జుమా రోజు మసీదుకు పిల్లలను తీసుకువచ్చే వారికి కొన్ని సూచనలు [వీడియో, టెక్స్ట్]

[2 నిముషాలు]
https://youtu.be/s7y3-hGEEbc
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ముందుగా, ఈ ఆడియోలోని ముఖ్య విషయాలు కింద పేర్కొనబడ్డాయి:

శుక్రవారం నమాజు కోసం పిల్లలను మస్జిద్‌కు తీసుకురావడం సరైనదేనా, వారు అల్లరి చేయడం వలన తల్లిదండ్రుల పుణ్యం తగ్గిపోతుందా అనే ప్రశ్నకు ఇందులో సమాధానం ఇవ్వబడింది. పిల్లలకు చిన్నతనం నుండే శుక్రవారం ప్రార్థనల ప్రాముఖ్యతను మరియు మస్జిద్ మర్యాదలను నేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత అని చెప్పబడింది. పిల్లలు అల్లరి చేయకుండా ఉండటానికి, వారిని ఒకేచోట వెనుక కూర్చోబెట్టడం అనే సాధారణ పొరపాటును సరిదిద్ది, ప్రతి తండ్రి తమ పిల్లలను తమ పక్కనే ఉంచుకోవాలని సూచించబడింది. ఇలా చేయడం ద్వారా పిల్లలు ఒకరితో ఒకరు ఆడుకోకుండా, ప్రశాంతంగా ఉంటారని మరియు మస్జిద్‌లో గందరగోళం జరగదని వివరించబడింది.


జవాబు:
మంచి ప్రశ్న అడిగారు మీరు, అల్హందులిల్లాహ్ (అన్ని ప్రశంసలు అల్లాహ్‌కే). శుక్రవారం రోజు పిల్లల్ని మన వెంట తీసుకుని వెళ్ళాలి. శుక్రవారం ఘనత వారికి తెలియాలి. శుక్రవారం రోజు ముస్లింల ఆరాధనల గురించి వారికి చిన్నప్పటి నుండే తెలపడం ఇది మన యొక్క బాధ్యత. కానీ, వారు పిల్లలు అయినందుకు ఏ కొన్ని పొరపాట్లు జరుగుతాయో, అందుకని ముందే తల్లిదండ్రులు మస్జిద్‌కు పిల్లల్ని పంపే ముందు పిల్లలకు నేర్పాలి. వేరే ఎవరైనా తెలియని పిల్లలు అల్లరి చేసినా, మీరు అల్లరి చేయకూడదు. మస్జిద్‌ను గౌరవించాలి, జుమా రోజును గౌరవించాలి, ఆ రోజు ఖుత్బా ఇస్తూ ఉంటారు ఖతీబ్ గారు, మనం శ్రద్ధగా వినాలి అర్థం కాకపోయినా. ఇందులో ఉన్నటువంటి ఘనతలు ఏమిటి? అని పిల్లలకు చెప్పాలి. ఇన్షా అల్లాహ్ (అల్లాహ్ తలిస్తే), మనం కూడా పిల్లల క్లాసులో ఈ విషయాలు బోధించే ప్రయత్నం చేస్తాము, ఇన్షా అల్లాహ్.

మరొక చాలా గొప్ప విషయం మనం మర్చిపోతూ ఉంటాము. అందువల్లనే పిల్లలు అల్లరి చేసుకోవడానికి ఎక్కువ అవకాశం కలుగుతుంది. అదేంటి? మన వద్ద ఒక అలవాటు ఏముంది? పిల్లలందరినీ ఒకచోట వెనక్కి పారేయండి. పిల్లలు పిల్లలు అందరూ ఒకచోట కలిసిన తర్వాత, వారికి అంత దూరపు ఆలోచన లేదు, బుద్ధి జ్ఞానాలు లేవు, ధర్మ అవగాహన లేదు. అందుకొరకు పిల్లలు పిల్లలు కలిసినప్పుడు ఇంకా ఎక్కువ అల్లరి జరుగుతుంది.

అందుకొరకు ఏం చేయాలి? ప్రతి బాధ్యుడు తమ పిల్లలను తమ వెంట ఉంచుకోవాలి. ఇదే చాలా మంచి పద్ధతి. దీని ద్వారా పిల్లలు అల్లరి చేయకుండా, ఎలాంటి గలాటా చేయకుండా ఉంటారు. ఇది చాలా మంచి పద్ధతి, దీన్ని అనుసరించే ప్రయత్నం చేయాలి.

జజాకుముల్లాహు ఖైరా (అల్లాహ్ మీకు ఉత్తమ ప్రతిఫలం ఇచ్చుగాక).

జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/friday/

ఇతరములు: