మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .
16వ అధ్యాయం – వ్యాధులు, వాటి వైద్యం, మంత్రించడం الطب والمرض والرقي
1411 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: الْعَيْنُ حَقٌّ
__________
أخرجه البخاري في: 76 كتاب الطب: 36 باب العين حق
1411. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు:- “దిష్టి తగలడం వాస్తవమే”. (సహీహ్ బుఖారీ:- 76వ ప్రకరణం – తిబ్, 3వ అధ్యాయం-ఆల్ ఐను హఖ్ )
17వ అధ్యాయం – చేతబడి ( జాదు), బాణామతి السحر
1412 – حديث عَائِشَةَ، قَالَتْ: كَانَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ سُحِرَ، حَتَّى كَانَ يَرَى أَنَّهُ يَأْتِي النِّسَاءَ وَلاَ يَأْتِيهِنَّ قَالَ سُفْيَانُ (أَحَدُ رِجَالِ السَّنَدِ) وَهذَا أَشَدُّ مَا يَكُونُ مِنَ السِّحْرِ إِذَا كَانَ كَذَا فَقَالَ: يَا عَائِشَةُ أَعَلِمْتِ أَنَّ اللهَ قَدْ أَفْتَانِي فِيمَا اسْتَفْتَيْتُهُ فِيهِ أَتَانِي رَجُلاَنِ فَقَعَدَ أَحَدُهُمَا عِنْدَ رَأْسِي، وَالآخَرُ عِنْدَ رِجْلَيَّ، فَقَالَ الَّذِي عِنْدَ رَأْسِي لِلآخَرِ: مَا بَالُ الرَّجُلِ قَالَ: مَطْبُوبٌ قَالَ: وَمَنْ طَبَّهُ قَالَ: لُبَيْدُ ابْنُ أَعْصَمَ، رَجُلٌ مِنْ زُرَيْقٍ، حَلِيفٌ لِيَهُودَ، كَانَ مُنَافِقًا قَالَ: وَفِيمَ قَالَ: فِي مُشْطٍ وَمُشَاقَةٍ قَالَ: وَأَيْنَ قَالَ: فِي جُفِّ طَلْعَةٍ ذَكَرٍ تَحْتَ رَعُوفَةٍ، فِي بِئْرِ ذَرْوَانَ قَالَتْ: فَأَتَى النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ الْبِئْرَ حَتَّى اسْتَخْرَجَهُ فَقَالَ: هذِهِ الْبِئْرُ الَّتِي أُرِيتُهَا وَكَأَنَّ [ص:60] مَاءَهَا نُقَاعَةُ الْحِنَّاءِ، وَكأَنَّ نخْلَهَا رُؤُوسُ الشَّيَاطِينِ قَالَ: فَاسْتُخْرِجَ قَالَتْ: فَقُلْتُ أَفَلاَ، أَي، تَنَشَّرْتَ فَقَالَ: أَمَا وَاللهِ فَقَدْ شَفَانِي، وَأَكْرَهُ أَنْ أُثِيرَ عَلَى أَحَدٍ مِنَ النَّاسِ شَرًّا
__________
أخرجه البخاري في: 76 كتاب الطب: 49 باب هل يستخرج السحر
1412. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:-
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు చేతబడి చేయబడింది. దాని ప్రభావం వల్ల ఆయన తన భార్యలను కలుసుకోకపోయినా కలుసుకున్నానేమోనని అనుమానించేవారు – ఈ హదీసు ఉల్లేఖకుల్లో హజ్రత్ సుఫ్యాన్ (రహిమహుల్లాహ్) దీనిపై వ్యాఖ్యానిస్తూ, “ఎవరికైనా ఇలాంటి పరిస్థితి వస్తే అది చాలా తీవ్రమైన చేతబడి అని భావించాలి” అని అన్నారు –
తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నాతో (అంటే హజ్రత్ ఆయిషా రదియల్లాహు అన్హాతో) ఇలా అన్నారు. ఆయిషా! నీకు తెలుసా? నేను అల్లాహ్ ని ఈ బాధ నుండి విముక్తి కలిగించమని వేడుకుంటే ఆయన దీనికి పరిష్కార మార్గం చూపించాడు.
(కలలో) నా దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారిలో ఒకడు నా తలవైపు, మరొకడు నా కాళ్ళవైపు కూర్చున్నాడు. తలవైపు కూర్చున్నవాడు “ఇతనికి ఏమయింది?” అని అడిగాడు రెండవ వ్యక్తిని. “ఇతనికి చేతబడి చేశారు” అన్నాడు రెండవ వ్యక్తి. “ఎవరు చేశారు?” అడిగాడు మొదటి వ్యక్తి. “లుబైద్ బిన్ ఆసిమ్ చేశాడు” అన్నాడు రెండవ వ్యక్తి. (లుబైద్, బనీ జరఖ్ తెగకు చెందిన వాడు, కపట విశ్వాసి, యూదుల పక్షపాతి). “ఈ చేతబడి ఎందులో చేశాడు?” మొదటి వ్యక్తి ప్రశ్నించాడు. “దువ్వెన, దువ్వెనతో రాలిన వెండ్రుకలలో” సమాధానమిచ్చాడు రెండవ వ్యక్తి. “ఎక్కడ చేశాడు?” అడిగాడు మొదటి వ్యక్తి, “పోతు ఖర్జూరపు గుత్తి పొరలో పెట్టి జర్వాన్ బావిలో ఒక రాతి క్రింద అదిమి పెట్టాడు” అన్నాడు రెండవ వ్యక్తి.
ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చేతబడిని (వస్తువుల్ని) తీసి వేయించడానికి (అనుచరుల్ని వెంట బెట్టుకొని) ఆ బావి దగ్గరకు వెళ్ళారు. “నాకు (కలలో) చూపించబడిన బావి ఇదే” అన్నారు ఆయన. ఆ బావిలోని నీరు గోరింటాకు రంగులా (ఎర్రగా) మారిపోయింది. అక్కడి ఖర్జూర చెట్లు కూడా పిశాచ తలలు మాదిరిగా తయారయిపోయాయి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆజ్ఞతో ఆ బావిలోని చేతబడి (వస్తువుల)ని తీసివేయడం జరిగింది. ఆ తరువాత నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో మాట్లాడుతూ “మీరు చేతబడికి విరుగుడు ఎందుకు చేయలేదు?” అని అడిగాను. దానికి ఆయన సమాధానమిస్తూ, “దైవసాక్షి! అల్లాహ్ నాకు స్వస్థత చేకూర్చినప్పుడు, నేను అనవసరంగా ఇతరుల మీద లంఘించి జనంలో అలజడి సృష్టించడం బాగుండదు. అలా చేయడం నాకిష్టం లేదు” అని అన్నారు.
(సహీహ్ బుఖారీ:- 76వ ప్రకరణం – తిబ్, 49వ అధ్యాయం – హల్ యుస్తఖ్రజ్ అస్-సిహ్ర్)
18వ అధ్యాయం – విష ప్రయోగం السم
1413 – حديث أَنَسِ بْنِ مَالِكٍ رضي الله عنه، أَنَّ يَهُودِيَّة أَتَتِ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، بِشَاةٍ مَسْمُومَةٍ فَأَكَلَ مِنْهَا، فَجِيءَ بِهَا، فَقِيلَ: أَلاَ تَقْتُلُهَا قَالَ: لاَ قَالَ: فَمَا زِلْتُ أَعْرِفُهَا فِي لَهَوَاتِ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ
__________
أخرجه البخاري في: 51 كتاب الهبة: 28 باب قبول الهدية من المشركين
1413. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం:- ఒక యూద స్త్రీ విషం కలిపిన మేక మాంసం తీసుకొని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరికి వచ్చింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (విషం సంగతి తెలియక) ఆ మాంసాన్ని కొద్దిగా తిన్నారు. తరువాత ఆ స్త్రీని (బంధించి) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరకు తీసుకు వచ్చారు. అప్పుడు ఒక వ్యక్తి “ఈమెను మీరు చంపి వేయించరా?” అని అడిగాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “చంపి వేయించను” అన్నారు. ఆ విషం ప్రభావం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అంతర్గళంలో ఎల్లప్పుడూ ఉండటం నేను గమనించాను.
(సహీహ్ బుఖారీ:- 51వ ప్రకరణం – హిబా, 28వ అధ్యాయం – ఖుబూలిల్ హదియ్యతి మినల్ ముష్రికీన్)
19వ అధ్యాయం – రోగి స్వస్థత కోసం మంత్రించడం استحباب رقية المريض
1414 – حديث عَائِشَةَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، كَانَ إِذَا أَتَى مَرِيضًا، أَوْ أُتِيَ بِهِ قَالَ: أَذْهِبِ الْبَاسَ، رَبَّ النَّاسِ، اشْفِ وَأَنْتَ الشَّافِي، لاَ شِفَاءَ إِلاَّ شِفَاؤُكَ، شِفَاءً لاَ يُغَادِرُ سَقَمًا
__________
أخرجه البخاري في: 75 كتاب المرضى: 20 باب دعاء العائد للمريض
1414. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏ రోగి దగ్గరకైనా వెళ్తే లేదా రోగే తన దగ్గరకు రావడం జరిగితే (ఆ రోగి స్వస్థత కోసం) ఆయన అల్లాహ్ ను ఇలా ప్రార్థిస్తారు:
“మానవుల ప్రభూ! (ఇతని) బాధను దూరం చెయ్యి. (ఇతనికి) స్వస్థత చేకూర్చు. స్వస్థత చేకూర్చే వాడవు నీవే. నీవు తప్ప మరెవ్వరూ స్వస్థత చేకూర్చే వారు లేరు. వ్యాధి ఏ మాత్రం మిగలకుండా పూర్తి స్వస్థత చేకూర్చు.” (أَذْهِبِ الْبَاسَ، رَبَّ النَّاسِ، اشْفِ وَأَنْتَ الشَّافِي، لاَ شِفَاءَ إِلاَّ شِفَاؤُكَ، شِفَاءً لاَ يُغَادِرُ سَقَمًا)
(సహీహ్ బుఖారీ:- 75వ ప్రకరణం – అల్ మర్దా , 20వ అధ్యాయం – దుఆయిల్ ఆయిది లిల్ మరీధ్)
20వ అధ్యాయం – రోగి మీద ‘ముఅవ్విజాత్’ పఠించి ఊదడం رقية المريض بالمعوّذات والنفث
1415 – حديث عَائِشَةَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ، إِذَا اشْتَكَى، يَقْرَأُ عَلَى نَفْسِهِ بِالْمَعَوِّذَاتِ، وَيَنْفُثُ فَلَمَّا اشْتَدَّ وَجَعُهُ كُنْتُ أَقْرَأُ عَلَيْهِ، وَأَمَسَحُ بِيَدِهِ، رَجَاءَ بَرَكَتِهَا
__________
أخرجه البخاري في: 66 كتاب فضائل القرآن: 14 باب المعوذات
1415. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:-
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎప్పుడైనా జబ్బుపడితే ముఅవ్విజాత్ (ఖులు వల్లాహు అహద్; ఖుల్ అవూజు బిరబ్బిల్ ఫలఖ్, ఖుల్ అవూజు బిరబ్బిన్నాస్) సూరాలు పఠించి తమపై ఊదుకునేవారు. (కొన్నాళ్ళకు) ఆయన (ప్రాణ సంకట వ్యాధికి గురయ్యారు) వ్యాధి తీవ్రరూపం దాల్చినప్పుడు, నేనే ముఆవ్విజాత్ సూరాలు పఠించి, ఆయన చేతిలో ఊది ఆ చేత్తోనే శ్రేయోశుభాల కోసం ఆయన శరీరాన్ని స్పృశింప జేస్తుండేదాన్ని.
(సహీహ్ బుఖారీ:- 66వ ప్రకరణం – ఫజాయిలె ఖుర్ఆన్, 14వ అధ్యాయం – అల్ ముఅవ్విజాత్)
21వ అధ్యాయం – దిష్టి తగిలితే, విష పురుగులు కుట్టితే మంత్రించడం అభిలషనీయం استحباب الرقية من العين والنملة والحمة والنظرة
1416 – حديث عَائِشَةَ عَنِ الأَسْوَدِ بْنِ يَزِيدَ، أَنَّهُ قَالَ: سَأَلْتُ عَائِشَةَ عَنِ الرُّقْيَةِ مِنَ الْحُمَةِ فَقَالَتْ: رَخَّصَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ الرُّقْيَةَ مِنْ كُلِّ ذِي حُمَةٍ
__________
أخرجه البخاري في: 76 كتاب الطب: 37 باب رقية الحية والعقرب
1416. హజ్రత్ అస్వద్ బిన్ యజీద్ (రహిమహుల్లాహ్) కథనం:- నేనొక సారి విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా)ను విష పురుగులు కుట్టినప్పుడు మంత్రించడం గురించి అడిగాను. దానికి ఆమె సమాధానమిస్తూ “విష పురుగుల కాటుకు మంత్రించవచ్చని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుమతి ఇచ్చారు” అని అన్నారు.
(సహీహ్ బుఖారీ:- 76వ ప్రకరణం – తిబ్, 37వ అధ్యాయం – రుఖ్యతిల్ హయ్యతి వల్ అఖ్రబ్)
1417 – حديث عَائِشَةَ، أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، كَانَ يَقُولُ لِلْمَرِيضِ: بِسْمِ اللهِ، تُرْبَةُ أَرْضِنَا، بِرِيقَةِ بَعْضِنَا، يُشْفَى سَقِيمُنَا، بِإِذْنِ رَبِّنَا
__________
أخرجه البخاري في: 76 كتاب الطب: 38 باب رقية النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ
1417. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రార్థించి రోగి పై ఊదేవారు –
“బిస్మిల్లాహి తుర్బతు అర్జినా బిరీఖతి బాజినా, యష్ఫీ సఖీమినా, బియిజ్ని రబ్బినా” (అల్లాహ్ పేరుతో, మా నేల మట్టి మాలో ఒకరి లాలాజలంతో కలసి తద్వారా మా ప్రభువు ఆజ్ఞతో మా రోగికి స్వస్థత చేకూరుతుంది.)
(సహీహ్ బుఖారీ:- 76వ ప్రకరణం • తిబ్, 38వ అధ్యాయం – రుయతిన్నబియ్యి (సల్లల్లాహు అలైహి వసల్లం))
1418 – حديث عَائِشَةَ، قَالَتْ: أَمَرَنِي رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، أَوْ أَمَرَ أَنْ يُسْتَرْقَى منَ الْعَيْنِ
__________
أخرجه البخاري في: 76 كتاب الطب: 35 باب رقية العين
1418. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ఆదేశించారు – లేక నన్నీవిధంగా ఆదేశించారు – “దిష్టి తగిలితే దానికి మంత్రించి ఊదాలి”. (సహీహ్ బుఖారీ:- 76వ ప్రకరణం, తిబ్, 35వ అధ్యాయం – రుఖ్యతిల్ ఐన్)
1419 – حديث أُمِّ سَلَمَةَ، أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، رَأَى فِي بَيْتِهَا جَارِيَةً، فِي وَجْهِهَا سَفْعَةٌ فَقَالَ: اسْتَرْقُوا لَهَا، فَإِنَّ بِهَا النَّظْرَةَ
1419. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఉమ్మె సల్మా (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నా ఇంట్లో ఒక అమ్మాయిని చూశారు. ఆమె ముఖం పై నల్లని మచ్చలు ఏర్పడి ఉన్నాయి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అది చూసి “ఈ పాపకు దిష్టి తగిలింది, మంత్రించి ఊదండి” అని అన్నారు.
(సహీహ్ బుఖారీ:- 78వ ప్రకరణం – తిబ్, 35వ అధ్యాయం – రుఖ్యతిల్ ఐన్)
23వ అధ్యాయం – ఖుర్ఆన్ సూక్తుల పఠనంతో వైద్యం చేసి ప్రతిఫలం తీసుకోవడం ధర్మసమ్మతమే جواز أخذ الأجرة على الرقية بالقرآن والأذكار
1420 – حديث أَبِي سَعِيدٍ رضي الله عنه، قَالَ: انْطَلَقَ نَفَرٌ مِنْ أَصْحَابِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فِي سَفْرَةٍ سَافَرُوهَا، حَتَّى نَزَلُوا عَلَى حَيٍّ مِنْ أَحْيَاءِ الْعَرَبِ، فَاسْتَضَافُوهُمْ، فَأَبَوْا أَنْ يُضَيِّفُوهُمْ فَلُدِغَ سَيِّدُ ذلِكَ الْحَيِّ، فَسَعَوْا لَهُ بِكُلِّ شَيْءٍ، لاَ يَنْفَعُهُ شَيْءٌ فَقَالَ بَعْضُهُمْ: لَوْ أَتَيْتُمْ هؤُلاَءِ الرَّهْطَ الَّذِين نَزَلُوا، لَعَلَّهُ أَنْ يَكُونَ عِنْدَ بَعْضِهِمْ شَيْءٌ فَأَتَوْهُمْ فَقَالُوا: يَا أَيُّهَا الرَّهْطُ إِنَّ سَيِّدَنَا لُدِغَ، وَسَعَيْنَا لَهُ بِكُلِّ شَيْءٍ، لاَ يَنْفَعُهُ فَهَلْ عِنْدَ أَحَدٍ مِنْكُمْ مِنْ شَيْءٍ فَقَالَ بَعْضُهُمْ: نَعَمْ وَاللهِ إِنِّي لأَرْقِي، وَلكِنْ وَاللهِ لَقَدِ اسْتَضَفْنَاكمْ فَلَمْ تُضَيِّفُونَا، فَمَا أَنَا بَرَاقٍ لَكمْ حَتَّى تَجْعَلُوا لَنَا جُعْلاً فَصَالَحُوهُمْ عَلَى قَطِيعِ مِنَ الْغَنَمِ فَانْطَلَقَ يَتْفِلُ عَلَيْهِ وَيَقْرَأُ (الْحَمْدُ للهِ رَبِّ الْعَالَمِينَ) فَكَأَنَّمَا نُشِطَ مِنْ عِقَالٍ فَانْطَلَقَ يَمْشِي وَمَا بِهِ قَلَبَةٌ قَالَ: فَأَوْفَوْهُمْ جُعْلَهُمُ الَّذِي صَالَحُوهُمْ عَلَيْهِ [ص:63] فَقَالَ بَعْضُهُمُ: اقْسِمُوا فَقَالَ الَّذِي رَقَى لاَ تَفْعَلُوا، حَتَّى نَأْتِيَ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَنَذْكُرَ لَهُ الَّذِي كَانَ، فَنَنْظرَ مَا يَأْمُرُنَا فَقَدِمُوا عَلَى رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَذَكَرُوا لَهُ فَقَالَ: وَمَا يُدْرِيكَ أَنَّهَا رُقْيَةٌ ثُمَّ قَالَ: قَدْ أَصَبْتُمُ، اقْسِمُوا وَاضْرِبُوا لِي مَعَكُمْ سَهْمًا فَضَحِكَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ
__________
أخرجه البخاري في: 37 كتاب الإجارة: 16 باب ما يعطَى في الرقية على أحياء العرب بفاتحة الكتاب
1420. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం:-
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుచరులు కొందరు ప్రయాణమయి, ఒక అరబ్ తెగ ఉండే ప్రాంతానికి వెళ్ళి విడిది చేశారు. వారు ఆ తెగవాళ్ళను (అరబ్ సంప్రదాయం ప్రకారం) తమకు ఆతిథ్యం ఇవ్వవలసిందిగా అడిగారు. కాని ఆ తెగ ప్రజలు వారికి ఆతిథ్యమివ్వడానికి నిరాకరించారు.
ఆ తరుపాత ఆ తెగ నాయకునికి తేలు కుట్టడమో, పాము కరవడమో జరిగింది. వారు చికిత్స కోసం ఉరుకులు పరుగులు పెట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోయింది. చివరికి వారిలో కొందరు మాట్లాడుతూ “ఇక్కడి కొచ్చి బస చేసిన వారిని అడగండి. వారిలో ఎవరి దగ్గరయినా మంత్రమో తంత్రమో ఉండవచ్చు” అని అన్నారు. వెంటనే ఆ తెగవాళ్ళు కొందరు ప్రవక్త అనుచరుల దగ్గరికి వచ్చి “మిత్రులారా! మా నాయకునికి పాము కరిచింది (లేక తేలుకుట్టింది). మేము ఎన్ని రకాల వైద్యం చేసినా ప్రయోజనం కలుగలేదు. (దాని కోసం) మీలో ఎవరి దగ్గరైనా ఏదైనా ఉందా?” అని అడిగారు.
దానికి ప్రవక్త అనుచరుల్లో ఒకడు “దైవసాక్షి! నా దగ్గర ఉంది. నేనతడ్ని మంత్రిస్తాను. కాని మేము మిమ్మల్ని ఆతిథ్యం అడిగితే మీరు మాకు ఆతిథ్యం ఇవ్వలేదు. అందువల్ల మీరేదయినా ప్రతిఫలం నిర్ణయిస్తే తప్ప నేను మీ నాయకునికి వైద్యం చేయలేను” అని అన్నాడు. చివరికి కొన్ని మేకలను ప్రతిఫలంగా ఇవ్వడానికి నిర్ణయం జరిగింది.
అప్పుడా వ్యక్తి వారి వెంట వెళ్ళి ఫాతిహా సూరా పఠించి అతని పై మంత్రించాడు. దాంతో అతను ఒక్కసారిగా బంధ విముక్తుడయి పోయినట్లు లేచి నడవసాగాడు. బాధ ఏ మాత్రం కూడా లేకుండా పోయింది. ఆ తెగవాళ్ళు నిర్ణీత ప్రతిఫలం పూర్తిగా వారికి చెల్లించారు. ప్రవక్త అనుచరుల్లో కొందరు “మనమీ ప్రతిఫలాన్ని పంచుకుందాం” అన్నారు. కాని మంత్రం పెట్టిన వ్యక్తి (ఆ మాటకు అంగీకరించకుండా) “మనం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరి కెళ్ళి, జరిగిన వృత్తాంతమంతా వివరించి దాని పై ఆయన ఏం నిర్ణయిస్తారో చూడనంత వరకు ఈ ప్రతిఫలాన్ని మనం పంచుకోకూడదు” అని అన్నాడు. చివరికి వారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి తిరిగొచ్చి ఆయనకు జరిగిన వృత్తాంతమంతా తెలియజేశారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ సంఘటన విని “ఫాతిహా సూరా మంత్రించడానిక్కూడా పనికొస్తుందని మీకెలా తెలిసింది? సరే మీరు చేసింది బాగానే ఉంది. ఆ మేకలను మీరు పంచుకోండి. దాంతో పాటు నా వాటా కూడా తీయండి” అని అన్నారు. ఈ మాట అంటూ ఆయన మనసారా నవ్వారు.
(సహీహ్ బుఖారీ:- 37వ ప్రకరణం – ఇజారా, 16వ అధ్యాయం – మాయూతా ఫిర్రుఖ్యతి అలా అహ్యాయిల్ అరబి బిఫాతిహతిల్ కితాబ్)
26వ అధ్యాయం – ప్రతి వ్యాధికి మందుంది. వైద్యం చేయడం మంచి పని لكل داء دواء واستحباب التداوي
1421 – حديث جَابِرِ بْنِ عَبْدِ اللهِ رضي الله عنهما، قَالَ: سَمِعْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، يَقُولُ: إِنْ كَانَ فِي شَيْءٍ مِنْ أَدْوِيَتِكُمْ، أَوْ يَكُونُ فِي شَيْءٍ مِنْ أَدْوِيَتِكُمْ، خَيْرٌ، فَفِي شَرْطَةِ مِحْجَمٍ، أَوْ شَرْبَةِ عَسَلٍ، أَوْ لَذْعَةٍ بِنَارٍ تُوَافِقُ الدَّاءَ، وَمَا أُحِبُّ أَنْ أَكْتَوِيَ
__________
أخرجه البخاري في: 76 كتاب الطب: 4 باب الدواء بالعسل
1421. హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా తెలియజేశారు:-
మీ మందులలో, రోగ చికిత్సా ప్రయత్నాలలో ఏదైనా ప్రయోజనం ఉందంటే అది ఈ మందుల్లో, ప్రయత్నాల్లో ఉంది, (1) శస్త్ర చికిత్స ద్వారా చెడు రక్తం తొలగించడం (cupping), (2) తేనెను సేవించడం, (3) వాతలు పెట్టడం (cauterization), కాని వాతలు పెట్టే ప్రక్రియ అంటే నాకిష్టం లేదు.*
(సహీహ్ బుఖారీ:- 76వ ప్రకరణం – లిబ్, 4వ అధ్యాయం – అద్దవాయి బిల్ అస్ల్ )
* ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) వ్యాఖ్యానం ప్రకారం ఈ హదీసులో వైద్యుల దృష్టితో ఒక విచిత్రమైన వైద్య దృక్పథాన్ని గురించి చెప్పడం జరిగింది. సాధారణంగా వ్యాధులు అజీర్తి, శరీరస్రావాల మార్పు వల్ల వస్తాయి. ఉదాహరణకు, రక్తాధిక్యత, పైత్యోద్రేకం, వాతం, కఫం, తదితర కారణాల వల్ల మనిషి వ్యాధిగ్రస్తుడవుతాడు. శ్వాసకోశ వ్యాధి వల్ల అనారోగ్యం పాలయితే శస్త్ర చికిత్స ద్వారా లేదా మరేదైనా పద్దతి ద్వారా చెడురక్తం తొలగించవలసి ఉంటుంది. ఇతర స్రావాల మార్పువల్ల జబ్బు పడితే భేది వైద్యం చేయాలి. దానికోసం నీటిలో తేనె కలిపి ఒక పద్ధతి ప్రకారం మందు తయారు చేసి వాడాలి. ఈ రెండు విధానాల వల్ల కూడా వ్యాధి నయం కాకపోతే చివరి ప్రయత్నంగా వాత పెట్టవలసి ఉంటుంది. కాని ఈ పద్ధతి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు ఇష్టం లేదు. (అనువాదకుడు)
1422 – حديث ابْنِ عَبَّاسٍ رضي الله عنهما، قَالَ: احْتَجَمَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَأَعْطَى الْحَجَّامَ أَجْرَهُ
__________
أخرجه البخاري في: 37 كتاب الإجارة: 18 باب خراج الحجام
1422. హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) శస్త్ర చికిత్స ద్వారా చెడు రక్తాన్ని తొలగించుకున్నారు. అలాంటి చికిత్స చేసిన వారికి దాని ప్రతిఫలం ముట్టజెప్పారు. (సహీహ్ బుఖారీ:- 37వ ప్రకరణం, -ఇజారా, 18వ అధ్యాయం – ఖరాజిల్ హజ్జామ్)
1423 – حديث أَنَسٍ رضي الله عنه، قَالَ: كَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، يَحْتَجِمُ، وَلَمْ يَكُنْ يَظْلِم أَحَدًا أَجْرَهُ
__________
أخرجه البخاري في: 37 كتاب الإجارة: 18 باب خراج الحجام
1423. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) శస్త్ర చికిత్స ద్వారా చెడు రక్తం తొలగించుకునే వారు (దానికి ప్రతిఫలం చెల్లించేవారు). ఆయన ఎవరి ప్రతిఫలం కూడా తమ దగ్గర ఉంచుకునేవారు కాదు. (సహీహ్ బుఖారీ:- 37వ ప్రకరణం – ఇజారా, 18వ అధ్యాయం – ఖరాజిల్ హజ్జూమ్)
1424 – حديث ابْنِ عُمَرَ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: الْحُمَّى مِنْ فَيْحِ جَهَنَّمَ فَأَبْرِدُوهَا بِالْمَاءِ
__________
أخرجه البخاري في: 59 كتاب بدء الخلق: 10 باب صفة النار وأنها مخلوقة
1424. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు: జ్వరం నరకాగ్ని ప్రజ్వలన ప్రభావం. కనుక దాన్ని నీటితో చల్లార్చండి. (సహీహ్ బుఖారీ:- 59వ ప్రకరణం – బద్ ఇల్ ఖల్ఖ్, 10వ అధ్యాయం – సిఫతిన్నారి వ అన్నహామఖ్లుఖా)
1425 – حديث أَسْمَاءَ بِنْتِ أَبِي بَكْرٍ، كَانَتْ، إِذَا أُتِيَتْ بِالْمَرْأَةِ قَدْ حُمَّتْ تَدْعُو لَهَا، أَخَذَتِ الْمَاءَ فَصَبَّتْهُ بَيْنَهَا وَبَيْنَ جَيْبِهَا قَالَتْ: وَكَانَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، يَأْمُرُنَا أَنْ نَبْرُدَهَا بِالْمَاءِ
__________
أخرجه البخاري في: 76 كتاب الطب: 27 باب الحمى من فيح جهنم
1425. హజ్రత్ ఫాతిమా బిన్త్ ముంజిర్ (రదియల్లాహు అన్హా) కథనం:- హజ్రత్ అస్మా బిన్త్ అబీ బక్ర్ (రదియల్లాహు అన్హా) దగ్గరికి వైద్యం కోసం జ్వరంతో ఉన్న స్త్రీ నెవరినైనా తీసుకురావడం జరిగితే, ఆమె నీళ్ళు తీసుకొని ఆ స్త్రీ ఎదబట్టపై చిలికించేవారు. ఆ తరువాత “జ్వరాన్ని నీళ్ళతో చల్లార్చాలని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మమ్మల్ని ఆదేశించే వారు” అని చెప్పేవారు. (సహీహ్ బుఖారీ:- 76వ ప్రకరణం – తిట్, 28వ అధ్యాయం – అల్ హుమ్మామిన్ పైహి జహన్నమ్)
1426 – حديث رَافِعِ بْنِ خَدِيجٍ، قَالَ: سَمِعْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: الْحُمَّى مِنْ فَوْحِ جَهَنَّمَ، فَابْرُدُوهَا بِالْمَاءِ
__________
أخرجه البخاري في: 76 كتاب الطب: 28 باب الحمى من فيح جهنم
1426. హజ్రత్ రాఫె బిన్ ఖదీజ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ఉపదేశించారు: జ్వరం నరకాగ్ని ప్రజ్వలన ప్రభావం. కనుక దాన్ని నీటితో చల్లబరచండి. (సహీహ్ బుఖారీ :- 76వ ప్రకరణం – తిబ్, 28వ అధ్యాయం – అల్ హుమ్మామిన్ ఫైహి జహన్నమ్)
27వ అధ్యాయం – రోగి నోట్లో మందు బలవంతంగా పోయరాదు كراهة التداوي باللدود
1427 – حديث عَائِشَةَ، قَالَتْ: لَدَدْنَاهُ فِي مَرَضِهِ، فَجَعَلَ يُشِيرُ إِلَيْنَا أَنْ لاَ تَلُدُّونِي فَقُلْنَا: كَرَاهِيَةُ الْمَرِيضِ لِلدَّوَاءِ فَلَمَّا أَفَاقَ، قَالَ: أَلَمْ أَنْهَكُمْ أَنْ تَلدُّونِي قُلْنَا: كَرَاهِيَةَ الْمَرِيضِ لِلدَّوَاءِ فَقَالَ لاَ يَبْقَى أَحَدٌ فِي الْبَيْتِ إِلاَّ لُدَّ وَأَنَا أَنْظرُ، إِلاَّ الْعَبَّاسَ، فَإِنَّهُ لَمْ يَشْهَدْكُمْ
__________
أخرجه البخاري في: 64 كتاب المغازي: 83 باب مرض النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ ووفاته
1427. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:-
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జబ్బుపడినప్పుడు మేము ఆయన నోటిలో మందు పోశాము. కాని ఆయన ఈ విధంగా మందు పోయకండని సైగ చేస్తూ మమ్మల్ని వారించారు. సాధారణంగా ప్రతి రోగికి మందు తినడం ఇష్టముండదు. అలాగే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా తమకు మందు తీసుకోవడం ఇష్టం లేకనే మమ్మల్ని వారించారని మేము భావించాము. అయితే ఆయన ఆరోగ్యం కుదుటబడిన తరువాత “ఈ విధంగా మందు త్రాగించవద్దని నేను మిమ్మల్ని వారించ లేదా?” అని అన్నారు. “ప్రతి రోగి మందు తీసుకోవడానికి ఇష్టం లేక వారించినట్లే మీరు కూడా వారించారని మేము అనుకున్నాం” అన్నాము మేము. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), అయితే ఇంట్లో ఎంతమంది ఉన్నారో అందరి నోళ్ళలో మందు పోయండి అబ్బాస్ (రదియల్లాహు అన్హు) తప్ప” అని అన్నారు. హజ్రత్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఆ సమయంలో ఇంట్లో లేరు గనక (ఆయన్ని మినహాయించారు).
(సహీహ్ బుఖారీ:- 64వ ప్రకరణం – మగాజి, 83వ అధ్యాయం – మరజిన్నబియ్యి (సల్లల్లాహు అలైహి వసల్లం) వ వఫాతిహ్)
28వ ఆధ్యాయం – ముసాంబరంతో వైద్యం التداوي بالعود الهندي وهو الكست
1428 – حديث أُمِّ قَيْسٍ بِنْتِ مِحْصَنٍ، أَنَّهَا أَتَتْ بِابْنٍ لَهَا صَغِيرٍ، لَمْ يَأْكُلِ الطَّعَامَ، إِلَى رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَأَجْلَسَهُ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فِي حِجْرِهِ، فَبَالَ عَلَى ثَوْبِهِ، فَدَعَا بِمَاءٍ فَنَضَحَهُ وَلَمْ يَغْسِلْهُ
__________
أخرجه البخاري في: 4 كتاب الوضوء: 59 باب بول الصبيان
1428. హజ్రత్ ఉమ్మె ఖైస్ బిన్త్ మిహ్సన్ (రదియల్లాహు అన్హా) కథనం:- నేనొకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి ఇంకా (ధాన్యపు) అన్నం తిననటువంటి ఒక పసిపిల్లవాడ్ని తీసుకొని వెళ్ళాను. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ పిల్లవాడ్ని తీసుకొని వడిలో కూర్చోబెట్టుకున్నారు. అంతలో ఆ పసివాడు ఆయన బట్టల పై మూత్రం పోశాడు. అప్పుడు ఆయన నీళ్ళు తెప్పించి బట్టలు జాడించి కడిగివేశారు.* (సహీహ్ బుఖారీ:- 4వ ప్రకరణం -వుజూ, 59వ అధ్యాయం – బౌలిస్సిబ్యాన్)
* ఈ హదీసు పై శీర్షికకు అనుగుణంగా లేకపోయినప్పటికీ దాని క్రింద చేర్చడానికి కారణం ఈ హదీసు, దీని తరువాత ఉన్న హదీసు (నెం. 1429) రెండు ఒకే హదీసులోని రెండు అంశాలు కావడమే. 1429వ హదీసు శీర్షికకు అనుగుణమయినది. అయితే ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) ఈ రెండింటిని వేర్వేరు ప్రకరణాలలో పేర్కొన్నారు. అంటే 1428 వహదీసుని ఉజూ ప్రకరణంలో, 1429 వ హదీసుని వైద్య ప్రకరణంలో పేర్కొన్నారు. ఈ గ్రంధం సంకలన కర్త తన గ్రంధంలో హదీసు మూలం (Text)ను బుఖారీ గ్రంథంనుంచి, విషయ సూచికను ముస్లిం గ్రంథం నుంచి తీసుకున్నారు. ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) హదీసులోని రెండు అంశాలను, వేర్వేరు ప్రకరణాల్లో పేర్కొంటే, ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) ఆ రెండు అంశాలను కలిపి ఒక హదీసుగా ఒకేచోట సలామ్ ప్రకరణంలో పేర్కొన్నారు.
1429 – حديث أُمِّ قَيْسٍ بِنْتِ مِحْصَنٍ، قَالَتْ: سَمِعْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، يَقُولُ: عَلَيْكمْ بِهذا الْعُودِ الْهِنْدِيِّ فَإِنَّ فِيهِ سَبْعَةَ أَشْفِيَةٍ، يُسْتَعَطُ بِهِ مِنَ الْعُذْرَةِ، وَيُلَدُّ بِهِ مِنْ ذَاتِ الْجَنْبِ
__________
أخرجه البخاري في: 76 كتاب الطب: 10 باب السعوط بالقسط الهندي البحري وهو الكست
1429. హజ్రత్ ఉమ్మె ఖైస్ బిన్త్ మిహ్సన్ (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- మీరు తప్పకుండా ముసాంబరం వాడండి. అందులో ఏడు రోగాలకు చికిత్స ఉంది. గొంతు వాపు వ్యాధికి దాన్ని ముక్కులోకి పీల్చాలి, న్యుమోనియా వ్యాధికి దాన్ని త్రాగించాలి. (సహీహ్ బుఖారీ:- 76వ ప్రకరణం – తిబ్, 10వ అధ్యాయం – అన్సువూతి బిల్ ఖుప్రిల్ హింది ఆల్ బటొ వహవల్ కస్తు)
29వ అధ్యాయం – నల్ల జీలకర్రను మందుగా వాడటం గురించి التداوي بالحبة السوداء
1430 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، أَنَّه سَمِعَ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، يَقُولُ: فِي الْحَبَّةِ السَّوْدَاءِ شِفَاءٌ مِنْ كُلِّ دَاءٍ، إِلاَّ السَّامَ
__________
أخرجه البخاري في: 76 كتاب الطب: 7 باب الحبة السوداء
1430. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు:- నల్ల జీలకర్రలో మరణానికి తప్ప ప్రతి వ్యాధికి చికిత్స ఉంది. (సహీహ్ బుఖారీ:- 76వ ప్రకరణం – తిబ్, 7వ అధ్యాయం – అల్ హబ్బతిస్సౌదా)
30వ అధ్యాయం – తల్బిన రోగి మనస్సుకు సుఖాన్నిస్తుంది التلبينة مجمة لفؤاد المريض
1431 – حديث عَائِشَةَ، زَوْجِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، أَنَّهَا كَانَتْ، إِذَا مَاتَ الْمَيِّتُ مِنْ أَهْلِهَا، فَاجْتَمَعَ لِذلِكَ النِّسَاءُ، ثُمَّ تَفَرَّقْنَ إِلاَّ أَهْلَهَا وَخَاصَّتَهَا، أَمَرَتْ بِبُرْمَةٍ مِنْ تَلْبِينَةٍ فَطُبِخَتْ [ص:67] ثمَّ صُنِعَ ثَرِيدٌ فَصُبَّتِ التَّلْبِينَةُ عَلَيْهَا ثُمَّ قَالَتْ: كُلْنَ مِنْهَا، فَإِنِّي سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: التَّلْبِينَةُ مَجَمَّةٌ لِفُؤَادِ الْمَرِيضِ تَذْهَبُ بِبَعْضِ الْحُزْنِ
__________
أخرجه البخاري في: 70 كتاب الأطعمة: 24 باب التلبينة
1431. హజ్రత్ ఉర్వా బిన్ జుబైర్ (రదియల్లాహు అన్హు) కథనం:- హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) బంధువుల్లో ఎవరైనా చనిపోయినప్పుడు స్త్రీలు గుమికూడుతారు. తరువాత వారంతా వెళ్ళిపోయి ముఖ్యమైన మహిళలు, కుటుంబసభ్యులు మాత్రమే ఉండిపోయినప్పుడు హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఒక కుండలో ‘తల్బీనా’ (1) తయారు చెయ్యమని చెప్పేవారు. దాని ప్రకారం తల్బీనా వంట తయారవుతుంది. ఆ తరువాత ‘సరీద్’ తయారు చేసి తల్బీనాలో కలుపుతారు. అప్పుడు హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఆ సమయంలో ఉన్న స్త్రీలను “ఇక తినండి, తల్బీనా రోగి మనస్సుకు సుఖాన్నిచ్చి అతని బాధ, విచారం దూరం చేస్తుందని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పగా నేను విన్నాను” అని చెప్పేవారు.
(సహీహ్ బుఖారీ:- 70వ ప్రకరణం, అయిమ, 24వ అధ్యాయం – అత్తల్బీనా)
(1) తల్బినా అంటే ఒక విధమైన అంబలి అని అర్ధం. ఇది గోధుమపిండి, లేకా గోధుమ పొట్టుకు మైదాపిండి చేర్చితయారు చేస్తారు. ఒకోసారి అందులో తేనె కూడా కలుపుతారు. ఇలా తయారయిన వంటకం పాలవలె ఉంటుంది గనుక దీన్ని తల్బినా అంటారు. సరీద్ అంటే షేర్వాలో రొట్టె ముక్కలు కలపగా తయారయ్యే ఖాద్య పదార్థం. ఇందులో మాంసం, పప్పు కూరగాయలు కూడా కలుపుతారు. (సంకలన కర్త)
31వ అధ్యాయం – తేనెతో వైద్యం التداوي بسقي العسل
1432 – حديث أَبِي سَعِيدِ، أَنَّ رَجُلاً أَتَى النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: أَخِي يَشْتَكِي بَطْنَهُ فَقَالَ: اسْقِهِ عَسَلاً ثُمَّ أَتى الثَّانِيَةَ، فَقَالَ: اسْقِهِ عَسَلاً ثُمَّ أَتَاهُ الثَّالِثَةَ، فَقَالَ: اسْقِهِ عَسَلاً ثُمَّ أَتَاهُ، فَقَالَ: فَعَلْتُ فَقَالَ: صَدَقَ اللهُ وَكَذَبَ بَطْنُ أَخِيكَ، اسْقِهِ عَسَلاً فَسَقَاهُ، فَبَرَأَ
__________
أخرجه البخاري في: 76 كتاب الطب: 4 باب الدواء بالعسل
1432. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం:- ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరకు వచ్చి “నా సోదరుడు కడుపునొప్పితో బాధపడుతున్నాడు” అని అన్నాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “అయితే అతనికి తేనె త్రాగించు” అని చెప్పారు. ఆ వ్యక్తి మళ్ళీ వచ్చాడు (కడుపు నొప్పి తగ్గలేదంటూ). దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తిరిగి “అతనికి తేనె త్రాగించు” అని చెప్పారు. ఆ వ్యక్తి మూడోసారి వచ్చాడు (నొప్పి తగ్గలేదంటూ). దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మళ్ళీ అతనికి తేనె త్రాగించమనే చెప్పారు. అతను నాల్గవసారి వచ్చి “నేనతనికి తేనె త్రాగించాను (కాని నొప్పి తగ్గలేదు)” అని అన్నాడు. “అల్లాహ్ నిజమే చెప్పాడు. నీ సోదరుని కడుపే అబద్ధమాడుతోంది (వెళ్ళు) అతనికి తేనె త్రాగించు” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). ఆ వ్యక్తి తేనె త్రాగించాడు మళ్ళీ. దాంతో అతని సోదరునికి స్వస్థత చేకూరింది. (2) (సహీహ్ బుఖారీ:- 76వ ప్రకరణం – తిబ్, 4వ అధ్యాయం – అద్దవాయి బిల్ అస్ల్)
(2) తేనెలో స్వస్థత ఉంది. దివ్యఖుర్ఆన్ ఇది ‘మానవులకు స్వస్థత’ అని పేర్కొన్నది. తేనే విరేచనకారి అయినప్పటికీ విరేచనం విరేచనకారి ద్వారానే అరికట్టబడుతుంది. ఈ పని తేనె బాగా చేస్తుంది. అందువల్ల తేనె తినడం వల్ల మొదట విరేచనాలు ఎక్కువయి చివరికి మలమంతా పోయి విరేచనాలు పూర్తిగా తగ్గిపోతాయి. ఈ చికిత్స వైద్య విధానానికి అనుగుణమైనది. ఈ పద్ధతి గురించి కువిమర్శ చేసేవాడు అజ్ఞాని మాత్రమేగాక నాస్తికుడు కూడా అనబడతాడు. (ఇమామ్ నవవీ-రహ్మలై)
32వ అధ్యాయం – ప్లేగు, దుశ్శకునం, జాతకం చెప్పించుకోవడం గురించి الطاعون والطيرة والكهانة وغيرها
1433 – حديث أُسَامَةَ بْنِ زَيْدٍ، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: الطَّاعُونُ رِجْسٌ، أُرْسِلَ عَلَى ظَائِفَةٍ مِنْ بَنِي إِسْرَائِيلَ، أَوْ عَلَى مَنْ كَانَ قَبْلَكُمْ، فَإِذَا سَمِعْتُمْ بِهِ بِأَرْضٍ فَلاَ تَقْدَمُوا عَلَيْهِ وَإِذَا وَقَعَ بِأَرْضٍ وَأَنْتُمْ بِهَا فَلاَ تَخْرُجُوا فِرَارًا مِنْهُ (وَفِي رِوَايَةٍ) لاَ يُخْرِجُكُمْ إِلاَّ فِرَارًا مِنْهُ
__________
أخرجه البخاري في: 60 كتاب الأنبياء: 54 باب حدثنا أبو اليمان
1433. హజ్రత్ ఉసామా బిన్ జైద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు:
“ప్లేగు వ్యాధి బనీ ఇస్రాయీల్ ప్రజల పై లేక మీ పూర్వీకుల పై విరుచుకుపడిన శిక్ష. కనుక వినండి, ప్లేగు వ్యాధి ప్రబలి ఉన్న ప్రాంతానికి వెళ్ళకండి. ఒకవేళ మీరు నివసిస్తున్న ప్రాంతంలోనే ప్లేగు వ్యాధి ప్రబలితే దాన్నుండి పారిపోవడానికి ఆ ప్రాంతం వదలి వెళ్ళకండి. (మరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది): మీరు ప్లేగు వ్యాధి నుండి పారిపోయే ఉద్దేశ్యంతో అక్కడ్నుంచి వెళ్ళిపోకండి”.
(సహీహ్ బుఖారీ:- 60వ ప్రకరణం, అంబియా, 54వ అధ్యాయం – హద్దసనా అబుల్ యమాన్)
1434 – حديث عَبْدِ الرَّحْمنِ بْنِ عَوْفٍ عَنْ عَبْدِ اللهِ بْنِ عَبَّاسٍ، أَنَّ عُمَرَ بْنَ الْخَطَّابِ رضي الله عنه، خَرَجَ إِلَى الشَّامِ، حَتَّى إِذَا كَانَ بِسَرْغَ، لَقِيَهُ أُمَرَاءُ الأَجْنَادِ، أَبُو عُبَيْدَةَ [ص:69] بْنُ الْجَرَّاحِ وَأَصْحَابُهُ، فَأَخْبَرُوهُ أَنَّ الْوَبَاءَ قَدْ وَقَعَ بِأَرْضِ الشَّامِ قَالَ ابْنُ عَبَّاسٍ: فَقَالَ عُمَرُ: ادْعُ لِي الْمُهَاجِرِينَ الأَوَّلِينَ فَدَعَاهُمْ فَاسْتَشَارَهُمْ وَأَخْبَرَهُمْ أَنَّ الْوَبَاءَ قَدْ وَقَعَ بِالشَّامِ، فَاخْتَلَفُوا فَقَالَ بَعْضهُمْ: قَدْ خَرَجْتَ لأَمْرٍ، وَلاَ نَرَى أَنْ تَرْجِعَ عَنْهُ وَقَالَ بَعْضُهُمْ: مَعَكَ بَقِيَّةُ النَّاسِ وَأَصْحَابُ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَلاَ نَرَى أَنْ تُقْدِمَهُمْ عَلَى هذَا الْوَبَاءِ فَقَالَ: ارْتَفِعُوا عَنِّي ثُمَّ قَالَ: ادْعُوا لِي الأَنْصَارَ فَدَعَوْتُهُمْ، فَاسْتَشَارَهُمْ فَسَلَكُوا سَبِيلَ الْمُهَاجِرِينَ، وَاخْتَلَفُوا كَاخْتِلاَفِهِمْ فَقَالَ: ارْتَفِعُوا عَنِّي ثُمَّ قَالَ: ادْعُ لِي مَنْ كَانَ ههُنَا مِنْ مَشْيَخَةِ قُرَيْشٍ مِنْ مُهَاجِرَةِ الْفَتْحِ فَدَعَوْتُهُمْ، فَلَمْ يَخْتَلِفْ مِنْهُمْ عَلَيْهِ رَجُلاَنِ فَقَالُوا: نَرَى أَنْ تَرْجِعَ بِالنَّاسِ وَلاَ تقْدِمَهُمْ عَلَى هذَا الْوَبَاءِ فَنَادَى عُمَرُ، فِي النَّاسِ: إِنِّي مُصْبِحٌ عَلَى ظَهْرٍ فَأَصْبَحُوا عَلَيْهِ قَالَ أَبُو عُبَيْدَةَ بْنُ الْجَرَّاحِ: أَفِرَارًا مِنْ قَدَرِ اللهِ فَقَالَ عُمَرُ: لَوْ غَيْرُكَ قَالَهَا يَا أَبَا عُبَيْدَةَ نَعَمْ، نَفِرُّ مِنْ قَدَرِ اللهِ إِلَى قَدَرِ اللهِ، أَرَأَيْتَ لَوْ كَانَ لَكَ إِبِلٌ هَبَطَتْ وَادِيًا لَهُ عُدْوَتَانِ، إِحْدَاهُمَا خَصِبَةٌ وَالأُخْرَى جَدْبَةٌ، أَلَيْسَ إِنْ رَعَيْتَ الْخَصِبَةَ رَعَيْتَهَا بِقَدَرِ اللهِ، وَاِنْ رَعَيْتَ الْجَدْبَةَ رَعَيْتَهَا بِقَدَرِ اللهِ قَالَ: فَجَاءَ عَبْدُ الرَّحْمنِ بْنُ عَوْفٍ وَكَانَ مُتَغَيِّبًا فِي بَعْضِ حَاجَتِهِ، فَقَالَ: إِنَّ عِنْدِي فِي هذَا عِلْمًا سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، يَقُولُ: إِذَا سَمِعْتُمْ بِهِ بَأَرْضٍ [ص:70] فَلاَ تَقْدَمُوا عَلَيْهِ، وَإِذَا وَقَعَ بِأَرْضٍ وَأَنْتُمْ بِهَا فَلاَ تَخْرُجُوا فِرَارًا مِنْهُ قَالَ: فَحَمِدَ اللهَ عُمَرُ، ثُمَّ انْصَرَفَ
__________
أخرجه البخاري في: 76 كتاب الطب: 30 باب ما يذكر في الطاعون
1434. హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం:- ఖలీఫా హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) సిరియా పర్యటన కోసం బయలుదేరి సర్గ్ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ సైన్యాధ్యక్షుడు హజ్రత్ అబూ ఉబైదా బిన్ జర్రాహ్, తన సహచరులతో పాటు వచ్చి ఆయన్ని కలుసు కున్నారు. “సిరియా ప్రాంతంలో అంటువ్యాధి ప్రబలి ఉంద”ని ఆయన హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు)కు తెలియజేశారు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) (ఈ మాట విని) “తొలి ముహాజిర్లను నా దగ్గరకు పిలుచుకురండి” అన్నారు. ముహాజిర్ లను పిలుచుకువచ్చారు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) వారికి , సిరియాలో అంటువ్యాధి వ్యాపించిందని తెలియజేశారు. (పరిస్థితిని సమీక్షించడానికి) ఆయన వారిని సంప్రదించారు.
అప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు తమ అభిప్రాయం వెలిబుచ్చుతూ “మీరు ఒక పని నిమిత్తం బయలు దేరి వచ్చారు. కనుక ఆ పని పూర్తికాకుండా ఇక్కడ్నుంచి వెళ్లిపోవడం బాగుండదని మా అభిప్రాయం” అని అన్నారు. మరి కొందరు మాట్లాడుతూ “మీతో పాటు ప్రముఖ సహాబీలు ప్రవక్త అనుచరులు ఇంకా (సజీవంగా) మిగిలి ఉన్నారు. అంచేత వీరందర్నీ ప్లేగు వ్యాపించిన ప్రాంతానికి తీసుకువెళ్ళడం సరికాదు” అని అన్నారు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఈ బేదాభిప్రాయాలు విని “ఇక మీరు వెళ్ళిపోండి” అని అన్నారు.
తరువాత ఆయన అన్సార్లను పిలవండని అన్నారు. అన్సారులు పిలువబడ్డారు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) వారి సలహా అడిగితే వారు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచారు. ముహాజిల్లు వెలిబుచ్చిన అభిప్రాయాలే వీరూ వెలిబుచ్చారు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) వారితో కూడా “ఇక వెళ్ళండ”ని అన్నారు. తరువాత (మక్కా) విజయం తరువాత (మదీనా) వలస వచ్చిన ఖురైష్ తెగ పెద్దలను పిలవండని అన్నారు ఆయన. వారిని పిలుచుకువచ్చిన తరువాత వారిలో ఇద్దరు కూడాభిన్నాభిప్రాయాలు వ్యక్తపరచలేదు. “ప్రజలను అంటు వ్యాధి వ్యాపించిన ఆ ప్రాంతానికి తీసికెళ్ళడం మంచిది కాదు. కనుక మీరు వారందర్నీ తీసుకొని (మదీనా) వెళ్ళిపోవడమే మంచిదని మా అభిప్రాయం” అన్నారు వారంతా. చివరికి హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) “నేను రేపు ఉదయం (మదీనా) వెళ్ళిపోతున్నాను. (నాతో పాటు రాదలిచిన వారు రావచ్చు) ” అని ప్రకటన గావించారు. ఆ ప్రకటన విని అందరూ మరునాడు ఉదయం బయలుదేరడానికి సిద్ధమయ్యారు.
అప్పుడు హజ్రత్ అబూ ఉబైదా బిన్ జర్రాహ్ (రదియల్లాహు అన్హు) మాట్లాడుతూ “మీరు అల్లాహ్ నిర్ణయించిన అదృష్టం నుండి పారిపోతున్నారా?” అని అడిగారు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఈ మాట విని ఇలా అన్నారు: “అబూ ఉబైదా! ఈ మాట మరొకరి నోట వెలువడి ఉంటే (నేను విచారించను). సరే, మేము అల్లాహ్ నిర్ణీత అదృష్టం నుండి పారిపోయి అల్లాహ్ నిర్ణీత అదృష్టం వైపుకే వెళ్ళి పోతున్నాము. మీ దగ్గర కొన్ని ఒంటెలు ఉండి, వాటిని తీసుకొని మీరు ఒక లోయలో ప్రవేశించారనుకోండి. ఆ లోయకు ఒక వైపు పచ్చటి చెట్లు చేమలు, మరొకవైపు బంజరు నేల కూడా ఉందనుకోండి. అప్పుడు మీరు మీ ఒంటెలను (పచ్చిక ఉన్న ప్రదేశం వదలి) బీడు ప్రదేశంలో మేపితే, లేక బీడు వదలి పచ్చిక ప్రదేశంలో మేపితే అది అల్లాహ్ నిర్ణయించిన అదృష్టం నుండి పారిపోవడం అవుతుందా? మీ ఆలోచనా వైఖరి సరైనదేనా?”
ఆ తరువాత హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రదియల్లాహు అన్హు) వచ్చారు. ఆయన ఆ సమయంలో ఎక్కడికో వెళ్ళి తిరిగొచ్చారు. ఆయన మాట్లాడుతూ “నా దగ్గర ఈ సమస్యకు సంబంధించిన (హదీసు) జ్ఞానం ఉంది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు – “ఎక్కడైనా అంటువ్యాధి ప్రబలిందని మీకు తెలిస్తే అక్కడకు వెళ్ళకండి. ఒకవేళ మీరున్న ప్రాంతంలోనే ప్లేగు వ్యాపిస్తే మటుకు ఆ అంటువ్యాధి బారినుండి తప్పించుకునే ఉద్దేశ్యంతో అక్కడ్నుంచి (వేరే చోటికి) వెళ్ళకండి“. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఈ హదీసు విని అల్లాహ్ కు కృతజ్ఞతలు చెప్పారు. తరువాత ఆయన అక్కడ్నుంచి (మదీనాకు) తిరుగు ముఖం పట్టారు.
(సహీహ్ బుఖారీ:- 76వ ప్రకరణం – తిబ్, 30వ అధ్యాయం – మాయుజ్కరు ఫిత్తావూన్)
33వ అధ్యాయం – అస్పృశ్యత, దుశ్శకునం, తారాబలం, దయ్యాల నమ్మకం – ఇదంతా మిథ్య لا عدوى ولا طيرة ولا هامة ولا صفر ولا نوء ولا غول ولا يورد ممرض على مصح
1435 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: إِنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: لاَ عَدْوَى وَلاَ صَفَرَ وَلاَ هَامَةَ فَقَالَ أَعْرَابِيٌّ: يَا رَسُول اللهِ فَمَا بَالُ إِبِلِي تَكُونُ فِي الرَّمْلِ كَأنَّهَا الظِّبَاءُ، فَيَأْتِي الْبَعِيرُ الأَجْرَبُ فَيَدْخُلُ بَيْنَهَا فَيُجْرِبُهَا فَقَالَ: فَمَنْ أَعْدَى الأَوَّلَ
__________
أخرجه البخاري في: 76 كتاب الطب: 25 باب لا صفر وهو داء يأخذ البطن
1435. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం:-
“అస్పృశ్యతా పాటింపు సరైనది కాదు, ‘సఫర్’, ‘హామా’ లలో నిజం లేదు” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). ఒక అరబ్బు గ్రామీణుడు ఈ మాట విని “దైవప్రవక్తా! నా ఒంటెలు జింకల మాదిరిగా ఎడారిలో శుభ్రంగా (ఆరోగ్యంగా) ఉంటాయి కాని చిడుముతో ఉన్న ఒక ఒంటె వచ్చి వాటిలో కలసిపోగానే ఒంటెలన్నిటికీ ఆ గజ్జి తగులుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది?” అని అడిగాడు. “ఇది (నువ్వనుకుంటున్నట్లు) అంటు వల్లనే వచ్చి ఉంటే ఆ మొదటి ఒంటెకు దేని అంటు తగిలింది?” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). *
(సహీహ్ బుఖారీ: 76వ ప్రకరణం – తిబ్, 25వ అధ్యాయం – లా సఫర వహువ దావున్ యాఖుజుల్ బత్న్)
* అజ్ఞానులు ఒకరి అంటు మరొకరికి తగులుతుందని భావిస్తారు. కాని అంటు ప్రభావానికి మూలకారకుడు అల్లాహ్ అని భావించరు. హదీసులో ఇది మూఢనమ్మకంగా పరిగణించబడింది. పైత్యం అనేది ఒక విధమైన ఉదరవ్యాధి . కాని అరబ్ బహుదైవారాధకుల నమ్మకం ప్రకారం రోగి కడుపులోకి ఒక జంతువు దూరి ఆకలిగా ఉన్నప్పుడు తీవ్రమైన క్షోభకలిగిస్తుంది. దీనివల్ల ఒక్కోసారి రోగి మృత్యువాతన కూడా పడతాడు. వారి వ్యాధిని చిడుముకన్నా కూడా ప్రమాదకరమైన అంటువ్యాధి అని నమ్మేవారు. ఈ నమ్మకాన్ని ‘సఫర్’ అంటారు. హామా గురించి కూడా పూర్వం అరబ్ బహుదైవారాధకుల్లో ఒక మూఢనమ్మకం ఉండేది. చనిపోయిన వ్యక్తి ఆత్మ గుడ్లగూబ శరీరంలో ప్రవేశిస్తుందని వారు నమ్మేవారు. అందువల్ల గుడ్లగూబను వారు దుశ్శకునంగా భావించేవారు. అది ఎవరి ఇంటి పైనయినా వాలితే ఆ యింటి యజమాని చనిపోతాడని వారు నమ్మేవారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ రెండు మూఢనమ్మకాలను ఈ హదీసులో ఖండించారు. (సంకలన కర్త)
1436 – حديث أَبِي هُرَيْرَةَ قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: لاَ يُورِدَنَّ مُمْرِضٌ عَلَى مُصِحٍّ
__________
أخرجه البخاري في: 76 كتاب الطب: 53 باب لا هامة
1436. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:- రోగగ్రస్త ఒంటెలను ఆరోగ్యవంతమైన ఒంటెల దగ్గరికి తెచ్చి పెట్టకండి. (సహీహ్ బుఖారీ:- 78వ ప్రకరణం – తిబ్, 53వ అధ్యాయం – లా హామా)
34వ అధ్యాయం – దుశ్శకునం, సత్ శకునం, చెడు విషయాలు الطيرة والفأل وما يكون فيه الشؤم
1437 – حديث أَنَسِ بْنِ مَالِكٍ رضي الله عنه، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: لاَ عَدْوَى وَلاَ طِيَرَةَ، وَيُعْجِبُنِي الْفَأْلُ قَالُوا: وَمَا الْفَأْلُ قَالَ: كَلِمَةٌ طَيِّبَةٌ
__________
أخرجه البخاري في: 76 كتاب الطب: 54 باب لا عدوى
1437. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: అస్పృశ్యతా పాటింపు లేదు. దుశ్శకునం పాటించడం ధర్మ సమ్మతం కాదు. అయితే మంచి శకునం (*) పాటించడమంటే నాకిష్టమే. అప్పుడు అనుచరులు “మంచి శకునం అంటే ఏమిటీ?” అని అడిగారు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “(మంచి శకునం అంటే) మంచి మాట (సద్వచనం)” అని సమాధానమిచ్చారు. (సహీహ్ బుఖారీ:- 76వ ప్రకరణం – తిబ్, 54వ అధ్యాయం – లా అద్వా)
(*) అకస్మాత్తుగా ఏదైనా మంచి మాట విని లేదా సందర్భోచితమైన మాట విని దాన్నుండి సకారాత్మక ఫలితం తీయడమే మంచి శకునం (ఫాల్). ఇది ధర్మసమ్మతమే. (అనువాదకుడు)
1438 – حديث أَبِي هُرَيْرَةَ، قَالَ: سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، يَقُولُ: لاَ طِيَرَةَ، وَخَيْرُهَا الْفأْلُ قَالُوا: وَمَا الْفأْلُ قَالَ: الْكَلِمَةُ الصَّالِحَةِ يَسْمَعُهَا أَحَدُكُمْ
__________
أخرجه البخاري في: 76 كتاب الطب: 43 باب الطيرة
1438. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం:-
“దుశ్శకునం పాటించకూడదు, మంచి శకునం పాటించవచ్చు” అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెబుతుంటే నేను విన్నాను. అప్పుడు కొందరు అనుచరులు “మంచి శకునం అంటే ఏమిటీ?” అని అడిగారు. దానికి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “(మంచి శకునం అంటే) ఎవరైనా చెప్పే మంచి మాట” అని సమాధానమిచ్చారు. (సహీహ్ బుఖారీ:- 76వ ప్రకరణం – తిబ్, 43వ అధ్యాయం – అత్తియరతి)
1439 – حديث ابْنِ عُمَرَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: لاَ عَدْوَى وَلاَ طِيَرَةَ، وَالشُّؤْمُ فِي ثَلاَثٍ: فِي الْمَرْأَةِ وَالدَّارِ وَالدَّابَّةِ
__________
أخرجه البخاري في: 76 كتاب الطب: 43 باب الطيرة
1439. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “అంటుని, దుశ్శకునాన్ని పాటించడం మంచిది కాదు. దౌర్భాగ్యం అనేది ఉంటే మూడింటిలో మాత్రంఉండవచ్చు – స్త్రీ, ఇల్లు, చతుష్పాదం.”(*) (సహీహ్ బుఖారీ:- 76వ ప్రకరణం – తిబ్, 43వ అధ్యాయం – అత్తియరతి)
(*) కుష్టు, బొల్లి, మసూచి, స్పోటకం, తట్టు, నోటి దుర్వాసన, కళ్ళ కలక, ఇతర అంటువ్యాధులు అంటువల్ల ఒకరినుంచి మరొకరికి సంక్రమిస్తాయని వైద్యులు భావిస్తారు. ఈ హదీసులో వైద్యుల ఈ అనుమానం నిజం కాదని తెలియజేయబడింది. ధర్మవేత్తలు కూడా ఈ హదీసు నుండి ఈ భావాన్నే గ్రహించారు. దుశ్శకునాలను గురించిన విషయాలు హిందువుల నుంచి ముస్లింలలో వ్యాపించిన మూఢనమ్మకాలు మాత్రమే. ఉదాహరణకు: దారిలో పిల్లి ఎదురయితే పని నెరవేరదని, ఎవరైనా తుమ్మితే కూడా బయలు దేరే వ్యక్తి పని నెరవేరదని భావిస్తారు. ఇవన్నీ మూఢ నమ్మకాలు. వీటిని నమ్మడం ముస్లింలకు ఏమాత్రం శోభించదు. ఇక్కడ దుశ్శకునం లేక దౌర్భాగ్యం అంటే -సంతానం లేని స్త్రీ లేక నోటి దురుసుగల స్త్రీ దుశ్శకునం అవుతుందని అర్ధం. అలాగే ఇల్లు ఇరుకుగా ఉంటే లేదా ఇరుగు పొరుగు మంచివాళ్ళు కాకపోతే ఆ ఇల్లు దుశ్శకునం అవుతుంది. గుర్రం, ఏనుగు వగైరా జంతువులు యుద్ధమైదానంలో ఉపయోగపడకపోతే అవి దుశ్శకునాలవుతాయి. (సంకలన కర్త)
1440 – حديث سَهْلِ بْنِ سَعْدٍ السَّاعِدِيِّ رَضِيَ اللهُ عَنْهُ: أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: ” إِنْ كَانَ فِي شَيْءٍ، فَفِي المَرْأَةِ، وَالفَرَسِ، وَالمَسْكَنِ “
__________
أخرجه البخاري في: 56 كتاب الجهاد: 47 بَابُ مَا يُذْكَرُ مِنْ شُؤْمِ الفَرَسِ
1440. హజ్రత్ సహెల్ బిన్ సాద్ సాదీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: దౌర్భాగ్యం అనేది ఉంటే అది మూడింటిలో మాత్రమే ఉంటుంది – స్త్రీ, గుర్రం, ఇల్లు.* (సహీహ్ బుఖారీ:- 58వ ప్రకరణం – జిహాద్, 47వ అధ్యాయం – మా యజ్కరు మిన్ షూమిల్ ఫరస్)
* దేన్నయినా సరే దౌర్భాగ్యంగా భావించడం మంచి విషయం కాదన్నదే ఈ హదీసు అంతరార్ధం. దౌర్భాగ్యం ఉంటే ఈ మూడింటిలో ఉంటుంది. కాగా ఈ మూడు దౌర్భాగ్యానికి ఆనవాళ్లు కావు. అందువల్ల ఏదీ దౌర్భాగ్యం కొజాలదన్నమాట. (సంకలనకర్త)
37వ అధ్యాయం – పామును చంపడం باب قتل الحيات وغيرها
1441 – حديث ابن عمر وأبي لبابة رَضِيَ اللهُ عَنْهُم، أَنَّهُ سَمِعَ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَخْطُبُ عَلَى المِنْبَرِ يَقُولُ: “اقْتُلُوا الحَيَّاتِ، وَاقْتُلُوا ذَا الطُّفْيَتَيْنِ وَالأَبْتَرَ، فَإِنَّهُمَا يَطْمِسَانِ البَصَرَ، وَيَسْتَسْقِطَانِ الحَبَلَ ” قَالَ عَبْدُ اللهِ: فَبَيْنَا أَنَا أُطَارِدُ حَيَّةً لِأَقْتُلَهَا، فَنَادَانِي أَبُو لُبَابَةَ: لاَ تَقْتُلْهَا، فَقُلْتُ: [ص:73] إِنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَدْ أَمَرَ بِقَتْلِ الحَيَّاتِ قَالَ: إِنَّهُ نَهَى بَعْدَ ذَلِكَ عَنْ ذَوَاتِ البُيُوتِ، وَهِيَ العَوَامِرُ
وَفي رواية: فَرَآنِي أَبُو لُبَابَةَ بن عبد المنذر، أَوْ زَيْدُ بْنُ الخَطَّابِ
__________
أخرجه البخاري في: 59 كِتَابُ بَدْءِ الخَلْقِ 14 بَابُ قَوْلِ اللهِ تَعَالَى: {وَبَثَّ فِيهَا مِنْ كُلِّ دَابَّةٍ}
1441. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మస్జిద్ వేదికపై ఉపన్యాసమిస్తూ “పాములను చంపివేయండి, ముఖ్యంగా రెండు (తెల్ల) చారలు ఉండి తోక తెగిన పాములను చంపివేయండి. ఇవి (మన) కళ్ళను పోగొడ్తాయి; వాటి (భయం) వల్ల స్త్రీలకు గర్భం పోవచ్చు” అని అన్నారు
ఒకసారి నేను ఒక పామును చంపడానికి దాన్ని వెతుకుతుంటే హజ్రత్ అబూ లుబాబా నన్ను కేకవేస్తూ ‘దాన్ని చంపకండి’ అన్నారు. “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పాములను చంపమన్నారు కదా!” అన్నాను నేను. “కాని ఆ తరువాత ఆయన ఇండ్లలో తిరిగే పాములను చంపవద్దని, అవి జిన్నులకు సంబంధించిన పాములయి ఉండవచ్చని అన్నారు” అని చెప్పారు అబూ లుబాబా (రదియల్లాహు అన్హు).
ఒక ఉల్లేఖనంలో ఇలా ఉంది – “అబూ లుబాబా (రదియల్లాహు అన్హు) లేక జైద్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) నన్ను చూసి చంపవద్దని అన్నారు.” – (సహీహ్ బుఖారీ:- 59వ ప్రకరణం – బద్ యిల్ ఖల్ఖ్, 14వ అధ్యాయం – ఖౌలిల్లాహి తఆలా (వబస్సఫీ హామిన్ కుల్లి దాబ్బా)
1442 – حديث عبد الله بن مسعود قَالَ: بَيْنَا نَحْنُ مَعَ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فِي غَارٍ، إِذْ نَزَلَتْ عَلَيْهِ: وَالمُرْسَلاَتِ فَتَلَقَّيْنَاهَا مِنْ فِيهِ، وَإِنَّ فَاهُ لَرَطْبٌ بِهَا، إِذْ خَرَجَتْ حَيَّةٌ، فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: ” عَلَيْكُمُ اقْتُلُوهَا ” قَالَ: فَابْتَدَرْنَاهَا فَسَبَقَتْنَا، قَالَ: فَقَالَ: ” وُقِيَتْ شَرَّكُمْ كَمَا وُقِيتُمْ شَرَّهَا “
__________
أخرجه البخاري في: 65 كتاب التفسير:سُورَةُ وَالمُرْسَلاَتِ: 1 باب حدثني محمود
1442. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) కథనం:- మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో కలసి ఒక గుహలో కూర్చొని ఉన్నాము. ‘ఆయన పై వల్ ముర్సలాత్ సూరా అవతరించింది. మేమీ సూరాను ఆయన నోట విని నేర్చుకున్నాము. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ సూరా పఠిస్తున్నప్పుడు ఒక పాము (కన్నంలో నుంచి) బయటికి వచ్చింది. ఆయన దాన్ని చంపమన్నారు. మేము దాన్ని చంపడానికి లంఘించాము. కాని అది వేగంగా తప్పించుకుపోయింది. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “అది మీ బారి నుండి తప్పించుకున్నది. మీరు దాని బారి నుండి తప్పించుకున్నారు” అని అన్నారు.
(సహీహ్ బుఖారీ:- 65వ ప్రకరణం – తఫ్సీర్, ముర్సలాల్ సూరా: 1వ అధ్యాయం – హద్దసనీ మహమూద్)
38వ అధ్యాయం :- తొండను చంపడం అభిలషనీయం استحباب قتل الوزغ
1443 – حديث أُمِّ شَرِيكٍ، أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَمَرَهَا بِقَتْلِ الأَوْزَاغِ
__________
أخرجه البخاري في: 59 كتاب بدء الخلق: 15 باب خير مال المسلم غنم يتبع بها شعف الجبال
1443. హజ్రత్ ఉమ్మె షరీక్ (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నన్ను తొండలను చంపమని ఆదేశించారు. (సహీహ్ బుఖారీ:- 59వ ప్రకరణం – బద్ యిల్ ఖల్ఖ్ , 15వ అధ్యాయం – ఖైరుల్ మాలిల్ ముస్లిమి గనమ్ యతఁబవూ బిహా
షఆ ఫుల్ జిబాల్)
1444 – حديث عَائِشَةَ، زَوْجِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ؛ أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ لِلْوَزَغِ فُوَيْسِقٌ وَلَمْ أَسْمَعْهُ أَمَرَ بِقَتْلِهِ
__________
أخرجه البخاري في: 28 كتاب جزاء الصيد: 7 باب ما يقتل المحرم من الدواب
1444. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తొండను దుష్ట పురుగని అన్న మాట నిజమే. కాని ఆయన దాన్ని చంపమని ఆదేశించినట్లు నేను వినలేదు. (సహీహ్ బుఖారీ:- 28వ ప్రకరణం – జజావు స్సైద్ , 7వ అధ్యాయం – మా యఖ్తులుల్ ముహ్రిమ్ మినద్దవాబ్బ్ )
39వ అధ్యాయం – చీమలను చంపడం నిషిద్ధం النهي عن قتل النمل
1445 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: قَرَصَتْ نَمْلَةٌ نَبِيًّا مِنَ الأَنْبِيَاءِ، فَأَمَرَ بِقَرْيَةِ النَّمْلِ فَأُحْرِقَتْ، فَأَوْحى اللهُ إِلَيْهِ أَنْ قَرَصَتْكَ نَمْلَةٌ أَحْرَقْتَ أُمَّةً مِنَ الأُمَمِ تُسَبِّحُ
__________
أخرجه البخاري في: 56 كتاب الجهاد: 153 باب حدثنا يحيى
1445. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా తెలియజేశారు: ఒక చీమ (పూర్వం) ఒక దైవప్రవక్తను కుట్టింది. అందువల్ల ప్రవక్త ఆజ్ఞతో మొత్తం చీమల పుట్టను కాల్చివేయడం జరిగింది. అప్పుడు అల్లాహ్ వహీ ద్వారా ఆ ప్రవక్తతో ఇలా అన్నాడు: “ఒక చీమ (మాత్రమే) నిన్ను కుట్టింది. కాని నీవు అల్లాహ్ ని స్మరించే చీమల సమాజం మొత్తాన్నే కాల్చివేశావు”. (సహీహ్ బుఖారీ:- 56వ ప్రకరణం – జిహాద్, 153వ అధ్యాయం – హద్దసనా యహ్యా)
40వ అధ్యాయం – పిల్లిని చంపడం నిషిద్ధం تحريم قتل الهرة
1446 – حديث عَبْدِ اللهِ بْنِ عُمَرَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: عُذِّبَتِ امْرَأَةٌ فِي هِرَّةٍ سَجَنَتْهَا حَتَّى مَاتَتْ، فَدَخَلَتْ فِيهَا النَّارَ، لاَ هِيَ أَطْعَمَتْهَا وَلاَ سَقَتْهَا إِذْ هِيَ حَبَسَتْهَا، وَلاَ هِيَ تَرَكَتْهَا تَأْكلُ مِنْ خَشَاشِ الأَرْضِ
__________
أخرجه البخاري في: 60 كتاب الأنبياء: 54 باب حدثنا أبو اليمان
1446. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: ఒక స్త్రీ పిల్లి మూలంగా దైవశిక్షకు గురయిపోయింది. ఆ స్త్రీ పిల్లి చనిపోయే వరకూ దాన్ని కట్టి పడేసింది. ఈ నేరం కారణంగానే ఆ స్త్రీ నరకానికి పోయింది. ఆమె ఆ పిల్లిని కట్టివేసి దానికి ఎలాంటి ఆహార పానీయాలు పెట్టనూ లేదు. క్రిమి కీటకాలు తినేందుకు దాన్ని ఆమె స్వేచ్ఛగా వదలి పెట్టనూ లేదు. (సహీహ్ బుఖారీ:- 60వ ప్రకరణం – అంబియా, 54 వ అధ్యాయం – హద్దసనా అబుల్ యమాన్)
41వ అధ్యాయం – సాధు జంతువులకు మేత పెట్టడం, నీరు త్రాపడం పుణ్యకార్యం فضل ساقي البهائم المحترمة وإِطعامها
1447 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: بَيْنَا رَجُلٌ يَمْشِي فَاشْتَدَّ عَلَيْهِ الْعَطَشُ، فَنَزَلَ بِئْرًا، فَشَرِبَ مِنْهَا، ثُمَّ خَرَجَ؛ فَإِذَا هُوَ بِكَلْبٍ يَلْهَثُ [ص:75] يَأْكُلُ الثَّرَى مِنَ الْعَطَشِ فَقَالَ: لَقَدْ بَلَغَ هذَا مِثْلُ الَّذِي بَلَغَ بِي فَمَلأَ خُفَّهُ، ثُمَّ أَمْسَكَهُ بِفِيهِ، ثُمَّ رَقِيَ، فَسَقَى الْكَلْبَ فَشَكَرَ اللهُ لَهُ فَغَفَرَ لَهُ قَالُوا: يَا رَسُولَ اللهِ وَإِنَّ لَنَا فِي الْبَهَائِمِ أَجْرًا قَالَ: فِي كلِّ كَبِدٍ رَطْبَةٍ أَجْرٌ
__________
أخرجه البخاري في: 42 كتاب المساقاة: 9 باب فضل سقي الماء
1447. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా తెలియజేశారు:
ఒక వ్యక్తి ఎక్కడికో పోతున్నాడు. దారిలో అతనికి దాహం వేసింది. ఒక చోట అతను ఓ బావిలోకి దిగి నీళ్ళు త్రాగి బయటికి వచ్చాడు. అంతలో అతని దృష్టి ఒక రొప్పుతున్న కుక్క పై పడింది. ఆ కుక్క నాలుక బయటికి వచ్చింది. అది తీవ్రమైన దప్పికతో బురద మట్టి నాకసాగింది. అప్పుడా వ్యక్తి తనలాగే ఈ కుక్క కూడా దప్పికతో అల్లాడిపోతోందని భావించాడు. వెంటనే అతను (బావిలోకి దిగి) తన కాలిజోడులో నీళ్ళు నింపి దాన్ని నోటితో పట్టుకొని బయటికి వచ్చాడు. ఆ నీటిని కుక్కకు త్రాగించాడు. అతను చేసిన ఈ సత్కార్యాన్ని అల్లాహ్ స్వీకరించి అతడ్ని క్షమించాడు. ప్రవక్త అనుచరులు ఈ మాటలు విని “దైవప్రవక్తా! జంతువులకు ఆహారం, నీళ్ళు పెట్టినా మాకు పుణ్యం వస్తుందా?” అని అడిగారు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఎందుకు రాదూ? ప్రాణం గల ప్రతి జీవికి ఆహారం, నీళ్ళు పెడితే పుణ్యం వస్తుంది” అని అన్నారు.
(సహీహ్ బుఖారీ:- 42వ ప్రకరణం – ముసాఖాత్, 9వ అధ్యాయం – ఫజ్లి సఖియిల్ మాయి)
1448 – حديث أَبِي هُرَيْرَةَ، قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: بَيْنَمَا كَلْبٌ يُطِيفُ بِرَكِيَّةٍ كَادَ يَقْتُلُهُ الْعَطَشُ، إِذْ رَأَتْهُ بَغِيٌّ مِنْ بَغَايَا بَنِي إِسْرَائِيلَ، فَنَزَعَتْ مُوقَهَا، فَسَقَتْهُ، فَغُفِرَ لَهَا بِهِ
__________
أخرجه البخاري في: 60 كتاب الأنبياء: 54 باب حدثنا أبو اليمان
1448. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- పూర్వం ఒక కుక్క తీవ్రమైన దప్పికతో చచ్చిపోయే స్థితికి వచ్చింది. అది (దాహంతో అలమటిస్తూ) ఒక బావి చుట్టూ తిరగసాగింది. అప్పుడు బనీ ఇస్రాయీల్ సంతతికి చెందిన ఒక వ్యభిచారిణి తన కాలి జోడుతో నీళ్ళు తోడి దానికి త్రాగించింది. ఆమె చేసిన ఈ సత్కార్యానికి ఫలంగా అల్లాహ్ ఆమె పాపాలను మన్నించాడు. (సహీహ్ బుఖారీ:- 60వ ప్రకరణం – అంబియా, 54వ అధ్యాయం – హద్దసనా అబుల్ యమాన్)