pdf]
263. అబద్దపు సాక్ష్యం తీవ్రంగా నిషేధించబడినది [pdf]
264. నిర్ణీత వ్యక్తిని లేక జంతువుని శపించటం నిషిద్ధం [pdf]
265. నిర్ణీత వ్యక్తి పేరు తీసుకోకుండా అవిదేయతకు పాల్పడే వారందర్నీ శపించవచ్చు [pdf]
266. అన్యాయంగా ముస్లిం ని దూషించటం నిషిద్ధం [pdf]
267. చనిపోయిన వారిని దూషించటం నిషిద్ధం [pdf]
268. ఇతరులను బాధ పెట్టరాదు [pdf]
269. పరస్పరం పగతో, సంబంధాలు త్రెంచుకొని ఉండరాదు [pdf]
270. అసూయ పడరాదు [pdf]
271. ఇతరుల తప్పు లేన్నటం, ఇతరులకు ఇష్టం లేక పోయినా వారి మాటల్ని వినడానికి ప్రయత్నించటం [pdf]
272. అనవసరంగా తోటి ముస్లింల గురించి దురనుమానాలు పెట్టుకోరాదు [pdf]
273. ముస్లింలను చులకనగా చూడరాదు [pdf]
274. ముస్లిం కి బాధ కలిగిందని సంబరాపడి పోవటం తగదు [pdf]
275. వంశం గురించి దెప్పి పొడవటం నిషిద్ధం [pdf]
276. నకిలీల తయారి , మోసం చేయటం నిషిద్ధం [pdf]
277. వాగ్దాన ద్రోహం నిషిద్ధం [pdf]
278. కానుకలు వగైరా ఇచ్చి , తరువాత దెప్పి పొడవటం [pdf]
279. గర్వ ప్రదర్శన , దౌర్జన్యం చేయరాదు [pdf]
280. ముస్లిం లు మూడు రోజులకు మించి మాట్లాడుకోకుండా ఉండటం నిషిద్ధం [pdf]
281. మూడో వ్యక్తి అనుమతి లేకుండా ఇద్దరు వ్యక్తులు రహస్య విషయాలు మాట్లాడుకోరాదు ….. [pdf]
282. బానిసను, పశువును, భార్యను,పిల్లల్ని అనవసరంగా శిక్షించరాదు [pdf]
283. ఏ జీవాన్ని అగ్నితో కాల్చి శిక్షించరాదు [pdf]
284. హక్కు దారునికి హక్కు చెల్లించకుండా వాయిదాలు వేయటం తగదు [pdf]
285. ఇచ్చిన కానుకల్ని తిరిగి తీసుకోరాదు …. [pdf]
286. అనాధుల సొమ్ము నిషిద్ధం [pdf]
287. వడ్డీ కటినంగా నిషేధించబడినది [pdf]
288. ఇతరులకు చూపించటం కోసం సత్కార్యాలు చేయటం నిషిద్ధం [pdf]
289. ప్రదర్శనా బుద్ది ( రియా ) క్రిందికి రాణి విషయాలు [pdf]
290. పర స్త్రీ వైపు , అందమైన బాలుని వైపు చూడటం నిషిద్ధం [pdf]
291. ఏకాంతంలో పరస్త్రీ వెంట ఉండటం నిషిద్ధం [pdf]
292. పురుషులు స్త్రీలను , స్త్రీలు పురుషులను అనుకరించరాదు [pdf]
293. షైతాన్ ను , అవిశ్వాసుల్ని అనుకరించరాదు [pdf]
294. శిరోజాలకు నల్ల రంగు వేసుకోరాదు [pdf]
295. ‘ఖజా’ చేయరాదు, ఖజా అంటే …. [pdf]
296. సవరాలు పెట్టుకోవటం , పచ్చబొట్లు పొడిపించు కోవటం నిషిద్ధం [pdf]
297. తెల్ల వెంట్రుకల్ని పీకేయరాదు , ప్రాజ్ఞుడైన యువకుడు గడ్డం మీద వచ్చే తొలి వెంట్రుకల్ని పీకేయరాదు [pdf]
298. కుడి చేత్తో మలమూత్ర విసర్జన చేసుకోరాదు [pdf]
299. ఒంటి చెప్పుతో నడవటం అవాంచనీయం [pdf]
300. నిప్పుని ఆర్పకుండా వదిలేయరాదు [pdf]
301. ‘తకల్లుఫ్ ‘చేయరాదు , తకల్లుఫ్ అంటే …. [pdf]
302. మృతుని మీద రోదించటం ….మొదలగునవి నిషిద్ధం [pdf]
303. సోదె చెప్పేవారి వద్దకు …. మొదలగువారి వద్దకు పోరాదు [pdf]
304. వేటినీ దుశ్శాకునంగా భావించరాదు [pdf]
305. ప్రాణుల బొమ్మలు గీయరాదు ….. [pdf]
306. వేట కోసం , పశువుల పొలాల రక్షణ కోసం తప్ప కుక్కల్ని పెంచరాదు [pdf]
307. జంతువుల మెడలకు గంటలు కట్టడం , ప్రయాణంలో కుక్కల్ని, గంటల్ని తోడున్చుకోవటం అవాంచనీయం
[pdf] 308. ‘జల్లాలా’ పశువు మీద స్వారీ చేయటం అవాంచనీయం [pdf]
309. మస్జిద్ లో ఉమ్మివేయరాదు ….. [pdf]
310. మస్జిద్ లో బిగ్గరగా అరవటం , పోయిన వస్తువుల గురించి ప్రకటనలు వగైరా చేయటం తగదు [pdf]
311. ఉల్లి, వెల్లుల్లి మొదలగునవి తిని మస్జిద్ కు వెళ్ళరాదు [pdf]
312. జుమా ఖుత్బా జరుగుతున్నప్పుడు మోకాళ్ళు పొట్టకు ఆన్చి కూర్చోవటం అవాంచనీయం [pdf]
313. ఖుర్బానీ చేసే వారు తమ ఖుర్బానీ సమర్పించే వరకు వెంట్రుకల్ని , గోళ్ళను కత్తిరించరాదు . [pdf]
314. సృష్టి రాశుల మీద ప్రమాణం చేయరాదు …. [pdf]
315. అబద్దపు ఒట్టేయటం కటినంగా వారించబదినది . [pdf]
316. ఒక విషయం గురించి ప్రమాణం చేసిన తరువాత అంతకంటే మెరుగైన విషయం ముందుకు వచ్చినప్పుడు [pdf]
317. పొరపాటు ప్రమాణం గురించి ….. [pdf]
318. లావాదేవీల్లో ప్రమాణం చేయటం అవాంచనీయం [pdf]
319. అల్లాహ్ ను స్వర్గం కాకుండా వేరితర వస్తువులు అడగటం అవాంచనీయం [pdf]
320. రాజులు మొదలగు వారిని చక్రవర్తులు అని అనరాదు , ఎందుకంటే….. [pdf]
321. [pdf] పాపాత్మున్ని , ధర్మంలో కొత్త పోకడలు పాల్పడేవాన్ని గౌరవ పదాలతో సంభోదించ రాదు [pdf]
322. జ్వరాన్ని తూలనాడటం తగదు [pdf]
323. గాలిని తిట్టరాదు , గాలి వీచేటప్పుడు దుఆ చేయటం గురించి ….. [pdf]
324. కోడిపుంజు ని తిట్టటం అవాచనీయం [pdf]
325. ఫలానా నక్షత్రం మూలంగానే మీకు వర్షం కురిసింది అని చెప్పరాదు [pdf]
326. ముస్లింని ‘ఓయీ ధైవతిరస్కారీ !’ అని పిలవటం నిషిద్ధం [pdf]
327. అశ్లీలపు మాటలు మాట్లాడరాదు, దుర్భాషలాడరాదు [pdf]
328. అసహజంగా మాట్లాడటం, అర్ధంకాని పదాలు ప్రయోగించటం , వత్తులు, పొల్లులను గురించి చాదస్తంగా వ్యవహరించటం తగదు [pdf]
329. నా మనసు మలినమైపోయిందని చెప్పరాదు [pdf]
330. ద్రాక్ష పండ్లను ‘కర్మ్’ అని అనరాదు [pdf]
331. అనవసరంగా స్త్రీ సుగుణాలను ఇతర పురుషుని ముందు వివరించరాదు [pdf]
332. “ఓ అల్లాహ్! నీకు ఇష్టముంటే నన్ను క్షమించు “ అని అనరాదు [pdf]
333. దేవుడు తలచింది, ఫలానా అతను తలచింది అని అనటం అవాంచనీయం [pdf]
334. ఇషా నమాజ్ తర్వాత మాట్లాడుకోవటం అవాంచనీయం [pdf]
335. భార్య భర్త పిలుపును నిరాకరించటం నిషిద్ధం [pdf]
336. భర్త ఇంట్లో ఉన్నప్పుడు స్త్రీ అతని అనుమతి లేకుండా ఉపవాసాలు పాటించటం [pdf]
337. రుకూలో లేక సజ్దాలో ముఖ్తదీ ఇమామ్ కంటే ముందు తలపైకేత్తటం నిషిద్ధం [pdf]
338. నమాజ్ చేసేటప్పుడు జ్బ్బలమీద చేతులు పెట్టటం అవాంచనీయం [pdf]
339. బాగా ఆకలిగా ఉండి అన్నం వడ్డించి ఉన్నప్పుడు…. నమాజ్ చేయటం అవాచనీయం [pdf]
340. నమాజ్ లో దృష్టి పైకెత్తి ఆకాశం వైపు చూడరాదు [pdf]
341. అకారణంగా నమాజులో దిక్కులు చూడరాదు [pdf]
342. సమాధుల అభిముఖంగా నమాజ్ చేయరాదు [pdf]
343. నమాజ్ చేస్తున్న వ్యక్తి ముందు నుంచి వెళ్ళరాదు [pdf]
344. ముఅజ్జిన్ ఇఖామత్ మొదలు పెట్టిన తరువాత ముఖ్తదీలు నఫిల్ నమాజులు చేయటం అవాంచనీయం [pdf]
345. జుమా నాటి పగలుని ఉపవాసం కోసం , రాత్రిని నమాజుల కోసం ప్రత్యేకించుకోరాదు [pdf]
346. విసాల్ ఉపవాసం పాటించటం నిషిద్ధం [pdf]
347. సమాధి మీద కూర్చోవటం నిషిద్ధం [pdf]
348. సమాధుల మీద గుమ్మటాలు కట్టటం నిషిద్ధం [pdf]
349. బానిస తన యజమాని దగ్గరి నుంచి పారిపోవటం చాలా తీవ్రమైన విషయం [pdf]
350. దేవుడు నిర్ణయించిన శిక్షల విషయంలో సిఫారసు చేయరాదు [pdf]
351. ప్రజలు నడిచే దారుల్లో , నీడ ఉండే చోట….. మల మూత్ర విసర్జన చేయరాదు [pdf]
352. నిలిచి ఉన్న నీటిలో మూత్ర విసర్జన చేయరాదు [pdf]
353. తండ్రి తన పిల్లలకు కానుకలు ఇవ్వటంలో ఒకరి మీద మరొకరికి ప్రాధాన్యత నివ్వటం అయిష్టకరం [pdf]
354. మృతుని గురించి మూడు రోజులకు మించి సంతాపం ప్రకటించరాదు [pdf]
355. పల్లెటూరి వాని కోసం పట్టణ వాసి బేరం చేయటం , తన సోదరుడు వివాహ సందేశం పంపిన చోట తను వివాహ సందేశం పంపటం తగదు [pdf]
356. షరీఅత్ అనుమతించని పనుల మీద ధనం ఖర్చు పెట్టరాదు [pdf]
357. ముస్లిం వైపు ఆయుధం చూపటం నిషిద్ధం, నగ్నఖడ్గం చేబూనటం తగదు [pdf]
358. అజాన్ తర్వాత మస్జిద్ నుండి బయటికి వెళ్లి పోవటం అవాంచనీయం [pdf]
359. సుగంధ ద్రవ్య కానుకను నిరాకరించటం అవాంచనీయం [pdf]
360. గర్వాహన్కారాలకు లోనవుతాడేమోనన్న భయముంటే ఎవర్నీ వారి సమక్షంలో పొగడరాదు [pdf]
361. అంటువ్యాధి ప్రబలి వున్న నగరం నుంచి పారిపోవటం, బయటివారు లోనికి ప్రవేశించటం అవాంచనీయం [pdf]
362. చేతబడి చేయటం, నేర్చుకోవటం, కటినంగా నిషేధించబడినది [pdf]
363. ఖుర్ఆన్ ను దైవ విరోధుల ప్రాంతాలకు తీసుకు వెళ్ళరాదు [pdf]
364. వెండి బంగారు పాత్రలను ఉపయోగించరాదు [pdf]
365. పురుషుల కాషాయరంగు దుస్తులు ధరించటం నిషిద్ధం [pdf]
366. రోజల్లా మౌనవ్రతం పాటించటం నిషిద్ధం [pdf]
367. తన రక్తసంబందాన్ని, తన బానిసత్వ సంబంధాన్ని వక్రీకరించుకోవటం నిషిద్ధం [pdf]
368. దేవుడు, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారించిన విషయాల జోలికి పోరాదని హెచ్చరిక [pdf]
369. నిషిద్ధ విషయాలకు పాల్పడినవాడు పాప నిష్కృతి కోసం ఏమి చేయాలి? [pdf]

పలు విషయాల ప్రకరణం
370. ప్రళయ చిహ్నాలు [pdf]

ఇస్తిగ్ఫార్ ప్రకరణం
371. మన్నింపు వేడుకోలు [pdf]
372. అల్లాహ్ విశ్వాసుల కొరకు స్వర్గం లో తయారు చేసి ఉంచిన వాటి గురించి [pdf]

[PDF]

కపటుడి చిహ్నాలు (Signs of Hypocrite)

al-munafiqun-telugu-islamహదీథ్׃ 12

علامـــــــــة المـنـــــــــافــــق కపటుడి చిహ్నాలు

حَدَّثَنَا سُلَيْمَانُ أَبو الرَّبِيعَ قال: حَدَّثَنَا إِسْمَاعِيلُ بْنُ جَعْفَرٍ قَالَ:حَدَّثَنَا نَافِعُ بْنُ مَالِكِ بْنُ أَبِي عَامِرٍ أَبو سُهَيْلٍ عَنْ أَبِيهِ عَنْ أَبِي هُرَيرَة

” عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:آيَةُ المُنَافِقِ ثَلاَثٌ إِذَا حَدَّثَ كَذَبَ، وَإِذَا وَعَدَ أَخْلَفَ، وَإِذَا اُؤْتُمِنَ خَانَ “  رواة صحيح البخاري

హద్దథనా సులైమాను అబు అర్రబీఅ ఖాల హద్దథనా ఇస్మాయీలుబ్ను జాఁఫరిన్ ఖాల హద్దథనా నాఫిఉబ్ను మాలికిబ్ను అబి ఆమిరిన్ అబు సుహైలిన్ అన్ అబీహి అన్ అబీహురైరత అనిన్నబియ్యి సల్లల్లాహు అలైహి వ సల్లమ ఖాల   ఆయతుల్ మునాఫిఖి థలాథున్, ఇదా హద్దథ కదబ, ఇదా వఆఁద అఖ్లఫ, ఇదా ఉఁతుమిన ఖాన రవాహ్ సహీ బుఖారి..

అస్సనద్ (ఉల్లేఖకుల పరంపర) సహీ బుఖారి హదీథ్ గ్రంధంకర్త   ← సులైమాను అబు అర్రబీఅ ← ఇస్మాయీలుబ్ను జాఁఫరిన్ ← నాఫిఉబ్ను మాలికిబ్ను అబి ఆమిరిన్ అబు సుహైలిన్  అబీహి (మాలికిబ్ను అబి ఆమిరిన్ అబు సుహైలిన్) ← అబీహురైరత (రదియల్లాహుఅన్హు) ప్రవక్త సల్లల్లాహుఅలైహి వసల్లం హితోపదేశం.

అల్ మతన్ (బోధించిన అసలు విషయం) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు కపటుడి చిహ్నాలు మూడు, 1) ఎప్పుడు మాట్లాడినాఅబధ్ధం పలుకుతాడు. 2) మరియు ఎప్పుడు వాగ్దానం చేసినాదానిని పూర్తి చేయడు. 3) మరియు వస్తువునైతే అతని దగ్గర నమ్మకంగా ఉంచుతారోదానిని అతడు నిజాయితిగా తిరిగి ఇవ్వడు. సహీ బుఖారి హదీథ్ గ్రంధం.

హదీథ్ వివరణ

కపటత్వానికి చేర్చే వివిధ విషయాల గురించి ఇస్లాం ధర్మం తీవ్రంగా హెచ్చరిస్తున్నది. చూడటానికి చిన్న చిన్నవిగా కనబడినా అవి కపటత్వం దగ్గరికి చేర్చుతాయి. ఇక్కడ థఅతబ బిన్ హాతిబ్ అల్ అన్సారీ యొక్క వృత్తాంతాన్ని ఒక మంచి ఉదాహరణగా వివరించటం జరిగినది. దివ్యఖుర్ఆన్ లోని సూరతు అత్తౌబా అధ్యాయంలో 77వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు –

فَأَعْقَبَهُمْ نِفَاقًا فِي قُلُوبِهِمْ إِلَى يَوْمِ يَلْقَوْنَهُ بِمَا أَخْلَفُوا اللهَ مَا وَعَدُوهُ وَبِمَا كَانُوا يَكْذِبُونَ(77)

అనువాదం – “వారు అల్లాహ్ యెడల చేసిన ఈ ప్రమాణభంగం కారణంగా, వారు చెబుతూ వచ్చిన అబద్ధాల కారణంగా, అల్లాహ్ వారి హృదయాలలో కాపట్యాన్ని నాటాడు. అది ఆయన సమక్షంలో హాజరయ్యే వరకు వారిని వెంటాడటం మానదు.”

ఉల్లేఖకుని పరిచయం: అబు హురైరా రదియల్లాహు అన్హు పూర్తి పేరు అబ్దుర్రహ్మాన్ బిన్ సఖర్ అద్దౌసీ. ఆయన 7వ హిజ్రీ సంవత్సరంలో ఖైబర్ విజయం సందర్భంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచర్యంలోనికి చేరినారు. ఎక్కువ హదీథ్ లను జ్ఞాపకం ఉంచిన వారిలో సహచరులలో (సహాబాలలో) ఒకరు.

ఈ హదీథ్ యొక్క ప్రయోజనాలు (లాభాలు):

  1. అబద్ధం చెప్పటం, ఇచ్చిన మాటను నిలబెట్టుకోక పోవటం, నిజాయితీని పాటించక పోవటం వంటి చెడు అలవాట్లతో, చెడు లక్షణాలతో ఎల్లప్పుడూ యుద్ధం చేస్తుండమని ఇస్లాం ధర్మం నిర్దేశిస్తున్నది.
  2. కపటత్వం నుండి మనం కాపాడుకోవటానికి ప్రయత్నించ వలెను. ఎందుకంటే అల్లాహ్ దగ్గర ఇది షిర్క్ అంటే ఏకదైవత్వ భాగస్వామ్యం లేదా బహుదైవారాధన కంటే ఘోరమైన పాపం.
  3. కపటత్వపు చిహ్నాల నుండి దైనినైనా సరే ఎట్టి పరిస్థితిలోను అలవర్చుకోకూడదు.
  4. ఎవరైతే కపటత్వపు లక్షణాలను అలవర్చుకున్నారో వారు, అల్లాహ్ దృష్టిలో  మరియు ఇతరుల దృష్టిలో చాలా హీనంగా దిగజారిపోతారు.
  5. మాట్లాడేటప్పుడు సత్యం పలకటం, ఇచ్చిన మాటను తప్పక పోవటం, నిజాయితీ తన దగ్గర ఉంచిన వస్తువులను వాటి యజమానికి సరిగ్గా తిరిగి ఇవ్వటం వంటి మంచి అలవాట్లు దైవవిశ్వాసుల చిహ్నాలలో కనబడతాయి.

Source : హదీథ్ – రెండవ స్థాయి  [తెలుగు]
(రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  ముహమ్మద్ కరీముల్లాహ్

ఇస్లాంలో పరిశుభ్రత (Cleanliness in Islam)

cleanliless-telugu-islamహదీథ్׃ 11

ఇస్లాంలో పరిశుభ్రత النظافة من الإسلام

حَدَّثَنَا مُحَمَّدُ بْنُ الْمُثَنَّى وَ مُحمَّدُ بْنُ بَشَّارٍ وَ إِبْرَاهِيمُ بْنُ دِينَارٍ جَمِيعاً عَنْ يَحْيَىٰ بْنِ حَمَّادٍ . قَالَ ابْنُ الْمُثَنَّى : حَدَّثَنِي يَحْيَىٰ بْنُ حَمَّادٍ . أَخْبَرَنَا شُعْبَةُ عَنْ أَبَانُ بْنِ تَغْلِبَ عَنْ فُضَيْلٍ الْفُقَيْمِيِّ عَنْ إِبْرَاهِيمَ النَّخَعِيِّ عَنْ عَلْقَمَةَ عَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُودٍ ، عَنِ النَّبِيِّ قَالَ:”  لاَ  يَدْخُلُ الْجَنَّةَ مَنْ كَانَ فِي قَلْبِهِ مِثْقَالُ ذَرَّةٍ مِنْ كِبْرٍ. قَالَ رَجُلٌ: إِنَّ الرَّجُلَ يُحِبُّ أَنْ يَكُونَ ثَوْبُهُ حَسَناً، وَنَعْلُهُ حَسَنَةً. قَالَ: إِنَّ اللَّهَ جَمِيلٌ يُحِبُّ الْجَمَالَ.اَلْكِبْرُ: بَطَرُ الْحَقِّ وَغَمْطُ النَّاسِ“رواة صحيح مسلم

