
[5:40 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
జంతువు జిబాహ్ చేసిన తరువాత తలవెంట్రుకలు తీయడం తప్పనిసరా! దీని గురించి ఆదేశం ఏమిటి!?
జిబాహ్ చేసిన వ్యక్తి తన తల వెంట్రుకలు తీయించుకోవటం ముస్తహబ్! కాని వాజిబ్ కాదు.
ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) వారి రెండు హదీసులలో దీని గురించి తెలియజేయడం జరిగింది. అలాగే ధర్మపండితుల సూచనలను, అబిప్రాయాలను కూడా తెలుసుకుందాం;
حَدَّثَنَا ابْنُ نُمَيْرٍ، عَنْ عُبَيْدِ اللَّهِ، عَنْ نَافِعٍ، عَنِ ابْنِ عُمَرَ، «أَنَّهُ ضَحَّى بِالْمَدِينَةِ، وَحَلَقَ رَأْسَهُ»
مصنف ابن أبي شيبة 3/247، 13890
ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం: “ఆయన మదీనాలో ఖుర్బానీ ఇచ్చారు, మరియు ఆ తరువాత తల వెంట్రుకలు(గుండు) చేయించుకున్నారు.”
(ముసన్నఫ్ ఇబ్నె అబి షైబా 13890# సనద్ సహీ)
మరో హదీసు ఇలా ఉంది:
حَدَّثَنِي يَحْيَى، عَنْ مَالِكٍ، عَنْ نَافِعٍ، أَنَّ عَبْدَ اللَّهِ بْنَ عُمَرَ «ضَحَّى مَرَّةً بِالْمَدِينَةِ» – قَالَ نَافِعٌ «فَأَمَرَنِي أَنْ أَشْتَرِيَ لَهُ كَبْشًا فَحِيلًا أَقْرَنَ، ثُمَّ أَذْبَحَهُ يَوْمَ الْأَضْحَى فِي مُصَلَّى النَّاسِ» قَالَ نَافِعٌ: فَفَعَلْتُ. ثُمَّ حُمِلَ إِلَى عَبْدِ اللَّهِ بْنِ عُمَرَ «فَحَلَقَ رَأْسَهُ حِينَ ذُبِحَ الْكَبْشُ، وَكَانَ مَرِيضًا لَمْ يَشْهَدِ الْعِيدَ مَعَ النَّاسِ»، قَالَ نَافِعٌ وَكَانَ عَبْدُ اللَّهِ بْنُ عُمَرَ يَقُولُ: «لَيْسَ حِلَاقُ الرَّأْسِ بِوَاجِبٍ عَلَى مَنْ ضَحَّى»، وَقَدْ فَعَلَهُ ابْنُ عُمَرَ
موطأ مالك 23/3، 1033
నాఫే (రహిమహుల్లాహ్) వారి కథనం: ఒక సారి అబ్దుల్లా ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) వారు మదీనాలో ఖుర్బానీ ఇవ్వాలనుకున్నారు. అయితే తన కోసం ఒక అద్భుతమైన కొమ్ము గల గొర్రెలను కొనమని, మరియు ప్రజలు ప్రార్థన చేసిన ప్రదేశంలో ఈద్ రోజున దాన్ని జిబాహ్ చేయమని చెప్పారు. నేను అలాగే చేసాను, జిబాహ్ చేసిన వెంటనే దానిని అబ్దుల్లా ఇబ్నె ఉమర్ వద్దకు తీసుకువెళ్ళాను, వారు తమ తల వెంట్రుకలు(గుండు) గీయించుకున్నారు. ఆయన అనారోగ్యంతో ఉండడం కారణంగా, ప్రజలతో కలిసి ఈద్ ప్రార్థనలకు హాజరు కాలేదు.ఆ తరువాత అబ్దుల్లా ఇబ్నె ఉమర్ వారు ఇలా అన్నారు:
“జంతువును బలి (ఖుర్బాని) ఇచ్చేవారికి తల గొరుగుట తప్పనిసరి కాదు. ఇది కేవలం ఇబ్నె ఉమర్ (అనగా నేను) చేసాను.”
(ముఅత్త ఇమామ్ మాలిక్ 1033#సనద్ సహీ)
అయితే కొందరూ ధర్మ పండితులు చెప్పారు; ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) వారు చేసిన ఈ పనికి, సహాబాలలో ఎవరూ కూడా విభేధించేవారు కారు.
ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్(రహిమహుల్లాహ్) ఆయన శిష్యులలోని వారు ఇలా చెబుతున్నారు; జిబాహ్ చేసిన వ్యక్తి గుండు గీయించడం ముస్తహబ్. అంటే తప్పనిసరి కాదు. అబిలషణీయం. ఎందుకంటే వారు కూడా ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) వారి దలీల్ ఆధారంగానే చెప్పారు.
అయితే హంబలీలలో గొప్ప పండితులు, అలాగే మాలికీలలో గొప్ప పండితులు ఇబ్నుల్ అరబీ మాలికి, హంబలీలలో అలాఉద్దీన్ ముర్దావి. అలాగే ఇమామ్ ఇబ్ను తైమియా(రహిమహుముల్లాహ్) మరియు ఇబ్ను ముఫ్లిహ్ అల్ హంబలి… ఇంక ఎంతో మంది ధర్మపండితులు యొక్క అభిప్రాయం కూడా ఇదే.
అలాగే షాఫయియాలో ముహద్దీస్ సిరాజుద్దీన్ ఇబ్ను ముల్కిన్ (రహిమహుల్లాహ్), ఇంకా దీనికి సంబంధించి ఎందరో ధర్మపండితుల అబిప్రాయం ఖుర్బాని చేసిన తరువాత తల వెంట్రుకలు తీయడం అబిలషణీయం అంటే ముస్తహబ్, వాజీబ్ కాదు.
హనీఫీయాలో ఇమామ్ అబూ హనిఫా(రహిమహుల్లాహ్) యెుక్క గొప్ప శిష్యులైన ముహమ్మద్ బిన్ హసన్. ముఅత్తా లోని ఇబ్నె ఉమర్ గారి హదీసు ప్రస్తావన తెచ్చి… ఇలా అన్నారు: ఎవరైతే హజ్ లో లేరో వారు తలవెంట్రుకలు తీయించుకోవటం వాజిబ్ కాదు. తప్పని సరిగా లేదు.
ఇదే అబూ హనీఫా వారి యొక్క మాట మరియు మా హనఫీయాలో సర్వసామాన్యంగా ఫుఖహాల యొక్క మాట.
అల్లాహ్ మనందరికీ సధ్బుధ్ధిని మరియు సంపూర్ణ ఇస్లామ్ జ్ఞానాన్ని మరియు దాని మీద జీవించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.
You must be logged in to post a comment.