తెలుగు ఇస్లామిక్ క్విజ్: పార్ట్ 53: రమజాన్ క్విజ్ 03 [ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 53
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

రమజాన్ ప్రత్యేక క్విజ్ ప్రశ్నల పత్రం – 03

(1) తరావీహ్ నమాజు చదివించేందుకు ఖుర్ఆన్ కంఠస్తం లేకపోతే ఏమిచెయ్యాలి?

A)  తరావీ మానెయ్యాలి
B ) ఖుర్ఆన్ చూసి చదవవచ్చు
C ) ఖుర్ఆన్ చూసి చదవకూడదు.

(2) సహరీ మరియు ఇఫ్తార్ ను గూర్చిన సరైన విధానం ఏది ?

A) ఆలస్యంగా సహరీ – త్వరగా (సమయం అయిన వెంటనే) ఇఫ్తార్ చెయ్యడం
B) ఆలస్యంగా ఇఫ్తార్ – త్వరగా సహరీ చెయ్యడం
C) సహరీ – ఇఫ్తార్ చెయ్యకుండా ఉపవాసం ఉండటం

(3) ఉపవాసి దుఆ ఎప్పుడు స్వీకరించబడుతుంది?

A) సహరీ సమయంలో మాత్రమే
B) కేవలం ఇఫ్తార్ సమయంలో మాత్రమే
C) ఉపవాస స్థితిలో ఉన్నంత కాలం ( సహరీ నుండీ ఇఫ్తార్ వరకు)

క్విజ్ 53: సమాధానాలు & వివరణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [12:22 నిమిషాలు]


రమజాన్ ప్రత్యేక క్విజ్ ప్రశ్నల పత్రం – 03

(1) తరావీహ్ నమాజు చదివించేందుకు ఖుర్ఆన్ కంఠస్తం లేకపోతే ఏమిచెయ్యాలి?

B) ఖుర్ఆన్ చూసి చదవవచ్చు

అవును, తరావీహ్ నమాజులో ఖుర్ఆన్ చూసి చదవవచ్చును. ఆయిషా (రజియల్లాహు అన్హా) యొక్క బానిస జక్వాన్ (ذَكْوَان) ఖుర్ఆన్ చూసి తరావీహ్ నమాజ్ చేయించేవారు. ఆయిషా (రజియల్లాహు అన్హా) అతని వెనక తరావీహ్ లో పాల్గొనేవారు. (సునన్ కుబ్రా బైహఖీ 2/359. 3366, బుఖారీలో ముఅల్లఖన్ వచ్చింది 692కు ముందు హదీసు. బాబ్ ఇమామతిల్ అబ్ది వల్ మౌలా).

“ఒక వ్యక్తి రమజానులో ఖుర్ఆన్ చూసి తరావీహ్ నమాజ్ చేయిస్తాడు, అతని గురించి మీరేమంటారు?” అని ఇమాం జుహ్రీ (రహిమహుల్లాహ్) ను ప్రశ్నించడం జరిగింది. అప్పుడు ఆయన చెప్పారు: “ఇస్లాం ఉన్నప్పటి నుండి మా మంచివారు ఖుర్ఆన్ లో చూసే నమాజు చేస్తూ ఉన్నారు.” (ముఖ్తసర్ ఖియామిల్ లైల్ వ ఖియామి రమజాన్: ఇమాం మిర్వజీ. 233)

అంతే కాదు ఇమాం నవవీ (రహిముహుల్లాహ్) చెప్పారు: మనిషికి ఖుర్ఆన్ కంఠస్తం ఉన్నా లేకపోయినా ఖుర్ఆన్ చూసి చదివినంత మాత్రాన నమాజ్ బాతిల్ కాదు. ఒకవేళ సుర ఫాతిహా గనక కంఠస్తం లేకుంటే చూసి చదవడం విధిగా అవుతుంది. చూసి చదివితే నమాజ్ బాతిల్ కాదు అన్న మాట మా మజ్ హబ్  (అంటే షాఫిఈ మజ్హబ్), మాలిక్ మజ్హబ్, మరియు అబూ యూసుఫ్, ముహమ్మద్ మరియు అహ్మదులవారి మజ్హబ్. (📚అల్ మజ్మూఅ షర్హ్ల్ ముహజ్జబ్ : ఇమాం నవవీ 4/27).

ముఖ్య గమనిక:

1- ఖుర్ఆన్ ఉత్తమ రీతిలో కంఠస్తం ఉన్న ఇమాం చూసి చదవడం మంచిది కాదు.

సారాంశం ఏమిటంటే: ఖుర్ఆన్ కంఠస్తం లేనందు వల్ల లేదా ఉత్తమ రీతిలో కంఠస్తం లేనందు వల్ల మరియు తరావీహ్ నమాజులు సామాన్య నమాజుల కంటే దీర్ఘంగా, ఆలస్యంగా చేయడం మంచిది గనక ఖుర్ఆన్ చూసి తరావీహ్ చేయించడం ఒక అవసరం గనక ఇది యోగ్యమే. దీని వల్ల నమాజ్ బాతిల్ కాదు.

తెలుగు, ఇతర భాషల్లో ఖుర్అన్ చూసి చదవడం సరి అయిన విషయం కాదు.

(2) సహరీ మరియు ఇఫ్తార్ ను గూర్చిన సరైన విధానం ఏదీ?

A) ఆలస్యంగా సహరీ – త్వరగా (సమయం అయిన వెంటనే) ఇఫ్తార్ చెయ్యడం

సహరీ చివరి సమయంలో మరియు ఇఫ్తార్ తొలి సమయంలో చేయడం చాలా మేలు. దీని గురించి ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారు:

بَكِّرٌوا بِالإفْطَارِ وَأَخِّرٌوا السُّحُورَ
ఇఫ్తార్ చేయడంలో తొందరపడండి, సహరి చేయడంలో ఆలస్యం చేయండి“. (సహీహ 1773).

روى البخاري (1957) ومسلم (1098) عَنْ سَهْلِ بْنِ سَعْدٍ أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ : ( لا يَزَالُ النَّاسُ بِخَيْرٍ مَا عَجَّلُوا الْفِطْرَ (బుఖారీ 1957, ముస్లిం 1098లో ఉంది,

2- సూర్యాస్తమయం అయిన వెంటనే ఇఫ్తార్ చెయ్యాలి. రుతబ్ (ఖర్జూరపు ఆరంభపు పండు) తో ఇఫ్తార్ చేయడం సున్నత్. అవి దొరకనప్పుడు ఖర్జూర్లతో, అవీ లేనప్పుడు నీళ్ళతో అది కూడా లభించనప్పుడు ఏది సులభంగా లభ్యమగునో దానితోనే ఇఫ్తార్ చేయాలి.

(3) ఉపవాసి దుఆ ఎప్పుడు స్వీకరించబడుతుంది?

C) ఉపవాస స్థితిలో ఉన్నంత కాలం ( సహరీ నుండీ ఇఫ్తార్ వరకు)

ప్రత్యేకంగా ఉపవాస స్థితిలో ఉన్నంత కాలం దుఆ స్వీకరించబడుతుంది. దీనికి దలీల్ ఉపవాసానికి సంబంధించిన ఆయతుల మధ్యలో అల్లాహ్ దుఆ గురించి ప్రస్తావించడం. అయితే రేయింబవళ్ళలో ఎన్నో సందర్భాలు న్నాయి వాటిలో అల్లాహ్ దుఆ స్వీకరిస్తాడు.


ఇతరములు :

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

రమదాన్  మెయిన్ పేజీ :
https://teluguislam.net/five-pillars/ramadhan-telugu-islam/

%d bloggers like this: