సత్కార్య వనాలు – దశమ వనం
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)
ఉపవాస విరమణ (ఇఫ్తార్ చేయించుట)
కేవలం అల్లాహ్ సంతృష్టి కొరకు ఇందులో ఓ పాలు పంచుకున్నవారికి రెండింతల పంట, అంటే నీవు ఒక్క రోజులో రెండు ఉపవాసాలు ఉంటున్నావన్నమాట. అది ధర్మసంపద నుండి కొంత ఖర్చు పెట్టినంత మాత్రాన. దట్టమైన తోటల ఛాయలో నీవు ఛాయ పొందుతావు. ప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు:
(مَنْ فَطَّرَ صَائِمًا كَانَ لَهُ مِثْلُ أَجْرِهِ غَيْرَ أَنَّهُ لَا يَنْقُصُ مِنْ أَجْرِ الصَّائِمِ شَيْئًا)
“ఎవరు ఉపవాసమున్నవారికి ఇఫ్తార్ చేయిస్తారో అతనికి ఉపవాసమున్నవారంత పుణ్యం లభించును. ఉపవాసమున్నవారి పుణ్యంలో ఏ కొరత జరగదు“. (తిర్మిజి 807. ఈ హదీసు హసన్ మరియు సహీ అని ఇమాం తిర్మిజి స్వయంగా చెప్పారు).
ఈ రోజుల్లో -అల్లాహ్ దయతో- కొన్ని స్వచ్ఛంద సేవ సంస్థలు ఎన్నో చోట్ల ఈ ఆరాధనను చాలా సులభమైనదిగా చేస్తున్నారు. కొన్ని (ఇఫ్తార్ చేయించే) మార్గాలు చూపిస్తారు. నీవు నీ కొంత సంపదతో అందులో పాల్గొనవచ్చు. వాస్తవానికి ఇది అగత్య పరులపై అల్లాహ్ కరుణ మరియు ఉపకారం చేసేవారికై రెట్టింపు పుణ్యాలకు మంచి దారి.
నీవు స్వయంగా ఈ దృశ్యాలు చూసి ఉంటావు. మస్జిదు ఆవరణలో మంచి మంచి ఆహారపదార్థాలతో విస్తరి వేయబడి ఉంటుంది. దాని చుట్టు దేశ, విదేశ బీద ముస్లింలు ఎంతో ప్రేమ, సంతోషంతో కూర్చుండి ఉంటారు. శ్రీమంతులు, ధనవంతులు స్వయంగా వారి సేవలో ఉండటాన్ని చూసి నీ నరనరాల్లో విశ్వాసం జీర్ణించుకుపోతుంది. వారు (శ్రీమంతులు) వారి(ఇఫ్తార్ చేయువారి)కిచల్లటి నీరు, వేడి వేడి జిలేబీలు, ఇతర తీపి పదార్థాలు అందిస్తూ ఉంటారు. సౌభ్రాత్వం, ప్రేమతో కూడిన చిరునవ్వు దాని మాధుర్యాన్ని మరింత పెంచుతుంది. ఇది ఓ చెప్పరాని విశ్వాసం. ఇది నిన్ను నీ ధర్మంపై గౌరవంగా ఉండే విధంగా చేస్తుంది. ఈ ధర్మమే ధనవంతుడిని పేదవాని పెదవుపై చిరునవ్వు తెప్పించే వానిగా చేస్తుంది. అంతే కాదు ధనవంతుడు స్వయంగా పేదలను వెతికి వారు సంతోషపడే వరకు వారికి ఇస్తూ ఉండే విధంగా చేస్తుంది.
వాస్తవానికి నేను ఆ సౌభ్రాత్రుత్వ దృశ్యాన్ని మరవలేను. నా కళ్ళారా నేను చూశాను (ఇఫ్తార్ సందర్భంలో) ఒక యజమాని తన చేతిలో ముద్ద తీసుకొని తన పనిమనిషి నోటిలో పెట్ట బోయాడు. ఆ పనిమనిషి సిగ్గుపడి తాను కూర్చున్న స్థలాన్ని వదలి పరిగెత్తాడు. యజమాని అతని వెంట పరుగిడుతూ చివరికి అతని నోట్లో ముద్ద పెట్టాడు. ఇది ఏదో ఒక నూతన సంఘటన కాదు. ప్రవక్త ﷺ ప్రవచనానికి ఆచరణ రూపం.
(إِذَا أَتَى أَحَدَكُمْ خَادِمُهُ بِطَعَامِهِ فَإِنْ لَمْ يُجْلِسْهُ مَعَهُ فَليُنَاوِلْهُ لُقْمَةً أَوْ لُقْمَتَيْنِ أَوْ أُكْلَةً أَوْ أُكْلَتَيْنِ فَإِنَّهُ وَلِيَ عِلَاجَهُ)
“మీలో ఎవరి దగ్గరికైనా అతని సేవకుడు భోజనం తీసుకువస్తే, అతను సేవకుడ్ని తనతో పాటు భోజనానికి కూర్చోబెట్టుకోలేని స్థితిలో ఉంటే అందులో నుంచి ఒక రెండు ముద్దలయినా అతనికి తప్పకుండా పెట్టాలి. ఎందుకంటే అతను అన్నం వండే శ్రమ భరించాడు“. (బుఖారి 2557, ముస్లిం 1663).
ఈ పోస్ట్ క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది. క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి పూర్తి పుస్తకం చదవండి.
- సత్కార్య వనాలు (Hadayiq)
https://teluguislam.net/2011/03/19/gardens-of-good-deeds-telugu-islam/
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)
ఇతరములు :
రమదాన్ మెయిన్ పేజీ :
https://teluguislam.net/five-pillars/ramadhan-telugu-islam/
You must be logged in to post a comment.