హద్దథనా ముహమ్మదుబ్ను అల్ ముథన్నా వ ముహమ్మదుబ్ను బష్షారిన్ వ ఇబ్రాహీముబ్ను దీనారిన్ జమీఅన్ అన్ యహ్యాబ్ని హమ్మాదిన్, ఖాల ఇబ్ను అల్ ముథన్నా, హద్దథనీ యహ్యాబ్ను హమ్మాదిన్, అఖ్బరనా షొబతు అన్ అబానుబ్ని తగ్లిబ అన్ ఫుదైలిన్ అల్ ఫుఖైమియ్యీ అన్ ఇబ్రాహీమ అన్నఖఇయ్యి అన్ అల్ఖమత అన్ అబ్దిల్లాహిబ్ని మస్ఊదిన్, అనిన్నబియ్యి ఖాల లా యద్ఖులు అల్ జన్నత మన్ కాన ఫీ ఖల్బిహి మిథ్ఖాలు దర్రతిన్ మిన్ కిబ్రిన్ఖాల రజులున్ఇన్న అర్రజుల యుహిబ్బు అయ్యకూన థౌబుహు హసనన్, నఅలుహు హసనతన్ఖాలఇన్నల్లాహ జమీలున్ యుహిబ్బుల్ జమాల, అల్ కిబ్రు, బతరుల్ హఖ్ఖి గమ్తున్నాసి రవాహ్ సహీ ముస్లిం.

అస్సనద్ (ఉల్లేఖకుల పరంపర) సహీ ముస్లిం హదీథ్ గ్రంధకర్త ← ముహమ్మదుబ్ను అల్ ముథన్నా,  ముహమ్మదుబ్ను బష్షారిన్ , ఇబ్రాహీముబ్ను దీనారిన్  (వీరందరు) ← యహ్యాబ్ని హమ్మాదిన్  ← ఇబ్ను అల్ ముథన్నా ← యహ్యాబ్ను హమ్మాదిన్ ← షొబతు ← అబానుబ్ని తగ్లిబ ← ఫుదైలిన్ ఫుఖైమియ్యి  ← ఇబ్రాహీమ అన్నఖయియ్యి ← అలఖమత ← అబ్దిల్లాహిబ్ని మస్ఊదిన్ (రదియల్లాహుఅన్హు) ప్రవక్త సల్లల్లాహుఅలైహి వసల్లం హితోపదేశం.

అల్ మతన్ (బోధించిన అసలు విషయం) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు ఎవరి హృదయములో నైతే అణువంత అహంభావం (గర్వం) ఉంటుందో అతడు స్వర్గంలో ప్రవేశించలేడు. అప్పుడు ఒక వ్యక్తి ఇలా ప్రశ్నించాడు, (అప్పుడు అక్కడ ఉన్న) ఒక వ్యక్తి ఇలా ప్రశ్నించాడు మరి మానవుడు నిశ్చయంగా మంచి దుస్తులు ధరించాలని, మరియు మంచి పాదరక్షలు (చెప్పులు,బూట్లు) తొడగాలని ఇష్టపడతాడు కదా!” ప్రవక్త ఇలా స్పష్టం చేశారు, ఖచ్చితంగా అల్లాహ్ సౌందర్యవంతుడు మరియు సౌందర్యాన్ని ఇష్టపడతాడు. అహంభావం (గర్వం) అంటే ఏమిటంటే వాస్తవాన్ని తిరస్కరించడము మరియు ప్రజలను నీచంగా (హీనంగా) భావించడము. సహీ ముస్లిం హదీథ్ గ్రంధం.

హదీథ్ వివరణ

ఈ హదీథ్ పరిశుభ్రతను ప్రోత్సహిస్తుంది మరియు దురహంకారాన్ని, గర్వాన్ని నిరోధిస్తున్నది. హృదయంలో అణువంత అహంకారం (గర్వం) ఉన్నా సరే అతడు స్వర్గం లోనికి ప్రవేశించలేడు. ఒకవేళ అదే అహంకారం అతడిని అల్లాహ్ యొక్క ఉనికిని మరియు అల్లాహ్ యొక్క దివ్యవాణిని తిరస్కరించేటట్లు చేస్తే, అతడు తప్పక నరకాగ్నిలోనికి విసిరి వేయబడతాడు. దివ్యసందేశం గురించి అయిష్టం చూపటం, ఇంకా ఐశ్వర్యం, భౌతిక సౌందర్యం, సామాజిక మరియు ప్రాపంచిక ఔన్నత్యం మరియు పేరుప్రఖ్యాతులున్న వంశమని గర్వపడటం మొదలైనవి అతడిలో గర్వాన్ని, దురహంకారాన్ని పెంచి, ఇతరులను తక్కువగా, నీచంగా చూడటం వైపుకు మళ్ళిస్తుంది. తర్వాత తర్వాత వీటి వలన దివ్యసందేశాన్ని కూడా తిరస్కరించటం మొదలు పెడతాడు. మొదట అతడు నరకశిక్ష అనుభవిస్తాడు,  అతడు ముస్లిం అవటం వలన ఆ తర్వాత స్వర్గంలోనికి చేర్చబడతాడు. ఏదేమైనా గాని చక్కని మంచి దుస్తులు అహంకారానికి, గర్వానికి చిహ్నం కాజాలదు. ఇంకా ఇస్లాం పరిశుభ్రంగా, హుందాగా ఉండటాన్ని ప్రోత్సహిస్తుంది.

ఈ హదీథ్ ఉల్లేఖకుని పరిచయం: అబు అబ్దుర్రహ్మాన్ అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రదియల్లాహు అన్హు,  ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దైవసందేశాన్ని ప్రాంరంభంలోనే స్వీకరించిన ప్రముఖులలో ఒకరు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం నుండి ఖుర్ఆన్ లోని 70 అధ్యాయములు (సూరహ్ లు) కంఠస్థం చేసినారు. 32వ హిజ్రీ సంవత్సరంలో దాదాపు 70 సంవత్సరాల వయస్సులో మదీనా పట్టణంలో చనిపోయారు.

ఈ హదీథ్ యొక్క ప్రయోజనాలు (లాభాలు):

  1. అహంకారం మరియు ప్రజలను నిర్లక్ష్యం చెయ్యటం నిషేధించబడినది.
  2. పరిశుభ్రత అంటే ప్రతి దానికీ సంబంధించనది – ధరించే దుస్తులు, వాడే ఇతర వస్తువులతో సహా.
  3. ఇంటిని, పాఠశాలను, వీధులను పరిశుభ్రంగా ఉంచటం పై జాగ్రత్త వహించవలెను.
  4. వారానికి కనీసం ఒక్కసారైనా స్నానం చేయటం మెచ్చుకో దగిన విషయం.

ప్రశ్నలు

  1. ఈ హదీథ్ నుండి మీరు నేర్చుకున్న విషయాలు క్లుప్తంగా వ్రాయండి.
  2. ఈ హదీథ్ ఉల్లేఖకుడి గురించి వ్రాయండి.
  3. అహంకారం వలన కలిగే నష్టాల గురించి వ్రాయండి.

అనవసరపు విషయాల జోలికి పోకూడదు (Leaving off unnecessary matters)

హదీథ్׃ 10

అనవసరపు విషయాల జోలికి పోకూడదు ترك المسلم ما لا يعنيه

حَدَّثَنَا أَحمَدُ بْنُ نَصْرٍ النَّيْسَابُورِيُّ وَغَيرُ وَاحِدٍ قَالوا حَدَّثَنَا أَبو مُسْهِرٍ عَنْ إسماعِيلَ بنِ عَبْدِ اللهِ بْنِ سَمَاعَةَ ، عَنْ الأوْزَاعيِّ ، عَنْ قُرَّةَ ، عَنْ الزُّهْرِيِّ عَنْ أَبي سَلَمَةَ عَنْ أَبي هُرَيْرَةَ قال.  قَالَ رَسُولُ اللَّه ”مِنْ حُسْنِ إِسْلاَمِ المَرْءِ تَرْكُهُ مَا لاَ يَعْنِيهِ “ رواه الترمذي

హద్దథనా అహ్మదుబ్ను నశ్రిన్ అన్నైసాబూరియ్యు వ గైరు వాహిదిన్ ఖాలూ, హద్దథనా అబుముస్హిరిన్ అన్ ఇస్మాయీలబ్ని అబ్దిల్లాహిబ్ని సమాఅత,  అన్ అల్ అవ్జాయ్యి,  అన్ ఖుర్రత , అన్ అజ్జుహ్రియ్యి , అన్ అబి సలమత అన్ అబి హురైరత ఖాల, ఖాల రసూలుల్లాహి మిన్ హుస్ని ఇస్లామి అల్ మర్ఇ తర్కుహు మా లా యనీహి” రవాహ్ అత్తిర్మిది .

అస్సనద్ (ఉల్లేఖకుల పరంపర) అత్తిర్మిది హదీథ్ గ్రంధకర్త   ← అహ్మదుబ్ను నశ్రిన్ అన్నైసాబూరియ్యు  & గైరువాహిదిన్  ← అబుముస్హిరిన్  ← ఇస్మాయీలబ్ని అబ్దిల్లాహిబ్ని సమాఅత ← అల్ అవ్జాయ్యి  ← అన్ ఖుర్రత ← అన్ అజ్జుహ్రియ్యి ← అబి సలమత ← అబి హురైరత (రదియల్లాహుఅన్హు) ← ప్రవక్త సల్లల్లాహుఅలైహి వసల్లం హితోపదేశం.

అల్ మతన్ (బోధించిన అసలు విషయం) అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు ఇస్లాం లోని ఉన్నతమైన లక్షణాలలో ఒక లక్షణం ఏమిటంటే, మానవుడు అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండటం అత్తిర్మిది హదీథ్ గ్రంధం.

అబుహురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీథ్ ప్రకారం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) ఒకసారి ఇలా బోధించారు –  “మిన్ హుస్నల్ ఇస్లాం, అల్ మరఅఁ తరకహ్ మా లా యఅఁనీహి” అంటే “అనవసర విషయాల జోలికి పోకుండా ఉండటం కూడా ‘మంచి ముస్లిం’ కావటానికి ఒక నిదర్శనం”  అత్ తిర్మిథి హదీథ్ గ్రంథం

హదీథ్ వివరణ

సందేశం మరియు ఆచరణ పరంగా ఇది ఒక ముఖ్యమైన హదీథ్. తనకు సంబంధించిన విషయాల గురించి తప్ప, ఒక ముస్లిం ప్రతిదాని గురించి మాట్లాడకూడదు. ఇతరుల వ్యక్తిగత విషయాలలో తలదూర్చకూడదని, వాటి జోలికి పోకూడదని కూడా ఈ హదీథ్ బోధిస్తున్నది. కేవలం ధనం సంపాదించటానికి మరియు ఉన్నత స్థానాలకు చేరటానికి మాత్రమే మన జీవితం వెచ్చించకూడదు.  ముస్లింలు పొగడ్తలను ఆశ్రయించకూడదు, ధర్మపరం గాను మరియు ప్రాపంచిక జీవితంలోను ఇది ఎంత మాత్రమూ ప్రయోజనకరం కాదు.

ఉల్లేఖకుని పరిచయం: అబు హురైరా రదియల్లాహు అన్హు పూర్తి పేరు అబ్దుర్రహ్మాన్ బిన్ సఖర్ అద్దౌసీ. ఆయన 7వ హిజ్రీ సంవత్సరంలో ఖైబర్ విజయం సందర్భంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచర్యంలోనికి చేరినారు. ఎక్కువ హదీథ్ లను జ్ఞాపకం ఉంచిన వారిలో సహచరులలో (సహాబాలలో) ఒకరు.

ఈ హదీథ్ యొక్క ప్రయోజనాలు (లాభాలు):

  1. తమకు సంబంధించని అనవసర విషయాలను వదిలి వేయమని ఇస్లాం ప్రోత్సహిస్తున్నది.
  2. మస్లింలు తమకు సంబంధించని విషయాలను – అవి మాటలు అయినా లేక చేతలు (పనులు) అయినా సరే
  3. వదిలివేయటం ఇస్లాం లోని అత్యుత్తమ నడవడికలో ఒక ముఖ్యమైన భాగం. అడగకపోయినా, స్వయంగా కల్పించుకుని సమాధానం చెప్పేటందుకు మీరు ప్రయత్నించవద్దు.
  4. మంచి వైపుకు దారి చూపటం పై ముస్లింలు ధ్యానం ఉంచవలెను.

ప్రశ్నలు

  1. ‘తమకు సంబంధించని అనవసర విషయాలు’ అంటే ఏమిటో వివరంగా వ్రాయండి.
  2. ఈ హదీథ్ ను ఆచరించటం వలన కలిగే లాభాలను వివరించండి.
  3. ఈ హదీథ్ ద్వారా సమాజానికి కలిగే ఉపయోగం గురించి తెలుపండి.

Source : హదీథ్ – రెండవ స్థాయి  [తెలుగు]
(రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  ముహమ్మద్ కరీముల్లాహ్

ఇరుగు పొరుగు (పొరుగింటి) వారి హక్కులు (Rights of neighbours)

హదీథ్׃ 09

ఇరుగు పొరుగు (పొరుగింటి) వారి హక్కులు حق الجار على الجار

حَدَّثَنَا أَبُو بَكْرِ بْنُ أَبِي شَيْبَةَ: حَدَّثَنَا أَبُو الأَحْوَصِ عَنْ أَبِي حَصِينٍ عَنْ أَبِي صَالِحٍ عَنْ أَبِي هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُولُ اللّهِ:  ” مَنْ كَانَ يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الآخِرِ فَلاَ يُؤْذِ جَارَهُ. وَمَنْ كَانَ يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الآخِرِ فَلْيُكْرِمْ ضَيْفَهُ.  وَمَنْ كَانَ يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الآخِرِ فَلْيَقُلْ خَيْراً أَوْ لِيَسْكُتْ “ رواة صحيح مسلم

హద్దథనా అబుబక్రిబ్ను అబి షైబత, హద్దథనా అబు అల్అహ్వశి అన్ అబిహశీనిన్ అన్ అబిశాలిహిన్ అన్ అబిహురైరత ఖాల, ఖాల రసూలిల్లాహి మన్ కాన యుమిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి ఫలా యూది జారహు, వమన్ కాన యుఁమిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి ఫల్ యుక్రిమ్ దైఫహు, వమన్ కాన యుఁమిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి ఫల్ యఖుల్ ఖైరన్ అవ్ లియస్కుత్ రవాహ్ సహీ ముస్లిం.

అస్సనద్ (ఉల్లేఖకుల పరంపర) సహీ ముస్లిం హదీథ్ గ్రంధంకర్త   ← అబుబక్రిబ్ను అబిషైబత ← అబు అల్అహ్వశి ← అబిహశీనిన్ ← అబిశాలిహిన్ ← అబిహురైరత (రదియల్లాహుఅన్హు) ← ప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం హితోపదేశం.

అల్ మతన్ (బోధించిన అసలు విషయం) అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహుఅలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు. ఎవరైతే అల్లాహ్ పై మరియు ప్రళయదినం పై విశ్వాసము ఉంచుతారో వారు తమ యొక్క పొరుగు వారికి కష్టము కలిగించ కూడదు. మరియు ఎవరైతే అల్లాహ్ పై మరియు ప్రళయదినం పై విశ్వాసము ఉంచుతారో వారు తమ ఇంటికి వచ్చిన అతిధులకు మంచి ఆతిధ్యముతో గౌరవిచవలెను. ఎవరైతే అల్లాహ్ మీద మరియు ప్రళయదినం పై విశ్వాసము ఉంచుతారో వారు వీలైతే మంచి మాటలు చెప్పవలెను లేకుంటే మౌనము వహించవలెను. సహీ ముస్లిం హదీథ్ గ్రంధం.

హదీథ్ వివరణ

ఇరుగు పొరుగు వారి హక్కులను కాపాడటం కూడా దైవ విశ్వాసం లోని ఒక ముఖ్యమైన భాగమని మరియు వారికి హాని కలిగించటం కూడా ఒక ఘోరమైన మహాపాపమని  ఈ హదీథ్ ప్రకటిస్తున్నది. ఇతర పొరుగింటి వారి కంటే సత్యసంధులైన, ధర్మాత్ములైన పొరుగింటి వారి గురించి ప్రత్యేక శ్రద్ధ చూపవలెను. ఇంకా ముస్లిం పొరుగింటి వారినందరికీ మంచి చేయవలెను, దయతో మంచి సలహాలివ్వవలెను, వారు సరైన మార్గాన్ని అనుసరించేటట్లుగా ప్రార్థించ వలెను, మరియు వారికి హాని కలిగించకూడదు.

ఉల్లేఖకుని పరిచయం: అబు హురైరా రదియల్లాహు అన్హు పూర్తి పేరు అబ్దుర్రహ్మాన్ బిన్ సఖర్ అద్దౌసీ. ఆయన 7వ హిజ్రీలో ఖైబర్ విజయం సందర్భంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచర్యంలోనికి చేరినారు. ఎక్కువ హదీథ్ లను జ్ఞాపకం చేసినవారిలో సహచరులలో (సహాబాలలో) ఒకరు.

ఈ హదీథ్ యొక్క ప్రయోజనాలు (లాభాలు):

  1. పరస్పరం ప్రేమ మరియు సహాయసహకారాలు పెంపొందుకునే దిశగా ప్రజలను ఇస్లాం ప్రోత్సహిస్తుంది.
  2. ఇరుగు పొరుగు వారి మధ్య సహాయసహకారాలు వారి మధ్య బంధుత్వాన్ని పటిష్టపరుస్తాయి.
  3. పొరుగింటి పిల్లలను మాటలతో లేదా చేతలతో (పనులతో) నొప్పించకుండా ఉండటం ద్వారా వారిపై దయ చూపినట్లవుతుంది.
  4. ఇంటి కప్పు పై నుండి లేదా తలుపు రంధ్రాల నుండి పొరుగింటిలోనికి తొంగిచూడటం నిషేధించబడినది.
  5. పొరుగువారికి ఎలాంటి అపకారం, కీడు, హాని కలిగించటం నిషేధించబడినది.
  6. అతిథులను మర్యాదపూర్వకంగా సత్కరించడం ప్రతి ఒక్కరి బాధ్యత.
  7. అనవసరపు సంభాషణలు సంపూర్ణమైన దైవవిశ్వాసం (ఈమాన్) నుండి దూరం చేస్తాయి.

ప్రశ్నలు

  1. తప్పక చేయమని దైవప్రవక్త ఆదేశించిన మూడుపనులు వ్రాయండి.
  2. పొరుగువారి హక్కులు ఏవి?
  3. పొరుగువారి పిల్లలతో ఎలా మెలగాలి?
  4. దేని వలన దైవ విశ్వాసానికి (ఈమాన్) దూరమవుతారు.
  5. పొరుగువారితో ఎలా ప్రవర్తించ వలెను?

Source : హదీథ్ – రెండవ స్థాయి  [తెలుగు]
(రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  ముహమ్మద్ కరీముల్లాహ్

అపనిందలు వేయటం (Gheebah & Slander)

హదీథ్׃ 08

تحريم الغيبة అపనిందలు వేయటం

حَدَّثَنَا يَحْيَىٰ بْنُ أَيُّوبَ وَ شِيْبَةَ وَ ابْنُ حُجْرٍ قَالُوا: حَدَّثَنَا إِسْمَاعِيلُ عَنِ الْعَلاَءِ عَنْ أَبِيهِ، عَنْ أَبِي هُرَيْرَةَ

أَنَّ رَسُولَ اللَّهِ قَالَ  ” أَتَدْرُونَ مَا الْغِيبَةُ؟ قَالُوا” اللَّهُ وَرَسُولُهُ أَعْلَمُ“ قَالَ”ذِكْرُكَ أَخَاكَ بِمَا يَكْرَهُ“ قِيلَ  ”أَفَرَأَيْتَ إِنْ كَانَ فِي أَخِي مَا أَقُولُ؟   “قَالَ ” إِن كَانَ فِيهِ مَا تَقُولُ، فَقَدِاغْتَبْتَهُ. وَإِنْ لَمْ يَكُنْ فِيهِ، فَقَدْ بَهَتَّهُ “   رواة صحيح مسلم

హద్దథనా యహ్యా ఇబ్ను అయ్యూబ వ షీబత వ ఇబ్ను హుజ్రిన్ ఖాలూ, హద్దథనా ఇస్మాయీలు అనిల్ అలాయి అన్ అబిహి,  అన్ అబి హురైరత అన్న రసూలల్లాహి ఖాల, అతద్రూన మా అల్ గీబతు ?” ఖాలూ, అల్లాహు వ రసూలుహు ఆలము. ఖాల, దిక్రుక అఖాక బిమా యక్రహు. ఖీల, అఫరాయ్త ఇన్ కాన ఫీ అఖి మా అఖూలు ?” ఖాల, ఇన్ కాన ఫీహి మా తఖూలు, ఫఖదిగ్ తబ్తహు. వ ఇన్ లమ్ యకున్ ఫీహి, ఫఖద్ బహత్తహు. రవాహ్ సహీ ముస్లిం .