తెలుగు ఇస్లామిక్ క్విజ్: పార్ట్ 52: రమజాన్ క్విజ్ 02 [ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 52
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

రమజాన్ ప్రత్యేక క్విజ్ ప్రశ్నల పత్రం – 02

(1) పవిత్ర రమజాన్ ను స్వాగతిస్తూ లేదా సందేహంతో 1 లేదా 2 రోజుల ముందు నుండి ఉపవాసం పాటించ వచ్చునా?

A)  పాటించ వచ్చు
B)  పాటించ కూడదు
C)  పాటించినా – పాటించక పోయినా పర్వాలేదు

(2) ఉపవాసి గూర్చి ప్రత్యేకించబడిన స్వర్గ ద్వారం పేరు ఏమిటి? 

A)  బాబుల్ ఐమాన్
B)  బాబుజ్ జిక్ర్
C)  బాబుర్ రయాన్

(3) రమజాన్ లో ఉపవాసం యొక్క సంకల్పం ఎప్పుడు చేసుకోవాలి?

A) ఉషోదయం (ఫజర్) కంటే ముందుగానే
B) ఫజర్ తర్వాత సూర్యోదయం అయిన తర్వాత
C) ఇఫ్తార్ లోపు

క్విజ్ 52: సమాధానాలు & వివరణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [12:22 నిమిషాలు]


రమజాన్ ప్రత్యేక క్విజ్ ప్రశ్నల పత్రం -02

(1) పవిత్ర రమజాన్ ను స్వాగతిస్తూ లేదా సందేహంతో 1 లేదా 2 రోజుల ముందు నుండి ఉపవాసం పాటించ వచ్చునా?

B) పాటించ కూడదు

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَتَقَدَّمَنَّ أَحَدُكُمْ رَمَضَانَ بِصَوْمٍ يَوْمٍ أَوْ يَوْمَيْنِ إِلَّا أَنْ يَّكُوْنَ رَجُلٌ كَانَ يَصُوْمُ صَوْمًا فَلْيَصُمْ ذَلِكَ الْيَوْمَ”

అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచనం, ‘‘రమ’దాను కు ఒకటి, రెండు రోజులు ముందు ఉపవాసం ఉండరాదు. అయితే అలవాటుగా ఉపవాసం ఉంటూ వస్తున్న వ్యక్తి ఉండవచ్చు.”(బు’ఖారీ 1914, ముస్లిమ్ 1082). మిష్కాత్ 1973, హదీసు కిరణాలు 1225, హదీసు మహితోక్తులు 657.

وَعَنْ عَمَّارِ بْنِ يَاسِرٍرَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: “مَنْ صَامَ الْيَوْمَ الَّذِيْ يُشَكُّ فِيْهِ فَقَدْ عَصَى أَبَا الْقَاسِمِ صلى الله عليه وسلم”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ. [حكم الألباني] : صحيح

‘అమ్మార్ బిన్ యాసిర్ కధనం: “అనుమానం గల దినంలో ఉపవాసం పాటించినవాడు, అబుల్ ఖాసిమ్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల అవిధేయతకు పాల్పడ్డాడు.” (అబూ దావూద్ తిర్మిజి’, నసాయి’, ఇబ్నె మాజహ్, దారమి). మిష్కాత్ 1977 . హదీసు కిరణాలు 1228.

అనుమానంతో కూడిన రోజంటే షాబాన్‌ మాసపు 30వ తేది. ఆకాశం మేఘావృతమై ఉన్న కారణంగా షాబాన్‌ మాసపు 29వ తేదీన చంద్రుడు కనిపించనప్పటికి కేవలం ఊహతో, మబ్బుల వెనక చంద్రుడు ఉండి ఉంటాడన్న అనుమానంతో మరునాడు రమజాన్‌ మాసపు ఒకటో తేదీ అని భావించి ఆ రోజున ఉపవాసం పాటించకూడదు. చంద్రుడు కనిపించాడా లేదా అన్న సందేహం ఏర్పడినప్పుడు ఆ నెలలో ముప్పై రోజులు పూర్తి చేసుకోవాలి. సందేహాస్పద దినాల్లో ఉపవాసం పాటించనవసరం లేదు. (హదీసు కిరణాలు 1228).

(2) ఉపవాసి గూర్చి ప్రత్యేకించబడిన స్వర్గ ద్వారం పేరు ఏమిటి?

C) బాబుర్ రయ్యాన్

وَعَنْ سَهْلِ بْنِ سَعْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “فِيْ الْجَنَّةِ ثَمَانِيَةَ أَبْوَابٍ مِّنْهَا: بَابٌ يُسَمَّى الرَّيَّانَ لَا يَدْخُلُهُ إِلَّا الصَّائِمُوْنَ”.

సహల్ బిన్ స’అద్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు: ”స్వర్గంలో ఎనిమిది ద్వారాలు ఉన్నాయి. వాటిలో ఒక ద్వారం పేరు రయ్యాన్. ఉపవాసకులు ఈ ద్వారం గుండానే స్వర్గం లోనికి ప్రవేశిస్తారు.” (బు’ఖారీ, ముస్లిమ్) మిష్కాత్ 1957,

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ أَنْفَقَ زَوْجَيْنِ مِنْ شَيْءٍ مِّنَ الْأَشْيَاءِ فِيْ سَبِيْلِ اللهِ دُعِيَ مِنْ أَبْوَابِ الْجَنَّةِ وَلِلْجَنَّةِ أَبْوَابٌ فَمَنْ كَانَ مِنْ أَهْلِ الصَّلَاةِ دُعِيَ مِنْ بَابِ الصَّلَاةِ وَمَنْ كَانَ مِنْ أَهْلِ الْجِهَادِ دُعِيَ مِنْ بَابِ الْجِهَادِ وَمَنْ كَانَ مِنْ أَهْلِ الصَّدَقَةِ دُعِيَ مِنْ بَابِ الصَّدَقَةِ وَمَنْ كَانَ مِنْ أَهْلِ الصِّيَامِ دُعِيَ مِنْ بَابِ الرَّيَانِ”. فَقَالَ أَبُوْ بَكْرٍ: مَا عَلَي مَنْ دُعِيَ مِنْ تِلْكَ الْأَبْوَابِ مِنْ ضَرُوْرَةٍ. فَهَلْ يُدْعَى أَحَدٌ مِّنْ تِلْكَ الْأَبْوَابِ كُلِّهَا؟ قَالَ: “نَعَمْ. وَأَرْجُوْ أَنْ تَكُوْنَ مِنْهُمْ”.

1890. (3) [1/592-ఏకీభవితం]

అబూ హురైరహ్ (రజియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనం: “అల్లాహ్ మార్గంలో ఒక వస్తువును జతలుగా (డబల్) దానం చేస్తే తీర్పుదినం నాడు స్వర్గద్వారాల వద్దనుండి అతన్ని పిలవటం జరుగుతుంది. స్వర్గానికి (8) ద్వారాలు ఉన్నాయి. ఒకవేళ ఆ వ్యక్తి అధికంగా నమా’జులు చదివే వాడైతే అతన్ని నమా’జు ద్వారం నుండి పిలవటం జరుగుతుంది. అల్లాహ్ మార్గంలో జిహాద్ చేసేవాడైతే అతన్ని జిహాద్ ద్వారం నుండి పిలవటం జరుగుతుంది. అధికంగా ‘సదఖహ్ చేసేవాడైతే, ‘సదఖహ్ ద్వారం నుండి పిలవటం జరుగుతుంది, అధికంగా ఉపవాసాలు ఉండేవాడైతే అతన్ని రయ్యాన్ ద్వారం నుండి పిలవటం జరుగుతుంది.” వెంటనే అబూబకర్ (రజియల్లాహు అన్హు), అన్ని ద్వారాల నుండి పిలువబడటం ఎందుకు, స్వర్గంలో ప్రవేశించడానికి ఒకే ద్వారం చాలు, అన్ని ద్వారాల నుండి పిలువబడేవారు కూడా ఎవరైనా ఉన్నారా?’ అని ప్రశ్నించారు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), ‘అవును, నువ్వూ వారిలోని ఒకడవని నేను భావిస్తున్నాను,’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్). (మిష్కాత్ 1890, హదీసు కిరణాలు 1217.)

(3) రమజాన్ లో ఉపవాసం యొక్క సంకల్పం ఎప్పుడు చేసుకోవాలి?

A) ఉషోదయం (ఫజర్) కంటే ముందుగానే

النسائي 2331:- عَنْ حَفْصَةَ، عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: «مَنْ لَمْ يُبَيِّتِ الصِّيَامَ قَبْلَ الْفَجْرِ، فَلَا صِيَامَ لَهُ» [حكم الألباني] صحيح

‘హఫ్’సహ్ (రజియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనం, ”రాత్రి ఫజ్ర్ కు  ముందే ఉపవాస సంకల్పం చేయని వాని ఉపవాసం నెరవేరదు.” (తిర్మిజి’, అబూ దావూద్, నసాయి’, దారమి) . మిష్కాత్ 1987

వివరణ-1987: విధి ఉపవాసానికి రాత్రే సంకల్పం చేసుకోవాలి. ఒకవేళ రాత్రి సంకల్పం చేసుకోకుండా, తెల్లవారిన తర్వాత సంకల్పం చేస్తే, ఉపవాసం నెరవేరదు. అయితే అదనపు ఉపవాసాలు ఏమీ తినకుండా మిట్టమధ్యాహ్నానికి ముందు సంకల్పించు కుంటే సరిపోతుంది.


ఇతరములు :

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

%d bloggers like this: