సంతాన శిక్షణ – పార్ట్ 06 [వీడియో]

బిస్మిల్లాహ్

[26:42 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

సంతాన శిక్షణలో జరిగే పొరపాట్లు

5- చెడును చూసి నిర్లక్ష్యం చేయడం

ఎలాగైతే కఠినత్వం మంచి విషయం కాదో, దానిని ఖండించడం జరిగిందో. అలాగే చెడును చూసి అశ్రద్ధ వహించడం కూడా మంచి విషయం కాదు. అనేక మంది తండ్రులు ఈ తప్పుకు గురి అవుతారు. వారి సాకు ఏమిటంటే వారు ఇంకా చిన్నారులే కదా, పెద్దగయిన తర్వాత ఈ చెడులను వారే వదులుకుంటారు. ఇది సరియైన మాట కాదు. ఎందుకనగా ఎవరైనా పసితనంలో ఓ అలవాటుకు బానిసయ్యాక పెరిగి పెద్దయ్యాక దాన్ని వదులుకోవడం అతనికి కష్టంగా ఉంటుంది. ఇబ్నుల్ ఖయ్యిం రహిమహుల్లాహ్ ఇలా చెప్పారు: ఎందరో తండ్రులు తమ సంతానాన్ని తమ కార్జపుముక్కలను అట్లే వదిలేసి, వారి శిక్షణ మానుకొని, వారి వాంఛలు తీర్చుకొనుటకు దోహదపడి వారి ఇహపరాలను పాడు చేస్తున్నారు. వారిని గౌరవపరుస్తున్నాము అన్నది వారి భ్రమ, అసలు వారు వారిని అవమానపరుస్తున్నారు. కనికరం చూపుతున్నాము అన్నది వారి భ్రమ అసలు వారు వారిపై దౌర్జన్యం చేస్తూ వారిని దూరం చేస్తున్నారు. చివరికి తమ సంతానం నుండి ఏ లాభం కూడా పొందలేకపోతారు. అంతే కాదు ఇలా చేసి వారు ఇహపరాల మేళ్ళు సాధించకుండా చేస్తున్నారు. తనయుళ్ళలో ఉన్న చెడును గనక నీవు చూసినట్లైతే అది ఎక్కువశాతం తండ్రుల నుండి సోకినదే అని నీకు తెలుస్తుంది. (తుహ్ ఫతుల్ మౌదూద్).

నిర్లక్ష్యాల్లో అతి గొప్పది; పిల్లలను నమాజు చేయమని, దాని పట్ల శ్రద్ధ వహించమని ప్రోత్సహించకపోవడం. ప్రవక్త ﷺ చెప్పారుః

 (مُرُوا أَبْنَاءَكُمْ بِالصَّلَاةِ لِسَبْعِ سِنِينَ وَاضْرِبُوهُمْ عَلَيْهَا لِعَشْرِ سِنِينَ وَفَرِّقُوا بَيْنَهُمْ فِي الْمَضَاجِعِ)

“మీ పిల్లలు ఏడు సంవత్సరాల వయస్సుకు చేరినప్పుడు మీరు వారికి నమాజు గురించి ఆదేశించండి. వారు పది సంవత్సరాలకు చేరినప్పుడు వారిని దండించండి. వారి పడకలను వేరు చేయండి”.

(అహ్మద్, అబూ దావూద్ 495. అల్బానీ దీనిని హసన్ అని అన్నారు).

తనయులు నిద్రపోతున్నది లేదా ఆడుకుంటున్నది చూస్తూ (వారికేమీ చెప్పకుండా) తండ్రి నమాజు కొరకు వెళ్ళిపోవుట చాలా తప్పు విషయం. అల్లాహ్ యొక్క ఈ ఆదేశం చదవండిః

[وَأْمُرْ أَهْلَكَ بِالصَّلَاةِ وَاصْطَبِرْ عَلَيْهَا] {طه:132}

నీ కుటుంబ సభ్యులను నమాజు చెయ్యండి అని ఆజ్ఞాపించు స్వయంగా నీవు కూడ దానిని పాటించు. (తాహా 20:132).

సంగీతం మరియు పాటలు వినుట నుండి వారిని వారించాలి. దుస్తుల్లో, అలవాట్లలో అవిశ్వాసుల పోలికల నుండి వారించాలి. ధరినిపై అల్లకల్లోలాన్ని సృష్టించే, సంస్కరణను చేపట్టని పేరుగల ప్రసిద్ధుల నుండి వారిని దూరం ఉంచాలి. వీటన్నిటిలో తండ్రి తమ సంతానంతో ప్రేమపూర్వకమైన సంబంధంతో పాటు మెతకవైఖరి, దయాగుణం అవలంభించాలి. సున్నితంగా, ఒప్పించగల పద్ధతిలో మాట్లాడాలి.


పుస్తకం & ముందు పాఠాలు
సంతాన శిక్షణకై తల్లిదండ్రులకు మార్గదర్శి
https://teluguislam.net/?p=1697

%d bloggers like this: