[14:05 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (14:05 నిముషాలు)
రమజాన్ & ఉపవాసాల ఘనత
[పుస్తకం నుండి: ఉపవాస (రోజా) ఆదేశాలు – జుల్ఫీ కేంద్రం నుండి [28 పేజీలు]]
అల్లాహ్ రమజాను మాసమునకు అనేక ఘనతలు ప్రత్యేకించాడు. ఇతర సమయాల్లో ఆ ఘనతలు లేవు. వాటిలో కొన్ని ఇవి:
- 1-స్వర్గపు ద్వారాలు తెరువబడతాయి, నరకపు ద్వారాలు మూయబడతాయి, బహిష్కృతులైన షైతానులు బంధించబడతారు.
- 2- దైవదూతలు ఉపవాసమున్నవారి గురించి ఇఫ్తార్ చేసే వరకు (అల్లాహ్ తో) క్షమాభిక్ష కోరుతూ ఉంటారు.
- 3- ఇందులో ఒక ఘనతగల మహారాత్రి ఉంది. అది వెయ్యి నెలలకన్నా శ్రేష్ఠమైనది.
- 4- (నెలంతా) ఉపవాసమున్నవారు రమజాను చివరి రాత్రిలో క్షమించబడుతారు.
- 5- రమజానులోని ప్రతీ రాత్రి అల్లాహ్ అనేక నరకవాసులకు విముక్తి కలుగజేస్తాడు.
- 6- రమజానులో ఉమ్రా చేయుట హజ్ చేయుట తో సమానం .
- 7- రమజానులోని ప్రతి రోజు ముస్లిం భక్తుని ఏదైనా ఒక దుఆ అంగీకరించబడుతుంది.
- 8- రమజాను మాసమెల్లా విశ్వాసం, పుణ్యాశతో తరావీహ్ నమాజ్ చేసేవారి పాపాలు మన్నించ బడతాయి.
- 9- ఈ తరావీహ్ జమాఅతుతో చేసేవారికి రాత్రంతా తహజ్జుద్ చేసినంత పుణ్యం.
- 10- ఉపవాసం ఉండేవారికి స్వర్గంలో ప్రత్యేకం ద్వారం ఉంది. దాని పేరు: రయ్యాన్. వారు తప్ప ఎవరూ దాని నుండి ప్రవేశించరు.
- 11 – ఉపవాసం మరియు ఖుర్ఆన్ సిఫారసు చేస్తాయి. వారి సిఫారసు అంగీకరించబడుతుంది.
- 12- ఒక్క ఉపవాసానికి బదులుగా 70 సం. నరకం నుండి దూరం ఉంచబడుతారు.
ఇంకా ఈ గౌరవ మాసపు ఘనతలో అబూ హురైర (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించిన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ఈ శుభవార్త కూడా ఉంది:
ఏ వ్యక్తి సంపూర్ణ విశ్వాసం మరియు పరలోక ప్రతిఫలాపేక్షతో రమజాను ఉపవాసాలు పాటిస్తాడో అతని పూర్వపు పాపాలు మన్నించబడతాయి. (బుఖారి 38, ముస్లిం 760).
ఆదము కుమారుడు చేసే ప్రతీ సత్కార్యానికి రెట్టింపు పుణ్యం ఉంటుంది. అల్లాహ్ చెప్పాడు: “కాని ఉపవాసం, అది నా కొరకు కాబట్టి నేనే స్వయంగా దాని ఫలితమిస్తాను”. (ముస్లిం 1151).
ఇతరములు:
You must be logged in to post a comment.