విశ్వాసులకు వ్యతిరేకంగా కాఫిర్లకు సహాయం చేయటము | ఇస్లాం నుంచి బహిష్కరించే విషయాలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్]

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం:అబ్దుల్ మాబూద్ జామయీ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి

إنَّ الْحَمْدَ لِلَّهِ، نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللَّهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وسَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللَّهُ فَلَا مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ، وَأَشْهَدُ أَنْ لَا إلـٰه إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ.

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

అల్లాహ్ దాసులారా! అల్లాహ్ భీతి కలిగి ఉండండి, ఎల్లప్పుడూ ఆయనకు భయపడుతూ ఉండండి, ఆయనకు విధేయత చూపండి, అవిధేయతకు పాల్పడమాకండి, ఇంకా గుర్తుంచుకోండి అల్లాహ్ ను విశ్వసించడం లో “విశ్వాసులను స్నేహితులుగా చేసుకోవడం” ఓ ఖచ్చితమైన భాగం, అంటే వాళ్ళను ప్రేమించడం, వాళ్ళను సహకరించడం. అల్లాహ్ ఈ విధంగా ఆజ్ఞాపించాడు:

وَالْمُؤْمِنُونَ وَالْمُؤْمِنَاتُ بَعْضُهُمْ أَوْلِيَاءُ بَعْضٍ ۚ يَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنكَرِ وَيُقِيمُونَ الصَّلَاةَ وَيُؤْتُونَ الزَّكَاةَ وَيُطِيعُونَ اللَّهَ وَرَسُولَهُ ۚ أُولَٰئِكَ سَيَرْحَمُهُمُ اللَّهُ ۗ إِنَّ اللَّهَ عَزِيزٌ حَكِيمٌ

విశ్వాసులైన పురుషులూ, విశ్వాసులైన స్త్రీలూ – వారంతా ఒండొకరికి మిత్రులుగా (సహాయకులుగా, చేదోడు వాదోడుగా) ఉంటారు. వారు మంచిని గురించి ఆజ్ఞాపిస్తారు. చెడుల నుంచి వారిస్తారు. నమాజులను నెలకొల్పుతారు, జకాత్‌ను చెల్లిస్తారు. అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారు. అల్లాహ్‌ అతిత్వరలో తన కారుణ్యాన్ని కురిపించేది వీరిపైనే. నిస్సందేహంగా అల్లాహ్‌ సర్వాధిక్యుడు, వివేచనాశీలి. (9:71)

విశ్వాసులారా! అల్లాహ్ ను విశ్వసించడంతో కుఫ్ర్ మరియు కాఫిర్లతో ద్వేషము, శత్రుత్వము ఖచ్చితమవుతుంది. వాళ్లతో సంబంధం తెంచటాన్ని వ్యక్తం చేయటము కచ్చితం అవుతుంది. ఎందుకంటే అసలైన విశ్వాసి అంటేనే: అల్లాహ్ ను, ఆయన ప్రవక్త ప్రియులను ప్రేమిస్తాడు మరియు అల్లాహ్ మరియు ప్రవక్త శత్రువుల పట్ల ద్వేషము, శత్రుత్వము కలిగి ఉంటాడు. మరియు అవిశ్వాసులతో ప్రాపంచిక ప్రయోజనం కొరకు స్నేహిం చేసుకోవడంతో అది ఫిస్క్ (పాపం) మరియు అల్లాహ్ మాటను తిరస్కరించినట్టే. ఇంకా అతను కబీరహ్ గునాహ్ కి పాల్పడినట్టే (మహా పాపానికి పాల్పడినట్టే). కానీ ఇలాంటి కుఫ్ర్ తో ఇస్లామీయ పరిధిలో నుంచి బహిష్కరించడం అనేది జరగదు, అల్లాహ్ స్వతహాగా కాఫిర్లతో స్నేహం చేయకండి అని ఖురాన్ లోని అనేక వాక్యాల్లో తెలియజేశారు, ఉదాహరణకు ఈ వాక్యము:

( لا يَتَّخِذِ الْمُؤْمِنُونَ الْكَافِرِينَ أَوْلِيَاءَ مِن دُونِ الْمُؤْمِنِينَ وَمَن يَفْعَلْ ذَٰلِكَ فَلَيْسَ مِنَ اللَّهِ فِي شَيْءٍ.)

విశ్వాసులు తమ తోటి విశ్వాసులను వదలి అవిశ్వాసులను స్నేహితులుగా చేసుకోరాదు. అలా చేసేవాడు ఏ విషయం లోనూ అల్లాహ్‌తో సంబంధం లేనివాడు.( 3 : 28)

ఇంకోచోట ఈ విధంగా అన్నారు:

(يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَّخِذُوا عَدُوِّي وَعَدُوَّكُمْ أَوْلِيَاءَ تُلْقُونَ إِلَيْهِم بِالْمَوَدَّةِ وَقَدْ كَفَرُوا بِمَا جَاءَكُم مِّنَ الْحَق).

విశ్వసించిన  ఓ ప్రజలారా! నా శత్రువుల్ని, మీ శత్రువుల్ని మీ స్నేహితులుగా చేసుకోకండి. మీరేమో స్నేహపూర్వకంగా వారివైపు  సందేశం పంపుతున్నారు. వారేమో  మీ  వద్దకు  వచ్చిన  సత్యాన్ని  త్రోసిపుచ్చారు.( 60 : 1)

అల్లాహ్ దాసులారా! కాఫిర్లతో స్నేహం చేయటము సంబంధం కొనసాగించడం కన్నా పెద్ద పాపము, ఇక్కడ కాఫిర్లకు స్నేహం అంటే అర్థము: విశ్వాసులకు వ్యతిరేకంగా వాళ్లకు సహాయం చేయటము, విశ్వాసులకు, అవిశ్వాసుల మధ్య యుద్ధం జరిగితే అవిశ్వాసులతోపాటు నిలబడటం, వాళ్లకు ఆయుధము ,ధనము మశోరాల ద్వారా సహాయం చేయటము, దాని వెనకాల ఉద్దేశము అవిశ్వాసుల ధర్మం ఇస్లాంపై మించిపోవాలని, అధికమవాలన్న ఆలోచన ఉంటే ఇలా చేయటము వలన ఇస్లామియా బహిష్కరణలో ఒకదానికి పాల్పడినట్టే, (అల్లాహ్ శరణు). దీనికి అల్లాహ్ చెప్పిన ఈ వాక్యము ఆధారము:

( ومن يتولهم منكم فإنه منهم إن الله لا يهدى القوم الظالمين.)

మీలో ఎవరయినాసరే వారితో చెలిమిచేస్తే అతడు కూడా వారిలో ఒకడుగానే భావించబడతాడు. నిశ్చయంగా దుర్మార్గులకు అల్లాహ్‌ సన్మార్గం చూపడు.( 5: 51)

కాఫిర్లతో స్నేహం చేయటము కుఫ్ర్ కావడానికి కారణం ఏంటంటే: దీనితో ఇస్లాం మరియు ముస్లింలతో ద్వేషము, శత్రుత్వం స్పష్టమవుతుంది ,ఇది కుఫ్ర్.

ఎందుకంటే అల్లాహ్ తనను, తమ ప్రవక్తను, తమ ధర్మాన్ని మరియు పూర్తి ముస్లింలను ప్రేమించాలన్న ఆదేశం ఇచ్చారు. ఇక ప్రేమించిన వాళ్లకు వ్యతిరేకంగా అవిశ్వాసులకు సహాయం చేయడం అంటే అది విశ్వాసుల ప్రేమకు విరుద్ధము. (మనం విశ్వాసులను ప్రేమించట్లేదు అని అర్థము , అల్లాహ్ మనందరినీ దీన్నుంచి రక్షించుగాక)

అల్లామా షిన్ఖీతి రహీమహుల్లహ్ వారు, అల్లాహ్ మాట (పైన పేర్కొనబడిన వాక్యము)కు వివరణ రాస్తూ ఇలా అన్నారు : ఏ వ్యక్తి అయితే యూదులను, నసారాను (క్రైస్తవులను) స్నేహితులుగా చేసుకుంటాడో , అతను వాళ్లతో స్నేహం చేయడం వలనే వాళ్లలోని వాడు అయిపోతాడు. ఇంకోచోట అన్నారు: వాళ్లతో స్నేహం చేయడం వలన అల్లాహ్ ఆగ్రహానికి, కోపానికి గురవుతాడు, అతనిపై శాశ్వతమైన శిక్ష నియమితం చేయడం జరుగుతుంది. ఒకవేళ విశ్వాసి అయితే వాళ్లతో స్నేహమే చెయ్యడు.

ఓ విశ్వాసులారా! ఇది ఆశ్చర్యకరమైన విషయం, ఒక విశ్వాసి ఇంకో విశ్వాసికి వ్యతిరేకంగా అవిశ్వాసులకు సహాయం చేయడము, ఇది కేవలం కపటము లేదా కపట గుణం కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారు, ఉదాహరణకు: రవాఫిజ్ (ఇస్లాం నుంచి బహిష్కరించబడ్డ ఒక తెగ) మరియు అవిశ్వాసుల దేశాల్లో వెళ్లి స్థిరపడిన వాళ్లు మాత్రమే ఇలా చేస్తారు, వాళ్ళ సైన్యంలో చేరిపోయి వాళ్ళతో కలిసి పనిచేసే వాళ్ళు, ఇలాంటి వాళ్లే ముస్లింలకు వ్యతిరేకంగా అవిశ్వాసులకు సహాయం చేస్తారు, ఎందుకంటే ఇది వాళ్ల ఉద్యోగంలో ఒక భాగం అని భావిస్తారు. (అల్లాహ్ మనల్ని రక్షించుగాక) ( అల్ ఫతావా/ ఇబ్ను తైమియహ్)

అల్లాహ్ మనందరికీ ఖురాన్ యొక్క శుభాలతో, ఆశీర్వాదాలతో దీవించును గాక, అల్లాహ్ మనందరినీ వివేకంతో, హితోపదేశంతో కూడిన వాక్యాల ప్రకారం ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించు గాక, నేను నా కొరకు మీ కొరకు అల్లాహ్ నుంచి క్షమాపణ వేడుకుంటున్నాను, మరియు మీరు కూడా ఆయన నుంచి క్షమాపణ కోరండి, సందేహంగా ఆయన క్షమించేవాడు దయగలవాడు.ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత …

అల్లాహ్ దాసులారా! ఆయన భీతి కలిగి ఉండండి. ఇంకా గుర్తుంచుకోండి కాఫిర్లతో ద్వేషము అంటే: వాళ్లపై దౌర్జన్యం చేయటం గాని, వాళ్లతో వ్యాపారం చేయకుండ ఉండటం గాని, వేతనాలు చెల్లించకుండ ఉండటం గాని వాగ్దానాలు భంగం చేయటం అనేది ఎంతమాత్రం కాదు. అఖీదా విషయంలో ఇదొక చాప్టర్ మరియు వ్యవహారాలు ఇవన్నీ మరో విషయం. వ్యవహారాలలో న్యాయము, ధర్మము చేయటము మరియు నైతికతల విషయంలో ఉత్తమ రీతిలో వాళ్లతో మెలగటము ఇది తప్పనిసరి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కాఫిర్లతో వ్యవహారాలు జరిపేవారు అయినప్పటికీ ప్రవక్త వారు ధార్మిక విషయంలో వాళ్ళ ధర్మం పట్ల ద్వేషము కలిగి ఉండేవారు, కానీ ప్రవక్త వారు ఎల్లప్పుడూ వాళ్ళతో మంచితనంగానే వ్యవహరించేవారు, ఉత్తమ రీతిలో మెలిగేవాళ్లు , యుద్ధంలో ఖైదీల మాదిరిగా వచ్చిన ఆవిశ్వాసులైనా సరే, ప్రవక్త వారు ఖైదీల విషయంలో ఈ విధంగా వ్యవహరించారు:

( ويطعمون الطعام على حبه مسكينا ويتيما وأسيرا)

అల్లాహ్‌ ప్రీతికోసం నిరుపేదలకు, అనాధులకు, ఖైదీలకు అన్నం పెడుతుంటారు. (76: 8)

మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే అల్లాహ్ మిమల్ని గొప్ప కార్యం గురుంచి ఆదేశించాడు . అల్లాహ్ ఆదేశం:

إن اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تسليما

నిశ్చయంగా   అల్లాహ్‌,  ఆయన  దూతలు  కూడా  దైవప్రవక్తపై  కారుణ్యాన్ని   పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా!  మీరు  కూడా  అతనిపై  దరూద్‌   పంపండి.  అత్యధికంగా  అతనికి  ‘సలాములు’  పంపుతూ  ఉండండి. (33: 56

اللهم صل وسلم على عبدك ورسولك محمد، وارض عن أصحابه الخلفاء، الأئمة الحنفاء، وارض عن التابعين ومن تبعهم بإحسان إلى يوم الدين.

ఓ అల్లాహ్! మాకు ప్రపంచంలో మేలును, పుణ్యాన్ని పరలోకంలో సాఫల్యాన్ని ప్రసాదించు, మరియు నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు. ఓ అల్లాహ్! మా హృదయాలను కపటం నుంచి ,మా ఆచరణను ప్రదర్శన బుద్ధి నుంచి మరియు మా చూపులను ద్రోహం నుంచి కాపాడుగాక.

ఓ అల్లాహ్! మేము నీతో స్వర్గం గురించి ప్రాధేయపడుతున్నాము, మరియు ఆ స్వర్గం లోకి ప్రవేశించేటువంటి ఆచరణని మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాము. మరియు ఆ నరకం నుండి నీ శరణు వేడుకుంటున్నాము మరియు నరకానికి దగ్గర చేసేటువంటి ప్రతి పని నుండి నీ శరణు కోరుకుంటున్నాము.

ఓ అల్లాహ్! ఇహపరలోకాల సర్వ మేలును ప్రసాదించు, ఆ మేలు మనకు తెలిసిన తెలియకపోయినా. మరియు ఇహ పరలోకాల చెడు నుంచి మమ్మల్ని రక్షించు ఆ చెడు మనకు తెలిసిన తెలియకపోయినా.

ఓ అల్లాహ్! నీ అనుగ్రహాలు మా నుండి తొలగిపోవటాన్ని, ఆరోగ్యం పోవటం నుంచి నీ శిక్షల నుంచి, నీ ఆగ్రహానికి గురికాకుండా మనల్ని రక్షించు, కాపాడు.

ఓ అల్లాహ్! మనకు ప్రపంచంలో పుణ్యాన్ని ప్రసాదించు, పరలోకంలో మేలును ప్రసాదించు, మనకు నరక శిక్ష నుండి కాపాడు.

اللهم صل على نبينا محمد وآله وصحبه وسلِّم تسليما كثيرا.

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం:అబ్దుల్ మాబూద్ జామయీ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి